హైదరాబాద్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణను ఎర్రమంజిల్ కోర్టు వాయిదా వేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ జీఆర్ కిచ్చిన 50 లక్షల విలువచేసే రెండు చెల్లని చెక్కుల కేసును మంగళవారం విచారించిన స్పెషల్ కోర్టు మాజిస్ట్రేట్ ఎం కృష్ణారావు కేసు తదుపరి విరాణను సెప్టెంబర్ 22కి వాయిదా వేశారు. అలాగే జీఎంఆర్ కు చెందిన లీగల్ టీం మాల్యా కొత్త చిరునామాను ఈ రోజు కోర్టు ముందుంచింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునందన్ పై జారీ నాన్ బెయిలబుల్ వారెంట్ ను హౌకోర్టులో రీకాల్ చేసుకున్నారు. అయితే ఈ రీకాల్ చెల్లదని చెప్పిన కోర్టు ఇదే కోర్టు ఆవరణలో హాజరు కావాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. దీంతో రఘునాథన్ వ్యతిరేకంగా జారీ చేసిన వారంట్ ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న కారణంగా శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది.
కాగా బ్యాంకులకే కాకుండా మాల్యా జీఎంఆర్ సంస్థకూ టోకరా వేశాడు. శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ బకాయిల చెల్లింపుల పేరిట ఇచ్చిన రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునాథన్ ఏప్రిల్ 20 న దోషిగా తేల్చిల్చింది. కానీ విజయ్ మాల్యా గైర్హాజరుతో మాల్యా పరోక్షంలో శిక్షను ఖరారు చేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే.