Boston Consulting Group
-
ఏఐతో వ్యాపారాల్లో శరవేగంగా మార్పులు
ముంబై: కొత్త తరం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ) టెక్నాలజీలు వ్యాపార స్వరూపాలను శరవేగంగా మార్చేస్తున్నాయి. చాట్‌జీపీటీ నుంచి డాల్–ఈ తదితర సాంకేతికతలు పని ప్రదేశాల్లో చూపే సానుకూల ప్రభావాలపై దేశీయంగా మెజారిటీ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 18 దేశాల్లో పలు పరిశ్రమలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు మొదలుకుని ముందు వరుసలో పని చేసే సిబ్బంది వరకూ 12,800 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. జెన్ఏఐ రంగం శరవేగంగా మారుతోందని, ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాల్లో దానికి సంబంధించిన పరివర్తన ప్రభావాలు స్పష్టంగా తెలుస్తున్నాయని బీసీజీ ఎక్స్ (ఏఐ, సాఫ్ట్వేర్ విభాగం) గ్లోబల్ లీడర్ నికొలస్ డి బెల్ఫాండ్స్ తెలిపారు. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోనూ భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు ఏఐ ప్రభావాలపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు బీసీజీ ఎక్స్ ఇండియా హెడ్ నిపుణ్ కల్రా చెప్పారు. సర్వేలోని ముఖ్యాంశాలు.. ► పని ప్రదేశాల్లో జెన్ఏఐ ప్రభావాలపై బ్రెజిల్ అత్యంత (71%) ఆశావహంగా ఉండగా, భారత్ (60%), మధ్యప్రాచ్యం (58%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అమెరికా (46%), నెదర్లాండ్స్ (44%), జపాన్ (40%) దేశాల్లో అత్యంత తక్కువ స్థాయిలో ఆశావహ భావం నెలకొంది. ► ఏఐ గురించి ఆందోళనగా ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్ (42 శాతం), ఫ్రాన్స్ (41 శాతం), జపాన్ (38 శాతం) ఉన్నాయి. పెద్దగా పట్టించుకోని ప్రాంతాల్లో మధ్యప్రాచ్యం (25 శాతం), బ్రెజిల్ (19 శాతం), భారత్ (14 శాతం) ఉన్నాయి. ► పని విషయంలో ఏఐ ప్రభావాలపై 2018లో 35 శాతం మంది సానుకూలంగా ఉండగా ప్రస్తుతం అది 52 శాతానికి చేరింది. ► భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న 1,000 మంది ఉద్యోగుల్లో 61 శాతం మంది జెన్ఏఐ సాధనాలపై ఆశావహంగా ఉన్నారు. జెన్ఏఐతో పొంచి ఉన్న రిస్కులతో పోలిస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని 72.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏఐతో తమ ఉద్యోగ విధుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని దాదాపు 88 శాతం మంది భావించగా, ఏఐకి సంబంధించి నిర్దిష్ట నిబంధనలు అవసరమని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► సీనియర్ లీడర్లు మరింత తరచుగా జెన్ఏఐని ఉపయోగిస్తున్నారు. మిగతా ఉద్యోగులతో పోలిస్తే మరింత ఆశావహంగా ఉన్నారు. జెన్ఏఐపై వారిలో పెద్దగా ఆందోళన లేదు. 62 శాతం మంది లీడర్లు ఏఐ విషయంలో ఆశావహంగా ఉండగా, ముందు వరుసలో పని చేసే సిబ్బందిలో 42 శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. మెజారిటీ లీడర్లు (80 శాతం) మంది తాము జెన్ఏఐ టూల్స్‌ను తరచుగా వినియోగిస్తున్నామని తెలపగా, ఇతర సిబ్బందిలో ఇది కేవలం 20 శాతంగానే ఉంది. ► జెన్ఏఐని తరచుగా ఉపయోగించే వారిలో 62 శాతం మంది దానిపై ఆశావహంగా ఉండగా, నాన్–యూజర్లలో ఇది 36 శాతంగా ఉంది. జెన్ఏఐని ఉపయోగించని వారిలో ఎక్కువగా ఫ్రంట్‌లైన్ సిబ్బందే (60 శాతం) ఉన్నారు. ► ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోతాయని భావిస్తున్నట్లు అంతర్జాతీయంగా 36% మంది తెలపగా, తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని విశ్వసిస్తున్నట్లు 86% మంది అభిప్రాయపడ్డారు. -
వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం
సాక్షి, అమరావతి: ‘‘పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. సమగ్రాభివృద్ధి అంటే.. ఒకే చోట మహానగరాలు నిర్మించడం కాదు.. రక్షిత తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం.. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను పూర్తిగా రూపుమాపవచ్చు.. ఇది అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలలో, రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయి.’’ ఇవి చెప్పింది ఒకటి కాదు రెండు కాదు మూడు కమిటీలు. శివరామకృష్ణన్ కమిటీ, జీఎన్.రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) ఇవే విషయాలను నివేదికల రూపంలో అందించాయి. మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఆ కమిటీలు చెప్పిన ముఖ్యమైన అంశాలను ఓ మారు పరిశీలిద్దాం.. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే.. విభజన తర్వాత రాష్ట్ర రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తుందని తేల్చిచెప్పింది. కమిటీ సిఫార్సులివి.. ► రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్న నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైనది కాదు. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. ► శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి. ► విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం వాటిల్లుతుంది. పర్యావరణానికీ విఘాతం కలుగుతుంది. ► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే ప్రతికూల పరిణామాలనెదుర్కోవాల్సి ఉంటుంది. ► విజయవాడ–గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. జీఎన్ రావు కమిటీ ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయడానికి రిటైర్డు ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదిక ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సులు ఇవీ.. ► శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలి. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. ► అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. ► అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. ► అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే వి«షయాన్ని ప్రభుత్వానికి సూచించాం. ► రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. ► రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బీసీజీ ఏం చెప్పిందంటే సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక అందిస్తున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ► ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉంటేనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. ► చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు) ► ఆంధ్రప్రదేశ్ అప్పు ఇప్పటికే 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల కోట్ల నుంచి 1.20 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది భారం. ► అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలా అప్పు చేయడం వల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిధులుండవు. ► అమరావతి నగరంలో రూ.లక్ష కోట్లు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటికి పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. ► ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి. -
నెరవేరిన ఆరు దశాబ్దాల కల
సాక్షి, కర్నూలు : మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన హరిచందన్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలు ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా కర్నూలు నడిబొడ్డున గల కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పారాటానికి నేడు ప్రతిఫలం లభించిందని ఆ జిల్లా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు రావాలన్నది మా కలఅని, 6 దశాబ్దాల మా కల ఇన్నాళ్లకు నెరవేరిందని పేర్కొన్నారు. మా కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) హైకోర్టు ఏర్పాటు వల్ల సీమకు న్యాయం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ నిర్ణయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ స్వాగతిస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని, మూడు రాజధానుల వల్ల ప్రాంతీయ అసమానతలు ఉండవని అభిప్రాయపడ్డారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజుని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చంద్రబాబు కుట్రలన్నీ విఫలమయ్యాయి. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు కుట్రలు పన్నితే... అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఆలోచన చేశారు’ అని అన్నారు. -
సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. (ముగ్గురి నోట అదే మాట!) రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. 2019 డిసెంబర్ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్ 29న రాష్ట్రం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. (‘బోస్టన్’ చెప్పిందేంటి?) అనంతరం 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్‌క్లియర్ అయ్యింది. గవర్నర్ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘బోస్టన్’ చెప్పిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వేర్వేరు స్థితులను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఎప్పుడు ప్రకటించారు? ఆయా దేశాల్లో రోజుకు ఎన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి? యాక్టివ్ కేసులు ఎన్ని? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొం దించింది. వీటన్నింటి ఆధారంగా ఆయా దేశాల్లో కేసుల సంఖ్య పతాక స్థాయికి ఎప్పుడు చేరుకుంటాయి? లాక్డౌన్ నిబంధనలు ఏ తేదీ నుంచి ఎత్తేయొచ్చు? అన్న అంశాలపై అంచనాలను సిద్ధం చేసింది. గత నెల 25 వరకు నమోదైన గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు రోజురోజుకూ మారిపో తున్న నేపథ్యంలో తమ నివేదికను వైద్యం, భద్రతలకు సంబంధించిన సలహా సూచనలుగా పరిగణించరాదని, ప్రత్యామ్నాయాలుగానూ చూడరాదని తెలిపింది. 10వ మరణంతో లాక్డౌన్.. భారత్‌లో కరోనా కేసులు జూన్ మూడో వారంలో పతాక స్థాయికి చేరతాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా కట్టింది. నివేదికలో సూచించిన గ్రాఫ్ ప్రకారం జూన్ మూడో వా రం నాటికి రోజూ 10 వేల కంటే ఎక్కువ కొ త్త కేసులు నమోదవుతాయి. చైనాలో మాదిరిగా కరోనా కారణంగా పదో మరణం సంభవించిన రోజున భారత్ లాక్డౌన్ ప్రకటించిం దని, చైనాతో పాటు, బెల్జియం, పోలండ్ వం టి దేశాల్లోనూ దాదాపు ఇదే స్థితిలో లాక్డౌన్ ప్రకటించాయని తెలిపింది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసే సమయం గురించి ప్రస్తావిస్తూ.. ఇందుకోసం తాము చైనాలోని హుబే, వూహాన్ ప్రాం తాల్లో ఏ సమయంలో లాక్డౌన్ ఎత్తి వేశారన్నదానికి ఆయా దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థకు, ప్రభుత్వ సామర్థ్యం, నిర్దిష్ట జనాభాకు అందు బాటులో ఉన్న ఆసుపత్రి పడకల సంఖ్య వంటివి పరిగణనలోకి తీసుకున్నామని వివ రించింది. దీంతో పాటు వైరస్ బారిన పడ్డ వారి ని సమర్థంగా ఐసోలేషన్‌లో ఉంచగల సామ ర్థ్యం కూడా ముఖ్యమేనని చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్ లో జూన్ ఆఖరు నుంచి సెప్టెంబర్ రెండో వారం మధ్యలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు అవకాశముందని అంచనా కట్టింది. భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను దృష్టిలో ఉం చుకుంటే లాక్‌డౌన్‌ను కొంచెం ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరమున్నట్లు బీసీజీ భావించింది. సీఎం కేసీఆర్ నివేదిక ఆధారంగానే విలేకరుల సమావేశంలో లాక్డౌన్ పొడిగింపునకు తన మద్దతు ప్రకటించారు. -
షాకింగ్: జూన్ వరకు లాక్డౌన్ పొడిగింపు..!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో 20 రోజుల పాటు విధించిన లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడంలేదు. లాక్‌డౌన్‌ను మరికొన్ని నెలల పాటు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగినా దానిని కేంద్రం కొట్టిపారేసింది. అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరోవైపు కోవిడ్ మృతుల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 15న లాక్డౌన్ ఎత్తివేసే సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా..? అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌లో లాక్డౌన్, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టును వెలువరించింది. (లాక్డౌన్ మరింత కఠినతరం?) బీసీజీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ‘దేశంలో లాక్‌డౌన్‌ను జూన్ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్ వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టతరమైన విషయం. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఇది మరింత కఠినం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ను అదుపుచేయడం భారత్ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్ వ్యాప్తి తగ్గకముందే లాక్డౌన్ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీజీ నివేదికపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు వివిధ కోణాల్లో స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పొడిస్తారని కొందరు అభిప్రాయపడుతుండగా... ప్రాంతాలు, వైరస్ ప్రభావాన్ని బట్టి దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. కాగా, దేశంలో వైరస్ తొలిదశలో ఉన్న సమయంలోనే మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు. -
రేపే ఏపీ మంత్రివర్గం భేటీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర మంత్రివర్గం రేపు (శనివారం) సమావేశం కానుంది. హై పవర్ కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక అధ్యయనానికి ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్న కేబినెట్ హై పవర్ కమిటీ నివేదికను అధ్యయనం చేయనుంది. కాగా ఈ నెల 20న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల ముందుకు తీసుకొచ్చింది. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హై పవర్ కమిటీ శుక్రవారం కలిసింది. నివేదికపై ప్రజంటేషన్ ఇచ్చింది. -
వామపక్షాలకు పవన్ కల్యాణ్ ఝలక్
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదాపై మాట మార్చారు. హోదా కోసం తాను చేయాల్సింది చేశానని ఆయన చెప్పుకొచ్చారు మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు బీజేపీ పంచన చేరి కామ్రేడ్లకు గట్టి ఝలక్ ఇచ్చారు. పాచిపోయిన లడ్డులు ఇచ్చిందని హోదాపై కేంద్రంపై విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు కాషాయ కండువాతో జత కట్టారు. మరోవైపు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించడం వల్లే సమస్య వచ్చిందని పవన్ వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున ఇన్చార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, జనసేన తరపున పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బీజేపీ, జనసేన కీలక భేటీ : విలీనమా? పొత్తా?) ఈ భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘వామపక్ష పార్టీలకు నేను ఏమైనా బాకీ ఉన్నానా? ఆ పార్టీలకు నేనేమీ చెబుతాను. వామపక్ష పార్టీలతో కలవక ముందే బీజేపీ కోసం పని చేసాను. ఏపీ భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకు వెళతాం. ఇక అమరావతిపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.’ అని అన్నారు. కాగా అమరావతిపై ప్రభుత్వం ఎలా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మీడియా ప్రతినిధుల ప్రశ్నించగా... ఆ ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానం దాటవేశారు. ఇక పవన్ వైఖరిపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు. కాగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ కమిటీలను వేసింది. అంతేకాకుండా ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార్సులు, నివేదికలపై మంత్రులతో కూడిన హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 9..30 గంటలకు సమాశమయ్యే మంత్రివర్గం హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. -
వరదొస్తే మునుగుడే!
-
వికేంద్రీకరణే మేలు.. ఎలుగెత్తిన గళాలు
-
వికేంద్రీకరణే మేలు.. ఎలుగెత్తిన గళాలు
‘అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలా.. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా.. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధికి బాటలు పడుతుంటే అడ్డుకుంటారా.. మీ స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం కావాలా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలు విరుచుకుపడ్డారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, బీఎన్ రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు మేలు కలుగుతుందని నినదిస్తూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అంతా ఒక్కటై కదం తొక్కారు. శనివారం పలుచోట్ల ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఒంగోలు సిటీ: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, శివరామకృష్ణన్, బీఎన్ రావు కమిటీలతోపాటు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను అమలు చేయాలని కోరుతూ ఒంగోలు ప్రజలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చారు. ర్యాలీకి సంఘీభావం తెలిపిన రాష్ట్ర ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాజధానిని అమరావతికే పరిమితం చేయాలంటూ రైతులను, ప్రజలను రెచ్చగొట్టి కపట నాటకాలు ఆడుతున్న చంద్రబాబు వాటికి ఇకనైనా తెరదించాలని సూచించారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొన్నారు. కదం తొక్కిన గిరిజనులు పాయకరావుపేట/పాడేరు: విశాఖ జిల్లా పాయకరావుపేట, పాడేరులో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక కేంద్రం ఏర్పాటును స్వాగతించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా అందరి పైనా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, పాడేరు మండలం వనుగుపల్లిలోనూ గిరిజనులు భారీ ర్యాలీ జరిపారు. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్బ నరసింగరావు పాల్గొన్నారు. ఆస్తుల్ని కాపాడుకునేందుకే చంద్రబాబు రాద్ధాంతం మదనపల్లె/నగరి (చిత్తూరు జిల్లా): అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా మదనపల్లె, నగరిలో మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. వారికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా, సినీ దర్శకులు, ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమరావతిలో రైతులను మోసగించి కొన్న భూములు, ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్ ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. సెల్వమణి మాట్లాడుతూ గతంలో రాజధాని పేరిట మద్రాసు, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందన్నారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని జిల్లాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి హిందూపురం: పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు నినదించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ వికేంద్రీకరణ చేస్తేనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని నిపుణుల కమిటీలు, విశ్లేషకులు చెబుతున్నారని, ఆ దిశగానే ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని వివరించారు. అమరావతిలో టీడీపీ నేతలు సాగించిన రియల్ బాగోతం త్వరలోనే బట్టబయలవుతుందన్నారు. ‘సీమ ద్రోహులను అడుగుపెట్టనివ్వం’ కర్నూలు (సెంట్రల్): అమరావతి పేరుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎవరైనా యాత్రలంటూ రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు రవికుమార్ హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. లక్షల కోట్లు దోచుకుని జోలె పడతారా.. శ్రీకాకుళం: శ్రీకాకుళం, టెక్కలి, శ్రీకాకుళం, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడిచినా ఉత్తరాంధ్ర నేటికీ వెనుకబడి ఉందన్నారు. రూ.లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రాజధాని పేరుతో జోలెపట్టి భిక్షాటన చేయడం సిగ్గు చేటన్నారు. ర్యాలీల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పాల్గొని మద్దతు తెలిపారు. సమతుల అభివృద్ధి కోరుతూ.. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల కమిటీల సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమతుల అభివృద్ధి చెందేలా వికేంద్రీకరణ చేపట్టాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లాలో శనివారం భారీ ర్యాలీలు నిర్వహించారు. కాకినాడలో ప్రదర్శనకు ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని బాలాంత్రం గ్రామం, కాకినాడ భానుగుడి సెంటర్, అనపర్తి తదితర ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. సాగర తీరంలో కదం తొక్కిన విద్యార్థులు బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని విద్యార్థులు నినదించారు. హార్బర్ ఇంటర్నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు సాగర తీరంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల రాజధానులతో పోటీపడే స్థాయి మన రాష్ట్రంలో విశాఖపట్నానికి మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు. మేధావుల నిర్ణయం మేరకే వికేంద్రీకరణ సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తణుకు, అత్తిలి, ఇరగవరం ప్రాంతాల్లో శనివారం ప్రదర్శనలు జరిగాయి. కొవ్వూరులో కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరై మద్దతు తెలిపారు. తణుకు, ఇరగవరంలో నిర్వహించిన ర్యాలీల్లో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అనువైనది విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన చర్చాగోష్టిలో మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అనువైనదని వక్తలు పేర్కొన్నారు. పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో జరిగిన ర్యాలీలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మద్దతు ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్య వేదిక విజయనగరం కోట జంక్షన్లో ర్యాలీ నిర్వహించింది. మూడు రాజధానుల విషయంలో అడుగులు ముందుకే..: మంత్రి కొడాలి నాని గుడివాడ: చంద్రబాబు, ఎల్లో మీడియా డాంబికాలకు భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. స్థానిక కే కన్వెన్షన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలన వికేంద్రీకరణ విషయంలో మూడు కమిటీల అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని, ఇక అడుగులు ముందుకే పడతాయని స్పష్టం చేశారు. రైతులు చర్చలకు సిద్ధమైతే తాను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టం జరగకుండా చూస్తానన్నారు. విభజన సమయంలో రాష్ట్రం రూ.90 వేల కోట్ల అప్పుల్లో ఉందని, చంద్రబాబు పాలనలో మరో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ఒక కులాన్ని, వర్గాన్ని, డబ్బా మీడియాను వెనకేసుకుని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం ఉంది కదా అని అభివృద్ధిని అమరావతికే పరిమితం చేసి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి సీఎం వైఎస్ జగన్‌పై పడిందన్నారు. సమావేశంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని ఒక ప్రాంతంలోనే ఉంటే అభివృద్ధి మొత్తం ఆ ప్రాంతానికే పరిమితమవుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఒక్కచోటే పోస్తే మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. ప్రభుత్వ నిర్ణయానికి ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఉంటుంది. – చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, ఏపీ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సీమ అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదు పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. చంద్రబాబు హయాంలో సీమ అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలంకాదని పలువురు నిపుణులు చెప్పినా.. పెడచెవిన పెట్టారు. అక్కడే రాజధాని ఏర్పాటు చేసి.. నేడు కొందరికి మద్దతు తెలపడం శోచనీయం. పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. –బొజ్జ దశరథరామిరెడ్డి, జాతీయ రైతు సంఘాల సమాఖ్య కార్యదర్శి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపుతూ చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టారు. కక్ష పూరిత చర్యలతో మరోసారి ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడడం చంద్రబాబు రాజనీతికి నిదర్శనం. పాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. సీమ వాసిగా ఉండి తన 15 ఏళ్ల పాలనలో సీమ అభివృద్ధికి ఏనాడూ చర్యలు తీసుకోని బాబు.. నేడు రాయలసీమలో రాజధానులపై ర్యాలీ చేయడం విడ్డూరం. –డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉండదు. పరిపాలనా వికేంద్రీకరణను వేళ్ల మీద లెక్కించే కొందరే వ్యతిరేకిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారే ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతిస్తోంది. – చల్లా జయశంకరరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు సీఎం నిర్ణయం అభినందనీయం రాష్ట్రంలో మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకోవడంతో పాటు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం హర్షణీయం. విశాఖలో సుమారు రెండు లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.. వీరిలో ఎవరికైనా హైకోర్టులో అప్పీల్ చేయాల్సి వస్తే ఇక్కడ హైకోర్టు బెంచ్ అవసరం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలనా వికేంద్రీకరణకు పూనుకోవడం అభినందనీయం. – ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావ సభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు పెంటకోట చంద్రరావు -
జనవరి 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
-
ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే ఈ నెల 18న కేబినెట్ భేటీ కానుంది. చదవండి: అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం ముగిసిన హై పవర్ కమిటీ భేటీ వికేంద్రీకరణకే పెద్దపీట -
అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు
‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? సామాజిక న్యాయం జరగకూడదనుకుంటున్నారా? అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలన్నదే మీ ఉద్దేశమా? వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందంటే అడ్డుపడతారా? మీ స్వార్థం కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అభివృద్ధి అంతా అమరావతిలోనే జరగాలనడం న్యాయమా? ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ మీరు చేసిందేమిటి? రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? గ్రాఫిక్స్‌తో చుక్కలు చూపించడం తప్ప ఏం చేశారు? ఇన్సైడర్ ట్రేడింగ్‌తో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సృష్టించుకోవడం తప్ప సామాన్య ప్రజానీకానికి ఏ విధంగానైనా లబ్ధి కలిగించారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయనకు వంతపాడుతున్న ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, జీఎన్‌రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘మీ హయాంలో ఎవరికీ మేలు చేయలేదు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుణ్యమా అని మేలు జరగబోతుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. బాబు తీరును నిరసిస్తూ అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. తీరు మారకపోతే మా ప్రాంతాల్లో అడుగు పెట్టలేరంటూ హెచ్చరించారు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం సబబుకాదని హితవు పలికారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయాలన్న నినాదాలు హోరెత్తాయి. నగరంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా శుక్రవారం భారీ ర్యాలీలు జరిగాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ అన్నివర్గాల ప్రజలు నినదించారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలు ర్యాలీ జరిపారు. అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, గాజువాక, మాడుగుల నియోజకవర్గాల్లో ప్రజలు కదం తొక్కారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పరిసరాల్లో తన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి వదరయ్యపాళెం/పలమనేరు/శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా సత్యవేడులో మహిళలు, విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మూడు రోడ్ల కూడలిలోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పూతలపట్టు తదితర నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. సత్యవేడులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే.. చంద్రబాబుకు వచ్చిన బాధేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే కళావతి అన్నింటికీ అమరావతే అనడం సరికాదు పాలన వికేంద్రీకణ జరగాలని ఆకాంక్షిస్తూ ‘తూర్పు’గోదావరి జిల్లా అంతటా శుక్రవారం ఉద్యమం ఊపందుకుంది. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు ఎర్రవంతెన నుంచి హైస్కూల్ సెంటర్ వరకూ ర్యాలీలో పాల్గొన్నారు. తునిలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని సాంస్కృతికంగా అభివృద్ధి చేస్తామని గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుపేర్కొన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తదితరులు కోటిపల్లి బస్టాండ్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి బైఠాయించారు. రామచంద్రాపురంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యువత ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తారా? కడప కార్పొరేషన్: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కడప ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమరావతి పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు నాయుడు కేవలం తన సామాజిక వర్గం ప్రయోజనాలను కాపాడటానికే మూడు రాజధానుల అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ఖాజా రహమతుల్లా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దు అనంతపురం: అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ జరగాలని కోరుతూ అనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ మేరకు కలెక్టర్ గంధం చంద్రుడుకు విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. గిరిజన విద్యార్థి సంఘం, ఎంఐఎం విద్యార్థి సంçఘం, వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ప్రాథమిక విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ సాంబశివారెడ్డి మద్దతు ప్రకటించారు. హిందూపురంలో టీడీపీ వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు ప్రాంతాల అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆందోళనలను అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. థ్యాంక్యూ.. సీఎం కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిస్తూ కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’ అంటూ నినదించారు. కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన పాణ్యం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు. నంద్యాల, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, మంత్రాలయంలో ర్యాలీ చేపట్టారు. సమగ్రాభివృద్ధి కోరుతూ.. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ విజయనగరం జిల్లావ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ర్యాలీలు హోరెత్తాయి. విజయనగరం మూడు రోడ్ల జంక్షన్లో మానవ హారం నిర్వహించారు. బొబ్బిలి, కురుపాం, పార్వతీపురం, సాలూరు, కొత్తవలస, భోగాపురంలో ర్యాలీలు జరిగాయి. నెల్లూరు రూరల్, ఆత్మకూరు పట్టణం, చేజెర్ల, సంగం, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పోడూరు, ఏలూరు నగరం, ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలం బాదంపూడి తదితర ప్రాంతాల్లో బైక్, కార్ల ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కొట్టు విశాల్ మద్దతు పలికారు. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, చర్చాగోష్టులు నిర్వహించారు. సోంపేటలో‘అధికారం–అభివృద్థి–వికేంద్రీకరణ’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో.. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మేధావుల ఫోరం చెబుతోందని స్పష్టం చేశారు. టెక్కలిలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. అమరావతిలో భూములు కొన్న నాయకులే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ రెండో భేటీ ముగిసింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అలాగే ఈ నెల 13వ తేదీన కమిటీ మరోసారి సమావేశం కానుంది. సమావేశం అనంతరం మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు ప్రజలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికపై క్షుణ్ణంగా చర్చించామన్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోందని, తప్పకుండా రైతుల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని అభిప్రాయపడ్డారు. ఒకేచోట అభివృద్ధితో ఎంత నష్టపోయామో చరిత్ర చెబుతోందన్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి సమాంతరంగా జరగాలని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు.. కొద్ది రోజుల నుంచి టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెర తీశారు. రైతుల్లో లేనిపోని అపోహలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. అమరావతిలో భూ దందాను నడిపి ఆయన లబ్ది పొందాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదా? వెనుకబడిన ప్రాంతాలు అలానే ఉండాలా? కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. జోలె పట్టుకొని తిరగడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి. ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా... మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, స్వలాభం కోసమే చంద్రబాబు తాపత్రాయపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం మంచిదికాదని సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ముందుకు వెళతాం అని ఆయన స్పష్టం చేశారు. చదవండి: వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అందరి అభిప్రాయాలు తీసుకుంటాం మూడింటిలోనూ ఉద్ధండులే! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే -
అమరావతి ఉద్యమంలో టీడీపీ మరో కుట్ర
-
బయటపడిన టీడీపీ మరో కుట్ర
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియాలో మరో కుట్రకు తెరతీసింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే... అతడి మృతిని రాజధాని ప్రాంతానికి ఆపాదించింది. రాజధాని రైతు ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని చనిపోయాడంటూ సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం చేపట్టింది. ఈ నేపథ్యంలో వీడియోపై ఆరా తీయగా... అది తమిళనాడుకు చెందిందని తేలడంతో టీడీపీ కుట్ర బట్టబయలైంది.(మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు) కాగా రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలకు తెర తీసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఓ రైతు మరణిస్తే.. ఆయన మరణాన్ని రాజధాని వికేంద్రీకరణ పరిణామాలకు ముడిపెట్టారు. అదే విధంగా చిన్నకాకాని వద్ద ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని.. ఆయన కారుపై రాళ్లతో దాడి చేసిన విషయం విదితమే. ఇలా అడుగడుగునా ఆందోళనలు సృష్టించి.. శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజధాని రైతులను రెచ్చగొట్టడానికి ఇప్పుడేమో ఇలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు.(ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) నీకెందుకు డబ్బులు వేయాలి.. చంద్రబాబుకు చేదు అనుభవం! కఠిన చర్యలు తీసుకుంటాం.. తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగినట్లుగా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారని గుంటూరు ఐజీ పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలను ట్రోల్ చేస్తూ ప్రశాంతంగా ఉన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటువంటి అసత్య వార్తలను ప్రసారం చేసినా.. ఇతరులకు షేర్ చేసినా.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అందరి అభిప్రాయాలు తీసుకుంటాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అలాగే, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పరిపాలనా వికేంద్రీకరణ కూడా అవసరమని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తెలిపింది. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికలపై చర్చించామని.. ఇంకా దీనిపై అధ్యయనం చేస్తామని కమిటీకి నేతృత్వం వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మరో మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పాలనా వికేంద్రీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ తొలి సమావేశం మంగళవారం విజయవాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగింది. సమావేశం అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలనే అంశంపై రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతోందని, దానిపై సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించామని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటివరకు రెండు కమిటీలిచ్చిన నివేదికలను విశ్లేషించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకునేందుకు సీఎం వైఎస్ జగన్ హైపవర్ కమిటీని నియమించారని చెప్పారు. తొలి సమావేశంలో జరిగిన చర్చలో వికేంద్రీకరణ జరగాల్సిందేనని కమిటీ భావించిందని.. జోన్లు, సెక్టార్ల వారీగా అభివృద్ధి ఎలా జరగాలో చర్చించామన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి పరిపాలనా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామన్నారు. తదుపరి సమావేశంలో మరింత సుదీర్ఘంగా, వివరంగా జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై చర్చిస్తామని, ఆ తర్వాత హైపవర్ కమిటీ తరఫున ఒక నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ మాత్రమే జరిగిందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ప్రభుత్వానికి అందిన వివిధ నివేదికలు, నిజాలు, లెక్కలన్నీ చూసి చరిత్రలో జరిగిన అనేక పరిణామాలు, పరిస్థితుల్ని కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. కమిటీ తరఫున రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేకపాటి గౌతంరెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆదిమూలపు సురేష్, సీఎం ప్రత్యేక సలహాదారు అజేయ కల్లం, ఐఏఎస్ అధికారులు నీరబ్‌కుమార్ ప్రసాద్, శ్యామలరావు, విజయ్‌కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు, బీసీజీ గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు. -
ముగిసిన హై పవర్ కమిటీ భేటీ
-
హై పవర్ కమిటీ భేటీ ప్రారంభం
-
ముగిసిన హై పవర్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరిగింది. అధికార వికేంద్రీకరణతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ముఖ్య అధికారులు, జీఎన్ రావు హాజరయ్యారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై మంత్రులు, అధికారులు ఈ భేటీలో చర్చించారు. -
వికీపీడియాలో పచ్చ దొంగలు
-
బీసీజీపై వికీపీడియాలో దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) వాస్తవ సమాచారం నెటిజన్లకు తెలియకుండా టీడీపీ మద్దతుదారులు వికీపీడియాలో ఆ పేజీని ఎడాపెడా మార్చివేశారు. రెండురోజుల్లోనే 12 సార్లు అందులోని సమాచారాన్ని మార్చి అది వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిల కంపెనీ అని, బఫూన్ కన్సల్టెన్సీ అని తప్పుడు సమాచారాన్ని జోడించారు. బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు వికీపీడియా పేజీని చూడగా ఈలోపే దాన్ని ఇష్టానుసారం మార్చి ఆ సంస్థపై దుష్ప్రచారానికి పూనుకున్నారు. బీసీజీ సమాచారాన్ని పూర్తిగా మార్చివేయడంతో ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వికీపీడియా యాజమాన్యం తప్పుడు సమాచారాన్ని సరిచేసింది. (చదవండి: ముగ్గురి నోట అదే మాట!) -
వికీపీడియాలో పచ్చదొంగలు
-
బీసీజీతో చంద్రబాబు అనుబధం