Chitralahari
-
మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తండ్రి-కొడుకులంతా ఇంతేనా..!
మధ్య తరగతి కుటుంబం అంటేనే ప్రేమ, అప్యాయత, అనురాగాలు అంటారు. కానీ అవేవి బయటివారికి పెద్దగా కనిపించవు. ఎందుకంటే అక్కడ ప్రేమ కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి. దాంతో మనసులో ఎంత ప్రేమ ఉన్న వాటిని బయటికి కనబడనివ్వవు ఆర్థిక ఇబ్బందులు. అందుకే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో తరచూ అరుపులు, గొడవలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కొడుకులకు అసలు పడదు. కానీ తండ్రికి కొడుకుపై ఎనలేని ప్రేమ, కొడుకుకు తండ్రి అంటే అంతులేని గౌరవం ఉంటాయి. అయితే కొడుకు భవిష్యత్తుపై దిగులుతో నాన్న కొడుకుపై చిరాకు పడతాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను కన్న కలలను సాకారం చేసుకోని స్థితిలో తండ్రిపై అసహనంతో ఉంటాడు కొడుకు. మరి అలాంటి వారు ఎప్పుడు ఎదురుపడినా ఏం జరుగుతుంది. గొడవలే కదా. అది సాధారణంగా అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించేదే. అలాంటి పాత్రలు వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. మరి మధ్యతరగతి తండ్రి-కొడుకుల బాండింగ్‌ను తెరపై ఆవిష్కరించిన చిత్రాలేవో ఓసారి చూద్దాం! తండ్రి, కొడుకుల సంఘర్షణే ‘నీది నాది ఒకటే కథ’: తండ్రి, కొడుకల మధ్య ఉండే సంఘర్షణ అందరి ఇళ్లలోనూ కామన్‌గా కనిపిస్తుంది. అలాంటిదే చాలా సినిమాల్లోనూ చూశాం. కానీ…తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణే కథాంశంగా వచ్చిన చిత్రం ‘నీది నాది ఒకటే కథ’. కొడుకు బాగా బతకాలి అని తపించే తండ్రి…మనకొచ్చిన పని చేసుకుంటూ జీవితంలో సాగిపోవాలి అని నమ్మే కొడుకు. ఈ లైన్‌ని అద్భుతంగా వెండితెరపై పండించారు దేవిప్రసాద్, శ్రీవిష్ణు. మధ్య తరగతి తండ్రి పాత్రలో దర్శకుడు దేవిప్రసాద్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. విద్యలేని వాడు వింత పశువు అన్న నానుడి ఎప్పటి నుంచో సమాజంలో పాతుకుపోయింది. చదువుకోని వాడు వింత పశువేనా ? చదువురాని వాళ్లంతా పనిరాని వాళ్లేనా ? అని ప్రశ్నలు వేస్తే దర్శకుడు వేణు ఊడుగల తీసిన సినిమా…ప్రేక్షకులను థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంది. ప్రతి మధ్య తరగతి తండ్రి…ఆ మాటకొస్తే ప్రతి తండ్రి తన పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. చదువులో వెనుక బడితే జీవితంలో వెనుక బడినట్టే అని ఆందోళన చెందుతారు. ఈ సంఘర్షణని బలంగా చూపించి, చర్చించారు ‘నీది నాది ఒకే కథ’లో. తండ్రిని అసలు లెక్కచేయని ‘మహర్షి’ చాలా బాగా చదవాలి, గొప్పవాడు కావాలని తపనపడే మధ్య తరగతి కొడుకులకు.. ధనవంతుల తనయులు అడ్డుపడుతుంటారు. డబ్బు, పలుకుబడితో ప్రతి విషయంలో వారిని తొక్కాలని చూస్తుంటారు. అలాంటి సంఘటన ఎదురైనప్పుడల్లా తండ్రిని తలచుకుని అసహనం వ్యక్తం చేస్తుంటాడు కొడుకు. ఓడిపోయిన తండ్రిగా చూస్తూ నాన్నను అసలు లెక్కచేయడు ఆ కొడుకు. ఆ తండ్రి కూడా కొడుకు కలలకు వారధి కాలేకపోతున్నానని మదనపడుతూ తననిన తాను ఓడిపోయిన తండ్రిగా చూసుకుంటాడు. అలా ఆ తండ్రి కొడుకుల మధ్య చూపులు తప్పా మాటలే ఉండవు. ఒకే ఇంట్లో ఉన్న ఆ తండ్రి-కొడుకుల మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంటుంది. అలాంటి పాత్రలను మహర్షిలో చాలా చక్కగా చూపించాడు ‘వంశీపైడిపల్లి’. ఆకలి రాజ్యం: దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు…ఆ పరిస్థితులను ఎత్తి చూపిన చిత్రం ఆకలి రాజ్యం. అదే సినిమాలో తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణని దర్శకుడు కె.బాలచందర్ అద్భుతంగా చూపించారు. తాను చెప్పినట్టుగా తనయుడు నడుచుకోవడం లేదని తండ్రి. తన దారిలో తనను వెళ్లనివ్వడం లేదని కొడుకు. ఆత్మాభిమానం విషయంలో ఇద్దరూ ఏమాత్రం తగ్గేది లేదంటారు. సుతిమెత్తగా తిట్టిపోసే తండ్రి ‘రఘువరన్ బీటెక్’: మిడిల్ క్లాస్ తండ్రులను ప్రేక్షకులకు బాగా చూపించిన చిత్రాల్లో రఘువరన్ బీటెక్ ఒకటి. ధనుష్ తండ్రిగా సముద్రఖని నటించారు. కొడుకేమో సివిల్ ఇంజినీర్ జాబ్ వస్తే మాత్రమే చేస్తానంటాడు. ఎన్నాళ్లు ఖాళీగా కూర్చుంటావని సుతిమెత్తగా తిట్టి పోస్తూ ఉంటా డు తండ్రి. ఇలాంటి నాన్నలు మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ‘చిత్రలహరి’.. కొడుకు కోసం సైకాలజిస్ట్‌గా మారిన తండ్రి: మిడిల్ క్లాస్ అన్న మాటలోనే అసలు విషయం అంతా ఉంది. ఇటు పూర్ ఫ్యామిలీ కోటాలోకి వెళ్లలేరు. అటు రిచ్ ఫ్యామిలీస్ సరసన నిలబడలేరు. కుటుంబ పెద్ద ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అందుకే…మిడిల్ క్లాస్ ఫాదర్స్‌లో పిల్లల కెరీర్ గురించి అంత ఎక్కువ తపన కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే అరుపులు. తిట్లు. అవసరం అయితే నాలుగు దెబ్బలు కూడా ఉంటాయి. కానీ…ఎదిగిన కొడుకు ప్రేమ దెబ్బకి దిగాలు పడిపోతే అరుపులు, తిట్లు పని చేయవు. అప్పుడే నాన్న తనకు తాను సైకాలజిస్ట్ అయిపోతాడు. ఇలాంటి పాత్రని ‘చిత్రలహరి’ సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సాయి ధరమ్ తేజ తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటన అందరినీ ఆకట్టుకుంది. ఇడియట్: నాన్న తిడతాడు. నాన్న కోప్పడతాడు. ఓకే.. బాగానే ఉంది. మరి కొడుకేం చేస్తాడు? ఏమన్నా చేస్తే నాన్న ఎందుకు తిడతాడు చెప్పండి ? చాలా ఇళ్లలో జరిగేది ఇదే. కొడుకులు చాలా సందర్భాల్లో నాన్నలను లైట్ తీసుకుంటారు. ఆ తండ్రి అసహనం…ఈ తనయుడి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇడియట్ సినిమాలో ఇలాంటి నాన్నకి యాక్షన్ చెప్పేశాడు పూరి జగన్నాథ్. ‘కొత్త బంగారు లోకం’.. కొడుకుని కొప్పడని తండ్రి: నాన్నలకు కోపం ఉంటుంది నిజమే. కానీ…కొందరు నాన్నలకు తమ పెంపకం మీద ఎనలేని నమ్మకం ఉంటుంది. తమ కోపాన్ని, అసహనాన్ని, పిల్లల ముందు చూపించడానికి కూడా ఇష్టపడరు. ఈ టైప్ ఆఫ్ నాన్నలు మిడిల్ క్లాస్‌లో కనిపించడం తక్కువే. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోనూ తక్కువే. ‘కొత్త బంగారు లోకం’లో అలాంటి తండ్రి పాత్రకు ప్రకాశ్ రాజ్ ప్రాణం పోశారు. ‘అమ్మో ఒకటో తారీఖు’: ఇప్పటి దాకా పిల్లల మీద అరిచే తండ్రులను చూశాం. అవసరమైతే రెండు దెబ్బలు వేసే తండ్రులను చూశాం. మధ్య తరగతి కుటుంబం అంటేనే… ఒంటెద్దు బండి అనే అర్థం. అలాంటి ఒంటెద్దు లాంటి తండ్రిని కళ్ల ముందుంచిన చిత్రం ‘అమ్మో ఒకటో తారీఖు’. గోవింద రావు పాత్రలో ఎల్.బి.శ్రీరాం చెలరేగిపోయారు. చాలా మధ్య తరగతి కుటుంబాల్లో తాము పేద వాళ్లం కాదన్న భావన ఉంటుంది. కానీ అక్కడ ఉండేదల్లా పేదరికమే. ఆ పరిస్థితిని, మధ్య తరగతి కుటుంబాల్లోని వ్యక్తుల ఆలోచనని, ఇంటి పెద్ద పడే ఆవేదనని వెండితెరకెక్కించడంలో దర్శకులు ఇ.వి.వి.సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రేలంగి మామయ్య: మిడిల్ క్లాస్ డాడీస్ అనగానే…బీపీ కామన్ అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. కానీ, కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ పాలసీని బలంగా నమ్ముతారు. ఈ తరహా నాన్నలు నిజ జీవితంలో అరుదుగానే కనిపిస్తూంటారు. ఆమాట కొస్తే వెండితెర మీద కూడా అరుదే. అలాంటి తండ్రిని రేలంగి మామయ్య క్యారెక్టర్లో మనకు చూపించాడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు. ఆ పాత్రకి తనదైన శైలిలో ప్రాణం పోశారు ప్రకాశ్ రాజ్. ‘పెళ్లి చూపులు’లో తండ్రికి చుక్కలు చూపించి విజయ్: హీరో కొంచెం అల్లరి చిల్లరిగా ఉంటేనే సినిమాకి అందం. అలాంటి హీరోని తండ్రి చివాట్లు పెడితేనే అసలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ ఫార్ములాకి దర్శకులు పదును పెడుతూ ఉండటం వల్ల…మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలు సిల్వర్ స్క్రీన్‌పై బాగా పండుతున్నాయి. ‘పెళ్లి చూపులు’ చిత్రంలో అలాంటి డాడీ క్యారెక్టర్లో నవ్వులు పూయించాడు నటుడు కేదార్ శంకర్. ఇక హీరో విజయ్ దేవరకొండ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా చదువు ఎక్కని బద్దకపు కొడుకుగా తండ్రికి చుక్కలు చూపించే పాత్రలో విజయ్ రెచ్చిపోయాడు. -
ఫ్లాప్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగటం లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస సినిమాలతో హల్చల్ చేసిన ఈ సుప్రీం హీరో తరువాత డీలా పడిపోయాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో కెరీర్ కష్టాల్లో పడింది. ఇటీవల చిత్రలహరితో కాస్త పరవాలేదనిపించినా సూపర్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ఈ సినిమా తరువాత దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వెన్నెల, ప్రస్థానం సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవాకట్టా తరువాత ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలతో డిజాస్టర్లు ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ వచ్చింది. తాజా దేవ కట్టా సాయి ధరమ్‌కు ఓ లైన్ వినిపించాడట. పూర్తి సీరియస్ మోడ్‌లో యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ కథ సాయి ధరమ్ తేజ్‌కు నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని చెప్పాడట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితేగాని ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. -
ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సాయి ధరమ్ తేజ్
ఇటీవల చిత్రలహరి సినిమాతో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన సాయి, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత చిత్రలహరితో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన ఈ మెగా హీరో నెక్ట్స్ సినిమాతోనూ అదే సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘భోగి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. టైటిల్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో సాయి ధరమ్ ప్లే బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నాడనిపిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
మేకింగ్ ఆఫ్ మూవీ- చిత్రాలహరి
-
కాంబినేషన్ కుదిరింది
యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతున్నారు హీరో సాయిధరమ్ తేజ్. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మంచి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటారు దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా కుదిరింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే రూపొందిన సంగతి తెలిసిందే. -
ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు
‘‘చిత్రలహరి’ సినిమాతో తేజుకి మంచి సక్సెస్ రావడం చాలా సంతోషంగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఫెయిల్యూర్ తన దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘చిత్రలహరి’. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. హైదారాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సినిమాలో తేజుని చూసినప్పుడు పర్సనల్‌గా కూడా నాకు తేజునే గుర్తుకొచ్చాడు. సింపుల్ క్యారెక్టర్స్‌ను హీరోలకు అడాప్ట్ చేస్తూ కిశోర్ సినిమాలు చేస్తుంటారు. తన స్టామినాకు తగ్గ సక్సెస్ ఇంకా రాలేదనే భావిస్తున్నారు. ఇండస్ట్రీకి రాగానే మూడు బ్లాక్‌బస్టర్స్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ చిన్న స్పీడ్ బ్రేకర్ దాటి మళ్లీ సక్సెస్‌బాట పట్టింది. సునీల్ తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. ‘‘కలెక్షన్స్ బాగా వచ్చాయి. సినిమా సక్సెస్ అంటున్నారు. కానీ సినిమా ప్రజలకు బాగా రీచ్ కావడమే నా దృష్టిలో సక్సెస్. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. కిశోర్ నా స్నేహితుడే. పోసానిగారు లవ్లీ పర్సన్. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలో మా అమ్మను చూసుకున్నాను’’ అన్నారు సాయిధరమ్‌తేజ్. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. హీరో సాయి, దర్శకుడు కిశోర్, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కిశోర్. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు సునీల్. ‘‘ఇప్పటివరకు 35 స్ఫూర్తి పాటలు రాశాను. ఈ సినిమా కోసం కూడా అలాంటి పాట రాశాను. ఈ విజయోత్సవ సభలో అందర్నీ చూడటం సంతోషంగా ఉంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. -
‘చిత్రలహరి’పై చిరు ఏమన్నాడంటే..
-
‘చిత్రలహరి’పై చిరు కామెంట్స్
వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు చిత్రలహరి కాస్త ఊరటనిచ్చినట్టు కనిపిస్తోంది. గత చిత్రాల కంటే ఈ సినిమా ఫర్వాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చిత్రలహరిపై భిన్నాభిప్రాయాలు వస్తుండగా.. మూవీకి ప్రమోషన్‌ను కల్పించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో తెలిపారు. చిత్రలహరి గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ చాలా చక్కగా, పరిణితితో నటించాడని, డైరెక్టర్ కిషోర్ తిరుమల మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని చక్కగా రూపొందించారని, మైత్రి మూవీస్ సంస్థకు తగ్గట్టుగా ఈ సినిమాను వారు నిర్మించారని తెలిపారు. ఈ మూవీలో నటించిన మిగతా పాత్రల గురించి కూడా తనదైన శైలిలో కామెంట్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన సంగీతంతో సత్తా చాటారని కొనియాడారు. -
వాళ్లలా నొప్పించి సంపాదించడం లేదు
‘‘గెలుపు, ఓటమి అనేది దేవుడు సృష్టించింది కాదు. మనం పెట్టుకున్న గేమ్ అది. ఇందులో ఫస్ట్ వస్తే సక్సెస్. అది త్వరగా సాధిస్తే సక్సెస్. ఇలా అన్నీ మనం ఆడుకుంటున్న ఆటలు. ఇలా ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్లు పరిగెడుతున్నాం. గెలిచిన వాడిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినవాడిని తక్కువ చేయడానికి ప్రయత్నించకుండా ఉండాలి’’ అని సునీల్ అన్నారు. సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియ దర్శన్, నివేథా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించిన సునీల్ పంచుకున్న విశేషాలు... ► మనోజ్, విష్ణులతో సినిమాలు చేసే సమయం నుంచి తేజు నాకు తెలుసు. మాతో చాలా బాగా కలసిపోయేవాడు. అప్పట్లో తేజుని హీరోగా పెట్టి నేను ఓ సినిమా దర్శకత్వం చేద్దామనుకున్నాను. ఇప్పటికి కలసి యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. ► నా గ్లాస్‌మేట్స్ చాలా మంది ఉన్నారు. చెబితే లిస్ట్ సరిపోదు. ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో త్రివిక్రమ్ ఒకరు. ఆనందం అయినా, బాధ అయినా తనతో పంచుకోవాలనుకుంటాను. కష్టం దాటగలిగే కాన్ఫిడెన్స్ మాలో నింపేవాడు త్రివిక్రమ్. ► ఇప్పుడు టెక్నాలజీని(ఫేస్బుక్, ట్వీటర్) ఉపయోగాల కంటే అనవసరమైన వాటికే వాడుతున్నాం. ఇటీవల ఏదో యూట్యూబ్ వీడియోలో నేను చనిపోయాను అని ఓ వీడియో పోస్ట్ చేసేశారు. అంటే వ్యూస్ కోసం వేరే వాళ్లను హర్ట్ చేసేస్తారా? లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్లు సారీ చెప్పేశారు. వాళ్లను మళ్లీ ఇబ్బంది పెడితే నాకేం వస్తుంది? అని వదిలేశాను. వాళ్లలా ఎదుటి వ్యక్తిని నొప్పించి నేను సంపాదించడం లేదు. అందర్నీ నవ్వించి సంపాదిస్తున్నాను. ► సోషల్ మీడియా రావడం వల్ల ప్రతిదీ వార్త అయిపోయింది. ఆ వార్త చదువుతూ మీ టైమ్‌ను వేస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంకో మంచి ఆలోచన చేయొచ్చు కదా? ► కమెడియన్ నుంచి హీరోగా మారినప్పుడు యాక్షన్ కామెడీ చేద్దాం అనుకున్నాను. హాలీవుడ్ సినిమాల్లో హీరో పక్కన ఉండే క్యారెక్టర్లు కూడా ఫిట్‌గా సిక్స్ ప్యాక్స్తోనే కనిపిస్తారు. యాక్షన్ కామెడీ హీరోగా చేయాలని సిన్సియర్‌గా ట్రై చేశా. హీరోగా సినిమాలు చేస్తున్నానని కామెడీ పాత్రలు చేయమని అడగడం తగ్గించారు దర్శక–నిర్మాతలు. హీరోగా నాకు నచ్చినవి కొన్ని ఉంటే నిర్మాతల వల్ల ఒప్పుకున్న సినిమాలు మరికొన్ని. అప్పుడు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా నాతో చాలా మంది నిలబడ్డారు. నాకు ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు లేవు. అందరితో బావుంటాను. నా అదృష్టం అదే. ► మన సినిమాలు ఎక్కువ శాతం హాలీవుడ్ కాపీయే. మనవి వాళ్ల దగ్గరకు వెళ్లడం ఉండదు. ► హీరోగా కాకుండా కమెడియన్‌గా కొనసాగాలనుకుంటున్నాను. అప్పుడు నెలకు 2సార్లు తప్పకుండా ప్రేక్షకులను పలకరించవచ్చు. హీరోగా సంపాదిస్తున్న దానికంటే తక్కువ వస్తుంది కదా? అని మీరు అడిగితే ఒకేసారి పది రూపాయిలు తీసుకున్నా, పదిసార్లు రూపాయి తీసుకున్నా అంతే కదా అంటాను. ► కామెడీ సినిమాలకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. మనం కథ రాయకుండా కామెడీ సినిమాలు లేవు అనడం కరెక్ట్ కాదు. ‘మొన్న’ ఎఫ్ 2’ సక్సెసే ఇందుకు నిదర్శనం. ► ప్రస్తుతం అల్లు అర్జున్– త్రివిక్రమ్, రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో చేస్తున్నాను. నా అభిమాన హీరోతో ఓ పెద్ద సినిమాలో చేస్తున్నాను (చిరంజీవి–కొరటాల శివ సినిమాను ఉద్దేశిస్తూ). -
చిత్రయూనిట్
-
చాలారోజులకు సక్సెస్ మీట్లో పాల్గొన్నా
‘‘నిన్నటివరకు వేడి వేడిగా ఎలక్షన్లు జరిగాయి. ఈ రోజు అందరూ సేద తీరటానికా అన్నట్లు మా సినిమా విడుదలైంది. అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా ఉంది’’ అని నవీన్ ఎర్నేని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ సివీయం∙నిర్మించిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ‘చిత్రలహరి’ విడుదలైంది. ఈ చిత్రం తాము ఊహించినట్లుగా విజయం సాధించడం ఆనందంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి ‘సినిమా చాలా బావుంది, మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైంది’ అని చెప్పటం, మార్నింగ్ షో నుండి మంచి మౌత్ పబ్లిసిటీతో సినిమాకు మంచి రెస్పాన్స్ ఉండటంతో మ్యాట్నీ కలెక్షన్స్ పెరిగాయి. ఏది ఏమైనా మొదటి మూడు రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రంకల్లా మా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అవుతారని మా నమ్మకం’’ అన్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఏ సక్సెస్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూశానో అది ఈ రోజు నెరవేరింది. ప్రేక్షకులు అన్ని మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి ‘సార్.. ఇది నా పర్సనల్ స్టోరీలా ఉంది’ అన్నారు. ఐ యామ్ సో హ్యాపీ’’ అన్నారు. చిత్రకథానాయకుడు సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా జెన్యున్‌గా ఫీలై మా సినిమాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. నన్ను బోయ్ నెక్ట్స్ డోర్ (పక్కింటి కుర్రోడు)లా ఉన్నావని అంటున్నారు. ‘మా ఫాదర్‌తో రిలేషన్ సినిమాలో మీకు, మీ ఫాదర్‌కి ఉన్న రిలేషన్ లాగానే ఉంది సార్’ అని చాలా మంది కుర్రాళ్లు ట్వీటర్ వేదికగా చెబుతుంటే ఆనందంగా ఉంది. అవి రీ ట్వీట్లు చేసుకొంటూ, వాళ్లకి సమాధానం చెప్పటంతోనే ఈ రోజంతా సరిపోయింది. కలెక్షన్లు చాలా బావున్నాయి. చాలా రోజుల తర్వాత సక్సెస్‌మీట్‌లో పాల్గొంటున్నాను. ఈ సినిమా యూత్‌కి కనెక్ట్ అవ్వటంతో మంచి ఫలితం వచ్చింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు, టీమ్ సక్సెస్. మెగాఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను ముందు నుంచి అనుకున్నట్లుగానే మంచి విజయం సాధించాం’’ అన్నారు. -
‘చిత్రలహరి’ మూవీ రివ్యూ
టైటిల్ : చిత్రలహరి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : సాయి ధరమ్ తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : కిషోర్ తిరుమల నిర్మాత : రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తాజాగా చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని తన పేరును కూడా సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రలహరి సాయి ధరమ్‌కు హిట్ ఇచ్చిందా..? పేరు మార్చుకోవటం కలిసొచ్చిందా..? కథ : విజయ్ కృష్ణ (సాయి ధరమ్ తేజ్) జీవితంలో సక్సెస్ అంటే తెలియని కుర్రాడు. ఈ పోటీ ప్రపంచంలో తాను గెలవలేకపోతున్నా అని విజయ్ నిరుత్సాహపడినా.. తండ్రి (పోసాని కృష్ణమురళి) మాత్రం తన కొడుకు ఎప్పటికైన సక్సెస్ అవుతాడన్న నమ్మకంతో ఉంటాడు. యాక్సిడెంట్లో సరైన సమయానికి సహాయం అందక చనిపోతున్న వారిని కాపాడేందుకు విజయ్ ఓ డివైజ్‌ను తయారు చేస్తాడు. దాని స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే లహరి(కల్యాణీ ప్రియదర్శన్) పరిచయం అవుతుంది. తన అలవాట్లు, ఉద్యోగం గురించి అబద్దాలు చెప్పి లహరిని ప్రేమిస్తాడు విజయ్. కానీ ఓ రోజు లహరికి నిజం తెలిసిపోతుంది. విజయ్‌ని వదిలేసి దూరంగా వెళ్లిపోతుంది. తనకు ప్రేమలోనూ సక్సెస్ దక్కలేదని మరింత కుంగిపోతాడు విజయ్. అలాంటి విజయ్ తిరిగి ఎలా సక్సెస్ సాధించాడు..?ఈ కథలో స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) పాత్ర ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి తాను గతంలో చేయని ఓ కొత్త తరహా పాత్రను ఎంచుకున్నాడు. నేటి యూత్ ను ప్రతిబింభించే చేసే క్యారెక్టర్లో తనవంతుగా బాగానే నటించాడు. తన రేంజ్లో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, డాన్స్‌లు చేసే సాయికి చాన్స్ దక్కలేదు. కానీ మెచ్యుర్డ్ పర్ఫామెన్స్తో విజయ్ కృష్ణ పాత్రలో జీవించాడు. హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్ పరవాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపించినా తరువాత ఓకె అనిపించేలా ఉంది. మరో హీరోయిన్గా నటించిన నివేదా పేతురాజ్‌కు పెద్దగా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కలేదు. కార్పోరేట్ ఉమెన్‌గా నివేదా లుక్ ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, సునీల్, వెన్నెల కిశోర్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సెన్సిబుల్ పాయింట్స్‌తో సినిమాలను తెరకెక్కించే కిషోర్ తిరుమల చిత్రలహరి కోసం మరో ఇంట్రస్టింగ్ లైన్ తీసుకున్నాడు. నేటి యూత్ సక్సెస్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు. సక్సెస్ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారు అన్న విషయాలను తెరమీద చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో కిషోర్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కథా కథనాలు నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి. కథలోని పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్థాయి సీన్స్ లేకపోవటం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకుడిగా తడబడినా రచయితగా మాత్రం సక్సెస్ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ గుర్తిండి పోయేలా ఉన్నాయి. ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్న సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాతో పరవాలేదనిపించాడు. రెండు పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సాయి ధరమ్ తేజ్ కొన్ని డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ క్యారెక్టరైజేషన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నచ్చలేదని చెప్పే చొరవ వచ్చింది
‘‘ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నాకు చాన్సులు వస్తున్నాయని నేను నమ్మడం లేదు. కుటుంబ నేపథ్యం వల్ల ఒకటో రెండో వస్తాయి. ఆ తర్వాత పట్టించుకోరు. వరుసగా నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్ముతున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై నాకు జడ్జిమెంట్ రాలేదు. అది వస్తే అన్నీ నేర్చుకున్నట్లే. యాక్టర్‌గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతాను’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► నా స్క్రీన్ నేమ్‌ని సాయితేజ్‌గా మార్చుకోవడం వెనక పెద ్దకారణాలేవీ లేవు. ధరమ్‌ని కొంతకాలం పక్కన పెట్టానంతే. ఈ చిత్రంలో జీవితంలో సక్సెస్ తెలియని విజయ్కృష్ణగా నటించాను. ఒకరి జీవితాన్ని ఓ ఐదు పాత్రలు ఎలా ప్రభావితం చేశాయి? అన్నదే కథ. విజయ్ క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యాను. కథ విన్నప్పుడే మంచి సినిమా అవుతుంది, వదులుకోకూడదనుకున్నాను. ► పదకొండేళ్లుగా కిషోర్ తిరుమల తెలిసినప్పటికీ సినిమా చేయడం కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంశాలను కిషోర్ బాగా చూపిస్తారు. నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నన్ను నమ్మి చాన్స్ ఇచ్చారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు ఉండాలి. దేవి అన్న మ్యూజిక్ చాలా ఇష్టం. ‘దేవి మ్యూజిక్‌లో నువ్వు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది’ అని మా అమ్మ అనేవారు. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీ. అలాగే సునీల్ అన్నతో వర్క్ చేయడం అనేది నాకున్న కలలో ఒకటి. అది కూడా నెరవేరినందుకు హ్యాపీ. ► నా గత ఆరు సినిమాలు ఆడలేదు. స్క్రిప్ట్‌ను ఎంచుకునే విధానంలో ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పే ధైర్యం వచ్చింది. ఏౖమైనా అంటే.. ‘చూశారు కదండీ.. నా ఆరు సినిమాల రిజల్ట్’ అని చెప్పొచ్చు. కథ పట్ల పూర్తి సంతృప్తిగా ఉంటేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నాను. భవిష్యత్‌లోనూ ఇదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రిప్ట్ విని, డౌట్స్ ఉంటే చెబుతా. అంతే కానీ ఈ మార్పు కావాలి. ఫలానా డైలాగ్స్ మార్చాలి. నా బాడీకి ఇది సూట్ అవ్వవు అన్న అభ్యంతరాలు చెప్పను. కానీ సినిమా ఫెయిల్ అయితే అది నా బాధ్యతగా తీసుకుంటాను. ఎందుకంటే హీరోగా నేను ‘యస్’ అన్నప్పుడే సినిమా ముందుకు వెళ్తుంది. ► మాటిచ్చాను కాబట్టి కొన్ని సినిమాలు చేశాను. మాట ఇస్తే ఎలాగైనా నిలబడాలి. స్టార్టింగ్ స్టేజ్‌లో కథ విన్నప్పుడు నచ్చి, ఆ తర్వాత కొంతదూరం ట్రావెల్ చేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్లిపోతుందని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాయిస్ లేదు. అప్పుడు సినిమా పూర్తి చేయాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడకపోతే ఆడియన్స్ రెస్పాన్స్, విమర్శకుల అభిప్రాయాలను విశ్లేషించుకుని నన్ను నేను మెరుగుపరచుకోవడానికి మరింత కష్టపడతాను. ► కథలో కంటెంట్ బాగుంటే సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుంది. ఫెయిల్యుర్ వల్ల ఆగిపోతారనే ఫీలింగ్ ఎప్పుడూ నాకు లేదు. ప్రతి యాక్టర్‌కి ప్రతి శుక్రవారం తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక చాన్స్. దాన్ని నేను నమ్ముతాను. సక్సెస్ ఉన్నప్పుడు మన చుట్టూ గుంపు ఉంటుంది. సక్సెస్ దూరమైనప్పుడు ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఈ ఇద్దరు ముగ్గురు మనం ఏ స్టేజ్‌లో ఉన్నా ఉంటారు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను. హిందీ చిత్రం ‘గల్లీభాయ్’ తెలుగు రీమేక్‌లో నేను నటిస్తానన్న వార్తల్లో నిజం లేదు. ► నా బ్రదర్ వైష్ణవ్ తేజ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో నా ప్రమేయం లేదు. దర్శకులు బుచ్చిబాబు ప్రొడ్యూసర్స్‌ని కలిసి ముందుకు వెళ్లారు. హెయిర్ సర్జరీ కోసం, లైపోసక్షన్ కోసమే నేను యూఎస్ ట్రిప్ వెళ్లాననే ప్రచారం జరిగింది. అది నిజం కాదు. ‘విన్నర్’ సినిమా సమయంలో హార్స్‌రైడింగ్ వల్ల బాగా గాయపడ్డాను. ఆ గాయాలను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా టైమ్‌కి జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తున్న టైమ్‌కి ఆ గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. యూఎస్‌లోని స్పోర్ట్స్ ఫిజియో దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్లాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నాను. -
‘చిత్రలహరి’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
తప్పుగా అర్థం చేసుకుంటారేమో..!
సినిమా: తనను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారేమో నటి నివేదా పేతురాజ్ వాపోతోంది. దుబాయ్‌లో పెరిగిన ఈ తమిళ అమ్మాయి నటిగా కోలీవుడ్‌లో రాణిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన నివేదా తమిళంలో ఒరునాళ్ కూత్తు చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ తరువాత జయంరవితో టిక్ టిక్ టిక్, విజయ్ ఆంటోనికి జంటగా తిమిరుపుడిచ్చవన్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ప్రభుదేవాకు జంటగా పొన్ మాణిక్యవేల్, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ చిత్రాలతో పాటు జగజాల్ కిల్లాడి, విజయ్‌సేతుపతితో ఒక చిత్రం, దుల్కర్ సల్మాన్ సరసన మరో చిత్రం చేస్తోంది. అయితే గ్లామర్ విషయంలో తనకంటూ హద్దులు విధించుకున్న ఈ బ్యూటీ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌నే సొంతం చేసుకుంది. అలాంటిది ఇటీవల కాస్త గ్లామర్‌తో కూడిన ఫోటోలను సామాజిక మాద్యమాలకు విడుదల చేసి చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఒక భేటీలో నివేదా మాట్లాడుతూ.. తాను చెప్పేది తప్పుగా అర్థం చేసుకుంటారని మౌనంగా ఉంటున్నాననీ, తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నటినని పేర్కొంది. అందుకే తనకు దైవభక్తి కాస్త ఎక్కువేనని చెప్పింది. తాను కళాశాలలో చదువుతున్నప్పుడు తన తల్లిదండ్రులు మధురై సమీపంలోని మడప్పురం కాళీ దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలకు తీసుకెళ్లారని చెప్పింది. అప్పుడు తనకు పూనకం వచ్చిందని తెలిపింది. అప్పటి నుంచే తనలో భక్తి భావం మరింత పెరిగిందనీ, ఇప్పటికి అప్పుడప్పుడూ తనకు పూనకం వస్తుందని చెప్పింది. ఇకపోతే తనను చిత్ర పరిశ్రమలో తదుపరి నయనతారతో పోల్చడం సరి కాదని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో జరుగున్న చర్చలపై నివేదా పేతురాజ్ వివరణ ఇచ్చుకున్నారు. -
‘చిత్రలహరి’ సెన్సార్ పూర్తి
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ దక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని భావిస్తున్న సాయి ధరమ్ తేజ్ తన పేరును కూడా సాయి తేజ్ మార్చుకున్నాడు. మరి ఈ ప్రయోగం అయిన సాయి తేజ్‌కు హిట్ ఇస్తుందేమో చూడాలి. -
మా అమ్మగారి ఆశ నెరవేరింది
‘‘కొరటాల శివ, సుకుమార్‌గారికి థాంక్స్. మా సినిమాకు ప్రారంభంలో ఎంతో బూస్ట్ ఇచ్చారు. మైత్రీ మూవీస్ నాకు స్పెషల్. ఎందుకంటే ఆరు సినిమాల ఫ్లాప్ తర్వాత నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి థ్యాంక్స్’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లు. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మాతలు. ఏప్రిల్ 12న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. చిత్రం ట్రైలర్‌ను కొరటాల శివ, సుకుమార్ విడుదల చేశారు. సుకుమార్ మాట్లాడుతూ – ‘‘కిషోర్ సెన్సిటివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఈ సినిమా ఒక ఉగాది పచ్చడిలాంటిది. సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకునే హీరోలు తమిళంలో ఉంటారు. అలాంటి హీరోల్లా సాయి ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. మంచి పాటలు కుదిరాయి ’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘ఇంత మంది దర్శకులకు అవకాశం ఇస్తున్నారంటే సంస్థ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సినిమాలే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అధినేతల తపన. రైటర్‌గా మా దగ్గర పని చేసిన కిషోర్‌లో చాలా టాలెంట్ ఉంది. తన నుండి చాలా చాలా మంచి సినిమాలు వస్తాయి. నాకీ కథ చెప్పారు. తేజు హానెస్ట్ పర్సన్. తను తప్ప ఎవరూ ఈ కథకు న్యాయం చేయలేరనిపించింది’’ అన్నారు. ‘‘కిషోర్ ఎప్పటి నుండో పరిచయం. దేవిశ్రీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ఎన్ని ఫ్లాపులొచ్చినా, హిట్స్ వచ్చినా ఈ స్టేజ్‌పై ఉన్నానంటే కారణం మా మావయ్యలు.. మెగాభిమానులు’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘నవీన్ ఎర్నేనిగారి వల్లే ఈ సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్ పెట్టాను. అలాగే యలమంచిలి రవి, మోహ¯Œ గారికి థ్యాంక్స్. నా మూడు సినిమాలకు దేవీగారి మ్యూజిక్ పెద్ద ఎసెట్‌గా నిలుస్తూ వచ్చింది. కార్తీక్ కెమెరామేన్‌గానే కాదు.. కథలో నాతో పాటు ట్రావెల్ అవుతూ వచ్చారు. నేను రైటర్‌గా ఉన్నప్పటి నుండి తేజుతో పరిచయం ఉంది. తప్పకుండా అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు కిషోర్ తిరుమల. ‘‘ఇందులో లహరి అనే పాత్ర చేశాను. సొంత వాయిస్‌తో డబ్బింగ్ కూడా చెప్పాను’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్ . ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నివేదా పేతురాజ్. ఈ వేడుకలో సునీల్, బ్రహ్మాజీ, దర్శకులు సంతోష్ శ్రీనివాస్, వెంకీ కుడుముల, మారుతి, శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు. -
చీకటికి చిరునామా నేను.. చిత్రలహరి
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సక్సెస్ కోసం సెంటిమెంట్లను కూడా ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో తన పేరును సాయి తేజ్ అని వేసుకుంటున్నాడు ఈ మెగా హీరో. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. కెరీర్లో సక్సెస్అన్నదే లేని ఓ యువకుడి కథ చిత్రలహరి. సాయి ధరమ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో సునీల్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
పేరు మార్చుకున్న మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మందికి పైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. అయితే యంగ్ జనరేషన్లో రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోగా మిగతా హీరోలు సక్సెస్‌ల వేటలో ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా తరువాత వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సాయి సక్సెస్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వరస ఫ్లాప్లే కారణమో లేక మరే ఇతర కారణమైనా ఉందో తెలియదు గానీ సాయి ధరమ్ తేజ్ తన పేరును మార్చుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన చిత్రలహరిలోని పరుగు పరుగు పాట లిరికల్ వీడియోలో సాయి ధరమ్ తేజ్ పేరును సాయి తేజ్ అని వేశారు. సినిమాలో కూడా టైటిల్స్‌లో ఇదే పేరు పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ కొత్త పేరైన సాయి ధరమ్ తేజ్‌ను ఫ్లాప్‌ల నుంచి బయటపడేస్తుందేమో చూడాలి. -
‘చిత్రలహరి’ టీజర్ రిలీజ్
-
తేజ్‌కు మళ్లీ సుప్రీమ్ డేస్ వస్తాయి
సాయిధరమ్‌తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా, ‘నేను శైలజా’ ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్ నిర్మించారు. ఏప్రిల్ 12న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ – ‘‘అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కిషోర్ ఈ టైటిల్ చెప్పగానే బాగా నచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తాం. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సాయి ధరమ్ తేజ్‌కు మళ్లీ ‘సుప్రీమ్’ డేస్ వస్తాయి అనే నమ్మకం ఉంది’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘మంచి పాత్ర కోసం చూస్తున్న తరుణంలో కిషోర్‌గారు ఈ పాత్రను ఇచ్చారు. ప్రేక్షకుడు నవ్వుతూనే ఇంటికి వెళ్తాడు’’ అన్నారు సునీల్.‘‘కిషోర్‌గారు కథ ఎంత బాగా చెప్పారో అంతే బాగా తీశారు. సునీల్ అన్న కామెడీని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు సాయిధరమ్. ‘‘కిషోర్‌గారు నా పాత్రను బ్యూటి ఫుల్‌గా డిజైన్ చేశారు. సాయిధరమ్, కల్యాణితో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు నివేదా. -
నాలుగు విభిన్న పాత్రల కథ ‘చిత్రలహరి’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు చిత్రయూనిట్. సినిమాలోని ప్రధాన పాత్రల స్వభావాలను టీజర్లోనే చెప్పేశారు. ఆపాత్ర మధ్య జరిగే సరదా సంఘటనలే ఈ సినిమా కథ అంటూ హింట్ ఇచ్చేశారు. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ మరో కీలక పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
రచయితగా మారిన మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్, తనకంటూ సొంత ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్ హీరో, తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు. దీంతో తన కోసం తానే ఓ కథను రెడీ చేసుకునే పనిలో ఉన్నాడట సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ఓ లైన్‌ను సిద్ధం చేసుకున్న సాయి, పూర్తి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తాను రాసుకున్న కథను డైరెక్ట్ చేయాల్సిందిగా ఓ యంగ్ డైరెక్టర్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నాడట. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అన్న విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రలహరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. -
‘చిత్రలహరి’లోని పాత్రలు మిమ్మల్ని కలుస్తారు!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికే టైటిల్ లోగోను రిలీజ్ చేసిన చిత్రలహరి టీం, ఈ బుధవారం టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ‘‘చిత్రలహరి’లోని పాత్రలో 13వ తారీఖున 9 గంటలకు మిమ్మల్ని కలుస్తారు’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు. -
బిజీ బిజీ
‘హలో’తో తెలుగు చిత్రపరిశ్రమకు హాయ్ చెప్పారు కల్యాణీ ప్రియదర్శన్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఈ ఏడాది కల్యాణి రెండుభాషల్లో నటించిన రెండేసి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె శర్వానంద్ సరసన సుధీర్ వర్మ సినిమాలో, సాయిధరమ్ తేజ్‌తో ‘చిత్రలహరి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళంలో దుల్కర్ సల్మాన్‌తో ‘వాన్’ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమా అంగీకరించి జోరు పెంచారు కల్యాణీ ప్రియదర్శన్. ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రాన్ని రూపొందించిన పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్నంది. ఇందులో హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్ నటించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించారు. తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలతో పాటు మలయాళంలో ఆమె తండ్రి ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘మరక్కార్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇందులో మోహన్‌లాల్ హీరో. కాగా, కళ్యాణి క్యారెక్టర్ షూట్ పూర్తయింది. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది.