Riddhi Kumar
-
ఫేస్ ఆఫ్ ఇండియా.. రిద్ధి కుమార్
పలు కళలకు చక్కటి ఆకృతినిస్తే.. ఆ పేరు రిద్ధి కుమార్. తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుసు.. ఇటీవలి ‘లవర్’, ఈనాటి ‘రాధే శ్యామ్’ సినిమాల ద్వారా. ఆమె వెబ్‌స్టార్ కూడా! అందుకే ఈవారానికి రిద్ధి కుమార్‌ను ఈ ‘కాలమ్’ గెస్ట్‌గా తీసుకొచ్చాం. పుట్టింది పుణెలో. తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లో పెరిగింది. తల్లి అల్కా కుమార్... అడ్వకేట్. పుణె, ఫెర్గ్యూసన్ కాలేజ్‌లో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పదవ తరగతి పూర్తయిన నాటి నుంచే పని చేయడం మొదలుపెట్టింది. డ్యాన్స్ టీచర్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా, యాంకర్‌గా ఇలా పలు రంగాల్లో ప్రతిభను చాటుకుంది. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎన్నో అందాల పోటీల్లోనూ పాల్గొంది. అన్నిట్లోనూ ఏదో ఒక టైటిల్స్‌ను గెలుచుకుంది. వాటిల్లో మిస్ పుణె (2015), ఫేస్ ఆఫ్ ఇండియా (2016) వంటివి మచ్చుకు కొన్ని. మోడలింగ్‌లో ఉన్నప్పుడే సినిమా అవకాశం వచ్చింది. అదే ‘లవర్’.. తెలుగు చిత్రం. దాని తర్వాత మాతృభాష మరాఠీలో, అనంతరం మలయాళం సినిమాల్లోనూ వరుస చాన్స్‌లు వచ్చాయి. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉండగానే వెబ్ చానెల్స్‌లోనూ ఆఫర్స్ ఆమె డేట్స్ డైరీలోని పేజీలను నింపేశాయి. అలా ‘వూట్’లో స్ట్రీమ్ అయిన ‘క్యాండీ’ రిద్ధిని దేశమంతటికీ పరిచయం చేసింది. డిస్నీ హాట్‌స్టార్‌లోని ‘హ్యుమన్’ సిరీస్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నటనంటే అమితంగా అభిమానించే రిద్ధి చిత్రకారిణి కూడా. ఆమె ఆయిల్ పెయింటింగ్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మహా ఫాలోయింగ్ ఉంది. ఇంకా చాలా కళలున్నాయి ఆమెలో.. రాస్తుంది.. కమ్మటి వెరైటీలను వండుతుంది.. విపరీతంగా ప్రయాణాలు చేస్తుంది. వృత్తి, ప్రవృత్తి రెండూ రెండు కళ్లలాంటివి అంటుంది. తమను తాము ఆవిష్కరించుకునే భూమికలు అంటే ఇష్టం. కానీ డ్రీమ్ రోల్స్ మాత్రం ఫన్ క్యారెక్టర్సే. అంతేకాదు డిటెక్టివ్, పోలీసు పాత్రల్లో నటించాలనీ ఉంది. – రిద్ధి కుమార్ -
రాధేశ్యామ్ భామ రిద్ధి కుమార్ ఫొటోలు
-
Riddhi Kumar: రాధేశ్యామ్ కోసం విలువిద్య నేర్చుకున్నా
‘రాధేశ్యామ్’ సినిమాలో స్పోర్ట్స్ ఉమన్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర చేయడం చాలా కష్టం. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆర్చరీ (విలు విద్య) నేర్చుకున్నాను’’ అని నటి రిద్దీ కుమార్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నటించిన రిద్దీ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది పుణే. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. నేను పుణేలోనే ఫిలాసఫీలో డిగ్రీ చేశాను. సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు ముందు మోడలింగ్‌లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చాన్స్ వచ్చింది. తెలుగులో ‘లవర్స్, అనగనగా ఓ ప్రేమకథ’ చిత్రంలో నటించాను. ఇంత తక్కువ సమయంలోనే ప్రభాస్ వంటి బిగ్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. నేను నటిస్తున్న వెబ్ సిరీస్ మేలో రిలీజ్ అవుతోంది. నటి రేవతి మేడమ్ దర్శకత్వంలో కాజోల్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాను. నాకు డిటెక్టివ్, ఫన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇలా అందరి హీరోలతో నటించాలని ఉంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
థియేటర్లో కలుద్దాం
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న హీరోలుగా, రిద్ధీ కుమార్, మేఘా చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా వేగేశ్న సతీష్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. నవంబర్ 3న షూటింగ్ మొదలు పెట్టి, డిసెంబర్ మొదటి వారానికి ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేశాం. కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకొని అవుట్‌డోర్‌లోనే షూటింగ్ చేశాం. అమలాపురం, విశాఖపట్నం, రాజమండ్రిలో నిర్విరామంగా షూటింగ్ జరిపాం. త్వరలోనే మిగిలిన పాట పూర్తి చేసి, సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘సతీష్‌గారు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్స్‌లో కలుసుకుంటాం’’ అన్నారు ఎం.ఎల్.వి. సత్యనారాయణ. -
ఓ తండ్రి తపనే ఈ సినిమా
విరాజ్. జె. అశ్విన్ హీరోగా ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధికుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. కె. సతీష్ కుమార్ సమర్పణలో కేఎల్ఎన్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. కేఎల్ఎన్ రాజు మాట్లాడుతూ– ‘‘రాంగ్ ట్రాక్‌లో వెళ్తోన్న ఓ కూతుర్ని సరైన మార్గంలో పెట్టాలనే ఓ తండ్రి తాపత్రయమే ఈ చిత్రకథాంశం. ప్రతాప్ ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. అంజన్ మంచి సంగీతం అందించారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. అశ్విన్, రిద్ధిలతో పాటు మిగతా ఆర్టిస్టులందరూ బాగా నటించారు. ఈ సినిమాపై నమ్మకంతో నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఒక కొత్త హీరోపై ఎంతో ప్రెజర్ ఉంటుంది. ఈ ఒత్తిడిని మర్చిపోయేలా మా టీమ్ çసపోర్ట్ చేశారు. మార్తాండ్ కె. వెంకటేశ్‌గారు నేను హీరోగా నటించడానికి ప్రోత్సహించారు. రాజుగారు నిర్మాతగా ఉన్న ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇందులో ఎనర్జిటిక్ అండ్ హైపర్‌గా ఉండే సూర్య క్యారెక్టర్ చేశాను’’ అన్నారు విరాజ్. ‘‘చిన్న సినిమా తీయడమే కాదు రిలీజ్ చేయడం కూడా కష్టమే. కానీ కేఎల్ఎన్ రాజుగారు మా సినిమాను ముందుండి నడిపించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ రీలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు ప్రతాప్. ‘‘కొత్తవారిని ప్రోత్సహించడానికి కేఎల్ఎన్ రాజుగారు నిర్మాతగా మారారు. ఈ సినిమా ప్రయాణంలో భాగమైన అందరికీ థ్యాంక్స్’’అన్నారు సునైన. రిద్ధికుమార్, నటుడు కాశీవిశ్వనాథ్, సమర్పకుడు సతీష్ పాల్గొన్నారు. -
అదే నిజమైన చాలెంజ్
‘‘అనగనగా ఒక రోజు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి చిత్రాలు నిర్మించిన కె.ఎల్.ఎన్.రాజు తాజాగా రూపొందించిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్ జె.అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్ తాతం శెట్టి దర్శకత్వంలో థౌజెండ్ లైట్స్ మీడియా పతాకంపై కె.ఎల్.ఎన్. రాజు నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎల్.ఎన్.రాజు మాట్లాడుతూ– ‘‘సినీ ఫైనాన్షియర్‌గా నేను అందరికీ తెలుసు. 40ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉంటున్నా. నిర్మాణం వైపు వెళ్లాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఇతర వ్యాపారాలు, వ్యాపకాల వల్ల ప్రొడక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. నాకు క్యూట్ లవ్ స్టోరీలంటే ఇష్టం. కథ నచ్చడంతోనే ‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమా తీశా. టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా అది మన ఫైవ్ సెన్స్‌కి లోబడే ఉండాలి. అలా కాకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పే కథాంశమిది. కె.సి. అంజన్ మంచి మెలోడి పాటలిచ్చాడు. ‘అనగనగా ఒక రోజు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అనగనగా ఓ ప్రేమ కథ’... ఇలా మా టైటిల్స్ ‘అ’తో స్టార్ట్ అవుతున్నాయి. అయితే ‘అ’ సెంటిమెంట్ ఏమీ లేదు. పెద్ద సినిమాలు, మల్టీస్టారర్స్ తీయటం కంటే చిన్న సినిమాలు తీయడంలోనే నిజమైన చాలెంజ్, సంతృప్తి ఉంటాయి’’ అన్నారు. -
ఊహించని సస్పెన్స్ ఉంది
విరాజ్.జె.అశ్విన్ కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధికుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. కె.సతీష్‌కుమార్ సమర్పణలో థౌజండ్ లైట్స్ మీడియా పతాకంపై ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో కేఎల్ఎన్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కేఎల్ఎన్ రాజు మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. మంచి స్టోరీ లైన్ కుదిరింది. క్లీన్ లవ్‌స్టోరీ. ఊహించని సస్పెన్స్ ఉంది సినిమాలో. హీరో, హీరోయిన్లు బాగా నటించారు. ప్రతాప్ చక్కగా తెరకెక్కించాడు. కేసీ అంజన్ ఇచ్చిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు ‘టచ్ హాజ్ ఏ మెమరీ’ అనే ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టారో సినిమా చూస్తే అర్థమవుతుంది. నిర్మాత కేఎల్ఎన్ రాజుగారు లేకపోతే ఈ సినిమా లేదు. హీరో, హీరోయిన్లు, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామేన్ ఇలా అందరం ఈ సినిమాలో కొత్తవాళ్లమే. కొత్త వారితో సినిమా తీసిన కేఎల్ఎన్రాజుగారు గట్స్ ఉన్న నిర్మాత. ఆయన కుమారుడు సతీష్‌గారు, కోడలు సునైన గారు కూడా సినిమాలో ఇన్వాల్వ్ అయి బాగా ప్రోత్సహించారు. మార్తాండ్గారి దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు ప్రతాప్. ‘‘హీరో కావాలనే నా కల నిజమైంది. ఇందులో నేను చేసిన సూర్య క్యారెక్టర్‌ను ప్రతాప్ బాగా డిజైన్ చేశారు. నాకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు విరాజ్. ‘‘మా విరాజ్‌ని హీరోగా చేసిన కేఎల్ఎన్ రాజుగారి సహకారాన్ని మర్చిపోలేను. ట్రైలర్, సాంగ్స్ మాదిరిగానే సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు మార్తాండ్ కె. వెంకటేశ్. ‘‘విరాజ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు నటుడు కాశీ విశ్వనాథ్. కెమెరామెన్ రాజు మాట్లాడారు. -
డిసెంబర్ 14న ‘అనగనగా ఓ ప్రేమకథ’
విరాజ్ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్, రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.యన్ రాజు ఈ సినిమాకు నిర్మాత. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాను డిసెంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత కెఎల్యన్ రాజు, దర్శకుడు ప్రతాప్, హీరో విరాజ్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రాఫర్ రాజు, నటుడు కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు ప్రతాప్.. తనకు దర్శకుడిగా తొలి అవకావం ఇచ్చిన నిర్మాత కెఎల్ఎన్ రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథ అని సినిమాకు ‘టచ్ హ్యాజ్ ఏ మెమరీ’ అన్న ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే మీకు అర్థమవుతుందని తెలిపారు. హీరో విరాజ్ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకముందన్నారు. -
ఓ ప్రేమకథ
విరాజ్.జె. అశ్విన్ హీరోగా రూపొందిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. ఇందులో రిద్ధి కుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో కె.సతీష్ కుమార్ సమర్పణలో కేఎల్ఎన్ రాజు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేఎల్‌యన్ రాజు మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా వ్యవహరించాను. ఆ తర్వాత వ్యాపారాలతో బిజీ అయిపోయాను. తిరిగి చిత్రాలను నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రతాప్ చెప్పిన కథ నచ్చింది. మా మామగారు డీవీఎస్ రాజుగారు ఉత్తమమైన చిత్రాలను నిర్మించారు. కొత్తవాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో కూడా ఎక్కువగా కొత్తవాళ్లే ఉన్నారు. హీరో అశ్విన్ చక్కగా నటించాడు. ప్రతాప్ బాగా తీశాడు. హీరోయిన్స్ మంచి నటన కనబరచారు. తొలి కాపీ చూసినప్పుడు మంచి సినిమా తీశాననే నమ్మకం కలిగింది’’ అన్నారు. ఈ సినిమాకు కె.సి. అంజన్ స్వరకర్త. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనగనగా ఓ ప్రేమకథ’
విరాజ్ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్, రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.యన్ రాజు ఈ సినిమాకు నిర్మాత. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ..‘సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యహరించిన నేను ఆ తరువాత నా వ్యాపారాలలో బిజీగా ఉండటం జరిగింది. చాలాకాలం తరువాత చిత్రాలను నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా కథలను వింటూ వస్తుండగా ఈ చిత్ర దర్శకుడు ప్రతాప్ చెప్పిన కథవిని చిత్రాన్ని నిర్మించటం జరిగింది. కుటుంబ సభ్యులంతా కలసి చూసే చిత్రం గా ఇది ఉంటుందని చెప్పగలను. ఈ చిత్రం ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేస్తున్నాము. చిత్రం విడుదల తేదీని, అలాగే ప్రీ రిలీజ్ వేడుక వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నా’రు. -
ఈ సినిమా విజయం సాధించాలి
‘‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రం మంచి హిట్ కొట్టాలి. కె.ఎల్.ఎన్. రాజు చేసిన ఈ ప్రయత్నం విజయం సాధించాలి. విరాజ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బాగుంది. తను మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నా. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. విరాజ్.జె. అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ది కుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో కె. సతీష్‌కుమార్ సమర్పణలో కె.ఎల్.యన్. రాజు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో గోపీచంద్ విడుదల చేశారు. నిర్మాత రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. ఈ చిత్రంలోని పాటలను దర్శకులు పూరి జగన్నాథ్, శేఖర్ కమ్ముల, పరశురామ్, మణిరత్నం రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్‌ను గోపీచంద్‌గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. అరకు, విశాఖపట్నం, మలేసియా, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘గోపీచంద్ అన్నయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని విరాజ్ అన్నారు. కాశీ విశ్వనాథ్, అనీష్ కురువిళ్ల, వేణు తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: కే.సి. అంజన్. -
గోపీచంద్ రిలీజ్ చేసిన ‘అనగనగా ఓ ప్రేమకథ’ ట్రైలర్
‘అనగనగా ఓ ప్రేమకథ’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను ఈరోజు (శనివారం) ఉదయం ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా ‘ట్విట్టర్’ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్, దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి, నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ...‘అనగనగ ఓ ప్రేమకథ’’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. మార్తాండ్.కె.వెంకటేష్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన అక్క కొడుకు అశ్విన్. ఈ చిత్ర హీరో. సన్నివేశాలలో గానీ, సంభాషణలు పలకటంలోగానీ, పోరాటాలలో గానీ అశ్విన్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఇదే అతని తొలి చిత్రం అనిపించటం లేదు. అంత బాగా నటించాడు. అశ్విన్ మంచి హీరో అవ్వాలని అభినందిస్తున్నాను. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. తమ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఆయన మాట్లాడుతూ..ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో రాణా విడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు విడుదల చేయటం, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు. -
‘ఈ రోజు నేను కొత్తగా పుట్టినట్టు ఉంది’
విరాజ్ జె అశ్విన్ హీరోగా టి.ప్రతాప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఒక్కో పాటను ఒక్కో సినీ ప్రముఖుడి చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే లెజెండరీ దర్శకుడు మణిరత్నం, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల చేతుల మీదుగా టీజర్, పాటలను రిలీజ్ చేయించిన చిత్రయూనిట్ తాజాగా మరో పాటు ఓ యువ దర్శకుడి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో ఘన విజయం అందుకున్న పరుశురాం చేతుల మీదుగా ఒక తొలి ప్రేమ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాతో విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతుండగా రిద్ధి కుమార్ ,రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
లవ్ అంటే నేనేలే...
విరాజ్.జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధీ కుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. టి.ప్రతాప్ దర్శకత్వం వహించారు. కె. సతీష్ కుమార్ సమర్పణలో కె.ఎల్.యన్.రాజు నిర్మించిన ఈ సినిమాలోని ‘లవ్ అంటే నేనేలే..’ పాటను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘లవ్ అంటే నేనేలే’ పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని అభినందనలు తెలిపారు. కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని పాటను మణిరత్నంగారు విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. ‘లవ్ అంటే నేనేలే..’ పాటను శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు. ఈ సాంగ్‌ని మలేసియాలోని పలు సుందరమైన లొకేషన్లలో చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కాశీ విశ్వనాథ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, కెమెరా: ఎదురొలు రాజు. -
ఓ ప్రేమకథ
విరాజ్ జె.అశ్విన్ హీరోగా, రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా టి.ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. కె. సతీష్ కుమార్ సమర్పణలో ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.ఎన్.రాజు నిర్మించిన ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ సాంగ్ సాహిత్యం, సంగీతం చాలా బాగున్నాయి. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్‌గారితో నేను చాలా సినిమాలు చేశా. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న ఆయన మేనల్లుడు విరాజ్ అశ్విన్ మంచి కథానాయకుడు అవుతాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు కె.ఎల్.ఎన్.రాజు. -
‘అనగనగనగా ఓ కథ’ సాంగ్ టీజర్
థౌజండ్ లైట్స్ మీడియా బ్యానర్‌పై ప్రతాప్ తాతంశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘అనగనగా ఓ ప్రేమకథ’. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ మార్తండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ కె అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ లిరికల్ వీడియోలతో సందడి చేస్తున్నారు. తాజాగా సినిమాలతో హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్‌ను రివీల్ చేస్తూ టైటిల్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరో విరాజ్ ప్లే బాయ్ తరహా పాత్రలో కనిపిస్తున్నాడు. పూర్తి పాట లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విరాజ్‌కు జోడిగా రిద్ధి కుమార్ నటిస్తున్న ఈ సినిమాకు కేసీ అంజన్ సంగీతమందిస్తున్నారు. &rel=0 -
ఐ లవ్ యు.. ఎవడ్రా నువ్వు
‘ఐ లవ్ యు సూర్య’, ఎవరమ్మా ఆ సూర్య?, ‘నాకు ఊహ వచ్చినప్పటి నుండి నాకు తెలిసిన ప్రేమ ఒకటి మా నాన్న.. రెండు నువ్వు, ఐ లవ్ యు.. ఎవడ్రా నువ్వు?’ వంటి డైలాగులు ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్లో అలరిస్తున్నాయి. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్. కె. వెంకటేశ్ మేనల్లుడు విరాజ్ జె.అశ్విన్ హీరోగా, రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. డైరెక్టర్ ఎన్. శంకర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన టి.ప్రతాప్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కె.ఎల్.ఎన్ రాజు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రానాగారు నా తొలి చిత్రం టీజర్‌ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు విరాజ్ జె.అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, కెమెరా: ఎదురొలు రాజు. -
రానా చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్
థౌజండ్ లైట్స్ మీడియా బ్యానర్‌పై ప్రతాప్ తాతంశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘అనగనగా ఓ ప్రేమకథ’. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ మార్తండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ కె అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఇటీవల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విరాజ్‌కు జోడిగా రిద్ధి కుమార్ నటిస్తున్న ఈ సినిమాకు కేసీ అంజన్ సంగీతమందిస్తున్నారు. -
ఓ ప్రేమకథ
ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కేఎల్ఎన్ రాజు 30 ఏళ్లుగా సినీ ఫైనాన్షియర్‌గా ఉన్నారు. తొలిసారి ఆయన నిర్మించిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. డైరెక్టర్ ఎన్. శంకర్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన టి.ప్రతాప్ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె.అశ్విన్ హీరోగా, రిద్దికుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. థౌజండ్ లైట్స్ మీడియా పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తొలి ప్రచార చిత్రాన్ని శుక్రవారం హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. కే ఎల్ఎన్ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ మంచి కథతో రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అక్టోబర్‌లో మా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘కేఎల్ఎన్ రాజుగారు బ్యానర్ స్థాపించి, మొదటి సినిమాకి దర్శకుడిగా నాకు అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రతాప్. విరాజ్ జె.అశ్విన్ పాల్గొన్నారు. కాశీ విశ్వనాథ్, అనీష్ కురువిళ్ల, వేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, కెమెరా: ఎదురొలు రాజు. -
‘లవర్’ మూవీ రివ్యూ
టైటిల్ : లవర్ జానర్ : రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : రాజ్ తరుణ్, రిద్ధి కుమార్, రాజీవ్ కనకాల, శరత్ కేడ్కర్, అజయ్ సంగీతం : సాయి కార్తీక్, అంకిత్ తివారి, అర్కో ప్రావో ముఖర్జీ, రిషీ రిచ్, అజయ్ వాస్, తనిష్క్ బాగ్చీ దర్శకత్వం : అనీష్ కృష్ణ నిర్మాత : దిల్ రాజు కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్ లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన రాజ్ తరుణ్ తాజాగా లవర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా అనీష్ కృష్ణ దర్శకుడు. ట్రైలర్ తో రాజ్ తరుణ్‌ను యాక్షన్ హీరోగా పరిచయం చేసే ప్రయత్నం చేసిన మేకర్స్... లవర్‌తో రాజ్ తరుణ్ కమర్షియల్ హీరోగా నిలబెట్టారా...? వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న ఈ యంగ్ హీరో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా..? కథ; రాజు (రాజ్ తరుణ్) అనాథ. అనంతపురంలో కస్టమైజ్డ్ మోటర్ బైక్ బిల్డర్‌గా పనిచేస్తుంటాడు. జగ్గు (రాజీవ్ కనకాల)ను తన సొంత అన్న గా భావించి వారి కుటుంబానికి చేదుడు వాదోడుగా ఉంటుంటాడు. ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రాజుకు ఓ గొడవ కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసే చరిత (రిద్ధి కుమార్) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. (సాక్షి రివ్యూస్) హాస్పిటల్ లో ఏ చిన్న తప్పు జరిగిన ఎదిరించి మాట్లాడే చరిత, లక్ష్మీ అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. చరిత కాపాడాలనుకున్న లక్ష్మీ ఎవరు..? ప్రభుత్వాన్నే గడగడలాండిచే వరదరాజులు (శరత్ కేడ్కర్)కు లక్ష్మీకి సంబంధం ఏంటి..? లక్ష్మీ, చరితలను రాజు ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు లవర్ బాయ్ ఇమేజ్ తో ఆకట్టుకున్న రాజ్ తరుణ్.. లవర్ సినిమాతో మాస్ కమర్షియల్ హీరోగా కనిపించే ప్రయత్నం చేశాడు. యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడ్డాడు. హీరోయిన్ రిద్ధి కుమార్‌కు తొలి సినిమాలోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. తెర మీద అందంగా కనిపించారు. అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో చరిత పాత్రలో రిద్ధి కుమార్ మంచి నటన కనబరిచారు. రాజీవ్ కనకాల నటన సినిమాకు ప్లస్ అయ్యింది.(సాక్షి రివ్యూస్) చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించిన రాజీవ్ తనదైన ఎమోషనల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. విలన్స్ గా అజయ్, సుబ్బరాజులు రొటీన్ పాత్రల్లో కనిపించారు. మెయిన్ విలన్‌గా నటించిన శరత్ కేడ్కర్‌ది అతిధి పాత్రే. ఆయన తెర మీద కనిపించేది కేవలం రెండు మూడు సీన్స్‌లోనే. హీరో ఫ్రెండ్స్‌గా సత్యం రాజేష్, ప్రవీణ్, సత్య , రాజాలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడిగా సినమా చేసిన అనీష్ కృష్ణ రొటీన్ కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కడక్కడా కాస్త కొత్తదనం కనిపించినా ఎక్కువ భాగం రొటీన్ ప్రేమకథలాగే సాగింది. ఫస్ట్ హాప్ ను కామెడీ, లవ్ స్టోరితో నడిపించిన దర్శకుడు అసలు కథ మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కాస్త నిరాశపరుస్తుంది. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా లేదు. ప్రీ క్లైమాక్స్ వరుకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. కార్‌ను హ్యాక్ చేయటం లాంటి అంశాలు ప్రేక్షకులకు అర్థం కావటం కాస్త కష్టమే. (సాక్షి రివ్యూస్)సంగీతం బాగుంది. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేయటం కొత్త ప్రయోగమనే చెప్పాలి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ కు మందు వచ్చే యాక్షన్ సీన్‌తో పాటు కేరళలో జరిగే సీన్స్ లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; హీరో హీరోయిన్ల నటన సినిమాటోగ్రఫి సాంగ్స్ మైనస్ పాయింట్స్ ; రొటీన్ కథా కథనాలు ఫస్ట్ హాఫ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
2020లో ఆ ప్లాన్ ఉంది
‘‘చిన్న సినిమా తీయాలంటే భయం వేస్తోంది. ఎందుకంటే ఆడకపోతే మొత్తం పోతుంది. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకురావాలంటే వాళ్లకు ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. పెట్టిన డబ్బుతో చిన్న సినిమాను సక్సెస్ చేసి, తిరిగి డబ్బు తెచ్చుకోవడం కష్టమైపోయింది. గతేడాది మిడిల్ రేంజ్ హీరోలతో నాలుగు సినిమాలు తీశాను. రైట్ కంటెంట్‌తో రైట్ సినిమా తీస్తే సినిమా హిట్ అవుతుందని గతేడాది ప్రూవ్ అయ్యింది’’ అన్నారు ‘దిల్’ రాజు. రాజ్‌తరుణ్, రిద్ధి కుమార్ జంటగా అనీష్‌కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ నిర్మించిన సినిమా ‘లవర్’. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన సంగతలు... ► అనీష్ దర్శకత్వం వహించిన ‘అలా ఎలా?’ చూశాను. బాగుందనిపించింది. ఆ తర్వాత 2016లో అనీష్ ఓ స్టోరీలైన్ చెప్పాడు. గతేడాది ఆరు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కుదరలేదు. సేమ్‌టైమ్ నాలుగేళ్లుగా ప్రాజెక్ట్స్ చూసుకుంటున్న హర్షిత్ కూడా తనకు ఓ సినిమాను అప్పజెప్పమని అడిగాడు. ఎందుకో ఈ సినిమా ఇవ్వాలనిపించింది. మ్యూజిక్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి, ఒక్కో పాటను ఒక్కో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో చేయిస్తానని హర్షిత్ అన్నప్పుడు షాకయ్యాను. కానీ ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తుంది. సినిమా చూసిన వారందరూ క్లైమాక్స్ బాగుందని చెబుతున్నారు. ఆ రోజు హర్షిత్ అడిగిన వాటికి వంద శాతం పాసయ్యాడు. కానీ ఈ సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్నట్లు 5 కోట్లు కాక, దాదాపు 8 కోట్లకు చేరుకుంది. లక్కీగా ఈ రోజుల్లో శాటిలైట్, హిందీ డబ్బింగ్ అంటూ ఇలా మార్కెట్ కూడా పెరిగింది. ఇది మంచి విషయం. ► ఫ్యామిలీ ఎమోషన్స్‌కు దూరమైన ఓ అనాథ కుర్రాడు, తన వారసులకు ఆ సమస్య రాకూడదని ఆలోచిస్తాడు. అలాగే తాను ప్రేమించిన అమ్మాయి తనకు అద్భుతమైన లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాడు. అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలే ‘లవర్’ చిత్రం. ► రెగ్యులర్ సినిమాలే ఇండస్ట్రీలో వస్తాయన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. కొత్త సినిమాలు తీయాలని నాకూ ఉంటుంది. కానీ ఫ్యామిలీ అండ్ యూత్ జానర్‌పై నాకు గ్రిప్ ఉంది. అందుకే షిఫ్ట్ అవ్వను. అలా కాకుండా కాస్త బయటికి వెళ్లినప్పుడు ఎకానమీ పరంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడ పెడుతున్నాం? ఎంత వస్తుంది అని ఆలోచించాల్సిందే. ► మా బ్రదర్ వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నో డౌట్.. తన ఫస్ట్ సినిమా ‘దిల్’ రాజు సినిమానే. టైటిల్ ‘పలుకే బంగారమాయెనా’ అనుకుంటున్నాం. కథ రెడీ అవుతోంది. పక్కా నా స్టైల్ సినిమానే. ► డెహ్రాడూన్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత మహేశ్‌బాబు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నాం. ఇంద్రగంటితో ఓ మల్టీస్టారర్ సినిమా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దాగుడుమూతలు’ అనుకున్నాం. వర్క్ జరుగుతోంది. ఈ స్క్రిప్ట్ చేస్తామా? లేక వేరే చేస్తామా? అనేది ఓ పది రోజుల్లో తెలుస్తుంది. గల్లా అశోక్ సినిమా స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యింది. అక్టోబర్ లేదా సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుంది. ► ఇక సినిమాల రిలీజ్ విషయానికొస్తే... నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేస్తాం. వెంకటేశ్, వరుణ్‌తేజ్ మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ని సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నాం. రామ్ హీరోగా ‘çహలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తాం. మహేశ్ సినిమా ఏప్రిల్ 5న విడుదల అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్ ఓన్లీ టాలీవుడ్‌కే పరిమితం కాదు. 2020లో బాలీవుడ్లో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాం. నా విషయానికొస్తే... నో యాక్టింగ్ నో డైరెక్షన్. ఈ రెండు విషయాల్లో క్లారిటీ ఉంది. -
నెర్వస్‌గా ఫీల్ అవుతున్నా
‘‘ఇప్పటి వరకు మా బ్యానర్లో 27 సినిమాలు వచ్చాయి. అందులో 22 సక్సెస్ అయ్యాయి. మిగిలిన 5 కూడా వర్కౌట్ అయ్యాయి. ‘లవర్’ చిన్న సినిమాగా వస్తున్నా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రాజ్ తరుణ్, రిద్ధి కుమార్ జంటగా ‘అలా ఎలా’ ఫేమ్ అనీశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవర్’. ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో హర్షిత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన అంకిత్ తివారి, తనీశ్, సాయి కార్తీక్, జె.బిలు ‘లవర్’ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం లుక్స్, టీజర్, సాంగ్స్ బావున్నాయి. హర్షిత్ ఫస్ట్ సినిమా. నా ఫస్ట్ సినిమా కంటే నెర్వస్‌గా ఫీల్ అవుతున్నా. అందరూ హార్డ్ వర్క్ చేసి మంచి అవుట్‌పుట్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మా చిత్రం పెద్ద సక్సెస్ అవుందని భావిస్తున్నా’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘తెలుగులో నా మొదటి చిత్రమిది’’ అన్నారు రిద్ధి కుమార్. ‘‘సోలో నిర్మాతగా నా ఫస్ట్ సినిమా ఇది’’ అన్నారు హర్షిత్ రెడ్డి. ‘‘అలా ఎలా’ చిత్రం తర్వాత ‘లవర్’ కి మూడేళ్లు గ్యాప్ వచ్చింది. త్వరగా చేసి ఉంటే మా నాన్నగారు ఈ సినిమా చూసేవారు. ప్రస్తుతం ఆయన లేరు’’ అన్నారు అనీశ్ కృష్ణ. -
రాజ్ తరుణ్ ‘లవర్’
-
రాజ్ తరుణ్ ‘లవర్’ ట్రైలర్
చాలాకాలం పాటు హిట్ లేక వెనుకబడ్డాడు రాజ్‌తరుణ్. అపజయాలు పలకరిస్తున్నా.. సరైన హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ కుర్రహీరో. ‘లవర్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరిచేందుకు రెడీ అయ్యాడు. తాజాగా విడుదలైన లవర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రాజ్ తరుణ్‌కు జోడిగా రిధి కుమార్ నటించింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలతో రాజ్‌తరుణ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాకు అన్నిష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రేపు ‘లవర్’ టీజర్
కుమారి 21ఎఫ్ సినిమా తరువాత రాజ్‌తరుణ్‌కు ఆ రేంజ్ హిట్ పడలేదు. ఈ ఏడాది వచ్చిన రంగుల రాట్నం, రాజు గాడు సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. రాజ్ తరుణ్ మరో మూవీ లవర్ విడుదలకు సిద్దంగా ఉంది. రాజ్ తరుణ్ డిఫరెంట్ లుక్‌తో వస్తోన్న లవర్ మూవీ జూలై 20న విడుదల కానుంది. రేపు (జూలై 14) ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. రాజ్ తరుణ్‌కు జోడిగా రిధి కుమార్ నటిస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. #Lover Theatrical trailer at 6PM tomorrow!!! 🙂@SVC_official #AneeshKrishna #RiddhiKumar pic.twitter.com/C22ylx4qNS — Raj Tarun (@itsRajTarun) July 13, 2018