LDF
-
Kerala: రూ.100 కోట్ల ముడుపుల కలకలం
తిరువనంతపురం: కేరళలోని ఎన్సీపీ (శరద్)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్ కె.థామస్ అధికార ఎల్డీఎఫ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(లెనినిస్ట్) ఎమ్మెల్యే కొవూర్ కుంజుమోన్లకు థామస్ ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్లో భాగస్వాములు. ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్సీపీ(అజిత్)లో చేరడం, పినరయి విజయన్‌పై ఒత్తిడి తెచ్చి కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్ 5న థామస్ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. ఈ వ్యవహారం అక్టోబర్ 25న త్రిసూర్‌లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్ మిత్ర పక్షం ఎన్సీపీ(శరద్)వర్గం ఎమ్మెల్యే థామస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్ కేబినెట్లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్లో చేరేందుకు థామస్ వేసిన పథకంగా భావిస్తున్నారు. ఎన్సీపీ(అజిత్), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్సీపీ(అజిత్)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్సీపీ(అజిత్)నేత మహ్మద్ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్సీపీ(శరద్)కమిటీ ఎదుట ఇటీవల థామస్ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్సీపీ(శరద్) జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది. -
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. -
Lok sabha elections 2024: రాజకీయ కథాకళి..కేరళ
కేరళ రాజకీయాల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములదే హవా. బీజేపీకి కేడర్ ఉన్నా ప్రజాదరణ అంతంతే. దక్షిణాదిలో బీజేపీ ఇంతవరకు ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవని ఏకైక రాష్ట్రం కేరళే. అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ 13 శాతం ఓట్లు సాదించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 11.3 శాతానికే పరిమితమైంది. ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయడమే లక్ష్యంగా కాషాయదళం కష్టపడుతోంది.క్రిస్టియన్, ముస్లిం ఓటర్లకూ చేరువయ్యేందుకు ప్రయతి్నస్తోంది. ఫలితంగా పలు స్థానాల్లో పోటీ ఇప్పటికే త్రిముఖంగా మారింది. ఇక జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో మాత్రం పరస్పరం తలపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకూ శుక్రవారం రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు జరుగుతున్న స్థానాలపై ఫోకస్... త్రిసూర్రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటు డు సురేశ్ గోపి ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా నిలి చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన ఇక్కణ్నుంచే పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్ విజయం సాధించారు. అయితే అప్పట్లో ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఆలస్యంగా గోపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈసారి కాంగ్రెస్ నుంచి వడకర ఎంపీ కె.మురళీధరన్ పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ సీఎం కె.కరుణాకరన్ కుమారుడు.నాలుగు పర్యా యా లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మురళీధరన్‌కు విన్నింగ్ మాస్టర్‌గా పేరుంది. సీపీఐ నుంచి మాజీ మంత్రి వి.ఎస్.సునీల్ కుమార్ పోటీలో ఉన్నారు. 35 శాతమున్న క్రిస్టియన్ ఓటర్లు నిర్ణాయకం కానున్నారు. 16 శాతమున్న ముస్లిం ఓట్లూ కీలకమే. ప్రధాని మోదీ ఇప్పటికే త్రిసూర్‌లో రోడ్డు షో జరిపారు. కరువన్నూర్ కో ఆపరేటివ్ బ్యాంక్ స్కాం అధికార ఎల్డీఎఫ్కు ఇక్కడ ప్రతికూలంగా మారనుందని అంచనా.పాలక్కాడ్బీజేపీ ఆశలు, ఆకాంక్షలకు పాలక్కాడ్ నియోజకవర్గం కీలకం కానుంది. కేరళలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్న ఏకైక మున్సిపాలిటీ ఇది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వీకే శ్రీకందన్ ఇక్కడ గెలిచారు. ఈసారి కూడా పార్టీ తరఫున ఆయనే బరిలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి విజయ రాఘవన్‌కు గట్టి పోటీనిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.కృష్ణకుమార్ వరుసగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో కృష్ణ కుమార్ 21.44 శాతం ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే గత మూడు సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ ఓటు శాతం పెరుగుతూ వస్తోంది.వయనాడ్ఇది 2009 లోక్‌సభ ఎన్నికల ముందు ఏర్పాటైన నియోజకవర్గం. అప్పటినుంచి ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎం.ఐ.షానవాజ్ గెలిచారు. 2019లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఖాయమని తేలడంతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వయనాడ్ నుంచీ బరిలో దిగారు. అమేథీలో ఓడినా ఇక్కడ ఆయన ఏకంగా 4.31 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.ఎన్డీఏ అభ్యరి్థ, బీడీజే (ఎస్) నేత తుషార్ వెల్లప్పల్లికి 78,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి మాత్రం రాహుల్‌కు ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగా లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. అన్నీ రాజా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య. ఇక సురేంద్రన్ ఉత్తర కేరళలో గట్టి పట్టున్న నాయకుడు. 2019 ఎన్నికల్లో పతనంతిట్టలో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌కు 64.9 శాతం ఓటర్లు రాగా, సీపీఎంకు కేవలం 25.24 శాతం ఓట్లే లభించాయి. ఎన్నికల ముందే ఇక్కడ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కాంగ్రెస్ డీసీసీ జనరల్ సెక్రటరీ పీఎం సుధాకరన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇక్కడ రోడ్ షోలు నిర్వహించారు. అమేథీ మాదిరిగానే వయనాడ్ నుంచి కూడా రాహుల్ పారిపోవడం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. అట్టింగల్ఇక్కడ కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ అదూర్ ప్రకాశ్‌ను కాంగ్రెస్ మరోసారి పోటీలో నిలిపింది. బీజేపీ తరఫున కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్ పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి వి.జోయ్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అదూర్ 2,80,995 ఓట్లతో (38.34 శాతం) గెలిచారు. సీపీఎం అభ్యర్థి అనిరుద్ధ్ సంపత్‌కు 34.5 శాతం, బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌కు 24.97 శాతం ఓట్లు లభించాయి. అట్టింగల్‌లో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. పథనంతిట్టఇక్కడ కూడా త్రిముఖ పోటీ వాతావరణమే నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఏకే ఆంటోనీ కుమారుడైన అనిల్ ఆంటోనీని బీజేపీ బరిలో నిలిపింది. సిట్టింగ్ ఎంపీ ఆంటో ఆంటోనీకి కాంగ్రెస్ మరోసారి అవకాశమిచి్చంది. సీపీఎం తరఫున మాజీ మంత్రి థామస్ ఇజాక్ పోటీలో ఉన్నారు. తన కుమారుడు ఓడాలని కోరుకుంటున్నానని, ఆంటో ఆంటోనీదే విజయమని ఏకే ఆంటోనీ ప్రకటించడం విశేషం!శబరిమల ఆలయం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ప్రధాన అభ్యర్థులు ముగ్గురూ కేథలిక్స్ క్రైస్తవులే కావడం విశేషం! 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంటో ఆంటోనీ 37.11 శాతం ఓట్లతో సీపీఎం అభ్యర్థి వీణా జార్జ్‌పై 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ 29 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే 2009 ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా 2014లో 16 శాతానికి, 2019లో 29 శాతానికి పెరిగాయి.కాసర్గోడ్సిట్టింగ్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితాన్ మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి సతీశ్ చంద్రన్‌పై ఆయన 1.4 లక్షల మెజారిటీతో గెలిచారు. బీజేపీ ఈ విడత ఎంఎల్ అశి్వనికి అవకాశమిచ్చింది. గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం మధ్యే ఉండనుంది. కొద్ది రోజులుగా సీపీఎం అభ్యర్థి ఎం.వి.బాలకృష్ణన్ పట్ల స్పష్టమైన మొగ్గు కన్పిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీకి ప్రజామద్దతు పెరుగుతోందని, మోదీ సర్కారుకు ఈసారి రాష్ట్ర ప్రజలు ఓటేస్తారని అశ్విని అంటున్నారు. కేరళలో తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో కూడా హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ నుంచి హాట్రిక్ వీరుడు శశిథరూర్ పోటీలో ఉండగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను బీజేపీ బరిలో దింపింది. ఎల్డీఎఫ్ సంకీర్ణం తరఫున పి.రవీంద్రన్ (సీపీఐ) తలపడుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళ: రాహుల్‌గాంధీపై ప్రధాని సెటైర్లు
తిరువనంతపురం: ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల పాలనలో కేరళ పరిస్థితి దిగజారిపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కేరళలోని పాలక్కాడ్‌లో సోమవారం(ఏప్రిల్ 15) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ దాకా లెఫ్ట్ ప్రభుత్వాలు ఎక్కడున్నా ఒకేలా వ్యవహరిస్తాయని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ యువరాజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓట్లడుగుతాడు. కానీ కేరళ పజలకు ఉన్న ఒక్క సమస్యపైనా మాట్లాడడు’ అని రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధాని చురకంటించారు. మరోపక్క బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోపై సోమవారం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై రాహుల్‌గాంధీ విమర్శలు -
తిరువనంతపురం ఫైట్.. కేంద్ర ఐటీ మంత్రిపై ‘ఈసీ’కి ఫిర్యాదు
తిరువనంతపురం: కేరళలోని కీలక సీటు తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తులు దాచారని ఎన్నికల కమిషన్(ఈసీ)కి వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఫిర్యాదు చేసింది. నామినేషనన్ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్లో గత ఏడాది ఆదాయాన్ని ఆయన చాలా తక్కువగా చూపించారని ఫిర్యాదులో ఎల్డీఎఫ్ నేతలు పేర్కొన్నారు. జూపిటర్ క్యాపిటల్ అనే కంపెనీలో ఆయనకు ఉన్న సింహభాగం వాటాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. ఇంతకముందు ఇదే విషయమై రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్‌చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి ప్రధానంగా యూడీఎఫ్ అభ్యర్థి శశిథరూర్‌తో పోటీపడుతున్నారు. ఇదీ చదవండి.. ప్రచార హోరు..తృణమూల్‌పై ప్రధాని మోదీ ఫైర్ -
ఆ రెండు పార్టీల చరిత్ర అవినీతికి మారు పేరు: ప్రధాని మోదీ
కొచ్చి: కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ‘శక్తి కేంద్ర ఇన్చార్జ్ సమ్మేళనం’లో పాల్గొని ప్రసంగించారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు చరిత్ర అవినీతికి మారు పేరు అని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయటంలో బీజేపీకి మాత్రమే ఘనమైన రికార్డు ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు పట్ల స్పష్టమైన దూరదృష్టి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. గడిచిన బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ గత ఐదు దశాబ్దాలుగా కేవలం ‘గరీబీ హఠావో’ నినాదం వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేరళలోని బీజేపీ కార్యకర్తలు ఎంత శక్తివంతులో త్రిస్సూర్‌లో ఏర్పాటు చేసిన ‘నారి శక్తి సమ్మేళనం’ కాన్ఫరెన్స్ ద్వారా అర్థమైందని మోదీ అన్నారు. అటువంటి వారే బీజేపీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారని తెలిపారు. దేశంలోనే తక్కువ కాలంలో రికార్డు స్థాయితో అభివృద్ధి చెందుతూ... దేశ భవిష్యత్తు పట్ల సంపూర్ణమైన దార్శనికత ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని మోదీ అభిప్రాయపడ్డారు. చదవండి: అయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? -
గవర్నర్ వైఖరిపై అధికార పార్టీ విస్తృతస్థాయి నిరసన
తిరువనంతపురం: కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వాన్ని బహిరంగంగా తీవ్రంగా తప్పుబట్టే ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై క్షేత్రస్థాయి విస్తృత నిరసన కార్యక్రమాలకు ఎల్డీఎఫ్ శ్రేణులు తెరతీశాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గవర్నర్ ఖాన్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిపెట్టాయి. భారత రాజ్యాంగంపై కనీస అవగాహనలేని గవర్నర్ పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున పనిచేస్తున్నారని ఆ కరపత్రాల్లో ప్రచురించారు. ఉన్నత విద్య పరిరక్షణకు ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ సొసైటీ పేరిట ఈ కరపత్రాలు ముద్రితమయ్యాయి. ఈనెల 15వ తేదీన రాజ్‌భవన్ ఎదుట ఏకంగా లక్షమందితో భారీ నిరసన కార్యక్రమానికి ఏర్పాటుచేస్తున్నట్లు ఎల్డీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తున్నారని, గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని గవర్నర్ ఖాన్ సోమవారం విమర్శించిన విషయం తెల్సిందే. ఇదీ చదవండి: గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? -
గోల్డ్ కేసులో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది
తిరువనంతపురం/న్యూఢిల్లీ : కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మధ్య మరోసారి దుమారం చెలరేగింది. గవర్నర్ ఖాన్ ఈసారి గోల్డ్ స్మగ్లింగ్ వివాదాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గవర్నర్ ఖాన్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆరోపించిన మర్నాడు గురువారం గవర్నర్ ఖాన్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్ అజెండాపై సీఎం ఒక్క ఉదాహరణ అయినా చూపగలరాని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్‌కి చెందిన వారిని నియమించడానికే ప్రస్తుతమున్న వైస్ ఛాన్సలర్లపై చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానిని రుజువు చేస్తే గవర్నర్ పదవికి తాను రాజీనామా చేస్తానని, అలా రుజువు చెయ్యలేకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ‘‘కేరళ ప్రజలు ప్రస్తుతం గోల్డ్ స్మగ్లంగ్ గురించి, అందులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ కేసులో శివశంకర్ పాత్ర ఏంటి ? ఎందుకు ఆయనని తొలగించారు ? ఈ కేసులో సీఎంఒ ప్రమేయం ఉందని తేలితే నేను ఇందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని గవర్నర్ హెచ్చరికలు జారీ చేశారు. -
కొడకారా దోపిడీ కేసు.. రాజకీయ చిత్తులు-జిత్తులు
కేరళ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన బీజేపీకి ‘హవాలా మనీ’ ఆరోపణలు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. కార్యకర్తల స్థాయి నుంచి కీలక నేతల దాకా ప్రతీ ఒక్కరి మధ్య ఈ స్కామ్ చిచ్చుపెడుతోంది. ఎన్నికలకు ముందు త్రిస్సూరు కొడకారా హైవేపై దోపిడి జరగడం.. ఈ కేసులో బాధితుడు ఫిర్యాదు చేసిన సొమ్ముకంటే ఎక్కువ సొమ్మును పోలీసులు రికవరీ చేస్తుండడం, ఆ సొమ్ముతో రాజకీయ నేతలకు లింకులు.. వెరసి పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి అక్కడి రాజకీయాలు. త్రిస్సూరు: ఎన్నికల్లో గెలుపు కోసం కేరళ బీజేపీ డబ్బులు పంచాలని ప్రయత్నించిందని, కానీ బీజేపీ నేతలే ఆ డబ్బు కోసం దోపిడీ డ్రామాలు ఆడారనే ఆరోపణలు.. ప్రస్తుతం ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. అయితే ఇదంతా ఎల్డీఎఫ్(సీపీఐ-ఎం) రాజకీయ కుట్రలో భాగమేనని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ప్రభుత్వంతో కుమ్మక్కై పోలీసులు కుట్రకు పాల్పడుతున్నాయని ఆదివారం బీజేపీ పక్ష నేతలంతా మీడియా సమావేశం నిర్వహించి ఆరోపణలకు దిగారు. ఈ సమావేశంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్‌తో పాటు కేంద్ర మంత్రి మురళిధరన్, పార్టీ మాజీ అధ్యక్షులు కుమ్మనం రాజేంద్రన్, కృస్ణదాస్ ఇంకా సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇలా మొదలైంది.. ఏప్రిల్ 7న త్రిస్సూరుకు చెందిన షమ్జీర్ శామ్సుదీన్ అనే వ్యక్తి కొడకారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఏప్రిల్ 3న రాత్రి.. అంటే అసెంబ్లీ ఎలక్షన్లకు మూడు రోజుల ముందు షమ్జీర్ తన కారులో కొచ్చివైపు వెళ్తున్నాడు. ఆ టైంలో కొడకారా ఫ్లైఓవర్ వద్ద తొమ్మిది మంది దుండగులు ‘ఫేక్ యాక్సిడెంట్’తో తనను ఆపారని, బెదిరించి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తీసుకెళ్తున్న పాతిక లక్షల రూపాయలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతను ఒంటరిగా వెళ్లి ఫిర్యాదు చేయలేదు. అతని కూడా వ్యాపారవేత్త ఏకే ధర్మరాజన్ కూడా ఉన్నాడు. ధర్మరాజన్ ఆరెస్సెస్ సభ్యుడు. ఆయన ఆ డబ్బును చాలామంది దగ్గరి నుంచి అప్పుగా తీసుకున్నానని చెప్పడం, సరిగ్గా దోపిడీ జరిగింది ఎన్నికల టైం కావడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. డొంక కదిలింది.. ఈ కేసులో దీపక్ అనే వ్యక్తి పోలీసులు మొదటగా అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారంతో ఈ దోపిడీలో పాల్గొన్న మరో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు పాతిక లక్షల కంటే ఎక్కువ సొమ్మును రికవరీ చేయడంతో అసలు ట్విస్ట్ మొదలైంది. దీంతో పోలీసులు ధర్మరాజన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. యువ మోర్చా నేత సునీల్ నాయక్ తనకు ఆ డబ్బు ఇచ్చాడని ధర్మరాజన్ చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు సునీల్ పిలిపించుకుని విచారించారు. తనకు ఆ డబ్బు బయటి నుంచి వచ్చిందని, ధర్మరాజన్తో తనకున్న లావాదేవీల కారణంగానే ఆ డబ్బు ఇచ్చానని చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు మరోసారి ధర్మరాజన్‌ను ఇంటరాగేషన్ చేయడంతో.. ఆ సొమ్ము బీజేపీ నేతల కోసమేనని ధర్మరాజన్ చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో లింకులు! త్రిస్సూరులోని ఓ హోటల్లో బీజేపీ కీలక నేత ఒకరు తనకోసం రూమ్ బుక్ చేశారని ధర్మరాజన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది నిజమేనని ఒప్పుకున్న బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్.. కేవలం ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఇంఛార్జిగా ఉన్న ధర్మరాజన్ కోసం ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ సొమ్ము బీజేపీకి చెందిన మరో ముగ్గురు నేతలకు అందించాల్సి ఉందని ధర్మరాజన్ చెప్పగా, వాళ్లు మాత్రం ఆ డబ్బుతో తమకేం సంబంధం లేదని పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ కేసులో అరెస్టయిన దీపక్.. దోపిడీ జరిగిన తెల్లారే బీజేపీ ఆఫీస్‌కు వెళ్లాడన్న విషయం వెలుగులోకి రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పైగా రికవరీ సొమ్ము దగ్గర దగ్గర మూడున్నర కోట్ల రూపాయలు ఉండొచ్చని పోలీసులు అంచనాకి వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగప్రవేశంతో ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో కోటి రూపాయల దాకా సొమ్ము రికవరీ అయినట్లు తెలుస్తోంది. సొంత నేతల పనేనా? ఈ దోపిడీలో ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్.. దోపిడీ తర్వాత బీజేపీ ఆఫీస్‌కు వెళ్లిన విషయాన్ని పార్టీ కూడా ధృవీకరించింది. అయితే దోపిడీకి సంబంధించి సొంత నేతలపైనే అధిష్టానానికి అనుమానం వచ్చిందని, ఆ కోణంలోనే దర్యాప్తు కోసం కొందరిని ఆఫీస్‌కు పిలిపించుకున్నామని, అందులో కార్యకర్త దీపక్ కూడా ఉన్నాడని బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్ చెప్పాడు. దీంతో ఈ దోపిడీ స్కెచ్ బీజేపీలోని సొంత నేతల పనే అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు కొడాకరా దోపిడీ గురించి బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసుకున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కేరళ బీజేపీలో అంతర్గత కుమ్ములాట వల్లే ఇదంతా జరిగి ఉండొచ్చని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అయితే ఈ కాంట్రవర్సీకి బీజేపీ కేరళ అధిష్టానం దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే.. ఇదంతా ఎల్డీఎఫ్ కుట్రలో భాగమేనని వాదిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని పట్టుకోవాల్సింది పోయి.. బీజేపీ నేతలతో ముడిపెట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపణలను దిగింది. నిందితుల్లో లెఫ్ట్ నేత కూడా?! పోలీసులు నిందితుల కాల్ లిస్టులను పరిశీలించాల్సింది పోయి.. వ్యాపారవేత్త అయిన ధర్మరాజన్ కాల్ లిస్ట్‌ను జల్లెడ పడుతోందని బీజేపీ మండిపడింది. ఈ కేసులో ఆరెస్ట్ చేయాల్సిన నిందితుడు మరోకడున్నాడని, అతను లెఫ్ట్ పార్టీ యూత్ వింగ్ లీడర్ మాత్రమే కాదని, త్రిస్సూరుకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఆ నిందితుడు ఈ కేసు నుంచి తప్పించునేందుకు వామపక్ష ఉద్యమవేత్త ఎన్ఎన్ పురం సాయం కూడా తీసుకున్నాడని చెప్పాడు. సీపీఎం నేత కొడియారి బాలకృష్ణన్ కొడుకును బెంగళూరులో డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేయగా, ప్రతీకారంగానే తన కొడుకు హరికృష్ణన్‌ను విచారణపేరుతో ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సురేంద్రన్ ఆరోపణలకు దిగారు. సిట్ ముందుకు నేతలు కొడకారా దారి దోపిడీ కేసు వ్యవహారంలో కేరళ బీజేపీ కీలక నేతల్ని ప్రశ్నిస్తోంది సిట్. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సురేంద్రన్ ఎన్నికల టైంలో ఇద్దరికి లంచాల ప్రలోభం చూపెట్టాడన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆయన డ్రైవర్‌తో పాటు ముఖ్య అనుచరుల్ని సిట్ ప్రశ్నించింది కూడా. ఇక సురేంద్రన్ తనయుడు హరికృష్ణన్.. దోపిడీ జరిగిన రోజు ధర్మరాజన్తో పలుమార్లు ఫోన్‌కాల్స్ మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో హరికృష్ణన్‌కు సిట్ నోటీసులు పంపింది. మరోవైపు బీజేపీ నేత, నటుడు సురేష్ గోపీని కూడా(హెలికాఫ్టర్ల ప్రచారంపై) ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొడకారా కేసులో న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈడీ దృష్టి కొరకాడ హవాలా మనీ కేసు అని, ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యం చేసుకోవాలని కోరుతూ లోక్‌తంత్రిక్ జనతా దళ్ యువ విభాగం జాతీయాధ్యక్షుడు సలీం మడావూర్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసులో జోక్యం చేసుకుంటుందో లేదో తెలపాల్సిందిగా ఈడీ ఏజెన్సీని ధర్మాసనం కోరింది. అయితే ఈడీ వారం గడువు కోరగా.. కోర్టు పదిరోజుల గడువు మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈడీ ఇప్పటికే ఈ కేసు ఫైల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
ఉద్దండులకు సాధ్యపడలేదు.. కానీ ఆయన సాధించారు
సంపూర్ణ అక్షరాస్యత.. వర్తమాన అంశాలపై పూర్తి అవగాహన కేరళ ప్రజల సొంతం.. రాజకీయాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటారు. అందుకే గత 40 ఏళ్లుగా ఒక్కసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఎందరో రాజకీయ చతురులు.. మరెందరో ఉద్దండులకు కూడా అది సాధ్యపడలేదు. నంబూద్రీపాద్, ఏకే గోపాలన్, కృష్ణ పిళ్లై వంటి శక్తిమంతమైన కమ్యూనిస్టు నేతలే అక్కడి ప్రజల నాడి పట్టలేకపోయారు. దీన్ని బట్టే కేరళ ప్రజల రాజకీయ చైతన్యం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. 1980 నుంచి ఏ ఒక్కరిని కూడా కేరళ ప్రజలు వరుసగా రెండోసారి సీఎం కుర్చీపై కూర్చోబెట్టలేదు. అలాంటిది 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. రెండోసారి అధికారంలోకి రానున్నారు కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి, కెప్టెన్, కామ్రేడ్ పినరయి విజయన్. గతంలో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఏ రాజకీయ నేతకూ సాధ్యంకాని ఈ అరుదైన రికార్డు.. విజయన్ను ఎలా వరించింది..? అఖండ విజయ సాధనకు తోడ్పడిన అంశాలేంటి..? గత ఐదేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తిరిగి ఎలా విజయ పతాకా ఎగరేయగలిగారు..? సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి రావడానికి పినరయి విజయన్ నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడ్డాయని అనడంలో సందేహం లేదు. ఎన్నికలకు ముందే విజయన్ రచించిన వ్యూహాలు ప్రతిపక్షాలను ఎన్నికల్లో నిలదొక్కుకోకుండా చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో విభేదాలు పినరయికి బాగా కలిసొచ్చాయి. కష్టకాలంలో ముందుండి.. సమస్య వచ్చినప్పుడే అసలైన లీడర్ ఎవరో తెలుస్తుంది అంటారు. గత ఐదేళ్లుగా కేరళలో ఒకదాని వెనుక ఒకటి వచ్చి పడుతున్న ఉపద్రవాలను చాకచక్యంగా, విజయవంతంగా ఎదురొడ్డి నిలిచారు పినరయి విజయన్. సమస్యలు, ఇబ్బందులు ఉన్న చోట తాను ఉన్నానంటూ ధైర్యం ఇచ్చారు. 2017లో ఓఖి సైక్లోన్, 2018లో నిపా వైరస్, 2018, 2019లో వరదలు, 2020లో కరోనా మహమ్మారి.. ఇలా అన్ని విపత్తులనూ విజయన్ సమర్థం గా ఎదుర్కొన్నారు. సైక్లోన్ సమయాల్లో ప్రజలను రక్షించడమే కాకుండా, వారికి కావాల్సిన ఆహారాన్ని, వరదలకు సంబంధించిన కిట్లను ప్రజలంద రికీ ప్రభుత్వం చేరవేసింది. మీడియా ముందుకు వచ్చి పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తూ ప్రజలకు నిబ్బరం కల్పించారు. విపత్తు నిర్వహణలో దిట్ట.. గతేడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో వలస కూలీలు పడ్డ ఇబ్బందులు వర్ణణాతీతం.. కానీ విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర సంక్షేమ పథకాలు, సేవలతో రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం అందించింది. అడ్వాన్స్‌గా పెన్షన్ ఇవ్వడం, ఉచితంగా రేషన్ సరుకులను పంపిణీ చేసింది. వలస కార్మికులను తమ రాష్ట్ర అతిథులుగా చూసుకుంటామని భరోసా కల్పించింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యంత కష్ట కాలంలో ప్రజల బాగోగులు చూసుకోవడం ద్వారా ప్రజల మనసులను దోచుకున్నారు విజయన్. రేషన్ సరుకుల పంపిణీ లాక్డౌన్ తర్వాత కూడా ఇప్పటికీ కొనసాగుతుండటం వల్ల ప్రజలకు మరింత దగ్గరయ్యారు. హామీలన్నీ నెరవేర్చే దిశగా.. గత ఎన్నికల్లో తాను చేసిన 600 హామీల్లో.. ఏకంగా 570 హామీలను నెరవేర్చిన ఘనత విజయన్‌కే దక్కింది. ఎన్నో పథకాలను ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎంతో దూరదృష్టితో రూపొందించారు. ‘లైఫ్ మిషన్’ద్వారా ఇళ్లు లేని, భూమి లేని నిరుపేదలకు దాదాపు 2 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. ‘అర్ధ్రమ్ మిషన్’పథకం ద్వారా రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనే సరైన వైద్యం అందేలా చేశారు. ‘ఎడ్యుకేషన్ మిషన్’ద్వారా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్ క్లాస్‌రూమ్స్, హైటెక్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసి, దేశంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా పేరుగాంచేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎన్నో సూచీల్లో మొదటి స్థానంలో కేరళ నిలిచేలా ఎంతో కృషి చేశారు పినరయి విజయన్. అయితే విజయన్ ప్రస్థానం నల్లేరు మీద నడకేమీ కాదు. ఆయనా ఎన్నో ఒడిదొడుకులను చవిచూశారు. ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. అంతెందుకు సొంత పార్టీలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీపీఐఎం సీనియర్ నేత అచ్యుతానందన్‌కు, పినరయి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోల్డ్ స్మగ్లిం గ్ కేసులో ఆయన హస్తం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఒకానొక సందర్భంలో పినరయిని మీడియా విలన్‌గా చిత్రీకరించింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా, పవర్ హౌస్లా నిలబడ్డారు రియల్ కామ్రేడ్. కేరళలో మత రాజకీయాలకు స్థానం లేదని ప్రజలు నిరూపించారు. ఎల్డీఎఫ్ విజయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నా. ప్రభుత్వ ఇమేజీ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బురద చల్లేందుకు పలు మీడియా సంస్థలు చేసిన దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారు. రాష్ట్రంలో లౌకికవాదం కొనసాగాలంటే లెఫ్ట్ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనం నమ్మారు. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు లేనిపోని ప్రచారాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, వేరే రాష్ట్రాల సీఎంలు కేరళకు వచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు చాలా తాపత్రయపడ్డారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ మత రాజకీయాలు చెల్లినట్లు కేరళలో చెల్లదని మరోసారి రుజువైంది’. – పినరయి విజయన్, కేరళ సీఎం -
Pinarayi Vijayan: పినరయి దిగ్విజయన్
తిరువనంతపురం: పినరయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కేరళలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపొందింది. సీఎం పినరయి విజయన్, ఆయన కేబినెట్ సహచరులు కేకే శైలజ, ఎంఎం మణి, ఏసీ మొయిదీన్, సురేంద్రన్, రామచంద్రన్, క్రిష్ణ కుట్టీ, టీపీ రామకృష్ణన్, చంద్రశేఖరన్ తదితరులు గెలుపొందారు. ఇటీవల రాజీనామా చేసిన ఉన్నత విద్యా శాఖ మాజీ మంత్రి కేటీ జలీల్ కూడా తవనూర్ నుంచి గెలిచారు. అయితే ఫిషరీస్ మంత్రి మెర్సీకుట్టీ అమ్మ కాంగ్రెస్ అభ్యర్థి పీసీ విష్ణునాథ్ చేతిలో ఓడిపోయారు. ప్రతిపక్ష నేతలు రమేశ్ చెన్నితల, మాజీ సీఎం ఊమెన్ చాందీ గెలుపొందారు. తన సమీప అభ్యర్థి అధికార సీపీఎం తరఫున పోటీ చేసిన సీ థామస్‌పై 9,044 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి అంత సులువుగా ఏమీ రాలేదు. కేరళ నుంచి వామపక్షాలను తుడిచిపెడతామని యూడీఎఫ్, బీజేపీలు ప్రచారం సందర్భంగా చాలాసార్లు ఉద్ఘాటించాయి. ప్రభుత్వంపై వచ్చిన ఎన్నో ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసులో పార్టీ మాజీ సెక్రటరీ బాలకృష్ణన్ కుమారుడిని అరెస్టు చేశారు. ప్రభుత్వంపై కాస్త అసంతృప్తి తదితర సమస్యలను దాటుకుంటూ సీఎం పీఠం దక్కించుకుంది. గతేడాది సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పినరయి విజయన్‌కు తెలిసే జరిగిందంటూ కాంగ్రెస్ తీవ్రంగా ఎండగట్టింది. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ అధికారి ఒకరు 1.9 లక్షల డాలర్లు (రూ.1.2 కోట్లు) ఒమన్‌లోని మస్కట్‌కు స్మగ్లింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. విజయన్‌కు చాలా దగ్గరి వ్యక్తి, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.శివశంకర్‌పై ఉన్న రెండు కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతోంది. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను.. మోదీ ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు తమపై దాడి చేస్తున్నాయంటూ ప్రచారం చేస్తూ.. సానుభూతి పొందుతూ దే ప్రయత్నం చేసింది. మూడేళ్ల కింద శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళను అనుమతించే వివాదంతో కేరళ ప్రభుత్వం ఒకానొక సందర్భంలో తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ వివాదం అధికారపార్టీపై తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో తిరిగి అధికారంలోకి వస్తామా అని ఎల్డీఎఫ్ వర్గాలే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా విజయం వరిస్తుందని ఆశలు చిగురించాయి. ఉన్న ఒక్కసీటూ కోల్పోయిన బీజేపీ కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. గతంలో ఉన్న సిట్టింగ్ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ‘మెట్రోమ్యాన్’ఇ.శ్రీధరన్ కూడా గెలవలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందగా, ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయింది. మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్‌ను బరిలో దింపగా, సీపీఎం అభ్యర్థి వి.శివకుట్టి చేతిలో పరాజయం చెందారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ కొన్ని రౌండ్ల వరకు ఆధిక్యం కనబర్చినా.. చివరి క్షణంలో సీపీఎం అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే షఫీ పారాంబిల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ప్రకటించని బీజేపీ.. శ్రీధరన్‌ను తమ పార్టీ సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం చేసింది. అయినా బీజేపీ వ్యూహం కేరళలో ఫలించలేదు. సినీ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్ గోపీ బీజేపీ తరఫున బరిలో దిగారు. ఓట్ల లెక్కింపులో సురేశ్ ఆధిక్యం కనబర్చినా.. చివరి రౌండ్లతో ఫలితం తారుమారైంది. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్ కూడా కంజిరపల్లి స్థానం నుంచి ఓడిపోయారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. లవ్ జిహాద్, శబరిమల ఆలయంలోని మహిళల ప్రవేశం వంటి అంశాలను బీజేపీ తన అస్త్రాలుగా మార్చుకుని తీవ్రంగా ప్రచారం చేసింది. ఎల్డీఎఫ్పై తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగించింది. అయినా కేరళలో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తాజా ఫలితాల ద్వారా స్పష్టం అవుతోంది. సరైన రాష్ట్రస్థాయి నాయకుడు లేకనే.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్ పాత్ర వంటి అంశాలను యూడీఎఫ్ కూటమి ఓటర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కాకపోతే పినరయి విజయన్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడితో దీటుగా ఎదుర్కోగల నేత లేకపోవడం కూడా యూడీఎఫ్ వెనుకంజకు ముఖ్య కారణమని విశ్లేషిస్తున్నారు. మాజీ సీఎం ఊమెన్ చాందీ ఎన్నికల ర్యాలీలో.. ఓ మత సంస్థలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలు కూడా యూడీఎఫ్ కూటమికి నష్టం చేకూర్చాయనే చెప్పొచ్చు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు చెక్ పెట్టగల సత్తా తమకే ఉందని యూడీఎఫ్ భావించింది. అయితే ఫలితాలు అందుకు భిన్నంగా ఉండటంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బ అని చెబుతున్నారు. -
44 ఏళ్ల చరిత్రను తిరగ రాసిన పినరయి విజయన్
సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కేరళలో రెండవసారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎన్నికలలో గెలిచి 44 ఏళ్ల చరిత్రను పినరయి విజయన్ తిరగ రాయనున్నారు. కేరళ రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు తర్వాత ఎల్డిఎఫ్ 95 స్థానాల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్(యుడిఎఫ్) 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు. గత నాలుగు దశాబ్దాల చరిత్రలో కేరళలో అధికార పార్టీ రెండవసారి విజయం సాధించిన సందర్భాలు లేవు. కానీ, ఈసారి సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఆ చరిత్రను తిరగ రాయనుంది. గెలుపు అంచులకు చాలా దగ్గరలో ఉంది. 2016లో 91 స్థానాలను దక్కించుకున్న ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఈ సారి 95 నుంచి 100 వరకు స్థానాలను గెలిచే అవకాశం ఉంది. బహుళ ఎగ్జిట్ పోల్స్, ప్రీ-పోల్స్ అన్నీ అంచనా వేసినట్లుగా స్పష్టమైన మెజారిటీతో ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమిపై విజయాన్ని సొంతం చేసుకోనుంది. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. చదవండి: చెత్తకుప్పలో మెతుకులే పరమాన్నం -
కేరళ: మరోసారి లెఫ్ట్ ప్రభుత్వం.. ధర్మదాం నుంచి పినరయి విజయం
లైవ్ అప్డేట్స్: ► "కేరళ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినందుకు పినరయి విజయన్, ఎల్డీఎఫ్ కు నా అభినందనలు. మేము ఇద్దరం కలిసి విస్తృతమైన విషయాలపై పనిచేస్తాము. కోవిడ్ -19 మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టే విషయంలో కలిసి పనిచేయనున్నాం" అని పీఎం మోడీ ట్వీట్ చేశారు. ► కేరళ ఎన్నికల్లో ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సీపీఎం నాయకుడు పినరయి విజయన్ కాంగ్రెస్ సీ రఘునాథన్ పై 50,123 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ► "కేరళ ప్రజలు మరోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. అయితే కోవిడ్ -19 వల్ల పెద్దగా సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదు. ప్రతి ఒక్కరూ కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు ► శశి థరూర్ పినరయి విజయన్ ను అభినందించారు "గత 44 సంవత్సరాలలో మొదటిసారి తిరిగి ఎన్నికైనందుకు @CMOKerala @vijayanPinarayiకి నా అభినందనలు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని గౌరవించడం వారి కర్తవ్యం. #కోవిడ్ & మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు మన మద్దతు ఉండాలి "అని ఎల్డిఎఫ్ చారిత్రాత్మక విజయంపై శశి థరూర్ ట్వీట్ చేశారు. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్...! ► మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. కాగా మరోసారి ఎల్డీఫ్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ► కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ గెలిచిన చరిత్ర ఇదేనని చెబుతున్నారు. ► కేరళలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార ఎల్డీఎఫ్ ఆధిక్యంలో దూసుకు పోతుంది. 44 స్థానాల్లో గెలుపొంది, 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 10 స్థానాలను కైవసం చేసుకుని, 35 లీడ్‌లో ఉంది. ► ఎల్డీఎఫ్ 70 , యూడీఫ్ 37 స్థానాలలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎల్డీఎఫ్ 26, యూడీఫ్ 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ► త్రిశూర్‌లో బిజేపీ అభ్యర్థి సురేష్ గోపి ముందంజలో ఉన్నారు. ► రెండోసారి విజయం దిశగా దూసుకుపోతున్న లెఫ్ట్ ప్రభుత్వం.. ► పినరయి విజయన్‌దే ఈవిజయం అంటున్న విశ్లేషకులు.. ► ధర్మదాంలో సీఎం పినరయి విజయన్ ఆధిక్యం ► పుత్తుపల్లిలో ఊమెన్ చాందీ చాంది ఆధిక్యం ► కేరళలో పాలక్కడ్‌లో మెట్రోమాన్ శ్రీధరన్ ముందంజ.. ► కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ ధర్మదంలో పోటీ చేసిన పినరయి విజయన్(CPM) పుట్టుపల్లిలో పోటీ చేసిన ఊమెన్ చాందీ(కాంగ్రెస్) కళహాకూట్టంలో పోటీ చేసిన శోభా సురేంద్రన్(బీజేపీ) ► కేరళలో ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న అధికార ఎల్డీఎఫ్.. ఎల్డీఎఫ్ 78 , యూడీఎఫ్ 48 ► కేరళలో తొలి రౌండ్లో ఎల్డీఎఫ్ ఆధిక్యం.. ఎల్డీఎఫ్ 68, యూడీఎఫ్ 47 ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 33, యూడీఎఫ్ 18 చోట్ల ఆధిక్యం ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 14, యూడీఎఫ్ 9 చోట్ల ఆధిక్యం ► కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్‌లో భాగంగా కేరళలో 633 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. కేరళలో 140 శాసనసభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
సీఎంకు మరో తలనొప్పి : రంగంలోకి కొత్త పార్టీ
సాక్షి, తిరువనంతపురం : రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలనేపథ్యంలో కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)నేత మణి సీ కప్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు గాను ఒక కమిటీనీ ఏర్పాటు చేశారు. కేరళలో అధికార కూటమి ఎల్డీఎఫ్లో భాగంగానున్న ఎన్సీపీకి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లో చేరిన అనంతరం తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. కప్పెన్ కొత్త పార్టీ, 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో 25వ రాజకీయ పార్టీగా అవతరించనుంది. కొత్త పార్టీ యోచనలో భాగంగా 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. మణి సీ కప్సన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పార్టీ పేరు, చిహ్నం ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ వారాంతంలో పార్టీ పేరు తదితర వివరాలు వెల్లడికానున్నాయని అంచనా. ఏడు జిల్లాల ఎన్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర క్యాడర్లోని తొమ్మిది మంది నేతల మద్దతు ఉన్నట్టు ప్రకటించుకున్న ఎమ్మెల్యే మణి సీ కప్పన్ యూడీఎఫ్‌లో చేరారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల నేతృత్వంలోని ఐశ్వర్య కేరళ యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత కేఎం మణి మరణించడంతో, పాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఉపఎన్నికల్లో మణి సీ కప్పన్ ఎల్డీఎఫ్ టిక్కెట్ పై గెలిచారు. అయితే, రానున్న ఎన్నికల్లో పాల స్థానంలో టికెట్‌ను వేరే అభ్యర్థి ఇవ్వనున్నట్టు సీపీఐ సారథ్యంలోని ఎల్డీఎఫ్ నిర్ణయించడం ఎన్సీపీ ఎమ్మెల్యే మణి సీ కప్పన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి గుడ్పైచెప్పి యూడీఎఫ్‌లో చేరారు. ఆదివారం ఐశ్వర్య ర్యాలీలో మాట్లాడిన ఆయన ఎల్డీఎఫ్కు అధికారం దక్కదని, రాష్ట్రంలో ఈ పార్టీకి కాలం చెల్లినట్టేనని వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న సీపీఐ(ఎం) నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్కు ఎదురు దెబ్బ తగలనుంది. -
21 ఏళ్లకే విజయం: దేశంలో తొలి మేయర్
తిరువనంతపురం\: వయసు కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం. దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ అనే విద్యార్థిని పేరు ఖరారైంది. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం తిరువనంతపురంలోని అల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సెకండియర్ చదువుతున్నారు. సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీపీఎం చిన్నారుల విభాగమైన బాలసంఘం కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్‌ముగళ్ వార్డు కౌన్సిలర్‌గా సీపీఎం టికెట్‌పై పోటీ చేశారు. కేరళలో స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. తిరువనంతపురం ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. అయితే, మేయర్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోయారు. ఆర్య రాజేంద్రన్ పేరును సీపీఎం జిల్లా నేతలు తెరపైకి తీసుకు రాగా అగ్ర నాయకత్వం అంగీకరించింది. దీంతో ఆర్య రాజేంద్రన్ మేయర్ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తానని ఆమె చెప్పారు. ప్రజలకు సేవ చేయడంతోపాటు తన చదువును కొనసాగిస్తానని తెలిపారు. ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్, తల్లి ఎల్ఐసీ ఏజెంట్. ఇప్పటిదాకా రికార్డు తెలుగమ్మాయి పేరిటే.. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య పేరిట ఉంది. ఆమె 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్టిక్కెట్పై పోటీ చేశారు. 26 ఏళ్ల వయసులోనే మేయర్‌గా ఎన్నికయ్యారు. -
కేరళ ‘స్థానికం’లో ఎల్డీఎఫ్ జయకేతనం
తిరువనంతపురం: కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మంచి విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఫ్) మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్లకు డిసెంబర్ 8, 10, 14వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం.. ఎల్డీఎఫ్ 514 గ్రామ పంచాయతీల్లో పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం కార్పొరేషన్ ఎల్డీఎఫ్ పరమైంది. కేరళలో ఎలాగైనా పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు నిరాశే మిగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ వంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పినరయి విజయన్ ప్రభుత్వానికి తాజా ఎన్నికల ఫలితాలు ఊరట కలిగించాయనే చెప్పారు. కేరళలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
తిరువనంతపురం విజేత ఎవరు?
సాక్షి, తిరువనంతపురం: తెల్లటి కద్దరు చొక్కా, దోవతి ధరించిన కుమ్మనం రాజశేఖరన్ బీజీపీ అభ్యర్థిగా తిరువనంతపురం కోక్‌సభ నియోజక వర్గంలో ఆదివారం వరకు విస్తతంగా పర్యటించారు. కచాని నుంచి కేశవదాసపురం వరకు సాగిన ఆయన ఎన్నికల యాత్రలో ఆయన ఎదురైన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగగా, ఆయన పార్టీ కార్యకర్తలు దారి పొడువున ఆయనకు కాషాయ, ఆకుపచ్చ కండువాలు కప్పుతూ ‘భారత మాతాకు జై’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల మాట్లాడుతూ తాను నియోజకవర్గం అభివద్ధికి కృషి చేయడంతోపాటు సంస్కతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తానంటూ ‘వివాదాస్పద శబరిమల’ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవాళ్లను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కృషి చేయగా, బీజేపీ, ఆరెస్సెస్ సంస్థలు అందుకు వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. తద్వారా బీజేపీ తిరువనంతపురం ప్రాంతంలో తన బలాన్ని పెంచుకుంది. తొలుత, సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ సమర్థించింది. గణనీయ సంఖ్యలో సుప్రీం తీర్పును ప్రజలు వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావడంతో బీజేపీ తన వైఖరిని మార్చుకొని ప్రత్యక్షంగా ఆందోళనలకు దిగింది. గత 70 ఏళ్లుగా రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకోసారి మారుతూ వస్తున్నాయని, ఈసారి ఆ మార్పు తిరువనంతపురంలో బీజేపీకి అనుకూలంగా మారుతుందని రాజశేఖరన్ మీడియాతో వ్యాఖ్యానించారు. వరుసగా గత రెండు ఎన్నికల్లో తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శశిథరూర్ విజయం సాధిస్తూ వచ్చారు. మూడవ విడతగా తిరువనంతపురంలో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగుతోంది. ఒక్క ఈ నియోజకవర్గంలోనే కాదు, మొత్తం కేరళలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏనాడు విజయం సాధించలేదు. ఈసారి శబరిమల వివాదం వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకని రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ 14, మిత్రపక్షాలు ఆరు స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మిత్రపక్షమైన భారత ధర్మసేన ఐదు, కేరళ కాంగ్రెస్ (థామస్) ఒక్క స్థానానికి పోటీ చేస్తున్నాయి. తిరువనంతపురం సీటును కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని ఉవ్యూళ్లూరుతున్న బీజేపీ, రాజశేఖరన్ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఆయన విజయం కోసం భారీ ఎత్తున ఆర్థిక వనరులను సమకూర్చినట్లు తెల్సింది. మరో పక్క ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆరెస్సెస్ స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్‌ను ఇక్కడికే పంపించింది. అయితే ఆయన విజయం అంత సులువుకాదు, కచ్చితమూ కాదు. కాంగ్రెస్ అభ్యర్థిగా శశిథరూర్యే కాకుండా ఎల్డీఎఫ్ తరఫున బలమైన అభ్యర్థి, మాజీ మంత్రి సీ. దివాకరన్ పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో శశిథరూర్ మొదటిసారి 99,998 ఓట్ల మెజారిటీ తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి పీ. రామచంద్రన్ నాయర్‌పై విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి పీ. కష్ణదాస్ కేవలం 84,094 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో కూడా శశిథరూర్ రెండోసారి విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి ఓ. రాజగోపాల్ రెండో స్థానంలో వచ్చారు. ఆ ఎన్నికల్లో శశిథరూర్ మెజారిటీ 15,470 ఓట్లకు పడి పోవడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో బీజేపీ 1998 నుంచి తన పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వస్తోంది. 1998లో 12.39 శాతం ఓట్లురాగా, 1999లో 20.93 శాతం, 2004లో 29.86 శాతం ఓట్లు వచ్చాయి. 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పోలింగ్ శాతం దారుణంగా 4.8 శాతంకు పడిపోయింది. అది 2009లో 11.4 శాతానికి, 2014లో 32.32 శాతానికి పెరిగింది. 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరువనంతపురం జిల్లాలోని నిమామ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంది. -
చితక్కొట్టుకున్న కార్యకర్తలు.. వీడియో వైరల్
తిరువనంతపురం : కేరళలోని కొల్లాంలోని పూయపల్లిలో రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన కేరళలో పోలింగ్ జరుగనున్న 20 లోక్‌సభ స్థానాల్లో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) మధ్యనే తీవ్ర పోటీ నెలకొని ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన ఆదివారం పూయపల్లిలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో చేతుల్లో ఉన్న పార్టీ జెండాలతోనే ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. -
రాగాలాపన
దేవతలు నడయాడే భూమిగా పిలిచే కేరళలో ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. అయ్యప్ప శరణుఘోష మిన్నంటే ప్రాంతంలో ఎన్నికల రణన్నినాదాలు హోరెత్తుతున్నాయి. రాష్ట్రంలో రెండే పక్షాలు.. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్).. లేదంటే వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్). అయిదేళ్లకి ఒకసారి కూటమిని మార్చే సంప్రదాయం ఈ రాష్ట్రం సొంతం. ఇక, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీకి దిగడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. శబరిమల వివాదం కమలనాథులకు ఓట్లు రాలుస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టమ్మీద ఒక్క సీటు సాధించిన బీజేపీ.. లోక్‌సభలో ఖాతా తెరుస్తుందా?.. అంతటా ఇవే ప్రశ్నలు..ఓటరు తీర్పెలా ఉండనుందో?. పర్యాటకులకు అదొక స్వర్గధామం. పచ్చని చెట్లు, బ్యాక్ వాటర్స్, మలబారు తీరం హాయిగొలిపి సేదదీరుస్తాయి. కేరళలో అక్షరాస్యత ఎక్కువ. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు ఉంది. కానీ కొన్ని వర్గాల ప్రజల్లో మత మౌఢ్యాలు, సంకుచిత స్వభావాలతో చైతన్యం పెరగలేదు. హిందువుల్లో అగ్రకులమైన నాయర్లు, వెనుకబడిన కులమైన ఈళవల ప్రాబల్యం ఎక్కువ. సాధారణంగా వామపక్షాల భూస్వామ్య వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ జాతీయవాదం మధ్య ఓట్లు చీలిపోతుంటాయి. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలను ప్రతీ ఎన్నికల్లోనూ మార్చడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రెండు కూటములు మైనార్టీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పుడు బీజేపీ శబరిమల వివాదంతో తమ ఓటు బ్యాంకుని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సీపీఎం, ఆరెస్సెస్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ రాజకీయ హత్యలకు పాల్పడడం రాజకీయాల్ని ప్రమాదంలో పడేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు హత్యకు గురికావడం, సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై వ్యతిరేకత దాదాపు ఆరు లోక్‌సభ సీట్లలో ప్రభావం చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ బరిలో దిగడంతో ఆ పార్టీ ప్రధాన మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)లో ఉత్సాహం పొంగిపొరలుతోంది. ముస్లింలంతా ఈసారి యూడీఎఫ్ కూటమికే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఖాతా తెరుస్తుందా? ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని బీజేపీ.. ఈసారి బోణీ కొట్టాలని ప్రయత్ని స్తోంది. భారత్ ధర్మ జనసేన (బీడీజేఎస్)తో పొత్తు పెట్టుకొని లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొంటోంది. కొన్నేళ్లుగా సంఘ్ పరివార్ తన కార్యకలాపాల్ని బాగా విస్తరించింది. కొన్ని సామాజిక అంశాలను లేవనెత్తుతూ పోరుబాట పడుతోంది. వాటిలో గోవధ, గో మాంసం వినియోగంపై నిషేధం, లవ్ జీహాద్, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వంటివి ఉన్నాయి. వీటి ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్ని స్తోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన సమయంలో ఆర్ఎస్ఎస్ కేరళలో ఏకంగా ఐదు వేల శాఖల్ని ప్రారంభించింది. సంప్రదాయంగా కేరళ రాష్ట్రంలో హిందూత్వ సిద్ధాంతాలకు అంతగా ఆదరణ లేకున్నా.. శబరిమల అంశంలో ఆర్ఎస్ఎస్కు మద్దతు అంతో ఇంతో కనిపించింది. మహిళలు రుతుస్రావం జరిగే వయసులో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లకూడదనేది నాయర్ల వాదన. వారికి మద్దతుగా బీజేపీ కూడా మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం దేవుడు లేడని తాను నమ్మడమే కాదు, హిందువులకు వ్యతిరేకంగా పని చేస్తోందంటూ ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తోంది. ఆ నాలుగు సీట్లపైనే బీజేపీ ఆశలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో బీజేపీ పది శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. ఈసారి శబరిమల వివాదం తమకి ఓట్లు రాలుస్తుందని ఆశలు పెట్టుకుంది. తిరువనంతపురం, త్రిస్సూర్, పథనం తిట్ట, కాసర్గోడ్ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్న బీజేపీ.. ఆ 4 సీట్లపై దృష్టి సారించింది. తిరువనంతపురంలో బరిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ (కాంగ్రెస్)కి గట్టి పోటీ ఇవ్వడానికి మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్‌ను పోటీకి దించింది. శబరిమల వివాదం తర్వాత నెలకొన్న వాతావరణం నేపథ్యంలో రాజశేఖరన్ గెలుపు గుర్రంగానే భావిస్తు న్నారు. ఇక ఎల్డీఎఫ్ నుంచి మంత్రిగా ప్రజాదరణ పొందిన సి.దివాకరన్ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ ముగ్గురే కావడంతో ఫలితం అంతుబట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో శశిథరూర్‌కి 34.09 శాతం ఓట్లు పోలైతే, 32.09 శాతం ఓట్లతో రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒ.రాజగోపాల్ నిలిచారు. వీరిద్దరి మధ్య ఓట్లలో తేడా చాలా తక్కువగా ఉండడం గమనార్హం. వరద చుట్టూ రాజకీయాలు గత ఏడాది ఆగస్టులో కేరళని వరదలు ముంచెత్తి అతలాకుతలం చేశాయి. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పి.విజయన్ (కేరళ సీఎం) సర్కార్ సహాయ చర్యలపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వరద సహాయ చర్యల్లో ఎల్డీఎఫ్ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంటే, కేంద్రం నుంచి సరైన సాయం అందలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో మోదీ సర్కార్‌పై నిప్పులు చెరుగుతోంది. వరదలు ముంచెత్తి ఇప్పటికే ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వందల కుటుంబాలు కోలుకోలేని స్థితిలోనే ఉన్నాయి. దక్షిణ కేరళలో అలపుజ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొన్ని ఇళ్లు మామూలు రూపురేఖలకు రాలేదు. బూత్‌ల ఏర్పాటుకు వెతుకులాట వరద బీభత్సానికి లోనైన పాఠశాలల్లో ఇంకా మరమ్మతు పనులు పూర్తి కాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా 441 పోలింగ్ స్టేషన్లను వెతుక్కోవాల్సిన పనిలో ఉంది. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయడానికి కొత్తవి, సురక్షితమైన భవనాలు వెతుక్కోవడం ఎన్నికల సంఘానికి సవాల్‌గానే మారింది. కానీ పోలింగ్ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి టీకా రామ్ మీనా ధీమా వ్యక్తం చేశారు. మహిళల స్థానం ‘ఇంతి’ంతే! రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. కానీ మహిళలను చట్టసభలకు పంపే అంశంలో కేరళ ఇంకా వెనుకబడే ఉంది. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి ఏకైక మహిళ పి.కె. శ్రీమతి మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. లోకసభలో మహిళల ప్రాతినిధ్యం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 సభ్యులకు 61 మంది మహిళలు ఎన్నికైతే (11.23%), కేరళ నుంచి ఎన్నికైన 20 మంది సభ్యుల్లో ఒక్కరే మహిళ (5%). ఈసారి ఎన్నికల్లో సీపీఎం ఇద్దరు మహిళలకు సీట్లు ఇస్తే, కాంగ్రెస్, బీజేపీ కూడా ఇద్దరు అభ్యర్థులనే బరిలో నింపాయి. మహిళలకు సీట్లు ఇవ్వడంలో రాజకీయ పార్టీలన్నిటిదీ ఒకే దారి. ఈసారైనా కేరళ ఓటర్లు మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచుతారా లేదా అన్న చర్చ నడుస్తోంది. ► ఎల్డీఎఫ్.. సిట్టింగ్ ఎంపీ శ్రీమతితో పాటు పథనం తిట్ట నుంచి వీణా జార్జ్‌కు టికెట్లు ఇచ్చింది. 70 ఏళ్ల వయసులోనూ విస్తృత ప్రచారం చేస్తున్న శ్రీమతి గెలుపుపై ధీమాతో ఉన్నారు. ► కాంగ్రెస్ కూడా ఇద్దరు మహిళలకు సీట్లు ఇచ్చింది. అలపుజ నుంచి శనిమోల్ ఉస్మాన్‌ను బరిలోకి దింపితే అళత్తూర్ నుంచి రమ్య హరిదాస్‌కు పోటీకి దించింది. ఎస్సీ రిజర్వుడు సీటు నుంచి పోటీ చేస్తున్న రమ్య హరిదాస్ మంచి గాయని. మ్యూజిక్‌లో బీఏ చేసింది. రమ్య తండ్రి రోజు కూలి. తల్లి మహిళా కాంగ్రెస్‌లో సభ్యురాలు. రమ్యలో టాలెంట్‌ను చూసి రాహుల్ స్వయంగా పిలిచి సీటు ఇచ్చారు. ► బీజేపీ కూడా ఇద్దరికే సీట్లు ఇచ్చింది. అత్తింగళ్ నుంచి శోభా సురేంద్రన్, పొన్నాని నుంచి వి.టి.రమను బరిలోకి దింపింది. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ► శబరిమల వివాదం: అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుకూలంగా సుప్రీం తీర్పు, అనంతర పరిణామాలను బీజేపీ అస్త్రంగా చేసుకొని కొన్ని సీట్లయినా కొల్లగొట్టాలని వ్యూహరచన చేస్తోంది ► రాజకీయ హత్యలు: ఆర్ఎస్ఎస్, సీపీఎం, కాంగ్రెస్.. ఈ మూడూ రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నాయి. కాసరగోడ్, కన్నూర్, వడకరలో రాజకీయ హింసే ప్రచారాస్త్రం కానుంది ► వరదలు– సహాయ చర్యలు: గత ఏడాది ఆగస్టులో వరదలు ముంచెత్తినపుడు విజయన్ సర్కార్ శక్తివంచన లేకుండా సహాయ కార్యక్రమాలు అందించినా, చాలాచోట్ల పునరుద్ధరణ పనులు పూర్తి కాలేదు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు భవనాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. దీనినే కాంగ్రెస్ అస్త్రంగా మలచుకుంది ► రైతుల ఆత్మహత్యలు, గ్రామీణ సంక్షోభం: పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన నష్టంపై గ్రామీణ ప్రాంతవాసులు కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. ► రాహుల్ గాంధీ ప్రభావం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం నుంచి స్వయంగా పోటీకి దిగడంతో.. మొత్తం తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారతాయని అంచనా. రాహుల్‌ని ఓడించలేని ఇతర పక్షాలు కనీసం ఆయన మెజారిటీ తగ్గించడానికి వ్యూహాలు పన్నుతున్నాయి. దేశంలోనే అక్షరాస్యత ఎక్కువగా ఉందని భుజాలు చరుచుకుంటాం. మహిళా ఓటర్లు ఎక్కువని గర్వపడతాం. కానీ మహిళల్ని చట్టసభలకు పంపాలంటే ఎవరికీ మనసు రావడం లేదు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉండడం నిజంగా సిగ్గుపడే విషయం. మా పార్టీ ఈసారి ముగ్గురికి సీట్లు ఇవ్వాలని అనుకుంది. కానీ రాజకీయ సమీకరణల మధ్య ఇద్దరికే ఇచ్చింది. ఎప్పటికైనా ఈ సంఖ్య పెరగాలని ఆశిస్తున్నాను. – పి.కె.శ్రీమతి, సీపీఎం, కన్నూర్ సిట్టింగ్ ఎంపీ వయనాడ్.. వార్ వన్‌సైడ్ కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్ని పంచుకుని ఉన్న వయనాడ్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సురక్షితమైన స్థానం. మల్లాపురంలో కొంత భాగం, కోజికోడ్‌లో కొంత భాగం కలిసి 2008లో వయనాడ్ స్థానం ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన షానవాజ్ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో లక్షా 50 వేల ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించిన ఆయన గత ఎన్నికల నాటికి ఆధిక్యం 20 వేలకు పడిపోయింది. గత ఏడాది ఆయన మరణించడంతో రాహుల్ ఈ సీటుని ఎంచుకున్నారు. ‘కేంద్రంలో మోదీ సర్కార్ దక్షిణాదిని చిన్న చూపు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో స్థానికుల్లో, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. అది చుట్టుపక్కల నియోజకవర్గాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది’ అని యూడీఎఫ్ సభ్యుడు సురేశ్ బాబు అభిప్రాయ పడ్డారు. వయనాడ్ జనాభాలో 12 లక్షల మందికిపైగా ఆదివాసీలు ఉన్నారు. వీరంతా నిరుపేదలు కావడంతో కాంగ్రెస్ ఎన్నికల హామీలో ప్రధానమైనది కనీసం ఆదాయ పథకం వీరందరికీ ఎంతటి ఉపయోగకరమో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో, ఇటు సభల్లో కూడా కాంగ్రెస్ ప్రచారం తారస్థాయికి చేరుకుంది. రాహుల్.. తన ట్విట్టర్ ఖాతాలో కూడా మలయాళం భాషలోనే ట్వీట్లు పెడుతున్నారు. ‘గాంధీ అనే పేరు చాలు రాహుల్‌ని గెలిపించడానికి. భవిష్యత్‌లో ఆయన ప్రధాని అయితే మాకే గర్వకారణం’ అని అక్కడి యువత ముక్తకంఠంతో చెబుతున్నారు. ‘ఇప్పుడు రాహుల్ గెలుస్తారా లేదా అన్నది కాదు. ఆయన పోటీ ప్రభావం ఎన్ని సీట్లపై ఉంటుంది?, ఇతర పార్టీల ప్రభావాన్ని ఎంత వరకు తగ్గించగలరు’ అనేదే ఇతర పక్షాలకు అసలు సిసలైన సవాల్ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. సర్వేలు ఏం చెబుతున్నాయ్? సర్వేలన్నీ ఈసారి యూడీఎఫ్‌కు అనుకూలంగానే ఉన్నాయి. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలిచి బోణీ కొడుతుందని సర్వేల అంచనా. ఇక అధికార ఎల్డీఎఫ్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి. రాజశేఖరన్, విజయన్, శశిథరూర్, రమ్యా హరిదాస్ శోభా సురేంద్రన్,వీణా జార్జ్,దివాకరన్, శ్రీమతి -
కేరళలో పార్టీల బలాబలాలు
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగనున్న 20 లోక్‌సభ స్థానాలకుగాను 18 లోక్‌సభ స్థానాల్లో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు మధ్యనే బహుముఖ పోటీ నెలకొని ఉంది. తిరువనంతపురం, పట్టణంతిట్ట లోక్‌సభ నియోజకవర్గాల్లోనే బీజేపీ బలం పుంజుకున్న కారణంగా త్రిముఖ పోటీ కనిపిస్తోంది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోని అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం ద్వారా ఈ రెండు నియోజక వర్గాల్లో హిందువులను బీజీపీ ఆకర్షించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే, మార్చి 6న ఎల్డీఎఫ్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ కూటమిలో సీపీఎం 16 సీట్లకు పోటీ చేస్తుండగా, నాలుగు సీట్లకు సీపీఐ పోటీ చేస్తోంది. భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్ (సెక్యులర్), లోక్తాంత్రిక్ జనతాదళ్ తరపున ఎవరూ పోటీ చేయడం లేదు. అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్ పార్టీ తన 16 మంది అభ్యర్థులను ఖరారు చేయడానికి మరో పది రోజులు పట్టింది. మిగతా నాలుగు సీట్లలో కూటమిలోని ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ రెండు సీట్లకు, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీ చెరో సీటుకు పోటీ చేస్తున్నాయి. ఈ లెక్కన సీపీఏం, కాంగ్రెస్ పార్టీలు 12 సీట్లలో ముఖాముఖి తలపడనున్నాయి. బీజేపీ కూడా సీనియర్ల పోటీ కారణంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యం చేసింది. శబరిమల ఆలయం ఉన్న పట్టణంతిట్ట నియోజక వర్గం మినహా మిగతా 19 స్థానాలకు బీజేపీ అధిష్టానం గురువారం అభ్యర్థులను ప్రకటించింది. గెలిచే అవకాశాలున్న తిరువనంతపురం సీటుకు మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్‌ను కేటాయించారు. వాస్తవానికి 16 సీట్లకే బీజేపీ పోటీ చేస్తుండగా, నాలుగు సీట్లను తన మిత్రపక్షమైన భారత ధర్మ జన సేనకు కేటాయించారు. నాలుగింటిలో ఆ పార్టీ కేవలం రెండు సీట్లలోనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాసర్‌గఢ్, పాలక్కాడ్, అలప్పూజ, కొట్టాయం ప్రాంతాల్లోనే బీజేపీకి కాస్త పట్టుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయత్వంలోని కూటమి ఏకంగా 12 సీట్లను గెలుచుకోగా, మిగతా సీట్లను వామపక్షాల కూటమి గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం కూటమి అధికారంలోకి వచ్చింది. కన్నూరు, వడకర, కోజికోడ్, పట్టణంతిట్ట, తిరువనంతపురం నియోజకవర్గాల్లో పోటీ నువ్వా, నేనా అన్నట్టు రసవత్తరంగా మారింది. -
కేరళలో దూసుకుపోతున్న ‘ఎల్డీఎఫ్’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే సీపీఎం నాయకత్వంలోని కేరళ పాలక పక్షం లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ‘మీ అంతర్గత కలహాలు ముగిశాయా, ఇదిగో మా టీం రెడీ!’ అన్న నినాదంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టేసింది. అంతకు ఒక్క రోజు ముందు అంటే, శనివారం నాడే కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఎల్డీఎఫ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్లు ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన సీట్లకన్నా ఈ సారి ఎక్కువ సీట్లను సాధిస్తామన్న ధీమాతో ఎల్డీఎఫ్ కనిపిస్తోంది. 2014 నాటి ఎన్నికల్లో ఎల్డీఎఫ్కు ఎనిమిది సీట్లు రాగా, యూడీఎఫ్‌కు మిగతా సీట్లు లభించాయి. ఎన్డీయేకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఈసారి సీపీఎం 16 సీట్లకు పోటీ చేస్తుండగా, సీపీఐ నాలుగు సీట్లకు పోటీ చేస్తోంది. మిత్రపక్షాలైన జనతాదళ్ (సెక్యులర్), లోక్తాంత్రిక్ జనతాదళ్ ఒక్క సీటుకు కూడా పోటీ చేయడం లేదు. కేరళలోని అన్ని లోక్‌సభ సీట్లకు ఏప్రిల్ 23వ తేదీన ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే 2014లోనూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే రసవత్తర పోటీ నడిచింది. బీజీపీ ఫ్రంట్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. అయితే ఒక్క తిరువనంతపురంలో ఆ పార్టీ అభ్యర్థి విజయానికి చేరువలోకి వచ్చి ఓడిపోయారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ చేతుల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ 15,470 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సీటును తిరిగి కైవసం చేసుకునే బాధ్యతను మాజీ రాష్ట్ర మంత్రి, సీపీఐ అభ్యర్థి సీ. దివాకరన్‌కు అప్పగించారు. ఇక బీజేపీ ఫ్రంట్ ఒకే ఒక ఎజెండా ‘శబరిమల’ అంశంపై ప్రచారం కొనసాగిస్తోంది. శబరిమల ఆలయంలోని అన్న వయస్కుల ఆడవాళ్లను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రయత్నించగా దానికి వ్యతిరేకంగా శివసేన, ఇతర హిందూత్వ సంస్థలు ఆందోళన చేస్తూ వచ్చాయి. ఆ ఆందోళన తనకు ఎన్నికల్లో ఉపకరిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఈసారి రాష్ట్రానికి సంబంధించి ఏది పెద్ద ఎన్నికల సమస్య అవుతుందని ఆసియా నెట్ టీవీ ఛానల్ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా వారిలో 64 శాతం మంది పెరుగుతున్న చమురు ధరలు, ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కేవలం రెండు సీట్లనే ఈసారి మహిళలకు కేటాయించారు. వారిలో కన్నూర్ సిట్టింగ్ ఎంపీ పీకే శ్రీమతి కూడా ఉన్నారు. తాము కేవలం నాలుగు సీట్లకే పోటీ చేస్తున్నందున తాము మహిళలకు స్థానం కల్పించలేక పోయామని సీపీఐ ప్రధాన కార్యదర్శి ఎస్. సుధాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
అత్యంత హీనంగా కేరళ సర్కారు తీరు
కొల్లం(కేరళ), బలంగిర్(ఒడిశా): శబరిమల అంశంపై కేరళ ప్రభుత్వం అత్యంత హీనంగా వ్యవహరించి, చరిత్రలో నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రేషన్ సరుకులను పక్కదారి పట్టకుండా ఆపి, రూ.90వేల కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేసినందుకు తనను తొలగించేందుకు కుట్ర జరిగిందని ప్రధాని ఆరోపించారు. మంగళ వారం ఆయన కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లం (కేరళ), బలంగిర్ (ఒడిశా)లలో జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించారు. అవినీతి, మతతత్వం, కులతత్వం అంశాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్డీఎఫ్) ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని పేర్కొన్నారు. ‘శబరిమల అంశంపై కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత హీనమైందిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇలా మరే ప్రభుత్వం కానీ, పార్టీ కానీ చేయలేదు. కమ్యూనిస్టులకు చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలపై ఏమాత్రం గౌరవభావం ఉండదని మనకు తెలుసు. కానీ, ఇంత హేయంగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేరు’ అని తీవ్రంగా దుయ్యబట్టారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై పార్లమెంట్ లోపల ఒకలా, పత్తనంతిట్ట (అయ్యప్ప కొలువైన జిల్లా)లో మరోలా మాట్లాడుతున్న కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. కేరళ ప్రజలకు, వారి సంప్రదాయాలకు రక్షణగా నిలిచే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. ‘యూడీఎఫ్, ఎల్డీఎఫ్ లకు ఒక్కటే చెబుతున్నా. మా కార్యకర్తను తక్కువగా చూడొద్దు. త్రిపురలో జరిగిందే ఇక్కడా జరుగుతుంది’ అని అన్నారు. నన్ను తొలగించేందుకు కుట్ర నకిలీ పత్రాల ద్వారా రూ.90వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకున్నందుకు తనను పదవి నుంచి తొలగించేందుకు చూశారని ప్రధాని మోదీ ఆరోపించారు. ‘గత ప్రభుత్వాల హయాంలో దళారులు.. లేకపోయినా ఉన్నట్లు పత్రాలు సృష్టించి రేషన్ కార్డులు, వంట గ్యాస్ కనెక్షన్లు, పింఛన్లు పొందారు. మా ప్రభుత్వం అలాంటి ఆరు కోట్ల పేర్లను గుర్తించి రూ.90వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే పెద్ద కుంభకోణాన్ని అడ్డుకుంది. తమ ఆటలు సాగకపోయేసరికి ఈ అక్రమార్కులంతా ఏకమై ఈ‘చౌకీదార్’ను తొలగించేందుకు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’ అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కొల్లాంలోని జాతీయ రహదారి–66పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును, బలంగీర్‌లో రూ.1,550 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. -
ఆ రెండు పార్టీల పేర్లు మాత్రమే వేరు..
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమలలో తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించడంలో పినరయ్ విజయన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కమ్యూనిస్టులది, కాంగ్రెస్ పార్టీది ఒకే రకమైన తత్వమని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్‌లు భారతదేశ సంస్కృతిని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను గౌరవించరని మండిపడ్డారు. అంతేకాక శబరిమల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే మాట మీద నిలబడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పార్లమెంట్లో ఒకలా.. పథనంథిట్టలో మరొకలా మాట్లాడతారని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పేర్లు మాత్రమే వేరు.. కానీ అవినీతి, కులతత్వం, మతతత్వం, కేరళ సాంస్కృతిక కల్పనను దెబ్బతీయడంలో రెండు ఒకేలా పని చేస్తాయని ఆరోపించారు. ఇవి రెండు పెద్ద అవకాశవాద పార్టీలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్థానిక ఎన్నికల్లో ఎల్డీఎఫ్ హవా
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని 14 జిల్లాల పరిధిలో స్థానిక సంఘాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 39 సీట్లకు ఎన్నికలు జరగ్గా వాటిలో 21 సీట్లను పాలకపక్ష ఎల్డీఎఫ్ గెలుచుకోగా, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 12 సీట్లను గెలుచుకొంది. ఇక బీజేపీకి రెండు సీట్లు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ)కు రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు రెండు సీట్లు వచ్చాయి. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పినరాయి విజయన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఫలితాలు రావడం విశేషం. ముఖ్యంగా శబరిమల ఆలయం ఉన్న పట్టణంమిట్ట జిల్లాలోని రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని భావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆరోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ, ఆరెస్సెస్ వర్గాలు భారీ నిరసన ప్రదర్శనలను నిర్వహించాయి. అయినప్పటికీ ఈ రెండు సీట్లలో ఒక సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించగా, మరో సీటును ఎస్డీపీఐ అభ్యర్థి గెలుచుకున్నారు. అలప్పూజ జిల్లాలో మాత్రమే రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. -
కొనసాగుతున్న శబరిమల నిరసనలు
తిరువనంతపురం/ముంబై: అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు కోచిలో భారీ ర్యాలీ తీశారు. మహారాష్ట్రలోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే.. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. మహిళల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమా, కాదా అన్న విషయాన్ని కాంగ్రెస్, బీజేపీలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోచిలోని శివాలయం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన భక్తులు..అయ్యప్ప స్వామి ఫొటోల ప్లకార్డులను పట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. ముంబై, థానే, నవీ ముంబైలకు చెందిన అయ్యప్ప భక్తులు ఆజాద్ మైదాన్‌లో నిరసన ర్యాలీ తెలిపారు. శబరిమల ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతృత్వంలో ప్రారంభమైన ‘లాంగ్‌మార్చ్’ శనివారం కొల్లామ్ జిల్లాలోకి ప్రవేశించింది. ‘తృప్తి సవాల్ విసరడానికే శబరిమల వస్తున్నారు తప్ప భక్తురాలిగా కాదు. ఉద్రిక్తతలను సృష్టించ వద్దని ఆమెను కోరుతున్నా’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై అన్నారు.