crickets
-
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువ అవుతోందని.. బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రజలకు ఆరోగ్య స్పృహ గతంలో కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల అనంతరం ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు అధికమయ్యాయి. ఇక కొందరేమో పర్యావరణ హితంగా జీవనం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా వీగన్లుగా మారిపోతున్నారు. అయితే, కెనాడాకు చెందిన టిఫానీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. తన 18 నెలల కూతురుకు ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! ఖర్చుల భారం.. అందుకే.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు (సుమారు రూ.25000) సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డకు ప్రోటీన్ సప్లిమెంట్ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో (క్రికెట్స్) విలువైన ప్రోటీన్ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్ అందుతోందని ఆమె పేర్కొంది. కీటక శాస్త్రంపై తనకున్న అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను కూడా సాలెపురుగు నుంచి తేలు వరకు పలు కీటకాలను గతంలో రుచి చూశానని పేర్కొంది. థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు చీమలు, మిడతలను తిన్నానని చెప్పుకొచ్చింది టిఫానీ. అక్కడి ప్రజల జీవన విధానంలో కీటకాలను తినడం మామూలేనని వెల్లడించింది. (చదవండి: 69 క్యాన్ల సోడాలు హాంఫట్) ఇలాంటి ప్రయోగాలు అవసరమా? మిడతలతో తయారు చేసిన పఫ్‌లు, ప్రోటీన్ పౌడర్‌ను తన బిడ్డకు అందిస్తునన్నాని టిఫానీ చెప్పింది. బీఫ్, చికెన్, పంది మాంసంలో ఉండే ప్రోటీన్లకు బదులు మిడతలపై ఆధారపడటంతో వారానికి అయ్యే ఖర్చులో 100 డాలర్ల వరకు ఆదా అవుతోందని పేర్కొంది. అయితే, టిఫానీ చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లపై ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని హితవు పలుకుతున్నారు. మరికొందరేమో కొత్త ఐడియా బాగానే ఉందిగానీ, చిన్నారికి ఇదో రకమైన శిక్ష కదా! అంటూ కామెంట్ చేశారు. ఏదైనా పాపకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే, తన కూతురు కొత్త రకమైన ఆహారాన్ని స్వీకరించడంలో ఎలాంటి బెరుకు, భయం కనబర్చదని టిఫానీ పేర్కొనడం గమనార్హం. అందువల్లే తమ ఆహారం కానిదైనప్పటికీ ఆమె తింటోందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు.. పీడియాట్రిక్ డైటీషియన్ వీనస్ కలామి ప్రకారం.. 6 నెలల వయసు తర్వాత పిల్లలకు ఆహారంలో పురుగులు, కీటకాలు భాగం చేస్తే తినే తిండి పట్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని పేర్కొంది. (చదవండి: వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది..ఫోటోషూట్ చేసి మరీ..) -
విండీస్ పై టీమిండియా ఘనవిజయం
న్యూఢిల్లీ: టీమిండియా పంజా విసిరింది. తొలి వన్డేలో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలమైన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు విశేషంగా రాణించి జయకేతనం ఎగురవేశారు. భారత్ విసిరిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ ఆటగాళ్లు తడబడి ఓటమి పాలైయ్యారు. విండీస్ ఆటగాళ్లలో స్మిత్ (97), బ్రేవో(26),పొలార్డ్ (40) పరుగులతో రాణించినా.. తరువాత ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. చక్కటి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన విండీస్ కు రెండో వన్డే చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం 46.3 ఓవర్లు మాత్రమే ఎదుర్కొన్న విండీస్ 215 పరుగులకే చాపచుట్టేసి పరాజయాన్ని కొనితెచ్చుకుంది. విండీస్ ఆటగాళ్లలో ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. భారత బౌలర్లలో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు లభించగా, జడేజాకు మూడు, మిశ్రా రెండు వికెట్లు తీశాడు. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 263 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (12), శిఖర్ ధవన్ (1) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (62), రైనా (62) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. అంబటి రాయుడు 32 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ (51 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. -
వెస్టిండీస్‌తో రెండో వన్డే: భారత్ స్కోరు 263/7
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్ 264 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్‌కు నిర్దేశించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (12), శిఖర్ ధవన్ (1) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (62), రైనా (62) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. అంబటి రాయుడు 32 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ (51 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టుకు సముచిత స్కోరు అందించాడు. భువనేశ్వర్ 18 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్ జెరోమీ టేలర్ మూడు వికెట్లు తీశాడు. -
రాణించిన కోహ్లీ, రైనా
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన 39 ఓవర్లలో నాలుగు వికెట్లకు 191 పరుగులు చేశారు. ఓపెనర్లు రహానె (12), శిఖర్ ధవన్ (1) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ, రైనా హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. అంబటి రాయుడు 32 పరుగులు చేశాడు. ప్రస్తుతం జడేజా, ధోనీ బ్యాటింగ్ చేస్తున్నారు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ రెండో మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మ్యాచ్ ఆరంభమైంది. భారత్ కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధోనీసేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది బంతులాడి ఒకే పరుగు చేసిన ఓపెనర్ శిఖర్ ధవన్.. జెరోమ్ టేలర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ రహానెకు తోడుగా అంబటి రాయుడు క్రీజులోకి వచ్చాడు. తొలి వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.