ఉడీ దాడి తర్వాత భారత్ తెస్తున్న ఒత్తిడిని తట్టుకోలేని పాకిస్థాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా పాక్ రాయబారి యుద్ధానికి సిద్దమేనంటూ ప్రకటన చేశారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంటే దాన్ని యుద్ధ చర్యగా భావిస్తామని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల చీఫ్ సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. నీటి పంపకాలపై సంప్రదింపులకు భారత్ నో చెప్పడంతో అజీజ్ పై విధంగా స్పందించారు.
ఇప్పటికే ఒప్పందం రద్దు విషయాన్ని ఐరాస, అంతర్జాతీయ న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళతామని పాక్ భారత్ ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిగా 56ఏళ్ల క్రితం చేసుకున్న ఈ ఒప్పందం యుద్ధాల సమయంలోనూ రద్దుకాలేదని అజీజ్ పాక్ పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇండియా తనంతట తాను ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదని చెప్పారు. జమ్మూ, కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని యూఎన్ జనరల్ అసెంబ్లీలో పేర్కొనడాన్ని పాక్ జాతీయ అసెంబ్లీ ఖండించింది. ఎప్పటిలానే కేవలం శాంతియుత చర్చలతోనే సత్సంబంధాలు ఏర్పడతాయని కపట వ్యాఖ్యలు చేసింది.
సింధు నదీ జలాలపై భారత్ తీసుకున్న నిర్ణయం ఆర్ధిక ఉగ్రవాదమని పాకిస్తాన్ సింధు నదీ జలాల మాజీ కమిషనర్ జమాత్ అలీ షా విమర్శించారు. ఒప్పందం రద్దయితే భారత్ జీలం, చినాబ్ నదులపై పెద్ద ఎత్తున కొత్త డ్యామ్ ల నిర్మాణం చేపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌ది యుద్ధ చర్యే: పాక్
Published Tue, Sep 27 2016 7:33 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM
Advertisement
Advertisement