Ganesh Chaturthi celebrations
-
అమెరికాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, 11 రోజుల పాటు..
అమెరికాలోని నార్త్ కరోలినాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హంటర్స్‌విల్లేలోని సాయిమందిర్‌లో గణపతి ప్రతిమను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పెద్ద ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు. మహిళల కోలాటాలు, భజనలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన మండపాల్లో గణనాథుడిని ప్రతిష్టించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. విఘ్నేశ్వరుడ్ని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్యపూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ ఉత్సవాలతో పాటు 5వ వార్షికోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం, బాబాకి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. -
అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు... సందడి చేసిన బాలీవుడ్ తారలు
Ambani Ganesh Chaturthi celebrations: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట గణేష్ చతుర్థి వేడుకలు జరిగాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు ముంబైలోని తమ నివాసం యాంటిలియాలో వైభవంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్ (Bollywood)లోని ప్రముఖ తారలు హాజరై సందడి చేశారు. (Richest Ganesh Idol In Mumbai: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!) బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుటుంబంతో సహా సంప్రదాయ దుస్తుల్లో హాజరై వేడుకకు వన్నె తెచ్చారు. ఆయనతోపాటు భార్య గౌరీ ఖాన్, పిల్లలు సుహానా ఖాన్, అబ్రామ్ ఉన్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా తెల్లటి కుర్తాలో హుందాగా కనిపించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan)తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి వేడుకకు వచ్చారు. రణవీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొణె (Deepika Padukone) దంపతులు సైతం సంప్రదాయ దుస్తులలో అబ్బురపరిచారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కలిసి రావడం కనిపించింది. అలియా భట్, ఓజీ ఫ్యాషన్‌స్టార్ రేఖ అందమైన చీరకట్టుతో ఆకట్టకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) అంబానీ ఇంట గణేశుడి ఆశీర్వాదం కోసం వచ్చిన ఇతర బాలీవుడ్ ప్రముఖుల్లో విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, అథియా శెట్టి, మనీష్ మల్హోత్రా, జూహీ చావ్లా తదితరులు ఉన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గణపతి నవరాత్రులు..ఇలా పూజిస్తే విజయమే కాదు ధనం కూడా
మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1) వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓమ్ గణానాం త్వా గణపతిగ్ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వానినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి. ఈనాడు చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది. శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘ పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘ అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆలయాలు బెంగళూరులోను, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో రత్నగిరి నగర్, పలకలూరి పంచాయతీలో లక్ష్మీగణపతి ఆలయం ఉన్నది. అక్కడి స్వామి ఎడమ వైపున ఒడిలో లక్ష్మీ అమ్మవారిని కూర్చుండపెట్టుకొని దశ భుజుడై దర్శనమిస్తాడు. అష్టలక్ష్ములకు సంకేతంగా ఎనిమిది చేతులతో ఎనిమిది విధాలైన ఆయుధాలను ధరించి ఒక చేతిలో అభయ ముద్రతో, మరొక చేతితో అమ్మవారిని ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యే వినాయకచవితి రోజున లక్ష్మీగణపతి స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం మనతో పాటు దేశ సౌభాగ్యాన్ని కూడా పొందుదాం. -
వినాయకుడి వివాహం ఎలా జరిగిందో తెలుసా?మనకు తెలియని కథ..
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం. -
Palavelli: వినాయక చవితి.. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే!
గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న సామగ్రితో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి సంబారాలే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు. పండగ సజావుగా సాగిపోయినట్లే ! గణానాతాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నూతి భిస్సీద సాధనమ్ గణపతి అంటే జ్ఞాన, మోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. ఆయనను స్తుతిస్తే సర్వవిఘ్నాలూ ఉపశమిస్తాయి. భక్త సులభుడు గణనాథుడు అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా. బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి, ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటీ, రకరకాల ఆకులు, పూవులతోటీ పూజించి, ఉండ్రాళ్లూ, పళ్లూ, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి, అపరాధ క్షమాపణగా ఐదు గుంజిళ్లు తీస్తేచాలు – మన కోర్కెలన్నింటినీ తీర్చే మహా దయామూర్తి. గణం అంటే సమూహం అని అర్థం. ఈ సృష్టి యావత్తూ గణాలమయం. అనేకమైన గణాలతో కూడిన మహాగణం. ఈ విశ్వం, మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం– మళ్లీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు– ఈ గణాలన్నింటిలో నూ అంతర్యామిగా వుంటూ, సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి. ఇంద్రుడు, భగీర థుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలయిన వారు గణపతిని ఆరాధించినట్లు ఐతిహ్యాలున్నాయి. దేవతలకే పూజనీయుడైన గణపతి మనందరికీ కూడా ఆరాధనీయుడు కాబట్టి ఆయన ఆవిర్భవించిన వినాయక చవితినాడు ఎవరి శక్తికి తగ్గట్టు వారు పూజించి ఆయన కృపాకటాక్షాలతో విఘ్నాలను తొలగించుకుని సకల సంపదలనూ పొందవలసిందిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే... పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వ్రేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే... గణపతి అంటే గణాలకు అధిపతి , తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అన్నమాట.. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు. పాలవెల్లి అంటే పాలపుంతే అని మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, మారేడు, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట. ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లిని అమర్చుతారు. – డి.వి.ఆర్. చదవండి: Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ.. పూర్తి పూజా విధానం -
Ganesh Chaturthi: వ్రతకల్పము.. పూజా ద్రవ్యములు, వరసిద్ధి వినాయక పూజ
శ్రీ రామ.. ఓమ్ మహాగణాధిపతయే నమః.. ఓమ్ వినాయకాయ నమః.. వినాయకచవితి ఇది మనందరి పండుగ.. పండుగ వస్తున్నదంటే పిల్లలకు కూడా ఎంతో సంబరంగా ఉంటుంది. పండుగరోజు ఇల్లు, పరిసరాలు శుభ్రం చేసుకోవటం, ద్వారానికి మామిడి తోరణాలు కట్టడం, పిండి వంటలు, నైవేద్యాలు చేసుకొని, కొత్తబట్టలు ధరించి భగవంతుణ్ణి ఆరాధించటం ముఖ్యంగా చేసేపనులు. ముఖ్యంగా వినాయకచవితి పండుగరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పత్రి తెచ్చే కార్యక్రమం పిల్లలకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. లోకంలో భాద్రపదమాసం శూన్య మాసమని ఈ నెలలో ఏ శుభకార్యక్రమాలు, వివాహలు, ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు చెయ్యకూడదని చాలామంది అభిప్రాయం. భద్రములకు (శుభములకు) స్థానమైన మాసం భాద్రపద మాసం. భాద్రపదశుద్ధ చవితి రోజున వినాయకుడు ఆవిర్భ వించి చవితి తిథిలో ఉన్న దోషాన్ని, భాద్రపద మాసానికున్న శూన్యతని తొలగించాడు. శ్రావణ మాసంతో వచ్చే వరలక్ష్మీ వ్రతం కేవలం ముల్తైదువులకు మాత్రం పరిమితమైతే శ్రావణ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమగా ద్విజుల వరకే పరిమితమైంది. వినాయకచవితికి అలాంటి నియమాలు లేవు. ఈ పండుగని కేవలం బ్రాహ్మణులే చెయ్యాలన్న విషయం ప్రత్యేకంగా కనిపించదు. అందరూ చేసుకోవచ్చు. స్త్రీలు పురుషులు అనే భేదం లేదు. చిన్న, పెద్ద తేడా లేదు. పసిపిల్లల నుండి పండు ముసలి వారి వరకూ అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ వినాయక చవితి. విశేషమైన నాయకుడు వినాయకుడు. ఆయన సకల దేవగణానికి అధిపతి ! సకల విఘ్నాలకు అధినాయకుడు ! మన సకల కార్యాలను నెరవేర్చగల వరసిద్ధిప్రదాత. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ‘ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ ‘ అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే ‘‘ అని విద్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో, దేవాలయాల్లో అంతటా వినాయక ప్రార్థనతోనే నిత్యకార్యక్రమాలు కూడా ప్రారంభమౌతాయి. వినాయక చవితి రోజున స్వామిని ఒక ప్రత్యేక రూపంతో ఆరాధిస్తారు. ఇతర రోజులలో పసుపుతో వినాయకుని చేసి పూజిస్తారు. సంపన్నులే కాక సామాన్యులు కూడా భక్తితో చేసుకొనే విశేషమైన పండుగ మన వినాయకచవితి. సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా మొదలుపెట్టిన పనులు విజయవంతం కావాలని సకల విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని కుటుంబ సమేతంగా పూజిస్తుంటాం. గణపతి పృథ్వీతత్త్వానికి సంకేతం. అందువల్ల బంగారం, వెండి, రాగి ప్రతిమలతో పూజ చేసినా మట్టి వినాయకునికి పూజ చేస్తేనే స్వామికి సంతృప్తి కలుగుతుంది. వినాయకుడు మూలాధారచక్రంలో ఉంటాడు. మూలా ధారచక్రం ప్రాణశక్తి కేంద్రం. అందువలన ఈ స్వామిని ఆరాధిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పత్రిపూజకి ఉపయోగించే 21 రకాల ఆకులు ఓషధీ విలువలు కలిగినవే కాబట్టి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. వర్ష ఋతువులో వచ్చే అనేక వ్యాధుల నుండి రక్షించే వ్రతం వినాయక వ్రతం. ఈ వ్రతాన్ని వినాయక చవితి రోజున ఆచరించాలి. ఈ కాలంలో ఆరోగ్యం అందరికీ అవసరమే. కాబట్టి మహాభాగ్యమైన ఆరోగ్యం పొందటానికి అందరం తప్పకుండా వినాయకుణ్ణి పూజించ వలసిందే. అటు సంప్రదాయంతో పాటు ఇటు సైన్సుని కూడా చాటుతున్నందు వలన వినాయక చవితి మనందరి పండుగ అయింది. పూజా ద్రవ్యములు శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతోపాటు, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం. వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునెయ్యి లేదా నువ్వులనూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశం, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు. పూజావస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠం. నైవేద్యం: ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి. పూజాపత్రి: గరిక, మాచిపత్రి, బలురక్కసి లేక ములక, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి. పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము. పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు తమ ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఏ వృత్తి వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతో పాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం. గణేశుని పూజ పూజకు ఏర్పాట్లు ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపు కుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.) శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘ పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి) అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా! యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘ శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః శ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిః విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ ఆచమనం ఓం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః (రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను) శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే! (ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.) ప్రాణాయామము ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘ సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా – గోదావరి మధ్యప్రదేశే స్వగృహే (సొంత ఇల్లుకాని వారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, సౌమ్యవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ................ (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడ శోపచార పూజాం కరిష్యే‘‘ (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను) తదంగ కలశపూజాం కరిష్యేః (మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను) కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించి కలశంపై కుడిచేతిని ఉంచి, కింది శ్లోకం చెప్పుకొనవలెను) శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా! ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి! నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ‘‘ అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానాంచ సంప్రోక్ష్యః (పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని కింది విధంగా పూజించాలి) శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పత ఆనసృణ్వన్నూతిభిస్సీదసాధనం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను) పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను) స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి) గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను) కుంకుమం సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను) పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను) పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను) ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను) ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను) దీపం దర్శయామి (దీపమును చూపవలెను) నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి) ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడిచేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ కింది మంత్రాలు చెప్పుకోవలెను). ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) హస్తప్రోక్షయామి, పాదవ్ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి) తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను) ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి) శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘ అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘ శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ çఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.) శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి) వరసిద్ధి వినాయక పూజ ఆరంభం స్వామిన్, సర్వజగన్నాధ యావత్పూజావసానగా ః తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు ధ్యానం : స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘ విఘ్నాంధ కారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘ పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘ చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణ ప్రతిష్ట (స్వామి వారికి ప్రాణం పోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః ‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వ యతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ ఆవాహనమ్ : స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ ఆసనమ్ : స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి). మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘ పాద్యమ్ : స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి). శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘ అర్ఘ్యమ్ : స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ ఆచమనీయమ్ : స్వామి వారి నోటికి నీళ్ళు అందించ డం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘ మధుపర్కం : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనాథం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ కింద చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి) పాలు : ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృషిణ యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘ పెరుగు : ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘ నేయి : ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘ తేనె : ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షీరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘ పంచదార : ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించినట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను బట్టతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్: (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘ యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘ గంధమ్ : (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి. అక్షతలు : (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘ సింధూరం : శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘ మాల్యం : శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు). సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘ అథాంగ పూజా : (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట) గణేశాయ నమః పాదౌ పూజయామి‘ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘ విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘ కామారిసూనవే నమః జంఘే పూజయామి‘ అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘ హేరంబాయ నమః కటిం పూజయామి‘ లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘ గణనాథాయ నమః హృదయం పూజయామి‘ స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘ పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘ గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘ విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘ శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి) ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు) ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక) ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు) ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు) ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు) ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు) ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి) ఓం గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి) ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు) ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు) ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం) ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ) ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు) ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం) ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు) ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు) ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం) ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు) ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు) ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్దె) ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు) ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకాల ఆకులను కలిపి వేసి నమస్కారం చేయవలెను) ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ (రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి) గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి! కంపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి! బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి! మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురశ్రేష్టాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కపిత్తఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి! స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామి ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి) ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు) ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక) ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు) ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు) ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు) ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు) ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి) ఓం గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి) ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు) ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు) ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం) ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ) ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు) ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం) ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు) ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు) ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం) ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు) ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు) ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్దె) ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు) ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకాల ఆకులను కలిపి వేసి నమస్కారం చేయవలెను) ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ (రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి) గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి! కంపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి! బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి! మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురశ్రేష్టాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కపిత్తఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి! స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మహోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమధాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాటత్పయే నమః ఓం శ్రీపతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమార గురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థ పనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయనే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వక్‌దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. బిల్వం : శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి. ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు). దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి. దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘ నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి) ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘ (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి) ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదైగః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి) ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘ (అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘ హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘ శ్రీ గణేష ప్రార్థన తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్‘ తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా! తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్ శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెలన్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముం బంచనీ రానంబున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోకరక్షామణి బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగనూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభి వృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాస్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి) మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి) గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రా విఘ్ననాశన‘ వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ ఏకదంతైక వదన తథా మూషికవాహన‘ కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘ తన్నోదంతిః ప్రచోదయాత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు) ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘ పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘ అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘ తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ప్రార్థన (పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి) నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘ సాష్టాంగ నమస్కారమ్ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు. (నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము. అపరాధ ప్రార్థన : అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా‘ పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి). (ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి) అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. తర్వాత విఘ్నేశుని కథా ప్రారంభం.. ఇక్కడ క్లిక్ చేయండి -
మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం… (ఫొటోలు)
-
చవితి వేడుకలకు ముస్తాబవుతున్న గణనాథుడు (ఫొటోలు)
-
సింగపూర్ లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
సింగపూర్‌లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 'సింగపూర్ తెలుగు సమాజం' ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న శివన్ దేవాలయంలో భక్తులు వినాకయ చవితి పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు.కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లో జరిగి ఈ పూజా కార్యక్రమంలో 100 మందికి భక్తులు బాల గణపతి పూజ చేశారు. వినాయక పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా చందనంతో చేయించబడిన బాలగణపతి ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు కోటిరెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాల్ని అందించినట్లు చెప్పారు. కోవిడ్ -19 కారణంగా ఆన్లైన్లో నిర్వహించిన పూజా కార్యక్రమాన్ని సుమారు 400 మంది తెలుగు కుటుంబాలు వీక్షించయాని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉత్తమ అలంకరణ పోటీలలో సుమారు 50 మంది బాలబాలికలు భక్తుల్ని ఆకట్టుకున్నారు. షర్విన్, అర్జున్, ప్రాచి, యువన్, నిత్య'లు బహుమతుల్ని అందించారు. అనంతరం కార్యవర్గసభ్యులకు , దాతలకు , పూజాకార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేసారు. -
గణేష్ చతుర్థి వేడుకలపై యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు
-
కర్ణాటక: వినాయక చవితి వేడుకలకు ఓకే.. కండిషన్స్ అప్లై
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో బహిరంగ స్థలాల్లో గణేశ్ చతుర్ధి ఉత్సవాలపై ఉత్కంఠ వీడిపోయింది. గరిష్టంగా అయిదు రోజులపాటు మండపాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పలు షరతులతో సమ్మతించింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలనపై పూర్తిగా నిషేధం విధించింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అధ్యక్షతన ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ చవితి పండుగ ఆచరణ గురించి వెల్లడించారు. చదవండి: గణేష్ మండపాల ఏర్పాటులో ఈ జాగ్రత్తలు పాటించండి గణేశ్ ఉత్సవాలకు షరతులు ► కరోనా నియమాలతో సార్వజనిక గణనాథుల విగ్రహాల ప్రతిష్టాపనకు జిల్లా యంత్రాంగం అనుమతి తప్పనిసరి. తాలూకా, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అధికారుల అనుమతి ఉండాలి ►నగర ప్రాంతాల్లో వార్డుకు ఒకచోట మాత్రమే విగ్రహం ఏర్పాటు చేయాలి ►గణేశ ఉత్సవ సంఘాలవారు కోవిడ్ టీకా వేసుకోవాలి ►గణనాథుల మండపాల వద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ అభియాన్ నిర్వహించాలి ►మండపాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు, డీజేలకు అనుమతిలేదు ►నిమజ్జన సమయంలో వాయిద్యాలు, ఊరేగింపులకు నో ►సరిహద్దు జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉన్నచోటే అనుమతిస్తారు. ►నగరాల్లో అపార్టుమెంట్లలో విగ్రహాలను ప్రతిష్టించవచ్చు. 20 మంది కంటే ఎక్కువ మంది గుంపుగా చేరరాదు. ►రాత్రి 9 గంటల తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి లేదు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి -
షారుక్ ఫొటోపై నెటిజన్ల ట్రోలింగ్
ముంబై: ‘‘ప్రార్థనలు, నిమజ్జనం పూర్తయ్యాయి. గణేశ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు కురిపించాలి. సంతోషాన్నివ్వాలి. గణపతి బప్పా మోరియా’’అంటూ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సోమవారం అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. నుదుటిన కుంకుమ ధరించి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఇప్పటికే సుమారు పద్నాలుగున్నర లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎప్పటిలాగే కొంతమంది నెటిజన్లు కింగ్ ఖాన్‌పై ట్రోలింగ్‌కు దిగడం మొదలుపెట్టారు. (రామ మందిరానికి షారుక్ రూ.5 కోట్ల విరాళం?) ‘‘సర్ మీరు ఇన్నాళ్లు ముస్లిం అనుకున్నానే. తప్పుగా భావించినందుకు క్షమించండి. మీరు ఏ వర్గానికి చెందిన వారో కాస్త క్లారిటీ ఇవ్వండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘అది నిజంగా కుంకుమ బొట్టేనా? లేదా పెయింట్ ఆ? దేవుడితో ఆటలాడితే శాపం పెడతాడు’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక షారుక్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘ప్రతీ ఏడాది వినాయక చవితిలాగే ఈసారి కూడా మమ్మల్ని సర్ప్రైజ్ చేశావు. ఎంతైనా నీకెవరూ సాటి రారు. మనసున్న మంచి వ్యక్తివి నువ్వు’’అంటూ అభిమానం చాటుకుంటున్నారు. (జియో సిమ్ యాడ్: షారుఖ్ స్థానంలో అక్షయ్?!) కాగా గతంలో తన చిన్న కుమారుడు అబ్రాం గణనాథునికి దండం పెట్టుకున్న ఫొటోను షేర్ చేసిన షారుఖ్ ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. కులమతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ- షారుక్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రాం ఉన్న విషయం విదితమే. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ సెలబ్రిటీలు శ్రద్ధా కపూర్, శిల్పాశెట్టి ఆదివారమే తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేసి లంబోదరుడికి వీడ్కోలు పలికారు. View this post on Instagram Prayers and visarjan done... This #GaneshChaturthi, may Lord Ganesha bestow upon you and your loved ones, blessings and happiness... Ganpati Bappa Morya! A post shared by Shah Rukh Khan (@iamsrk) on Aug 23, 2020 at 9:09am PDT -
స్వయంభూ గణేష్: వచ్చే ఏడాదైనా ప్లాన్ చేసుకోండి!
విద్యకు , విజ్ఞానానికి , వినయానికి అధిపతి వినాయకుడు. ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజలు అందుకునేది విఘ్నాలను తొలగించే ఆ బొజ్జ గణపయ్యే. అలాంటి ఆది దేవుడు ‘విఘ్నేశాధిపత్యం’ దక్కించుకున్న భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకొంటాం. చిన్నా, పెద్దా భక్తులందరికీ ఎంతో ఇష్టమైన లంబోదరుడి పండుగ అంటే సంబరాలు మామూలుగా ఉండవు. వాడవాడలా గణనాథులను కొలువుదీర్చి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగే గణేషుని ఉత్సవాలు ముంబైలో మరింత అట్టహాసంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మహమ్మారి కరోనా కారణంగా మునుపటిలా వేడుకలు నిర్వహించే వెసలుబాటు లేకుండా పోయినా.. ఉన్నంతలోనే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ గణపతిని పూజించేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కొలువుదీరిన తాత్కాలిక మంటపాలలో లంబోదరుడి ప్రతిష్టాపన మొదలైంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి రోజుకే పరిమితం గాకుండా మహారాష్ట్రలో ఏడాదంతా పూజలు అందుకునే స్వయంభూ విఘ్నేశ్వరాలయాల(అష్ట వినాయకయాత్ర) గురించి కొన్ని వివరాలు.. 1. శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న సిద్ధాటెక్ పట్టణంలో ఉంది. గజాననుడు ఇక్కడ శ్రీ సిద్ధి వినాయకగా కొలువుదీరాడు. సాధారణంగా అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. అయితే సిద్ధాటెక్లో గల ఈ దేవాలయంలో మాత్రం లంబోదరుడి తొండం కుడివైపునకు తిరిగి కనపడుతుంది. దీనితో పాటు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. గుడి చుట్టూ పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది. 2. శ్రీ మయూరేశ్వర్ మందిర్/శ్రీ మోరేశ్వర్ టెంపుల్ పుణె జిల్లాలోని మోర్గావ్లో ఉంది ఈ ఆలయం. పుణె నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నదీ తీరంలో కొలువుదీరిన అష్టవినాయక యాత్ర టూర్లో ఇది మొదటిది అని చెప్పవచ్చు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది. 3. బల్లాలేశ్వర దేవాలయం రాయ్‌గఢ్‌లో జిల్లాలోని పాలి గ్రామంలో కలదు. రోహా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరస్‌గడ్ కోట, అంబా నదికి మధ్య కొలువుదీరిన ఈ ఆలయంలో గణనాథుడు రాతి సింహానం మీద ఆసీనుడైన బల్లాలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. గజాననుడి అపర భక్తుడైన బల్లాల్ పేరు మీదుగా దీనికి బల్లాలేశ్వర ఆలయం అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పాలిలో సంపన్నుడైన వ్యాపారవేత్త కళ్యాణ్, తన భార్య ఇందుమతి, కొడుకు బల్లాల్‌తో కలిసి నివసించేవాడు. ఆ ఊరిలో పిల్లలంతా రాళ్లను దేవతా మూర్తులుగా భావిస్తూ పూజలు చేస్తూ ఆటలాడుకునేవారు. అలా ఓ రోజు గ్రామ శివారులో ఓ పెద్ద రాయిని చూసిన బల్లాల్.. దానిని గణేషుడిగా పేర్కొంటూ పూజలు చేయడం ప్రారంభించాడు. ఆకలిదప్పులు మరచి పిల్లలంతా గణనాథుని స్మరణలో మునిగిపోయి రేయింబవళ్లు అక్కడే ఉండిపోయారు. దీంతో పిల్లల జాడ తెలియక కంగారుపడిన పెద్దలంతా అకకడి చేరుకుని, దీనికంతటికి బల్లాల్ కారణమంటూ తిట్టిపోస్తూ తండ్రి కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన కళ్యాణ్ కొడుకు లాక్కొచ్చి చెట్టుకట్టేసి విపరీతంగా కొట్టాడు. అంతేగాక గణేషుడిగా పూజలు అందుకున్న రాయిని పగులగొట్టాడు. నిన్ను కాపాడటానికి ఎవరూ రారు అంటూ దేవుడిని తిడుతూ బల్లాల్ను అక్కడే వదిలి వెళ్లిపోతాడు. తన ఇష్టదైవాన్ని దూషించడంతో తండ్రిపై కోపగించుకున్న బల్లాల్ అతడి కళ్లు పోవాలని శపిస్తాడు. ఆ తర్వాత ఒక్కడే ఒంటరిగా అక్కడ ఉండిపోయి లంబోదరుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. బల్లాల్ బాధను చూడలేక సాధువు రూపంలో వచ్చిన గజాననుడు అతడి గాయాలన్నింటి మాన్పి, ఏం కావాలో కోరుకోమని అభయమిస్తాడు. ఇందుకు ఆ బాలుడు.. ‘‘నువ్వు ఇక్కడే కొలువుదీరి.. శరణుజొచ్చిన వారిని కాపాడు తండ్రి’’అని కోరతాడు. బల్లాల్ కోరికను మన్నించిన పార్వతీ పుత్రుడు అతడిని ఆలింగనం చేసుకుని, నా పేరు ముందు నీ పేరును జోడించి బల్లాలేశ్వరుడిగా కొలువుదీరతాను అని చెబుతాడు. లంబోదరుడు నిజంగా దేవుడు ఉంటే నిన్ను రక్షిస్తాడని అనికలిసి ఈ దేవాలయాన్ని మోరేశ్వర్ విఠల్ సింద్కర్ 1640లో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 4. గిరిజాత్మజ దేవాలయం పుణె జిల్లాలోని లెన్యాద్రి(గణేష్ పహర్ లేదా సులేమాన్ గుహలు)లో ఉంది. హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీ దేవి పుత్రుడైన(గిరిజ ఆత్మ నుంచి వచ్చినవాడు) వినాయకుడిని కేవ్ నంబర్ 7 వద్ద దర్శించుకోవచ్చు. ఇందుకోసం సుమారు 300 మెట్లు ఎక్కాలి. కాస్త కష్టంతో కూడుకున్నదైనా పైకి వెళ్లినట్లయితే లంబోదరుడితో పాటు కొండ చుట్టుపక్కల గల ప్రకృతి అందాలన వీక్షించవచ్చు. 5. చింతామణి దేవాలయం చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. పుణెకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి(ఆభరణం) రూపం కలిగి ఉంటాడు. అష్టవినాయక ఆలయాల్లో ఇది పెద్దది. 6. విఘ్నేశ్వర దేవాలయం పుణెకు 85 కిలోమీటర్ల దూరంలో గల ఓజార్ వద్ద కూకడి నది తీరాన గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరాన్ని బంగారంతో తయారు చేశారు. ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగావ్ మరియు జున్నార్ ల నుండి ఇది 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలో వెళ్లవచ్చు. 7. మహాగణపతి దేవాలయం పుణె జిల్లాలోని రాజన్గావ్లో కలదు. మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు. 8. వరదావినాయక దేవాలయం మహాడ్ గ్రామంలో వరదా వినాయక దేవాలయం కలదు. పరిసరాల్లో గల ఒక సరస్సు ఒడ్డున లభించిన విగ్రహాన్ని దేవాలయం లోపల ప్రతిష్టించారు. 1725లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పీష్వా పాలకులు దీనిని పునరుద్ధరించారు. 1892 నుంచి ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. స్వయంభూ వినాయకుడితో పాటు మూషిక, నవగ్రహ దేవతలు, శివలింగం కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్ఠాదశ శక్తి పీఠాల వలె అష్ఠ గణపతులు కూడా పురాతనమైనవి. గణేష, ముద్గాల పురాణాలలో వీటి ప్రస్తావన ఉంది. ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే క్షేత్రాలుగా భాసిల్లుతున్న ఈ ఆలయాలను కరోనా అంతమైన తర్వాత హాయిగా కుటుంబంతో కలిసి దర్శించి తరించండి. -
వినాయకుడిని పూజిద్దాం ఇలా..
సాక్షి, ఉట్నూర్: భారతీయతలో ప్రకృతి ఆరాధన దాగి ఉంది. హిందూ దేవతారాధన, పండుగలకు ప్రపంచంలోనే ఎంతో విశిష్టత ఉంది. చెట్టు, పుట్ట, రాయి, రప్పా, నీరు, నిప్పు, భూమి, గాలి, ఆకాశం ఇలా దేనిని పూజించిన వాటి వెనుక ఉన్న పరమార్థం ప్రకృతిని ఆ రాధించడమే. ప్రతీ పూజ, ఆధ్యాత్మిక కార్యక్రమం వెనుక శాస్త్ర విజ్ఞానం (సైన్సు) దాగుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వినాయకచవితి పూజలోనూ అలాంటి అంశాలే ఉన్నాయి. వినాయక చవితి రోజున వినాయకుడిని ఏకవింశతి (21) పత్రాలతో పూజించడం సంప్రదాయం. ప్రకృతి వనరులను మానవ ఆరోగ్యానికి ఉపయోగించుకోవడంతో పాటు వాటిని దైవ సమానంగా చూసుకోవాలని ప్రతీ పూజ తెలియజేస్తోంది. గణపతికి సమర్పించే 21 రకాల పత్రి.. వాటి విశిష్టత.. పూజ సందర్భంలో పఠించాల్సిన మంత్రాల గురించి ఓ సారి పరిశీలిద్దాం. ఓం సముఖాయ నమః మాచీపత్రం పూజయామి.. మాచీ పత్రం: తెలుగులో దీనిని మాచపత్రి అంటారు. చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. ఇవి దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కంటి, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. ఓం గణాధిపాయనమః బృహతీ పత్రం పూజయామి.. బృహతీ పత్రం: దీనిని ములక, వాకుడాకు అంటారు. ఇవి వంగ ఆకుల మాదిరి, తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర, నేత్ర, వ్యాధులను నయం చేస్తుంది. దంతధావనానికి కూడా ఉపయోగిస్తారు. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి.. బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా కూడా లభ్యమవుతుంది. ఇవి శివుడికి ఇష్టమైనవి. మహాలక్ష్మికి ఊడా ఇష్టమైనవిగా వేద పండితులు చెబుతుంటారు. ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది. ఓం గుహాగ్రజాయనమః అపామార్గ పత్రం పూజయామి.. అపామార్గ పత్రం: తెలుగులో ఉత్తరేణి అంటారు. గింజలు సన్నటి ముళ్లను కలిగి ఉంటాయి. ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారుట, అర్ష మొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి.. కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. పువ్వులు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. దురుద, కంటి, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఓం గజానయ నమః దూర్వా యుగ్మం పూజయామి.. దూర్వా యుగ్మం: దూర్వా యుగ్మం అంటే గరిక. ఇందులో తెల్లగరిక, నల్ల గరిక అనే రకాలున్నాయి. ఇది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శ మొలలను నివారిస్తుంది. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి.. దత్తూర పత్రం: దత్తూర అంటే ఉమ్మెత్త మొక్క. ఇది సెగ గడ్డలు, స్తనవాపు, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, పేను కొరుకుడు, నొప్పులు, రుతువ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. ఓం గజకర్ణాయనమః తులసీ పత్రం పూజయామి.. తులసీ పత్రం: హిందువులు దేవతార్చనలో వీటిని విధిగా వాడతారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నునొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలను తగ్గిస్తుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓం భిన్నదంతాయనమః విష్ణుక్రాంత పత్రం పూజయామి.. విష్ణు క్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతోంది. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి.. బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు ఆకు. ఇందులో రేగు, జిట్రేగు, గంగరేగు అనే మూడు రకాలున్నాయి. జీర్ణకోశ, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతోంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి.. చూతపత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. వీటిని వాడని హైందవ గృహాలు ఎక్కడ ఉండవు. ఇది రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతోంది. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి.. దాడిమీ అంటే దానిమ్మ మొక్క. విరేచనాలు, గొంతు నొప్పి, తగ్గిస్తుంది. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవతలకు ఇష్టమైన ఆకు దేవదారు. అజీర్తి, పొట్ట వ్యాధులను తగ్గిస్తుంది. ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి ధవనం, మరువం అంటారు. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జుట్టు రాలడం, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. ఓం హేరంభాయ నమః సింధువార పూజయామి.. వావిలి అంటారు. జ్వరం, గాయాలు, చెవిపోటు, మూర్ఛవ్యాధి, ప్రసవం అనంతరం వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి. ఓం శూర్సకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి.. జాజీ పత్రం: ఇది సన్న జాజిగా పిలువబడే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయ వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి దీనిని లతా దూర్వా, దేవ కాంచనం అంటారు. మూర్ఛ, కఫం, పొట్ట సంబంధిత వ్యాధులు, నూలి పురుగులను నివారిస్తోంది. దీని ఆకులను ఆహారంగా కూడా వినియోగిస్తారు. ఓం ఇభవక్రాయ నమః శమీ పత్రం పూజయామి.. జమ్మి చెట్టు ఆకులను శమీ పత్రాలంటారు. మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడుతుంది. ఓం వినాయక నమః అశ్వత్థ పూజయామి.. అశ్వత్థ పత్రం: రావి ఆకులను అశ్వత్థ పత్రాలంటారు. ఇవి మలబద్దకం, కామె ర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, నోటి పూత, చర్మవ్యాధులను నివారిస్తుంది. జీర్ణశక్తిని, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి.. తెల్లమద్ది ఆకులను అర్జున పత్రాలంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. ఇది అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం. చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల నివారణకు బాగా పని చేస్తుంది. ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజయామి.. జిల్లేడు ఆకులను అర్క పత్రాలంటారు. ఇవి చర్మవ్యాధులు, సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు, వ్రణాలను తగ్గిస్తాయి. -
దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాలతో సహా.. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతాయి. ప్రతి వీధిలో ఒక గణేష్ మండపం తప్పనిసరి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు బొజ్జ గణపయ్య దగ్గర చేరతారు. ఇక చిన్నారుల సంతోషానికి హద్దే ఉండదు. వినాయకుడి చేతిలో లడ్డు, వాహనం ఎలుక ఎంత ముఖ్యమో.. గణేష్ మండపంలో మ్యూజిక్ సిస్టమ్ అంతే ముఖ్యం. ఇక ఉదయం, సాయంత్రం ఓ ఐదారు గంటల పాటు వినాయకుడి పాటలతో హోరెత్తిస్తారు. ప్రస్తుతం ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా కొన్ని వందల కొత్త పాటలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఎన్ని పాటలు వచ్చినప్పటికి మన తెలుగు సినిమాల్లోని కొన్ని వినాయకుడి పాటలు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అలా కమర్షియల్ చిత్రాల్లో బాగా పాపులర్ చెందిన లంబోదరుడి పాటలు.. దండాలయ్యా.. ఉండ్రాలయ్యా వెంకటేష్, టబు జంటగా నటించి కూలీ నం.1 చిత్రంలో వినాయకుడిని కొలుస్తూ.. వచ్చే ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా’ పాట ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1999లో వచ్చిన ఈ చిత్రంలో వినాయకుడి గురించి వచ్చే ఈ పాట ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇప్పటికి ప్రతి గణేష్ మంటపం దగ్గర ఈ పాట ప్లే కావాల్సిందే. వక్రతుండ మహకాయ కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన ‘దేవుళ్లు’ సినిమాలో గణేశుడ్ని కీర్తిస్తూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా నటించి, పాడిన ‘వక్రతుండ మహకాయ’ పాట ఇప్పటికి వినాయక చవితి ఉత్సవాల్లో వినిస్తూనే ఉంటుంది. (గణేశ్ ఉత్సవాలకు 127 ఏళ్లు) జై జై గణేషా.. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 2006 లో విడుదలైన ‘జై చిరంజీవి’ సినిమాలోని ‘జై జై గణేషా’ పాటకు మాస్లో సూపర్ క్రేజ్. ఇక మెగస్టార్ చిరంజీవి చిందేసిన పాట కావడంతో ప్రతి గణేషుడి మంటపం దగ్గర ఈ పాట హోరెత్తాల్సిందే. గణపతిబప్పా మోరియా హిందీలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన ‘ఎనీ బడీ కెన్ డ్యాన్స్’ (ఏబీసీడీ)సినిమాలోని ‘గణపతిబప్పా మోరియా’ పాట దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మన తెలుగు నాట కూడ గణేష్ మండపాల్లో ఈ పాట తప్పక వినిపిస్తుంది. (ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు) ఇక మహేశ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’లో జగడమే పాటలో ఒక బిట్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ ఒక బిట్ సాంగ్ ఉంది. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’, రవితేజ నటించిన ‘పవర్’ సినిమాలో వినాయకుడి పాటలు ఉన్నాయి. ఇక రామ్ హీరోగా నటించిన ‘గణేష్’ సినిమాలో వినాయకుడిపై ఒక పాట ఉంది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘డిక్టేటర్’ మూవీలో వినాయకుడిని కీర్తిస్తూ.. ‘గం గం గణేషా’ అనే పాట తెరకెక్కిందే. ఇక నాని, నాగార్జున నటించిన దేవదాస్ చిత్రంలోని ‘లక లక లకుమికరా’ పాట కూడా బొజ్జ గణపయ్యను కొలిచే పాటే. అలానే నాగ చైతన్య, తమన్న జంటగా వచ్చిన 100 పర్సెంట్ లవ్‌లో కూడా ‘తిరు తిరు గణనాథ’ అంటూ లంబోదరుడి పాట ఉంది. -
బహ్రెయిన్‌లో మహిళ దుశ్చర్య
మనామా: బహ్రెయిన్ సూపర్ మార్కెట్లో వినాయకుడి విగ్రహాలు ఉంచడం పట్ల ఇద్దరు ముస్లిం ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేయడమే కాక సూపర్‌మార్కెట్ సిబ్బందితో గొడవపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నివేదికల ప్రకారం ఈ సంఘటన బహ్రెయిన్ రాజధాని మనమా పక్కనే ఉన్న జుఫైర్ ప్రాంతంలోని ఒక సూపర్ మార్కెట్లో జరిగింది. వివరాలు.. వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని బహ్రెయిన్ జుఫైర్ సూపర్మార్కెట్లో గణేషుడి విగ్రహాలు అమ్మకం కోసం ఉంచారు. ఇది చూసిన ఇద్దరు ముస్లిం మహిళలు వినాయక విగ్రహాలను దూషించడమే కాక సూపర్‌మార్కెట్ సిబ్బందితో గొడవపడ్డారు. అంతేకాక వారిలో ఓ మహిళ విగ్రహాలను ఒక్కొక్కటిగా నేలపై పడేసి ధ్వంసం చేసింది. ‘ఇది మహ్మద్ బెన్ ఇస్సా దేశం. అతను ఇతర మతస్తుల దేవుళ్లను అనుమతించాడని మీరు భావిస్తున్నారా. ఇది ముస్లిం దేశం.. ఇలా చేయడం సరియైనదేనా’ అంటూ ప్రశ్నించింది. మరొక మహిళ ‘పోలీసులను పిలవండి. ఈ విగ్రహాలను ఎవరు ఆరాధిస్తారో చూద్దాం’ అంటూ అవరడం వీడియోలో చూడవచ్చు. (ముంబైలో లాల్బగ్చా గణేశ్ ఉత్సవాలు రద్దు) This video is from #Bahrain "Lady destroying the idols of Lord Ganesha " No religion teaches to disrespect someone's faith and belief's. #Bahrain pic.twitter.com/IGrtS1k12E — Amit (@amy_official7) August 16, 2020 ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో బహ్రెయిన్ ప్రభుత్వం సదరు మహిళ మీద చర్యలు తీసుకుంది. ఈ మేరకు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ‘జుఫైర్లోని ఒక దుకాణంలో విగ్రహాలను ధ్వంసం చేసినందుకు.. ఒక సామాజిక వర్గాన్ని.. దాని ఆచారాలను అవమానించినందుకు 54 ఏళ్ల మహిళపై రాజధాని పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు’ అంటూ ట్వీట్ చేసింది. రాయల్ సలహాదారు ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఈ చర్యను ఖండించారు. దీనిని ‘ద్వేషపూరిత నేరం’గా వర్ణించారు. ‘మతపరమైన చిహ్నాలను నాశనం చేయడం బహ్రెయిన్ ప్రజల స్వభావంలో భాగం కాదు. ఇది ద్వేషాన్ని బహిర్గతం చేసే నేరం’ అంటూ అల్ ఖలీఫా ఒక ట్వీట్లో పేర్కొన్నారు. Capital Police took legal steps against a woman, 54, for damaging a shop in Juffair and defaming a sect and its rituals, in order to refer her to the Public Prosecution. — Ministry of Interior (@moi_bahrain) August 16, 2020 -
ముంబైలో లాల్బగ్చా గణేశ్ ఉత్సవాలు రద్దు
ముంబై: దేశంలో కరోనా ధాటికి అతలాకుతలమవుతున్న నగరాల్లో ముంబై ముందు స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వినాయక ఉత్సవాలు నిర్వహించకూడదని ముంబైలోని ప్రముఖ లాల్బగ్చా రాజ సార్వజనిక్ గణేషోత్సవ మండలి నిర్ణయించింది. వైరస్ విజృంభణ వల్ల వినాయక చతుర్థి వేడుకలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకు బదులుగా కోవిడ్‌తో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ఉత్సవ మండలి సెక్రటరీ సుధీర్ సాల్వీ మీడియాకు తెలిపారు. దీంతోపాటు వైరస్ బారిన పడిన రోగుల కోసం రక్తదానం, ప్లాస్మా దానం క్యాంపులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. (‘వినాయక’ విడుదల ఎప్పుడు?) కాగా 1934 నుంచి లాల్బగ్చా మండలి క్రమం తప్పకుండా గణేశుడిని ప్రతిష్టిస్తూ వేడుకలు నిర్వహిస్తోంది. కానీ ఈ యేడాది ఉపద్రవంలా వచ్చిపడ్డ కరోనా మహమ్మారి వల్ల విగ్రహ ప్రతిష్టతో సహా ఎలాంటి వేడుకలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చూడా ఈసారి గణేశుడి ప్రతిమలు నాలుగు అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వినాయక చతుర్థి వేడుకలు సాదాసీదాగా జరుపుకోవాలని, పందిళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. (ముంబైకి మరో ముప్పు) -
వైరల్ : నాగిని డాన్స్ చేస్తూ చనిపోయాడు
సియోని : చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. చనిపోయే వ్యక్తికి కూడా తాను ఇప్పుడు చనిపోబోతున్నాను అనే విషయం తెలియదు. చనిపోవడం అనేది ఇప్పటికీ ఓ మిస్టరీయే. అది ఎప్పుడు ఎవరికి ఎలా ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. గణపతి నిమజ్జనం సందర్భంగా నాగిని డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి అకాస్మాత్తుగా మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన గురుచరణ్ ఠాగూర్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి గణేష్ మండపం వద్ద నాగిని మ్యూజిక్‌కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఏమైందా అని చుట్టూ ఉన్న వాళ్లు దగ్గరికి వెళ్లి చూసేలోపే అతడు మృతిచెందాడు. అతడు డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
స్టార్ మా గణేష్ మహోత్సవం 2019
-
హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం సందడి
-
ఎదుటే గణేష్ విగ్రహం.. ఏం చేశారో చూడండి..!
గాంధీనగర్ : దేశమంతా బొజ్జ గణపయ్యను భక్తి ప్రపత్తులతో కొలువుదీర్చుకుంటే గుజరాత్లో మాత్రం కొందరు మత్తులో మునిగిపోయారు. గణేష్ విగ్రహం ఎదుటే విచ్చలవిడిగా మద్యం సేవించి, బాలీవుడ్ పాటలతో పిచ్చెక్కినట్టు డ్యాన్సులు చేశారు. వీధుల్లో బీర్లు పారించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 8 మందిని అరెస్టు చేశారు. వివరాలు.. సూరత్‌లోని గోల్వాడ్లో శివగణేష్ యూత్ అసోసిషేషన్ సభ్యులు వినాయక ప్రతిమ ప్రతిష్టించాలనుకున్నారు. ఓ భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భక్తి ముసుగులో మద్యం సేవించి, భారీ లౌడ్ స్పీకర్లతో డ్యాన్సులు వేశారు. పక్కా ఆధారాలు లభించడంతో 8 మందిని అరెస్టు చేశామని ఏసీపీ జేకే పాండ్యా చెప్పారు. ఏ మతాన్నైనా కించపరిచే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గణేశ్ ఉత్సవాలకు 127 ఏళ్లు
భైంసా (ముథోల్): దేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగుతున్నకాలమది. స్వాతంత్రం కోసం జాతీయ నాయకులు పోరాడుతున్నారు. బాలగంగాధర్ తిలక్ సైతం అదేబాటలో నడిచాడు. అందరినీ సమైక్యంగా కలుపుకుపోవాలన్న ఆలోచనతో ముందుకు కదిలాడు. ఆ రోజుల్లో ఆంగ్లేయులు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. నలుగురు ఒక చోట కలుసుకునే అవకాశంలేదు. ఆ రోజుల్లో ఇళ్లలోనే గణపతి పూజలు జరిగేవి. అలాకాకుండా ఏటా గణేశ్ విగ్రహాలను ప్రతిష్టిస్తే అంతా కలిసి ఒకేచోట ఉత్సవాలు జరుపుకుంటారని అనుకుని ఆ దిశగా అడుగులు వేశాడు. 1893లో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోని పుణేలో శ్రీ కస్బ గణపతిని ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించాడు. అప్పటి నుంచి 127 ఏళ్లుగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కుభీర్‌కు వచ్చి... ఆ సమయంలో ముథోల్ ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండేది. ముథోల్ ప్రాంతమంతా నాందేడ్ జిల్లా పరిధిలోకి వచ్చేది. బాలగంగాధర్ తిలక్ దేశమంతా పర్యటిస్తూ ఇప్పటి నిర్మల్ జిల్లాలోని ముథోల్ నియోజకవర్గ పరిధిలో గల కుభీర్‌కు చేరుకున్నారు. అప్పుడు కుభీర్‌ను పాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్‌కు బాలగంగాధర్‌తిలక్ దగ్గరి బంధువు. 1905లోనే భైంసాకు వచ్చిన బాలగంగాధర్‌తిలక్ పట్టణానికి చెందిన నారాయణ్‌వాగ్‌తో సమావేశమయ్యారు. అప్పుడే కుభీర్‌లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కుభీర్‌నుపాలించే యశ్వంత్‌రావుదేశ్‌ముఖ్ గణేశ్ ఉత్సవాలను నిర్వహించేవారు. 1950 నుంచి 40ఏళ్లపాటు కుభీర్‌కు చెందిన వైద్యనాథ్ ఉత్సవాల నిర్వాహణను చూసుకున్నారు. నేడు గ్రామస్తులు ఈ ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. భైంసా పట్టణంలో 101 ఏళ్లుగా.. భైంసాలో 1919లో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మందిరంలో మొదటిసారిగా నారాయణ వాగ్ సమక్షంలో ఉత్సవాలు ప్రారంభించారు.101 ఏళ్ళుగా గోపా లకృష్ణ మందిరంలో గణేశ్ ఉత్సవాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిమజ్జనం రోజున ఇక్కడే పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. 1921లో హతిగణేశ్ మండలి ఉత్సవాలను ప్రారంభించింది. నేడు భైంసా పట్టణంలో 100కు పైగా మండళ్లు గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. అప్పట్లో అంతా కలిసి భజనలు చేస్తూ ఒకేచోట ఉత్సవాలు చేసుకునేవారు. నేడు గణేశ్ మండళ్ల సంఖ్య 100కు పైగానే చేరింది. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
తెలుగు రాష్ట్రాలో వినాయక చవితి శోభ
-
సాక్షి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
-
‘మట్టి గణపతులనే పూజిద్దాం’
సాక్షి, సిటీబ్యూరో: మట్టి గణపతిని పూజిద్దాం...పర్యావరణాన్ని రక్షిద్దామంటూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మట్టి గణపతులు పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడంలో ముందుందని మునిసిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ అన్నారు. గురువారం మైహోం నవదీపలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతుల కార్యక్రమంలో తన కుమార్తెతో కలిసి మట్టివిగ్రహలు పంపిణీ చేశారు. ఉద్యోగులందరికీ మట్టి విగ్రహాలు హెచ్ఎండీఏ ఉద్యోగులందరికీ హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ మట్టి గణేష విగ్రహాలను పంపిణీ చేశారు. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ శరత్ చంద్ర, సూపరింటెండెంట్ పరంజ్యోతి, పీఆర్ఓ లలిత ప్రతి ఉద్యోగికి మట్టి గణపతి తో పాటు తులసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పర్యావరణ హితానికి అనుగుణంగా వ్యవహరించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను విరివిగా పెంచాలని కోరారు.