kapu
-
మేనిఫెస్టోలో చెప్పినదానికి మించి కాపులకు భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడూ ముందడుగే. ఏ వర్గానికి చేసిన మేలయినా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు కానీ, ఒక్క రూపాయి తక్కువ చేయలేదు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ప్రజలకు సీఎం జగన్ ఈ ఐదేళ్లలో చేసిన మేలు, కల్పించిన ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో చేయకుండా ఆ వర్గ ప్రజలను వంచించారు. కాపు సామాజిక వర్గం ప్రజలను చంద్రబాబు వేధించిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లకు కడుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపుల దశ తిరిగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి రూ.2,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని పేర్కొన్నారు. అయితే వాస్తవంగా ఈ ఐదేళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి చేసిన మొత్తం ఆర్థిక సాయం రూ.34,005.12 కోట్లు. అంటే చెప్పినదానికంటే రూ. 24 వేల కోట్లు ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కల్పించారు. డీబీడీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.93 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ఆర్థిక ప్రయోజనాలను కాపులకు అందించారు. చంద్రబాబు గతంలో ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కాపులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవంగా చంద్రబాబు పాలన ఐదేళ్లలో కాపులకు కేవలం రూ.1,340 కోట్లే కేటాయింపులు చేశారు. అంటే ఇచ్చిన హామీని నెరవేర్చనేలేదు. రూ.5 వేల కోట్లలో పావు వంతే కేటాయింపులు చేసి, కాపు వర్గాలను మోసం చేశారు. అంతే కాదు.. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన వారిపై చంద్రబాబు తన పాలనలో ఉక్కుపాదం మోపారు. ఆఖరికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, వారి కుటుంబసభ్యులను ఇంట్లోనే నిర్బధించడంతో పాటు ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. అంతే కాకుండా ఏకంగా నలుగురు కాపు వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అర్హతగల కాపులందరినీ నవరత్నాల పథకాలకు ఎంపిక చేశారు. సిఫార్సులు, లంచాలకు తావులేకుండా, పార్టీలకు అతీతంగా కాపు సోదరులు, కాపు సోదరిలకు సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం అందించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,58,613 మంది కాపు మహిళలకు రూ.2029.92 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ ఇంత ఆర్థిక సాయం అందుకోవాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉంటేనే సాధ్యం అవుతుందనేది జగమెరిగిన సత్యం. -
YSRCPలో చేరిన కాపు జేఏసీ నేతలు
-
పవన్ కల్యాణ్ పై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఫైర్
-
బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు
సాక్షి, అమరావతి: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దని చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక హితవు పలికింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటింటికి కరపత్రాల రూపంలో పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కాపు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, కో–కన్వీనర్లు పంచాది రంగారావు, ఎన్.వి.రామారావు మీడియాకు విడుదల చేశారు. మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారని పేర్కొన్నారు. -
బడుగులకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: మూడు జాబితాల్లోనూ కాపు, బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. బడుగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన సొంత సామాజికవర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికే 30 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. వెలమ సామాజిక వర్గాన్ని కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండిచేయి చూపారు. టీడీపీ జాబితాలో ముస్లిం మైనార్టీ సీట్లు కేవలం మూడే కేటాయించారు. ఇప్పటివరకు 139 స్థానాలకు అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించగా, బీసీ-31, ముస్లిం మైనార్టీ-3, ఎస్సీ-26, ఎస్టీ-04, కాపు-09, కమ్మ 30, రెడ్డి-28, వైశ్య-02, క్షత్రియ-05, వెలమ-01 సీట్లు కేటాయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు సీఎం జగన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. -
మనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం జగన్ వల్లే దక్కింది: అడపా శేషు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్లు అయ్యిందని.. ఈ కాలంలో కాపులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమిలో 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడని మండిపడ్డారు. జనసేనలో పవన్ వెనుక తిరిగిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తిరువూరులో వైఎస్సారీసీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, వైఎస్సార్సీపీ కాపు నేత ఆకుల శ్రీనివాస్ ,తిరువూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్, తిరువూరు కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. కాపులకు అండగా ఉంటానని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 30 మందిని ఎమ్మెల్యేలను చేసి, మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. మనం కోరుకున్న రాజ్యాధికారం జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కిందన్నారు.. ఆయనకు మనకు ఏం చేయలేదని వ్యతిరేకించాలని ప్రశ్నించారు.. సీఎం చెప్పింది చేస్తారని, పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. కొలికపూడి శ్రీనివాస్‌పై అడపా శేషు ఫైర్.. ‘రంగా హత్యకు వైఎస్సార్ కారణమని కొలికపూడి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. రంగా హత్యకు కారణం ముమ్మాటికీ టీడీపీ,చంద్రబాబే. టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయం. వంగవీటి మోహన్ రంగా మనకు ఇచ్చిన ఆయుధం వైఎస్ జగన్. టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయి .పథకాలు ఆగిపోతాయి. కాపులకు తిరువూరులో అండగా నిలబడే వ్యక్తి నల్లగట్ల స్వామిదాస్. మనకు రాజకీయ గురువు రంగా ఒక్కరే. చిరంజీవి, పవన్ మనకి కేవలం సినిమా హీరోలు మాత్రమే. వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ, చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. పవన్ జనసేన పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడు’ అని అడపా శేషు మండిపడ్డారు. -
నేను రాజకీయాల్లో హీరోను.. పవన్‌పై ముద్రగడ ఫైర్
సాక్షి, కాకినాడ: రాజకీయపరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైనా ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఘనమైన కుటుంబ చరిత్ర మాది. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరా. కానీ, ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు. బేషరతుగానే వైఎస్సార్సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నా. కాపులు, దళితుల కోసం నేను ఉద్యమించా. దళితుల భిక్షతోనే ఈ స్థితికి వచ్చా. కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే.. బీసీని గెలిపించాను. ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారు. నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను.. .. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి ఆయన ఎవరు?. అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు? కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు?. మీరు సినిమాల్లో హీరో కావొచ్చు. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను’’ అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. .. ‘‘సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు?.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదు? అని కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారు. మీరేంటీ పొడుగు?.. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు. నేను రాజకీయాల్లో గొప్ప. ఆ మాటకొస్తే రాజకీయాల్లోను.. సినిమా ఫీల్డ్ లో నేను ముందున్నాను. మీరా నాకు పాఠాలు నేర్పేది?’’.. అని జనసేన కార్యకర్తలపై ముద్రగడ మండిపడ్డారు. .. ‘వైఎస్సార్సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. కానీ, కొన్ని శక్తులు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీలో చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధం’ అంటూ ముద్రగడ ప్రకటించారు. -
Fact Check: ‘కాపు’ కాసిందే జగన్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాపుల మదిలో విష బీజాలు నాటి చంద్రబాబుకు మేలు చేయాలనే కుతంత్రంతో రామోజీరావు అడ్డగోలుగా మరో తప్పుడు కథనాన్ని వండి వార్చారు. ‘కాపులకు జగన్ దగా’ అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడులో విషం కక్కారు. అసలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకొని వారి ఓట్లతో గద్దెనెక్కి వారిని వంచించి వదిలేసిందే చంద్రబాబు. ఇది జగమెరిగిన సత్యం. రిజర్వేషన్లు, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు వంటి ఎన్నో హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా కాపులను దారుణంగా దగా చేశారు. ఒక్క కాపులే కాదు.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేశారు. మోసాలకు కేరాఫ్ చంద్రబాబు అన్న ముద్ర వేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం మాయ మాటలతో తాను మభ్య పెట్టలేనని, చేసేదే చెబుతానని నిఖార్సైన నాయకుడిగా నిలబడ్డారు. ఇచ్చి న మాటను నిలబెట్టుకుంటూ నవరత్న పథకాలతో కాపులను అన్ని విధాలుగా ఆదుకోవడంతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ పెట్టి వారికి నిజమైన మేలు చేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపుల్లోని పేద వర్గాలకు ఆర్థిక తోడ్పాటునందించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. సీఎం జగన్ 58 నెలల పాలనలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.39,317.80 కోట్లు ఆర్థిక సాయమందించి సీఎం జగన్ రికార్డు సృష్టించారు. రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకుడిగా సీఎం వైఎస్ జగన్ కాపుల ఉన్నతిలో తనదైన ముద్ర వేసుకున్నారు. విశ్వసనీయత, నిబద్ధత, నిజాయతీకి సీఎం వైఎస్ జగన్ మారుపేరు. ఈ విషయాలన్నీ తెలిసీ రామోజీ అసత్య కథనంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. రామోజీ ఇలాంటి కథనాలు ఎన్ని అచ్చేసినా చంద్రబాబుకున్న మోసాలకు కేరాఫ్ ముద్రా పోదు.. సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న విశ్వసనీయతకు మారు పేరన్న గౌరవమూ తగ్గదు. రామోజీ అచ్చేసిన కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిస్తే.. ఆరోపణ: కార్పొరేషన్‌ను నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కారు? వాస్తవం: కాపు కార్పొరేషన్‌ను గత చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఇది తెలిసినా ఎన్నికలు సమీపిస్తుండటంతో బాబుకు రాజకీయ మేలు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై రామోజీ బురద రాతలకు దిగజారారు. కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరుపుతానని మాట ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా 2014 నుండి 2017 వరుకు ఒక్క రూపాయీ విదల్చలేదు. 2017 నుండి 2019 వరకు రూ.1,874.67 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. విడుదల చేసింది రూ.1,334 కోట్లే. అంతే ప్రకటించిన మొత్తంలో రూ.540 కోట్లు బకాయి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు పెట్టిన బకాయిలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల అభ్యున్నతికి కాపు కార్పొరేషన్ ద్వారా చేయూతనిచ్చి ంది. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.15,044.64 కోట్లతో వైఎస్సార్ కాపు నేస్తం, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ అసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆరోపణ: గత ప్రభుత్వ హయాంలో రూ1,441 కోట్ల మేర రాయితీ రుణాలు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రూ.1,441.75 కోట్లు మేరకు రాయితీ రుణాలు ఇచ్చి నట్టు చంద్రబాబు గురించి గొప్పలు చెప్పిన ఈనాడు.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు మించి నిధులు కేటాయించినప్పటికీ మసిపూసి మారేడు కాయ చేసేలా అబద్ధాలు రాసేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 (ఈ ఏడాది మార్చి) వరకు 19,81,458 మంది లబ్దిదారులకు రూ.3,260.87 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి వాటికి నిధులు విడుదల చేసింది. వాహన మిత్ర పథకంలో 58 నెలల కాలంలో 25,046 మందికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.132.57 కోట్లు ఆర్థిక సాయం అందించింది. ఆరోపణ: నైపుణ్య శిక్షణ నిలిపేశారు వాస్తవం: నైపుణ్య శిక్షణ పేరుతో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ సంస్థలకు బకాయిలు పెట్టిన రూ.8.83 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వం విద్యోన్నతి అంటూ గొప్పలు చెప్పిన పథకంలో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ ఇచ్చి న సంస్థలకు బకాయి పెట్టిన రూ.6.15 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2023–2024 ఏడాదికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ద్వారా అర్హత కలిగిన కాపు విద్యార్ధులకు లక్ష రూపాయలు చొప్పున 23 మందికి రూ.23 లక్షలు అందించింది. ఆరోపణ: కాపు భవన నిర్మాణాలపైనా జగన్ కన్నుకుట్టింది వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలు చెప్పి మంజూరు చేసిన భవనాల్లో ఒక్క దానికీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించలేదు. అదీ చంద్రబాబు సర్కారు ఘనత. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా నెల్లూరు మున్సిపాలిటీలో, బాపట్ల జిల్లా ఏల్చూరు, అడవిపాలెం, చందలూరులో నాలుగు కాపు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించింది. ఇదీ సీఎం వైఎస్ జగన్ నిబద్ధత. ఆరోపణ: విదేశీ విద్య దక్కకుండా కుతంత్రాలు వాస్తవం: గత ప్రభుత్వం చేపట్టిన విదేశీ విద్యా పథకంలో అక్రమాలు, అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. దీంతో ఈ పథకాన్ని మరింత మెరుగులు దిద్ది పేద వర్గాలకు మేలు చేసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 2015–16 నుండి 2018–19 వరకు 307 మంది విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.20.97 కోట్ల మేర బకాయిలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. 2022 నుంచి 2024 (మార్చి) వరకు విదేశీ విద్యా దీవెనకు సంబంధించి 60 మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ రూ.15.62 కోట్లు అందించి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల్లో 2019 నుంచి 2024 వరకు 8,41,677 మంది కాపు విద్యార్ధుల కోసం వారి తల్లులకు రూ.3,950.79 కోట్లు అందించింది. -
కాపుల పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ: వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్నం, సాక్షి: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని.. కాపుల పట్ల సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలో కాపు సామాజిక భవనం భూమి పూజా కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలు పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ కాపుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కాపులకు రూ. 25 కోట్లు భూమి కేటాయించడమమే ఇందుకు నిదర్శనం. అదీ విశాఖ నడిబొడ్డున.. హైవే పక్కన 50 సెంట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర. కాపులతో పాటు యాదవుల సామాజిక భవనం నిర్మాణం కోసం కూడా 50 సెంట్ల భూమి కేటాయించారు. రాజ్యసభ నిధుల నుంచి కాపు, యాదవ సామాజిక భవనాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తాను అని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘‘రూ. 25 కోట్లు విలువైన 50 సెంట్లు భూమిని కాపు భవనానికి సీఎం జగన్ కేటాయించారు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేస్తాం. విశాఖ నగరంలో ఇప్పటికే అనేక కళ్యాణ మండపాల నిర్మాణం పూర్తి చేశాం. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 31మంది కాపులు పోటీ చేసేందుకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఆ 31 మందిలో 29 విజయం సాధించారు. ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల ఆరాధ్య దైవం రంగాను చంపిన వారికి.. ముద్రగడ పద్మనాభంను అవమానించిన వారికి మద్దతు చెబుతారో.. కాపులకు మేలు చేసిన వారికి అండగా ఉంటారో మీరే(కాపులను ఉద్దేశించి..) నిర్ణయించుకోవాలని అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ మేలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో పెద్ద పీట వేశారు. కాపు నేస్తం పథకం ప్రవేశ పెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కులగణన చేపట్టారు. కాపు బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారు. కాపులకు సేవ చేసేందుకు మేము ఎప్పుడు ముందు ఉంటాం అని బొత్స ఝాన్సీ అన్నారు. ఇంకా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీదర్, కొండా రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రబ్బరు చెప్పుల రాజకీయం కాస్త.. !’
విజయవాడ, సాక్షి: రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్లతో రాజకీయాలు చేయిస్తానని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట మార్చాడని.. ఇప్పుడు డబ్బున్న వాళ్ళను మాత్రమే జనసేన నాయకుల్ని చేస్తోందని వైఎస్సార్సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్ విమర్శించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలే చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరి నుంచి పవన్ కల్యాణ్ కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నాడు. పవన్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశాడు. 2019 తరువాత చార్టర్ ఫ్లైట్ కొన్నాడు. కోట్లు పెట్టి కార్లు కొన్నాడు. అసలు పవన్‌కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?.. .. పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తే నేను బూటు చూపిస్తున్నా. పార్టీ పెట్టి కాపులను పవన్ కల్యాణ్ మోసం చేశారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డున పడేశారు. టీడీపీకి హోల్ సేల్ గా పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేశాడు. నమ్మి మోసపోయిన నాకు మీరు(పవన్‌ను ఉద్దేశించి..) సమాధానం చెప్పాలి అని రామ్‌సుధీర్ వ్యాఖ్యానించారు. .. జనసేన పార్టీ పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాల పేరుతో పెద్ద స్కామ్‌కు తెరలేపారు. జనసేనలో నాదెండ్ల లింగమనేని ఇద్దరూ కలిసి టికెట్ల డిసైడ్ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని అడుగుతున్నారు.. అని రామ్ సుధీర్ ఆరోపించారు. -
పవన్ కల్యాణ్.. టీడీపీ తొత్తు: అడపా శేషు
-
కాపు ఓట్లకి గేలం వేసేందుకు పవన్ ని ట్రాప్ చేసిన చంద్రబాబు
-
కులం పేరిట బాబు విష రాజకీయం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా విష ప్రచారం చేస్తున్నాయి. నిజం గుమ్మం దాటి బయటకు వచ్చేలోగా అబద్దం ఊరంతా తిరిగివచ్చిందన్న సామెత గుర్తు చేస్తున్నాయి. కులం.. ఓ అస్త్రం ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి ప్రజలను కులాల పేరిట విడగొట్టడంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో సక్సెస్ అయింది. కొన్ని కులాలను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతకైనా దిగజారిందన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నుంచి ఓ పకడ్బందీ వ్యూహరచనను అమలు చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఏపీలో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు కొంత సఫలీకృతుడయ్యాడని చెబుతారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మరో అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో కాపులు ఏ రకంగానయితే పెద్ధ సంఖ్యలో ఉన్నారో.. అలాగే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బలిజలున్నారు. పవన్‌తో పొత్తు.. దేనికి సంకేతం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సినిమాల్లో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలతో సంబంధం లేకుండా కొంత యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, ఆ సమయంలో పవన్ పార్టీ కోసం పని చేయడం.. ఆ తర్వాత కాలంలో అది కాస్తా కాంగ్రెస్‌లో కలిసిపోవడం.. ఇదంతా సగటు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయం. ఈ ఎపిసోడ్‌ను జాగ్రత్తగా ఫాలో అయిన చంద్రబాబు.. ఈ మొత్తం అధ్యాయం నుంచి పవన్ కళ్యాణ్ అనే చాప్టర్‌ను బయటకు తీశాడు. తనకు అనుకూలమైన రాజకీయ పరిస్థితులను సృష్టించడానికి పవన్‌కళ్యాణ్‌ను ఓ పావుగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 2014లో అసలు పోటీ చేయకుండానే.. పొత్తులోకి రావడం, 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఓటు చీల్చేందుకు జనసేన విడిగా పోటీచేసేలా చూడడం, ఆ తర్వాత మళ్లీ పవన్‌తో జైల్లో పొత్తు పెట్టుకోవడం.. ఇవన్నీ హఠాత్తుగా జరిగిన రాజకీయ పరిణామాలు కాదు. అతి జాగ్రత్తగా చంద్రబాబు తెరవెనక రచించిన మంత్రాంగానికి ఇవి విజువల్ రూపం మాత్రమే. పవన్ వెనక ఉన్న వారెవరు? పవన్ కళ్యాణ్‌ను కాపుల ప్రతినిధిగా ఎవరైనా చెప్పుకుంటే అంతకు మించిన తప్పు ఇంకొకటి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉండే భీమవరం నియోజకవర్గాన్ని ఎంచుకుని మరీ పోటీ చేస్తే.. 8వేలకు పైగా తేడాతో ఓడిపోయారు పవన్‌కళ్యాణ్. నిజంగా పవన్ కాపుల ప్రతినిధే అని జనం నమ్మితే ఓడించబోరు కదా. ఇక చంద్రబాబు చేతిలో ఉన్న ఎల్లో మీడియా ఓ అడుగు ముందుకేసి కాపులతో పాటు, బలిజ కూడా జనసేన, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయన్న ఓ అబద్ద ప్రచారాన్ని సోషల్ మీడియాలో నడుపుతున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా తెలగ/కాపులు, బలిజలు ఉన్నారు. బలిజలు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో విస్తరించి ఉన్నారు. మరి బలిజలకు చంద్రబాబు చేసిందేంటీ? సీఎం జగన్ చేసిందేంటీ? చంద్రబాబు ఏం చేయకపోగా.. బలిజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాడు. మా నమ్మకం నువ్వే జగన్ : బలిజలు రాయలసీమ జిల్లా బలిజల్లో ఎందరికో మంచి పదవులను ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. అవకాశం వచ్చిన ప్రతీ సారి బలిజలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు సీఎం జగన్. YSR జిల్లానే చూసుకుంటే.. కడపకు చెందిన సి.రామచంద్రయ్యను ఎమ్మెల్సీగా నియమించారు. గురుమోహన్ ను అన్నమయ్య జిల్లా అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. మర్రి రవికుమార్ ను రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంచుకున్నారు. పోరుమామిళ్లకు చెందిన డా. కళ్యాణ్ చక్రవర్తిని ఆప్కోస్ డైరెక్టర్ గా నియమించారు. బలిజలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో 10 మంది కాపు నేతలకు మంత్రి పదవులివ్వడమే కాకుండా కీలక శాఖలు ఇచ్చారు సీఎం జగన్. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాస్‌ను, అగ్రోస్ ఛైర్మన్‌గా నవీన్ నిశ్చల్‌ను, నియమించారు. అలాగే చిత్తూరు జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యేగా జంగాలపల్లె శ్రీనివాసులు (అరణి శ్రీనివాసులు)ను 2019లో గెలిపించుకున్నారు. నగరికి చెందిన కేజీ శాంతికుమారిని ఈడిగ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఫారెస్ట్ బోర్డు మెంబర్‌గా నయనార్ శ్రీనివాసులును నియమించారు. పదవులకు తోడు.. యావత్తు బలిజలకు అండగా ఉండేలా ఇప్పుడు మరో అడుగు ముందుకేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. బలిజ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మంత్రివర్గం మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు అయిదుగురికి, రెండో సారి పునర్వ్యవస్థీకరించినప్పుడు అయిదుగురికి కాపు/బలిజలనుంచి తీసుకున్నారు సీఎం జగన్. బలిజలంతా వైఎస్ఆర్సీపీ వైపే : రత్నాకర్ వరుసగా నాలుగో సారి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పండుగాయల తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. "మాటల్లో కాదు, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన లాంటి ఓ సామాన్యుడిని కేబినెట్ పదవిలో కూర్చోబెట్టగలిగిన చిత్తశుద్ధి, సత్తా ఒక్క వైయస్ఆర్ సీపీకే ఉంది. కాపు, బలిజ సామాజికవర్గానికి మరింత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. త్వరలోనే బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కాబోతోంది, ఆర్ధికంగా వెనుకబడిన బలిజల అభ్యున్నతికి ఈ కార్పొరేషన్ ద్వారా చేయూతనివ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన." అని అన్నారు. పవన్‌తో చంద్రబాబు పొత్తు పేరిట కాపు, బలిజల ఓటు బ్యాంకును కొట్టేయాలన్న చంద్రబాబు ప్రయత్నం కచ్చితంగా విఫలమవుతుందని, బలిజల ముసుగులో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయాలను బలిజలు ఈసడించుకుంటున్నారంటున్నారు. బలిజలకు టీడీపీలో పదవులే కాదు, కనీస గౌరవం కూడా లేదంటున్నారు. -
కాపుల మీద దాడులపై పవన్ నోరు విప్పాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ)/రాజమహేంద్రవరం సిటీ: కాపు సామాజికవర్గంపై దాడులు జరుగుతుంటే పవన్‌కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాపులపై పవన్‌కు ప్రేమ ఉంటే మంత్రి అంబటిపై దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు. మంత్రి అంబటిపై దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న టీడీపీని బతికించాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ అంబటిపై దాడిని ఖండించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేతలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కాపు జేఏసీ ర్యాలీ మంత్రి అంబటిపై దాడి దుర్మార్గమని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాపు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జేఏసీ నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కాపు జేఏసీ నేతలు నందెపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, మానే దొరబాబు, అడపా అనిల్, రాయవరపు గోపాలకృష్ణ, ఆకుల ప్రకాష్, వలవల దుర్గాప్రసాద్, నామన వాసు, బురిడీ త్రిమూర్తులు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల గూండాగిరిపై కాపుల కన్నెర్ర
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): వంగవీటి రంగాను హత్య చేయడంతోపాటు ముద్రగడ పద్మనాభంను మానసికంగా చంపేశారని.. ఇలా అన్ని రంగాల్లో కాపులను టీడీపీ నేతలు అణగదొక్కుతూనే వచ్చారని అఖిల భారత కాపు అభ్యున్నతి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రి అంబటి రాంబాబుపై ఖమ్మంలో టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారని.. ఇకపై ఇలాంటి దాడులు చెల్లవని పేర్కొంది. గతంలో కూడా అంబటిపై దాడి చేశారని.. పదే పదే కాపులపై దాడులకు తెగబడితే తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించింది. మంత్రి అంబటిపై టీడీపీ గూండాల దాడిని ఖండిస్తూ అఖిల భారత కాపు అభ్యున్నతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాపులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ నేతల గూండా గిరిపై కన్నెర్ర చేశారు. ఆలిండియా కాపు అభ్యున్నతి సంఘం జిల్లా అధ్యక్షుడు, గుంటూరు మిర్చియార్డు డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ టీడీపీకి మొదటి నుంచి కూడా కాపుల పట్ల చిన్నచూపే ఉందని విమర్శించారు. కాపు నేత కాకి శ్రీను మాట్లాడుతూ తమ మౌనాన్ని చేతగానితనంగా భావిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. మిర్చియార్డు మాజీ వైస్ చైర్మన్ ఎర్రబాబు, కాపు నేతలు కోట రాందాస్, గేదెల రమేష్, యిర్రిసాయి, రాతంశెట్టి మన్నార్, నరాలశెట్టి అర్జున్, కారసాని వెంకట్, రవి నాయుడు, డి.జయ, రేజేటి నవీన్ పాల్గొన్నారు. -
నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించి... కమ్మ, కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని వీరంగం సృష్టించారు. హనుమాన్‌జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హాజరైన ఈ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.నియోజకవర్గ పరిశీలకుడు హరిబాబు నాయుడుపై గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఖర్చు మాది... మేం లోకల్.. నువ్వు నాన్‌లోకల్. మామీద నీ పెత్తనం ఏమిటీ. నాకు నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి. నువ్వెంత. ఇక్కడ మాదే పెత్తనం...’ అంటూ జాస్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హరిబాబు నాయుడుపై జాస్తి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు నాయకులు దాడి చేసేందుకు దూసుకెళ్లారు. దీంతో హరిబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతలు రెండు వైపులకు చేరి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడిని సైతం స్థానిక నేతలు రెచ్చగొట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో కొనకళ్ల నారాయణరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరువర్గాలు వినకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వికటించిన చంద్రబాబు ప్రయోగం... టీడీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడిగా గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేత వడ్రాం హరిబాబు నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. నియోజకవర్గంలోని కాపులను సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనకు పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. అయితే, హరిబాబు నియామకం తొలి నుంచి ఇక్కడ కొందరు నాయకులకు నచ్చలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరులుగా ఉంటూ మట్టిదోపిడీ, సెటిల్మెంట్లు చేసినవారికి హరిబాబు నియామకం మింగుడు పడలేదు. దీంతో ఆధిపత్యం కోసం పోరు జరుగుతూనే ఉంది. ఇటీవల నిర్వహించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్రలో హరిబాబు నాయుడు యాక్టివ్‌గా వ్యవహరించడాన్ని స్థానిక నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గురువారం జాస్తి వెంకటేశ్వరరావు గొడవకు దిగడంతోపాటు ఆ తర్వాత ఉంగుటూరు మండల అధ్యక్షుడు కూడా నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో కొందరు నేతల ఆధిపత్య, అహంకారపూరిత ధోరణి వల్లే ఈ గొడవ జరిగిందని, వీరి వైఖరి వల్ల అన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. -
పవన్ కళ్యాణ్ పై తూర్పు కాపు నేతల ఆగ్రహం
-
పవన్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు..: కాపు మహిళా నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత దక్కిందని కాపు మహిళా నేతలు అన్నారు. ఆదివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడలో కాపు మహిళలను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వీర మహిళలపై దాడి అంటూ రెచ్చగొట్టేయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే ద్వారంపూడిపై వపన్ చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని కాపు మహిళా నేతలు అన్నారు. కాపులను గౌరవించేది ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. కాపుల కోసం ఆలోచించి ఉన్నత పదవులు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. నగర వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టిన ద్వారంపూడి పేరు ప్రస్తావిస్తున్నారు. ద్వారంపూడి వల్ల పవన్‌కు ఎప్పుడో మంచి జరిగే ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని ముట్టడించడానికి వీరమహిళలు వచ్చారు. అప్పుడు మేమంతా ద్వారంపూడికి అండగా నిలబడ్డాం -కాకినాడ అర్బన్ డవలప్మెంట్ ఛైర్మన్ చంద్రకళా దీప్తి గత 30 ఏళ్లుగా నగరంలో ఉన్న 80 శాతం కాపులు ద్వారంపూడి కి అండగా ఉంటున్నాం. మాకు ద్వారంపూడితో ప్రయాణం ఆనందకరం. -రాజారపు కృష్ణ, కాపు నేత -
కాపు రిజర్వేషన్‌పై జూన్‌లో తుది విచారణ
సాక్షి, అమరావతి: ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై జూన్ 26న తుది విచారణ చేపడుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌కు పలు సూచనలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని, ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తేవాలని సూచించింది. లేనిపక్షంలో రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టులో పెండింగ్‌లో ఉందన్న కారణంతో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని వ్యాఖ్యానించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం చట్ట విరుద్ధమంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. జోగయ్య తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చిందని, దీనిపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టాన్ని అమలు చేయడంలేదని అన్నారు. విద్యా, ఉపాధి అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు జోక్యం చేసుకుంటూ.. కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ తాము గతంలోనే పిల్ దాఖలు చేశామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. కాపులకు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని, అందువల్ల లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. -
పదేళ్లైనా.. ప్చ్! జనసేన అనుకూల పవనాలు ఇంకా రాలేదు
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్నా పార్టీకి అనుకూల పవనాలు ఇంకా రాలేదని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాపులందరూ ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకలో తాను ఓడిపోయేవాడిని కాదన్నారు. ‘రాష్ట్రంలో ఇంత సంఖ్యా బలం ఉన్న కాపు, బలిజ కులాలకు నిజంగా కట్టుబాటు ఉంటే వేరేవారు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇది గ్రహించనంత వరకు రాజ్యాధికారాన్ని మరిచిపోండి’ అని పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర వహించి బీసీలు, ఎస్సీలను కూడగట్టి కమ్మ, రెడ్డి, క్షత్రియులకు గౌరవం ఇచ్చి తీరాలన్నారు. ‘మా అమ్మ గాజుల బలిజ, నాన్న కాపు. నా కులం ఉనికిని నేను ఎప్పుడూ తీసివేయలేదు. నా కులం వాస్తవం. కాపులు ఐక్యంగా ఉంటే దక్షిణాదిలో బలమైన శక్తిగా ఎదగవచ్చు’ అని పేర్కొన్నారు. కాపులు కోస్తాలో గొంతు ఎత్తగలరుగానీ రాయలసీమలో బలిజలు నోరెత్తేందుకు భయపడతారని, ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. సీఎం పదవిస్తేనే పొత్తు! ముఖ్యమంత్రి పదవి ప్రాతిపదికనే ఏ పారీ్టతోనైనా పొత్తులు ఉండాలని కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్‌కు సూచించింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో హరిరామ జోగయ్య మాట్లాడుతూ జనసేనను బలహీన పరిచేందుకు టీడీపీ పలు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ రెండింటితో యుద్ధాన్ని ప్రకటించి ముందుకు వెళ్లాలని తాను పవన్‌కళ్యాణ్‌ను కోరుతున్నట్లు చెప్పారు. లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోనని మాటిస్తున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొంటూ తానెందుకు ఉంటానని ప్రశి్నంచారు. ‘నమ్మిన వారిని తగ్గించం. ఎవరి అజెండాల కోసమూ పనిచేయం’ అని తెలిపారు. చదవండి: స్కాములన్నీ బాబు హయాంలోనే -
హరిరామ జోగయ్యకు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్..
అమరావతి: కాపు సామాజిక వర్గం అంశంపై మాజీ మంత్రి హరి రామ జోగయ్య రాసిన లేఖకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు నాయుడుతో జతకడుతున్న పవన్ కల్యాణ్‌కు పంపబోయిన లేఖను తనకు పంపారా? అని పరోక్షంగా హరిరామ జోగయ్యకు చురక అంటించారు. అలాగే హరి రామ జోగయ్య ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వంతో ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు అమర్నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఓ లేఖను ట్వీట్ చేశారు. pic.twitter.com/bnqvFRKR6L — Gudivada Amarnath (@gudivadaamar) February 5, 2023 చదవండి: యనమల.. ఇవన్నీ కనిపించడం లేదా? -
చంద్రబాబు, పవన్ ఎత్తులను కాపులే చిత్తు చేస్తారా..?
సంక్రాంతి తరువాత తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గినా రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ముఖాన్ని ముందు పెట్టి కాపుల ఓట్లు కొల్లగొట్టాలి అనేది బాబు ఎత్తుగడ. కానీ, కాపులు ప్రజారాజ్యం తరువాత రాజకీయంగా చేతులు కాల్చుకున్నారు. చిరంజీవిని నమ్మి దివాళ తీసిన కాపులు చాలా మంది ఉన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పెట్టినా ఆయన వెనుక నడవడానికి మెజార్టీ కాపులు ఇష్టపడటం లేదు. ప్రజారాజ్యం అనుభవాలు, జనసేన వెనుక చంద్రబాబు, రామోజీలు ఉన్నారనే ప్రచారంతో కాపులు చాలా మంది పవన్ కల్యాణ్‌కు దూరంగా ఉంటున్నారు. జనసేన వెనుక చంద్రబాబు, రామోజీ ఉన్నారనేది ప్రచారం కాదు, వాస్తవమే అనే విధంగా పవన్ మాటలు, చేష్టలు ఉంటున్నాయి. 2014లో చంద్రబాబును గెలిపించడానికే జనసేన ఉద్దేశపూర్వకంగా పోటీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు వ్యూహంలో భాగంగానే పవన్ విడిగా పోటీ చేశారని రాజకీయ వర్గాల్లో బలమైన టాక్ ఉంది. ఇక.. 2024 ఎన్నికల కోసం చంద్రబాబు, పవన్ ఏడాది క్రితం నుంచే సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికలకు మొదటి మెట్టుగా ఇప్పటం సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం ఆధ్యంతం చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసే విధంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటం సభలోనే పవన్ శపథం చేశారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి విడిగా పోటీ చేసిన పవన్, 2024 నాటికి తన ఆలోచనలు మార్చుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని జబ్బలు చరుస్తున్నాడు. ఇదంతా ఎవరి కోసం..? ఇక్కడే కాపులు పవన్ కల్యాణ్ మీద అనుమానం పెంచుకుంటున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనను, మూడున్నరేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో 60శాతం కంటే ఎక్కువ మద్దతు ఉంది. పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న చంద్రబాబుకు పరిస్థితులు ఆశాజనకంగాలేవు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన కాపులు సీఎం జగన్ చిత్తశుద్ది, రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన పడుతున్న తాపత్రయం గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన విద్యా, వైద్య సంస్కరణలు చూస్తున్నారు. 30 ఏళ్లు పైబడి నిజాయితీగా ఆలోచించే కాపులు జగన్‌కే జై కొడుతున్నారు. ఇక.. 50 ఏళ్ల పైబడిన కాపులు 90 శాతానికిపైగా వైఎస్ జగన్‌పై బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికీ బలమైన కాపు ఓటు బ్యాంక్ సీఎం వైఎస్ జగన్‌తోనే ఉంది. పవన్ కల్యాణ్ చెప్పులు చూపించడం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి, విజయవాడ నోవాటెల్‌లో చంద్రబాబుతో పవన్ భేటీ, హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లడాన్ని మెజార్టీ కాపులు సమర్థించడం లేదు. 2024కు చంద్రబాబు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాడు. ఆ శస్త్రాల్లో మొదటి ఆయుధం పవన్ కల్యాణ్. లోకేష్ కంటే కూడా చంద్రబాబు పవన్ కల్యాణ్‌నే ఎక్కువ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఒక పక్క లోకేష్ గ్రాఫ్ పడిపోకుండా ఉండటానికి జనవరి 27 నుంచి పాదయాత్రకు ప్లాన్ చేశారు. మరో పక్క కాపుల ఓట్ల కోసం వారాహితో పవన్‌ను రోడ్డెక్కిస్తున్నారు. ఇంకోపక్క ఎల్లో మీడియాతో నిత్యం అబద్ధాలు చెప్పిస్తున్నారు, రాయిస్తున్నారు. మరో పక్క వందల కోట్లు గుమ్మరించి సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలకు తెగిస్తున్నారు. ఇంత చేస్తున్నా.. కాపులు, బడుగు, బలహీన వర్గాలు సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారనేది చంద్రబాబు పచ్చమీడియా ఆందోళన. అందుకే.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై, అభివృద్దిపై చర్చ జరగకుండా ఉండేందుకు హింసను రెచ్చగొడుతున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎల్లో మీడియా చేసే ఫేక్ ప్రచారాలు అడ్డుకోవాలంటే.. వైఎస్సార్సీపీ వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారం కల్పించాలి. సచివాలయాల దగ్గర నుంచి సినిమా థియేటర్ల వరకూ ఈ ప్రచారం హోరెత్తాలి. రాజకీయంగా అస్త్రాలను సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు, అమలు చేస్తున్నారు. 1. సంక్షేమ అస్త్రం 2. రాజకీయ సమానత్వ అస్త్రం 3. ఆర్ధిక సమానత్వ అస్త్రం. మూడు అస్త్రాలకు మార్గదర్శి భారత రాజ్యాంగం, మహాత్మ గాంధీ ఆలోచనలే. బాబు, పవన్‌లు సీఎం వైఎస్ జగన్ మీద దాడి చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ, వారు దాడి చేస్తున్నది భారత రాజ్యాంగంపై, గాంధీ, అంబేద్కర్ ఆలోచన విధానాలపై అని తెలుసుకోలేకపోతున్నారు. 75 ఏళ్లుగా స్వాతంత్య్ర భారత చరిత్రలో కాగితాలకే పరిమితమైన సిద్దాంతాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయి. సీఎం జగన్ తన పాలనకు మానవత్వం జోడించి ముందుకెళ్తున్నారు. చదువే తలరాతను మారుస్తుందని, ఆంధ్రప్రదేశ్ పౌరులు గ్లోబల్ సిటిజన్స్‌గా ఎదగాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. మాటలు చెప్పడమే కాదు.. అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఒక్క విద్యారంగం మీదనే మూడున్నరేళ్లలో రూ.55వేల కోట్లు ఖర్చు చేశారు. వైద్య రంగంలో దాదాపు 50 వేల ఉద్యోగాలిచ్చారు. చంద్రబాబు విద్య, వైద్య రంగాల ఊపిరి తీయడానికి ప్రయత్నిస్తే.. సీఎం జగన్ మాత్రం విద్య, వైద్య రంగాలే తమ ప్రభుత్వానికి పీఠిక అన్నట్లు పాలన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్దిని కాపు సోదర, సోదరీమణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. పవన్ ఆరాటమంతా చంద్రబాబును సీఎం చేయడం కోసమేనని వీరంతా ఓ అంచనాకు వచ్చారు. పవన్ అరుపులు, ఆర్తనాదాలు ప్యాకేజీ నుంచి వచ్చినవేనని మెజార్టీ నమ్ముతున్నారు. ఒక్క సీటు లేని ఆయన, 68 నియోజకవర్గాల్లో ఇంచార్జిలే లేని బాబు ఇద్దరూ కలిసి జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోగలరా? అనే ప్రశ్న వేసుకుంటే.. వచ్చే సమాధానం అడ్డుకోలేరనే. ఈ విషయం.. చంద్రబాబు, పవన్‌లకు కూడా బాగా తెలుసు. - వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ, సామాజిక విశ్లేషకులు. -
పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్
-
కాపు రిజర్వేషన్లపై తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కీలక వ్యాఖ్యలు
-
రాజానగరం లో ఘనంగా కాపు కార్తీకమాస వన సమారాధన సభ