bike stunts
-
కేబుల్ బ్రిడ్జీపై స్టంట్లు చేస్తూ.. బాణసంచా కాల్చుతూ వెర్రి వేషాలు
హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేస్తూ బాణ సంచా కాల్చుతూ ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు హల్చల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదకర రీతిలో స్టంట్టు చేయడమే కాకుండా బాణసంచా కాల్చడాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.కేబుల్ బ్రిడ్జీపై నుంచి స్టంట్లు చేసుకుంటూ వచ్చిన యువకుడు ఐటీసీ కోహినూర్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని షాట్స్(బాణసంచా) పేల్చాడు. స్టంట్లు చేస్తూ షాట్స్ పేల్చడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో బైక్‌పై స్టంట్లు చేయడం, బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి పైనా స్టంట్లు చేసే వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. బైక్‌పై నెంబర్ లేకపోవడంతో సదరు యువకుడి ఆచూకీ తెలియలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. స్టంట్లు చేసి, బాణసంచా కాల్చిన యువకుడిపై బీఎన్ఎస్ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.నాలెడ్జ్ సిటీలో బైక్ రేస్.. 36 మందిపై కేసు నమోదు కేకలు వేస్తూ వాహనదారులను భయపెడుతూ బైక్ రేసింగ్‌కు పాల్పడిన 35 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్సెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రమాదకర స్థితిలో బైక్‌తో స్టంట్లు చేయడం, బిగ్గరగా అరవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. నాలెడ్జ్సిటీలో బైక్ రేస్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానిక చేకున్నారు. నలువైపుల పోలీసులు మోహరించి బైక్ రేస్‌కు పాల్పడిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 21 బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు.చదవండి: వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్శుక్రవారం రాత్రి బైక్ రేస్‌కు పాల్పడిన 15 మంది, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రేస్‌కు పాల్పడిన యువకులను రిమాండ్ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు. బైక్ రేస్ చేయకుండా వారి తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరం ఉదని ఆయన సూచించారు. రేసింగ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దీపావళి నాడు కొంతమంది చేసిన ఓవరాక్షన్‌పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 -
రన్నింగ్ కారును తన్నుతున్న పోకిరీలు
-
రీల్స్ మోజులో ప్రాణం పోయింది
లింగోజిగూడ/వర్ధన్నపేట: ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం బైక్‌పై చేసిన స్టంట్ అదుపుతప్పి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు కోనాపురానికి చెందిన మేడ రాజు, మహబూబీ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఎల్బీనగర్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో నివాసముంటున్నారు.మేడ రాజు కుమారుడు శివ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం తన స్నేహితులు సంపత్, పవన్, విజయ్‌తో కలిసి బైక్‌లపై ఎల్బీనగర్ పెద్దఅంబర్‌పేట వైపు బయల్దేరారు. కేటీయం బైక్ ను శివ నడుపుతుండగా సంపత్ వెనుక కూర్చున్నాడు. శివ తన బైక్‌తో రీల్స్ కోసం స్టంట్లు చేస్తుండగా, మరో బైక్‌పై ఉన్న పవన్, విజయ్‌లు వీడియో తీస్తున్నారు. హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద శివ నడుపుతున్న బైక్.. స్కూటర్‌ను ఢీ కొట్టడంతో అదుపుతప్పి కిందపడ్డారు.శివ, సంపత్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. శివ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రగాయాలతో సంపత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివ మృతదేహాన్ని ఆదివారం రాత్రి స్వగ్రామం కోనాపురానికి తరలించారు. హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: యువకుడి ప్రాణం తీసిన బైక్ స్టంట్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. యువకులు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. హయత్‌నగర్‌లో బైక్ స్టంట్లు యువకుడి ప్రాణాలు తీశాయి. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు.వర్షం కురుస్తున్న సమయంలో కేటీఎం బైక్‌పై ఇద్దరు యువకులు స్టెంట్లు చేస్తుండగా.. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. చేతికందిన కుమారుడు మృతిచెందాడన్న వార్త జీర్ణించుకోలేక ఆ కన్నతల్లి పెట్టిన రోదన అక్కడివారిని కలిచివేయించింది. -
తమిళనాడులో పిచ్చి తలకెక్కింది.. ప్రాణాలు జాగ్రత్త
-
ఫైర్ క్రాకర్స్‌తో బైక్‌పై డేంజరస్ స్టంట్స్: గుండెలదిరిపోయే వీడియో వైరల్
చెన్నై: దీపావళి వేడుకల్లో భాగంగా కొంతమంది యువకులు జాతీయ రహదారిపై బాణా సంచా పేల్చుతూ ప్రమాదకరమైన స్టంట్ చేసిన వైనం వైరల్‌గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో విచిత్ర విన్యాసాలతో రోడ్డుమీద బీభత్సం సృష్టించారు. బైక్‌కు పటాకులు తగిలించి మరీ వాటిని పేల్చుకుంటూ చేసిన స్టంట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వాళ్లు అనుకున్నట్టుగా వీడియో వైరల్ అయ్యింది గానీ చివరికి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అటు నెటిజన్లు కూడా ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది. 71 వేల మంది ఫాలోవర్లున్న ‘డెవిల్ రైడర్’ అనే ఇన్‌స్టా పేజీలో నవంబర్ 9న ఈ వీడియో అప్లోడ్ అయింది. సిరుమరుత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై, వాహనానికి బాణాసంచా తగిలించుకుని, దాన్ని గిరా గిరా తిప్పుతూ, బైక్‌పై వెళ్లే వ్యక్తి కొద్దిసేపు బైక్ ముందు భాగాన్ని రోడ్డుపై నుంచి పైకి లేపుతూ బైకును ఒక టైరుపై ఉంచి స్టంట్స్ చేశాడు. బైక్ వెళ్తుండగానే బాణా సంచా పేల్చడంతో అవిపెద్ద ఎత్తున పేలి, గుండెలదిరేలా భారీగా మెరుపులు రావడం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైడర్ తంజావూరుకు చెందిన ఎస్ అజయ్ అని గుర్తించారు. అజయ్‌తోపాటు, దాదాపు 10మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన మరికొంత మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి జాబితాను సిద్ధం చేస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని జిల్లా ఎస్పీ వరుణ్‌కుమార్ ఎక్స్ (ట్విటర్)లో ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తమిళనాడులో కార్కు టపాసులు తగిలించి పేల్చిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. #WATCH | Tamil Nadu | In a viral video, a group of bikers were seen performing stunts and bursting firecrackers while riding motorcycles in Tiruchirappalli. Trichy SP Dr. Varun Kumar tells ANI, "Trichy District police arrested 10 persons under various IPC sections and under the… pic.twitter.com/fShjqlR6wV — ANI (@ANI) November 14, 2023 -
ముసలోడే కానీ.. మహానుభావుడు, బైక్‌పై స్టంట్స్ చేసిన వృద్ధుడు
రోడ్ల మీద రయ్రయ్ అంటూ కుర్రాళ్లు చేసే స్టంట్స్ గురించి తెలిసిందే. ఇందులో పెద్ద విశేషం ఏముంది? కానీ కొంతమంది వయసుతో సంబంధం లేని పనులు చేస్తుంటారు. అలా కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఓ వృద్దుడు యువకుడిలా మారి బైక్‌పై విన్యాసాలతో ఆశ్చర్యపోయేలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విశేషాలు క్షణాల్లో మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. సరికొత్త విషయాలు, గమ్మత్తైన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. బైక్‌పై ఓ వృద్ధుడు విన్యాసాలు చేశాడు. బైక్‌ను నడుపుతూ ఒక్కసారిగా హ్యాండిల్‌ని విడిచిపెట్టేశాడు. బైక్‌పై జంప్స్ చేస్తే హుశారుగా స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. చాలామంది నెటిజన్లు వృద్ధుడి విన్యాసాలకు షాక్ అవుతుంటే, మరికొందరు మాత్రం.. తాతగారికి ఈ వయసులో అవసరమా? పొరపాటున కిందపడితే ఎంత ప్రమాదం? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. इन्हीं हरकतों की वजह से सरकार ने पुरानी पेंशन योजना बंद की है। 😅 pic.twitter.com/9On89AL5SJ — Ankit Yadav Bojha (@Ankitydv92) August 13, 2023 -
హీరోయిన్లా మజాకా.. యాక్షన్ తగ్గేదే లే!
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.. ఇంకొకరు ఫ్లయిట్ ఎక్కారు... ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘యాక్షన్‌కి సై’ అంటూ బరిలోకి దిగారు. ప్రత్యర్థులను రఫ్ఫాడారు. సుకుమారంగా కనిపించే కథానాయికలు రఫ్‌గా మారిపోయి, విలన్లను ఇరగదీశారు. సమంత, త్రిష, కీర్తీ సురేశ్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆలియా భట్, కృతీ సనన్ వంటి నాయికలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం. పవర్ఫుల్ రీటా ఓ వైపు హీరోయిన్గా అగ్రహీరోల సరసన నటిస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్నారు కీర్తీ సురేశ్. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, థ్రిల్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్ పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది. కాగా ‘సైరన్, రఘు తాత, కన్ని వెడి’ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తీ సురేశ్. వీటిలో ‘కన్ని వెడి’ లేడీ ఓరియంటెడ్ మూవీ. ‘రఘు తాత’ కూడా దాదాపు ఇలాంటి సినిమానే. ఇక చిరంజీవి చెల్లెలిగా కీర్తి నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీ టు హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్ ఖాన్ ‘పఠాన్’ మూవీలో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిన దీపిక ప్రస్తుతం ‘ఫైటర్’, ‘సింగం 3’ వంటి చిత్రాల్లో యాక్షన్ రోల్స్‌కి సై అన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ కోసం ప్రత్యేకంగా స్టంట్స్‌లో శిక్షణ తీసుకున్నారు దీపిక. అలాగే ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగం 3’ రూపొందనుంది. ‘సింగం’, ‘సింగం 2’ చిత్రాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి దర్శకత్వంలోనే ‘సింగం 3’ తెరకెక్కనుంది. ఈ మూడో భాగం హీరోయిన్ ఓరియంటెడ్‌గా సాగనుందట. ఇందులో దీపికా పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే ఓ హాలీవుడ్ మూవీలో ఏజెంట్‌గా కనిపించనున్నారట దీపిక. ఈ చిత్రంలోనూ ఆమె యాక్షన్ సీన్స్ చేయనున్నారని భోగట్టా. ఇలా బాలీవుడ్ టు హాలీవుడ్ యాక్షన్ రోల్స్ సైన్ చేసి జోరుగా దూçసుకెళుతున్నారు దీపికా పదుకోన్. టైగర్‌తో యాక్షన్ సల్మాన్ ఖాన్‌కి సమానంగా కాకపోయినా తనదైన శైలిలో ఫైట్స్ చేశారు కత్రినా కైఫ్. ‘టైగర్’ ఫ్రాంచైజీలో భాగంగా సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టైగర్ 3’. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్. హీరో హీరోయిన్లు ఇద్దరూ గూఢ చారుల పాత్రల్లో నటిస్తున్నారట. ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో కత్రినా కనిపించనున్నారని సమాచారం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో జోయాగా కత్రినా చేసిన ఫైట్స్ హైలైట్‌గా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకించి సౌత్ కొరియాకు చెందిన స్టంట్ మాస్టర్ల దగ్గర 14 రోజులు శిక్షణ తీసుకున్నారట కత్రినా. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ కానుంది. యుద్ధ విమానం ఎక్కి.. దాదాపు లేడీ ఓరియంటెండ్ సినిమాలకే పరిమితమయ్యారు కంగనా రనౌత్. సర్వేష్ మేవారా దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘తేజస్’. ఈ చిత్రంలో ఆమె యుద్ధ విమానాలు నడిపే పైలెట్ పాత్ర చేశారు. కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం పలు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు కంగన. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ చిత్రం నిర్మించారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అనే అంశంతో ‘ఎమర్జెన్సీ’ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగన నటించిన ఈ చిత్రం నవంబరు 24న విడుదల కానుంది. అలాగే పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా కంగన టైటిల్ రోల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబరు 19న విడుదల కానుంది. హాలీవుడ్లో యాక్షన్ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ఆలియా భట్ కూడా యాక్షన్‌కి సై అన్నారు. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా కీలక పాత్ర చేశారు. స్పై యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు ఆలియా భట్. ఈ నెల 11న ఈ సినిమా విడుదల కానుంది. బైక్‌పై దూసుకెళుతూ... ఇటీవల విడుదలైన ‘ఆది పురుష్’లో సుకుమారి సీతగా కనిపించిన కృతీ సనన్ ఇప్పుడు అందుకు పూర్తి విభిన్నంగా రూడ్‌గా మారిపోయారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గణ్పథ్: పార్ట్ 1’లో ఆమె పవర్ఫుల్ రోల్ చేశారు. ఈ సినిమా కోసం కృతి అద్భుతమైన బైక్ స్టంట్స్ చేశారు. ఇందుకోసం బైక్ స్టంట్స్ నేర్చుకున్నారామె. అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇంతేనా.. ఇంకొందరు కథానాయికలు యాక్షన్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తామేంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నారు. వెబ్‌లో యాక్షన్ కొందరు కథానాయికలు వెండితెరపై యాక్షన్ రోల్స్ చేస్తుంటే త్రిష, సమంత వంటి తారలు వెబ్ సిరీస్‌లో ఈ తరహా పాత్రలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన త్రిష తొలిసారి ‘బృందా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. సూర్య వంగల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో త్రిష ఓ పవర్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. త్రిషలోని మాస్ ఇమేజ్‌ని బలంగా చూపించే పాత్ర ఇది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆ మధ్య వరుసగా హీరోల సరసన నటించిన సమంత ఇటీవల లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ బ్యూటీ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’. దర్శక ద్వయం రాజ్–డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ రోల్లో అదరగొట్టారు. ప్రస్తుతం సమంతతోనే ఈ దర్శక–ద్వయం ‘సిటాడెల్’ అనే మరో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రియాంకా చో్రపా నటించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హిట్ డ్రామా ‘సిటాడెల్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. గూఢచారి సాహసాల నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ సిరీస్‌గా రూపొందుతోంది. ఇందులో సమంత యాక్షన్ సీన్స్‌లో అలరించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. -
Video: బైక్‌పై పోలీస్ స్టంట్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అధికారులు
లక్నో: యువతకు రేసింగ్‌లు, స్టంట్లపై క్రేజ్ పెరిగిపోతుంది. బైక్, కార్లతో రోడ్లపై రయ్ రయ్ మంటూ రచ్చ చేస్తుంటారు. ర్యాష్ డ్రైవింగ్‌తో విన్యాలు చేస్తూ ప్రమాదాల బారినపడటమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా రిస్క్‌లో పడేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమందిలో మార్పు రావడం లేదు.. ఏరికోరి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అయితే బైక్ స్టంట్లు చేసిన వారిపై జరిమానా విధించాల్సిన కొంతమంది పోలీసులే నిబంధనలు అతిక్రమిస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ బైక్ స్టంట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. గోరఖ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సందీప్ కుమార్ చైబే.. యూనిఫాం ధరించి బైక్‌పై ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. తన రేసింగ్‌ను మరొకరితో వీడియో తీయించాడు. దీనికి డైలాగ్ జోడించి వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇంకేముంది ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీస్ చర్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. అంతేగాక ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. కాగా ఏ పోలీసు సిబ్బంది వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫిబ్రవరి 8, 2023న ఆదేశాలు జారీ చేశారని ఎస్ఎస్పీ క్టర్ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. అయిన్నప్పటికీ.. కానిస్టేబుల్ సందీప్ కుమార్ చౌబే తన వీడియోను పోస్ట్ చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు.. సీఐ దుర్మరణం -
వీడియో: ఇది సజ్జనార్ మార్క్.. యువకుడికి మంచి చెబుతూనే.. ఆర్టీసీ ఎండీగా వార్నింగ్ కూడా
-
హైదరాబాద్ లో బైక్ రేసింగ్ లతో రెచ్చిపోతున్న యువకులు
-
వైరల్ వీడియో: ఇద్దరమ్మాయిలతో బైక్‌పై యువకుడి స్టంట్
-
ఓరి నీ వేషాలో.. హీరోల ఇద్దరమ్మాయిలతో బైక్ స్టంట్.. ఆ తర్వాత..
ముంబై: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరు మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. రూల్స్ పాటించనందుకు జరిమానాలు విధిస్తున్నా డోంట్ కేర్ అంటూ బైక్‌లతో స్టంట్స్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారినపడుతూ, ప్రమాదాలకు గురవతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ బైకర్ చేసిన స్టంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. ముంబైలో ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్ చేశాడు. ఓ యువకుడు తన బైక్‌పై ముందు భాగంలో ఒక యువతిని, వెనుక మరో యువతిని కూర్చోబెట్టుకుని స్టంట్స్ చేశాడు. బైక్ ముందు భాగాన్ని అమాంతం పైకిలేపి అలానే కొద్ది దూరంపాటు తీసుకెళ్లాడు. ఇలా కొద్ద దూరంగా ముందు టైర్ గాల్లోనే ఉండి.. బైకర్ స్టంట్‌ను పూర్తి చేశాడు. ఇక, దీన్ని మరో బైక్ మీద వస్తున్న వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను పాట్‌హోల్ వారియర్స్ ఫౌండేషన్ అనే సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసింది. ఇక, ఈ వీడియో మహారాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది సదరు సంస్థ. వీడియోతో పాటు బైక్ నంబర్‌ను కూడా జోడించి ట్విట్టర్ వేదికగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసింది. కాగా, వీడియోపై స్పందించిన పోలీసులు.. బైకర్‌తోపాటు ఆ ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదుచేసినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వీరి గురించి వివరాలు తెలిస్తే.. పోలీసులకు సమాచారం అందించాలని ట్రాఫిక్ విభాగం కోరింది. ముగ్గురిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. dangerous Stunt with 2 pillion rider one in front & one at rear, no helmet & doing whilly ! they know that Mumbai roads hv became #PotholesFree now...! pls catch him @MTPHereToHelp bike reg no. is Mh01DH5987 pic.twitter.com/tvYeRMDR39 — @PotholeWarriors Foundation💙 #RoadSafety🇮🇳🛵🛣 (@PotholeWarriors) March 30, 2023 -
వైరల్ వీడియో: అంత ఓవర్ ఎందుకు భయ్యా.. దెబ్బకు సరదా తీరిపోయిందిగా..
-
అంత ఓవర్ ఎందుకు భయ్యా.. దెబ్బకు సరదా తీరిపోయిందిగా..
ప్రస్తుత జనరేషన్ యూత్‌లో కొందరు బైక్ రైడింగ్స్ చేస్తూ ప్రమాదాలకు గురైన ఘటనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలు చూసే ఉంటారు. తమకే బైక్ రైడింగ్ తెలుసు అన్నట్టుగా రోడ్డుపై స్టంట్స్ చేసి ప్రమాదాలను కొనితెచ్చుకున్నారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. వీడియోలో ఓ యువకుడు రోడ్డుపై స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. స్కూటీ ముందు ఉన్న మరో వ్యక్తి ఇదంతా వీడియో తీస్తూ ఉన్నాడు. కాగా, స్కూటీ డ్రైవ్ చేస్తున్న క్రమంలో యువకుడు.. ఒక్కసారిగా రన్నింగ్‌లో ఉన్న స్కూటీతో స్టంట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. స్కూటీ స్పీడ్‌లో ఉండటంతో బైకర్ అదుపుతప్పి ముందుకుపడిపోయాడు. అనంతరం.. స్కూటీ కూడా అతడిపై పడిపోయింది. ఈ ఘటనలో సదరు యువకుడికి గాయాలు అయ్యాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Arslaan (@arslaan_99) మరోవైపు.. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా, ఆ వీడియో రోడ్డుపై ఓ బైకర్.. బైక్‌తో స్టంట్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో స్పీడ్‌లో ఉన్న బైక్‌పై పట్టుకోల్పోవడంతో బైకర్ కింద పడిపోయాడు. కానీ, బైక్ మాత్రం స్పీడ్‌లో అలాగే ముందుకు సాగింది. ఇక, ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @the_corner__kid -
రికార్డు బ్రేక్ ‘వీలీ’ స్టంట్
రోడ్డుపై బైక్‌లతో కుర్రకారు చేసే విన్యాసాలను మనలో చాలా మంది చూసే ఉంటాం.. బండిని మెలికలు తిప్పుతూ పోనీయడం.. ముందు చక్రాన్ని పైకి లేపి యాక్సిలేటర్‌ను రెయిజ్ చూస్తూ దూసుకుపోవడం, అత్యంత వేగంగా బండిని నడుపుకుంటూ వచ్చి వెనుక చక్రం పైకి లేచేలా ఒక్కసారిగా బ్రేక్ వేయడం... బండిని ఉన్నచోటనే గుండ్రంగా తిప్పడం వంటి స్టంట్లను మీరు చూసే ఉంటారు. కానీ లిథువేనియాకు చెందిన అరునస్ గిబేజా అనే స్టంట్ రైడర్ వీటన్నింటికన్నా క్లిష్టమైన ఓ విన్యాసాన్ని చేసి చూపించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇంతకీ అతను చేసిన స్టంట్ ఏమిటంటే... బండిని కేవలం వెనుక చక్రంపై నడపడమే (వీలీ) కాకుండా హ్యాండిల్‌ను వదిలేసి ఏకంగా అర కిలోమీటర్‌కుపైగా దూరం (580 మీటర్ల 81 సెంటీమీటర్లు) దూసుకెళ్లాడు. తద్వారా 2019లో భారత్‌కు చెందిన రోహితేశ్ ఉపాధ్యాయ్ అనే యువకుడు సుమారు 566 మీటర్ల దూరంపాటు ఇదే రకంగా బండి నడిపి నమోదు చేసిన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టాడు. -
వైరల్ వీడియో: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు
-
హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు
రాయ్‌పూర్: బైక్ స్టంట్స్, రేసింగ్‌లు చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. పోలీసులు ఇలాంటివి చేయడకూడదని ఎంత చెప్పినా కూడా పట్టించుకొని కొందరు రోడ్డుపై విన్యాసాలు చేస్తూ పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. వీరు చేసే ఫీట్లు ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అంతేగాక వీటి వల్ల కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయినా స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా ఓ బైకర్ చేసిన స్టంట్ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కదులుతున్న బైక్ మీద ఓ వ్యక్తి ప్రమాకరంగా స్టంట్ చేశాడు. రద్దీగా ఉన్న రోడ్డుపై బైక్‌కు ఒకవైపే కూర్చొని విన్యాసాలు చేశాడు. ఒంటి చేతితో హ్యండీల్ పట్టుకొని హీరోలా ఫీల్ అవుతూ ప్రమాదకరంగా డ్రైవ్ చేశాడు. హెల్మెట్ కూడా ధరించకుండా రోడ్డు భద్రతా నియమాలను ఏమాత్రం పాటించకుండా బైక్ నడిపాడు. అంతేగాక ఆయన చేసే ఘనకార్యాన్నిస్నేహితులతో వీడియో తీయించుకున్నాడు. చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన కదిలే కళ్యాణ మండపం.. చూస్తే ‘వావ్’ అనాల్సిందే అయితే యువకుడి స్టంట్ ఆయనకే ఎసరు పెట్టింది. బైక్‌తో ఫీట్లు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడికి రూ. 4,200 జరిమానా విధించి చర్యలు తీసుకున్నారు. చివరకు తనను క్షమించాలని చెవులు పట్టుకుని ఆ యువకుడు వేడుకున్నాడు. దుర్గ్ పోలీసులు ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పటి వరకు రెండు లక్షల మంది వీక్షించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల చర్యను నెటిజన్లు అభినందిస్తున్నారు. బైకర్ తిక్క కుదిరిందంటూ కామెంట్ చేస్తున్నారు. -
స్టంట్లు చేస్తున్నారా.. జర జాగ్రత్త! పోలీసులు ఇంటికే వచ్చేస్తారు..
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరిలో కంచన్‌బాగ్–చంద్రాయణగుట్ట రోడ్డులో అర్ధరాత్రివేళ మూడు ఆటోలు విన్యాసాలు చేశాయి. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. గత నెలలో బేగంపేట–ప్రకాష్‌నగర్ మార్గంలో ఏడుగురు యువకులు అర్ధరాత్రి వేళ హల్చల్ చేశారు. రేసింగ్‌తో పాటు వీళ్లు చేసిన ఫీట్లు సోషల్‌మీడియా ద్వారా పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసిన అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు. సోషల్‌మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఈ రెండు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బయటపడకుండా నిత్యం అనేక ప్రాంతాల్లో ఈ తరహా స్టంట్లు జరుగుతున్నాయని పోలీసులకు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిపై నిఘా ఉంచడానికి డ్రోన్లు వినియోగించనున్నారు. ఒక్కో జోన్‌కు ఒక్కో డ్రోన్ చొప్పున సమీకరించుకోవాలని నిర్ణయించినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ... నడిరోడ్లపై సాగే ఈ సర్కస్ ఫీట్లలో పాల్గొంటున్న వారంతా యువకులే ఉంటున్నారు. ప్రధానంగా మధ్య, పశ్చిమ, ఉత్తర మండలాల్లోని ఎన్టీఆర్ మార్గ్, పీవీ నర్సింహారావు మార్గ్, మెహదీపట్నం, టోలీచౌకీ, బేగంపేట, బోయిన్పల్లి తదతర ప్రాంతాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని కొన్ని చోట్ల ఈ విన్యాసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి వేళల్లో సాగుతున్న వీటి వల్ల ఇతరులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆ వాహనచోదకులకు, ఎదుటి వారికీ ప్రమాదహేతువులుగా మారే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం ఉండట్లేదు. డ్రోన్ల సాయంతో గగనతలం నుంచి... దీన్ని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం ఇలాంటి వ్యవహారాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లు వాడాలని నిర్ణయించింది. ప్రతి జోన్‌కు ఒకటి చొప్పున ఉండే శక్తిమంతమైన డ్రోన్లను రాత్రి వేళల్లో రేసర్లను గుర్తించడానికి వాడనున్నారు. ఒక్కో డ్రోన్ గరిష్టంగా 250 మీటర్ల ఎత్తులో, 25 కిమీ పరిధిలో నిఘా ఉంచగలుగుతుందని అధికారులు చెప్తున్నారు. “28ఎక్స్’ వరకు జూమ్ చేసుకునే సామర్థ్యం వీటి కెమెరాలకు ఉంటుంది. ఫలితంగా రాత్రి వేళల్లోనూ కింద ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్‌ను కచ్చితంగా చూడగలరు. ఆయా ప్రాంతాల్లో ఉండే డ్రోన్ ఆపరేటర్లు స్టంట్లు చేస్తున్న వాహనాలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు. వాహనాల నంబర్ల ఆధారంగా బాధ్యుల చిరునామాలను గుర్తించి అరెస్టు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది. మూడు సెక్షన్ల కింద కేసులు సాధారణ ప్రజలతో పాటు తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారే ఈ తరహా రేసింగ్స్, స్టంట్స్‌ను తీవ్రంగా పరిగణించనున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఐపీసీతో పాటు మోటారు వాహన చట్టం, సీపీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికే చంద్రాయణగుట్ట, బేగంపేట కేసుల్లో వీటిని ప్రయోగించాం. డ్రోన్ల సాయంతో వాహనాల నంబర్లు గుర్తించి, వారి ఇళ్లకు వెళ్ళి మరీ పట్టుకుంటాం. నంబర్ ప్లేట్లు సక్రమంగా కనిపించని వాహనాల విషయంలో సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు వెళ్తాం. – నగర పోలీసు ఉన్నతాధికారి -
పోకిరీల స్టంట్లతో హడలిపోతున్న వాహనదారులు
-
వైరల్: ట్రాఫిక్‌లో డేంజరస్ బైక్ స్టంట్.. యువకుడికి దిమ్మ తిరిగింది!
బైక్ స్టంట్స్ చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. తమ బైక్ స్టంట్స్ వల్ల ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అయినా కూడా కొందరు పట్టించుకోకుండా రోడ్డుపై స్టంట్స్ చేస్తూ పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. హీరోలా ఫీల్ అవుతూ రకరకాల స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఓ బైకర్ చేసిన స్టంట్ తేడాకొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. చదవండి: వ్యక్తి చుట్టు కుప్పగా హాట్ చిప్స్.. ఫన్నీ వీడియో.. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విటర్లో పోస్టు చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రోడ్డుపై ఓ యువకుడు అందరిలాగే బైక్‌పై వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఒక్కసారిగా బైక్ ముందు చక్రాన్నిస్టైల్గా పైకి లేపాడు. అలాగే బైక్ నడుపుతూ కొంచెం దూరం వెళ్లి గాల్లోకి లేపిన చక్రాన్ని కిందకు దింపాడు. అయితే అప్పుడే ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా బైక్ బ్యాలెన్స్ తప్పింది. చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు బైక్ ఊగిపోతూ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టబోయి తప్పించుకున్నాడు. కానీ వెంటనే వెనకాల వస్తున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టాడు. దాంతో బైకర్ గాల్లో ఎగిరి పడ్డాడు. అతను వెనక తగిలించుకున్న బ్యాగ్ గాల్లో ఎగురుతూ పడింది. మరి బైకర్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ ఇక్కడితో వీడియో పూర్తయింది. ఇదంతా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. #BeSafe💐 ऐसा मत करना😢😢😢😢 Hero की Heropanti nikal gayi 😢😢😢@ipskabra @arunbothra @ipsvijrk pic.twitter.com/fHZ2mo7Rgb — Rupin Sharma IPS (@rupin1992) October 27, 2021 -
పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!!
ఒక బైకుపై ఆరుగురు వ్యక్తులు ఒకరిని ఒకరు అంటకుండా వెళ్లడం సాధ్యమా? ఫజిల్లా ఉందే.. ఇదేలా సాధ్యమౌతుంది.. ఇదేనా మీ సమాధానం. ఐతే ఈ వీడియో వైపు ఓ లుక్కెయ్యండి. బైకుకు వెనక భాగంలో ఒక నెచ్చెన కట్టి, దానికి రెండు టైర్లు అమర్చారు. బైకు నడిపే వ్యక్తి కాకుండా ఇంకా ఐదుగురు, వారి లగేజీలతోసహా ఆ నిచ్చెనపై హాయిగా కూర్చున్నారు. ఇంతమంది కూర్చోగా ఇంకా కావల్సినంత స్థలం మిగిలి ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. రోడ్డుపై వేరే వెహికల్లో ప్రయాణించే వారు ఈ సన్నివేశాన్ని రికార్డు చేశారు. దీనికి సంబంధించిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. ఒకే పనిని ఎప్పుడూ ఒకేలా ఎందుకు చెయ్యాలి.. ఇలా కూడా చేయొచ్చని వీళ్లు నిరూపించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ రేట్ల దృష్ట్యా ఐడియా అదుర్స్ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఐడియా భలే ఉందిగానీ, సేఫ్టి చూసుకోండి గురూ అని మరికొందరు సూచిస్తున్నారు. పాపం ట్రాఫిక్ పోలీసుల కంటబడితే వీళ్ల పరిస్థితి ఏంటో అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. View this post on Instagram A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde) -
బైక్ స్టంట్స్ చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు
-
‘స్ట్రీట్ ఫైట్’.. పరేషాన్!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన బాలురు, యువతి వాస్తవాలను మరిచి స్టంట్స్ చేస్తున్నారు. రియాల్టీ షోల కోసం, రియల్ హీరోయిజం చూపడానికి రెచ్చిపోతున్నారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోవడం.. తీయడం చేస్తూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగుల్చుతున్నారు. ఒకప్పుడు ఓల్డ్ సిటీలో చేపట్టిన ఆపరేషన్ చబుత్ర మంచి ఫలితాలు ఇచ్చింది. ► కరోన ప్రభావంతో గత ఏడాది నుంచి అది ఆగిపోవడంతో పరిస్థితి మళ్లీ తప్పింది. గత వారం డబీర్‌పురా పరిధిలో చోటు చేసుకున్న మహ్మద్ అద్నాన్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. దీన్ని మరిచిపోక ముందే 2015లో మీర్‌చౌక్ ప్రాంతంలో జరిగిన స్ట్రీట్‌ఫైట్ కేసు కోర్టులో వీగిపోవడం పోలీసులకు శరాఘాతంగా మారింది. మేల్కొన్న మూడు కమిషనరేట్ల అధికారులు మళ్లీ ఆపరేషన్ చబుత్రలు మొదలెట్టారు. తరచు విషాదాలు... ► నగరంలో తరచు ఏదో ఒక ఉదంతం వెలుగులోకి వస్తూనే ఉంటోంది. టీవీ షోల ప్రభావానికి లోనవుతున్న వారిలో టీనేజర్లే ఎక్కువగా ఉంటున్నారు రెజ్లింగ్‌తో ప్రేరణ పొందిన కొందరు యువకులు 2015 మేలో పాతబస్తీలో వీరంగం సృష్టించారు. ► ఫంజెషా బస్తీలో ఏడుగురు యువకుల మధ్య ప్రారంభమైన పందెం స్ట్రీట్ ఫైట్‌కు దారి తీసింది. 17 ఏళ్ల నబీల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు ఇటీవల నాంపల్లి కోర్టులో వీగిపోయింది. ► బార్కాస్ ప్రాంతానికి చెందిన జలాలుద్దీన్(19) శాలిబండలోని గౌతం జూనియర్ కాలేజీలో ఇంట ర్ ప్రథమ సంవత్సరం చదివేవాడు. కలర్స్ చానల్ నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాల్టీ షోలో పాల్గొనాలనే కోరిక ఇతడికి ఉండేది. ► ‘ఫియర్ ఫ్యాక్టర్–ఖత్రోంకే ఖిలాడీ’ సిరీస్‌కు ఎంట్రీ వీడియో తీసే ప్రయత్నాల్లో ఒంటికి నిప్పు పెట్టుకున్నాడు. 60 శాతం కాలి ఐదు రోజుల పాటు చికిత్సపొంది తుదిశ్వాస విడిచాడు. బైక్ రేసులు సైతం... ఓ ప్రాంతంలో నిఘా ఉంచి ‘రేసర్లను’ పట్టుకుంటున్నారు. వారితో పాటు తల్లిదండ్రుల్నీ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ చర్యలతో కొన్ని రోజులు మిన్నకుండిపోతున్న యువత... ఆపై ప్లేసులు మార్చి మళ్లీ రెచి్చపోతున్నారు. -
బైక్‌పై స్టంట్స్ చేస్తూ యువకుల దుర్మరణం
బెంగళూరు: బైక్‌పై స్టంట్స్ చేస్తూ ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన ఘటన బెంగుళూరులో ఆదివారం చోటుచేసుకుంది. బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని గోవిందపురకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయం రోడ్డుకు వెళ్లి బైకుపై విన్యాసాలు చేశారు. అయితే, వారు స్టంట్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి ఘోర ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని బెంగుళూరులోని ఎలహంక పోలీసులు తెలిపారు. (చదవండి: చాక్లెట్ మ్యాగీ: ఇదో విపత్తు)