Heroine
-
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్‌ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
చీరకట్టులో కొత్త హీరోయిన్ షాజ్ఞ శ్రీ వేణున్ మెరుపులు (ఫొటోలు)
-
తెలుగు హీరోతో పెళ్లి.. రెండేళ్లకే విడాకులు.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
పల్లెటూరి అల్లరి పిల్ల కేతిక.. లుక్కే మార్చేసిందిగా! (ఫొటోలు)
-
ఒక్కరు కాదు ఇద్దరు.. పుష్ప రాజ్ తగ్గేదేలే
-
హీరోయిన్లా మెరిసిపోతున్న టాప్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..? (ఫోటోలు)
-
షాపులో నగలన్నీ చిరంజీవి హీరోయిన్ ఒంటిపైనే! (ఫొటోలు)
-
సాగర తీరాన మన్మధుడు హీరోయిన్.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
-
హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
రచ్చ సినిమాలో కనిపించిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా..? (ఫోటోలు)
-
జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
దుబాయ్‌లో చిల్ అవుతున్న బర్త్‌డే గాళ్ (ఫొటోలు)
-
దసరా, దీపావళి సంబరాల్లో సమీరా రెడ్డి.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్ ఇచ్చిన హీరోయిన్‌తో జోడీ (ఫోటోలు)
-
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
రాంగోపాల్ వర్మ కోసం భారీ ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
చీరకట్టులో హీరోయిన్ ప్రణీత.. ఇంత అందంగా ఉందేంటి!
-
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
పూజా కన్నన్ హల్దీ ఫంక్షన్.. అందరి కళ్లు సాయిపల్లవిపైనే! (ఫోటోలు)
-
మాయలేడిని అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బెదిరింపులు!
సాక్షి, అమరావతి : బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరి జత్వానీ అత్యంత వివాదాస్పదురాలు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లు తదితరులను లక్ష్యంగా చేసుకుని ‘వలపు వల (హనీ ట్రాప్)’ వేసి...అనంతరం బ్లాక్ మెయిలింగ్ చేస్తూ భారీగా డబ్బులు గుంజడంలో ఆమె సిద్ధహస్తురాలు. అందుకోసం సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ పత్రాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడుతూ మరీ భారీగా ఆస్తులను కొల్లగొట్టడం ఆమె చరిత్ర. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయి. అయితే ఈ మాయలేడి బ్లాక్ మెయిలింగ్ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసింది. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికినకాడికి దండుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు.. ఇన్నాళ్లూ ప్రత్యర్థి పార్టీ వరకే పరిమితం చేసిన వేధింపులను తాజాగా పారిశ్రామికవేత్తలకూ వర్తింపజేశారు. ఈ పరంపరలో బడా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌ను తాజాగా ఈ కేసులోకి లాగుతున్నారు. ఇందుకు ఎల్లో మీడియా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఊతమిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజస్ పరిశ్రమను.. వైఎస్సార్ జిల్లాలో జువారి, దాలి్మయా సిమెంటు పరిశ్రమల యాజమాన్యాన్ని సర్కారు పెద్దలు ముడుపుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను ముడుపుల కోసం వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అయినా సరే టీడీపీ పెద్దలు బరితెగించి మరీ బాడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. మరోవైపు ఎన్నికల హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వ పన్నాగంగా ఉంది. దండుకునే దందా.. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వలపు వల (హానీ ట్రాప్) పేరుతో బ్లాక్ మెయిలింగ్ దందా అది పెద్ద సమస్యగా మారింది. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, రక్షణ రంగంలోని ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని వలపు వల విసిరి.. అనంతరం వారీ నుంచి భారీగా డబ్బులు, ఆస్తులు కొల్లగొట్టడం ఓ మాఫియాస్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అటువంటి ఓ హనీట్రాప్ కేసును వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు అత్యంత సమర్థంగా సత్వరం పరిష్కరించి శభాష్ అనిపించారు. పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసి.. న్యాయస్థానం అనుమతితో నిందితురాలిని ముంబయి నుంచి తీసుకువచి్చ... విజయవాడ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అంతా చట్ట ప్రకారం వ్యవహరించారని అందరూ ప్రశంసించారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ వ్యవహారంలో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డ ఘరానా మోసగత్తెకు వత్తాసు పలుకుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే ‘హనీట్రాప్ స్పెషలిస్ట్’ కాదంబరీ జత్వానీని అడ్డంపెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం ఐపీఎస్ అధికారులకు గురిపెట్టింది. రెడ్‌బుక్ రాజ్యాంగం సృష్టిస్తు న్న టెర్రర్లో మరో అంకానికి తెరతీసింది. వలపు వల.. ఆపై బ్లాక్ మెయిలింగ్ వలపు వల, బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ దందా కోసం కాదంబరీ జత్వానీ పకడ్బందీగా వ్యవహరించేవారు. పోలీసుల విచారణలో ఆమె అక్రమాలలన్నీ పూర్తి ఆధారలతో సహా బట్టబయలయ్యాయి. అవేమిటంటే.. కాదంబరీ జత్వానీకి రెండు పాస్ పోర్టులు, రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరి వద్ద ఒక్కో పేరుతో పరిచయం చేసుకునేది. ఈ పకడ్బందీ దందాలో కదాంబరీ తమ్ముడు అంబరీశ్ జత్వానీ కూడా ప్రధాన పాత్రధారే. దుబాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తన తమ్ముడికి అండర్ వరల్డ్ మాఫీయాతో సంబంధాలు ఉన్నాయని... ఆ మాఫియా ద్వారా అంతం చేస్తామని కూడా కాదంబరీ తీవ్ర స్థాయిలో బెదిరించే వారు. మాఫియాతో సంబంధాలు ఉండటమే కాదు హవాలా రాకెట్‌ను కూడా అతను నిర్వహించే వాడు. ఈ విధంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరులతోపాటు దేశంలోని పలు నగరాల్లోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి భారీగా ఆస్తులు కొల్లగొట్టారు. ఏసియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దానీ కూడా ఆమె బాధితుల జాబితాలో ఉన్నారు. ఆయన ఫిర్యా దుతో ముంబయిలోని గమ్‌దేవీ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. అదే రీతిలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై తప్పుడు ఆరోపణలతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. అంతా చట్టబద్ధంగానే.. తనకు అలవాటైన రీతిలోనే కాదంబరీ జత్వానీ ఓ రాజకీయ నేత కుక్కల విద్యాసాగర్‌పై వలపు వల విసిరి అనంతరం బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దుబాయిలోని మాఫియాతో అంతం చేయిస్తానని బెదిరించింది. విద్యాసాగర్‌కు చెందిన జగ్గయ్యపేటలో సర్వే నంబరు 396/2ఏ2హెచ్/1తో 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో సొంతం చేసుకుంది. ఆ భూమిని మరొకరికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసాగర్‌కు విషయం తెలిసింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చట్టానికి లోబడి విచారణ నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మెజిస్ట్రీట్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ముంబయి వెళ్లారు. ముంబయి పోలీçసు ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే కాదంబరీ జత్వానీని అరెస్ట్ చేసి అక్కడి మేజి్రస్టేట్ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమరి్పంచిన ఆధారాలతో సంతృప్తి చెందిన మెజి్రస్టేట్.. ఆమెను ఏపీకి తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు. దాంతో కాదంబరీ జత్వానినీ పోలీసులు విజయవాడ తీసుకువచ్చి అదే రోజు స్థానిక మెజిస్ట్రీట్ ఎదుట హాజరు పరిచారు. మెజిస్ట్రీట్ రిమాండ్ విధించంతో ఆమెను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆమె కొన్నాళ్లు ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండి, తర్వాత ముంబయికి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సినీ నటి అరెస్టులో అంతా చట్టబద్ధంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆమెకు న్యాయవాదుల సహాయం అందించేందుకు పోలీసులు సంసిద్ధత చూపారు. కానీ ఆమె అందుకు తిర స్కరించి ముంబయి నుంచి తన సొంత న్యాయవాదులను రప్పించుకున్నారు. ఈ కేసు విషయంలో విజయవాడ పోలీసులు పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరించారు. న్యాయస్థానాల అనుమతితో, నిబంధనలకు లోబడి దర్యాప్తు ప్రక్రియ పూర్తి చేశారు. దేశంలోనే ఎందరో బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడూ మోసం చేస్తున్న కాదంబరీ నేరాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను అభినందించాల్సింది పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం.. పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలతో వేధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సర్కారే లీకులిచ్చి.. భారత రాజ్యాంగాన్ని గౌరవించం అని, తాము అమలు చేసేది లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగమేనని టీడీపీ కూటమి ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న పోలీసు అధికారులు, రాజకీయ నేతలను వేధించడమే ధ్యేయంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే కాదంబరీ జత్వానీ కేసును నేపథ్యంగా తీసుకుని పోలీసు అధికారులకు గురి పెట్టింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించి అవాస్తవాలు, అభూతకల్పనలను టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచి్చంది. తద్వారా ఆ పోలీసు అధికారులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తోంది. టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలతో కథనాలు... పచ్చ టీవీ చానళ్లలో రోజంతా చర్చలతో రాద్ధాంతం చేస్తోంది. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి.. కాదంబరీ జత్వానీ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలపై విచారించాలని విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్‌ను గురువారం విచారణాధికారిగా నియమించింది. -
స్పోర్ట్స్ ప్రజెంటర్ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బ్యూటీ..
తమ అందాన్ని కాపాడుకోవాలని జాగ్రత్తపడే తారలు కొందరైతే దాన్ని రెట్టింపు చేసుకోవాలని ఉబలాటపడే బ్యూటీలు మరికొందరు. పెద్దగా అవకాశాల్లేక, వెండితెరకు దూరంగా ఉండే ముద్దుగుమ్మలైతే రీఎంట్రీ కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీ ఆయేషా టకియా కూడా అదే కోవలోకి వస్తుంది. సూపర్ సినిమాతో తెలుగులో అదరగొట్టిన ఈ హీరోయిన్ బాలీవుడ్లో దిల్ మాంగే మోర్, టార్జాన్, సలాం ఇ ఇష్క్, వాంటెడ్, పాఠశాల వంటి హిట్ చిత్రాల్లో నటించింది.13 ఏళ్లుగా వెండితెరకు దూరం2011లో వచ్చిన మోద్ సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాది ఓ మ్యూజిక్ రియాలిటీ షోలోనూ తళుక్కుమని మెరిసింది. అనంతరం సోషల్ మీడియాలో మాత్రమే అలరిస్తోంది. తాజాగా ఆమె నీలిరంగు చీర కట్టి ఓ రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదలగా అది వైరల్‌గా మారింది. అందులో ఆమె పెదాలు ఉబ్బిపోయి ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు తన లుక్ ఏమీ బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు.గుర్తుపట్టలేనట్లుగా మారిపోయిందే..నువ్వు ఏడాది క్రితమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావని తెలుసు. కానీ ఈ పోస్టులో మాత్రం అస్సలు గుర్తుపట్టలేనట్లే ఉన్నావు, తను ఆయేషా టాకియా అంటే నమ్మలేకపోతున్నాను. చిన్నప్పుడు తన సినిమాలు చూసి ముచ్చటపడిపోయాను. ఇప్పుడేంటి, ఇలా అయిపోయింది?, ఒకప్పుడు బాలీవుడ్లో రాణిగా వెలుగు వెలిగింది.. రీఎంట్రీ కోసమే ఈ అవతారం ఎత్తిందా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా లిప్ ఫిల్లర్స్ వేయించుకున్న తర్వాత ఈ బ్యూటీ ముఖమే మారిపోయింది. View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) -
వరలక్ష్మి వ్రతం పూజలో సీనియర్ హీరోయిన్ లయ (ఫోటోలు)