Banwarilal Purohit
-
పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచారు. ‘‘వ్యక్తిగత కారణాలతోపాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్ గవర్నర్ పదవితోపాటు, చండీగఢ్ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమరి్పస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్ బాధ్యతలు చేపట్టారు. -
పంజాబ్ గవర్నర్ పదవికి బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా
చంఢీఘర్: పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ గవర్నర్ పదవి, కేంద్ర పాలిత ప్రాంతం ఛండీఘర్ అడ్మినిస్ట్రేటర్ పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు పంపిన రాజీనామా పత్రంలో.. తన రాజీనామాను దయచేసి అంగీకరించాలని కోరారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం పంపిన పలు బిల్లులను ఆమోదించటంలో జాప్యం చేస్తున్న నేపథ్యంలో బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్ పదవి రాజీనామా చేశారు. నవంబర్ 10, 2023లో పంజాబ్ అసెంబ్లీ పంపిన ఐదు బిల్లులను బన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలపకుండా జాప్యం చేశారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేయటాన్ని నిలదీసింది. అప్పటి నుంచి పంజాబ్ ప్రభుత్వానికి.. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం చంఢీఘర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఇక.. అమిత్ షాను కలిసిన మరుసటి రోజు బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్ పదవికి రాజీనామా చేయటంపై చర్చ జరుగుతోంది. Punjab Governor and Chandigarh Administrator Banwarilal Purohit resigns due to "personal reasons and certain other commitments." pic.twitter.com/0o05k6Hn6p — ANI (@ANI) February 3, 2024 -
సీఎం మాన్కు గవర్నర్ ఘాటు లేఖ.. ఆప్ సీరియస్
చండీగఢ్: ఆప్ సర్కార్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్‌లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకొన్నాయి. తాను పంపిన లేఖలకు సీఎం భగవంత్ మాన్ సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్.. రాష్ట్రపతి పాలన పెట్టిస్తానని, ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తానని హెచ్చరించారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల ప్రకారం.. సీఎం భగవంత్ మాన్కు పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం మాన్‌ను గవర్నర్ హెచ్చరించారు. తన లేఖలకు సమాధానం ఇవ్వకుంటే ఐపీసీలోని సెక్షన్ 124 కింద క్రిమినల్ చర్యలు కూడా తీసుకొంటానని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. తాను గతంలో రాసిన లేఖలకు మీరు(సీఎం మాన్) సమాధానం ఇవ్వకపోవడం పట్ల చాలా కలత చెందానని గవర్నర్ తన తాజా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తానని హెచ్చరించారు. పొలిటికల్ హీట్.. అంతేకాకుండా.. శిక్షణ నిమిత్తం 36 మంది పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను విదేశాలకు పంపడంతో పాటు పలు ఇతర అంశాలపై తాను గతంలో రాసిన లేఖ ద్వారా సమాచారం కోరానని, అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమస్యను నివారించేందుకు తీసుకొన్న చర్యలపై వివరాలు కోరానని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా సమాధానం నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గవర్నర్ పురోహిత్ లేఖపై ఆప్ ఘాటుగా స్పందించింది. గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పంజాబ్‌కు బదులు మణిపూర్, హర్యానాలో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.. వీలైతే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సూచించింది. ఇది కూడా చదవండి: రైలు బోగీలో పేలిన సిలిండర్.. పలువురు మృతి -
గవర్నర్‌ను కలిసిన ఆప్ శాసనసభాపక్ష నేత భగవంత్ మాన్
-
రాజ్‌భవన్‌లో గవర్నర్ పురోహిత్‌ను కలిసిన చన్నీ
-
పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు ఉత్తరాఖండ్‌కు రాష్ట్రపతి కొత్త గవర్నర్‌ను నియమించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్ పురోహిత్‌ను పంజాబ్ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు ఆయన పంజాబ్ గవర్నర్ బాధ్యతలు అదనంగా పర్యవేక్షిస్తున్నారు. నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్ఎన్ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అసోం గవర్నర్ జగదీశ్ ముఖికి నాగాలాండ్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఇటీవలే ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్న మౌర్య రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గురి్మత్ సింగ్‌ను నియమించారు. 2016లో సింగ్ ఆర్మీ నుంచి రిటైరయ్యారు. చైనాతో మిలటరీ వ్యవహారాల్లో ఆయన అనుభవజ్ఞుడు. -
M K Stalin: తమిళనాడు సీఎం బహిరంగ లేఖ
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆదివారం ప్రజలకు బహిరంగ ఉత్తరం రాశారు. ‘‘తమిళనాడు ప్రగతిపై నేను కన్నకలలు నెరవేర్చుకునే మంచి అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నాను. ప్రజలు కోరుకునే సుపరిపాలన అందిస్తానని హామీ ఇస్తున్నాను. పదేళ్ల కష్టాలు, కన్నీళ్లను తుడిచేందుకు ప్రయత్నిస్తా’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఆ ఉత్తరంలోని ప్రధాన అంశాలు.. ‘‘మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే విశ్వాసంతోనే సీఎంగా బాధ్యతలు స్వీకరించి విధుల్లోకి దిగాను. ప్రభుత్వ బాధ్యత అనేది పూలపాన్పుకాదు, ముళ్ల పాన్పు. కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకోవడం ద్వారా వారి సమస్యలపై అవగాహన పెంచుకున్నాను. వీటిల్లో ఏ ఒక్కటీ విస్మరించకుండా నెరవేర్చే అవకాశం నాకు దక్కింది. అన్ని రంగాల అభివృద్ధిలో తమిళనాడును అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు మళ్లీ తలెత్తుకునేలా చేయాలి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం నా కర్తవ్యం. పదేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలతో మోసపోయిన ప్రజలు నా నుంచి ఎంతో ఆశిస్తున్నారని అర్థం చేసుకోగలను. గతాన్ని తలుచుకుని చింతించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చీకటిని తిట్టుకునేకంటే దాన్ని పారద్రోలే దీపాన్ని వెలిగించడం మంచి లక్షణం. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ కష్టకాలాన్ని ఒక సవాల్‌గా తీసుకుంటున్నాను. పారదర్శక పాలన అందిస్తాను. విజయోత్సవం జరుపుకునే తరుణం కాదు, కష్టాల్లో ఉన్నవారికి భరోసా కల్పించాల్సిన సమయం’’ అని పేర్కొన్నారు. డీఎంకే కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీలతో స్నేహితుల్లా మెలగాలని కోరారు. రేపే తొలి అసెంబ్లీ తమిళనాట ఎన్నికలు ముగిసిన తర్వాత డీఎంకే నేతృత్వంలో తొలి అసెంబ్లీ సమావేశం మంగళవారం జరగనుంది. చెన్నైలోని కలైవానర్ అరంగంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో 16వ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వకారం చేయిస్తారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటారు. అడ్వకేట్ జనరల్‌గా షణ్ముగ సుందరం తమిళనాడు అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది షణ్ముగసుందరం నియమితులయ్యారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనేది ముఖ్యమైన పదవుల్లో ప్రధానమైనది. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన న్యాయ సలహాలను అడ్వకేట్ జనరల్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్‌గా వ్యవహరించిన విజయనారాయణన్ ప్రభుత్వం మారగానే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో డీఎంకేకు చెందిన షణ్ముగ సుందరంను ప్రభుత్వం నియమించింది. ప్రొటెం స్పీకర్‌గా కే పిచ్చాండి కీళ్‌పొన్ను ఎమ్మెల్యే కే.పిచ్చాండిని అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ నియమించినట్లు అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్‌భవన్‌లో పిచ్చాండితో గవర్నర్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయిస్తారని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో పిచ్చాండి స్పీకర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ప్రమాణం చేయిస్తారని వెల్లడించారు. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు పిచ్చాండి పదవిలో కొనసాగుతారు. -
శాసనసభాపక్ష నేతగా స్టాలిన్ ఎన్నిక
చెన్నె: పదేళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారం చేపట్టనుంది. ఆ పార్టీ శాసనసభ పక్షనేతగా డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేయాలని గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ స్టాలిన్‌కు ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా తొలిసారి స్టాలిన్ ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు కొద్దిమంది సమక్షంలోనే గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో స్టాలిన్ ప్రమాణం చేయనున్నారు. స్టాలిన్‌తో పాటు కొద్ది మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేయనున్నారని డీఎంకే అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి ఏకంగా స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ కన్నా అధిక సీట్లు ఉన్న డీఎంకేను అధికారం చేపట్టాలని గవర్నర్ ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్‌భవన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు బుధవారం ఉదయం స్టాలిన్‌ను తమ ఎమ్మెల్యేలంతా తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న పత్రాన్ని గవర్నర్‌కు అందించారు. చదవండి: కరోనాపై యుద్ధం ప్రకటించిన మమత చదవండి: కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌కు శాసనసభ పక్ష తీర్మాన ప్రతిని అందిస్తున్న కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ -
హత్యా బెదిరింపులు.. గవర్నర్ ఉక్కిరిబిక్కిరి
గవర్నర్ హోదా అంటే పూలపాన్పు కాదు.. పదునైన ముళ్లపై పాదరక్షలు లేని కాలినడకేనని తమిళనాడు గవర్నర్లకు తరచూ అనుభవం ఎదురవుతోంది. తాజాగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సైతం అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకోలేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. చివరకు బదిలీ అయ్యేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలపై ఆంతర్యమేమిటోనన్న ప్రశ్న తలెత్తుతోంది. సాక్షి, చెన్నై : వేర్వేరు రాష్ట్రాల వారు తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన వారిలో అధికశాతం కత్తిమీద సాము పరిస్థితిని ఎదుర్కొన్నారు. లౌక్యం తెలిసిన ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ప్రభుత్వంపై మింగుడు పడలేకపోయారు. ప్రస్తుత గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు సైతం అదే పరిస్థితులు ఎదరయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ బిల్లుపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ జాప్యం చేయడంతో అధికార, ప్రతిపక్షాలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయి. గవర్నర్ ఆమోదముద్ర కోసం వేచిచూడకుండా రిజర్వేషన్‌పై ప్రభుత్వం జీఓ జారీచేసింది. దీంతో మరో ఆలోచనకు తావివ్వకుండా విధిలేని పరిస్థితుల్లో గవర్నర్ ఆమోదించారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులోని ఏడుగురు శిక్షా ఖైదీల విడుదలపై గవర్నర్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. రెండేళ్లయినా ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ అభీష్టంతో నిమిత్తం లేకుండా గవర్నరే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల నియామాకాన్ని చేశారు. ఈ వీసీల్లో కొందరు ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అన్నావర్సిటీ వీసీ సూరప్ప, ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ కారణంగా గవర్నర్ పేరు కూడా రచ్చకెక్కింది. ఇలా తమిళనాడులో జరిగే అనేక వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం తెరపైకి రావడంపై కేంద్రం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ బదిలీకి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పైగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వివాదాల్లో చిక్కుకున్న బన్వరిలాల్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వెళ్లేందుకా..కొనసాగేందుకా? అనేక అంశాల మధ్య నలుగుతున్న గవర్నర్ బన్వరిలాల్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. మూడు రోజులుగా ఢిల్లీలో తిష్టవేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, పార్లమెంటు వ్యవహారాల మంత్రిని ఇప్పటికే కలిశారు. శుక్రవారం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. గవర్నర్ అకస్మాత్తుగా ఢిల్లీ ప్రయాణం వెనుక కారణాలపై అన్వేషణ సాగుతోంది. బదిలీ కోసమా లేక కేంద్రంలో బదిలీ ఆలోచనలకు తెరదించి తమిళనాడులోనే కొనసాగేందుకా ఈ ఢిల్లీ పర్యటన అని చర్చ మొదలైంది. అన్నావర్సిటీ వీసీకి హత్యా బెదిరింపులు అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సూరప్ప హత్యాబెదిరింపులకు గురయ్యారు. అన్నా వర్సిటీకి ప్రత్యేక అంతస్థు కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఆయన ఇటీవల లేఖ రాయడం కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రానికి లేఖరాసిన ఆయనను వీసీ బాధ్యతల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు, అనేక వర్గాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీసీ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ అన్నావర్సిటీకి ప్రత్యేక అంతస్తు అవసరం లేదని కేంద్రానికి లేఖరాసింది. ఈ వివాదాల నేపథ్యంలో వీసీ సూరప్పను తుపాకీతో కాల్చి చంపుతానని వీరప్పన్ అనే పేరుతో వర్సిటీకి ఒక ఉత్తరం చేరింది. చెన్నై కొట్టూరుపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్
చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ సోకింది. తాజాగా భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రి స్పష్టం చేసింది. గవర్నర్‌ను హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచి కొంతమంది డాక్టర్లతో కూడిన బృందం పర్యవేక్షించనుంది. భన్వరిలాల్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే కావేరి ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కావేరి ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు. (ఏపీ రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు రద్దు) జూలై 29వ తేదీన తమిళనాడు రాజ్‌భవన్ సిబ్బందిలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు.తాజాగా ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాజ్‌భవన్‌లో మరోసారి అలజడి రేగింది. అంతకుముందు 84 మంది రాజ్‌భవన్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులు, సెక్యూరిటీ, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లకు చెందిన వారే ఉన్నారు. ఆ క్రమంలోనే రాజ్‌భవన్ ప్రధాన బిల్డింగ్‌లో ఎవరూ కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అదే సమయంలో గవర్నర్‌తో కూడా ఎవరూ కూడా కాంటాక్ట్ కాలేదని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో పలువురు మంత్రులు కరోనా బారిన పడ్డారు. కాగా, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో వివిధ ఆంక్షలతో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారికి ఈ-పాస్ లేనిదే అనుమతించమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష లేనట్లేనా..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలకు క్షమాభిక్ష లేనట్లేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హంతకుల విడుదలను నిరాకరిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మౌఖికంగా చెప్పినట్లు శుక్రవారం ప్రచారం జరగడంతో చర్చనీయాంశం అయింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21న చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో జరిగిన ఎన్నికల ప్రచారం సమయంలో ఎల్టీటీఈ మానవబాంబు చేతిలో హతమయ్యారు. ఈ హత్య కేసుకు సంబంధించి నళిని, మురుగన్, శాంతన్, పేరరివాళన్, రవిచంద్రన్, రాబర్ట్‌పయాస్, జయకుమార్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మురుగన్, శాంతన్, పేరరివాళన్‌లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నలుగురికి యావజ్జీవ శిక్షపడింది. ఉరిశిక్ష పడిన ముగ్గురు ఖైదీలు క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే క్షమాభిక్ష అంశంపై అనేక ఏళ్లు నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యాన్ని కారణంగా చూపి ఆ ముగ్గురి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో మొత్తం ఏడుగురు ఖైదీలు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు పాతికేళ్లకుపైగా శిక్షను అనుభవించడంతో వారిని విడుదల చేయాలని 2014, 2016లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో తీర్మానం చేశారు. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది. భారత రాజ్యాంగం 161 సెక్షన్ కింద వారి విడుదలపై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. ఈ పరిణామం తరువాత ఏడుగురు ఖైదీల విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ కోరింది. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు సైతం మద్దతు పలికాయి. పోరాటాలు కూడా చేశాయి. చట్టనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఏడుగురిని విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి గత ఏడాది ఏప్రిల్‌లో మరోసారి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపారు. అయితే తీర్మానాలు రాజ్‌భవన్‌కు చేరుకున్నా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుమారు ఐదేళ్లుగా ఈ వ్యవహారం రాజ్‌భవన్‌లో నానుతుండగా, ఏడుగురు ఖైదీల విడుదల చేయరాదని గవర్నర్ నిర్ణయించినట్లుగా రాజ్‌భవన్ వర్గాల ద్వారా అనధికార సమాచారం శుక్రవారం బయటకు వచ్చింది. చట్టనిపుణులతో గవర్నర్ చర్చించిన తరువాతనే గవర్నర్ ఈ నిర్ణయానికి వచ్చారని, గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని సైతం గవర్నర్ తోసిపుచ్చారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఎలాంటి సమాచారం రాలేదు. ముఖ్యమంత్రి ఎడపాడికి గవర్నర్ మౌఖికంగా ఈ విషయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖైదీల విడుదల విషయంలో గవర్నర్ బన్వరిలాల్ నిర్ణయం ఏమిటో అధికారికంగా ప్రకటించాలని పీఎంకే నేత డాక్టర్ రాందాస్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ రాజీవ్ హంతకుల్లో ఒకరైన రవిచంద్రన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘నక్కీరన్’ గోపాల్‌పై కేసు వెనక్కి తీసుకోవాలి
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను అగౌరవపరిచారనే కారణంతో ‘నక్కీరన్’ వారపత్రిక వ్యవస్థాపక సంపాదకులు నక్కీరన్ గోపాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఖండించింది. భారత రాష్ట్రపతి, గవర్నర్లను కించపరుస్తూ, వారి బాధ్యతలకు తీవ్ర ఆటంకం కలిగించే వారిని శిక్షించేందుకు వాడే ఐపీసీ సెక్షన్ 124ను నక్కీరన్ గోపాల్‌పై మోపడం అన్యాయమని ఐఎన్ఎస్ అధ్యక్షులు జయంత్ మమెన్ మాథ్యూ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను గౌరవించాలని ఆయన కోరారు. ఈ విషయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. నక్కీరన్ గోపాల్‌పై, వారపత్రిక సిబ్బందిపై దాఖలైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సర్కారుకు విజ్ఞప్తిచేశారు. -
‘నక్కీరన్’ అరెస్ట్ వెనక సెక్స్ స్కామ్
సాక్షి, న్యూఢిల్లీ : నక్కీరన్ గోపాల్‌గా ప్రసిద్ధి కెక్కిన తమిళ ద్వైవార పత్రిక ఎడిటర్ ఆర్. రాజగోపాల్ అరెస్ట్, విడుదల వెనక పెద్ద సెక్స్ కుంభకోణమే దాగుంది. ఆ కుంభకోణాన్ని దర్యాప్తు చేసే దమ్ములేని తమిళ పోలీసులు నక్కీరన్ గోపాల్‌ను అరెస్ట్ చేసి అనవసరంగా అభాసుపాలయ్యారని తమిళ జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. నక్కీరన్‌ను అరెస్ట్ చేయడం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు తమిళనాడు గవర్నర్ కార్యాలయం కూడా క్షమాపణలు చెప్పాలని మద్రాస్ రిపోర్టర్స్ గిల్డ్ సహా రాష్ట్రంలోని 11 జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు వారు తమిళనాడు వచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఓ మెమోరాండం కూడా సమర్పించారు. రాష్ట్ర గవర్నర్ భన్వారీ లాల్ పురోహిత్ మధురై కామరాజ్ యూనివర్శిటీకి ఛాన్సలర్‌గా ఉన్నారు. ఈ యూనివర్శిటీకి అనుబంధంగా పనిచేస్తున్న విరుధునగర్ జిల్లాలోని ‘దేవాంగ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నిర్మలా దేవీ సెక్స్ స్కామ్‌లో చిక్కుకున్నారు. మహిళలను, విద్యార్థినులను ప్రలోభపెట్టి సెక్స్‌లోకి దించుతున్నారన్నది ఆమెపై అభియోగం. ఈ కేసులో ఏప్రిల్ 24వ తేదీన అమెను అరెస్ట్ చేశారు. అంతకుముందు నుంచి ఆమె తనకు గవర్నర్ పురోహిత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని పోలీసులతో చెబుతూ వస్తున్నారు. అయినా ఆమెను పోలీసులు విడిచి పెట్టలేదు. ఈ విషయాన్ని గోపాల్ తన నక్కీరన్ పత్రికలో వార్తగా రాశారు. ఆ తర్వాత సెక్స్ స్కామ్‌లో ఓ రీసెర్చ్ విద్యార్థి కరుప్ప స్వామి, కామరాజ్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి. మురుగన్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మలా దేవీపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు పెట్టారు. నిర్మలా దేవీ అరెస్ట్ కాకముందే అంటే, ఏప్రిల్ 16వ తేదీనే రాష్ట్ర గవర్నర్ ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌తో తనపై తానే ఏకసభ్య విచారణ కమిషన్‌ను వేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్మలా దేవీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఆ సమావేశంలో తనపై తానే విచారణ కమిటీని వేసుకోవడం ఏమిటని కూడా గవర్నర్‌ను విలేకరులు ప్రశ్నించారు. అది కూడా ఆయనకు కోపం తెప్పించిందట. ‘గవర్నర్‌ను నాలుగుసార్లు కలసుకున్నట్లు నర్మలా దేవీ వెల్లడి: ఆమె ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు’ అన్న శీర్షికతో నక్కీరన్ పత్రిక సెప్టెంబర్ 26–28 నాటి సంచికలో ఓ వార్తను ప్రచురించింది. సీబీఐ విచారణలో నిర్మలా దేవీ తాను నాలుగు సార్లు రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకున్నట్లు వెల్లడించిందని, అయితే సీబీఐ అధికారులు దీన్ని అధికారికంగా నమోదు చేయలేదని ఆ వార్తలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పోలీసులు నక్కీరన్ గోపాల్‌ను అరెస్ట్ చేసి నాలుగు గంటలపాటు పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. ఆయన తరఫున న్యాయవాదిని కూడా అనుమతించలేదు. ఐపీసీలోని 124వ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నక్కీరన్ గోపాల్‌పై దాఖలు చేసిన సెక్షన్‌ను చూసి జడ్జీయే అవాక్కయ్యారు. రాష్ట్రపతి లేదా గవర్నర్లను తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అడ్డుపడుతున్నవారిపై ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. ఏ విధంగా గవర్నర్ విధులకు గోపాల్ అడ్డుపడ్డారో చెప్పాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కేసును కొట్టివేసి గోపాల్‌ను విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో గోపాల్ విడుదలయ్యారు. గోపాల్ తప్పుడు వార్తలు రాసి ఉన్నట్లయితే ఆయనపై పరువు నష్టం దావా వేయాలిగానీ తప్పుడు కేసు బనాయించడం ఏమిటని తోటి జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. దివంగత కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను అడవి దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేసినప్పుడు ఆయన విడుదలకు నక్కీరన్ గోపాల్ మధ్యవర్తిత్వం వహించిన విషయం తెల్సిందే. -
‘నక్కీరన్’ గోపాల్ అరెస్టును తప్పుబట్టిన మద్రాస్ కోర్టు
సాక్షి, చెన్నై : ప్రముఖ జర్నలిస్ట్ ‘నక్కీరన్’ గోపాల్‌కు మద్రాసు హైకోర్టు ఊరట కల్పించింది. గోపాల్‌కు రిమాండ్ విధించడానికి నిరాకరించి తమిళనాడు ప్రభుత్వానికి, చెన్నై పోలీసులకు గట్టి షాక్ ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ గురించి తప్పుడు కథనం రాశారంటూ ‘నక్కీరన్’ గోపాల్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్ ప్రతిష్టను దిగజార్చేవిధంగా గోపాల్ అసత్య కథనాలు రాశారంటూ రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో ఆయనను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆయనపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను తప్పుపట్టిన మద్రాసు కోర్టు గోపాల్‌కు రిమాండ్ విధించేందుకు నిరాకరించింది. కాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న గోపాల్ ప్రస్తుతం తమిళ మ్యాగ్జైన్ ‘నక్కీరన్’కు ఎడిటర్- ఇన్- చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ఈ మ్యాగజీన్ ప్రముఖంగా ప్రచురించింది. ఎక్కువ మార్కులు రావాలంటే విద్యార్థినులు ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ నిర్మలా దేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో గవర్నర్ వద్దకు కూడా నిర్మలా దేవి విద్యార్థులను తీసుకెళ్లిందని గోపాల్ తన కథనంలో రాసుకొచ్చారు. అంతేకాక గవర్నర్ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్ నిర్మలా దేవీ పోలీసుల విచారణలో అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. -
గవర్నర్‌పై ఆరోపణలు.. జర్నలిస్ట్ అరెస్ట్
చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌పై తప్పుడు కథనం రాసినందుకు గాను ప్రముఖ జర్నలిస్ట్ ‘నక్కీరన్’ గోపాల్‌ను మంగళవారం తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న గోపాల్ ప్రస్తుతం తమిళ మ్యాగ్జైన్ ‘నక్కీరన్’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మ్యాగ్జైన్ తమిళనాడు ప్రోఫెసర్ నిర్మాలా దేవికి సంబంధించిన కథనాలను ప్రచురించింది. మార్కులు కావాలంటే విద్యార్థినులు ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ ప్రొఫెసర్ నిర్మలా దేవీ వారిని వ్యభిచారంలోకి దించుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆమె గవర్నర్ వద్దకు కూడా విద్యార్థులను తీసుకెళ్లిందని నక్కీరన్ తన కథనంలో పేర్కొన్నారు. అంతేకాక ‘గవర్నర్ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్ నిర్మలా దేవీ పోలీసుల విచారణలో అంగీకరించారు. అందుకే గవర్నర్ ఈ కేసుపై విచారణ చేసేందుకు అంగీకరించడం లేదు’ అంటూ నక్కీరన్ తన కథనంలో రాసుకొచ్చారు. దీంతో నక్కీరన్‌పై రాజ్‌భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ ఖండించారు. నిందితురాలైన ప్రొఫెసర్ నిర్మలా దేవీని తాను ఎప్పుడూ కలవలేదని ఆయన వెల్లడించారు. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు రిటైర్డ్ ఉన్నతాధికారి ఆర్.సంథమ్‌ను గవర్నర్ నియమించారు. ఈ క్రమంలో గవర్నర్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ, ఆయన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా అమర్యాదకరంగా కథనాన్ని ప్రచురించినందుకు గాను నక్కీరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పుణె వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వచ్చిన నక్కీరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గోపాల్ అరెస్ట్‌ను తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు డీఎమ్‌కే ప్రెసిడెంట్ ఎమ్కే స్టాలిన్ ఖండించారు. బీజేపీ, అధికార ఏఐడీఎమ్కే ప్రభుత్వాలు ప్రెస్ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తున్నాయని స్టాలిన్ ఆరోపించారు. -
రాజీవ్ హంతకుల్ని విడుదల చేయండి
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాల్సిందిగా తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆదివారం చెన్నైలో ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. కాంగ్రెస్ మినహా తమిళనాడులోని మిగిలిన పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాజీవ్ హత్య దోషులను విడుదల చేసేందుకు విముఖంగా ఉండటం తెలిసిందే. రాజీవ్ హత్య కేసులో మురుగన్, శాంతన్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయాస్, నళిని, రవిచంద్రన్‌లు గత 27 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం ప్రకారం వీరిని విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. 2014లో జయలలిత సీఎం ఉండగానే దోషులను విడుదల చేయాలని నిర్ణయించినా కేంద్రం అప్పట్లో సుప్రీంను ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు కూడా గవర్నర్‌కే వదిలేసింది. మరి ఇప్పుడు గవర్నర్ కేంద్రాన్ని కాదని దోషులను విడుదల చేస్తారా అని ప్రశ్నించగా, ఇది రాష్ట్ర ప్రభుత్వ, ప్రజల నిర్ణయమనీ, గవర్నర్ అందుకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. -
కరుణానిధికి రాష్ట్రపతి పరామర్శ
సాక్షి, చెన్నై: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం చెన్నై వచ్చిన ఆయన, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌తో కలిసి నేరుగా ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. కరుణానిధిని పరామర్శించిన అనంతరం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళిలతో రాష్ట్రపతి కాసేపు మాట్లాడారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కోవింద్ ట్విట్టర్లో తెలిపారు. జూలై 28 నుంచి కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు నేతలు ఆయనను పరామర్శించడం తెలిసిందే. కాగా కరుణానిధికి ఆరోగ్యం బాగాలేదనే బాధతో పుదుకోట్టై జిల్లా కరంబకుడికి చెందిన మూడో వార్డు డీఎంకే కార్యదర్శి మనోహరన్ ఆదివారం గుండె ఆగి మరణించినట్లు సమాచారం. కరుణానిధి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మనోహరన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. -
స్టాలిన్ చర్యలపై ఆగ్రహం
సాక్షి, చెన్నై: ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జిల్లాల్లో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పర్యటనను అడ్డుకోవాలని యత్నిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ప్రతిపక్షానికి గవర్నర్ హెచ్చరికలు జారీచేశారు. ‘గవర్నర్‌కు కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. వాటిననుసరించి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. కాదని ఎవరైనా విఘాతం కలిగించాలని యత్నిస్తే వాళ్లు జైలుకు వెళ్లాల్సిందే. ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం గవర్నర్ కార్యకలాపాలను అడ్డుకునేవారిపై కేసు నమోదుచేసి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది’ అంటూ రాజ్‌భవన్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలు పర్యటిస్తున్న గవర్నర్ భన్వరిలాల్.. ప్రభుత్వ కార్యాలయాల సందర్శించి అక్కడి కార్యాకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర ఆగ్రహం వెల్లగక్కుతోంది. ‘రాజ్‌భవన్ మరో సచివాలయంగా మారిందని, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఓ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ’ అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కే రీతిలో వ్యవహరిస్తున్న ఆయన్ను తప్పించాల్సిందేనని డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా గవర్నర్ ఏ మాత్రం తగ్గడం లేదు. విమర్శలు, ఆరోపణలు, ఆందోళనల్ని ఖాతరు చేయకుండా తన దారిలో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం గవర్నర్ నామక్కల్ పర్యటన సందర్భంగా డీఎంకే నల్ల జెండాల ప్రదర్శన వివాదానికి దారితీయగా, పలువురు నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా రాజ్‌భవన్ హెచ్చరికలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. -
ఆయనో ఏజెంట్
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఓ ఏజెంట్ అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కే రీతిలో వ్యవహరిస్తున్న ఆయన్ను తప్పించాల్సిందేనని నినదించారు. సాక్షి, చెన్నై : బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సమీక్షలు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలంటూ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ జిల్లాల పర్యటనల్ని సాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌భవన్ మరో సచివాలయంగా మారిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా, నల్ల జెండాలతో వ్యతిరేకత, నిరసన వ్యక్తంచేసినా గవర్నర్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఆందోళనల్ని ఖాతరు చేయకుండా తన దారిలో తాను ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం గవర్నర్ నామక్కల్ పర్యటన సందర్భంగా డీఎంకే నల్ల జెండాల ప్రదర్శన వివాదానికి దారితీసింది. నల్ల జెండాల్ని ప్రదర్శించిన డీఎంకే వర్గాలను బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ, ఛలో రాజ్ భవన్ నిర్ణయాన్ని హఠాత్తుగా డీఎంకే తీసుకుంది. శనివారం ఉదయాన్నే స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో డీఎంకే ఎమ్మెల్యేలు అన్భళగన్, ఎం.సుబ్రమణియన్, శేఖర్ బాబు, మాధవరం సుదర్శనం, రంగనాథన్, వాగై చంద్రశేఖర్, మోహన్, రవిచంద్రన్, అరవింద్ రమేష్‌లతో పాటు కేంద్రమాజీ మంత్రి రాజ తదితర నేతలు ఉదయాన్నే పెద్దఎత్తున కేడర్‌తో సైదాపేట కోర్టు వద్దకు చేరుకున్నారు. దూసుకొచ్చిన నేతలు పది గంటల సమయంలో అక్కడికి స్టాలిన్ చేరుకున్నారు. ఆయన రాకతో ఒక్క సారిగా వాతావరణం అక్కడ మారింది. గవర్నర్ తీరును, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నామక్కల్‌లో తమ వాళ్లతో పోలీసులు వ్యవహరించిన విధానాన్ని ఖండిస్తూ, నిరసిస్తూ నినాదాల్ని హోరెత్తించారు. ఓ వైపు నినాదాలు మిన్నంటుతుంటే, మరో వైపు ఎమ్మెల్యేలతో కలిసి డీఎంకే జెండాను చేతబట్టి రాజ్ భవన్‌వైపు స్టాలిన్ కదిలారు. పెద్ద ఎత్తున డీఎంకే కేడర్ దూసుకురావడంతో ఉత్కంఠ నెలకొంది. రాజ్ భవన్‌కు అతి సమీపంలో రోడ్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటుచేసి, ఎవరూ అటు వైపు రాకుండా అడ్డుకున్నారు. అయినా, డీఎంకే వర్గాలు పోలీసుల వలయాన్ని ఛేదించే రీతిలో ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజ్ భవన్వైపుగా డీఎంకే వర్గాలు చొచ్చుకు రాని రీతిలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. దీంతో రోడ్డు మీద డీఎంకే వర్గాలు బైఠాయించి రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళన కారణంగా సైదా పేట నుంచి గిండి మార్గం, అడయార్ వైపుగా మార్గాల్లో ఎక్కడికక్కడ వాహనాలు ఆగాయి. ట్రాఫిక్‌ను క్రమ బద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు స్టాలిన్ సహా ఎమ్మెలేల్ని అడ్డుకుని బలవంతంగా అరెస్టుచేశారు. వీరందర్నీ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచారు. స్టాలిన్ ఫైర్ స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్ర హక్కుల్ని గవర్నర్ కాలరాస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్‌గా ఇక్కడ అడుగు పెట్టి ఉన్న దృష్ట్యా, ఎక్కడ తమ అవినీతి బండారాలు బయట పడుతాయోనన్న భయంతో ఈ పాలకులు గవర్నర్ విషయంలో మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఆది నుంచి గవర్నర్ చర్యల్ని డీఎంకే అడ్డుకుంటూ వస్తోందని, ఆయన ఎక్కడికి వెళ్లినా వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన గవర్నర్, ఇష్టానుసారంగా ముందుకు సాగడాన్ని ఖండిస్తున్నామన్నారు. అందుకే నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నామని పేర్కొంటూ, ఈ సమయంలో నామక్కల్‌లో తమవాళ్ల మీద బల ప్రయోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు తాము శాంతియుత మార్గంలో పయనించామని, అయితే, నామక్కల్ ఘటనతో తమను గవర్నర్ రెచ్చగొడుతున్నట్టుందని ధ్వజమెత్తారు. ఇలాంటి గవర్నర్‌ను తప్పించాలని, లేదా తన పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఆరుగురు రాష్ట్రపతులు ఇక్కడి విద్యార్థులే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆరుగురు రాష్ట్రపతులను అందించిన ఘనత మద్రాసు యూనివర్సిటీకే సొంతమని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. మద్రాసు వర్సిటీ 160వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించగా రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థుల్లో మూడింట ఒకవంతు అమ్మాయిలుండటంపై కోవింద్ మాట్లాడుతూ ఒక అమ్మాయిని చదివిస్తే రెండు కుటుంబాలను చదివించినట్లేనన్నారు. ‘ మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, ఆర్ వెంకట్రామన్, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం.. వీరంతా ఇక్కడ చదువుకున్న వారే. తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఈ వర్సిటీ విద్యార్థే. నోబెల్ బహుమతులు అందుకున్న సీవీ రామన్, సుబ్రమణియన్ చంద్రశేఖర్‌లు సైతం ఇక్కడే చదువుకున్నారు. ఈ వర్సిటీలో విద్యనభ్యసించిన సుబ్బారావు, పతంజలి శాస్త్రిలు ప్రధాన న్యాయమూర్తులుగా ఎదిగారు. ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, సరోజినీనాయుడు, సీ సుబ్రమణియన్‌లు కూడా వర్సిటీకి పేరు తెచ్చినవారే. ఇంతటి పేరు ప్రఖ్యాతులు, ఘనత వహించిన విశ్వవిద్యాలయమిది’ అని కోవింద్ అన్నారు. స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ పాల్గొన్నారు. -
నా రూటే సెపరేటు
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన రాజ్‌భవన్ కార్యకలాపాలు ఆధ్యంతం వివాదాస్పదంగా మారిపోయాయి. నారూటే..సెపరేటు అన్నట్లుగా ఆయన వ్యవహారశైలితో రాజ్‌భవన్‌రచ్చబండగా మారిపోయింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా 2017 అక్టోబర్ 6న బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే రాజ్‌భవన్‌లో మాంసాహారంపై నిషేధం విధించారు. మాంసాహారాన్ని నేను ముట్టను, మరెవ్వరినీ ముట్టనివ్వను అని హుకుం జారీచేశారు. రాజ్‌భవన్‌కు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే అతిథులకు సైతం స్వచ్ఛమైన శాఖాహారమేనని స్పష్టం చేశారు. రాజ్‌భవన్ సిబ్బంది సైతం తమ లంచ్ బాక్సుల్లో మాంసాహారం తీసుకురాకూడదు, ఒక వేళ తినాలనిపిస్తే బైటకు వెళ్లి ఆరగించిరండి అంటూ ఆదేశించి రాజ్‌భవన్‌ను వెజ్‌భవన్‌గా మార్చివేశారు. ఈ ఆదేశాలకు లోలోన గొణుక్కున్నవారు లేకపోలేదు. ఇక ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి పోటీగా జిల్లాలో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరుపై సమీక్షలు మొదలుపెట్టారు. గవర్నర్ సమీక్షలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా గవర్నర్ సమీక్షలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. రామనాథపురం జిల్లా పర్యటనలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా గవర్నర్ తొంగిచూసాడంటూ కలకలం రేగింది. స్థానికులు గవర్నర్‌ను చుట్టుముట్టి నిలదీయడంతో సెక్యూరిటీ గార్డులు ఆయనను అర్ధంతరంగా కారులో ఎక్కించి కాపాడారు. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారం సైతం గవర్నర్ మెడకు చుట్టుకుంది. కళాశాల విద్యార్థినులను లైంగికంగా ప్రలోభపెట్టేందుకు నిర్మలాదేవి జరిపిన సెల్‌ఫోన్ సంభాషణల్లో గవర్నర్ పేరును కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో గవర్నర్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై నిర్మలాదేవి అరెస్టయిన అదే రోజు సాయంత్రానికి రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానంతో ఏకసభ్య విచారణ కమిషన్‌ను నియమించారు. గవర్నర్ హడావుడిని ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు అనుమానించాయి. పోలీసులు, మదురై కామరాజ్ యూనివర్సిటీ ఈ వ్యవహారంలో నిగ్గుతేల్చాల్సి ఉండగా గవర్నర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంలోని మర్మమేమని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశం పెట్టి తనపై పడిన మచ్చను తొలగించుకునే ప్రయత్నంలో గవర్నర్ మరో కొత్త వివాదానికి తెరలేపారు. మహిళా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ఆమె చెంపను సుతారంగా నిమరడంతో జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో మరోసారి కంగారుపడిన గవర్నర్ సదరు మహిళా విలేకరికి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. ఇలాంటి అనేక గందరగోళాల మధ్య అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా కర్ణాటకకు చెందిన సూరప్పను నియమించి మరో రచ్చకు తెరదీశారు. కళాశాల విద్యార్థినులపై లైంగిక ప్రలో భాలకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పదవి నుంచి తప్పుకోవాలని లేదా కేంద్రం రీకాల్ చేయాలని, సూరప్ప నియామకాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ప్రతిపక్షాల ఆందోళనలకు గవర్నర్ బంగ్లా శాశ్వత చిరునామాగా మారడం, ముట్టడి యత్నాలు కొనసాగుతున్నందున సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటైంది. ఇద్దరు సహాయ కమిషనర్లు, ఇద్దరు అదనపు కమిషనర్లు వెయ్యిమంది ఇతర పోలీసు అధికారులు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్ బంగ్లాలోకి వెళ్లే రెండు ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను సిద్ధంగా ఉంచుకున్నారు. రాజ్‌భవన్ సందర్శకుల అనుమతిని రద్దు చేశారు. గుర్తింపు కార్డు కలిగి ఉన్నవారిని మాత్రమే గవర్నర్ బంగ్లాలోకి అనుమతిస్తున్నారు. -
ఫేస్బుక్ షేర్: వివాదంలో ప్రముఖ నటుడు
సాక్షి, చెన్నై: మహిళా జర్నలిస్టు పట్ల తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అనుచిత చర్య వివాదం ఇంకా ముగియకుండానే రాష్ట్రానికి చెందిన నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ (సత్తనాతపురం వరదరాజ శేఖర్) చిక్కుల్లో పడ్డారు. మహిళా పాత్రికేయులపై అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఓ బీజేపీ అభిమాని ఫేస్బుక్ పోస్ట్‌ను షేర్ చేసి మరో వివాదానికి తెర తీశారు. ‘మదురై యూనివర్సిటీ, గవర్నర్ అండ్ ది వర్జిన్ చీక్స్ ఆఫ్ ఎ గర్ల్’ అనే పేరుతో తిరుమలై.ఎస్ అనే ఫేస్బుక్ యూజర్ ఈ పోస్ట్ పెట్టాడు. మహిళా జర్నలిస్టులపై చాలా అవమానకరమైన పదజాలంతో విరుచుకుపడిన ఫేస్బుక్ పోస్ట్‌ను బీజేపీ నేత షేర్ చేశారు. విశ్వవిద్యాలయాల కన్నా ఎక్కువ లైంగిక వేధింపులు మీడియా సంస్థల్లో ఉన్నాయని ఆ పోస్ట్‌లో ఆరోపించాడు. అంతేకాదు మీడియా పెద్దలతో పడుకోకుండా..ఏ మహిళ రిపోర్టర్ లేదా న్యూస్ రీడర్ కాలేదంటూ రెచ్చిపోయాడు. దీంతోపాటు తమిళనాడు మొత్తం మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. మీడియా మొత్తం నేరస్థులు, రాస్కల్స్, బ్లాక్‌మెయిలర్ల చేతిలో చిక్కి తిరోగమన మార్గంలో ఉందని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన శేఖర్ తానా పోస్ట్‌ను పూర్తిగా చదవకుండానే పోస్ట్ చేశాననీ, ఎవర్నీ కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ శేఖర్ వివరణ ఇచ్చుకున్నారు. అమెరికాకు వెళ్ళినప్పుడు మోదీ అభిమానిగా తిరుమలై తనకు పరిచయమయ్యాడని చెప్పారు. ఇపుడు ఆ పోస్ట్‌ను తొలగించాలనుకున్నా.. ఫేస్బుక్ బ్లాక్ చేయడంతో అది సాధ్యం కావడంలేదని చెప్పొకొచ్చారు. (ప్రస్తుతం ఈ పోస్ట్ డిలీట్ అయింది) కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పాత్రికేయులపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా శేఖర్ చర్యకు నిరసనగా మహిళా జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రముఖులు చెన్నైలోని బీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగనున్నారు. -
‘గవర్నర్ ఆ చేతిని ఫినాయిల్‌తో కడగాల్సింది’
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మహిళా జర్నలిస్టు చెంపను తడమటాన్ని సమర్ధిస్తూ సోషల్‌మీడియాలో పోస్టు చేసిన తమిళనాడు బీజేపీ నాయకుడు శేఖర్ వెంకటరామన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. జర్నలిస్టును తాకిన చేయిని బన్వరీలాల్ ఫినాయిలతో కడుక్కోవాలని సూచించారు. వెంకటరామన్ పోస్టుపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో నష్ట నివారణా చర్యల్లో భాగంగా ఆయన దాన్ని తొలగించారు. గవర్నర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీల పరువుకు భంగం కలిగించేందుకే జర్నలిస్టు గవర్నర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారని వెంకటరామన్ పోస్టులో రాసుకొచ్చారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులు బడా వ్యక్తులతో గడపకుండా రిపోర్టులు కాలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోలీసు స్టేషన్లలో వస్తున్న ఫిర్యాదులను గమనిస్తే ఇదే ప్రస్ఫుటమవుతుందని వ్యాఖ్యానించారు. సెక్స్ ఫర్ డిగ్రీ స్కామ్‌లో పురోహిత్ పేరు బయటకు రావడంపై లక్ష్మీ సుబ్రహ్మణ్యం గవర్నర్‌ను ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇవ్వని గవర్నర్ ఆమె చెంపను తడిమారు. దీనిపై మాట్లాడిన వెంకటరామన్ విశ్వవిద్యాలయాల్లో కన్నా మీడియా సంస్థల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అనుచితంగా ప్రవర్తించి, చెంపను తాకినందుకు మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రహ్మణ్యంకు గవర్నర్ క్షమాపణ తెలిపిన విషయం తెలిసిందే. -
మహిళా విలేకరికి గవర్నర్ క్షమాపణ
చెన్నై: మహిళా విలేకరి చెంపపై తట్టినందుకు తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బుధవారం ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆమె తన మనవరాలి వంటిదనీ, విలేకరిగా ఆమె పనిని మెచ్చుకుంటూ అప్యాయతతో చెంపపై తట్టానని పురోహిత్ వివరణ ఇచ్చారు. ఇంగ్లిష్ మేగజీన్‌లో విలేకరిగా పనిచేసే లక్ష్మి సుబ్రమణియన్ మంగళవారం పురోహిత్‌ను ఓ ప్రశ్న అడగ్గా, దాన్నుంచి తప్పించుకునేందుకు పురోహిత్ ఆమె చెంపపై తట్టి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగి గవర్నర్ చర్య పట్ల నిరసన వ్యక్తం చేశాయి. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేయడంతో చివరకు పురోహిత్ క్షమాపణ కోరుతూ లక్ష్మి సుబ్రమణియన్‌కు లేఖ రాశారు. దీంతో గవర్నర్‌ను మన్నించిన ఆమె.. ఆయన ప్రవర్తించిన తీరు మాత్రం సరైనది కాదని పురోహిత్‌కు ఈమెయిల్ పంపారు. -
జర్నలిస్ట్ కు క్షమాపణ చెప్పిన గవర్నర్
చెన్నై : విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్ట్ పట్ల తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ఆయన క్షమాపణలు చెప్పారు. మనువరాలి వయస్సులో ఉన్న ఆమెను అభినందించేందుకే ఆమె చెంపను తాకానన్నారు. తన చర్య వల్ల ఆ మహిళా జర్నలిస్టు బాధపడినందు వల్ల ఆమెకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కోరారు. అసలేం జరిగిందంటే.. బన్వరిలాల్‌తో తనకు పరిచయం ఉందంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ మంగళవారం రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తనకు ఆ ప్రొఫెసర్ ఎవరో కూడా తెలియదంటూ బన్వరిలాల్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పకుండా బదులుగా ఆమె చెంపను తాకారు. గవర్నర్ చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన పట్ల గవర్నర్ ప్రవర్తనపై మహిళా జర్నలిస్టు ట్విటర్లో స్పందించారు. ‘విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు’ అంటూ మహిళా జర్నలిస్లు లక్ష్మీ సుబ్రహ్మణినయన్ ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్థతి కాదన్నారు. నా ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకున్నాను. కానీ ఆ మలినం నన్ను వదిలినట్లు అనిపించడం లేదు. 78 ఏళ్ల వయస్సున్న మీరు నాకు తాతయ్యలాంటి వారే కావొచ్చు. కానీ మీ చర్య నాకు తప్పుగా అన్పిస్తోంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.