ఒక రోజు సాయంకాలం
ఆమె వాడిన పూవై
మా వాకిట్లోకి వచ్చి నిలిచింది
పావురాలు వాలిన నేలమీద
రాలిన మల్లెలు ఆమె
పెదవి చివరన బిగబట్టిన
నిండు దుఃఖం ఆమె
నవ్వుల జాడ మరచిన
ఆవేదన సంత ఆమె
ఆమెకు మనసుంది
చిగురించాలనే తపన వుంది
ఆమెలో విరహపు రుచి వుంది
పూల దాహం వుంది
లేనిదల్లా ఆమె చుట్టూ నలుగురు మనుషులే
ఇప్పుడామె- జీవితాన్ని కోల్పోయిన
విషాద సమయాన్ని మోస్తూ
నాకు దూరంగా
ఆమెకు ఆమె మరింత దగ్గరగా
(ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్
9849082693)
జ్ఞాపకం
Published Mon, Jan 4 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM
Advertisement