contracts
-
వొడాఫోన్ ఐడియా భారీ కాంట్రాక్టులు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా భారీ కాంట్రాక్టులకు తెరతీసింది. 4జీ, 5జీ నెట్వర్క్ పరికరాల కొనుగోలు కోసం రూ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది. మూడేళ్లలో వీటిని సరఫరా చేసేందుకు దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లను ఎంపిక చేసుకుంది. వెరసి ఈ ఏడాది భారీ ఆర్డర్లను ఇచ్చిన టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్ ఐడియా నిలిచింది. మూడేళ్ల కాలంలో 6.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 55,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచేందుకు కంపెనీ ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా తొలి దశ కింద తాజా కాంట్రాక్టులకు తెరతీసింది. మూడేళ్లలో 4జీ, 5జీ కవరేజీకి వీలుగా నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లు పరికరాలు సరఫరా చేయవలసి ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటన పేర్కొంది. సరఫరాలు డిసెంబర్ క్వార్టర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. తద్వారా 4జీ కవరేజీని 1.03 బిలియన్ నుంచి 1.2 బిలియన్ల జనాభాకు పెంచడం, కీలక మార్కెట్లలో 5జీ సేవలను ప్రవేశపెట్టడం, డేటా వినియోగానికి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరించడం చేపట్టనున్నట్లు తెలియజేసింది. తొలుత 4జీ కవరేజీని 120 కోట్ల మందికి చేరువ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీఐఎల్ 2.0కు శ్రీకారం... వీఐఎల్ 2.0 పేరుతో పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించినట్లు వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా తెలియజేశారు. నోకియా, ఎరిక్సన్ కంపెనీ ప్రారంభం నుంచి భాగస్వాములుకాగా.. తాజాగా శామ్సంగ్తో ప్రయా ణం ప్రారంభించడం ప్రోత్సాహకర అంశమని వ్యాఖ్యానించారు. 2018లో ఐడియా సెల్యులర్‌తో విలీనం అనంతరం వొడాఫోన్ ఐడియాగా ఏర్పాటైనప్పుడు 40.8 కోట్లమంది కస్టమర్లతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించింది. అయితే ఆపై జియో, ఎయిర్‌టెల్‌తో ఎదురైన తీవ్ర పోటీలో వెనకబడటంతో ప్రతీ నెలా కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచి్చంది. ప్రస్తుతం వీఐఎల్ వినియోగదారుల సంఖ్య 21.5 కోట్లు. -
అలాంటి ఉద్యోగుల విషయంలో కఠిన వైఖరి
ఉద్యోగుల కాంట్రాక్టు విషయంలో తన కఠిన వైఖరిని ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. తమ ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని విప్రో తెలిపింది. అంటే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించి బయటకు వెళ్లిపోయేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేసింది."ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల విషయంలో ఖచ్చితంగా ఉంటాం. ఇందులో మా వైఖరి మారలేదు. మారబోదు’’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు. కంపెనీలో ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామని, కానీ కొంత మంది బయట మంచి అవకాశాలు దొరికితే వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.గత ఏడాది నవంబర్‌లో విప్రోను వీడి కాగ్నిజెంట్‌లో సీఎఫ్ఓగా చేరిన తమ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ నుంచి కాంట్రాక్టు ఉల్లంఘన కింద విప్రో ఇటీవల రూ.25 కోట్లు కోరింది. 2015లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినప్పటి నుంచి దలాల్‌కు మంజూరు చేసిన స్టాక్ యూనిట్ల విలువను బట్టి ఈ మొత్తాన్ని విప్రో డిమాండ్ చేసింది. ఇదే వ్యవహారంలో తన మాజీ యజమాని విప్రోతో వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇటీవల కాగ్నిజెంట్ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. -
వ్యవసాయ కార్పొరేషన్లపై ఏసీబీ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఆయన వ్యవసాయశాఖలోని ఒక కార్పొరేషన్ ఎండీ.. టెండర్లు, పనుల్లో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు మొదలు అన్నింటిలోనూ వసూళ్లేనని.. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆయన హైదరాబాద్‌లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక విల్లా, హైదరాబాద్ పరిసరాల్లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ♦ ఇదేశాఖలోని ఓ కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు రెండు విల్లాలు, రెండు ప్లాట్లు, నగర శివారులో ఐదెకరాల ఫాంహౌస్ ఉందని సమాచారం. మరో కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, ఐదుచోట్ల ఇళ్ల స్థలాలు, నగర సమీపంలో రెండెకరాల భూమి ఉన్నాయి. ఒక కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారికి ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయి. ♦ ..వ్యవసాయశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనే జర్లపై వస్తున్న ఫిర్యాదుల్లోని అంశాలివి. దీనిపై దృష్టిపెట్టిన ఏసీబీ కొందరు పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. రెండు కార్పొరేషన్ల ఎండీలపై నేరుగా ఫిర్యాదులు అందడంతో.. ఏసీబీ అధికారులు లోతుగా పరిశీల న చేపట్టి, రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే ఆయా ఉద్యోగులను పిలిపించి విచారించేందుకు, సోదాలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయా కార్పొరేషన్ల జనరల్ మేనేజర్లు, మేనేజర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వ్యవసా య ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఐఏఎస్‌ల విచారణతో.. వ్యవసాయశాఖలోని 11 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇద్దరు ఐఏఎస్‌లను విచారణ అధికారులుగా నియమించారు కూడా. దీంతో భారీగా దండుకున్న అధికారుల్లో దడ మొదలైంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, దీని నుంచి బయటపడేందుకు పలువురు ఎండీలు, జనరల్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మార్క్‌ఫెడ్‌లో భారీగా ఉల్లంఘనలు! వ్యవసాయశాఖ పరిధిలో మార్క్‌ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, హాకా, టెస్కాబ్, సీడ్ కార్పొరేషన్ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో వందల కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. మార్క్‌ఫెడ్ లోనైతే ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. దానిద్వారానే రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రైతుల పంటలను కూడా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం, రైతుల నుంచి కొన్న పంటలను విక్రయించాక వచ్చే డబ్బును బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అధికా రులు ఆయా లావాదేవీలను ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకులతో నిర్వహిస్తుండటంపై విమర్శలు న్నా యి. ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారుతు న్నట్టు ఆరోప ణలు న్నాయి. ఎరువుల నుంచి గన్నీ బ్యాగుల దాకా.. ఎరువుల రవాణా టెండర్లు అధికారులకు వరాల జల్లు కురిపిస్తాయని.. రూ.వంద కోట్లకు పైబడి ఉండే ఈ టెండర్లను ఒకే కంపెనీకే వచ్చేలా నిబంధనలు రూపొందించి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కంపెనీకే టెండర్ దక్కుతూ వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇక గన్నీ బ్యాగుల టెండర్లలోనూ కొందరు అధికారులు కంపెనీల నుంచి కమీషన్లు అందుకుంటున్నారన్న సమాచారం ఉంది. ♦ 2019–20లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నను టెండర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో దాదాపు రూ.1,200 కోట్లు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఎండీ స్థాయి అధికారి నుంచి మేనేజర్ల వరకు కోట్లలో కమీషన్లు ముట్టినట్లు ఫిర్యాదులున్నాయి. మార్క్‌ఫెడ్‌కు రూ.3 వేల కోట్ల అప్పులుంటే, ఈ స్కాం వల్లే సగం అప్పు పేరుకుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అసలు పదేళ్లుగా మార్క్‌ఫెడ్ జనరల్ బాడీ సమావేశం జరగలేదంటే నిబంధనల ఉల్లంఘన ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నాయి. మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి తన పోస్టును కాపాడుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ♦ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లోనైతే జిల్లా మేనేజర్లు కూడా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో కొందరిని అడ్డుపెట్టుకొని పైస్థా యి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమా లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవే ట్ గోదాములతో సంబంధాలు పెట్టుకుని.. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌ను దివాలా తీయిస్తున్నా రన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పనులకు టెండర్లకు వెళ్లకుండా పాత వాటినే కొనసాగిస్తూ నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. ♦ ఆయిల్‌ఫెడ్‌లో సిద్దిపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతుల టెండర్‌ను తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీకి కాకుండా మరో కంపెనీకి ఇవ్వడం వివాదం రేపింది. కోర్టులో ఈ వివాదం ముగిసింది. కానీ ఈ వ్యవహారంలో కొందరు అధికారులు పాత్ర పోషించారని.. కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ♦ నిబంధనలకు విరుద్ధంగా ఆయిల్‌ఫెడ్‌లో రూ.కోటిన్నర, వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో రూ.కోటి మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద కేటాయించారు. ♦ హాకాలో శనగల కొనుగోలు వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఇందులో ఎండీ పాత్ర కంటే అప్పటి ఒక ప్రజాప్రతినిధి జోక్యమే అన్ని విధాలుగా హాకాను భ్రష్టుపట్టించిందనే విమర్శ లున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి శనగలు సరఫరా చేసే బాధ్యత తీసుకొని వాటిని విని యోగదారులకు కాకుండా వ్యాపారులకు కమీష న్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ♦ ఇక ఆగ్రోస్‌ను పెద్దగా అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ యాంత్రీకరణ అమలుకాకపోవడంతో ఆగ్రోస్ కునారిల్లిపోయింది. ♦ ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధి తన పదవిని అడ్డుపెట్టుకొని రూ.500 కోట్ల దాకా వెనకేసుకున్నట్టు ఆరోపణ లున్నాయి. అధికారం ద్వారా అనేక వ్యాపారాలు చేసి కమీషన్లు వసూలు చేశారని, అధికారులు తనకు నచ్చినట్టుగా వ్యవహరించేలా చేశాడని సమాచారం. అదే ఇప్పుడు సదరు కార్పొ రేషన్‌ను బోనులో నిలబెట్టిందని అంటున్నారు. ఇప్పటికీ చక్రం తిప్పుతున్న మాజీ చైర్మన్లు గత ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారు ఇప్పుడు మాజీలుగా మారినా కొత్త ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఆయా కార్పొరేషన్ ఎండీలు, ఇతర మేనేజర్లు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తూ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే పార్టీ మారి మళ్లీ ఇదే కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వస్తామనీ బెదిరిస్తున్నట్టు సమాచారం. కొందరు ఇప్పటికీ కార్పొరేషన్ల డ్రైవర్లను వాడుకుంటున్నట్టు తెలిసింది. సదరు మాజీ చైర్మన్లతో కలసి అక్రమాలకు పాల్పడిన పలువురు ఎండీలు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
అమరావతిలో ‘ప్రత్తిపాటి’ దోపిడీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణాల్లో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు వెల్లడైంది. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొల్లగొట్టి.. షెల్‌కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఆధారాలతోసహా బట్టబయలైంది. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లమైంది. దీంతో డీఆర్ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తీగ లాగితే కదిలిన డొంక ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలలో బ్రాంచి కార్యాలయాలున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ డైరెక్టర్‌గా, ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ, చేసినట్లు గా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతోపాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా పొందింది. దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ దృష్టిసారించాయి. ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది. షెల్ కంపెనీలను సబ్ కాంట్రాక్టర్లుగా చూపించి రూ.21.93 కోట్లు అవెక్సా కార్పొరేషన్ ముసుగులో ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో ప్రత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్డు సంస్థలను బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ (ప్రస్తుత పేరు జైశ్నవి ఎమినెన్స్) అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందింది. ఆ కంపెనీ నుంచి రూ.37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. సీఆర్డీయే పరిధిలో రోడ్లు, వరదనీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే, ఈ సంస్థ తానిషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రోజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు రూ.21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా కనికట్టు చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. అవి ఏ పనులూ చేయలేదు. ఆ నాలుగు కంపెనీలూ షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం రూ.21,93,08,317 నిధులను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. రహదారి కాంట్రాక్టుల ముసుగులో రూ.26.25 కోట్లు దోపిడీ అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలోని ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలోకి మళ్లించుకుంది. రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ – స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఆ విధంగా ఏ పనీ చేయకుండానే వివిధ దశల్లో రూ.26,25,19,393 దోపిడీ చేసింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరిట అక్రమంగా రూ.17.85 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జి+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈమేరకు ఆధ్యా ఎంటర్‌ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా రూ.17,85,61,864 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం రూ.66,03,89,574 ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. అవును ...భోగస్ బిల్లులతో నిధులు కొల్లగొట్టాం – అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్ర జగదీశ్వరరావు ఈ వ్యవహారంపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ విచారణలో మొత్తం లోగుట్టు బట్టబయలైంది. అవెక్సా కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కుర్ర జగదీశ్ తాము బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని అంగీకరించారు. ఈ కుంభకోణానికి ఎలా పాల్పడిందీ ఆయన సవివరంగా వెల్లడించారు. దాంతో అవెక్సా కంపెనీ ముసుగులో ప్రత్తిపాటి కుటుంబం అవినీతి బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైంది. తనయుడి కోసం తండ్రి పుల్లారావు చక్కర్లు విజయవాడ స్పోర్ట్స్/గుణదల (విజయవాడ తూర్పు): అమరావతి పనుల కుంభకోణంలో దొరికిపోయిన ప్రత్తిపాటి శరత్ కోసం అతని తండ్రి, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పత్త్రిపాటి పుల్లారావు విజయవాడలో చక్కర్లు కొట్టారు. డీఆర్ఐ ఫిర్యాదుపై శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు. దీంతో శరత్ జాడ కోసం అతని తండ్రి పుల్లారావు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఇతర టీడీపీ నాయకులను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షణలు చేశారు. ముందుగా గురునానక్ కాలనీలోని ఏసీపీ కార్యాలయానికి, అక్కడ లేకపోవడంతో మాచవరం పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం తన అనుచరులను నగరం నలుదిక్కులకు పంపారు. ఆ తరువాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడా లేకపోవడంతో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో పుల్లారావు, పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులతో కలిసి పోలీసు కమిషనరేట్‌కు చేరుకొని తన కొడుకును చూపించాలంటూ ఆందోళనకు దిగారు. కొద్ది సేపటి తరువాత రూరల్ డీసీపీ కె.శ్రీనివాసరావు వచ్చి ఓ గంటలో న్యాయమూర్తి వద్ద నిందితుడు శరత్‌ను ప్రవేశపెడతామని చెప్పడంతో ఆందోళన విరమించి మాచవరంలోని జడ్జి క్వార్టర్స్‌కు వెళ్లారు. -
యశస్వికి ‘డబుల్’...శ్రేయస్, కిషన్ అవుట్
ప్రతిభకు, మైదానంలో ప్రదర్శనకు బీసీసీఐ పట్టం కట్టింది...టెస్టుల్లో వరుస డబుల్ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్‌ను ‘డబుల్ ప్రమోషన్’తో గుర్తించిన బోర్డు నిలకడైన ఆటతో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను ఒక మెట్టు పైకి ఎక్కించింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ స్థాయిని నిలబెట్టుకోగా...క్రమశిక్షణ తప్పితే శిక్ష తప్పదంటూ శ్రేయస్, కిషన్‌లను పక్కన పెట్టింది. 30 మందితో కూడిన బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ జాబితాలో విశేషాలివి. న్యూఢిల్లీ: 2023–24కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా బీసీసీఐ కాంట్రాక్ట్‌ల జాబితాలో తమ ‘ఎ ప్లస్’ గ్రేడ్లను నిలబెట్టుకున్నారు. ఈ కేటగిరీలో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పూ జరగలేదు. గ్రేడ్ ‘ఎ’లో ఇప్పటికే ఉన్న అశ్విన్, షమీ, హార్దిక్ పాండ్యాలతో పాటు కొత్తగా సిరాజ్, రాహుల్, గిల్ చేరారు. గత ఏడాది కాలంగా వన్డే వరల్డ్ కప్ సహా పలు సిరీస్‌లలో కీలక ప్రదర్శనలతో టీమ్ మేనేజ్మెంట్ అంచనాలను అందుకోవడమే ఈ ముగ్గురి ప్రమోషన్‌కు కారణం. టి20ల్లో అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతూ వన్డే జట్టులోనూ ఉన్న సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్ ‘బి’లో తన స్థానం నిలబెట్టుకోగా ఇందులో యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కడం పెద్ద విశేషం. సాధారణంగా తొలి సారి కాంట్రాక్ట్ ఇస్తూ ఆటగాళ్లను ‘సి’లో చేర్చి ఆపై ప్రదర్శనతో ప్రమోషన్లు ఇచ్చే బోర్డు యశస్వి అసాధారణ ఆటకు నేరుగా ‘బి’లో అవకాశం కల్పించింది. ‘సి’ జాబితాలో ఉన్నవారిలో కొందరు అప్పుడప్పుడు వన్డేల్లో మెరిసినా...దాదాపు అందరూ టి20 స్పెషలిస్ట్‌లే కావడం విశేషం. క్రమశిక్షణారాహిత్యంతో... ‘వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి పరిణామాలే అందుకు కారణం. వీరిద్దరు భారత్‌కు ఆడని సమయంలో రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగాలని బీసీసీఐ సూచించినా...దానిని పట్టించుకోలేదు. మానసిక ఆందోళన కారణంగా చూపి దక్షిణాఫ్రికా టూర్ మధ్యలోనే స్వదేశం వచ్చేసిన కిషన్ ఆ తర్వాత దుబాయ్‌లో పార్టీలో పాల్గొంటూ కనిపించాడు. తమ జట్టు జార్ఖండ్ ఒక వైపు రంజీ ఆడుతుంటే అతను నేరుగా ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ శిక్షణా శిబిరానికి హాజరయ్యాడు. మరో వైపు ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో చోటు కోల్పోయిన తర్వాత శ్రేయస్ వెన్ను గాయంతో ముంబై తరఫున రంజీ క్వార్టర్ ఫైనల్ ఆడలేనని చెప్పాడు. అతని గాయంలో నిజం లేదని ఎన్సీఏ డాక్టర్లు ధ్రువీకరించినట్లుగా బోర్డు అంతర్గత సమాచారం. ఈ విషయంలో కోచ్ ద్రవిడ్ నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్ కప్‌లో 530 పరుగులతో కీలక పాత్ర పోషించిన అయ్యర్ పట్ల తీవ్రంగా వ్యవహరించి...గాయం తర్వాత అక్టోబర్నుంచి ఇప్పటి వరకు అధికారిక టోర్నీ ఆడని హార్దిక్‌కు మాత్రం ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ కొనసాగించడం ఆసక్తికరం. జాతీయ జట్టుకు ఆడని సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ బీసీసీఐ ఇప్పుడు స్పష్టంగా పేర్కొనడం విశేషం. కొత్తగా పేసర్లకు... కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న రిషభ్ పంత్ గత ఏడాది కాలంలో ఎలాంటి క్రికెట్ ఆడకపోయినా...పూర్తిగా పక్కన పెట్టకుండా ఒక గ్రేడ్ తగ్గించి అతడిని కొనసాగించగా...పేలవ ప్రదర్శనతో అక్షర్ స్థాయి కూడా తగ్గింది. భారత్‌లో ఫాస్ట్ బౌలర్లను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహించే క్రమంలో ఐదుగురు బౌలర్లకు కొత్తగా ‘ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్’లు ఇవ్వడం విశేషం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కాలాన్ని కాంట్రాక్ట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు, లేదా 10 టి20లు ఆడాలి. ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ తర్వాతి మ్యాచ్ ఆడితే వారు నేరుగా ‘సి’ గ్రేడ్‌లోకి వచ్చేస్తారు. జట్టులో స్థానం కోల్పోయిన పుజారా, ఉమేశ్, శిఖర్, చహల్, హుడా సహజంగానే జాబితానుంచి దూరమయ్యారు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితా (2023–24) గ్రేడ్ ‘ఎ’ ప్లస్ (రూ.7 కోట్లు): రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘ఎ’ (రూ. 5 కోట్లు): అశ్విన్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా గ్రేడ్ ‘బి’ (రూ. 3 కోట్లు): సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ గ్రేడ్ ‘సి’(రూ.1 కోటి): రింకూసింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివమ్ దూ బే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, సుందర్, ముకేశ్ కుమార్, సంజు సామ్సన్, అర్ష్ దీప్, కేఎస్ భరత్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పటిదార్ (వీరందరికీ మొదటిసారి కాంట్రాక్ట్ దక్కింది). కాంట్రాక్ట్‌లు కోల్పోయినవారు: అయ్యర్, ఇషాన్ కిషన్, పుజారా, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్. సిరాజ్, రాహుల్, గిల్ (‘బి’ నుంచి ‘ఎ’కి) కుల్దీప్ ‘సి’ నుంచి ‘బి’కి పంత్, అక్షర్ (‘ఎ’ నుంచి ‘బి’ కి) యశస్వికి నేరుగా ‘బి’ గ్రేడ్ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లు: ఆకాశ్ దీప్ (బెంగాల్), ఉమ్రాన్ మలిక్ (జమ్మూ కశ్మీర్), యశ్ దయాళ్ (యూపీ), విద్వత్ కావేరప్ప, విజయ్‌కుమార్ వైశాక్ (కర్నాటక). -
ఒకేసారి 13 కొత్త కాంట్రాక్టులు.. ఎన్ఎస్ఈ
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్‌లో మరింత విస్తరించే దిశగా ఎన్ఎస్ఈ కొత్త కాంట్రాక్టులను జోడిస్తోంది. సోమవారం ఒకేసారి 13 నూతన కాంట్రాక్టులను ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. కమోడిటీ డెరివేటివ్స్‌లో ఎన్ఎస్ఈ ఆఫర్ చేస్తున్న ఉత్పత్తుల సంఖ్య 28కి చేరింది. గోల్డ్ 1కేజీ ఫ్యూచర్స్, గోల్డ్ మినీ ఫ్యూచర్స్, సిల్వర్ మినీ ఫ్యూచర్స్, కాపర్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, గోల్డ్ గినియా (8గ్రాములు) ఫ్యూచర్స్, అల్యూమినియం ఫ్యూచర్స్, అల్యూమినియం మినీ ఫ్యూచర్స్, లెడ్ ఫ్యచర్స్, లెడ్ మినీ ఫ్యూచర్స్, నికెల్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, జింక్ మినీ ఫ్యూచర్స్‌లో ‘ఆప్షన్ ఆన్ ఫ్యూచర్స్’ను ఎన్ఎస్ఈ తాజాగా ప్రారంభించింది. ఇంధనం, బులియన్, బేస్ మెటల్స్‌లో అన్ని ఉత్పత్తులకు సంబంధించి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అందిస్తున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్లో రిస్క్‌ను సమర్థవంతంగా హెడ్జ్ చేసుకోవచ్చని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. గత కొన్ని రోజుల్లో ఎన్ఎన్ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, సిల్వర్‌కు సంబంధించి ఆరు నూతన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించడం గమనార్హం. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. -
కోవిడ్ తర్వాత పెట్టుబడులు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో నమ్మకం అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్ తర్వాత ఏటా పెరుగుతున్న ఒప్పందాలు, వాస్తవ రూపంలోకి వచ్చిన పెట్టుబడులే దీనికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్ ప్యాకేజీతో పరిశ్రమలను ఆదుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఎంచుకుంటున్నారు. 2021 తర్వాత నుంచి రాష్ట్రం ఆకర్షిస్తున్న పెట్టుబడుల విలువ భారీగా పెరుగుతోంది. 2021లో రూ.9,373 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 47 ఒప్పందాలు కుదరగా 2022లో 54 యూనిట్ల ద్వారా రూ.16,137 కోట్ల విలువైన ఒప్పందాలు జరగడం గమనార్హం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 18 యూనిట్ల ద్వారా రూ.7,187 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. అంటే గత 27 నెలల్లో కొత్తగా 119 యూనిట్లను ఆకర్షించడం ద్వారా రూ.32,697 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మార్చిలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 387 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా గరిష్టంగా ఆరు నెలల్లోనే పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రానున్న త్రైమాసికాల్లో ఈ ఒప్పందాల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉత్పత్తి ప్రారంభించడంలోనూ అదే జోరు కేవలం కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను అమలు చేస్తోంది. ‘వైఎస్ఆర్ వన్’ ద్వారా ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభించే వరకు అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ వ్యవస్థను తెచ్చింది. దీంతో గతేడాది పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2021లో రూ.10,350 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 47 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్లు డీపీఐఐటీ తెలిపింది. 2022లో రూ.45,217 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో రూ.4,919 కోట్ల విలువైన 13 యూనిట్లు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. అంటే గత 27 నెలల వ్యవధిలో మొత్తం 106 భారీ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.60,486 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 కాలంలో సగటున ఏటా రూ.11,994 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇప్పుడు నాలుగేళ్లుగా ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం గమనార్హం. ఈ ఏడాది ముగిసేనాటికి సగటు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. -
ఇదేం ‘శిక్ష’ణ..?.. కోచింగ్ పూర్తికాకుండానే సంస్థలకు సొమ్ములు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చే కాంట్రాక్టులు పొందిన పలు ప్రైవేటు కోచింగ్ సంస్థలు శిక్షణ పూర్తి చేయకుండానే సర్కారు సొమ్మును అప్పనంగా దండుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా సంస్థల నిర్వాకంతో విలువైన సమయాన్ని కోల్పోయిన అభ్యర్థులు పలు జిల్లాల్లో ఏకంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో వాస్తవ పరిస్థితిని సమీక్షించిన అధికారులకు అసలు సంగతి తెలిసింది. ఇంత జరిగినా అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టి ఇక చేసేదేంలేదని చేతులు దులుపుకోవడం గమనార్హం. ‘ప్రైవేటు’కు అప్పగించి... బీసీ అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గతేడాది సెపె్టంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లను తెరిచింది. ఒక్కో కేంద్రంలో 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేసింది. ఒక్కో అభ్యర్థికి మూడు నెలలపాటు అయ్యే శిక్షణ వ్యయాన్ని రూ. 5 వేల చొప్పున ఖరారు చేశారు. ఈ ఫీజును బీసీ సంక్షేమ శాఖ భరిస్తూ... అభ్యర్థులకు మాత్రం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సెంటర్లను తెరిచింది. ఈ లెక్కన ఒక్కో కేంద్రంలో 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు రూ. 5 లక్షలు ఖర్చు కానుండగా రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్ల ద్వారా అయ్యే మొత్తం శిక్షణ ఖర్చు రూ. 2.5 కోటు్లగా ప్రభుత్వం తేల్చింది. ఈ మొత్తంతో అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను బీసీ స్టడీ సర్కిల్ ఏడు ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 స్టడీ సెంటర్ల బాధ్యతలు ఇవ్వగా మిగతా ఆరు సెంటర్లకు ఐదేసి సెంటర్ల చొప్పున శిక్షణ బాధ్యతలు ఇచ్చింది. సబ్ కాంట్రాక్టు పేరుతో మాయ.. ఇంతవరకు బాగానే ఉన్నా... శిక్షణ బాధ్యతలు తీసుకున్న ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. అభ్యర్థులకు నేరుగా శిక్షణ ఇచ్చే బదులు ఆ బాధ్యతను కొందరికి సబ్ కాంట్రాక్టు ఇచ్చాయి. 20 స్టడీ సెంటర్ల బాధ్యతలు తీసుకున్న ఓ కాంట్రాక్టు సంస్థ... కిందిస్థాయిలో ఒక్కో వ్యక్తికి 10 సెంటర్ల చొప్పున రూ. 7.5 లక్షలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లు తెలిసింది. అయితే సబ్ కాంట్రాక్టు పొందిన వాళ్లంతా తరగతులు ప్రారంభించి దాదాపు నెల రోజులు నిర్వహించిన అనంతరం అప్పటివరకు చెప్పిన క్లాసులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టు తీసుకున్న సంస్థలను డిమాండ్ చేశారు. కానీ కాంట్రాక్టు సంస్థలు పట్టించుకోకపోవడంతో సబ్ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ తరగతులను నిలిపివేశాయి. దీంతో అర్ధంతరంగా కోచింగ్ నిలిచిపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేయగా మరికొన్ని జిల్లాల్లో అభ్యర్థులను స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. మరోవైపు దీనిపై వివాదం కొనసాగుతుండగానే శిక్షణ గడువు ముగిసిందంటూ కాంట్రాక్టు సంస్థలు బీసీ స్టడీ సర్కిల్ నుంచి బిల్లులు డ్రా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నోటీసులిచ్చినా స్పందించలేదు.. కలెక్టర్ల ఆదేశంతో రంగంలోకి దిగిన బీసీ సంక్షేమ అధికారులు వాస్తవ పరిస్థితులను గుర్తించి బీసీ స్టడీ సర్కిల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఇటీవల కాంట్రాక్టు పొందిన ప్రైవేటు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అవకతవకలపై వెంటనే వివరణ ఇవ్వాలని పేర్కొంది. కానీ ఈ నోటీసులకు ఆయా సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అర్ధంతరంగా ఆపేస్తే ఎలా? గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనగానే సంబరపడ్డా. నారాయణపేట జిల్లాలోని బీసీ స్టడీ సెంటర్లో కోచింగ్‌కు వెళ్లా. దాదాపు నెలన్నర తరగతుల అనంతరం శిక్షణను అర్ధంతరంగా ఆపేశారు. దీంతో సిలబస్ పూర్తికాక, ఇతర కోచింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి సతమతమవుతున్నా. – శ్వేత, బొమ్మన్‌పాడ్, నారాయణపేట జిల్లా -
ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: ఒకవైపు ద్రవ్యోల్బణం శాంతించగా, మరోవైపు పారిశ్రామికోత్పత్తి గణనీయంగా తగ్గి పోయింది. మైనస్ 4 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ప్రధానంగా తయారీ తగ్గడం, మైనింగ్, విద్యుత్ విభాగాల్లో వృద్ధి లేకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ వివరాలను ఎన్ఎస్వో విడుదల చేసింది. మైనింగ్ విభాగం కేవలం 2.5 శాతం వృద్ధిని నమోదు చేయగా, తయారీ విభాగం మైనస్ 5.6 శాతానికి పడిపోయింది. (దగ్గు నివారణకు హెర్బల్ సిరప్: వాసా తులసి ప్లస్) విద్యుత్ ఉత్పత్తి 1.2 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 2.3 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగం 15 శాతం మేర, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్‌లో 13.4 శాతం క్షీణత నమోదైంది. ఇంటర్ మీడియట్ గూడ్స్ ఉత్పత్తి 2.8 శాతం తగ్గగా, ప్రైమరీ గూడ్స్ 2 శాతం, ఇన్ఫ్రా/కన్స్ట్రక్షన్ గూడ్స్ ఉత్పత్తి 1 శాతం వృద్ధిని చూశాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.1 శాతం వృద్ధిని చూడగా, 2021 అక్టోబర్ నెలలోనూ 4.2 శాతం వృద్ధి నమోదు కావడాన్ని గమనించొచ్చు. మొత్తం మీద అక్టోబర్‌లో ఐఐపీ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా రావడం గమనార్హం. 2020 ఆగస్ట్ నెలకు నమోదైన మైనస్ 7 తర్వాత, మళ్లీ ఇంత కనిష్టాలకు తయారీ రంగం పనితీరు పడి పోవడం ఇదే మొదటిసారి. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) -
RS Praveen Kumar: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మెహిదీపట్నంలోని భోజగుట్ట బస్తీలో ప్రభుత్వ పాఠశాలను ఇటీవల సందర్శించాను. అక్కడ పాఠశాల ప్రాంగణంలోనే అంగన్ వాడీ కేంద్రం కూడా ఉంది. అందులో 20 మంది చిన్నపిల్లలున్నారు. కానీ ఆ గదిలో కనీసం కరెంటు లేదు. పాఠశాల విద్యార్థులు తరగతి గదులు లేక నాలుగు, ఐదవ తరగతుల పిల్లలు ఒకే గదిలో కూర్చోగా, ఒకటవ తరగతి పిల్లలు బయట వరండాలో కూర్చొని చదువుకుంటున్నారు. ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థికి కూడా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. యూనిఫాం అందలేదు. పాఠశాల పక్కనే కాలనీవాసులు చెత్తను పడేస్తున్నారు. ఇదీ తెలంగాణలో విద్యావ్యవస్థ పరిస్థితి. రాజధాని నగరంలోనే ఇలా ఉందంటే ఇక గ్రామాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. బడులను బాగుచేస్తామని చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ పథకం వంటివి ఇప్పుడు అయినవారికీ, బడాబాబులకూ దోచిపెట్టే మార్గాలుగా మారడం దారుణం. ‘మన ఊరు– మన బడి’ పథకం కింద రూ.7,200 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతలో భాగంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. గత మే నెలలో పాఠశాలల్లో చిన్న, పెద్ద మరమ్మత్తుల కోసం రూ.1,539 కోట్లకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి 24 గంటల లోపే రద్దు చేశారు. తిరిగి రాత్రికి రాత్రే నోటిఫికేషన్ లోని విధివిధానాలు మార్చారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఏడాదికి రూ. 180 కోట్ల రాబడి ఉన్న సంస్థలే అర్హమైనవి. ఈ ఆదాయం, అర్హత ఎవరికి ఉంటుంది? కచ్చితంగా బహుజన వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణపేదలు) ప్రజలకు అయితే ఉండదు. కేవలం బడా కాంట్రాక్టర్లకు మాత్రమే అర్హత ఉంటుంది. పెద్ద కాంట్రాక్టర్లయినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండేవారికే టెండర్లు దక్కేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని, పేదలకు ఉపయోగపడాల్సిన బడ్జెట్‌ను కేవలం ఆయనకు సన్నిహితులైన ఒకరిద్దరికే దోచిపెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నది. కాకపోతే ఏమిటి? కేవలం రూ.4,500కు వచ్చే డ్యూయల్ డెస్క్ ధరను అమాంతం రూ. 12,000కు పెంచి, వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అధికారికంగా చెల్లించే పనికి ఒడిగట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జైళ్లలో ఉండే ఖైదీలు తయారుచేసిన వస్తువులను కూడా అతితక్కువ ధరకు తీసుకునే అవకాశం ఉన్నా, ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతోంది. గ్రీన్ బోర్డు ఒక చదరపు ఫీట్ ధరను రూ. 280 నుండి రూ. 370కి పెంచారు. అయితే మొదటిసారి టెండర్ నోటిఫికేషన్‌కు ప్రతిస్పందిస్తూ టెండర్ దాఖలు చేసిన సంస్థలు... తాము అర్హులమైనా తమను అనర్హులుగా ప్రభుత్వం ఎలా తమ టెండర్లను తిరస్కరిస్తుందని ప్రశ్నిస్తూ హైకోర్టుకు ఎక్కాయి. కోర్టులో ఈ వివాదంపై వాదనలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం రెండోసారి పిలిచిన టెండర్లనూ రద్దు చేస్తున్నట్లు కోర్టుకు తెలియచేసింది. దీనర్థం ఏమిటి? మేం మొదటి నుంచీ ‘మన ఊరు– మన బడి’ పనుల టెండర్లలో అవకతవకలూ, ఆశ్రిత పక్షపాతం ఉన్నాయని ఆరోపిస్తున్న విషయాలు నిజమే అని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా. అంతా సజావుగా ఉంటే రెండోసారీ టెండర్లను ఎందుకు రద్దుచేసినట్లు? ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాల భవనాలకు పెయింటింగ్ వేసే కాంట్రాక్టులనూ బడా కాంట్రాక్టర్లే దక్కించుకునేలా నిబంధనలు రూపొందిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పారిశ్రామికవేత్తల గతేం కావాలి? ఇదంతా చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగా ఎంఎస్ఎంఈలు మూతపడేలా ప్రభుత్వమే పాటుపడుతున్నదని అర్థమవుతోంది. ఒకపక్క విదేశాలకు వెళ్ళి, అనేక రాయితీలు ప్రకటించి అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్... ఇదే రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు, రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు. 5,000 ఎంఎస్ఎంఈలు మూత బడుతుంటే ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లతోపాటూ ఎంఎస్ఎంఈలనూ టెడర్ల ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. అప్పుడే చిన్నాచితక కంపెనీలు నడుపుతున్న బహుజనులకూ అభివృద్ధి చెందే అవకాశం దక్కుతుంది. తెలంగాణలోని పేద ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను అర్థం చేసుకోవాలి. మోసానికి గురవుతున్న మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ‘మన ఊరు – మన బడి’ పథకానికి కావా ల్సిన నిధులను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి కూడా సేకరిస్తున్నది కానీ, జీఓ నం. 59/2018, జీఓ నం. 32/2022లు చెప్పిన ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇవ్వాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మోసం చేస్తోంది. ఒక్క విద్యా వ్యవస్థలోనే కాదు మిగతా రంగాలలోనూ ఈ దోచిపెట్టే పని కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన 1.15 లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులో గానీ, రూ. 36 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టులో గానీ ఒక్క బహుజనుడు కూడా కాంట్రాక్టరుగా లేడు. ఈ అన్యాయాన్ని మిగతా పార్టీలవారు ఎవరూ ప్రశ్నించడం లేదు. బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే కాంట్రాక్టుల్లో మా బహుజనుల వాటా ఏదని ప్రశ్నిస్తోంది. గత 70 ఏళ్లుగా బహుజన సమాజం మోసపోతున్నది. ఆధిపత్య పార్టీల నాయకులు బహుజనులను కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు. సంపద ఉన్న చోటికి వారిని రానివ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఒక బహుజనుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోకపోతే, తెలంగాణ రాష్ట్ర ఆస్తి, వనరులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే పేద ప్రజల సొమ్మును ఎత్తుకుపోయే రాబందుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. బహుజన తెలంగాణను సాధించాలి, తెలంగాణ అమరుల ఆశయాలను నిజం చేయాలి. (క్లిక్: పోడు రైతుకు హరితహారం గండం) - డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ -
చేపల చెరువుల్లో కాసుల వేట
ఇది జనగామ జిల్లాలోని తరిగొప్పుల చెరువు. ఇందులో వల వేస్తే దొరికే చేపల్ని ఏరడానికి రెండు చేతులూ చాలవంటారు ఇక్కడి మత్స్యకారులు. కానీ సంవత్సరం క్రితం వదిలిన చేపపిల్లలు ఇప్పటికీ పిల్లలుగానే ఉన్నాయని, బరువు పెరగలేదని దోసిలి చిన్నబోతోందని అంటున్నారు. మెదక్ చెరువులో ఎదిగీ ఎదగని చేపపిల్లల్ని చూపుతున్న వీరిద్దరు గంగారాం, వెంకటేశ్. ఏడాది పాటు పిల్లల్ని పోసి పెంచితే..చేపలు అరకిలో మేరకైనా బరువు పెరగలేదని, దోసిలైనా నిండలేదని వాపోతున్నారు. ఏడాదిశ్రమ వృథా అయిందని వీరంటున్నారు. శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) చేపా చేపా ఎందుకు ఎదగలే అంటే.. పూర్తిగా ఊపిరి పోసుకోకుండానే పంపిణీ చేశారు.. అదను దాటాక నన్ను చెరువులోకి పంపారంటోంది. మండు వేసవిలోనూ కృష్ణా, గోదావరి నీళ్లతో కళకళలాడే 28,704 నిండు చెరువులు, కుంటల ద్వారా నీలి విప్లవం సాధన దిశగా ప్రభుత్వం వేసిన అడుగులను ఇంటి దొంగలే దారి మళ్లించారు. ఎక్కడికక్కడ నిబంధనలకు తిలోదకాలిచ్చి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఫలహారంలా పంచుకుతిన్నారు. చెరువును, చేపను నమ్ముకున్న వారిని వంచన చేశారు. కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు లాభపడితే, నెలల తరబడి శ్రమించిన గంగపుత్రులు, ముదిరాజ్‌లు దగాపడ్డారు. కూలీ కూడా గిట్టుబాటు కాలేదు రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత (100 శాతం సబ్సిడీ) చేపపిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే 2021–22 వార్షిక సంవత్సరానికి గాను సుమారు రూ.93 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని మత్స్య సహకార సంఘాలకు 89.09 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశారు. అయితే విత్తన చేపల్లో 40 శాతానికి పైగా చెరువుల్లో వేయగానే మరణించగా, ప్రాణంతో మిగిలిన చేపలను ఎంతో జాగ్రత్తగా పెంచినా ఎక్కడా ఒక్క చేప కూడా 500 గ్రాములకు మించి బరువు పెరగలేదు. ఫలితంగా ఏడాదంతా కష్టపడిన మత్స్యకారులకు కూలీ కూడా గిట్టుబాటు కాకపోగా, అనేక చోట్ల ఎదగని చేపలను పట్టకుండా చెరువుల్లోనే వదిలేశారు. చచ్చిన పిల్లలకూ లెక్కలు చేప పిల్లల పంపిణీని జూన్ – జూలై మాసాల్లో మొదలు పెడితే చెరువులు, కుంటల్లో నీళ్లు తగ్గే మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఎదిగిన చేపలు పట్టేందుకు అనుకూలమైన సమయం. ఆ తర్వాత వర్షాలు వస్తే చెరువులు, కుంటలు పొంగి పొర్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే గత ఏడాది చేప విత్తనాల (పిల్లల) కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం నుంచే కొందరు పెద్దలు, అధికారులు కాసుల వేట ప్రారంభించారు. రాష్ట్రంలోని చెరువుల్లోనే చేప పిల్లలను ఉత్పత్తి చేయాలనే నిబంధన పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. తమకు అనుకూలమైన వారికి కాంట్రాక్టు దక్కేలా చూసే క్రమంలో ఏకంగా ఆరుసార్లు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టులు పొందిన ఇతర రాష్ట్రాల వారు డ్రమ్ములు, ట్యాంకర్ల ద్వారా విత్తనాలు సరఫరా చేశారు. తీరిగ్గా సెప్టెంబర్, అక్టోబర్‌లో చెరువుల్లో వదిలారు. అప్పటికే అనేక చేప పిల్లలు మృత్యువాత పడ్డా వాటిని కూడా చెరువుల్లో కలిపేసి లెక్కలు రాసుకున్నారు. సైజు, నాణ్యతలోనూ రాజీ విత్తన చేప పిల్లలను 35– 40 (చిన్న చెరువులు, కుంటలకు), 80–100 (పెద్ద చెరువులు, రిజర్వాయర్లకు) మిల్లీమీటర్ల (పొడవు) చొప్పున రెండురకాల సైజుల్లో కొనుగోలు చేయాలని నిర్ణయించినా ఎక్కడా నిబంధనలు అమలు కాలేదు. పైగా సైజుతో పాటు పిల్లల నాణ్యతలో కూడా రాజీ పడిపోయారు. ఓ వైపు కాలం దాటాక చెరువుల్లో వేయటం, చిన్న సైజు.. సరిగ్గా అభివృద్ధి చేయని విత్తనాలను (నాణ్యత లేని చేప పిల్లలు) చెరువుల్లో వదలటం వల్ల ఆశించిన దిగుబడిలో సగం కూడా లేదని మత్స్య సహకార సంఘాలు వాపోతున్నాయి. అదను దాటినా నాణ్యమైన చేప పిల్లలను వదిలితే 6–8 మాసాల్లోనే ఒక్కో చేప కిలో నుండి కిలోంబావు వరకు తూకం వచ్చేది. కానీ సగటున 450 గ్రాములు కూడా తూగటం లేదు. వాస్తవానికి గతంలో ప్రభుత్వమే చేప పిల్లలను ఉత్పత్తి చేసి సంఘాలకు ఇచ్చేది. కానీ గత కొన్నేళ్లుగా విత్తనాల పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. దీని వెనుక కూడా భారీ మతలబు ఉందనే ఆరోపణలున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రు కొండ మంగలి కుంట చెరువులో గతేడాది ఆగస్టు నెలలో బంగారు తీగ, బొచ్చ, రవ్వ రకాల చేప పిల్లలను వదిలారు. ఒక్కో చేప కేవలం 100 నుంచి 150 గ్రాములు మాత్రమే పెరిగింది. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో వేసిన 7.20 లక్షల చేప పిల్లల్లో 50 శాతం మాత్రమే బతికాయి. భారీగా ఎదిగిన ‘ప్రైవేటు’ పిల్లలు మా తపాలఖాన్ చెరువులో గత సెప్టెంబర్‌లో 80 వేల చేపపిల్లలు (బొచ్చ, బంగారుతీగ, రవ్వ) వదిలారు. అన్నీ బాగా ఉంటే ఆర్నెల్లలో కిలోకు పైగా తూగాలి. కానీ ఈ రోజుకు 100 గ్రాములకు కూడా పెరగలేదు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసినా మాకు ఏ ప్రయోజనం లేదు. మేము జగిత్యాల నుండి సొంత ఖర్చుతో ప్రైవేటు వ్యక్తుల నుండి తెచ్చిన పిల్లలు భారీ సైజు వచ్చాయి. – బాలయ్య, తున్కిఖల్సా, వర్గల్, సిద్దిపేట జిల్లా -
సామాజిక అస్పృశ్యత నిర్మూలనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదని, సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌తో కలిసి డ్రా ద్వారా ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దళితులు కూలీకి పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేడ్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. దళితబంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా, ఆ యూనిట్‌ను గ్రౌండ్ చేసేలా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. గతంలో నీటిపారుదలశాఖ టెండర్లలో ఎస్సీ, ఎస్టీలకు 21 శాతం కేటాయించామని, ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కేటాయిస్తున్నామని, వంద పడకలలోపు ఆసుపత్రులను ఒక కేటగిరీగా, వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులను మరో కేటగిరీగా విభజించామని వివరించారు. మొత్తం 56 ఆసుపత్రుల ఎంపిక పారదర్శకంగా చేశామని, వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారని తెలిపారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్ల నిబంధనల్లోనూ మార్పులు చేశామని, ఒక్క టెండర్ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించా మని చెప్పారు. మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. -
చేపా.. చేపా ఎందుకు వదల్లే? ‘కాంట్రాక్టు’ అడ్డమొచ్చింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా మత్స్యసంపద పెరుగుతున్నప్పటికీ ఈ కార్యక్రమం అమల్లో ఎదురవుతున్న సమస్యలు విమర్శలకు తావిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందలకోట్ల రూ పాయలు ఖర్చు పెట్టి జలవనరుల్లో ప్రభుత్వం చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ ఈ ప్రక్రియలో అవలంబిస్తోన్న పద్ధతుల పై పలు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు సకా లంలో జలవనరుల్లో చేప పిల్లలను వదల్లేకపోతు న్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపభూయిష్టంగా కాంట్రాక్టు విధానం.. వాస్తవంగా జలవనరుల్లోకి జూన్, జూలై నెలల్లోనే చేపలు, రొయ్యల పిల్లలు వదలాల్సి ఉంటుంది. అప్పుడే సమయానుకూలంగా అవి పెరిగి పెద్దవయి ఆరోగ్యకరమైన మత్స్య సంపదను సృష్టిస్తాయి. కానీ, మత్స్య శాఖ అవలంబిస్తోన్న కాంట్రా క్టు విధానంతో చెరువుల్లో చేప పిల్లల్ని పోయడం ఆలస్యమవుతోంది. మత్స్యకార సొసైటీల ద్వారా పోసినప్పుడు ఇబ్బందులు రాలేదు కానీ, ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను తీసుకురావడంతో ఆలస్యం జరుగుతోంది. కాంట్రాక్టుల ఖరారులో ఆలస్యం, కాంట్రాక్టర్లు పేచీలు పెట్టడం, విత్తనాల ధరల నిర్ణయంలో రాజకీయ జోక్యం అనివార్యం కావడం, కాంట్రాక్టర్లు ఈ విషయంలో ఆందోళనకు దిగడంతో టెండర్‌ను రద్దు చేయడం వరకు పరిణామాలు వెళ్లాయంటే ఈ కాంట్రాక్టు విధానం ఎంత లోపభూయిష్టంగా అమలవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను తెచ్చి చెరువుల్లో వదిలేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతోంది. అభాసుపాలవుతున్న ప్రక్రియ ఇక చెరువుల్లో వదిలే సమయంలో కూడా అనవసరమైన రాజకీయ ప్రమేయంతో జాప్యం జరుగుతోంది. ఫలానా చెరువులో చేపలు పోయాలంటే అక్కడి ప్రజాప్రతినిధులందరూ హాజరు కావాల్సి ఉండడం, ఒక్కరికి వీలు లేకపోయినా కార్యక్రమం వాయిదా వేయాల్సి రావడం లాంటి ప్రొటోకాల్ సమస్యలు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని మత్స్యశాఖ అధికారులే చెబుతున్నారు. మరోవైపు చేప విత్తనాలు పూర్తి స్థాయిలో ఏక కాలంలో అందుబాటులోకి రాకపోవడం, నాసిరకంగా ఉన్నాయని, పిల్లలు సరిగా లేవని, తక్కువగా వచ్చాయనే వివాదాలు కూడా ఈ ప్రక్రియను అభాసుపాలు చేస్తున్నాయి. అలాగే రాష్ట్ర చేపగా గుర్తింపు పొందిన కొర్రమీనును చెరువుల్లో పోసేందుకు మత్స్యశాఖ ఇప్పటివరకు ఉపక్రమించకపోవడం విమర్శలకు కారణమవుతోంది. నిబంధనల మేరకు సాగని లెక్క వాస్తవానికి చేప పిల్లలను లెక్కపెట్టి మరీ చెరువుల్లో పోయాలి. ఈ లెక్క పెట్టిన చేప పిల్లలను రెవెన్యూ అధికారులు నిర్ధారించాలి. కెమెరాల మధ్య ఈ కార్యక్రమం జరగాలి. కానీ, అలా జరగడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. చేప పిల్లల లెక్కింపులో జరిగిన అవకతవకల కారణంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు క్షేత్రస్థాయి అధికారులపై ప్రభుత్వం అధికారికంగా అభియోగా లు నమోదు చేసి విచారణ జరుపుతోంది. కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల వారితో పాటు రాజకీయ నాయకులు ఆర్థిక ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నారే తప్ప మత్స్యకారుల సంక్షేమం కోసం ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మత్స్య సొసైటీలకే పూర్తిస్థాయిలో చేప పిల్లలను పోసే కార్యక్రమాన్ని అప్పగించడంతో పాటు మత్స్య శాఖ కచ్చితమైన పర్యవేక్షణతో ఈ సమస్యల్ని అధిగమిస్తే ప్రయోజనం ఉంటుందని, మత్స్య సంపద పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉచిత పంపిణీతో సత్ఫలితాలు మత్స్యకారుల ఆర్థిక స్వావలంబన పెంచే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమం అమల్లో ఎలాంటి సమస్యలున్నప్పటికీ చేప పిల్లల ఉచిత పంపిణీ సత్ఫలితాలనిస్తోందని గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిలో మత్స్య సంపద చెప్పుకోదగిన పాత్ర పోషిస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో చేపల పెంపకం, ఆక్వాకల్చర్ జీఎస్డీపీ భాగస్వామ్యం రూ. 2,670 కోట్లు ఉండగా, ఆ తర్వాత ఏడాది నుంచి వరుసగా రూ.2,649 కోట్లు, రూ.2,275 కోట్లు, రూ.3,654 కోట్లు, రూ.4,042 కోట్లు, రూ.4,694 కోట్లు, రూ.5,254 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. 2016–17లో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం కాగా, 2017–18లో రొయ్య పిల్లల పంపిణీ ప్రారంభించారు. మత్స్యకారుల కంటే కాంట్రాక్టర్‌కే ఎక్కువ లబ్ధి ప్రభుత్వం విడుదల చేసే చేప పిల్లల్లో కేవలం రెండు మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. అదే మత్స్యకార సొసైటీలకు నిధులు ఇస్తే పది రకాల చేపలను వదిలే అవకాశం ఉంటుంది. చేపలు పోసే అధికారం కాంట్రాక్టర్‌కు ఉండడంతో నాసిరకం చేపలను వదులుతున్నాడు. అదే సమయంలో ఎక్కువ రేటు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ పథకంలో వాస్తవంగా మత్స్యకారుల కంటే కాంట్రాక్టరే ఎక్కువ లబ్ధి పొందుతున్నాడు. – కాశమేని దేవేందర్, మత్స్యకారుడు, సిరిసిల్ల -
టీడీపీ పెద్దల ‘స్కిల్’ నిర్వాకాలు బహిర్గతం
‘యువత నైపుణ్యాలను పెంపొందించి మెరుగైన ఉపాధి కల్పనకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చాం’ – టీడీపీ పెద్దలు చెబుతున్న మాట. ‘ఏపీఎస్ఎస్డీసీకి మేం రూ.56 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే సరఫరా చేశాం. రూ.3,300 కోట్ల విలువైన ప్రాజెక్టు అని చెబుతున్న దానితో మాకు ఎలాంటి సంబంధం లేదు’ – ఏపీఎస్ఎస్డీసీకి తాజాగా సీమెన్స్ కంపెనీ లేఖ సాక్షి, అమరావతి: టీడీపీ సర్కారు అవినీతి నిర్వాకాలకు ఇది తిరుగులేని నిదర్శనం. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో మతలబు ఇందులో స్పష్టమవుతోంది. సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి ప్రభుత్వం చెల్లించాల్సిన పది శాతం నిధుల పేరిట రూ.371 కోట్లను టీడీపీ పెద్దలు దారి మళ్లించారు. అందులో రూ.241 కోట్లు కొల్లగొట్టేశారు. సీమెన్స్ కంపెనీ ఇటీవల ఏపీఎస్ఎస్డీసీకి రాసిన లేఖతో ఈ బండారం బట్టబయలైంది. ‘సీమెన్స్’ పేరుతో అంచనాలు పెంపు గత సర్కారు హయాంలో ఏపీఎస్ఎస్డీసీ రూ.3,300 కోట్లకు సీమెన్స్ కంపెనీ పేరుతో చేసుకున్న ఒప్పందం వెనుక లోగుట్టు వీడింది. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం నిధులను ప్రభుత్వం చెల్లించాలి. ప్రాజెక్టు వ్యయాన్ని ఎంత పెంచితే ఆమేరకు ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచి చూపాలంటే ఓ అంతర్జాతీయ కంపెనీ కావాలి. అందుకే సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో కలిసి ప్రాజెక్టు చేపడుతున్నామంటూ రూ.3,300 కోట్లకు టీడీపీ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం చేసుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ కలసి 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. అయితే ఆ రెండు కంపెనీలు ఒక్క రూపాయి కూడా వెచ్చించ లేదు. గత ప్రభుత్వం మాత్రం తన వాటాగా జీఎస్టీతో సహా రూ.370 కోట్లు చెల్లించేసింది. ఇందులో సీమెన్స్ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్వేర్, మరి కొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు. రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్తో షెల్ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్‌టెక్ ఖాతాలోకి మళ్లించారు. ఇలా టీడీపీ పెద్దలు రూ.241 కోట్లు జేబులో వేసుకున్నారు. అసలు సీమెన్స్ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలియదు. భారత్‌లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్ టెక్‌తో కలిసి కథ నడిపించారు. ప్రాజెక్టుతో సంబంధం లేదన్న సీమెన్స్ టీడీపీ హయాంలో ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేసుకున్న సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ వ్యవహారాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్పష్టం చేసింది. ఈమేరకు సీమెన్స్ కంపెనీ ఇటీవల ఏపీఎస్ఎస్డీసీకి ఓ లేఖ రాసింది. సుమన్ బోస్ తన పరిధిని అతిక్రమించి ఏపీఎస్ఎస్డీసీతో చేసుకున్న ఒప్పందానికి తమ కంపెనీ ఏ విధంగానూ బాధ్యత వహించదని లేఖలో తేల్చి చెప్పింది. అసలు ఆ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా ఎలా లెక్కించారో కూడా తమకు తెలియదని, ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంది. సుమన్ బోస్ ఏపీఎస్ఎస్డీసీతో జరిపిన లావాదేవీలు, ఈమెయిల్ సందేశాల గురించి సీమెన్స్ కంపెనీకి కనీస సమాచారం కూడా లేదని తెలిపింది. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే డిజైన్‌టెక్ కంపెనీ తమకు రూ.56 కోట్లు చెల్లించిందని వెల్లడించింది. ఆమేరకు తాము లైసెన్స్డ్ సాఫ్ట్‌వేర్‌ను సరఫరా చేయడంతోపాటు ఇతర సేవలు అందించామని వివరించింది. అంతటితో తమ పని ముగిసిందని, అంతేగానీ రూ.3,300 కోట్ల ప్రాజెక్టుకు తమ బాధ్యత లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు పేరుతో టీడీపీ పెద్దలు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు తద్వారా వెల్లడవుతోంది. -
రికార్డు స్థాయిలో కుదేలైన జీడీపీ
సాక్షి, ముంబై: దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో తొలి త్రైమాసికంలో భారీగా క్షీణతను నమోదు చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా ఉంది. కరోనా సంక్షోభంతో గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.1996లో భారతదేశం త్రైమాసిక గణాంకాలను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం పడిపోయింది. జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉంది. అనుకూలమైన రుతుపవనాలు, నిండిన జలాశయాలలో నీటి లభ్యత, ఖరీఫ్ విత్తనాలు, పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సేకరణ బలమైన రబీ ఉత్పత్తి వ్యవసాయ వృద్ధికి తోడ్పడినట్లు తెలుస్తోంది. -
మరింత క్షీణించిన పారిశ్రామికోత్పత్తి
సాక్షి, ముంబై: ఆర్థిక మందగమనంపై ఆందోళన కొనసాగుతుండగానే, పారిశ్రామిక పురోగతి మైనస్‌లోకి జారుకోవడం మరింత భయపెడుతోంది. సెప్టెంబరు ఐఐపీ డేటా మరింత పతనమై వరుసగా రెండో నెలలో కూడా క్షీణతనునమోదు చూసింది. సెప్టెంబరు ఐఐపీ డేటా -4.3 శాతంగా ఉంది. గత నెలలో 1.1శాతంతో పోలిస్తే పారిశ్రామికోత్పత్తి సూచీ అంచనా వేసిన దానికంటే దిగువకు చేరింది. గత ఏడాది సెప్టెంబరు నెల ఐఐపీ డేటా 4.5 శాతంగా ఉంది. గణాంక విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం మైనింగ్, తయారీ, విద్యుత్ ఇలా అన్ని విభాగాల్లో ఉత్పత్తి తగ్గుదల కనిపించింది. ఇది తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుంది. పెట్టుబడి డిమాండ్ 20.7 శాతానికి పతనమైంది. ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాలను సూచించే కోర్ సెక్టార్ డేటా -5.2 శాతం వద్ద 14 సంవత్సరా కనిష్టానికి చేరింది. పారిశ్రామిక ఉత్పత్తిలో కోర్ సెక్టార్ వాటా 40 శాతం. పారిశ్రామిక వృద్ధిలో నిరంతర మందగమనం కారణంగా ఆర్బీఐ డిసెంబరులో పాలసీ రివ్యూలో మరోసారి రేటు కోత వెళ్లక తప్పదని నిపుణులు అంచనావేస్తున్నారు. -
ఈ- ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టలపై సీఎం జగన్ సమీక్ష
-
ఈ- ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : ఈ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ. కోటిపైనున్న కాంట్రాక్ట్‌లపై ఈ సమావేశంలో చర్చించారు. -
ఈ నెల 5 నుంచి కొత్త కాంట్రాక్ట్‌లు
ముంబై: కొత్తగా ఎంపికైన భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది కాంట్రాక్ట్‌లు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తాయని బీసీసీఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు సిద్ధమయ్యాయని, గురువారంలోగా లాంఛనం పూర్తవుతుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కాగా... బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల ఎంపిక జాబితాను సెలక్షన్ కమిటీ బోర్డు ముందుంచింది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్.శ్రీధర్ కొనసాగనుండగా... విక్రమ్ రాథోడ్ కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ ట్రైనర్ కోసం మాత్రం ప్రస్తుతం ఎన్సీఏలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. -
రెజ్లర్లకూ కాంట్రాక్టులు
గొండా: భారత్‌లో క్రికెటర్లే కాదు... రెజ్లర్లూ కాంట్రాక్టు ‘పట్టే’శారు. ఇప్పటిదాకా గెలిచినపుడే పతకాలు, ప్రోత్సాహకాలు దక్కేవి. ఇకపై వార్షిక కాంట్రాక్టుల రూపంలో స్థిరమైన మొత్తాలను అందుకోనున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్తగా ఈ కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇంటాబయటా పతకాలు సాధిస్తున్న రెజ్లర్లకు ‘ఎ’, ‘బి’ కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఎ–గ్రేడ్‌లో రూ. 30 లక్షలు, బి–గ్రేడ్‌లో రూ. 20 లక్షలు వార్షిక ఫీజుగా చెల్లిస్తారు. సి, డి గ్రేడ్‌ల్లో ఉన్న రెజ్లర్లకు వరుసగా రూ. 10 లక్షలు, రూ. 5 లక్షలు చెల్లిస్తారు. ఏటా ఆయా రెజ్లర్ల ప్రదర్శనను సమీక్షించి గ్రేడ్లను మారుస్తారు. ఈ కాంట్రాక్టుల్లో యువ స్టార్ రెజ్లర్లకు పెద్దపీట వేశారు. బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, పూజ ధండాలకు ‘ఎ’ గ్రేడ్ ఇవ్వగా... వెటరన్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత అయిన సుశీల్ కుమార్‌కు ‘బి’ గ్రేడ్ కాంట్రాక్టు ఇచ్చారు. ఇదే జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ ఉంది. దేశంలో బీసీసీఐ తర్వాత కాంట్రాక్టు ఇస్తున్న రెండో క్రీడా సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐనే! భారత ఒలింపిక్ సంఘం సభ్య సమాఖ్యల్లో కాంట్రాక్టులు చెల్లిస్తున్న ఏకైక క్రీడా సంఘంగా డబ్ల్యూఎఫ్ఐ ఘనతకెక్కనుంది. జూనియర్ రెజ్లర్లకు ఇదెంతో ప్రోత్సాహకరమని వినేశ్ ఫొగాట్ హర్షం వ్యక్తం చేసింది. -
కాంట్రాక్టు పనుల్లో ‘కంగాళీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేప డుతోన్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీ య, గృహాలు, ప్రాజెక్టుల నిర్మా ణం తది తర కాంట్రాక్టు పనులకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వర్తింపజేసే విధానంలో గందరగోళం నెలకొంది. ఈ కాంట్రాక్టు పనులపై తొలుత 18 % జీఎస్టీ విధించగా, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు దానిని 12 శాతానికి తగ్గించారు. అయినా 12% జీఎ స్టీ కూడా భారం అవుతోందనే ఆలోచన తో దాన్ని 5 శాతానికి తగ్గించాలని కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేసే అన్ని కాంట్రాక్టు పనులకు, మట్టిపని 60 శాతానికి మించి ఉండే ప్రైవేటు వర్కులకు మాత్రమే 5% వర్తింపజేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. అయితే ఈ మేరకు నోటిఫికేషన్‌ను ఇంతవరకు విడుదల చేయకపోవడం గందరగోళానికి కారణమవుతోంది. అడ్వాన్సులిచ్చేస్తున్నారు ఇంతవరకు కేంద్రం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు 5 శాతం జీఎస్టీని కలిపి బిల్లులు చెల్లిస్తోంది. కాంట్రాక్టర్లపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, నోటిఫికేష న్ రాకపోవడంతో తమకు 12 శాతం అడ్వాన్సులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కో రుతున్నారని సమాచారం. లేదంటే తొలు త నిర్ణయించిన విధంగా 10 శాతమైనా చెల్లించాలని ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీఎ స్టీని కలుపుకుని అడ్వాన్సులు తీసుకుం టున్న కాంట్రాక్టర్లు ఆ మేరకు జీఎస్టీ చెల్లింపులు చేయడం లేదని, ప్రతి నెలా చెల్లించాల్సిన దాంట్లో జీఎస్టీ చూపించ కుండా, చివరి బిల్లు వరకు వాయిదా వేస్తున్నారని పన్నుల శాఖ అధికారులంటు న్నారు. ఓవైపు పన్ను భారం పడకుండా ముందే ప్రభుత్వం నుంచి అడ్వాన్సులు తీసుకోవడం, మరోవైపు చివరి వరకు పన్ను చెల్లించకుండా వాయిదా వేయడం ద్వారా వందల కోట్ల రూపాయలను మా ర్కెట్లో కాంట్రాక్టర్లు చలామణి చేస్తూండ టం గమనార్హం. మరోవైపు మొత్తం పనులపై జీఎస్టీ 12 శాతమైనా, 5 శాతౖ మెనా, ఆ పనులకు వినియోగించే ముడి సరుకులపై మాత్రం 18 నుంచి 28 శాతం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కూడా తీసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్లకు లభిస్తోందని పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు. మొత్తం పనులపై 5% జీఎస్టీ చెల్లించి, ఐటీసీ 18 నుంచి 28 శాతానికి తీసుకుంటే ప్రభుత్వమే కాంట్రా క్టర్లకు అదనంగా బిల్లులు చెల్లించాల్సి వ స్తుందని, దీనివల్ల వందల కోట్ల రూపాయల భారం పడుతుందని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఏదీ తేలకుండా, పన్ను కట్టకుండా ఉంటే చివర్లో ఈ కాంట్రాక్టు పనులకు జీఎస్టీ లెక్కలు తేల్చడం కూడా తమకు తలకు మించిన భారమవుతుందంటున్నారు. -
రిలయన్స్ ఇన్ఫ్రాకు భారీ ఆర్డర్
సాక్షి, ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ నష్టాలతో సంక్షోభంలో పడ్డ అనిల్ అంబానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. వేల కోట్ల రూపాయల భారీ కంట్రాక్ట్ లభించిందన్న వార్తలతో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాల్టి(బుదవారం) ప్రతికూల మార్కెట్లో లాభాలను ఆర్జిస్తోంది. రిలయన్స్ ఇన్ఫ్రా బంగ్లాదేశ్ నుంచి రెండుప్రాజెక్టులను సాధించింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బంగ్లాదేశ్‌నుంచి రూ. 5 వేల కోట్ల కాంట్రాక్టులను పొందింది. ఢాకాలో మేగానాఘాట్ వద్ద 750 మెగావాట్ల ఎల్ఎన్జీ ఆధారిత కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు ఈపీసీ కాంట్రాక్ట్ లభించినట్లు రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. అలాగే కుతుబ్దియా ఐలాండ్ వద్ద ఎల్ఎన్జీ టెర్మినల్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సైతం ఆర్డర్ దక్కినట్లు తెలియజేసింది. 2019 కల్లా వీటిని పూర్తిచేయాల్సి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ ఆర్డర్ల విలువ రూ. 5,000 కోట్లని ఒక ప్రకటనలో తెలిపింది. 250 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల రెండు లిగ్నైట్ ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 3,675 కోట్ల ఇపిసి ఆర్డర్ తరువాత ఈ భారీ ఆర్డర్ సాధించామని రియలన్స్ ఇన్ఫ్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ గుప్తా పేర్కొన్నారు. -
మంత్రి పేరుతో దందా
కాంట్రాక్టులు ఇస్తానని వసూళ్లు రంపచోడవరం : రాష్ట్ర మంత్రిపేరుతో ఇంజినీరింగ్ శాఖ అధికారులను, సిబ్బందిని బెదిరించి దందాకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. సదరు మంత్రి వద్ద తనకు ఎంతో పలుకుబడి ఉందని పర్సంటేజీలు ఇస్తే ఇంజినీరింగ్ పనులు మంజూరు చేస్తానని ఆ వ్యక్తి వసూళ్లకు తెగబడుతున్నాడు. రంపచోడవరంలో ఒక ప్రభుత్వ అతిథి గృహాన్ని అడ్డాగా చేసుకుని ఆయన తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అతడి వద్దకే జేఈ స్థాయి నుంచి డీఈ స్థాయి వరకు ఇంజినీర్లు వెళ్లి మాట్లాడి వస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆ వ్యక్తి ఇంజినీరింగ్ ఉన్నతాధికారి గదిలోనే కూర్చుని ఉపాధి హామీ ప్రత్యేక ప్రాజెక్టు పనుల విషయమై కాంట్రాక్టర్లతో మాట్లాడేవాడంటే ఆయనకు ఆయా అధికారులతో ఎంత పరిచయాలు ఉన్నాయో తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో కూడా ఆయన మంత్రి పేరుతో రంపచోడవరంలో తిష్టవేసి చక్రం తిప్పాడు. అతడి దందాపై ‘మంత్రి బంధువువైతే ఓకే’ పేరుతో వచ్చిన కథనంతో రంపచోడవరం వదిలి వెళ్లిపోయాడు. తాజాగా సదరు వ్యక్తి ఉంటున్న ప్రభుత్వ భవనంలోకి శనివారం రాత్రి స్థానిక పోలీసులు వెళ్లి అతడిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అతడితో పాటు అక్కడే ఒక జేఈ ఉండడం విశేషం. అసలు ఏ హోదాతో అతడికి ప్రభుత్వ అతిథి గృహాన్ని కేటాయించారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అతిథి గృహంలో ప్రైవేట్ వ్యక్తి ఎందుకు ఉన్నాడు? అనే దానిపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు ఆ భవనానికి వెళ్లారు. తాజాగా జరిగిన సంఘటనతో అతడి వల్ల మోసపోయిన చోటా మోటా కాంట్రాక్టర్లు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ఏజెన్సీకి సంబంధం లేని వ్యక్తి ఇంజనీరింగ్ శాఖలోని కొంత మందితో సంబంధాలు పెట్టుకుని ఈ దందాలకు తెగబడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకంలో చేసి వర్క్‌ల్లో ఫైనల్ బిల్లులు విషయంలో కూడా సదరు వ్యక్తి చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పనులను పర్యవేక్షించి నివేదికలు ఇవ్వాల్సిన క్వాలిటి కంట్రోల్ అధికారులను సైతం మేనేజ్ చేయగలనని చెప్పుకోవడం వెనుక ఎవరి హస్తం ఉందో అర్థం కావడం లేదు. ఇలాంటి వ్యవహారాలపై నిగ్గు తేలాలంటే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిందే. -
కక్కుర్తికి నిలయంగా కల్వకుర్తి: నాగం
హైదరాబాద్: తన కుటుంబ సభ్యులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతోందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల వ్యయం పెంపులో కేసీఆర్ ప్రమేయం లేకుంటే నంబర్ 146 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. జలయజ్ఞంలో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక పేర్కొందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లో అవినీతిని తమ పార్టీ సహించబోదని హెచ్చరించారు. రిటైర్డు ఇంజినీరింగ్ అధికారులను పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కల్వకుర్తి కక్కుర్తికి నిలయమైందని చెప్పారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని అన్నారు. -
గురివింద సామెతలు చెప్పకండి
దిగ్విజయ్‌పై గుత్తా మండిపాటు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘నా జీవితంలో ఎప్పుడూ కాంట్రాక్టులు చేయలేదు. కాంట్రాక్టులు చేసే వారితో నాకు సంబంధాలు కూడా లేవు’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కాంట్రాక్టులు, డబ్బుల కోసమే పార్టీని వీడుతున్నాననడం కాంగ్రెస్ నేతలకు సంస్కారం కాదన్నారు. నల్లగొండలో గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ గురివింద సామెతలు చెబుతున్నారన్నారు. ఇప్పుడు కాం గ్రెస్‌లో ఉన్న నేతలు ఎందుకు కాంట్రాక్టులు తీసుకుంటున్నారని గుత్తా ప్రశ్నించారు. కాం గ్రెస్‌లో అంతర్గత రాజకీయాలకు విసిగిపో యే తాను టీఆర్ఎస్కు అండగా ఉంటానని ప్రకటించానన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు రాజీనామా చేస్తానని, నల్లగొండ పార్లమెంటుకు ఉప ఎన్నికలు వస్తాయని, అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. తన వియ్యంకుడు కాంట్రాక్టరే. ఆ కుటుంబంతో బంధుత్వం ఏర్పడి కొన్ని ఏళ్లే అయిందని గుత్తా తెలిపారు. కానీ వారి కంపెనీ కింద 60-70 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులు చేస్తున్నారని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. తన నిజాయితీ నిరూపించుకు నేందుకు అవసరమైతే వెంకటేశ్వరస్వామి గర్భగుడిలో ప్రమాణం చేస్తానన్నారు.