న్యూఢిల్లీ: బెంచీలు, బెలూన్లు, బేబీ వాకర్లు, బెల్టులు.. వీటన్నింటికీ ఉన్న సంబంధం ఏంటో తెలుసా? తమ వద్ద నమోదై గుర్తింపు పొందని రాజకీయ పార్టీల కోసం ఎన్నికల సంఘం విడుదల చేసిన 164 గుర్తుల్లో ఇవి ఉన్నాయి. ఎన్నికల గుర్తుల ఉత్తర్వులు (రిజర్వేషన్, కేటాయింపులు)–1968 ప్రకారం ఈ గుర్తులను ఏదో ఒక పార్టీకి రిజర్వ్ చేయవచ్చు.
ఈసీ జనవరి 11న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇంకా అల్మారా, బ్లాక్ బోర్డు, గ్యాస్ పొయ్యి, సిలిండర్, గ్రామ్‌ఫోన్, ద్రాక్ష, టై, నెయిల్ కట్టర్, అగ్గిపెట్టె, నూడిల్ బౌల్, ప్రెషర్ కుక్కర్, రోడ్ రోలర్ వంటి గుర్తులున్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 1,837 నమోదై గుర్తింపు పొందని పార్టీలున్నట్లు ఈసీ తెలిపింది.
కాదేదీ గుర్తులకనర్హం!
Published Fri, Mar 3 2017 3:09 PM | Last Updated on Mon, Sep 17 2018 5:59 PM
Advertisement