ట్రంప్కు షాకిచ్చిన ఉబర్ సీఈవో
ట్రంప్కు షాకిచ్చిన ఉబర్ సీఈవో
Published Fri, Feb 3 2017 9:25 AM | Last Updated on Thu, Aug 30 2018 9:07 PM
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఉబర్ టెక్నాలజీస్ సీఈవో ట్రావిస్ కలానిక్ షాకిచ్చారు. ట్రంప్ బిజినెస్ అడ్వయిజరీ గ్రూప్ నుంచి ఉబర్ సీఈవో వైదొలిగారు. ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న కఠిన చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలతోపాటు, ఆయనకు మద్దతిస్తున్న సీఈవోలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ట్రావిస్ కలానిక్, డొనాల్డ్ ట్రంప్కు గుడ్బై చెబుతున్నట్టు గురువారం ప్రకటించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు, కార్యకర్తలు ట్రంప్ వ్యాపార అడ్వయిజరీ గ్రూప్ నుంచి బయటికి వచ్చేయాలని ఉబర్ సీఈవోపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఉబర్ డ్రైవర్లలో చాలామంది వలసవాదులే ఉండటం గమనార్హం. ఏడు ముస్లిం దేశాల పౌరులను, వలసవాదులను తాత్కాలికంగా అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు పాస్ చేసిన సంగతి తెలిసిందే.
ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై దేశవ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఆర్డర్లను వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్నాయి. '' అడ్వయిజరీ గ్రూప్లో చేరడం ప్రెసిడెంట్ను ఎండోర్స్మెంట్ తీసుకోవడం లేదా ఆయన అజెండాలను ఫాలోవ్వడమని కాదు. దురదృష్టవశాత్తు మమల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు'' అని కలానిక్ పేర్కొన్నారు. ఉబర్ సీఈవో ట్రంప్ గ్రూప్ నుంచి వైదొలిగినట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెల్సియా కోల్హర్ ధృవీకరించారు. ట్రంప్ అడ్వయిజరీ గ్రూప్లో ఉన్న ఉబర్పై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఉబర్ అకౌంట్లను డిలీట్ చేసి, దాని ప్రత్యర్థి లిఫ్ట్ ఇంక్లో చేరమని వాదనలు వినిపించాయి. అకౌంట్ డిలీట్ చేసిన వారు, ఉబర్కు ఈమెయిల్స్ సైతం పంపారు. బ్యాన్ నేపథ్యంలో ప్రభావితమయ్యే వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకానమిక్ పాలసీలో కూడా తాను చేరనని ఉబర్ సీఈవో ప్రెసిడెంట్కు స్పష్టంచేశారు. ట్రంప్ ఆర్డర్లకు వ్యతిరేకంగా ఇప్పటికే సిలికాన్ వ్యాలీ సైతం విమర్శల గళం వినిపిస్తోంది. మైక్రోసాప్ట్, గూగుల్, యాపిల్ ఇంక్, అమెజాన్లు ట్రంప్ ఆర్డర్లను వ్యతిరేకిస్తున్నాయి.
Advertisement