huzurabad
-
కౌశిక్‌రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కరీంనగర్,సాక్షి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధర్నా చేపట్టారు. కౌశిక్‌రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండోవిడత దళితబంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉద్రిక్తంగా మారింది. -
డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర.. కేటీఆరే అసలు టార్గెట్!
-
హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 చిరు వ్యాపారుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అరటి పండ్ల బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వాహనాలు, ఇతర దుఖాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదం..షార్ట్ సర్క్యూట్ వల్లేనని తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ లో వింత శబ్దాలు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
కరీంనగర్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. నిన్న(మంగళవారం) జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు.. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం 221, 126 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై నమోదు అయంది. బీఎన్ఎస్ యాక్టు కింద కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం. కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ ఆగ్రహంహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసినట్లు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదన్న కేటీఆర్ తేల్చిచెప్పారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్‌ను ఢీకొట్టడంతో..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలంలో ఓ లారీ.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెతో సహా మరో యువతి మృతిచెందింది. దీంతో, కుటుంబం సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం బోర్నపల్లి మూలమలుపు వద్ద మొరం లోడ్‌తో వస్తున్న లారీ.. బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న మొరం బైక్‌పై వెళ్లున్న వారిపై పడింది. మట్టిలో వారు ముగ్గురు కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం, జేసీబీ సాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు. ఇక, ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు ఉన్నారు. మృతి చెందిన వారిని విజయ్, సింధుజ, వర్షలుగా గుర్తించారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, బోర్నవల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఈటలకు మల్కాజ్గిరి ఫిక్స్!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ టికెట్‌ను ఈటల రాజేందర్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలో ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్‌పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్‌లు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రెండు చోట్లా ఓటమి.. మున్ముందు మరింత కఠిన పరీక్ష తప్పదా?
ఎప్పుడు ఎన్నిక జరిగినా అక్కడ ఆయనదే గెలుపు. నియోజకవర్గం మారినా ఇప్పటికి ఏడుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021 ఉప ఎన్నికలో ఓడిపోతారనే ప్రచారం సాగింది. గులాబీ బాస్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించారు. పార్టీ మారారు. కాని కారు దెబ్బకు ఢీలా పడతారని అందరూ భావించారు. అయితే అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించి విజయుడిగా నిలిచారు. తాజా ఎన్నికల్లో మాత్రం అభిమన్యుడిలా ఓడిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో? ఆయన కథేంటో చూద్దాం. ఈటల రాజేందర్.. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ పరిచయమైన పేరు. అప్పటి సీఎం కేసీఆర్ ను ఎదిరించి గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినా..తన పంథాకు భిన్నమైన కమలం పార్టీ నీడకు చేరారు. ఆ పార్టీలో చేరాక తన సొంత జిల్లాకు చెందిన నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ తో పొసగకున్నా...తాజా ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు.. సవాల్ విసిరి మరీ గజ్వేల్ లో కేసీఆర్ పై బరిలోకి దిగి, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అటు కమలాపూర్ నియోజకవర్గం నుంచి..ఇటు హుజూరాబాద్ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన విజేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చాక జరిగిన 2021 ఉపఎన్నిక యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు ఈటలపై అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఈటల ఓటమి కోసం గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. నాటి ఉపఎన్నికలో అభిమన్యుడిని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టింది. కానీ, ఈటల మాత్రం తన ఏడో విజయాన్నందుకున్నారు. దాంతో ఈటల క్రేజ్ కమలం పార్టీలో మరింతగా పెరిగింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. అదే పరిస్థితి ఈటల విషయంలో ఎనిమిదో ఎన్నికలో జరిగింది. ఇంతకాలం ఎదురులేని మనిషిగా నిల్చిన ఈటల.. తాజా ఎన్నికల్లో తనపైన ఎవ్వరూ అంత ఫోకస్ చేయకపోయినా తాను నమ్ముకున్న హుజూరాబాద్ లో ఓటమి పాలయ్యారు. అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. 2018 ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా.. ఈసారి ఎన్నికల్లో గెలిపించి పట్టం కట్టారు. ఈటలను ఓడగొడుతానని సవాల్ విసిరిన కౌశిక్‌కు.. సెంటిమెంట్ రాజకీయాలు కూడా ఈసారి కలిసివచ్చాయనే టాక్ ఎలాగూ ఉంది. అటు గజ్వేల్ లో తొడగొట్టి గులాబీ పార్టీ బాస్ కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు వెళ్లి అక్కడా ఈటల భంగపడ్డారు. తాను ప్రచారంలో లేని లోటును పూడ్చేందుకు హుజూరాబాద్‌లో తన సతీమణి జమునను ప్రచారంలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటలకు ఓటమి తప్పలేదు. ఈటల వచ్చాక బీజేపీలో జరుగుతున్న మార్పులపై ఓ పెద్ద చర్చే జరుగుతున్న క్రమంలో...బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న సంప్రదాయవాదుల్లో కొంత వ్యతిరేకత కూడా అంతర్లీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈటల గెలిస్తే ఆయనకు కొంత ప్లస్సయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈటల రీగెయిన్ కావడానికి తన శైలిని కొంచెం మార్చుకోవాల్సి ఉందని.. ఆచితూచి అడుగులు వేస్తేనే రాజకీయాల్లో ఇప్పటివరకూ తనకున్న ప్రత్యేకతను కాపాడుకోగలుగుతారనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ చెంతనే ఎక్కువ కాలం రాజకీయాలు చేసిన ఈటల రాజేందర్లో కొంతమేర ఉన్న అహంకార పోకడలు ఆయనకు మైనస్‌గా మారాయనే వారూ ఉన్నారు. గతంలో హుజూరాబాద్ లోనే ఉంటూ హైదరాబాద్ మంత్రిగా కాకుండా.. హుజూరాబాద్ మంత్రిగా పేరు పడ్డ ఈటల.. ఈమధ్య హుజూరాబాద్‌కు దూరమవ్వడం కూడా ఆయనలో వస్తున్న తేడాను ఇక్కడి ఓటర్లు పసిగట్టారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న ఈటల చేసేదెంత?.. అధికారపక్షంలో ఉన్నవారైతే అయ్యే అభివృద్ధి ఎంత అనే లెక్కలతో పాటు...ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ కు ఈసారి పెద్దఎత్తున ఓట్లు పోలవ్వడం..కౌశిక్ రెడ్డిపై వెల్లువెత్తిన సానుభూతి కూడా కలిసి.. ఈటల ఓటమికి ఆయన నమ్ముకున్న హుజూరాబాద్‌లోనే బీజం పడింది. రెండు నియోజకవర్గాల్లో ఓటమి ఈటల రాజకీయ జీవితాన్ని కొంత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ లీడర్‌గా ఎదుగుతున్న క్రమంలో.. ఇప్పటికే విజయంతో ఊపుమీదున్న కౌశిక్ రెడ్డితో.. మున్ముందు ఫైట్ కూడా ఈటలకు మరింత టఫ్‌గానే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. చదవండి: AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా? -
హుజురాబాద్ బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ
-
హుజూరాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కౌశిక్ రెడ్డి
-
హుజురాబాద్‌లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్‌రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్‌ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్‌లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: మంత్రి కేటీఆర్
-
ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్దే అధికారం: హరీశ్‌రావు
-
TS Election 2023: ఈ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 17సార్లు..!
సాక్షి, కరీంనగర్, పెద్దపల్లి: 'ఉద్యమాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ 1957లో (ఎస్సీ రిజర్వ్) నియోజకవర్గంగా ఏర్పడి మూడేళ్లకే జనరల్ స్థానంగా మారింది. ఇందులో హుజూరాబాద్, భీమదేవరపల్లి తాలూకాలుగా ఉండేవి. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగుసార్లు, టీడీపీ, స్వతంత్రులు మూడుసార్లు చొప్పున, ఇక బీఆర్ఎస్ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించింది. 2021లో వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. ఇక్కడి నుంచి గెలిచిన ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంత్రులుగా పని చేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గకేంద్రంతోపాటు ఆ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట(కొత్తగా ఏర్పడిన మండలం), హుజూరాబాద్ (మొత్తం ఐదు మండలాలు)తో కలిపి ముఖచిత్రంగా మారింది. ఇక కమలాపూర్ నియోజకవర్గం పూర్తిగా కనుమరుగైంది.' ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఇలా.. 1957లో ఏర్పడిన హుజూరాబాద్‌కు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఈ నియోజకవర్గంలో ఉన్న సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హుస్నాబాద్ నియోజకవర్గంలో.. కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంతోపాటు జమ్మికుంట, వీణవంక మండలాలను హుజూరాబాద్‌లో కలిపారు. అప్పటివరకు ఉన్న శంకరపట్నం, మానకొండూర్ మండలాలను విడదీసి కొత్తగా ఏర్పడిన మానకొండూర్ నియోజకవర్గంలో కలిపారు. హుజూరాబాద్ నుంచి 1957లో ఇద్దరు స్వతంత్రులే బరిలో దిగగా.. పోలుసాని నర్సింగరావును గెలిపించారు. 1962లో గాడిపల్లి రాములు (కాంగ్రెస్), 1967లో తిరిగి పోలుసాని నరసింగరావు (కాంగ్రెస్), 1972లో వొడితెల రాజేశ్వరరావు (కాంగ్రెస్), 1978లో దుగ్గిరాల వెంకట్రావు (కాంగ్రెస్), 1983లో కొత్త రాజిరెడ్డి (స్వతంత్ర), 1985లో దుగ్గిరాల వెంకట్రావు (టీడీపీ), 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరి సాయిరెడ్డి విజయం సాధించారు. ఇక 1994, 1999లో వరుసగా ఇనుగాల పెద్దిరెడ్డి (టీడీపీ) గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఆదరించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ లక్ష్మీకాంతారావు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. పునర్విభజన అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈటల ఘన విజయం సాధించారు. 2014, 2018లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్ని కల్లోనూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సా ధించారు. 2004వరకు జమ్మికుంటలో నామినేషన్ వేసే ఇక్కడి అభ్యర్థులు.. 2009 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే వేస్తున్నారు. నియోజకవర్గ ప్రత్యేకతలు.. నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం. ఎస్సారెస్పీ నుంచి ప్రవహించే కాకతీయకాలువ ద్వారా ఈ ని యోజకవర్గంలోని నా లుగు మండలాల్లో 59 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జమ్మికుంటలోని పత్తిమార్కెట్ ఉత్తర తెలంగాణలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది. సీడ్ ఉత్పత్తిలోనూ హుజూరాబాద్ దేశంలోనే పేరుగాంచింది. జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు వ్యవసాయంలో సూచనలు చేస్తూ కొత్త వంగడాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. జమ్మికుంట, ఉప్పల్, బిజిగిర్షరీఫ్లో ఉన్న రైల్వేస్టేషన్ ద్వారా ప్రయాణికులకు రవాణా సులువవుతోంది. మొత్తం ఓటర్లు 2,44,514 హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 106 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు ఉండగా, మొత్తం 305 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2,44,514 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,19,676 మంది పురుషులు, 1,24,833 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. -
ఈటల హుజూరాబాద్ బరిలో ఉంటారా? ఉండరా?
-
ప్రాణాలకు తెగించి కరెంట్ ఇచ్చిన లైన్‌మ్యాన్
-
ఈటల రాజేందర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మానకొండూరు వద్ద ఈటల కాన్వాయ్‌లోని ఒక కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. ఈటల రాజేందర్ ఆదివారం హుజురాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో మానకొండూరు మంలంలోని లలితాపూర్ వద్ద గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. దీంతో, ఈటల కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సందర్భంగా ఈటల కాన్వాయ్‌లోని మిగతా కార్లు ఒక్కదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో సిబ్బంది, నేతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. -
కేసీఆర్ పొలిటికల్ దాడి.. ఈటల రూటు మార్చేశారా?
ఈటల రాజేందర్ రూట్ మార్చేశారా?.. గతంలో మంత్రిగా ఉన్నపుడు హుజూరాబాద్‌కే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అటువైపు రావడమే మానేశారా?. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించే క్రమంలో రూట్ మార్చారా? తనపైనే ఫోకస్ చేస్తూ.. పదవులు కట్టబెడుతున్న తరుణంలో.. తానెక్కడి నుంచి బరిలోకి దిగుతారనే విషయంలో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచే బరిలో ఉంటారా? ప్లేస్ మార్చుతారా? ఈటల ఆలోచన ఏంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది. గులాబీ బాస్ కేబినెట్లో మంత్రిగా ఉన్నపుడు ఈటల రాజేందర్ ఎప్పుడూ తన నియోజకవర్గమైన హుజూరాబాద్‌లోనే కనిపించేవారు. కేసీఆర్‌ను ధిక్కరించి బయటకొచ్చాక కూడా నియోజకవర్గానికి ఎన్నడూ దూరంగా లేరు. అయితే, గత ఉప ఎన్నికలో తనను టార్గెట్ చేస్తూ గులాబీ దళం చేసిన ముప్పేట దాడితో ఈటల ఉక్కిరిబిక్కిరి అయింది వాస్తవం. గులాబీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం ఈటలనే వరించింది. ఈ పరిణామం గులాబీ దళపతిని మరింత అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతం నుంచి నలుగురికి రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి.. విప్‌గా క్యాబినెట్ హోదా కల్పించడమ కాకుండా.. హుజూరాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. జరుగుతున్న పరిణమాలన్నీ ఇప్పుడు ఈటలలో మధనానికి కారణమయ్యాయా అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. తెలంగాణ అంతటా ఈటల పర్యటన.. కేసీఆర్ వ్యూహ రచన గురించి బాగా తెలిసినవాళ్లలో ఈటల రాజేందర్ కూడా ఒకరు. ఈ క్రమంలో గులాబీబాస్ వ్యూహాలకు ప్రతివ్యూహంగా ఈటల అడుగులు వేస్తున్నారా..? అందుకే తరచూ పర్యటిస్తూ ఉండే సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారా..? బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ హోదాను ఆసరా చేసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ.. రాబోయే ఎన్నికల నాటికి తన ఛరిష్మాను ఇంకా పెంచుకోవడంతో పాటు.. తానెక్కడ నిలబడ్డా గెలవగలిగే అనుకూల పరిస్థితులను సృష్టించుకుంటున్నారా?. ఈక్రమంలో ఏ నియోజకవర్గం అయితే తనకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు వేసుకుంటున్నారా అని చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఈటల ఎప్పుడూ లేనివిధంగా తన నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో.. అసలు వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారా? మరో నియోజకవర్గం ఎంచుకుంటారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్లాన్ మార్చనున్న ఈటల? ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచే మళ్లీ బరిలోకి దిగొచ్చూ, లేకపోవచ్చు.. ఎన్నికలనాటికి రాజకీయ సమీకరణాల ఆధారంగా పరిస్థితులు మారిపోతాయి. కానీ, తననే ఫోకస్ చేస్తూ తనను ఎలాగైనా ఓడించాలన్న కసితో ఉన్న గులాబీబాస్నే ఒకింత కన్ఫ్యూజ్ చేసే క్రమంలోనే ఈటల అడుగులెటువైపో తెలియకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. తన చిరకాల ప్రత్యర్థిలా మారిన గులాబీ బాస్ కేసీఆర్ మీద లేదంటే జిల్లాలో ప్రధాన ప్రత్యర్థిగా తయారైన మంత్రి గంగుల కమలాకర్ మీద గానీ ఈటల బరిలోకి దిగే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా? -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్ భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. ఈ మేరకు ఈటలకు భద్రత పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనుంది. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యే భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి గురువారం డీసీసీ సందీప్ రావు చేరుకొని ఆయన భద్రత అంశంపై చర్చించారు. అనంతరం ఎమ్మెలయే భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇచ్చారు. అయితే ఈటలకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వమే వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: కేటీఆర్‌కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి -
ఈటల నివాసానికి పోలీసులు.. భద్రతపై చర్చ
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి డీసీసీ సందీప్ రావు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఈటల భద్రత అంశంపై ఆయనతో సమావేశమై అరగంట పాటు చర్చించారు. అనంతరం, ఈటల ఇంటి నుంచి డీసీపీ వెళ్లిపోయారు. ఇక, వీరి భేటి నేపథ్యంలో ఈటల భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ చెప్పిన అంశాలను డీజీపీ వివరిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈటల ఇంటి పరిసరాలను అధికారులు నిన్న(బుధవారం) పరిశీలించారు. అయితే, ఈటల భద్రతను సమీక్షించాలని మంత్రి కేటీఆర్.. డీజీపీని ఆదేశించారు. దీంతో, రాజేందర్ భద్రత పెంపుపై డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. మరోవైపు.. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ప్రాణహాని ఉందని ఈటల ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు కేంద్రం వై కేటగిరి భద్రత పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్ -
ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జమున.. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె తెలిపారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్‌పై ఈటల జమున మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీంతో, ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేశారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌కు భద్రత పెంపుపై డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష చేయనున్నారు. దీంతో, సీనియర్ ఐపీఎస్ కాసేపట్లో ఈటల ఇంటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఈటల జమున కామెంట్స్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. హత్యా రాజకీయాలను ఈటల కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. ఎక్కడ హుజురాబాద్‌లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటల రాజేందర్‌ను ఓడించేందుకని స్పష్టం చేశారు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
ఈటల రాజేందర్ హత్యకు కుట్ర... స్పందించిన కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్‌వి హత్యా రాజకీయాలని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హత్యా రాజకీయాలను ఆయనక కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. 2014లో బాల్‌రాజ్ అనే వ్యక్తిని ఈటల రాజేందర్ హత్య చేయించారని ఆరోపించారు. ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్‌ను థర్డ్ డిగ్రీ పెట్టించి వేధిస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. 2018 మర్రిపల్లిగూడెంలో ఈటల తనను చంపించే ప్రయత్నం చేశారని అన్నారు. ఎక్కడ హుజురాబాద్‌లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. చదవండి: అంతా తెలుసు.. టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ‘నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటెల రాజేందర్‌ను ఓడించేందుకు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుంది. బీసీలపై గౌరవం ఉంటే ఎందుకు ముదిరాజ్ కోడల్ని, అల్లున్ని తెచ్చుకోలేదు. కోళ్లఫామ్ పెట్టుకున్న వ్యాపారులు దివాళ తీస్తంటే ఈటల రాజేందర్ మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన పెంచే కోళ్లు ఏమైనా బంగారు గుడ్లు పెడుతున్నాయా? ఈటల రాజేందర్ కాస్త ఇవాళ చీటర్ రాజేందర్‌గా మారారు. రోడ్డు పొడిగింపు కోసం అమర వీరుల స్థూపాన్ని తొలగించేందుకు తీర్మానం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమరుల స్తూపం శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈటల లేడు’ అని పేర్కొన్నారు. కాగా ఈటల రాజేందర్ సతీమణి జమున తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిఇసందే. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని జమున వ్యాఖ్యానించారు -
ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
మానకొండూర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. అతడు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు ద్విచక్రవాహనదారుడిని ఢీ కొని, అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. బెలూన్స్ ఓపెన్‌కావడంతో కౌశిక్‌రెడ్డి, గన్మెన్లు, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మానకొండూర్ మండలం శంషాబాద్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తనకారులో సోమవారం ఉదయం కరీంనగర్ నుంచి హుజూరాబాద్ బయల్దేరా డు. మానకొండూర్ మండలం శంషాబాద్ చేరుకోగానే అదే గ్రామానికి చెందిన బూస సంపత్ ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతుండగా కౌశిక్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు అతడిని ఢీకొట్టింది. కారు డ్రైవర్ అప్రమత్తమై కుడివైపు తిప్పగా.. రోడ్డు కిందకు దిగింది. రెండు చెట్లను ఢీకొట్టబోతుండగా డ్రైవర్ తప్పించడంతో చిన్నపాటి కందకంలో దిగింది. కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదసమయంలో కౌశిక్‌రెడ్డి ముందుసీట్లో కూర్చుకున్నాడు. బెలూన్స్ ఓపెన్‌కావడంతో కారులోని వారికి ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనదారుడికి గాయాలు కాగా.. కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కౌశిక్‌రెడ్డి మరోకారులో హుజూరాబాద్ వెళ్లిపోయారు. కాగా.. కౌశిక్‌రెడ్డి డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా కా రు నడపడంతో తనతండ్రి ప్రమాదానికి గురయ్యాడని సంపత్ కొడుకు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్‌కుమార్ వివరించారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. దారిలో షాకిచ్చిన వధువు ఫ్యామిలీ
సాక్షి, హుజురాబాద్: ప్రేమపెళ్లి చేసుకున్న ఓ నవ వధువు సినీఫక్కీలో కిడ్నాప్‌కు గురైంది. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని హన్మకొండ వైపుగా కొత్త జంట వెళుతోంది. కారును అడ్డగించిన 15 మంది.. వరుడిపై దాడి చేసి, వధువును తీసుకెళ్లారు. వధూవరులిద్దరు హన్మకొండకు చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలోకి వధువును తీసుకురానున్నట్లు సమాచారం.