Chanchalguda Central Prison
-
బెయిల్‌పై భానుకిరణ్ విడుదల
చంచల్‌గూడ (హైదరాబాద్): హైదరాబాద్‌లో 2011 జరిగిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసు ప్రధాన నిందితుడు భానుకిరణ్ బుధవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ హత్య కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తెలిసిందే. చర్లపల్లి జైల్లో ఉన్న భానుని 2016లో చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన భానును.. అత్యంత పటిష్ట భద్రత మధ్య అతని అనుచరులు మరో చోటికి తరలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడేందుకు భాను నిరాకరించాడు. అతని అనుచరుడు మన్మోహన్ ఏడేళ్ల శిక్ష పూర్తి చేసుకుని 2018లో విడుదలయ్యాడు. -
జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం?
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ బాషాకు కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జానీ బాషాను చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు. ఇక, జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.జానీ బాషా లైంగిక వేధింపులకు పాల్పడిన విషయంలో తన నేరాన్ని ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అలాగే, దురుద్దేశంతోనే ఆమెను తన అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది.షూటింగ్ సమయంలో కూడా వ్యాన్లోనే ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అందుకు ఆమె నిరాకరిస్తే జుట్టు పట్టుకుని బాధితురాలి తలను అద్దానికేసి కొట్టాడు. మత మార్పిడి సైతం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్య సుమలత(అలియాస్ ఆయేషా)పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంగా సుమలతపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: అభయ్ నోటిదురుసు వల్ల అందరికీ నష్టం.. అర్ధరాత్రి బిగ్‌బాస్ వార్నింగ్ -
రాధాకిషన్ రావును కరిచిన ‘పిల్లి’.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ మాజీ టాస్కో ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ‘పిల్లి’కరిచింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్త్రావమైంది. సమాచారం అందుకున్న జైలు అధికారులు అత్యవసర చికిత్స కోసం రాధాకిషన్ రావును నారాయణ గూడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
బిగ్‌బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్‌లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్‌ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్‌తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్‌తో పాటు సోదరుడు మనోహర్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్‌గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత
సాక్షి కర్నూలు/ హైదరాబాద్: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు.. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు. ఇది కూడా చదవండి: మంచి చేసే ఉద్దేశం వాళ్లకు లేదు.. నారా చంద్రబాబును నమ్మొద్దు: సీఎం జగన్ -
ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తానని పేర్కొన్నారు.ఎందుకు అకారణంగా తనను రోజుల తరబడి హౌజ్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. బోనులో పెట్టినా పులి..పులే.. నేను రాజశేఖర్‌రెడ్డి బిడ్డనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అరాచకాలు ఇంక ఎంతకాలం సహించాలని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీసులు బెదిరించారని.. తన ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేసినట్లు పేర్కొన్నారు. ఎవరిమీద చేయి చేసుకోలేదని అన్నారు. పోలీసులు ఏ అధికారం ఉందని తనను హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిట్ ఆఫీస్‌కు సామాన్యుడికి పోయే పరిస్థితి లేదా? అని నిలదీశారు. ఇక్కడున్నది రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. భయపడటం తెలీదన్నారు. ‘రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే నా మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఏం సాధించారు. కేసీఆర్‌కు పరిపాలన చేతనైందా. అవినీతి చేయడం చేతనైంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్‌కు చేతనైంది. కేసీఆర్ ఎప్పుడైనా సెక్రటేరియట్‌కు వెళ్లారా? కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కొడుకు రియల్ ఎస్టేట్, కుమార్తె లిక్కర్‌స్కాం, చేయడం సాధ్యమైంది. వేలకోట్ల అవినీతి సొమ్ము సంపాదించడమే తెలిసింది. తాలిబన్లలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇది అప్ఘనిస్తాన్ అనకపోతే ఏమనాలి. వైఎస్సార్టీపీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసులకు తెలియదా? పోలీసులు నాపై పడి దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. నాపై మళ్లీ దాడి చేస్తారనే ఉద్ధేశంతోనే పోలీసులను తోసేశాను. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నన్ను చూడటానికి అమ్మ వస్తే అది తప్పా? అమ్మతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.’ అని షర్మిల పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన! -
TSPSC పేపర్ లీక్ కేసులో ఇద్దరికి ఈడీ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి లభించింది. రెండు రోజులపాటు వాళ్లను కస్టడీకిలోకి తీసుకుని విచారించొచ్చని కోర్టు ఈడీ అధికారులకు తెలిపింది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌లను ఈడీ ప్రశ్నించేందుకు అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ మేరకు ఈ నెల 17, 18 తేదీల్లో.. అదీ చంచల్‌గూడ జైల్లోనే ఇద్దరిని ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతించాలంటూ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈడీ. ఈ మేరకు జైల్లోనే నిందితులను విచారించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. ఆ విజ్ఞప్తికి కోర్టు అనుకూలంగా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. -
చంచల్‌గూడ జైలుకు నిహారిక
సాక్షి, క్రైమ్: నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేసి.. తాజా నిందితులుగా చేర్చి సోమవారం హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్‌లను ఏ2, ఏ3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హాసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక గర్ల్‌ఫ్రెండ్. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్‌ను అతి కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేశాడు. ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్య జరిగిన తర్వాత.. ప్రియుడు హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఆపై అవసరం ఉందని చెబితే రూ.1500 ట్రాన్స్ఫర్ కూడా చేసింది. నవీన్‌ను హత్య చేసిన ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని పోలీసులు తేల్చారు. మరోవైపు తన ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం ద్వారా ఆధారాలను మాయం చేసేందుకు నిహారిక ప్రయత్నించిందని తెలుస్తోంది. -
చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
-
డ్రగ్స్ కేసులో పోలీసుల కస్టడీకి మోహిత్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్, ప్రముఖ హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల క్రితం నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మోహిత్‌ను అరెస్ట్ చేసింది. తాజాగా చంచల్‌గూడ జైలు నుంచి మోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడుతున్న ప్రముఖుల వివరాలు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారనే కోణంలో పోలీసుల ప్రశ్నిచనున్నారు. గోవా కింగ్ పిన్ ఎడ్విన్‌తో మోహిత్‌కు గల సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి కాల్ లిస్ట్, వాట్సప్ చాటింగ్‌లపైనా ప్రశ్నించనున్నారు. కాటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 50 మందికిపైగా కంజూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, గోవా, ముంబైలో ఈవెంట్స్ నిర్వహించిన మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదీ చదవండి: డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి నేహా దేశ్‌పాండే భర్త అరెస్ట్ -
నిందితులకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ (ఏ–1), నందకుమార్ (ఏ–2), సింహయాజీ స్వామి (ఏ–3)లను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ వారు లొంగిపోని పక్షంలో పోలీసులు అరెస్టు చేయవచ్చని తెలిపింది. ఈ నెల 27వ తేదీన ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ముగ్గుర్నీ అరెస్టు చేశారు. సరూర్‌నగర్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి ఇంట్లో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.. ఈనెల 26న రాత్రి మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే భౌతికంగా నగదు పట్టుబడకపోవటంతో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును జడ్జి తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై జస్టిస్ సీహెచ్ సుమలత విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, నిందితుల తరఫున న్యాయమూర్తి ఇమ్మనేని రామారావు వాదనలు వినిపించారు. నిందితుల వెనుక పెద్దలెవరో నిగ్గు తేల్చాల్సి ఉంది: ఏజీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నిందితుల రిమాండ్ అవసరం. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేశారు. నిందితులు వచ్చిన తర్వాత దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా వారిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది. కిందికోర్టు రిమాండ్‌కు తరలింపునకు ఉత్తర్వులు జారీ చేయకపోవడం చెల్లదు. నిందితులను రిమాండ్‌కు పంపేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డ్లిను నిందితులు ప్రలోభపెట్టారనేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. నిందితుల ముగ్గురి వెనుక ఉన్న కీలక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉంది. నిందితులను రిమాండ్‌కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది..’ అని ఏజీ నివేదించారు. సివిల్ పోలీసులకు దర్యాప్తు అధికారం లేదు.. రామారావు వాదనలు వినిపిస్తూ.. ‘ఘటనా స్థలంలో నగదు ఏమీ లభ్యం కాకున్నా, కావాలని కేసులో ఇరికించారు. సీఆర్పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా రిమాండ్‌కు పంపడం చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పుల ప్రకారం 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిందే. అసలు అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఈ కేసు నమోదు, దర్యాప్తు చేసే అధికారం సివిల్ పోలీసులకు లేదు..’ అని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులను లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు లొంగిపోయినా, పోలీసులు అరెస్టు చేసినా జ్యుడీషియల్ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఆర్పీసీ సెక్షన్లు 50–ఏ, 51, 54,55, 56, 57లను పాటించాలని స్పష్టం చేశారు నందకుమార్ ఇంట్లో అరెస్టు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో షేక్‌పేటలోని ఆదిత్యా హిల్‌టాప్ అపార్ట్మెంట్లోని నందకుమార్ ఇంట్లో ముగ్గుర్నీ అరెస్టు చేసిన పోలీసులు.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. కాసేపటి తర్వాత మెయినాబాద్ ఠాణాకు తరలించి, మరోసారి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇక్కడే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. నిందితులు ఇక్కడ ఉన్నంత వరకు పోలీసులు మీడియాతో పాటు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెస్టుల తర్వాత తిరిగి మెయినాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు. అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే అప్పటికే కోర్టు సమయం ముగియడంతో సరూర్‌నగర్‌లోని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. నిందితుల ఆరోగ్యం దృష్ట్యా రిమాండ్‌కు అనుమతించొద్దని వారి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయమూర్తి, జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు అయ్యేందుకు వాహనం ఎక్కిన నిందితుల ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులకు సింహయాజి చెయ్యి ఊపుతూ టాటా చెప్పారు. మునుగోడు ఎన్నికల తర్వాతే కస్టడీ.. కేసు తదుపరి దర్యాప్తును మునుగోడు ఎన్నికల తర్వాతే చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని భావించిన సైబరాబాద్ పోలీసులకు బ్రేక్ పడినట్లయింది. నవంబర్ 4 తర్వాత కస్టడీ పిటిషన్‌ను సిద్ధం చేస్తామని, కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఫామ్‌హౌస్ సమావేశంపై శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు నందకుమార్ ఏర్పాట్లు చేశారు. కానీ ఈలోగా హైకోర్టు అరెస్టు ఆదేశాలు ఇవ్వటంతో అది జరగలేదు. -
అంతా నిరుపేద కుటుంబాల వారే...
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం కేసులో అరెస్టు అయిన 45 మంది నిందితుల్లో దాదాపు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని జైలు అధికారులు చెప్తున్నారు. సోమవారం 28 మంది నిందితుల తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చి ములాఖత్ ద్వారా తమ కుమారులను కలిశారు. నిందితుల్లో ఒకరు సింగరేణి ఉద్యోగి కుమారుడు కాగా, మరొకరు ఆర్టీసీ ఉద్యోగి కుమారుడని గుర్తించారు. ఈ ఇద్దరూ మినహా మిగిలిన 26 మంది నిందితులూ బెయిల్ కోసం న్యాయవాదుల ఖర్చులు కూడా భరించలేరని పేద కుటుంబాలకు చెందిన వారని అంటున్నారు. తమ కుమారులు ఇలాంటి ఆందోళన, విధ్వంసం చేయడానికి సికింద్రాబాద్ వెళ్తున్నట్లు తమకు చెప్పలేదని, కోచింగ్ కోసం వెళ్తున్నట్లు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అమాయకులను అరెస్టు చేశారు శుక్రవారం గణేష్ ఎక్కడకు వెళ్లాడో మాకు తెలీదు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. రాత్రి 11 గంటలకు ఎస్సై ఫోన్ చేసి బాబు మా దగ్గర ఉన్నాడని, అతడి ఆధార్ నంబర్ పంపమని చెప్పారు. ఎక్కడ ఉన్నాడని అడిగితే సికింద్రాబాద్ కేసులో పట్టుకున్నామన్నారు. మా బాబు రైల్వేస్టేషన్ గోడ అవతలే ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు పట్టుకున్నారు. అసలు నిందితులు దొరక్కపోవడంతో వాళ్ల ఉద్యోగాల కోసం పోలీసులు అమాయకుల్ని అరెస్టు చేశారు. ములాఖత్‌లో కలిసినప్పుడు మా అబ్బా యి ఇదే చెప్తున్నాడు. మేము స్టేషన్లోకి వెళ్లలేదు... స్టేషన్ గోడ అవతలే పట్టుకుని అరెస్టు చేశారని ఏడుస్తున్నాడు. – అంజయ్య కసారాం, నిందితుడు గణేష్ తండ్రి, సంగారెడ్డి జిల్లా లాయర్ని మాట్లాడుకోవడానికి డబ్బుల్లేవ్ మా పిల్లలు చేయని నేరానికి జైలు పాలయ్యారు. లాయర్ని మాట్లాడుకోవడానికీ డబ్బులు లేవు. దయచేసి మా పిల్లల్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని చేతులెత్తి మొక్కుతున్నా. మా పిల్లలను కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌లకు విన్నవించుకుంటున్నా. ఇప్పటికే జైలు పాలైన వారి జీవితం నాశనమైంది. మహేందర్ అరెస్టు విషయం తెలిసి మూడు రోజుల క్రితం ఊరి నుంచి రూ.2 వేలు తెచ్చా. ఇప్పుడు ఖర్చులకూ డబ్బుల్లేవు. దీంతో బస్టాండులో పడుకుంటున్నా. ఆర్మీలో చేరాలనేది మా వాడి ఐదేళ్ల కల. ఇప్పుడు అది కలగానే మిగిలిపోయింది. విద్యార్థుల వల్లే వచ్చిన తెలంగాణలో వాళ్లే జైలు పాలవుతారని అనుకోలేదు. మా పిల్లలు ఆర్మీ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని చెప్తున్నారు. – సాయప్ప, నిందితుడు మహేందర్ మామ, రాంపూర్ గ్రామం, తాండూరు -
తమ పిల్లలకు ఏ పాపం తెలియదంటూ కన్నీరుమున్నిరు
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంస సృష్టించిన కేసులో 46 మంది చంచల్గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిని కలిసేందుకు తల్లి, దండ్రులు జైలు వద్దకు వచ్చారు. సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలతో ములాఖత్‌లో కలవడానికి వచ్చారు. నిందితులుగా జైలులో ఉన్న తమ పిల్లలకు ఏమౌతుందోననే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలు సిబ్బంది వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
ఎట్టకేలకు ములాఖత్‌కు రాహుల్ గాంధీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు ఎట్టకేలకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి అనుమతి దొరికింది. ములాఖత్‌కు అనుమతించాలని మరోసారి విజ్క్షప్తి చేయండంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ ధృవీకరించారు. రాహుల్‌తో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. శనివారం మధ్యాహ్నాం సమయంలో జైల్లో ఉన్న పద్దెనిమిది మంది ఎన్ఎస్యూఐ నేతలను ముగ్గురు కీలక నేతలు పరామర్శిస్తారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నిరసనలు చేపట్టగా.. పోలీసులు వాళ్లందరినీ అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
రాహుల్ తెలంగాణ టూర్లో మరో షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టూర్‌కి మరో షాక్ తగిలింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్‌కు అనుమతి లభించలేదు. చంచల్‌గూడ జైలు సూపరిండెంట్ ఈ మేరకు రాహుల్‌గాంధీ ఎన్ఎస్ఐయూ నేతలతో ములాఖత్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ మీటింగ్‌కు వీసీ అనుమతి ఇవ్వని సంగతి ఇదివరకే తెలిసిందే. ఈ క్రమంలో.. కౌన్సిల్ నిర్ణయంపై వర్సిటీలో ఎన్ఎస్యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీళ్లతో ములాఖత్ అయ్యేందుకు రాహుల్ గాంధీని అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు. అయినా అధికారులు అంగీకరించలేదు. మరోవైపు వరంగల్‌లో జరిగే రైతుల సంఘర్షణ సభకు హాజరుకానున్నారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఓరుగల్లుకు తరలిపోతున్నాయి. ఇంకోపక్క నల్లగొండ నుంచి అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ సభకు డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ఏ ముఖం పెట్టుకుని ఓయూ వెళతారు? -
శిల్పా చౌదరికి బెయిల్.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదల
సాక్షి, మణికొండ: సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు పిలిచి, అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని వారిని నమ్మించి కోట్లు దండుకున్న శిల్పాచౌదరికి ఎట్టకేలకు రాజేంద్రనగర్ కోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ఆమెపై ఉన్న 3 కేసులలోను బెయిలు మంజూరవడంతో శుక్రవారం విడుదలయ్యారు. శిల్పాచౌదరికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10వేల రూపాయల చొప్పున ష్యూర్టీలు సమర్పించాలని చెప్పింది. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం చేయొద్దని .. నిబంధన విధించింది. ఎవరితోనూ ఫోన్లో కానీ, డైరెక్ట్‌గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని సాక్షులను బెదిరించరాదని కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతీ శనివారం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని తెలిపింది. కాగా గతనెల 13న ఆమెపై దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా 25వ తేదీన శిల్పను అరెస్టు చేసి 26న రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం 3 సార్లు కస్టడీకి తీసుకుని విచారించినా మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేసిందో మాత్రం నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్‌నగర్‌లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణల్లో పేర్కొంది. చదవండి: పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం? -
శిల్పా చౌదరికి రూ.11కోట్లు ఇచ్చిన ఆ బాధితురాలెవరు..?
సాక్షి, హైదరాబాద్: తన పేరు మీద గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్‌లో విల్లా నంబర్–17 మాత్రమే ఉందని కిట్టీ పార్టీలతో సంపన్న వర్గాల మహిళల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన తెల్ల శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పెట్టుబడులు, అధిక వడ్డీల రూపంలో పలువురు బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును మరో మహిళకు ఇచ్చానని, ఆమె మోసం చేయడంతోనే ఈ ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. నగదు తీసుకున్న మహిళ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లతో పాటు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌ల స్థిర, చరాస్తులపై విచారణాధికారులు, నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రెండ్రోజులు ఆరా తీసినట్టు తెలిసింది. వందల సంఖ్యలో బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలతో బినామీ పేర్లతో స్థలాలు కొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడెక్కడ కొన్నారు.. ఆస్తులు ఎవరి పేర్ల మీదు ఉన్నాయో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శిల్ప కస్టడీ శనివారం మధ్యాహ్నంతో ముగియడంతో ఆమెను తిరిగి చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. రూ.11 కోట్లు ఇచ్చిందెవరు? దివానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసిన శిల్ప.. హై ప్రొఫైల్ సెలబ్రిటీలతో నెలలో రెండు సార్లు కిట్టీ పార్టీలు నిర్వహించేది. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు ఇస్తానని ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి రూ. కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఒక్క బాధితురాలు మాత్రం రూ.11 కోట్లు ఇచ్చినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఆమె ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదన్నారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) బాధితులు వేలల్లో.. ఫిర్యాదులు మూడే! శిల్పా చౌదరి కాల్ డేటా ఆధారంగా ఆమె బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ముగ్గురు మహిళా బాధితులే నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుప్పాలగూడలోని మహిళ వ్యాపారవేత్త దివ్యారెడ్డి (రూ.1.05 కోట్లు) ఫిర్యాదుతో శిల్ప బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సూపర్‌స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శిణి (రూ.2.9 కోట్లు) ఫిర్యాదు చేసింది. మూడో బాధితురాలు నార్సింగికి చెందిన వ్యాపారవేత్త రోహిణి (రూ.3.1 కోట్లు) కేసు నమోదు చేసింది. వీళ్ల ముగ్గురు శిల్పకు ఇచ్చిన సొమ్ము రూ.7.05 కోట్లు. శిల్ప చెప్పేదంతా అవాస్తవం తాను వసూలు చేసిన మొత్తంలో రూ.6 కోట్లు జన్వాడకు చెందిన టంగుటూరి రాధికా రెడ్డికి ఇచ్చానని పోలీసులకు శిల్ప చెప్పినట్టు తెలిసింది. ఆమెను పోలీసులు విచారిచంగా శిల్ప చెప్పేదంతా అవాస్తవమని, ఆమెనే తన దగ్గర డబ్బులు తీసుకుందని రాధిక ఆరోపించింది. శిల్ప ఇచ్చిన చెక్కులు, ఇతర పత్రాలను పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. -
శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్ చేసేందుకే ఇచ్చారా?
మణికొండ: కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను పరిచయం చేసుకొని వారి నుంచి భారీగా డబ్బు గుంజిన శిల్పా చౌదరిని పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఆమెను 2 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) శిల్పాచౌదరిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చింది. తొలుత విచారణలో ఆమె పెద్దగా సహకరించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణాధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అయితే ఆమె ఫోన్ కాల్‌డాటా, వాట్సాప్ చాటింగ్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లపై ప్రశ్నించడంతో విలపించినట్లు సమాచారం. చాలా మంది బ్లాక్‌మనీని వైట్ చేసేందుకు పెట్టుబడి రూపంలో ఇచ్చారని, మరికొందరు అధిక వడ్డీకి ఆశపడి అప్పుగా ఇచ్చారని పోలీసులకు వివరించినట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టినది, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సమాధానం దాటవేసినట్లు తెలిసింది. సంపన్నుల డబ్బును ఎగ్గొట్టే ఎత్తుగడను శిల్పాచౌదరి అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. శనివారం కూడా ఆమె విచారణ సాగనుంది. -
చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: ‘క్యూ న్యూస్’ ఛానల్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు సోమవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఓ జ్యోతిష్యుడు కొద్ది రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులు సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Q News Mallanna: తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా? బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కాగా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు అయ్యియి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా.. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న చిలకలగూడ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
నాగశౌర్య ఫామ్‌హౌస్ కేసు: కస్టడీలోకి ప్రధాన నిందితుడు
హైదరాబాద్: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్ పేకాట కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు జరిపిన తర్వాత.. నిందితుడు సుమన్ చౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. పేకాట, క్యాసినో ఇతర కేసుల వివరాలపై ఆరాతీస్తున్నారు. కాగా, ఫామ్ హౌజ్దేని కోసం తీసుకున్నారు..? ఎవరెవరి పాత్ర ఉంది..? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట -
తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: క్యూ నూస్ చానెల్ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ.. తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి( ఆగస్టు 27న) మల్లన్నను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా శనివారం మల్లన్నను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో భాగంగా తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్ 306,సెక్షన్ 511 కింద కేసులు పెట్టడంపై అతని తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదిదారుడు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును అడిగింది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తామని తెలిపిన కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం మల్లన్నను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇక మల్లన్న కేసు విషయానికి వస్తే.. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు . అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నకు రెండుసార్లు నోటీసులు అందించారు. అయితే నోటీసులపై మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! ఓటుకు కోట్లు కేసు: రేవంత్ రెడ్డికి సమన్లు -
సీబీఐ ఎదుట బొల్లినేని మౌనవ్రతం
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ సీబీఐకి సహకరించడం లేదు. మే 1 నుంచి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సోమవారం కూడా బొల్లినేనిని అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎన్ని విధాలా ప్రశ్నించినా.. తనకు అనారోగ్యం ఉందని సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అదే విధంగా రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన విధానం, వాటి డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నలు సంధించినా నోరు తెరవలేదని తెలిసింది. చివరి రోజు అయిన మంగళవారం కస్టడీ ముగియనుంది. ఆఖరు రోజైనా సమాధానాలు రాబట్టాలన్న పట్టుదలతో ఉన్నారు సీబీఐ అధికారులు. విచారణ అనంతరం బొల్లినేని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. చదవండి: బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా! -
నోరు మెదపని బొల్లినేని శ్రీనివాసగాంధీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ నోరు విప్పలేదని సమాచారం. మే 1 నుంచి 4వ తేదీ వర కు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి బొల్లినేనిని తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు వేసి విచారణకు తీసుకురావడం గమనార్హం. ఈ సందర్భంగా తొలిరోజు విచారణలో సీబీఐ అధికారులకు గాంధీ ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2019 జూలైలో బొల్లినేనిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా సహకరించకపోవడంతో నాటకీయ పరిణామాల మధ్య ఏప్రిల్ 20న ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ రోజు కూడా అనేక అనారోగ్య కారణాలు చూపి అరెస్టు తప్పించుకుందామనుకున్న గాంధీని సీబీఐ ఎట్టకేలకు అరెస్టు చేసింది. శనివారం సీబీఐ అధికారుల ప్రశ్నలకు బొల్లినేని ఎలాంటి సమాధానాలు చెప్పలేదని సమాచారం. గతంలో ఇలాంటి కేసులు ఎన్నో విచారించిన బొల్లినేని ప్రస్తుతం తానే ముద్దాయి కావడంతో కావాలనే సమాధానం చెప్పడం లేదని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. చదవండి: బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా! -
జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. కిడ్నాప్ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉంటున్న ఆమెకు బెయిల్ లంభించడంతో శనివారం బయటకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆమె 18 రోజులుగా జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ కోర్టుల్లో అనేక సార్లు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే అఖిలప్రియకు బెయిల్ మంజూరు కావడంతో బెయిల్ ఆర్డర్ కాపీలను ఆమె తరుఫు న్యాయవాదులు జైలుకు తీసుకువచ్చారు. అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అఖిల ప్రియ విడుదలతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. (మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’!) మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.