devulapalli krishna sastri
-
దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి వేడుకలు
పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 124 జయంతి కార్యక్రమాన్ని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్‌గా నిర్వహించారు. ఏడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్, అమెరికా, భారతదేశాలకు చెందిన వక్తలు గాయనీమణులు పాల్గొన్నారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వసంత ప్రచురణగా 17 దేశాలకు చెందిన 250 మంది కవయిత్రులు రచించిన కవితా మేఘమాల అనే కవితా సంకలనాన్ని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆవిష్కరించారు. దేవులపల్లి రచించిన సినిమా పాటలను ఆలనాటి నటి అలనాటి నటీమణి జమునా తలచుకుని ప్రసంగించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. సింగపూర్ నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలగడం తమ అదృష్టమన్నారు. వంశీ అధ్యక్షులు రామరాజు మాట్లాడుతూ.. దేవులపల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు లలిత రామ్ అందించిన ఆర్ధిక సహకారంతో, కవితా మేఘమాల సంకలనాన్ని ప్రచురించామన్నారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆవుల మంజులత, రాధిక మంగిపూడి, కలపటపు లక్ష్మీ ప్రసాద్‌లతో పాటు దేవులపల్లి కుటుంబ సభ్యులు లలితారామ్, రత్నపాప, సీతా రత్నాకర్, శారద తదితరులు పాల్గొన్నారు. -
ఆ కాసేపు.. అడవి పుత్రులుగా..
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాలకు పరవశించి ‘ఆకులో ఆకునై..పువ్వులో పువ్వునై.. కొమ్మలో కొమ్మనై .. నునులేత రెమ్మనై .. ఈ అడవీ సాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా’ అని తన కృష్ణపక్షం తొలి కవితగా రాసుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి భావుకతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది నల్లమల. ఈ అభయా రణ్య విహారం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నది. పచ్చని ప్రకృతి సోయగాలు, లోయలు, ఎత్తైన పర్వతాలు, నింగిని తాకుతున్న మహావృక్షాలు, స్వేచ్ఛగా సంచరించే వన్య ప్రాణులను చూస్తూ సాగే జంగిల్ సఫారీ సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నది. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల, బైర్లూటి, ప్రకాశం జిల్లా పెదదోర్నాల సమీపంలోని తుమ్మలబయలు క్యాంపుల్లో ఏకో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. పలువురు పర్యావరణ ప్రేమికులకు కనువిందు చేస్తున్నది. కొండల్లో..కోనల్లో.. ఎకో టూరిజంలో భాగంగా ఆరుగురు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్‌లో గంటన్నర పాటు జంగిల్ సఫారీ సాగుతుంది. స్థానిక చెంచుజాతి యువత గైడులుగా జంగిల్ క్యాంప్, ప్రకృతి వీక్షణం, ట్రెక్కింగ్, బర్డ్ అండ్ బటర్‌ఫ్లై వాకింగ్, హెరిటేజ్ వాక్, సిద్ధాపురం ట్యాంక్ వాక్.. అటవీ అందాలను పరిచయం చేస్తుంది. ఆదిమ గిరిజన జాతి ‘చెంచులు’ సంప్రదాయ విలువిద్య సాధన యువతలో సరదాను నింపుతోంది. మూడు క్యాంపుల్లో.. ► పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని గోర్లెస్ కాలువ నుంచి లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వెదురు పడియ బేస్ క్యాంప్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తుమ్మలబయలు సఫారీ ఉంటుంది. ఇక్కడే వన్య ప్రాణులను వీక్షించేందుకు వాచ్ టవర్‌ను నిర్మించారు. సుమారు 13కిలో మీటర్ల ప్రయాణం 1.30 గంటల పాటు ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సఫారీకి అనుమతిస్తారు. ► మహానంది సమీపంలోని పచ్చర్ల గిరిజన గ్రామం నుంచి సుమారు 10 కిలో మీటర్ల జంగిల్ ట్రాక్ ఉంది. దాదాపు గంటర్నరకుపైగా సాగే సఫారీలో సూర్యుడు కంటికి కనిపించనంతగా ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన చెట్ల కింద ప్రయాణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ సందర్శకులు బస చేసేందుకు రెండు కాటేజీలు, నాలుగు టెంట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. ► ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి గిరిజన గ్రామంలో 10 కిలో మీటర్ల సఫారీ ట్రాక్ ఉంది. ఈ గ్రామం నుంచి మూడు కిలో మీటర్లు దూరం వెళ్తే టైగర్ జోన్ ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి దేవాలయం శిథిలావస్థలో దర్శనమిస్తోంది. ఇక్కడ నాలుగు కాటేజీలు, ఆరు టెంట్లు, డార్మెట్రీలు అందుబాటులో ఉన్నాయి. ► సఫారీకి ఆరు ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్లను వినియోగిస్తున్నారు. ఒక రైడ్‌కి రూ.800 (ఒక వ్యక్తికి రూ.150) వసూలు చేస్తున్నారు. ఇక కాటేజీలు, టెంట్లకు రూ.5వేల నుంచి రూ.4వేల వరకు ధర ఉంది. ఇందులోనే భోజన సదుపాయం, సఫారీ కూడా కలిపి ఉంటుంది. జీవ వైవిద్యానికి నిలయం.. తూర్పు కనుమల్లోని నల్లమల శ్రేణుల్లో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతరించిపోతున్న ఎన్నో వృక్ష, జంతుజాలానికి నిలయంగా ఉంది. పులులు, మచ్చల జింకలు, ఇండియన్ బస్టర్డ్స్, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి పందులతో పాటు దాదాపు 70 రకాల క్షీరదాలు, 300 రకాల పక్షులు, 100 రకాల సీతాకోక చిలుకల ఆవాసాలున్నాయి. గ్రే హార్న్‌బిల్ (పొడవాటి ముక్కు పక్షి), డ్రోంగో, కోయెల్, ఇండియన్ రోలర్, ప్యారడైజ్ ఫ్లై చోచర్, బ్లాక్ హెడ్ ఓరియోల్, రెడ్ వెంటెడ్ బుల్బుల్, పర్పుల్ సన్‌బర్డ్ జాతులు కనువిం దు చేస్తాయి. వీటిని చూడటానికి సందర్శకులు రెండు నుంచి మూడు కిలోమీటర్లకు పైగా ప్రకృతి నడకకు వెళ్తారు. అడవుల పరిరక్షణ, స్థానిక తెగల జీవన ప్రమాణాల పెంపు, అటవీ సంపదను రక్షించుకోవడంపై పర్యాటకులకు అవగాహన కల్పనలో భాగంగా పర్యాటక, అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వన్యప్రాణి వారోత్సవాలకు సిద్ధమవుతోంది. -
ఊరు ఒక పండుగ
పట్టణంలో ఉన్నప్పుడు పల్లెటూరికి పోయి ఉండాలనిపిస్తుంది. తీరా, పల్లెటూళ్లో పట్టుమని పదిరోజులైనా ఉండలేను. వింతగా తయారయ్యాను నేను. అసలు పల్లెటూరికే మతిపోయినట్లుంది ఇప్పుడు. ఇదివరకు ఎలా గుండేది. పాపం, నిశ్చలంగా నిశ్చింతగా! ‘‘కాలవ ఒడ్డున ఒరిగి నీడ చూసుకేనేదో, చేలనడుమ పడుచులాగ చేయెత్తీ పిలిచేదో, తోటవెనెక కాస్త కాస్త తొంగి తొంగి చూసేదో, కొండపక్క నిలిచేదో.’’ ఎంత తీయగా, చల్లగా ఉండేది తెలుగు పల్లె! ఇప్పుడు పల్లె కూడా మతి చెడగొట్టుకుంది– పట్టణం లాగ ఉండబోయి, అది చాతకాక. కాఫీ హోటళ్లూ, వాటినుంచి గ్రామఫోను రికార్డుల అరుపులూ, కిల్లీసోడా కొట్టులూ, బస్సుల సందడీ, సినీమాలూ, వాటి తాలూకు ప్రకటనలూ– వాటి అన్నిటితో గ్రామం వేడుక కోసం నగరంవైపు మొగం తిప్పుకొని చూస్తున్నట్టుంటుంది. నగరం వీటి అన్నిటి మధ్యా ఊపిరాడక నలుగుతూ, అన్నం కోసం పల్లె వైపు చేతులు జాపుతున్నట్టుంది. పల్లె తల్లి వంటిది. పట్టణం ప్రియురాలు వంటిది. అన్నం పెట్టడం, చల్లని అంకం మీద పవళింప జేసుకోవడం– గారంగా పెంచుతుంది పల్లె. ఆకర్షించడం, ఎప్పటికప్పుడు ఆవేశాలతో కదిలించి వేయడం– గాఢంగా ఊపేస్తుంది పట్టణం. ‘‘నీకేం గావాలి?’’ అంటుంది పల్లె. ‘‘నా కేమిస్తావు?’’ అంటుంది పట్టణం. పల్లె కుటుంబంలాగ, సంసారంలాగ ఉంటుంది. పట్టణం సంతలాగ విపణిలాగ ఉంటుంది. గ్రామంలో కాలాలు తెలిసిపోతాయి– ఎండా, వానా, వెన్నెలా, వీటితో స్పష్టంగా. పట్టణానికి రుతువులు లేవు. చెట్లూ, చేమలూ, లతలూ, పువ్వులూ, పక్షులూ, బిక్కచచ్చి ఉంటాయి. పట్టణంలో పదిమందిలో ఒంటరిగా ఉంటాం. పల్లెలో మనిషీ, చెట్టూ చేమా పిట్టా జంతువూ కలిసి ఒకే కుటుంబం. పట్టణంలో కొత్తరకపు ఇళ్లు లేస్తున్నాయి. దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కొన్నింటికి చుట్టూ గోడలు ఉంటాయి, లోపలికి రావడానికి వీలు లేదన్నట్టు. ఎన్నిటికో గోడలు లేకపోయినా వీధి అరుగులుండవు. గ్రామాల్లో ఇళ్లకు వీధి అరుగులుండేవి. వీధి అరుగు ఆహ్వానం వంటిది. మొదటి ఆతిథ్యం అరుగే ఇస్తుంది. అతిథులో, అభ్యాగతులో, బాటసారులో, అందరినీ ఇలా దయచేయండి అంటుంది వీధి అరుగు. మా ఊళ్లో చెప్పుకోదగ్గ అరుగులు నాలుగు ఉండేవి– కరణం జగ్గరాజు మావయ్యగారిదీ, మునసబు శేషాద్రిగారిదీ, దివాణందీ అంటే వెలమ దొరగారు వెంకట్రాయణిం గారిదీ, మరీ మాదీ అంటే పెద్ద శాస్త్రులు గారిదీని. ఇవే, సమయాన్ని బట్టి, కచేరీ లయ్యేవి; క్లబ్బు లయ్యేవి; సభాస్థలాలయ్యేవి. రాయణింగారి అరుగు గచ్చు నిగనిగమంటూ నున్నగా మెరుస్తూ ఉండేది. అరుగంటే నిజానికి రెండు అరుగులు– వీధి గుమ్మానికి అటూ ఇటూ, దివాణపు టరుగు మీద తివాసీలు పరచి ఉండేవి. కాని, చల్లటి గచ్చుమీదే కూర్చోవాలని ఉండేది మాకు. ఈ అరుగుల మీద ఇటూ అటూ జేరగిలబడ్డానికి గచ్చు బాలీసులుండేవి. అరుగుల మీద ఒకవైపు రెండు సవారీ లుండేవి– చక్కగా చెక్కిన అడ్డలూ, సోగదండెలూ, దంతపుకోళ్లూ, రాయంచ రెక్కలతో పరుపు బాలీసులూ, ‘‘వింతపని చక్కీల్ పెంజరీ పింజరీల్’’; మొదలైన వాటితోనూ. పెద్దలు మాట్లాడుకుంటూంటే పిల్లలం ఆ సవారీలో సరదాగా కూర్చునేవాళ్లం. ఆ అరుగుల మీద ఉన్న కిటికీలలో నుంచి దివాణం లోపలి భాగం కనబడేది. కరణం గారి వీధి అరుగుమీద పాత తివాసీ ఉండేది– కొంత నలిగి, ఎంతో రంగు పోగొట్టుకున్నది. ఒక పక్కన గోడ నానుకుని ఆయన కూర్చుంటే ముందుగా చిన్న డెస్క్బల్ల ఉండేది. కరణం జగ్గరాజు మామయ్య కచేరీ వేషం మహాబడాయిగా ఉండేది– ‘‘తెలితలపాగ, చొక్క, మొలతిత్తి భుజంబున చల్వపచ్చడంబు, అలచిటివ్రేల ముద్రిక, ఒయారము మీర పొగాకు చుట్ట.’’ మునసబు శేషాద్రి వీధి అరుగు గచ్చుకన్నా నిగనిగలాడుతూ గట్టిగా నున్నగా ఉండేది– మట్టితో అలికిన దైనా! ఈ అరుగు మొగాన జేవురు మట్టిచార లుండేవి. దీని మీద పెద్ద పెద్ద తుంగ చాపలు. కరణం వీధి అరుగూ, మునసబు వీధి అరుగూ కచేరీలు. అవి సాయంకాలం దాకా సందడిగా ఉండేవి. కిస్తీలూ, జప్తులూ, మందడిగోడల ఫిర్యాదులుగా, బందెలదొడ్లూ, చేలగట్ట వివాదాలూ, సర్వేరాళ్లూ, రెవిన్యూ ఇనస్పెక్టర్ల దురంతాలూ, తాసిల్దారు గారికి సప్లయిలూ, బోర్డు ఎన్నికలూ, రౌడీ సుబ్బన్న పోకిరి చేష్టలూ, అచ్చెమ్మ విడాకులూ– ఇలాటి వాటిమీద కరణం మునసబుల మంత్రాంగాలూ ఈ అరుగుల మీద జరిగేవి. ఇక్కడికి అన్ని తరగతులవారు వచ్చేవారు. పాగాలవారూ, జుట్టు ముళ్లవారూ, జునపాలవారూ, బొత్తాలు లేని చొక్కాలవారూ! దూరాన అరుగుమీద ఓ మూల ఒక పరదేశి మూటతో కూర్చుని ఉంటాడు. ఈ వ్యవహారాల తీర్పులో నడుమ ఎవరో ఒకరు ఛలోక్తులు విసురుతారు. ఒకడనవసరంగా కలుగజేసుకొని చీవాట్లు తింటాడు. సాయంకాలం మూడుగంటల నుండి దివాణపు వీధి అరుగు. ఇక్కడికి కరణం మునసబు వస్తారు; కలకాపులు వస్తారు; మేష్టారు వస్తారు; సిద్ధాంతీ షావుకారు కూడా వస్తారు. రాయణింగారు సరేసరి. ఇంతలో ఆ వీధినే తుర్రుమని ఒక పంది అటు పరుగెత్తేది; చెంగున ఇటు ఒక లేగదూడ బంతిలా ఎగిరి వెళ్లిపోయేది. ఊరిబావి నుండి నీళ్లు తెస్తున్న అమ్మలక్కలు, అంతవరకు కిలకిల మాట్లాడేవాళ్లు, ఒక్కసారి ఆగిపోయి, నిశ్శబ్దంగా తలలు రెండోవైపు తిప్పుకొని నడిచిపోయేవారు. వాళ్ల అందెల రవళిలో రవ్వంత ఒడిదుడుకూ, వాళ్ల కడవల నీళ్లలో రవ్వంత తొట్రుపాటూ, వాళ్ల మనస్సులు దివాణపు టరుగుమీదనే ఉన్నాయని తెలియపరుస్తున్నప్పటికీ. ఇంతలో సీమదేశాల్లో యుద్ధాన్ని గురించో, చంద్రలోక యాత్రను గురించో, కబుర్లు వస్తాయి. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతారు. వెటకారంగా చిరునవ్వుతూ కరణంగారు ఆఖరిమాట చెప్పడానికి చూస్తూ ఉంటారు. తమ పూర్వులైన వీరుల్లో ఒకరుంటే చాలు, ఈ యుద్ధాలు చిటికెలో తేలిపోయేవని దొరగారు చెప్తారు. కాలికి పసరు పూసుకొని హిమాలయాలకిన్నీ, ఇట్టే చేతులు జాపి కాళ్లెత్తి చంద్రగోళానికిన్నీ, మన పూర్వులు చటుక్కున వెళ్లి, మళ్లీ సాయంకాలానికి ఎలా తిరిగివచ్చేసేవారో సిద్ధాంతిగారు విశదంగా తెలియబరుస్తారు. రెండో అరుగు మీద పేకాట జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు వీధి అరుగుల ముందు, తూర్పు నుంచి రాజుగారు పంపిన పుంజుకీ, రాయణింగారి పుంజుకీ, పోట్లాట జరుగుతుంటే, అందరూ చూస్తారు. కౌజుపిట్టలది కూడా. రాత్రి శాస్త్రిగారి వీధి అరుగు. దానిముందు ఖాళీస్థలంలో పురాణ పఠనం. కరణం మునసబుల వీధి అరుగులు గ్రామస్థుల నిత్యలౌకిక జీవితానికీ, దివాణం వీధి అరుగు వేడుకలకీ కాలక్షేపానికీ, శాస్త్రిగారి వీధి అరుగు ధర్మచింతనకీ ఆముష్మిక గోష్ఠికీ కేంద్రాలై ఉండేవి. కాక కుట్టుపని దానయ్య అరుగుండేది. దానిమీద మిషన్ టకటకలాడిస్తూ ఉండేవాడు. సిద్ధాంతిగారి చిన్న అరుగుండేది. ఇక్కడ ఆయనచేత చెవిటి సుబ్బయ్య– వినిపించకపోయినా న్యూస్పేపన్ చదివించుకొనేవాడు. ఇలాగే ప్రసిద్ధమైన అరుగులు కొన్ని ఉండేవి. అయితే ఈమధ్య వీధుల్ని వెడల్పు చెయ్యడంలో అరుగులు కొన్ని కుదించుకుపోయాయి. కొన్ని అరుగులు గదులైపోయాయి. సిద్ధాంతిగారి వీధి అరుగు అటువంటిది. దానిలోకి వచ్చింది దానయ్య కుట్టుమిషన్. రాయణింగారు చితికిపోవడం వల్ల వారు దూరాలకు వలసపోవడమున్నూ, తరువాత కుమారుని ఉద్యోగానికై పట్టణవాస మేర్పరచుకోవడమున్నూ, దివాణపులోగిలి లోపల కూలి దిగబడిపోయి అరుగుల మీద అందంగా చెక్కిన స్తంభాలు మాత్రం మిగిలిపోయాయి. కరణంగారు వృద్ధులవడం వల్ల, ఇతర కారణాల వల్ల కుంగిపోయిన గుడారంలాగ అయిపోయి అరుగుమీద చతికిలబడి కూర్చుంటారు. ఇప్పుడు దానిమీద ఆట్టే కచేరీలు జరగడం లేదు. శాస్త్రిగారు పరమపదించడం వల్ల, వారి కుమారుడు ఇంగ్లీషు చదువుకొని, ఎక్కడికో ఉద్యోగానికి వెళ్లిపోతే ఆ ఇల్లు బోర్డువారు ‘ఎక్వైరు’ చేసి అరుగుల మీద క్లాసుల కోసం గదులు కట్టారు. మునసబుగారి వీధి అరుగు ఇంకా సందడిగానే ఉంది. అయితే, అక్కడ ఇప్పుడు ఎన్నికలగోలా పార్టీల కోలాహలమున్నూ. దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897–1980) ‘మా ఊళ్లో వీథి అరుగు’ వ్యాసానికి సంక్షిప్త రూపం ఇది.కృష్ణశాస్త్రి వ్యాసావళిలోని ‘పుష్పలావికలు’ ప్రకరణంలో ఇది ఉంది. కృష్ణపక్షము, ఊర్వశి ఆయన ప్రసిద్ధ రచనలు. సినీగీత రచయితగానూ ప్రముఖులు. -
సాహిత్య మరమరాలు
ఒకనాటి ఉదయం మా ఇంటికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో కలిసి కాటూరి వేంకటేశ్వరరావు గారు వచ్చారు. ఇద్దరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని వస్తూ ఉండటం చూచి ‘‘రండి రండి కృష్ణార్జునులు’’ అంటూ లోపలికి ఆహ్వానించాను. ‘‘మీ ఉపమ బాగుంది’’ అన్నారు కృష్ణశాస్త్రి నవ్వుతూ. అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథుల కోసం మా ఆవిడ ఉప్మా తయారుచేసింది. జీడిపప్పు వేసిన వేడి వేడి ఉప్మా తింటూ కాటూరి వారు అన్నారు– ‘‘కరుణశ్రీ! ఇందాక నీ ఉపమ బాగుంది. అంతకంటే మీ శ్రీమతి ఉపమా ఇంకా బాగుంది.’’ ఆయన ఛలోక్తికి అంతా నవ్వుకున్నాము. – ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి (విశ్వకరుణ, 1992) సేకరణ: గాలి నాసర రెడ్డి -
అదే ఫలహారం అయితే వద్దులే
సాహిత్య మరమరాలు భావకవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు పరంపరలోనివారు మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి. ఈయనకు ఫలహారాల మీద కొంత మోజు. ఏ స్నేహితుడినో కలవడానికి ఏ ఊరైనా వెళ్తే, ఉదయం అల్పాహారమైనా, మధ్యాహ్న భోజనమైనా వడ్డించింది తినేసేవారుగానీ సాయంత్రం మాత్రం ఫలహారం మీదికి ఆయన మనసు పోయేది. మరి దాన్ని నేరుగా అడగలేరు కదా, అందుకని, ‘ఈ వేళప్పుడు ఈ ఊళ్లో ఏం తింటారూ?’ అని దీర్ఘం తీస్తూ అడిగేవారు. అప్పుడు ఆతిథ్యం ఇచ్చినవాళ్లు ఆయన అంతరంగాన్ని గ్రహించి, ఏదైనా చేసిపెట్టాలి. ఇలా ఆయన అడిగేతీరు నెమ్మదిగా అందరికీ తెలిసిపోయింది. ఒకసారి ఆయన బందరులోని కృష్ణాపత్రిక ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఏడెనిమిది మంది కవులు కూర్చునివున్నారు. అందులో ‘పింగళి(లక్ష్మీకాంతం) –కాటూరి’ జంట కవుల్లో ఒకరైన కాటూరి వేంకటేశ్వరరావు ఒకరు. సాయంత్రం అవుతోంది. సుందరరామశాస్త్రికి ఫలహారం మీదకు మనసు లాగుతోంది. తన అలవాటైన శైలిలో ‘ఈ వేళప్పుడు ఈ ఊళ్లో ఏం తింటారూ?’ అని ‘సభ’ను ఉద్దేశించి ప్రశ్నించారు. కాటూరి చప్పున, ‘చీవాట్లు తింటారండి’ అని అదే తరహాలో జవాబిచ్చారు. అందరూ నవ్వుకున్నారు. -
గోదావరి పుష్కరాలు - మహాత్మ్యం
బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరుపుకోవలసిందిగా పుష్కర శాస్త్రంలో వివరణ ఉంది. పుష్కర సమయంలో భూమండలంలోని సమస్త తీర్థాలే గాక, ఇతర లోకాల్లోని పవిత్ర తీర్థాలన్నీ గోదావరి నదిలో కలసి వుంటాయని ప్రగాఢమైన విశ్వాసం. ఈ పవిత్ర సమయంలో గోదావరి సమీపానికి త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, సప్తరుషులు, పితృదేవతలు, సర్వదేవతలూ ఒక పర్వకాలం దాటేవరకు అక్కడే నివాసాలు ఏర్పరచుకుంటారని ఐతిహ్యం. పుష్కర మహాత్మ్యం... పంచభూతాలలో ఒకటైన జలాన్ని ‘పుష్కరం’ అని పిలుస్తారు. ‘పోషయతీతి పుష్కరం’ అంటే పోషించేది పుష్కరం అని అర్థం. ఈ పదానికే మరొక వ్యుత్పత్తి అర్థం ‘పోషయతీతి, పుష్ణాతీతి పుష్కరం’ అంటే... పోషించేది, పుష్టినిచ్చేది అని పుష్కరానికి మరొక అర్థం కూడా ఉంది. పుష్కరకాలం ముగిసేవరకు ప్రకృతిలోని వివిధ జీవరాశులు వివిధ రకాలుగా తమ ధ్యానాలు, వ్రతాలు కొనసాగిస్తాయని ఒక విశ్వాసం. ఇదే సమయంలో చేపలు త్రిషవణ స్నానాన్ని ఆచరిస్తాయని, చాతక పక్షి ఆహారం ముట్టుకోకుండా కఠోర ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుందని, కొండ గుహల్లోని వివిధ మృగ జీవులు సైతం వ్రత కర్మలను పాటిస్తాయని, కొంగలు నిత్య ధ్యానాన్ని కొనసాగిస్తాయని పుష్కర శాస్త్రాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, నర్మద, కావేరి నదులు ప్రసిద్ధమైన నదులు. అవి మనకు ఐహికాముష్మిక సుఖాలను ప్రసాదిస్తాయని లోకోక్తి. ఏ నదికి ఎప్పుడు? ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులు అని పిలుస్తారు. నవగ్రహాలలో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశులలో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు, తొమ్మిది పాదాలు కలసి ఒక రాశిగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం గురువు ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు, అంటే గురువు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి, వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మదానదికి, మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చికరాశిలో ప్రవేశించినప్పుడు భీమరథీ నదికి, ధనూరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరవాహిని (తపతి) నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధూనదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రణీతా (పరిణీత, ప్రాణహిత) నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా గంగా, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, తపతి, తుంగభద్ర, సింధు, ప్రణీత వంటి జీవనదులను పుష్కర నదులని పిలుస్తారు. ఈ విధంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పుణ్యనది అధిష్టానమై ఉంటుంది. ఆ పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు వచ్చి ఉంటారు. అందుకే ఆ సమయంలో ఆ నదిని చేరుకోవడం వల్ల ఆ దేవతలందరి సాన్నిధ్యం మనకు కలుగుతుందని విశ్వాసం. పుష్కరాల ఐతిహ్యం... పూర్వం ముద్గలుడు అనే ముని శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ఏమి కావాలని అడిగితే... ‘నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామీ!’ అని కోరుకున్నాడు ముద్గలుడు. అందుకు శివుడు తనలో ఉన్న అష్టవిధ శక్తులలో ఒకటైన జలంలో ముద్గలుని కలుపుకున్నాడు. ఆ తరువాత బ్రహ్మ కూడా శివుని గూర్చి తపస్సు చేస్తాడు. శివుడిలో ఉన్న జలతత్వాన్ని (ముద్గలుని) వరంగా ఇవ్వమని కోరతాడు. భూమండలాన్ని కమండలంగా మార్చి, అందులో జలతత్వాన్ని నింపి బ్రహ్మకు ఇచ్చాడు శివుడు. అది చాలా శక్తివంతమైన జలం కావున ఉత్తర దేశంలో ఒక మడుగును సృష్టించి అందులో ఈ జలాన్ని పోశాడు బ్రహ్మ. ఆ జలమే ‘పుష్కరం’ అయింది. ఆ పుష్కర ప్రదేశమే తరువాత వ్యవహారంలో ‘పోఖ్రాన్’గా మారింది. మరో కథనమూ ఉంది... బృహస్పతి మహర్షి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మెప్పించి దైవగురుత్వంతో పాటు పుష్కరుని తన వశం చేయమన్నాడు. కానీ పుష్కరుడు అందుకు అంగీకరించలేదు. ఇద్దరి మధ్య రాజీని చేశాడు బ్రహ్మ. అప్పుడు బృహస్పతి ప్రభావం ఉండే నదిలో పుష్కరుడు ఆ సంవత్సరం ఉండాలి. సంవత్సరం మొదట్లో 12 రోజులు చివరిలో 12 రోజులు మిగతా రోజులలో మధ్యాహ్నం కేవలం ఒకటిన్నర గంట పాటు ఆ నదిలో పుష్కరుడు ఉంటాడు. పై కారణంతోనే 12 సంవత్సరాలకు ఒకసారి 12 రోజులు పూర్తిగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే 12 సంవత్సరాల సమయాన్ని ‘ఒక పుష్కర కాలం’ అని పిలుచుకుంటుంటారు. పుష్కర స్నానం ఎందుకు చేయాలి? అన్ని స్నానాలలోకెల్లా నదీస్నానాలు ఉత్తమమైనవి అని పెద్దలు చెబుతారు. నీరు నది రూపంలో ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని మాతృమూర్తిగా భావించే సంప్రదాయం మనది. అటువంటి నదీమ తల్లికి పుష్కరకాలం వచ్చిందంటే ఆ 12 రోజులు కూడా 12 పర్వదినాలతో సమానమే. ‘పుష్కర కాలంలో నదీ స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకం’ అని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. తెలుగులో ఒకే అక్షర భేదంతో పుష్కరము, ముష్కరము అనే రెండు వ్యతిరేక అర్థాలనిచ్చే పదాలున్నాయి. పుష్కరం అంటే ‘పునీతమైన కర్మ’ అయితే, ముష్కరం అంటే ‘దుర్నీతితో చేసే చెడ్డ కర్మ’. అయితే చెడ్డ కర్మలు చేసి జీవితకాలంలో మలినపడిన ముష్కరుల్ని సైతం ఒకే ఒక్క నదీస్నానంతో పుష్కరం పునీతుల్ని చేస్తుంది. అందుకే స్నానం, దానం, పితృతర్పణలు, శ్రాద్ధకర్మలు ఈ పుష్కరాల్లో చేయడం చేత పితృకర్మల పుణ్యం కోటిరెట్లు పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది. శ్లో: జ్ఞాన హ్రదే ధ్యానజతే రాగద్వేష మలాపహే యఃస్నాతి మానసేతీర్థం స యాతి పరమాం గతిమ్ జ్ఞానం అనే మడుగులో ధ్యానం అనే నీటితో రాగద్వేషాలు అనే మాలిన్యాలు పోయేటట్లు మానస తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని అర్థం. శ్లో: ఉత్తమంచ నదీస్నానం మధ్యమం చ తటాకతే అధమం కూప స్నానంచ ఖాండ స్నానేన కిం ఫలమ్ నదీస్నానం ఉత్తమమైనది. చెరువులో స్నానం చేయడం మధ్యమమైంది. బావిలో స్నానం చేయడం అధమమైంది. ఇక చిన్న తొట్టిలో స్నానం చేయడం వల్ల ఏ ఫలితం ఉండదు అని దీని భావం. పుష్కరిణిలో స్నానం చేసే ముందు... శ్లో: జన్మ ప్రభృతి యత్పాపం స్త్రీయా వా పురుషేణ వా పుష్కరే స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అనే సంకల్ప మంత్రాన్ని చదివి నదిలో మునిగితే సర్వపాపాలు పోతాయనేది పురాణోక్తి. పుష్కరాల్లో శ్రాద్ధకర్మలు... పుష్కర కాలానికి గల మరో విశిష్టత పితరుల సంస్మరణార్థం చేసే శ్రాద్ధ కర్మలు. పుష్కర సమయాల్లో దేవతలు, రుషులు వారితో పాటు పితరులు కూడా వస్తారనే ప్రమాణవాక్యం పుష్కర శాస్త్రాలలో పేర్కొనబడినది. ఇక్కడ చేసే శ్రాద్ధం వారికి తిండి పెడుతుందా? అనేది చాలామందిలో మెలిగే ధర్మసందేహం. కానీ మన కంటికి కనపడని కొన్ని పదార్థ గ్రాహకాలైన అణువులు ఇక్కడ మంత్రంతో కూడుకొని పెట్టే శ్రాద్ధ ద్రవంలోని ఆహార రసాన్ని మన పితరులకు అందిస్తుందంటారు. ఈ కర్మలను పరిపూర్ణ విశ్వాసంతో చేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు. పుష్కర శ్రాద్ధ ప్రమాణ శ్లోకాలు శ్లో: ఆదౌ పితా తథా మాతా సాపత్నీ జననీ తథా మాతామహాస్సపత్నీకా ఆత్మపత్నీస్త్వనంతరం సుతభ్రాతృ పితృవ్యాశ్చ మాతులాస్సహ భార్యకాః దుహితా భగినీ చైవ దౌహిత్రోభాగినేయకః పితృష్వసా మాతృష్వసా సాజామాతాభావకస్స్ను సా శ్వశురౌ స్యాలకశ్చైవస్యామినో గురురిక్ధిభిః పితృ, మాతృ వర్గాలకీ, మాతామహి మాతామహ వర్గాలకీ, అన్నదమ్ములకూ, పినతండ్రి పెదతండ్రులకు, అక్కచెల్లెళ్లకూ, బావమరుదులకు, బావగార్లకు, మామగారికి, అత్తగారికి, గురువులకు, శిష్యులకు, పినతల్లి, పెదతల్లులకు, మేనత్తలకు, తన సంతానానికి, వారి సంతానానికి, అల్లుళ్లకూ కోడళ్లకూ ఇలా తనకు సంబంధించిన పైన చెప్పిన చనిపోయినవారందరికీ శ్రాద్ధకర్మ, పిండ ప్రదానం, తర్పణం వదలటం వంటి కార్యక్రమాలను జరపడం పుష్కర సమయంలో అనాదిగా వస్తూవున్న ఆచారం. ఔషధదానం వల్ల ఆరోగ్యం, సాలగ్రామాల దానం వల్ల వైకుంఠ ప్రాప్తి, గోదానం వల్ల కైలాస ప్రాప్తి, నువ్వుల దానం వల్ల దుఃఖాలు తొలగిపోవటం, నేతిని దానం చేయడం వల్ల ఆయుర్దాయం, గృహదానం వల్ల శాశ్వత సుఖం, భూదానం వల్ల అధికారం, బంగారు, వెండి దానాల ద్వారా ఇహపర సౌఖ్యాలు పుణ్యలోక ప్రాప్తి, మంచం, సేవకులను దానం చేయడం వల్ల స్వర్గ ప్రాప్తి, వస్త్రదానం వల్ల వసులోక ప్రాప్తి. పై వస్తువుల్ని ఇవ్వలేనివారు యథాశక్తి కొంత ధనాన్ని కూడా దానం చేయవచ్చు. సాలగ్రామం దానం అన్నిటికన్నా శ్రేష్టమైనది. - సి.శివారెడ్డి సహాయ పరిశోధకుడు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప పుష్కర దానాలు... పుష్కర శాస్త్రంలో పుష్కరాలు జరిగే 12 రోజులలో ఏ రోజు ఏవేవి దానం చేయాలో వివరించి ఉంది. మొదటి రోజు: భూదానం, ధాన్యదానం, సువర్ణదానం, రజత దానం, అన్నదానం రెండోరోజు: రత్నదానం, గోదానం, వస్త్రదానం, లవణదానం మూడవరోజు: అశ్వదానం, ఫలదానం (నాలుగు రకాల పండ్లు), గుడ (బెల్ల) దానం, శాక (గుమ్మడి, ఆనప మొదలైనవి) దానం. నాల్గవరోజు: తేనె, నెయ్యి, పాలు, నూనె, మధుర పదార్థాలు ఐదవరోజు: ధాన్యం, బండి, ఎద్దులు, నాగలి, దున్నపోతులు మొదలైనవి దానం చేయాలి ఆరవరోజు: ఔషధాలు (వట్టివేరు, జాజికాయ, జాపత్రి, కరక్కాయ), కస్తూరి, కర్పూరం, చందనం, సుగంధ ద్రవ్యాలు ఏడవరోజు: పల్లకి, మంచం, పీట మొదలైనవి ఎనిమిదవరోజు: అల్లం, దుంపలు, పూలదండలు, చందనం మొదలైనవి దానం చేయాలి తొమ్మిదవరోజు: దుప్పటి, కంబళి సేవకులను దానం చేయాలి, పిండ ప్రదానాలు ఈ రోజునే చేస్తారు పదవరోజు: పుస్తకదానం, సాలగ్రామ దానం, శాకదానం, రజిత (వెండి), ముత్యాలు దానం చేయాలి పన్నెండవరోజు: మేక, నువ్వులు వంటివి దానం చేయాలి గోదావరి సౌరభం... ఉరకలు వేసే పరుగులు తీసే చెంగూ చెంగున పొంగుతు వచ్చే గోదావరి వంతెన కాడా పంతా లాడక వంతూలేసుకు వంకరదారీ గోదారీ కండియా లందెలు గాజుల సందడి కడవల నీళ్లా గలగలగల ఒయ్యారీ పడమటింటిలోన బుట్టి పల్లాల అడుగు బెట్టీ పాపికొండల లోయగొట్టి, బద్రాద్రి దాపులో పట్టీసం సుట్టబెట్టి, కోనసీమతోపులో పాయపాయలైనావా! పాడి పంటలిచ్చావా పైడి పంటలిచ్చావా, గోదారీ జోతలూ, పాదాల జోతలో మా తల్లీ గోదారీ మా లచ్చీ జోతలో గోదారి గంగమ్మ గొప్ప యిల్లాలు ఆ దేవి సలవుంటే అదే మాకు సాలు నిండు చూలాలల్లే పిండి ఒంగే సేలు దండిగా రాలు బంగారు ధాన్యాలు గరిశెల్లు పండగా గాదెల్లు నిండగా - దేవులపల్లి కృష్ణశాస్త్రి