Dharmana Prasad Rao
-
పెన్షన్లు పేదలకు దూరం చేసిన పాపం చంద్రబాబుదే : ధర్మాన
-
సగర్వంగా ఎగిరిన సామాజిక జెండా
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ, 25 లోక్‌సభ మొత్తం 200 స్థానాలకుగాను సరిగ్గా సగం అంటే 100 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ సామాజిక న్యాయ పతాకాన్ని ఎగరేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. గత ఎన్నికల తరహాలోనే శనివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్.. మంత్రి ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ లతో ఒకేసారి 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటింపజేశారు. సామాజిక మహా విప్లవం ► నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఆ వర్గాలను అక్కున చేర్చుకుంటూ వారి సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్.. సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలకుగాను 29 స్థానాల్లో ఎస్సీ, 7 స్థానాల్లో ఎస్టీ, 48 స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులను బరిలోకి దించారు. మొత్తం 84 శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు. ఇందులో 7 స్థానాల్లో మైనార్టీలకు, మొత్తంగా మహిళలకు 19 స్థానాల్లో అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 41 స్థానాలు వెరసి ఆ వర్గాలకు 77 స్థానాలను కేటాయించారు. వీటిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు 7 స్థానాలు అధికంగా ఆ వర్గాలకు కేటాయించారు. గత ఎన్నికల కంటే ఇప్పుడు మహిళలకు అదనంగా 4 స్థానాలు, మైనార్టీలకు అదనంగా 2 స్థానాలు కేటాయించారు. ► 25 ఎంపీ స్థానాలకుగాను 4 స్థానాల్లో ఎస్సీ, ఒక స్థానంలో ఎస్టీ, 11 స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అంటే.. మొత్తం 16 లోక్‌సభ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు ఏడు వెరసి 12 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు ఆ వర్గాలకు అదనంగా 4 స్థానాలు కేటాయించారు. గత ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థినులుగా 4 చోట్ల మహిళలకు అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 5 స్థానాలను కేటాయించారు. చంద్రబాబు, పవన్ సామాజిక ద్రోహం సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడి జనసేనతో జట్టుకట్టారు. అయినా ఘోర పరాజయం తప్పదని గ్రహించి.. అవినీతి కేసుల నుంచి బయటపడొచ్చనే వ్యూహంతో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి వార్టితో పొత్తు పెట్టుకుని జనసేనకు 21, బీజేపీకి పది శాసనసభ స్థానాలు కేటాయించారు. 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేసేలా లెక్క తేల్చారు. ఈ కూటమి ఇప్పటిదాకా 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో బీసీలు కేవలం 25 (టీడీపీ 24, జనసేన 1) మంది, మైనార్టీలు కేవలం ముగ్గురే ఉండటం గమనార్హం. ఆ మూడు పార్టీలు ఖరారు చేయాల్సిన స్థానాలు ఇంకా 40 మాత్రమే మిగిలాయి. వాటిలో ఒకట్రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు, పవన్ మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచి, ఆ వర్గాలకు ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ఇచ్చిన తరహాలోనే.. మంత్రివర్గం కూర్పుతోనే సామాజిక న్యాయానికి నాంది పలికిన సీఎం జగన్.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు పెద్దపీట వేసి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. నా నా అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు పదవులు, పనులు ఇచ్చారు. ఇప్పుడు 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలు కలిపి 200 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 శాతం కేటాయించి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. అన్ని వర్గాలకు ఊతం.. అందుకే గెలుపు ఖాయం గత 58 నెలలుగా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో అన్ని వర్గాల పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లను సీఎం జగన్ జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్లు.. వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చడం ద్వారా అన్ని వర్గాల పేదల అభివృద్ధికి ఊతమిచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. అందులో 2.13 లక్షల ఉద్యోగులను గత 58 నెలల్లోనే నియమించారు. గత 58 నెలల పాలనలో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కని్పస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ వినమ్రంగా కోరుతూ సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ సమర భేరి మోగించారు. ఇందులో భాగంగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి విజయవంతమయ్యాయి. టీడీపీ–జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్ ఫ్లా్లప్ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మారిటైజ్ వంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెబుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో జగన్ ఎగరేసిన సామాజిక న్యాయ పతాకం రెపరెపలాడటం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. -
వైఎస్సార్సీపీ జాబితాలో BCలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట
-
మంత్రి ధర్మాన ప్రసాదరావుతో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి, తాడేపల్లి: భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డీసీ వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక కోరారని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్‌కి గ్యారెంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. శిస్తు వసూలు చేసుకోవడానికి 1బీ, అడంగల్ వంటివి మత్రమే తెచ్చారని తెలిపారు. భూమిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసేలోపు కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్భం ప్రయత్నించిందని గుర్తుచేశారు. టైటిలింగ్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలమేరకు 2019లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపారని తెలిపారు. రెండుసార్లు వెనక్కి వెళ్లొచ్చి.. 2023లో ఆమోదం పొందిందని చెప్పారు. దేశంలోనే సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66శాతం భూములకు సంబంధించిందేనని చెప్పారు. ఆ 66 శాతంలో లక్ష ఆదాయంలోపు ఉన్నవారి కేసులో 90 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 60 శాతం హత్యలు భూ వివాదాలు వల్ల జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని, 17 వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్, సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్ డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగమేఘాలమీద అమలు చేయడం లేదని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేకప్ చేసిందని పేర్కొన్నారు. రూల్ ఫ్రెమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని, దేశంలో కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం విశేషమని తెలిపారు. చదవండి: ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
-
సాధికార నినాదంతో మురిసిన మహేంద్ర తనయ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సాధికార నినాదంతో మహేంద్ర తనయ నది మురిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విజయ సంకేతాలతో మెరిసింది. మహేంద్ర తనయ తీరంలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బుధవారం ఘనంగా జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన బడుగు, బలహీనవర్గాలతో పాతపట్నం కిటకిటలాడింది. యాత్రకు దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. బూరగాం నుంచి పాతపట్నంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వచ్చే సరికి జనాలతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రసంగాలకు జనం జేజేలు పలికారు. పేదల సంక్షేమంలో సీఎం జగన్ నంబర్ వన్ : మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమాన్ని అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వారు లేరని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.40 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు అందజేశారని తెలిపారు. ఆకలి చూసి, కన్నీరు తుడవడమే సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు. పేదలకు గూడు, నీడ కల్పించాలన్న లక్ష్యంతో రూ. 12,800 కోట్లతో భూమి కొని మరీ 32 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తున్నారని వివరించారు. నాడు–నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో ప్రజల జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు వస్తుందని చెప్పారు. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో కొట్లాటలు జరిగేవని, జగన్ పాలనలో రైతులకు అలాంటి ఇబ్బందులు లేవన్నారు. చంద్రబాబులా రాజకీయాలు చేసి లబ్ధిదారుల ఎంపిక ఏనాడూ చేయలేదని చెప్పారు. చంద్రబాబు పధ్నాలుగేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాకు ఒక్క మంచి పని చేయలేదన్నారు. బాబు అధికారంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను వేధించారని తెలిపారు. పైసా అవినీతి జరగలేదు: స్పీకర్ తమ్మినేని సీతారాం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఒక్క పైసా అవినీతి లేకుండా లక్షల కోట్లు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పైసా అవినీతి లేకుండా పాలన జరుగుతోందని, అవినీతి జరిగినట్లు రుజువు చేస్తే స్పీకర్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్ బడుగుల అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు. రాజ్యాంగ ఆశయాల సాధన: ఎమ్మెల్యే కళావతి పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారని వివరించారు. గిరిజనులకు పోడు భూముల హక్కులిచ్చారని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాలకొండ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు వైఎస్ జగన్ పరిష్కారం చూపించారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. వంశధార నిర్వాసితుల నోటి ముందున్న కూడును కూడా టీడీపీ నేతలు లాక్కున్నారని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ సీఎం కాగానే వంశధార నిర్వాసితులకు రూ. 216 కోట్లు అదనపు పరిహారం అందించారని తెలిపారు. రూ.750 కోట్లతో వైఎస్సార్ శుద్ధ జలం ప్రాజెక్టును చేపట్టి ఉద్దానం ప్రజల కష్టాలను తీరుస్తున్నారన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. -
ఎల్లోమీడియా ఏది రాస్తే అది నమ్మే పరిస్థితి ఎప్పుడో పోయింది: ధర్మాన
-
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవాన్ని నిలిపింది సీఎం జగనే: ధర్మాన
-
‘పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే’
సాక్షి, ఇచ్చాపురం: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇఛ్చాపురంలో జెండా ఊపి బస్సు యాత్రను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఇక, బస్సు యాత్ర సందర్భంగా ఇచ్చాఫురం బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పలాలు డైరెక్ట్‌గా ఇస్తున్నాం. ప్రజలు అది గమనించాలి. ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చిన్న స్థలం ఇచ్చారని చంద్రబాబు అనడం హాస్యాస్పదం. టీడీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదు. అవినీతి లేకుండా చేసిన ఘనత మన ప్రభుత్వానిదే. ఏ ఒక్కరూ తలవంచకుండా ఆత్మగౌరవంతో పేద ప్రజలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడు అనడం హాస్యాస్పదంగా ఉంది. సిల్క్ కుంభకోణం కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయాడు. ఈడీ, ఐటీల వద్ద స్కిల్ స్కామ్‌కు సంబంధించిన వివరాలున్నాయి. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో బాబు ఫెయిల్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇటువంటి ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత మీపై ఉంది. రాబోయే ఎన్నికలు మనకు ఓ సవాల్. ఇక్కడ ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయి. అన్ని కులాలను సమానంగా చూస్తున్నాం.. రాబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో మనం గెలవాలి. పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత మాదే. మంచి భవిష్యత్తు ఉండాలని బడి, వైద్యం, విద్య అందించాం. స్వార్ధం కోసం వచ్చే వారిని దూరం పెట్టాలి అని పిలుపునిచ్చారు. ఇచ్చాపురం క్యాడర్ అందరూ పనిచేయాలని కోరారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మత్స్యకార సోదరులారా మన సమస్య మీద చంద్రబాబునాయుడు వద్దకు వెళితే మీ డొక్కా తీస్తా, తోలుతీస్తా అని బెదిరించారు. గడిచిన ఎన్నికల్లో తొక్కతీసి ఇప్పుడు రాజమండ్రి జైల్లో చిప్పకూడు తినిపించాం. ఎస్సీ, ఎస్టీలో పుట్టడానికి మనం కోరుకుంటామా అని చంద్రబాబు అన్నారు. కానీ, మన ప్రభుత్వంలో దళితుడే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు ఆనాడు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. అటువంటి చంద్రబాబుని క్షమించకూడదు. వైద్యం, విద్యను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేశారు.. బహిరంగ సభలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు ఉన్నారంటే మన సీఎం జగన్ వల్లే. పేదవాడు, దళితులు, మైనార్టీలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం జగన్ వచ్చాక స్థితి గతులు పెరిగి కార్పోరేట్ వైద్యం పేదలకు అందించారు. విద్యలో ఇంగ్లీష్ మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆపాలని చూశారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే మన కులాలు మంచి స్థితిలో ఉన్నాయి. పేదల పక్షపాతి సీఎం జగన్.. పెత్తందార్ల పక్షపాతి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
చంద్రబాబుపై ఉన్న కేసులను ముందు ఐటీ, ఈడీ సంస్థలే దర్యాప్తు చేశాయి
-
అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్‌ది సాహసోపేత నిర్ణయం: మంత్రి ధర్మాన
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ నిర్ణయంతో ఇకపై అసైన్డ్ భూముల లబ్ధిదారులైన పేదలకు సర్వహక్కులు లభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భూమి యాజమాన్యానికి సంబంధించి మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైన నిర్ణయాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘మొదట్లో వ్యవసాయం తప్ప మరొక ఉపాధిమార్గం ఉండేది కాదు. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక 20 ఏళ్లుగా తమకిచ్చినటువంటి భూమిపై సాగుచేసుకుంటున్న వ్యక్తికి ఆ భూమిపై అన్నిరకాల హక్కుల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి మహత్తర గొప్ప నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేస్తున్నాను’ అని చెప్పారు. 20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు.. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ 1977లో ఏపీ శాసనసభ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (పీఓటీ)–1977 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందంటే, ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసిన పెద్దలు, ప్రభుత్వం.. పేదలకు ఇస్తున్న భూమి జమీందార్లకు, భూస్వాములకు అమ్మకం చేస్తున్నారని.. తద్వారా వారికి ఉపాధికల్పించడానికి ఇచ్చిన భూమి వారి వద్ద లేకుండా పోతుందనే విషయాన్ని గ్రహించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటున్న నేపథ్యంలో 1977 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి 40 ఏళ్లు దాటాయి. దేశంలోనూ సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. నిరుపేదల్లో అక్షరాస్యత పెరిగింది. గ్రామాల్లో భూస్వాములు, జమీందార్లు లేకుండా.. అందరికీ అనేక ఉపాధిమార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఈనేపథ్యంలో ఒక మేజర్ సంస్కరణ తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేశారు. ఆ ఆలోచనే.. ఏపీ కేబినెట్లో తీర్మానించినట్టుగా, 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపైనున్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. అంటే, ఒక ప్రయివేటు భూమిపై వ్యక్తులకున్న హక్కులన్నీ... నేటికి 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్భూమి రైతులకు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది’ అని అన్నారు. రైత్వారీ పట్టాపొందిన వారికే ఆ భూమిపై హక్కు చట్టాలు తెలియక, లేదంటే అన్యాక్రాంతం చేసినా, లేక ఇప్పటికే భూములు అమ్ముకున్నట్లైతే.. వాటిని కొనుగోలు చేసిన వారికి మాత్రం పీఓటీ చట్టంలో రిలీఫ్ ఉండదని చెప్పారు. చట్టంలో దాని స్థాయి యథారీతిగానే ఉంటుందని.. ఆ భూమిపై హక్కు అప్పట్లో ఒరిజినల్ రైత్వారీ పట్టా పొందిన రైతుకు మాత్రమే చెందుతుందని స్పష్టంచేశారు. కనుక ఇప్పటికే సదరు అసైన్డ్ భూములు కొనుగోలు చేసుకున్నవారికి హక్కులు ఉండవని అర్ధం చేసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూమి పొంది, 20 ఏళ్లకు పైబడి సాగుచేసుకుంటున్న భూమిపై సంబంధిత రైతుకు పూర్తిహక్కుల్ని ఈ ప్రభుత్వం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల... రాష్ట్రంలో సుమారుగా 15.21లక్షల మంది అసైన్డ్ రైతులు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ‘20 ఏళ్లుదాటి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నవారి సంఖ్య ఇది. ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 33.29 లక్షల ఎకరాల్ని రైతులకు అసైన్డ్ చేయగా 19.21 లక్షలమంది లబ్ధిదారులు ఉన్నారని.. వీటిల్లో 27.41 లక్షల ఎకరాల భూమిపై ప్రస్తుతం కేబినెట్ నిర్ణయంతో ఆంక్షల్ని ఎత్తివేయనున్నట్లు తెలిపారు. చదవండి: తప్పు చేసింది టీడీపీ హయాంలో.. విషం వీరిపైనా! -
మంత్రి ధర్మాన ప్రసాదరావుతో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
చంద్రబాబు మాయమాటలు నమ్మితే అంతే సంగతులు
-
రాజకీయాల కోసం కాకుండా రాజ్యాంగ ఫలాలు అందేలా సాగుతున్న పాలన: మంత్రి ధర్మాన
-
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో " స్ట్రెయిట్ టాక్ "
-
ప్రతి సచివాలయం ఒక రిజిస్ట్రార్ ఆఫీస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి గ్రామ, వార్డు, సచివాలయం ఒక రిజిస్ట్రార్ కార్యాలయంగా మారబోతోందని, తద్వారా మరింత పారదర్శకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి, సత్ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని సాహసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. వీటి ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన, సమర్ధవంతమైన, వివాదరహితమైన సేవలు అందుతున్నాయని వివరించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే) ద్వారా అనేక భూముల వివాదాలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కోస్తాంధ్ర జిల్లాల రెవెన్యూ అధికారుల ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతల్లో చూపించారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ప్రజల ముంగిటకే పారదర్శక పాలన తెచ్చారని, దీన్ని ప్రజలు ఎంతగానో స్వాగతిస్తున్నారని చెప్పారు. అసైన్డ్ భూములపై అధ్యయనానికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక కమిటీని నియమించారని, ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. భూముల రీసర్వే ప్రక్రియ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూముల రీసర్వేలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల చొరవ అభినందనీయమని అన్నారు. భూ వివాదాలు పరిష్కారమవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలవారికి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించామని వివరించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం (రీసర్వే), ఇళ్ల పట్టాల పంపిణీ, 22ఏ కేసులు, చుక్కల భూముల వివాదాలు, సాదా బైనమా, ఆర్వోఆర్, ఆర్వోఎస్ఆర్ పట్టా, నాలా, ఆక్రమణ భూముల క్రమబద్ధీకరణ, అనాధీన భూములు, ఈ–పంట తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించి, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించనున్నట్లు మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖకు జవసత్వాలను తీసుకొచ్చి సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల అవసరాలను తీర్చాలనే ఏకైక లక్ష్యంగా పనిచేద్దామన్నారు. వెబ్‌ల్యాండ్ ఎంట్రీలపై గతంలో కొన్ని విమర్శలు వచ్చేవని, రిజిస్ట్రేషన్ అయిన రోజే ఆటోమ్యుటేషన్ చేసి విమర్శలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, తర్వాతి సదస్సు విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సదస్సులో సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్, ఐజీ రామకృష్ణ, కోస్తాంధ్ర జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడితే ఎలా?
-
ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయి
తిరుపతి అర్బన్/తిరుచానూరు: రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతిలో బుధవారం ఉమ్మడి రాయలసీమ జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సు జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన మంత్రి ధర్మాన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీనవర్గాల వారికి మంచి చేయాలనే సంకల్పంతో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడున్నరేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను వివిధ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమచేశారని గుర్తుచేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటిపట్టాలు ఇవ్వడంతోపాటు గృహనిర్మాణాలు చేపడుతున్నారని గుర్తుచేశారు. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత మొత్తంలో ఇళ్ల పంపిణీ ఇదే తొలిసారన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న భూసర్వేతో ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పారు. 90 శాతం గ్రామాల్లో సమస్యలు పరిష్కారమై ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందన్నారు. అధికారులకు అండగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమస్యలుంటే వాటికి పరిష్కారం చూపుతామని చెప్పారు. అవినీతి రహిత పాలనకు సీఎం శ్రీకారం చుట్టారని చెప్పారు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న అధికారులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను విజయవంతం చేయడానికి రెవెన్యూ విభాగం ఎంతో కీలకమైనదన్నారు. ఇందుకోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. కాలక్రమంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణలు అమల్లోకి వచ్చాయన్నారు. ఓ వ్యక్తి పుట్టినప్పటి నుంచి జీవించినంతకాలం, చివరికి అంత్యక్రియల వరకు రెవెన్యూ విభాగంతో ముడిపడి ఉండే బంధాలను ఆయన వివరించారు. ఈ సదస్సులో సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, అదనపు సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, డైరెక్టర్ సిద్ధార్థ జైన్ పాల్గొన్నారు. -
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్ర : మంత్రి ధర్మాన
-
సీఎం జగన్ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు: సజ్జల
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన అనేక విప్లవాత్మక మార్పుల్లో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదన్నారు. గవర్నమెంట్‌కు రెవెన్యూ వ్యవస్థ అనేది నాడీ వ్యవస్థ లాంటిదని చెప్పారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఆదివారం 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చలర్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ఉద్యోగులపై విశ్వాసం ఉండడం వల్లే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చారిత్రాత్మకమైన సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నాటి నుంచి కలగా మిగిలిపోయిన వాటిని చక్కదిద్దేపనిలో నిమగ్నమయ్యారు. ఎలాంటి లిటికేషన్లు, అనుమానాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 71వేల ఎకరాలు పేదలకు పంచడం అంటే ఊహలకు కూడా అందని అంశం అని పేర్కొన్నారు. 'మూడున్నరేళ్ల పాలనలో కరోనా రెండేళ్లు ఇబ్బంది పెట్టింది. పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాలు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ స్టేజ్‌కి వచ్చాయి. సీఎం జగన్ ఏం చేసినా ఎంత ఎక్కువ మందికి మేలు జరుగుతుంది అనేదే ఆలోచిస్తారు. టీమ్ స్పిరిట్‌కి బేస్ క్రీడలు మాత్రమే. ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేలా క్రీడల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్ జగన్!) -
ఒక ఎకరం ఇవ్వని బాబుకు.. 30లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్‌తో పోలికా?: మంత్రి ధర్మాన
సాక్షి, గుంటూరు: సంఘాల కంటే సమాజం గొప్పదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తమపై సమాజానికి ఇతరత్రా అనుమానాలు రాకుండా సంఘాలు ప్రవర్తించాలని సూచించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేది రెవెన్యూ టీమ్‌గా పేర్కొన్నారు. మంచి భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని సూచించారు. బ్రిటిషనర్లు చేసిన సర్వేలతోనే ఇప్పటికీ కొనసాగుతున్నామని, ప్రభుత్వం చేపట్టిన సర్వేతో గ్రామాల్లో అశాంతి పోతుందని స్పష్టం చేశారు. ‘సర్వే క్లియరెన్స్ ఉంటే రాష్ట్ర జీడీపీ మరో రెండుశాతం పెరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానించిన ఓ చట్టం వల్ల రెవెన్యూ మరింత శక్తిమంతం అవుతుంది. ఆ చట్టం ఆమోదించబడితే సివిల్ కోర్టుల్లోని కొన్ని హక్కులు రెవెన్యూ సిబ్బంది చేతుల్లోకి వస్తాయి. చంద్రబాబు ఐదేళ్లలో ఒక ఎకరం కూడా కొని పేదలకు ఇవ్వలేదు. పేదలకు ఒక్క ఎకరా ఇవ్వని చంద్రబాబుకు, 30లక్షలపైగా ఇళ్ళు కట్టిస్తున్న జగన్ పాలనకు పోలికా? కొంతమంది ఆ ఇళ్లను చూడటానికి బయల్దేరారు. ఈ మూడేళ్లలోనే అన్ని సమస్యలు వచ్చినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లు ఐదేళ్లు ఉంటాయి. మా ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది. అంటే చంద్రబాబు హయాంలో రోడ్లు వేయలేదు. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది సరికాదు’అని స్పష్టం చేశారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇదీ చదవండి: పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్ -
చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై.. మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేదికాదని, నష్టం ఉండేది కాదన్నారు మంత్రి ధర్మాన. ‘భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అయినా లక్షల కోట్లతో అమరావతి ప్రతిపాదన చేశారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్. చంద్రబాబు సన్నిహితులు భూమి కొనుగోలు చేశాకే రాజధాని ప్రకటించారు. సింగపూర్ పార్లమెంట్లో ఈశ్వరన్ వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు నాటకం తెలిసింది. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయి. చంద్రబాబు నారాయణ కమిటీ వేసి 3,940 సీక్రెట్ జీవోలు ఇచ్చారు.’ అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నిపుణులు హాజరై.. విశాఖను పాలన రాజధానిగా చేయాలని కోరారు. ఇదీ చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర -
‘అసైన్డ్’ బదలాయింపులో ప్రజలకు మేలు జరగాలి
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరిగి, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా అసైన్డ్ భూముల బదలాయింపునకు మెరుగైన సిఫారసులు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేలను కోరారు. అసైన్డ్ భూములపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మంగళగిరిలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం చట్టాలను ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరువిడతల భూ పంపిణీకి తాను నేతృత్వం వహించానని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు భూమి మరింత అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం అన్నివిధాలా కృషిచేస్తున్నారని తెలిపారు. భూమి వ్యవసాయం, ఇతర రంగాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. వ్యవసాయ భూమి తమ చేతుల్లో ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మవిశ్వాసం అసైన్డ్ భూములున్నవారికి సైతం కలిగించేలా కమిటీ కృషిచేయాలని కోరారు. గతంలో మాదిరిగా గ్రామాల్లో పెత్తందారులు పేదవర్గాల నుంచి భూములు లాక్కునేందుకు వీల్లేదన్నారు. అసైన్మెంట్దారులైన పేదవారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పక్క రాష్ట్రాలతో పోల్చి అసైన్డ్ భూములకు సంబంధించి రైతులు పొందిన ప్రయోజనాలు పరిశీలించాలన్నారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. కమిటీ సభ్యురాలైన హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పట్టా భూముల మధ్యలో అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు కోర్టులో కేసులు వేస్తున్నారని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని నియమించడం గొప్ప పరిణామమన్నారు. ఈ సమావేశంలో తొలుత అసైన్డ్ భూములపై చట్టాలు, సవరణలు, కలెక్టర్ల నివేదికలు, గత కమిటీ సిఫార్సులు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సీసీఎల్ఏ, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ కమిటీకి వివరించారు. అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్, సీసీఎల్ఏ ల్యాండ్స్ జాయింట్ సెక్రటరీ జి.గణేష్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను గౌరవిస్తాము: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండేందుకు విశాఖను ఒక రాజధానిగా చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బార్ ప్రతినిధులు ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను తాము గౌరవిస్తామని, కానీ రైతులను అడ్డం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ మాఫియాను మాత్రం సహించబోమని చెప్పారు. ఉత్తరాంధ్రవాసులు ఎప్పుడూ రాజధానికి దూరంగానే ఉన్నారని, ఇన్నాళ్లకు దగ్గరగా రాజధాని ఏర్పాటుకు అవకాశం వచ్చిందని, దాన్ని జారవిడుచుకోవద్దని చెప్పారు. ఉత్తరాంధ్రలో రాజధాని ఉంటే భావితరాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. అధికార వికేంద్రీకరణ అవసరాన్ని ఆ కమిటీ సూచించిందన్నారు. పెద్ద క్యాపిటల్ ఈ రాష్ట్రానికి పనికిరాదని చెప్పిందన్నారు. చంద్రబాబు అందుకు భిన్నంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత కమిటీ నివేదికల ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపారు. srikaరాజధాని ఏర్పాటుకు ముందు చంద్రబాబు దొనకొండ, నూజివీడు అంటూ రోజుకో పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాలకు అనుగుణంగా రాజధాని ప్రకటన చేశారని తెలిపారు. ఆ రోజు జీ టు జీ ఒప్పందం జరిగిందని చెప్పారని, కానీ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అది నిజం కాదని చెప్పారని అన్నారు. మన ప్రాంత ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు ఉద్యమాల్లో కీలక పాత్రను పోషించాలని కోరారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫల్గుణరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వాసుదేవరావు, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ నాయకులు ఎమ్మెస్ వినయ్ భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు.