English medium schools
-
పేదల అక్షరంపై కక్ష
నిరుపేదల చదువుపై ఇంకా పెత్తందార్ల కక్ష తీరడం లేదు. జగన్ ప్రభుత్వంలో వారికి ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఏపీ విధానాలపై ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సైతం ఇక్కడి విద్యా విధానంలో తెచ్చిన సంస్కరణలను వేనోళ్ల పొగుడుతుంటే వీరికి గిట్టడం లేదు.ఉన్న పళంగా వారికి మాతృభాషపై ప్రేమ పుట్టుకొచ్చేసింది. దానిని జగన్ తొక్కేస్తున్నారంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదోలా జగన్‌ను ఇరుకున పెట్టాలని వారు లేనిపోని కుట్రలు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సైతం ఇక్కడి పచ్చనేతల స్క్రిప్టునే వల్లె వేస్తూ నిరుపేదల చదువుపై కుట్రకు పన్నాగం పన్నుతున్నారు. –సాక్షి, అమరావతి బడుగులు ఎదుగుతున్నారనే బాబు భయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తుండటంతో బడుగులు ప్రపంచ మానవులుగా ఎదుగుతుండటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగడం మానేసి ఇంగ్లిష్‌పై విషం నూరిపోశారు.చంద్రబాబు మొదట్నుంచి కులవాది, తన కుల ఆధిపత్యం కోరుకునే వ్యక్తి. అందుకే తన సామాజికవర్గం వారే ఇంగ్లిష్ చదువులతో విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పేద పిల్లలు మాత్రం ఇక్కడే అరకొర వేతనాలతో ఉండిపోవాలన్నది ఆయన దురుద్దేశం. విభజనాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లపాటు నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించి, వారి ఆర్థిక సహకారంతో రాజకీయం నడిపారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యా వ్యవస్థను కులతత్వ పూరితంగా మార్చేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇంగ్లిష్ చదువులను దూరం చేసే కుట్ర చేశారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించారు. ఇంగ్లిష్ మీడియంను ప్రోత్సహించారు. ఖరీదైన బైజూస్ కంటెంట్‌ను ఉచితంగా అందించారు. ట్యాబ్‌లు ఇచ్చారు. విశ్వవిజ్ఞానాన్ని అందుకునేలా పేద పిల్లలను తీర్చిదిద్దారు. దీనిపై పెత్తందార్లు కుయుక్తులు పన్నడం సరికాదు. ఇంగ్లిష్ మీడియం పెత్తందారులకే పరిమితమా? పేదలకు ఇంగ్లిష్ వస్తే ఎదుగుతారని భయమా..తెలుగు కోసం కాదు విద్యా వెలుగు అడ్డుకోవాలనే.. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా జగన్ అభివృద్ధి చేస్తున్నారు. డిజిటల్ విద్యా బోధన కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే క్రమంలో నిరుపేద విద్యార్థులు కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియం కూడా తీసుకువచ్చారు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇది ఇంకా పెరిగి దేశం మొత్తం అనుసరిస్తే విద్యా వ్యాపారానికి నూకలు చెల్లుతాయనే కేంద్రంలోని పెద్దల భయం. అయినా ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు ఏ భాషలో చదివారు? తెలుగు మీడియంలో చదువుకున్నవారిలో అత్యధికులు నిరుద్యోగులుగా, లేదా చిరుద్యోగులుగా ఎందుకు మిగిలారు? అమిత్ షా పిల్లలు ఎక్కడ చదివారు? మన రాష్ట్రంలో తెలుగు భాషకు కంకణం కట్టుకున్నామని చెబుతున్న భాజాపా నేత వెంకయ్యనాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు... వాళ్ల పిల్లలు, మనవళ్లను ఏ మీడియంలో చదివించారు? అదే చదువు బడుగు బలహీన వర్గాల వారికి వద్దని ఎలా చెబుతారు? అయినా ఇక్కడ తెలుగు భాషనేమీ తీసేయడం లేదు కదా. ఇంగ్లిష్ మీడియం అదనంగా తెచ్చారు. అందరూ విద్యావంతులైతే హెచ్చుతగ్గులుండవన్నది అంబేడ్కర్ మాట. అందుకు తగ్గట్టుగా ఏపీలో అడుగులు పడుతున్నాయి. ఇది చూసి తమ ఆధిపత్యం ఎక్కడపోతుందోనని కొందరు భయపడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. – జస్టిస్ ఈశ్వరయ్య అమిత్ షా ఇంట పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు అమిత్‌షా పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలి. డబ్బున్నవారంతా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. కూటమిలో ఉన్న నాయకుల మాట విని తెలుగు భాష గురించి అమిత్‌షా మాట్లాడటం బాధగా ఉంది. చంద్రబాబు కొడుకు ఎక్కడ చదివాడు? ఏం మీడియంలో చదివాడు? పేద ప్రజల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే తప్పేంటి? విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన నాయకుడు సీఎం జగన్. ఓటుకి ఇంగ్లిష్ మీడియానికి ముడిపెట్టడం సరికాదు. ఇంగ్లిష్ మీడియం తీసుకు రాను అని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? – యార్లగడ్డ వెంకటరమణ, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ అమిత్ షా,చంద్రబాబు పిల్లలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషకు మద్దతు సాకుతో జరుగుతున్న ప్రచారం వెనుక పేదల చదువులను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. మాతృభాషను చంపేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న అమిత్ షా, చంద్రబాబు, రామోజీరావు వంటి పెద్దల వారసులు, మనుమలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న వారి పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు చెందిన పేదోళ్లు మాత్రం మాతృభాషను బతికించాలనే నిబంధనతో ప్యూన్లు, క్లర్కులు, గుమాస్తాలు, కూలీలుగా మిగిలిపోవాలా? ఇదెక్కడి ఆటవిక న్యాయం. పేద పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదవకూడదా? పెత్తందార్లకు మాత్రమే ఇంగ్లిష్ చదువులు రాసిపెట్టారా? ఏ బిడ్డ అయినా పుట్టినప్పటి నుంచి మాతృభాషలోనే అక్షరాభ్యాసం చేస్తారు కదా. అలాంటి మాతృభాషను ఎవరో చంపేస్తే చచ్చిపోతుందా? చంద్రబాబు చెబితే మాత్రం అమిత్ షాకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద బిడ్డలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యమిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆయన కృషివల్లే ఈ రోజు మన పేద బిడ్డలు అమెరికాలోని శ్వేతసౌధం, ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి సత్తా చూపారు. ఇక్కడి తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్ మీడియంనే కోరుకుంటున్నారు. ఎన్నికల వేళ దీనిపై రాజకీయం తగదు. –ఆర్.కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడుబాబోస్తే ఇంగ్లిష్ మీడియం తీసేయడం తథ్యం భవిష్యత్తులో చంద్రబాబు తీసుకోబోయే చర్యలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మోదీ, అమిత్ షాల మాటను బాబు తూచా తప్పరు కాబట్టి.. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంగ్లిష్ మీడియం తీసేయడం తథ్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు మంచి స్కూళ్లు, మౌలిక సదుపాయాలు, భోజన వసతి, బైలింగ్వల్ బుక్స్ అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల రానున్న రోజుల్లో పెట్టుబడి దారుల పిల్లలకు పోటీపడే స్థాయిలో పేద వర్గాల పిల్లలు ఎదుగుతారు. ప్రాంతీయ భాషలోనే చదువు అంటున్న అమిత్ షా కొడుకు జయ్ షా పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని చిన్న వయసులోనే నేషనల్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అయ్యాడు.మరి తన కొడుకుని అమిత్ షా గుజరాతీలో ఎందుకు చదివించలేదు? అంబానీకి ధీరూబాయ్ అంబానీ పేరుతో ముంబయిలో పెద్ద ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉంది. అక్కడ గుజరాతీ, మరాఠీ సబ్జెక్టే లేదు. మరి వాటిని మరాఠీ లోకో, గుజరాతీ భాషలోకో అమిత్ షా ఎందుకు మార్పించలేదు? గుజరాత్‌లోనే అదానీ స్కూల్ ఉంది అది కూడా పూర్తిగా ఇంగ్లిష్ మీడియం స్కూల్. బిర్లా కూడా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు నడుపుతున్నారు.మరి వీటన్నింటినీ కేంద్రంలోని పెద్దలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్లంతా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చందాలు ఇస్తున్నారనా? గ్రామీణులు, వ్యవసాయదారుల పిల్లలు అంబానీ అదానీ పిల్లలతో సమానమైపోతారేమోననే భయంతోనే ఇంగ్లిష్ వద్దంటున్నారా? ఏ మీడియంలో చదివితే పిల్లలు బాగా రాణించగలరో అదే మీడియంలో చదివించాలి కదా. తాజాగా వచ్చిన పదోతరగతి ఫలితాల్లో కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు 91శాతం పాసైతే తెలుగు మీడియంలో చదువుకున్నవారు 81 శాతమే పాసయ్యారు.అంటే దీనర్థం ఏమిటి? ఇంగ్లిష్‌లో పిల్లలు మరింత సులభంగా చదువుకోగలుగుతున్నారనే కదా. ఇంగ్లిష్ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు రాకుండా ఎలా పోతుంది? పల్లెల్లో వ్యవసాయ కూలీలు, చెప్పులు కుట్టేవారు, కుండలు చేసుకునేవారికి ఇంగ్లిష్ చదువులు వస్తే తమ పిల్లలతో పోటీ పడతారని వీరి భయం. కూటమి అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థను కుక్కలు చింపిన విస్తరి చేద్దామని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం, ఆయన చేపట్టిన విద్యా సంస్కరణలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో నిరుపేదలు ఆదివాసీలు, దళితులు దేశం గుర్తించే విజయాలు సాధిస్తారు. –కంచ ఐలయ్య, విద్యావేత్త ఎన్డీఏ ప్రభుత్వంలోనే తెలుగు భాష నిర్వీర్యంరాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తెలుగు భాషను భ్రష్టు పట్టించారు. అయినా ధర్మవరం సభలో అమిత్‌షా తెలుగును పరిరక్షిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ‘క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు రాసిచ్చిన అబద్ధాలను అమిత్‌షా వల్లెవేయడం సిగ్గుచేటు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, తెలుగు భాష ప్రోత్సాహానికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా భాషా స్ఫూర్తిని నిర్వీర్యం చేశారు.ఐదేళ్లపాటు అధికారంలో ఉండి కనీసం భాషా సంఘాన్ని పెట్టలేని చంద్రబాబు తెలుగు భాషను పరిరక్షిస్తామని చెప్పడం హాస్యాస్పదం. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార భాషా సంఘాన్ని పూర్తిస్థాయిలో నియమించి తెలుగు వికాసానికి బాటలువేశారు. ఎన్నడూ లేనివిధంగా గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలను వారంరోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. వేమన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో వేమన పద్యాలను చదివించి ఉభయ భాషా ప్రావీణ్యాన్ని ప్రోత్సహించారు.అల్లూరి సీతారామరాజు శత జయంతి, జాషువా వంటి మహోన్నత కవుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తూ తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటారు. అందువల్లే ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే స్థాయికి తెలుగు విద్యార్థులు ఎదిగారు. తెలుగుభాషా పరిరక్షణ కంటే ముందుగా లోకేశ్‌కు మంచి తెలుగు నేర్పించాలి..’ అని విజయబాబు అన్నారు. –విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు -
పేద పిల్లలు.. పెద్ద చదువులు
పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు ఒక్కటే అని గట్టిగా నమ్మిన వ్యక్తిని. అందుకే రెండేళ్లలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. రెండేళ్లలో మొత్తంగా విద్యా రంగంలో 1,62,75,373 మందికి లబ్ధి కలిగిస్తూ రూ.26,677.82 కోట్లు ఖర్చు చేశాం. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు. అందుకే పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ సమూల మార్పు తీసుకువచ్చాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీ వల్లే మహిళలకు ప్రాధాన్యత జగనన్నా.. నేను బీటెక్ సెకండియర్ చదువుతున్నాను. నాకు ఒక అక్క ఉంది. నా బాగోగులు, మంచి చెడ్డలు చూసుకోవడానికి ఒక అన్నయ్య ఉంటే బావుండేది అనుకునే వాళ్లం. కానీ విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో నాలాంటి ఎంతో మంది చెల్లెళ్లు, తమ్ముళ్లకు మీరు ఒక అన్నగా భరోసా ఇస్తున్నారు. నిజంగా మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తున్నాం. గతంలో ఎక్కడికి వెళ్లినా మీ నాన్న పేరు.. ఆయన ఫోన్ నంబర్ అని అడిగేవారు. ఇప్పుడు మీ అమ్మ పేరు ఏంటని అడుగుతున్నారు. మీ వల్లే ఈరోజు మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. పథకం ఏదైనా సరే అమ్మల ఖాతాల్లో డబ్బు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. – రామ లాహిత్య, విద్యార్థిని, అనంతపురం సాక్షి, అమరావతి: పేద పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలన్నదే తన తపన, తాపత్రయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తూ.. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని తెలిపారు. మనసా, వాచా, కర్మణా సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ తోడుగా నిలుస్తున్నామని చెప్పారు. పెద్ద చదువులు చదివితేనే పెద్ద ఉద్యోగాలు వచ్చి ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయట పడతాయని, అప్పుడే వారి తల రాతలు మారతాయని అన్నారు. జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఈ ఏడాది రెండవ విడత దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను 9,88,437 మంది తల్లుల ఖాతాలకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు బాగా చదవాలని.. వాళ్లకు మన తరఫు నుంచి ఇవ్వదగ్గ ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే అని తాను చాలా గట్టిగా నమ్ముతానని చెప్పారు. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మనం చాలా వెనకబాటులో ఉన్నామన్నారు. రాష్ట్రంలో చదువురాని వారు 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం మంది ఉన్నారని, దేశంలో సగటున 27 శాతం మంది మాత్రమేనని తెలిపారు. ఈ లెక్కన దేశ సగటు కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల జమ కార్యక్రమంలో వివిధ జిల్లాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద చదువులతోనే పేదరికానికి చెక్ ► 18 – 23 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఇంటర్ పూర్తయ్యాక ఎంత మంది కాలేజీలకు వెళ్తున్నారని చూస్తే.. ఆశ్చర్యకరమైన నంబర్లు కనిపిస్తున్నాయి. మనం బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో పోల్చి చూసుకుంటాం. ఇవన్నీ ఒకే రకమైన ఎకానమీ ఉన్న దేశాలు. ► బ్రెజిల్లో 51.8 శాతం, రష్యాలో 83.4 శాతం, చైనాలో 54.7 శాతం పిల్లలు ఇంటర్ తర్వాత కాలేజీల్లో చేరుతున్నారు. మన దేశంలో కేవలం 27 శాతం మంది మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారు. అంటే దాదాపు 73 శాతం మంది పిల్లలు ఇంటర్ తర్వాత కాలేజీల్లో చేరడం లేదు. పిల్లలు పై చదువులు చదవకపోతే, పై స్థాయి ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ పోగొట్టలేం. తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు ► పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రావాలి. ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు. అప్పుడే వారి తల రాతలు మారుతాయి. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి.. పెద్ద జీతాలు వచ్చే అవకాశాలుంటాయి. ► ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి.. అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే.. జగన్ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేశాను. ► ఆ దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ప్రతి పేదవాడికి, ఓసీల్లో ఉన్న పేద పిల్లలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. వారి తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితిని మారుస్తున్నాం. హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు ఇస్తున్నాం. నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ► ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న పిల్లలకు పూర్తిగా నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెండో సంవత్సరం కూడా అడుగులు బాగా ముందుకు వేయగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా బకాయిలు లేకుండా, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ► వారు కాలేజీలకు వెళ్లి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది. దీనివల్ల దాదాపు 10.97 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఏడాది రెండో విడత కింద రూ.694 కోట్లు విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం.. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సంవత్సరంలోనే గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన దాదాపు రూ.1,800 కోట్లు తీర్చడమే కాకుండా, రూ.4,207.85 కోట్లు ఇచ్చాం. ఈ ఏడాది ఎలాంటి బకాయిలు లేకుండా ఏప్రిల్ నెలలో మొదటి విడత కింద రూ.671.45 కోట్లు ఇచ్చాం. నేడు (గురువారం) రెండో విడత కింద ఇస్తున్న సుమారు రూ.693.81 కోట్లతో కలిపి ఇప్పటి వరకు నేరుగా మ్తొతం రూ.5,573.11 కోట్లు చెల్లించాం. ఆ తల్లులకు అన్నగా, తమ్ముడిగా, పిల్లలకు మేనమామగా ఈ కార్యక్రమం చేస్తున్నా. ► విద్యా దీవెన కింద మొదటి విడత ఏప్రిల్‌లో, రెండో విడత ఇవాళ చెల్లించగా, మూడో విడత డిసెంబర్లో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తాం. తల్లుల చేతికే డబ్బు ఇచ్చి, వారే నేరుగా ఫీజులు చెల్లించేలా చేశాం. తద్వారా కాలేజీల్లో వసతులు బాగోలేకపోతే తల్లులు తలెత్తుకుని కాలేజీలను నిలదీసే పరిస్థితి కల్పించాం. వారు డబ్బులు కడుతున్నారు కాబట్టి ఆ హక్కు వారికొస్తుంది. ఏమైనా సమస్యలున్నా, సదుపాయాల లోపం ఉన్నా 1902 కు కాల్చేస్తే ప్రభుత్వం వాటి మీద దృష్టి పెడుతుంది. ► వసతి దీవెన మొదటి విడత ఏప్రిల్‌లో ఇచ్చాం. మళ్లీ డిసెంబర్లో రెండో విడత ఇస్తాం. వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వారికి రూ.20 వేలు వసతి, భోజనం కోసం ఇస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన.. రెండు కార్యక్రమాలతో పిల్లలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. అంగన్వాడీల నుంచే చదువుల విప్లవం ► అంగన్వాడీల్లో కూడా పీపీ1, పీపీ2 విధానాన్ని తీసుకొచ్చి అక్కడ కూడా చదువుల విప్లవం తీసుకురావాలని తాపత్రయ పడుతున్నాం. పిల్లలకు, గర్భవతులుగా ఉన్న తల్లులకు మంచి పౌష్టికాహారం అందించాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.1,800 కోట్లు పెట్టాం. ► ప్రతి అడుగులోనూ చదువుకు అత్యంత పెద్దపీట వేసే ప్రభుత్వం మనది. మన పిల్లలు బాగా చదవాలని అంగన్వాడీలను పీపీ1 గా మార్చి అక్కడ నుంచి ఇంగ్లిష్ మీడియంను తీసుకు వచ్చాం. సీబీఎస్ఈ అఫిలియేషన్‌ను తీసుకు వచ్చాం. పీపీ1 నుంచి డిగ్రీ వరకు అన్ని చదువులు ఇంగ్లిష్ మీడియంలో చదివించే గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టగలిగాం. ఈ కార్యక్రమాలన్నింటికీ దేవుడు దీవించాలని, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ ఘటనతో పరిస్థితి మార్చాలని నిర్ణయం నేను పాదయాత్ర సాగిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇప్పటికీ గుర్తుంది. దారిలో నేను వెళ్తున్నప్పుడు గోపాల్ అనే తండ్రి ఇంటి దగ్గర కొడుకు ఫొటోతో ఫ్లెక్సీ పెట్టాడు. నా వద్దకు వచ్చి ‘ఫీజు లక్ష రూపాయలు అయితే ప్రభుత్వం నుంచి అరకొరగా రీయింబర్స్మెంట్ వస్తోంది. అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ఫీజు కింద రూ.30 వేలు ఇస్తున్నారు.. మిగతా రూ.70 వేలు ఏటా అప్పు చేయాల్సి వస్తోంది. దీన్ని చూసి తట్టుకోలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆ తండ్రి నాకు చెప్పాడు. ఆ ఘటన నా మనసుని ఎంతగానో కలిచి వేసింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలన్న తపన, తాపత్రయంతోనే అడుగులు వేస్తున్నాం. అంబేడ్కర్ మార్గంలో ముందడుగు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆ తర్వాతి ప్రభుత్వాలు తూట్లు పొడిచాయి. మీరు వచ్చాక పూర్తి స్థాయిలో కులాలకు అతీతంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. పాత బకాయిలు కూడా విడుదల చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా తీరును ముందుకు తీసుకెళుతున్నారు. మీ కృషి వల్ల గ్రామీణ విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. మీకు ధన్యవాదాలు. – పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఇంగ్లిష్ మీడియంతో పేదల దశ మారుతుంది అన్నా.. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల నాలాంటి విద్యార్థులు ఎందరో మంచి చదువులు చదువుకుంటున్నారు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. నా చదువుకి అయ్యే ఖర్చు గురించి మా నాన్న శ్రమ పడకుండా మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా చదువుకుంటున్నాను. ఇప్పుడు బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంగ్లిష్ మీడియం వల్ల పేద విద్యార్థుల దశ, దిశ మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థులందరి తరఫున మీకు ధన్యవాదాలు. – తేజ ప్రకాష్, భీమవరం, పశ్చిమగోదావరి ఇది మేనమామ గిఫ్ట్ జగనన్నా.. నాకు ఇద్దరమ్మాయిలు. ఒంటరి పోరాటం చేస్తున్నాను. వారిని పెంచి పోషించి, చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. అవమానాలు ఎదుర్కొన్నాను. నా చిన్న కూతురు ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతోంది. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.35 వేలు వచ్చేవి. మిగిలిన డబ్బులకు చాలా ఇబ్బంది పడేదానిని. మీరు సీఎం అయ్యాక పూర్తి ఫీజు ఇస్తున్నారు. పైగా తల్లుల ఖాతాలో వేస్తున్నందుకు చాలా సంతోషం. మేం నేరుగా కాలేజీలకు వెళ్లి బాగోగులు తెలుసుకుంటున్నాం. దీనికితోడు వసతి దీవెన వల్ల మాపై భారం తగ్గింది. ఈ పథకాల వల్ల కలిగే లబ్ధిని పిల్లలు వారి మేనమామ గిఫ్ట్ ఇచ్చినట్లుగా సంతోషపడుతున్నారు. – పి.అంజనాదేవి, విద్యార్థిని తల్లి, గుంటూరు -
ఇంగ్లిష్ మీడియంకు కట్టుబడి ఉన్నాం
-
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెడితే తప్పేంటి?
-
మేధోమథనం
-
రూపురేఖలు మారుస్తాం
-
96.17% ఇంగ్లిష్‌కే ఆమోదం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఆమోదం తెలిపారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారానే తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లలు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలనే ఆకాంక్ష వ్యక్తమైంది. ఎంచుకునేందుకు మూడు ఆప్షన్లు.. న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 –5 తరగతి చదివే విద్యార్థులు 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం ఆప్షన్లను కోరిన సంగతి తెలిసిందే. వీరంతా రెండు నుంచి ఆరో తరగతి వరకు చదువులు కొనసాగించనున్నారు. ► ఏ మాధ్యమంలో బోధన కొనసాగించాలో సూచించేందుకు ప్రభుత్వం మూడు ఆప్షన్లను కల్పించింది. తెలుగు తప్పనిసరిగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన ఒకటి కాగా, తెలుగు మాధ్యమంలో బోధన రెండోది. ఇతర భాషల్లో బోధన మూడో ఆప్షన్‌గా ఇచ్చారు. ►1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 17,87,035 మంది ఉండగా 17,85,669 మంది తల్లిదండ్రులు తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ► మొదటి ఐచ్ఛికాన్ని టిక్ చేస్తూ 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియం కోరుకున్నవారు 3.05 శాతం మంది కాగా ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం ఉన్నారు. ఏప్రిల్ 29 వరకు అందిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మాధ్యమంలో బోధన సాగాలో మాధ్యమాల వారీగా పేరెంట్సు అందించిన ఆప్షన్లు ఇలా.. -
‘ఇంగ్లీష్ మీడియాన్ని బూచిగా చూపడం సరికాదు’
సాక్షి, విశాఖపట్నం: ఇంగ్లీష్ మీడియంపై కోర్టు కేసును కొట్టేసినంత మాత్రాన ప్రతిపక్షాలు జబ్బలు చరుచుకోవల్సిన అవసరం లేదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో బడుగు, బలహీన వర్గాలు తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగితే బతుకులు బాగుంటాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారని గుర్తు చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చేస్తాను.. అన్న మాటకు సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ మీడియంపై రెండు జీవోలు జారీ చేశామని చెప్పారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టును తప్పని సరి చేస్తూ ఒక జీవో, ఇంగ్లీష్ మీడియాన్ని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలన్నది మరో జీవో అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పక్షాలు ఆంగ్ల మధ్యమాన్ని బూచిగా చూపించి జబ్బలు చరుచుకుంటున్నారని ఇది సరైంది కాదని లక్ష్మీ ప్రసాద్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంపై సీఎం చిత్తశుద్ధితో ఉన్నారని వ్యాఖ్యానించారు. న్యాయ పోరాటం ద్వారా ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం తగిన ప్రణాళిక సిద్ధం చేస్తోందని లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. -
తల్లిదండ్రుల ఓటు ఇంగ్లిష్ మీడియానికే
పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని, ప్రపంచంతో పోటీపడాలని ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కొనేలా ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తల్లిదండ్రులందరూ మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు.. ఆ పై సంవత్సరాల్లో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమ లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు తమ స్కూళ్లలో పిల్లలకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యనందించాలని తీర్మానాలు చేసి పంపించాయి. విచిత్రం ఏమిటంటే ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగు తోంది. తెలుగు మాధ్యమం ఆప్షన్ వారి దరఖాస్తు ఫారాల్లో ఉండదు. తెలుగును పూర్తిగా విస్మరించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు సబ్జెక్టును ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాల ప్రకారం కాకుండా తమ వర్క్ పుస్తకా ల ద్వారా ప్రశ్నలు, జవాబులను బట్టీ పట్టిస్తున్నాయి. బడుగులకు ఇంగ్లిష్ మీడియం వద్దా? ► ప్రభుత్వ పాఠశాలల్లో దిగువ మధ్య తరగతి, పేద, బడుగు, బలహీన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారు. వారందరికీ ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించడానికి, నాణ్యమైన చదువు చెప్పించడానికి వైఎస్ జగన్ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని వేగంగా అడుగులు వేసింది. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ జీవోలు జారీ చేసింది. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో, సామాజిక బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకుందని బడుగు, బలహీన వర్గాల నుంచి విశేష స్పందన వచ్చింది. ► సమాజంలోని అన్ని వర్గాలు.. ఇంగ్లిష్ మీడియం పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా.. ‘మాతృ భాష పరిరక్షణ’ పేరుతో పలు రూపాల్లో అడ్డుతగలడం ప్రారంభించాయి. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని.. మాతృభాషకు ఇబ్బంది రానివ్వమని ప్రభుత్వం ఎంత చెప్పినా వారి చెవికెక్కలేదు. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదలు, ఆ పార్టీ నాయకులంతా వ్యతిరేకించారు. ఏదో రకంగా అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. న్యాయ స్థానాలను ఆశ్రయించి, ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకున్నారు. ఆహ్వానించిన టీచర్ల సంఘాలు ► రాష్ట్రంలోని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇంగ్లిష్ మీడియం బోధనకు సిద్ధం ► ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును మరింత పరిపుష్టం చేసేలా తప్పనిసరి చేస్తూ ఆ పాఠ్యపుస్తకాలను మరింత పటిష్టమైన రీతిలో రూపొందించింది. ► టీచర్లకు ఆంగ్ల మాధ్యమ నైపుణ్యం కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తే సెలవుల్లో సైతం సంతోషంగా హాజరయ్యారు. శిక్షణ లో నేర్చుకున్న అంశాల తర్వాత వారి లో మరింత ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరిగింది. ► ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో ప్రభుత్వ స్కూళ్లు మూతపడి ఉన్నప్పటికీ వారంతా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బోధ్ శిక్షా లోకమ్ యాప్ ద్వారా ఆంగ్ల మాధ్యమ బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో నిమగ్నమయ్యా రు. స్కూళ్లు తెరవగానే తమ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే ఆయా సబ్జెక్టులను బోధించేందుకు సిద్ధమవుతున్నారు. ► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో కలుపుకొని 3,05,856 మంది టీచర్లున్నారు. వారిలో దాదాపు 2 లక్షల మంది వరకు ప్రభుత్వ టీచర్లు.. టీచర్ ఎలిజిబులిటీ టెస్టు, ఆపై టీచర్ రిక్రూట్మెంటు టెస్టు (డిఎస్సీ)లో మెరిట్ సాధించి ఆయా పోస్టులు సాధించిన వారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు స్కూళ్లలో కంటే ప్రభుత్వ స్కూళ్లలోనే ఆంగ్ల మాధ్యమాన్ని విజయవంతం చేయగలుగుతామని టీచర్లంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆ మేరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► మరోవైపు తెలుగు మాధ్యమం పాఠశాలను కూడా మండలానికి ఒకటి ఏర్పాటు చేసి, విద్యార్థులు వచ్చి వెళ్లేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆంగ్ల విద్యతో పేద వర్గాలకు మేలు
-
సర్కారు బడి.. ఇంగ్లిష్ ‘స్టడీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటిగా ఇంగ్లిషు మీడియం వైపు మళ్లుతున్నాయి. ఏటా ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మీడియంలోకి మారుతున్నాయి. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా మీడియం మార్పునకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతోంది. జిల్లాల్లో ఇంగ్లిషు మీడియం ప్రారంభించేందుకు అనేక పాఠశాలలు సిద్ధంగా ఉన్నా సాంకేతిక సమస్యలు, ప్రభుత్వ అనుమతి వంటి కారణాలతో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) తీర్మానం చేసి పంపితే చాలు మీడియం మార్పునకు ఓకే చెప్పాలని నిర్ణయించింది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంలోకి మార్చుతామని తెలిపింది. మీడియం మార్పు ఫైలు ప్రభుత్వానికి రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లో డీఈవోల స్థాయిలోనే ఆమోదం తెలపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యా శాఖ సిద్ధం చేసింది. అవి ప్రభుత్వ ఆమోదం తర్వాత అమల్లోకి రానున్నాయి. దీంతో ఇక తెలుగు మీడి యం స్కూళ్లు ఇంగ్లిషు మీడియంలోకి మారడం మరింత సులభతరం కానుంది. ప్రభుత్వ స్కూళ్లలో.. రాష్ట్రంలో 40,597 పాఠశాలలున్నాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 26,754 ఉండగా, ప్రైవేటు స్కూళ్లు 10,549 ఉన్నాయి. మిగతావి ఎయిడెడ్, గురుకులాలు, కేంద్రీయ విద్యాలయాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల వరకు ఉన్నత పాఠశాలలుండగా, అందులో సగం స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం కొనసాగుతోంది. మరోవైపు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఇంగ్లిషు మీడియం కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని ఇప్పటికే చాలా స్కూళ్లను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియానికి మార్పు చేశారు. అందులో కొన్నింటికి మీడియం మార్పుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ప్రభుత్వం డీఈవోలకే అధికారం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మీడియం మార్పు సులభతరం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 37.82 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలోనే చదువుతుండగా, 57.46 శాతం మంది విద్యార్థులు తెలుగు మీడియం చదువుకుంటున్నారు. మరో 4.72 శాతం మంది విద్యార్థులు ఇతర మీడియంలలో చదువుకుంటున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో 96.94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలోనే చదువుకుంటుండగా, 2.06 శాతం మంది తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. మిగతా ఒక్క శాతం ఇతర మీడియం విద్యార్థులున్నారు. ఆసక్తి, సదుపాయాలు, తీర్మానమే కీలకం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లలో కొంతమందే ఇంగ్లిషు మీడియం చదువుకున్నా, అనేకమంది ఉపాధ్యాయ విద్యను ఇంగ్లిషు మీడియంలోనే పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లిషు మీడియంలో బోధన పెద్ద సమస్య కాబోదన్నది ఉపాధ్యాయుల వాదన. పైగా ఇంగ్లిషు మీడియం బోధించే టీచర్లకు ప్రభుత్వం కూడా శిక్షణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తమ పాఠశాలల్లో తాము ఇంగ్లిషు మీడియంలో బోధిస్తామని టీచర్లు ముందుకొస్తే, ఆయా పాఠశాలల్లో సరిపడా టీచర్లుంటే.. తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం కోరుకుంటే.. ఆ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఒక్క తీర్మానం చేసి పంపిస్తే చాలు.. ఆ పాఠశాలను ఇంగ్లిషు మీడియంలోకి మార్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అయితే అన్నింటికి ఒకేసారి కాకుండా ఒక్కో తరగతి వారీగా మార్పునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక మీడియం బదలాయింపు అధికారాన్ని డీఈవోలకు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడితే జిల్లా స్థాయిలోనే మీడియం మార్పు జరిగిపోనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో... తెలుగు మీడియం: 15,44,208 (57.46%) ఇంగ్లిష్ మీడియం:10,16,334 (37.82%) అన్ని మీడియాలు: 26,87,563 ప్రైవేటు పాఠశాలల్లో ... 64,315 (2.06%) 30,27,459 (96.94%) 31,22,927 -
తెలుగు భాషను పక్కన పెట్టలేదు
-
మార్పు కోసమే ఇంగ్లీష్ మీడియం
-
విద్యను వ్యాపారంగా మార్చారు
-
ఇంగ్లిష్ మీడియంపై రాజకీయం చేయడం సరికాదు
-
ఇంగ్లిష్ మీడియంపై రాద్ధాంతం వద్దు
-
చంద్రబాబు ప్రైవేట్ పాఠశాలకు ప్రాధాన్యత ఇచ్చారు
-
బహుజనుల చిరకాల స్వప్నం ఇంగ్లిష్
మెకాలే భారతదేశంలో ఇంగ్లిష్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టేంత వరకు దేశంలో అక్షరాస్యత రెండు, మూడు శాతాన్ని మించి లేదు. 1901 నాటికి ఈ అక్షరాస్యత ఐదుశాతం. బ్రాహ్మణ, హిందూరాజులు శూద్రులకు, అతి శూద్రులకు చదువులు లేకుండా చూడాలన్న నియమాన్ని తు.చ.తప్పకుండా పాటించారు. ఇలా ఈ దేశ బహుజనులకు చదువులు అందని మానిపండ్లే అయ్యాయి. భారతీయ బహుజనులు గులాంగిరి నుంచి విముక్తం కావాలంటే ఇంగ్లిష్ నేర్చుకోవాలని, విద్యావంతులు కావాలని పూర్తిస్థాయిలో పోరాటం చేసి జీవితాన్ని అంకితం చేసిన మొట్టమొదటి బహుజన తాత్వికుడు మహాత్మ జ్యోతిబాపూలే. బ్రిటిష్ వారి ప్రోత్సాహంతో కులాలకతీతంగా అందరికీ విద్యనందించాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫూలే స్ఫూర్తితో చదువుల్లో సారమెల్ల చదివాడు. ఆయన భారత రాజ్యాం గంలో పొందుపరిచిన రిజర్వేషన్లు, విద్యా హక్కుల వల్లనే ఈ దేశ బహుజనులు ఈ మాత్రంగానైనా చదువుకోగలిగారు. గత శతాబ్ది ‘80’ల వరకూ ప్రైవేట్ పాఠశాలలుండేవి కావు. ఒకటి, అరా క్రైస్తవ మిషనరీలో నడిపే ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలుండేవి. ఈ పాఠశాలల్లో ధనవంతులు, అగ్రవర్ణాల వారే ఎక్కువ మంది చదువుకునేవారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని బహుజనులు స్వల్పంగానైనా చైతన్యవంతులు కావడం అగ్రవర్ణాలకు నచ్చలేదు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. అందులో ఇంగ్లిష్ మీడియం చదువులు మాత్రమే ఉంటాయి. బహుజనులకు తరతరాలుగా చదువును నిరాకరించిన ఉన్నత కులాలవారే ఈ పాఠశాలలు, కళాశాలల్లో వందలు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు అనే మాటే వినబడకున్నా ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం వద్దనే వాళ్ళు, తెలుగు భాషోద్ధారకులమని చెప్పుకునే వాళ్ళు పెదవి కూడా కదపలేదు. ఇప్పుడేమో గ్రామీణ పేదలకు ఇంగ్లిష్ మాధ్యమమంటే నానాయాగీ చేస్తున్నారు? ఇదేం న్యాయం? క్రమక్రమంగా బహుజన పేదలకూ ఇంగ్లిష్ చదువులపై ఆసక్తి పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోవడం. ప్రైవేట్ ఉద్యోగాలు.. ఐటీ ప్రాధాన్యత పెరగడం. విదేశీ వలసలు పెరగడం అన్ని ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ ఇంగ్లిష్‌కి ప్రాధాన్యతనివ్వడం. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ పేద బహుజనులు కూడా మాకు ఇంగ్లిష్ మీడియమే కావాలంటున్నారు. గత ముప్పై నలభై ఏళ్లుగా తెలుగు జాతి బహుజనులు, అసలైన తెలుగు భాషా పరిరక్షకులు ఆంగ్లమాధ్యమం కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వరంగంలో ఆ చదువులు కావాలని కలగంటున్నారు. ఆ స్వప్నాన్ని నిజం చేస్తున్న ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విధానం బహుజనులకు ఆత్మస్థైర్యాన్నిస్తుంది. దాన్ని అడ్డుకోవటానికి మీరెవరు? విద్యాహక్కులో భాగంగా ఇంగ్లిష్ మాధ్యమ చదువులు కావాలని కోరుకుంటున్న బహుజనుల పిల్లలను ఫీజుల భారం మోయలేక నిరక్షరాస్యులుగా మిగలమంటారా? ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలను, కళాశాలను నడుపుతున్నది మీరే. మీ పిల్లలను, మనుమలను, మనుమరాండ్లను ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిస్తున్నది మీరే. ఇండ్లల్లోంచి తెలుగును తరిమివేసింది మీరే. విద్యను కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేసింది మీరే. మాతృభాషలను వేన వేల ఏళ్ళుగా కాపాడుతున్నది బహుజనులు, వాళ్ళే తమకిప్పుడీ ఆంగ్లమాధ్యమం కావాలని కోరుకుంటున్నారు. తమ విద్యాహక్కుగా కోరుతున్నారు. అడ్డుకుంటానికి మీరెవరు?బహుజనుల అంతరంగాన్ని అర్థం చేసుకొని, ఆధునిక పోకడలను అవగాహన చేసుకొని ఇంగ్లిష్ అవసరాన్ని గుర్తించి ‘బహుజనుల చిరకాల స్వప్నం ఆంగ్లమాధ్యమం’ను సాకారం చేస్తున్న యువనాయకుడు వై,ఎస్.జగన్మోహన్ రెడ్డిని అభినందిద్దాం. ఈ చర్యను విజయవంతం చేస్తే బహుజనులంతా ఆయనకు రుణపడి ఉంటారు. డా. కాలువమల్లయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత, మొబైల్ : 91829 18567 -
మీ పిల్లలే ఉన్నత విద్యలు చదవాలా..?
సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతల పిల్లు ఏ మీడియంలో చదువుకుంటున్నారని వేమూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కేవలం టీడీపీ నేతల పిల్లలే ఉన్నత విద్య చదవాలా.. పేద పిల్లలు ఉన్నత విద్య చదవకూడదా అని నిలదీశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసే చెత్త పలుకులు అందరికీ తెలుసని, రాధాకృష్ణకు చేతనైతే చంద్రబాబు దగ్గర చప్రాసి ఉద్యోగం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. బాబు ఎందుకు నోరు మెదపడం లేదు ఇంగ్లీష్ మీడియం చదివితే మత ప్రచారం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కుటుంబంపై మత రాజకీయాలు చేస్తే చంద్రబాబు మట్టి కొట్టుకుపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నలబై ఏళ్ల అనుభవం.. 40 ఏళ్ల వయస్సు ఉన్న సీఎం జగన్ చేతిలో పటాపంచలు అయ్యిందని ఎద్దేవా చేశారు. ఏపీకి చెందిన ఒక ముఖ్యుడికి రూ. 150 కోట్లు అందాయని జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. -
మీ పిల్లలు మాత్రమే ఇంగ్లిష్ చదవాలా? : ఆర్కేరోజా
సాక్షి, నగరి : చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పిల్లలు మాత్రమే కాన్వెంట్లో చదవాలా? పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమం చదవకూడదా అని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా ప్రశ్నించారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక పీసీఎన్ ఉన్నత పాఠశాలలో నాలుగు అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు భాషను చంపేస్తున్నారంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని, తెలుగు భాషపై అంతటి ప్రేమ ఉన్న వారు తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో ఎందుకు చదివించడం లేదని నిలదీశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ఎందుకు తొలగించలేదో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. భాష వేరు బోధన వేరు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తల్లిభాష ఎప్పటికీ మనతోనే ఉంటుందని, దానిని ఎవరూ మరవరని గుర్తు చేశారు. తెలుగు మాధ్యమంలో చదివే పిల్లలు పూర్తి స్థాయిలో ఆంగ్లం మాట్లాడలేక కెరీర్లో వెనుకబడుతున్నారని వివరించారు. అందుకే తల్లిదండ్రులు అప్పుచేసి తమ పిల్లలను ప్రైవే టు పాఠశాలలకు పంపుతున్నారని పేర్కొన్నా రు. ప్రతి ఒక్కరూ ఇంగ్లిషు చదివి ఉన్నత శిఖరాలు చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. మా వాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ చంద్రబాబులా ఆంగ్లం మాట్లాడి ఎవరూ పరువు తీయకూడదనే ఈ ప్రయత్నమన్నారు. విద్యార్థుల మీద ప్రేమతో, అభిమానంతో, ఆశతో నాడు–నేడు, అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం తదితర వినూత్న పథకాలతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయన్నారు. తన పిల్లల్లా అందరూ చదువుకోవాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, అందరూ ఆంగ్ల మాద్యమాన్ని చక్కగా చదివి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీదేవి, తహసీల్దార్ బాబు, ఎంపీడీవో రామచంద్ర, ప్రధానోపాధ్యాయులు సునీత, నమశ్శివాయం, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం..
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ సచివాలయం, మంగళగిరి, గుంటూరు అనే పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం తెలుగు ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడు. మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆ చదువులెందుకు అంటున్నాడు. వాళ్లు గ్రామాలు దాటి బయటకు రావద్దన్నది టీడీపీ దుర్మార్గ కోరిక. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే ఇక తెలుగు పేపర్లు ఎవరు కొని చదువుతారు అన్నది పచ్చ మీడియా ఆందోళన కాబోలు. బాబు అవినీతిని కప్పిపుచ్చి పాఠకుల మెదళ్లలోకి స్లో పాయిజన్ ఎక్కించే అవకాశం ఉండదని ఏడుపు. వీళ్ల కుటుంబాల్లోని పిల్లలు తెలుగు మాట్లాడటానికే ఇష్టపడరు.’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
వారి మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా ?
సాక్షి, అమరావతి : గ్రామీణ విద్యార్థుల ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థుల్లో 43 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. వీరిలో 33.23 శాతం ఎస్టీలు,49. 6 శాతం ఎస్సీలు, 62.5 శాతం బీసీ విద్యార్థులు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారని తెలిపారు. గతంలోనే పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నా గ్రామీణ స్థాయిలో మాత్రం అవి చెప్పుకునే విధంగా లేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నాడు-నేడు' పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేలా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ 'నాడు-నేడు' కార్యక్రమం విజయవంతం అయితే నారా లేడు అన్న పరిస్థితి వస్తుందన్న ఆందోళన టీడీపీ నేతల్లో నెలకొన్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యను భోదించేందుకు 98వేల మంది టీచర్లకు ఇఫ్లూ పనిచేస్తున్న నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ప్రకటించారు. పనిగట్టుకొని విమర్శలు గుప్పిస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ, చంద్రబాబు, రామోజీరావు మనవళ్లు తెలుగుమీడియం చదువుతున్నారా అంటూ ప్రశ్నించారు. మేము అమలు చేయబోతున్న ఇంగ్లీష్ మీడియం విధానంలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని మంత్రి స్పస్టం చేశారు. -
అడిగిన వెంటనే ఆంగ్ల మాధ్యమం
మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వ బడులను పరిరక్షించుకోవడానికి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంతో గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు గ్రామ పంచాయతీ, ఎస్ఎంసీ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయి. దీంతో అడిగిన వెంటనే ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. 2019–2020 విద్యా సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్న పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు అనేక పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇచ్చిన విద్యాశాఖ తాజాగా మరో తొమ్మిది పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇచ్చింది. జిల్లాలోని మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్, ఆర్మూర్ మండలంలోని మంథని, కోమన్‌పల్లి, సుర్బిర్యాల్, డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి, కమలాపూర్, నవీపేట్ మండలంలోని నాళేశ్వర్, రెంజల్ మండలంలోని దూపల్లి పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఆరు, ఏడు తరగతుల్లో ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో అనుమతి ఇవ్వగా వచ్చే ఏడు ఎనిమిదో తరగతికి ఆంగ్ల మాధ్యమాన్ని విస్తృత పరచనున్నారు. దశల వారీగా పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది. ఆంగ్ల మాధ్యమంపై ఉన్న మోజుతో ఎంతో మంది విద్యార్థులను వారి తల్లితండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి పాఠశాలలను మూసివేయడం లేదా రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను తగ్గించడానికి అవకాశం ఏర్పడింది. అయితే ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలంటే విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తేనే పాఠశాలల పరిరక్షణ జరుగుతుందనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీలు, గ్రామాభివృద్ధి కమిటీలు, ఎస్ఎంసీ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం అమలుకు మూడేళ్ల కిందనే విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలను స్వీకరించారు. అయితే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. చివరకు ఈ విద్యా సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యాశాఖ అనుమతులను ఇస్తోంది. కాగా కొత్తగా ఉపాధ్యాయుల పోస్టులను కోరడం, అదనపు గదులు, ఇతర సౌకర్యాలను అడగకుండా షరతు విధించి ఆంగ్ల మాధ్యమం అమలునకు అనుమతిని విద్యాశాఖ అధికారులు ఇస్తున్నారు. అనేక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ ఈ ఏడు అనుమతులను ఇవ్వడంతో వచ్చే ఏడాది కొత్తగా అనుమతులను కోరే పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదిఏమైనా ప్రభుత్వ బడులను పరిరక్షించడానికి ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ అధికారులు అడిగిన వెంటనే అనుమతులు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
కేజీబీవీల్లో 1,260 పోస్టులు
- 84 కొత్త ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో భర్తీకి చర్యలు - ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది - జూన్ 12లోగా నియామకాలు - 504 సీఆర్టీ పోస్టులు మహిళలకే సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) నియామకాలకు సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే జూన్ 12 నుంచి ప్రారంభించనున్న ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో మొదట 6, 7 తరగతులను మాత్రమే ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఒక్కో స్కూల్లో ఆరుగురు కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లు (సీఆర్టీ), 1 స్పెషల్ ఆఫీసర్, 1 పీఈటీ, 1 అకౌంటెంట్, ఇద్దరు వంట మనుషులు, 1 స్కావెంజర్, ఇద్దరు నైట్ వాచ్మన్లు, 1 అటెండర్ మొత్తంగా 15 మందిని ఒక్కో స్కూల్లో నియమించను న్నారు. సీఆర్టీలు, స్పెషల్ ఆఫీసర్ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారై ఉండాలి. సీఆర్టీలకు నెలకు రూ.15 వేలు, స్పెషల్ ఆఫీసర్‌కు రూ.20 వేలు, పీఈటీ, అకౌంటెం ట్‌కు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తారు. మొత్తం 504 సీఆర్టీ పోస్టులను మహిళల తోనే భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. జిల్లాల్లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. రాత పరీక్షలు, నియామకాలను పాఠశాలలు ప్రారంభించే రోజు(జూన్ 12) కంటే ముందే పూర్తి చేయాలని ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. నియామకాల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఇచ్చారు. సీఆర్టీ పోస్టుల్లో మహిళలనే నియమిస్తారు. స్థానిక జిల్లాకు చెందిన వారినే టీచర్లుగా నియమిస్తారు. 11 నెలల కాంట్రాక్టు లేదా పాఠశాలలకు చివరి దినం వరకు ఏది ముందు అయితే దాన్ని పరిగణనలోకి తీసుకొని కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపడతారు. నియమితులైన వారు షిఫ్ట్ పద్ధతిలో రాత్రి వేళల్లోనూ పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త కేజీబీవీల్లో మొదట 34 స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తారు. ఒక్కో దానికి రూ.2.7 కోట్లు వెచ్చిస్తారు. జూన్ 12న ప్రారంభించబోయే కేజీబీవీ మండలాలు ఆదిలాబాద్: ఆదిలాబాద్ (రూరల్), మవొల, ఇంద్రవెల్లి, గడిగూడ, మంచిర్యాల: బీమారం, నాన్పూర్, హజీపూర్, కన్నెపల్లి, నిర్మల్: నిర్మల్ (అర్బన్), సోన్, నర్సాపూర్, పెద్దూర్, దస్తూరాబాద్, కొమ్రంభీం: లింగాపూర్, పెంచికల్‌పేట, చింతల మానేపల్లి, రాజన్న (సిరిసిల్ల): తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి, నిజామాబాద్ : ముప్కాల్, ముగ్బాల్, ఇందల్వాయి, మదర్నా, రుద్రూర్, ఎర్రగట్ల, కామారెడ్డి: రాజంపేట, బీబీపేట, వరంగల్ (అర్బన్): ఐనవోలు, వేలేరు, జయశంకర్ భూపాల్పల్లి : టేకుమట్ల, పలిమెల, కన్నాయిగూడెం, జనగాం: తరిగొప్పుల, చిల్పూర్, మహబూబాబాద్: గంగారం, చిన్నగూడూరు, పెద్దవంగర, ఖమ్మం: రఘునాథపాలెం, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం, బూర్గంపాడు, అల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం, సిద్దిపేట: కొండపాక, కొమురవెల్లి, మర్కూక్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ (రూరల్), రాజాపూర్, మరికల్, వనపర్తి: అమరచింత, మదనాపూర్, రేవల్లి, చిన్నాంబావి, శ్రీరంగపూర్, నాగర్‌కర్నూల్: పెంట్లవెల్లి, పదిర, సిద్ధాపూర్, ఊరకొండ, చరకొండ, జోగుళాంబ గద్వాల: నాందిన్నె, రాజోలి, కృష్ణా, ఉండవెల్లి, నల్లగొండ: అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి, తిరుమల్గిరి(సాగర్), కొండమల్లెపల్లి, నెరేడుగొమ్ము, సూర్యాపేట: నాగారం, మద్దిరాల, పాలకీడు, చింతలపాలెం, యాదాద్రి: అడ్డగూడూరు, వికారాబాద్: కోట్‌పల్లి, రంగారెడ్డి: చౌదరిగూడెం, కడ్తాల్, పెద్దపల్లి: అంతర్గాం, పాలకుర్తి, రత్నాపూర్, కరీంనగర్: ఇల్లంతకుంట -
తగ్గుతున్న తెలుగు మీడియం స్కూళ్లు
► ఐదేళ్లలో 3,700 నుంచి 2 వేలకు తగ్గిన సంఖ్య ► అదే స్థాయిలో పెరిగిన ఆంగ్ల మాధ్యమ స్కూళ్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలకు క్రమంగా డిమాండ్ పడిపోతోంది. అదే సమయంలో ఆంగ్ల మీడియం స్కూళ్లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోనూ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కావాలంటూ తల్లిదండ్రుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ విద్యా సంవత్సరంలో సుమారు 500 వరకు ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను విద్యాశాఖ ప్రారంభించింది. వీటికితోడు ఆరో తరగతి నుంచి 182 మోడల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మీడియం బోధనను కొనసాగిస్తోంది. విద్యా హక్కు చట్టం పరిధిలోకి ప్రీ ప్రైమరీ విద్యను తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తే ప్రభుత్వ రంగంలోనూ భారీగా ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల సంఖ్య పెరగనుంది. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ తెలుగు మీడియం స్కూళ్ల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం 2011-12 విద్యా సంవత్సరం నుంచి 2015-16 విద్యా సంవత్సరం వరకు దాదాపు 2 వేల వరకు తెలుగు మీడియం స్కూళ్లు తగ్గిపోగా, ఇంగ్లిష్ మీడియంలో దాదాపుగా ఆ మేరకు పాఠశాలల సంఖ్య పెరిగింది. విద్యాశాఖ ప్రస్తుతం తెలుగు మీడియం స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చుకునేందుకు (కన్వర్షన్) అవకాశం కల్పించడంతో ప్రైవేటు రంగంలో ఆంగ్ల మాధ్యమం స్కూళ్ల సంఖ్య మరింత పెరగనుంది. మూడేళ్లుగా టెన్త్ పరీక్షల్లోనూ మారిన పరిస్థితి... గత మూడేళ్లుగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో తెలుగు మీడియంకటే ఇంగ్లిష్ మీడియంలో హాజరయ్యే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013-14లో తెలుగు మీడియం విద్యార్థులు 2,50,073 మంది పరీక్షలకు హాజరుకాగా, ఇంగ్లిష్ మీడియంలో 2,36,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 2014-15 విద్యా సంవత్సరంలో 2,44,448 మంది తెలుగు మీడియం విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఇంగ్లిష్ మీడియంలో 2,56,363 మంది పరీక్షలు రాశారు. 2015-16 విద్యా సంవత్సరంలో టెన్త్ రాసిన తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య 2,24,040కి తగ్గగా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసిన వారి సంఖ్య 2,82,682కి పెరిగింది. ఇదీ ప్రైవేటు పాఠశాలల పరిస్థితి సంవత్సరం తెలుగు ఇంగ్లిష్ మీడియం మీడియం 2011-12 3,728 8,142 2012-13 3,588 8,885 2013-14 3,100 9,872 2014-15 2,658 9,726 2015-16 2,000 9,882