atmakur by election
-
జనం.. వైఎస్సార్సీపీ పక్షం
సాక్షి, అమరావతి: ఎన్నిక ఏదైనా పోటీ ఏకపక్షమే.. ఘన విజయం వైఎస్సార్సీపీదే.. ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ప్రజాదరణతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ సహా ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడుతున్నాయి. ఇదీ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాన్ని సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి సామాజిక న్యాయానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ఓట్ల శాతం ► పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. మూడేళ్లలో జరిగిన తిరుపతి లోక్‌సభ.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లోనూ ఏకపక్షంగా ఘన విజయం సాధించింది. ► 2019లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో 13,16,473 ఓట్లు (79.76 శాతం) పోలైతే.. వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ 7,22,877 ఓట్లు (55.03 శాతం) సాధించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 4,94,501 (37.65 శాతం) ఓట్లు దక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ 2,28,376 ఓట్ల ఆధిక్యంతో అప్పట్లో విజయం సాధించారు. ► బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి 2021 ఏప్రిల్ 27న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో 11,05,468 (64.60 శాతం ఓట్లు పోలైతే.. వైఎస్సార్సీపీకి 6,26,108... 56.67 శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీకి 3,54,516 (32.09 శాతం.. బీజేపీ–జనసేన అభ్యర్థికి 5.17 శాతం) ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 2,71,592 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ► తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో చావు దెబ్బ తినడంతో.. ఆ తర్వాత జరిగిన బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబు దూరంగా ఉన్నారు. సవాల్ విసిరినా స్వీకరించలేని దైన్యం ► టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో.. సంప్రదాయానికి భిన్నమైనా.. బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ సవాల్ విసిరితే, ఘోర పరాజయం తప్పదనే భయంతో చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారు. ► నేరుగా బరిలోకి దిగకుండా వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి.. మెజార్టీ తగ్గించేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు పలుకుతూ.. ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. ► బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య హఠాన్మరణం వల్ల జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య డాక్టర్ సుధను వైఎస్సార్సీపీ బరిలోకి దించింది. టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ–జనసేన పొత్తుతో పోటీ చేశాయి. ఎన్నికల్లో తమ ఏజెంట్లను బూత్‌ల్లో పెట్టి పరోక్షంగా వారి అభ్యర్థికి టీడీపీ పరోక్షంగా మద్దతు పలికింది. ► 2021 అక్టోబరు 30న ఎన్నికలు జరిగితే నంబర్ 2న ఫలితాలు వెల్లడించారు. అంటే ప్రభుత్వం ఏర్పాటైన సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 90,533 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 76.25 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయి. ► 2019 ఎన్నికలతో పోల్చితే.. వైఎస్సార్సీపీకి 15.33 శాతం ఓట్లు పెరిగాయి. అప్పట్లో పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీకి 60.89 శాతం రాగా.. 44,734 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 14.27 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ► 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్ రెడ్డి 22,276 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పట్లో పోలైన ఓట్లలో 53.22 శాతం ఓట్లు సాధించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో అతని సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. బీజేపీ అభ్యర్థి తరఫున పలు గ్రామాల్లో ఆ పార్టీ నేతలను పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా కూర్చోబెట్టి.. పరోక్షంగా మద్దతు పలికింది. ► అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం (1,02,241) ఓట్లు సాధించిన విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ కేవలం 14.1 శాతం ఓట్లకు పరిమితమై.. డిపాజిట్ కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రక విజయాలు ► పంచాయతీ.. మండల పరిషత్, జిల్లా పరిషత్.. మున్సిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికల్లో నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డను అడ్డు పెట్టుకుని.. వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయని కుట్ర లేదు. ఆ కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10,536 పంచాయతీలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు దక్కించుకుంటే.. టీడీపీ మద్దతుదారులు కేవలం 2,100 పంచాయతీలకు పరిమితమయ్యారు. ► రాష్ట్రంలో 649 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 637 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కేవలం 9 స్థానాలకు టీడీపీ పరిమితమైతే.. జనసేన ఒక స్థానంలో ఉనికిని చాటుకుంది. దాంతో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్‌లను ఒకే పార్టీ కైవసం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ► రాష్ట్రంలో 9,654 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 8,264 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తే.. టీడీపీ కేవలం 955 స్థానాలకు చిక్కిపోయింది. జనసేన కేవలం 182 స్థానాలకు, బీజేపీ 32 స్థానాలకు పరిమితమైంది. ► రాష్ట్రంలో 87 మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహిస్తే 84 స్థానాల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. 13 కార్పొరేషన్లలోనూ క్లీన్ స్వీప్ చేసింది. -
వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలో భాగంగా ఈ నెల 23న పోలింగ్ నిర్వహించారు. 1,37,289 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 64.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధిక్యత సాధించారు. సరాసరి ప్రతి రౌండ్లో 4 వేల ఓట్ల ఆధిక్యత దక్కించుకున్నారు. అధికార పార్టీకి బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్లో సైతం వైఎస్సార్సీపీ సత్తా చాటింది. 208 పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీకి 167 ఓట్లు లభించాయి. బీజేపీకి 21, నోటాకు 3, బీఎస్పీకి 7, ఇతరులకు 10 ఓట్లు లభించాయి. ఫ్యాన్ గాలికి బీజేపీ గల్లంతు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ సునామీకి బీజేపీ గల్లంతయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్, కేంద్ర మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ నేతలు ఆత్మకూరులో తిష్టవేసి కోలాహలంగా ఎన్నికల ప్రచారం చేశారు. అధికార వైఎస్సార్సీపీపై అనేక అభాండాలు వేస్తూ ప్రచారం సాగించారు. బీజేపీ ఆరోపణలను ప్రజలు నిర్మొహమాటంగా తోసిపుచ్చారు. కేవలం 19,353 ఓట్లు మాత్రమే దక్కించుకుని 14.1 «శాతానికి ఆ పార్టీ పరిమితమైంది. తిరుపతి పార్లమెంటు, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్టు కోల్పోయిన బీజేపీ.. తాజాగా మూడోసారి ఆత్మకూరులోనూ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా కూర్చొన్నప్పటికీ వారి ఆటలు సాగలేదు. ఓటర్లు ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ.. అనైతిక మద్దతుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఎన్నికల అధికారి హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకుంటున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి అపారంగా పెరిగిన ఓటర్ల మద్దతు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటర్ల మద్దతు ఆపారంగా పెరిగింది. పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయినప్పటికీ మంచి మెజార్టీ సాధించడం ద్వారా నేతలు సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో 83.38% పోలింగ్ అయ్యింది. ఈ ఉప ఎన్నికలో కేవలం 64.26 శాతానికే పోలింగ్ పరిమితమైంది. ఓటర్లు పోలింగ్‌కు వెళితే వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తారనే కారణంగా టీడీపీలోని ఓ సామాజిక వర్గం నేత, తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ట్రాక్టర్లలో నెర్రవాడ వెంగమాంబ తిరునాళ్లకు తరలివెళ్లేలా ప్రేరేపించారు. మర్రిపాడు, సంగం, ఆత్మకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున తిరునాళ్లకు వెళ్లడంతో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం వైఎస్సార్సీపీకి దక్కాయి. 2019లో 53.22 శాతం ప్రజలు మద్దతుగా నిలిస్తే, ఇప్పుడు అందుకు అదనంగా 21.25 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై 5,337 ఓట్ల మెజార్టీని సాధించారు. ఈ పరంపర తుది రౌండ్ వరకు కొనసాగింది. ఆత్మకూరు పరిధిలోని 6 మండలాల్లో గణనీయమైన మెజార్టీ దక్కింది. గౌతమ్ అన్న పేరు నిలబెడతా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, పేదల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పట్ల ప్రజలు చూపిన ఆదరణే నా విజయానికి కారణం. ప్రణాళికా బద్ధంగా ఆత్మకూరు ఉన్నతికి కృషి చేస్తాను. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. నా విజయం కోసం విశేషంగా కృషి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులకు ధన్యవాదాలు. – మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆత్మకూరు -
‘విషం మద్యంలో లేదు.. మీ బుర్రలో ఉంది’
సాక్షి, అమరావతి: ఎన్నిక ఏదైనా ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయంపై ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు. చదవండి: ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్.. ‘‘తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలుస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు భారీ మెజార్టీ అందిస్తున్నారు. మధ్యవర్తి ప్రమేయం లేకుండా రాష్ట్రంలో నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయి. మద్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. మద్యంలో కాదు.. టీడీపీ మెదడులోనే విషం ఉంది. టీడీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఈ కుట్రలు. టీడీపీ విష ప్రచారంతో మాపై ఉన్న అభిమానం తగ్గిపోదు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు’’ అని అంబటి రాంబాబు అన్నారు. ‘‘మద్యంపై దుష్ట చతుష్టయం విష ప్రచారం చేస్తోంది. మద్యంలో విషపూరిత పదార్థాలు లేవని గతంలోనే తేలింది. విషం మద్యంలో లేదు.. మీ బుర్రలో ఉంది. ప్రజలను వైఎస్సార్సీపీ పార్టీకి దూరం చేయాలని ప్రతిపక్షాలు కుట్ర. బూమ్‌బూమ్, ప్రెసిడెంట్ మెడల్స్ చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. మేము వచ్చాక ఒక్క డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు. సంక్షేమ కార్యక్రమాలు ఆపడానికే టీడీపీ కుట్రలు. ఎన్ని కుట్రలు చేసినా ఆత్మకూరులో మా విజయాన్ని ఆపలేకపోయారని’’ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. -
ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
సాక్షి, తాడేపల్లి: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్‌ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామ రక్ష అంటూ సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష! (2/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022 -
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు -
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: 82 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ విజయం
-
ఆత్మకూరులో టీడీపీ వక్ర బుద్ధి బయటపడ్డ ఫోటోలు, వీడియోలు
-
ఆత్మకూర్ బైపోల్.. 62 శాతం పోలింగ్
-
ఆత్మకూరు పోలింగ్: బయటపడ్డ టీడీపీ బండారం
సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. సాంప్రదాయ పద్దతంటూ పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ.. బద్వేల్ తరహాలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. పోలింగ్ రోజు టీడీపీ బండారం బయటపడింది. ఆత్మకూరు, అనంత సాగరం, మర్రిపాడు, సంగం, ఏఎస్ పేట, చేజర్ల మండలాల్లో పలు చోట్ల టీడీపీ నేతలు.. బీజేపీ ఏజెంట్ల అవతారమెత్తారు. చదవండి: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్ పోలింగ్ జరిగింది. పోలింగ్ పక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఈనెల 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలు
-
ఓటేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రారంభం
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
-
కాసేపట్లో ఆత్మకూరు పోలింగ్
-
పోలింగ్ కు సర్వం సిద్ధం
-
ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి
ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాల్లో ఏపీఎస్పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్ స్టాఫ్ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్ అధికారులు 38 మంది మాస్టర్ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు. ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటరు స్లిప్‌లు పంపిణీ జరిగిందన్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డు ఓటరు ఐడీ లేదా ఆధార్ బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, విద్యుత్ వసతులు ఏర్పాటు చేసినట్లు, సజావుగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడంతో అధికారుల ఆదేశాల మేరకు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నియోజకవర్గయేతరులు వెళ్లిపోవాలని ఆర్వో, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. పక్షం రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టంగా చేపట్టాయి. వైఎస్సార్సీపీ మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పనితీరు, సంక్షేమ పాలనకు దర్పంగా ఆత్మకూరు తీర్పు ఉండాలని ప్రజల్ని కోరారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అండగా నిలిచినట్లే ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆశీర్వదించాలని గ్రామాలను చుట్టేస్తూ ప్రజల్ని కోరారు. అర్హతే ప్రామాణికంగా అందించిన సంక్షేమ పాలన కారణంగా ఘనమైన మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. సంకటస్థితిలో బీజేపీ తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తరహాలో ఆత్మకూరులోనూ బీజేపీ అగ్రనేతలంతా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ వ్యవహారాల ఇన్చార్జితో పాటు, రాజ్యసభ సభ్యులు,, మాజీ కేంద్ర మంత్రులు ఆత్మకూరులో తిష్ట వేసి ఆ పార్టీ శ్రేణులను నడిపించారు. బీజేపీ అభ్యరి్థని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాగా అభ్యర్థి భరత్‌కుమార్ నాన్‌లోకల్ కావడంతో ఆ సమస్య బీజేపీని వెంటాడుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీస పరువు నిలుపుకునే స్థాయిలో ఓట్లు దక్కితే చాలు అన్నట్లు ఆ పార్టీ నేతల వైఖరి కనిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీరికి ఈ దఫా బీఎస్పీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. గతంలో కాస్తా తక్కువ ఓట్లతో బీజేపీ కంటే వెనుకబడిన బీఎస్పీ ఈ దఫా అధిగమించేందుకు విశేషంగా ప్రయత్నించింది. ఆ మేరకు ప్రజల చెంతకు చేరి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. మెజార్టీపైనే అందరి అంచనాలు నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జి భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థి ఎన్ ఓబులేసులు ప్రధానంగా తలపడుతుండగా బరిలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరిగి పార్టీ అమలు చేస్తున్న నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 2,13,138 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా 1,07,367 కాగా, పురుష ఓటర్లు 1,05,960 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం ఓ ట్లు పోల్ కాగా, ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదు అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం -
రేపు ఆత్మకూరు ఉపఎన్నికల పోలింగ్
-
ఆత్మకూరు ఉపఎన్నికల్లో ముగిసిన ప్రచారం
-
సంక్షేమ పథకాలై విక్రమ్ ను గెలిపిస్తాయి
-
ప్రజలు నాకు అడుగడుగునా మద్దతుగా నిలుస్తున్నారు
-
రిగ్గింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది ??
-
నెల్లూరు ఉప ఎన్నిక.. ముగిసిన ప్రచార పర్వం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. 23న జరగనున్న పోలింగ్‌పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్‌లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.