వెస్టిండీస్తో రెండో వన్డే: భారత్ స్కోరు 263/7 | india sets 264 runs target for wet indies in 2nd odi | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్తో రెండో వన్డే: భారత్ స్కోరు 263/7

Published Sat, Oct 11 2014 6:29 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

వెస్టిండీస్తో రెండో వన్డే: భారత్ స్కోరు 263/7

వెస్టిండీస్తో రెండో వన్డే: భారత్ స్కోరు 263/7

న్యూఢిల్లీ: వెస్టిండీస్తో రెండో వన్డేలో భారత్ 264 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్కు నిర్దేశించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శనివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7  వికెట్లకు 263 పరుగులు చేసింది.

ఓపెనర్లు రహానె (12),  శిఖర్ ధవన్ (1) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (62),  రైనా (62) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. అంబటి రాయుడు 32 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ (51 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టుకు సముచిత స్కోరు అందించాడు. భువనేశ్వర్ 18 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్ జెరోమీ టేలర్ మూడు వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement