killer
-
ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి.. ‘పాపమంతా ఫేస్‌బుక్‌దే’
అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపింది. కానీ తాను కావాలని చంపలేదని, తనను ఫేస్బుక్ ప్రభావితం చేసిందని వింత కారణం చెబుతోంది. ‘న్యూస్‌వీక్’ కథనం ప్రకారం.. ఈ ఘోరం చేసిన మహిళను 32 ఏళ్ల టిఫానీ యాన్ కేథరీన్ లూకాస్గా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కొడుకులు ఆరేళ్ల మారిస్ బేకర్ జూనియర్, తొమ్మిదేళ్ల జేడెన్ హోవార్డ్లను నవంబరు 8న కెంటకీలోని తమ నివాసంలో తుపాకీతో కాల్చింది. రక్తపు మడుగులో పడివున్న పిల్లలను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఇంతటి ఘోరం చేసిన ఆమె ఇతరులకూ ప్రమాదకరమని పేర్కొన్న న్యాయమూర్తి.. విచారణ ముగిసే వరకూ 2 మిలియన్ డాలర్ల (రూ.16.6 కోట్లు) పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. నవంబర్ 14న కోర్టు విచారణ సందర్భంగా బుల్లిట్ కౌంటీ షెరీఫ్ అనే దర్యాప్తు సంస్థకు చెందిన డిటెక్టివ్ రిచర్డ్ బీల్.. తాను విచారించినప్పుడు నిందితురాలు లూకాస్ తనతో ఏం చెప్పిందో కోర్టుకు తెలియజేసింది. ‘న్యూస్‌వీక్’ కథనం ప్రకారం.. ఇద్దరు పిల్లలను తలపై దాదాపు 30 సెకన్లలో నాలుగు షాట్లు కాల్చారని బీల్ వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని, తనను ఎవరో ఫేస్బుక్ ద్వారా "మానిప్యులేట్" చేశారని లూకాస్ చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే లూకాస్ వాదనను మారిస్ బేకర్ జూనియర్ సవతి తల్లి మిచెల్ రైస్ ఖండించారు. ఆమె కావాలనే పిల్లలను చంపేసిందని, ఇంత క్రూరమైన పని చేసేలా ఎవరూ ప్రభావితం చేయరని రైస్ తెలిపినట్లు ఫాక్స్ అనుబంధ డబ్ల్యూడీఆర్బీ కథనం పేర్కొంది. -
కూతుర్ని చంపిన హంతకుల కోసం హీరోలా వేటాడాడు ఓ తండ్రి..ఏకంగా రూ. 16 కోట్లు..
ఓ తండ్రి అంతులేని ప్రేమకు నిదర్శనమే ఈ గాథ. కూతురు ఆకస్మిక మరణం ఆ తండ్రిని నిలువనీయలేదు. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందన్న ప్రశ్నలు అతడ్ని కుదురుగా ఉండనివ్వలేదు. తానే ఓ డిటెక్టివ్‌లా దర్యాప్తు చేసేలా పురిగొల్పాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 37 ఏళ్లు తన కూతురికి న్యాయం జరగాలని తపించి నిరీక్షించాడు. దేశం కానీ దేశంలో వందసార్లుకు పైగా పర్యటించాడు. డబ్బును కూడా లెక్కచేయకుండా నీళ్లలా ఖర్చుపెట్టాడు. కానీ ఇప్పటికి అతడి కూతురు హత్య చిక్కుముడి వీడని మిస్టరీలో ఉండిపోయింది. ఐతే ఆ తండ్రి తపన, ఆశ, అలుపెరగని ప్రయత్నం చివరికి ఫలించాయా అంటే... అసలేం జరిగిందంటే..తన కూతురుని చంపిన హంతకుల కోసం హీరోలా అన్వేషించిన వ్యక్తి ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ వార్డ్ మరణించిన అతడి కూతురు పేరు జూలీ వార్డ్. ఆమె వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. జూలీ మరణించేనాటికి ఆమె వయసు 28 ఏళ్లు. ఆమె బరీ సెయింట్ ఎడ్మండ్స్లోని పబ్లిషింగ్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే జూలీ మాసాయి మారా గేమ్ రిజర్వ్‌లో జంతువుల ఫోటోలు తీసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆరు నెలలు కెన్యా పర్యటనలోనే ఉండిపోయింది. అయితే ఆమె చిరిసారిగా సెప్టెంబర్ కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి కనిపించడంలేదని తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆమె మరణించిందనే వార్త వచ్చింది. దీంతో ఏం అర్థకాని జూలీ తండ్రి ఆఘమేఘాలపై కెన్యా వెళ్లిపోయాడు. నా కూతురు ఎందుకని చనిపోయిందని అని ఆ తండ్రి ఒకటే ఆత్రుతో వెళ్లగా..అక్కడ అధికారులు ఆమెపై క్రూరమృగాలు దాడి చేసి చంపేశాయని చెప్పారు. ఐతే జూలీ తండ్రికి అధికారులు చెబుతున్నవన్నీ కట్టుకథల్లా తోచాయి. కనీసం కూతురి చివరి చూపు దక్కలేదు, పైగా ఆమె మృతదేహం కూడా కనిపించకపోవడం ఇవన్నీ జాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అధికారుల మాటలను నమ్ముతూ కూర్చొంటే.. ఏం లాభం లేదని నిర్ణయించుకుని జాన్ వార్డ్ స్వయంగా డిటెక్టివ్‌లా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాడు. జూన్వార్డ్ దంపతులు, జూలీ(కుడివైపు), ఇన్సెట్లో ఇద్దరు సోదరులతో దిగిన చిన్ననాటి చిత్రం అందులో భాగంగా ఫోరెన్సిక్ గురించి తనకు తానుగా నేర్చుకుని మరీ కూతురి మృతదేహం కోసం అన్వేషించాడు. జూలీని చివరిగా కనిపించిన ప్రాంతంలో ఏకంగా ఐదు విమానాలతో జల్లెడ పట్టించాడు. చివరికి ఆమె మృతదేహం ఆ రిజర్వ్‌కి దాదాపు 10 మైళ్ల దూరంలో కనిపించింది. జాన్ తన కుమార్తె దవడ, ఎడమ కాలు తదితర భాగాలను గుర్తించాడు. అయితే అవి రెండు కాలిపోయి పోదల్లో ఉన్నాయి. ఎలా చనిపోయిందనే దాని గురించి అలుపెరగకుండా దర్యాప్తు చేస్తూనే ఉన్నాడు. జూలీ అవశేషాలను ఫ్రిజర్‌లో భద్రపరిచి ఎలాగైనా హంతకులను పట్టుకోవాలని తన కూతరుకి న్యాయం చేయాలని ఎంతగానో తపించాడు. జాన్ దర్యాప్తు ఓ కొలిక్కి రాడమే కాకుండా ఆమె ఎలా చనిపోయిందో కనుకున్నాడు. దర్యాప్తులో కెన్యా అప్పటి అధ్యక్షుడు కుమారుడు జోనాథన్ మోయి జూలీపై క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడని కనుగొన్నాడు. ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి జంతువుల దాడిలో చనిపోయిందని నమ్మించాడని తెలుసుకున్నాడు. అయితే దాన్ని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు జాన్ వద్ద లేవు. ఎంతాగనో అధికారులను ప్రాధేయపడి చర్యలు తీసుకోమని చెప్పినా..కానీ వారు అధ్యక్షుడి కొడుకు కావడం వల్ల ఈ ఘటనను మభ్యపెట్టి తారుమారు చేసే కుట్రకే తెరతీశారు. ఐతే జాన్ తగ్గేదేలా అంటూ.. చేసిన దర్యాప్తు కారణంగా అధికారులు సైతం జూలీది హత్యేనని ఒప్పుకోక తప్పుకోలేదు. దీని కోసం కెనడా కోర్టులో ఏకంగా 22 సార్లు క్రాస్ ఎగ్జామిన్ని జాన్ ఎదుర్కొన్నాడంటేనే వాస్తవం ఏంటో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇద్దరు సోదరులో జూలీ వార్డ్(ఫైల్‌ఫోటో) ప్రభుత్వమే తమే చేతిలో ఉన్నవాళ్లతో పోరాడటం ఎంత కష్టం అనేదానికి ఈ జూలీ కేసు ఓ ఉదాహరణ. ఆ తండ్రి కూతురు కేసు దర్యాప్తు కోసం ఏకంగా తన సొంత డబ్బు రూ. 16 కోట్ల దాక నీళ్లలా ఖర్చుపెట్టాడు. చివరి శ్వాస వరకు కూతురుకి న్యాయం జరగాలని పోరాడాడు. జూన్ వయసు ఇప్పుడూ 79 ఏళ్లు ఇటీవలే అతన మరణించాడు. అతడు మరణించడానికి రెండు వారాల ముందే అతడి భార్య జేన్ కూడా చనిపోయారు. తమ తండ్రి జాన్ ఆశ అడియాశగానే మిగిలిపోయిందని అతడి కొడుకులు బాబ్, టిమ్ చాలా ఆవేదనగా చెప్పుకొచ్చారు. తమ సోదరి కేసును తాము క్లోజ్ చేయనివ్వమని తమ తండ్రి ఎలా కెన్యా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడో అలానే తాము పోరాడతామని, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని చెబుతున్నారు జాన్ కొడుకులు. జాన్ వార్డ్ కొడుకు బాబ్ వార్డ్ న్యాయం కోసం తన తండ్రి చూపిన పట్టుదల, తెగువ నమ్మశక్యం కానివని అన్నారు. జాన్ మరణించడానికి ఆరునెలల ముందు వరకు కెన్యా వెళ్లోచ్చారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన తండ్రి ఈ కేసుపై ఓ పుస్తకం కూడా రాశారని, అందుకు తాను సహకరించినట్లు బాబ్ చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు టిమ్ దీనిపై డాక్యుమెంటరీ కూడా తీస్తామన్నారు. ఇక ఈ జూలీ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 1992లో ఆమె హత్య కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న ఇద్దరు గేమ్ రేంజర్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. కెన్యా పోలీసు అధికారుల్లో కొత్త బృందం 1997లో ఈ కేసును మళ్లీ పరిశీలించింది. 1999లో ఒక గేమ్కీపర్ని ఈ కేసులో విచారించారు. కానీ, ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. 2004లో ఈ హత్యకు సంబంధించిన తీర్పును రికార్డ్ చేశారు. మళ్లీ 2010లో లండన్ డిటెక్టివ్‌ల సాయంతో కెన్యా స్థానికుల పోలీసుల ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. జూలీ అవశేషాలు కనిపించిన ప్రదేశంలో జరిగిన క్రైమ్ గురించి ఓ అవగాహనకు వచ్చారు. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా కొంత వరకు పురోగతి సాధించనట్లు తెలిపారు బాబ్. అలసు నిందితులను కనిపెట్టి ఈ కేసును చేధిస్తామని జాను కుమారుడు బాబ్ నమ్మకంగా చెబుతున్నారు. కాగా, పాపం ఆ తండ్రి కూతురుకి న్యాయం జరగాలని తపించి, తపించి అలిసిపోయి మత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఇప్పటికైన జూలీ కేసులో నిందులెవరనేది తెలుస్తుందా? అంతుపట్టిని మిస్టరీలా మిగిలి.., ఆ తండ్రి ప్రయత్నం వృధాగాపోతుందా? అనేది వేచి చూడాల్సిందే...! --ఆర్ లక్ష్మీ లావణ్య (చదవండి: ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతాం! సైన్సుకే అంతుచిక్కని మిస్టరీ ప్రదేశం..) -
మిస్టరీ: అందమైన ఇంటిని శ్మశానంగా మార్చాడు, 34 ఏళ్ల తర్వాత..
నిస్సహాయతను, నిర్వేదాన్ని నింపుకున్న గుండెలో.. ఓ వెర్రి నవ్వు నిస్తేజంగా తొణికిసలాడుతుంది. ఆ నవ్వులో.. సమాజాన్ని నిలువునా కాల్చి బూడిద చేయగలిగేంత ఆవేశం ఉంటుంది. 43 ఏళ్ల వెనెస్సా బెన్నెట్‌ని కదిలిస్తే అచ్చం అలాంటి నవ్వే నవ్వుతుంది. ఎందుకంటే.. తనకు ఊహ తెలియక మునుపే.. క్రూరమైన చావు పరిచయం అయ్యింది. ఊహ తెలిసేసరికి.. ఆ చావే శరణమనిపించింది. చెల్లాచెదురైన తన బతుకుని చక్కదిద్దుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. బతుకుపోరాటంలో ఇప్పటికీ తన మనసుతో తాను యుద్ధం చేస్తూనే ఉంది. ఇంతకీ ఎవరీ వెనెస్సా? అసలు తన జీవితంలో ఏం జరిగింది? వెనెస్సా గురించి ఒక మాటలో చెప్పాలంటే.. దురదృష్టానికి, అదృష్టానికి మధ్య నలిగిన ఒక జీవితం. తనకు అసలేం జరిగిందో తెలియని వయసులోనే.. తోటివాళ్ల రూపంలో.. వెకిలినవ్వులు, ఎగతాళి చూపులు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. ఆ పరిస్థితికి కారణం ఎవరో తెలియక, తను ఎందుకలా ఉందో తెలియక తల్లడిల్లింది. ఊహ తెలిశాక తన కథ తనకే కన్నీళ్లు తెప్పించింది.1984 జనవరి 16 అర్ధరాత్రి ఓ రాక్షసుడు సుత్తి చేత పట్టుకుని.. అమెరికా, కొలరాడోలోని అరోరాలో.. వెనెస్సా ఇంట్లో అడుగుపెట్టాడు. ఆమెకప్పుడు మూడేళ్ల వయసు. వాడు లోపలికి అడుగుపెట్టగానే.. వెనెస్సా తండ్రి బ్రూస్ బెన్నెట్(27)ని అత్యంత క్రూరంగా సుత్తితో కొట్టి చంపేశాడు. మూడేళ్ల చిన్నారిపై లైంగికంగా.. తర్వాత తల్లి డెబ్రా(26), అక్క మెలిస్సా(7)లపై లైంగికంగా దాడి చేసి.. అదే సుత్తితో వాళ్లనూ హత్య చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఇంటిని శ్మశానంగా మార్చాడు. అసలేం జరుగుతోందో తెలియని స్థితిలో వెనెస్సా ఒంటరిగా ఆ కిల్లర్ చేతికి చిక్కింది. కనికరంలేని ఆ క్రూరుడు మూడేళ్ల వెనెస్సాపై కూడా లైంగికదాడి చేసి.. సుత్తితో తీవ్రంగా కొట్టాడు. అందరిలానే ఆ పాపా చనిపోయిందనుకుని తెల్లారేసరికి పారిపోయాడు. ఉదయం పది దాటేసరికి వెనెస్సా నాన్నమ్మ కొన్నే బెన్నెట్.. ఆ ఘోరాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. కాసేపటికే పోలీసులు, వైద్యులు అంతా అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న వెనెస్సా కొన ఊపిరితో ఉందని గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 16ఏళ్లకే డ్రగ్స్‌కు అలవాడుపడి.. కిల్లర్ దాడికి.. వెనెస్సా దవడ, పుర్రె పగిలిపోయాయి. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. శరీరం మొత్తం ఛిద్రమై.. ప్రాణం మాత్రమే మిగిలింది. రెండేళ్లకు కోలుకున్న వెనెస్సా.. తీవ్రమైన ఒత్తిడి, కోపం, అసహనం లాంటి ఎన్నో మానసిక రుగ్మతలతో బాధపడుతూ నాన్నమ్మ దగ్గరే పెరిగింది. అయితే ఇంతటి ఘోరం చేసిన కిల్లర్ ఎవరో.. ఎవరికీ తెలియలేదు. దర్యాప్తు జరుగుతున్నా.. సరైన సాక్ష్యాధారాల్లేక.. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. కాలక్రమేణా తన కథను తెలుసుకున్న వెనెస్సా.. సమాజంపై ద్వేషాన్ని పెంచుకుంది. చెడుదారుల్లో నడిచింది. 16 ఏళ్లకే డ్రగ్స్‌కు అలవాటుపడింది. 17 ఏళ్ల వయసులో.. జీవితం మీద విరక్తి పుట్టి.. చనిపోవాలని మణికట్టుని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. జీవితం విలువ తెలిసొచ్చింది ఏళ్లుగా కిల్లర్ కోసం.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగినా.. ఆ అగంతుకుడు ఎవరో తేలలేదు.18 ఏళ్ల వయసులో తన ఇష్టపూర్వకంగానే గర్భవతి అయిన వెనెస్సా.. కొడుకు పుట్టిన 3 నెలలకు ‘తల్లిగా ఎలా ఉండాలో తెలియట్లేదు’ అంటూ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అధికారులకు బాబుని అప్పగించేసింది. రోజురోజుకీ మానసిక ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. తను, తన బాయ్‌ఫ్రెండ్ కలసి వంతెన కింద జీవించడం మొదలుపెట్టారు. తలస్నానం చెయ్యాలన్నా.. దగ్గరల్లోని ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంది. దొంగతనాలు, మాదకద్రవ్యాల కేసుల్లో జైలుకి కూడా వెళ్లింది. 30 ఏళ్లు వచ్చేసరికి.. ఆమెలో మార్పు మొదలైంది. జీవితం అంటే ఇది కాదు అనే ఆలోచన వచ్చింది. మనిషిగా బతకడానికి.. గతంతో సంబంధం లేదనిపించింది. దాంతో మాట, తీరు అన్నీ మార్చింది. ఫ్రాంకీ విల్లార్డ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాటి మనిషికి సాయం చెయ్యాలనే ఆలోచనతో తన కథను ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టింది. డ్రగ్ కౌన్సెలర్ అయేందుకు డిగ్రీ కళాశాలలో చేరింది. 2018లో సుమారు 20 ఏళ్ల వయసున్న తన కొడుకుని కూడా కలుసుకుంది. ఆ రోజు వెనెస్సా మనస్పూర్తిగా నవ్వింది. ‘నేను ఒకరికి ప్రాణం పోశాననే ఆనందం.. నేనో తల్లిననే అనుభూతి చాలా గొప్పగా ఉంది’ అంటూ పొంగిపోయింది. 2018 వరకూ ఈ కేసు మిస్టరీగానే ఉంది. సరిగ్గా 34 ఏళ్ల తర్వాత.. డీఎన్ఏ ఆధారంగా కిల్లర్ ఎవరనేదానిపై ఓ స్పష్టత వచ్చింది. డీఎన్ఏతో హంతకుడు ఎవరో తేలింది షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ కిల్లర్.. పరారీలో ఉన్న నిందితుడు కాదని.. 1984 ఆగస్ట్ 9 నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న నేరగాడని తేలింది. అతడు సీరియల్ కిల్లర్ అలెక్స్ క్రిస్టోఫర్ ఎవింగ్ అని అందరితో పాటు వెనెస్సా అప్పుడే తెలుసుకుంది. 1984లో అతడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో బెన్నెట్ ఫ్యామిలీ విషాదగాథ కూడా ఒకటని.. ముందు నుంచి అనుమానాలున్నా.. డీఎన్ఏతో 2018లో క్లారిటీ వచ్చింది. 1984 జనవరి 10న లేక్‌వుడ్‌లో ప్యాట్రీషియా స్మిత్ అనే మహిళపై హింసాత్మకంగా లైంగిక దాడి చేసి, హత్య చేశాడు. అదే ఏడాది ఆగస్టు 9న నెవాడా, హేండర్సన్లో గొడ్డలితో నాన్సీ, క్రిస్ బ్యారీలపై దాడిచేసి పారిపోయాడు. ఆ కేసులోనే అతడు అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నాడు. అతడికి హ్యామర్ కిల్లర్ అనే పేరు కూడా పెట్టాయి అప్పటి వార్తా పత్రికలు. మూడు వేర్వేరు రాష్ట్రాల్లో ప్రజలపై దాడి చేసినట్లు ఆధారాలు ఉండటంతో అతడికి పెరోల్ కూడా లభించలేదు. 2021 నాటికి అతడు బెన్నెట్ కేసులో దోషిగా రుజువు కావడంతో కోర్టు.. మూడు జీవితకాలాల కారాగార శిక్షను విధించింది. దాంతో అతడు జీవితంలో బయటికి వచ్చే అవకాశాన్నే కోల్పోయాడు. ఈ కథ తెలిసిన వాళ్లంతా న్యాయం జరిగింది అన్నారు. కానీ వెనెస్సా మాత్రం.. తనకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని, అతడిలో నేను పశ్చాత్తాపం చూడలేదని చెప్పింది. సమాజంపై గౌరవం కోల్పోయింది ‘అతడి కారణంగా నేను నా వాళ్లని మాత్రమే కాదు.. సమాజంపై నమ్మకాన్నీ, గౌరవాన్నీ కోల్పోయాను. నా వ్యక్తిత్వాన్నీ కోల్పోయాను. ఇప్పటికీ నేను ప్రతిరోజూ అద్దంలో చూసుకుని.. తట్టుకోలేని వేదనను అనుభవిస్తున్నాను. తెలియని కోపం, ద్వేషం, మానసిక వేదన ఇలా అన్నీ నన్ను కుంగదీస్తూనే ఉన్నాయి. నా జీవితం నాశనమైపోయింది. దానికి ఏ పరిష్కారం లేదు’ అంటూ ఎందరో మనసుల్ని మెలిపెట్టింది. సరైన సాక్షులు లేని ఈ కథలో కిల్లర్ కేవలం డీఎన్ఏ ఆధారంగానే దొరికాడు. లేదంటే ఇప్పటికీ ఈ కథ మిస్టరీగానే ఉండిపోయేది. ∙సంహిత నిమ్మన -
ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్‌పై అమ్మాయిల మోజు.. జైలులో ఉన్నా..
రిచర్డ్ రెమిరెజ్ 1960 ఫిబ్రవరి 29న అమెరికాలోని టెక్సాస్ పరిధిలోగల ఎల్ పాసోలో జన్మించాడు. అతని బాల్యం సవ్యంగా సాగలేదు. అతని తల్లిదండ్రులు నిరంతరం గొడవపడుతూ అతనిని పట్టించుకునేవారు కాదు. 12 ఏళ్ల వయసులో రిచర్డ్ తన కజిన్ మైక్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏదో విషయమై భార్యతో గొడవ పడిన మైక్.. రిచర్డ్ ఎదుటనే ఆమెను హత్య చేశాడు. ఈ ఉదంతం రిచర్డ్ మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే తాను కూడా ఎవరినైనా హత్యచేయాలని అనుకున్నాడు. తన బంధువు మైక్ తీరుతెన్నులకు ప్రభావితుడైన రిచర్డ్ పెరిగి పెద్దయ్యాక నేరమార్గాన్ని ఎంచుకున్నాడు. 1984 జూన్‌లో 79 ఏళ్ల వితంతువుపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు రిచర్డ్‌ను పట్టుకోవడంలో విఫలమయ్యారు. అది మెదలు రిచర్డ్ తన వినోదం కోసం హత్యలు చేయడం మొదలుపెట్టాడు. ఆధారాలు మాయం చేయకుండానే రిచర్డ్ హత్యలు చేస్తూ వచ్చినా.. పోలీసులు అతనిని పట్టుకోలేకపోయారు. దీంతో రిచర్డ్ నేరాల మీద నేరాలు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతను సైతానిక్ సొసైటీలో చేరాడు. ఈ సొసైటీ సైతానుకు పూజలు చేసేది. ఈ సొసైటీలో చేరిన దగ్గరి నుంచి ప్రతీరోజూ మత్తుమందులు తీసుకునేవాడు. ఫలితంగా నిస్సత్తువుగా మారి ఏ పనీ చేయలేకపోయేవాడు. మద్యం మత్తులో తేలేందుకే రిచర్డ్ ఈ సొసైటీలో చేరాడు. అయితే అంతకు మందు రిచర్డ్ 13 హత్యలు, 11 అత్యాచారాలు, 14 దోపిడీలు చేశాడు. అక్కడి జనం అతనిని ‘నైట్ స్టాకర్’ అని పిలిచేవారు. పోలీసులు.. కొందరు బాధితులు అందించిన ఆధారాల మేరకు అతని స్కెచ్ రూపొందించారు. అతను మార్కెట్లో తిరుగుతుండగా వలపన్ని పోలీసులు అతనిని పట్టుకున్నారు. కోర్టు రిచర్డ్ రెమిరిజ్ను దోషిగా తీర్మానిస్తూ, 1989 నవంబరు 20న అతనికి ఉరిశిక్ష విధించింది. అతను చేసిన దారుణాలకు ప్రతిగా అతనిని 19 సార్లు ఉరితీయాలని ఆదేశించింది. రిచర్డ్ జైలులో మగ్గుతున్నప్పడు అతనికి అమ్మాయిల నుంచి లవ్ లెటర్లు వచ్చేవి. ఇదేకోవలో డోరిన్ లివోఎ అనే మ్యాగజైన్ ఎడిటర్ నుంచి కూడా అతనికి ఉత్తరాలు వచ్చేవి. ఆమె 11 ఏళ్లలో ఏకంగా 75కు మించిన ఉత్తరాలను రిచర్డ్‌కు రాసింది. ప్రతీవారం అతనిని కలుసుకునేందుకు జైలుకు వచ్చేది. 1996లో రిచర్డ్ జైలులోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వారి అనుబంధం ఎంతో కాలం నిలవలేదు. డెరిన్ అతనికి విడాకులు ఇచ్చింది. 2013 జూన్ 7న జైలులోనే రిచర్డ్ కన్నుమూశాడు. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు -
అతీఖ్ హంతకుల జైలు మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్-పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌లను కాల్చి చంపిన నిందితులను అధికారులు జైలు మార్చారు. సన్నీ సింగ్, అరుణ్ మౌర్యా, లవ్లేష్ తొవారిలను ప్రయాగ్‌రాజ్ నైనీ జైలు నుంచి ప్రతాప్‌ఘడ్ జైలుకు మార్చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. నైనీ జైలులో వాళ్లపై దాడి జరగవచ్చేనే నిఘా వర్గాల సమాచారం మేరకు ముగ్గురు హంతకులను జైలు మార్చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫేమస్ కావాలనే తాము అహ్మద్ గ్యాంగ్‌ను ఏరివేసే పనిలో దిగామని, ఈ క్రమంలోనే అతీఖ్, అతని సోదరుడిని కాల్చిచంపామని ఈ ముగ్గురు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు. మరోవైపు కోర్టు వీళ్లకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఇక అతీఖ్,అష్రాఫ్‌ల హత్య ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూడీషియల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. మరోవైపు యూపీ పోలీస్ శాఖ కూడా రెండు సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. యూపీ పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి అతీఖ్, అష్రాఫ్‌లను వైద్యపరీక్షల కోసం తరలిస్తుండగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ఆ ముగ్గురు.. తుపాకులతో కాల్చి చంపిన తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ పోలీసులకు లొంగిపోయారు. వాళ్ల నుంచి ఫేక్ ఐడీకార్డులు , కెమెరా, మైక్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిలో లవ్లేష్కు తూటా కాలి నుంచి దూసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అంతకు ముందు.. బుధవారం ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో ఉమేష్‌పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీఖ్ తనయుడు అసద్ అహ్మద్‌ను, అతన్ని అనుచరుడ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. -
కిస్కా కథ అలా ముగిసింది..!
ఒంటారియో: కిస్కా. ఓర్కా రకం కిల్లర్ వేల్. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం. దాదాపు 40 ఏళ్లపాటు నీళ్ల ట్యాంకులో ఒంటరిగా బతుకీడ్చింది. చోటు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. ఐస్‌ల్యాండ్ సమీపంలోని సముద్ర జలాల్లో ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఈ కిల్లర్ వేల్ పట్టుబడింది. దీనిని ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద ఉన్న మెరైన్‌ల్యాండ్ జూ పార్క్‌కు అమ్మేశారు. 40 ఏళ్ల పాటు కిస్కా ఓ నీళ్ల ట్యాంకుకే పరిమితమైపోయింది.ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా ముద్రపడింది. ఇటీవలే సుమారు 47 ఏళ్ల వయస్సులో కిస్కా చనిపోయింది. ‘కిస్కా మృతి పట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్ శాంక్చువరీ ప్రాజెక్టు ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’అని ఏనిమల్ జస్టిస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెమిల్లె లబ్చుక్ అన్నారు. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కాల ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు. -
రాజీవ్ గాంధీ హంతకులకు సుప్రీంకోర్టు లో ఊరట
-
బిగ్‌బాస్ : నిజం తెలిసి షాక్ అయిన హౌస్మేట్స్.. ప్రోమో రిలీజ్
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన కిల్లర్ టాస్క్‌లో నటరాజ్ మాస్టర్ మ్యాన్ ఆఫ్ ది షోగా నిలిచాడు. ఒక్క టాస్క్‌తో నటరాజ్ మాస్టర్ రేంజ్ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హౌస్‌లో ఉన్న వాళ్లందర్నీ ముప్పుతిప్పులు పెట్టి అయిదుగిరిని మర్డర్ చేసినా మాస్టరే కిల్లర్ అని ఒక్కరు కూడా కనిపెట్టలేకపోయారు. బిగ్‌బాస్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ కిరాక్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో నటరాజ్ మాస్టరే కిల్లర్ అని చెప్పడంతో షాక్ అవడం హౌస్మేట్స్ వంతవుతుంది. అఖిల్, అషూలు కిల్లర్ అయి ఉండొచ్చని హౌస్మేట్స్ భావించినా చివరకు కిల్ కిల్ కిలాడీ అంటూ నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇవ్వడంతో హౌస్మేట్స్ అంతా నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది. "WHAT IS HAPPENING IN THIS HOUSE?!" 🤯 What a win! Never before Never after have we seen such a killer! Watch the 'KILLER' Bigg Boss Non-Stop episode at 9PM exclusively on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/4giCtrZ710 — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 27, 2022 -
కోల్డ్ బ్లడెడ్ కిల్లర్: అతని టార్గెట్ ఒంటరి పురుషులే
Targeting sleeping homeless men: యూఎస్‌లో తుపాకీలతో దాడుల జరిపే కొంతమంది నేరస్తుల గురించి విన్నాం. జాతి వివక్షతతో దాడులు చేసేవాళ్లు కొందరైతే. మరికొందరూ మా దేశంలోకి ఎందుకు వచ్చారంటూ స్థానిక రౌడిలు కాల్పులు జరపడం చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒంటరిగా ఉన్న పురుషుల పైనే దాడి చేస్తాడంటా. పైగా వారిని హతమార్చేంత వరకు వదలడట. వివరాల్లోకెళ్తే...న్యూయార్క్ వాషింగ్టన్ డీసీలలో వరుస హత్యలు జరిగాయి. ఈ జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉన్న పురుషుల పైనే నిందితుడు దాడి చేశాడు. అతను ఇప్పటి వరకు ఐదుగురుని మట్టుబెట్టడు. పైగా గత రెండు రోజుల్లో చేసిన దాడిలో ఇద్దరూ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతను ఒంటరిగా ఉన్న పురుషులనే టార్గెట్ చేస్తున్నాడని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డీసీ వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్లు అనుమానం వ్యక్తం చేశారు. వారు ఆ నేరస్తుడిని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్‌గా వ్యవహరించారు. అలాగే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మేయర్లు జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉండే పురుషుల కోసం ఒక హెచ్చరిక జారీ చేశారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును విచారిస్తుంది. అంతేకాదు దర్యాప్తులో.. అతను నిరాశ్రయుల పైన దాడులు జరుపుతున్నాడని, తాజాగా మాన్‌హట్టన్‌లోని ట్రిబెకా ప్రాంతంలో 43 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చడాని వెల్లడించారు. పోలీసుల నిందుతుడి ఫోటోను కూడా విడుదల చేశారు. పైగా నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 19 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. Tonight, Washington, DC Mayor Muriel Bowser and @NYCMayor spoke about ongoing investigations by the @DCPoliceDept and the @NYPDnews. Following their conversation, Mayor Bowser and Mayor Adams released the following joint statement: https://t.co/MpcefoOowL pic.twitter.com/dbWmLxg1Tb — Mayor Muriel Bowser (@MayorBowser) March 14, 2022 (చదవండి: ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్స్!) -
Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..
Warning! Terminator like robots could wipe out humanity from Earth వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను తయారు చేసేందుకు అగ్రరాజ్యాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ కిల్లర్ రోబో టార్గెట్ విక్టిమ్ బతికున్నాడా లేదా అనే విషయాన్ని స్వయంగా తెలుసుకోగలవు కూడా. అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను రూపొందించే రేసులో దేశాలు నేనంటే నేనని పరుగులు తీస్తున్నాయి. ఐతే ఈ రోబోల వంటి టెర్మినేటర్లు భూమిపై మానవాళిని తుడిచిపెట్టగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇలాంటి డ్రోన్లను అభివృద్ధి చేయడానికి చైనా, రష్యా, అమెరికా పూర్తి మద్ధతును తెలిపాయి. సాంకేతికతతో ఊచకోత కోసేందుకు యత్నం కిల్లర్ రోబోల ముప్పుపెరుగుతున్న దృష్ట్యా ఈ నెలలో జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాణాంతక స్వయం ప్రతిపత్తి గల ఆయుధాల సాంకేతికతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ రోబోలు పూర్తిగా మెషిన్ కంట్రోల్‌తో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను తీయగలవు. వీటిలో కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతికత పొందుపరచి ఉంటాయి. ఇప్పటికే మొదటి కిల్లర్ రోబో తయారీ పూర్తిచేసిన లిబియా కిల్లర్ రోబోల్లో ఉన్న సాంకేతికత సహాయంతో ఎరను వేటాడి చంపగలవు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేసేలా ఈ రోబోలను రూపొందించబడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఒక వ్యక్తిని చంపాలా వద్దా అనే విషయాన్ని కూడా స్వయంగా నిర్ణయించుకోగలవు. సాంకేతికత సహాయంతో మనుషులు పెద్ద సంఖ్యలో ఊచకోత కోసే అవకాశం ఉందని మకాలెస్టర్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ డావ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మొత్తం మావనవాళి అంతం చేస్తాయి. లిబియాలో మొదటి స్వీయ నిర్ణయాత్మక దాడి చేయగల డ్రోన్‌ను విజయవంతంగా తయారు చేసిందని మార్చిలో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అణ్వాయుధ పోటీలో తప్పిదాలకు చోటివ్వకూడదని, ఇటువంటి డ్రోన్లను వెంటనే నియంత్రించాలని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తోంది. చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
అమ్మో అందాల రాక్షసి : 650 మందిని చంపి వాళ్ల రక్తంతో
ప్రతి ఒక్కరు స్లిమ్ గా, చక్కటి గ్లోతో మెరిసి పోవాలని అనుకుంటారు. అందుకే తాము అభిమానించే హీరోలు, హీరోయిన్లు అందం కోసం వాడే బ్రాండెడ్ క్రీమ్స్ ను అప్లయ్ చేసి ఎదుటి వారికి తమని తాము అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది యూట్యూబ్ వీడియోలు చూసి రకరకాల రెసిపీలను ట్రై చేస్తుంటారు. అది కూడా సాధ్యపడకపోతే చివరికి అరే వాళ్లకంటే మనం బాగున్నాం అంటూ వారికి వారు సర్ధి చెప్పుకుంటుంటారు. ఇప్పుడంటే ఇలా ఉంటే పూర్వం అందం కోసం మనిషి రక్తంలో స్నానం చేసేవారు. ముఖ్యంగా 16వ శతాబ్ధానికి చెందిన రాణులు వారి ఆస్థానంలో పెద్దలు చెప్పినట్లు అందం కోసం చిత్ర విచిత్రమైన పనులు చేసేవారు. అందులో కొన్ని పనులు అత్యంత దారుణంగా ఉండేవి. ఎలిజిబెత్ బాతోరి ప్రపంచంలో అంత్యత ప్రమాదకరమైన రాణి. ప్రస్తుతం యూరప్ దేశాల్లో ఓ భాగమైన హంగేరి దేశంలో హంగేరియన్ రాజకుటుంబానికి చెందిన రాణి ఈ ఎలిజిబెత్ బాతోరి. హంగేరిలో ఓ రాజ్యాన్ని పరిపాలించేది. ఆమెకు అందంగా ఉండడం అంటే మహా పిచ్చి. ఆ అందం కోసం 1585 నుండి 1610 సంవత్సరం మధ్య కాలంలో పెళ్లికాని 650 మంది యువతుల్ని చంపేసింది. రాణి కావడంతో తన రాజభవనంలో పనిచేసేందుకు పెళ్లికాని యువతుల్ని ఆహ్వానించేది. పనిపేరుతో వారిని చంపేసి వారి రక్తంతో స్నానం చేసేది. ఎలిజిబెత్ బాతోరికి తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరో చెప్పారట. పెళ్లికాని యువతుల రక్తంతో స్నానం చేస్తే అందంగా కనిపిస్తారని. అదిగో అప్పటి నుండి పెళ్లికాని యువతుల్ని పనికి పిలిపించి హత్యలు చేసింది. ఆమెకు మరో ఆరుగురు సహకరించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అంతమందిని హత్య చేస్తుంటే ఎవరు పట్టించుకోలేదా అంటే ఆమె అసలే రాణి. ఎవరు ప్రశ్నిస్తారు. అయితే చివరికి పాపం పండింది. ఎలిజిబెత్ దగ్గర పనిచేసే సుసన్నా అనే సేవకురాలు బయటపెట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 1610లో ఆమెకు కోర్ట్ జీవిత ఖైదు విధించింది. రాణి తన పలుకుబడితో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ బాతోరి పై హంగేరియన్ కు చెందిన డైరక్టర్ జురాజ్ జకుబిస్కో హాలీవుడ్ లో బాతోరి (కౌంట్ నెస్ ఆఫ్ బ్లడ్ ) పేరుతో సినిమా తెరకెక్కించారు. 10మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 2008 జులై 10న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. -
ప్రతీరోజూ లైంగికదాడి,చిత్రహింసలు.. ఆపై
జోసెఫినా రివెరా పడుపు వృత్తితో పొట్టపోసుకునేది. జాక్వెలిన్ ఆస్కిన్స్ కూడా అంతే. రివెరాలాగే తనొక వేశ్య. వృత్తి ఒక్కటే కాదు.. వీరిద్దరిలో ఉన్న మరో సారూప్యత ఏమిటంటే.. ఇద్దరూ ‘హైడ్నిక్’ బాధితులే. అతడి చేతిలో చిత్రహింసలు అనుభవించినప్పటికీ బతికి బయటపడగలిగారు. అతడి అకృత్యాలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేశారు. అవును... గ్యారీ హైడ్నిక్ నరరూప రాక్షసుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు యువతులను అపహరించి, వారికి నరకం చూపించాడు. ప్రతిరోజూ అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడటమే గాక, వారిని హింసిస్తూ ఆనందం పొందేవాడు. అనంతరం ఒక్కొక్కరిని చంపేసి, శరీరాన్ని ముక్కలు చేసి కుక్కలు తినే ఆహారంలో కలిపి మిగతా వాళ్లకు పెట్టేవాడు. నవంబరు 1986 నుంచి 1987 మార్చి వరకు అతడి రాక్షసకాండ కొనసాగింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా అతడికి దగ్గరైనట్లు, అతడిలాగే ఆలోచిస్తున్నట్లు నటించి, నమ్మించి రివెరా చేసిన సాహసంతో ఆమెతో పాటు ఆస్కిన్స్ కూడా నరకకూపం నుంచి తప్పించుకుంది. పోలీసులకు సమాచారం అందించి హైడ్నిక్ను అరెస్టు చేయించింది. ఈ క్రమంలో అతడిపై హత్య, లైంగికదాడి, కిడ్నాప్ తదితర నేరాల కింద కేసు నమోదైంది. దోషిగా తేలడంతో లీథల్ ఇంజక్షన్ ఇచ్చి హైడ్నిక్కు మరణశిక్ష అమలు చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన గురించి రివెరా, ఆస్కిన్స్ తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అతడి దురాగతాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గ్యారీ హైడ్నిక్ తనను తాను మత గురువుగా చెప్పుకొనేవాడు. అలా స్థానికుల్లో ఆధ్మాత్యిక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. నిజానికి అతడిని చూస్తే ఇన్ని నేరాలు చేశాడంటే నమ్మబుద్ధి కాదు. 1986, నవంబరు 25న అతడు రివెరాను కిడ్నాప్ చేశాడు. గొంతునులిమి పట్టి, చేతులకు బేడీలు వేసి బలవంతంగా ఆమెను లాక్కెళ్లాడు. తన ఇంట్లో బంధించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అలా రివెరా అతడి కామానికి బలై పోయిన తొలి బాధితురాలిగా మారింది. రివెరా తర్వాత సాండ్రా లిండ్సే(24), లీసా థామస్(19), డెబోరా డూడ్లీ(23), జాక్వెలిన్ ఆస్కిన్స్(18), ఆగ్నస్ ఆడమ్స్(24)ను హైడ్నిక్ కిడ్నాప్ చేశాడు. వాళ్లందరినీ తన ఇంటి బేస్మెంట్ ఏరియాలో బంధీలుగా చేసి హింసించేవాడు. హైడ్నిక్ నేర చరిత్ర ఆధారంగా ‘ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ అనే సినిమాలో సీరియల్ కిల్లర్ బఫెలో బిల్ క్యారెక్టర్‌ను సృష్టించారు కూడా. లిండ్సేను మా కళ్లముందే.. ఆర్నెళ్ల కాలంలో తమను హైడ్నిక్ ఏవిధంగా చిత్రహింసలు పెట్టాడో చెబుతూ రివెరా, ఆస్కిన్స్ ఒళ్లు గగుర్పొడిచే విషయాలు పంచుకున్నారు. లిండ్సే మణికట్టును గొలుసు వేసి, సీలింగ్‌కు ఆమెను వేలాడదీసి కొన్ని రోజులపాటు అలాగే ఉంచేశాడు హైడ్నిక్. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఉండేవాడు. దీంతో ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చింది. దానికి తోడు పస్తులుంచడంతో ఆకలికి తట్టుకోలేక ఆమె మరణించింది. అయినప్పటికీ హైడ్నిక్ క్రూర మనసు శాంతించలేదు. లిండ్సే శరీరాన్ని ముక్కలుగా కోసి మాంసం వండాడు. కుక్కలు తినే ఆహారంతో దానిని కలిపి మిగతా బాధితురాళ్లకు వడ్డించాడు. అంతేగాక తన రాకపోకలకు సంబంధించిన కారు శబ్దాలు వినపడకుండా స్క్రూ డ్రైవర్‌తో వారి చెవుల్లో పొడిచి చెవిటి వాళ్లను చేసేశాడు. ఇక డుడ్లీ విషయానికొస్తే.. ఆమెను నీటి గుంటలో నిలబెట్టి ఎలక్ట్రిక్ షాకిచ్చి చంపేశాడు. మిగతావారిని సైతం ఇలాగే చిత్ర విచిత్ర పద్ధతుల్లో హతమార్చాడు. ఇవన్నీ చూస్తూ భయపడిపోయిన రివెరా, హైడ్నిక్ను మచ్చిక చేసుకుని బయటపడాలని భావించింది. అందుకు తగ్గట్టుగా అతడికి మద్దతుగా ఉన్నట్లు మాట్లాడుతూ.. సంకెళ్లు విడిపించుకుంది. రివెరాను పూర్తిగా నమ్మిన హైడ్నిక్ ఆమె తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చాడు. అక్కడి నుంచి బయటపడ్డ రివెరా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైడ్నిక్ రాక్షసక్రీడ ముగిసిపోయింది. (చదవండి: 93 మందిని చంపేశాడు; ‘అందులోనే అసలైన మజా’!) తొలుత డిన్నర్‌కు తీసుకువెళ్లాడు.. ప్రాస్టిట్యూట్‌గా ఉన్న ఆస్కిన్స్ దగ్గరకు వచ్చిన హైడ్నిక్ తొలుత ఆమెను డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లి సరదాగా గడిపాడు. ఆమెతో స్నేహంగా నటిస్తూనే, వీడియో గేమ్ ఆడుకుంటున్న సమయంలో ఆస్కిన్స్ వెనుకగా వెళ్లి గొంతు నులిమి, చేతులు కట్టేసి ఈడ్చుకెళ్లి బేస్మెంట్లో పడేశాడు. దీంతో ఆస్కిన్స్ ఏడుపులతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లింది. అక్కడ అప్పటికే బంధీగా ఉన్న రివెరా ఆస్కిన్స్కు ధైర్యం చెప్పింది. ఎలాగైనా తనను విడిపిస్తానని మాట ఇచ్చింది. అన్నట్లుగానే ఆమెను బయటకు తీసుకువచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ మిగతా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్నట్టు... వీరంతా నల్లజాతి మహిళలే కావడం గమనార్హం. -
‘కరోనా’ ఒత్తిడిలో భార్యను చంపాడట!
సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లోని ఇప్స్విచ్ నగరానికి సమీపంలోని బర్హామ్‌కు చెందిన షాట్ గన్ లీడర్ పీటర్ హాట్‌షోర్న్ జోన్స్ (51) గత మే నెలలో ఘోరానికి పాల్పడ్డారు. 17వ శతాబ్దానికి చెందిన తన ఫామ్ హౌజ్‌లో ఇద్దరు చిన్న పిల్లలు కలిగిన తన భార్య సిల్కీ జోన్స్ (41)ను లైసెన్స్ కలిగిన 12 బోర్ షాట్ గన్‌తో రెండు సార్లు ఛాతిపై కాల్చి హత్య చేశారు. ఈ నేరానికి ఆయనకు కఠిన శిక్ష పడుతుందని స్థానిక ప్రజలు భావించారు. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల మానసిక ఒత్తిడి పెరిగి ఏం చేస్తున్నానో తెలియని అయోమయ పరిస్థితుల్లో తన భార్యను చంపుకున్నానని నిందితుడు పీటర్ మొరపెట్టు కోవడంతో కేసును విచారించిన ఇప్స్విచ్ క్రౌన్ కోర్టు కనికరించింది. ముక్కు పచ్చలారని ఇద్దరి పిల్లల ముందే భార్యను చంపావా? అని ప్రాన్స్‌క్యూటర్ అడిగిన ప్రశ్నకు లేదని పీటర్ సమాధానం ఇచ్చారు. చనిపోయిన తర్వాత పిల్లలు చూశారని చెప్పారు. పిల్లల ముందే భార్యను చంపడం నిజమా, కాదా ? అని దర్యాప్తు జరిపిన పోలీసు అధికారిని ప్రశ్నించగా, తమకు సరిగ్గా తెలియదని, కాల్పులు జరిపిన గంట తర్వాత నిందితుడే 999 నెంబర్‌కు ఫోన్‌చేసి చెప్పగా, రక్తం మడుగులో పడి ఉన్న భార్యను ఆస్పత్రికి పంపించామని, షాట్‌గన్ స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఆ రోజు ఉదయం 6.40 గంటలకు సిల్కీ జోన్స్ మరణించారని వివరించారు. పిల్లల ముందే భార్యను కాల్చి చంపితే కూడా పీటర్‌కు కఠిన శిక్ష పడేది. మే 3వ తేదీ తెల్లవారుజామన 4.45 సమయంలో పీటర్ పోలీసులకు ఫోన్‌చేసి చెప్పారు. తన భార్యను తానే కాల్చి చంపినట్లు ముందుగా ఫోన్లో స్వయంగా అంగీకరించిన పీటర్ ఆ తర్వాత పోలీసుల ఇంటరాగేషన్‌లో మాట మార్చారు. ఆగంతకుడెవరో కాల్చారన్నారు. ఆ తర్వాత తనను ఆవహించిన ఏదో శక్తి కాల్చిదన్నారు. ఇంతకు తాను కాల్చాడా, ఆగంతకుడు కాల్చాడా? అంటూ పలుసార్లు అటు ఇటు మాట్లాడారు. బుధవారం నాడు ఇప్స్విచ్ కోర్టు ముందు ముందుగా ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేసిన పీటర్, చివరికి మానసిక ఒత్తిడిలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్ (ఐటీ కంపెనీకి లీగల్ అడ్వైజర్)’ చేస్తోన్న భార్యను తానే కాల్చానని ఒప్పుకున్నారు. తన మానసిక ఒత్తిడిని పరిగణలోకి తీసుకొని కఠిన శిక్ష విధించవద్దని మొర పెట్టుకున్నారు. ఈయన మొరతోపాటు హత్యా సమయంలో నేరస్థుడి మనస్థితి సరిగ్గా లేదంటూ కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్ ఫ్రాంక్ ఫర్నాహామ్ ఇచ్చిన నివేదికను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. అందుకనే హత్యానేరం కింద కేసును విచారించకూడదని కోర్టు నిర్ణయించింది. ఎన్నేళ్లు జైలు శిక్ష విధించాలనే అంశంపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని కేసు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు వైద్యుల సూచన మేరకు నిందితుడు క్రమం తప్పకుండా మానసిక వైద్యానికి మందులు వాడాలని సూచించింది. -
‘క్రిమినల్’కు పాతికేళ్లు ఈ సందర్భంగా..
అక్కినేని నాగార్జున హీరోగా మహేశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘క్రిమినల్’. మనీషా కోయిరాల, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించారు. పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సంగీతం దిగ్గజం ఎమ్ఎమ్ కీరవాణి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘తెలుసా మనసా’ సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పాతికేళ్లు పూర్తిచేసుకుంది. అయితే ఈ సినిమా, ఈ సినిమాలోని తెలుసా మనసా పాట మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. సినిమా విడుదలై పాతికేళ్లు అవుతున్న సందర్భంగా అనూప్ శంకర్ ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో పాడి నిస్వార్ధంగా సమాజానికి సేవ చేస్తున్న వారికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. దీనిపై హీరో నాగార్జున కూడా స్పందించారు. ఈ పాటను నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి స్వరపరచిన ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ నాగ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇక తెలుసా మనసా పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, పాటను బాలు, చిత్ర అద్భుతంగా ఆలపించారు. Thank you anoop Shankar!! It’s been 25 years since this beautiful song was composed by @mmkeeravaani 🙏 so happy to know You are Dedicating this song to the Selfless hearts who serve society!!👉 https://t.co/0AtrQpfAzf#worldnursesday #tribute insta Id @singeranoopsankar — Nagarjuna Akkineni (@iamnagarjuna) May 12, 2020 చదవండి: రేపే హీరో నిఖిల్-పల్లవి వివాహం? పవన్ కల్యాణ్.. ‘ఇప్పుడే మొదలైంది’? -
‘కిల్లర్’ సినిమా సక్సెస్‌మీట్
-
కిల్లర్ రియల్ సక్సెస్
‘‘ఇప్పుడు సినిమాలు హిట్ సాధించడం అరుదైపోయింది. ‘కిల్లర్’ చిత్రం రియల్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు డబ్బుతోపాటు ప్రశంసలు దక్కడం గర్వంగా ఉంది’’ అని అర్జున్ అన్నారు. విజయ్ ఆంటోని, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘కొలైగారన్’. ఇందులో ఆషిమా నర్వాల్ కథానాయికగా నటించారు. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్కుమార్, టి.శ్రీధర్ ఈ చిత్రాన్ని ‘కిల్లర్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ నెల 7న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో విజయ్‌ఆంటోని మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి ‘కిల్లర్’ సినిమాతో నిరూపితమైంది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో అర్జున్‌గారు నటించడం మా ప్రధానబలం. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి వెళ్లాలి’’ అని అన్నారు. ‘‘దాదాపు 35 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా నన్ను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణగారికి కృతజ్ఞతలు. ‘కిల్లర్’ చిత్రం బాగా ఆడుతోంది. రెండోవారంలో 60థియేటర్స్ పెరగడం ఈ సినిమా విజయానికి సంకేతం. విజయ్ ఆంటోనీ, ఆండ్రూస్ బాగా చేశారు’’ అన్నారు అర్జున్. ‘‘విజయ్ ఆంటోని వల్లే ఈ అవకాశం వచ్చింది. అర్జున్‌గారు నటించడం హైలైట్. ఈ సినిమా సక్సెస్‌లో మా టీమ్ కీలకం’’ అన్నారు ఆండ్రూ. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అంజయ్య, ప్రదీప్, కథానాయిక ఆషిమా నర్వాల్, నటి భానుశ్రీ, సంగీత దర్శకుడు సైమన్ కింగ్ పాల్గొన్నారు. -
వంద సినిమాల్లో ఒకటిలా ఉండదు
‘‘కళకు భాషతో సంబంధం లేదని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందర్నీ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా బాగుంది.. పెద్ద హిట్ అవుతుంది.. మళ్లీ సక్సెస్ మీట్లో తప్పకుండా కలుద్దాం’’ అన్నారు విజయ్ ఆంటోని. అర్జున్, విజయ్ ఆంటోని హీరోలుగా, ఆషిమా నర్వాల్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘కొలైగారన్’. ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని టి.నరేష్కుమార్–టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో రేపు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘విజయ్ ఆంటోని, అర్జున్.. తమ నటనతో ఆకట్టుకున్నారు. కథ చాలా బాగుంటుంది. అందుకే తెలుగులో విడుదల చేస్తున్నాం. ఇంట్రెస్టింగ్ అంశాలు, ఉత్కంఠ పరిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తమిళంలోకి హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎప్పటికైనా సావిత్రిగారంత పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు ఆషిమా నర్వాల్. ‘‘ఇది నా మొదటి తెలుగు సినిమా. పాటలకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సంగీత దర్శకుడు సైమన్ కె. కింగ్. ‘‘వంద సినిమాల్లో ఒక సినిమాలా ‘కిల్లర్’ ఉండదు.. వంద సినిమాలకు ఒక సినిమాలా ఉంటుంది’’ అని చిత్ర రచయిత భాషా శ్రీ అన్నారు. -
విజయ్ ఆంటోని ‘కిల్లర్’ మూవీ స్టిల్స్
-
థ్రిల్లింగ్ కిల్లర్
యాక్షన్ కింగ్ అర్జున్, విజయ్ ఆంటోని నటించిన చిత్రం ‘కొలైగారన్’. దియా మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై ‘కిల్లర్’ పేరుతో టి. నరేశ్ కుమార్, టి.శ్రీధర్ విడుదల చేస్తున్నారు. ఆండ్య్రూ లూయిస్ దర్శకత్వం వహించారు. రంజాన్ పండగ సందర్భంగా జూన్ 7న ‘కిల్లర్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అర్జున్, విజయ్ ఆంటోనిలకు ఉన్న క్రేజ్‌తో ఇప్పటికే తెలుగులో మంచి బిజినెస్ జరిగింది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చి్రత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ అందించిన పాటలు ఓ హైలైట్’’ అన్నారు. ఆశిమా నర్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, సంపత్‌రాజ్ తదితరులు నటించారు. -
ఆటోవాలా హైలైట్
అరాచకాలు, అన్యాయాలు చేస్తూ మాఫియా డాన్‌గా మారిన వ్యక్తిని పోలీసులు చివరికి ఎలా అంతమొందించారు? అనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘హైటెక్ కిల్లర్’. జాతీయ బాడీ బిల్డర్ బల్వాన్ హీరోగా, శ్రావణి హీరోయిన్గా నటించారు. ఎస్ఎంఎం ఖాజా దర్శకత్వంలో మజ్ను సాహెబ్ మూవీస్, సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకాలపై మజ్ను రెహాన్ బేగం నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేశాం. రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వాటిని త్వరలోనే చిత్రీకరించనున్నాం. ఎస్కె మజ్ను అందించిన పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడిన ‘ఆటోవాలా...’ సాంగ్ హైలైట్ అయింది. ‘హైటెక్ కిల్లర్’కి సీక్వెల్‌గా ‘హీమాన్’ అనే పేరుతో మరో సినిమా తెరకెక్కిస్తున్నాం. దాన్ని రంజాన్ కానుకగా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షేక్ మహ్మద్ , నిర్మాత: మజ్ను రెహాన్ బేగం. -
హంతకుడు ఎవరు?
అర్జున్, విజయ్ ఆంటోని, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లర్’. ‘హంతకుడు’ అన్నది ఉపశీర్షిక. బి.ప్రదీప్ సమర్పణలో దియా మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రం స్నీక్ పీక్ టీజర్‌ను రిలీజ్ చేయగా, బిగ్ సీడీని అర్జున్ విడుదల చేశారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘అర్జున్‌గారితో కలిసి ఈ సినిమా చేయటం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే. ఆషిమా ఈ సినిమాతో ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్‌గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావుగారు నాకు గాడ్ ఫాదర్. భాష్యశ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారు. మేలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేశా. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. విజయ్ ఆంటోనీ మంచి మనిషి. ఈ చిత్రంలో ‘కిల్లర్’ ఎవరనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అన్నారు అర్జున్. ‘‘నాకు తెలుగు రాకున్నా తెలుగు వారికి నచ్చే సినిమా తీశా. విజయ్ ఆంటోని నా స్నేహితుడు. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్‌గారు ఈ సినిమా చేయటమే మా మొదటి సక్సెస్. టెక్నికల్‌గా నెక్ట్స్ లెవెల్ మూవీ అవుతుంది’’ అన్నారు ఆండ్రూ లూయిస్. సంగీత దర్శకుడు సైమన్ కె.కింగ్, పాటల రచయిత భాష్యశ్రీ, అషిమా నర్వాల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మ్యూక్స్. -
నీవు నేర్పిన విద్య
‘‘నన్ను చంపాలి నువ్వు!’’ అన్నాడతను. ఉలిక్కిపడి అతని ముఖంలోకి తీక్షణంగా చూసిందామె. ‘‘ఎస్, నువ్వు సరిగానే విన్నావు. నువ్వు హత్యచేయవలసింది నన్నే!’’ అన్నాడతను మళ్ళీ. అతని పేరు రాంచందర్. ముప్పయ్యేళ్ళుంటాయి. ‘‘జోకులు ఆపి ఎవర్ని లేపేయ్యాలో సమఝయ్యేలా చెప్పు’’ అందామె కటువుగా. ఆమెకు పాతికేళ్ళుంటాయి. రఫ్ అండ్ టఫ్ హైర్డ్ కిల్లర్ ఆమె. ఇంటర్నెట్ లో ‘కిరాయి హంతకుడి’ కోసం కవర్ట్ యాడ్ ఇస్తే, కాంటాక్ట్‌లోకి వచ్చింది. ఓ హోటల్ రూమ్‌లో కలుసుకున్నారు వాళ్లు. ‘‘నేను జోక్ చేయడంలేదు. నిజంగానే నాకు చావాలని ఉంది. అందుకే’’ అన్నాడు రాంచందర్. అతను తనతో వేళాకోళం ఆడడంలేదనీ, సీరియస్‌గానే చెబుతున్నాడనీ గ్రహించింది. ‘‘చచ్చుడు కర్మ నీకేంది, బిడ్డా?’’ ఆశ్చర్యంతో అడిగింది. ‘‘నీ పేరేమిటో తెలుసుకోవచ్చునా?’’ అడిగాడు అతను. ‘‘ఎల్. కె. – లేడీ కిల్లర్..’’ అంది, పేరు చెప్పడం ఇష్టంలేనట్టు. ‘‘సారీ!’’ అని, ‘‘ఎందుకు చావాలనుకుంటున్నానో చెబుతాను విను’’ అంటూ అతగాడు చెప్పిన కథనం: ‘రాంచందర్ ఓ ధనవంతుడు. సువర్చల అనే ఓ విడోని ప్రేమించి పెళ్ళాడాడు. వయసులో అతనికంటే ఐదేళ్ళు పెద్దది ఆమె. ఓ బలహీన క్షణంలో మోసంచేసి అతని ఆస్తినంతా తన పేరిట రాయించేసుకుంది. ఆ తరువాత నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి. ఏదో ఒక కారణంతో అతన్ని అవమానిస్తూ హెరాస్ చేయనారంభించింది ఆమె. విడాకులు ఇచ్చేద్దామంటే ఆమె మీది ప్రేమను చంపుకోలేకపోతున్నాడు. అతనికి తనపట్ల గల పిచ్చి ప్రేమను ఆసరా చేసుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నాడన్న అనుమానం కూడా వుంది. ఆమె మాటలతో, చర్యలతో అనుక్షణం మానసిక క్షోభను అనుభవిస్తూ జీవించడం అతనికి చేతకావడంలేదు.. అందుకే చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాడు.’ విస్తుపోయి చూసింది ఎల్.కె. ‘‘దాన్ని చంపక, నువ్వు చస్తానంటవేంది, బిడ్డా?!’’ అంది, నమ్మలేనట్టుగా. ‘‘అదిసరే. ఓ విషయం నాకు అంతుబట్టలే. చావాలనుకుంటే ఏ రైలు కింద పడో, హుస్సేన్ సాగర్‌లో దూకో, లేదా.. ఇంట్ల ఉరేసుకునో చావొచ్చుగా నువ్వు? కిరాయి హంతకులకు లక్షలు పోసి చంపించుకోవడమెందుకు?’’ అనుమానంగా అడిగింది. ‘‘అదా? స్వయంగా ప్రాణాలు తీసుకోవడానికి గొప్ప ధైర్యం కావాలి’’ చెప్పాడతను. ‘‘కిరాయి ముఖ్యంగాని, ఎవర్ని చంపామన్నది ముఖ్యం కాదుగా! నిన్ను చంపడానికి నేను ఒప్పుకుంటున్న. ఫీజు ఐదు లక్షలు. ముందే ఇచ్చేయాలె. అడ్వాన్స్ అంటే, బ్యాలెన్స్ పే చేయడానికి చచ్చాక నువ్వుండవుగద మల్ల!’’ అందామె. సగం సొమ్ము అడ్వాన్స్‌గా చెల్లించాడు రాంచందర్. తన చావుకు ముహూర్తం తానే నిర్ణయిస్తాననీ, చంపడానికి ముందురోజున మిగతా సొమ్ము ముట్టజెప్పబడుతుందనీ చెప్పాడు. ··· ‘‘చందర్! నీతో కొంచెం మాట్లాడాలి’’ అంది సువర్చల, బయటకు వెళుతూన్న అతన్ని చూసి. ఆగి, ‘‘ఎస్, డియర్?’’ అంటూ వచ్చి సోఫాలో ఆమె పక్కను కూర్చున్నాడు అతను. ముప్పయ్ అయిదేళ్ళ సువర్చల తెల్లగా, నాజూకుగా, అందంగా ఉంటుంది. ఆమె భర్త చమక్ లాల్ ముత్యాల వ్యాపారి. పత్తర్ ఘాట్‌లో ముత్యాల షాపు ఉంది అతనికి. మూడేళ్ళ క్రితం డెంగ్యూ ఫీవర్ తో అకాలమరణం చెందాడు. అప్పటి నుంచి వ్యాపారాన్ని స్వయంగా చూసుకోసాగింది ఆమె. ఒంటరిగానే జీవిస్తోంది. రెండేళ్ళ క్రితం అనుకోకుండా రాంచందర్‌తో పరిచయమయింది సువర్చలకు. తాను ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టునని చెప్పుకున్నాడు అతను. స్త్రీలను ఆకట్టుకునే అతని రూపానికీ, మాటలకూ పడిపోయిందామె. ఒంటరి ఆడదాన్ని చేసి ఆస్తి కోసం తనకు సమస్యలు తెచ్చిపెడుతూన్న బంధువుల బారినుంచి కాపాడుకునేందుకు అతని తోడు అవసరమనిపించింది. పెళ్ళిచేసుకున్నారు ఇద్దరూ. అయితే, ఆమధ్య రాంచందర్లో ఏదో మార్పు కనిపిస్తోంది ఆమెకు. ‘‘చెప్పు, చందర్! ఎవరామె?’’ సూటిగా అడిగింది సువర్చల. ఎదురుచూడని ఆ ప్రశ్నకు కొద్దిగా తడబడ్డాడు అతను. ‘‘ఎవరు?’’ ‘‘చూడు, చందర్! కొద్దిరోజులుగా నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ప్రేమించానంటూ నా వెంటపడి వేధించావు. పెళ్ళయాక నా మీద మోజు తీరిపోయిందా నీకు?’’ ఆమె స్వరంలో తీక్షణత. ‘‘మార్పా? నాలోనా? నెవ్వర్!’’ అన్నాడతను. ‘‘అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఆందోళనచెందకు, డియర్!’’. ‘‘పిల్లి కళ్ళు మూసుకున్నంతలో లోకం దాన్ని చూడకపోదు. నువ్వు ఎవరో పిల్లతో చక్కెర్లు కొడుతున్న సంగతి నా దృష్టికి వచ్చింది’’ అంది, అతని ముఖకవళికలను గమనిస్తూ. ‘‘అబద్ధం! నామీద నీకెవరో చాడీలు చెప్పుంటారు, డియర్! మనల్ని విడదీయాలన్న పన్నాగం అయ్యుంటుంది. నువ్వు నా ప్రాణం!’’ అన్నాడతను, ఆమెను దగ్గరకు తీసుకుంటూ. ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయిందామె. తరువాత, ‘‘ఓకే. నువ్వు చెప్పేది నిజం కావాలని ఆశిస్తున్నాను’’ అంది. ‘‘ఎల్లుండి దివాలీ. ఆ రోజున ఇంట్లో లక్ష్మీపూజ ఘనంగా చేస్తానన్న సంగతి నీకు తెలుసుగా? ఈ రెండు రోజులూ ఎక్కడికీ వెళ్ళొద్దు’’. ‘‘ఓ.. ష్యూర్, డియర్!’’ అన్నాడు లేస్తూ. ··· సువర్చల దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీపూజ చేసుకుంటుంది. అది కుటుంబసభ్యులకే పరిమితం. ఎందుకంటే ఆ పూజలో అపూర్వ వజ్రం ఒకటి ఉంచబడుతుంది. ఆ వజ్రం ఐదు తరాలుగా ఆ కుటుంబంలో ఉంది. దాని ప్రస్తుత విలువ వేయికోట్ల పైచిలుకే. అంతర్జాతీయ మార్కెట్లో అంతకు ఎన్నో రెట్లు ఉంటుందని అంచనా. వంశపారంపర్యంగా వస్తూన్న ఆ వజ్రమే తమకు సకల శుభాలనూ చేకూరుస్తోందన్న ప్రగాఢ నమ్మకం. దాని గురించి ఆ కుటుంబేతరులకు తెలియదు. ఏడాదికోసారి దీపావళి రోజున లక్ష్మీపూజ కోసం బైటకు తీయడం జరుగుతుంది. మిగతా 364 రోజులూ బ్యాంక్ లాకర్లో సేఫ్ గా ఉంటుంది. గత దీపావళి రోజున ఆ వజ్రాన్ని చూసిన రాంచందర్ కన్నులు మిరుమిట్లు గొలిపాయి. దాని చరిత్ర విని, ‘‘ఇంత విలువైన వజ్రాన్ని ఇన్స్యూర్ చేయకపోవడం ఆశ్చర్యకరమే!’’ అన్నాడు. సువర్చల నవ్వి, ‘‘ఇన్స్యూర్ చేయడమంటే దీని గురించి టామ్ టామ్ చేయడమే. దీని ఉనికి ఎవరికీ తెలియనంతవరకే సేఫ్టీ’’ అంది. ఎప్పటిలాగే దీపావళికీ వజ్రాన్ని వుంచి పూజ చేసుకుంది సువర్చల. రాంచందర్ హాల్లో టీవీ చూస్తున్నాడు. బయటి నుంచి దీపావళి సందడి వినవస్తోంది. పటాసుల శబ్దాలు మిన్నంటుతున్నాయి. పూజ అయ్యాక వెండిపళ్ళెంలో స్వీట్స్‌తో హాల్లోకి వచ్చింది సువర్చల. అంతలో హఠాత్తుగా కరెంట్ పోయింది. వెనువెంటనే పిస్టల్ శబ్దమూ, ‘అమ్మా!’ అన్న ఆర్తనాదమూ – పటాసుల ధ్వనులలో కలసిపోయాయి. కాసేపటి తరువాత కరెంట్ తిరిగివచ్చింది. నేలపైన నెత్తుటిమడుగులో పడివున్న సువర్చలను చూసి ఒక్క ఉరుకులో ఆమెను సమీపించాడు రాంచందర్. ··· రాంచందర్ తన చావుకు ముహూర్తం దీపావళికి పెట్టుకున్నాడు. ముందురోజున లేడీ కిల్లర్ ని కలసి బ్యాలెన్స్ ఫీజు చెల్లించేసాడు. దీపావళినాటి రాత్రి ఎనిమిదిన్నరకు సువర్చల భవంతికి వెళ్ళింది లేడీ కిల్లర్. మూడంతస్తుల భవనం అది. దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మెయిన్ గేటు దగ్గర వాచ్‌మ్యాన్ లేడు. ఆరోజు అతనికి సెలవు ఇచ్చి పంపేస్తానన్నాడు రాంచందర్. కాంపౌండులో ప్రవేశించింది ఎల్.కె. ఫలానా టైముకు తాను ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నిలుచుంటాననీ, అప్పుడు షూట్ చేయమనీ చెప్పాడు రాంచందర్. తన సొంత ఆయుధంతోనే చావాలన్నది తన సెంటిమెంటనీ, ఇంటి ముఖద్వారం దగ్గర మెట్లపక్కన క్రోటన్ ప్లాంట్ ఉన్న మట్టికుండీలో తన పిస్టల్ని ఉంచుతాననీ, దాన్ని తీసి షూట్ చేయమనీ, తర్వాత దాన్ని అక్కడే పెట్టేయమనీ చెప్పాడు. ‘ఇదేం చావు సెంటిమెంటురా బాబూ! చావడానికి ఏ పిస్టల్ అయితేనేమి?’ అనుకుని విస్తుపోయిందామె. కుండీలోంచి పిస్టల్ తీసుకుని బాల్కనీ వైపు వెళ్ళింది ఎల్.కె. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నిలుచునివున్న రాంచందర్ కనిపించాడు. అంతే! లేడీ కిల్లర్ చేతిలోని పిస్టల్ పేలింది. కుప్పకూలిపోయాడు అతను. పిస్టల్ శబ్దం దీపావళి ధ్వనులలో కలసిపోయింది. తరువాత పిస్టల్ని యథాస్థానంలో ఉంచి, కూల్‌గా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయిందామె. ··· సిటీ శివార్లలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో ప్రియుడి ఒడిలో పడుకుని ఆ వజ్రాన్ని కుతూహలంతో పరిశీలిస్తోంది షహనాజ్. ఇరవయ్యేళ్ళుంటాయి ఆమెకు. కొంచెం బొద్దుగా, తెల్లగా, అందంగా, మోడర్న్‌గా ఉంటుంది. ఆమె చేతిలో ఉన్నది సువర్చలకు చెందిన ఫ్యామిలీ డైమండ్! ‘‘జీవితంలో ఇలాంటి వజ్రాన్ని చూడడం ఇదే మొదటిసారి. దీని ఖరీదు వేయికోట్లంటే నమ్మశక్యం కావడంలేదు’’ అందామె. ఏదో అనబోయిన అతను టీవీలో వస్తున్న వార్తను చూసి ఆగిపోయాడు. సువర్చల హత్యావార్త అది – ‘గతరాత్రి సువర్చల, ఆమె భర్త రాంచందర్ దీపావళి సందర్భంగా తమ నివాసంలో లక్ష్మీపూజ ఘనంగా జరుపుకున్నారు. అనంతరం దంపతుల నడుమ ఏం గొడవ జరిగిందో ఏమో, రాంచందర్ భార్యను ఆమె లైసెన్స్డ్ పిస్టల్‌తోనే షూట్ చేసి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. శవాలు రెండూ హాల్లో పడున్నాయి. పక్కనే పిస్టలూ, దానిపైన రాంచందర్ వేలిముద్రలూ ఉన్నాయి. పోలీసులు శవాలను పోస్ట్ మార్టమ్‌కి పంపించి, ఆ సంఘటన వెనుక వున్న కారణాలను పరిశోధిస్తున్నారు’ ప్రియుడి వంక ఆశ్చర్యంగా చూసింది షహనాజ్. ‘‘అక్కడ శవమై పడున్న రాంచందర్, ఇక్కడికి ఎలా వచ్చాడబ్బా!?’’ అంది. ‘‘ఏం మాయ చేశావ్, డియర్?’’ నవ్వాడతను. అతని మదిలో గతం సినిమారీలులా తిరిగింది..’విడో అయిన సువర్చలకు బోలెడు ఆస్తి వుందని తెలిసి ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేశాడు రాంచందర్. ఆమెను ఒప్పించి పెళ్ళాడాడు. అంతవరకు రికామీగా తిరుగుతూ వచ్చిన అతను ఖరీదైన జీవితాన్ని అనుభవించసాగాడు. ఆమె ఆస్తినంతటినీ తన పేరిట రాయించుకోవడానికి అవకాశం కోసం చూడసాగాడు. అంతలో సువర్చల ఫ్యామిలీ డైమండ్ గురించి తెలిసింది. దాన్ని ఎలా కాజేయాలా అని ఆలోచిస్తూండగానే, శ్యామ్ సుందర్ తో పరిచయమయింది. శ్యామ్ సుందర్ దుబాయ్‌లో ప్రియురాలిచేత వంచింపబడి ఆ మధ్యనే ఇండియాకి తిరిగొచ్చాడు. ఆమెను, ఆమె వంచనను మరచిపోలేక ఆత్మహత్యకు పూనుకున్నాడు. అప్పుడే రాంచందర్ అనుకోకుండా కలవడమూ, అతన్ని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడటమూ జరిగాయి. కవలల్లా ఇద్దరూ ఒకే పోలికలో ఉండడం ఇద్దర్నీ చకితుల్ని చేసింది. ప్రపంచంలో ఒకే పోలికలో ఏడుగురు ఉంటారన్నది నిజమేననిపించింది. వారి మధ్య స్నేహం కలసింది. శ్యామ్ సుందర్‌ని చూసాక రాంచందర్ ఆలోచనలు కొత్తపుంతలు తొక్కాయి. అతన్ని అడ్డుపెట్టుకుని సువర్చల వజ్రాన్ని తస్కరించేందుకు పథకం వేసాడు. ఓ కట్టుకథతో, హైర్డ్ కిల్లర్ కి సుపారీ ఇచ్చి తనను చంపమని పురమాయించాడు. దీపావళి రోజున తన ఇంటికి డిన్నర్ కి రావలసిందిగా శ్యామ్ సుందర్ ని ఆహ్వానించాడు. సువర్చల పూజలో ఉండగా వచ్చిన అతిథిని ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి పంపించాడు – పూజ అయ్యాక పిలుస్తాననీ, భార్యను తమ రూపాలతో సర్ప్రైజ్ చేద్దామనీనూ.. తరువాత లైట్లు ఆర్పేసి సువర్చలను ఆమె పిస్టల్ తోనే షూట్ చేశాడు. ఆ పిస్టల్ని బైట పూలకుండీలో ఉంచాడు. లేడీ కిల్లర్ దాన్ని తీసుకుని రాంచందర్ లా ఉన్న శ్యామ్ సుందర్‌ని షూట్ చేసింది. పిస్టల్ని యథాస్థానంలో ఉంచి వెళ్ళిపోయింది. రాంచందర్ బాల్కనీలోని శ్యామ్ సుందర్ శవాన్ని తీసుకొచ్చి హాల్లో పడేశాడు. పిస్టల్ని పూలకుండీలోంచి తెచ్చి దాని మీది వ్రేలిముద్రల్ని చెరిపేసి, శ్యామ్ సుందర్ చేతిలో పెట్టి అతని ముద్రలు పడేలా చేశాడు. పిస్టల్ని అతని పక్కనే పడేసి, వజ్రంతో ఉడాయించాడు. సువర్చల వద్దనున్న ఆ వజ్రం గురించి ఎవరూ ఎరుగరు కనుక, అది దొంగిలింపబడినట్టు ఎవరికీ తెలియదు. ఇకపోతే, చనిపోయింది రాంచందర్ కాదనీ, అతని రెప్లికా మరొకడు ఉన్నాడనీ ఎరుగని పోలీసులు తనను అనుమానించరు.’ అతను చెప్పినదంతా నోరు తెరచుకుని ఆలకించిన షహనాజ్, ‘‘వాహ్! నీది సూపర్ బ్రెయిన్, డియర్!’’ అంది మెచ్చుకోలుగా, ‘‘రేపే వజ్రంతో ఇక్కణ్ణుంచి మనం జెండా ఎత్తేస్తున్నాం, డార్లింగ్! మారిషస్ కి టికెట్స్ ఆల్రెడీ కొనేశాను. అక్కణ్ణుంచి అమెరికా వెళ్ళిపోదాం. అక్కడ వజ్రాన్ని అమ్మేద్దాం. మనం పెళ్ళిచేసుకుని ఆ డబ్బుతో జీవితాంతం సుఖంగా గడిపేద్దాం’’ అన్నాడు రాంచందర్. ‘‘సో క్యూట్!’’ అంటూ ప్రియుణ్ణి గాఢంగా కౌగలించుకుంది షహనాజ్ సంతోషంతో. ··· రాత్రి పదకొండు గంటలకు శంషాబాద్ ఏర్పోర్ట్లో ప్రవేశించారు రాంచందర్, షహనాజ్‌లు. ఆనవాలు తెలియకుండా తన రూపంలో మార్పులు చేసుకున్నాడు రాంచందర్. అతని వద్ద ఓ ట్రాలీ సూట్ కేసూ, ఆమె చేతిలో ఓ ట్రావెల్ బ్యాగూ ఉన్నాయి. మారిషస్ ఏర్ లైన్స్ ‘చెకిన్’ కౌంటర్ వద్ద పెద్ద క్యూ ఉంది. రెస్టారెంటుకు వెళ్ళి కాఫీ తాగారు ఇద్దరూ. అనంతరం అతను బోర్డింగ్ పాసెస్ కోసం క్యూలో నిలుచుంటే, ఆమె లాంజ్ లో కూర్చుంది. కొంతసేపటి తరువాత హఠాత్తుగా సెక్యూరిటీ స్టాఫ్ డాగ్ స్క్వాడ్ తో ప్రవేశించి ప్రయాణికుల బ్యాగేజ్ ని చెక్ చేయనారంభించారు. రాంచందర్ దగ్గరకు రాగానే కుక్కలు అతని సూట్‌కేస్ వాసన చూసి పెద్దగా మొరగనారంభించాయి. పోలీసులు దాన్ని తెరిపించి సోదాచేసారు. ‘నాటుబాంబు’ బైటపడింది! తెల్లబోయిన రాంచందర్, ‘‘నో! నాకేం తెలియదు. అది అందులోకి ఎలా వచ్చిందో ఎరగను’’ అంటూ మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా, అతని రెక్కలు విరిచిపట్టుకుని లాక్కుపోయారు పోలీసులు. వెళ్తూ షహనాజ్ కూర్చున్న వైపు చూశాడు రాంచందర్. ఆమె కనిపించలేదు. స్క్వాడ్ రాకముందే, ఆమె ట్రావెల్ బ్యాగ్‌ని సీటులో పెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళడం అతను ఎరుగడు. కాసేపటికి వాష్‌రూమ్ నుంచి తిరిగొచ్చిన షహనాజ్, తన ట్రావెల్ బ్యాగ్ తీసుకుని కూల్‌గా ఏర్ పోర్ట్లోంచి బైటకు నడిచింది. ఖాళీగా ఉన్న క్యాబ్‌ని పిలిచి ఎక్కింది. క్యాబ్ సిటీవైపు దూసుకుపోతుంటే మదిలోనే అనుకుందామె – ‘సారీ, రామ్! నిన్ను నమ్మిన ఆడదాన్ని, పెళ్ళాడిన భార్యనే డైమండ్ కోసం నిర్దాక్షిణ్యంగా చంపేశావు నువ్వు. రేపు నాకంటే అందంగా ఉన్న మరో ఆడది కనిపించినా, లేదా నీ రహస్యం ఎరిగినదాన్ని అనో నా అడ్డు తొలగించుకోవన్న గ్యారంటీ ఏమిటి? అందుకే తెలివిగా వజ్రాన్ని తస్కరించి, నీ సూట్ కేసులో నాటుబాంబును తెచ్చి పెట్టాను. పోలీసులకు దాని గురించి టిపాఫ్ ఇచ్చింది కూడా నేనే. రేపే వజ్రంతో యు.ఎస్. చెక్కేస్తున్నాను. టెర్రరిస్టుగా నువ్వు జైలునుంచి బైటపడటం కల్ల. ఒకవేళ ఎలాగో మేనేజ్ చేసి బైటపడ్డా, నన్ను కనిపెట్టడం నీ తరం కాదు. నిన్ను డబుల్ క్రాస్ చేశానని తిట్టుకోకు. ఆఫ్టరాల్, ఇది నువ్వు నేర్పిన విద్యేగా’ · -
వారిని నేను చంపలేదు..
సాక్షి, చెన్నై : తమిళనాట సంచలనం కలిగించిన చిన్నారి హాసిని, ఆమె తల్లి సరళ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. వారిని తాను చంపలేదంటూ హంతకుడు దశ్వంత్ మాట మార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కుండ్రత్తూరుకు చెందిన దశ్వంత్ చెన్నై మౌలివాక్కానికి చెందిన ఆరేళ్ల బాలిక హాసినిని గత ఫిబ్రవరిలో అత్యాచారం చేసి చంపేశాడు. ఈ కేసులో జైలుకెళ్లిన దశ్వంత్, బెయిల్‌పై విడుదలై ఈనెల 2న తల్లి సరళను హత్య చేసి నగలతో ముంబైకి పరారయ్యాడు. ముంబై పోలీసుల సహాకారంతో తమిళనాడు పోలీసులు హంతకుడిని అరెస్టు చేసి పుళల్ జైలులో నిర్బంధించారు. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. భారీ భద్రత నడుమ పోలీసులు దశ్వంత్‌ను చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుపచడానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో పోలీసు వ్యాను నుంచి కిందికి దిగిన దశ్వంత్ విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి హాసినిని, తన తల్లి సరళను తాను హత్య చేయలేదన్నాడు. విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి పూర్తివివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. తర్వాత న్యాయమూర్తి వేల్మురుగన్ సమక్షంలో దశ్వంత్‌ను కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల దిగ్భ్రాంతి: కొన్ని రోజుల క్రితం దశ్వంత్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా విచారణ అవసరం లేదని, తనకు శిక్షను విధించాలని కోరాడు. ప్రస్తుతం హాసినిని, తల్లి సరళను తాను హత్య చేయలేదని చెప్పడం పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దశ్వంత్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను బలపరిచేందుకు, కొత్త సాక్షులను చేర్చేందుకు పోలీసులు నిర్ణయించారు. -
జీవనశైలి వ్యాధులే టాప్ కిల్లర్స్
సాక్షి,న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా టీబీ, డయేరియా వంటి వ్యాధుల కన్నా గుండె, శ్వాస సంబంధిత వ్యాధులతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. అత్యంత వెనుకబడిన రాష్ర్టాల్లోనూ జీవనశైలి వ్యాధులు విస్తృతమయ్యాయని పేర్కొంది. 1990ల వరకూ అంటు,సీజనల్ వ్యాధుల కారణంగా అధిక మరణాలు నెలకొంటే తాజాగా జీవనశైలి వ్యాధులే జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయని స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనీషియేటివ్ పేరిట వెల్లడైన నివేదిక పేర్కొంది. దేశం అభివృద్ధి బాట పట్టినా పౌష్టికాహార లేమి ఇప్పటికీ అనారోగ్య కారణాల్లో ముందువరసలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2016లో చోటుచేసుకున్న మరణాల్లో అంటు సీజనల్ వ్యాధుల కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 26 శాతం కాగా, జీవనశైలి వ్యాధుల మరణాలు 60 శాతం పైగా ఉన్నాయి.గాయాలబారిన పడి మరణించిన వారి సంఖ్య 11 శాతంగా నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల వారిలో జీవనశైలి వ్యాధులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక దేశవ్యాప్త మరణాల్లో 28 శాతం గుండె సంబంధిత వ్యాధులు కారణం కాగా, డయేరియా, ఇన్ఫెక్షన్లతో 15.5 శాతం, శ్వాసకోశ సమస్యలతో 11 శాతం, గాయాలతో 10.7 శాతం, క్యాన్సర్‌తో 8.3 శాతం మృత్యువాతన పడుతున్నారు. పక్షవాతం, మధుమేహం, కిడ్నీ వ్యాధులతో కూడా పెద్దసంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయని నివేదిక తెలిపింది. భారతీయ వైద్య పరిశోధన మండలి, భారత ప్రజారోగ్య ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నివేదికను వెల్లడించాయి. -
ఐదేళ్ల బాలికతో హత్య మిస్టరీ వీడింది!
బెంగళూరు: బెంగళూరులోని మిల్క్ మెన్ స్ట్రీట్‌లో ఇటీవల 29 ఏళ్ల సుప్రీత తన ఇంట్లో హత్యకు గురైంది. ఆమె భర్త రవిరాజ్ శెట్టీనే ఆ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అయితే రవిరాజ్ మాత్రం పొంతనలేని సమాధానాలతో పోలీసుల విచారణను తప్పుదోవపట్టించాడు. తన భార్య మానసికవ్యాధితో బాధపడుతోందని, ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని విచారణలో రవిరాజ్ చెప్పుకొచ్చాడు. హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోలేనని.. తన ఐదేళ్ల కూతురు రీతూ నిద్రిస్తుందని పోలీసులకు చెప్పాడు. దీంతో రీతూ సహాయంతో పోలీసులు కేసును చేదించారు. హత్య అనంతరం తాతయ్య ఇంట్లో ఉంటున్న రీతూను విచారించడానికి మఫ్టీలో వెళ్లిన మహిళా పోలీసు అధికారి.. చాక్లెట్లు, బొమ్మలతో ముందుగా బాలికను మచ్చిక చేసుకొని విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అమ్మ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అని రీతూ చెప్పడం విశేషం. అమ్మ అసలు ఎలా గాయపడింది అని ప్రశ్నించగా.. 'నాన్న ఆ రోజు అమ్మను భుజాలపై కిచెన్‌లోకి తీసుకెళ్లాడు. తరువాత రక్తం మరకలతో బయటకు వచ్చాడు. అమ్మ కిచెన్‌లో కింద పడింది అని నాన్న చెప్పాడు' అని బాలిక జరిగింది జరిగినట్లుగా చెప్పింది. ఇదంతా రికార్డు చేసిన పోలీసులు బాలిక తండ్రి రవిరాజ్‌కు చూపించారు. ఇక చేసేదిలేక రవిరాజ్ హత్యానేరం అంగీకరించాడని ఉల్సూర్ పోలీసులు వెల్లడించారు.