Vinaya Vidheya Rama
-
భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో
ఒకప్పుడు సౌత్ ఇండియా స్టార్ నటుడిగా ప్రశాంత్ గుర్తింపు పొందాడు. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించినా తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా మెప్పించాడు. ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడు. 17 సంవత్సరాల వయసులోనే ప్రశాంత్ 'వైగాసి పోరంతచ్చు' అనే తమిళ సినిమాతో నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. తమిళంలో ఒకప్పుడు అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన స్టార్ ప్రశాంత్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జీన్స్ సినిమా ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అజిత్, విజయ్ తదితరులు కెరీర్లో గుర్తింపు పొందుతున్న సమయంలో ప్రశాంత్‌కు వారికి మించిన గుర్తింపు ఉండేది. సినీ కెరియర్ భారీ విజయాలతో దూసుకుపోతున్న సమయంలో తన భార్యతో వివాదాలు. ఆపై పదే పదే సినిమా పరాజయాలతో స్టార్ డమ్ కోల్పోయాడు. విడాకుల సమయంలో వచ్చిన వివాదాల వల్ల ప్రశాంత్ కెరీర్ పాతాళానికి పడిపోయింది. తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్‌కు అన్నగా, కలెక్టర్ పాత్రలో ప్రశాంత్ కనిపించాడు. తాజాగ తమిళ ప్రముఖ రాజకీయ, సినీ విశ్లేషకుడు కాంతరాజ్ ప్రశాంత్ గురించి పలు విషయాలు వెల్లడించారు. 'సినీ ఇండస్ట్రీలో ప్రతి పదేళ్లకు ఒకసారి మార్పులు వస్తూనే ఉంటాయి. కొంతమంది నటీనటులు మాత్రమే కాలంతో ముందుకు సాగగలుగుతున్నారు. నటనలో ప్రశాంత్‌కు ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు. ప్రశాంత్ తన తండ్రి త్యాగరాజ్ డైరెక్షన్లో 'అంధాగన్' సినిమా తీస్తున్నారు. ఇంతటితో ఆయన సినిమాలు చేయకపోవడమే మంచిది. (ఇదీ చదవండి: చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్‌కు ఛాన్స్) అతను వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది. నేడు సినిమాలు మారిపోయాయి. అతనిలో గతంలో ఉన్న హీరోయిజం లేదు. ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తారు. అంతేకాకుండా ప్రశాంత్ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అది ప్రశాంత్ సినీ కెరీర్‌పై భారీ ప్రభావం చూపాయి. వాటి తర్వాత ప్రశాంత్ సినిమాల నుంచి తప్పుకున్నాడు.' అని కాంతరాజ్ పేర్కొన్నాడు. భార్యతో గొడవలు ప్రశాంత్‌కి 2005లో వ్యాపారవేత్త కుమార్తె గృహలక్ష్మితో పెళ్లయింది. వారిద్దరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొద్దిరోజుల్లోనే వారిద్దరి మధ్య సమస్యలు తలెత్తాయి. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. వీరిద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగినట్లు సమాచారం. తర్వాత గృహలక్ష్మి తన పుట్టింటికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. పాపను చూసేందుకు వారి ఇంటికి వెళ్లినా ప్రశాంత్‌ను అనుమతించలేదు. తన భార్యను తిరిగి పొందేందుకు ఆయన కోర్టును ఆశ్రయించాడు. అలా వారిద్దరి మధ్య అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే ఇంతలోనే మరో అనుకోని సంఘటన జరిగింది. ప్రశాంత్ జీవితంలో ఊహించని ఘటన నారాయణన్ అనే వ్యక్తి వారి గొడవలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ కంటే ముందే గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని రంగంలోకి దిగాడు. గృహలక్ష్మి తనను 1998లోనే పెళ్లాడిందన్నది అతని వాదన. దీంతో విడాకుల కోసం హీరో ప్రశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసిందని సమాచారం. తన కూతురుని తన దగ్గర వదిలేయాలని ప్రశాంత్ కోరగా కోర్టు అంగీకరించలేదు. విడాకుల సమయంలో వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రశాంత్ ఇమేజ్ను భారీగా దెబ్బతీశాయి. ఇలా వెండితెర లైమ్‌లైట్‌లో కనిపించకుండా పోయాడు. ఆయనతో పాటు వచ్చిన అజిత్, విజయ్ లాంటి స్టార్లందరూ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. -
ఈసారి 'వినయ విధేయ వార్నర్'లా..
మెల్బోర్న్: తెలుగు హీరోలను, సినిమాలను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ, వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ను వాడేశాడు. రాంచరణ్, కియారా అడ్వానీ నటీనటులుగా నటించిన వినయ విధేయ రామ సినిమాలోని యాక్షన్ సీన్లతో స్వాపింగ్ వీడియో రూపొందించి, తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. నేను మళ్లీ వచ్చేశాను. ఈ లెజెండ్ ఎవరు? ఇది ఏ సినిమాలో సన్నివేశం అని క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్టుకు హీరోలు రాంచరణ్, రానా దగ్గుబాటి, ప్రభాస్‌లను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుత నెట్టింట హల్చల్ చేస్తుంది. దీనిపై రాంచరణ్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) కాగా, బుట్టబొమ్మ సాంగ్‌తో స్వాపింగ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించిన ఈ ఆసీస్ స్టార్ క్రికెటర్.. ఆతర్వాత చాలా మంది తెలుగు అగ్ర హీరోలకు చెందిన సినిమాల్లోని సీన్లతో వీడియోలు చేశాడు. ఇటీవలే రాజమౌళీ ఆర్ఆర్ఆర్ పోస్టర్‌ను మార్ఫింగ్ చేసిన వార్నర్.. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి వినయ విధేయ రామను వాడాడు. ఈ మధ్యకాలంలో పేస్ ఆఫ్ యాప్‌ను ఉపయోగించి సౌత్ స్టార్స్ సినిమాల్లోని సన్నివేశాల్లో నటిస్తున్న డేవిడ్ భాయ్.. కొంతకాలంగా ఇలాంటి ప్రయోగాలనే చేస్తూ బీజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ రద్దు కావడంతో ఖాళీగా ఉన్న వార్నర్.. ఎక్కువ శాతం సమయాన్ని మార్ఫింగ్ వీడియోలు చేయడానికి కేటాయించడం విశేషం. -
టాలీవుడ్ @ 2020
గడిచిన పదేళ్ల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ.. ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరెన్నో శిఖరాలను అందుకుంది. గొప్ప గొప్ప విజయాలను సాధించింది. తన మార్కెట్ వ్యాల్యూనూ అనూహ్యంగా పెంచుకుంది. ఇవాళ జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగానే కాదు.. ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇందుకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా నిలబెట్టడంలో, టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపజేయడంలోనూ బాహుబలి సినిమాలది ప్రత్యేకమైన స్థానం. కానీ అంతకుముందు నుంచి టాలీవుడ్ సినిమాలు వడివడిగా ఎదుగుతూ ఎంతో పేరుప్రఖ్యాతలు పొందాయి. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ దిశదిశలా వ్యాపించింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానే క్రేజ్ నెలకొంది. అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో విస్తరించిన మార్కెట్‌ను అందిపుచ్చుకోవడం.. పెరిగిపోయిన అంచనాలకు దీటుగా సత్తా ఉన్న సినిమాలు నిర్మించడం తెలుగు చిత్రసీమకు కత్తిమీద సాములాంటిదే. పెరిగిన బడ్జెట్.. అంచనాలు! బాహుబలి ఇచ్చిన జోష్‌తో భారీ సినిమాలు తెరకెక్కించేందుకు ఇప్పుడు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఒకప్పుడు 30, 40కోట్ల బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు వెనుకాముందు అయ్యేవారు. సినిమా హిట్టయినా అంత బడ్జెట్ తిరిగొస్తుందా? అన్న సందేహాలు వెంటాడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిష్టాత్మక సినిమాల కోసం, క్రేజీ కాంబినేషన్ల కోసం వందల కోట్లు పెట్టేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు సాహసిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన సినిమాలే సాహో, సైరా, మహర్షి, వినయవిధేయ రామ. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. ఇందులో సాహో, సైరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో భారీ అంచనాలతో, కళ్లుచెదిరే విజువల్స్, స్టంట్లతో ఈ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలకు టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. అయితే, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఏమాత్రం కథ, కథనాలు ఏమాత్రం ప్రేక్షకుడి అంచనాలకు మించి లేకపోతే.. కథ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని ఈ ఏడాది వచ్చిన సినిమాలు నిరూపించాయి. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో, దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటికీ.. అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. దర్శకుడు సినిమాలోని స్టంట్ల మీద పెట్టిన ఫోకస్లో కొంతమేరకైనా కథ, స్క్రీన్‌ప్లే మీద పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమోనని వినిపించింది. మొత్తానికి హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లో సాహో సినిమా భారీ పరాభవాన్నే ముటగట్టుకుంది. హిందీలో వందకోట్లకుపైగా వసూళ్లు రావడం, ప్రభాస్ స్టార్డమ్ కలిసిరావడంతో ఈ సినిమా నిర్మాతలకు కొంత ఊరటనిచ్చే విషయం. ఇక, చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరానరసింహారెడ్డి సినిమా కూడా అంచనాలకు దూరంగానే ఉండిపోయింది.రేనాటి సూరీడు, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో హిట్టైనప్పటికీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇతర భాషల్లో ఓ మోస్తరు వసూళ్లే రాబట్టింది. మహేశ్‌బాబు 25వ సినిమా మహర్షి కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. ప్రిన్స్ మహేశ్ స్టామినాకు తగ్గట్టు వసూళ్లు రాబట్టంలో సక్సెస్ కాలేదు. ఇక, రాంచరణ్ హీరోగా తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. రంగస్థలం లాంటి పర్ఫార్మెన్స్ ఒరియంటెడ్ పాత్ర చేసిన చరణ్.. ఆ వెంటనే రోటిన్ ఫార్ములా సినిమాలో నటించడం.. ఫైట్లు, రక్తపాతంతో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రేక్షకులను బెంబెలెత్తించడంతో ఈ సినిమా బోల్తా కొట్టింది. మారిన బాక్సాఫీస్ సరళి! తెలుగు చిత్రపరిశ్రమ మార్కెట్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశీయంగానూ పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేకాదు ఓవర్సీస్లోనూ గణనీయంగా వసూళ్లు రాబట్టే సత్తా ఉన్నట్టు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాల ప్రమాణాలూ మారిపోయాయి. ఒకప్పడు 50 రోజులు ఆడితే బొమ్మ హిట్టు అనేవారు. వందరోజులు ఆడితే సూపర్‌హిట్టు.. 175, 200 రోజులు ఆడితే బ్లాక్‌బస్టర్ హిట్టు, ఆల్‌టైమ్ హిట్టు అని కొనియాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో 40రోజుల్లోనే కొత్త సినిమా ప్రేక్షకుల చెంతకు చెరిపోతోంది. టీవీల్లోనూ, ఇంకా వీలైతే యూట్యూబ్‌లోనూ వీలైనంత త్వరగా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఎన్ని థియేటర్లలో విడుదలైంది.. ఏ స్థాయిలో ప్రారంభ వసూళ్లు సాధించింది.. ఎన్ని వారాలపాటు నిలకడగా వసూళ్లు రాబట్టగలిగిందనేని సినిమా విజయానికి ఇప్పుడు ప్రమాణంగా మారింది. ప్రారంభ వసూళ్ల ఆధారంగా సినిమా జయాపజయాలు బేరిజు వేసే పరిస్థితి వచ్చింది. మొదటి మూడు రోజులు బంపర్ వసూళ్లు సాధిస్తే బొమ్మ హిట్టు, సూపర్‌హిట్టు ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొదటి రెండు వారాల వసూళ్లు సినిమా విజయానికి ప్రాణపదంగా మారిపోయాయి. థియేటర్లలో లాంగ్రన్ అనేది చాలావరకు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలి, రంగస్థలం లాంటి బలమైన కథాచిత్రాలే చాలాకాలంపాటు ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చాయి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా, స్టార్ హీరో మూవీ అయినా మూడు, నాలుగు వారాలకు మించి థియేటర్లలో నిలబడని పరిస్థితి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టాలీవుడ్ కూడా తన పద్ధతలను మార్చుకుంది. ప్రారంభ వసూళ్లపైనే ఇప్పుడు దర్శక నిర్మాతలు, సినీ తారలు ఫోకస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున విడుదల చేసి మొదటి ఒకటిరెండు వారాల్లోనే దండిగా వసూళ్లు రాబడట్టంపై దృష్టి పెట్టారు. ఆన్లైన్లో వరుసగా ఫస్ట్‌లుక్, టీజర్లు, పాటలు, ట్రైలర్లు విడుదల చేస్తూ.. ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతూనే.. క్షేత్రస్థాయి పర్యటనలతో సినిమా విడుదలకు ముందే ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఈ పరిణామాలు కొంతమేరకు సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా సినిమాలోబలమైన కథకథనాలు, భావోద్వేగాలు, వినోదం ఉంటే.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకులు థియేటర్ వైపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కథకథనాలు బాగుండి.. స్టార్ బలం లేకపోయినా, అంతగా ప్రచారం లేకపోయినా హిట్టు కొట్టవచ్చునని ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవురా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఎవరు, మల్లేశం వంటి సినిమాలు నిరూపించాయి. మొత్తానికి కళ్లుచెరిరే స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ మాత్రమే సినిమాను ప్రేక్షకులకు చేరువచేయలేదని, ప్రేక్షకుడిని రంజింపజేసే కథ, స్క్రీన్‌ప్లే, బలమైన భావోద్వేగాలు ఉంటే తప్ప బొమ్మ హిట్టు కావడం అంత ఈజీ కాదని 2019 బాక్సాఫీస్ హిస్టరీ చాటుతోంది. మూస సినిమాలకు కాలం చెల్లిపోయిందని, రొటీన్ ఫార్మూలాలతో తెరకెక్కించే మసాలా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దొరకడం కష్టమేనని తాజా పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, పెరిగిన మార్కెట్ అంచనాలకు దీటుగా.. మారిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని.. ఫ్రెష్ కంటెంట్‌నూ, క్రియేటివ్ కథలను అన్వేషించి తెరకెక్కించాల్సిన అవసరముందని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ సినిమా పేరిట ఇన్నాళ్లు అవలంబించిన రోటిన్, మూస ఫార్ములా చిత్రాలను పక్కనబెట్టి.. ఒరిజినాలిటీ ఉన్న కథలను, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో వినూత్నంగా తెరకెక్కిస్తే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం ఈజీ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రాబోతున్న టాలీవుడ్ పందెకోళ్లు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సరికొత్త కథాకథనాలతో కొత్త సంవత్సరంలో రాబోయే సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తాయని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయని ఆశిద్దాం. - శ్రీకాంత్ కాంటేకర్ -
బోయపాటికి హీరో దొరికాడా?
మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను, వినయ విధేయ రామ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో ఈ యాక్షన్ దర్శకుడు ఆలోచనలో పడ్డాడు. చాలా కాలంగా బోయపాటి నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బోయపాటి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ కన్నడ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నారట. జాగ్వర్ సినిమాతో టాలీవుడ్, సాండల్వుడ్లకు ఓకేసారి పరిచయం అయిన నిఖిల్ గౌడ హీరోగా బోయపాటి తదుపరి చిత్రాన్న ప్లాన్ చేస్తున్నారట. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, బోయపాటి సినిమాతో మరోసారి టాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
రామరాజు@ పోలీస్
‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి నిత్యం ఏవో కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు రామరాజు అనే వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రబృందం షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో రామరాజు అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పోలీస్ చెక్‌పోస్ట్ నేపథ్యంలో భారీ యాక్షన్ సీన్‌ను తెరకెక్కించారు. అయితే..‘ఆర్ఆర్ఆర్’ సెట్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వాటిలో అనాంగ్పూర్ పోలీస్ అవుట్ పోస్ట్ అనే పేరుతో పక్కనే బ్రిటిష్ జెండా ఉన్న ఓ ఫొటో ఉంది. దీంతో ఈ సినిమా 1920 టైమ్‌లో హర్యానా రాష్ట్రం నేపథ్యంలో సాగనుందనే టాక్ జోరుగా నడుస్తోంది. అంటే...బ్రిటీష్ ప్రభుత్వం టైమ్‌లో చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారెమోనని కొందరు ఊహిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పాత్ర గురించి కూడా చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో కథానాయికలుగా బాలీవుడ్ హీరోయిన్లు పరిణీతి చోప్రా, ఆలియా భట్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కీలక పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ను సంప్రదించారట టీమ్. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
అంచనాలను అందుకోలేకపోయాం
జనవరి 11... రామ్‌చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ విడుదలైన రోజు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఆ అంచనాలను అందుకోలేకపోయామని మంగళవారం రామ్‌చరణ్ మీడియాకి ఓ లేఖ విడుదలచేశారు. ఆ లేఖ సారాంశం... ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు, నా పట్ల, మా సినిమాల పట్ల మీరు చూపిస్తున్న∙ప్రేమాభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్యగారు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకి కృతజ్ఞుడనై ఉంటాను. మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపచేసే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఈ సినిమాని అందించలేకపోయాం. మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. అన్ని వేళలా తమ మద్దతు నాకు అందించిన మీడియా మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. – ప్రేమతో మీ రామ్‌చరణ్ -
ఒప్పేసుకున్న రామ్ చరణ్..!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చెర్రీ రొటీన్ మాస్ ఫార్ములా సినిమా చేయటం అభిమానులకు రుచించలేదు. అయితే మాస్ ఫార్ములా సినిమా కావటంతో కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి. తాజాగా వినయ విధేయ రామ రిజల్ట్‌పై చరణ్ ఓ ప్రతికా ప్రకటన విడుదల చేశారు. సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృతఙన్యుడనై ఉంటానని తెలిపారు. అభిమానులను అలరించే సినిమా ఇచ్చేందుకు శ్రమించామన్న చెర్రీ, అంచనాలని అందుకోలేకపోయామని అంగీకరించారు. భవిష్యత్తులో మీరు మెచ్చే చిత్రాన్ని అందిస్తానన్నారు. -
పిల్లోడి హెయిర్ సెట్ చేస్తున్న చెర్రీ!
‘వినయ విధేయ రామ’ షూటింగ్ సెట్లో అందరం కలిసి ఓ కుటుంబంలా ఉండే వారమని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు నటీమణులు. రామ్‌చరణ్‌కు వదినగా నటించిన స్నేహ తనయుడికి, చెర్రీకి మంచి స్నేహం కుదిరిందట. విహాన్ చెర్రీకి పెద్ద అభిమాని అని, రామ్‌లో ఉన్న చిన్నపిల్లల మనస్తత్వం వల్ల తాను విహాన్‌ను షూటింగ్‌కు తీసుకువెళ్లిన ప్రతీసారి ఇద్దరు కలిసి ఆడుకునే వారంటూ షూటింగ్ లొనేషన్లో తీసిన పిక్‌ను స్నేహ షేర్ చేశారు. విహాన్ హెయిర్‌ను సెట్ చేస్తున్న చెర్రీ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. View this post on Instagram A throwback from #VVR sets. Vihaan has a huge RC fan in him and Ram had a kid in him to play with vihaan everytime I took him to the sets. Sweethearts.....😊 A post shared by Sneha Prasanna (@realactress_sneha) on Jan 19, 2019 at 2:53am PST -
మాస్ మార్కే కాపాడిందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో సినిమాకు భారీ నష్టాలు తప్పవని భావించారు. కానీ వసూళ్ల పరంగా చూస్తే సీన్స్ రివర్స్ అయ్యింది. సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకున్న వినయ విధేయ రామ మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా ఆరు రోజుల్లో ఈ సినిమా 60 కోట్లకుపైగా వసూళ్లు సాధించటంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాల నుంచి చాలా వరకు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సన్నివేశాలు కాస్త అతిగా అనిపించినా.. బోయపాటి మార్క్ మాస్ యాక్షనే సినిమాను కాపాడిందన్న టాక్ వినిపిస్తోంది. బీ, సీ సెంటర్స్ రెస్పాన్స్ బాగుండటం కలెక్షన్ల విషయంలో ప్రభావం చూపించింది. జనవరి 25 వరకు రిలీజ్లు లేకపోవటం కూడా వినయ విధేయ రామకు కలిసొస్తుందని భావిస్తున్నారు. -
‘వీవీఆర్’ ఎంత రికవరీ చేసిందంటే..?
సంక్రాంతి విన్నర్ అవుదామని పందెంకోడిలా బరిలోకి దిగిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాస్.. ఊర మాస్, కమర్షియల్ మూవీ అంటూ ఊదరగొట్టిన ఈ చిత్రానికి విపరీతమైన నెగెటివ్ టాక్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాలపై సోషల్‌మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్స్ వచ్చాయి. అయితే మొదటిరోజే ఈ సినిమాపై వచ్చిన టాక్ చూసి.. రెండో రోజుకు ఈ మూవీ చాపచుట్టేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వినయ విధేయ రామ నిలకడగా రన్అవుతోంది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఎఫ్2పై కాసుల వర్షం కురుస్తున్నా.. కలెక్షన్ల విషయంలో వీవీఆరే ముందుంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 65 శాతాన్ని రికవరీ చేసినట్టు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ రంగస్థలం తరువాత వస్తోన్న చిత్రం, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో అనేసరికి ఈ మూవీ బిజినెస్ ఓ రేంజ్లో జరిగింది. రంగస్థలం రికార్డులు కూడా బద్దలు కొట్టేస్తుందని అభిమానులు ఆశపడ్డారు. తీరా ఫలితం చూస్తే.. రంగస్థలం రికార్డులు దేవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలనుకుంటూ డిస్ట్రిబ్యూటర్లు తమ గోడును వెల్లిబుచ్చుకుంటున్నారట. ఈ సినిమాను దాదాపు 72కోట్లకు అమ్మగా ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్లకు 46కోట్ల ఆదాయం తెచ్చిపెట్టిందట. ఇక ఓవర్సీస్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా పడిపోయింది. ఇప్పటివరకు ఈ చిత్రం మిలియన్ క్లబ్‌లోకి చేరుకోలేకపోయింది. రంగస్థలంతో మూడు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు చేసిన చెర్రీ.. ‘వీవీఆర్’తో తేలిపోయాడు. మరి వీవీఆర్ ఫుల్‌రన్‌లో అయినా సేఫ్‌గా బయటపడుతుందో లేదో చూడాలి. -
‘వీవీఆర్’... అసలేం జరుగుతోంది..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరున్న బోయపాటి, రంగస్థలం సక్సెస్‌తో సూపర్ ఫాంలో ఉన్న చెర్రీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కటంతో రిలీజ్ కు ముందు నుంచే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ఫస్ట్ షో నుంచి సినిమా మీద ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా దర్శకుడు బోయపాటిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. కావాలనే కొంతమంది ఇలా సినిమాను ట్రోల్చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు, నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, రిలీజ్ చేసిన వీడియోస్ కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు ఫ్యాన్స్. ఒక వర్గం కావాలనే సినిమాను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. సినిమా అనేది టీం వర్క్.. అయినా కేవలం దర్శకుడినే బాధ్యుడిని చేసి విమర్శించటం కరెక్ట్ కాదంటున్నారు అభిమానులు. గతంలో ఇంత బ్యాడ్ టాక్ వచ్చిన సినిమాలేవి రెండో రోజుకు నిలబడలేకపోయాయి. కానీ చరణ్ ఇమేజ్, బోయపాటి స్టామినా కారణంగా వినయ విధేయ రామ మంచి వసూళ్లు సాధించిందంటున్నారు ఫ్యాన్స్. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బీ, సీ సెంటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు. తొలి రోజే దాదాపు 30 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ సినిమా చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే టాక్ ప్రభావం రెండో రోజు కలెక్షన్ల మీద కనిపించింది. మరో రెండు రోజులు సంక్రాంతి సెలవులు కావటంతో వసూళ్ల పరంగా సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
విదేయ రామ్
-
పండక్కి ట్రిపుల్ ధమాకా
సంక్రాంతి పండక్కి సినిమాలొస్తాయి. థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారు. ఆకాశంలో గాలిపటాల కంటే స్టార్స్ ఎక్కువ కనపడతారు. రంగుల ముగ్గుల కంటే థియేటర్లో రంగుల కాగితాలు ఎక్కువ ఎగురుతాయి. ఇక స్వీట్ల పంపకాలు, వేడుకలు, డ్యాన్సులు... థియేటర్ల బయట బోలెడంత హంగామా. సంక్రాంతికి ట్రిపుల్ ధమాకాలా వచ్చిన మూడు స్ట్రయిట్ ‘ఫ్యాన్.... టాస్టిక్’ సినిమాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. సంక్రాంతి సీజన్లో ముందుగా వచ్చిన సినిమా ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’. నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. క్రిష్ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాతలు. ‘‘ట్రేడ్ పరంగా బుధవారం రిలీజ్ అంటే అంత మంచిది కాదు. కానీ ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి విడుదలకు ఆ రోజుని ఎంపిక చేసుకున్నాం’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ చిత్రం వసూళ్ల విషయానికొస్తే... 700 థియేటర్లలో రిలీజైన ‘యన్.టి.ఆర్’ తొలి రోజు 10 కోట్ల పై చిలుకు షేర్ చేసిందని, బుధవారం అయినప్పటికీ ఇంత వసూలు చేయడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘యన్.టి.ఆర్’ రిలీజ్ తర్వాత ఒక్క రోజు గ్యాప్ (11న విడుదల)తో ‘వినయ విధేయ రామ’ తెరపైకి వచ్చింది. రామ్‌చరణ్ హీరోగా డీవీవీ దానయ్య నిర్మించారు. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరపైకొచ్చింది. దాదాపు 900 థియేటర్లకు పైగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు 30 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్ వీకెండ్లో సందడి చేయడానికి థియేటర్లోకి వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం శనివారం తెరకొచ్చింది. ‘‘మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్లో ఈ సినిమా కూడా హిట్టే’’ అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. స్ట్రయిట్ చిత్రాల మధ్య వచ్చిన డబ్బింగ్ మూవీ ‘పేట’. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ సినిమాని తెలుగులో అశోక్ వల్లభనేని విడుదల చేశారు. మూడు స్ట్రయిట్ చిత్రాల మధ్య రావడంతో థియేటర్లు పెద్దగా దొరకలేదు. రజనీ మార్క్ మాస్ మూవీ అనిపించుకుని, ప్రేక్షకులను థియేటర్స్‌కి రాబట్టుకుంటోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కియారా, రామ్‌చరణ్ వెంకటేశ్, తమన్నా, మెహరీన్, వరుణ్ తేజ్ రజనీకాంత్, త్రిష -
కోలీవుడ్‌కు వినయ విధేయ రామ
సినిమా: వినయ విధేయ రామ అంటూ టాలీవుడ్ యువ స్టార్ నటుడు రామ్‌చరణ్ మరోసారి తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అవును ఈయన ఇంతకు ముందు తెలుగు చిత్రం మగధీర అనువాదంతో కోలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తరువాత కూడా రామ్‌చరణ్ నటించిన పలు చిత్రాలు తమిళంలోకి అనువాదమై నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా భారీ తెలుగు చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అడ్వాని హీరోయిన్గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో తమిళస్టార్ నటుడు ప్రశాంత్, స్నేహా, మధుమిత, ముఖేష్రిషీ, జేపీ.హరీశ్ ఉత్తమన్, ఆర్యన్ రాజేశ్, రవివర్మన్ ముఖ్య పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రకాశ్ ఫిలింస్ సమర్పణలో డీవీవీ.ఎంటర్టెయిన్మెంట్స్ నిర్మించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతబాణీలు అందించారు. కుటుంబనేపథ్యంలో ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్, వినోదం, రాజకీయం, సాహసం అంటూ మంచి కమర్శియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలను బ్రహ్మాండమైన సెట్స్ వేసి చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. చిత్రంలోని పోరాట దృశ్యాలకు మాత్రమే రూ.11 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కనల్‌కన్నన్ కంపోజ్ చేసిన ఈ ఫైట్స్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటాయని చెప్పారు. వినయ విధేయ రామా చిత్రం తెలుగులో శుక్రవారం విడుదలైంది. ఫిబ్రవరి తొలివారంలో తమిళంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం తెలిపారు. -
‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ
టైటిల్ : వినయ విధేయ రామ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రామ్ చరణ్, కియారా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : బోయపాటి శ్రీను నిర్మాత : డీవీవీ దానయ్య రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. వరుస ప్రయోగాల తరువాత చరణ్ కమర్షియల్ ఎంటర్టైనర్తో వస్తుండటంతో అభిమానులు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? రామ్‌చరణ్ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..? బోయపాటి మాస్ ఫార్ములా వర్క్ అవుట్ అయ్యిందా..? కథ : రామ (రామ్‌చరణ్)కు తన అన్నలంటే ప్రాణం. పెద్దవాడు భువన్ కుమార్(ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం. తన వారి కోసం చదువును భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ. భువన్ కుమార్ ఎలక్షన్ కమిషనర్‌గా వైజాగ్‌లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు. అదే సమయంలో బీహార్‌లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్ మున్నా (వివేక్ ఒబెరాయ్). రాజు భాయ్ తన ప్రాంతంలో ఎలక్షన్లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో పెట్టుకుంటున్నాడని తెలిసి, భువన్ కుమార్‌ను అక్కడికి ఎలక్షన్ కమీషనర్‌గా పంపిస్తారు. తనకు ఎవరు ఎదురొచ్చినా అంతం చేసే రాజు భాయ్, భువన్ కుమార్‌ను ఏం చేశాడు.? అన్న కోసం రామ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత పక్కా మాస్ కమర్షియల్ సినిమాలో నటించిన రామ్ చరణ్, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టుగా అనిపించినా.. రామ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగానూ మంచి పరిణతి కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో చరణ్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన బాగుంది. విలన్‌గా వివేక్ ఒబెరాయ్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్ రాజేష్, ముఖేష్ రుషి, హరీష్ ఉత్తమన్, రవి వర్మ, మధునందన్ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు. విశ్లేషణ : రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావటంతో వినయ విధేయ రామపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటం లో చిత్రయూనిట్ పూర్తిగా విఫలమైంది. బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హై ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే సినిమాలో యాక్షన్ కాస్త శ్రుతి మించినట్టుగా అనిపిస్తుంది. బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తెర నిండా నటీనటులు ఉన్నా ఎవరినీ సరిగ్గా వినియోగించుకోలేదు. రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమా చేసే ప్రయత్నంలో కథా కథనాలు పూర్తిగా గాడి తప్పాయి. హీరోను అంచనాలకు మించి చూపించే ప్రయత్నంలో ఏ మాత్రం నమ్మశక్యంగా లేని పోరాట సన్నివేశాలను డిజైన్ చేశారు. ఒక దశలో యాక్షన్ సీన్స్ మధ్యలో కథ వచ్చిపోతున్న భావన కలుగుతుంది. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. రిషీ పంజాబీ తన సినిమాటోగ్రఫితో సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. ఎలివేషన్ షాట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రామ్ చరణ్ కొన్ని యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : మితిమీరిన హింస ఫోర్స్డ్ సీన్స్ సంగీతం దర్శకత్వం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘యన్.టి.ఆర్’ వర్సెస్ ‘వీవీఆర్’
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఎవరి అభిమానుల గ్రూప్ వారికి ఉంటుంది. అసలే నాగబాబు-బాలయ్య వివాదం అగ్గిరాజేస్తుంటే.. ఎన్టీఆర్, వీవీఆర్ అంటూ అయితే గత రెండ్రోజులుగా నందమూరి, మెగా ఫ్యాన్స్ తాకిడి మరీ ఎక్కువైంది. మొన్న రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడిపై ట్రోలింగ్స్ హోరెత్తగా.. ఈరోజు రిలీజ్ అయిన రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’పై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. ఓల్డేజ్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఫర్వాలేదనిపించినా.. ఎన్టీఆర్ యువకుడిగా ఉన్న పాత్రలో బాలయ్య అరాచకంగా కనిపించాడని విమర్శలు వచ్చాయి. ఏదేమైనా యన్.టి.ఆర్ సినిమాకు కొంత డివైడ్‌టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బయోపిక్ మీద మాత్రం ట్రోలింగ్స్ ఆగడం లేదు. యువకుడిగా ఎన్టీఆర్ ఉండే సన్నివేశాల్లోనైనా జూ.ఎన్టీఆర్ యాక్ట్ చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపించాయి. ఇక నేడు (జనవరి 11) ప్రపంచవ్యాప్తంగా వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాగా.. సినిమా బాలేదని ఓ వైపు ట్రోల్స్ జరుగుతుండగా.. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీ అంటూ మరోవైపు టాక్ ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల సినిమాలను ప్రమోట్ చేసుకుంటే ఏ బాధ లేదు కానీ, పక్కవారి సినిమాలపై అదే పనిగా ట్రోల్స్ చేస్తుండటంతో ఎంతో కొంత కలెక్షన్లపై ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ‘వీవీఆర్’పై జెన్యూన్ టాక్ తెలియాలంటే ఇంకొంచెంసేపు ఆగాల్సిందే. -
అలాంటి సినిమాలు చేయలేను
‘‘సినిమాలో ఫోర్స్‌గా ఫైట్ పెట్టను. యాక్షనే కావాలంటే ఇంగ్లీష్ సినిమా చూడొచ్చు. కానీ ప్రేక్షకులు మన సినిమాలనే ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మన సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఓ రిలేషన్ ఉంటుంది. ‘భద్ర’ నుంచి నా సినిమాలను గమనిస్తే ఫ్యామిలీ, సొసైటీ అంశాలు తప్పనిసరిగా ఉన్న విషయం తెలుస్తుంది’’ అన్నారు బోయపాటి శ్రీను. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బోయపాటి చెప్పిన సంగతులు. ► పోయిన ఏడాది పడిన కష్టాలన్నింటినీ మరచిపోయి కొత్త ఏడాదిలో అందరూ జరుపుకునే మొదటి పండగ సంక్రాంతి. ఈ పండగలాంటి సినిమా ‘వినయ విధేయ రామ’. ఫ్యామిలీ కోసం తలవంచే వినయుడిలా, అయినవారి కోసం ఏమైనా చేసే ఒక విధేయుడిగా, తనది అనుకున్న దాన్ని సాధించే రాముడిలోని పరాక్రమవంతుడిగా రామ్‌చరణ్ క్యారెక్టర్ ఉంటుందీ సినిమాలో. ఈ సినిమాకు ఎంత కావాలో అంతా చేశారు రామ్ చరణ్. అజర్ బైజాన్ షెడ్యూల్ కోసం ఆయన బాగా బాడీని బిల్డప్ చేశారు. ఈ కథను రామ్‌చరణ్ కోసమే రాశాను. ఒకరినొకరు బాగా నమ్మి ఈ సినిమా చేశాం. సోషల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ఓ పాయింట్‌ను కూడా ఈ సినిమాలో టచ్ చేశాం. ► సినిమా ప్రేక్షకులు కొత్త పోస్టర్‌నే కోరుకుంటారు. కొత్త లుక్స్‌నే చూడాలనుకుంటారు. కుటుంబ కథా చిత్రం అన్నప్పుడు ఆర్టిస్టుల కటౌట్స్, వారి లుక్స్ కూడా ముఖ్యం. ప్రశాంత్‌గారు, ఆర్యన్ రాజేశ్, రవివర్మ, మధు నందన్, స్నేహ, మధుమిత, హిమజ, ప్రవీణ.. ఇలా అందరూ బాగా చేశారు. విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్‌ను సంప్రదించినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందు ఆసక్తిగా లేదన్నారు. కానీ నేను కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. నా సినిమాలోని ప్రతి పాత్రకు జస్టిఫికేషన్ ఉండేలానే ప్లాన్ చేస్తాను. జ్యూస్ నాదైనా గ్లాస్ దానయ్యగారిదే. నిర్మాత సహకారం బాగా ఉంటే సినిమా బాగుంటుంది. స్ట్రాంగ్ విజువల్‌ని దేవిశ్రీ ప్రసాద్ ముందు పెడితే ఎలాంటి ఆర్ఆర్ ఇస్తారో సినిమాలో చూస్తారు. నా ఆర్టిస్టు నుంచి సినిమాకు కావాల్సింది రాబట్టుకోవడం కోసమే సెట్లో యాక్టివ్‌గా ఉంటాను. నేను రాయడం, తీయడం మీదనే ఎక్కువగా దృష్టి పెడతాను. బిజినెస్‌లో అంతగా కల్పించుకోను. ► చిరంజీవిగారు 150 సినిమాలు చేశారు. వెయ్యి కథలు విని ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు సినిమా బాగా రావడం కోసమే. ఈ కథ విన్న తర్వాత నాన్నగారికి ఓసారి చెబుదాం అన్నారు చరణ్. ఇప్పుడే వద్దు.. పది రోజులు తర్వాత చెబుదాం అన్నాను. ఆయనకు ఫుల్‌గా చెప్పాను. నచ్చింది. బాగుంది. నువ్వు బాగా చేస్తావనే నమ్మకం ఉంది అన్నారు. ► తండ్రి ఎవరైనా తన కొడుక్కి స్పోర్ట్స్ బైకో, స్పోర్ట్స్ కారో గిఫ్ట్‌గా ఇస్తారు. కానీ చిరంజీవిగారు రామ్‌చరణ్‌కు ఓ యుద్ధ ట్యాంకర్ (వారసత్వం)ని ఇచ్చారు. అది తోలుతూనే ఉండాలి. గెలుస్తూనే ఉండాలి. నిలబెడుతూనే ఉండాలి. ఒకటే మాట ఏంటంటే.. చరణ్ దానికి సమర్థుడు. ► చిన్న సినిమాలు, స్మూత్ సినిమాలు చేయలేను. ఆడియన్స్ నా దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాన్నుంచి నేను బయటికి రాలేను. కథలుగా మారుతూనే వస్తున్నాను. యాక్షన్ పార్ట్ ఒక భాగం మాత్రమే. అంటే.. పదిమంది చూసే సినిమాలు చేస్తాను కానీ ఒకరు చూసే సినిమాలు చేయను. మంచి సినిమాలు చేస్తాను. బయోపిక్ పట్ల ఆసక్తి ఉంది. చేసినా దానికి ఓ దమ్ము ఉంటుంది. నా బ్రాండ్‌ను నూటికి నూరు శాతం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఆ బాధ్యతను పెంచుకుంటూనే వెళ్తాను. ► ఇండస్ట్రీలో బోయపాటి చేసే ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే. నా గత సినిమాల రేంజ్‌ని మించి నా సినిమాలు ఉండాలని ఎప్పటికప్పుడు తాపత్రయపడుతుంటాను. ఏ హీరోతో నేను సినిమా చేస్తున్నానో ఆ హీరో ఫ్రంట్ సీట్ అభిమానిగానే నేను ఫీల్ అవుతాను. చరణ్‌ని అలా ఫీలయ్యే ‘వినయ విధేయ రామ’ సినిమా చేశాను. ► ప్రేక్షకులు తమ జీవితాల్లో నుంచి కొంత సమాయాన్ని మన కోసం వెచ్చిస్తున్నారు. వాళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఫ్యామిలీ కోసం కాకుండా సినిమా చూడటానికి ఖర్చు పెడుతున్నారు. లక్షల్లో ఆడియన్స్ సినిమాను చూస్తారు. వారందరి అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అంటే చావుతో చెలగాటం ఆడతాం. నిద్ర ఉండదు. నేను నిద్రపోయి ఆరు రోజులైంది. డీటీఎస్ నుంచి ప్రింట్ వెళ్లేవరకు ఆరు రోజులు. ఆ తర్వాత పబ్లిసిటీ, సినిమాను ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడతాం. ఎందుకంటే మనకంటే ఎంతోమంది మేధావులు ఉన్నా దేవుడు సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చాడు. ► బాలకృష్ణగారితో నేను చేయబోయే సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. రామ్‌చరణ్‌కు ఓ లైన్ చెప్పాను. ఈ సినిమాకు బాగా టైమ్ పట్టొచ్చు. చిరంజీవిగారితో కూడా ఓ సినిమా ఉంటుంది. నా టీమ్ 180 మెంబర్స్ ఉంటారు. నా సినిమాలో స్పాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతమంది ఉంటారు. అందరినీ కో ఆర్డినేట్ చేయాలంటే సెట్లో కాస్త గట్టిగానే ఉండాలి. అప్పుడే టైమ్ సేవ్ అయ్యి నిర్మాతకు నష్టం వాటిల్లదు. నా సెట్‌కి ఒకసారి వస్తే ఈ విషయం అర్థం అవుతుంది. -
పోటీ ఎందుకు అనిపించింది!
‘‘ప్రతి సినిమా ఒక మంచి సినిమా అవుతుందనే స్టార్ట్ చేస్తాం. ఒక సక్సెస్ఫుల్ సినిమాలోని క్యారెక్టర్ గురించే ఆలోచిస్తే అందరి డైరెక్టర్స్‌తో సినిమాలు చేయలేం. 1980లో చూస్తే నాన్నగారు అన్ని జానర్స్‌ను రెండేళ్లలో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆర్టిస్టుగా నేనూ అలా అన్నీ చేయాలనుకుంటాను. కన్విక్షన్ ఉన్న డైరెక్టర్స్‌తో సెన్సిబుల్ సినిమాలు చేయడం కూడా ఇష్టమే. బోయపాటి గారు మంచి కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. ‘వినయ విధేయ రామ’ సెట్స్‌లో నేను బాగా ఎంజాయ్ చేశాను’’ అని రామ్‌చరణ్ అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ చెప్పిన సంగతులు... ∙నలుగురు అన్నదమ్ముల కథే ఈ ‘వినయ విధేయరామ’. ప్రతి వ్యక్తి క్యారెక్టర్లో వినయం, విధ్వంసం ఉంటాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అంతే. సంక్రాంతికి తగ్గట్లే ‘వినయ విధేయ రామ’ టైటిల్ ఉంది. కథకు కూడా దగ్గరగా ఉండే టైటిల్ ఇది. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాతో ఈ సినిమాకు పోలికలు ఉన్నాయి అంటున్నారు కానీ నాకు అలా అనిపించలేదు. ఈ సినిమాలోని పరిస్థితులు, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉంటాయి. ఎప్పటినుంచో ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ అది ఈ సినిమా కాదని నా అభిప్రాయం. ∙‘రంగస్థలం’ తర్వాత 15 రోజుల లోపలే ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఇంకాస్త టైమ్ ఉంటే నాకు పర్సనల్‌గా ఇంకా బాగుండేది అనిపించింది. టైమ్ లేకపోయినా ‘రంగస్థలం’లోని చిట్టిబాబు క్యారెక్టర్ నుంచి ఈ సినిమాలోని రామ్ క్యారెక్టర్లో బాగానే ఒదిగిపోయాను. ∙బోయపాటిగారి సినిమాలను చూస్తే లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆయనకు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటేనే అది ఆయనకు ఉన్న స్ట్రెంత్ వల్లే. ఈ సినిమాలో యాక్షన్ బ్యాలెన్డ్స్‌గా ఉంటుందనే అనుకుంటున్నాను. ∙సిల్వెస్టర్ స్టాలోన్ వంటి గొప్ప నటుల సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనలా ఈ సినిమాలో నాకు రాంబో లుక్ అనేసరికి కాస్త ఉత్సాహంగా అనిపించింది. ఈ లుక్ గురించి బోయపాటిగారు రెండేళ్ల క్రితమే చెప్పారు. ‘వినయ విధేయ రామ’కు బాడీ బిల్డింగ్ అవసరం అయ్యింది. అందుకే కొంతకాలం డైట్ ఫాలో అయ్యాను. ‘సైరా’ నిర్మాణంలో ఉపాసన పాత్ర ఏం లేదు. నా డైట్ విషయంలో మాత్రం ఉంది. ఈ మధ్య వైఫ్స్ అందరూ అదే చేస్తున్నారు (నవ్వుతూ). నేను ఎక్కువగా డైట్ చేయను. నార్మల్‌గా నేను ఇంట్లో బాగానే తింటాను. ∙నా పేరుతో డైలాగ్ చేప్పే ముందు, ఆ తర్వాత పెద్ద సీన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్లో నాకు పెద్ద సమస్యగా అనిపించలేదు. నాన్నగారు(చిరంజీవి) బోయపాటిని పిలిచి ఓ జోక్ వేశారు. ఎవరి పర్మిషన్ తీసుకుని ఈ పేరు పెట్టారు అని (నవ్వుతూ). నాన్నగారు ఈ సినిమా ఈవెంట్లో ఆ డైలాగ్‌ను నాకన్నా పదిరెట్లు బాగా చెప్పారనిపించింది. షాకింగ్‌గా అనిపించింది. ∙ప్రతి సినిమా ‘రంగస్థలం’ లానే రావాలంటే కష్టం అవుతుంది. కథ విన్నప్పుడు ఆడియన్‌గా నాకు ఆసక్తికరంగా అనిపించాలి. దర్శకుడు క్లారిటీగా ఉన్నారనిపిస్తే తప్పకుండా చేస్తాను. ‘రంగస్థలం’లాంటి మంచి సినిమా చేసినప్పుడు ఆర్టిస్టుగా నా కాన్ఫిడెన్స్‌లో మార్పు వచ్చింది. కానీ అది మరింత పెద్దగా అని చెప్పలేను. ∙గతేడాది సమ్మర్లో రిలీజైన ‘రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల కలెక్షన్స్ విషయంలో చిన్న డిస్ట్రబెన్సెస్ వచ్చాయి. అది అవరసమా? అనిపించింది. హ్యాపీగా అందరం మంచి సినిమాలు చేశాం. నిర్మాతలకు మంచి డబ్బులు వచ్చాయి. ఈ కలెక్షన్స్ విషయంలో పోటీ ఎందుకు? అనిపించింది. పోటీ ఉంటే క్యారెక్టర్స్ విషయంలో ఉండాలి. సినిమాలు ఇంకా బాగా చేయాలనే విషయంలో పోటీ ఉండాలి. నిర్మాతలకు డబ్బులు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. మధ్యలో అభిమానులు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిర్మాతగా కన్నా ఫ్యాన్స్ ఈగర్‌గా ఉంటారు. నా వైపు నుంచి నేను చెప్పాను. కలెక్షన్స్ విషయంలో అంత ప్రెజర్ లేదు అని. రేపు నిర్మాతలు పెట్టుకుంటే అది వారి ఇష్టం. ఎందుకంటే ఇది వారి సినిమా. ∙నాలో మార్పు వచ్చింది అంటున్నారు. అయితే నాకు పెద్ద మార్పేం అనిపించడంలేదు. సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతుంటాను. మహేశ్, తారక్ వంటి వాళ్లతో నేను బాగా కలిసిపోతాను. సోషల్æమీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ విషయం బయటకు తెలుస్తోంది. నాన్నగారు కూడా చెన్నైలో ఉన్నప్పుడే అందర్నీ కలిసేవారు. అదే ఫాలో అవుతున్నాను. ∙నా స్టాఫ్‌ను బాగా చూసుకుంటే నాకు బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తారని నా ఆలోచన. అందుకే నా టీమ్‌కి బహుమతులు ఇవ్వాలనుకుంటాను. నిర్మాతగా, యాక్టర్‌గా ఉంటడం వల్ల చిన్న స్ట్రెస్ ఉంటుంది. ఈ సినిమా, ‘సైరా’ రిలీజ్ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’కు 150పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నాను. ∙దానయ్యగారు గట్స్ ఉన్న నిర్మాత. తివ్రిక్రమ్గారితో దానయ్యగారి నిర్మాణంలో నాన్నగారు ఓ సినిమా చేస్తారు. ఈ సినిమా కంటే ముందు కొరటాల శివగారితో సినిమా చేస్తారు నాన్నగారు. నేనూ శివగారు చేయాల్సింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ వల్ల నాన్నగారితో శివగారు చేస్తున్నారు. లేటైనా శివగారితో నా సినిమా ఉంటుంది. ∙రాజమౌళిగారు ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ‘ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా?’ని నేను, ఎన్టీఆర్ షాకయ్యాం. నేను సైలెంట్‌గా ఉన్నాను. తారక్ బాగా ఎగై్జటయ్యాడు. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం యు.ఎస్. వెళ్లాం. ∙కొణిదెల ప్రొడక్షన్స్‌లో వేరే వారితో సినిమాలు చేయాలనుకోవడం లేదు. నాన్నగారి కోసమే అనుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీలో నేను మా నాన్నగారికి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎవ్వరూ ఇవ్వలేరని చెప్పగలను. ఈ సినిమా ప్రీ–రి లీజ్ ఈవెంట్లో టీఆర్ఎస్ నేత కేటీఆర్ ‘మీలో రాజకీయ నాయకుడికి ఉండ వలసిన లక్షణాలు ఉన్నాయని కితాబు ఇచ్చారు కదా! అలాంటి ఆలోచన మీకేమైనా ఉందా?’ అని చరణ్‌ని అడిగితే, ‘‘ఆయన యాక్టింగ్ చేయకూడదు. నేను పాలిటిక్స్ చేయకూడదు’’ అన్నారు. ‘సైరా: నరసింహారెడ్డి’ విషయంలో అన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయని చెప్పడం లేదు. పెద్ద సినిమాలు చేసేటప్పుడు కొన్నిసార్లు డేట్స్ కావొచ్చు, ప్రొడక్షన్లో కావొచ్చు... ఇలా చాలా కారణాలు ఉంటాయి. ‘రంగస్థలం’ సినిమా సెట్‌ను రీ డెకరేట్ చేసి ‘సైరా’కు వాడుకుందాం అనుకున్నాం. ల్యాండ్ ఓనర్‌కు ఏదో ప్రాబ్లమ్ ఉండి ఆపారు అంతే. అనుకున్న బడ్జెట్‌తో జరుగుతోంది. ఓవరాల్‌గా బాగానే జరుగుతోంది. చెప్పుకోదగ్గ సమస్య లేదు. రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. రీ షూట్స్ జరగడంలేదు. రీ షూట్స్ చేసేంత డబ్బు లేదు. దసరాకు రిలీజ్ కావొచ్చు. 200 కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుంది. చేయాల్సినౖ టెమ్లోనే చేస్తున్నాం. -
‘సైరా’ రిలీజ్ డేట్ చెప్పిన చరణ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎందిరించిన మొట్ట మొదటి తెలుగు నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. తల్లి కోరిక మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తన తండ్రికి కానుకగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సైరా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు ఓ అప్డేట్ ఇచ్చాడు చరణ్. వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చరణ్, సైరాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, తమన్నా, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
అలాంటి చోట.. ఆయన షర్ట్ లేకుండా ఉన్నారు : ఉపాసన
-
అలాంటి చోట.. ఆయన షర్ట్ లేకుండా ఉన్నారు : ఉపాసన
మిష్టర్ సీ.. షర్ట్ లేకుండా లొకేషన్లో వర్కౌట్లు చేసేస్తున్నాడట. ఇంతకీ మిష్టర్ సీ అంటే తెలుసుగా.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీని ముద్దుగా మిష్టర్ సీ అంటుంటారు. వినయ విధేయ రామ సినిమాలోని యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో చెర్రీ వర్కౌట్లు చేస్తున్న వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ట్రైలర్లో చూపిన భారీ యాక్షన్ సీన్స్ మెగా ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. షూటింగ్లో యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించే ముందు కసరత్తులు చేస్తున్న వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘గడ్డకట్టేలా చలి ఉంది అయినా అతను షర్ట్ లేకుండా ఉన్నారు. మిష్టర్ సీ నిజమైన హీరో. ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ ఇస్తున్న కంపెనీకి ధన్యవాదాలు. మీ ఫైట్స్ సూపర్‌గా ఉంటాయి’ అంటూ ట్వీట్ చేశారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
ఇదో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్
రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రం 2గంటల 26 నిమిషాల నిడివి ఉందని సమాచారం. అలాగే ఈ సినిమాలోని ‘రామా లవ్స్ సీత..’ పాటను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా గురించి రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో బ్యూటిఫుల్ అండ్ బ్యాలెన్డ్స్ క్యారెక్టర్ చేశాను. పూర్తి స్థాయి మాస్ ఫిల్మ్‌లా ఉంటుంది. మంచి కుటుంబ కథా చిత్రం కూడా. సినిమాలో అజర్ బైజాన్ లొకేషన్స్‌ను నేపాల్–బీహార్ సరిహద్దు ప్రాంతంలా చూపించాం. కియారా ఫైన్ ఆర్టిస్టు. ఆ అమ్మాయి కళ్లతో మంచి హావభావాలు పలికించగలదు. మంచి డ్యాన్స్ పార్టనర్. ‘రామా లవ్స్ సీత’ సాంగ్ విజువల్‌గా హైలైట్‌గా ఉంటుంది. ప్రశాంత్, స్నేహ, వివేక్ ఒబెరాయ్గార్లతో పనిచేయడం నాకు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది. లొకేషన్లో బాగా ఎంజాయ్ చేశాం కూడా. పెద్ద సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు దానయ్యగారు. ఆయనతో చేస్తే మా హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో చేసినట్లే ఉంటుంది. బోయపాటిగారు మంచి కన్విక్షన్‌తో సినిమా చేస్తారు’’ అన్నారు. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి చెబుతూ– ‘‘ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే సర్ప్రైజ్ కాలేదు. సెట్లో ఎలా ఉంటామని కూడా ఆలోచించలేదు. బయట మేం మంచి స్నేహితులం. అదే షూటింగ్లో కూడా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది’’ అని పేర్కొన్నారు. -
హోమ్‌ఫుడ్ ఇస్తే ఫ్రెండ్ అయిపోతా
‘‘నాకు నార్త్ అండ్ సౌత్ అనే తేడా లేదు. యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేస్తూ గ్లోబల్ ఆడియన్స్‌కు రీచ్ అవ్వాలన్నదే నా లక్ష్యం. వీలైనంతమంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌వైపు కూడా ముందుకు అడుగులు వేస్తున్నాను. ‘బాహుబలి’ చిత్రం భాషాభేదాలను చెరిపేసింది. ప్రస్తుతం ద్విభాషా, త్రిభాషా చిత్రాలు కూడా రూపొందుతున్నాయి’’ అని కియారా అద్వానీ అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందిన సినిమా ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా కియారా అద్వానీ చెప్పిన సంగతులు. ► ‘భరత్ అనే నేను’ సినిమాలో నేను చేసిన వసుమతి క్యారెక్టర్‌కి ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నా సీత క్యారెక్టర్‌కి డిఫరెన్స్ ఉంది. మంచి మాస్ కమర్షియల్ సినిమా ఇది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉంటుంది సీత. అదే ఎవ్వరూ లేకుండా రాముడు మాత్రమే ఉన్నప్పుడు డామినేట్ చేయాలని చూస్తుంది. అప్పుడు సీతనే బాస్ అన్నమాట (నవ్వుతూ). సినిమాలో రామ్‌చరణ్‌కి, నాకు మంచి కెమిస్ట్రీ కుదిరింది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బోయపాటిగారు బాగా తీశారు. దానయ్యగారు కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ► బోయపాటిగారు ఫస్ట్ టైమ్ ఈ కథ చెప్పినప్పుడు మంచి ఫ్యామిలీ సినిమా చేయబోతున్నాననే ఫీలింగ్ కలిగింది. ప్రశాంత్‌గారు, స్నేహగారు, వివేక్ ఒబెరాయ్గారు.. ఇలా సిల్వర్‌స్క్రీన్‌పై 15 మంది మంచి నటీనటులు కనిపిస్తారీ సినిమాలో. వీరందరితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ప్రతి సినిమాకు ప్రిపేర్ అయినట్లే ఈ సినిమాకు డైలాగ్స్ ప్రిపేర్ అయ్యాను. ఒత్తిడికి గురి కాలేదు. ► తెలుగు సినిమా అయినా, హిందీ సినిమా అయినా డైరెక్టర్ విజన్‌ను నేను పూర్తిగా నమ్ముతాను. సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎంతసేపు ఉందన్నది కాదు. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానా? లేదా? అని మాత్రమే ఆలోచించుకుంటాను. స్క్రీన్‌పై కనిపించే టైమ్‌లో నా పాత్రతో ఆడియన్స్‌ను ఎంత ఎంగేజ్ చేశానన్న అంశాన్నే ముఖ్యంగా భావిస్తాను. క్వాలిటీ బాగా రావాలని కోరుకుంటాను. ► చిన్నప్పటి నుంచే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. భరతనాట్యం, కథక్‌లలో ప్రవేశం ఉంది. ఈ సినిమాలో బాగా డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఇక రామ్‌చరణ్‌గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో మీ అందరికీ తెలుసు. సాంగ్స్ షూట్ టైమ్‌లో టీమ్ నుంచి నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ‘రామా లవ్స్ సీత, తస్సాదియా...’ సాంగ్స్ నా ఫేవరెట్. ► యాక్టర్స్ అందరికీ మంచి టైమ్ వస్తుంది. ‘ఎమ్ఎస్. ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమాలో సాక్షి మహేంద్రసింగ్ పాత్ర చేశాను. ఆ టైమ్‌లో ధోని సినిమా సాక్షి కదా అన్నారు కొందరు. హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ‘భరత్ అనే నేను’ సినిమాలో అవకాశం వచ్చింది. మహేశ్‌బాబు కో–స్టార్ అంటే తెలుగులో ఒక హీరోయిన్‌కి ఇంతకన్నా డ్రీమ్ లాంచ్ ఏం ఉంటుంది? అనిపించింది. నాకు టర్నింగ్ పాయింట్ అనిపించింది. ► బాలీవుడ్లో కరణ్‌జోహార్‌కి పెద్ద అభిమానిని నేను. ఓ రోజు ఆయన డైరెక్ట్‌గా కాల్ చేశారు. ఏదో పార్టీ అనుకున్నాను. కానీ ఆయన ‘లస్ట్ స్టోరీస్’లో నేను చేయనున్న పాత్రకు తాను డైరెక్ట్ చేయనున్నట్లు చెప్పారు. అది చిన్న మినీ ఫిల్మ్‌లా అనిపించింది. సెన్సిబిలిటీగా, నెర్వస్‌గా అనిపించింది. ఆడిషన్ కూడా చేయలేదు. డైరెక్ట్‌గా సెట్లోకి వెళ్లిపోయాం. ఈ వెబ్ సీరీస్‌తో నాకు ఫీమేల్ ఆడియన్స్‌లో గుర్తింపు పెరిగింది. ► విజయ్ దేవరకొండకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మంచి టాలెంటెడ్ యాక్టర్. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నాను. ఆడియన్స్ పోలిక పెడతారని తెలుసు. కబీర్ (షాహిద్ కపూర్), ప్రీతి క్యారెక్టర్స్‌ను ఆడియన్స్ ఇష్టపడతారని అనుకుంటున్నాను. మేం కష్టపడుతున్నాం. సందీప్ వంగాగారు ప్యాషనేట్ డైరెక్టర్. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్లు అక్కడక్కడ మార్పులు చేశాం. ► మహేశ్‌బాబు, రామ్‌చరణ్ ఫ్యామిలీ ఓరియంటెండ్ పీపుల్. అందుకే వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మంచి రిలేషన్ ఉంది నాకు. ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ టైమ్‌లో నమ్రత, మహేశ్‌బాబు, సితారలతో స్నేహం ఏర్పడింది. ‘వినయ విధేయ రామ’ టైమ్‌లో చరణ్, ఉపాసనలతో రిలేషన్ కుదిరింది. హోమ్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా హోమ్‌ఫుడ్ ఇస్తే ఇట్టే ఫ్రెండ్ అయిపోతా(నవ్వుతూ). ► బాలీవుడ్లో ‘కళంక్’ చేశా, ‘గుడ్‌న్యూస్, కబీర్‌సింగ్’ చేస్తున్నా. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. నా పాత్ర ఆసక్తికరంగా ఉండే మంచి సినిమాల్లో నేను భాగమైతే అంతే చాలు. -
ఉపాసన చేసిన వంటకం వైరల్
-
భర్త అంటే ఎంత ప్రేమో..!
టాలీవుడ్ సెలబ్రెటీ కపుల్స్‌లో రామ్ చరణ్-ఉపాసనలది ప్రత్యేకం. తన భర్తకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులకు చేరవేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఉపాసన. డైట్ విషయంలో, న్యూట్రిషన్ ఫుడ్‌పై తనకు ఉన్న అవగాహన గురించి సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. అసలే తన భర్త డైటింగ్‌లో ఉన్నాడు.. టైమ్‌కు సరైన డిష్ ఉండాలి..అని ఆలోచించి.. ఉపాసన చేసిన వంటకం వైరల్ అవుతోంది. ‘వీవీఆర్’ షూటింగ్లో రామ్ చరణ్ బిజీగా ఉండగా.. ఆయన అసిస్టెంట్ పక్కనే ఉన్న సరస్సుల్లోంచి చేపను పట్టుకొచ్చారు. అయితే ఈ డిష్‌ను ఉపాసన కారం, ఉప్పు లేకుండా ఆలీవ్ ఆయిల్, నిమ్మకాయను వాడి వండారు. స్వీట్ పొటాటో లేకపోయేసరికి మాములు పొటాటోను ఉడకబెట్టి ఇచ్చారు. శ్రీవారి డైట్ విషయంలో ఉపాసన చూపించే శ్రద్ధ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోన్న చిత్రయూనిట్.. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయనుంది.