ఒవైసీకి గట్టి ఎదురుదెబ్బ! | Setback for Asaduddin Owaisi | Sakshi
Sakshi News home page

ఒవైసీకి గట్టి ఎదురుదెబ్బ!

Published Sat, Mar 11 2017 7:28 PM | Last Updated on Sat, Aug 25 2018 5:02 PM

ఒవైసీకి గట్టి ఎదురుదెబ్బ! - Sakshi

ఒవైసీకి గట్టి ఎదురుదెబ్బ!

లక్నో: అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఆలిండియా మజ్లిస్‌ ఇతేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీకి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ ఎన్నికల్లో 38 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపినా.. ఎక్కడ కూడా ఆ పార్టీ బోణీ కొట్టలేదు. ఒక్క స్థానాన్ని కూడా గెలుపొందలేకపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి ఉత్తరప్రదేశ్‌లోనూ తమ పార్టీని విస్తరించుకోవాలన్న ఒవైసీ కలలు నెరవేరలేదు. ఎంఐఎం నుంచి కచ్చితంగా విజయం సాధిస్తారని భావించిన జియావుర్‌ రెహ్మాన్‌ బర్క్‌ కూడా ఓటమి పాలయ్యారు. జియావుర్‌ నాలుగుసార్లు ఎంపీ అయిన షఫీక్‌ ఉర్‌ రెహ్మాన్‌ బర్క్‌ మనవడు.

ఉత్తరప్రదేశ్‌లో భారీగా ముస్లిం ఓటర్లు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు ఒవైసీ తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. యూపీలో ముమ్మరంగా ప్రచారం చేసిన ఆయన.. ప్రచారపర్వంలో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారని తాజా ఫలితాలు చాటుతున్నాయి. అయితే, తాము ఇంకా యుద్ధం నుంచి తప్పుకోలేదని, మున్ముందు మరింత తీవ్రంగా ఎన్నికల్లో పోరాడుతామని ఒవైసీ స్పష్టం చేశారు. యుద్ధం మొదలుకాకముందే పారిపోవాలనేవిధంగా ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement