Land Mobilization
-
జంక్షన్ల వద్ద మరింత భూసేకరణ
►వారిద్దరు అన్నదమ్ములు.. రాష్ట్ర రహదారిని ఆనుకుని వారికి 15 ఎకరాల పొలం ఉంది. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఆ రహదారిని క్రాస్ చేసే చోట నిర్మించే కూడలికి తొలుత 50 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు ప్రాథమిక అలైన్‌మెంటు రూపొందించారు. దీనివల్ల ఆ అన్నదమ్ములు తమ పొలంలో ఐదెకరాలు కోల్పోవాల్సి వస్తుందని తేలింది. అన్నదమ్ములు పోనీలే అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఆ జంక్షన్‌ను మరింత పెద్దదిగా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో వారు తమ మొత్తం పొలం కోల్పోవాల్సి వస్తోంది. ►ఆయనో వ్యాపారి.. జాతీయ రహదారికి చేరువలో ఆయనకు కొంత ఖాళీ స్థలం, ఓ మిల్లు ఉంది. ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసే చోట నిర్మించే ఇంటర్ ఛేంజర్‌కు 63 ఎకరాలు కావాల్సి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. ఈ మేరకు రూపొందించిన అలైన్మెంటులో ఆ వ్యాపారి స్థలం కూడా ఉంది. దీంతో తన మిల్లుకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆ స్థలం మినహాయించినా సరిపోతుందని భావించిన అధికారులు ఓ ప్లాన్ రూపొందించారు. కానీ తాజాగా విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఆయనకున్న ఖాళీ స్థలంతోపాటు మిల్లు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ ఛేంజర్ల డిజైన్ మారటం.. వాటికి చేరువగా ఉన్న భూ యజమానులపై పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. కొత్తగా విడుదలైన గెజిట్ నోటిఫికేషన్లు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముందనుకున్న ప్లాన్‌ను మారి ఉన్నట్టుండి కొత్త ప్లాన్ తెరపైకి రావటం, భారీగా భూ సమీకరణ చేయాల్సిన పరిస్థితి తలెత్తడమే ఇందుకు కారణం. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ కసరత్తును వేగవంతం చేసిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఇందుకోసం ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓల పరిధితో కూడిన ఎనిమిది క్లస్టర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటికి వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉండగా.. గత ఏప్రిల్‌లో మూడు, రెండు రోజుల క్రితం నాలుగు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ల వివరాలు చూసి, జంక్షన్లకు చేరువగా ఉన్న కొందరు భూ యజమానులు లబోదిబోమంటున్నారు. 11 చోట్ల ఇంటర్ ఛేంజర్లు రింగురోడ్డు ఉత్తరభాగంలో 11 చోట్ల ఇంటర్ ఛేంజ్ నిర్మాణాలు (జంక్షన్లు) రానున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇతర రోడ్లను క్రాస్ చేసే చోట జంక్షన్లు నిర్మిస్తారు. ఒక్కో జంక్షన్ 50 నుంచి 60 ఎకరాలలో ఉండేలా తొలుత డిజైన్ చేశారు. వాటిని ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. సాధారణంగా జంక్షన్ల వద్ద వాహనాలు 30 కి.మీ. వేగానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఔటర్ రింగురోడ్డు కూడళ్లపై నిర్మించిన ఇంటర్ చేంజర్లను అలాగే డిజైన్ చేశారు. కానీ ఆర్ఆర్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే అయినందున ఇంటర్ ఛేంజర్లపై వాటి వేగం 50 నుంచి 60 కి.మీ. వరకు ఉండేలా చూడాలని తాజాగా నిర్ణయించిన అధికారులు ఇంటర్ ఛేంజర్ల డిజైన్లను మార్చారు. చాలా దూరం నుంచే మలుపు ఉండేలా చేయటంతో ఒక్కో జంక్షన్ విస్తీర్ణం 70 నుంచి 80 ఎకరాలకు పెరిగింది. ఈ మేరకు అక్కడ భూమిని సమీకరించాల్సి వచ్చింది. తాజాగా విడుదలైన గెజిట్లలో ఈ విషయం గుర్తించి, భూములు కోల్పోతున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎనిమిదో గెజిట్ నోటిఫికేషనూ విడుదల ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియకు పచ్చజెండా ఊపే చివరి 8వ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. తూప్రాన్ ఆర్డీఓ పరిధిలో దాతర్‌పల్లె, గుండారెడ్డి పల్లె, ఇస్లాంపూర్, కిష్టాపూర్, నాగులపల్లె, నర్సంపల్లె, వట్టూరు, వెంకటాయపల్లె గ్రామాలకు సంబంధించిన 176.6176 హెక్టార్ల మేర భూమిని సేకరించేందుకు అనుమతినిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన 158.64 కి.మీ. నిడివితో రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ప్రక్రియకు అనుమతినిస్తూ 3 ఏ గెజిట్ నోటిఫికేషన్లు అన్నీ విడుదల అయినట్టయింది. -
అసైన్డ్ భూముల్లో
► నగరాలు, పట్టణ శివార్లలోని అసైన్డ్ భూములు చాలావరకు పడావుగా ఉన్నాయి. నీటి వనరులు తగ్గిపోవడం, చుట్టుపక్కల పొలాలు రియల్ ఎస్టేట్ బూమ్‌లో ప్లాట్లుగా మారిపోవడంతో నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. వాటిల్లో లబ్ధిదారులు వ్యవసాయం చేయలేని స్థితి, ఆ భూములను అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ► ఇలా పడావు పడిన అసైన్డ్ భూములను గుర్తించిన ప్రభుత్వం వాటిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవాలనుకుంటోంది. అయితే అసైన్డ్ భూములను లబ్ధిదారులు నేరుగా అమ్ముకునేందుకు వీల్లేదు. అందుకే అసైనీల ఆమోదంతో ఆ భూముల్లో లే అవుట్లను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ► సమీకరిస్తున్న భూములకు ప్రతిఫలంగా అసైన్డ్ భూముల లబ్ధిదారులకు ఒక్కో ఎకరానికి 600–800 చ.గ. చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ► అసైన్డ్ భూముల్లోని అభివృద్ధి చేసిన లే అవుట్లలో ప్లాట్లను అసైనీలకు కేటాయించడం ద్వారా వాటిని వారు విక్రయించుకునే అవకాశం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దశాబ్దాల కిందట భూములు లేని నిరుపేదలకు ప్రభుత్వం లభ్యత ఆధారంగా ఒకటి నుంచి మూడెకరాల వరకు అసైన్డ్ భూములుగా పంపిణీ చేసింది. అయితే ఈ భూములు చాలావరకు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాల కోసం బలవంతంగా అయినా ఈ భూములను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించినా, రైతుల నుంచి వ్యతిరేకత రావడం, బలవంతంగా తీసుకోవడంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొంత వెనక్కి తగ్గింది. తాజాగా అసైనీల (ప్రభుత్వం నుంచి అసైన్డ్ భూములు పొందినవారు) సమ్మతితోనే ల్యాండ్ పూలింగ్ జరపాలనే నిర్ణయానికి వచ్చింది. ప్లాట్లు, ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో అసైన్డ్ భూములను సమీకరించి, ప్రభుత్వమే లే అవుట్లు అభివృద్ధి చేసి సామాన్య ప్రజలకు విక్రయించనుంది. కనీసం 25 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ఇలాంటి ప్రాజెక్టులను అభివృద్ధి పరచాలని భావిస్తోంది. అభివృద్ధి చేసిన లేఅవుట్లో 800 చదరపు గజాల ప్లాటు విలువ భారీగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ లేఅవుట్లు కావడంతో ఆదరణ ప్రైవేట్ లే–అవుట్లలో రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే, సరైన రీతిలో అభివృద్ధి చేయకుండానే.. ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటున్నారు. ఇలాంటి ప్లాట్లను కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్లతో పాటు ఇంటి నిర్మాణ అనుమతులు పొందడానికి ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు కట్టి ఎల్ఆర్ఎస్ కింద ఈ ప్లాట్లను తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తామే అస్సైన్డ్ భూములను క్రమపద్ధతిలో అభివృద్ధి చేయడం వల్ల నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ చేసే లే అవుట్లు కావడం వల్ల ప్లాట్లకు ఆదరణ బాగా ఉంటుందని, అటు లబ్ధిదారులకు, ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా సమకూరుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి లే అవుట్లలో రహదారులు, మంచినీటి పైపులైను, ఖాళీ స్థలాలు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ స్థంభాలు, ఈ లేఅవుట్లకు అనుసంధానంగా రహదారుల ఏర్పాటు పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే చేపడ్తారు. ఎలాంటి వివాదం లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయనుండడంతో కొనుగోలు దారులకు టైటిల్ గ్యారెంటీ సైతం లభించనుంది. ప్లాట్లకు డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాల్లో తొలుతగా ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తొలుత ఈ జిల్లాల్లోనే.. తొలుత రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని డిమాండ్ ఉన్న పట్టణాల సమీపంలో లే అవుట్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 6,470 ఎకరాల అస్సైన్డ్ భూములున్నాయి. హైదరాబాద్ శివార్లలోని కుంట్లూరు, మోకిల, తుర్కయాంజాల్, కుమ్మరిగూడ, గుర్రంగూడ, గుండ్లపోచంపల్లి తదితర ప్రాంతాల్లో ఈ లే అవుట్ల అభివృద్ధికి సిద్ధమైంది. ఉప్పల్ భగాయత్‌లో సేకరించిన ప్రైవేట్ భూముల యజమానులకు ఒక ఎకరానికి 1,000 నుంచి 1,200 చదరపు గజాల చొప్పున ప్లాట్లను హెచ్ఎండీఏ కేటాయించింది. -
పేదల ద్రోహి చంద్రబాబు
తాడికొండ: బడుగు బలహీన వర్గాలకు రాజధాని ప్రాంతంలో నిలువ నీడ లేకుండా చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సత్యన్నారాయణ విమర్శించారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు ఆయన బుధవారం మద్దతు ప్రకటించారు. రాజధాని భూ సమీకరణ పేరుతో దళితుల లంక, అసైన్డ్ భూములను లాక్కుని నిలువ నీడ లేకుండా చేశాడన్నారు. ఎన్ఆర్ఐ నిధులతో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్న చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో ప్రజాదరణ లేకే ఓటమి పాలయ్యాడనే నిజం తెలుసుకోవాలని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమష్టిగా అభివృద్ధి, వికేంద్రీకరణ జరుగుతుందనే మూడు రాజధానులకు భారీ మద్దతు వస్తోందన్నారు. పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు ముస్లిం యువకులకు వేసిన బేడీల సంగతేంటి బాబూ.. మూడు రాజధానుల ఉద్యమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులతో పేద ఎస్సీ, మహిళలపై దాడులు చేయించింది చాలక, దాడిచేసిన వారిని అరెస్టు చేస్తే రైతులకు బేడీలు వేశారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆలిండియా ఇత్తెహాదుల్ ముస్లీమీన్ రాష్ట్ర యూత్ లీడర్ సయ్యద్ దాదాపీర్ విమర్శించారు. తన గుంటూరు సభలో ముస్లిం యువకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసు బనాయించి బేడీలు వేసి జైళ్లలో పెట్టిన విషయం గుర్తులేదా అని ప్రశి్నంచారు. దీక్షలకు ఏఐఎంఐఎం ప్రకాశం జిల్లాల జాయింట్ సెక్రటరీ ఉస్మాన్ ఘనీ, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్, మైలాలీ, సల్మాన్, మేఘశ్యామ్ తదితరులు సంఘీభావం తెలిపారు. దళిత నేతలు నత్తా యోనరాజు, చెట్టే రాజు, పరిశపోగు శ్రీనివాసరావు, పిడతల అభిõÙక్, సుభాíÙణి, బూదాల సలోమి, సుధారాణి, సౌమ్య, బేతపూడి సాంబయ్య, పులి దాసు, గంజి రాజేంద్ర, కొలకలూరి లోకేష్, ఈపూరి ఆదాం, లకుమీ పద్మకుమార్, దానయ్య తదితరులు పాల్గొన్నారు.కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేస్తుండడం విశేషం. -
‘పీవోటీ’ని ఉల్లంఘించి థర్డ్ పార్టీలకు ప్లాట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూ సమీకరణ ప్రక్రియలో పీవోటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఎస్సీలు, ఇతర బలహీన వర్గాలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన వ్యవసాయ భూములకు బదులుగా కొందరు థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘రాజధాని అమరావతి’పై సోమవారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి బొత్స మాట్లాడారు. అసైన్డ్ భూమి కలిగి ఉన్న వ్యక్తులు తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చినా ప్రామాణికంగా తీసుకొని ఆ భూమికి బదులుగా థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని, ఇది పూర్తిగా పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. 455 మంది అసైన్డ్ రైతులకు సంబంధించి 289 ఎకరాల భూమికి బదులుగా 1,68,300 చదరపు అడుగుల మేర ప్లాట్లు ధర్డ్ పార్టీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలిందన్నారు. కమిటీ సూచనల ప్రకారమే నిర్ణయం భూ సమీకరణలో పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వం ఎస్సీ, బలహీన వర్గాలకు చేసిన అన్యాయాలను సరిదిద్దేందుకు అలాంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని బొత్స చెప్పారు. గుంటూరు– విజయవాడ మధ్య ఉండే సారవంతమైన భూముల్లో రాజధాని ఏర్పాటు సరైంది కాదని శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా సూచించిందని బొత్స గుర్తు చేశారు. అది భవన నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదని కూడా కమిటీ సూచించిందని, ఆ కమిటీ చెప్పినట్టే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి 102 అడుగుల మేర పునాదులు వేయాల్సి రావడం వాస్తవం కాదా? అని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి ప్రణాళికల సమీక్ష, రాజధానితోపాటు మొత్తం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సమగ్ర వ్యూహాలను సూచించేందుకు నలుగురు నిపుణులతో కమిటీని నియమించినట్లు మంత్రి వివరించారు. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ఆర్ కన్వీనర్‌గా ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగానే రాజధానిపై ఏ నిర్ణయమైనా ఉంటుందని మంత్రి వివరించారు. దురాక్రమణ, అవినీతి, దోపిడీ సీఆర్డీఏ పరిధిలోని మొత్తం 2,600 ఎకరాల అసైన్డ్ భూములపై విచారణ కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిని మొదట 217 చదరపు కిలోమీటర్లగా నిర్ధారించి తర్వాత చంద్రబాబు వియ్యంకుడికి భూ కేటాయింపులపై గత ప్రభుత్వం జీవో విడుదల చేశాక వారికి ప్రయోజనం చేకూర్చేలా సీఆర్డీఏ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో దురాక్రమణ, అవినీతి, దోపీడీ జరిగిందని చెప్పారు. -
ఉరేసుకొని చస్తాం..
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంత రైతుల్లో ప్రభుత్వం మళ్లీ అలజడి సృష్టిస్తోంది. సర్వేలంటూ, హైటెన్షన్ వైర్లంటూ రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇప్పటికే భూ సమీకరణతో వేలాది ఎకరాలను బీడు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు అరకొరగా మిగిలిన భూముల్లో కూడా పంటలు సాగుచేసుకోనివ్వకుండా దారుణంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంట పొలాల మీదుగా హైటెన్షన్ వైర్లు లాగడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ స్థలాల్లో గానీ, ఇళ్ల మీదుగా కానీ ఇలాంటి విద్యుత్ వైర్లు వేయగలరా? అంటూ అధికారులను నిలదీశారు. అయినా కూడా వారు వెనక్కి తగ్గకపోవడంతో.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతులు బెదిరించారు. వివరాలు.. రాజధాని ప్రాంతం ముంపునకు గురవకుండా ఇరిగేషన్ శాఖ రూ.240 కోట్లతో కృష్ణానదిపై కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం నులకపేట 130 కె.వి సబ్‌స్టేషన్ నుంచి గుంటూరు చానల్ మీదుగా హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేశారు. కొండవీటి వాగు వద్దకు వచ్చేసరికి రైతుల పంట పొలాలు, స్థలాల మీదుగా హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైతులు గతంలో కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో తాత్కాలికంగా పనులు విరమించిన ఇరిగేషన్ శాఖ అధికారులు.. మళ్లీ మంగళవారం రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పొలాల్లోంచి హైటెన్షన్ వైర్లను లాగడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడకు చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. ఎక్కడో పైన వెళ్లే వైర్లను ఆపడానికి మీరెవరంటూ రైతులను ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రశ్నించగా.. మీ స్థలాలు, ఇళ్ల మీదుగా ఇలాంటి భారీ కరెంటు వైర్లు వెళుతుంటే ఊరుకుంటారా అంటూ నిలదీశారు. ఇక్కడ ఉన్న అర ఎకరం, ఎకరం భూములను ఐదారుగురు పంచుకోవాల్సి ఉందని, ఇది అగ్రికల్చరల్ భూమి కాదని.. మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదంటూ అభ్యంతరం తెలిపారు. రాజధాని నిర్మాణానికి మా భూములు ఇవ్వబోమంటూ గతంలో కోర్టును ఆశ్రయించామని.. అలాంటి భూముల్లో ఎలా వైర్లు ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి.. రైతులను అక్కడ్నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో మా పొలాల మీదుగా వైర్లు లాగితే వాటికే ఉరేసుకొని చస్తామని రైతులు స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళితే అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తిరిగి వెళ్లిపోయారు. మెట్రో రైల్ సర్వే కోసమంటూ.. మైట్రో రైల్ సర్వే కోసమంటూ వచ్చి హడావుడి చేసిన కొందర్ని ఉండవల్లి రైతులు మంగళవారం అడ్డుకున్నారు. ఓ సర్వే సంస్థకు చెందిన బృందం మంగళవారం ఉదయం పొలాలను ఇష్టం వచ్చినట్టు తొక్కుతూ తిరుగుతుండటంతో.. అక్కడ ఉన్న ఇద్దరు రైతులు వారిని నిలదీశారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులున్నాయని.. అడ్డుకుంటే అడ్డుకుంటే ఇబ్బందులు పడతారంటూ వారు బెదిరింపులకు దిగారు. దీంతో రైతులు వారిని పొలాల్లోంచి బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఇంతలో ఈ విషయం తెలిసిన గ్రామ రైతులు భారీగా అక్కడకు చేరుకున్నారు. తాము ప్రభుత్వానికి భూములివ్వలేదని.. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నందున సర్వే చేయవద్దంటూ వారికి తేల్చిచెప్పారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. వారిని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు. మళ్లీ వస్తే కేసులు పెడతామంటూ రైతులు సర్వే బృందాన్ని హెచ్చరించారు. -
600 కోట్లకు మోగిన గంటా
-
రూ.600 కోట్లకు ‘గంటా’రావం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని పేదలకు చెందిన విలువైన 358 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసి వాటి ద్వారా రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఆ ప్రాంత మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి రంగం సిద్ధం చేశారు. గతంలోనే ఇందుకు ప్రయత్నించగా విషయం రచ్చవడంతో అప్పట్లో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఆయన తన ప్రయత్నాలు మానలేదు. తెరవెనక మంత్రాంగం కొనసాగించారు. బినామీ పేర్లతో వాటిని కొనేసిన మంత్రి వాటిని చట్టబద్ధం చేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించారు. భూసమీకరణ పేరిట విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు ఈ భూములు అప్పగించి.. అందుకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లను సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నారు. ఇందుకోసం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘చినబాబు’తో మాట్లాడి రంగం సిద్ధం చేసుకున్నారు. తద్వారా రూ.600 కోట్లకుపైగా అప్పనంగా కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రతిపాదనకు సీఎం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం. అసైన్డ్ భూములను కొనుగోలు చేసి... విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, పెందుర్తి, ఆనందపురం మండలాల పరిధిలో సుమారు 358 ఎకరాల అసైన్డ్ భూములను మంత్రి గంటా శ్రీనివాసరావు బినామీ(బంధువులు, సంస్థ ఉద్యోగుల) పేర్లతో చట్టవిరుద్ధంగా కారుచౌకగా కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములను అమ్మడానికి, కొనడానికి వీలులేదని ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్(పీఓటీ) చట్టం స్పష్టంగా చెబుతోంది. పీఓటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూముల్ని కొనడం నేరం. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ‘‘ఈ భూములను వుడా తీసుకుంటోంది. ఇది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన అసైన్డ్ భూమి అయినందున వుడా నష్టపరిహారం ఇవ్వకుండా ఉచితంగా లాగేసుకుంటుంది. మాకు ఇస్తే ఎకరాకు రూ.లక్ష ఇస్తాం.. అంటూ మంత్రి బంధువులు, ఆయనకు చెందిన సంస్థలోని ఉద్యోగులతో ప్రచారం చేయించడం ద్వారా అసైనీల్లో భయం సృష్టించారు. దీంతో ఊరికే భూములు పోగొట్టుకోవడంకంటే ఎంతో కొంత తీసుకుని విక్రయించడం మేలనే భావనతో ఎకరా రూ.లక్ష నుంచి లక్షా ఇరవై వేల ధరతో అమ్మేశారు. మొత్తం 358 ఎకరాలను రూ.40 కోట్లలోపు మొత్తానికే మంత్రి బినామీ పేర్లతో కైవసం చేసుకున్నారు. ఇందులో భాగంగా రికార్డులను సైతం తారుమారు చేశారు. ఈ భూముల్ని అమ్ముకుంటే రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లదాకా వస్తుంది. అయితే పీఓటీ చట్టం ప్రకారం అమ్ముకోవడం వీలుకాదు. అందువల్ల ఈ భూమిని వుడాకు సమీకరణ కింద కట్టబెట్టి వుడా నుంచి ఎకరాకు 1,120 గజాల చొప్పున ప్లాట్లు తీసుకోవాలని మంత్రి పథకం రూపొందించారు. ఇలా తీసుకున్న ప్లాట్లు మంత్రి బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయి. దీంతో చట్టబద్ధంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. తమ చేతికి మట్టి అంటనివిధంగా వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మేరకు భూసమీకరణ కింద ఈ భూములను తీసుకోవాలని వుడాపై ఒత్తిడి తెచ్చారు. ‘చినబాబు’ నుంచి కూడా ఒత్తిడి రావడంతో వుడా మౌఖికంగా అంగీకరించింది. సీఎం గ్రీన్‌సిగ్నల్ వుడా భూసమీకరణకు అనుమతించాలని విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ గత నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కోరగా సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘గతంలో ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ వుడా భూ సమీకరణ ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపడం గమనార్హం. రూ.40 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్లకుపైగా రాబడి.. భూసమీకరణ కింద మంత్రి బినామీల నుంచి 358 ఎకరాలను సమీకరించినందుకు ప్రతిగా వుడా వారికి ఎకరాకు 1,120 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలని ప్రతిపాదనలతో గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు రావడం, విశాఖ ప్రాంతానికి చెందిన మరో మంత్రి స్వయంగా మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయడంతో ఇది ఆగిపోయింది. అయితే ఇప్పుడు గత ప్రతిపాదనల ప్రకారమే ముందుకు వెళుతున్నారు. ఆ మేరకు 358 ఎకరాల సమీకరణకుగాను భూయజమానులైన బినామీలకు వుడా 4,00,960 గజాల మేరకు ప్లాట్లను ఇవ్వాల్సి ఉంటుంది. వుడా ఇవ్వడానికి ప్రతిపాదించిన ప్రాంతంలో గజం విలువ రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంది. కనిష్ట ధరను ప్రామాణికంగా తీసుకున్నా గజానికి రూ.15,000 ప్రకారం 400960 గజాలకు రూ.601.44 కోట్లు అవుతుంది. మధ్యస్తంగా గజం రూ.17,000 ధరతో విక్రయిస్తే రూ.681.63 కోట్లు వస్తుంది. ఏతావాతా రూ.40 కోట్లతో మంత్రి కొట్టేసిన అసైన్డ్ భూమిని వుడాకు కట్టబెట్టడం ద్వారా ఆయన కొట్టేసే మొత్తం రూ.600 కోట్లుపైమాటే. ఇందులో చినబాబు, మంత్రి పంచుకోగా మిగిలిన దానిలో కొంత మొత్తాన్ని ఎన్నికల ఖర్చుకోసం ఇస్తామని మంత్రివర్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై ఇక రాద్ధాంతం చేయవద్దని చినబాబు మరో మంత్రికి హితవు పలికినట్టు సమాచారం. -
శెట్టిపల్లి భూముల జోలికి రావొద్దు: పవన్
సాక్షి, తిరుపతి/అమరావతి: తిరుపతి సమీపంలోని శెట్టిపల్లిలో గ్రామస్తులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల జోలికి రావొద్దంటూ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. బుధవారం ఆయన శెట్టిపల్లిలో రైతులు, గ్రామస్తులతో సమావేశమై భూముల వివరాలడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ తమ భూములను ఇవ్వొద్దని, బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేలకోట్ల దోచుకుంటూ, పేదల భూములనూ లాక్కుంటారా? అని ప్రశ్నించారు. పట్టాలిస్తామని గ్రామదేవతపై ప్రమాణం చేసి ఇప్పుడు ఆర్థికనగరం పేరుతో భూ సమీకరణ అని భూములు లాగేసుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హౌస్ ఫర్ ఆల్లో పైసా వసూల్
► ఇళ్లు ఇప్పిస్తామని టీడీపీ నాయకుల వసూళ్ల పర్వం ► భూమి సమీకరణ పూర్తికాకముందే ఆర్భాటంగా శంకుస్థాపన ► అర్హుల నిర్ధారణకు బృందాల విచారణను అడ్డుకుంటున్న వైనం ► ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు ► 6,630 ఇళ్లకు గాను తొలి విడతలో 3 వేల ఇళ్లు మాత్రమే నిర్మాణం సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో ఇళ్లు లేని నిరుపేదలందరికీ బహుళ అంతస్థుల సముదాయంలో ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటించారు. పథకానికి ఈ ఏడాది జూన్ 19వ తేదీన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు హడావుడిగా శంకుస్థాపన చేశారు. 54 ఎకరాల్లో 6,630 గృహాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం టిడ్కో సంస్థకు 54 ఎకరాల భూమి అప్పగించి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, కొంత భూమి కోర్ట వివాదంలో ఉండటంతో కేవలం 24 ఎకరాల భూమి మాత్రమే అప్పగించింది. శంకుస్థాపన చేసి రెండు నెలలు దాటుతున్నా భూమిని అప్పగించకపోవడంతో ఇప్పటివరకూ పనులు ప్రారంభించనే లేదు. ప్రస్తుతం పనులు దక్కించుకున్న టిడ్కో సంస్థ అప్పగించిన 24 ఎకరాలనే చదును చేసి 3 వేల గృహాలు నిర్మించనుంది. వివాదం ఎప్పుడు తేలుతుందో? మిగతా భూమి ఎప్పుడు అప్పగిస్తారో తెలియని పరిస్థితి. మిగతా 3,630 గృహాల నిర్మాణం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. మరో 3,370 నిర్మాణాలు? రెండో విడతలో మరో 3,370 గృహాలు నిర్మిస్తామంటూ అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భూసమీకరణ మాత్రం ఇప్పటికీ సమస్యగానే ఉంది. వీరికి అడవి తక్కెళ్లపాడులో స్థలం లేకపోవడంతో చౌడవరం, మరో విలీన గ్రామంలో స్థలం సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి చెల్లింపులు ఇలా.. ఈ పథకానికి సింగిల్ బెడ్రూమ్ అయితే లబ్ధిదారుడు రూ. 50 వేలు, డబుల్ బెడ్రూం అయితే రూ. లక్ష చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల రాయితీ లభిస్తుంది. మిగతా నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వీటిని లబ్ధిదారుడు నెలనెలా చెల్లించాల్సి ఉంటుంది. అక్రమాలు బయటపడతాయని విచారణ అడ్డగింపు.. పదివేల మందితో కూడిన లబ్ధిదారుల జాబితాపై విచారణ జరిపేందుకు గాను నగరపాలక సంస్థ పరిధిలో 16 బృందాలు ఏర్పడ్డాయి. విచారణ జరిపితే తమకు అనుకూలంగా అనర్హులకు ఎక్కడ ఇళ్లు రాకుండా పోతాయోనన్న భయంతో టీడీపీ డివిజన్‌స్థాయి నాయకులు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా ఆపుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే లబ్ధిదారులు ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకూ బొక్కేసిన టీడీపీ నాయకులు జాబితా ప్రకటించక ముందే వారి నుంచి డీడీలుసైతం సేకరించారని తెలుస్తోంది. డీడీలు ఇవ్వకపోతే ఇల్లు రాదేమోననే భయంతో లబ్ధిదారులు డీడీలు తీసి మరీ అధికార పార్టీ నేతలకు అప్పగించడం మమనార్హం. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందా? లేదా? అసలు ఇల్లు ఎక్కడ ఇస్తారు? అనే సమాచారంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. 24 ఎకరాల్లో 3 వేల ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు.. హౌస్ ఫర్ ఆల్ ద్వారా మొదటి విడతలో 54 ఎకరాల్లో 6,630 గృహాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశాం. ప్రతిపాదిత భూమిలో కొంత కోర్టు వివాదాల్లో ఉండటంతో కేవలం 24 ఎకరాల్లో ప్రస్తుతం 3 వేల ఇళ్లు మాత్రమే నిర్మిస్తున్నాం. ఈలోపు మిగతా భూమి కూడా అప్పగిస్తే రెండో విడత ప్రారంభిస్తాం. మరో 3,370 గృహాలు నిర్మిస్తాం. అధికారులు ఇప్పటికే అన్వేషణలో ఉన్నారు. భూమి సమీకరించగానే టెండర్లు పిలుస్తాం. – టిడ్కో ఎస్ఈ కోటేశ్వరరావు -
రాజధానిలో మలివిడత పూలింగ్
సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంత రైతుల నుంచి ఇప్పటికే 33,000 ఎకరాలను భూ సమీకరణ విధానంలో తీసుకున్న రాష్ర్ట ప్రభుత్వం మలి విడతలో మరో 14 వేల ఎకరాల భూములు సమీకరించేందుకు నిర్ణయించింది. శుక్రవారం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజధాని అంతర్ వలయ రహదారి (ఇన్నర్ రింగ్‌రోడ్డు) నిర్మాణానికి 14 వేల ఎకరాలను జూలై తరువాత మలివిడత ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునేందుకు సిద్ధమవ్వాలని సీఆర్డీఏ అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో ఉన్న తన మనవణ్ణి చూడటానికి శని, ఆదివారాల్లో కూడా వెళ్లకుండా అమరావతి బ్రాండింగ్ కోసం ఇక్కడే ఉంటున్నానని సీఎం అన్నారు. సచివాలయం ఆర్కిటెక్ట్‌గా ఫోస్టర్ ప్లస్ కన్సార్టియం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే అమరావతి పరిపాలన నగరంలో జరిగే పనులకు 40 శాతం లేబర్ కాంపౌనెంట్ ఏరియా అలవెన్స్ వర్తింపజేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 918 ఎకరాల్లో నిర్మిస్తున్న పరిపాలన నగరం ఫోస్టర్ ప్లస్ పార్టనర్స్ అండ్ కన్సార్టియం మాస్టర్ ప్లాన్, డిజైన్ అందిస్తోందన్నారు. -
పెనుమాక భూములపై సర్కారుకు చెంపపెట్టు
-
బలవంతపు భూసేకరణకు బ్రేక్
- పెనుమాక భూములపై యథాతథస్థితి - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - సామాజిక ప్రభావ అంచనా చేపట్టాలి - రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి - ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం - 251 మంది పెనుమాక రైతులకు ఊరట - చంద్రబాబు సర్కారుకు చెంపపెట్టు సాక్షి, హైదరాబాద్/తాడేపల్లి రూరల్ (మంగళగిరి) : రాజధాని పేరుతో.. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం కోసం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణకు ప్రయత్నాలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది. గుంటూరు జిల్లా, పెనుమాక గ్రామ రైతులను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా యథాతథస్థితి (స్టేటస్కో)ని కొనసాగించా లని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కొన్ని నెలలుగా పోరాడుతున్న రైతులకు ఊరట లభించినట్లయింది. 2013 భూ సేకరణ చట్ట నిబంధనలను అనుసరించి సామాజిక ప్రభావ అంచనా (ఎస్ఈఎస్) చేపట్టడంతో పాటు, భూ సేకరణ నోటిఫికేషన్‌పై బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలతో రైతులు దాఖలు చేసిన పిటిషన్లను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా భూ సేకరణ కోసం ప్రభుత్వం ఈ నెల 11న జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పెనుమాకకు చెందిన 251 మంది రైతులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి విచారణ చేపట్టారు. తూతూమంత్రంగా గ్రామసభలు, సర్వేలు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు చట్ట నిబంధనల ప్రకారం పలు విధి విధానాలను అనుసరించాల్సి ఉందని, అయితే ప్రభుత్వం వాటిని విస్మరించిందని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీకి ముందు సామాజిక ప్రభావ అంచనా చేపట్టాల్సి ఉండగా, అది కూడా చేయలేదన్నారు. ఇక గ్రామసభల నిర్వహణ, క్షేత్రస్థాయి సర్వేలు తదితర వాటన్నింటినీ తూతూ మంత్రంగా ఒక్క రోజులోనే ముగించిందని ఆయన కోర్టుకు నివేదించారు. తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్ వాదనలు వినిపిస్తూ, తాము జారీ చేసింది కేవలం ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమేనన్నారు. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాల స్వీకరణకు తమకు చట్ట ప్రకారం 60 రోజుల గడువు ఉందని ఆయన తెలిపారు. పిటిషనర్లు తెలియచేసే అభ్యంతరాలను తప్పక పరిగణనలోకి తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం పూర్తి చేయాల్సిన అన్ని విధి విధానాలను పూర్తి చేసిన తరువాతనే తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సామాజిక ప్రభావ అంచనా చేపట్టి, భూ సేకరణపై రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటివరకు రైతుల భూముల విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని స్పష్టం చేస్తూ ఈ వ్యాజ్యాలను పరిష్కరించారు. భూమి కోసం పెనుమాక రైతుల పోరాటం.. స్వచ్ఛంద భూ సమీకరణ అంటూ పైకి చెబుతూనే రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో రైతులను సీఆర్డీఏ అధికా రులు రకరకాలుగా భయభ్రాంతుల కు గురి చేశారు. దీంతో తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన 670 ఎకరాల యజమానులు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. సామాజిక సర్వేలు నిర్వహించకుండానే నిర్వహించినట్టు చిత్రీకరించడం, జరీబు భూములను మెట్ట గా చూపించి మోసగించే ప్రయత్నం చేయడంతో రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై కోర్టును ఆశ్రయించారు. కోర్టు చీవాట్లతో సీఆర్డీఏ అధికారులు పెనుమాకలో రైతులతో సమావేశం నిర్వహించారు.దీనికి హాజరైన ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి సామాజిక సర్వే వివరాలు తెలపాలని కోరడంతో సర్వే బృందం తూతూ మంత్రంగా లెక్కలు చూపించింది. రైతులు ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్ని ఇళ్లు పోతున్నాయనే వివరాల పత్రాలను వైఎస్సార్సీపీ నేతలు చూపించడంతో నివ్వెరబోయిన అధికారు లు సమావేశం వాయిదా వేసి పరార య్యారు.దాంతో సీఆర్డీఏ అధికారుల తప్పుడు సర్వే పత్రాలను రైతులు అక్కడే దహనం చేశారు. ఉండవల్లిలో సైతం ఇదే తీరు ఎదురుకావడంతో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో రైతులు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఆదేశాలను జారీచేసింది. -
సమీకరణకివ్వని భూములన్నీ గ్రీన్‌బెల్టులు: బాబు
సాక్షి, అమరావతి: రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణలో బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగకుండా, సర్కారు ‘రియల్’ వ్యాపారానికి ఎదురొడ్డి నిలిచిన రైతులపై కక్షసాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములు అప్పగించని రాజధాని రైతుల భూములను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జరిగిన సమీక్షలో సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఆ భూముల్లో వ్యవసాయం మినహా ఏ ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు వీల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం నుంచి రాజధాని వరకు 3.8 కిలోమీటర్ల మేర కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థ.. నమస్కార ముద్ర, కూచిపూడి నృత్య భంగిమ ముద్ర, కూచిపూడి అరల ముద్ర, పువ్వు ఆకారంలో రెండతస్తుల వారధి, అమరావతి స్థూపం, కొండపల్లి బొమ్మ ఆకారంలో డిజైన్లను చూపించింది. అయితే కూచిపూడి ముద్ర, పువ్వు డిజైన్‌ను కలిపి రెండంతస్తుల వారధికి తుదిరూపు ఇవ్వాలని బాబు ఎల్ అండ్ టీకి సూచించారు. -
ప్లాట్ల ఆప్షన్లకు 15 రోజుల గడువు
29 గ్రామాల్లో 9.18(ఎ), 9.18(బి) ఫారాల పంపిణీ సాక్షి, విజయవాడ బ్యూరో: భూ సమీకరణకు భూములిచ్చిన రైతులు తమకు ఏ తరహా ప్లాట్లు కావాలో కోరుకునేందుకు సీఆర్డీఏ గురువారం నుంచి 15 రోజుల గడువు ఇచ్చింది. ఇందుకోసం 9.18(ఎ), 9.18(బి) ఫారమ్స్‌ను 29 గ్రామాల్లో పంపిణీ చేయిస్తోంది. తన వాటా ఏకమొత్తం ప్లాటు కావాలంటే 9.18(ఎ), కామన్ ప్లాట్ కావాలంటే 9.18(బి) ఫారమ్‌ను పూర్తి చేయాలి. రైతులు తనకు రావాల్సిన నివాస, వాణిజ్య ప్లాట్లను అర్హత మేరకు అతిపెద్ద ప్రామాణిక ప్లాటుగా గాని, లేకపోతే వివిధ సైజుల్లో ఉన్న ప్రామాణిక ప్లాటుగానీ కోరుకోవచ్చు. 15 రోజుల్లోపు రైతులు ఆప్షన్లు తెలుపుతూ ఏ ఫారమ్ ఇవ్వకపోతే అర్హతల ప్రకారం వారికొచ్చే ప్రామాణిక ప్లాటును, మిగిలిన విస్తీర్ణానికి చిన్న ముక్కల ప్లాట్లలో వాటా కేటాయిస్తారు. -
‘రాజధాని ప్లాట్ల కేటాయింపు’ ఖరారు
సాక్షి, విజయవాడ బ్యూరో: భూ సమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. నివాస, వాణిజ్య స్థలాలను ఏయే రైతులకు ఎలా ఇవ్వాలో నిర్ణయించింది. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్డీఏ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాట్ల కేటాయింపు విధానానికి అంగీకారం తెలిపారు. ఒక రెవెన్యూ గ్రామంలో భూములిచ్చిన రైతులకు అదే గ్రామంలో నివాస, వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మెట్ట భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో, జరీబు భూములిచ్చిన వారికి జరీబు ప్లాట్లు ఇవ్వనున్నారు. తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకిచ్చిన మాట ప్రకారం రైతులకు అదనంగా మరో 50 గజాల వాణిజ్య స్థలాన్ని ఇస్తూ కేటాయింపులు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతులకిచ్చే లే అవుట్లలో నివాస స్థలాలు 120 చదరపు గజాల నుంచి నాలుగు వేల చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో, వాణిజ్య స్థలాలు 30 గజాల విస్తీర్ణం నుంచి ప్రారంభించి నాలుగు వేల గజాల వరకు వివిధ సైజుల్లో ఇవ్వడానికి సిద్ధం చేసిన ప్రణాళికను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఒకవేళ ఎవరైనా రైతుకు దక్కాల్సిన ప్లాటు 120 గజాల కన్నా (ప్లాటు కనీస సైజు) తక్కువగా ఉన్న పక్షంలో అలాంటి రైతులు కొందరిని కలిపి వారికి ఉమ్మడి ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ ప్లాట్లను వేలం వేసి వచ్చే సొమ్మును రైతుల వాటా ప్రకారం పంచుతారు. ఒకవేళ ఎవరైనా ఉమ్మడి ప్లాటు వద్దనుకుంటే అభివృద్ధి హక్కు కలిగి, అమ్ముకునేందుకు వీలుండే (టీడీఆర్) బాండ్లు తీసుకునే వెసులుబాటును రైతులకు ఇవ్వనున్నారు. -
బలవంతపు భూసేకరణపై ప్రత్యక్ష పోరు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని పేరిట జరుగుతున్న బలవంతపు భూసమీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) నిర్ణయించింది. చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 33 వేల ఎకరాల సారవంతమైన భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నట్టు ధ్వజమెత్తింది. సంఘం 29వ జాతీయ మహాసభల్లో భాగం గా శుక్రవారం ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై చర్చ జరిగింది. రైతులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ ఖరారు చేయాలని తీర్మానించింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి అనుగుణంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలని రాష్ట్రాల ప్రతినిధులు చెప్పారు. ఏపీలో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి గుంజుకుని కార్పొరేట్ శక్తులకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెడుతోందని, రైతులకు కనీస పరిహారం కూడా చెల్లించడం లేదని ఏపీ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ బ్యాంక్ పేరిట పేదల భూములకు ఎసరు పెడుతోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టు వివరించారు. రైతులకు పెన్షన్ ఇవ్వాలి 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాలని మహాసభ డిమాండ్ చేసింది. పంటలు పండక, అప్పుల ఊబిలో చిక్కుకుని తల్లడిల్లుతున్న రైతును ఆదుకోవడంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని తీర్మానించింది. కేంద్రబడ్జెట్లో వ్యవసాయానికి తీరని అన్యాయం జరిగిందని, వడ్డీ రాయితీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడాన్ని ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో సుమారు ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రైతు కుటుం బాన్నీ కేంద్రం ఆదుకోలేదని అతుల్‌కుమార్ అంజన్ ఆరోపించారు. పార్లమెంటులో గంటల కొద్దీ సమయాన్ని వృధా చేస్తున్న పార్టీలు రైతు ఆత్మహత్యలపై కనీసం గంట సేపూ చర్చించకపోవడాన్ని తప్పుబట్టారు. నివేదికపై మాట్లాడిన వారిలో రైతు సంఘం ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, గుండా మల్లేష్, ప్రబోధ్ పాండా తదితరులున్నారు. మహాసభ సందర్భంగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణమండపంలో ‘వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు, రాయితీలు’ అంశంపై జరిగే జాతీయ సదస్సుకు ఉప రాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ హాజరవుతారు. -
తుళ్లూరు మండలంలో నేడు వైఎస్ జగన్ పర్యటన
-
తుళ్లూరు మండలంలో నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం తుళ్లూరు మండలం మల్కాపురం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదనే కారణంతో మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె చినచంద్రశేఖర్ అనే రైతుకు చెందిన 4 ఎకరాల 79 సెంట్లలోని చెరకు తోటను కొందరు దుండగులు గురువారం రాత్రి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో రాజధాని నిర్మాణానికి భూములివ్వని అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది డిసెంబర్లో భూ సమీకరణ విధానాన్ని వ్యతిరేకించిన ఐదు గ్రామాలకు చెందిన 13 మంది రైతుల పొలాల్లో వారి వ్యవసాయ పరికరాలను దుండగులు తగులబెట్టారు. ఆ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఆ కేసులో కూడా పోలీసులు ఎలాంటి చ ర్యలు తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో గురువారం అగ్నికి ఆహుతైన పంట పొలాన్ని పరిశీ లించడమే కాకుండా బాధిత రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లైఓవర్
సాక్షి, విజయవాడ బ్యూరో : గన్నవరం విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో ఆయన రాజధాని వ్యవహారాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విమానాశ్రయ అప్రోచ్ రోడ్డును హైవే వరకు నాలుగు లైన్లుగా విస్తరించి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. హైవే, విమానాశ్రయం ట్రాఫిక్‌కు సంబంధం లేకుండా ఉండేలా దీన్ని నిర్మించాలని చెప్పారు. భారీ విమానాలు ఆగేందుకు వీలుగా రన్‌వే విస్తరణ కోసం ఏలూరు కాలువను ఏడు కిలోమీటర్లు మళ్లించే పనులను 40 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెండు ఆర్ అండ్ బీ రోడ్లను మూడు కిలోమీటర్ల మేర మళ్లించే పనులను 45 రోజుల్లో చేయాలని సూచించారు. విశాఖపట్నం - విజయవాడ, చెన్నై - నెల్లూరు, విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారులను ఆరు వరుసలుగా విస్తరించాలని చెప్పారు. ఇందుకోసం వెంటనే సవివర నివేదికలు తయారు చేయాలని సీఎం హైవే అధికారులకు సూచించారు. పండుగలా రాజధాని శంకుస్థాపన... అక్టోబర్ 22వ తేదీన రాజధాని శంకుస్థాపనను పండుగలా చేయాలని, ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య మంత్రి ఈ కార్యక్రమానికి వస్తున్నారని సీఎంతెలిపారు. శంకుస్థాపన పైలాన్ భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఉండాలని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఒక పార్కుగా తయారుచేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 29 రాజధాని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని, దానిలో గ్రామస్తులకు ఉపాధికి దొరుకుతుందని తెలిపారు. గ్రామకంఠాలకు ఆనుకుని ఉన్న 8వేల ఎకరాలను భూసమీకరణ కింద ఇస్తామని పెదపరిమి, హరిశ్చంద్రపురం, వడ్డమాను గ్రామాల రైతులు ముందుకు వచ్చారని, దీన్ని పరిశీలించాలని సీఆర్డీఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కార్యాలయాల తరలింపును వేగవంతం చేయాలని, అధికారులకు అవసరమైన నివాస సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. -
పదేళ్లలో రూ.53,547 కోట్లు..!
రాజధాని నిర్మాణానికి బడ్జెట్ లెక్కలు తేల్చిన సీఆర్డీఏ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,550 కోట్లు సాక్షి, హైదరాబాద్ : నూతన రాజధాని నిర్మాణానికి వచ్చే పదేళ్లలో రూ.53,547.67 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి(సీఆర్డీఏ) లెక్కకట్టింది. భూసమీకరణతోపాటు అమరావతి సిటీలో, సీడ్కేపిటల్లో, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణానికి ఏడాదికి అవసరమయ్యే నిధులు, వచ్చే పదేళ్లల్లో ఏ ఏడాది ఎన్ని నిధులు అవసరమనే అంచనాలను సీఆర్డీఏ రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీఆర్డీఏ పరిపాలన తదితర అవసరాల కోసం రూ.171.56 కోట్ల బడ్జెట్ అవసరమని అంచనా వేశారు. ఉద్యోగుల జీతభత్యాలతోపాటు పలు రంగాల్లో కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసేందుకు ఈ మొత్తం అవసరమని సీఆర్డీఏ పేర్కొంది. ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి రూ.3,560 కోట్లు అవసరం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రూ.541 కోట్లు, సీడ్ కేపిటల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.4,641.94 కోట్లు, అమరావతి సీటీలో మౌలిక వసతుల కల్పనకు రూ.28,711.56 కోట్లు, ల్యాండ్‌పూలింగ్ స్కీము అమలుకు రూ.15,921.61 కోట్లు అవరమని సీఆర్డీఏ అంచనా వేసింది. -
భూఫార్స్
రాజధానికి వేలాది ఎకరాలు కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకే ..? రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటున్న ప్రభుత్వం భయపడి ఇచ్చామంటున్న అన్నదాతలు.. న్యాయస్థానాలను ఆశ్రయించి భూములు కాపాడుకునే యత్నం రాజధానికి భూ సమీకరణ ప్రక్రియ రైతుల పాలిట శాపంగా మారింది. స్వచ్ఛందంగా భూమిలిచ్చారని ముఖ్యమంత్రి బాబు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అన్నదాతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నయానో, భయానో 12,450 మంది రైతుల నుంచి 30,400 ఎకరాలు ప్రభుత్వం సమీకరించింది. ఇందులో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామని ఢంకా భజాయిస్తోంది. రైతులకు మేలైన ప్యాకేజీ ఇస్తామంటోంది. వృత్తి నైపుణ్యశిక్షణ చేపడతాం.. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. అంటూ ఏవేవో చెబుతోంది. వీటన్నిటినీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే రైతులు వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల ప్రతినిధులు, సామాజికవేత్తలు, న్యాయస్థానాలను ఆశ్రయించి భూములు కాపాడుకునే యత్నాలు చేశారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని నిర్మాణానికి తుళ్ళూరు మండలంలోని కొందరు మినహా ఇతర రైతులు ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ రకాల ఒత్తిడులకు భయపడి భూములు ఇచ్చారనేది వాస్తవం. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉద్యమనేతల సూచనలు, రైతుల ఆక్రందనలు వినిపించలేదు. 30,400 ఎకరాలను ఇచ్చిన రైతులకు కౌలు చెక్కుల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ఇప్పటివరకు 18,200 ఎకరాల రైతులకు మాత్రమే చెక్‌లు ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.50 వేల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే కౌలు చెక్కులను ఆ రుణాలకు జమ చేస్తుండటంతో చేతిలో చిల్లిగవ్వలేక రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ కంఠాల్లోని స్థలాలు, గ్రామానికి అరకిలోమీటరు దాటిన వ్యవసాయ భూములను అమ్ముకునే అవకాశం లేక రైతులు తల్లిడిల్లిపోతున్నారు. వృత్తి కార్మికుల పరిస్థితి అధ్వానం.. దీంతో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 39,509 వ్యవసాయ కార్మికులు, వివిధ వృత్తులకు చెందిన 16,654 మంది కార్మికులు మూడునెలల నుంచి ఉపాధి కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని కుమ్మరి, వడ్రంగి వంటి చేతి వృత్తిపనివారు ఇంట్లో ఉండి రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదించేవారు. ఉపాధి కోల్పోయిన వీరికి నెలకు రూ.2,500 అందిస్తామని, మే నెలలో ఇది ప్రారంభం ప్రకటించారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి రెండునెలల సమయం పడుతుందని ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారు. ఉద్యమ బాట.. రాజధాని నిర్మాణానికి పచ్చని భూములను తీసుకుంటున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చర్చించారు. అంతేకాక ఆ పార్టీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులను రాజధాని గ్రామాలకు పంపించి రైతుకు భరోసా కలిగించారు. భూ సమీకరణలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వివిధ రకాల ఉద్యమాలు నడిపారు. న్యాయపోరాటం చేసే రైతులకు సహకారం అందించారు. సామాజిక ఉద్యమనేత మేథాపాట్కర్ వంటి అనేకమంది ఉద్యమకారులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుకు భరోసా కలిగించారు. నదీ పరీవాహక ప్రాంతంలో.. మంగళగిరి నియోజకవర్గంలోని నదిపరివాహక ప్రాంతాల రైతుల పరిస్థితి ఒక్కసారిగా తల్లికిందులైంది. సాలీనా మూడు పంటలు పండే భూములున్న జరీబు రైతులు ఎకరాకు రూ.లక్ష కౌలును పొందేవారు. ఆ భూముల ధరలు కూడా ఎకరా రూ.5 కోట్ల వరకు ఉండేది. వారంతా చంద్రబాబు విదిల్చే కౌలు మొత్తాలకు ఆశపడక న్యాయపోరాటం చేస్తున్నారు. వీరిని బెదిరించేందుకు భూ సేకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్టు నోటిషికేషన్ జారీ చేసిన ప్రభుత్వం దానిని అమలు పరచకుండానే భూ సమీకరణలో రైతుల నుంచి భూములు తీసుకునే యత్నం చేస్తోంది. -
భూసేక‘రణం’
సాక్షి, విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2,460 ఎకరాల భూ సమీకరణ గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చెందాలంటే మూడువేల ఎకరాల భూమి కావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 580 ఎకరాల్లో విమానాశ్రయం ఉంది. తొలివిడతగా 490 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించనున్నారు. విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకురావాలంటే మరో 1,970 ఎకరాలు అవసరమవుతుంది. గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించేందుకు అవసరమైతే ఏలూరు కాల్వను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం, అధికారులు ఉన్నట్టు సమాచారం. నష్టపరిహారం విషయం తేల్చరేం? గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు తొలివిడతగా 340 మంది రైతుల నుంచి 490 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా ఏయే రైతుకు ఎంతెంత భూమి పోతుందో కూడా తెలియజేశారు. కేసరపల్లిలో ఎకరాకు రూ.98 లక్షలు,బుద్దవరంలో రూ.57లక్షలు, అజ్జంపూడి లో రూ. 46 లక్షలు నష్టపరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే, కేసరపల్లిలో ఇచ్చే రేటే మిగిలిన గ్రామాల్లోనూ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలో భూసమీకరణకు సహకరించాలంటూ ప్రభుత్వం రైతులను కోరుతోంది. ల్యాండ్ పూలింగ్‌కు సహకరించకపోతే బలవంతంగా అయినా భూమి సమీకరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు తప్ప రైతులు కోరిన విధంగా నష్టపరిహారం ఇచ్చే విషయం మాత్రం తేల్చడం లేదు. బందరు పోర్టు మాటేమిటి? అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోగా మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిం చారు. ఆయన జిల్లాకు వచ్చిన ప్రతిసారీ నాయకులు పోర్టు విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరిగితే వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. పోర్టు విస్తరణకు 4,800ఎకరాల భూమి కావాల్సి ఉండగా, ఇందులో 2,450ఎకరాలు ప్రభుత్వ భూమి, రైతుల వద్ద నుంచి సుమారుగా 2,350ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి సర్వే పూర్తిచేసి భూములు ఏయే రైతులకు చెందినవో కూడా గుర్తించారు. ఆ తరువాత భూసేకరణ కానీ, భూ సమీకరణపై కానీ దృష్టి పెట్టలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతున్నా పోర్టుకు శంకుస్థాపన రాయి పడలేదు. పర్యాటకాభివృద్ధికి 10వేల ఎకరాలు కృష్ణానదికి దక్షిణ భాగంలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే, ఉత్తర భాగంలో టూరిజం అభివృద్ధి చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు న దీతీరం నుంచి హైవేకు మధ్య ఉండే ఖాళీ స్థలాలను, ప్రయివేటు భూములు సుమారు 10వేల ఎకరాలు ఉంటాయి. ఈ భూములను సేకరించి ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ భూముల్లో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. నదికి అభిముఖంగా ఉండటంలో భూముల ధర చుక్కల్ని అంటుతోంది. కంచికచర్ల, నందిగామ మండల్లాలో భూమి సేకరించి సిబ్బందికి క్వార్టర్స్ కట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని రావడంతో తమ భూముల రేట్లు పెరిగాయని రైతులు సంతోషపడుతుంటే.. వాటిపై ప్రభుత్వం కన్నేయడంతో రైతులు అయోమయంలో పడ్డారు. పారిశ్రామిక హబ్ కోసం 30వేల ఎకరాలు నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా నూజివీడు వరకు సుమారు 30 ఎకరాల భూములను భూసమీకరణ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తే నూతన రాజధానికి ఆర్థిక పరిపుష్టి సమకూరుతుందని అధికారులు, ప్రజాప్రతి నిధులు భావిస్తున్నారు. రాజధాని పేరుతో కోట్ల విలువైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
11 రోజులు 17 వేల ఎకరాలు
భూ సమీకరణ లక్ష్యం నెరవేరేనా ? ►భూ సమీకరణపై విస్తృత ప్రచారం ►వ్యాపారులను మించిపోతున్న ప్రభుత్వం ►ద్వంద్వ విధానాలపై రైతుల్లో నిరసన సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని గ్రామాల్లో భూ సమీకరణపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. భూ సమీకరణ వల్ల లాభాలను రైతుకు వివరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. భూ సమీకరణకు ఈ నెలాఖరు వరకు గడువు పొడగించామని, గతంలో అభ్యంతర పత్రాలు(9.2) ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు అంగీకారపత్రాలు(9.3) ఇవ్వవచ్చని, భూ సేకరణ విధానం కంటే భూ సమీకరణలోనే రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయంటూ.. మైకుల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఆటోలను వినియోగిస్తూ అందులో రికార్డు చేసిన క్యాసెట్లకు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొత్త సినిమాలు, ఎగ్జిబిషన్లు, కొత్త దుకాణాల ప్రారంభాల సమయంలో నగరాల్లోని వ్యాపారులు సమీపంలోని గ్రామీణ ప్రాంతాలోల ఈ తరహా ప్రచారాన్ని గతంలో నిర్వహించేవారు. వీరికి ధీటుగా అధికారులు కూడా భూ సమీకరణ వలన కలిగే లాభాలను ప్రచారం చేస్తున్నారు. అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులకు వెంటనే కౌలు చెక్కుల పంపిణీ, రుణమాఫీ వంటి సౌకర్యాలను సత్వరం అందచేయడం జరుగుతుందని, సలహాలు, సందేహాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రచారంలో పేర్కొంటున్నారు. భూ సేకరణను బూచిగా చూపి.. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల నుంచి భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటామని ఈ నెల 14 న ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 33,400 ఎకరాలను భూ సమీకరణ విధానంలో సేకరించామని, అదనంగా భూములు కావాలని పట్టణాభివృద్ధి సంస్థ రెవెన్యూశాఖను కోరడంతో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానికి అవసరమైన భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం సర్వాధికారాలు ఇచ్చింది. అయితే భూ సేకరణ విధానాన్ని ప్రారంభించనున్నామని రైతుల్ని భయపెట్టిన ప్రభుత్వం ఆ విధానంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా భూ సమీకరణ విధానానికి గడువు పొడగించడంతోపాటు దాని వలన కలిగే లాభాలకు విస్త్రత ప్రచారం కలిగించడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూ సేకరణ బూచితో రైతుల్ని భయపట్టిన ప్రభుత్వం భూ సమీకరణపై ప్రచారం చేస్తూ ద్వంద్వ విధానాలు అనుసరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. -
అన్ని ప్రాజెక్టులకూ భూ సమీకరణే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను సమీకరణ విధానంలోనే చేపట్టాలని మంత్రివర్గం భావించింది. సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ భూ సమీకరణపై సుదీర్ఘంగా చర్చించింది. కొత్త రాజధాని తరహాలోనే మిగతా ప్రాజెక్టులన్నింటికీ కూడా సమీకరణ పద్ధతినే అనుసరించాలని తీర్మానించింది. విశ్వసనీయం సమాచారం మేరకు.. ఇకపై జరిగే అన్ని కేబినెట్ సమావేశాలూ రాత్రి వరకు కొనసాగుతాయని, అందుకు సిద్ధపడి రావాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. భూ సమీకరణపై చర్చ సందర్భంగా భోగాపురంలో రైతుల వ్యతిరేకత ప్రస్తావనకు రాగా మంత్రులు మణాలిని, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటాలతో పాటు యనమల రామకష్ణుడు బాధ్యత తీసుకుని పూర్తయ్యేలా చూడాలని సీఎం చెప్పినట్టు తెలిసింది. -
అయోమయంలో అన్నదాతలు
- ఈనెల 10 వరకు భూ సమీకరణకు గడువు - 11 నుంచి భూమి సేకరిస్తామని హెచ్చరిక - చర్చలతో కాలం గడుపుతున్న అధికారులు సాక్షి ప్రతినిధి, విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు రైతుల నుంచి భూమి సేకరించే కార్యక్రమం కొలిక్కి రాలేదు.. రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఒప్పందం కుదరలేదు.. అధికారుల తీరు మాత్రం అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ భూమికి కేసరపల్లిలోని భూములకు చెల్లించినట్టుగా ఎకరాకు రూ.98 లక్షల చొప్పున ఇప్పించాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షనేత ైవె ఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. తొలి విడతగా 490 ఎకరాల సేకరణ విస్తరణ కింద ప్రభుత్వం మొదటి విడతగా 340 మంది రైతుల నుంచి 490 ఎకరాల భూమిని సేకరించనుంది. భూములు కోల్పోయే వారిలో గన్నవరం మండలంలోని కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి రైతులు ఉన్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో విధమైన పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భూ సేకరణ కార్యక్రమం కొలిక్కి రాలేదు. అందితే జుట్టు అందకుంటే కాళ్లు అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. విమానాశ్రయ విస్తరణ కోసం భూమిని సేకరించేందుకు మొదట నిర్ణయించారు. నాలుగు నెలల కిందట భూ సేకరణ నోటీసు కూడా జారీ చేశారు. ఎవరి భూమి ఎంత పోతుందో తెలియజేశారు. అధికారులు రైతులతో చర్చలు జరిపిన తరువాత కేసరపల్లి రైతుల భూములకు ఎకరాకు రూ.98 లక్షలు, బుద్ధవరం భూములకు ఎకరాకు రూ.57 లక్షలు, అజ్జంపూడి రైతుల భూములకు ఎకరాకు రూ.46 లక్షల ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పారు. కేసరపల్లి భూములకు ఇవ్వాలని నిర్ణయించిన పరిహారాన్నే బుద్ధవరం, అజ్జంపూడి భూములకూ ఇవ్వాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. ముందుగా భూ సేకరణ నోటీసు ఇచ్చిన అధికారులు పాలకుల సూచనల మేరకు రాజధాని ప్యాకేజీ తాయిలాలు చూపించి భూ సమీకరణ ద్వారా ఇవ్వాలని సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ ద్వారా రైతులకు చెప్పించారు. ఇందుకు ఈనెల 10వ తేదీ వరకు గడువు విధించారు. లేదంటే ఈనెల 11 నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ల్యాండ్‌పూలింగ్‌ను రైతులు పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. భూ సమీకరణ ద్వారానే పరిహారాన్ని కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సెక్షన్ 26జీ కింద ఎక్కువ విలువ కలిగిన భూములతో సమానమైన పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. విస్తరణలో పోనున్న ఏలూరు కాలువ! విమానాశ్రయ విస్తరణలో భాగంగా ఏలూరు కాలువను మార్చాలని అధికారులు చెబుతున్నారు. బుద్ధవరం-దావాజీగూడెం మధ్యలో ఏలూరు కాలువ ఉంది. ఈ మధ్యలో ఉండే భూమిని విస్తరణలోకి తీసుకుంటుండటంతో ఈ కాలువ కూడా విస్తరణలో కలిసిపోతుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న కాలువను తప్పనిసరిగా మార్చాలి. అయితే, ఎంత మొత్తం కాలువ విస్తరణలో పోతుందనే కచ్చితమైన వివరాలు అధికారుల వద్ద లేవు. త్వరలో సర్వే చేస్తామని అధికారులు తెలిపారు. ఏలూరు కాలువ మారిస్తే తప్పకుండా కాలువ నిర్మాణానికి అక్కడి రైతుల నుంచి భూమిని కాలువ కోసం తిరిగి సేకరించాల్సి ఉంటుంది. -
భూములపై ఢిల్లీకి పోరు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ‘చలో ఢిల్లీ’ ఉద్యమంపై దృష్టిపెట్టారు. కేంద్రసర్కారు ఇటీవల అమల్లోకి తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్సు, రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తోన్న భూ సమీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. బుధవారం విజయవాడలో పలువురు రైతు నాయకులు సమావేశమై ఇందుకు సంబంధించిన ప్రాథమిక కార్యాచరణను రూపొందించుకున్నారు. ఆ మేరకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలో పార్టీలకతీతంగా రైతులంతా సమావేశమై ఉద్యమ విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకోనున్నారు. అంతేకాక బాధిత రైతులందరి అభిప్రాయం మేరకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా 15 మందితో ప్రత్యేక పోరాట కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో 30 వేల ఎకరాల భూములను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ 21,620 ఎకరాలను సమీకరించింది. మొదటినుంచీ జరీబు భూముల రైతాంగం భూసమీకరణను వ్యతిరేకిస్తూనే ఉంది. రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాలకు చెందిన రైతులు భూసమీకరణకు దూరంగానే ఉన్నారు. మరోవైపు మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కూడా రైతుల ప్రయోజనాలకోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు రైతుల గోడు వినిపించడం మంచిదని, దీనివల్ల కొంతైనా మేలు జరిగే వీలుందని భావించిన పలువురు రైతు నాయకులు, సామాజిక ఉద్యమకారులు చలో ఢిల్లీ ఉద్యమం వైపు దృష్టిపెట్టారు. జాతీయ స్థాయిలో సామాజిక ఉద్యమకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అన్నాహజారే సాయంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఎదుట నిరసన తెలపడం వల్ల జాతీయస్థాయి మీడియా దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లవుతుందని రైతుసంఘాల నేతలు భావించారు. అన్ని గ్రామాలకు సమాచారాన్ని పంపి కలసివచ్చే రైతులతో 21న ఢిల్లీకి పయనమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు రైతుల పక్షాన పోరాడుతున్న న్యాయవాది మల్లెల శేషగిరిరావు తెలిపారు. మా భూములను మినహాయించాలి.. రాజధాని భూ సమీకరణపై హైకోర్టులో రైతుల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) నుంచి తమ భూములను మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని భీమిరెడ్డి శివరామిరెడ్డి, మరో 31 మంది దాఖలు చేశారు. ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణకు శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం భూ సమీకరణ బాధ్యతలను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగించిందని, రాజధాని నిర్మాణం పేరుతో తమ వంటి చిన్న రైతులకు చెందిన చిన్నచిన్న విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని తెలిపారు. తరతరాలుగా స్వేదం చిందించి సాగుచేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందని, ఈ భూములు తప్ప తమకు మరో ఆధారం లేదని, భూ సమీకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రభుత్వం తమను ఏదోరకంగా దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, దారికి రానివారిని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. భూ సమీకరణను వ్యతిరేకించిన ఆరు గ్రామాల్లోని రైతులకు చెందిన పంటలను, పంపులను, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు తగులపెట్టారని, రైతులను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. -
రాజధాని గ్రామాల్లో స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్
ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా నిలిపేసిన అధికారులు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో నివేశన స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి 29 గ్రామాల్లోని అధికార, అనధికార లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మౌఖిక ఆదేశాల మేరకు వీటిని నిలిపేసినట్టు సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. ఈ విషయమై గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస్ కూడా ఐజీ మౌఖిక ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే లిఖిత పూర్వక ఆదేశాలు వస్తాయని ఐజీ వివరించినట్టు చెప్పారు. -
భూ సమీకరణకు సిబ్బంది కేటాయింపు
సాక్షి, గుంటూరు: భూ సమీకరణను వేగవంతం చేయడంలో భాగంగా 27 యూనిట్లకు పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఇతర జిల్లాల నుంచి కేటాయించిన రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది గుంటూరు జిల్లాలో రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో వీరిని 27 యూనిట్ల పరిధిలో నియమిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు మండలంలోని 16 గ్రామాల్లో భూ సమీకరణ కు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మండలంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బందిని నియమించగా, మిగిలిన సిబ్బందిని మంగళగిరి, తాడేపల్లి మండలాలకు కేటాయిస్తున్నారు. ఇప్పటికి ఇతర జిల్లాల నుంచి 11 మంది, గుంటూరు నుంచి ఆరుగురు మొత్తం 17 మంది డిప్యూటీ కలెక్టర్లు, 29 మంది తహశీల్దార్లు, 47 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 40 మంది సర్వేయర్లు వచ్చారు. 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు.తాత్కాలికంగా జిల్లాలో ఉన్న సీనియర్ అధికారులను భూ సమీకరణకు వాడుకుంటున్నారు.ఇంకా సీనియర్, జూని యర్ అసిస్టెంట్లను కేటాయించాల్సి వుంది. ఇప్పటికే జిల్లాలో పలువురు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లను భూ సమీకరణకు వినియోగిస్తున్నారు. మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు, తిప్పాయిపాలెంలో భూ సమీకరణ కోసం డిప్యూటీ కలెక్టర్లు ఆయా గ్రామాల పరిధిలో నోటిఫికేషన్లు విడుదల చేశారు. రైతులు 9.3 దరఖాస్తులు తీసుకెళ్లారు. బుధవారం నాటికి 725 మంది రైతులు 2,058.56 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు సమ్మతించినట్టు గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు తెలిపారు. తుళ్లూరు మండలంలోని ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు అంగీకార పత్రాలు ఇవ్వలేదు. -
మా శవాలపై రాజధాని కట్టుకోండి...
-
మా శవాలపై రాజధాని కట్టుకోండి..
సర్కారుపై ‘రాజధాని గ్రామాల’ రైతుల ఆగ్రహం స్వతంత్రంగా బతుకుతున్న మమ్మల్ని రోడ్డున పడేస్తారా? ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. సెంటు భూమి కూడా ఇవ్వం వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఎదుట స్పష్టంచేసిన రైతులు సాక్షి, గుంటూరు: రాజధాని కోసమంటూ తమ భూములను అప్పనంగా కాజేసే కుయుక్తులపై కర్షక లోకం కన్నెర్ర చేస్తోంది. కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని భూమిలో బంగారం పండించే భూమిపుత్రులంతా పోరాటానికి సన్నద్ధమయ్యారు. భూసమీకరణ పేరుతో అడ్డగోలుగా భూములను సొంతం చేసుకుకోవాలనుకుంటున్న సర్కారు పెద్దలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సెంటు భూమి ఇచ్చేదిలేదని.. తమ భూములు తీసుకునే రాజధాని నిర్మించాలనుకుంటే తమ శవాలపైనే ఆ రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్తున్నారు. ‘‘రైతులను మోసం చేశావు... జనాల్ని మోసం చేస్తున్నావు... ఇప్పుడు హైటెక్ మోసంతో మా భూములు తీసుకోవాలని చూస్తున్నావు. మీకు ఓట్లేసినందుకు తగిన శాస్తి జరిగింది. 200 వాగ్దానాలు చేశావు, ఇక్కటైనా నెరవేర్చావా?’’ అంటూ.. రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతాల రైతులు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా పొలాలు తీసుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేద్దామనా?’’ అని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పెళ్లిళ్లు జరిగే పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు.ఆదివారం ఆ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పర్యటించి రైతుల మనోగతాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తే పోరాడతాం: వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లాలో రాజధాని కడితే ఆనందమే.. కానీ రైతులు నష్టపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే సహించబోమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టంచేశారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. బడాబాబులు బినామీ భూములను జాగ్రత్త చేసుకుని.. రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అయిదడుగుల్లోనే నీరు పడే ప్రాంతాల్లో రాజధాని నిర్మించాలంటే ఖర్చుతో కూడిన పనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తమకు పార్టీలతో పనిలేదని, పేద రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రైతుల కు నచ్చేవిధంగా ఉండాలి గానీ, ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే పోరాడతామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా రైతులకు హామీ ఇచ్చారు. -
సర్కారు ‘భూ’తంపై పోరు
-
సర్కారు ‘భూ’తంపై పోరు
భూ సమీకరణపై ‘రాజధాని గ్రామాల’ రైతుల్లో భయాందోళనలు * ‘రియల్’ దందా చేసే ప్రణాళికపై ఆగ్రహావేశాలు * సంఘటితమవుతున్న రైతులు.. న్యాయపోరాటానికి సన్నద్ధం * భూ సమీకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల్లో రైతుల తీర్మానాలు * కార్యాచరణపై ఈ నెల 8 లేదా 9 తేదీల్లో విజయవాడలో సదస్సు * 14 గ్రామాల రైతులతో రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ఏర్పాట్లు * గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల పర్యటనలు సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ‘భూ సమీకరణ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 17 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల వ్యవసాయ భూములను ‘సమీకరించాల’ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. బంగారం పండే పంట భూములను పైసా ధర చెల్లించకుండా స్వాధీనం చేసుకుని అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించి.. ఆ తర్వాత రైతులకు ఎకరాకు 1,000 గజాల భూమిని తిరిగి ఇచ్చి.. మిగతా భూమిని అటు రియల్టర్లు, ఇటు ప్రభుత్వం పంచుకునే దిశగా చేస్తున్న కసరత్తుపై ఆయా గ్రామాలు, వాటి సమీప గ్రామాల్లో ఆం దోళనకర వాతావరణం నెలకొంది. దీంతో రైతులు తమ భూములను కాపాడుకోవటం కోసం పోరుబాట పడుతున్నారు. న్యాయ పోరాటానికి రైతులు సన్నద్ధం... రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల రైతులను భూ సమీకరణకు వ్యతిరేకంగా సంఘటిత పరచడానికి ముఖ్య నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 17 గ్రా మాల్లో 21,000 మంది పట్టాదారు రైతులు, సు మారు 3,000 మంది అసైన్డ్ భూముల రైతులు ఉంటే.. మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరులో ప్రభుత్వ అతిథిగృహానికి వంద మందిని పిలిపించుకుని మాట్లాడి.. భూ సమీకరణకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని ఎలా ప్రకటిస్తారని ఆయా గ్రామాల రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ‘‘ప్రభుత్వం మన భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వారితో అభివృద్ధి చేయించి మిగిలిన భూమిలో మూడు వాటాలు వేస్తుందట. ఇదేం న్యాయం?’’ అంటూ తుళ్లూరు మండలంలోని 14 గ్రామాల రైతులను సంఘటితం చేయడానికి రైతు సంఘాల నేతలు నడుం బిగించారు. ఈ మండలంలోని దాదాపు 5,000 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి సమాలోచనలు జరుపుతున్నారు. ప్రధాని, రాష్ట్రపతులకు తీర్మానాలు... ఇప్పటికే పలు గ్రామాల రైతులు, రైతు సంఘా లు భూ సమీకరణకు తాము వ్యతిరేకమని తీర్మానాలు చేశాయి. మిగిలిన గ్రామాల్లో కూడా ఈ తీర్మానాలు చేయించి వీటిని హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి పంపాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు. గ్రా మాల్లో పంటలు పండని భూముల సర్వే నంబర్లు, వాటి వివరాలనూ వీరందరికి సమర్పించి.. ఆ భూముల్లో రాజధాని నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈ నెల 8 లేదా 9వ తేదీన విజయవాడలో 14 గ్రామాల రైతులతో సదస్సు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే బలవంతంగా భూ సేకరణ చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు వామపక్ష పార్టీలు ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించా యి. రైతాంగం నుంచి భూమిని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారితో మైండ్ గేమ్ ఆడుతుండటాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయడానికి సైతం బీజేపీ వర్గాలు సిద్ధమవుతున్నారు. కాగా వెంకటయపాలెం గ్రామంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన 800 ఎక రాలు ఉన్నందునే దాన్ని సేకరణనుంచి మినహా యించారని రైతు సంఘాలు ఆరోపించాయి. మా గ్రామాలే త్యాగం చేయాలా? రాజధాని నిర్మాణం కోసం మా 17 గ్రామాలో లేక ఈ ప్రాంతంలోని మూడు, నాలుగు మండలాల రైతులు మాత్రమే త్యాగం చేయాలా? అంత అవసరమైతే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ పెద్దలు వారి కుటుంబ సభ్యులు, వారి బినామీల పేర్ల మీద ఉన్న భూములను రాజధాని కోసం త్యాగం చేయాలని చెప్పండి. రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. 25,000 ఇస్తే కౌలు రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాలు ఎలా బతకాలి? - మల్లెల హరీంద్రచౌదరి, (మాజీ ఎంపీపీ, తుళ్లూరు మండలం) హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం ‘‘రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రైతులను బెదిరించి భూములు లాక్కోవడం చేయడం మంచిది కాదు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అవగాహన సదస్సుకు హా జరైనట్లు పుస్తకంలో సంతకం పెట్టాలని చెప్పి న అధికారులు రైతులంతా అంగీకరించారని ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. మంత్రి పుల్లారావు తనకు కావాల్సిన వారితో మాత్రమే మాట్లాడి రైతులతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అవసరమైతే పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తాం. - కొమ్మినేని సత్యనారాయణ (గుంటూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు, బీజేపీ) -
బెజవాడ-గుంటూరు మధ్యే తొలిదశ భూ సమీకరణ
► సీఎం బాబుతో రాజధాని నిర్మాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ► వివరాలు వెల్లడించిన మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ► ఈ నెల 17, 18, 19 తేదీల్లో విజయవాడ, గుంటూరుల్లో మంత్రివర్గ సభ్యుల పర్యటనలు ► రాజధానికి భూములిచ్చే రైతులు వేరే చోట భూములు కొనుక్కుంటే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, చార్జీలు రద్దు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల్ని తొలిదశలో విజయవాడ-గుంటూరు మధ్యే సమీకరించాలని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. తొలిదశగా 30 వేల ఎకరాల్ని రైతుల నుంచి సమీకరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాజధాని నిర్మాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. శనివారం సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్‌బాబు భేటీ అయ్యారు. వీరి మధ్య రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నయా రాయ్‌పూర్, గాంధీనగర్, చండీగఢ్ నిర్మాణానికి భూ సేకరణ ఎలా జరిగిందనే అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ చర్చల వివరాల్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. సమీకరణ అనంతరం అభివృద్ధి చేసే భూమిని 60:40 నిష్పత్తిలో కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి పల్లె తెలి పారు. రైతులకు 40 శాతం వరకు అభివృద్ధి భూమిలో వాటా వస్తుందని, అంటే ఎకరాకు వెయ్యి చదరపు గజాల వరకు భూమి దక్కుతుం దన్నారు. అసైన్డ్ భూముల విషయంలో మాత్రం 30 శాతం వరకు మాత్రమే రైతులకు వాటా దక్కుతుందని వివరించారు. అభివృద్ధి చేసిన భూమిని రైతులు అమ్ముకోకుంటే పదేళ్ల వరకు ఏటా రూ. 25 వేల వరకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సమావేశంలో నిర్ణయించామన్నారు. ఒకవేళ రైతులు భూమిని అమ్ముకుంటే మాత్రం పరిహారం ఇవ్వరన్నారు. భూ సమీకరణపై విజ యవాడ-గుంటూరు మధ్య ప్రాంతాల రైతులతో చర్చలు, ఒప్పందాలు చేసుకునేందుకు ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఆ ప్రాంతాల్లో మంత్రి వర్గ ఉపసంఘం పర్యటించనుందని తెలిపారు. రైతులు ఆమోద సంకేతాలిస్తున్నారు.. నూటికి నూరు శాతం రైతులు ల్యాండ్ పూలింగ్ విధానానికి ఆమోదయోగ్యంగా ఉన్నారని, ఇప్పటికే వారు ప్రభుత్వానికి సంకేతాలు కూడా పం పుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఉత్తమ, అత్యద్భుత రాజధాని నిర్మాణానికి బెస్ట్ ఆర్కిటెక్చర్ కోసం ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతలు ‘మెకంజి’ కన్సల్టెన్సీకి అప్పగించేందుకు యోచిస్తున్నామని, ఇప్పటికే ఆ కన్సల్టెన్సీ కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చిందన్నారు. రాజ దాని నిర్మాణానికి భూములు ఇచ్చే రైతులు ఎవరైనా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో భూములు కొనుక్కున్నా, వారికి స్టాంప్ డ్యూటీ ఫీజు, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం హామీనిస్తుందన్నారు. హుదూద్ తుపానుపై మాట్లాడుతూ తుపాన్ ప్రభావం గురించి గంట గంటకు కేంద్రం తెలుసుకుంటోందన్నారు. తుపాన్ సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు మున్సిపల్ మంత్రి నారాయణను విశాఖపట్నం పంపించామన్నారు. కేర్‌ఫుల్‌గా బ్రీఫింగ్ ఇవ్వు.. చంద్రబాబుతో భేటీ అనంతరం సచివాలయం చాంబర్ నుంచి వెలుపలికి వచ్చిన మంత్రులు యనమల, పల్లె రఘునాథరెడ్డి, పి.నారాయణ ‘‘ల్యాండ్ పూలింగ్ మీద పెద్దగా చర్చించలేదని’’ పదే పదే చెప్పారు. కేవలం నాలుగు మాటలే సీఎం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్‌పై మాట్లాడారని మంత్రి నారాయణ విలేకరులతో పేర్కొన్నారు. కారు ఎక్కే ముందు యనమల.. సహచర మంత్రి పల్లెను పిలిచి ‘కేర్‌ఫుల్‌గా బ్రీఫింగ్’ ఇవ్వాలని సూచించి మరీ వెళ్లారు.