విభజన బిల్లులో ప్రస్తావన లేకున్నా... ఉత్తరాఖండ్‌కు హోదా! | uttarakhand special status | Sakshi
Sakshi News home page

విభజన బిల్లులో ప్రస్తావన లేకున్నా... ఉత్తరాఖండ్‌కు హోదా!

Published Wed, Oct 7 2015 10:04 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో ఏర్పాటైన ఓ భారీ పరిశ్రమ - Sakshi

హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో ఏర్పాటైన ఓ భారీ పరిశ్రమ

మల్లు విశ్వనాథరెడ్డి-ఉత్తరాఖండ్ నుంచి సాక్షి ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ విభజన బిల్లులో ఎక్కడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా(స్పెషల్ స్టేటస్) లభించింది. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా 2000 సంవత్సరంలో ఆవిర్భవిస్తే... 2002లో ప్రత్యేక హోదా దక్కింది. దీనివల్ల రాష్ట్రానికి గరిష్టంగా లబ్ధి చేకూరింది.

రాష్ట్రానికి దక్కిన ప్రయోజనాలివీ...
* 2003 జనవరి 7వ తేదీ తర్వాత ఏర్పాటైన పరిశ్రమలకు ఎకై్సజ్ డ్యూటీ 2007 మార్చి 31 వరకు పూర్తిగా మినహాయింపు వర్తిస్తుందని తొలుత ప్రకటించారు. ప్రత్యేక హోదా ప్రకటించిన మరుక్షణమే పరిశ్రమలు రాలేదని, వచ్చిన తర్వాత కూడా ఏర్పాటుకు కొంత సమయం పట్టిందని, అందువల్ల మరో ఐదేళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో 2010 మార్చి 31 వరకు ఎకై్సజ్ డ్యూటీ మినహాయింపు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అంటే.. 2010 మార్చి 31 లోపల ఉత్పత్తి ప్రారంభించిన వారికి పదేళ్లపాటు మినహాయింపు వర్తిస్తుంది. ఉదాహరణకు 2010 మార్చి 30లోపు ఉత్పత్తి ప్రారంభించిన వారికి ఎకై్సజ్ డ్యూటీ మినహాయింపు 2020 మార్చి 30 వరకు వర్తిస్తుంది.

* పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత తొలి 5 సంవత్సరాలు కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు లభించింది. తర్వాత 5 సంవత్సరాలు 30 శాతం మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపునకు 2013 మార్చి 31 వరకు గడువు విధించింది. ఉదాహరణకు 2013 మార్చి 30న ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీలకు.. 2018 మార్చి 30 వరకు ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు లభిస్తుంది.

* ప్లాంటు, యంత్రాల మీద పెట్టిన పెట్టుబడిపై 15 శాతం రాయితీ.. గరిష్టంగా ఒక్కో యూనిట్‌కు రూ. 30 లక్షల వరకు లభిస్తుంది. 2013 జనవరి 6 వరకు ఈ మినహాయింపు అమలులో ఉంది.

* కేంద్రం నుంచి అందే సాయంలో 90 శాతం గ్రాంటుగా(తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు), 10 శాతం రుణంగా లభిస్తుంది.
 విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణాలను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కేంద్రమే చెల్లిస్తుంది కాబట్టి రాష్ట్రాలకు పూచీకత్తు సమస్య కూడా ఉండదు.

* ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన(పీఎంఆర్‌ఎం) లబ్ధిదారుల వయసులో 5 సంవత్సరాల మినహాయింపు లభించింది. సాధారణ రాష్ట్రాల్లో 18-35 సంవత్సరాల యువతనే ఎంపిక చేసుకోవాలి. ప్రత్యేక హోదా ఫలితంగా 18-40 సంవత్సరాల వయసుల వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది.

తలసరి ఆదాయం వృద్ధిరేటు పరుగులు...
పారిశ్రామికీకరణ ఉత్తరాఖండ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)ని గణనీయంగా పెంచింది. ప్రత్యేక హోదా అమల్లోకి వచ్చిన రెండు, మూడు సంవత్సరాల తర్వాత పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించడంతో... 2005-06 నుంచి తలసరి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకొంది. వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటును దాటేసి వడివడిగా ముందుకెళ్లిపోయింది. రాష్ట్ర ఆవిర్భావ సమయం వరకు జాతీయ వృద్ధిరేటు కంటే తక్కువగా ఉన్నా.. ఆ తర్వాత తలసరి ఆదాయం వృద్ధిరేటు పరుగులు పెట్టింది. 2004-05 స్థిర ధరల ప్రకారం తలసరి ఆదాయం ఇలా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement