diabetics
-
పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
భారతీయ వంటకాల్లో పప్పులు చాలా ప్రధానమైనవి. కచ్చితంగా ఏదో రూపంలో మన ఆహారంలో పప్పులు తీసుకుంటాం. అది పప్పుగా వండుకుని తీసుకోవడం లేదా స్నేక్స్ రూపంలోనో పప్పులను తీసుకోవడం జరగుతుంది. అలాంటి వాటిని రోజూవారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు ఇంకా మంచిదని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు పరిశోధకులు పప్పుధాన్యాలపై జరిపిన అధ్యయనంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవేంటంటే.. పరిశోధకుల అధ్యయనం ప్రకారం అన్ని రకాల కాయధాన్యాలు, చిక్కుళ్లు జాతికి చెందినవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో మంచి ప్రోటీన్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదీగాక పప్పుల్లో తక్కువుగా గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరని ప్రభావవంతంగా తగ్గిస్తాయి. అందువల్ల టైప్ 2 మధుమేహం ఉన్నవారికి అధిక ఫైబర్ ఉన్న పప్పు దినుసులు ఎంత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు టోరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సుమారు 121 మంది మధుమేహ రోగులపై అధ్యయనం నిర్వహించారు. వారిలో సగం మందికి ఆహారంలో ప్రతిరోజూ ఒక పప్పు ధాన్యాలను చేర్చారు. మిగిలిన సగం మందికి గోధుమ ఆహారాన్ని ఇచ్చారు. అధికంగా పప్పుజాతికి సంబంధించిన వాటిని తీసుకున్న వారిలో చక్కెర హెచ్‌బీఏ1సీ(హీమోగ్లోబిన్ ఏ1సీ) స్థాయిల్లో తగ్గుదల కనిపించింది. ఇందులో ఉండే ఫైబర్లు రక్తంలోని చక్కెరను సమర్ధవంతగా నియంత్రించాయి. ముఖ్యంగా పప్పులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) ఉండటం కారణంగా రక్తంలోని గ్లైసెమిక్‌ని సులభంగా నియంత్రించగలదని తెలిపారు. ఈ పప్పుజాతికి చెందిన కాయధాన్యాలు నేరుగా రక్తంలోనే గ్లూకోజ్‌ని విడుదల చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదని చెబుతున్నారు. వీటిలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయి. అందువల్ల రక్తంలో గ్లూకోజ్‌ని సమస్థాయిలో ఉంచడం లేదా స్థిరంగా ఉండేటట్లు చేస్తాయిని చెబుతున్నారు. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు పప్పుధాన్యాలు అత్యంత మంచివి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈజీగా రక్తంలో కరిగిపోగలదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వుల, తక్కువ గ్లైసెమిక్ ఆహారా పదార్థాల తోపాటు ఈ పప్పు ధాన్యాలను కూడా చేర్చితే మరింత పోషాకాలతో కూడిన ఆహారం అందినట్లు అవుతుంది. పైగా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది పప్పులకి సంబంధించిన మరిన్నీ ఆసక్తికర విషయాలు.. కెనడియన్ల అధ్యయనం ప్రకారం పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లుకు ప్రతిస్పదించే విధానం ప్రభావితం అవుతున్నట్లు గమనించారు. ఫలితంగా గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు తెలిపారు అధ్యయంనంలో బంగాళ దుంపలు, బియ్యం స్థానంలో పప్పులు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సుమారు 20%కి పైనే తగ్గుతాయి. సగం అన్నం స్థానంలో అధికంగా కాయధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సుమారు 20% వరకు తగ్గుదల కనిపించింది పూర్తిగా పప్పుధాన్యాలను తీసుకుంటే 35%పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయిని చెబుతున్నారు పరిశోధకులు కాబట్టి పప్పులను మీ రోజూవారి ఆహారంలో సూప్ రూపంలోనే లేదా స్నాక్స్ కింద ఉకడబెట్టి తీసుకున్నా మంచిది. అదీగాకుండా మీరు తీసుకునే సలాడ్‌లో వీటిని కూడా చేర్చుకున్నా మంచిదే. అలా కాకుండా రోజూ పప్పుతినలేం అనుకున్న వాళ్లు, ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు మీరు తినే చికెన్, మటన్‌కి ఈ పప్పు ధాన్యాలను జోడించి తీసుకోవచ్చని చెబుతున్నారు పోషాకాహార నిపుణులు. (చదవండి: చపాతీలు డయాబెటిక్ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
ఇక రోజూ ఇన్సులిన్ అవసరం లేదు!
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే మధుమేహం రాకముందే అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఇకపై ఆ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. ప్రతిరోజూ కాకుండా వారంలో ఒకసారి మాత్రమే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందట. సైంటిస్టులు జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ‘లాన్సెట్’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 13.6 కోట్ల మందికి ప్రీడయాబెటిస్ ఉందని అంచనా వేశారు. మనుషుల్లో తగినంత ఇన్సులిన్, హార్మోన్ తయారుకాకపోవడం లేదా ఆ పరిస్థితిలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోవటం వల్ల హై బ్లడ్ షుగర్ వస్తుంది. లైఫ్ స్టైల్లో మార్పులు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఈమధ్య కాలంలో తక్కువ వయసులోనే పలువురు మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే మధుమేహం రాకముందే పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం మంచిది. మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో టైప్-2 డయాబెటిస్ సాధారణమైంది. ప్రతిరోజూ మందులు వాడితే సరిపోతుంది. ఇక టైప్-1 డయాబెటిస్ వారు మాత్రం జీవితాంతం ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఒకరోజూ ఇన్సులిన్ తీసుకోకపోయినా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీరికి కాస్త ఉపశమనం లభించనుంది. శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించిన 'ఐకోడెక్' అనే ఇన్సులిన్‌తో కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది డైలీ తీసుకునే ఇన్సులిన్ షాట్స్‌కి సమానంగా ఉంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. 'ఐకోడెక్' ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 582 మంది రోగులపై ఈ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో సగం మందికి 'ఐకోడెక్' అనే ఇంజెక్షన్‌ను ఇవ్వగా, మిగతా సగం మందికి 'డెగ్లుడెక్' అనే సాధారణ ఇన్సులిన్ ఇంజెక్షన్(రోజూ వాడేది)ను ఇచ్చారు. దాదాపు 26 వారాల తర్వాత వీరి HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)లెవల్స్‌ను పరిశీలించగా.. ఊహించని మార్పులను కనుగొన్నారు. డెగ్లుడెక్ ఇన్సులిన్‌తో పోలిస్తే తాజాగా శాస్త్రవేత్తలు కొనిపెట్టిన ఐకోడెక్ ఇన్సులిన్‌ను వాడిన వాళ్లలో హైపోగ్లైసీమిక్ (తక్కువ గ్లూకోజ్ స్థాయిలు) కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఇదంత పెద్ద విషయం కాదని, ఈ రకమైన ఇన్సులిన్‌తో వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. -
Covid: జీవితాన్ని కడగండ్లపాలు చేస్తున్న కొత్త జబ్బులు..
సాక్షి, బనశంకరి (కర్ణాటక): జీవితాన్ని కడగండ్లపాలు చేసే ఇతర జబ్బులకు కూడా కోవిడ్ రక్కసి కారణమవుతోంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 6 నెలల్లో రాష్ట్రంలో 59, 632 మంది డయాబెటిస్, రక్తపోటు (బీపీ) రోగాల బారినపడినట్లు జాతీయ డయాబెటిస్ నియంత్రణ కార్యక్రమంలో వెల్లడైంది. కొత్తగా షుగర్ జబ్బు కనబడిన రోగుల్లో 35 నుంచి 40 శాతం మంది కోవిడ్‌కు గురైనవారిగా తేలింది. జీవనంలో మార్పులకు తోడు కోవిడ్ సోకడం వల్ల షుగర్, బీపీ ప్రమాదం పెరిగింది. తీవ్రమైన కోవిడ్ బారినపడినవారికి చికిత్సలో స్టెరాయిడ్స్ ఔషధాలను ఇస్తారు. దీంతో దేహంలో షుగర్ భారీగా పెరిగి మధుమేహానికి దారి తీస్తోందని నిపుణులు తెలిపారు. కొత్త ప్రమాదాలు.. ఇప్పటికే కర్ణాటకలో లక్షలాది మంది మధుమేహ, బీపీ రోగులు ఉన్నారు. కొత్తగా వచ్చినవారు వీరికి అదనం. నగర ప్రదేశాలకు పరిమితం కాదని, పల్లెల్లోని వారు, అక్కడి నుంచి వలస వచ్చిన వారిలో కూడా బీపీ, షుగర్ కనిపించాయి. కోవిడ్ రోగుల్లో 30 నుంచి 40 శాతం మందిలో మధుమేహం, బీపీ కనపించినట్లు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. కోవిడ్ సోకినప్పటికీ తీవ్రం కాకుండా సత్వర చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకర జీవన రీతులతో షుగర్, బీపీ రాకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు. -
మధుమేహం మందులతోనూ కేన్సర్లకు చికిత్స!
వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ వ్యవహారం. మధుమేహంతోపాటు... మద్యపానాన్ని తగ్గించేందుకు వాడే మందులు.. ఆఖరకు కుక్కుల కీళ్ల నొప్పులు తగ్గించేందుకు వాడే మందులు కూడా కేన్సర్ కణాలను చంపేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బ్రాడ్ ఇన్స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన డానా ఫేబర్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లు జరిపిన తాజా పరిశోధన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వేర్వేరు వ్యాధులకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులను వీరు కేన్సర్ కణాలపై ప్రయోగించి చూశారు. మొత్తం 4518 మందులను పరీక్షించగా వీటిల్లో కనీసం 50 మందులు 578 రకాల కేన్సర్ కణాలపై మెరుగైన ప్రభావం చూపుతున్నట్లు ఈ పరిశోధన ద్వారా తెలిసింది. కేన్సర్లకు కొత్త మందులు అభివద్ధి చేసేందుకు, ఉపయోగిస్తున్న మందులనే కేన్సర్ చికిత్సలో భాగం చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అంచనా. పరిశోధన మొదలైన తొలినాళ్లలో కేన్సర్‌పై పనిచేసే మందు ఒక్కటి కూడా గుర్తించలేమని తాము అనుకున్నామని, ఏకంగా 50 వరకూ ఉండటం ఆశ్చర్య పరిచిందని టాడ్ గోలబ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగించే మందులు, మంట/వాపు కోసం వాడేవి కూడా కేన్సర్ కణాలను చంపేయడంతోపాటు ఇతర కణాలపై ఎలాంటి దుష్ప్రభావమూ చూపలేదని, కొన్ని మందులైతే ఇప్పటివరకూ ఎవరూ ఊహించని రీతిలో ప్రొటీన్లను నిరోధించడం ద్వారా కేన్సర్ కణాలను మట్టుబెట్టాయని టాడ్ తెలిపారు. టెపోక్సాలిన్ అనే మందు కేన్సర్ కణాల్లో గుర్తుతెలియని లక్ష్యాన్ని ఢీకొట్టి ఎండీఆర్1 అనే ప్రొటీన్ ఉత్పత్తి నియంత్రిస్తూ చంపేస్తోందని, ఈ ప్రొటీన్ కీమోథెరపికి శరీరం స్పందించకుండా చేస్తుందని వివరించారు. -
గుడ్డు సొనతో ఇన్సులిన్
మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్‌ను కోడిగుడ్డు సొన నుంచి తయారు చేయడంలో విజయం సాధించారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. తరచూ ఇన్పులిన్ ఎక్కించుకునే వారు డయాబెటిక్ పంపులు వాడతారన్నది మనకు తెలిసిన విషయమే. అయితే వీటితో ఓ చిక్కు ఉంది. రెండు మూడు రోజుల్లో ఇన్సులిన్ కాస్తా గడ్డలు కట్టిపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్లనే వీటిని తరచూ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెల్బోర్న్లోని ఫ్లోరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ అండ్ మెంటల్ హెల్త్ శాస్త్రవేత్తలు కత్రిమ ఇన్సులిన్ తయారీకి పూనుకున్నారు. జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివద్ధి చేసిన ఒక టెక్నిక్‌ను మరింత మెరుగుపరచడం ద్వారా ఇందులో విజయం సాధించారు కూడా. గుడ్డుసొనలో ఇన్సులిన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఉంటాయని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త అక్తర్ హుస్సేన్ తెలిపారు. గ్లైకోఇన్సులిన్ అని పిలుస్తున్న ఈ కొత్త రకం మందు అధిక ఉష్ణోగ్రతల్లో, గాఢతల్లోనూ గడ్డకట్టదని రక్తంలోనూ సహజ ఇన్సులిన్ కంటే ఎక్కువ స్థిరంగా పనిచేస్తుందని హుస్సేన్ వివరించారు. ఇన్సులిన్ పంపుల్లో ఉపయోగించేందుకు ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుందని అన్నారు. సాధారణ ఇన్సులిన్ రెండు రోజులు మాత్రమే పనిచేస్తే.. గ్లైకోఇన్సులిన్ ఆరురోజుల పాటు పనిచేస్తుందని తెలిపారు.ఈ మందు అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వంద కోట్ల రూపాయల వథా ఖర్చును అరికట్టవచ్చునని వివరించారు. -
కొవ్వులతోనూ మధుమేహం!
మధుమేహం ఎలా వస్తుంది? ఆ.. ఏముంది.. వేళాపాళ లేని ఆహార అలవాట్లు, వ్యాయామ లేమి, రక్తంలో చక్కెర మోతాదు పెరగడం. ఇవే కదా మనకు తెలిసిన కారణాలు. కానీ... చక్కెరతో నిమిత్తం లేకుండా కూడా క్లోమగ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయని, తద్వారా నిరోధకత ఏర్పడి రక్తంలో గ్లూకోజు మోతాదు తగ్గకుండా టైప్ –2 మధుమేహం వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించడంతో ప్రశ్న మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన టైప్ –2 మధుమేహం వచ్చేందుకూ కొన్ని రకాల కొవ్వు కణాలూ కారణమేనన్న అంచనాను బలపరిచింది. ఊబకాయంతో ఉన్న, మధుమహాం అంచుల్లో ఉన్న కొన్ని ఎలుకలపై వీరు ప్రయోగం చేశారు. కొవ్వులు ఒక స్థాయి కంటే ఎక్కువైనప్పుడు సైక్లోఫిలిన్ డీ (సైఫ్డీ) బీటా కణాల్లోని మైటోకాండ్రియాలోకి ప్రొటాన్లను విడుదల చేస్తుందని... ఆ వెంటనే కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని ఈ ప్రయోగాల ద్వారా తెలిసింది. సైఫ్డీ ప్రొటీన్ లేని ఎలుకలను ఉపయోగించినప్పుడు ఇన్సులిన్ స్థిరంగా ఉన్నట్లు స్పష్టం కావడంతో మధుమేహానికి.. కొవ్వులకు మధ్య ఉన్న లింక్ స్పష్టమైంది. మనుషుల నుంచి సేకరించిన బీటా కణాలపై జరిపిన పరిశోధనలూ ఇదే రకమైన ఫలతాలిచ్చాయి. మరిన్ని పరిశోధనల చేయడం ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉందని, తద్వారా మధుమేహానికి కొత్త కొత్త చికిత్స పద్ధతులు, మందులు అందుబాటులోకి వస్తాయని అంచనా. -
మధుమేహం.. ఇలా దూరం..
మధుమేహం వచ్చినట్లు నిర్ధారణైన తొలి ఐదేళ్లలోనే శరీర బరువును పది శాతం కంటే ఎక్కువ తగ్గించుకోగలితే వ్యాధిబారిన పడటాన్ని తప్పించుకోవచ్చని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహులు దాదాపు 40 కోట్ల మంది ఉండగా.. భారత్‌లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పలు రకాల జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా మనకు పరిచయమైన విషయమే. రోజుకు 700 కేలరీల ఆహారాన్ని 8 వారాలపాటు కొనసాగిస్తే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందని ఇటీవలి పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఈ ఫలితం చాలాకాలంగా వ్యాధి తో బాధపడుతున్న వారిలో సగం మందిలో కనిపించగా.. కొత్తగా నిర్ధారణ అయిన వారిలో 90 శాతం వరకూ ఉంది. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. తొలి ఐదేళ్లలో పది శాతం కంటే ఎక్కువ బరువు తగ్గిన వారికి సమస్యలు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో కేలరీలను పరిమితం చేయడం, కడుపు కట్టుకుని వేగంగా బరువు తగ్గడం కంటే పది శాతం మాత్రమే తగ్గడమన్నది ఆచరణ సాధ్యమైన విషయమని, చాలామంది అనుసరించేందుకు వీలైందని, అందుకే తమ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడిందని డాక్టర్ హజీరా డంబా మిల్లర్ తెలిపారు. -
కొలెస్ట్రాల్ తగ్గినా మధుమేహులకు సమస్యే!
టైప్ –2 మధుమేహులకు రక్తంలోని కొలెస్ట్రాల్ ఒక స్థాయికి మించి తగ్గితే నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయంటున్నారు జర్మనీకి చెందిన హైడల్‌బర్గ్ యూనివర్శిటీ హాస్పిటల్ శాస్త్రవేత్తలు. డయాబెటిక్ పాలీ న్యూరోపతి అని పిలిచే నాడీ సంబంధిత సమస్యలకు మధుమేహానికి మధ్య సంబంధం ఉందన్న విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ.. కొలెస్ట్రాల్ మోతాదులతో దీనికి లింక్ ఉండటంపై పెద్దగా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాము వంద మంది మధుమేహులపై ప్రయోగం చేశామని.. వీరిలో న్యూరోపతి ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఉన్నారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. వీరి కుడికాలిని ఎమ్మారై స్కానింగ్ ద్వారా చూసినప్పుడు నాడీ సంబంధిత గడ్డలు కొన్ని సూక్ష్మస్థాయిలో కనిపించాయని.. రక్తంలోని కొలెస్ట్రాల్ మోతాదుకు, ఈ గడ్డల సైజుకు నేరుగా సంబంధం ఉన్నట్లు తాము వీరి ఇతర వైద్య పరీక్షల వివరాలను చూసినప్పుడు తెలిసిందని చెప్పారు. మధుమేహుల్లో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగించే మందులను విచక్షణతో వాడాలన్న భావనకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. -
నిద్ర అలవాట్లలో తేడా వస్తే...
వేళకింత తిని.. పడుకోవాలని పెద్దలు అంటూంటే.. వారిదంతా చాదస్తం అని యువతరం కొట్టిపారేస్తూంటుంది. కానీ.. బ్రైగమ్ అండ్ విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం.. నిద్ర అలవాట్లలో వచ్చే తేడాలు ఊబకాయం, హైపర్ టెన్షన్లతోపాటు మధుమేహం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలకూ కారణమవుతోందని తెలియడం చూస్తే మాత్రం పెద్దలమాట చద్దిమూట అనుకోవాల్సిందే. ఒక్కోరోజు ఒక్కో సమయంలో నిద్రపోయే వారితో పాటు.. నిద్రపోయే సమయంలో కూడా తేడాలు ఉండేవారు 2000 మందిని పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తియాన్వీ హువాంగ్ తెలిపారు. ఆరేళ్లపాటు జరిపిన పరిశీలనల తరువాత ఈ తేడాలు ఎక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఈ అధ్యయనంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర అలవాట్ల గురించి వారిని ప్రశ్నించి తెలుసుకోవడం ఇందులో ఒకటని.. ఆక్టీ గ్రాఫ్ వంటి వాచీలను వాడటం ద్వారా వారంలో వారు ఎంత సమయం నిద్రపోతున్నారో తెలుసుకున్నారని వీరు విమర్శిస్తున్నారు. వీటి ఆధారంగా వారి నిద్ర అలవాట్లలో వచ్చిన తేడాలు ఏమిటన్నది నిర్దిష్టంగా తెలియదని చెప్పారు. -
మధుమేహానికి చెక్.. కొత్త పద్ధతిలో!
మధుమేహానికి నిరపాయకరంగా చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెటబాలిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు చేసిన తాజా ప్రయత్నం మాత్రం కొంచెం వినూత్నమైంది. కొవ్వులతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా సరే.. అవి కాలేయంలో సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి మధుమేహం రాకుండా చేయవచ్చునని వీరు అంటున్నారు. మన శరీరంలో కొవ్వులు అడిపోజ్ కణజాలంలో నిల్వ ఉంటాయని మనకు తెలుసు. దీర్ఘకాలంపాటు ఎక్కువగా తీసుకుంటే మాత్రం కొవ్వు కాలేయంలో కూడా పోగుబడుతుంది. ఇది కాస్తా ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీసి.. శరీరం ఇన్సులిన్‌కు స్పందించే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో టైప్ –2 మధుమేహం వచ్చేస్తుంది. ఈ రకమైన జీవక్రియ సంబంధిత వ్యాధులకు.. సెరమైడ్ అనే కొవ్వు రకానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు గతంలోనే గుర్తించినా.. ప్రొటీన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వీటిని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం అంతగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో మ్యాక్స్ ప్లాంక్ శాస్త్రవేత్తలు ఈ సెరమైడ్ కొవ్వులలో ఇన్సులిన్ నిరోధాన్ని ప్రేరేపిస్తున్న వాటిని గుర్తించారు. వాటిని మాత్రమే అడ్డుకోగల ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడాన్ని తగ్గించగలిగారు. ఇదే క్రమంలో వాటి రక్తంలోని చక్కెర మోతాదులు కూడా తగ్గాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న హామెర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు సెల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
గర్భిణుల్లో మధుమేహం... పిల్లలకు ఊబకాయం?
గర్భిణి స్త్రీల రక్తంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉంటే.. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తులో ఊబకాయులుగా మారే అవకాశం ఉందని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ టెనసీ శాస్త్రవేత్తలు. ప్లాస్ వన్ పరిశోధన జర్నల్‌లో ప్రచురితమైన తాజా వ్యాసం ప్రకారం.. గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో తాత్కాలికంగా కనిపించే మధుమేహాన్ని గుర్తించకపోయినా ఫలితం మాత్రం మారదు. 1995 – 2004 మధ్యకాలంలో కాన్పులైన దాదాపు 40 వేల మంది గర్భిణులను తాము పరిశీలించామని.. పిల్లల వివరాలను కూడా పరిగణలోకి తీసుకున్న తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సమంత ఎహెర్లిచ్ తెలిపారు. ఈ 40 వేల మందికీ 24, 28 వారాల గర్భం ఉన్న సమయంలో రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను పరిక్షించామని, ఏడేళ్ల వయసుకు చేరేవరకూ పిల్లల వివరాలూ సేకరించామని వివరించారు. పరిశీలన సమయంలో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే.. జెస్టేషనల్ డయాబెటిస్ ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు అదనంగా మరో పరీక్ష చేశామని సమంత తెలిపారు. అయితే సాధారణ చక్కెర మోతాదులు ఉన్న వారితో పోలిస్తే ఎక్కువ ఉన్నవారి పిల్లలు ఊబకాయులయ్యేందుకు 13 శాతం అవకాశం ఉందని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని చెప్పారు. ఒకవేళ ఆ మహిళకు జెస్టేషనల్ డయాబెటిస్ ఉంటే పిల్లలు ఊబకాయులయ్యేందుకు 52 శాతం అవకాశముందని అన్నారు. ఒకవేళ గర్భిణి స్త్రీల బాడీమాస్ ఇండెక్స్ సాధారణ స్థాయిలో ఉండి, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లలకు ఊబకాం రాలేదన్నది తమ అధ్యయనం చెబుతోందని అన్నారు. -
మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!
మధుమేహంతో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్న విషయమే. క్వీన్ మేరీ యూనివర్శిటీ, గ్లాస్గౌ యూనివర్శిటీలు ఈ జాబితాకు ఇంకో సమస్యను చేర్చారు. టైప్ –2 మధుమేహం ఉన్న వారిలో అత్యధికులు కాలేయ సంబంధిత లివర్ సైరోసిస్ లేదా కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఈ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు చెబుతున్నరు. యూరప్‌లోని దాదాపు కోటీ ఎనభై లక్షల మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విలియం అలజవాయి తెలిపారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వందలో పాతిక మందికి వచ్చే వ్యాధే అయినప్పటికీ దీనికి టైప్ –2 మధుమేహానికి మధ్య దగ్గరి సంబంధం ఉందని... చాలా సందర్భాల్లో దీన్ని ఎవరూ గుర్తించరని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి కాస్తా ముదిరి కాలేయం దెబ్బతినేందుకు కారణమవుతుంది. సకాలంలో ఇలాంటి రోగులను గుర్తించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మధుమేహం ఉన్న వారు మరింత జాగ్రత్తగా కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని తమ అధ్యయనం చెబుతోందని ఆయన వివరించారు -
సచివాలయంలోనే మందుల్లేవ్..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పాలనకు కేంద్రంగా ఉండే సచివాలయంలోనే మందులకు దిక్కులేని పరిస్థితి నెలకొని ఉంది. గత రెండు మాసాలుగా మధుమేహం నివారణ (షుగర్)కు ఇచ్చే మాత్రలు లేకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మందులను రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సరఫరా చేయాలి. కానీ గడిచిన రెండు మాసాలుగా మధుమేహం నివారణ మందులు సరఫరా చేయలేదు. సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతాయి. సచివాలయ ఉద్యోగులు 2 వేల మంది ఉండగా, వారికే సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. చాలా మంది ఉద్యోగులు సచివాలయంలోని డిస్పెన్సరీకి వెళ్లడం, మందులు లేవని చెప్పడంతో వెనుదిరిగి వస్తున్నారు. ఈ మందులతో పాటు మరికొన్ని యాంటీబయోటిక్స్, బీకాంప్లెక్స్, విటమిన్ మాత్రలు కూడా అందుబాటులో లేవని చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ సచివాలయంలోని డిస్పెన్సరీలో ఎప్పుడూ మందులు లేవని చెప్పేవారు కాదని, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు మందులు ఉంటాయో, ఎప్పుడు ఉండవో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. అలాగే సచివాలయం ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకూ రక్తపరీక్షలు కూడా చేయలేని పరిస్థితి నెలకొని ఉందని ఉద్యోగులు వాపోయారు. ఏ రక్తపరీక్ష చేయించుకోవాలన్నా బయటికి వెళ్లి చేయించుకోవాల్సి వస్తోందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి వాపోయారు. ఇప్పటివరకు లేబొరేటరీ కూడా ఏర్పాటు చేయలేక పోవడం దారుణమని, అంబులెన్సు కూడా అందుబాటులో ఉండదన్నారు. ఎవరైనా ఉద్యోగులు 108కు ఫోన్ చేస్తే తూళ్లూరు నుంచి గాని, మరెక్కడనుంచో ఇక్కడకు రావాలని, దీనికి బాగా సమయం పడుతోందని పేర్కొన్నారు. -
రక్తపోటు, మధుమేహం ఉందా? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి
మన శరీరంలో మూత్రపిండా(కిడ్నీ)లను చాలా సంక్లిష్టమైన, కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలో విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోసి బయటకు విసర్జిస్తాయి. అంతేకాదు... కీలకమైన హార్మోన్లు, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడుగింజ ఆకృతిలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా ఉండి, కుడివైపు దానికంటే కాస్త ఎగువన ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెంమీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలోనూ కిడ్నీలది ప్రధాన పాత్ర. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలను కూడా పూర్తిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 1. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2. కిడ్నీ స్టోన్స్ 3. కిడ్నీ ఫెయిల్యూర్ 4. కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వరకు పాకి అక్కడా ఇన్ఫెక్షన్లను కలగజేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే మూత్రపిండాలలోని రాళ్లలో ఇసుకరేణువు పరిమాణం మొదలుకొని గోల్ఫ్‌బాల్ సైజువరకూ ఉంటాయి. వీటిలో కొన్ని రకాలు అంత ప్రమాదకరం కాకపోయినా తీవ్రమైన నొప్పిని, బాధను కలిగిస్తాయి. సైజును బట్టి అనేకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అధిక బరువు, స్మోకింగ్, ఆల్కహాల్, రక్తపోటు, షుగర్‌లెవల్స్ అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలు మూత్రపిండాల మీద పడి అది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యకు దారితీయవచ్చు. మూత్రపిండాలు ఫెయిల్ అయనప్పుడు మాత్రమే లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స పద్ధతులు అనుసరించడం తప్పనిసరి కావచ్చు.పుట్టుకతో వచ్చే మూత్రపిండాల్లో కణుతులు, పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ దగ్గరికి చెకప్స్‌కు తీసుకెళ్లినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి–బరువు తగ్గడం, అజీర్ణం, అధికరక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్‌గా చెప్పుకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. వీటిని పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రీనల్‌సెల్ కార్సినోమా (ఆర్సీసీ): ఈ రకం కణితి పెద్ద వయసు వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా ఇతర చోట్లకు పాకిన (మెటాస్టాసిస్ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూంటుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్–టైప్లలో ఉండే ఈ క్యాన్సర్... ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలలో, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలో కనుగొనడం కూడా జరుగుతూ ఉంటుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్ చేసేవారిలో చిన్నవయసు వారిలోనూ ఈ క్యాన్సర్ నమోదువుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అధికబరువు వంటి వాటితో పాటు జీన్మ్యుటేషన్స్ ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్‌లు, యూరినరీ టెస్టులు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవల్స్ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడే సమయానికి అది ఊపిరితిత్తులకు, ఎముకలు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్ ఎక్స్‌రే, బోన్ స్కాన్స్ కూడా చేయిస్తూ ఉండాలి. కిడ్నీని మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కిడ్నీలను లాపరోస్కోపిక్ పద్ధతిలో కూడా తొలగించడం జరుగుతోంది. క్యాన్సర్ కాని కణుతుల్లో కూడా సైజును బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, మూత్రపిండాలలో అవి చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీని తొలగించడం జరుగుతుంది. సర్జరీ తర్వాత కిడ్నీ ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి సర్జరీని 3 రకాలుగా చేస్తుంటారు. రాడికల్ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, టిష్యూలను మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు. సింపుల్ నెఫ్రొక్టమీ స్టేజ్–1: కిడ్నీ క్యాన్సర్‌కు ఒక మూత్రపిండాన్ని మాత్రం తీసివేయడం జరుగుతుంటుంది. పార్షియల్ నెఫ్రోక్టమీ: పుట్టుకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత మేరకే దాన్ని తీసేవేయడం జరుగుతుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా మూత్రపిండాలను ఇలా కణితి ఉన్న మేరకు మాత్రమే తీసివేయడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణం జీవితాన్ని గడపగలుగుతారు. రెండు మూత్రపిండాలను తీసివేశాక, రెండోది సరిగా పనిచేయకపోతే... వారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం అవసరం. చికిత్స ముగిశాక కూడా ఫాలో అప్ కేర్ తప్పనిసరి. సీటీస్కాన్, చెస్ట్ ఎక్స్‌రే వంటి టెస్ట్‌లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి విషాలకు దూరంగా ఉంటే మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలం. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
అందరికీ ఒకే చికిత్స సరికాదు..
మధుమేహం చికిత్సకు వ్యక్తులు జన్యువులు ఆధారంగా చేసుకుని సిద్ధం చేసిన ఆహరం మెరుగైన ఫలితాలిస్తుందని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. కడుపు/పేవుల్లోని బ్యాక్టీరియాల కారణంగా ఒకే రకమైన ఆహారానికి వ్యక్తులు వేర్వేరుగా స్పందిస్తూంటారని అందువల్ల పోషకాల్లో తేడా వచ్చి వ్యాధికి స్పందన కూడా వేరుగా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హెలెనా మెండిస్ సోరేస్ తెలిపారు. ఆహారానికి రక్తంలని గ్లూకోజు మోతాదులకు మధ్య ఉన్న సంబంధాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు తాము ప్రయోగాలు మొదలుపెట్టామని వ్యక్తుల వయసు, ఆహారం, వ్యాయామం వంటి అంశాలు మాత్రమే కాకుండా.. తీసుకునే ఆహారానికి స్పందించే లక్షణం ఆధారంగా రక్తంలోని గ్లూకోజు మారుతూంటుందని వివరించారు. కార్బోహైడ్రేట్లు, కేలరీ లెక్కలేసి ప్రస్తుతం వేస్తున్న అంచనాలు సరికాదని అన్నారు. ఈ కారణంగానే కొంతమంది మధుమేహులుకు కొన్ని రకాల పండ్లు తిన్నా రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగవని తెలిపారు. దాదాపు 327 మందిపై ఆరు రోజుల పాటు పరిశీలన జరిపామని.. తీసుకునే ఆహారానికి రక్తంలోని చక్కెర మోతాదులకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసకునే ప్రయత్నం చేశామని చెప్పారు. -
మాస్టర్ స్విచ్‌ను కనుక్కున్నారా?
గుండెజబ్బులు మాత్రమే కాకుండా మధుమేహం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులన్నింటికీ మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. పోషకాలు, కాలుష్యాలు.. పర్యావరణం తదితరాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా రోగ నిరోధక వ్యవస్థలోని కణాలను చైతన్యవంతం చేసే ఒక ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా గుండెజబ్బులను నియంత్రించవచ్చునని వీరు అంటున్నారు. ఎంటార్సీ1 అనే ఈ ప్రొటీన్‌ను నైట్రోగ్లిసరిన్, సిల్దనాఫిల్ వంటి రసాయనాలతో అవసరమైనప్పుడు మాత్రమే పనిచేసేలా చేయవచ్చునని తాము ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా గుర్తించామని డేవిడ్ కాస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. టర్బటిన్ అనే రసాయనం జీవక్రియలను.. కణాల పెరుగుదల, విభజన వంటి అంశాలన్నింటినీ నియంత్రిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. నైట్రోగ్లిసరిన్, సిల్దనాఫిల్ వంటి వాటి మందులతో ఈ టర్బటిన్ను ప్రేరేపితం చేయవచ్చునని వీరు అంటున్నారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఎంటార్సీ1 ఉత్పత్తిని నియంత్రిస్తూ గుండెజబ్బులను అదుపులో ఉంచవచ్చునని చెప్పారు. -
‘విటమిన్ – డి’ తో మధుమేహ నివారణ!
సూర్యుడి నుంచి ఉచితంగా అందే విటమిన్ – డి శరీరానికి చేసే ఉపయోగాలు ఎన్నో. బ్రెజిల్‌లోని ద నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలు, విటమిన్ – డి ద్వారా మధుమేహం రాకుండా చూసుకోవచ్చు అని చెబుతున్నాయి! కొన్ని ఇతర పరిశోధనలు కూడా విటమిన్ – డి ద్వారా రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను నియంత్రించుకోవచ్చునని చెబుతూండటం విశేషం. విటమిన్ – డి లేమి రక్తంలోని గ్లూకోజ్ మోతాదులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు బ్రెజిల్ శాస్త్రవేత్తలు దాదాపు 680 మంది మహిళలపై పరిశోధన చేశారు. దాదాపు 34 శాతం మంది డి – విటమిన్‌ను వాడుతూండగా.. వారిలో గ్లూకోజ్ మోతాదులు తగు నియంత్రణలో ఉన్నట్లు తెలిసింది. మాత్రల రూపంలో కాకుండా.. అప్పుడప్పుడూ ఎండలో గడిపిన వాళ్లలోనూ ఇవే రకమైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జో ఆన్ పింకెర్టన్ తెలిపారు. విటమిన్ – డి తక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తేలిందని చెప్పారు. మరికొన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకుంటే మధుమేహ నియంత్రణకు చౌకైన కొత్తమార్గం లభిస్తుందని వివరించారు. -
మధుమేహానికి బానిసలు కానక్కరలేదు
మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు: మైదా, రిఫైన్డ్ చక్కెర పదార్థాల వాడకం, పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారంగా తీసుకోవడం, అధికంగా తెల్ల చక్కెర పదార్థాలు వేసిన డ్రింకులు తీసుకోవడం, ఆహారం తినటం, పీచు పదార్థం లేనిదైన మాంసం, అల్కహాల్ల సేవనం. వందల కొద్దీ రసాయనాలు వేసిన– ప్యాక్ చేసిన ఆహారం కొనుక్కొని తినడం, తీవ్ర ఒత్తిడితో కూడిన జీవన శైలి, ఉద్రేకాలు, ఉద్వేగాలు క్లోమ గ్రంధిని ఆవహించిన ఇన్పెక్షన్లు, యాంటీ బయాటిక్‌ల విపరీత ఫలితాలు ఇందుకు చెప్పుకోదగ్గ కొన్ని కారణాలు. గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ‘మధుమేహం’ మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. ఇది కళ్లు, మూత్ర పిండాలు, ఎముకలు, మెదడుకూ కూడా రోగాలు తెచ్చి పెడుతుంది. మధుమేహం టైప్ 2 రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికి పది సూత్రాలు: 1. 1.8 నుంచి 12.5% పీచు పదార్థం కలిగిన సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా స్వీకరించడం. సిరిధాన్యాలలో పీచుపదార్థం ధాన్యపు కేంద్రం నుంచి బయటి వరకూ, పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. రోజుకొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి. ఇలా 5 ధాన్యాలనూ రోజుకొకటి తినాలి. కుటుంబంలో అందరికీ చిన్న నాటి నుండే అవగాహన పెంచాలి. 2. రోజూ 50 నుండి 70 నిమిషాలు నడవటం అవసరం. 3. అధికంగా ఆకుకూరలు, సేంద్రియ ఆహారం సహజ రూపంలో తినడం. 4. మునగకాయలు, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామకాయల వాడకం పెంచుకోవాలి. జామ, మామిడి ఆకుల కషాయాన్ని ఉదయాన్నే త్రాగాలి. 5. పాల వాడకం మానివేయాలి. కొని తినే ప్యాకెట్ ఆహారాలను దూరం పెట్టాలి. 6. మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి. 7. మన ఉద్రేకాలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి. 8. వరి అన్నం, గోధుమలు, మైదాతో కూడిన పదార్థాలను అతి తక్కువ వాడటం లేదా పూర్తిగా దూరంగా ఉంచాలి. 9. జిజఛిటపై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, తెల్ల చక్కెర వేసిన రెడీ మేడ్ ఆహారాల నుండి మనలను మనం రక్షించుకోవాలి. 10. మధుమేహం టైప్ 2 అందరికీ వచ్చేదే కదా అనే ‘అల్ప ధోరణి’ లేకుండా ఈ వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే మార్గాలు పాటించడం. వ్యాధి వస్తే సరైన ఆహారం, మారిన జీవనశైలితో పోరాడటం. ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంటకీ రక్తపరీక్షలు కాకుండా జిb్చ1ఛి రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలకూ తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయంగా సరైన పద్ధతిలో తెలుసుకోవాలి. రోగాలు ముఖ్యంగా దీర్ఘవ్యాధులు మన ఆనందాలను హరిస్తాయి. ఎందుకంటే వైద్యానికి పోయి మరిన్ని పరీక్షలూ, మరింత సంక్లిష్టమైన అర్థం కాని రోగాల విషవలయంలో ఇరుక్కొని, వ్యాధి నివారణ కనుచూపు మేరలో లేకుండా పోతున్నది. అశాంతికి కారణమవుతోంది.అందుకే మన ఆరోగ్యాన్ని మేలైన ఆహారం ద్వారా మనమే సాధించుకోవాలి. పోలిష్ చేయని సిరి ధాన్యాలు మనకు శక్తిని ప్రసాదిస్తాయి.నేటి ఆహార అలవాట్ల వల్ల వచ్చేది ‘డయాబెటిస్/చక్కెర/ మధుమేహం వ్యాధి. ఇది ఒక చేదు ‘ఆరంభం’ మాత్రమే. క్రమంగా మన నేత్రాలు, మూత్ర పిండాలు, ఎముకలు, రక్త పీడనం (బీపీ), పునరుత్పత్తి మండలం, హృదయ ఆరోగ్యం... అన్నింటిపై దీని ప్రభావం ఉంటుంది. పలు రోగాలకు కారణమవుతుంది. ఆహారం నుండి మన రక్తంలోకి వచ్చే గ్లూకోజ్ యొక్క నియంత్రణే మన ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. సిరిధాన్యాలే సమర్ధవంతంగా, సరైన ఫైబర్ కలిగి, మన రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణ చేయగలవు. అతి తక్కువ ఫైబర్ లేదా, పూర్తిగా ఫైబర్ లేని మైదా, వరి అన్నం, గోధుమలు మన ఆరోగ్యానికి దోహదం చేయవు.చక్కెర వ్యాధి, అధిక రక్తపోటు, మోకాళ్ల నొప్పులూ, ఊబకాయం, రక్తంలో పెరిగే ట్రైగ్లిసెరైడ్స్, కొలెస్ట్రాల్, మూర్ఛలూ, గాంగ్రీసులు, క్యాన్సర్లు, మూత్రపిండ వ్యాధులూ, గర్భాశయ వ్యాధులూ, చర్మ వ్యాధులూ – ఎటువంటి వ్యాధులు ఉన్నా, సిరి ధాన్యాల సరైన పోషణ ద్వారా ఆరోగ్యం వైపు మీరు ప్రయాణిస్తారు.పోలిష్ చేయని సిరిధాన్యాల వాడకం ద్వారా ఎముక మజ్జను ఉత్తేజపరచటం, రక్తశుద్ధి, థైరాయిడ్, కాలేయం, క్లోమ గ్రంధుల మెరుగుపాటు, మెదడు, జీర్ణ మండల వ్యాధులూ మొదలైన కష్టాలన్నీ తీర్చుకోవచ్చు.వీటితో అన్నం వండుకోవచ్చు. రొట్టెలు చేసుకోవచ్చు. ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోసె, బిర్యానీ, బిసిబేళబాత్ కూడా చేసుకోవచ్చు. (అండుకొర్రలు నాలుగు గంటలు, మిగిలిన ధాన్యాలన్నీ కనీసం రెండు గంటల ముందు నానబెట్టికుని వండుకోవాలి) సిరి ధాన్యాలతో పాటు కొన్ని రకాల ఆకుల కషాయాలను సేవించడం ద్వారా క్యాన్సర్ వంటి పెద్ద రోగాల బారిన పడకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమే. -
మధుమేహం..బీపీ మందులతో
మధుమేహం... రక్తపోటుల చికిత్సకు వాడే రెండు మందులు కలిపి వాడితే కేన్సర్ కణితుల పెరుగుదలను అడ్డుకోవచ్చునని అంటున్నారు బాసెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కేన్సర్ కణాలు పెరిగేందుకు అవసరమైన ఇంధన సరఫరాలను అడ్డుకోవడం ద్వారా ఈ మందులు కణితి పెరుగుదలను అడ్డుకుంటాయని సెల్ రిపోర్ట్స్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. మధుమేహం కోసం వాడే మెట్ఫార్మిన్ నేరుగా కేన్సర్ కణాలపై దుష్ప్రభావం చూపగలదని.. అయితే ఈ మందును వాడే మోతాదు కారణంగా ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని... సైరోసింగోపైన్ అనే రక్తపోటు నివారణ మందు కూడా చేరినప్పుడు ప్రభావం ఎక్కువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బెంజిమన్ తెలిపారు. పోషకాలను శక్తిగా మార్చే కీలకమైన అణువు ఎన్ఏడీ + తగినంత ఉత్పత్తి కాకుండా ఈ మందుల మిశ్రమం కేన్సర్ కణాలపై ప్రభావం చూపుతుందని హాల్ వివరించారు. కేన్సర్ కణాలు అత్యధికం తమ శక్తి అవసరాల కోసం గ్లూకోజ్‌ను లాక్టేట్‌గా మార్చుకుంటాయని, సైరోసింగోపైన్ ఈ లాక్టేట్ను సరఫరా చేసే రెండు మూలకాలను అడ్డుకుంటుందని తమ పరిశోధనల్లో తెలిసినట్లు బెంజిమన్ వివరించారు. -
కోడిగుడ్లు ఎక్కువైనా.. గుండెకు ఇబ్బంది లేదు!
వారానికి 12 చొప్పున ఏడాది పొడవునా కోడిగుడ్లు తిన్నా ఎలాంటి ఇబ్బంది లేదని సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెతోపాటు మధుమేహం వంటి వ్యాధుల విషయంలోనూ కోడిగుడ్ల ప్రభావం పెద్దగా లేదని వీరు అంటున్నారు. మూడు నెలలపాటు కోడిగుడ్లు ఎక్కువగా తిన్నా ఆరోగ్యంపై ప్రభావం ఉండదని గతంలోనే నిరూపణ అయినప్పటికీ తాజా పరిశోధనలు ఈ కాలాన్ని ఏడాదికి పెంచడం గమనార్హం. వారానికి రెండు గుడ్లు మాత్రమే తినేవారితోపాటు 12 గుడ్లు తినే వారిని కొంత కాలంపాటు పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని గుండెజబ్బుల విషయంలో రెండు గుంపుల్లోని వారి స్థాయి ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని నిక్ ఫుల్లర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ముందుగా తాము మూడు నెలలు ఆ తరువాత ఇంకో మూడు నెలలు ఈ తరహా ఆహారం ఇచ్చి పరిశీలనలు జరిపామని, ప్రతి దశలోనూ భాగస్వాముల్లో గుండె జబ్బులకు సంబంధించిన ఏ వ్యతిరేక లక్షణమూ కనిపించలేదని వివరించారు. సంతృప్త కొవ్వుల స్థానంలో మోనోశ్యాచురేటెడ్, పాలీ అన్శ్యాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలన్నది గుర్తుంచుకుంటే చాలని కోడిగుడ్లు ఎక్కువ తిన్నా గుండెజబ్బుల ప్రమాదం తక్కువని తమ ప్రయోగం స్పష్టం చేస్తోందని ఆయన వివరించారు. -
మధురానుబంధానికి ఏడడుగులు
ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ ఇస్తూ, ‘పంచదార వేయొచ్చా?’ అని అడగడం సర్వ సాధారణం అయిపోయింది. మిథునం కథలో శ్రీరమణ ‘ప్రతివారికి శంఖుచక్రాల్లా బీపీ షుగర్లు ఉంటున్నాయి’ అని చమత్కరించారు. అది వాస్తవం కూడా. మధుమేహం (షుగర్) ఏ కారణం వల్ల వచ్చినా, మధుమేహం వచ్చినవారు వారు మాత్రమే కాకుండా వారి జీవిత భాగస్వామిపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. ప్రభావం అంటే.. మధుమేహం వారిపై వారి భాగస్వామి మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఏర్పడడం. మధుమేహాన్ని భాగస్వామి తన నియంత్రణలో ఉంచుకునేలా వారు ప్రోత్సహించాలి. ఇది కొత్త బాధ్యతే కావొచ్చు. కాని తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన బాధ్యత. ఒత్తిడిని తగ్గించాలి: మధుమేహం వచ్చిందని తెలియగానే భాగస్వామికి తాను భారంగా ఉన్నాననే భావనలో పడిపోతారు. అది తప్పు అని చెప్పాలి. ఒత్తిడి పెరిగే కొద్దీ వ్యాధి పెరుగుతుంది కనుక, ఒత్తిడి పడకుండా, ఎప్పటికప్పుడు వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేలా వారితో ప్రేమగా మాట్లాడుతుండాలి. శ్రద్ధ తీసుకోవాలి: మధుమేహం గురించి పూర్తిగా అవగాహన కలిగించాలి. మొదట్లో కొన్నిసార్లయినా డాక్టరు దగ్గరకు భాగస్వామితో కలిసి వెళ్లి, వ్యాధి గురించి వివరంగా అడిగి తెలుసుకోవాలి, మధుమేహం గురించి బాగా చదవాలి. ఎంత తెలుసుకుంటే, అంత జాగ్రత్తగా ఉండొచ్చని, భయపడటం అనవసరమని చెబుతూ ఉండాలి. కలిసి వాకింగ్: మధుమేహం అనేది జీవన విధానంలో ఒక అసమతుల్యతని, వ్యాధి తగ్గడానికి సమష్టి కృషి అవసరమని, భాగస్వామితో చర్చించి, ఏం చేయాలనే అంశం నిర్ణయించుకోవాలి. ఎటువంటి విషయంలో సహాయం అవసరమవుతుందో ముందుగానే చర్చించుకోవాలి. ఉదాహరణకి ఆరోగ్యకరమైన ఆహారం గురించి సూచించడం, వాకింగ్ చేసేలా సహకరించడం, వారితో పాటు వాకింగ్‌కి వెళ్లడం. శాసించకూడదు: నిరంతరం ఏదో ఒక జాగ్రత్త చెబుతూంటే, భాగస్వామికి చిరాకు కలిగి, చాలాకాలం పాటు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది చాలామందిలో కనిపిస్తుంది. ఏ ఒక్కరూ ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణతో ఉండరనే గుర్తించాలి. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రతిరోజూ శ్రద్ధతో కాపాడుకోరనే విషయం గుర్తు తెచ్చుకోవాలి. మనకు ఇష్టులైనవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే బాధ కలుగుతుంది. అలాగని నిత్యం నస పెడుతున్నట్లుగా జాగ్రత్తలు చెప్పడం వల్ల ఆరోగ్యం కుదుట పడదని గ్రహించాలి. మధుమేహం కారణంగా శారీరకంగా బాధపడుతుంటే గమనించి, వారికి మరింత సహకరించాలి. ఆ రోజు వరకు వారు ఎంత చక్కగా పనిచేసారోనని ప్రశంసిస్తూ, 2,3 రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించాలి. కొన్ని మానేయాలి: జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. భాగస్వామి ఎదురుగా జంక్ ఫుడ్ తింటూ, టీవీ చూస్తూ కూర్చోకూడదు. భాగస్వామి కోసం చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఆహారనియమాలు పాటిస్తూ, వ్యాయామం చేయడానికి సహకరించాలి. ఇద్దరూ కలిసి జిమ్‌లో చేరాలి. తీపి తినడం, పొగతాగటం, మద్యం సేవించడం వంటి అలవాట్లను విడిచిపెట్టాలి. చెడు అలవాట్లను విడిచిపెట్టి, ఆరోగ్యంగా జీవించడానికి ఇదొక మంచి అవకాశంగా భావించాలి. ఓర్పు అవసరం: పదే పదే వ్యాధి గురించి మాట్లాడకూడదు. భాగస్వామికి ఆసరాగా ఉంటున్నారనే విషయం వారు నెమ్మదిగా అర్థం చేసుకునేవరకూ ఓరిమితో ఉండాలి. వారి కోసం తప్పక సమయాన్ని కేటాయించాలి. నిపుణుల సహకారం: వ్యాధిని నియంత్రించుకునే ఈ సుదీర్ఘ ప్రయాణంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం అవసరం. వైద్యులను తరచుగా కలుస్తూ ఉండటం వల్ల సందేహాలు పోతాయి. వెళ్లిన ప్రతిసారీ వైద్యునితో వివరంగా అన్నీ చెప్పాలి. డైటీషియన్ దగ్గర నుంచి డైట్‌ప్లాన్ తెచ్చుకోవాలి. ఇలా అన్ని విషయాల్లో భాగస్వామితో ‘మనసున మనసై’ అన్నట్లు ఉండడం వల్ల తమకు మధుమేహం వచ్చిందనే ఫీలింగ్ బాధించదు. పైగా త్వరగా నియంత్రణలోకి వస్తుంది. -
బిడ్డకు పాలిస్తే..
నవజాత శిశువుకు తల్లిపాలకు మించిన ఆరోగ్య రక్షణ లేదని అంటారుగానీ.. మధుమేహం విషయంలో ఇది తల్లికీ మేలని అంటున్నారు శాస్త్రవేత్తలు. దాదాపు 30 ఏళ్ల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన కైసర్ పెర్మనెన్‌టే శాస్త్రవేత్తలు తెలిపారు. పాలిచ్చే తల్లులకు రొమ్ము, అండాశయ కేన్సర్ల ముప్పూ తక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. యువతుల్లో గుండెజబ్బులు వచ్చేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడం లక్ష్యంగా 1986లో కైసర్ పెర్మనెన్‌టే శాస్త్రవేత్తలు కొంతమంది మహిళలపై ఒక అధ్యయనం చేపట్టారు. ఇందులో 18 – 30 మధ్య వయస్కులు దాదాపు ఐదే వేల మంది పాల్గొన్నారు. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని మినహాయించి తరచూ జరిపిన పరిశోధనల ద్వారా తేలింది ఏమిటీ అంటే.. ఆరునెలల కంటే ఎక్కువ సమయం పిల్లలకు స్తన్యమిచ్చే వారిలో సగం మందిలో మధుమేహ లక్షణాలేవీ కనిపించలేదు. పాలు అస్సలు పట్టని తల్లులతో పోలిస్తే ఆరు నెలల కంటే తక్కువ పాలిచ్చే తల్లుల్లో మధుమేహం ముప్పు 25 శాతం తక్కువని తేలింది. ఈ ఫలితాలు ఇతర పరిశోధనల ఫలితాలకు దగ్గరగా ఉన్నాయని, అన్ని ప్రాంతాల మహిళలు (ఆఫ్రికన్లు, ఇతరులు) ఇదే రకమైన ధోరణి కనపరిచారని ఈ అధ్యయనం నిర్వహించిన డాక్టర్ గుండెర్సన్ తెలిపారు. -
మధుమేహానికి జన్యుచికిత్స!
జన్యువుల్లో మార్పులు చేస్తే బోలెడన్ని వ్యాధులకు సమర్థంగా చికిత్స కల్పించవచ్చు. అయితే ఇందుకోసం జన్యువులను కత్తిరించాలి. అవసరమైన కొత్త జన్యువులను చేర్చాలి లేదంటే తొలగించాలి. ఈ మార్పులు చేర్పులు దీర్ఘకాలంలో శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియని కారణంగా ఇప్పటివరకూ జన్యుచికిత్స అంతగా అందుబాటులోకి రాలేదు. సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ లోటు కూడా తీరనుంది. జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ –క్యాస్ 9 సాయంతో వీరు ఎలాంటి కత్తిరింపులు లేకుండానే మధుమేహంతోపాటు కొన్ని ఇతర జబ్బులను సమర్థంగా నయం చేయగలిగారు. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగాల్లో అవసరమైన జన్యువులను చైతన్యపరచడం లేదంటే ఆఫ్ చేయడం ద్వారా తాము వ్యాధులను నయం చేయగలిగినట్లు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త జువాన్ కార్లోస్ అంటున్నారు. క్రిస్పర్ క్యాస్ 9 టెక్నాలజీలో జన్యువులను కత్తిరించే క్యాస్ 9 ఎంజైమ్ స్థానంలో తాము చైతన్యం లేని డీక్యాస్ 9ను ఉపయోగించామని, దీనివల్ల ఇది నిర్దిష్ట జన్యువును కచ్చితంగా చేరుకోగలిగినా.. దానికి ఏమాత్రం నష్టం కలిగించదని జువాన్ తెలిపారు. డీక్యాస్ 9 ఎంజైమ్‌కు కొన్ని రసాయనాలను జోడించడం ద్వారా కావాల్సిన జన్యువులను ఆన్/ఆఫ్ చేయగలదని వివరించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు మధుమేహం, మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధులపై తాము ఈ టెక్నాలజీని ప్రయోగించిన సత్ఫలితాలు రాబట్టామన్నారు. -
చలికాలంలో పుడితే... పెద్దయ్యాక మధుమేహం?
పుట్టే రుతువునుబట్టి మనకు వచ్చే వ్యాధులు ఆధారపడి ఉంటాయా? అంటే చలికాలంలో పుడితే పెద్దయ్యాక మధుమేహం, ఆకులు రాలే కాలంలో పుడితే మనో వ్యాకులత వంటి వ్యాధులొస్తాయా? అవునని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెప్పినా.. ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. గర్భంలో ఉండగా తల్లి చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల ప్రభావం బిడ్డకు వచ్చే వ్యాధులపై ఉంటుందన్నది ఈ అధ్యయనం తాలూకూ సారాంశం. మూడు దేశాల్లోని కొన్ని లక్షల మంది గర్భిణులు వారి పిల్లల ఆరోగ్య వివరాలను పరిశీలించిన తరువాత తామీ అంచనాకు వచ్చామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త నికొలస్ టాటనెట్టీ తెలిపారు. న్యూయార్క్ నగరానికి చెందిన దాదాపు 17 లక్షల మంది పిల్లల వివరాలు పరిశీలించినప్పుడు జూలై, అక్టోబర్ నెలల్లో పుట్టిన వారికి ఉబ్బసం వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందని చెప్పారు. అయితే వీరు గర్భంలో ఉండగా వారి తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తమకు తెలియలేదని అందువల్ల తాము అమెరికాతోపాటు దక్షిణ కొరియా, తైవాన్లకు చెందిన రికార్డులను పరిశీలించామని, గర్భధారణ చివరి త్రైమాసికంలో సూర్యరశ్మి తక్కువగా లభిస్తే పుట్టబోయే పిల్లలకు మధుమేహం వచ్చే అవకాశమున్నట్లు తాము గుర్తించామని వివరించారు. న్యూయార్క్ నగరంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించిందని చెప్పారు. తొలి త్రైమాసికంలో కాలుష్యకారక ధూళికణాలు ఎక్కువగా పీలిస్తే పుట్టబోయే బిడ్డలకు గుండె సంబంధిత సమస్యలు రావచ్చునని నికొలస్ వివరించారు. ధూళి కణాల వల్ల రక్తపోటు ఎక్కువై దాని ప్రభావం పిండంపై పడటం దీనికి కారణమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. -
మధుమేహంలో మరోరకం
మధుమేహంలోని ప్రధానమైన రెండు రకాలు... టైప్–1 డయాబెటిస్, టైప్–2 డయాబెటిస్ అని అందరికీ తెలిసిన సంగతే. ఇవే కాకుండా డయాబెటిస్‌లో మరికొన్ని అరుదైన రకాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి పాంక్రియోటోజెనిక్ డయాబెటిస్. దీనిని టైప్–3సీ డయాబెటిస్ అని కూడా అంటారు. ఈ డయాబెటిస్‌ను కొంతమంది వైద్యులు టైప్–2 డయాబెటిస్‌గానే గుర్తిస్తున్నారని, దీనివల్ల టైప్– 3సీ డయాబెటిస్ రోగులకు తగిన చికిత్స లభించక వారు ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారని ఇంగ్లాండ్‌లోని సర్రీ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. పాంక్రియాస్ గ్రంథిలో వాపు, పాంక్రియాస్ కణజాలంలో అసాధారణమైన పెరుగుదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు టైప్–3సీ డయాబెటిస్ సోకుతుంది. దీని లక్షణాలు కూడా టైప్–2 డయాబెటిస్ మాదిరిగానే ఉంటాయని, రక్త పరీక్ష చేసినప్పుడు చక్కెర మోతాదు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు, పాంక్రియాస్ నుంచి ఉత్పత్తయ్యే ఇన్సులిన్‌కు శరీర కణజాలం స్పందిచనప్పుడు, స్థూలకాయం వంటి కారణాల వల్ల టైప్–2 డయాబెటిస్ తలెత్తుతుంది. టైప్–2 డయాబెటిస్లోను, టైప్–3సీ డయాబెటిస్లోను వ్యాధి లక్షణాలు దాదాపు ఒకేలా ఉన్నా, కారణాలు మాత్రం వేర్వేరు. అందువల్ల అసలు కారణాలను గుర్తించి తగిన చికిత్స చేయకుంటే టైప్–3సీ రోగులు ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటారని సర్రీ వర్సిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే టైప్ 3íసీ డయాబెటిస్ పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.