Inzamam-Ul-Haq
-
నాడు పాక్‌లో తలదాచుకున్న కుటుంబం.. డాక్టర్ కావాలనుకున్న రషీద్ ఇప్పుడిలా
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. పదకొండేళ్ల వ్యవధిలో.. వన్డేల్లో పాక్‌తో తలపడిన 7 సార్లూ అఫ్గాన్‌కు ఓటమే ఎదురైంది. విజయానికి కొన్నిసార్లు చేరువగా రాగలిగినా.. లక్ష్యాన్ని అందుకోవడం మాత్రం అఫ్గాన్ల వల్ల కాలేదు. కానీ ఈసారి లెక్క మారింది. అప్పటికి ఇంగ్లండ్‌పై గెలిచిన అఫ్గన్.. మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి పాక్‌ను చిత్తు చేయడంలో సఫలమైంది. ఈ గెలుపుతో వచ్చిన జోష్‌లో తర్వాత మరో రెండు మ్యాచ్‌లు నెగ్గి.. ప్రపంచకప్‌లో తొలిసారిగా సెమీస్ రేసులోనూ నిలవగలిగింది. ఇక పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయం తర్వాత కీలక సభ్యుడైన రషీద్ ఖాన్ ఆట పాటతో మైదానంలోనే సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం జట్టుదే కావచ్చు. కానీ రషీద్‌కు సంబంధించి ఇది మరింత ప్రత్యేకం. ఎందుకంటే అఫ్గానిస్తాన్ ఒక జట్టుగా ఎదగడంలో అతడి పాత్ర కూడా ఎంతో కీలకం. వరుస పరాజయాల నుంచి బయటపడి క్రికెట్ వేదికపై టీమ్‌గా ఆ జట్టు సత్తా చాటడంలో రషీద్ కూడా ప్రధాన భాగస్వామి. సరిగ్గా చెప్పాలంటే అఫ్గాన్ క్రికెట్‌తో పాటు సమాంతరంగా అతనూ ఎదిగాడు. అంతకుమించి కూడా వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తమ సొంత దేశంలో యుద్ధ వాతావరణం, మరెన్నో ప్రతికూలతలను అధిగమించి ఈ స్థాయికి చేరిన అతని పట్టుదల, కఠోర సంకల్పం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక దశలో యుద్ధ భయంతో పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోయి అక్కడే దేశవాళీ క్రికెట్లోనూ సత్తా చాటి వెలుగులోకి వచ్చిన రషీద్ ప్రస్థానం అసాధారణం. తొలి గ్లోబల్ సూపర్ స్టార్ అఫ్గానిస్తాన్ దేశం నుంచి వచ్చిన తొలి గ్లోబల్ సూపర్ స్టార్.. ఈ వాక్యం రషీద్‌ఖాన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ప్రపంచవ్యాప్తంగా రషీద్ వేర్వేరు టోర్నీలు, లీగ్స్‌లో ఏకంగా 30 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో తన సొంత దేశం నుంచి పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలు అటు ఆస్ట్రేలియా నుంచి అమెరికా, ఇంగ్లండ్‌కు చెందిన జట్ల వరకు ఉన్నాయి. అన్నింటా, అంతటా ఎక్కడ ఆడినా అతనికి అన్ని వైపుల నుంచి అభిమానం దక్కింది. క్రికెట్ ప్రేమికులందరూ లెగ్‌స్పిన్నర్‌గా రషీద్ ఆటను చూసి చప్పట్లు కొట్టినవారే! ఏదో ఒక దశలో తమవాడిగా సొంతం చేసుకున్నవారే. సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అడిగితే చెప్తారు ఐపీఎల్లో అతని విలువేంటో, అతని ప్రభావం ఎలాంటిదో! తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టినప్పుడే 2017 నుంచి ఐదు సీజన్ల పాటు హైదరాబాద్‌కు ఆడిన అతను గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని గూగ్లీలు ప్రపంచంలో ఎంతటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెడతాయి. తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టినప్పుడే అతను అసోసియేట్ టీమ్ నుంచి ఈ మెగా లీగ్‌లో ఆడిన తొలి ఆటగాడిగా కొత్త ఘనతతో బరిలోకి దిగాడు. అదీ ఏకంగా రూ. 4 కోట్ల విలువతో రైజర్స్ అతడిని ఎంచుకుంది. అప్పటి నుంచి అతను ఒక వైపు తన ఫ్రాంచైజీ టీమ్‌లకు, మరో వైపు జాతీయ జట్టుకు స్టార్‌గా మారాడు. ఇంకా చెప్పాలంటే అతను రాక ముందు వేళ్ల మీద లెక్కించగలిగే విజయాలు మాత్రమే సాధించిన అఫ్గానిస్తాన్ ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు కారణమైందంటే అందులో రషీద్ పాత్ర ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధ వాతావరణం నుంచి వచ్చి... అఫ్గానిస్తాన్‌లోని నన్‌గర్హర్ రాష్ట్రం అతని స్వస్థలం. ఏడుగురు అన్నదమ్ముల్లో అతను ఆరోవాడు. చాలామంది లాగే తన అన్నలు సరదాగా టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుతుండటం చూసి అతనికీ ఆసక్తి కలిగింది. అయితే ఆ దేశంలో పరిస్థితులు కనీస స్థాయిలో కూడా లేవు. కాబట్టి ఇంతకంటే మెరుగ్గా క్రికెట్లో ఏమీ చేయలేమనేది అందరి భావన. డాక్టర్ కావాలనుకుంటే విధిరాత మరోలా పెద్దయ్యాక తామేం కావాలో కలలు కనే అందరి పిల్లల్లానే చిన్నప్పుడు రషీద్ కూడా డాక్టర్ కావాలని, కంప్యూటర్స్ నేర్చుకొని పెద్ద స్థాయికి చేరుకోవాలని, మంచి ఇంగ్లిష్ నేర్చుకొని టీచర్ కావాలని.. ఇలా చాలా కలలు కన్నాడు. కానీ అతనికి మరో విధంగా రాసి పెట్టి ఉంది. రషీద్ ఉండే ఊరు బాటి కోట్ పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది. పెషావర్ సమీప నగరం. చిన్న చిన్న క్రికెట్ టోర్నీలు ఆడేందుకు ఇక్కడివారు అక్కడికి, అక్కడివారు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి సమయంలో నజీమ్ అనే మేనేజర్ రషీద్‌లోని ప్రతిభను గుర్తించాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అర్థం కాని అతని బౌలింగ్ శైలి నజీమ్‌ను ఆకర్షించింది. తన మాట మీద పెషావర్‌లోని ఒక కళాశాల కోచింగ్ కార్యక్రమంలో రషీద్‌ను అక్కడివారు తీసుకున్నారు. పాకిస్తాన్‌కు వలస వెళ్లి దాంతో రషీద్‌కు కొత్త తరహా శిక్షణ లభించింది. అప్పటి వరకు ఎలాంటి నాణ్యత లేని సిమెంట్ టర్ఫ్‌లపై ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన అతనికి అసలైన క్రికెట్ ఏమిటో అర్థమైంది. దాదాపు అదే సమయంలో అఫ్గానిస్తాన్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. కారణాలు ఏమైనా తీవ్రవాదుల హల్చల్, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం పరిస్థితులను ఇబ్బందికరంగా మార్చాయి. దాంతో రషీద్ కుటుంబం మొత్తం పాకిస్తాన్‌లోని పెషావర్‌కే వెళ్లి తలదాచుకుంది. అక్కడ అతడిని చాలా మంది ముహాజిర్ (శరణార్థి) అంటూ ఆట పట్టించినా.. తన క్రికెట్‌తో అతను అన్ని మరచిపోయేవాడు. తిరుగులేని ప్రదర్శనతో... అపార ప్రతిభ ఉండటంతో పాకిస్తాన్లో జరిగే పలు దేశవాళీ టోర్నీల్లో రషీద్ చెలరేగిపోయాడు. అయితే సహజంగానే జాతీయ బోర్డు నిబంధనల కారణంగా అతనికి పాక్ టీమ్‌లో అవకాశాలైతే రాలేదు. కానీ అప్పటికే మెరికలా మారిన అతను తన సొంత దేశం చేరి ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు. పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ తమ కోచ్‌గా రావడం రషీద్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇంజమామ్ ఒత్తిడి తేవడంతో జింబాబ్వే పర్యటనకు తొలుత.. అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. రషీద్‌ను తీసుకున్న తర్వాతే మిగతా విషయాలు మాట్లాడదామంటూ ఇంజమామ్ ఒత్తిడి తేవడంతో స్థానం ఖాయమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు చూస్తే అందరికంటే ముందుగా రషీద్ పేరుతోనే టీమ్ షీట్ తయారు కావడం విశేషం. జింబాబ్వే సిరీస్‌తో అరంగేట్రం చేసిన రషీద్ ఆ తర్వాత అమిత వేగంగా దూసుకుపోయాడు. ఆ తర్వాత లెక్కలేనన్ని ఘనతలు అతడి ఖాతాలో వచ్చి చేరాయి. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా, టి20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా పలు ఘనతలు అతడి జాబితాలో చేరాయి. సహాయకార్యక్రమాల్లో ముందుంటూ... భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ మొదలైన రెండు రోజులకు.. అఫ్గానిస్తాన్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ధర్మశాల మైదానంలో మరికొద్ది సేపట్లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సన్నద్ధమైంది. అప్పుడే ఒక విషాద వార్త బయటకు వచ్చింది. అఫ్గానిస్తాన్ దేశాన్ని అతి పెద్ద భూకంపం కుదిపేసింది. మ్యాచ్ ఫీజును విరాళంగా దేశంలో మూడో పెద్ద నగరమైన హిరాట్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎలాగోలా అఫ్గాన్ ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగించేశారు. ఆ వెంటనే జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన తరఫు నుంచి మొత్తం ప్రపంచకప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించేశాడు. ఆపై తగిన సహాయం చేయాలంటూ తన ఫౌండేషన్ ద్వారా కోరాడు. ఒకవైపు టోర్నీలో సత్తా చాటుతూ మరోవైపు తన సన్నిహితుల సహకారంతో అతను అఫ్గానిస్తాన్‌లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నాడు. నిధులతో పాటు పునరావాస కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. 25 ఏళ్ల రషీద్ ఇలా స్పందించడం మొదటిసారి కాదు. గతంలోనూ తన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగం కావడంతోపాటు తన సొంత డబ్బుతో చిన్నారుల చదువు, పేదలకు సహకారం వంటి పనుల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అక్కడి పరిస్థితులు కూడా తన దేశం కోసం ఏదైనా చేయాలనే ప్రేరణను కలిగిస్తాయని అతను చెబుతుంటాడు. పేద దేశం, టెర్రరిజం మొదలు ఇతర తీవ్రమైన ప్రతికూలతలకు ఎదురొడ్డి తాను ఇప్పుడు ఒక గొప్ప ఆటగాడిగా ఎదగడం వరకు ఎక్కడా తన మూలాలను మర్చిపోలేదు. ప్రపంచంలో ఏ చోట క్రికెట్ ఆడుతున్నా.. సాయం చేసేందుకు ఎప్పుడైనా సిద్ధమని అతను అన్నాడు. అదే అతడిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్
ICC ODI WC 2023- Pakistan Squad: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించిన వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంకు భంగపాటు తప్పలేదు. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలుకానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఇమాద్.. స్పిన్ దళంలో ఒకడిగా తప్పక టీమ్‌లోకి వస్తాడని భావించివారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఇమాద్ వసీంను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. అలాంటి వాళ్లనే ఎంపిక చేస్తాం ‘‘చాలా రోజులుగా ఇమాద్ వన్డేలు ఆడటం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో తమను తాము నిరూపించుకోవాల్సిందే. అందుకే అతడికి చోటు లేదు డొమెస్టిక్ క్రికెట్లో ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అదే మెయిన్ క్రైటీరియా’’ అని ఇంజమామ్ ఉల్ హక్ స్పష్టం చేశాడు. కాగా వరల్డ్‌కప్‌నకు ప్రకటించిన జట్టులో నసీం షా స్థానంలో హసన్ అలీ రీఎంట్రీ ఇస్తుండగా.. మహ్మద్ వసీం జూనియర్ నాలుగో సీమర్‌గా చోటు సంపాదించాడు. అనూహ్య రీతిలో ఉస్మా మీర్‌కు కూడా స్థానం దక్కింది. ఇదిలా ఉంటే.. సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు ఆడుతున్న ఇమాద్ వసీం 10 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయడంతో పాటు 268 పరుగులు సాధించాడు. కాగా పాక్ తరఫున ఇప్పటి వరకు 55 వన్డేలు ఆడిన 34 ఏళ్ల ఇమాద్.. 986 పరుగులు చేయడంతో పాటు.. 44 వికెట్లు పడగొట్టాడు. చివరగా 2020లో జింబాబ్వేతో సొంతగడ్డపై వన్డే ఆడాడు. చదవండి: Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే? 🚨 Our squad for the ICC World Cup 2023 🚨#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/pJjOOncm56 — Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023 -
సచిన్, ద్రవిడ్ కాదు.. అతడే ఆసియాలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్: సెహ్వాగ్
ప్రముఖ క్రికెట్ ప్రేజేంటర్ గౌరవ్ కపూర్ హోస్ట్ చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి చేశాడు. ఈ షోలో పాల్గొన్న సెహ్వాగ్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆసియాలో అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరని గౌరవ్ కపూర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా అతడు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కాకుండా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్‌ను ఎంపిక చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. కాగా 2000లలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలతో పోటీపడిన ఆటగాళ్లలో ఇంజమామ్ వుల్ హక్ ఒకడు. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 498 మ్యాచ్‌లు ఆడిన ఇంజమామ్.. 20,569 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 25 సెంచరీలు, వన్డేల్లో 10 సెంచరీలు సాధించాడు. అయితే వన్డేల్లో మాత్రం 83 హాఫ్ సెంచరీలు ఇంజమామ్ చేశాడు. "అందరూ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతారు. కానీ ఇంజమామ్-ఉల్-హక్ ఆసియాలో అతిపెద్ద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. అయితే సచిన్ పాజీ అందరి కంటే ముందున్నాడు. అతడికి ఎవ్వరితో పోటీ లేదు. కానీ ఆసియాలో మాత్రం అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే.. ఇంజమామ్‌ను మించిన వారు లేరు. 2003-04 కాలంలో ఇంజమామ్ ఓవర్‌కి 8 పరుగులు చేసేవాడు. అతను తన బ్యాటింగ్ పార్టనర్‌కి భయపడొద్దు అని ధైర్యం చేప్పేవాడు. ఓ మ్యాచ్‌లో ఆఖరి 10 ఓవర్లలో 80 పరుగులు అవసరం. ఇటువంటి సమయంలో ఏ ఆటగాడైనా ఒత్తడికి గురవుతాడు. కానీ ఇంజమామ్ మాత్రం చాలా కూల్‌గా ఉంటాడు. అదే విధంగా 2005లో ఓ మ్యాచ్‌లో డానిష్ కనేరియా రౌండ్‌ది వికెట్ బౌలింగ్ చేసి కాస్త ఇబ్బంది పెట్టాడు. భారీ షాట్లు ఆడకుండా నన్ను ఆపేందుకు కనేరియా ప్రయత్నించాడు. నేను ఒకట్రెండు ఓవర్లు ఢిపెన్స్ ఆడాను. ఆ తర్వాత ఇంజమామ్ వైపు తిరిగి... ‘‘ఇంజీ భాయ్... నా కాళ్లు నొప్పి పెడుతున్నాయ్. ఎంత సేపు డిఫెన్స్ ఆడాలని’’ అని అన్నాను. దానికి అతడు ‘‘నన్నేం చేయమంటావ్’’ అన్నాడు. అందుకు బదులగా "సర్కిల్ లోపలకి లాంగ్ ఆన్ ఫీల్డర్ని తీసుకురా, నేను సిక్స్ కొడతా అని ఇంజీతో చెప్పా. దానికి ఇంజమామ్ నవ్వాడు. ‘‘సరే నేను సిక్సర్ కొట్టపోతే ఆ ఫీల్డర్ని మళ్లీ వెనక్కిపంపించు’’ అని చెప్పాను. అందుకు అతడు అంగీకరించి ఫీల్డర్ని సర్కిల్ లోపలకి పిలిచాడు. కనేరియా గూగ్లీ వేయగా.. నేను చెప్పినట్లగానే బంతిని స్టాండ్స్‌కు పంపించాను. ఫీల్డింగ్ మార్చినందుకు కనేరియాకు ఒక్క సారిగా కోపం వచ్చింది. వెంటనే కెప్టెన్ దగ్గరికి వెళ్లి ‘ఇంజీ భాయ్, మీరు ఫీల్డర్‌ను ఎందుకు పైకి తీసుకువచ్చారు? అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా నువ్వు సైలెంట్‌గా వెళ్లి బౌలింగ్ చెయి, లేదంటే బయటకు వెళ్లిపోతావు అని ఇంజీ భాయ్ అన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. -
52 ఏళ్ల వయసులోనూ ఇంజీ పవర్ఫుల్ సిక్సర్.. ఆశ్చర్యపోయిన ఆఫ్రిది!
Inzamam Ul Haq- Shahid Afridi: విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికి 15 ఏళ్లకు పైనే అవుతోంది. జింబాబ్వేతో 2007లో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా పాక్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు ఇంజీ! అయితే, యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులను అలరిస్తున్న ఈ మాజీ సారథి... తాజాగా.. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. అదిరిపోయే షాట్ పాకిస్తాన్లో మెగా స్టార్స్ లీగ్ పేరిట ఆరు జట్ల మధ్య టీ10 లీగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఇంజమామ్.. 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే, క్రీజులో ఉన్నంత సేపు బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు ఇంజీ. ఈ క్రమంలో అతడు కొట్టిన పవర్ఫుల్ సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. 52 ఏళ్ల వయసులోనూ పవర్‌హిట్టింగ్ చేసిన ఇంజీని అలా చూస్తూ ఉండిపోయారు అభిమానులు. డగౌట్లో కూర్చున్న మరో మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది సైతం ఇంజీ భాయ్ షాట్‌కు ఆశ్చర్యపోయాడు. సోమవారం నాటి మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరుగుల వరద కాగా పాకిస్తాన్ తరఫున ఇంజమామ్ వన్డేల్లో మొత్తంగా 11,701 పరుగులు సాధించాడు. పాక్ తరఫున వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా నిలిచాడు. తన కెరీర్లో మొత్తంగా 120 టెస్టులు, 378 వన్డేలు ఆడాడు. 81 వన్డే మ్యాచ్‌లకు సారథ్యం వహించి 51 గెలిచాడు. చదవండి: Ajinkya Rahane: డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. Babar Azam: ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ.. Inzi Bhai scores 29 of just 16 and becomes the cricketainer of the day.#KingdomValleyMSL2022 #MSL #KingdomValleyMSL#MegaStarsLeague #Cricketainment #KingdomValley#CricketLeague #Cricket #ShahidAfridi #mediasniffers#Pakola #Daikin #Pindi #islamabad #InzimamUlHaq pic.twitter.com/EdkQVg6GmL — Mega Stars League (@megastarsleague) December 19, 2022 -
SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ..
Asia Cup 2022 Winner Sri Lanka- Inzamam Ul Haq Comments: ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకను విజేతగా నిలపడంలో ఆ జట్టు బ్యాటర్ భనుక రాజపక్సదే కీలక పాత్ర. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న వేళ నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. చాంపియన్‌గా నిలడంలో తన వంతు సాయం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు 30 ఏళ్ల రాజపక్స. తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన స్ట్రైక్‌రేటుతో భనుక రాజపక్స రాణించి తీరు ప్రశంసనీయం. పాక్‌తో ఫైనల్లో అతడి స్ట్రైక్‌రేటు 157.78. రాజపక్స అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. భనుక రాజపక్స ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఎక్కువ బంతులు తీసుకుని రాజపక్స కనుక ఈ డెబ్బై పరుగులు చేసి ఉంటే.. ఆ ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదని వ్యాఖ్యానించాడు. సరైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు. హసరంగ భళా రాజపక్స, హసరంగ! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇంజమామ్ మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘హసరంగ 31 పరుగులు... రాజపక్స 71 పరుగులు చేశాడు. ఈ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్. కఠిన పరిస్థితుల్లో.. ఒత్తిడిని జయించి వారు ఈ స్కోర్లు నమోదు చేశారు. ఒకవేళ ఈ డెబ్బై పరుగులు చేసేందుకు గనుక రాజపక్స ఎక్కువ బంతులు తీసుకుని ఉంటే.. అప్పుడు లంక జట్టు స్కోరు 140 వరకు వచ్చి ఆగిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ సులువుగానే ఆ లక్ష్యాన్ని ఛేదించేది. అప్పుడు రాజపక్స ఇన్నింగ్స్ వృథాగా పోయేది. దానికసలు విలువే ఉండేది కాదు’’ అంటూ టీ20 ఫార్మాట్లో స్ట్రైక్‌రేటుకు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పుకొచ్చాడు. మా వాళ్లు చాలా తప్పులు చేశారు ఇక తమ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘‘శ్రీలంక పేసర్లంతా కొత్తవాళ్లు. వాళ్లలో ఒక్కరికి కూడా తగినంత అనుభవం లేదు. అయినా.. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగారు. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీలో బాగానే ఆడింది.. కానీ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. చాలా పొరపాట్లు చేశారు. ఒత్తిడిని అధిగమించలేకపోయారు. ఆదిలో శ్రీలంకను 58-5కు కట్టడి చేయగలిగినా ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం’’ అని పాక్ ఆట తీరుపై ఇంజమామ్ ఉల్ హక్ విమర్శలు గుప్పించాడు. కాగా దుబాయ్ వేదికగా పాక్‌తో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 23 పరుగులతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. మెగా ఈవెంట్లో ఆరోసారి టైటిల్ గెలిచిన జట్టుగా దసున్ షనక బృందం నిలిచింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'టీమిండియాను ఓడించడం అంత ఈజీ కాదు.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై ఒత్తిడి ఉంది'
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా అద్భుతమైన పునరాగమనం చేసింది. దీంతో సిరీస్ ఆశలను భారత్ సజీవంగా నిలుపుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని, ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని ఇంజమామ్ తెలిపాడు. అదే విధంగా అతడు భారత బౌలర్లపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్,చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. టీమిండియా విజయం సాధించడంతో ఈ సిరీస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ప్రోటీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని భావించాను. కాని భారత బౌలర్లు దక్షిణాఫ్రికా విజయాన్ని అడ్డుకున్నారు. ఇక టీమిండియా స్వదేశంలో అంత సులభంగా ఓడిపోదు. కాబట్టి ఇప్పుడు దక్షిణాఫ్రికాపై ఒత్తిడి ఉంది. టీమిండియా యువ ఆటగాళ్లు పోరాట పటిమను కనబరుస్తున్నారు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేరు. అయినప్పటికీ వారు అద్భుతమైన విజయాన్ని సాధించగలిగారు" అని ఇంజమామ్-ఉల్-హక్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! -
'పనికిమాలిన పిచ్‌లు తయారు చేయకండి'
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు ఫేలవ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల మ్యాచ్‌లో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌పై బ్యాట్స్‌మన్ పండగ చేసుకున్నారు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్స్ కూడా పాక్ బౌలర్లకు ధీటుగానే బదులిచ్చారు. ఒక రకంగా జీవం లేని పిచ్‌ను ఎలా తయారు చేయడం ఏంటని అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ -ఉల్-హక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టుపై విమర్శలు వస్తున్నాయి. ఈ పిచ్ ఏంటి అంటూ కొందరు అభిమానులు పేర్కొన్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలో నిజముంది. కనీసం వచ్చే టెస్టులో పనికిమాలిన పిచ్ తయారు చేయరని భావిస్తున్నా. టెస్టుల్లో ఇలాంటి ఫలితం ఎప్పుడు చూశానో నాకు సరిగా గుర్తులేదు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మొదటిరోజునే పిచ్ ఏంటనేది అర్థమైపోయింది. మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా కూడా పాక్‌కు ధీటుగా బదులిచ్చింది. మొదట పాక్ ఈ మ్యాచ్‌లో 100-150 పరుగుల లీడ్ సాధిస్తుందని అనుకున్నా. కానీ ఆసీస్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.సాధారణంగా ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయంటారు. కాబట్టి కనీసం వచ్చే టెస్టుకైనా స్పోర్టింగ్ పిచ్ తయారు చేస్తారని ఆశిస్తున్నా. స్పిన్నర్లకు సహకరించేలా వికెట్ తయారు చేయండి. దయచేసి డెడ్ పిచ్‌లను తయారు చేయకండి.'' అంటూ యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. చదవండి: Prithvi Shaw: నా బ్యాటింగ్ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన జడేజా.. నంబర్ 1 -
టీమిండియా ప్రదర్శన షాకింగ్.. దారుణం.. అసలేం చేశారు: పాక్ మాజీ కెప్టెన్
Inzamam-ul-Haq Comments On Team India Loss: ‘‘ఇండియా- పాకిస్తాన్ తర్వాత ఈ టోర్నమెంట్లో ఇదే పెద్ద మ్యాచ్. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య పోరు కన్నా ఆసక్తికరం. కానీ... ఇంతటి ప్రాముఖ్యం గల మ్యాచ్‌లో టీమిండియా ఆడిన విధానం నన్ను విస్మయానికి గురిచేసింది. అసలు వాళ్లు ఏం చేశారో అర్థం కాలేదు. అంత పెద్ద జట్టు.. ఇంతలా ఒత్తిడికి గురవడమేమిటో నాకస్సలు అర్థం కావడం లేదు’’ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. న్యూజిలాండ్ చేతిలో కోహ్లి సేన ఓటమి తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నాడు. కాగా సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో కివీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కనీసస్థాయి ప్రదర్శన కనబరచకలేక ఒత్తిడిలో చిత్తయింది. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఇంజమామ్... భారత జట్టు ప్రదర్శనపై పెదవి విరిచాడు. ‘‘న్యూజిలాండ్ స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేయగలరు. కానీ వరల్డ్ క్లాస్ మాత్రం కాదు. కానీ... టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి బౌలింగ్‌లో సింగిల్స్ కూడా తీయలేకపోయారు. స్పిన్ బౌలింగ్‌లో చక్కగా ఆడటమే కోహ్లి బలం. తను కూడా సింగిల్స్ కూడా తీయలేకపోవడం దారుణం’’ అని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ కకావికలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి.. (17 బంతుల్లో 9 పరుగులు) పూర్తిగా నిరాశపరిచాడు. ఇక టీమిండియా పరిస్థితి ఇలా ఉంటే... పాకిస్తాన్ వరుసగా టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్‌పై విజయాలతో సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేసుకుంది. చదవండి: T20 World Cup 2021 Ind Vs NZ: టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇంకా అవకాశం ఉందా?! Kohli is gone ☝️ Trying to up the ante, he attempts a big one against Sodhi but fails. He is dismissed for 9.#T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/PiOAQJGwjz — T20 World Cup (@T20WorldCup) October 31, 2021 -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్..
Inzamam-ul-Haq discharged from hospital: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రముఖ భారతీయ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా ఇంజమామ్-ఉల్-హక్ వేగంగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఛాతీ నొప్పితో భాద పడుతున్న అతడిని సోమవారం ఉదయం లాహోర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అతడికి వైద్యులు ఆంజియోప్లాస్టి శస్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఇంజమామ్ ఆరోగ్యం మెరుగు పడడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ గెలవడంలో ఇంజమామ్ కీలక పాత్ర పోషించాడు. అతడు 2007 లో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. గతంలో పాక్ జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన 51 ఏళ్ల ఇంజీ.. ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇంజమామ్ ఉల్ హక్.. తన కెరీర్లో 120 టెస్టులు... 378 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు).. వన్డేల్లో 11739(10 సెంచరీలు) రన్స్ చేశాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు. చదవండి: T20 World Cup: టీమిండియాలోకి శ్రేయస్..? ఆ నలుగురిపై వేటు పడనుందా..? -
Inzamam ul Haq: పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు..
Inzamam-ul-Haq undergoes angioplasty: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించి ఆంజియోప్లాస్టి నిర్వహించారు. ప్రస్తుతం ఇంజమామ్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, అతడు కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జియో న్యూస్ జర్నలిస్టు ఆర్ఫా ఫిరోజ్ జేక్ ట్విటర్ వేదికగా తెలిపారు. కాగా ఇంజీకి గుండెపోటు వచ్చిందన్న వార్తల నేపథ్యంలో అతడి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ‘‘నువ్వు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి’’ అని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ఇక 1992 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడైన ఇంజమామ్... దేశంలోని అత్యుత్తమ బ్యాటర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. గతంలో పాక్ జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన 51 ఏళ్ల ఇంజీ.. ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇంజమామ్ ఉల్ హక్.. తన కెరీర్లో 120 టెస్టులు... 378 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు).. వన్డేల్లో 11739(10 సెంచరీలు) రన్స్ చేశాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు. చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్ Really saddened to hear about Inzamam Ul Haq's heart attack. One of Pakistan's greatest ever batters and a bona-fide legend of the game...keeping him in my thoughts and praying for a speedy recovery. — Aatif Nawaz (@AatifNawaz) September 27, 2021 Former Pakistan captain Inzamam-ul-Haq suffered a heart attack and had to undergo angioplasty. He is said to be recovering in hospital. Our prayers for a complete and swift recovery for the legend. #InzamamUlHaq | #CricketTwitter pic.twitter.com/GMUwrjlcOd — Grassroots Cricket (@grassrootscric) September 27, 2021 -
టీమిండియా చెత్త ప్రదర్శన.. కోహ్లి, రోహిత్‌లదే బాధ్యత
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా దారుణ ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. కోహ్లి, రోహిత్‌లు దీనికి బాధ్యులని.. ముందు వారిద్దరు బ్యాటింగ్ బాగా చేస్తే బాగుంటుదంటూ చురకలంటించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇంజమామ్ మాట్లాడుతూ..'' టీమిండియా బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్ బౌలర్లను ఏ మాత్రం ఇబ్బందిపెట్టలేకపోయారు. వారి బ్యాటింగ్ శైలి నాసిరకంగా తయారైంది. తొలి రెండు టెస్టుల్లోనూ టీమిండియా బ్యాటింగ్ అంత ఆసక్తికరంగా ఏం కనిపించలేదు. కోహ్లి, రోహిత్ శర్మలే దీనికి బాధ్యత వహించాల్సి ఉంది. నా దృష్టిలో వారిద్దరు బాగా బ్యాటింగ్ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 105 బంతులాడి 19 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ కాస్త స్ట్రోక్‌ప్లేతో షాట్లు ఆడితే టాపార్డర్, మిడిలార్డ్రర్‌కు ధైర్యంగా ఉండేది. చదవండి: మ్యాచ్ జరుగుతుండగా విరాట్ కోహ్లి ఫోటో ప్రత్యక్షం ఇక విరాట్ కోహ్లి ప్రదర్శన మరింత దారుణంగా తయారైంది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. లీడ్స్ టెస్టులోనూ కోహ్లి అదే ప్రదర్శనను చేశాడు. 31 బంతులాడి కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వీరిద్దరు మాత్రమే కాదు జట్టులో ఉన్న మిగిలిన సీనియర్ బ్యాట్స్‌మన్ పుజారా, రహానేలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టీమిండియా పతనాన్ని శాసిస్తున్నాడు. టెస్టు సిరీస్ ఆరంభం నుంచి అండర్సన్ మంచి ప్రదర్శననే కనబరుస్తున్నాడు. టీమిండియా బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే మ్యాచ్ నాలుగురోజుల్లో ముగిసే అవకాశం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అనూహ్యంగా 78 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లను ఉతికారేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు రోజుల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. జో రూట్ అద్భుత సెంచరీతో మెరవగా.. డేవిడ్ మలాన్ అర్థ సెంచరీతో రాణించాడు. ఇప్పటికే 345 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. చదవండి: T20 Cricket: టి20 క్రికెట్లో సరికొత్త రికార్డు.. చరిత్రలో తొలి బౌలర్‌గా -
ఆసీస్ మ్యాచ్ ముఖ్యమా.. పాక్‌ను డీగ్రేడ్ చేయడమే ఇది!
Pakistan Tour Of West Indies 2021: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మండిపడ్డాడు. వెస్టిండీస్ బోర్డు ప్రతిపాదనలకు అంగీకరించి, మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను నాలుగు మ్యాచ్‌లకు కుదించడం పాకిస్తాన్ క్రికెట్ జట్టును తక్కువ చేసి చూపడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్ జట్టు టీ20 సిరీస్ నిమిత్తం వెస్టిండీస్‌లో పర్యటించాల్సి ఉంది. మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను రద్దు చేసి... బుధవారం నుంచి రీషెడ్యూల్ చేశారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన వెస్టిండీస్- ఆస్ట్రేలియా(విండీస్ టూర్) వన్డే మ్యాచ్‌ను నిర్వహించడానికే విండీస్ బోర్డు ఈ మేరకు పీసీబీ వద్ద ప్రతిపాదనలు చేసింది. ఇందుకు పాక్ బోర్డు అంగీకరించడంతో పాకిస్తాన్‌తో ఆడాల్సిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4 మ్యాచ్‌లకు పరిమితం చేసింది. ఈ విషయంపై స్పందించిన ఇంజమామ్.. ‘‘అసలు పీసీబీ ఇలాంటి ఒక ప్రపోజల్‌కు ఎందుకు అంగీకరించిందో అర్థం కావడం లేదు. కరోనా కేసు వెలుగు చూసిన కారణంగా విండీస్- ఆసీస్ మ్యాచ్ రీషెడ్యూల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే... దీనితో పాక్ టీ20 సిరీస్‌కు ఏం సంబంధం? నిజానికి టీ20 సిరీస్‌కు, ఆగష్టు 12న ప్రారంభం కావాలిస్న టెస్టు సిరీస్‌కు మధ్య మధ్య తొమ్మిది రోజుల వ్యవధి ఉంది. కావాలంటే ఈ గ్యాప్‌లో మరో మ్యాచ్ నిర్వహించవచ్చు. కానీ, ఆస్ట్రేలియా కోసం విండీస్ పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని భావించింది. ఇది నిజంగా పాక్ జట్టును డీగ్రేడ్ చేయడమే. పీసీబీ ఎందుకు సానుకూలంగా స్పందించిందో నాకింకా షాకింగ్‌గానే ఉంది. ఈసారి ఈ జట్టుతో లేదంటే ఆ జట్టుతో అని పదేపదే జట్లు మార్చడానికి.. ఇవేమీ క్లబ్ మ్యాచ్‌లు కాదు కదా. అంతర్జాతీయ మ్యాచ్‌లు’’ అని తన యూట్యూబ్ చానెల్ వేదికగా పీసీబీ, విండీస్ బోర్డు తీరును విమర్శించాడు. కాగా టాస్ వేసిన తర్వాత వెస్టిండీస్ జట్టు సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడినట్లు తెలియడంతో విండీస్- ఆసీస్ మధ్య జరగాల్సిన రెండో వన్డేను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. A battle to end the #WIvAUS tour on a high note.🏆 pic.twitter.com/V5kWV28wwy — Windies Cricket (@windiescricket) July 26, 2021 Hosein finds the 1st wicket! #WIvAUS #MenInMaroon pic.twitter.com/WG1nsnopqv — Windies Cricket (@windiescricket) July 26, 2021 -
ఈ విషయం ముందే చెప్పా.. నిర్ణయం సరైనదే
కరాచీ: జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్ను టీమిండియా రెండో జట్టుకు టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయడంపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్‌గా ద్రవిడ్ సరిగ్గా సరిపోతాడని.. అతని మార్గనిర్దేశనంలో జట్టు అదరగొడుతుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేయడంపై పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు. ''నేను ఈ విషయం ఇంతకముందే చెప్పా. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ సరిగ్గా సరిపోతాడు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే. ద్రవిడ్ అండర్-19 గ్రూఫ్ నుంచి ఎందరో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేశాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా రెండో జట్టుకు ఎంపికయ్యే ఆటగాళ్లలో చాలావరకు ద్రవిడ్ శిక్షణలో రాటుదేలిన వారే. వారి నుంచి ఆటను ఎలా రాబట్టాలనేది అతనికి బాగా తెలుసు. ఆటగాళ్లు కూడా ద్రవిడ్‌తో మంచి అనుబంధం ఉన్న కారణంగా ఇట్టే కలిసిపోతారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎక్స్పరిమెంట్స్ చేస్తే మంచిది. ఎందుకంటే సీనియర్లు లేని లోటు తెలియాలంటే బ్యాకప్ బెంచ్ కూడా పటిష్టంగా ఉంచుకోవాలి. బీసీసీఐ మంచి ప్రణాళికతో ముందుకెళుతుంది.. వీరిని చూసి ఇతర క్రికెట్ బోర్డులు అదే దారిని ఎంచుకోవాలి'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శ్రీలంక పర్యటనకు సంబంధించి టీమిండియా జట్టును బీసీసీఐ వచ్చే నెలలో ప్రకటించనుంది. కోచ్ విషయంలో క్లారిటీతో కనిపించిన బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పజెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రేసులో శిఖర్ ధావన్, హార్దిక పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లు కనిపిస్తున్నా.. సెలెక్టర్లు మాత్రం అనుభవం దృష్యా కెప్టెన్సీ బాధ్యతలు ధావన్‌కే అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సీనియర్ జట్టు న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు సన్నద్దమవుతుంది. జూన్ 2న ఇంగ్లండ్ వెళ్లనున్న టీమిండియా జూన్ 18 నుంచి 22 వరకు కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. చదవండి: ద్రవిడ్ కెప్టెన్ కావడం వారికి ఇష్టం లేదు.. అందుకే అలా చేశారు -
'టీమిండియా వద్ద మెషిన్ గన్ ఉన్నట్టుంది'
కరాచీ: టీమిండియా జట్టులో యంగ్ ఆటగాళ్లకు కొదువ లేదని.. ఎప్పటికప్పుడు జట్టులోకి కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్-ఉల్-హక్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా 66 పరుగులతో విజయం సాధించిన అనంతరం ఇంజమామ్ స్పందించాడు. ''బహుశా టీమిండియా వద్ద ఏదైనా మెషిన్ గన్ ఉందనుకుంటా. రోజు ఎవరో ఒక కొత్త ఆటగాడు జట్టులో చేరుతూనే ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా యువ ఆటగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్రసిధ్ కృష్ణ, కృనాల్ పాండ్యాలు అదరగొట్టారు. ఒకరు బ్యాటింగ్.. మరొకరు బౌలింగ్‌లో విజృంభించారు.అరంగేట్రంలోనే రాణిస్తే జట్టులో సీనియర్ల పక్కన స్థానం సుస్థిరం చేసుకునే అంశాన్ని ఇప్పుడు వచ్చిన ఆటగాళ్లు ఒంట బట్టించుకున్నారు. గత ఆరు నెలలుగా చూసుకుంటే.. ఆసీస్ సిరీస్ నుంచి మొదలుకొని జట్టులోని యంగ్ ఆటగాళ్లంతా అదరగొట్టేస్తున్నారు. సీనియర్స్ వాళ్ల రోల్ పోషిస్తుండగా.. జూనియర్లు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఆసీస్ సిరీస్‌లో నటరాజన్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్.. తాజగా ఇంగ్లండ్ సిరీస్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, కృనాల్‌లు అందుకు ఉదాహరణ. ప్రస్తుతం భారత్ ఆడుతున్న క్రికెట్లో నాణ్యత ఎక్కువగా కనిపిస్తుంది.. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే టీ20 ప్రపంచకప్‌ను భారత్ ఎగురేసుకుపోవడం ఖాయం. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రాహుల్- కృనాల్‌ల మధ్య ఏర్పడిన 112 పరుగుల భాగస్వామ్యం టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 270 పరుగుల వద్దే భారత్ ఇన్నింగ్స్ ముగుస్తుందన్న దశలో వీరిద్దరు కలిసి జట్టు స్కోరు 300 దాటించారు. అందులో కృనాల్ 31 బంతుల్లోనే 58 పరుగులు సాధించడం చూస్తుంటే టీమిండియా వద్ద మెషిన్ గన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
సెహ్వాగ్‌ను చూసినట్లు అనిపించింది: పాక్ మాజీ కెప్టెన్
ఇస్లామాబాద్: టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ బ్యాటింగ్ శైలి, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేసిందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ అన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఒత్తిడికి లోనుకాకుండా తమదైన శైలిలో బ్యాట్‌తో చెలరేగిపోవడంలో ఇద్దరూ ఇద్దరేనంటూ ప్రశంసలు కురిపించాడు. పంత్‌ను చూసినప్పుడల్లా సెహ్వాగ్ ఎడమచేతిలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సిడ్నీ(డ్రా), బ్రిస్బేన్(గెలుపు) ఫలితాల్లో పంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మెరుగ్గా ఆడాడు. ముఖ్యంగా నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ చేసి తన విలువేమిటో మరోసారి చాటి చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇంజమామ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ అత్యంత ప్రతిభావంతుడు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఒత్తిడి ఫీల్ అవ్వడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆటగాడిని చూశాను. 6 వికెట్లు పడిన సమయంలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అద్భుతమైన ఇన్నిండ్స్ ఆడాడు. పిచ్ గురించి పట్టించుకోలేదు. బౌలర్ ఎవరన్న విషయం గురించి ఆలోచించలేదు. స్పిన్నర్లైనా, ఫాస్ట్ బౌలర్లు అయినా తను ఒకే విధంగా ఆడతాడు. నేనైతే పంత్ బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. సెహ్వాగ్ ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తున్నాడా అనిపించింది’’ అంటూ ప్రశంసించాడు. అదే విధంగా.. సెహ్వాగ్‌తో తను ఆడిన మ్యాచ్‌ల గురించి గుర్తుచేసుకుంటూ.. ‘‘సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నపుడు వేరే ఇతర విషయాల గురించి అస్సలు పట్టించుకోడు. పిచ్ ఎలా ఉంది, బౌలర్ ఎవరు, బౌండరీల వద్ద ఫీల్డర్లు ఉన్నా సరే తను ఆడాలనుకున్న షాట్‌ను తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లోనూ తన పంథా ఇలాగే ఉంటుంది. అప్పట్లో సచిన్, ద్రవిడ్, ఇప్పుడు విరాట్, రోహిత్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎంతో మంది భారత్‌కు దొరికారు. అయితే, సెహ్వాగ్ వంటి ఆత్మవిశ్వాసం ఉన్న క్రికెటర్‌ను నేనింత వరకు చూడలేదు’’ అని గత జ్ఞాపకాలు పంచుకున్నాడు. చదవండి: పంత్ హైలెట్ షాట్: పాపం మొహం మాడ్చుకున్నాడుగా! కామెంటేటర్స్ మీరు మారండి.. పంత్ స్టన్నింగ్ రిప్లై -
అంతా బయటివాళ్లే... మనోళ్లు ఒక్కరు లేరు
చెన్నై: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 100వ టెస్టులో సెంచరీ సాధించిన 9వ ఆటగాడిగా రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంతకముందు ఈ ఘనత సాధించిన వారిలో జావెద్ మియాందాద్, రికీ పాంటింగ్, ఇంజమామ్ ఉల్ హక్, గోర్డన్ గ్రీనిడ్జ్, కొలిన్ కౌడ్రే, అలెక్ స్టీవార్ట్, గ్రేమి స్మిత్, హషీమ్ ఆమ్లా ఉన్నారు. అయితే 100వ టెస్టులో సెంచరీ చేసిన ఆటగాడు టీమిండియా నుంచి ఒక్కరు లేకపోవడం విశేషం. కాగా ఈ ఘనత సాధించిన తొమ్మిది మందిలో రూట్ సహా మరో ఇద్దరు ఇంగ్లండ్‌కు చెందినవారు కాగా..పాకిస్తాన్, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఉండగా.. ఆస్ట్రేలియా, విండీస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. దీంతో పాటు రూట్ 100వ టెస్టులో సెంచరీ సాధించిన 5వ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. 2012లో దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమి స్మిత్ సెంచరీ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రూట్ కెప్టెన్‌గా 100వ టెస్టులో సెంచరీ చేయడం విశేషం. స్మిత్, రూట్ కంటే ముందు కెప్టెన్ హోదాలో 100వ టెస్టులో సెంచరీ సాధించిన వారిలో మియాందాద్, ఇంజమామ్, కొలిన్ కౌడ్రే ఉన్నారు. చదవండి: మ్యాచ్ మధ్యలో కోహ్లి, రూట్ ఏం మాట్లాడారో! జో రూట్ అరుదైన ఘనత -
చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం
బ్రిస్బేన్ : జాంటీ రోడ్స్.. క్రికెట్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. అప్పటివరకు మూస ధోరణిలో ఉండే ఫీల్డింగ్‌కు కొత్త పర్యాయం చెప్పిన వ్యక్తి రోడ్స్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఫీల్డింగ్ విన్యాసాలు.. డైవ్ క్యాచ్‌లు.. మెరుపువేగంతో రనౌట్లు.. మైదానంలో పాదరసంలా కదలడం లాంటివన్నీ రోడ్స్ వచ్చిన తర్వాత వేగంగా మారిపోయాయి. తన 11 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు.. రనౌట్లు.. వెరసి కొన్నిసార్లు దక్షిణాఫ్రికా జట్టును కేవలం తన ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్‌లు గెలిపించాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టుకు ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం) అందుకు చాలా ఉదాహరణలున్నాయి.. వాటి గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తుకువచ్చేది 1992 ప్రపంచకప్.. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోడ్స్.. ఇంజమామ్‌ను రనౌట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. రోడ్స్ చేసిన విన్యాసం జిమ్ ఫెన్విక్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించగా.. అది బెస్ట్ ఫోటోగ్రఫీగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 36 ఓవర్లకు కుదించి 194 పరుగులను రివైజ్డ్ టార్గెట్‌గా విధించారు. వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. పాక్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులతో పటిష్టంగా నిలిచి విజయానికి చేరువలో ఉంది. క్రీజులో ఇంజమామ్ ఉల్ హక్ 48 పరుగులతో మంచి టచ్‌లో ఉండగా.. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అతనికి అండగా ఉన్నాడు. అలెన్ డొనాల్డ్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఇంజమామ్ షాట్ ఆడాడు. ఇంజమాముల్ హక్ కొట్టిన బంతిని రోడ్స్ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్ షాక్‌కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఇంజమామ్‌ను రోడ్స్ ఔట్ చేయడంతో ఆ ప్రభావం పాక్‌పై తీవ్రంగా పడి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రనౌట్‌తోనే జాంటీ రోడ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఒకే మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు అందుకున్న ఘనత రోడ్స్ పేరిట ఇప్పటికి నిలిచిపోయింది. తాజాగా ఐసీసీ క్రిస్టమస్ సందర్భంగా మరోసారి జాంటీ రోడ్స్ రనౌట్ ఫీట్‌ను స్నో స్టాపింగ్ మూమెంట్ పేరుతో ట్విటర్లో షేర్ చేసింది. As a part of our Crickmas celebrations, we bring you some of the biggest 'snow'stopping instances in cricket history ❄️❗ Who remembers this incredible run-out by Jonty Rhodes from the 1992 @cricketworldcup 🤩 pic.twitter.com/cQM5f73TcJ — ICC (@ICC) December 23, 2020 -
సిరీస్ ఫలితాన్నే మార్చేసిన స్టన్నింగ్ క్యాచ్
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకు పైగా భారత్ క్రికెట్ జట్టును ఏలిన ఘనత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ది. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీల మార్కును చేరిన ఏకైక బ్యాట్స్‌మన్ సచిన్. 1989లో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్లో మొదటి సెంచరీ చేయడానికి 8 టెస్టుల వరకు ఆగాల్సి వచ్చింది. 1990లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 17 ఏళ్ల వయసులో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. అలా ఆరంభమైన సచిన్ సెంచరీల ప్రస్థానం శతక శతకాలను చూస్తే వరకూ ఆగలేదు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలతో ప్రత్యేకంగా తనొక శకాన్నే సృష్టించుకున్నాడు సచిన్. ఇలా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్లలో ఒకడిగా నిలిచిన సచిన్.. బౌలింగ్‌లో కూడా అద్భుతాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. (ధోని కంటతడి పెట్టాడు!) తన లెగ్ బ్రేక్‌లతో మ్యాజిక్ చేసి భారత్‌కు విజయాల్ని అందించిన క్షణాలు కూడా క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. తన అంతర్జాతీయ కెరీర్లో ఫీల్డింగ్‌లో కొన్ని మధురమైన క్షణాలను కూడా సచిన్ సొంతం చేసుకున్నాడు. తాజాగా సచిన్‌కు సంబంధించిన ఒక ఫీల్డింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం సచిన్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్‌ను మరొకసారి గుర్తుచేసుకున్నారు ఫ్యాన్స్. 2004 పాకిస్తాన్ పర్యటనలో భాగంగా వన్డే మ్యాచ్‌లో సచిన్ లాంగాన్ బౌండరీ వద్ద క్యాచ్‌ను అందుకున్న తీరు ఆ మ్యాచ్‌కే హైలైట్ అనడం కంటే ఇప్పటికీ హైలైట్ అంటేనే బాగుంటుందేమో. అది సిరీస్ ఫలితాన్నే మార్చేసిన క్యాచ్. పాక్ క్రికెటర్ ఇంజమాముల్ హక్ క్యాచ్‌ను ఒంటిచేత్తో సచిన్ అందుకోవడంతో అప్పటివరకూ గెలిచే స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో భారత్ విజయంతో సిరీస్ 2-2తో సమం కాగా, ఇక చివరి వన్డేను భారత్ గెలిచి సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. సిరీస్ ఫలితాన్ని మార్చిన ఆనాటి క్యాచ్ ఇప్పుడు వైరల్‌గా మారడంతో ఆ మ్యాచ్‌ను చూడని క్రికెట్ అభిమానులు.. సచిన్‌లోని అద్భుతమైన ఫీల్డర్‌ను చూసి మురిసిపోతున్నారు. Proud To Remember♥️ Sachin Tendulkar Unbelievable One Handed Catch of Inzamam-ul-Haq in Pakistan 2004. Series Was 2-2, This Wicket Changed The Match & Series IND Win (3-2)🇮🇳 @CrickeTendulkar @Sachin_rtpic.twitter.com/Jw28Sh6P2n— CrickeTendulkar Sachin🇮🇳Tendulkar FC (@CrickeTendulkar) August 20, 2020 -
ఇదేనా కెప్టెన్సీ.. ట్రిక్స్ ఎక్కడ?
కరాచీ: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి చెందడం పట్ల మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ విమర్శలు గుప్పించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కంటే పాకిస్తాన్ అన్ని విధాలా బాగా ఆడినా అవసరమైన సందర్భంలో రాణించలేకపోవడం వల్లే విజయం సాధింలేకపోయిందన్నాడు. ప్రధానంగా అజహర్ అలీ కెప్టెన్సీని ఇంజీ వేలెత్తిచూపాడు. అజహర్ కొన్ని ప్రయోగాలు చేయకపోవడం వల్లే గెలవాల్సిన మ్యాచ్‌ను పరాజయంతో ముగించాల్సి వచ్చిందన్నాడు. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో రెండొందల పరుగులలోపే ఆలౌట్ చేస్తుందనుకుంటే చివరకు గెలుపును వారికి అందించడం నిరాశను మిగిల్చిందన్నాడు. తన యూట్యూబ్ చానల్లో ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ ఓటమిని ఇంజీ విశ్లేషించాడు. ‘ నా ప్రకారం చూస్తే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే ఆలౌట్ అవుతుందని అనుకున్నా. కానీ మా కెప్టెన్ అజహర్ అలీ చేసిన తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఇచ్చాం. కనీసం షార్ట్ బాల్స్‌ను కూడా ఎక్కడా ప్రయోగించలేదు. ఇంగ్లండ్ విజయానికి కారకులైన బట్లర్, వోక్స్‌లు షార్ట్ పిచ్ బంతుల్ని ఆడలేరు. ఈ ప్రయోగం చేయలేదు. అజహర్ అలీ కెప్టెన్‌గా ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఇంగ్లండ్ కంటే పాకిస్తాన్ బలంగా ఉంది’ అని ఇంజీ పేర్కొన్నాడు. పాకిస్తాన్ నిర్దేశించిన 277 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్(75) , వోక్స్ (84)లు కీలక పాత్ర పోషించారు.(బట్లర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో?) -
‘అలా చేసి ఐపీఎల్ జరిపితే ప్రశ్నలు తప్పవు’
కరాచీ: ఈ సీజన్ అక్టోబర్-నవంబర్ విండోలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడి అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరిగితే అది అనేక అనుమానాలకు తావిస్తోందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ స్పష్టం చేశాడు. కరోనా వైరస్ కారణంగా క్రికెటర్లను రిస్క్‌లోకి నెట్టడం ఇష్టం లేక టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేసేందుకు ఐసీసీ యోచిస్తోంది. కాగా, వరల్డ్‌కప్ వాయిదా పడితే ఐపీఎల్‌కు లైన్ క్లియర్ అవుతుందని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఇలా చేస్తే అనేక ప్రశ్నలకు ఉత్పన్నమవుతాయని ఇంజీ పేర్కొన్నాడు. ‘ బీసీసీఐ చాలా బలమైన క్రికెట్ బోర్డు. ఐసీసీలో బీసీసీఐదే కీలక పాత్ర. కరోనా వైరస్ కారణంగా మేము టీ20 వరల్డ్‌కప్ జరపలేమని ఆస్ట్రేలియా చేతులెత్తేస్తే అది ఆమోదయోగ్యమే. అదే సమయంలో వేరే మిగతా ఈవెంట్లు జరిగితే ప్రశ్నల వర్షం తప్పదు. (‘సచిన్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్.. రెండు సమాధానాలు’) ఒకవేళ వరల్డ్‌కప్‌ను వాయిదా వేసి ఆ ప్లేస్‌లో ఐపీఎల్ జరిగితే దీన్ని ఏమని అర్ధం చేసుకోవాలి. ఐపీఎల్ జరపడానికి అన్ని అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ జరపడానికి బీసీసీఐ కసరత్తులు ముమ్మరం చేసింది. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ జరపాలని చూస్తోంది. ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్స్, స్పాన్సర్స్, ఇతర స్టేక్ హోల్డర్లు అంతా ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు’ అని ఇంజీ తెలిపాడు. కరోనా దెబ్బకు ఆగిపోయిన ఐపీఎల్‌ను మళ్లీ నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇది కాస్త కార్యరూపం దాలిస్తే భారత అభిమానులకే కాదు యావత్ క్రికెట్ ప్రియులకు వినోదం పంచుతుంది. మ్యాచ్‌లు గానీ జరిగితే టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. కోవిడ్–19 విలయంతో మార్చి, ఏప్రిల్‌లలో జరగాల్సిన ఈ లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. సందేహాలతో ఊగిసలాడుతున్న లీగ్‌పై ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చిచెప్పారు. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ పోటీలు నిర్వహించేందుకైనా సిద్ధమేనని గంగూలీ సంకేతమిచ్చాడు. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నామని గత నెలలోనే స్పష్టం చేశాడు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’) -
‘సరైన టైమ్‌లో కెప్టెన్‌గా తీసేశారు’
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడాన్ని మాజీ కెప్టెన్, మాచీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ తీవ్రంగా తప్పుబట్టాడు. పాకిస్తాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సర్ఫరాజ్‌ను మరి కొంతకాలం కెప్టెన్‌గా కొనసాగిస్తే బాగుండేదన్నాడు. సరైన టైమ్‌లో సర్ఫరాజ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం నిజంగా దురదృష్టకరమన్నాడు. ఒక కెప్టెన్‌గా ఎంతో అనుభవం సాధించి తప్పుల్ని సరిదిద్దుకుంటున్న క్రమంలో సర్ఫరాజ్‌కు ఉద్వాసన చెప్పడం సరైన నిర్ణయం కాదన్నాడు. ‘ పాక్ క్రికెట్‌కు చాలా గొప్ప విజయాలను సర్ఫరాజ్ అందించాడు. ఎన్నో గుర్తిండిపోయే విజయాలు సర్ఫరాజ్ కెప్టెన్సీలో చూశాం. కానీ అతను అనుభవం గడించి తప్పుల్ని సరి చేసుకుంటున్న సమయంలో కెప్టెన్‌గా తప్పించడం బాధాకరం. సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు చాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో పాటు టీ20ల్లో నంబర్ స్థానానికి చేరింది. (బయో సెక్యూర్ క్రికెట్ సాధ్యమేనా?) దాంతో పాటు మంచి విజయాలను కూడా జట్టుకు అందించాడు. కెప్టెన్‌గా మరికొంత కాలం ఉండటానికి సర్ఫరాజ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. అతనిపై నమ్మకం లేకనే పాక్ క్రికెట్ బోర్డు సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తీసేసింది. ఇక్కడ ఇంకా ఓపిక పడితే బాగుండేది’ అని ఇంజీ తెలిపాడు. 2016 నుంచి 2019 వరల్డ్‌కప్ వరకూ పాక్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా సేవలందించిన ఇంజమామ్.. గత వరల్డ్‌కప్‌లో పాక్ క్రికెటర్లు అభద్రతా భావానికి లోను కావడంతోనే నాకౌట్‌కు చేరకుండా నిష్క్రమించాల్సి వచ్చిందన్నాడు. ఇక్కడ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను నిందించాల్సిన అవసరం లేదన్నాడు. విపరీతమైన ఒత్తిడి కారణంగా సరిగా ఆడలేమని మనసులో పెట్టుకుని అందుకు మూల్యం చెల్లించుకున్నారన్నాడు. గతంలో మూడు ఫార్మాట్లకు సర్పరాజ్ కెప్టెన్‌గా ఉండగా, వరల్డ్‌కప్ తర్వాత అతన్ని సారథ్య బాధ్యతలు తొలగించారు. తొలుత వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను తీసేసిన తర్వాత టెస్టు ఫార్మాట్ నుంచి కూడా సారథిగా తీసేశారు. బాబర్ అజామ్‌కు వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించగా, అజహర్ అలీకి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో సర్ఫరాజ్‌కు పీసీబీ అవకాశం కల్పించడం అతనికి ఊరటనిచ్చే అంశం.(‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’) -
‘ఆ ఇద్దరే సిరీస్ స్వరూపాన్ని మార్చేశారు’
కరాచీ: 2004-05 సీజన్లో భారత్‌లో పర్యటించిన విశేషాలను పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అదొక ఒత్తిడితో కూడిన సిరీస్ కావడంతో భారత్‌లో వారిపై గెలవడం రెట్టింపు సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అప్పటికే తమ గడ్డపై భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోవడంతో విపరీతమైన ఒత్తిడితో అడుగుపెట్టినా అందుకు తగిన ఫలితమే లభించిందన్నాడు. తన యూట్యూబ్ చానల్లో ఆనాటి జ్ఞాపకాలను ఇంజీ గుర్తు చేసుకున్నాడు. ఆ ద్వైపాకిక్షిక సిరీస్‌లో టెస్టు సిరీస్‌ను సమం చేయడమే కాకుండా, వన్డే సిరీస్‌ను 4-2 తేడాతో గెలుచుకోవడం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు.(233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..) ‘తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో టెస్టులో గంగూలీ నేతృత్వంలోని భారత్ గెలిచింది. అయినా మేము పట్టువదల్లేదు. మూడో టెస్టులో అమీతుమీకి సిద్ధమయ్యాం. అది మేము గెలిచి సిరీస్‌ను సమం చేశాం. ఆ సిరీస్‌లో అబ్దుల్ రజాక్, కమ్రాన్ అక్మాల్‌లు మా తలరాతను మార్చారు. వారిద్దరి వల్లే మేము సిరీస్‌ను చేజార్చుకోలేదు. వారు సిరీస్ స్వరూపాన్నే మార్చేశారు. జూనియర్ స్థాయి క్రికెటర్లే ఆడుతున్నప్పుడు మేము ఎందుకు ఆడలేకపోతున్నాం అనే ప్రశ్నను వారు లేవనెత్తారు. చండీగఢ్‌లో జరిగిన టెస్టులో కమ్రాన్ సెంచరీ చేయగా, రజాక్ 70 పరుగులకు పైగా చేశాడు. దాంతో మ్యాచ్‌ను కాపాడుకున్నాం. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేలను కోల్పోయి వెనుకబడ్డాం. అది ఆరు వన్డేల సిరీస్. ఆ తర్వాత వరుసగా నాలుగు వన్డేలు గెలిచి సిరీస్‌ను భారీ తేడాతో గెలిచాం. జూనియర్ స్థాయి క్రికెటర్లు ఆడుతున్నప్పుడు మేము ఎందుకు ఆడటం లేదు అని నాతో పాటు యూనిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ల్లో పట్టుదల వచ్చింది. దాంతోనే టీమిండియాపై చాలా కసిగా ఆడాం. ఏది ఏమైనా కమ్రాన్, రజాక్లే సిరీస్ స్వరూపాన్ని మార్చింది’ అని ఇంజీ పేర్కొన్నాడు. (టై అంటే టై.. సూపర్ ఓవర్ ఏమిటి?) -
ఆ పాక్ దిగ్గజం అండగా నిలిచాడు: రషీద్
కాబూల్: తమ జట్టుకు పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు ఇంజమాముల్ హక్ కోచ్‌గా పని చేసిన సమయంలో తనకు ఎక్కువ అండగా నిలిచాడని అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలిపాడు. తనను బాగా గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇంజమాములేనని రషీద్ పేర్కొన్నాడు. తనను కేవలం టీ20 బౌలర్‌గా మాత్రమే ముద్ర వేసిన సమయంలో ఇంజీ తనపై నమ్మకం ఉంచాడన్నాడు. తనను టీ20 స్పెషలిస్టుగా ముద్ర వేయడంతో అసంతృప్తి ఉండేదని, ఇదే విషయాన్ని ఇంజీతో చెబితే వాటిని పట్టించుకోవద్దన్నాడు. తాను కోచ్‌గా ఉన్నంతకాలం జట్టులో కచ్చితంగా ఉంటావనే హామి ఇచ్చాడన్నాడు .అలా తన కెరీర్ ఎదుగుదలకు ఇంజీ సహకరించాడన్నాడు. టీ20 స్పెషలిస్టు ముద్రపై ఇంజీ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నాడు. తాను అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతానని నమ్మకం ఇంజీలో ఉండేదని, అదే ఈరోజు తనను నంబర్ వన్ టీ20 బౌలర్‌గా నిలబెట్టిందన్నాడు. ఇక టీ20 ఫార్మాట్లో మేటి జట్టు ఏదైనా ఉందంటే అది వెస్టిండీస్ క్రికెట్ జట్టేనని రషీద్ స్పష్టం చేశాడు. (గంగూలీ చెప్పినట్లే చేశా: పంత్) అచ్చం టీ20లకు సరిపోయే బ్యాట్స్‌మెన్ విండీస్ జట్టులో చాలా మంది ఉన్నారన్న రషీద్.. టీమిండియా క్రికెట్లో హార్దిక్ పాండ్యా చాలా ప్రమాదకరమన్నాడు. టీ20ల్లో హార్దిక్ జోరును ఆపడం చాలా కష్టమన్నాడు. తన తల్లి క్రికెట్‌కు పెద్ద అభిమాని అని రషీద్ తెలిపాడు. తాను క్రికెట్ ఆడుతున్న నాటి నుంచి అమ్మ ఈ గేమ్‌కు ఫ్యాన్‌గా మారిపోయారన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఈవెంట్లు ఏమీ జరగకపోవడంతో అమ్మ విపరీతమైన బోర్ ఫీలవుతున్నట్లు పేర్కొన్నాడు. ఇంటిని క్రికెట్ స్టేడియంగా మార్చేసి ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. తన ఇంటిలో లెగ్ స్పిన్ వేయడానికి సరిపోయే స్థలం ఉందన్నాడు. ఇంటిలో ఐదు ఓవర్ల క్రికెట్ ఆడుతున్న విషయాన్ని రషీద్ తెలిపాడు. తన సోదరుల్లో కొంతమంది లాక్డౌన్ కారణంగా వారి వారి ఇళ్లలోనే చిక్కుకుపోగా, మిగిలి వారితో కలిసి క్రికెట్ ఆడుతున్నానన్నాడు. తమ ఇంట్లో ఉన్న సోదరులు, ఇతర బంధువులతో కలిసి రెండు జట్లుగా విడిపోయి క్రికెట్ గేమ్‌ను ఎంజాయ్ చేస్తున్నామన్నాడు. ఇలా ఆడటం వల్ల తన బాల్యం బాగా గుర్తుకువస్తుందన్నాడు. 2015 అక్టోబర్‌లో అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికైన ఇంజీ.. ఎనిమిది నెలలు పాటు ఆ జట్టు కోచ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. (ఆసీస్ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే!) -
భారత క్రికెటర్లు స్వార్థపరులు..వేస్ట్!
కరాచీ: భారత క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ సంచలన కామెంట్స్ చేశాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెటర్లకు- పాకిస్తాన్ క్రికెటర్లకు చాలా వ్యత్యాసం ఉండేదన్నాడు. భారత్ క్రికెటర్లు కేవలం తమ స్థానాలను కాపాడుకోవడం కోసమే క్రికెట్ ఆడేవారంటూ ఆరోపించాడు. భారత క్రికెటర్లు ఎప్పుడూ వ్యక్తిగత రికార్డులే లక్ష్యంగా బ్యాటింగ్ చేసేవారన్నాడు. ఇక పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ విషయానికొస్తే జట్టు ప్రయోజనాల కోసమే ఆడవారని, వ్యక్తిగత రికార్డులకు పాక్ ఆటగాళ్లు అప్పుట్లో దూరంగా ఉండేవారన్నాడు. కేవలం జట్టు గెలుపే లక్ష్యంగా పాకిస్తాన్ క్రికెటర్లు ఫీల్డ్‌లో దిగేవారని ఇంజమామ్ అన్నాడు. ‘ భారత క్రికెటర్లు వరుస సిరీస్‌లు దృష్టిలో పెట్టుకునే ఆడేవారు. (లాక్డౌన్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ.. కేసు నమోదు) ఒక సిరీస్‌లో ఆడితే మరొక సిరీస్‌లో ప్లేస్ ఉండేది. సిరీస్‌లో ఫెయిల్ అయితే తదుపరి సిరీస్‌లు అవకాశం వచ్చేది కాదు. వారు ఎప్పుడూ వారి వారి అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోయేవారు. మా సమయంలో టీమిండియా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉండేది. మాకంటే బ్యాటింగ్ పరంగా చాలా బలంగా ఉండేది. కాగితపు పులులు తరహాలో వారు మా కంటే స్ట్రాంగ్‌గా ఉండేవారు. బ్యాట్స్‌మెన్‌గా మా రికార్డు వారి కంటే మెరుగ్గా ఉండేది కాదు. కానీ మేము ప్రతీ ఒక్కరం కనీసం 30 నుంచి 40 పరుగులు చేయాలనే పట్టుదలతో ఉండేవాళ్లం. వారు వ్యక్తిగత రికార్డుపై కన్నేసేవారు. భారత జట్టులో ఎవరైనా సెంచరీ చేస్తే అది జట్టు కోసం కాదు.. వారి వ్యక్తిగతం కోసమే. మరి మేము జట్టుగా పోరాడేవాళ్లం. భారత జట్టులో వ్యక్తిగత ప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో పేపర్‌పై పులిలా మిగిలిపోయేవారు. ఇప్పుడు మన క్రికెటర్లు కూడా ప్లేస్‌లు కోసం కుస్తీ పడుతున్నారు. ఏదో ఒకటి-రెండు ఇన్నింగ్స్‌లు ఆడేసి స్థానాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. మేనేజ్మెంట్ కోరుకునేది మీ నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన. భయపడుతూ క్రికెట్ ఆడొద్దు’ అని ఇంజమాముల్ సూచించాడు.(ధోనికి చాన్స్‌తో గుండెల్లో కత్తి దింపినట్లు అయ్యింది..) -
అతన్ని పాక్ 'వివ్ రిచర్డ్స్' అంటారు