lunch motion petition
-
ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు చుక్కెదురైంది. ఐఏఎస్‌లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి బుధవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై హైకోర్టు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ విచారించింది. విచారణలో భాగంగా ఐఏఎస్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఐఏఎస్‌లో ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు.ఐఏఎస్ అధికారుల పిటిషన్‌పై విచాణ జరిగిందిలావిచారణ సందర్భంగా.. డీపీవోటీ తరపు లాయర్ తెలంగాణ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. కేంద్రంలో ఉన్న అధికారులంతా అనుభవజ్ఞులు. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే విజ్ఞత వాళ్లకు ఉంది. ఏ అధికారి ఎక్కడ పనిచేయాలనే అధికారం కోర్టులకు లేదని అన్నారు.ప్రజా సేవ కోసమే ఐఏఎస్లుప్రజా సేవ కోసమే ఐఏఎస్‌లు. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్ళాలి. ట్రైబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్ కాదు. డిస్మిస్ చేస్తే మళ్ళీ అప్పీల్ చేస్తారు.ఇది లాంగ్ ప్రాసెస్.అధికారులు ముందు రిపోర్ట్ చేయండి’అని హైకోర్టు స్పష్టం చేసింది.అనంతరం ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనల్ని వినిపించారు. స్థానిక తను పరిగణలోకి తీసుకోవాలని,ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలని కోరారు.తీర్పును వాయిదా వేయాలంటూపండగలు ఉన్నాయి అప్పటివరకు స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పండుగలు ఇప్పుడు ఏం లేవన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. అయితే అందుకు ఐఏఎస్ తరుఫు న్యాయవాదులు.. క్యాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తున్నామని చెప్పగా.. క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరిన హై కోర్ట్ కోరింది. అందుకు ఆర్డర్ కాపీ ఇంకా రాలేదని ఐఏఎస్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. క్యాట్ తదుపరి విచారణ నవంబర్ 4కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఐఏఎస్‌లను రిలీవ్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఐఏఎస్‌ల విజ్ఞప్తిపై హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా.. బుధవారం సాయంత్రంలోగా ఐఏఎస్‌లు ఏపీలో రిపోర్ట్ చేయాలని, కాబట్టి పూర్తి స్థాయిలో వినాలంటూ పట్టుబట్టడటంతో వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి.ముందు ఏపీలో రిపోర్ట్ చేయండిఅటు డీవోపీటీ, ఇటు ఐఏఎస్‌ల తరుఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ..15రోజుల పాటు ఊరట కల్పించాన్న ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. ఐఏఎస్‌లు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అనంతరం, ‘ముందు ఏపీలో రిపోర్ట్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత వింటాం. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సమస్యలు మరింత జఠిలం అవుతాయి’ అని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ తుది తీర్పును వెలువరించింది. 👉చదవండి: ఐఏఎస్‌లకు క్యాట్ చురకలు -
వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై విచారణ.. తీర్పు రిజర్వ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగేలా ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. తీర్పు రిజర్వ్ చేసింది.ఏపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం కొనసాగించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలకు అక్రమ కట్టడాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులపై పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం లంచ్ మోషన్ వేయడంతో.. అధికారులకు కోర్టు బ్రేకులు వేసింది. ఇవాళ్టి వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మరికొన్ని కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వైఎస్సార్సీపీ. -
ముందస్తు బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: మద్యం కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరుకు సంబంధించి సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసులో తనకు ముందస్తుగా బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ఇస్తే, మరో కేసులో అరెస్టు చేయాలన్న కుట్రతోనే తాజాగా మద్యం కుంభకోణం కేసు నమోదు చేసిందన్నారు. దీర్ఘకాలం పాటు జైలులోనే ఉంచాలన్న వ్యూహంలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. స్కిల్ కుంభకోణంలోనూ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా అరెస్టుచేశారని వివరించారు. ఈ కేసులో కూడా అలా అరెస్టుచేస్తారన్న ఆందోళనతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని ఆయన చెప్పారు. 28వరకు అరెస్టు చేయబోం.. అనంతరం.. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. స్కిల్ స్కాం కేసులో కంటి శస్త్రచికిత్స నిమిత్తం చంద్రబాబుకు నవంబరు 28 వరకు తాత్కాలిక బెయిల్ ఇచ్చిందని, అందువల్ల అప్పటివరకు తాము ఆయనను అరెస్టుచేయబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను రికార్డ్ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అడ్డగోలుగా అనుమతులతో.. నిజానికి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ నేతలకు చెందిన మద్యం కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరుచేశారు. దీనివల్ల ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ కుంభకోణంపై ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును మూడో నిందితునిగా చేర్చింది. -
సీఐడీ అధికారుల కేసుపై లంచ్ మోషన్ పిటిషన్
-
ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్..
-
గ్రూప్-1 రద్దు..హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
-
చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ పిటిషన్..!
-
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వనమా.. హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన జలగం వెంకట్రావ్ మరోవైపు, సీఈవో వికాస్‌రాజ్‌ను జలగం వెంకట్రావు కలిశారు. సీఈవోకు హైకోర్టు తీర్పు కాపీని అందజేశారు. వనమాపై అనర్హత వేటుతో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలి జలగం కోరారు. కాగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. వనమా గెలుపుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు జలగం. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆస్తులు సక్రమంగా చూపించలేదనే అభియోగాలు ఉన్నాయి. వీటిని నిజమని తేల్చిన న్యాయస్థానం ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: కలసిరాని మంత్రి పదవి... ఎమ్మెల్యేగా గెలిచినా తప్పని తలనొప్పులు అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగానూ రూ. 5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇక డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావ్‌ను ఎమ్మెల్యేగా డిక్టేర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
గోవిందరాజస్వామి ఆలయం మహా సంప్రోక్షణ ఆపండి
సాక్షి, అమరావతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం గర్భగుడి విమాన గోపురంపై బంగారు పూతతో కూడిన రాగి రేకులను ఏర్పాటు చేసే విషయంలో అక్రమాలు జరిగాయని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరుతూ హైకోర్టులో గురువారం లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలైంది. గోవిందరాజ స్వామి దేవస్థానంలో ఈ నెల 21న తలపెట్టిన మహా సంప్రోక్షణ వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తిరుపతికి చెందిన తుమ్మా ఓంకార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి విచారణ జరిపారు. ఇదే వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటిపై కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు కూడా దాఖలు చేశామన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. టీటీడీ కౌంటర్‌తో పాటు ఇతర అంశాలనూ పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా విమాన గోపురానికి బంగారుపూత పూసిన రాగి రేకులు అమర్చడం వల్ల గోపురం దెబ్బతింటుందని చెప్పారు. ఇందులో అక్రమాలు జరిగాయని, రాగి రేకులకు బంగారు పూతకు బదులు బంగారు రంగు వేస్తున్నారని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరారు. మహా సంప్రోక్షణ పూర్తయితే గర్భగుడిని ఎక్కి విమాన గోపురాన్ని పరిశీలించే అవకాశం ఉండదన్నారు. అందువల్ల మహా సంప్రోక్షణను నిలిపివేయాలని కోరారు. -
బండి సంజయ్ చేసిన తప్పేంటి?.. అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 41ఏ నోటీసు ఇవ్వకుండా సంజయ్‌ను అరెస్ట్ చేశారంటూ.. హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్ రద్దుపై అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. గురువారం మధ్యాహ్నం విచారణ జరిపారు. కరీంనగర్ నుంచి వరంగల్‌కు బండి సంజయ్‌ను తీసుకెళ్లేందుకు 300 కిలోమీటర్లు తిప్పారని ఆయన తరపు న్యాయవాది రామ్‌చంద్రరావు కోర్టుకు తెలిపారు. బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక వాట్సాప్‌లో సర్క్యూలేట్ చేశాడే తప్ప.. పేపర్ లీకేజీలో అతని ప్రమేయం ఎక్కడుందని ప్రశ్నించింది. క్వశ్చన్ పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చిన తర్వాత అది లీకేజ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. బండి సంజయ్ పేపర్ లీకేజీలో కుట్రదారుడు అన్న విషయం తేలిందన్నారు. ప్రశాంత్‌కు, సంజయ్‌కు మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగిందని, కానీ ఆయన ఇంకా తన ఫోన్‌ను ఇవ్వలేదని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇప్పటికే కింది కోర్టులో బెయిల్ పిటిషన్వ వేశామని.. దానిపై ఈరోజే తీర్పు వచ్చేలా ఆదేశాలని ఇవ్వాలని న్యాయవాది రామచంద్రరావు తెలిపారు. శనివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సంజయ్‌పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కింది కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణం ఇదే? -
ఎమ్మెల్యేలకు ఎర కేసు: లంచ్ మోషన్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ వద్ద దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విత్‌డ్రా చేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ వేగం పెంచింది. కేసు వివరాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ మరో లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, ప్రాథమిక సాక్ష్యాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్‌కు సీబీఐ 5 లేఖలు రాసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన తీర్పును మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత స్టే కోసం సింగిల్ జడ్జిని ఆశ్రయించవచ్చో లేదో చీఫ్ జస్టిస్ నుంచి స్పష్టత తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించారు. సింగిల్ బెంచ్‌లో జరిగిన వాదనలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన తీర్పును మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ మంగళవారం ఈ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, సీబీఐ దర్యాప్తు తీర్పును వారం రోజులైనా నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు (పిటిషన్‌ను విచారణకు స్వీకరించే వరకు) స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై ద్విసభ్య ధర్మాసనం మెరిట్స్‌లోకి వెళ్లలేదు కాబట్టి తమ లంచ్‌మోషన్ పిటిషన్లో సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవచ్చని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రశ్నకు ఏజీ సమాధానమిచ్చారు. సీబీఐ దర్యాప్తును నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వొచ్చని చెప్పారు. ప్రస్తుతం సిట్ విచారణ నిలిచిపోయిందని, ఈ పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపడం సరికాదన్నారు. ఇప్పటికే సీబీఐ జేడీ ఫైళ్లు అప్పగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారని, సీబీఐ అత్యుత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని స్టే ఇవ్వాలని కోరారు. ఈ కేసులో డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సింగిల్ జడ్జి తీర్పు తర్వాత దర్యాప్తు కోసం సీబీఐ ప్రభుత్వంపై ఒత్తిడి చేయొద్దని ఉత్తర్వుల్లో స్పష్టంచేసిందని ఏజీ బదులిచ్చారు. ద్విసభ్య ధర్మాసనం అప్పీల్లోని మెరిట్స్ ఆధారంగా తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అప్పీల్‌కు విచారణార్హత లేదని తేల్చినందున సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవచ్చన్నారు. నిందితుల తరఫు సీనియర్ న్యాయవాదులు రవిచందర్, ప్రభాకర్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పాక స్టే కోసం సింగిల్ జడ్జి వద్దకు ప్రభుత్వం రావడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదని, సింగిల్ జడ్జి స్టే ఇవ్వడానికి ఆస్కారం లేదని వాదించారు. సింగిల్ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేస్తే తీర్పు వచ్చిందని, ఇప్పుడు మళ్లీ అదే సింగిల్ జడ్జి వద్దకు స్టే కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు ఆదేశాలను నిలుపుదల చేయడానికి ద్విసభ్య ధర్మాసనం నిరాకరించిందని గుర్తుచేశారు. సిట్ దర్యాప్తు చేయాలని భావించడమూ అత్యుత్సాహం కిందకే వస్తుందని చెప్పారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత స్టే కోసం సింగిల్ జడ్జిని ఆశ్రయించవచ్చో లేదో చీఫ్ జస్టిస్ నుంచి స్పష్టత తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించారు. బుధవారం సీజే బెంచ్ వద్ద స్పష్టత తీసుకుని చెబుతామని ఏజీ చెప్పడంతో విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. -
గవర్నర్ తమిళిసై విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరఫు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో బడ్జెట్ తేదీ మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 3వ తేదీ బదులు 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ తెలంగాణ సర్కార్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్ సిఫార్సులకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో.. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ నాటకీయ పరిణామల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌కు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం. చదవండి: కేసీఆర్ సర్కార్ Vs గవర్నర్.. మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు గతంలో ఏం జరిగింది? రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుండగా, ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సాంకేతికంగా వెసులుబాటు ఉంది. దీనిని ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. తనను అవమానించడానికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగాన్ని రద్దు చేసుకుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గతేడాది గవర్నర్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే సిఫారసు చేయకుండా పెండింగ్‌లో ఉంచగలనని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమైన నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై సోమవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగం ఉంటుందని టీఎస్ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. -
ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసిన సీఐడీ
-
బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు
-
రాజు ఆత్మహత్య.. హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి,హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రాజు మృతిపై అనుమానాలు ఉన్నాయని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థిస్తూ.. లంచ్ మోషన్ పిటిషయన్ దాఖలు చేశారు. మధ్యాహ్నాం దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. (చదవండి: రాజు... నేరచరితుడే! ) చిన్నారి హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపినట్లయితే.. రూ.10లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. గురువారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభ్యమైంది. రైలుకు ఎదురెళ్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. (చదవండి: ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: సీపీ అంజనీ కుమార్) కాగా.. రాజు ఆత్మహత్యపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడో రాజును పట్టుకుని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: సైదాబాద్ నిందితుడి కదలికలు: సింగరేణి కాలనీ టు నష్కల్ -
ఎస్ఈసీ ఆదేశాలపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన హైకోర్టు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వలంటీర్లు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది. కాగా, వలంటీర్ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అందుకు వాటిని రద్దు చేయాలని సవాలు చేస్తూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్‌జైన్ సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
గ్రేటర్ ఎన్నికలు: హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పిల్‌పై అత్యవసరంగా విచారించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్దమని, మున్సిపల్ యాక్ట్ 52ఈను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషన్ లంచ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ పటిషన్లపై లంచ్‌మోషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1న పోలింగ్ నిర్వహిస్తామని, 4న ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: జీహెచ్ఎంసీలో నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలకు వరకు అధికారులు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 20 వరకు నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఉమ్మడిగా ప్రకటించనున్నట్లు లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సీపీఐ, సీపీఎం పార్టీలు పేర్కొన్నాయి. -
చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: చర్ల ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు మృత దేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ హైకోర్టును కోరారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని తెలిపారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలన్నారు. అదే విధంగా మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టు మార్టం చేపించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారించ చేపట్టనున్నది. చదవండి: ముగ్గురు మావోల ఎన్కౌంటర్ -
కూల్చివేత ఆపాలంటూ పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో చేపట్టిన భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ మేరకు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. భవనాల కూల్చివేత వల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడుతుందని, 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలి కలుషితం అవుతుందని తెలిపారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. దీన్ని అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది. కాగా సచివాలయంలో ఏ, బీ, సీ, డీ, జీ, జే, కే, ఎల్, నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాకుల భవనాలు ఉండగా, మంగళవారం సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు సచివాలయం పక్కన ఉన్న రాతిభవనం కూల్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయి. కూల్చివేత పనులు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. (సచివాలయం కూల్చివేత) -
ఎన్నికల వాయిదాపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని పిటిషన్లో పేర్కొన్నారు. నెల్లూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. లంచ్ విరామం అనంతరం విచారణ చేపడతామని తెలిపింది. కాగా ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కోరుతూ గతంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. మార్చి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా కరోనాను సాకుగా చూపుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించే విధంగా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే గవర్నర్‌ను కోరారు. దీనిపై గవర్నర్ ఈసీని వివరణ సైతం అడిగారు. ఈ నేపథ్యంలో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు తీర్పుపై ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై లంచ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై హైదరాబాద్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. బాధ్యులపై సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ఎలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయాలని పిటిషన్లో పేర్కొంది. గ్లోబరీనా టెక్నాలజీ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కోరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం తర్వాత విచారణ జరగనుంది. ఇంటర్ బోర్డ్ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు రెండో రోజు కూడా ఇంటర్ బోర్డ్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అక్కడికి భారీ ఎత్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అవతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్‌కే రేపే చివరి గడువు కావడం.. వెబ్సైట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఏపీలో ఫోన్ల ట్యాపింగ్; హైకోర్టులో వాదనలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం మధ్యాహ్నం హై కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ఏపీ హై కోర్టు తర్వాతి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. వైసీపీ నాయకులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ దాదాపు 13 మందిని ప్రతి వాదులుగా చేరుస్తూ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హై కోర్టులో పిటీషన్ వేశారు. దీనితో పాటు కీలక ఆధారాలను కూడా హై కోర్టుకు సమర్పించారు. కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు, ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్ ఇంటిలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కూడా ప్రతివాదులుగా చేర్చిన సంగతి తెలిసిందే. -
హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నుంచి పోలీసులు తనను బహిష్కరించడాన్ని నిరసిస్తూ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పరిపూర్ణనంద బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ ధాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీస్ శాఖ విస్మరిస్తోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. తక్షణమే బహిష్కరణను తొలగించేలా పోలీస్ శాఖకు అదేశాలు ఇవ్వాలని పరిపూర్ణనంద స్వామి పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించలేదు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. కత్తి మహేశ్‌ను కూడా హైదరాబాద్ నుంచి బహిష్కరించారు. ఆరు నెలల పాటు నగరంలోకి రాకుండా నిషేధం విధించారు. -
ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ - ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పౌరహక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు పూర్తి అయ్యేవరకు మావోయిస్టుల మృతదేహాలను సరైన పద్దతిలో భద్రపరిచేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం జరపాలని కోరింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదు చేయాలంది. పౌరహక్కుల సంఘం పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం విచారణకు చేపట్టనున్నట్టు సమాచారం. కాగా సరిహద్దులోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట- ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌తో పాటు మరో నేత మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు.