gollaprolu
-
ఆశ్చర్యానికి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
చిట్టి చిల్లీ.. చాలా ఘాటు గురూ! ఒక్కసారి కొరికితే..
సాక్షి, కాకినాడ(పిఠాపురం): చిట్టి చిల్లీ... చూడటానికి చెర్రీ పండులా ఎర్రగా గుండ్రంగా ఉంటుంది. నోరూరిస్తుంది. కానీ ఒక్కసారి కొరికితే చెంబుడు నీళ్లు తాగినా మంట తగ్గదు. అంతటి ఘాటు ఉన్న ఈ చిట్టి మిరపకాయల ధర కూడా సాధారణ మిర్చి కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ చిట్టి మిర్చికి పుట్టినిల్లు కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రాంతమైనా... మరాఠా వాసులతోపాటు దుబాయ్, మలేషియా దేశాల ప్రజలకు దీనిపై మక్కువ ఎక్కువ. సొంతగా విత్తనం తయారీ... గొల్లప్రోలు మండలంలోని రేగడి భూములు పొట్టి మిరప సాగుకు అనుకూలం. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, ఎ.విజయనగరం గ్రామాలలో సుమారు 600 ఎకరాలలో పొట్టి మిరపను సాగు చేస్తున్నారు. రైతులే సొంతగా విత్తనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. తమకు పండిన పంటలో నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుని ఎండబెట్టి విత్తనాన్ని సిద్ధం చేసుకుంటారు. ఎకరాకు 70 నుంచి 80 బస్తాలు దిగుబడి వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే పెట్టుబడి పోను ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ చిట్టి మిరపకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ముంబై, పుణె ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి దుబాయ్, మలేషియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 250 నుంచి 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లోని స్టార్ హోటళ్లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు టన్ను పొట్టి మిర్చిని విదేశాల్లో రూ.7లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పదేళ్లుగా సాగు చేస్తున్నా పదేళ్లుగా పొట్టి మిరప సాగు చేస్తున్నా. మొత్తం మీద మిరప సాగు లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేయడం వల్ల మంచి దిగుబడి వస్తోంది. ఆదాయం కూడా బాగుంది. – వెలుగుల బాబ్జి, మిరప రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం రైతులే మార్కెటింగ్ చేసుకునేలా చర్యలు ప్రస్తుతం రైతు దగ్గర వ్యాపారులు కేజీ రూ.300 వరకు కొంటున్నారు. దానిని రూ.1.200లకు అమ్ముకుంటున్నారు. రైతులే స్వయంగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. – ఎలియాజర్, డీపీఎం ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు గొల్లప్రోలు మండలంలో ఈ ఏడాది 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు చేశారు. ఉద్యానశాఖ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు అందిస్తున్నాము. మంచి డిమాండ్ ఉన్న పంట కావడంతో రైతులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. – బీవీ రమణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి, కాకినాడ -
Chilli Crop Cultivation: నల్ల తామరను జయించిన దుర్గాడ
మిరప పంటపై నల్ల తామరకు ప్రకృతి వ్యవసాయమే దీటుగా సమాధానం చెబుతోంది. రెండేళ్లుగా నల్ల తామర, మిరప తదితర ఉద్యాన పంటలను నాశనం చేస్తుండడంతో దీన్ని పెను విపత్తుగా ప్రభుత్వం గుర్తించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో కాకినాడ జిల్లాలోని మిరప రైతులు నల్ల తామర తదితర చీడపీడలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పంటను నిలబెట్టుకుంటున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సస్యరక్షణ మందులను వినియోగించి నల్ల తామర ఉధృతిని కట్టడి చేస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. దుర్గాడ గ్రామంలో 650 ఎకరాల్లో గుండ్రటి రకం మిరప సాగవుతుంటే, ఇందులో 180 ఎకరాలలో రైతులు ప్రకృతి సేద్య పద్ధతులు పాటిస్తున్నారు. ఈ మిరప పంట నల్ల తామర పురుగును తట్టుకుని నిలబడటం విశేషంగా చెబుతున్నారు. దుర్గాడ రకం మిర్చి విరగ పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే, అదే గ్రామంలో ఈ పొలాలకు పక్కనే ఉన్న, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్న రైతుల పొలాల్లో మిరప తోటలు నల్లతామర తదితర చీడపీడలతో దెబ్బతి న్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఫొటోలు: వివివి వరప్రసాద్, పిఠాపురం కొత్త పురుగు నల్ల తామరను నియంత్రించడంలో రసాయనక ఎరువులు, పురుగుమందుల కంటే కషాయాలే బాగా పనిచేస్తున్నాయి. ఉల్లి కషాయం, జీవామృతం, మీనామృతం వంటివి వినియోగించిన పొలాల్లో మిరప పంట తామర పురుగును తట్టుకుని నిలబడింది. రసాయనిక సేద్యంలో దెబ్బతిన్న మిరప పొలాల్లో కషాయాలు, ద్రావణాలు ఉపయోగించిన చోట్ల పంట తిరిగి పుంజుకుంటుండటం విశేషం. సేంద్రియ ఎరువులు వాడిన పంట మంచి ఆదాయాన్నిస్తుండగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగించిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ రైతులకు అవగాహన కల్పించి వచ్చే సీజన్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. నల్ల తామర ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నాం. సేంద్రీయ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గింది. – ఇలియాజర్ (94416 56083), డీపీఎం, పకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ కుళ్లిన ఉల్లితో కషాయం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, చేప వ్యర్థాలతో మీనామృతం, అల్లం–వెల్లుల్లితో అగ్ని అస్త్రం వంటివి తయారు చేసుకొని మిరప పంటకు వాడుతూ ప్రకృతి సేద్యంలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. కుళ్లిన ఉల్లిపాయలు, వేపాకులతో తయారు చేసే ఉల్లి కషాయం మిరప తోటల్లో నల్ల తామరను కట్టడి చేయటంలో కీలక స్థానం పోషిస్తోంది. ఎకరా మిర్చి తోట నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా కొన్ని కాయలు కోయాల్సి ఉంది. – వెలుగుల బాబ్జి (97014 41771), ప్రకృతి సేద్య పద్ధతుల్లో మిర్చి సాగు చేస్తున్న రైతు, దుర్గాడ ఎకరానికి రూ. 65 వేల పెట్టుబడి.. రూపాయి కూడా తిరిగి రాలేదు.. నేను గత కొన్నేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందులతో మిరప సాగు చేస్తున్నా. ఐతే గత రెండేళ్ళుగా నల్ల తామర పురుగు సోకడంతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరానికి రూ 65 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. పంట పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. రసాయనిక పురుగుమందులు పంటకు రక్షణ కల్పించ లేకపోయాయి. – ఇంటి ప్రసాద్, మిర్చి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా -
కాకినాడ గొల్లప్రోలులోని టెంట్ హౌస్ గోడాన్ లో అగ్నిప్రమాదం
-
CM YS Jagan: ఇచ్చిన మాటకు మించి మేలు
గొల్లప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘కాపులకు మేలు చేస్తామని చెప్పినట్టుగానే చేసి చూపించాం. మేనిఫెస్టోలో పెట్టకున్నా మనసున్న ప్రభుత్వం కాబట్టే వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. మూడేళ్లుగా నిరాటంకంగా కాపు మహిళలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు ఏటా రూ.1,000 కోట్ల వంతున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు ఇస్తామని చెప్పి.. కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి కాపులను మోసం చేశారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. మనం చెప్పిన మాటకు మించి మేలు చేశామన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం ఆయన కంప్యూటర్లో బటన్ నొక్కి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 3,38,792 మంది కాపు మహిళల ఖాతాల్లో రూ.508 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇది మనసుతో స్పందించే ప్రభుత్వం అన్నారు. అక్క చెల్లెమ్మలు, రైతులు, పేదల ప్రభుత్వం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలతో పాటు ప్రతి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకూ తోడుగా నిలిచామన్నారు. కాపు నేస్తం పథకం కింద ఈ మూడేళ్లలో రూ.1,492 కోట్లు అందించామని చెప్పారు. అర్హత ఉండి కూడా పథకాన్ని పొందలేకపోయిన వారికి ఈ నెల 19న రూ.1.8 కోట్లకు పైగానే జమ చేశామన్నారు. నవరత్న పథకాల ద్వారా ఈ మూడేళ్లలో ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన అక్కచెల్లెమ్మలకు, కుటుంబాలకు డీబీటీ, కాపు కార్పొరేషన్ ద్వారా ఏకంగా రూ.16,256 కోట్లు అందించామని వివరించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టే పథకాలు, నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.16 వేల కోట్ల లబ్ధి కలిగించామని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేలు చేసినందుకే మీ ఆశీర్వాదాలు ►2.46 లక్షల మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి పట్టాల విలువే రూ.12 వేల కోట్లు. 1.2 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు రూ.2 వేల కోట్లు ఇస్తామన్నాం. ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పాం. మూడేళ్లు కూడా తిరక్క ముందే రూ.32,296 కోట్లు ఇవ్వగలిగాం. ►నవరత్నాల పథకాల ద్వారా అన్ని వర్గాల వారినీ ఆదుకున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. అందువల్లే ఇవాళ ధైర్యంగా గడప గడపకూ వెళుతున్నాం. మీ ఆశీర్వాదం అందుకుంటున్నాం. ►మెట్ట ప్రాంత రైతుల స్వీయ ప్రయోజనాల దృష్ట్యా నాన్న (రాజశేఖరరెడ్డి) గారి హయాంలోనే ఏలేరు ప్రాజెక్టును చేపట్టి మొదటి విడతలో 60 శాతం పనులు చేశారు. ఆ తర్వాత పట్టించుకున్న వారు లేరు. ఆ అంచనాలు ఇప్పుడు తడిసి మోపెడయ్యాయి. ►ఎమ్మెల్యే దొరబాబు అన్న అభ్యర్థన మేరకు ఏలేరు ఫేజ్–1 ఆధునికీకరణకు రూ.142 కోట్లు, ఏలేరు ఫేజ్–2కు మరో రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా. ఇది కాకుండా పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాల్టీలకు రూ.20 కోట్లు చొప్పున రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. జన స్పందన అనూహ్యం సభకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. సీఎం జగన్ వేదిక వద్దకు రాక మునుపే సభా స్థలి మహిళలతో నిండిపోయింది. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో బయట వాహనాలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కోలకతా–చెన్నై జాతీయ రహదారిలో గొల్లప్రోలు వద్ద అటు, ఇటు నాలుగు కిలోమీటర్లు మేర జన సముద్రాన్ని తలపించింది. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల అంచనాలకు మించి జనం రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించడం కొంత సేపు కష్టతరంగా మారింది. సభలో సీఎం ప్రసంగం సాగిన 30 నిమిషాల పాటు మహిళలు, యువత జై జగన్.. థ్యాంక్యూ సీఎం సార్.. అంటూ నినదించారు. -
CM Jagan: చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు
ఇవాళ సహాయ కార్యక్రమాల్లో మొత్తం అధికార యంత్రాంగాన్నంతటినీ మోహరించాం. మానవత్వంతో సహాయం చేస్తున్నాం. ఆరుగురు జిల్లా కలెక్టర్లు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లు బాధితుల వెన్నంటి ఉన్నారు. రేషన్, రూ.2 వేల సాయం అందలేదని ఏ ఒక్కరూ అనలేదు. ఈ పెద్దమనిషి (చంద్రబాబు) మాత్రం నిన్న (గురువారం) చేతిలో కాగితాలు పట్టుకుని అబద్ధాలు చెప్పారు. ఎలాగైనాసరే ప్రజలను నమ్మించగలమని అనుకుంటున్నారు. ఎందుకంటే పత్రికలు నడిపేది వాళ్లే, టీవీలు వాళ్లవే, చర్చ నడిపించేది, చర్చించేది వాళ్లే కాబట్టి. – సీఎం వైఎస్ జగన్ గొల్లప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు. ఆ పెద్ద మనిషిది అదో మార్కు రాజకీయం. ఒకటే అహంకారం. ఆయనకు డబ్బా కొట్టే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉన్నాయని, ఏ అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారనే ధీమా. వీటికి తోడుగా దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కనీసం 10 హామీలు కూడా అమలు చేయకుండా చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి, ఇప్పుడేమో సంక్షేమ పథకాలు రద్దు చేయాలంటున్నారు. డీబీటీ అమలుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వెటకారం చేస్తున్నారు. చంద్రబాబుతో కూడిన ఈ దుష్టచతుష్టయం గతంలో అమలు చేసిన డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) కావాలో, మనం అమలు చేస్తోన్న డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) కావాలో ఒకసారి ఆలోచించండి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను కోరారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం ఆయన కంప్యూటర్లో బటన్ నొక్కి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. చంద్రబాబు గత పాలన, ప్రతిపక్ష నేతగా అతని తీరును తూర్పారపట్టారు. గడచిన మూడేళ్ల సంక్షేమ పాలనకు, గత ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన సభకు భారీగా హాజరైన మహిళలు. దిగజారిన రాజకీయాలు ►కాపుల ఓట్లను కొంతమేర అయినా కూడగట్టి, వాటన్నింటినీ హోల్‌సేల్‌గా చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు ఇవాళ కనిపిస్తున్నాయి. రాజకీయాలు దిగజారిపోయాయి. గతంలో ఒక కులానికి కానీ, ఒక సామాజిక వర్గానికి కానీ.. ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది.. అని అడిగితే లెక్కలు మాత్రమే చూపించేవారు. బడ్జెట్లో వందల కోట్లు చూపించినా, అదే కులానికి చెందిన నాకు ఎందుకు మేలు జరగ లేదని, ఆ లెక్కలన్నీ మాయాజాలమే అనుకునేవారు. ముఖ్యమంత్రి జగన్‌కు సాదర స్వాగతం పలుకుతున్న విద్యార్థినులు ►ఇవాళ మనం ఇంటింటికీ వెళ్లి.. మీకు ఇన్ని పథకాలు అందాయి అని చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. పారదర్శకంగా ఇంత మంచి చేశాం. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా? ఆలోచించండి. ►బాబు పాలనలో అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీలు చెబితేనే కొద్ది మందికి మాత్రమే అరకొరగా మేలు జరిగేది. అదీ లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. లంచాలు, వివక్ష అనేవి ఇవాళ ఎక్కడా కనిపించవు. ఇవాళ మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయం, వర్గం, ఇవేమీ చూడకుండా మేలు చేస్తున్నాం. మనకు ఓటు వేసినా, వేయకపోయినా ఇస్తున్నాం. కాపునేస్తం లబ్ధిదారులైన మహిళలతో సీఎం జగన్. చిత్రంలో ఎంపీ వంగా గీత మీరే ఆలోచించండి.. ►వందకుపైగా సామాజిక వర్గాల బాగుకోరే మన పాలన కావాలా? లేక గత ప్రభుత్వం మాదిరి చంద్రబాబు, వారి దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు బాగు మాత్రమే కావాలా.. ఆలోచించండి. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేసిన, నిజాయితీతో కూడిన రాజకీయాలు కావాలా? లేక మోసం, వెన్నుపోటు, వంచనతో కూడిన.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పచ్చి అబద్ధాల మార్కు చంద్రబాబు రాజకీయం కావాలా? ఈ విషయాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ►హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు ప్రతి ఇంటికీ రూ.4 వేలు ఇచ్చానని, ఇవాళ జగన్ రూ.2వేలు ఇచ్చారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో తిరుగుతున్నా. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు అప్పట్లో 11 రోజులు తిరిగాను. అప్పుడు వారు ఇచ్చింది పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడకక్కడా 10 కేజీలు బియ్యం మాత్రమే. తిత్లీ తుపాను సమయంలోనూ అంతే. ►గతంలో కూడా ఇదే బడ్జెట్. ఇప్పటి కంటే అప్పుడే అప్పులు ఎక్కువ. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవాళ మీ బిడ్డ ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు? కేవలం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోవడమే తేడా. నాకు ఉన్నది మీ దీవెనలు. ఆ దేవుడి ఆశీస్సులు. – సీఎం వైఎస్ జగన్ గత పాలకులు బూటు కాళ్లతో తన్నించారు గత చంద్రబాబు పాలనలో కాపులను బూటు కాళ్లతో తన్నించారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాత్రమే మా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతోంది. కాపు నేస్తం, ఇతర పథకాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నారు. మీ సాయంతో నేను టీ దుకాణం పెట్టుకుని, సొంత కాళ్లపై నిలబడ్డాను. 35 ఏళ్ల క్రితం నాకు పెళ్లయింది. అద్దె ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్నాం. మీరు పెద్ద కొడుకుగా మా సొంత ఇంటి కల నెరవేరుస్తున్నారు. కొమరగిరిలో స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం జరుగుతోంది. పూర్తయ్యాక మీరు (సీఎం) మా గృహ ప్రవేశానికి తప్పకుండా రావాలి. – బండారు సుజాత, కాకినాడ అర్బన్ మళ్లీ మీరే సీఎం కావాలి గత ప్రభుత్వం కాపుల్ని అగ్రవర్ణాలుగా చూసింది తప్ప చేసిందేమీ లేదు. కాపు మహిళలు డబ్బులు లేకపోయినా ఇల్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో మీరు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. ఎంతో మంది మహిళలు మీ సాయం అందుకుని సొంత కాళ్లపై నిలబడ్డారు. నేను గేదెలను కొనుక్కుని పాల వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాను. కుటుంబ పోషణకు నా భర్తకు నెలకు రూ.4 వేలు ఇస్తున్నాను. నా భర్త ఆటో డ్రైవర్. వాహనమిత్ర ద్వారా అతనికి రూ.10 వేల సాయం అందింది. ఇటీవల ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ప్రాణ భిక్ష పెట్టారు. నా కుమారుడికి ఫీజు రీయింబర్స్మెంట్, మా అత్తకు పింఛన్ అందుతోంది. ఇంటి స్థలం ఇచ్చారు. ఇంత మేలు చేసిన మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి. – చిక్కాల రాణి, కొవ్వాడ, కాకినాడ రూరల్ -
వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
వైఎస్సార్ కాపు నేస్తం: 3,38,792 మందికి లబ్ధి
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉంటే చాలు.. మంజూరు చేస్తున్నారు. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడము అని సీఎం వైఎస్ జగన్ ప్రతి సమావేశంలో చెబుతూ.. అదే ఆచరిస్తున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అరకొర సాయం ► శుక్రవారం అందించే రూ.508.18 కోట్లతో కలిపి ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.1,491.93 కోట్ల మేర లబ్ధి కలిగించారు. తద్వారా ఒక్కో పేద కాపు అక్క,చెల్లెమ్మకు ఈ మూడేళ్లలో రూ.45,000 లబ్ధి కలిగింది. ► గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది ఏటా సగటున రూ.400 కోట్లు కూడా లేని దుస్థితి. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం మూడేళ్లలోనే వివిధ పథకాల ద్వారా 70,94,881 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 27 రెట్లు ఎక్కువగా అంటే మొత్తం రూ.32,296.37 కోట్ల లబ్ధి చేకూర్చింది. ► ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం ఈ ప్రభుత్వం విశేష కృషి చేసింది. సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సీఎం సహా, ఏకంగా నాలుగు మంత్రి పదవులు కేటాయించింది. అన్ని నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత కల్పించింది. ► గత టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనేక పథకాలు అమలు చేయలేదు. అమలు చేసినవి కూడా అరకొరే. వివిధ పేర్లతో కొర్రీలు, కోతలతో వీలైనంతమందికి సాయం ఎగ్గొట్టారు. నేడు సీఎం పర్యటన ఇలా.. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద సాయం జమ చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. -
కాకినాడ: గొల్లప్రోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
వైఎస్సార్ కాపు నేస్తం; సీఎం జగన్ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు. 10.45-12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణంలో ప్రసంగించి.. వైఎస్సార్ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. చదవండి: అక్కా.. సాయం అందిందా? -
Kakinada: నల్ల తామరకు ‘ఉల్లి’ కళ్లెం! ఆదర్శంగా దుర్గాడ రైతులు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అలాంటి ఉల్లి రైతులకు తల్లిగా మారింది. కుళ్లిన ఉల్లిపాయలతో తయారు చేసిన కషాయం పొట్టి మిర్చి మొదలు అనేక ఇతర పంటలకూ సంజీవినిగా మారింది. అనుకోని ఉపద్రవాలకు పకృతి వ్యవసాయమే ధీటుగా సమాధానం చెబుతుందని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన రైతులు నిరూపించారు. దుర్గాడ గ్రామంలో సుమారు వెయ్యి మంది చిన్నా, పెద్దా రైతులు ఉంటారు. పొట్టి మిర్చి అనే అరుదైన దేశవాళీ రకం రౌండ్ మిర్చికి దుర్గాడ పెట్టింది పేరు. వందలాది మంది రైతులు ఈ రకం మిర్చిని ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సాగు చేశారు. ఈ ఏడాది మిర్చి తోటలను నల్ల తామర (త్రిప్స్ పార్విస్పైనస్) సర్వనాశనం చేసింది. దుర్గాడలో సుమారు 300 ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. కుళ్లిపోయిన ఉల్లి పాయలతో తయారు చేసిన కషాయం మిరప తోటలను, ఇతర తోటలను రసంపీల్చే పురుగుల నుంచి రక్షించడానికి ఉపయోగపడటం విశేషం. ‘ఉల్లి కషాయంతో ముడత విడిపోతుండటంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా రైతులోకంలో పాకిపోయింది. గత డిసెంబర్లో అనేక జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా రైతులు దుర్గాడ వచ్చి ఉల్లి కషాయాన్ని తీసుకెళ్లి పంటలను రక్షించుకున్నారు. లీటరు రూ.30కి విక్రయిస్తున్నాం. అప్పట్లో రోజుకు 500–600 లీటర్ల వరకు అమ్మాం. మిర్చితోపాటు అనేక ఇతర పంటల్లోనూ రసం పీల్చే పురుగులన్నిటినీ ఉల్లి కషాయం కంట్రోల్ చేసింది. దుర్గాడలో ఉల్లి కషాయం వాడని రైతు లేరు. ఈ ఏడాది ఆ గ్రామానికి చెందిన వెయ్యి మందికి పైగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తామంటున్నారు..’ అని ఏపీ ప్రకృతి వ్యవసాయ విభాగం ఎంసీఆర్పీ వెంకట రమణ ‘సాక్షి’తో చెప్పారు. మిరప, మామిడి, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికం, బంతి, చామంతి, టమాటా, దొండ వంటి అనేక పంటలపై దాడి చేస్తున్న రసంపీల్చే పురుగుల నియంత్రణకు ఉల్లి కషాయం చాలా ఉపయోగపడిందని ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది చెబుతున్నారు. ఉల్లి కషాయంతో పాటు, కుళ్లిన చేపలతో మీనామృతం, అల్లం వెల్లుల్లితో తయారైన అగ్నిఅస్త్రం, దేశవాళీ ఆవు పెరుగుతో తయారైన పులిసిన మజ్జిగతో ప్రకృతి వ్యవసాయంలో చక్కని ఫలితాలు సాధిస్తూ దుర్గాడ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేస్తున్న ముర్రె మన్నెయ్య అనే మిర్చి రైతు నల్ల తామర తాకిడికి పంటను పీకేద్దామనుకున్నాడు. పక్క పొలానికి చెందిన రైతు సూచన మేరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మారి అనేక దశపర్ణి కషాయం, ఉల్లి కషాయం, పుల్లమజ్జిగ, పంచగవ్య పిచికారీ చేసి పంటను పూర్తిగా రక్షించుకున్నారు. అసలేమీ రాదనుకున్న ఎకరంన్నర పొలంలో సుమారు పది క్వింటాళ్ల మిర్చి దిగుబడి పొందారు. నష్టాలపాలయ్యే దశలో సాగు పద్ధతి మార్చుకొని లాభాలు పొందాడు. ప్రతి ఇల్లూ కషాయ విక్రయ కేంద్రమే! దుర్గాడలో పంట సీజన్లో సుమారు 15 టన్నుల వరకు ఉల్లిపాయలు పాడైపోతూ ఉంటాయి. గతంలో వీటిని పారేసే వారు. కానీ ప్రస్తుతం ఉల్లి కషాయం తయారీలో కుళ్లిన ఉల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో దానికీ ఆర్థిక విలువ వచ్చింది. మామూలు ఉల్లి కేజీ రూ. 20 ఉంటే పనికి రాని ఉల్లి కేజీ రూ. 3–5 వరకు పలుకుతోంది. ఇళ్ల దగ్గర పూల మొక్కలకు బదులుగా సీతాఫలం, ఉమ్మెత్త, వేప తదితర ఔషధ మొక్కలను పెంచటం ప్రారంభించారు. ప్రతీ ఇంటి వద్దా దేశవాళీ ఆవులు దర్శనమిస్తున్నాయి. గ్రామం మొత్తంలో సుమారు 70 మంది రైతులు తమ ఇళ్ల వద్ద ఉల్లి కషాయం తయారు చేసి అమ్మటం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రతి రైతూ ఉల్లి కషాయం వాడారు ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు పొట్టి మిర్చి దిగుబడి వచ్చేది. అయితే, ఈ ఏడాది నల్లతామర విరుచుకు పడటంతో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే రైతులు చాలా మంది పూర్తిగా నష్టపోయి తోటలు పీకేసి నువ్వులు వేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మిరప చేలు ఉల్లి కషాయం వల్ల తట్టుకున్నాయి. దిగుబడి 15 క్వింటాళ్లకు తగ్గింది. దుగ్గాడలో రసాయన సేద్యం చేసే రైతులు సహా ప్రతి రైతూ ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం తయారు చేసి ఇచ్చిన ఉల్లి కషాయం వాడి ఉపశమనం పొందారు. తోటలు తీసేద్దామనుకున్న రసాయన రైతులు కొందరు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి తోటలను నిలబెట్టుకున్నారు. – ఎలియాజర్(94416 56083), ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్టు మేనేజర్, కాకినాడ జిల్లా ఉల్లి కషాయం బాగా పని చేస్తోంది ఉల్లి కషాయం పంటలను ఆశించే రసంపీల్చే పురుగులను బాగా కట్టడి చేస్తోంది. పకృతి వ్యవసాయం డీపీఎం గారు ఉల్లి కషాయం తయారీ విధానాన్ని వివరించగా ప్రయోగాత్మకంగా తయారు చేసి చూసాను. మొదట్లో నా పొలంలో పిచికారీ చేస్తే పురుగుల తీవ్రత తగ్గి పంట నిలబడింది. దీంతో ఎక్కువ మోతాదులో తయారీ ప్రారంభించా. ప్రతి రోజూ 20–50 లీటర్ల ఉల్లి కషాయం తయారు చేస్తున్నాను. ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుచేసిన మిర్చి పంట నల్ల తామర పురుగును తట్టుకుని నిలబడడంతో మిగిలిన రైతులు కూడా వాడడం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ భారీగా ఉల్లి కషాయం, జీవామృతం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఇతర ప్రాంతాల రైతులు కూడా వచ్చి ఉల్లి కషాయం కొనుక్కెళ్తున్నారు. – గుండ్ర శివ చక్రం (95537 31023), రైతు, ఉల్లి కషాయం తయారీదారుడు, దుర్గాడ, కాకినాడ జిల్లా ఉల్లి కషాయం తయారీ, వాడకం ఇలా.. ఉల్లి కషాయానికి కావాల్సినవి: ఉల్లి పాయలు (కుళ్లినవైనా పర్వాలేదు) – 20 కేజీలు, వేపాకు – 5 కేజీలు, సీతాఫలం ఆకు – 2 కేజీలు, ఉమ్మెత్తాకు – 1 కేజీ, గోమూత్రం – 20 లీటర్లు, గోవు పేడ – 2 కేజీలు. తయారు చేసే విధానం: ఉల్లి పాయలు, వేపాకులు, సీతాఫలం ఆకులు, ఉమ్మెత్తాకులను మెత్తగా దంచి ముద్దగా చేసి దానికి ఆవు పేడ కలిపి సిద్ధం చేసుకోవాలి. ఒక పొయ్యిపై పెద్ద పాత్రను పెట్టి 20 లీటర్ల గోమూత్రాన్ని పోసి, దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఆకులు, ఉల్లి మిశ్రమాన్ని దానిలో కలుపుకోవాలి. మూడు పొంగులు వచ్చే వరకు అర గంట పాటు మరగబెట్టాలి. తరువాత చల్లారనిచ్చి, వడకట్టి ఒక పరిశుభ్రమైన డ్రమ్ములో భద్రపరచుకోవాలి. ఇలా దాదాపు 20 లీటర్ల ఉల్లి కషాయం తయారవుతుంది. మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఉల్లి కషాయాన్ని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాల పాటు పిచికారీ చేయడం వల్ల చీడపీడల నుంచి పంటకు ఉపశమనం లభిస్తుంది. వాడే విధానం: 4 లీటర్ల ఉల్లి కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి చేలల్లో పిచికారీ చేసుకోవాలి. ఉల్లి కషాయం కలిపిన సుమారు 150 లీటర్ల ద్రావణం ఎకరానికి అవసరమవుతుంది. ఉద్యానవన పంటలకు ఆకులు మొదళ్లు తడిచేలా పిచికారీ చేసుకోవడం వల్ల అన్ని రకాల పురుగులు నశిస్తాయని రైతులు చెబుతున్నారు. దుర్గాడలో ఉల్లి కషాయాన్ని పకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు లీటరు రూ. 30లకు విక్రయిస్తున్నారు. – వీఎస్‌వీఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురం, కాకినాడ జిల్లా -
ప్రాణ స్నేహితులు.. ప్రాణం పోయేప్పుడు కూడా కలిసే..
పిఠాపురం: వారిద్దరిదీ ఒకే ఊరు.. ఒకే వీధి.. ఒకే సామాజికవర్గం.. చిన్ననాటి నుంచీ ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. ఇద్దరిలో ఎవరి పనైనా కలిసే వెళతారు. మృత్యువులోనూ వారిది వీడని స్నేహబంధమైంది. కత్తిపూడి బైపాస్ రోడ్డులో వన్నెపూడి జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. ఏలేశ్వరం గ్రామానికి చెందిన గండ్రెడ్డి మాధవరావు (48) రైతు. అదే గ్రామానికి చెందిన సిరగం వెంకటరమణ అలియాస్ శ్రీను (42) వ్యవసాయ కూలీ. వీరిద్దరూ చిన్ననాటి నుంచీ ప్రాణ స్నేహితులు. మంగళవారం ఉదయం తుని మండలం తలుపులమ్మ లోవకు మోటారు సైకిల్‌పై వెళ్లి, తిరిగి వస్తున్నారు. కత్తిపూడి బైపాస్ రోడ్డులో వన్నెపూడి జంక్షన్ వద్ద బైక్ ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరావు పరిశీలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మాధవరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట రమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మృతితో ఏలేశ్వరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఆ ఎస్సై అవినీతికి అంతే లేదు!
గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సైను అరెస్ట్ చేయడం ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుల్ సింహాచలం ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ స్టేషన్ ఏర్పడిన తరువాత మొదటిసారి ఏసీబీ దాడి చేసిందని ఈ ప్రాంతీయులు అంటున్నారు. ఈ ఎస్సైపై ఇప్పుడు పలు ఆరోపణలు, వివాదాలు బయటపడుతున్నాయి. సాక్షి, గొల్లప్రోలు (పిఠాపురం): స్థానిక ఎస్సైగా బి.రామకృష్ణ 2014 బ్యాచ్‌లో ఎస్సైగా ఉద్యోగం పొందారు. పెద్దాపురం, కాకినాడ పోర్టు స్టేషన్లలో పనిచేసిన ఆయన.. 2017 జనవరి 17న గొల్లప్రోలుకు బదిలీపై వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈయనను ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రోద్భలంతో ఇక్కడికి చేయించారు. ఈయన అన్నిట్లోనూ బేరసారాలకు దిగేవారన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి పేకాట, రోడ్డు ప్రమాదాలు వరకు ప్రతి కేసులోనూ చేతులు తడపాల్సివచ్చేదట. చివరకు కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ వివారాల్లో కూడా తలదూర్చి వసూళ్లకు పాల్పడేవాడని ఇప్పుడు పలువురు చెబుతున్నారు. ఇటీవల చెందుర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో భార్యాభర్తలు, ప్రేమ వ్యవహారాల్లో నమోదైన కేసులో ఇరువర్గాలను రాజీ పెట్టి మామూళ్లు వసూళ్లు చేసినట్లు బాధితులు తెలిపారు. వన్నెపూడిలో పురుగు మందు తాగిన కేసులో రూ.30 వేల వరకు వసూలు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ప్రత్తిపాడు జంక్షన్లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో బస్సు విడుదల చేయడానికి రూ.30 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణ వచ్చింది. పేకాడుతున్న వారి వద్ద దొరికిన మొత్తం సొమ్ములో నామమాత్రపు మొత్తం చూపుతూ నమోదు చేసిన సంఘటనలు నిత్యకృత్యం. గొల్లప్రోలులో రెండు పేకాట శిబిరాలు, మల్లవరంలో కోడిపందేల నిర్వహణకు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీపావళి పండగకు బాణసంచా దుకాణాలకు అనుమతి ఇవ్వడానికి రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తాజాగా వెల్లడైంది. హైవేపై చీకటి వ్యాపారాల నుంచి ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణ. స్థానిక కొత్తపేటలో గోడ తగాదా విషయంలో కేసు రాజీకి రూ.20 వేలు, ఎస్సీపేటలో ఒక కేసుకు రూ.10 వేలు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. స్టేషను బెయిల్ విషయంలో కేసును బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేసేవారట. ఇటీవల గొల్లప్రోలులోని కొత్తపేటలో పేకాట కేసులో పట్టుబడ్డ 9 మంది నుంచి రూ.27 వేలు వసూలు చేసి, దానిని పెట్టీ కేసుగా మార్చారన్న ఆరోపణ ఉంది. గ్రావెల్ తరలింపులో.. పక్క నియోజకవర్గం నుంచి గ్రావెల్, మట్టి ఇక్కడకు తరలించడానికి ముందుగా స్టేషను మామూళ్లు వసూలు చేసేవారు. స్థానిక రెవెన్యూ అధికారులకు, నియోజకవర్గ ప్రజాప్రతినిధి కళ్లు గప్పి మరీ గ్రావెల్ దందా సాగించేవారని ఆరోపణలు ఉన్నాయి. పట్టుకున్న వాహనాలను విడుదల చేయించుకోవడానికి భారీ ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. బాస్ ఇన్స్పెక్షన్ కోసం రూ.5 లక్షల వసూలు! డివిజినల్ స్థాయి పోలీసు అధికారి ఇన్స్పెక్షన్ పేరిట పలువురి నుంచి సుమారు రూ.5 లక్షల వరకు వసూలు చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. వ్యాపారులు, మిల్లర్లు, పారిశ్రామిక వేత్తలు, చివరికి వైఎస్సార్ సీపీ నేతల నుంచి కూడా వసూళ్లు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రూ.2 లక్షలని చెప్పి.. రూ.5 లక్షలు వసూలు చేశారని పోలీసులే చెబుతున్నారు. కానిస్టేబుల్‌తో వసూళ్లు.. ఇటీవల గొల్లప్రోలు నుంచి కాకినాడ టూటౌన్ బదిలీ అయిన కానిస్టేబుల్ సింహాచలం గతంలో మామూళ్ల దందా నడిపేవాడు. అయితే అక్కడ నుంచి సింహాచలంను మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌పై అసిస్టెంట్ రైటర్‌గా రికార్డులు రాయడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. స్టేషన్లో మామూళ్లు విషయంలో అతడిని సంప్రదించా ల్సిందేనని పలువురు చెబుతున్నారు. ఏసీబీ దాడిలో ఈ కానిస్టేబుల్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విదితమే. బాధితులు అతనితో మాట్లాడిన వాయిస్ రికార్డు పెద్ద సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్లో కింద నుంచి పైవరకు చేతులు తడపాలని....ఇందులో మాకు ఎంతో రాదంటూ అతడు మాటలును బట్టి అవినీతి సొమ్ము ఎవరెవరికి అందుతున్నాయో అర్ధమవుతోందని పలువురు అంటున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌కు రిమాండ్ ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన గొల్లప్రోలు ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుల్ సింహాచలానికి ఈ నెల 29వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. బెయిల్ మంజూరు విషయంలో రూ.10 వేలు తీసుకుంటూ గురువారం రాత్రి ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్ సింహాచలం ఏసీబీకు దొరికిన విషయం విదితమే. దీంతో ఏసీబీ అధికారులు నిందితులను రాజమండ్రి ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరిచారు. వారిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. దీంతో నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఆయన తెలిపారు. -
అంతా ఊడ్చుకెళ్లిన దొంగలు!
సాక్షి, తూర్పుగోదావరి(గొల్లప్రోలు) : పట్టణంలో సోమవారం ఉదయం భారీ చోరీ జరిగింది. స్థానిక మార్కండేయపురంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు మాండపాక ప్రభాకరరావు ఇంట్లో సుమారు రూ.13లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.20వేల నగదు, విలువైన బాండ్లు, డాక్యుమెంట్లు అపహరణకు గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మండపాక ప్రభాకరరావు, అతడి భార్య వరలక్ష్మి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ప్రభాకరరావు ప్రత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో, వరలక్ష్మి గొల్లప్రోలులోని మలిరెడ్డి వెంకట్రాజు మండల పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నారు. ఉదయం యథావిధిగా ఇద్దరూ విధుల్లోకి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరలక్ష్మి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టి , బీరువాలో వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న భర్త ప్రభాకరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులను విచారించారు. ఇంటి వెనుక గోడ దూకి వచ్చి చోరీకీ పాల్పడిన వ్యక్తి ఇంటి వెనుక ఉన్న గోడ దూకి లోపలకు ప్రవేశించినట్టు బురద కాలితో ఉన్న ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. ఇంటి తాళం బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించి బీరువా తాళం తెరిచి అందులో ఉన్న వస్తువులను సోఫా, మంచంపై పేర్చి బాక్సుల్లో ఉన్న వస్తువులను చాకచక్యంగా అపహరించాడు. రూ.13లక్షల విలువైన సొత్తు అపహరణ 43కాసుల బంగారు ఆభరణాలు, 57 తులాల వెండి వస్తువులతో పాటు రూ.20వేల నగదు చోరీకు గురైంది. వీటి విలువ సుమారు రూ.13లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. వీటితో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసిన రూ.9.85 లక్షల విలువైన డిపాజిట్ బాండ్లు, రెండు స్థలాల డాక్యుమెంట్లు, భూమి డాక్యుమెంట్లు కూడా అపహరణకు గురయ్యాయి. క్రైమ్ పార్టీ, స్థానిక పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి, సమీప నివాసితుల నుంచి వివరాలు సేకరించారు. తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. -
గొల్లప్రోలు వద్ద రైలులో అగ్నిప్రమాదం
-
యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, తూర్పు గోదావరి: యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలులోని వంటచేసే బోగీలో(ప్యాంట్రీ కార్) మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయడపడ్డారు. ప్రమాదం జరగడంతో ఐదు గంటలుగా రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. ప్రమాదానికి గురైన రైలును మరికాసేపట్లో గొల్లప్రోలు నుంచి పిఠాపురం తరలించనున్నారు. గొల్లప్రోలు స్టేషన్ వద్ద రెండు రైల్వే లైన్లు మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం ఒకే లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో విజయవాడ-విశాఖపట్నం మద్య రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు రైల్వే అధికారుల తీరుపై మండిపడుతున్నారు. -
‘తూర్పు’లో మరో చింతమనేని
కాకినాడ: మహిళల పట్ల టీడీపీ నాయకుల ప్రవర్తన మారినట్లుగా కనిపించడం లేదు. గతంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్, మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెల్సిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఓ మహిళా అధికారితో డ్రైనేజీలో చేయి పెట్టించి వార్తల్లోకి ఎక్కారు. గొల్లప్రోలు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మీతో బలవంతంగా కచ్ఛ డ్రైనేజీలో చేయి పెట్టించి మురుగు నీటి మట్టిని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎత్తించారు. ఇటీవల గొల్లప్రోలు 10వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం సందర్భంగా డ్రైనేజీ శుభ్రంపై స్థానికులు, ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ, శానిటరీ అధికారులకు ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మీని పిలిపించి ఆమె నుంచి బలవంతంగా సెల్‌ఫోన్ లాక్కున్నారు. కాలువ పారతో కచ్ఛ డ్రైయిన్‌లో మట్టిని తీస్తూ..శివలక్ష్మీ చేత్తో ఆ మట్టిని బలవంతంగా ఎత్తించారు. అందరి ముందు అవమానానికి గురికావడంతో శివలక్ష్మీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. విధులలో నిర్లక్ష్యం వహించిందన్న కారణంగా శివలక్ష్మీని, మున్సిపల్ కమిషనర్ విధుల నుంచి ఉపసంహరించారు. ఎమ్మెల్యే వర్మ తనకు చేసిన అవమానంపై ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని శివలక్ష్మీ కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు కూడా చేశారు. నలభై వేల మంది జనాభా కలిగిన గొల్లప్రోలు మున్సిపాలిటీలో 60 మంది శానిటరీ సిబ్బంది ఉండాలి.. కానీ 32 మంది మాత్రమే ఉన్నారు. -
చేబ్రోలు ప్రమాదానికి మట్టి మాఫియానే కారణం
-
చేబ్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర ప్రమాదం; ఆటో నుజ్జు నుజ్జు
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది గాయపడ్డారు. టాటా మ్యాజిక్ ఆటోను టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జయిపోయింది. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలం బీతావహంగా ఉంది. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు విశాఖపట్నం జిల్లా మాచవరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కాకినాడలో గృహప్రవేశానికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చేబ్రోలు రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
26 రోజులుగా పూజలు.. ఆ పాము మృతి
సాక్షి, పిఠాపురం(తూర్పుగోదావరి): గత కొన్ని రోజులుగా జిల్లా ప్రజలు దేవుడని కొలుస్తూ పూజలు చేస్తున్న పాము గురువారం మృతిచెందింది. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని ఓ రైతు పొలంలో 26 రోజుల క్రితం కనిపించిన పామును గ్రామ ప్రజలు సుబ్రమణ్య స్వామి స్వరూపం అంటూ పూజలు చేశారు. ఆ పాము గ్రామస్తుల దగ్గరికి వెళ్లినా వారిని కాటు వేయకపోవడంతో సాక్షాత్తు దేవుడేనంటూ మరింత నమ్మకం ఏర్పరుచుకున్నారు. బుధవారం కుసుం విడిచిన పాము అనుకోకుండా మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎస్సైయే కారణం.. గత కొన్ని రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న పాము మృతిచెందటానికి గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ కారణమంటూ దుర్గాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎస్సైను సస్పెండ్ చేయాలంటూ గ్రామస్తులు జాతీయరహదారిపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. పాము మృతి చెందిన స్థలంలో గుడి కట్టాలని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. -
‘డిజిటల్ బోధన’ లో గొల్లప్రోలు ప్రథమ స్థానం
రాష్ట్రంలో ద్వితీయస్థానం గొల్లప్రోలు : జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోధనలో గొల్లప్రోలు జెడ్పీ బాలుర పాఠశాల రాష్ట్రంలో ద్వితీయస్థానం, ల్లాలో ప్రథమ స్థానం సాధించింది. జిల్లా వ్యాప్తంగా గత నవంబర్‌లో వందపాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సులభమైన, ఆసక్తికరమైన పద్ధతుల్లో బోధన చేయడానికి డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా గొల్లప్రోలు జెడ్పీసూ్కల్ 188 గంటల పాటు డిజిటల్ క్లాసులు నిర్వహించినట్టు జిల్లావిద్యాశాఖ వెలువడించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మందస మండలం వీరగున్నమాపురం ప్రథమస్థానంలో నిలిచింది. జిల్లాలో కరప హైసూ్కల్ ద్వితీయస్థానంలో నిలిచింది. ఈమేరకు పాఠశాలలో డిజిటల్ క్లాసుల నిర్వహణకు కృషి చేసిన ఇ¯ŒSచార్జి జే.కామేశ్వరరావును, ప్రధానోపాధ్యాయులు జీఏ ప్రశాంతిని పలువురు అభినందించారు. -
ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి
గొల్లప్రోలు : గొల్లప్రోలుకు చెందిన విద్యాకమిటీ మాజీచైర్మన్, సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక మండలశాఖ అధ్యక్షుడు పడాల రత¯ŒSభరత్ (43) చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. స్థానిక మండలపరిషత్ పాఠశాల వద్ద బుధవారం పెట్రోల్‌పోసుకుని ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహంతో రాస్తారోకో.. భరత్మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సమాచారహక్కుప్రచార ఐక్యవేదిక సభ్యులు, కుటుంబసభ్యులు మృతదేహంతో స్థానిక రాయవరం సెంటర్లో రాస్తారోకో చేశారు. ఆయన మృతికి కారకులైన ఉపాధ్యాయులు, గొల్లప్రోలు ఎస్ఐ బి.శివకృష్ణలను వెంటనే సస్పెండ్‌చేయాలని డిమాండ్ చేశారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. పిఠాపురం సీఐ ఉమర్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులకు, సమాచారహక్కు ఐక్యవేదిక సభ్యులకు కొంతసేపు వాగ్వాదం చోటుచేకుంది. దీంతో పెద్దలు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాచారహక్కుప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు చేతన మాట్లాడుతూ భరత్‌పై తప్పుడు కేసు బనాయించడమే కాకుండా, కొందరు ఉపాధ్యాయులు ఆయనను హతమార్చేందుకు పన్నాగం పన్నారన్నారు. మేజిస్ట్రేట్ అనుమతి లేనిదే నిందితులను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఎస్ఐ భరత్‌ను అరెస్ట్ చేసారన్నారు. తప్పుడు పనులు చేస్తూ, విధులకు గైర్హాజరవుతున్నారని జిల్లాకలెక్టర్‌కు భరత్ íఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఉపాధ్యాయులు పథకం ప్రకారం తప్పుడు కేసు పెట్టడమే కాకుండా ఆయన బలవన్మరణానికి కారణమయ్యారన్నారు. మేజిస్ట్రేట్ మరణ వాంగ్మూలం ప్రకారం ఎస్ఐను, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ఐక్యవేదిక నాయకురాలు జంగా సంతోష్‌కుమారి డిమాండ్ చేసారు. మృతుని కుటుంబానికి రూ 25 లక్షలు పరిహారం, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమాచారహక్కు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐక్యవేదిక మహిళావిభాగం అధ్యక్షురాలు నాళం ఆండాల్ తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో రెండిళ్లు దగ్ధం
నాలుగు కుటుంబాలు నిరాశ్రయం∙ రూ.4 లక్షల ఆస్తినష్టం గొల్లప్రోలు : చేబ్రోలులోని పల్లపువీధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తినష్టం ఏర్పడి, నాలుగు కుటుంబాలు నిరాశ్రయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పక్క పక్క నున్న రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పాలపర్తి రామన్నదొర, అతడి కుమారుడు దుర్గాబాబు నివాసం ఉంటోన్న ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంటిలో ఉన్న టీవీ, ఫ్యాను, ఎలక్టిక్రల్ గృహోపకరణాలు, బియ్యం, దుస్తులు బూడిదయ్యాయి. ముందు రోజు బ్యాంకు నుంచి తీసుకొచ్చిన డ్వాక్రా రుణం రూ.30 వేలు, అప్పు తీర్చేందుకు దాచి ఉంచిన రూ.20 వేలు మొత్తం రూ.50 వేలు కాలి బూడిదయ్యాయి. వీటితో పాటు ఇంటికాగితాలు, ఆధార్, రేష¯ŒSకార్డులు కూడా కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలామని, రెక్కాడితేకానీ డొక్కాడని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. మరో ఇంటి ప్రమాదంలో... చుట్టలు చుట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న లింగం చిన్నయ్యదొర, అతడి కుమారుడు సూర్యప్రకాష్ ఉంటున్న ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. బ్యాంకులో నుంచి తీసుకొచ్చిన డ్వాక్రా రుణం రూ.50 వేలు, కూతురికి కొత్త దుస్తులు కొందామని దాచుకున్న రూ.20 వేలు కాలిపోయాయి. ఎలక్టిక్రల్, గృహోపకరణాలు, దుస్తులు, బూడిదయ్యాయి.వారు కట్టుబట్టలతో మిగిలారు. పేలిన గ్యాస్ సిలిండర్... అగ్నిమంటలకు చిన్నయ్యదొర ఇంటిలో ఉన్న సిలండర్ భారీ శబ్ధంతో పేలిపోయింది. పేలుడు దాటీకి సిలండర్లోని ఇనుప భాగాలు సుమారు వంద అడుగులు దూరంలో ఎగిసిపడ్డాయి. పేలుడు శబ్ధానికి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు బయటకు పరుగులు తీశారు. పిఠాపురం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు ఇళ్లు మొత్తం కాలిపోయాయి. -
బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పాదనకు ప్రాధాన్యం
గొల్లప్రోలు : బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పాదనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పట్టుపరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇ.రాంబాబు తెలిపారు. డీడీగా బాధ్యతలు స్వీరించిన అనంతరం ఆయన మొదటిసారిగా చేబ్రోలు పట్టు పరిశ్రమకేంద్రం పరిధిలోని పట్టుక్షేత్రాలను శుక్రవారం సందర్శించారు. పట్టుపురుగుల పెంపకం షెడ్లను, మల్బరీతోటలను పరిశీలించారు. అలాగే పట్టురైతుల అనుభవాలను తెలుసుకున్నారు. పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను, రేరింగ్షెడ్డు సంరక్షణను, మల్బరీతోటల యాజమాన్యపద్ధతులను ఆయన రైతులకు వివరించారు. అనంతరం ప్రయోగాత్మకంగా పెంపకం చేపట్టిన ఎఫ్‌సీ 3 క్ష 4రకం పట్టుగూళ్లను పరిశీలించారు. గూళ్ల నాణ్యత, దిగుబడిపై రైతులతో మాట్లాడారు. దిగుబడి ఆశాజనకంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చే శారు. ముఖ్యంగా సీతాకాలంలో తేమ నియంత్రణకు రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచించారు. రేరింగ్షెడ్డుకు గాలి విస్తారంగా తగిలేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేడిగాలి బయటకు పోయేలా షెడ్డు పైభాగంలో వెంటిలేటర్ల సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. రానున్న 4 నెలల కాలంలో బైవోల్టిన్ పట్టుగూళ్ల పెంపకాన్ని అధికంగా చేపట్టేలా రైతులను చైతన్యపరుస్తున్నామన్నారు. మంచి దిగుబడులు సాధనకు ఎప్పటికప్పుడు ప్రత్యేక సూచనలు అందచేస్తున్నామన్నారు. అనంతరం ఆయన పట్టుపరిశ్రమ కేంద్రంలోని రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన వెంట ఏడీ ఎన్.సత్యనారాయణ, ఏఎస్ఓ కోనేటి అప్పారావు, టెక్నికల్ అసిస్టెంట్ కాకి రామచంద్రరావు ఉన్నారు.