candidates drought
-
టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా..
సాక్షి, తిరుపతి: సొంత జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబునాయుడు నానా తంటాలు పడుతున్నారు. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లా నాయకులపై రుసరుసలాడుతున్నారు. ఎలాగైనా నామినేషన్లు వేయించి ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. కానీ ఆయన మాటలు విని ఎవ్వరూ ముందుకు రానంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు కాళ్లబేరానికి రావడం సబబుగాలేదని అంటున్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ నేతల బరితెగింపు.. బాబు హైరానా జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి రోజు తమ పార్టీ మద్దతు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు నానా హైరానా పడ్డారు. శ్రీరంగరాజుపురం మండలంలో పలువురు గ్రామస్థాయి నేతలకు నేరుగా ఫోన్లుచేసి ప్రాధేయపడ్డారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనవని, ఎలాగైనా నామినేషన్ వేయాలని కోరినట్లు తెలిసింది. ఆయన అభ్యర్థనను టీడీపీ శ్రేణులు తిస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నప్పుడు టీడీపీ తరఫున ఎలా పోటీ చేయమంటారని నేరుగా ఆయననే ప్రశ్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. అన్నీ ఏకగ్రీవమైతే పార్టీ పరువు పోతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాటదాటేసినట్టు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చదవండి: పంచాయతీ పుట్టింది ఇలా.. కుప్పంలో ఎదురుగాలి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పలువురు గ్రామ స్థాయి నాయకులకు చంద్రబాబు ఫోన్ చేసి నామినేషన్ల విషయమై చర్చించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2013 కంటే ఎక్కువ స్థానాల్లో టీడీపీ శ్రేణులు నామినేషన్లు వేసి గెలవాలని ఆదేశించినట్లు తెలిసింది. అందుకు తాము సుముఖంగా లేమని ముఖం మీదే చెప్పినట్లు సమాచారం. అధికారంలో ఉన్నన్ని రోజులు పట్టించుకోని అధినేత ప్రస్తుతం పరువు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చిన్న ఉద్యోగం కోసం సాయం చేయమంటే అందుకు ఏ నాయకుడూ ముందుకు రాలేదని చెప్పినట్టు శాంతిపురంలో చర్చజరుగుతోంది. ఇక ఎస్ఆర్పురం మండలంలో 30 ఏళ్లుగా టీడీపీనే నమ్ముకున్న ఓ కార్యకర్త ఇంటి స్థలం కోసం ఓ మండల స్థాయి నాయకుడి వద్దకు వెళ్లి ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయిందని మండిపడ్డారు. ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకున్నా.. కేవలం 2 సెంట్ల స్థలం ఇవ్వలేని పార్టీ కోసం తానెందుకు పోటీ చేయాలని ప్రశ్నించినట్టు తెలిసింది. -
‘పసుపు’ పలచనైంది..
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి నేడు సిద్దిపేట నియోజకవర్గంలో టీడీపీకి ఎదురవుతోంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్‌ను కలిగి రాష్ట్ర స్థాయిలో పార్టీ అధిష్టానం దృష్టిలో పడిన సిద్దిపేట టీడీపీ నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలవెలాపోతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సంగ్రామంలో రాజకీయ పార్టీల నేతలు తమ జెండాలను గ్రామాల్లో రెపరెలాడించేందుకు కార్యన్మోఖులయ్యారు. కాని నియోజక వర్గంలోని మూడు మండలాల్లో టీడీపీ పరిస్థితి నిరాశ జనకంగా ఉంది. నియోజకవర్గంలోని సిద్దిపేట చిన్నకోడూర్, నంగునూర్ మండలాల పరిధిలో ఉన్న 47 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 17 స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండడం విశేషం. మరోవైపు మిగతా స్థానాలకు అభ్యర్థులు దొరకకపోవడంతో ఆయా గ్రామాల క్యాడర్ పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లో ప్రశ్నార్ధకంగానే మారింది. వివరాల్లోకి వెళ్తె.. టీడీపీ అవిర్భావ సమయం నుంచి 2000 సంవత్సరాల వరకు 17 సంవత్సరాలు నియోజకవర్గంలో టీడీపీది ఏకఛత్రాధిపత్యం. ప్రస్తుత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. కాలక్ర మేణా టీఆర్ఎస్ అవిర్భావం చెందడం. కేసీఆర్‌తో పాటే ఉన్న పార్టీ శ్రేణుల్లో అత్యధికం ఆయన బాటే పట్టారు. ఉన్న కొద్దిపాటి క్యాడర్‌తో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో పార్టీ అభ్యర్థుల ఎన్నిక కష్టతరంగా మారింది. కొన్ని గ్రామాల్లో అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టినప్పటికీ నామినేషన్ల నాటికి కూడా అభ్యర్థులు దొరక కపోవడంతో పరిస్థితి అనుకూలంగా ఉన్న గ్రామాల్లోని అభ్యర్థులను బరిలోకి నిలిపింది. అయినప్పటికీ అత్యధిక గ్రామాల్లో టీడీపీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం తొమ్మిది చోట్ల అభ్యర్థులను నిలిపారు. మరోవైపు మొన్నటి వరకు మండలంలో కొద్దిపాటి బలం ఉన్న నంగునూరులో పరిస్థితి దయనీయంగా మారింది. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 4 చోట్ల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిద్దిపేట మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు నాలుగురే పోటీకి దిగడంతో నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల బ్యాలెట్ పేపర్లో 30 స్థానాల్లో టీడీపీ ఊసేలేకపోవడం విశేషం. -
అభ్యర్థులు కరువు
చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మదనపల్లె, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి మున్సిపాల్టీల్లో మొదటి రోజు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒక్కనామినేషన్ కూడా వేయలేదు. రెండవ రోజు చిత్తూరులో కాంగ్రెస్ తరపున రెండు నామినేషన్లు వేశారు. ఆరు మున్సిపాల్టీల్లో 169 వార్డులకు, చిత్తూరులో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండగా అభ్యర్థులు ప్రాంతీయ పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ టిక్కెట్లకు డిమాండ్ ఉంది. ఈ రెండు పార్టీల్లో టిక్కెట్లు దొరకని వారు స్వతంత్రంగా బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ టిక్కెట్టు కోసం ఎవరూ ఆసక్తి చూపటం లేదు. పత్తాలేని మున్సిపల్ కో-ఆర్డినేటర్లు పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మున్సిపాల్టీ ఎన్నికల కోసం నియమించిన కో-ఆర్డినేటర్లు ఇప్పటి వరకు పత్తాలేరు. కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చిత్తూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సీకే.బాబు రాజీనామా చేయడంతో ఇక్కడ కాంగ్రెస్ చుక్కానిలేని నావలా మారింది. మదనపల్లె మున్సిపాల్టీలో షాజహాన్‌బాష వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల మైనార్టీలు ఆసక్తి చూపడం లేదు. ఇక శ్రీకాళహస్తి, పుత్తూరు, పుంగనూరు మున్సిపాల్టీల్లో సరేసరి. బీజేపీకి గడ్డు పరిస్థితి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడి ఫీవర్‌తో నెట్టుకురావాలని చూసిన బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతోంది. చిత్తూరు కార్పొరేషన్లో అన్ని డివిజన్లకు అభ్యర్థులను పెట్టగలిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మున్సిపాల్టీల్లోనూ అక్కడక్కడా ఒకటీ అరా నామినేషన్లు వేయడం మినహా ఇంతవరకు బీజేపీ అభ్యర్థిత్వాల కోసం ఆశావహులు ఎవరూ పరుగులు దీయడం లేదు. బీజేపీ తరపున నిలబడితే ఉపయోగం లేకపోగా, తామే ఆ పార్టీ ప్రచారానికి ఉపయోగపడాల్సి వస్తుందని అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. -
మిగిలింది ఆయనే!
2009లో... రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలుతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో కొలువయ్యారు. ఫలితంగా ఆ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున టిక్కెట్ దొరకడం ప్రతిష్టాత్మకంగా భావించారు. 2014లో... తెలుగు ప్రజలను నిలువునా చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ పరిస్థితుల్లో పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా బరిలో నిలిచే అభ్యర్థులు కరువయ్యారు. పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదానికి తెరతీసింది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా విభజన వైపు ఆ పార్టీ వేస్తున్న ఒక్కో అడుగు రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఇతర పార్టీల ఆహ్వానం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచినా అటువైపు అడుగులేసే నాయకుడు కరువయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కోట్ల కుటుంబం పెద్ద దిక్కుగా మారింది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించే అభ్యర్థులే కరువయ్యారు. విధిలేని పరిస్థితుల్లో ఈ విడత కోట్ల కుటుంబమంతా బరిలో నిలిచేందుకు నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. పార్లమెంట్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బరిలో నిలుస్తుండగా.. కుటుంబ సభ్యులు రెండు అసెంబ్లీ స్థానాల నుంచి.. అనుచరుడు మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం ఉంది. కోట్ల తన కుమారుడు రాఘవేందర్‌రెడ్డి రాజకీయ రంగప్రవేశం ఆలూరు నియోజకవర్గం నుంచి చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ స్థానం నుంచి అనుచరుడిని బరిలో నిలపనున్నట్లు సమాచారం. ఇక డోన్ అసెంబ్లీ స్థానం నుంచే తాను బరిలో నిలవనున్నట్లు కోట్ల సుజాతమ్మ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. ఆ మేరకు గత ఆదివారం స్థానికంగా ఆమె ఓ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమై మద్దతు కోరడం తెలిసిందే. తక్కిన పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను సైతం అధిష్టానం కోట్ల భుజస్కంధాలపైనే ఉంచినట్లు పార్టీ వర్గీయుల్లో చర్చ కొనసాగుతోంది. ఎమ్మిగనూరు బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా టీడీపీ నేత ఒకరికి పార్టీ తీర్థం ఇప్పించి పోటీ చేయించవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి టీజీ వెంకటేష్ ఒకవేళ పార్టీ మారితే ఎవరిని బరిలో నిలపాలనే విషయమై కోట్ల ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రచారం జరుగుతున్నట్లుగా టీజీ పార్టీ వీడితే టీడీపీ నేత ఒకరిని కాంగ్రెస్‌లో చేర్చుకుని పోటీ చేయించేందుకు అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.