Kings punjab
-
వచ్చీ రావడంతోనే రికార్డు.. అత్యంత వేగంగా వంద వికెట్లు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున గురువారం కగిసో రబడా తొలి మ్యాచ్ ఆఢాడు. ఈ క్రమంలో వచ్చీ రావడంతోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఐపీఎల్లో వందో వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించేందుకు రబాడ 1438 బంతులు తీసుకున్నాడు. రబాడ తర్వాత మలింగ 1622 బంతుల్తో రెండో స్థానంలో ఉండగా.. డ్వేన్ బ్రావో 1619 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో హర్షల్‌పటేల్ 1647 బంతులతో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ల పరంగానూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో ఉన్నాడు. రబాడ 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించాడు. రబాడ తర్వాత మలింగ(70 మ్యాచ్‌లు), భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లు 81 మ్యాచ్‌లు, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాలు 83 మ్యాచ్‌లు, యజ్వేంద్ర చహల్ 84 మ్యాచల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. 𝐴𝑎𝑡𝑒 ℎ𝑖 𝑑𝑖𝑙 𝑘ℎ𝑢𝑠ℎ 𝑘𝑎𝑟 𝑑𝑖𝑡𝑡𝑎, Rabada veere! 🙌 Kagiso Rabada is 🔙 with pace 🔥 as he brings up a 💯 wickets in #TATAIPL✨#PBKSvGT #IPLonJioCinema #IPL2023 | @KagisoRabada25 @PunjabKingsIPL pic.twitter.com/vnXHyt3quI — JioCinema (@JioCinema) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్‌గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా.. మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫెవరెట్‌గా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. దీంతో పాటు ఈరోజు మ్యాచ్ ఆడనున్న పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. చదవండి: Gautam Gambhir: అయ్యో ఏంటిది గంభీర్.. నీ అంచనా తప్పింది.. పంజాబ్ కింగ్స్ తన ఓపెనర్లను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరపున కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాలు ఓపెనర్లుగా వస్తున్నారు. కొన్ని సీజన్ల నుంచి వీరిద్దరి కాంబినేషన్ మంచి ఆరంభాలు ఇస్తుంది. అయితే క్రిస్‌గేల్‌ను ఓపెనర్‌గా పంపి.. మయాంక్‌ను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే పంజాబ్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగో స్థానంలో నికోలస్ పూరన్‌కు అవకాశం ఇవ్వాలి. ఇక ఏడో స్థానంలో క్రిస్ జోర్డాన్ స్థానంలో మొయిసెస్ హెన్రిక్స్‌కు అవకాశం ఇవ్వాలి. అతను ఏడో స్థానంలో వస్తే బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడుతాడు. ఇక స్పిన్నర్‌గా రవి బిష్ణొయి అయితే బాగుంటుంది. ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ ఎలెవెన్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, నాథన్ ఎల్లిస్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ చదవండి: RCB Vs KKR: కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు -
కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌లపై వేటు వేసేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... ఈ ఏడాది జట్టు ప్రదర్శనపై పంజాబ్ యాజమాన్యం అప్పుడే సమీక్షను ఆరంభించింది. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను గెల్చుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాకుండా పంజాబ్ కోచ్‌గా తనకు తొలి ఏడాదే అయినా... జట్టును వరుస ఓటముల నుంచి గెలుపు బాట పట్టించిన కుంబ్లే పనితీరుపై పంజాబ్ సంతృప్తితోనే ఉంది. అయితే వేలంలో కోట్లు వెచ్చించి తెచ్చుకున్న మ్యాక్స్‌వెల్ (రూ.10.75 కోట్లు), కాట్రెల్ (రూ.8.5 కోట్లు) ప్రదర్శనలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్... వారిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) మ్యాక్స్‌వెల్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, షమీ, గేల్, యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లను కొనసాగించే వీలుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌ను పటిష్టం చేసేలా కసరత్తులు ఆరంభించింది. ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో కేవలం ఒకే విజయాన్ని నమోదు చేసిన పంజాబ్... అనంతరం వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేలా కనిపించింది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇంటి దారి పట్టింది. (చదవండి: 100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్) -
ఎంఎస్ ధోని తొలిసారి..
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఆరు విజయాలతో ముగించింది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలకు సీఎస్కే గండికొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సీఎస్కే టోర్నీ నుంచి గౌరవంగా నిష్క్రమించింది. ఇదిలా ఉంచితే, ఈ సీజన్లో సీఎస్కే కెప్టెన్ 14 మ్యాచ్‌లకు గాను 12 ఇన్నింగ్స్‌లు ఆడి 199 పరుగులు చేశాడు. ఇది ధోని నుంచి వచ్చిన నిరాశజనకమైన ప్రదర్శన. అదే సమయంలో ఈ సీజన్లో ధోని ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇలా తన ఐపీఎల్ కెరీర్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా ఒక సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి.ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ను తాను ఆడతాననే విషయాన్ని ధోని స్పష్టం చేశాడు. టాస్ సమయంలో అతనికి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా తాను ఇంకా ఆడతాననే సంకేతాలిచ్చాడు. ‘ యెల్లో జెర్సీలో ఇది మీ చివరి మ్యాచ్ కావొచ్చా?’ అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా కాదు అనే సమాధానాన్ని ధోని ఇచ్చాడు. ఈ సీజన్లో ధోని ఆకట్టుకోలేనంత మాత్రాన అతన్ని తక్కువగా అంచనా వేయొద్దని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార పేర్కొన్నాడు. ఏదో ఒక్క సీజన్ ప్రదర్శనతో ధోనిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదన్నాడు. అతను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని, వచ్చే సీజన్లో ధోని నుంచి మంచి ఇన్నింగ్స్‌లు వస్తాయని ఆశిస్తున్నానన్నాడు. -
కింగ్స్ పంజాబ్ కథ ముగిసె..
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ కథ ముగిసింది. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔటైన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. సీఎస్కేతో మ్యాచ్ లో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 153 పరుగుల స్కోరునే చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. పంజాబ్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలుకావడంతో సీజన్‌ను భారంగా ముగించింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డుప్లెసిస్(48; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్(62 నాటౌట్;49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్),,అంబటి రాయుడు(30 నాటౌట్; 30 బంతుల్లో 2 ఫోర్లులు రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో సన్‌రైజర్స్, రాజస్తాన్,కేకేఆర్‌లు బరిలో నిలిచాయి. మంగళవారం ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్ తర్వాత ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు కానున్నాయి. ఈ రోజు రాజస్తాన్ వర్సెస్ కేకేఆర్ జట్లలో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. కానీ లీగ్ దశలో చివరి రోజు వరకూ వేచి చూడక తప్పదు. సీఎస్కేతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్గిడి బౌలింగ్‌లో అగర్వాల్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికి రాహుల్(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ చేరాడు. ఎన్గిడి బౌలింగ్‌లోనే రాహుల్ క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించాడు. ఇక క్రిస్ గేల్(12), పూరన్(2), మన్దీప్ సింగ్(14), నీషమ్(2)లు నిరాశపరచడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ దీపక్ హుడా(62 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. సీఎస్కే బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్, శార్దూల్ ఠాకూర్, జడేజాలు తలో వికెట్ సాధించారు. సీఎస్కే ఆరు విజయాలతో టోర్నీ నుంచి ముగించింది. ఇది సీఎస్కేకు వరుసగా మూడో విజయం కావడం విశేషం. -
అదరగొట్టిన దీపక్ హుడా
అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్గిడి బౌలింగ్‌లో అగర్వాల్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికి రాహుల్(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ చేరాడు. ఎన్గిడి బౌలింగ్‌లోనే రాహుల్ క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించాడు. ఇక క్రిస్ గేల్(12), పూరన్(2), మన్దీప్ సింగ్(14), నీషమ్(2)లు నిరాశపరచడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ దీపక్ హుడా(62 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. సీఎస్కే బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్, శార్దూల్ ఠాకూర్, జడేజాలు తలో వికెట్ సాధించారు. దీపక్ హుడా మెరుపులు.. పంజాబ్ టాపార్డర్ నుంచి పెద్దగా మెరుపులు లేని సమయంలో హుడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడమే కాకుండా షాట్ల ఎంపికలో నియంత్రణ పాటించాడు. ఏ గ్యాప్‌ల్లోకి ఆడితే పరుగులు సాధించవచ్చో చూసుకుంటూ షాట్లు ఆడాడు. పంజాబ్ శిబిరంలో ఆందోళన నెలకొన్న సమయంలో హుడా తన ఇన్నింగ్స్‌తో మెరిపించాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్లో హుడాకు రెండో హాఫ్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో సాధించిన 62 పరుగులే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. ఇది పోరాడే స్కోరు కాబట్టి కింగ్స్ పంజాబ్ బౌలర్లు ఎంతవరకూ రాణిస్తారో చూడాలి. -
ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్ ఇదేనా ?
అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇది తన చివరి ఐపీఎల్ కాదనే విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. ఈ ఐపీఎల్ తర్వాత ధోని ఇక ఆడడని రూమర్లు పుట్టుకొచ్చిన నేపథ్యంలో దానిపై ధోని నుంచి స్పష్టత వచ్చింది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో భాగంగా టాస్ వేయడానికి ధోని వచ్చిన సమయంలో దీనిపై క్లారిటీ వచ్చింది. టాస్ వేసిన తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ నుంచి ఒక ప్రశ్న దూసుకొచ్చింది. ‘ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్ ఇదేనా?’ అంటూ అడిగాడు. దానికి అంతే వేగంగా ధోని బదులిచ్చాడు. ‘కచ్చితంగా కాదు’ అంటూ ధోని సమాధానమిచ్చాడు. దాంతో వరుసగా పుట్టుకొస్తున్న రూమర్లకు బ్రేక్ పడింది. వచ్చే ఐపీఎల్ కూడా తాను ఆడతాననే సంకేతాలిచ్చాడు ధోని. ఈ సీజన్లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా సీఎస్కే నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి. దాంతో ధోనిపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనికి ధోని ఇచ్చిన సమాధానంతో ముగింపు పడింది. అంతే కాకుండా ట్వీటర్లో ధోని సమాధానానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోని రిప్లై అదిరిందని సీఎస్కే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్ కింగ్స్ పంజాబ్‌కు కీలకం. రాహుల్ గ్యాంగ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ సీజన్లో ఇరుజట్లకు లీగ్ దశలో చివరి మ్యాచ్. -
రేసులో నిలవాలంటే ‘పంజా’ విసరాలి
అబుదాబి: కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. ముందుగా పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్‌గా ఇరుజట్లు 22సార్లు ముఖాముఖి పోరులో తలపడితే అందులో సీఎస్కే 13సార్లు విజయం సాధించగా, పంజాబ్ 9సార్లు గెలుపొందింది. ఇక ఇప్పటికే సీఎస్కే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించగా, కింగ్స్ పంజాబ్ ఇంకా రేసులోనే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కింగ్స్ పంజాబ్ తన ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. సీఎస్కేపై గెలిచినా మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఇంకా మూడు ప్లేఆఫ్స్ స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. అందులో నాల్గో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. దాంతో పంజాబ్ కనీసం నాల్గో స్థానంలో ఉండాలంటే ధోని సేనపై భారీ విజయం సాధించాలి. (‘అందుకే ధోనికి బిగ్ ఫ్యాన్ అయ్యా’) ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో కొనసాగుతోంది. ఇక్కడ రన్‌రేట్ -0.133గా ఉంది. అదే సమయంలో సన్‌రైజర్స్ కూడా 12 పాయింట్లతో రేసులోకి వచ్చేసింది. ఇక్కడ ఆరెంజ్ ఆర్మీ రన్‌రేట్ 0.555గా ఉంది. కింగ్స్ పంజాబ్ ఓ మంచి విజయాన్ని సాధిస్తేనే ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. నాల్గో స్థానం రేసులో సన్‌రైజర్స్, కింగ్స్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య ఎక్కువ పోటీ ఉండవచ్చు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించి, సన్‌రైజర్స్, రాజస్తాన్‌లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో(చివరి మ్యాచ్‌ల్లో) గెలిచిన పక్షంలో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే కింగ్స్ పంజాబ్ ఆడాల్సి ఉంటుంది. మరొకవైపు ధోని అండ్ గ్యాంగ్ కూడా వరుస విజయాలతో టచ్‌లోకి రావడం పంజాబ్‌ను కలవరపరుస్తోంది. (‘శ్రేయస్ అయ్యర్ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్ చాన్స్ కష్టమే’) గత ఐదు మ్యాచ్‌లకు గాను కింగ్స్ పంజాబ్ నాలుగు విజయాలు సాధించగా, సీఎస్కే రెండు విజయాలే సాధించింది. కింగ్స్ పంజాబ్ ఆడిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రాజస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. దాంతో పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కాగా, ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్(641-పంజాబ్), డుప్లెసిస్(401-సీఎస్కే), మయాంక్ అగర్వాల్(398- పంజాబ్), నికోలస్ పూరన్(351-పంజాబ్), అంబటి రాయుడు(329-సీఎస్కే)లు టాప్ ఫెర్ఫార్మెర్స్‌గా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో మహ్మద్ షమీ(20-పంజాబ్), సామ్ కరాన్(13-సీఎస్కే), రవి బిష్నోయ్(12-పంజాబ్), దీపక్ చాహర్(12-సీఎస్కే), మురుగన్ అశ్విన్(10-పంజాబ్)లు వరుసగా ఉన్నారు. -
‘శ్రేయస్ అయ్యర్ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్ చాన్స్ కష్టమే’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఘోర పరాజయం చవిచూడటం కంటే ముందుగానే సంగక్కార ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ -2020 స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానల్లో జాయిన్ అయిన సంగక్కార లైవ్ షోలో మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్ అండ్ గ్యాంగ్ బ్యాటింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఢిల్లీ పేలవమైన బ్యాటింగ్‌ను చూస్తుంటే ఆ జట్టు టాప్-4లో నిలవడం చాలా కష్టమన్నాడు. ('నేను బౌలింగ్‌కు వస్తే గేల్ సెంచరీ చేయలేడు') ‘ఢిల్లీ టాపార్డర్ బ్యాటింగ్‌లో నిలకడ కనిపించడం లేదు. వారి టాపార్డర్ రాణిస్తేనే ప్లేఆఫ్ ఆశలు పెట్టుకోవచ్చు. గ్యారంటీగా ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని చెప్పలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్లేఆఫ్ చాన్స్‌లు చాలా తక్కువ. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరింది. ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కింగ్స్ పంజాబ్ కూడా టాప్-4లో ఉంటుందనే అనుకుంటున్నా. కానీ ప్లేఆఫ్ స్థానం దక్కించుకునే నాల్గో జట్టు ఏదో చెప్పడం నాకు కష్టంగా ఉంది’ అని సంగక్కరా అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ దారుణమైన ఓటమి చవిచూసింది. దాంతో ఆ జట్టు నెట్‌రన్‌రేట్ మైనస్‌లోకి వెళ్లిపోయింది. అటు తొలుత బ్యాటింగ్‌లో నిరాశపరిచిన ఢిల్లీ, బౌలింగ్‌లో కూడా రాణించలేదు. దాంతో ముంబై ఇండియన్స్ ఈజీ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషాన్(72 నాటౌట్; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. (టాప్ లేపిన ముంబై.. చిత్తుగా ఓడిన ఢిల్లీ) -
బ్యాట్ విసిరేసిన గేల్..
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓటమి పాలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో గేల్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాల్గో బంతికి గేల్ బౌల్డ్ అయ్యాడు. బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో అసహనానికి గురైన గేల్ బ్యాట్‌ను విసిరేశాడు. సెంచరీ ముందు ఔట్ కావడంతో గేల్ తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఇలా నెర్వస్ నైన్టీస్లో పెవిలియన్ చేరడం, అందులోనే కేవలం పరుగు మాత్రమే కావాల్సిన తరుణంలో బౌల్డ్ కావడంతో గేల్ ఆ కోపాన్ని బ్యాట్‌పై చూపించాడు. ఆ తర్వాత తేరుకున్న గేల్ బ్యాట్ తీసుకుని వెళ్లి ఆర్చర్‌ను అభినందించాడు. కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్‌స్టోక్స్(50;26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్((48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించగా, రాబిన్ ఊతప్ప(30; 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్ స్మిత్(31 నాటౌట్; 20 బంతుల్లో 5 ఫోర్లు), బట్లర్( 22 నాటౌట్;11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ ఇంకా ఓవర్ ఉండగానే విజయం సాధించింది. దాంతో ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్ విజయం సాధించినట్లయ్యింది. లక్ష్య ఛేదనలో స్టోక్స్, ఊతప్పలు రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 5.3 ఓవర్లలో 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ప్రధానం స్టోక్స్ దూకుడుగా ఆడి విలువైన పరుగులు సాధించాడు. కాగా, హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత స్టోక్స్ ఔట్ కాగా, ఊతప్ప, సంజూ శాంసన్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. శాంసన్ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ప్రతీ వికెట్‌కు విలువైన భాగస్వామ్యం సాధించడంతో రాజస్తాన్ అవలీలగా గెలిచింది. -
కింగ్స్ పంజాబ్‌కు బ్రేక్
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న కింగ్స్ పంజాబ్‌కు రాజస్తాన్ రాయల్స్ అడ్డుకట్టవేసింది. కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్‌స్టోక్స్(50;26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్((48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించగా, రాబిన్ ఊతప్ప(30; 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్ స్మిత్(31 నాటౌట్; 20 బంతుల్లో 5 ఫోర్లు), బట్లర్( 22 నాటౌట్;11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్తాన్ 15 బంతులు ఉండగానే విజయం సాధించింది. దాంతో ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్ విజయం సాధించినట్లయ్యింది. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) లక్ష్య ఛేదనలో స్టోక్స్, ఊతప్పలు రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 5.3 ఓవర్లలో 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ప్రధానం స్టోక్స్ దూకుడుగా ఆడి విలువైన పరుగులు సాధించాడు. కాగా, హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత స్టోక్స్ ఔట్ కాగా, ఊతప్ప, సంజూ శాంసన్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. శాంసన్ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ప్రతీ వికెట్‌కు విలువైన భాగస్వామ్యం సాధించడంతో రాజస్తాన్ అవలీలగా గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(46;41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించడంతో పాటు పూరన్(22; 10 బంతుల్లో 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మన్దీప్ సింగ్‌లు ఆరంభించారు. కాగా, ఆడిన తొలి బంతికి మన్దీప్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి మన్దీప్.. స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, గేల్లు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించడంతో కింగ్స్ గాడిలో పడింది. ఈ జోడి తమదైన శైలిలో రాజస్తాన్‌పై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రధానంగా రాహుల్ ఔటైన తర్వాత గేల్ చెలరేగి ఆడాడు. పూరన్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, మ్యాక్స్‌వెల్‌తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు గేల్. కాగా, సెంచరీ పరుగు దూరంలో గేల్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్ నాల్గో బంతి గేల్ బ్యాట్‌ను తాకి వికెట్ల గిరాటేయడంతో పెవిలియన్ చేరాడు. -
క్రిస్ గేల్ మెరుపులు
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(46;41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించడంతో పాటు పూరన్(22; 10 బంతుల్లో 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, మన్దీప్ సింగ్‌లు ఆరంభించారు. కాగా, ఆడిన తొలి బంతికి మన్దీప్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి మన్దీప్.. స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం పంజాబ్ ఇన్నింగ్స్‌ను రాహుల్, గేల్లు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించడంతో కింగ్స్ గాడిలో పడింది. ఈ జోడి తమదైన శైలిలో రాజస్తాన్‌పై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రధానంగా రాహుల్ ఔటైన తర్వాత గేల్ చెలరేగి ఆడాడు. పూరన్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, మ్యాక్స్‌వెల్‌తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు గేల్. కాగా, సెంచరీ పరుగు దూరంలో గేల్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్ నాల్గో బంతి గేల్ బ్యాట్‌ను తాకి వికెట్ల గిరాటేయడంతో పెవిలియన్ చేరాడు. కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. -
కింగ్స్ పంజాబ్ జైత్రయాత్ర కొనసాగేనా?
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న రెండో అంచె మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 224 టార్గెట్‌ను నిర్దేశించగా, రాజస్తాన్ 19.3 ఓవర్లలో దాన్ని ఛేదించింది. ఇక ఓవరాల్‌గా ఇరుజట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరగ్గా అందులో రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. (ఈపీఎల్‌ను దాటేసిన ఐపీఎల్!) ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ 12 పాయింట్లు సాధించింది కింగ్స్ పంజాబ్. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో కింగ్స్ పంజాబ్ కూడా బరిలో నిలిచింది. ఇప్పుడు కింగ్స్ పంజాబ్ మరో విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తోంది. ఇక రాజస్తాన్ పరిస్థితి మెరుగ్గా లేదు. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో(ఈ మ్యాచ్‌తో కలుపుకుని) భారీ విజయాలు సాధించాలి. అప్పుడే అవకాశం ఉంటుంది. మరొకవైపు మిగిలిన రెండు మ్యాచ్‌లో గెలిస్తే కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచినా రేసులో ఉంటుంది. కానీ మిగిలిన జట్ల ఫలితాలపై కింగ్స్ పంజాబ్ ఆధారపడాల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ కేకేఆర్ కంటే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం. సన్‌రైజర్స్ రన్‌రేట్‌తో పోలిస్తే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాలేదు. ఈ రెండు జట్ల మధ్యే నాలుగో స్థానం కోసం అధికపోటీ ఉండవచ్చు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) ఇక ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్(595-కింగ్స్ పంజాబ్), మయాంక్ అగర్వాల్(398-కింగ్స్ పంజాబ్), నికోలస్ పూరన్(329-కింగ్స్ పంజాబ్), సంజూ శాంసన్(326-రాజస్తాన్), స్టీవ్ స్మిత్(276-రాజస్తాన్)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇరుజట్లలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో మహ్మద్ షమీ(20-కింగ్స్ పంజాబ్), జోఫ్రా ఆర్చర్(17-రాజస్తాన్), రవిబిష్నోయ్(12- కింగ్స్ పంజాబ్), శ్రేయస్ గోపాల్(9- రాజస్తాన్), మురుగన్ అశ్విన్(9-కింగ్స్ పంజాబ్)లు వరుసగా ఉన్నారు. కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ రాజస్తాన్ స్టీవ్ స్మిత్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి -
ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్‌కు వెళ్లిన తొలి జట్టుగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇక గతేడాది రన్నరప్ సీఎస్కే.. ఈ ఐపీఎల్లో లీగ్ దశలో నిష్క్రమించిన తొలి జట్టు. ఆర్సీబీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖాయం చేసుకోగా, నిన్న(గురువారం) కోల్‌కతా నైట్‌రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించడంతో ముంబై ప్లే ఆఫ్‌కు చేరింది. ఇక్కడ కేకేఆర్ ఓటమి చెందడంతోనే ముంబై నేరుగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మొదటి జట్టుగా నిలిచింది. వారి రన్‌రేట్ కూడా అన్ని జట్లు కంటే మెరుగ్గా ఉంది. ముంబై 1.186 రన్‌రేట్‌తో ఉంది. దాంతో వారు లీగ్ దశను టాప్-2తో ముగించే అవకాశం ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లలతో ఉన్న ముంబైకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ జట్లతో తలపడనుంది. (ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే..) కేకేఆర్.. కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు దాదాపు అడుగు అంటి పోయాయి. కేకేఆర్ ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లాడి 12 పాయింట్లతో ఉంది. టాప్-4లో నిలవడానికి కేకేఆర్‌కు పాయింట్ల పరంగా అవకాశం ఉన్నా నెట్రన్ రేట్ వారి బెర్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. ప్రస్తుతం కేకేఆర్ నెట్రన్ రేట్ -0.467గా ఉంది. ఒకవేళ తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచి 14 పాయింట్లతో నిలిచినా వారిపై నెట్‌రన్‌రేట్ ప్రభావం చూపనుంది. లీగ్ దశలో కేకేఆర్‌కు ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. కింగ్స్ పంజాబ్ ఈ సీజన్ ఆరంభంలో వరుస మ్యాచ్‌ల్లో చతికిలబడి ఒక్కసారి రేసులో వచ్చిన జట్టు ఏదైనా ఉందంటే అది కింగ్స్ పంజాబ్. తొలి అంచెలో విజయానికి చాలా దగ్గరగా వచ్చి పలు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన కింగ్స్ పంజాబ్.. రెండో అంచెలో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలతో దుమ్మురేపింది. మొత్తంగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు రన్‌రేట్ -0.049గా ఉంది. ఆ జట్టు ఇంకా రాజస్తాన్ రాయల్స్‌తో, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌లో గెలిస్తే కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచినా రేసులో ఉంటుంది. కానీ మిగిలిన జట్ల ఫలితాలపై కింగ్స్ పంజాబ్ ఆధారపడాల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ కేకేఆర్ కంటే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం. సన్‌రైజర్స్ రన్‌రేట్‌తో పోలిస్తే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాలేదు. ఈ రెండు జట్ల మధ్యే నాలుగో స్థానం కోసం అధికపోటీ ఉండవచ్చు. రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్ ఆరంభంలో అదరగొట్టి ఆపై అంచనాలను అందుకోలేకపోయిన జట్టు రాజస్తాన్. ప్రస్తుతం 12 మ్యాచ్‌లో ఆడి 10 పాయింట్లతో ఉంది రాజస్తాన్. ఇంకా కింగ్స్ పంజాబ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆ జట్టు ఆడాల్సి ఉంది. కానీ వారి నెట్‌రన్‌రేట్ చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతం రాజస్తాన్ రన్‌రేట్ -0.505గా ఉంది. రాజస్తాన్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా రన్‌రేట్‌పై ఆధారపడక తప్పదు. అదే సమయంలో కింగ్స్ పంజాబ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ ఓడించడమే కాకుండా సన్‌రైజర్స్ ఆడాల్సి ఉన్నా రెండు మ్యాచ్‌ల్లో ఓడితేనే రాజస్తాన్‌కు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ అందరి అంచనాలను తల్లక్రిందలు చేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లో ఆడిన ఆర్సీబీ.. 14 పాయింట్లతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోహ్లి అండ్ గ్యాంగ్.. ఇంకా సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. వారి రన్‌రేట్ 0.048తో మెరుగ్గా ఉంది. ఇక మిగిలి ఉన్న మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్ గెలిచినా ఆర్సీబీ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లో ఓడినా ఆర్సీబీకి నెట్‌రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువ. కానీ అప్పుడు అది వారి నెట్‌రన్‌రేట్‌పై ప్రభావం చూసుకోవాలి. భారీ ఓటములు ఎదురైతే మాత్రం అప్పుడు అది వారి నెట్‌రన్‌రేట్‌పై ప్రభావం చూపనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో ఇరగదీసిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ముందుగా ఢిల్లీని ప్లేఆఫ్ చేరుతుందని భావించారు. కానీ ఇంకా ఢిల్లీ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోలేదు. ప్రస్తుతం 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. 14 పాయింట్లతో ఉంది. వారి రన్‌రేట్‌గా కూడా మెరుగ్గానే ఉంది. ఢిల్లీ రన్‌రేట్ 0.030గా ఉండటంతో ఆ జట్టు టాప్-4లో ఉండే అవకాశాలు ఎక్కువ. అప్పుడు రన్‌రేట్ తగ్గకుండా చూసుకోవడమే కాకుండా రేసులో ఉన్న జట్లు భారీ తేడాతో గెలవకుండా ఉంంది. ఇటీవల సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తరహా ఓటములు వస్తేనే ఢిల్లీ ప్లేఆఫ్ బెర్తు కష్టం అవుతుంది. ముంబై ఇండియన్స్, రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో ఢిల్లీ తన మిగిలిన లీగ్ మ్యాచ్‌ల్లో తలపడనుంది. ప్రస్తుతానికి ఢిల్లీ సేఫ్జోన్లో ఉన్నట్లే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు కాస్త క్లిష్టంగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన వార్నర్ సేన 10 పాయింట్లతో ఉంది. అంటే రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో ఆర్సీబీ, ఢిల్లీ, కింగ్స్ పంజాబ్ జట్లలో కనీసం ఒక జట్టు 16 పాయింట్లతో ఉండకూడదు. అప్పుడు సన్‌రైజర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్‌రేట్ 0.396గా ఉంది. అంటే కింగ్స్ పంజాబ్ కంటే మెరుగ్గా ఉంది సన్‌రైజర్స్. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, ఢిల్లీల కంటే సన్‌రైజర్స్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం. ఇది నిలబడాలంటే మిగిలిని రెండు మ్యాచ్‌ల్లో గెలిచి తీరాలి. సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌లతో తలపడనుంది. -
వారిదే టైటిల్.. ఆర్చర్ జోస్యం నిజమయ్యేనా?
దుబాయ్: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్‌తోనే కాదు.. తన ట్వీట్ల ద్వారాను ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఆర్చర్ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో అతని ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్లో ఏది జరిగినా ఆర్చర్ ముందే చెప్పాడనే ట్వీట్ మన ముంగిట నిలుస్తూ ఉంటుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది ఆర్చర్‌కే తెలియాలి. నిజంగానే ఆర్చర్ టైమ్ మిషీన్ ఉందా అని ప్రశ్న కూడా అభిమానులు మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. (సల్మాన్ పాత ట్వీట్ వైరల్!) ప్రస్తుత ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ రాజస్తాన్ తరఫున ఆడుతున్న ఆర్చర్ ఒక అద్భుతమైన క్యాచ్‌ను పట్టాడు. కార్తీక్ త్యాగి వేసిన 11 ఓవర్ నాల్గో బంతిని భారీ షాట్ ఆడిన ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్.. బౌండరీ లైన్ కు కాస్త ముందు ఆర్చర్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ క్యాచ్‌ను పట్టడం కష్టసాధ్యమనుకున్న తరుణంలో ఆర్చర్ దాన్ని అందుకుని శభాష్ అనిపించాడు. అసాధారణమైన క్యాచ్‌లను పట్టడం క్రికెట్లో ఒకటైతే, ఈ విషయాన్ని ఆర్చర్ దాన్ని ముందుగా చెప్పడమే ఆసక్తికరంగా మారింది. 2014లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అది ‘క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్’ అని ఆర్చర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. వారిదే టైటిల్.. ఆర్చర్ జోస్యం ఐపీఎల్ 13 సీజన్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సీజన్ టైటిల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుస్తుందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జోస్యం చెప్పాడు. అయితే ఈ ఇంగ్లండ్ పేసర్ చెప్పింది ఇప్పుడు కాదు... ఆరేళ్ల క్రితం. కింగ్స్ పంజాబ్ టైటిల్ గెలుస్తుందని 2014లో ట్వీట్ చేశాడు. ఆర్చర్ 2014లో చేసిన ట్వీట్ కింగ్స్ పంజాబ్ ఇటీవలే రీ ట్వీట్ చేసింది. కింగ్స్ పంబాబ్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌ల్లో గెలవగా, అందులో ఐదు వరుసగా గెలిచినవే. వరుస ఐదు ఓటముల తర్వాత పంజాబ్ పుంజుకుని ఇలా ప్లే ఆఫ్ రేసులోకి రావడంతో పంజాబ్‌దే టైటిల్‌ను అంతా అనుకుంటున్నారు. 2014లో ఫైనల్‌కు చేరిన కింగ్స్ పంజాబ్.. కేకేఆర్ చేతిలో చతికిలబడింది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ను కింగ్స్ పంజాబ్ ఎగురేసుకుపోతుందని ఒక సెక్షన్ వర్గం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అంత సీన్లేదని అంటున్నారు. ప్రధానంగా సెకండ్ లెగ్‌లో కింగ్స్ పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అదే సమయంలో ఆర్చర్ ఎప్పుడో ట్వీట్ చేసిన మరొకసారి ప్రత్యక్షం కావడం, దాన్ని కింగ్స్ పంజాబ్ రీట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మరి పంజాబ్ టైటిల్ గెలుస్తుందా.. ఆర్చర్ జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. ఆర్చర్ జోస్యం నిజమవుతుందా.. లేదా అనేది కూడా కింగ్స్ పంజాబ్‌కు ప్రశ్నగానే ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆర్చర్ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది కింగ్స్ పంజాబ్.(వచ్చే ఏడాది కూడా ధోనీ సారథ్యంలోనే!) #Jofradamus at it again 🔮#SaddaPunjab #IPL2020 #KXIP #KXIPvSRH https://t.co/UI6jrPl03B — Kings XI Punjab (@lionsdenkxip) October 24, 2020 -
కింగ్స్ పంజాబ్ జైత్రయాత్ర
షార్జా: వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్ పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుని రేసులోకి వచ్చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేసి 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్(28;25 బంతుల్లో 4ఫోర్లు), మన్దీప్ సింగ్(66 నాటౌట్; 56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), గేల్((51; 28 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)లు ఆకట్టుకున్నారు. కింగ్స్ 47 పరుగుల వద్ద రాహుల్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత మన్దీప్ సింగ్, క్రిస్ గేల్లు మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. క్రిస్ గేల్ 25 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది కింగ్స్ పంజాబ్‌కు ఆరో విజయం కాగా, కేకేఆర్‌కు ఇది ఆరో ఓటమి.ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత కింగ్స్ పంజాబ్ నాల్గో స్థానానికి చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ తొలుత ఫీల్డింగ్ తీసుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, నితీష్ రాణాలు ఆరంభించారు.కాగా, మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రాణా డకౌట్ అయ్యాడు. మొదటి ఓవర్ రెండో బంతికే రాణా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్లో రాహుల్ త్రిపాఠి(7), దినేశ్ కార్తీక్(0)లు ఔటయ్యారు. మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్ నాల్గో బంతికి త్రిపాఠి ఔట్ కాగా, ఆఖరి బంతికి కార్తీక్ డకౌట్ అయ్యాడు. దాంతో కేకేఆర్ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో గిల్‌కు జత కలిసిన ఇయాన్ మోర్గాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 81 పరుగులు చేయడంతో కేకేఆర్ తేరుకుంది. మోర్గాన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. ఆపై నరైన్(6),నాగర్కోటి(6), కమిన్స్(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఇక గిల్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లతో 57 పరుగులు సాధించాడు. చివర్లో ఫెర్గ్యూసన్(24 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించాడు. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్ తీశారు. -
ఆదుకున్న గిల్, మోర్గాన్
షార్జా: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ తొలుత ఫీల్డింగ్ తీసుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, నితీష్ రాణాలు ఆరంభించారు.కాగా, మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రాణా డకౌట్ అయ్యాడు. మొదటి ఓవర్ రెండో బంతికే రాణా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్లో రాహుల్ త్రిపాఠి(7), దినేశ్ కార్తీక్(0)లు ఔటయ్యారు. మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్ నాల్గో బంతికి త్రిపాఠి ఔట్ కాగా, ఆఖరి బంతికి కార్తీక్ డకౌట్ అయ్యాడు. దాంతో కేకేఆర్ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో గిల్‌కు జత కలిసిన ఇయాన్ మోర్గాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 81 పరుగులు చేయడంతో కేకేఆర్ తేరుకుంది. మోర్గాన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. ఆపై నరైన్(6),నాగర్కోటి(6), కమిన్స్(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఇక గిల్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లతో 57 పరుగులు సాధించాడు. చివర్లో ఫెర్గ్యూసన్(24 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్ తీశారు. -
ఫస్ట్ బ్యాటింగ్ జట్టుకు కష్టాలు తప్పవా?
షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో కేకేఆర్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేసి 164 సాధిస్తే, కింగ్స్ పంజాబ్ 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కేకేఆర్ 11మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించగా, కింగ్స్ పంజాబ్ 11 మ్యాచ్‌లకు ఐదు విజయాలు నమోదు చేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది. మరొకవైపు ఈ మ్యాచ్ గెలిచి మరో మెట్టు ఎక్కాలని కేకేఆర్ యోచిస్తోంది. ఏది ఏమైనా ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. కాగా, ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు కష్టాలు తప్పవని పిచ్ రిపోర్ట్‌ను బట్టి అర్థమవుతుంది. పిచ్ స్లోగా ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే టాస్ గెలిచిన రాహుల్ ముందుగా ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపాడు.ఇదే విషయాన్ని టాస్ వేసిన క్రమంలో రాహుల్ స్పష్టం చేశాడు. ఛేదించే క్రమంలో బోర్డుపై ఎంత స్కోరు ఉందో తెలిస్తే గేమ్ ప్లాన్ సక్రమంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నాడు. ఇదిలాఉంచితే, ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఎటువంటి మార్పులు లేకుండా గత మ్యాచ్‌లో జట్టునే కొనసాగిస్తున్నాయి. ఇక ఓవరాల్‌గా ఇరుజట్లు 26సార్లు ముఖాముఖి పోరులో తలపడితే కేకేఆర్ 18సార్లు విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 8మ్యాచ్‌ల్లో గెలిచింది. 2014లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తుదిపోరులో కేకేఆర్ గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్ ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి దూసుకుపోతుండగా, కేకేఆర్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్(567-కింగ్స్ పంజాబ్), మయాంక్ అగర్వాల్(398- కింగ్స్ పంజాబ్), నికోలస్ పూరన్(327- కింగ్స్ పంజాబ్), శుబ్‌మన్ గిల్(321-కేకేఆర్), ఇయాన్ మోర్గాన్(295- కేకేఆర్)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇరుజట్లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మహ్మద్ షమీ(17-కింగ్స్ పంజాబ్), వరుణ్ చక్రవర్తి(12-కేకేఆర్), రవి బిష్నోయ్(10-కింగ్స్ పంజాబ్)లు వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహుల్ వర్సెస్ వరుణ్ ఈ మ్యాచ్‌లో రాహుల్-వరుణ్ చక్రవర్తిల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు. రాహుల్ బ్యాటింగ్‌లో దుమ్ములేపుతుంటే, వరుణ్ బౌలింగ్‌లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్లు సాధించి కేకేఆర్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ 133.41 స్టైక్‌రేట్‌తో పాటు 63 యావరేజ్‌తో ఉండగా, వరుణ్ 7.05 ఎకానమీతో కొనసాగుతున్నాడు. దాంతో వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. కేకేఆర్ ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, లూకీ ఫెర్గ్యూసన్, నాగర్కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ -
శభాష్ అనిల్ కుంబ్లే: గావస్కర్
న్యూఢిల్లీ: వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్ రేసు ఆశల్ని సజీవంగా ఉంచుకున్న కింగ్స్ పంజాబ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఒక్కసారిగా రేసులోకి వచ్చేసిన పంజాబ్ పోరాట స్ఫూర్తితో దూసుకుపోవడానికి కోచ్ అనిల్ కుంబ్లేనే కారణమని గావస్కర్ కొనియాడాడు. తన క్రికెట్ కెరీర్లో ఏ విధంగా అయితే పోరాటం చేశాడో, అదే స్ఫూర్తితోనే జట్టులోకి నింపాడని గావస్కర్ ప్రశంసించాడు. స్టార్ స్పోర్స్ క్రికెట్ లైవ్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘ కింగ్స్ పంజాబ్ వరుస విజయాల్లో కుంబ్లే రోల్‌ను మరచిపోకూడదు. కుంబ్లే ఒక పోరాట యోధుడు. అది అతని క్రికెట్ కెరీర్లో చాలా దగ్గరగా చూశాం. తల పగిలినప్పుడు కూడా కట్టుకట్టుకుని బౌలింగ్ వేసి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. (ధోని ఈజ్ బ్యాక్: సెహ్వాగ్) ఇప్పుడు కింగ్స్ పంజాబ్‌లో కూడా అదే అంకిత భావాన్ని నింపుతున్నాడు కుంబ్లే. అసాధ్యమనుకున్న పరిస్థితుల్ని నుంచి కింగ్స్ పంజాబ్‌ను గాడిలో పెట్టాడు. ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ రేసులోకి వచ్చింది’ అని గావస్కర్ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో 126 పరుగుల్ని కూడా కాపాడుకుని విజయాన్ని సాధించడం పంజాబ్ ఆటగాళ్లలో గెలవాలి అనే కసే కారణమన్నాడు. అందుకు వారిలో అనిల్ కుంబ్లే నింపిన స్ఫూర్తే ప్రధాన కారణంగా గావస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక కింగ్స పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై కూడా గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్సీ పాత్రలో రాహుల్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడో మనం చూస్తున్న మ్యాచ్‌లే ఉదాహరణ అని తెలిపాడు.బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడమే కాకుండా, ఫీల్డింగ్‌లో మార్పులు, బౌలింగ్ చేయిస్తున్న విధానం రాహుల్ కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడు అనడాన్ని చూపెడుతుందన్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను అర్షదీప్‌కు ఇవ్వడంలో రాహుల్ కెప్టెన్సీ చాతుర్యం కనబడిందన్నాడు. ఎస్ఆర్హెచ్ 14 పరుగులు చేయాల్సిన సమయంలో అర్షదీప్‌ను బౌలింగ్‌కు ఉపయోగించి సక్సెస్ కావడం రాహుల్‌లోని కెప్టెన్సీ పరిణితికి నిదర్శమన్నాడు. (బ్రేక్‌లో ఒక ప్లేయర్‌ను మిస్సయ్యాం..!) -
భారమైన హృదయంతో బరిలోకి దిగాడు..
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ అనూహ్య విజయం సాధించింది. సన్‌రైజర్స్ గెలుస్తుందనుకునే తరుణంలో కింగ్స్ పంజాబ్ అద్భుతం చేసింది. 14 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు సాధించిన పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్‌కు విశ్రాంతినిచ్చి మన్దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మన్దీప్ 17 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌కు భారమైన హృదయంతోనే మన్దీప్ సిద్ధమయ్యాడు. అతని తండ్రి, మాజీ అథ్లెటిక్స్ హర్దేవ్ సింగ్ శుక్రవారం రాత్రి చనిపోయారు. అయితే స్వస్థలం వెళ్లలేని స్థితిలో ఉన్న మనదీప్ సింగ్.. అతని తండ్రి చివరి చూపును వీడియో కాల్‌లోనే చూసి నివాళులు అర్పించాడు. శనివారం నాటి మ్యాచ్‌లో మన్దీప్ తండ్రి మృతికి సంతాపంగా పంజాబ్ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో మయాంక్ గాయపడటంతో మన్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మన్దీప్ జట్టుకోసం ఓపెనర్‌గా బరిలోకి దిగాడని కింగ్స్ పంజాబ్ కొనియాడింది. ఇక మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రాతో పాటు సచిన్ టెండూల్కర్లు కూడా మన్‌దీప్‌ను కొనియాడారు. ఎంతో గుండె నిబ్బరం ఉన్న మన్దీప్ జట్టుకోసం సిద్ధం కావడం అతని అంకితభావానికి, ధైర్యానికి నిదర్శనమన్నాడు. ‘ మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధిస్తుంది. ఆ వ్యక్తికి తుది వీడ్కోలు చెప్పలేకపోతే ఇంకా కలిచివేస్తుంది. మన్‌దీప్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’ అని సచిన్ తెలిపాడు. ఇక కేకేఆర్ ఆటగాడు నితీష్ రాణా మావయ్య సురిందర్ సింగ్ కూడా రెండు రోజుల క్రితం మరణించారు. ఈ రెండు కుటుంబాలు విషాదం నుండి కోలుకోవాలని సచిన్ ఆకాంక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్ కూడా మన్‌దీప్‌ను కొనియాడుతున్నారు. కుటుంబంలో విషాదం నెలకొని ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్ ఆడటం అతని చేసే పనిలో ఎంతటి అంకిత భావం ఉందో తెలియజేస్తుందని అభిమానులు కీర్తిస్తున్నారు. -
ఏం చేస్తాం.. మరిచిపోవడం తప్పితే..: వార్నర్
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చతికిలబడిన సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. కింగ్స్ పంజాబ్ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్ ఆర్మీ తేలిపోయింది. సన్‌రైజర్స్ 24 బంతుల్లో(నాలుగు ఓవర్లలో) 27 పరుగులు చేయాల్సిన తరుణంలో మనీష్ పాండే-విజయ్ శంకర్లు క్రీజ్‌లో ఉన్నారు. కానీ 14 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్ పరాజయాం పాలైంది. (ధోని చెప్పింది నిజమే కదా.. ఇప్పుడేమంటారు!) మ్యాచ్ తర్వాత ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ..’ ఇది మమ్మల్ని తీవ్ర గాయం చేసింది. చాలా ఘోరమైన ఓటమి. బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయాం. మేము ఒత్తిడిని అధిగమించలేకపోయాం. రానురాను పిచ్ కఠినతరం అవుతుందని అనిపించింది. కానీ ఇది స్వల్ప టార్గెట్. దాన్ని ఛేదించలేకపోయాం. ఏ దశలోనూ లైన్‌ను దాటలేకపోయాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కింగ్స్ పంజాబ్‌ను కట్టడి చేశారు. మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అసాధారణం. వారు గేమ్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేశారు. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలం కావడంతో పరాజయం చెందాం. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోవడం బాధగా ఉంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయాం. ఏం చేస్తాం.. మరిచిపోయి ముందుకు సాగడం తప్పితే’ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్ ఆర్మీ తేలిపోయింది. అర్షదీప్ సింగ్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి విజయ్ శంకర్(26; 27 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్ కావడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. జోర్డాన్ వేసిన 19 ఓవర్ మూడో బంతికి హోల్డర్(5) ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి.ఆ తరుణంలో చివరి ఓవర్ వేసిన అర్షదీప్ పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ విజయం సాధించగా, సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. -
ఒత్తిడిలో వార్నర్ సేన చిత్తు.. పంజాబ్ భళా
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చతికిలబడిన సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. కింగ్స్ పంజాబ్ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో ఆరెంజ్ ఆర్మీ తేలిపోయింది. అర్షదీప్ సింగ్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి విజయ్ శంకర్(26; 27 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్ కావడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. జోర్డాన్ వేసిన 19 ఓవర్ మూడో బంతికి హోల్డర్(5) ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఆ తరుణంలో చివరి ఓవర్ వేసిన అర్షదీప్ పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ విజయం సాధించగా, సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, జోర్డాన్లు తలో మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయ్లకు వికెట్ చొప్పున లభించింది. ఇది కింగ్స్ పంజాబ్‌కు ఐదో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి. ఇది కింగ్స్ పంజాబ్‌కు వరుసగా నాల్గో విజయం కావడం విశేషం. తాజా విజయంతో కింగ్స్ పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, హైదరాబాద్ పరిస్థితి క్లిష్టంగా మారింది.(100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్) మనీష్ ఔటే టర్నింగ్ పాయింట్ మనీష్ పాండే ఔట్ అయ్యే సమయానికి సన్‌రైజర్స్‌కు 27 పరుగులు అవసరం . క్రిస్ జోర్డాన్ వేసిన 17 ఓవర్ తొలి బంతిని వైడ్ వేయగా అక్కడ పరుగు వచ్చింది. ఆ తర్వాత అదే బంతికి మనీష్ పాండే భారీ షాట్ ఆడాడు. అది సిక్స్‌గా మారే చివరి నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్క జంప్‌తో దాన్ని క్యాచ్ తీసుకున్నాడు. బౌండరీ లైన్ చాలా సమీపంగా వెళ్లిన సుచిత్ క్యాచ్ పట్టిన తీరు శభాష్ అనిపించింది. అక్కడే మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఆపై ఎవరూ కూడా ఆడే యత్నం చేయలేకపోవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను ఆరెంజ్ ఆర్మీ చేజార్చుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌ను డేవిడ్ వార్నర్-బెయిర్ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత చేసిన తర్వాత వార్నర్(35; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. స్పిన్నర్ రవి బిష్నోయ్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి రాహుల్‌కు క్యాచ్ వార్నర్ ఔటయ్యాడు. ఆపై వెంటనే బెయిర్ స్టో(19; 20 బంతుల్లో 4ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మురుగన్ అశ్విన్ వేసిన ఎనిమిదో ఓవర్ రెండో బంతికి బెయిర్ స్టో బౌల్డ్ అయ్యాడు. అబ్దుల్ సామద్(7; 5 బంతుల్లో 1 ఫోర్) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దాంతో 67 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది సన్‌రైజర్స్. ఆ తరుణంలో మనీష్ పాండేకు విజయ్ శంకర్ జత కలిశాడు. వీరిద్దరూ 33 పరుగుల జత చేసిన తర్వాత మనీష్ పాండే పెవిలియన్ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో వికెట్లను చేజార్చుకుని పరాజయం పాలైంది. 19.5 ఓవర్లలో 114 పరుగులకే సన్‌రైజర్స్ చాపచుట్టేసింది. ఆరుగురు సన్‌రైజర్స్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో పంజాబ్‌కు బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మనదీప్ సింగ్‌లు ఆరంభించారు. మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్దీప్ సింగ్(17) నిరాశపరిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్-క్రిస్ గేల్ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్(20;20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హోల్డర్ వేసిన 10 ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయిన గేల్.. వార్నర్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. ఆపై తదుపరి ఓవర్లో రాహుల్(27; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కింగ్స్ తిరిగి తేరుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్(12), దీపక్ హుడా(0), క్రిస్ జోర్డాన్(7), మురుగన్ అశ్విన్(4)లు విఫలయ్యారు. కాగా, నికోలస్ పూరన్(32 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో వంద పరుగుల మార్కును చేరింది కింగ్స్ పంజాబ్. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా విఫలమైన బ్యాట్స్మెన్లలో కింగ్స్ పంజాబ్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఒకడు. గతంలో ఎప్పుడూ చూడని మ్యాక్స్‌వెల్‌ను ప్రస్తుత ఐపీఎల్ చూస్తున్నామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడూ తన విధ్వంసకర ఆట తీరుతో ప్రత్యర్థులకు దడ పుట్టించే మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ ఐపీఎల్లో పూర్తిగా తేలిపోయాడు. మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో దిగుతున్నాడంటే భయపడే బౌలర్లు.. మ్యాక్సీనే కదా అనే స్థాయికి వచ్చేశాడు. ఏదో నాలుగైదు బంతులు ఆడి మనోడే వికెట్‌ను ఇస్తాడులే అనేంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. (‘ఇదొక భయంకరమైన పవర్ ప్లే’) ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్ వంద బంతులను మాత్రమే ఆడాడు. అంటే మ్యాచ్‌కు వచ్చి సగటున పది బంతులు మాత్రమే ఆడిన ఘనత మ్యాక్సీది. ఇక్కడ మ్యాక్స్‌వెల్ చేసిన పరుగులు 102. ఈరోజు(శనివారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మ్యాక్సీ 13 బంతులాడి 12 పరుగులు చేశాడు. దాంతో ఓవరాల్‌గా ఈ సీజన్లో వంద బంతుల్ని ఎదుర్కోవడంతో పాటు వంద పరుగుల్ని కూడా కష్టపడి పూర్తి చేసుకున్నాడు. పించ్ హిట్టర్లలో ఒకడైన మ్యాక్సీ 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం. ఒక జట్టు ఎంతో నమ్మకంతో వరుసపెట్టి అవకాశాలు ఇస్తుంటే మనోడేమో ఇలా పేలవ ప్రదర్శనతో పంజాబ్ పరాజయాల్లో భాగమవుతున్నాడు. ఎవరైనా విజయాల్లో భాగమైతే అతనిపై ఆయా జట్లు కూడా నమ్మకం ఉంచుతాయి. మరి మ్యాక్సీ విఫలం కావడం అతని అంతర్జాతీయ కెరీర్‌పైనే కాకుండా లీగ్‌ల్లో కూడా ప్రభావం చూపడం ఖాయం. కాగా, నేటి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్(32 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. -
ఎస్ఆర్హెచ్ టార్గెట్ 127
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, మనదీప్ సింగ్‌లు ఆరంభించారు. మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్దీప్ సింగ్(17) నిరాశపరిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రాహుల్-క్రిస్ గేల్ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్(20;20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హోల్డర్ వేసిన 10 ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయిన గేల్.. వార్నర్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. ఆపై తదుపరి ఓవర్లో రాహుల్(27; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కింగ్స్ తిరిగి తేరుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్(12), దీపక్ హుడా(0), క్రిస్ జోర్డాన్(7), మురుగన్ అశ్విన్(4)లు విఫలయ్యారు. కాగా, నికోలస్ పూరన్(32 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
మయాంక్ అగర్వాల్ దూరం
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసి 201 పరుగులు చేయగా, కింగ్స్ పంజాబ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య ఓవరాల్‌గా 15 మ్యాచ్‌లు జరగ్గా అందులో ఎస్ఆర్హెచ్ 11 సార్లు విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 4 విజయాలు మాత్రమే అందుకుంది. ఈ సీజన్లో ఇరుజట్లు ఇప్పటివరకూ తలో 10 మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి. దాంతో ఇక నుంచి ప్రతీ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఒక మార్పు చేసింది నదీమ్ స్థానంలో ఖలీల్‌ను జట్టులోకి తీసుకుంది.మరొకవైపు కింగ్స్ పంజాబ్ రెండు మార్పులు చేసింది. మయాంక్ అగర్వాల్, జిమ్మీ నీషమ్‌లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్ల మన్దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్‌లను తుది జట్టులోకి తీసుకుంది. ఇరుజట్ల మధ్య స్టార్ ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా జరగవచ్చు. కింగ్స్ పంజాబ్ జట్టు బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్(540), మయాంక్ అగర్వాల్(398), పూరన్(295)లు టాప్ ఫెర్ఫామర్స్గా ఉండగా బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ(16), రవి బిష్నోయ్(9), మురుగన్ అశ్విన్(7)లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరొకవైపు సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ విభాగంలో డేవిడ్ వార్నర్(335), జోనీ బెయిర్ స్టో(326), మనీష్ పాండే(295)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్ విషయానికొస్తే రషీద్ ఖాన్(12), నటరాజన్(11), ఖలీల్ అహ్మద్(8)లు టాప్ ఫెర్మమర్స్గా ఉన్నారు. ప్రధానంగా స్పిన్నర్ రషీద్ ఖాన్ మంచి ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థి ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో సాహసం చేయడానికి భయపడుతున్నారు. వార్నర్ వర్సెస్ షమీ ఈ రోజు ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో వార్నర్-షమీల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. సన్‌రైజర్స్ జట్టులో వార్నర్ టాప్ స్కోరర్‌గా ఉండగా, కింగ్స్ పంజాబ్ జట్టు షమీ టాప్ బౌలర్‌గా ఉన్నాడు. ఈ ఐపీఎల్లో వార్నర్ ఆడపా దడపా మెరుస్తూ ఉండటంతో అతని స్టైక్‌రేట్ అంత బాలేదు. కేవలం 124.07 స్టైక్‌రేట్‌తో మాత్రమే వార్నర్ ఉన్నాడు. ఇది టీ20 మ్యాచ్‌ల్లో ఆకర్షణీయమైన స్టైక్‌రేట్ కాదు. ఇక షమీ ఎకానమీ 8.43గా ఉంది. దాంతో షమీ బౌలింగ్‌లో వార్నర్ ఎంతవరకూ రాణిస్తాడనేది ఆసక్తికరం.