Maha Samudram Movie
-
'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!
‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్‌పై నిజమేనంటూ కథనాలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్‌స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్‌తో వీరిద్దరి రిలేషన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో. అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనీస్ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023 -
ఓటీటీలోకి ‘మహా సముద్రం’
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. చాలా గ్యాప్ తర్వాత ‘మహా సముద్రం’ చిత్రంతో ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్‌కు తండ్రి నుంచి విముక్తి దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులను ఈ మూవీ కాస్తా నిరాశ పరిచిందన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లీక్స్‌లో మహా సముంద్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రావు రమేశ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. -
అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌భూపతి
MahaSamudram Director Ajay Bhupathi Says Sorry: ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలు, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు తమ అసంతృప్తిని సోషల్‌మీడియా ద్వారా డైరెక్టర్ భూపతికి తెలిపారు. తాజాగా పవన్‌రెడ్డి అనే ట్విట్టర్ యూజర్..మహాసముద్రం ఏంటి అన్నా అలా తీశావ్? చాలా ఎక్స్పెక్ట్ చేశా అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అజయ్‌భూపతి.. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. నెక్ట్స్ టైం మంచి కథతో వస్తాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అజయ్ భూపతి చేసిన ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. Sorry for not reaching your expectations... Next time I will be back with a story that can satisfy you all... https://t.co/RTWin30gKV — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021 చదవండి: హీరోయిన్గా మారిన టిక్‌టాక్ స్టార్ నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత -
‘మహా సముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్ : మహా సముద్రం జానర్ : యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, జగపతిబాబు, రామ చంద్ర రాజు తదితరుల నిర్మాణ సంస్థ : ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: సుంకర రామబ్రహ్మం దర్శకత్వం : అజయ్ భూపతి సంగీతం : చేతన్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ : రాజ్ తోట ఎడిటింగ్: ప్రవీణ్ విడుదల తేది : అక్టోబర్ 14, 2021 ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతోఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే వైజాగ్ నగరానికి చెందిన అర్జున్(శర్వానంద్), విజయ్(సిద్ధార్థ్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. అర్జున్ ఏదైనా బిజినెస్ ప్రారంభించడానికి ప్రయత్నించగా, విజయ్ మాత్రం పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు మహాలక్ష్మీ అలియాస్ మహా(అదితిరావు హైదరీ)తో ప్రేమలో ఉంటాడు విజయ్. పోలీసు ఉద్యోగం సంపాదించాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అర్జున్ లైఫ్‌లోకి అనుకోకుండా వస్తుంది లా స్టూడెంట్ స్మిత(అను ఇమ్మాన్యుయేల్). కట్ చేస్తే.. వరుసగా జరిగే కొన్ని సంఘటనల వల్ల విజయ్ వైజాగ్ సిటీ నుంచి పారిపోవాల్సి వస్తుంది. అతని ఆచూకీ కోసం అర్జున్ ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పారిపోయిన విజయ్ తిరిగి మళ్లీ వైజాగ్‌కు వస్తాడు. అప్పటికీ అర్జున్ డ్రగ్స్ మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. అసలు విజయ్ వైజాగ్ సిటీని వదిలి ఎందుకు పారిపోయాడు? బిజినెస్ చేయాలనుకునే అర్జున్ స్మగ్లింగ్, డ్రగ్స్ దందాను ఎందుకు ఎంచుకున్నాడు? ప్రాణ స్నేహితులైన అర్జున్, విజయ్ శత్రువులుగా ఎలా మారారు? విజయ్ ప్రాణంగా ప్రేమించిన మహాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సమయంలో అర్జున్ ఎలా తోడుగా నిలిచాడు?అనేదే మిగిలి కథ. ఎవరెలా చేశారంటే... అర్జున్‌గా శర్వానంద్, విజయ్‌గా సిద్ధార్థ్ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శర్వానంద్ కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నిజాయితీగా ఉన్న వ్యక్తి అనుకోకుండా అక్రమ వ్యాపారాలు చెయ్యడం, స్నేహితుడి ప్రియురాలిని సొంత మనిషిలా చూసుకోవడం. అతని కూతురి ఆలనా పాలనా చూడడం. చివరకు తన ప్రేమను కూడా వదులుకోవడం.. ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడు. ఇక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న విజయ్‌గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.చాలా రోజుల తర్వాత కొత్త సిద్దార్థ్‌ను చూస్తున్నామన్న ఫీల్ కలిగించాడు. ఇక ఈ మూవీలో చాలా ప్రాధాన్యత ఉన్న మహా పాత్రలో అదితిరావు హైదరి ఒదిగిపోయింది. అందంతో పాటు చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. లా స్టూడెంట్‌గా అను ఇమ్మాన్యుయేల్ పర్వాలేదనిపించింది. శర్వా, సిద్ధూల తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్రలు.. జగపతి బాబు, రావు రమేశ్లవి. చుంచూ మామ పాత్రలో జగపతి బాబు పరకాయ ప్రవేశం చేశారు. కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పది అని నమ్మే గూని బాబ్జీ క్యారెక్టర్లో రావు రమేశ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్ ధనుంజయ్‌గా రామచంద్ర రాజు తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. రెండో సినిమాకే భారీ కథను, అందుకు తగ్గట్లు హెవీ స్టార్ కాస్టింగ్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. క్యారెక్టర్స్ తో తాను అనుకున్న పాయింట్ ని చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా పాత్రల పరిచయానికే సమయం కేటాయించాడు. గూని బాబ్జీగా రావు రమేశ్ ఎంటర్ అయ్యాక కథ పరుగులు తీసుస్తుంది. ఫస్టాఫ్ అంత సోసోగా నడిపించిన డైరెక్టర్.. ఇంటర్వెల్ పాయింట్ కి పీక్ టైంకి తీసుకొచ్చి, ఓ ఫైట్ సీన్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరిగేలా చేశాడు. కానీ సెకండాఫ్ ఆ అంచనాలను తగ్గట్లు కాకుండా వేరే ట్రాక్ తీసుకుని వెళుతుంది. అలా అని మరీ బోర్ ఏమి కొట్టదు కానీ ఇంటర్వెల్ వరకు ఉన్న కిక్ మాత్రం తగ్గుతుంది. సెకండాఫ్ కి వచ్చేసరికి దర్శకుడు పూర్తిగా ఎమోషన్స్ మీదకి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఎమోషన్స్ తెరపై అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కొత్త సౌండ్స్ తో యాక్షన్స్ సీన్స్‌కి ప్రాణం పోశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్‌గా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మహా సముద్రం ట్విటర్ రివ్యూ
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. ఈ మూవీ ఫస్టాఫ్ బాగానే ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అజయ్ భూపతి చెప్పినట్లుగానే చేతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ అదరగొట్టినట్టు చెబుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఫస్టాఫ్ డీసెంట్ యాక్షన్, రొమాన్స్ లు కనిపించాయి. అలాగే మెయిన్ లీడ్ నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా బాగుందని చెబుతున్నారు. #MahaSamudram Decent 1st Half 👍 Starts slow but picks up towards interval. Interval BGM 👌🔥 — Venky Reviews (@venkyreviews) October 14, 2021 సినిమా స్లోగా ప్రారంభమైనప్పటికీ... ఇంటర్వెల్ వచ్చేసరికి మంచి జోష్‌తో పికప్ అయింది. ఇంటర్వెల్ సీన్ మూవీకి హైలెట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Average 1st Half !! With good Interval Plot Music & Bgm 👌 #MahaSamudram https://t.co/AfwmBpIaS2 — InsideTalkz (@InsideTallkz) October 14, 2021 Best part of #MahaSamudram is the interval break time! Much needed break from movie 1st half, gearing up for second half🔥🔥🔥 — Aneesh (@aneesh2303) October 14, 2021 #MahaSamudram meru iche publicity ki a content ki aslu sambandam unda …first half 🤦♂️ Interval fight 👍 — vijay (@movie_devotee) October 14, 2021 #MahaSamudram has spellbound performances from almost all the characters but with slow paced screenplay. May end up with commercial HIT status pic.twitter.com/VKtohEUwa1 — ₳ ₭ (@itsmeGAK) October 14, 2021 Welcome back @Actor_Siddharth annayya😁😍❤️#MahaSamudram pic.twitter.com/7D7acKUvtR — _Nen_inthe_ (@GowriSh82126401) October 14, 2021 JB and Rao Ramesh giving great performances 👌 #MahaSamudram — Venky Reviews (@venkyreviews) October 14, 2021 -
గ్రీన్ ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటిన ‘మహా సముద్రం’ టీమ్
-
ఇద్దరు హీరోలతో మూవీ అంటే వచ్చే కిక్ వేరు : అజయ్ భూపతి
‘దర్శకుడు కావాలన్నదే నా కల. ఆర్ఎక్స్ 100 తో ఆ కల నెరవేరింది. ఆ సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అని కూడా ఆలోచించలేదు. నేను దర్శకుడని అయ్యాను అనే తప్పా.. సినిమా ఫలితం గురించి నేను ఆలోచించలేదు. నాకు పలాన సినిమా చేయాలి అనే కల ఏమీ లేదు. నచ్చిన చిత్రాలు చేసుకుంటూ వెళ్తాను’అన్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (మంగళవారం) దర్శకుడు అజయ్ భూపతి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం.. ►ఈ సినిమాలో మహా పాత్రకు కొంత మందిసెట్ అవుతారు. సమంత గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. ముందు ఆమెను కూడా అనుకున్నాను. కానీ చివరకు అదితిరావు హైదరిని తీసుకున్నాను. ►ఇద్దరు హీరోలతో సినిమా అంటే వచ్చే కిక్ వేరు. ఇద్దరు హీరోలున్న దళపతి, విక్రమ్ వేదా ఇలా ఎన్నో సినిమాలు తెరపై చూస్తే ఏదో తెలియని ఆనందం వేస్తుంది. అలాంటి ఫీల్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని, ఆ కిక్‌ను వారికి మళ్లీ చూపించాలనే సినిమాను తీశాను. ►ఆర్ ఎక్స్ 100 తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. అవన్నీ పక్కనపెట్టేసి మహా సముద్రం కోసం ట్రై చేశాను. ఆర్ ఎక్స్ 100 కంటే ముందే పాయింట్ఉంది. నేను తరువాత తీయబోయే సినిమా ఇదే అని కార్తికేయకు కూడా సెట్లోచెప్పేవాడిని. ►మహాసముద్రం పూర్తిగా కల్పిత కథ. ఓ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే కథ. కొన్ని పాత్రల మధ్య జరిగే కథ. వైజాగ్‌లో సముద్రానికి ఆనుకుని ఉన్న లొకేషన్లో సాగే కథ. అక్కడి వ్యక్తులు, వారి వ్యక్తిత్వాల మధ్య జరిగే కథ. ►ఏ స్టోరీలో అయినా సరే ఫీమేల్ క్యారెక్టర్ బలంగా ఉంటే అది సక్సెస్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. బాలచందర్ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అంతులేని కథలో జయప్రద పాత్ర ఇష్టం. సినిమాలో అలా వచ్చి వెళ్లే క్యారెక్టర్లను నేను రాయను. ►కథ రాసుకున్నప్పుడు ఎవ్వరినీ ఊహించుకోలేదు. ఇద్దరు హీరోలు అని కథ రాసుకున్నా. కొంత మంది దగ్గరికి వెళ్లాను. కథ బాగా నచ్చిందని అందరూ అన్నారు. కానీ కొంత మంది సోలో హీరో అయితే చేస్తాను అని అన్నారు. కానీ నేను ఇదే కథ చేస్తాను అని పట్టుబట్టాను. అలా చివరకు శర్వా, సిద్దులు ఓకే అయ్యారు. ►హీరోల కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొన్ని కొన్ని సీన్లలో మాటలు, వారే మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్నాను. ►ఫ్రెండ్ అంటే నాలుగు రోజులు కలిసి తిరిగి, బీర్లు తాగివెళ్లడం కాదు. ఒక్కసారి మనం ఫ్రెండ్ అని అనుకుంటే.. వాడు చేసే తప్పులను, ఒప్పులను అంగీకరించాలి. జీవితాంతం వాడి కోసం నిలబడాలని చెప్పే కథ. ►నాకు ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయిందో తెలియదు. నిర్మాతలు కూడా నాకు ఎప్పుడూ ఇంత బడ్జెట్ అయిందని చెప్పలేదు. ఈ సినిమాను నా మీద వదిలేశారు. నాకు ఏ సమస్యను రానివ్వలేదు. కొత్త ఆర్టిస్ట్‌ల్లా నా దగ్గరికి వచ్చే వారు. సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం నిర్మాతలే. నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనా కూడా వైజాగ్‌లో జాగ్రత్తగా షూటింగ్ చేసుకుని వచ్చాం. ►ప్రతీ పాత్రకు ఆది, అంతం ఉంటుంది. అలా వచ్చీ వెళ్లే పాత్రలు నా సినిమాలో ఉండవు. ఏ ఒక్కరూ కూడా నా క్యారెక్టర్ లెంగ్త్ ఎంత అని అడగలేదు. శర్వా, సిద్దులు సైతం వచ్చారు.. వారి క్యారెక్టర్ చేసి వెళ్లారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం వాళ్లే. ►ఆర్ ఎక్స్ 100 సమయంలోనూ రెండు ట్రైలర్లు కట్ చేశాను. ఇప్పుడు కూడా అలానే చేశాను. అది నా స్టైల్. కథలో దమ్ము ఉండాలి. కావాలంటే నేను ఇంకో ట్రైలర్‌ను కూడా కట్ చేయగలను. ట్రైలర్ చూసి ఈ కథను చెప్పలేరు. ఇందులో సబ్ స్టోరీస్ చాలా ఉంటాయి. ►ప్రేమకు హద్దుల్లేవు. నీ మీద నీకు ఎంత ప్రేమ అని అంటే.. అంత ఇంత అని చెప్పలేం. దాన్ని కొలవలేం. ఒక్కోసారి ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అందుకే కొలవలేనంత ప్రేమ అనే క్యాప్షన్‌ను పెట్టాం. ►నేను చూసిన కొంతమంది క్యారెక్టర్స్, వారి క్యారెక్టరైజేషన్స్ ఈ చిత్రంలో వాడాను. అలా మా అమ్మమ్మ గారు తన చేతిని కొరుక్కునేది. పిల్లల అల్లరిని తట్టుకోలేక అలా చేసివారు. అదే రావు రమేష్ గారికి పెట్టాం. జగపతి బాబు గారి పాత్రను మన చుట్టూ చూస్తుంటాం. ఆయనే ఈ సినిమా క్యారెక్టర్స్ అతి పెద్ద బలంగా మారుతాయి. సినిమా చూసి బయటకు వచ్చాక హీరో హీరోయిన్లు గుర్తుకు ఉండరు. క్యారెక్టర్సే గుర్తుంటాయి. ►ఎప్పుడూ విలన్ క్యారెక్టర్లు వేసే వారిని తీసుకొచ్చి విలన్‌గా చూపిస్తే ఏం బాగుంటుంది. అందుకే ఎప్పుడూ లవర్ బాయ్ క్యారెక్టర్లు వేసిన సిద్దును ఇందులో మాస్ యాంగిల్లో చూపించాను. అదే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. నేను క్యారెక్టర్ ఇలా ఉండాలని చెప్పాను. కానీ మేకోవర్ కోసం ఆయనే కష్టపడ్డారు. సిద్దు మేకప్ మేన్ చాలా రకాలుగా ట్రై చేశారు. ►ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు శర్వా క్యారెక్టర్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా చూసి బయటకు వచ్చాక శర్వా పాత్రను మీరంతా ప్రేమిస్తారు. ►మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి నా మెంటాలిటీ తెలుసు. నాకు ఏ టైప్, కొత్త జానర్లు అంటే ఇష్టమని తెలుసు. రంభ రంభ, చెప్పకే చెప్పకే పాటలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. ఇక సినిమాలో విజువల్స్ చూస్తే అందరికీ నచ్చుతాయి. ఈ సినిమాకు ఆయనే మెయిన్ పిల్లర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కొత్త సౌండ్స్ వింటారు. నా బాస్ (ఆర్జీవీ) దగ్గర నేర్చుకుందే సౌండ్ గురించి. ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ►ఆర్ ఎక్స్ 100 సినిమాకు పని చేసిన డైరెక్షన్ టీంలో ఇప్పటికి ముగ్గురు దర్శకులు అయ్యారు. ఇక మహా సముద్రం కోసం పని చేసిన పది మంది త్వరలోనే దర్శకులు కాబోతోన్నారు. వారు నాకంటే టాలెంట్. ►ఆర్ ఎక్స్ 100 సినిమా పాన్ ఇండియా. ఇప్పుడు అన్ని భాషల్లో రీమేక్ అవుతోంది. అంటే ఆర్ ఎక్స్ 100 ఐడియా పాన్ ఇండియా. ఇప్పుడు మహా సముద్రం కూడా పాన్ ఇండియా సినిమానే. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ►ఆర్ ఎక్స్ 100 బాలీవుడ్ రీమేక్ కోసం ఆఫర్ వచ్చింది. బాలీవుడ్లో చేయాలనే ఆసక్తి నాకు లేదు. నాకు ఇక్కడ చాలా బాగుంది. అక్కడి కంటే ఇక్కడే బాగుంది. తెలియని వాళ్ల దగ్గరకి వెళ్లి సినిమా చేయాలని ఇప్పుడు అనిపించలేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ►ఓటీటీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో ఆంథాలజీ కాన్సెప్ట్ కోసం అడిగారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓటీటీలో అయితే మన ఐడియాను ఇంకాస్త విస్తృతంగా చూపించవచ్చు. థియేటర్లో చూపించలేని ఐడియాను, ఆ స్పాన్‌ను ఓటీటీ కోసం ఇంకాస్త పెంచుకోవచ్చు. నాకు కూడా ఓటీటీ అంటే ఇష్టం. ►ఆర్ ఎక్స్ 100 సినిమాను ఆర్జీవీ గారు వెంటనే చూడలేదు. ఆ తరువాత ఎప్పుడో చూశారు. ఈ సినిమా ట్రైలర్ ఆయనకు బాగా నచ్చింది. ట్వీట్ కూడా వేశారు. సినిమా చూస్తారా? అని అడిగాను. తరువాత చూస్తాను అని అన్నారు. ►అన్ని జానర్లలో చిత్రాలు చేయాలని ఉంది. మహా సముద్రం తరువాత మాస్ ఎంటర్టైనర్తో రాబోతోన్నాను. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తాను. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించబోయే చిత్రాలివే..
దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకు పలు సినిమాలు సిద్దమయ్యాయి. ఇందులో కొన్ని థియేటర్లోకి వస్తుండగా మరికొన్ని ఓటీటీలో విడుదల కానున్నాయి. ప్రతి ఏడాది దసరాకు అగ్ర హీరో సినిమాలు పోటీ పడేవి. కానీ ఈసారి అగ్ర హీరోల సినిమాలు ఏం లేకపోవడం గమనార్హం. అయితే కుర్ర హీరోలు మాత్రం తమ లక్‌ను పరీక్షించుకునేందుకు ఈ వారంలో మీ ముందుకు రాబోతున్నారు. వెండితెర, బుల్లితెరపై సందడి చేయబోయే ఆ చిత్రాలేవో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. థియేటర్లో విడుదల కాబోయే చిత్రాలు మహా సముంద్రం యంగ్ హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్‌ల మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముంద్రం’. అదితీ రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రావు రమేశ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుదీర్ఘ విరామంతో నేరుగా తెలుగు సినిమాతో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను మహా సముంద్రంతో పలకరించబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్లో విడుదల కానున్న ఈ మూవీ అతడికి ఏ మేర సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్కినేని వారసుడు అఖిల్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. అక్టోబరు 15న దసరా పండగ కానుకగా విడుదలవుతోన్న ఈమూవీని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడిగా వ్యవహరించాడు. కాగా అఖిల్ నటించిన మూడు చిత్రాలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని మంచి హిట్ కోసం చూస్తున్న అఖిల్ ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో వస్తున్నాడు. ఈ సారి అయినా అఖిల్ బ్లాక్ బస్టర్ కొడతాడో లేదో చూడాలి. పెళ్లి సందD సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలను సమకుర్చారు. రోషన్‌కు జోడిగా కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్లకు ప్రేక్షకులను విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రం కూడా అక్టోబరు 15న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు నటుడిగా మారి, ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓటీటీ... సర్దార్ ఉద్దమ్ జలియన్ వాలాబాగ్ ఉదంతం నేపథ్యంలో విక్కీ కౌశల్ కీలక పాత్రలో సూజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’. విక్కీ కౌశల్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబరు 16న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికి పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. వందల మంది మృతికి కారణమైన జనరల్ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్ సింగ్ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్ సిర్కార్‌లు ‘సర్దార్ ఉద్దమ్’ తెరకెక్కించారు. రష్మీ రాకెట్.. హీరోయిన్ తాప్సీ పన్ను తాజా చిత్రం రష్మీ రాకెట్. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ గుజరాత్ అథ్లెట్ రష్మీ ప్రాతలో కినిపించనుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. కాగా గతంలో తాప్సీ నటించిన ‘థప్పడ్’ ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె నటించిన ‘హసీనా దిల్రుబా’, ‘అనబెల్ సేతుపతి’ కూడా ఓటీటీ బాట పట్టాయి. -
సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు
‘‘నాకు చాలెంజింగ్ పాత్రలంటే చాలా ఇష్టం. ఆ విషయంలో మణిరత్నంగారు నా గురువు. నేను స్టార్లా సెట్‌కు రాను.. ఓ నటిగా వస్తాను. దర్శకులు చెప్పింది చేస్తాను. ‘మహాసముద్రం’లో మహా పాత్రకు ప్రాణం పోసేందుకు ప్రయత్నించాను’’ అని అదితీరావు హైదరీ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ ముఖ్య పాత్రల్లో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీరావు హైదరీ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం అజయ్ భూపతి నాకు ‘మహాసముద్రం’ స్క్రిప్ట్‌ను వినిపించారు. కథ బాగా నచ్చింది. నేను చేసిన మహా పాత్ర స్వీట్, హార్డ్ వర్కింగ్.. నిజాన్ని చెప్పే గుణం ఉంటుంది. నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తుంటాను. అజయ్‌గారు ప్రేమకథ అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఈ సినిమా రెండు ట్రైలర్లు చూసినా స్టోరీని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నేను హైదరాబాద్‌లో పుట్టాను. కానీ, పెరిగింది నార్త్‌లోనే. నాకు తెలుగు అంతగా రాదు. అయితే నాకు డైలాగ్స్ ఇచ్చి, అర్ధరాత్రి లేపి సీన్ నంబర్ చెబితే ఇట్టే చెబుతాను.. అంతలా బట్టీపట్టేస్తాను. ఎందుకంటే సెట్‌కు వచ్చినప్పడు మిగతా వాళ్ల సమయం వృథా చేయాలనుకోను. ఓసారి డైలాగ్ ప్రాక్టీస్ చేసేలోపు పిలవడంతో వెంటనే చెప్పలేకపోయాను.. అప్పుడు ఏడ్చేశాను. బయోపిక్స్‌లో నటించడం నాకు ఇష్టం. ఎంఎస్ సుబ్బలక్ష్మీ, రేఖగార్ల బయోపిక్ అయితే బాగుంటుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్–బృందా మాస్టర్‌తో ఓ చిత్రం చేస్తున్నాను. హిందీలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమాతో పాటు మరికొన్ని ఉన్నాయి’’ అన్నారు. -
మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్‌గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్‌గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్‌పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్‌గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్‌గారు. సినిమాలు తీసేది థియేటర్స్‌లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాధపడితే నాకేం సంబంధం?.. ‘చీటర్స్’ ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందన
నాగ చైతన్య-సమంత విడాకులు ప్రకటించిన రోజు హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న చై-సామ్ విడాకులు తీసుకోబోతున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వెంటనే...‘మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు’అని నెటిజన్లను ప్రశ్నిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఆయన సమంత గురించే అన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. (చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ) One of the first lessons I learnt from a teacher in school... "Cheaters never prosper." What's yours? — Siddharth (@Actor_Siddharth) October 2, 2021 తాజాగా ఆ ట్వీట్‌పై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తనకు ‘మహాసముద్రం’ దర్శకుడు అజయ్ భూపతికి మాటల మధ్యలో వచ్చిన అంశంపై తన చిన్నప్పుడు నేర్చుకున్న లెసన్‌ని జోడిస్తూ ట్వీట్ చేశానని సిద్ధార్థ్ చెప్పాడు. తన జీవితంలో జరిగిందే తాను ఆరోజు ట్వీట్ చేశానని, ఎవరో తన గురించి అనుకుంటే తానేమీ చేయలేనన్నారు. మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే, నేను దాన్ని ట్వీట్ చేశాను. దానికి ఎవరో బాధపడితే నాకేం సంబంధం అని సిద్ధార్థ్ ప్రశ్నించారు. నా లైఫ్ గురించి నేను మాట్లాడుతానని, వేరే వాళ్లతో సంబంధమే లేదని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. -
అది చిన్న గాయమే, సర్జరీలాంటిదేమీ లేదు: హీరో సిద్దార్థ్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్దార్థ్ మీడియాతో ముచ్చటించారు. సిద్దార్థ్ ఏమన్నాడో ఆయన మాటల్లోనే.. ► మహా సముద్రం క్లైమాక్స్ షూట్లో చిన్న గాయమైంది. దానికే అజయ్ భూపతి సర్జరీ అని చెప్పేశాడు. దీంతో మా అమ్మానాన్నలు తెగ కంగారు పడిపోయి.. ఫోన్లు చేశారు. ఆ వెంటనే అజయ్ భూపతికి ఫోన్ చేసి అలా చెప్పావ్ ఏంటి? అని అడిగాను. మీరే కదా ట్రీట్మెంట్ అని చెప్పారు అని అన్నాడు. ట్రీట్మెంట్కు, సర్జరీకి చాలా తేడా ఉందని అన్నాను. అది చిన్న గాయం మాత్రమే సర్జరీలాంటిదేమీ జరగలేదు. ► అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా చూశాను. ఎంత పర్ఫెక్షన్తో తీశాడో.. రామ్ గోపాల్ వర్మ శిష్యుడనిపించుకున్నాడు. అతడు మహాసముద్రం కథ చెబితుంటే.. రెండో సినిమా దర్శకుడిలా అనిపించలేదు. వెంటనే ఓకే చెప్పాను. ఇది ట్రెండ్ సెట్టర్ సినిమా. శర్వానంద్ అద్భుతమైన నటుడు. మేం ఇద్దరం కలిసి ఓ సినిమా చేస్తున్నామంటే ఎవరికి తగిన కారణాలు వారికి ఉంటాయి. నేను, శర్వాతో ఒక్కసారి చర్చలు కూడా పెట్టుకోలేదు. మాకు స్క్రిప్ట్ మీద అంత నమ్మకం ఉంది. అజయ్ భూపతి ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్ బాగుంది కానీ కథ ఏంటి అర్థం కావడం లేదు అని చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు. అదే మా సక్సెస్. ► ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు సిద్దు అంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనే ఇమేజ్ ఇచ్చారు. కానీ ఈ సినిమాతో కొత్త రకమైన ఇమేజ్ వస్తుంది. 2003లో బాయ్స్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. మధ్యలో వచ్చింది బ్రేక్‌లాంటిది కాదు. కానీ నాలో నేను వెతుక్కునే క్రమంలో బ్రేక్ వచ్చింది. నన్ను స్టార్‌ను చేసింది తెలుగు వాళ్లే. అయితే ప్రతీ భాషల్లో నాకు ఓ ఐకానిక్ చిత్రం ఉంది. తమిళంలో బాయ్స్, హిందీలో రంగ్ దే బసంతి ఇలా ఉన్నాయి. అయితే నేను ప్రతీ చోటా తెలుగు నటుడిని అని చెప్పుకునేవాడిని. దాంతో అక్కడి వారు హర్ట్ అయ్యేవారు. కానీ నేను తెలుగు స్టార్‌ని, ఇండియన్ నటుడిని. అందుకే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను. ► నేను బయటి నుంచి వచ్చాను. అలా బయటి నుంచి వచ్చిన వారి కోసం నేను ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. కొత్త వారిని ఎంకరేజ్ చేద్దామని అనుకున్నాను. తెలుగులో కూడా కొంత మంది యంగ్ దర్శకులతో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాను. ఎంబీఏ చదివి మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను. శంకర్ గారి సినిమాతో హీరో అయ్యాను. అయితే నేను సంపాదించిన వాటిల్లోంచి నిర్మించాను. నేను నిర్మించిన ప్రతీ ఒక్కటి కూడా లాభాలను తెచ్చిపెట్టింది. అలా ప్రాఫిట్ రాకపోతే మా నాన్న కూడా ఊరుకోరు. ► నేను ‘మా’లో లైఫ్ టైం మెంబర్‌ను. ఆహూతి గారు ఉన్న సమయంలోనే మెంబర్షిప్ తీసుకున్నాను. ‘మా’ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నాను. అన్నీ కూడా ఫాలో అవుతున్నాను. నేను కచ్చితంగా అందరి మాటలు విని.. నా మనసులో ఏమనిపిస్తుందో.. వారికే ఓటు వేస్తాను. ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నిజాయితీగా ఉండాలని అనుకుంటాను. దాని వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవాలి. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. రాజకీయాల్లోకి రాను అని చెప్పను. కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. -
‘మహాసముద్రం’లోని ట్విస్ట్‌లు అంచనాలకు అందవు: మ్యూజిక్ డైరెక్టర్
ఆర్ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా చేస్తున్న ఈ మూవీలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతున్న ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. వివరాలిలా.. ► ఎంతో ఇన్టెన్సిటీ ఉన్న ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘మహా సముద్రం’. ఈ చిత్రం చూసిన తర్వాత ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్లారు. చివరి 40 నిమిషాలు సినిమా ఎంతో ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. ► అమాయకంగా ఉండే మనుషుల జీవితాల్లో వచ్చే మార్పుల సమాహారమే ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందరి అంచనాలు మించేలా సినిమా ఉంటుంది. ► మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథను బట్టే మ్యూజిక్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను. ► ఆర్ఎక్స్ 100 సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్‌లు మహాసముద్రంలో ఉంటాయి. అంటే దాదాపు ఐదారు ఉంటాయి. అవి ప్రేక్షకుల అంచనాలకు అందవు. ఒక అతీంద్రియ శక్తితో పాటు.. టైం, విధి మనిషిని ఎన్ని రకాలుగా మార్చుతుందనేది చూపించబోతున్నాం. ► ఆర్ఎక్స్ 100 సినిమాకు చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో ఈ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరింత జాగ్రత్తగా మ్యూజిక్ అందించాను. కచ్చితంగా ఇందులోని అన్ని పాటలు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. ► మహా అనే క్యారెక్టర్లో చాలా ఆసక్తిని రేపుతుంది. ఆమె జీవితంలో జరిగే సంఘటనలు చుట్టూ ఉన్న వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనేది కథ. ► కొన్ని జానర్స్ మూవీ సెంట్రిక్‌గా చేయాల్సి ఉంటుంది. మూవీలో ఆ పర్టిక్యులర్ సీన్లో వచ్చే పాట ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే.. ఆ పాట హిట్టైనట్టే. ఆర్ఎక్స్ 100 సినిమాకి అదే మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో నాకు చెప్పకే చెప్పకే అనే పాట ఎక్కువగా ఇష్టం. ► దర్శకుడు కథను ఎంతో క్లియర్‌గా, డీటైల్డ్‌గా నాకు చెప్పారు. లైవ్ బేస్డ్ ఎలిమెంట్స్ చేసే స్కోప్ ఇచ్చారు. ► ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించారు. ఇంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ప్రతీ ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా కష్టంగా అనిపించినా.. ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. ► చైతన్య ప్రసాద్, భాస్కరభట్ల, కిట్టు విశ్వప్రగడ అందరూ అద్భుతంగా రాశారు. సినిమాలోని ఎమోషన్‌ను ముందుకు తీసుకెళ్లలా వారి పాటలు ఉన్నాయి. ► బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100 లో రుధిరం, ఎస్ఆర్ కళ్యాణమండపంలోని చుక్కల చున్నీ బాగా ఇష్టం. ► పాటలు ఎప్పుడూ కూడా సినిమాకు తగ్గట్టే ఉండాలి. పాటలను బట్టే సినిమాలను చూస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకు అంత ఆదరణ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. నా జర్నీ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. చదవండి: ఇండియాకు తిరిగి వచ్చాను, కోలుకుంటున్నా: హీరో సిద్ధార్థ్ -
ఇండియాకు తిరిగి వచ్చాను, కోలుకుంటున్నా: హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం కోలుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘మహా సముంద్రం’ మూవీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్స్ చేస్తుండగా సిద్దార్థ్ గాయపడినట్లు ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దర్శకడు అజయ్ భూపతి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫైట్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సిద్ధార్థ్ స్పైన్(వెన్నుముక)కు గాయమైంది. దీంతో సర్జరీ కోసం లండన్ వెళ్లిన సిద్దార్థ్ ఇటీవల తిరగి ఇండియా వచ్చాడట. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. తాను ఇండియాకు తిరిగి వచ్చినట్లు చెప్పాడు. అంతేగాక ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘మహా సముంద్రం’ సినిమాలో తన డబ్బింగ్ చెబుతున్నానని పేర్కొన్నాడు. చదవండి: లండన్‌లో హీరో సిద్ధార్థ్‌కు సర్జరీ! ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నన్నాడు. ఇక తన స్పైన్ సర్జరీ బాగా జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పాడు. అయితే డాక్టర్లు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు తెలిపాడు. అలాగే తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులకు ఈ సందర్భంగా సిద్దార్థ్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత ‘మహా సముంద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. చదవండి: 'మా'ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే... View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
'మహా సముద్రం' నుంచి రొమాంటిక్ మెలోడి సాంగ్
ప్రేమలో పడ్డప్పుడు కుదురుగా ఉండనివ్వని ఆలోచనలతో తికమకపడిపోతుంటారు ప్రేమికులు. అది ఆనందం తాలూకు తికమక. ‘మహాసముద్రం’ సినిమాలో రెండు జంటలు అలాంటి ఫీలింగ్‌తోనే ఓ పాట పాడుకున్నాయి. ఓ జంట శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్, మరో జంట సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ. ఈ రెండు జంటలూ ‘తికమక..’ అంటూ పాడుకునే లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటకు కిట్టు వరప్రసాద్ సాహిత్యం అందించగా హరిచరణ్, నూతన్ మోహన్ పాడారు. అజయ్ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. -
పండగ సందడి: ద‘సరదా’ షురూ
సినీప్రియులకు పండగ ఎప్పుడంటే బోలెడన్ని సినిమాలు విడుదలైనప్పుడు. పండగలప్పుడు సినిమా రిలీజుల సందడి, పండగ సందడితో డబుల్ ఆనందం దక్కుతుంది. అయితే గత ఏడాది దసరా పండగ సినీ లవర్స్‌ని నిరుత్సాహపరిచింది. థియేటర్ల లాక్డౌన్ వల్ల గత దసరాకి సినిమాలు విడుదల కాలేదు. ఈ దసరాకి సరదా షురూ అయింది. దసరా ఆరంభం నుంచి ముగిసే వరకూ ఈ నవరాత్రికి అరడజను సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూద్దాం. ఉద్యోగం వేటలో అలసిపోయిన రవీంద్ర యాదవ్ జీవితం ఆటలోనైనా గెలవాలని గొర్రెల కాపరిగా కొండపొలం వెళతాడు. అక్కడ ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. అడవిలోని క్రూరమైన జంతువులతో పాటు హానికరమైన మనుషులతో కూడా రవీంద్ర యాదవ్ పోరాడాల్సి వస్తుంది. మరి.. ఈ పోరాట ఫలితం ఏంటి? అనేది థియేటర్స్‌లో తెలుస్తుంది. కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండపొలం’. ‘కొండపొలం’లో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదల కాగా, దేవీ నవరాత్రులు మొదలైన మరుసటి రోజు.. అంటే అక్టోబరు 8న ‘కొండపొలం’ థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక నెల్సన్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ చిత్రం తెలుగులో ‘వరుణ్ డాక్టర్’గా అక్టోబరు 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రానికి నిర్మాత. ‘డాక్టర్’లో శివకార్తికేయన్ అమ్మాయిల కిడ్నాప్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వినయ్‌రాయ్, యోగిబాబు, మిళింద్ తదితరులు కీలక పాత్రధారులు. మరోవైపు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్‌ల క్రేజీ కాంబినేషన్లో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మహాసముద్రం’ కూడా పండగకి వస్తోంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లు. ఒక అమ్మాయి ప్రేమ, ఇద్దరు అబ్బాయిల జీవితాలను ఎలా మార్చింది? అనే అంశంతో ఈ సినిమా కథనం సాగుతుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. దసరాకి ‘ఎనిమి’గా థియేటర్స్‌లోకి వస్తున్నాడు విశాల్. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్య మరో హీరో. స్నేహితుడి నమ్మకద్రోహం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘ఎనిమీ’లో విశాల్, ఆర్య ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కూడా దూసుకొస్తున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో పూజా హెగ్డే, అఖిల్ పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన ఓ ఎన్ఆర్ఐ కుర్రాడు, స్టాండప్ కమెడియన్ అయిన ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? అనే అంశం ఆధారంగా ఈ చిత్ర కథనం సాగుతుంది. మరోవైపు ఇదే రోజు ‘వరుడు కావలెను’ అంటూ థియేటర్స్‌కు వస్తున్నారు హీరోయిన్ రీతూ వర్మ. నాగశౌర్యనే ఈ వరుడు. ‘వరుడు కావలెను’ లో రీతూవర్మ వీరి కల్యాణం పెళ్లి పీటలపైకి వెళ్లే క్రమంలో జరిగే సంఘటనల డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య డైరెక్టర్. ఈ సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా దసరా రిలీజ్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. మరి.. ఈ విజయ దశమికి ప్రేక్షకులు ఏ చిత్రానికి విజయాన్ని అందిస్తారో? ఎవరి దశను తిప్పుతారో చూడాలి. -
లండన్‌లో హీరో సిద్ధార్థ్‌కు సర్జరీ!
Hero Siddharth Got Surgery In London: హీరో సిద్ధార్థ్‌కు లండన్‌లో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన సిద్ధార్థ్‌కు ఆ తర్వాత ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ సెటిలైపోయాడు. ఈ క్రమంలో అక్కడ కూడా తన సినిమాలకు అంతగా గుర్తింపు రాకపోవడంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం అనంతరం ‘మహా సముద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ దసరా సందర్భంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల మహా సముద్రం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి, హీరో శర్వానందా, హీరోయిన్ అనూ ఇమ్మాన్యయేల్తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హజరయ్యారు. అయితే ఈ వేడుకలో సిద్ధార్థ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆరా తీయగా ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఇటీవల లండన్ వెళ్లిన సిద్ధార్థ్‌కు అక్కడ సర్జరీ జరిగినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ అయితే చికిత్స ఎందుకు, దేనికి అనేది మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకునే సిద్ధార్థ్ సర్జరీ విషయంపై ప్రస్తావించలేదు. అంతేగాక కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు షేర్ చేయకపోవడం గమనార్హం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే దీనిపై సిద్ధార్థ్ స్పందించే వరకు వేచి చూడ్సాలిందే. కాగా మహా సముద్రంలో సిద్ధార్థ్‌తో పాటు శర్వానంద్ కూడా హీరో నటిస్తున్నాడు. -
‘మహా సముద్రం’ మూవీ స్టిల్స్
-
మీరు చేస్తే నీతి..నేను చేస్తే బూతా: ‘మహా సముద్రం’ ట్రైలర్
Maha Samudram Trailer Out: శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సముద్రం చాలా గొప్పది..చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ సాగే ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 'నవ్వుతూ కనిపిస్తున్నట్లున్నంత మాత్రానా బాగున్నట్లు కాదు', 'మీరు చేస్తే నీతి..నేను చేస్తే బూతా' వంటి డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
‘మహా సముద్రం’ ట్రైలర్ రీలీజ్ ఎప్పుడంటే..?
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ నెల 23న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ రావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తుండగా.. జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా దసరా కానుకగా అక్టోబర్ 14న సినిమా విడుదల కానుంది. చదవండి: 'మహాసముద్రం' నుంచి మరో లిరికల్ సాంగ్ Setting up our 1st Sail⛵ in the Tale of #ImmeasurableLove❤️#MahaSamudram Voyage Begins on 23rd Sep with an Engrossing Trailer❤️🔥@Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @chaitanmusic @AKentsOfficial#MahaSamudramonOct14th pic.twitter.com/WhgaleB5oZ — Sharwanand (@ImSharwanand) September 20, 2021 -
'మహాసముద్రం' నుంచి మరో లిరికల్ సాంగ్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ''హే రంభ'' పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ విడుదల అయ్యింది. "చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు.. అంటూ సాగే ఈ సాంగ్‌ను హీరోయిన్ రష్మిక విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ సంగీతంలో వచ్చిన ఈ మెలోడి సాంగ్ ఆకట్టుకుంటుంది. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.చాలాకాలం తరువాత సిద్ధార్థ్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. Such a sweet song. All the best you guys! 🌸😙 Happy to launch #CheppakeCheppake 😁 @ImSharwanand 🌸 also showed me the trailer-cut and got to say @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel you guys look amaaaazing!! ❤️ Loads of love.. 🌸#MahaSamudram 🌊 pic.twitter.com/LWuouS0j1m — Rashmika Mandanna (@iamRashmika) September 6, 2021 చదవండి: టెన్నిస్ స్టార్‌తో రిలేషన్.. కన్ఫర్మ్ చేసిన ‘ఖడ్గం’ భామ! ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్ సేతుపతి -
ఆర్ఆర్ఆర్ వాయిదా.. దసరా రేసులో యంగ్ హీరోలు!
RRR Movie Postponed: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెబుతూ వచ్చారు. దీనికి తగ్గట్లుగానే ప్రతి పోస్టర్ లోనూ అదే తేదీని వేస్తూ సినీ అభిమానుల్లో ఆశ కల్పించారు. కాని ప్రస్తుత పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని వాయిదా వేయనున్నట్టు టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. అందుకే దసరా రేసులో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. అక్టోబర్ 8న కొండపొలం రిలీజ్ చేస్తున్నట్లు క్రిష్ ప్రకటించాడు.రిలీజ్ డేట్ లాక్ చేసిన వెంటనే, ప్రమోషన్ స్టార్ట్ చేసాడు.మూవీ నుంచి ఓబులమ్మ ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది.ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఇప్పుడు కొండపొలంకు పోటీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కూడా అక్టోబర్ 8న రిలీజ్ అవుతోంది. గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా చాలా కాలంగా పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. గీతా ఆర్డ్స్ నిర్మిస్తున్న ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ లో ఫస్ట్ బిగ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అఖిల్ ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. టాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 14న శర్వానంద్, సిద్ధార్ద్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ‘మహా సముద్రం’విడుదల కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితీరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ రేస్ నుంచి తప్పుకుందనే రూమర్స్‌కే ఇన్ని సినిమాలు దసరా సీజన్ కు ఖర్చీఫ్ వేస్తోంటే, ఒకవేళ అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ వస్తే మాత్రం మరిన్ని భారీ చిత్రాలు బాక్సాఫీస్ రిలీజ్ కన్ ఫామ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. -
‘మహాసముద్రం’ వచ్చేది అప్పుడే!
‘మహాసముద్రం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబరు 14న విడుదల కానుంది. శుక్రవారం ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించి, కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన చిత్రం ఇది. (చదవండి: ప్యాన్ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు: పృథ్వీ) ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితీరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. రావు రమేష్, జగపతిబాబు, ‘కేజీఎఫ్’ఫేమ్ రామచంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిశోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర. -
మందు తాగి చిందేసిన జగపతిబాబు, శర్వానంద్
Hey Rambha Rambha Song In Maha Samudram: శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "మహా సముద్రం". 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. జూలై 9న షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా హే రంభ పాట రిలీజైంది. రంభ మాయలో పడిపోయిన జగపతిబాబు, శర్వానంద్ మందేసి చిందేస్తున్నారు. అందాల రంభకు వీరాభిమానులమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. పూటుగా తాగుతూ 'హే రంభ.. హే రంభ' అని ఆమె జపమే చేస్తున్నారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను చైతన్ భరద్వాజ్ ఆలపించాడు. వైజాగ్ బీచ్‌లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మార్మోగిపోతోంది. మరి మీరు కూడా ఓసారి ఈ పాటను వినేయండి..