chilakaluripeta
-
కాసేపట్లో చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచార భేరి
-
YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం
-
ప్రజాగళం సభపై కొమ్మినేని కామెంట్స్
-
ప్రజాగళం సభపై అంబటి సెటైర్లు
-
చిలకలూరిపేటలో ప్రజలకు చేరని గళం
కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న చిలకలూరిపేట ప్రజాగళం కాస్తా.. టీడీపీ, జనసేన అత్యుత్సాహంతో నీరుగారిపోయింది. వందల ఎకరాలు, లక్షల జనాలు అంటూ ఉదరగొట్టిన కూటమి ప్రచారం.. ఆచరణలో చల్లబడింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత స్పీచులను తిరగేసి చదవగా.. ప్రధాని మోదీ జాతీయ వాదాన్ని వినిపించారు. బీజేపీతో పొత్తు ఎందుకంటే.? : చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుంది. ఎవరికీ అనుమానం లేదు. మోదీ ఒక వ్యక్తి కాదు... భారత్‌ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి. మోదీ అంటే సంక్షేమం.. మోదీ అంటే అభివృద్ధి. మోదీ అంటే భవిష్యత్తు... మోదీ అంటే ఆత్మవిశ్వాసం. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి... మోదీ. అందుకే రాష్ట్ర ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఐదుకోట్ల మంది ప్రజలకు ఆనందం కలిగించేందుకే ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన చేరాయని, అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్టీఆర్‌ను కీర్తించిన ప్రధాని మోదీ చిలకలూరిపేట సభలో ప్రధాని నరేంద్రమోదీ .. తన ప్రసంగంతో చంద్రబాబుకు పరోక్షంగా చురకలంటించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పదవిని, పార్టీని లాక్కుంటే.., ప్రధాని మోదీ మాత్రం చిలకలూరిపేట వేదికగా ఎన్టీఆర్‌ను కీర్తించారు. చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. "ఆంధ్రా ప్రజలందరికీ నమస్కారాలు" అన్నారు. "ఎన్టీఆర్ రాముడి పాత్రలో జీవించారు, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఆ దృశ్యమే గుర్తొచ్చింది, పేదలు, రైతుల కోసం ఎన్టీఆర్ పోరాడారు, ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల వేళ ఆయన స్మారక నాణెం విడుదల చేశాం. తెలుగు బిడ్డ పీవీకి భారత రత్న ఇచ్చి గౌరవించాం. అప్పట్లో కాంగ్రెస్ ఎన్టీఆర్‌ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది" అని అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు నిన్ననే ఎన్నికల నగారా మోగింది తర్వాతి రోజే నేను ఆంధ్రప్రదేశ్ కు వచ్చా కోటప్పకొండ ఈశ్వరుడి ఆశీస్సులతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నా త్రిమూర్తుల ఆశీర్వాదం లభించినట్లుగా భావిస్తున్నా వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం 400 ఎంపీ సీట్లు దాటాలి .. ఎన్డీఏ కి ఓటేయాలి ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ వికాసాన్ని కలిపి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది ఎన్డీఏ పేదలకు సేవ చేసే ప్రభుత్వం పదేళ్ల నా పాలనలో 30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు రాష్ట్రానికి, పల్నాడుకు ఎంతో చేశాం ఏపీకి అనేక జాతీయ విద్యాసంస్థలొచ్చాయి ఎన్డీఏలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళతాం కాంగ్రెస్ మాత్రం మిత్ర పక్షాలను వాడుకుని వదిలేస్తుంది ఇండియా కూటమిలో ఎవరికి వారే అన్నట్టుగా పరిస్థితి ఉంది ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పర విరుద్ధంగా పనిచేస్తుంటాయి కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతాయి కాంగ్రెస్, లెఫ్ట్ దిల్లీలో మాత్రం కలిసిపోతాయి ఎన్నికలకు ముందే విభేదాలు బయటపడ్డాయి కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులను వాడుకుని వదిలేస్తుంది ఇండియా కూటమి... అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచించండి -
చిలకలూరిపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్
-
అవ్వలతో మంత్రి విడదల రజిని సరదా సన్నివేశం
-
మంత్రి పదవి అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచేసిన పుల్లారావు
-
ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమిది
సామాన్యుడికి వైద్యం అందించే విషయంలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టాం. ఇంటింటా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని.. ఆరోగ్య భరోసా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. ఈ రోజు పెన్షన్లు ఏ మాదిరిగా మీ ఇంటికి నడిచి వస్తున్నాయో.. అదే మాదిరి వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి.. అవసరమైన సందర్భాల్లో మీ ఇంటికి కూడా కదిలి వచ్చే కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి,గుంటూరు: ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశానికే రోల్ మోడల్‌గా, వైద్య ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ విధానం రాబోయే రోజుల్లో దేశం మొత్తం మన వద్ద కాపీ చేసుకుని, అమలు చేసే రోజు వస్తుందని ఆకాంక్షించారు. మనిషి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో గురువారం ఆయన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించారు. అక్కడి విలేజ్ క్లినిక్‌ను సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలు, చేస్తున్న పరీక్షలు, అందుబాటులో ఉన్న మందుల గురించి వైద్య సిబ్బందితో ఆరా తీశారు. గ్రామంలో ఎంత మందిని స్క్రీనింగ్ చేశారు.. ఎంత మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి.. వాటిని యాప్‌లో ఎలా నమోదు చేస్తున్నారన్న విషయాన్ని అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘ఇక డాక్టర్ కోసం మీ గ్రామం నుంచి ఎక్కడెక్కడికో పట్టణాలకు పోవాల్సిన అవసరం లేదు. డాక్టరే మీ గ్రామానికి వస్తాడు. మీ ఇంటి చేరువకే వస్తాడు. మీ కుటుంబం కోసం, మన పేదల కోసం అక్కడికే వైద్యుడితో పాటు వైద్య సేవలు కూడా వస్తాయి. అక్కడే మీ జబ్బుల గురించి తెలుసుకుని, అక్కడే మందులు ఇచ్చే గొప్ప కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తదితరులు తొలి దశలోనే జబ్బులను గుర్తించవచ్చు ► పేదలు, పేద సామాజిక వర్గాల వారు హాస్పిటల్స్ చుట్టూ, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పరీక్షలు చేయించుకోవడం కోసం పరీక్ష కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఆధునిక వైద్యాన్ని మీ గ్రామంలోనే ఉచితంగా అందించడానికే ఈ విధానం తీసుకువచ్చాం. గ్రామంలో మంచానికే పరిమితమైన రోగుల గడప వద్దే అవసరమైన వైద్యం అందజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం. ► ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అని ఒక నానుడి. జబ్బులు ముదరకుండా.. రాకుండా కాపాడేందుకు ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకువచ్చాం. దీనివల్ల బీపీ, షుగర్, ఇతరత్రా రోగాలను తొలి దశలోనే కనుక్కోగలుగుతాం. వాళ్లకు వెంటనే వైద్యం అందించి, ముదరకుండా కాపాడగలుగుతాం. ఇది ఒక్క బీపీ, షుగర్లకు మాత్రమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ వరకూ ప్రతి పేదవాడికి ఒక రక్షణ చక్రంగా నిలుస్తుంది. మన గ్రామానికి నడిచి వచ్చిన గొప్ప వ్యవస్థ ► ఇదే లింగంగుంట్ల వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో ఏకంగా 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేయడం కోసం డయాగ్నస్టిక్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీడియో కాన్ఫ్రెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఎవరికి బాగా లేకపోయినా విలేజ్ క్లినిక్‌కు వెళితే స్పెషలిస్టు డాక్టర్లు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యం అందించే గొప్ప వ్యవస్థ ఈ రోజు మన గ్రామానికే నడిచి వచ్చింది. ► ప్రతి 2,000–2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. ఇందులో బీఎస్సీ నర్సింగ్ చేసిన వ్యక్తి కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)గా ఉంటారు. మరో ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంటుంది. వీళ్లిద్దరే కాకుండా ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్‌లో రిపోర్టు చేసే వ్యవస్థ ఆవిర్భవించింది. తద్వారా ప్రతి పేదవాడికి 24 గంటలపాటు వైద్యం అందించవచ్చు. ► విలేజ్ క్లినిక్‌లను మండలానికి రెండు పీహెచ్‌సీలకు అనుసంధానం చేస్తున్నాం. ప్రతి హీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఇందులో ఒక డాక్టర్ ఓపీ చూస్తుంటే.. రెండో డాక్టర్ కదిలే వైద్యశాల అయిన 104 వాహనం ఎక్కి, ప్రతిరోజూ తనకు కేటాయించిన గ్రామాల్లోకి వెళ్తాడు. అక్కడి విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై సేవలు అందిస్తాడు. మండలానికి నలుగురు డాక్టర్లు ► మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు.. అంటే ప్రతి మండలానికి నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వీరు డ్యూటీలు మార్చుకుంటూ ప్రజలకు సేవ చేస్తారు. ప్రతి డాక్టరు కూడా తనకు కేటాయించిన గ్రామానికే తాను వెళ్తాడు కాబట్టి.. ఆ డాక్టర్ పేరు, మొబైల్ నంబరు ప్రతి విలేజ్ క్లినిక్‌లో, ప్రతి గ్రామ సచివాలయంలో పెద్ద అక్షరాలతో డిస్ప్లే చేస్తారు. ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డాక్టర్ మీకు అందుబాటులో ఉంటాడు అనే భరోసా ఉంటుంది. ► నెలకు రెండు నుంచి నాలుగుసార్లు అదే గ్రామానికి వచ్చి వైద్యం అందిస్తాడు. తద్వారా ఆ డాక్టరుకు ఆ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని పేరు, పేరున పిలిచే పరిచయం ఏర్పడుతుంది. అదే ఫ్యామిలీ డాక్టర్ విధానం. ఈ కాన్సెప్ట్ట్ను అమలు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, ఒక పద్ధతి ప్రకారం ముందు చూపుతో 104 వాహనాలు కొనుగోలు చేయడం, విలేజ్ క్లినిక్‌లు స్థాపించడం, ముందుగానే వైద్యులు, సిబ్బంది నియామకం, ఆరోగ్యశ్రీకి సంబంధించిన యాప్స్ తయారు చేయడం, అవి డౌన్లోడ్ చేసి వినియోగించే విధానం వీళ్లందరికీ నేర్పించాం. రెండు పథకాల మీదే రూ.10 వేల కోట్లు ► ఆరోగ్యశ్రీ అనగానే దివంగత నేత రాజశేఖరరెడ్డి పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి చేరువగా, ఉచితంగా తీసుకువచ్చారు. వైఎస్సార్ తదనంతరం ఈ పథకాన్ని నీరుగార్చుతూ వచ్చారు. చంద్రబాబు హయాంలో ఈ పథకంలోని ప్రొసీజర్స్‌ను 1000కి కట్టడి చేశారు. రూ. 800 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. ► మనందరి ప్రభుత్వం రాగానే ఆ బకాయిలను చెల్లించడమే కాకుండా, ప్రొసీజర్స్‌ను ఏకంగా 3,255కు విస్తరించాం. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ఆస్పత్రులు గతంలో కేవలం 919 మాత్రమే ఉంటే, ఇవాళ వాటి సంఖ్య 2,261. మన ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలో 35,71,596 మంది సేవలు అందుకున్నారు. ► నిరుపేద ప్రాణం, నిస్సహాయుల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఒక్క ఆరోగ్యశ్రీ మీద చేసిన ఖర్చు రూ. 9 వేల కోట్లు. ఇది కాకుండా ఆరోగ్య ఆసరా కింద మరో రూ.990 కోట్లు ఖర్చు చేశాం. ఈ రెండు పథకాల మీదే రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. తేడా మీరే గమనించండి.. ► గత ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఇవాళ మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.3,300 కోట్లు వెచ్చిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో 46 నెలల కాలంలో ఏకంగా 48,639 ఉద్యోగాలు ఇచ్చాం. ► దేశ వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 33 శాతం, స్టాఫ్ నర్సులు 27%, జనరల్ íఫిజీషియన్ 50% ఖాళీలు ఉంటే మనం వంద శాతం భర్తీ చేశాం. స్పెషలిస్టు డాక్టర్లకు సంబంధించి దేశ వ్యాప్తంగా 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో 96.04 శాతం పూర్తి చేశాం. ► దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ స్థాపించాం. అక్కడ 10,032 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, అంతేమంది ఏఎన్ఎంలను నియమించాం. ఆశా వర్కర్లకు గతంలో రూ.3 వేల జీతం ఉంటే ఇప్పుడు రూ.పది వేలు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వమే కొత్తగా 560 అర్బన్ పీహెచ్‌సీలు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాం. ప్రతి 2,500 జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం ఉన్న ఏకైక రాష్ట్రం మనదే. చంద్రబాబునాయుడు వైద్య రంగంపై ఏటా రూ.ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే మనం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం. ► రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే ఉంటే, కొత్తగా 17 మెడికల్ కళాశాలలను నిర్మిస్తున్నాం. పాత కళాశాలలను నాడు–నేడు కింద తీర్చిదిద్దుతున్నాం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. 104, 108 వాహనాలు కొత్తగా 1,514 కొనుగోలు చేశాం. ► గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 229 రకాల మందులు, అవి కూడా నాసిరకం అందుబాటులో ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక 562 రకాల డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటున్న వాళ్లు, తలసేమియాతో బాధ పడుతూ మంచానికే పరిమితమైన వాళ్లకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. ► ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించడమే కాకుండా, ఆ మనిషి ఇంటికి వెళ్లి తిరిగి పనులు చేసుకునే వరకు అండగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5 వేలు చొప్పున వైద్యుల సలహా మేరకు విశ్రాంతి సమయంలో సాయం చేస్తున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా 46 నెలల కాలంలోనే మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2,05,108 కోట్లు జమ చేశాడు. వివక్ష, లంచాలు లేని పాలన సాగుతోంది. ఇదీ.. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. మీరే గమనించండి. బాబుకు స్కామ్‌లే తప్ప.. స్కీమ్‌లు తెలియవు స్కామ్‌లు చేయడమే తప్ప స్కీంలు తెలియని బాబులు ఉన్నారు. వారికి అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. మాత్రమే తెలుసు. లంచావతారాలు, గజ దొంగలు, వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ మంచావతారాలు, సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్న జీవులు.. ఇలా ఒకరు చంద్రబాబు రూపంలో, ఒకరు ఈనాడు రూపంలో, ఒకరు ఆంధ్రజ్యోతి, మరొకరు టీవీ5 రూపంలో.. వీరికి తోడుగా ఒక దత్తపుత్రుడు రూపంలో కనిపిస్తారు. ఫలానా మంచి పని చేశామని చెప్పుకోలేని వీరికి మిగిలింది జిత్తులు, ఎత్తులు, పొత్తులు, కుయుక్తులు మాత్రమే. వీటితో మాత్రమే వీరు రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డ నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తుంటే, దీనికి అక్క చెల్లెమ్మల నుంచి వస్తున్న మద్దతు చూసి తట్టుకోలేక తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి. నాకు అంగబలం, అర్థబలం, మీడియా బలం లేకపోయినా.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. నేను పొత్తులపై ఆధార పడను. నాకు ఎవరితోనైనా పొత్తు ఉందంటే అది ప్రజలతో మాత్రమే. నాకు కుయుక్తులు చేతకాదు. అబద్ధాలు చెప్పలేను. మోసం చేయలేను. పన్నాగాలు, జిత్తులు చేత కాదు. నేను ఏది చెప్తానో అదే చేస్తాను. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా.. అన్నది కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా సైనికుల్లా నిలబడండి. చిలకలూరిపేటకు వరాలు చిలకలూరిపేటలో రూ.150 కోట్లతో తాగునీటి కోసం పనులు జరుగుతున్నాయి. దీనికి మున్సిపల్ వాటాగా ఖర్చు పెట్టాల్సిన రూ.63 కోట్లు కావాలని మంత్రి విడదల రజిని అడిగింది. దీన్ని మంజూరు చేస్తున్నా. అంబేడ్కర్ కమ్యూనిట్ హాల్, బీసీ భవన్, కాపు భవనాలను మంజూరు చేస్తున్నా. ముస్లిం శ్మశానం, దర్గా నిర్మాణం కోసం 3 ఎకరాల భూమిని మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నా. లిఫ్ట్ ఇరిగేష¯న్ స్కీం మరమ్మతులకు ప్రతిపాదనలు రాగానే వాటిని కూడా పూర్తి చేస్తాం. జగనన్నా.. ఇది మీరు పెట్టిన భిక్ష బీసీ మహిళనైన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసిన జగనన్నకు రుణపడి ఉంటాను. అన్నా.. నా రాజకీయ జీవితం నీవు పెట్టిన భిక్ష. చిలకలూరిపేట లాంటి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ మంత్రిగా ఉండటమే మీ చిత్తశుద్ధికి నిదర్శనం. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. ఆరోగ్య రంగానికి ఏం మేలు చేశారో చెప్పాలి. ఆయన ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తి యుద్ధం అంటూ కాలక్షేపం చేశారు. చంద్రబాబు నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చు.. నాలుగు టీవీలు, నాలుగు పత్రికలు, నాలుగు పార్టీలతో పొత్తులు కలిగి ఉండొచ్చు. కానీ నాలుగు కోట్ల మంది ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉండరు. ఆ స్థానం మా జగనన్నదే. రాబోయే ఎన్నికల్లో మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా, మీ దుష్టచతుష్టయం ఎన్ని అరాచకాలు చేసినా మిమ్మల్ని ఓడించడం ఖాయం. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మీ వల్లే బతికున్నా.. నేను కూలి పనులు చేసుకునే వాడిని. నా కిడ్నీలు పాడయ్యాయని, వెంటనే డయాలసిస్ చేయాలన్నారు. చాలా డబ్బు ఖర్చవుతుందని నేను భయపడ్డాను. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని డాక్టర్ అడిగారు. ఉందని చెప్పాను. ఆ కార్డు ఆధారంగా నా వద్ద నుంచి ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా నన్ను బతికిస్తున్నారు. వలంటీర్ వచ్చి నీకు రూ.10 వేలు ఫించన్ జగనన్న పంపారని ప్రతి నెలా ఇస్తున్నారు. ఆ డబ్బుతో, ఇతరత్రా మీ పథకాలతో నా కుటుంబం ముందుకెళ్తోంది. మా నాన్నకు గుండె సమస్య వస్తే ఎలాంటి ఖర్చు లేకుండా స్టంట్ వేశారు. ఇప్పుడు తీసుకొస్తున్న ఫ్యామిలీ డాక్టర్ పథకం మాలాంటి పేదలకు వరం. మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాం. – ఎం.రమేష్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారు, లింగంగుంట్ల -
వెంకాయమ్మ చెబితే ఏ అధికారి అయినా మాట వినాల్సిందే! ఎదురు చెబితే..
పార్టీలో ఆయనో సీనియర్ నేత. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగారు. అధికారంలో ఉన్నంత కాలం భార్యాభర్తలు అడ్డంగా దోచుకున్నారు. పార్టీ ఓడిపోయాక మకాం హైదరాబాద్‌కు మార్చాడా మాజీ మంత్రి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ నియోజకవర్గాన్ని వదిలేశాడు. ఇప్పుడు కార్యకర్తలకు టైం వచ్చింది. ఆయనపై రివెంజ్ తీర్చుకునే పనిలో పడ్డారు. ఆ నేత ఎవరో? ఆయన మీద రివెంజ్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. అబ్బో ఘన చరిత్ర ప్రత్తిపాటి పుల్లారావు ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తికాలం మంత్రిగా పనిచేశారు. టీడీపీలో కీలక నేతగా ఉండటంతో మంత్రిగా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్తిపాటి పుల్లారావు తన సంపదలను అడ్డగోలుగా పెంచేసుకున్నారు. మైనింగ్, లిక్కర్, రేషన్ మాఫియాకు రింగ్ మాస్టర్‌గా వ్యవహరించారు. ఇక ఆయన భార్య వెంకాయమ్మ అయితే సెటిల్మెంట్ల వ్యవహారంలో ఆరితేరిపోయారు. జిల్లాలో ఏ అధికారికి పోస్టింగ్ ఇవ్వాలన్నా, ట్రాన్స్ ఫర్ కావాలన్నా రేట్లు నిర్ణయించి వసూలు చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పుల్లారావు భార్య వెంకాయమ్మ చెబితే ఏ అధికారి అయినా మాట వినాల్సిందే. ఎదురు చెబితే ఏమవుతుందో అధికారులకు బాగా తెలుసు. ఇలా ఐదేళ్లపాటు భార్యా భర్తలు జిల్లా మొత్తం ఊడ్చేశారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహనరెడ్డి దెబ్బకు పుల్లారావు అడ్రస్ గల్లంతయ్యింది. దీంతో వెంటనే హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. అప్పటినుంచి టీడీపీ అనే పార్టీ ఉందనే విషయాన్నే పూర్తిగా మర్చిపోయాడు. అసలు చిలకలూరిపేట వైపు చూడడమే మానేశారు ప్రత్తిపాటి పుల్లారావు. ఆయన రూటే సెపరేటు పుల్లారావు తీరుతో టీడీపీ కార్యకర్తలు చిలకలూరిపేటకు పార్టీ ఇన్చార్జి ఉన్నారో లేదో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధినేత కార్యక్రమాలకు పిలుపునిచ్చినా పుల్లారావు మాత్రం పేటవైపు కన్నెత్తి చూడడంలేదు. స్థానిక టీడీపీ నేతలు కొంతమంది పుల్లారావు వ్యవహారశైలిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఓడాక పుల్లారావు చిలకలూరిపేటకు రాకుండా హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేశారని ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదంటూ.. ఆధారాలను చంద్రబాబు ముందు పెట్టారు. దీంతో చంద్రబాబు పుల్లారావుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. అయినా పుల్లారావు తీరు మారలేదు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే గుంటూరుకు వచ్చి హాజరవడమే తప్ప చిలకలూరిపేటకు మాత్రం వెళ్లేవాడు కాదాయన. దీంతో పుల్లారావుకు సీటిస్తే తమ తడాఖా చూపిస్తామని చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు తేల్చి చెప్పేశారు. పుల్లారావుకు బదులు మరో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్ద కొత్త డిమాండ్ లేవనెత్తారు. పార్టీని, కార్యకర్తలను పట్టించుకోని పుల్లారావుకు ఎందుకు సీటివ్వాలని ఏకంగా అధినేతకే ప్రశ్నల వర్షం కురిపించారని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు కూడా నియోజకవర్గం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకున్నారట. అవకాశం ఇస్తే సై పుల్లారావు తీరుతో విసుగు చెందిన స్థానిక నేతలంతా ఇక ఆయనతో కుదరదని నిర్దారించుకుని... మనమే కొత్తనేతను వెతుక్కుందామని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏగా పనిచేసిన పావులూరి శ్రీనివాస్పేరును తెరపైకి తెచ్చారు. పావులూరి కూడా అధినేత అవకాశం ఇస్తే చిలకలూరిపేటనుంచి పోటీ చేసేందుకు సై అన్నాడట. ఈ విషయం తెలుసుకున్న పుల్లారావు పావులూరి కాళ్లు, గడ్డాలు పట్టుకుని బతిమిలాడాడట. ఇక పావులూరితో కూడా ప్రయోజనం లేదని అర్థం చేసుకున్న చిలకలూరిపేట తెలుగుదేశం నాయకులంతా కలిసి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే కొంతమంది నందమూరి సుహాసిని వద్దకు వెళ్లి పేటనుంచి పోటీ చెయ్యాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. సుహాసిని కూడా పోటీ చెయ్యడానికి సుముఖంగానే ఉన్నారని, పైగా బాలకృష్ణ కూడా సపోర్టు చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు చిలకలూరిపేట తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు, లోకేష్ లకు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. తాను అక్కడ లేకపోవడంతో...పేటలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకుని ప్రత్తిపాటి పుల్లారావు తెగ కంగారు పడిపోతున్నారట. చివరికి పుల్లరావును చిలకలూరిపేట తమ్ముళ్ళు ఏంచేస్తారో చూడాలి. -
అందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యం: మంత్రి రజిని
చిలకలూరిపేట: పేదలందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన 2,272 గృహాలను మంత్రి శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా చిలకలూరిపేటలో ఫేజ్–1 కింద నిర్మించిన 4,512 టిడ్కో గృహాల్లో తొలి విడతగా 2,272 గృహాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో మిగిలిన గృహాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఫేజ్–2 కింద నిర్మిస్తున్న మరో 1,008 గృహాల పనులు త్వరగా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, దుష్టచతుష్టయం ఓర్వలేక విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, పేదలకు అండగా ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, టిడ్కో ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ జి.ప్రసాదరావు, మెప్మా పీడీ వెంకటనారాయణ, రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు. -
కేవలం వారిని ఓటు బ్యాంక్‌గానే చూశారు: విడదల రజిని
-
ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రమాదవశాత్తు చెరువులో బైక్‌తో సహా పడి.. రాత్రంతా నిస్సాహాయంగా అక్కడే ఉండిపోయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీ చెందిన రాజుపాలెం ప్రసాద్ (22) రాడ్‌బెండింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 20వ తేదీన ఉన్నవకు వచ్చిన తన స్నేహితుడిని బైక్‌పై కొప్పర్రు గ్రామంలో విడిచి రాత్రి 11.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. కొప్పర్రు దాటి అరకిలోమీటరు దూరంలోకి రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. సమీపంలోని చెరువులోకి నేరుగా దూసుకెళ్లింది. చెరువులో పడ్డ ప్రసాద్ మీద బైక్ పడటంతో తిరిగి లేవలేకపోయాడు. ప్రమాదం నుంచి రక్షించమని కోరేందుకు ఇరువురుకి ఫోన్ చేయగా అర్థరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ ఎత్తలేదు. చెరువు నీటిలో తడవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ప్రసాద్ రాత్రంతా చెరువులోనే బైక్ కింద నిస్సహాయంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ వైపుగా పొలం పనులకు వెళ్తున్న రైతులు గమనించి చెరువు నుంచి బయటకు తీశారు. వివరాలను అడిగి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పెదనందిపాడు పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో ఉన్నవకు తీసుకువచ్చారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') ఆ తండ్రి బాధ తీర్చలేనిది.. మృతుడి తండ్రి రమణయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పదేళ్ల కిందట భార్య రాగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాటి నుంచి ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరలోనే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వేగం రూపంలో మృత్యువు ముంచుకొచ్చి పెళ్లీడుకొచ్చిన కొడుకుని మింగేసింది. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇలా అకాల మృత్యువు బారిన పడడంతో ప్రసాద్ మృతదేహాన్ని చూసిన తండ్రి రమణయ్య విలవిల్లాడి పోయాడు. ఆ తండ్రి ఆవేదనను చూసి చూపరుల హృదయాలు సైతం ద్రవించాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగించారు. -
తల్లి పొత్తిళ్లలో ఓలలాడాల్సిన నెలరోజుల పసికందును..
నాదెండ్ల(చిలకలూరిపేట): కన్నతల్లి పొత్తిళ్లలో ఓలలాడాల్సిన నెలరోజుల పసికందును కర్కశంగా హతమార్చిన అమానుష ఘటన గురువారం గుంటూరు జిల్లాలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన పోతురాజు శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమారుడు గోపీకృష్ణ మంగళగిరిలోని ఓ సెల్‌షాపులో పనిచేస్తుంటాడు. వారానికోసారి ఇంటికి వచ్చిపోతుంటాడు. తెలంగాణకు చెందిన ఝాన్సీరాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నవంబర్ 1న వీరికి ఓ బాబు జన్మించాడు. బుధవారం ఎప్పటిలానే అత్తమామలతో కలిసి ఝాన్సీరాణి భోజనం ముగించుకుని నిద్రించింది. అయితే తెల్లవారుజామున లేచి చూసే సరికి.. తన పక్కలో ఉండాల్సిన శిశువు ఇంటి ఎదురుగా ఉన్న నీటి తొట్టెలో విగతజీవిగా కనిపించడంతో ఆమె షాక్‌కు గురైంది. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్ సీఐ కె.సుబ్బారావు, నాదెండ్ల ఎస్ఐ కె.సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. భర్త గోపీకృష్ణ గ్రామానికి చేరుకున్నాడు. శిశువు తండ్రి గోపీకృష్ణను డీఎస్పీ విజయభాస్కరరావు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాద స్వరానికి ‘పద్మశ్రీ’ పరవశం
చిలకలూరిపేట: నాదస్వరానికి రాగవిస్తారం (ఘనరాగాల)తో చిలకలూరిపేట బాణి తెచ్చిన ఘనత గుంటూరు జిల్లా చిలకలూరిపేట నాదస్వర విద్వాంసులకే దక్కుతుంది. దూదేకుల ముస్లింలైన వీరి సంగీతార్చనతో ఎందరో దేవుళ్లు నిద్రలేస్తారు. వారి సుమధుర నాదం ఎన్నో దేవాలయాల్లో సుప్రభాత సేవలకు ఆధ్యాత్మిక శోభ సంతరింపజేస్తుంది. ప్రస్తుతం ఎనిమిదో తరానికి చెందిన నాదస్వర విద్వాంసులైన షేక్ మహబూబ్ సుభాని, షేక్ కాలేషాబీ దంపతులకు నాదస్వరమే సర్వస్వం. ఎనిమిది తరాలుగా.. ఏడో తరానికి చెందిన నాదబ్రహ్మ, నాదస్వర గానకళా ప్రపూర్ణ బిరుదాంకితులు షేక్ చినపీరు సాహెబ్ చిలకలూరిపేటలో నివసించిన ప్రాంతానికి చినపీరుసాహెబ్ వీధిగానే నామకరణం చేశారు. నాదస్వర విద్వాంసుడిగా పేరొందిన షేక్ చినపీరు సాహెబ్‌కు ముందు 1825 నుంచి వారి వంశీకులు షేక్ నబీసాహెబ్, షేక్ చిన నసర్దీ, పెద నసర్దీ సోదరులు, షేక్ పెద హుస్సేన్, చిన హుస్సేన్, దాదాసాహెబ్, గాలిబ్‌సాహెబ్ సోదరులు నాదస్వర విద్వాంసులుగా రాణించారు. చినపీరు సాహెబ్ వద్ద శిష్యరికం చేసిన షేక్ ఆదంసాహెబ్ సంగీత విద్వాంసుల కోటాలో ఎమ్మెల్సీగా వ్యవహరించగా, మరో శిష్యుడు కరువది షేక్ చినమౌలాసాహెబ్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరానికి చెందిన షేక్ మహబూబ్ సుభాని, షేక్ కాలేషాబీ దంపతులు వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. షేక్ చినపీరుసాహెబ్ మనవడే (కూతురి కుమారుడు) షేక్ మహబూబ్ సుభాని. ఆయన భార్య షేక్ కాలేషాబీ కూడా చినపీరుసాహెబ్‌కు వరుసకు మనవరాలే. సుభాని దంపతుల కుమారుడు షేక్ ఫిరోజ్‌బాబు తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఎంసీఏ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా దాన్ని వదలివేసి నాదస్వర కచేరీల్లో తల్లిదండ్రులతో పాటు పాల్గొంటున్నాడు. బాల్యం నుంచి.. ఏడేళ్ల వయసులోనే సుభాని ఆయన తండ్రి షేక్ మీరా సాహెబ్ వద్ద నాదస్వరంలో ఓనమాలు దిద్దారు. షేక్ కాలేషాబీ తన తొమ్మిదో ఏట ఆమె తండ్రి షేక్ జాన్‌సాహెబ్ వద్ద నాదవిద్య అభ్యసించారు. 1978లో వీరి వివాహం అనంతరం కర్నూలు ప్రభుత్వ శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రమౌళి వద్ద కొంతకాలం నాదస్వరం అభ్యసించారు. అనంతరం గానకళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ షేక్ చినమౌలానా సాహెబ్ వద్ద తంజావూర్ బాణిలో పదేళ్ల పాటు శిక్షణ పొందారు. దేశ విదేశాల్లో కచేరీలు.. సుభాని దంపతులు భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో వేలాది కచేరీలు ఇచ్చారు. 2005 మార్చి 5న రాష్ట్రపతి భవన్లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు 2 గంటల పాటు కచేరీ చేశారు. అబుదాబి, బ్రెజిల్, కెనడా, దుబాయి, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మలేసియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లండ్ దేశాల్లో వీరు ప్రదర్శనలిచ్చారు. తిరుమలలో కూడా నాదస్వరం వినిపించారు. 2001 మార్చి 24 నుంచి శృంగేరి శ్రీశారదా పీఠం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. 1994లో తమిళనాడు ప్రభుత్వం వీరికి కలైమామణి అవార్డును ప్రకటించింది. వీరికి 2000లో చెన్నై బాలాజీ టెలివిజన్ సంస్థ దేశ థమారై అవార్డు, 2002లో నాదస్వర కళానిధి అవార్డు, 2004లో అమెరికాలోని సౌత్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ కాలిఫోర్నియా అవార్డు, 2005లో డాక్టర్ తిరువెంగడు సుబ్రమణ్యపిళ్లై శతాబ్ది అవార్డు, 2008లో నాదస్వర చక్రవర్తి అవార్డు లభించాయి. 2009లో ఇంటిగ్రిటీ కల్చరల్ అకాడమీ (చెన్నై) అవార్డు లభించింది. 2009లో కెనడియన్ ఫైన్ ఆర్ట్స్ అవార్డు, 2015లో సంగీత మాసపత్రిక (చెన్నై) నాదబ్రహ్మం అవార్డును వీరు అందుకున్నారు. శ్రీలంకలో 2016లో నాదస్వర గానకళా వారధి అవార్డు, 2017లో ఏపీ ప్రభుత్వం హంసకళా రత్న అవార్డును అందజేసింది. 2010 అక్టోబర్ నుంచి ఆలిండియా రేడియోలో వీరు టాప్‌గ్రేడ్ నాదస్వర విద్వాంసుల ద్వయంగా కొనసాగుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది... పద్మశ్రీ పురస్కారం అందుకొనేందుకు ఈ నెల 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు హాజరుకావాలని లేఖ అందుకోవటం ఎంతో సంతోషం కలిగించింది. నాదస్వర విద్య కనీసం పాతికేళ్లు శ్రమపడితే కాని పట్టుబడదు. నిత్య సాధనతో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇన్నాళ్ల శ్రమకు తగిన ప్రతిఫలం పద్మశ్రీ పురస్కారంతో లభించినట్లయింది. గతంలో మా పూర్వీకుడైన కరువది షేక్ చినమౌలాసాహెబ్ పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన పక్కన స్థానం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నాం. – షేక్ మహబూబ్ సుభాని, షేక్ కాలేషాబీ చిలకలూరిపేటలో నాదస్వరం ఆలపిస్తున్న సుభాని దంపతులతో కుమారుడు ఫిరోజ్‌బాబు (ఫైల్) -
మందు.. సోడా.. మంచింగ్.. ఆ కోతే వేరబ్బా!
-
సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి యడవల్లి దళిత రైతుల క్షీరాభిషేకం
సాక్షి, చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ రైతులు 120 మంది సాగుచేసుకుంటున్న 223 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు అప్పగించాలని గురువారం మంత్రిమండలి నిర్ణయించింది. దీంతో రైతులు ఎమ్మెల్యే విడదల రజనిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చిత్రపటానికి అభిషేకం చేశారు. ఒక్కో రైతుకు రూ.25 లక్షల వంతున మొత్తం రూ.30 కోట్లు పరిహారంగా అందుతుందని ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వం భూములను ఉచితంగా లాక్కోవాలని చూసిందని, ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని రైతులు పేర్కొన్నారు. -
బాలిక గొంతు కోసి ఆపై..
సాక్షి, చిలకలూరిపేట : పెళ్లికి నిరాకరించిన మైనర్ బాలిక గొంతు కోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉదంతమిది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘాతుకానికి సంబంధించి ఎస్ఐ కె.నాగేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సంజీవ నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లితో కలిసి స్పిన్నింగ్ మిల్లులో కూలి పనులకు వెళుతోంది. ఇదిలావుంటే.. నరసరావుపేటకు చెందిన ఆమె బావ (అక్క భర్త)కు తమ్ముడైన అంకం అఖిల్‌కుమార్ కొంత కాలంగా బాలిక వెంటపడి.. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. బాలిక తల్లి తన కుమార్తెకు మైనార్టీ తీరకపోవడం, అఖిల్ కుమార్ సత్ప్రవర్తనతో ఉండకపోవడం వంటి కారణాల వల్ల అతడికిచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లిన అఖిల్ తనను పెళ్లి చేసుకోవాలని బాలికను బలవంత పెట్టాడు. బాలిక కుదరదనటంతో వెంట తెచ్చుకున్న షేవింగ్ బ్లేడ్‌తో బాలిక గొంతుపై కోసి తాను కూడా గొంతుపై గాయం చేసుకున్నాడు. బాలిక కేకలు వేయటంతో ఆమె తల్లి, చుట్టుపక్కల వారొచ్చి బాలికను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. నిందితుడు కూడా ఆదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎంపీడీవోపై ఎమ్మెల్యే ఆగ్రహం
సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : అవినీతిని ప్రోత్సహిస్తారా...ప్రభుత్వం ఓ వైపు అవినీతి రహిత పాలన అందించాలంటుంటే, మీరు అక్రమ వసూళ్లకు పాల్పడతారా? అంటూ చిలకలూరిపేట ఎంపీడీవో పి.శ్రీనివాస పద్మాకర్‌పై ఎమ్మెల్యే విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అక్రమంగా బిల్లులు పెట్టించి అవసరానికి మించి నిధులను డ్రా చేసుకుంటున్నారని కొంతకాలంగా ఎంపీడీవోపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులను పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్యే ముందు గోడు వెళ్లబోసుకున్నారు. పంచాయతీల నుంచి అక్రమంగా నిధులు డ్రా చేసి తనకు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీడీవోపై ఫిర్యాదు చేశారు. మాట వినకున్నా, చెప్పింది చెప్పినట్లు చేయకున్నా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఉద్యోగాలు తీయించి వేస్తానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన నెలరోజుల వ్యవధిలో తమ వద్ద నుంచి రూ.1.8 లక్షలు అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. ఇదే సందర్భంలో అక్కడకు వచ్చిన ప్రజలు సైతం డబ్బులు చెల్లించనిదే ఏ పని చేయడంలేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న ఓ కాంట్రాక్టర్ రూ.2 లక్షలు విలువైన పనులు నిర్వహించి రూ. 5లక్షలకు బిల్లు పెట్టాలని తనకు ఎంపీడీవో చెప్పారని ఆరోపించారు. బిల్లు అయ్యాక మిగిలిన రూ.3 లక్షలు తనకు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీవోపై ఎమ్మెల్యే విడదల రజని జెడ్పీ సీఈవో డి.చైతన్యకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తగు చర్యలు తీçసుకుంటామని సీఈవో ఫోన్లో ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. -
స్టోక్ కాంగ్రీపై మనోళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు లదాఖ్ ప్రాంతంలోని 6,153 మీటర్ల స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని అధిహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లికల్ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్. అఖిల్‌లు ఈ పర్వతాన్ని అధిరోహించారు. ఈ యాత్రకు సంబంధించి తనకు ఆర్ఎస్ ప్రవీణ్ తోడ్పాటునందించారని మల్లికార్జున తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీలపై అభిమానంతో సాయికిరణ్ బ్యానర్ ప్రదర్శించారు. -
ప్రత్తిపాటి @ ప్రజాధనం లూటీ
సాక్షి, గుంటూరు : మన నియోజకవర్గ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చింది. ఇక ప్రతి మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని నాలుగేళ్ల క్రితం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు భావించారు. ప్రత్తిపాట్టి పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు పదవి వచ్చిన దగ్గర నుంచి అవినీతి జడలు విప్పింది. ఊరూవాడా అక్రమాలు జోరు పెరిగింది. నీరు– చెట్టు పథకం మంత్రితోపాటు ఆయన అనుచరులకు వరంగా మారింది. అధికారం అండ ఉండడంతో పత్తి కొనుగోలులో గోల్మాల్ చేశారు. అవినీతి తోడేళ్లుగా మారి గ్రావెల్‌ను మింగేస్తూ.. అందినకాడిని మట్టి బొక్కేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ప్రాణాలు ఆరిపోతుంటే.. ఆ సంస్థ భూములు అన్యాయంగా చెరబట్టారు. అక్రమాలపై ప్రశ్నించి జర్నలిస్టుల కలాల కంఠానికి ఉరి బిగించారు. మంత్రి భార్య రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజలను పీడించారు. అన్ని శాఖల అధికారులను గుప్పిట్లో పెట్టుకుని కమీషన్లు దండుకున్నారు. ఇలా ఐదేళ్ల పాలనలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. మొత్తంగా చిలకలూపేట నియోజకవర్గంలో అభివృద్ధికి పాతరేసి.. అవినీతి, అక్రమాలు, అరాచకాల కోటగా మార్చేశారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు... ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్ భూమి ఉంది. గతంలో వెంచర్లు వేసి భూమి అభివృద్ధి చేయటానికి సంస్థ వీటిని కొనుగోలు చేసింది. ఈ భూమి అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్ డైరెక్టర్ కనుకొల్లు ఉదయదినాకర్ పేరుపై రిజిస్టర్ అయ్యింది. అగ్రి గోల్డ్ భాగస్వామి అయిన ఇతని వద్ద నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మ (ప్రత్తిపాటి వెంకటకుమారి) 2015 జనవరి 19వ తేదీన ఖాతా నంబర్ 525, సర్వే నంబర్లు 104–6, 104–5,104–4,104–3,104–1,103–2ల ప్రకారం మొత్తం 6.19 ఎకరాలను కొనుగోలు చేశారు. తిరిగి గతేడాది ఏప్రిల్ 17వ తేదీ అగ్రి ప్రాజెక్టు సంస్థకు చెందిన బండా శ్రీనివాసబాబు నుంచి సర్వే నంబర్ 101–1లోని 5.44 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అదే రోజు అంటే ఏప్రిల్ 17వ తేదీ మంత్రిప్రగడ విజయ్‌కుమార్ వద్ద నుంచి సర్వే నంబర్లు 104–1,104–2,104–3 ద్వారా 2.60 ఎకరాలు, సర్వే నంబర్ 104–4లో ఉన్న 0.57 ఎకరాలను కొనుగోలు చేశారు. మొత్తం అగ్రిగోల్డ్‌కి చెందిన 14.81 ఎకరాల భూమిని మంత్రి సతీమణి పేరుపై కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన మొత్తం భూమిని అదే ఏడాది జూన్ 4వ తేదీన గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు విక్రయించారు. అగ్రి గోల్డ్ భూమిని రహస్యంగా భాగస్వాములు వేరే వ్యక్తులకు ఎకరా రూ.32 లక్షలకు అమ్మటానికి వ్యవహారం నడిచింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు వ్యక్తులతో అగ్రిమెంటు కూడా రాయించుకున్నారు. విషయం తెలిసిన మంత్రి వీరిని బెదిరించి అగ్రిమెంట్లు రద్దు చేయించారు. తాను కేవలం ఎకరాకు రూ.20 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పటంతో గత్యంతరం లేక నష్టానికి మంత్రికి భూములు అమ్మారు. భూములు కొన్న మంత్రి జూన్‌లో ఇవే భూములను ఎకరాకు రూ.52 లక్షలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు మంత్రికి లాభంగా దక్కాయి. అక్షరం గొంతు నొక్కి చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్ శంకర్‌పై(హత్యకు గురైనప్పుడు ఆంధ్రప్రభ ఆర్సీ ఇన్చార్జి) 2014 నవంబర్ 25వ తేదీన తెలుగు యువత పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దిబోయిన శివ, మరో ముగ్గురు దాడి చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి శంకర్ మృతి చెందాడు. తొలుత ఆధారాలు లేవని కేసు మూసివేసేందుకు ప్రయత్నించగా.. జర్నలిస్టు సంఘాలు పోరాటం చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరు కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారులను మాత్రం అరెస్టు చేయ లేదు. సీసీఐలో భారీ కుంభకోణం 2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డుల ద్వారా ఈ కుంభకోణం జరిగింది. విశాఖపట్టణం నుంచి గుంటూరు వచ్చిన సీబీఐ అధికారుల బృందం సీసీఐ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. అప్పట్లో జరిగిన పత్తి కుంభకోణంలో దాదాపు రూ.540 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా 43 మార్కెట్ యార్డుల్లో పత్తికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి. అయితే ముందే రైతుల నుంచి వ్యాపారులు, దళారీలు పత్తి క్వింటాకు రూ. 3 వేలలోపు కొని రూ. 4 వేలు, రూ.4100 చొప్పున సీసీఐకి విక్రయించారు. కొనుగోలు చేసిన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకురాకుండా గ్రామాల నుంచే నేరుగా జిన్నింగ్ మిల్లులకు తరలించారు. ఈ వ్యవహారంలో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు. గ్రామాల నుంచి వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. కాటా వేయని పత్తికి కాటా వేసినట్లు చార్జీలు, మార్కెట్ యార్డుల నుంచి సీసీఐ జిన్నింగ్ చేయించే మిల్లులకు పత్తిని తరలించినట్లు రవాణా చార్జీలు ఖర్చు రాసి డబ్బులు దండుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత పత్తి కొనుగోలు సంస్థ (సీసీఐ)లో జరిగిన అవినీతి ప్రభుత్వాన్ని కుదిపేసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో కంటితుడుపుగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ అనంతరం 2016 నవంబర్‌లో చిలకలూరిపేట మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి కే నాగవేణి సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 మంది మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేశారు. కప్పం కట్టనిదే ఫైల్ కదలదు చిలకలూరిపేట నియోజకవర్గంలో రెవెన్యూ, మున్సిపల్ ఇలా ఏ కార్యాలయంలో ఫైల్ కదలాలన్నా మేడమ్‌ను కలిసి కప్పం కట్టాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ ఎకరాకు రూ.1 లక్ష వసూలు చేస్తున్నారు. మంచినీటి సరఫరా పేరుతో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల వరకు దండుకున్నారు. ఎంత పెద్ద వర్క్ అయినా మూడు, నాలుగు భాగాలుగా విభజించి ఒక్కరికే నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ భారీగా ముడుపులు తీసుకున్నారు. బాణా సంచా వ్యాపారుల నుంచి ఏటా రూ. కోటి చొప్పున ఇప్పటి వరకు రూ. 5 కోట్లు, పాన్ పరాగ్, గుట్కా హోల్‌సేల్ వ్యాపారుల నుంచి రూ. 3 కోట్లు వసూలు చేశారు. గుంటూరులో కల్తీ కారం తయారీదారులను బెదిరించి రూ. 8 కోట్లు దండుకున్నారు. నకిలీ విత్తనాల కుంభకోణం సైతం వీరి కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. విత్తనాలను బ్లాక్ చేసి కిలో లక్ష రూపాయలకు అమ్మించారు. అతి ఖరీదైన భూమి కబ్జా చిలకలూరిపేటలోని ఓగేరు వాగు పక్కనే ఉన్న సుమారు ఎకరాల స్థలాన్ని మంత్రి పుల్లారావు అనుచరులు ఆక్రమించి ప్లాట్లు వేసేశారు. 12 ఏళ్ళ క్రితం వాగు నుంచి వరద నీరు పట్టణంలోకి రాకుండా కరకట్టలు నిర్మించారు. ఆ సమయంలో అక్కడ ఎస్టీలు కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. దీంతో కొంత స్థలాన్ని వదిలేసి కరకట్ట నిర్మించారు. ఇది మంత్రి అనుచరులకు వరంగా మారింది. తమ పూర్వీకుల పేరుతో పట్టాలు ఉన్నట్లుగా సృష్టించి మంత్రి అండదండలతో పూర్ణాసింగ్, మాధవ్‌సింగ్, శంబుసింగ్ అనే వ్యక్తులు ఆక్రమించి ప్లాట్లు వేశారు. సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే స్థలం కబ్జాకు గురైంది. మంత్రి కన్నుపడిన యడవల్లి భూముల్లో గ్రానైట్ విలువ : రూ. 3000 కోట్లు పేదల బియ్యం రవాణాలో అక్రమాలు : రూ. 200 కోట్లు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో గ్రావెల్ దోపిడీ : రూ.500 కోట్లు మున్సిపల్ పనుల్లో మంత్రి భార్య కమీషన్ : రూ.150 కోట్లు పేట కేంద్రంగా సీసీఐ కుంభకోణం : రూ. 540 కోట్లురూ. టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను అడ్డుపెట్టుకుని దోచుకున్న మొత్తం : 150 కోట్లు అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలులో లబ్ధి : సుమారు 5 కోట్లు -
గ్రామం ఒక్కటే..పేర్లు రెండు
సాక్షి, నరసరావుపేట : ఒకే గ్రామం.. కానీ రెండు నియోజకవర్గాలు. ఎదురెదురు ఇళ్లలోని వారు ఓటు వేసేది మాత్రం వేర్వేరు అభ్యర్థులకు. ఇటువంటి చిత్రమైన పరిస్థితి నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల సరిహద్దులోని రెండు గ్రామాల్లో నెలకొంది. కోటప్పకొండ సమీపంలోని యక్కలవారిపాలెం, కట్టుబడివారిపాలెం గ్రామాలు పేరుకే రెండు గ్రామాలు. ఒకే గ్రామంగా కలిసి ఉంటాయి. కేవలం రెండు గ్రామాలను విడదీసేది ఒక రోడ్డు మాత్రమే. రోడ్డుకు తూర్పున నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కట్టుబడివారిపాలెం ఉండగా, పశ్చిమాన నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని యక్కలవారిపాలెం గ్రామం ఉంది. ఎన్నికల సమయంలో రెండు నియోజకవర్గాల నాయకులు గ్రామాన్ని రెండు గ్రామాలుగా విడదీస్తున్న ఒకే మెయిన్‌రోడ్డుపై ప్రచారం చేస్తుంటారు. కొత్తపాలెం పరిస్థితి ఇదే.. కొత్తపాలెం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నరసరావుపేట మండలంలోని కొత్తపాలెం, చిలకలూరిపేట మండల పరిధిలోకి వచ్చే అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాలు రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు గ్రామాలను కూడా విడదీసేది ఒకే రోడ్డు. రోడ్డుకు ఒక వైపు ఆమీన్సాహెబ్పాలెం(అవిశాయపాలెం), రెండో వైపు కొత్తపాలెం గ్రామాలున్నాయి. మిగిలిన సమయంలో రెండు గ్రామాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తుంటారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవి రెండు గ్రామాలని చెబితేగానీ తెలియదు. ఎన్నికల్లో మాత్రం ఇక్కడి ఓటర్లు తమ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల అభ్యర్థులకు ఓటు వేస్తుంటారు. -
ప్రమాదంలో ముగ్గురు అయ్యప్పభక్తుల మృతి
గుంటూరు: చిలకలూరిపేట మండలం తాతపూడి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, అతివేగంతో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఐదుగురు అయ్యప్ప భక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్ఆర్సీపీలో చిలలలూరి పేట టీడీపీ నేతలు
-
మట్టుబెట్టి మంటబెట్టి..!
ఎప్పుడు చంపారో తెలియదు.. ఎక్కడ చంపారో తెలియదు.. ఎవరు మట్టుబెట్టారో తెలియదు.. పక్కాగా హతమార్చారు. మృతి చెందాక కల్వర్టు అడుగు భాగంలోని తూములో మూటకట్టి పడేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం – కట్టుబడివారిపాలెం గ్రామాల మధ్య గురువారం ఓ యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్య స్థానికుల్లో కలకలం రేపింది. చిలకలూరిపేటరూరల్: మండలంలోని కమ్మవారిపాలెం నుంచి కట్టుబడివారిపాలెం గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బీ మార్గ మధ్యలో కల్వర్టు ఉంది. వర్షపు నీరు ప్రవహించేందుకు కల్వర్టు అడుగు భాగంలో సిమెంట్ పైపు ఏర్పాటు చేశారు. ఈ పైపులో యువకుడి మృతదేహం ఉన్నట్లు గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ యూ శోభన్‌బాబు, ఎస్ఐ పీ ఉదయ్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటాయని భావిస్తున్నారు. ఇతర ప్రాంతంలో హత్య చేసి ప్లాస్టిక్ గోతంలో మూట కట్టి ఇక్కడకు తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కల్వర్టు కింది భాగంలో ఉన్న పైపులో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులుచెబుతున్నారు. మృతుడి ప్యాంట్‌పై ఈగ డ్రసెస్ అని ముద్రించి ఉంది. గోవిందపురం వీఆర్వో రియాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానాలు, మిస్సింగ్ కేసులు ఉన్న వారు వెంటనే రూరల్ పోలీసులను సంప్రదించాలని సీఐ శోభన్‌బాబు తెలిపారు.. గతంలోనూ ... చిలకలూరిపేట ప్రాంతంలో ఇదే తరహాలో హత్యలు జరగడం విశేషం. మండలంలో మూడు ప్రదేశాల్లో నాలుగు కేసులు ఇలాంటివే ఉండడంతో.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు చెందిన ఒక వివాహిత భర్తకు మాయమాటలు చెప్పి నాదెండ్ల మండలం గణవవరం డొంకలోకి తీసుకువెళ్లి ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టింది. చిలకలూరిపేటకు చెందిన వివాహిత, సోదరుడితో కలిసి భర్తను కొట్టి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించింది. నరసరావుపేటకు చెందిన రౌడీషీటర్.. ఒక మహిళను హత్య చేసి గోతంలో మూటకట్టి మండలంలోని పోతవరం గ్రామంలో పడవేసి వెళ్లాడు. ఈ కేసులను శోధించిన పోలీసులు నిందితులను గుర్తించారు. అదే తరహాలో మరో హత్య జరగడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.