Gopinath
-
రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం
సాక్షి, హైదరాబాద్/ గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని.. మాతాశిశు మరణాలు, విషజ్వరాలు పెరిగిపోతు న్నాయని బీఆర్ఎస్ ‘ప్రజారోగ్య కమిటీ’ మండిప డింది. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ఎమర్జెన్సీ పాలన అని ఆరోపించింది. గాంధీ ఆస్ప త్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తే పోలీ సులు అడ్డుకోవడం దారుణమని మండిపడింది.గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. నేతల అరెస్టులు..ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ టి.రాజయ్య నేతృత్వంలో.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌లతో కమిటీని వేసింది. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని.. మాతాశిశు మరణాలపై నిజనిర్ధారణ చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. అయితే కమి టీకి నేతృత్వం వహిస్తున్న టి.రాజయ్యను పోలీ సులు ఉదయమే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గృహ నిర్బంధం చేశారు. మిగతా ఇద్దరు సభ్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ మెతుకు ఆనంద్ పోలీసుల కళ్లు గప్పి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరికొందరు పార్టీ నేతలతో కలసి గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులు వారిని ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరగ డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు మాగంటి గోపీనాథ్, సంజయ్, మెతుకు ఆనంద్ లను అరెస్టు చేసి నారాయణగూడ ఠాణాకు.. ఇతర నేతలు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించి బొల్లారం ఠాణాకు తరలించారు. మధ్యాహ్నం తర్వాత నేతలు, కార్యకర్తలను వదిలేశారు.రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలిగాంధీ ఆస్పత్రి ఘటన తర్వాత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రజారోగ్య కమిటీ సభ్యులు రాజయ్య, సంజయ్, మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లా డారు. సీఎం, మంత్రుల సమీక్ష లేకపోవడంతో.. రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గిపోయాయని రాజయ్య ఆరోపించారు. నిజనిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిద్రపోతోందని డాక్టర్ సంజ య్ విమర్శించారు. ఆస్పత్రుల్లో డొల్లతనం బయట పడుతుందనే తమకు అడ్డుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. నిపుణులైన వైద్యులు లేకే, ఆస్పత్రుల్లో మరణాలు సంభవి స్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాతాశిశు మరణాలపై దాపరికం ఎందుకు?ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న మాతాశిశు మరణాలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాపరికంగా వ్యవహరి స్తోందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక అంశాలపైనే పోరాడుతు న్నామని, ప్రతిపక్షంగా ఇది తమ బాధ్యత అని చెప్పారు. సీఎం కార్యాలయం నుంచి వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సరైన సహ కారం లేదని ఆరోపించారు. -
అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ‘ఉపాధి కల్పనలో భారత్ జీ20 దేశాలలో వెనుకబడి ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి దేశం అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది’ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ శనివారం తెలిపారు. 2010–20 మధ్య భారత్ సగటున 6.6 శాతం వృద్ధిని సాధించిందని, అయితే ఉపాధి రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గీత చెప్పారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం, నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడం, ట్యాక్స్ బేస్‌ను విస్తృతం చేయడం అవసరమని తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక కీలక దేశంగా ఉండాలనుకుంటే దిగుమతి సుంకాలను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. -
ఆ తమిళ ఎంపీకి తెలుగుపై ఎందుకంత ప్రేమ?
తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ సమావేశాల రెండో రోజు లోక్‌సభలో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ ఆయన తెలుగులో ఎందు ప్రమాణం చేశారు? ఆయనకు తెలుగుతో ఉన్న అనుబంధం ఏమిటి?పార్లమెంట్ సమావేశాల రెండవ రోజున కొత్తగా ఎంపీకైన ఎంపీలలోని పలువులు తమ ప్రాంతీయ భాషలలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన ఎంపీ కే గోపినాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీ మరొక రాష్ట్రపు మాతృ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం ఏమిటా? అని అందరూ అతనిని ఆసక్తిగా గమనించారు. ఎంపీ గోపినాథ్ ఓ చేతితో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చివరిలో జై తమిళనాడు అని తమిళంలో నినదిస్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గోపీనాథ్ తెలుగు కుటుంబానికి చెందిన వారు. కృష్ణగిరి జిల్లా హోసూరు ఆయన స్వస్థలం. గోపీనాథ్ విద్యాభ్యాసం తెలుగులో కొనసాగింది. 2001, 2006, 2011లలో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. తమిళనాడులో ఏర్పడిన తెలుగు భాషా సమస్యలతో పాటు, అక్కడి తెలుగు వారి కోసం ఎంపీ గోపీనాథ్ పోరాడారు. తమిళనాడు అసెంబ్లీలోనూ ఆయన పలుమార్లు తెలుగులో ప్రసంగించారు. మాతృభాషపై ఎనలేని మమకారమున్న గోపీనాథ్ మరోమారు పార్లమెంటులోనూ తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.కృష్ణగిరి జిల్లా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు అతి సమీపంలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషలను కూడా మాట్లాడుతారు. కాగా గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత కూడా అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో వైరల్ అవుతుంటుంది. .@INCTamilNadu MP K. Gopinath from the Krishnagiri constituency surprised everyone by taking his oath in #Telugu. pic.twitter.com/ooGgVDg4VH— South First (@TheSouthfirst) June 25, 2024 -
నేటినుంచి విశాఖలో లెజెండ్స్ క్రికెట్
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియంలో ముగిసే లీగ్‌దశ చివరి ఫేజ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎల్ఎల్సీ నాకవుట్‌కు చేరుకుంటాయని ఏసీఏ అపెక్స్ కౌ న్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి తెలి పారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో చివరి దశ పోటీల్లో భాగంగా శనివారం తలపడనున్న జట్ల ఆటగాళ్లు శుక్రవారం విశాఖ చేరుకున్నారని చెప్పారు. నాకవుట్ పోటీలు సూరత్‌లో జరుగనున్నాయన్నారు. ఇండియా కాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్‌తో పాటు సదరన్ సూపర్‌స్టార్స్ జట్ల సభ్యులు విశాఖ చేరుకోగా ఎయిర్‌పోర్టులో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఘనంగా స్వాగతం పలికిందని తెలిపారు. అర్బన్‌రైజర్స్ జట్టు శనివారం విశాఖ చేరుకోనుందని చెప్పారు. విశాఖలో మ్యాచ్‌లు.. శనివారం రాత్రి ఏడుగంటలకు ఇండియా కాపిటల్స్ జట్టుతో మణిపాల్ టైగర్స్ తలపడనుండగా, ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు గుజరాత్ జెయింట్స్‌తో సదరన్ సూపర్‌స్టార్స్ జట్టు తలపడనుంది. 4వ తేదీ రాత్రి ఏడుగంటలకు లీగ్ దశలో చివరి మ్యాచ్ రాత్రి ఏడుగంటలకు మణిపాల్ టైగర్స్‌తో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. -
ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తిలో ని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపీనాథ్ మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా, స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆర్కే గ్రూప్స్ అధినేత పద్మశ్రీ డాక్టర్ రవి పిళ్లై, సుమారు 20 మంది రష్యా దేశస్థులు కూడా ఉన్నారు. -
అడవి బిడ్డల వెతల గాథ.. ‘ఈతచెట్టు దేవుడు’
ఒడిశా రాష్ట్రంలో వెనుకబడిన కొరాపుట్ జిల్లా– అక్కడి కొండకోనల్లో బతుకులు వెళ్లమార్చే అడవిబిడ్డల వెతల గాథ ‘ఈతచెట్టు దేవుడు’. సుప్రసిద్ధ ఒడియా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాథ్ మహంతి రాసిన ‘దాది బుఢా’ నవలను డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి ‘ఈతచెట్టు దేవుడు’గా తెలుగులోకి అనువదించారు. ఇదివరకే ఈ నవల ‘ది ఏన్సెస్టర్’ పేరిట ఇంగ్లిష్‌లోకి అనువదితమైంది. ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా కొరాపుట్ జిల్లాలో కొంతకాలం పనిచేసిన గోపీనాథ్ మహంతి అక్కడి ఆదివాసీల జీవితాలను దగ్గరగా గమనించారు. లుల్లా అనే గ్రామంలోని గిరిజనుల బతుకులను, వాళ్ల వెతలను కళ్లకు కట్టే గాథ ఇది. లుల్లా గ్రామాన్ని అక్కడి గిరిజనులు విడిచిపెట్టి, మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు పాఠకులను కదిలిస్తాయి. ఒడియా భాషా సాహిత్యాలతో సుదీర్ఘ పరిచయం గల రచయిత్రి డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి ఈ నవలను మూలంలోని ఒరవడిని ఒడిసి పట్టుకుని అనువదించిన తీరు ప్రశంసనీయం. నవలలోని గిరిజనుల సంభాషణలకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని కళింగసీమ మాండలికాన్ని ఎంచుకోవడం సముచితం. – దాసు -
జీవీ– 2 చిత్ర కథను రెండు రోజుల్లో రాశా..!
సాక్షి, తమిళనాడు: జీవీ– 2 చిత్ర కథను రెండు రోజుల్లో రాసినట్లు దర్శకుడు వీజే గోపీనాథ్ తెలిపారు. ఈయన దర్శకత్వంలో నటుడు వెట్రి హీరోగా నటించిన జీవీ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమే జీవీ –2. ఇటీవల శింబు కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో మానాడు వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి తన వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. (చదవండి: నా కెరీర్లో బెస్ట్ పాత్ర ఇదే!: మెహరీన్) దర్శకుడు మాట్లాడుతూ జీవీ చిత్రానికి కథ, సంభాషణలు రచయిత బాబు తమిళ్ రాశారని చెప్పారు. దానికి సీక్వెల్ చేయాలని భావించినప్పుడు రచయిత బాబు తమిళ్‌ను సంప్రదించగా జీవీ చిత్రానికి సీక్వెల్ అవకాశమే లేదని చెప్పడంతో తానే కథను తయారు చేయడానికి సిద్ధమయ్యానన్నారు. అలా రెండు రోజుల్లోనే జీవీ– 2 చిత్ర కథను రాశానని తెలిపారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. -
ఆకాశం హద్దులు దాటించిన వ్యక్తి.. ఇప్పుడెక్కడ?
Deccan Aviations GR Gopinath దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. ఆ మాటల స్ఫూర్తికి వాస్తవ రూపం ఇచ్చినవారిలో జీఆర్ గోపినాథ్ ఒకరు. విమాన ప్రయాణం చేసే హక్కు సంపన్నులకే కాదు. ఈ దేశంలో ఉన్న సామాన్యులకు కూడా ఉందని చాటి చెప్పారు. ఒక్క రూపాయికే ఆకాశయానం కలిగించిన గొప్ప ఎంట్రప్యూనర్ గోపినాథ్. ఆకాశం నీ హద్దురా డైనమిక్ ఎంట్రప్యూనర్, సోషల్ రీఫార్మర్, దేశభక్తుడైన గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఆకాశం నీ హద్దురా అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఇప్పుడా గోపినాథ్ ఏం చేస్తున్నారు. తన దక్కన్ ఏవియేషన్ సంస్థ గురించి ఏం చెప్పారు. ఈ దేశ భవిష్యత్తు గురించి ఆయన కంటున్న కలలు ఏంటీ ? ఇటీవల మనీ కంట్రోల్ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు మీ కోసం.. మిస్ అవుతున్నా దక్కన్ ఏవియేషన్స్ సీఈఓగా ఉన్నప్పుడు సామాన్యులను విమానంలోకి ఎక్కించడం, టైర్ టూ సిటీల మద్య ఎయిర్ కనెక్టివిటీ కల్పించడం వంటి పనులు చేపట్టినప్పుడు ఒంట్లో కొత్త శక్తి ప్రవహించేది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడది మిస్ అవుతున్నాను. ఆ తప్పు చేయను పునర్జన్మలపై నాకు నమ్మకం లేదు, కానీ మళ్లీ జన్మంటూ ఉంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నా డెక్కన్ ఏవియేషన్‌ను విజయ్‌మాల్యాకు అమ్మను గాక అమ్మను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకోవడం పొరపాటు. నేను నా మనసు మాట విని ఉండాల్సింది. కానీ అలా చేయకుండా డెక్కన్ ఏవియేషన్‌లో పెట్టుబడిదారుల అభిప్రాయం వైపుకే మొగ్గు చూపాను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయడం వల్ల మాకు లాభాలు వచ్చాయనే మాట నిజమే. కానీ సామాన్యులకు విమానయానం దగ్గర చేయాలనే నా కల. కానీ అలా జరగలేదు. అయితే జరిగినదాని గురించి జరగబోయేదాని గురించి నాకు పెద్దగా బాధ అయితే లేదు. రాజకీయాల్లో... కింగ్‌ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యాకు ఎయిర్ దక్కన్ని అమ్మేసిన తర్వాత ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో బెంగళూరు సౌత్ నియోకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. అయినా సరే నా ప్రయాణం అపకుండా అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నాను. ఆప్ పార్టీ పెట్టగానే దానిలో చేరాను. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంత్రృత్వ పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశాను. కానీ పార్టీ పెట్టిన తీరు, ఎన్నికల్లో గెలిపించిన వైనం, పరిపాలన చేస్తున్న విధానాల పరంగా అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇప్పటికీ అభిమానం, గౌరవం ఉన్నాయి. రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా ప్రారంభించారనే నమ్ముతాను. అలాంటి నేతలు కావాలి బడా కార్పోరేట్ కంపెనీలు అన్ని కూడా పాలసీ తయారీలో కీలకంగా ఉండే వారితో దగ్గరి సంబంధాలు నెరుపుతున్నాయి. కార్పోరేట్ శక్తులకు మంచి నాయకులు కాదు మనకు కావాల్సింది. సామాజికంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చే సృజనాత్మక ఐడియాలు కలిగిన ఎంట్రప్యూనర్లు ప్రోత్సహించేవారు కావాలి. అప్పుడే మన సమాజం వేగంగా మార్పులు వస్తాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. వారిపైనే ఆశలు ఇప్పుడున్న ఎంట్రప్యూనర్లలో ఓలా భవీష్ అగర్వాల్, పేటీఎం విజయ్ శేఖర్ శర్మలు ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నారు. ఇలా వ్యక్తులు మనకు వేలమంది కావాలి. వారంత విభిన్న రంగాల్లోకి చొచ్చుకుపోవాలి. తమకున్న ఐడియాలను ఆచరణలోకి తెచ్చి దేశ గతిని మార్చేయాలి. నా దృష్టిలో ఈ రోజుల్లో ఫ్రీడం ఫైటర్లు అంటే ఎంట్రప్యూనర్లే. వారే ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలరు. అలా జరగడం లేదు నరేంద్రమోదీ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టగానే రెడ్టేపిజంలో మార్పులు వస్తాయని ఆశించాను. కానీ అలా ఏం జరగడం లేదు. రెట్రోట్యాక్స్ను రద్దు చేయడానికే ఏడేళ్లు సమయం తీసుకున్నారు. కొత్త ఎంట్రప్యూనర్లకు క్షేత్రస్థాయిలో అనవసరంగా ఎదురయ్యే అడ్డంకులు తొలగించాలి. ఐడియాలో సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి వచ్చే వెసులుబాటు ప్రభుత్వ పరంగా ఉండాలి. అప్పుడే మనం చైనాను దాటి అభివృద్ధిలో ముందుకు పోగలం. రిటైర్ అయ్యాక రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదు. దక్కన్ ఏవియేషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బిజిగానే ఉంటున్నాను. కర్నాటకలోని మా సొంతూరిలో వ్యవసాయం క్షేత్రంలో ఎక్కువ సేపు గడుపుతుంటా. దీంతోపాటు డెక్కన్ ఛార్టర్స్ అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా హోదాలో ఉన్నాను. ఈ సంస్థ ఆధీనంలో యాభై వరకు హెలికాప్టర్లు, జెట్ విమానాలు ఉన్నాయి. వీటి నిర్వాహణకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఇక రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, అవినీతి తదితర అంశాలపై గంటల తరబడి జరిగే చర్చాగోష్టీల్లో భాగమవుతాను. వర్తమాన అంశాలపై పుస్తకాలు కూడా రాస్తుంటాను. ఇప్పటికే సింపుల్ ఫ్లై, వన్ కనాట్ మిస్ ద ఫ్లైట్ అనే పుస్తకాలు అచ్చయ్యాయి. - సాక్షి , వెబ్‌డెస్క్ చదవండి: స్త్రీలు ఎగరేసిన విమానం -
Rana Daggubati: ప్యాన్ ఇండియా మూవీకి సై
‘టాప్ హీరో, దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ వంటి సినిమాలను నిర్మించిన ఆచంట గోపీనాథ్ ప్రస్తుతం ఓ ప్యాన్ ఇండియా సినిమాకి శ్రీకారం చుట్టారు. రానా దగ్గుబాటి హీరోగా విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో సీహెచ్ రాంబాబుతో కలిసి ఆచంట గోపీనాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ పూర్తయిన తర్వాత రానాతో మా సినిమా ప్రారంభం అవుతుంది. ఇప్పటికే కథ ఓకే అయింది. కథ, కథనం, హీరో పాత్రచిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. కాగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ ‘ఇమైక్క నొడిగళ్’ను తెలుగులో ‘అంజలి సీబీఐ’గా విడుదల చేశారు ఆచంట గోపీనాథ్. -
స్త్రీలు ఎగరేసిన విమానం
నలుగురు స్త్రీలు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు. పేదవాడిని రూపాయి టికెట్‌తో విమానంలో కూచోబెట్టిన ‘ఎయిర్ డెక్కన్’ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకు దర్శకత్వం వహించిన స్త్రీ– సుధ కొంగర... భర్త విమానం ఎగరేయడానికి ముందే ‘బన్ వరల్డ్’ అనే బేకరీ పెట్టి అతని కల నెరవేర్చుకోవడానికి గొప్ప బలం ఇచ్చిన భార్య భార్గవి గోపీనాథ్.. ఆ పాత్రను తెర మీద అద్భుతంగా పోషించి హీరోకు హీరోయినూ సమానమే అని నిరూపించిన మలయాళ నటి అపర్ణ బాల మురళి.. కొడుకు పక్కన కొండలా నిలిచిన తల్లి పాత్ర పోషించిన ఊర్వశీ... వీరంతా ఇప్పుడు ప్రేక్షకులలో స్ఫూర్తినింపే ఒక విమానాన్ని ఎగురవేశారు. గొప్ప కలలు కనడం సామాన్యుడి హక్కు అని సందేశం ఇస్తున్నారు. గోపీనాథ్ అతని భార్య గురించిన సినిమా – జీవిత విశేషాల కథనం ఇది. కెప్టెన్ గోపీనాథ్‌గా, ‘ఎయిర్ డెక్కన్’ గోపీనాథ్‌గా దేశానికి తెలిసిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ 1980లలో తన 28వ ఏట మిలట్రీ నుంచి బయటపడ్డాడు. ఆయన కర్ణాటకలోని తన సొంత ప్రాంతం హసన్‌కు వచ్చి సేంద్రీయ పద్ధతుల్లో తన పెద్దలు ఇచ్చిన పొలంలో సెరికల్చర్ ప్రారంభించాడు. ఆయనకు భార్గవితో పెళ్లయ్యింది. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. 1997లో చార్టర్ హెలికాప్టర్లను అద్దెకు తిప్పే సంస్థను గోపీనాథ్ మొదలెట్టే నాటికే పిల్లల చదువు కోసమే కాదు కుటుంబానికి ఆర్థికపరమైన దన్ను కోసం భార్గవి బెంగళూరు వచ్చేశారు. ఆమె బంధువొకరు అప్పటికే బెంగళూరులో బేకరీ నడుపుతున్నారు. ఆయన సహాయంతో మల్లేశ్వరంలో ఆమె ‘బన్ వరల్డ్’ అనే బేకరీని స్థాపించారు. కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడాన బన్ వరల్డ్ విపరీతంగా ఆదరణ పొందింది. విద్యార్థులు అక్కడికి వచ్చి కూచునే స్థలం అయ్యింది. గోపీనాథ్ తన జీవితంలో ఏ ప్రయోగం చేసినా, సామాన్యుడు ఎక్కే విమానయాన సంస్థ ప్రారంభించాలనుకున్నా తన వెనుక తన భార్య నడిపే బేకరి ఉంది, తనకు ఆమె సంపూర్ణ మద్దతు ఉంది అని భావించడం వల్లే. అలాగని భార్గవి పూర్తిగా భర్త చాటు భార్యగా పూర్తిగా ఉండలేదు. గోపీనాథ్‌కు సలహాదారుగా, మార్గదర్శి గా, ఆర్థిక సర్దుబాటుదారుగా కూడా ఉంది. అందుకే తన జీవిత కథ స్ఫూర్తితో తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను చూసిన గోపీనాథ్ ‘నా భార్య పాత్ర ఎలా ఉండాలో అలా ఉంది’ అని చిత్ర హీరో–నిర్మాత సూర్యను, దర్శకురాలు సుధ కొంగరను ప్రశంసించాడు. సినిమాలో ఆయన భార్య పాత్రను మలయాళ నటి అపర్ణ బాలమురళి పోషించింది. భర్తను డీకొట్టేలా ఉంటూనే అతన్ని ఎంతో సమర్థించే పాత్ర అది. నిజ జీవితం కర్ణాటకకు చెందిన గోపీనాథ్‌ను భారత పౌర విమానయాన చరిత్రను తిరగరాసిన వ్యక్తిగా చెప్పుకుంటారు. 2003 వరకూ ఆకాశంలో విహరించడం అనేది డబ్బున్నవారి వ్యవహారంగా మాత్రమే దేశంలో ఉంటే గోపీనాథ్ తన ‘ఎయిర్ డెక్కన్’ సంస్థతో దానిని సమూలంగా మార్చేశాడు. ఒక్కశాతం మంది కే అందుబాటులో ఉండే విమానయానాన్ని దాదాపు 40 శాతం మందికి ఆయన చేరువ చేశాడు. చిన్న విమానాలు నడపడం, చిన్న ఊళ్లకు నడపటం, ట్రావెల్ ఏజెంట్ కమీషన్‌ను తొలగించి నేరుగా టికెట్ కొనే ఏర్పాటు చేయడం, ప్రయాణంలో ఇచ్చే తినుబండారాల, పానీయాల చార్జిని తొలగించి అవి కావాల్సిన వారు ఫ్లయిట్లోనే కొనుక్కునే ఏర్పాటు చేయడం ఇవన్నీ సంచలనం సృష్టించాయి. అన్నింటి కంటే మించి ‘ఒక రూపాయి’ టికెట్ స్కీమ్ పెట్టి రెండు మూడు నెలల ముందు టికెట్ బుక్ చేసుకుంటే ఒక్క రూపాయికే విమాన ప్రయాణం చేయొచ్చు అని ఆఫర్ ఇవ్వడంతో రైలులో ఎన్నడూ ఫస్ట్ క్లాస్ ప్రయాణం చేసి ఎరగని వారు కూడా విమానం ఎక్కారు. 2003–2007 వరకూ సాగిన ఎయిర్ డెక్కన్ ఆ తర్వాత ‘కింగ్ ఫిషర్’లో విలీనం అయ్యింది. తన అనుభవాలను ఆయన ‘సింప్లి ఫ్లై’ పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం స్ఫూర్తిగానే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తయారైంది. సినిమా మార్పు కెప్టెన్ గోపీనాథ్ ’సింప్లి ఫ్లై’ పేరుతో తన ఆత్మానుభవాలు రాశాక దానిని చదివిన గిరీష్ కర్నాడ్ ‘ఈ కథ మంచి సినిమా అవుతుంది’ అని నలుగురికీ చెప్పడం మొదలెట్టాడు. ఈ పుస్తకాన్ని విపరీతంగా ఇష్టపడ్డ సుధ కొంగర రైట్స్ కోసం గోపీనాథ్‌ను సంప్రదిస్తే ఎందుకో ఆయన ఇవ్వలేదు. ఈలోపు తన డాక్యుమెంటరీ ‘పిరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’తో ఆస్కార్ సాధించిన నిర్మాత గునీత్ మోంగా ఆ రైట్స్ సాధించింది. అయినా వెనక్కు తగ్గని సుధ ఆ కథను సూర్యాకు చెప్పి ఒప్పించి గునీత్తో కలిసి సినిమా నిర్మించేలా ప్రాజెక్ట్‌ను చక్కబరిచింది. నిజ జీవితంలో కథ కర్నాటకలో జరిగినా సినిమా తమిళంలో తీయడం వల్ల మదురై ప్రాంతానికి (తెలుగులో చుండూరు) మారింది. స్కూల్ టీచర్ కొడుకైన సూర్య తమ పల్లెలో ఆగని రైలు కోసం పోరాడే స్థాయి నుంచి తన పల్లెవారు విమానం ఎక్కే స్థాయి వరకు చేసే పోరాటం గా ‘సూరారై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) తయారైంది. అప్పటికే విమానయానంలో ఉన్న పెద్ద పెద్ద మొసళ్లు, తిమింగలాలు సామాన్యుడికి విమాన టికెట్ అందుబాటులోకి తెస్తాను అంటూ సూర్య బయలుదేరితే ఎటువంటి కష్టాలు తెచ్చి పెడతారో నాటకీయంగా సినిమాకు తగిన స్థాయిలో చూపించారు. నలుగురు స్త్రీలు ఈ కథ ఖర్చుతో కూడిన కథ. విమానాలు, ఎయిర్‌పోర్ట్‌లు అంటే పెద్ద బడ్జెట్ అవసరం అవుతుంది. మేకింగ్ కూడా శ్రమతో నిండినది. ఇలాంటి సినిమాలకు మగ దర్శకులను ఎంచుకోవడం పెద్ద హీరోల ఆనవాయితీ. కాని సూర్య సుధ కొంగర సామర్థ్యాలకు విలువ ఇచ్చారు. ఆమె ఆ కథను సమర్థంగా తీర్చి దిద్ది పరిశ్రమలో స్త్రీ దర్శకుల ఉనికిని సమున్నతంగా నిలబెట్టారు. ‘గురు (వెంకటేశ్) హిట్టయ్యాక యూనిట్లో నా ముందు ఎవరూ నోరెత్తడం లేదు’ అంటారు సుధ– స్త్రీ దర్శకులకు ఎదురైన చిరాకులను గుర్తు చేసుకుంటూ. ఇక సినిమాలో సూర్యకు భార్యగా చేసిన అపర్ణ మదురై పల్లెటూరు అమ్మాయిగా ఏదైనా సాధిద్దాం అనుకునే మొండి ఆడపిల్లగా పల్లెటూరి అమ్మాయిలను ఉత్సాహ పరుస్తుంది. ఆ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన భార్గవి కథను ఇప్పుడు ఎక్కువ మంది తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక సినిమాలో సూర్య తల్లిగా నటించిన ఊర్వశి కొడుకుపై నమ్మకం ఉంచిన స్త్రీ. అతనికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. నిజ జీవితంలో కాని, సినిమాలో కాని ఈ విమానం కేవలం మగవారి వల్ల ఎగరలేదు... స్త్రీల వల్ల కూడా ఎగరింది అని దర్శకురాలు చాలా నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పడం వల్ల స్త్రీ భాగస్వామ్యం సమాజ ప్రగతిలో ఎంత అవసరమో చెప్పినట్టయ్యింది.పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషుడికి తోడుగా నిలుస్తూ గొప్ప విజయాలు సాధించాలనే స్ఫూర్తి మరోసారి ఉజ్జీవనం కావడం ఎంతో సంతోషకరమైన విషయం. ‘ఎగిరి’ గంతేయాల్సిన విజయం. -
సేవకు గుర్తింపు....
సాక్షి, హైదరాబాద్: కరోనా విపత్తులో సామాన్య జనానికి పలు సేవా కార్యక్రామాలు అందించినందుకుగాను సీనియర్ సబ్ ఎడిటర్, సామాజిక కార్యకర్త టి.గోపీనాథ్‌ను ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ‘కరోనా వారియర్ ఇంటర్నేషనల్ హానర్’ పేరుతో సత్కరించింది. కోవిడ్ కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదవారిని గుర్తించి వారికి నిత్యావసరాలు అందించడమేగాక, అలాంటి వారి ఉనికి వెలికి తీసి మరిన్ని సంస్థల సహకారం అందేలా గోపినాథ్ కృషి చేశారు. ఈ మేరకు ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఆయనకు సర్టిఫికెట్ ప్రదానం చేసింది. సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ ఈ మేరకు గోపీనాథ్‌ను అభినందించారు. తనకు అందిన పురస్కారం తాను మరిన్ని సేవాకార్యక్రమాలు చేసేందుకు బలాన్నిచ్చిందని గోపీనాథ్ పేర్కొన్నారు. గాయని పద్మశ్రీ త్యాగరాజుకు.. సుల్తాన్‌బజార్: ప్రఖ్యాత గాయని పద్మశ్రీ త్యాగరాజుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు ‘కరోనా వారియర్ ఇంటర్నేషనల్ హానర్’ అవార్డును అందించారు. కరోనా కాలంలో పద్మశ్రీ త్యాగరాజు ‘కోవిడ్–19 మ్యూజిక్ ఛాలెంజ్’ శీర్షికన ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 100 పాటలు స్వయంగా పాడి రోజుకో పాట చొప్పున ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ తన గానం ద్వారా అందరినీ ఆనందపరిచారు. కరోనా కాలంలో ఆమె చేసిన కృషిని గుర్తించి ‘విశ్వగురు’ ఎండీ సత్యవోలు రాంబాబు స్వయంగా పద్మశ్రీ త్యాగరాజుకు అవార్డు ప్రదానం చేశారు. -
ఎమ్మెల్యే విడదల రజని మరిది కారుపై దాడి
సాక్షి, గుంటూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో... ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే కారులో ఉన్నారని భావించి ఈ ఘటనకు పాల్పడ్డారు. కారులో ఎమ్మెల్యేకు బదులు మీరెందుకు ఉన్నారంటూ మాపై దాడి చేశారు. చిలకలూరిపేటలో మా పుల్లారావు కాకుండా మీరెలా గెలుస్తారని బెదిరించారు. మీ ఎమ్మెల్యే ఎలా తిరుగుతుందో చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నాయకుల దాడిలో మా కారు పూర్తిగా ధ్వంసం అయింది. దాడికి పాల్పడవారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం’ అని తెలిపారు. కాపలా కాసి దాడులు చేస్తారా? టీడీపీ గూండాలను తనను టార్గెట్ చేశారని ఎమ్మెల్యే విడదల రజని ఆరోపించారు. 200మందికి పైగా ఒకేసారి దాడి చేశారని, రాళ్లు, రాడ్లతో కారును ధ్వంసం చేశారన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కాపలా కాసి దాడులు చేయడం కాదని, దమ్ముంటే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజాక్షేత్రంలో గెలవాలని ఎమ్మెల్యే రజని సవాల్ విసిరారు. -
డిఫరెంట్ స్టోరీ
సినిమా సినిమాకీ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు రానా. ‘గృహం’ వంటి హారర్ థ్రిల్లర్‌తో సూపర్‌హిట్ అందుకున్నారు దర్శకుడు మలింద్ రౌ. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. రజనీకాంత్ ‘బాషా’ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి, తెలుగులో ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడటానికి కారణమైన విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ ఆచంట మాట్లాడుతూ– ‘‘బాషా’ సినిమాతో తెలుగుసినిమా ఇండస్ట్రీకి విశ్వశాంతి పిక్చర్స్ పరిచయమైంది. చాలా గ్యాప్ తర్వాత మా బ్యానర్లో నయనతార హిట్ చిత్రం ‘ఇమైక్కా నొడిగల్’ ను ‘అంజలి సిబిఐ’ గా విడుదల చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగుసినిమాలను నిర్మించబోతున్నాం. అందులో భాగంగా రానాగారితో సినిమా చేయబోతున్నాం. ఆగస్ట్ నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. -
కోపానికి, అహంకారానికి మాల్యా బాధితుడు
ముంబై : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయమాల్యా కోపానికి, అహంకారానికి బాధితుడని ఎయిర్‌డెక్కన్ చైర్మన్ జీ ఆర్ గోపినాథ్ అన్నారు. రాజకీయ కుట్ర కంటే కూడా ఆయన ఎక్కువగా కోప, అహంకారాల్లోనే ఇరుక్కుపోయారని చెప్పారు. 2007లో ఎయిర్‌డెక్కన్‌ను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రూ.1000 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం 2012లో కింగ్‌ఫిషర్ దివాలా స్థాయికి పడిపోయింది. బ్యాంకులకు రూ.9000 కోట్ల బకాయిపడింది. బ్యాంకులకు రుణ పడిన ఈ కోట్ల మొత్తాన్ని ఎగ్గొట్టిన మాల్యా యూకేకు పారిపోయారు. ప్రస్తుతం మాల్యా యూకేలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆయన్ను భారత్‌కు రప్పించడానికి ఏజెన్సీలు తీవ్ర ఎత్తున్న కసరత్తు చేస్తున్నాయి. మాల్యా అప్పగింత కేసును లండన్ కోర్టు విచారిస్తోంది. ఆయనను పొలిటికల్ ఫుట్బాల్లా రిఫర్ చేస్తూ.... డిఫాల్డ్ అయిన సమయంలో మాల్యా తన కార్యక్రమాల్లో అంత తెలివిగా ఉండేవారు కాదని పేర్కొన్నారు. రుణాల ఎగవేతకు మాల్యా పోస్టర్ బాయ్‌లా ఉన్నారని అభివర్ణించారు. రెండు పార్టీలు కూడా తాము సౌకర్యవంతం కోసం రాజకీయంగానే గుర్తిస్తున్నారన్నారు. మాల్యా రాజకీయ కుట్రకు బాధితుడు కాదని, ఆయన ప్రతి ఒక్కరికీ 'హాట్ పొటాటో' అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మృతి
చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్(72) మృతిచెందారు. కారులో చిత్తూరు నుంచి చెన్నై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయన 1989 నుంచి 1994 వరకూ చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.7.50 లక్షలతో ఉడాయించిన సూడో పోలీసులు
హైదరాబాద్: పోలీసులమంటూ దుండగులు నగల వ్యాపారిని బెదిరించి రూ. ఏడున్నర లక్షలను దోచుకెళ్లారు. ఈ ఘటన బుధవారం మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సికింద్రాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి గోపీనాథ్ ఇటీవల వ్యాపార నిమిత్తం చెన్నై వెళ్లారు. మళ్లీ తిరిగి బుధవారం తెల్లవారుజామున రైలులో సికింద్రాబాద్ చేరుకున్నారు. ఇంటికి వస్తున్న క్రమంలో ఆయన్ని ఆగంతకులు అటకాయించారు. తాము పోలీసులమంటూ బెదిరించి... బ్రౌన్‌షుగర్ అమ్ముతున్నావని సమాచారం ఉంది... తనిఖీ చేయాలని అతడిని నిలదీశారు. దీంతో వారు గోపీనాథ్ వద్ద ఉన్న రూ.20 లక్షల నగదు, 25 కిలోల వెండి సామగ్రిని తనిఖీ చేస్తున్నట్లు నటించి... రూ.7.5 లక్షల నగదుతో ఉడాయించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మహంకాళి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీఎం కేసీఆర్‌తో గోపీనాథ్, గాంధీల భేటీ
నేడు సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న టీ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ గురువారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. వీరు రెండుసార్లు సీఎంను కలవడం, పార్టీ మారుతున్నట్లు స్పష్టం కావడంతో టీ టీడీపీ నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్, గాంధీ సీఎం కేసీఆర్‌తో మరోమారు భేటీ అయ్యారు. కాగా, వీరిద్దరూ శుక్రవారం సీఎం సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ‘సీఎం వీరిద్దరినీ శుక్రవారం మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఆ సందర్భంలోనే వారు సాదాసీదాగా సీఎం అధికార నివాసంలో చేరుతారా? లేక తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాట చేసి పార్టీలోకి వస్తారా అన్న విషయంపై చర్చిస్తారు..’ అని పార్టీ వర్గాలు చెప్పాయి. -
కిడ్నాప్ మిస్టరీని చేధించిన పోలీసులు
= నలుగురి అరెస్ట్ = రూ.5 లక్షల నగదు, మారుతి కారు, పల్సర్‌వాహనం స్వాధీనం బెంగళూరు(బనశంకరి) : బోల్ట్‌నట్ తయారీ కంపెనీ యజమాని కిడ్నాప్ ఉదంతాన్ని చేధించిన చెన్నమ్మకెర అచ్చుకట్టె పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5లక్షల నగదు, రెండు ఉంగరాలు, మారుతీ కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.డీసీపీ లోకేశ్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు.. నాగేగౌడనపాళ్యకు చెందిన ముత్తురాజ్, యలచేనహళ్లి నివాసి నారాయణ, అభిషేక్, రాకేశ్‌లు సుబ్రహ్మణ్య పుర పరిధిలోని ఏజీఎస్లేఔట్ కు చెందిన బోల్ట్‌నట్ కంపెనీ యజమాని గోపినాథ్‌ను గత నెల 26 తేదీన కిడ్నాప్ చేశారు. గోపీనాథ్‌ను అతని కారులోనే రాచనమడు అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అతనినుంచి రూ.35 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు అతని వద్ద రెండు బంగారు ఉంగరాలు, రూ. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకొని వదలివేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు దక్షిణ విభాగం డిప్యూటీ పోలీస్‌కమిషనర్ బీఎన్.లోకేశ్‌కుమార్ మార్గదర్శనంలో బనశంకరి ఉప విభాగం సహాయక పోలీస్ కమిషనర్ ఆర్సీ.లోకేకుమార్ నేతృత్వంలో చెన్నమ్మకెరె అచ్చుకటె సీఐ టీటీ.కృష్ణ, ఎస్ఐ. ఎస్పీ.కమారస్వామి కేసు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి నగదు, బంగారు ఉంగరాలు, మారుతీకారు, బైక్, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. -
రాజకీయ అధికారమే మాలల సమస్యకు పరిష్కారం
మాలల సమావేశంలో సామాజిక విశ్లేషకులు గోపీనాథ్ హైదరాబాద్: రాజకీయ అధికారంతోనే మాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అందుకు సామాజిక, రాజకీయ శక్తులుగా మాలలు ఎదగాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్ అన్నారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్లో మాలల ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గోపీనాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళితే వర్గం రాదేమో కానీ, కులం మాత్రం తప్పకుండా మన వెంటే వస్తుందన్నారు. భారత్‌లోని వామపక్ష పార్టీలు 90 ఏళ్ల తర్వాత కులం ప్రాధాన్యతను ఇప్పుడు గుర్తిస్తున్నాయని చెప్పారు. మాజీ మంత్రి శంకర్రావు మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ అనుకూల తీర్మానాన్ని ఈ సమావేశం వ్యతిరేకించింది. కార్యక్రమంలో మాల సంఘాల కన్వీనర్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, కాంగ్రెస్ నేత డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే లింగయ్య, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాల సంఘాల నేతలు చెన్నయ్య, పసుల రామ్మూర్తి, రావుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు తీరు మారనేలేదు
పంగులూరు: ‘నేను మారాను..నన్ను నమ్మండని’ ఎన్నికల సమయంలో ఎన్నో మాయమాటలు చెప్పిన సీఎం చంద్రబాబు తీరు రైతుల పట్ల ఏమాత్రం మారలేదని జిల్లా రైతుసంఘం నాయకుడు ఎం.గోపీనాథ్ ఆరోపించారు. పంగులూరు తహ శీల్దారు కార్యాలయం వద్ద జిల్లా కౌలు రైతుసంఘం అధ్యక్షుడు రాయిని వినోద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కౌలు రైతుల ధర్నాలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి పలుమార్లు మొర పెట్టుకున్నా వారికి తగిన న్యాయం జరగలేదన్నారు. జిల్లా కౌలురైతు సంఘ అధ్యక్షుడు రాయిని వినోద్ మాట్లాడుతూ ఒకే గ్రూపులో ఒకరిద్దరికి రుణమాఫీ జరగగా, మిగిలిన వారికి ఎందుకు వర్తించలేదని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు గంగయ్య మాట్లాడుతూ ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన తహశీల్దారు డి.నిర్మల బ్యాంకు అధికారులతో మాట్లాడి కౌలు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకు అధికారులతో తహశీల్దార్ చర్చలు: తన కార్యాలయంలో తహశీల్దార్ నిర్మల ఏర్పాటు చేసిన సమావేశానికి పంగులూరు ఎస్బీఐ మేనేజర్ జె రఘు, చందలూరు సిండికేట్ బ్యాంకు మేనేజర్ అశోక్‌బాబు, ముప్పవరం వైశ్యా బ్యాంకు మేనేజర్ సీతారామయ్య హాజరయ్యారు. రైతుసంఘం పక్షాన గోపీనాథ్, వినోద్, గంగయ్య, తల్లపనేని రామారావు హాజరై కౌలు రైతుల స్థితిగతులపై చర్చించారు. తహ శీల్దారు నిర్మల లీడ్ బ్యాంకు మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. రుణమాఫీ పొందని రైతులు జనవరి 6వ తేదీ లోగా ఆధారాలతో కూడిన జిరాక్స్ కాపీలు సంబంధిత వీఆర్వోలకు అందజేయవచ్చని తెలిపారు. పంగులూరు బ్యాంకు మేనేజర్ సమావేశానికి రావడం ఆలస్యం కావడంతో రైతులు బ్యాంకు వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు గుడిపాటి మల్లారెడ్డి, తల్లపనేని రామారావు, రాయిని వెంకట సుబ్బారావు, సరికొండ రామచంద్రరాజు, తల్లపనేని సుబ్బారావు, 21 గ్రామాలకు చెందిన 300 మందికి పైగా కౌలు రైతులు, మహిళా రైతులు హాజరయ్యారు. -
అప్రమత్తం
ఉగ్రవాద కార్యకలాపాలపైఎన్‌ఐఏ హెచ్చరికతో పోలీసుల అలెర్ట్ తిరుపతితో పాటు జిల్లా వ్యాప్తంగా నిఘాను పటిష్ఠం చేసిన ఉన్నతాధికారులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ (కేంద్ర దర్యాప్తు సంస్థ) హెచ్చరికలతో తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీలు గోపీనాథ్ జట్టి, జి.శ్రీనివాస్ నిఘాను పటిష్ఠం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుపతితో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో తనిఖీలను శనివారం కూడా కొనసాగించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికపై నిఘా వేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. తెలంగాణలో కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎస్బీఐ, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంక్ లూటీల్లో ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఎన్ఐఏ గుర్తించింది. ఆ బ్యాంకుల్లో లూటీ చేసిన సొమ్మును తిరుపతి, చెన్నైల్లో కొన్ని సంస్థలకు చేరవేసి, ఆస్తులను కూడగట్టి స్థావరాలను ఏర్పాటుచేసుకునేందుకు ఉగ్రవాద సంస్థ ప్రయత్నిస్తోందంటూ ఎన్ఐఏ శుక్రవారం రాత్రి తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీలకు సమాచారం అందించింది. శుక్రవారం రాత్రే తిరుపతికి చేరుకున్న ఎన్ఐఏ బృందం విస్తృతంగా సోదాలు చేసిన విషయం విదితమే. శుక్రవారం రాత్రి తిరుపతితో పాటు జిల్లా వ్యాప్తంగా సోదాలు చేసిన పోలీసులు శనివారం కూడా తనిఖీలను కొనసాగించారు. ప్రధాన రహదారుల్లో నాకాబందీ నిర్వహించి.. వాహనాలను తనిఖీ చేశారు. లాడ్జిల్లో సోదాలు చేశారు. గుర్తింపు కార్డులు లేకుండా లాడ్జిల్లో ఎవరికీ వసతి కల్పించవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఉగ్రవాద సంస్థ నుంచి జిల్లాలో ఏ ఏ ప్రాంతాలకు నిధులు చేరవేశాయన్న అంశంపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ప్రధాన బ్యాంకుల అధికారులతో రహస్యంగా మంతనాలు జరిపింది. తిరుపతితో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూముల, ఆస్తుల క్రయవిక్రయాలపై ఆరా తీసింది. అనుమానాస్పద క్రయవిక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్ఐఏ బృందం ఓ వైపు సోదాలు, దర్యాప్తు చేస్తుంటే.. మరో వైపు పోలీసులూ విస్తృతంగా గాలింపు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ప్రకటించిన హై అలెర్ట్‌ను శనివారం కూడా కొనసాగించడం గమనార్హం. -
గీత దాటితే వేటే
అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులను కఠినంగా శిక్షిస్తాం 150 అధునాతన సీసీ కెమెరాలతో తిరుపతి నగరంలో నిఘా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టే వేసేందుకు ప్రత్యేక ప్రణాళిక ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘భూవివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేసే పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్ట ప్రకారం భూ వివాదాలను పరిష్కరించకుండా దాటవేసినా చర్యలు తప్పవు. నిబంధనల మేరకు ప్రజలకు న్యాయం చేసి పోలీసు ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తా’అని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి స్పష్టీకరించారు. వరుస దోపిడీలు, ఎర్రచందనం స్మగ్లింగ్, ట్రాఫిక్ సమస్య, ల్యాండ్ సెటిల్మెంట్లు తదితర అంశాలపై ఎస్పీ గోపీనాథ్ జట్టిని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. సాక్షి: తిరుపతిలో దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోయాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: గతంలో దోపిడీలు, దొంగతనాలు కొన్ని ప్రాంతాల్లోని గ్యాంగ్‌లు చేసేవి. ఆ గ్యాంగ్‌లను త్వరగా పట్టుకునేవాళ్లం. ఇటీవల కొత్త వ్యక్తులు చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, రాబరీలకు పాల్పడుతున్నారు. అందువల్ల వారిని పట్టుకోవడం కొంచెం కష్టంగా మారింది. అయినా.. రెండు నెలలుగా దొంగతనాలను అరికట్టడంలోనూ చోరీ సొమ్మును రికవరీ చేయడంలోనూ ముందున్నాం. దోపిడీ దొంగతనాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశాం. తిరుపతి నగరంలో 150 అధునాతన ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నాం. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నగరంలో స్థితిగతులను విశ్లేషిస్తాం. బీట్స్ పెంచుతాం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద బీట్స్ ఏర్పాటు చేస్తాం. బ్లూకోల్ట్స్‌ను అధికం చేస్తాం. నిఘా పటిష్టం చేయడం.. పర్యవేక్షణను అధికం చేయడంతో చోరీలకు అడ్డుకట్ట వేస్తాం. సాక్షి: శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ఎలా అడ్డుకట్ట వేస్తారు? ఎస్పీ: ఎర్రచందనం స్మగ్లర్లను కొందరిని ఇప్పటికే అరెస్టు చేశాం. స్మగ్లర్లకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరికొందరిపై తీసుకోనుంది. అటవీశాఖలో స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. శేషాచలం అడవులపై గట్టి నిఘా వేశాం. బడా స్మగ్లర్లు, చోటా స్మగ్లర్లు, మేస్త్రీలు, కూలీలు, స్మగ్లింగ్‌కు వాహనాలను ఏర్పాటుచేసే ట్రాన్స్‌పోర్టు సంస్థలపై గట్టి నిఘా ఏర్పాటుచేశాం. దీని వల్ల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్షాల నరికివేతను కొంత మేర అడ్డుకోగలిగాం. రెండు మూడు నెలల్లో స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో అడ్డుకుని తీరుతాం. సాక్షి: తిరుపతి, ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి పరిధిలో కొందరు పోలీసు అధికారులు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎస్పీ: సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చకూడదు. కానీ.. సివిల్ వివాదంలో క్రిమినల్ కోణం ఉంటే పోలీసులు జోక్యం చేసుకోవాలి. భూమి యజమాని ఒకరైతే.. మరొకరు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆ భూమిని ఆక్రమించుకునేయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో న్యాయం చేయాలని భూ యజమాని పోలీసులను ఆశ్రయిస్తే.. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందే. అలా కాకుండా కబ్జాదారుల తరఫున సెటిల్మెంట్లు చేసే పోలీసు అధికారులను వదిలి పెట్టేది లేదు. ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడిన ఇద్దరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపాం. సాక్షి: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో హైటెక్ వ్యభిచారం సాగిస్తున్నారు. హెరాయిన్, బ్రౌన్‌షుగర్ యువతకు విక్రయిస్తున్నారు. వీటిని ఎలా అడ్డుకుంటారు? ఎస్పీ: హైటెక్ వ్యభిచారం సాగుతున్న అంశం మా దృష్టికి వచ్చింది. తనిఖీలను ముమ్మరం చేస్తాం. హైటెక్ వ్యభిచారం నిర్వహించే వారిపై, హెరాయిన్, బ్రౌన్‌షుగర్ వ్యాపారం చేస్తున్న స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: తిరుపతి నగరంలో అస్తవ్యస్త ట్రాఫిక్‌ను ఎలా చక్కదిద్దుతారు? ఎస్పీ: ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. 150 ప్రదేశాల్లో అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాం. 17 ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశాం. మరో 33 ప్రాంతాల్లో త్వరలోనే ఏర్పాటుచేస్తాం. ట్రాఫిక్ విభాగానికి ఓ డీఎస్పీతో పాటూ ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాం. వారంలో రెండు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. బస్సులు, స్కూల్ వ్యాన్లు, లారీలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై జరిమానా విధించడమే కాదు.. న్యాయస్థానంలో ప్రవేశపెట్టి శిక్షపడేలా చేస్తాం. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారిపై భారీ ఎత్తున జరిమానా విధిస్తాం. సాక్షి: తిరుపతి అర్బన్ జిల్లాలో పోలీసులకు వీక్లీ ఆఫ్ సౌకర్యం లేదు. దీనిపై మీ స్పందన.. ఎస్పీ: పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నారు. సిబ్బంది విభజన కూడా పూర్తి కాలేదు. తిరుపతి నగరంలో ట్రాఫిక్, సీసీఎస్ విభాగాలతో పాటు లా అండ్ ఆర్డర్‌కు సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇస్తాం. -
ఆప్‌ను వీడిన ఇల్మి, గోపీనాథ్
కేజ్రీవాల్ తీరు నచ్చకే రాజీనామా చేశామన్న నేతలు అధినేత జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైపోయిందని విమర్శ న్యూఢిల్లీ /బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేతలు షాజియా ఇల్మి, జీఆర్ గోపీనాథ్ శనివారం ఆ పార్టీని వీడారు. కేజ్రీవాల్ జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని, పార్టీలో అసలు అంతర్గత ప్రజాస్వామ్యమనేదే లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా తర్వాత వారు ఢిల్లీలో విలేకరులతో మట్లాడారు. కేజ్రీవాల్ జైలు రాజకీయాలకు పాల్పడుతున్నారని, గడ్కారీ పెట్టిన పరువునష్టం కేసులో బెయిల్ తీసుకోవడానికి కేజ్రీవాల్ ఎందుకు నిరాకరించారని గోపీనాథ్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ పొరపాట్లే ఆయన వైఫల్యానికి కారణమవుతున్నాయన్నారు. ఇల్మి మాట్లాడుతూ... ‘‘అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలని చెప్పుకొనే ఆప్ పార్టీలోనే.. అంతర్గత ప్రజాస్వామ్యం కరువవడంతో ఈ పనిచేయాల్సి వచ్చింది. కేజ్రీవాల్ జైలులో ఉండి సమయాన్ని, శక్తిని వృథా చేయొద్దు. బెయిల్ తీసుకుని ప్రజల మధ్యకు వచ్చి పోరాడాలి..’’ అని పేర్కొన్నారు. తాను ఆప్‌ను వీడినా మరే పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాగా.. ఇంతకుముందే మాజీ దౌత్యవేత్త మధ భండారి ఆప్‌ను వీడారు. ఇద్దరు కీలక నేతలు వినోద్‌కుమార్ బిన్ని, అశ్విని ఉపాధ్యాయలను పార్టీ నుంచి వెలివేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి రాజీనామా కేజ్రీవాల్‌కు పెద్ద దెబ్బే కానుంది. మరోవైపు.. కపిల్‌సిబల్ కుమారుడు అమిత్ పెట్టిన పరువునష్టం కేసులో షాజియా ఇల్మిపై ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ప్రశాంత్‌భూషణ్‌లతో పాటు ఈ కేసులో నిందితురాలైన షాజియా పార్టీని వీడిన రోజే వారెంట్‌జారీ కావడం గమనార్హం. -
ఆమ్ ఆద్మీకి డబుల్ షాక్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి డబుల్ షాక్ తగిలింది. శనివారం ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోకడలను వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్నట్టు గోపీనాథ్, షాజియా ప్రకటించారు. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు షాజియా చెప్పారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆమె విమర్శించారు. బెంగళూరుకు చెందిన గోపీనాథ్ కూడా కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ పూచీకత్తుపై బెయిల్ తీసుకోకుండా జైలుకెళ్లడాన్ని తప్పుపట్టారు. -
‘మిషన్-2014’ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న పార్టీలు
సాక్షి, ముంబై: ‘మిషన్-2014’కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. రోజురోజుకీ మారుతున్న రాజకీయ పరిణామాలపై దృష్టి కేంద్రీకరించిన అన్ని పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా మారడంతోపాటు 2014లో జరగబోయే ఎన్నికల కోసం వ్యూహరచన చేయడంలో ఇప్పటినుంచే నిమగ్నమయ్యాయి. పార్టీలను బలోపేతం చేయడంతోపాటు ప్రజాదరణ పొందేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించాయి. కొన్ని పార్టీలైతే అంతర్గత విభేదాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మార్పులు చేర్పులు చేపడుతున్నాయి. సీట్ల పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఇవి ఆయా కూటములకు తలనొప్పిగా మారాయి. సాధ్యమైనంత మేర తమ కూటముల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను విడనాడి సీట్ల పంపకాలకు త్వరగా తెరదించాలనుకుంటున్నాయి. ప్రస్తుతం పితృపక్షం నడుస్తుండటంతో దసరా అనంతరం సీట్ల చిక్కుముడిని విప్పాలని ఆయా పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. పాతఫార్ములాతోనే మహా కూటమి పోటీ మహాకూటమి లోక్‌సభ సీట్ల పంపకాలలో ఆర్పీఐకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయం స్పష్టం కాకపోయినా, పాత ఫార్ములానే ఉంటుందని బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే స్పష్టం చేశారు. ‘గతంలో మాదిరిగానే బీజేపీకి 26, శివసేనకు 22 సీట్లు ఉంటాయి. అయితే వీటిలో నుంచి ఆర్పీఐకి ఎన్ని కేటాయించాలనేది ఆ పార్టీ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలేతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. దసరా అనంతరం దీనిపై స్పష్టత వస్తుంద’ని తెలిపారు. ఈ విషయమై బుధవారం గోపీనాథ్ ముండే మాతోశ్రీకి వెళ్లి శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమయంలో ఎలాంటి చర్చలు జరగలేదని, పాత ఫార్ములాతోనే ముందుకు వెళ్లనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నాలుగు లోక్‌సభ సీట్లు కావాలని, తొందరగా సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి చేయకపోతే కూటమి నుంచి బయటకి వెళ్లనున్నట్టు రాందాస్ అథవాలే హెచ్చరికపై ముండే స్పందించారు. అలాంటిదేమి జరగదని, చర్చల ద్వారా అన్ని సమస్యలకు సమాధానం లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆర్పీఐకి సరైన న్యాయం జరుగుతుందని ఆయన హామీఇచ్చారు. భవిష్యత్‌లో కూడా మహాకూటమికి ఎలాంటి ఢోకా ఉండదని ఆయన పేర్కొన్నారు. డీఎఫ్ కూటమిలో సైతం... డీఎఫ్ కూటమిలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకాలపై వివాదాలు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎన్సీపీ నాయకులు పాత ఫార్ములతోనే (26-22) పోటీ చేస్తామని ప్రకటిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ మాత్రం కొత్త ఫార్ములాతో పోటీ చేస్తామని పేర్కొంటోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ 29 స్థానాల్లో పోటీ చేసి ఎన్సీపీకి 19 స్థానాలను ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ తాజాగా ఉండగానే పుణేలో పర్యటించిన రాహుల్‌గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలకు చేసిన హితబోధ డీఎఫ్ కూటమిలో కొత్త తలనొప్పులను తీసుకువచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒంటరిగా బరిలోకి దిగాలన్న కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ మేరకు అలాంటి అవసరం రాకుండా అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని ఆయన సూచించారు. అధిక సీట్లు కైవసం చేసుకుని ఎన్సీపీ అవసరం లేకుండా చూసుకోవాలన్నారు. దీనిపై రాబోయే రోజుల్లో ఎన్సీపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. ఒంటరిగానే ఎమ్మెన్నెస్... శివసేనతోపాటు ఇతర పార్టీలకు పలు చోట్ల గట్టి పోటీ ఇస్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కూడా మిషన్ -2014కు సిద్ధమైంది. రాజ్‌ఠాక్రే అనేక ప్రాంతాల్లో పర్యటించి పదాధికారులు, కార్యకర్తల మనోబలాన్ని పెంచడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలా? ఒంటరిగా బరిలోకి దిగాలా..? అనే విషయం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనలు రాలేదు. ఇప్పటివరకైతే ఒంటరి పోటీవైపే మొగ్గుచూపుతున్న ఎమ్మెన్నెస్ ఎన్నికల్లో తమ సత్తాచాటి వచ్చే ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్రను పోషించాలని ఉబలాటపడుతోంది. మరోవైపు ఎమ్మెన్నెస్ పార్టీని కూడా మిత్రపక్షంగా చేర్చుకొని బరిలోకి దిగాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా అది ఎంత మేరకు సఫలీకృతమవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.