Milk Farmers Union
-
ఆత్మహత్యల దిశగా పాలరైతులు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీ నూతన పాలకవర్గం గజకర్ణ.. గోకర్ణ...టక్కు టమార విద్యలతో ముందుకు సాగుతోంది. అంతా అరచేతిలో చుక్కలు చూపిస్తూ ‘హిప్నటిజాన్ని’ తలపిస్తున్నారు. అవిగో పాల డబ్బులు...ఇవిగో ఉద్యోగుల వేతనాలు..అల్లవిగో పాల రవాణా వాహనాల పాల బకాయిలు అంటూ ఊహల పల్లకిలో తేలియాడే విదంగా డెయిరీ కార్యకలాపాల్లో చుట్టూ పెనవేసుకున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. రూ.35 కోట్లు వచ్చేశాయి ఇంకేముంది కష్టాలు తీరుతాయని భావించిన అటు పాడి రైతులకు, ఇటు ఉద్యోగులకు, పాలు రవాణా చేసిన వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లారు. డెయిరీని నిలువునా ముంచిన అధికార తెలుగుదేశం పాలకమండలిని మించి పోతున్న ప్రస్తుత అధికారులతో కూడిన పాలకమండలి పరిపాలన కూడా పాత వారినే తలపిస్తుందనటంలో సందేహం లేదు. చివరకు పాడి రైతులు, పాలు సేకరించి సరఫరా చేసిన ఏజెంట్లు చివరకు ఆత్మహత్యా యత్నాలకు ఒడిగట్టాల్సిన పరిస్థితులను పాలకులు కల్పించటం అత్యంత దారుణంగా మారింది. కనిగిరికి చెందిన పాల రైతు నరహరి నాతిరెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నాడు. ఒంగోలు డెయిరీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఒంగోలు గిత్త, ఒంగోలు ఆవు ...ఒంగోలు డెయిరీ పాల రుచే వేరు. రాష్ట్రంలో ఏ జిల్లా పాలకు లేని అమృతమైన పాల రుచి ఒక్క ప్రకాశం జిల్లాకే సొంతం. అలాంటి డెయిరీని పాలకమండలి నిలువునా ముంచేసింది. చివరకు పాల రైతులు, ఉద్యోగులు, పాల రవాణా చేసిన వాహనదారులు, ప్రజా సంఘాల ఆందోళనలతో పాత పాలకమండలిని రద్దుచేసిన ప్రభుత్వం కంపెనీ చట్టంలో ఉన్న డెయిరీని మార్చి ఉద్యోగులతో కూడిన పాలక మండలిని ఏర్పాటుచేసింది. ఫెడరేషన్ నుంచి రూ.35 కోట్లు అప్పుగా కూడా ఇప్పించింది. ఇప్పించినట్లే ఇప్పించి సాక్షాత్తు ప్రభుత్వమే నూతన పాలకమండలితో సన్నాయి నొక్కులు నొక్కిస్తుందన్న అపవాదును మూటకట్టుకుంటుంది. జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మాత్రం డెయిరీ అధికారులు, పాలకమండలి డెయిరీని అభివృద్ధి చేస్తున్నాం. పాల బకాయిలు చెల్లిస్తున్నాం, ఉద్యోగుల జీతాల బకాయీలు ఇచ్చేస్తున్నాం అని అటు అధికారులు, ఇటు పాలకమండలి ప్రకటనలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం మాత్రమే పాకులాడుతున్నారన్నది నిత్యకృత్యమైంది. జిల్లాకు గత పది రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సార్లు వస్తున్నాడు. మొదటిసారి జూలై 28వ తేదీన ఒంగోలు నగరంలో ధర్మ పోరాట దీక్షకు వచ్చారు. ఆ ముందు రోజు డెయిరీ చైర్మన్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ జె.మురళి ఒంగోలు వచ్చి 25 పాల సొసైటీలకు సంబంధించిన పాల బకాయిలు రూ.36.30 లక్షలు చెల్లించాం అని చెప్పారు. మిగతా వారికి కూడా పాల బకాయీలు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. కాని 11 రోజులయింది ఇప్పటకీ ఏ ఒక్క పాడి రైతుకూ ఒక్క రూపాయి కూడా చెల్లింపులు జరుగలేదు. మొత్తం జిల్లాలో ’12 కోట్ల వరకు పాల బకాయీలు ఉన్నాయి. ఇక పోతే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పామూరు, చీరాల ప్రాంతాలకు వస్తున్నారు. దీంతో మళ్లీ మరో డ్రామాకు డెయిరీ అధికారులు, పాలక మండలి మరో డ్రామాకు తెరలేపారు. మరమ్మత్తులు పూర్తి కాకుండానే పాలపొడి ఫ్యాక్టరీని ట్రయల్ రన్ పేరిట ఫొటోలకు ఫోజులిచ్చి మరీ ప్రకటించుకునేందుకు పాకులాడుతున్నారు. ఇప్పటి వరకు కనీసం మరమ్మతుల కోసం కనీసం రూ.5 లక్షలు కూడా వెచ్చించలేదన్నది ప్రచారం జరుగుతోంది. పాలపొడి ఫ్యాక్టరీని రూ.30 లక్షలతో మరమ్మతులు చేయించి కర్ణాటక నుంచి పాలు తెప్పించి యథావిధిగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జిల్లాకు రాకముందు చైర్మన్ చెప్పిన మాట. -
మహారాష్ట్ర పాడి రైతుల నిరసన
-
నిరసన: పాలన్నీ రోడ్లపాలు
ముంబై : పాల సేకరణ ధరను ఒక లీటరుకు రూ.ఐదు పెంచాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా స్వాభిమానీ శేత్కారీ సంఘటన (ఎస్ఎస్ఎస్) ముంబైకి సరఫరా అయ్యే పాల ట్యాంకర్లను నిలిపివేసింది. పాల ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లను చించేసి నిరసన తెలిపింది. పుణే, సతారా, సంగ్లీ, సోలాపూర్, వైజాపూర్, అమ్రావతి తదితర నగరాల్లోని రోడ్లపై దాదాపు రెండు లక్షల లీటర్ల పాలను పారబోసి ఆందోళన చేపట్టారు. స్వాభిమానీ శేత్కారీ సంఘటన చీఫ్, ఎంపీ రాజ్ శెట్టి మాట్లాడుతూ.. ప్రైవేట్, కో ఆపరేటీవ్ పాల సంఘాలు జూలై 21నుంచి పాల సేకరణ ధరను లీటరుకు రూ. 3 పెంచనున్నాయి. దాని వల్ల రైతుకు లాభమేమి లేదు. రైతుకు తాత్కాలిక ఉపశమనం కోసం పాల ఉత్పత్తికి రూ. ఐదు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఎస్ ప్రతినిధి యోగేశ్ పాండే, కొంతమంది నిరసనకారులతో కలిసి పుణేలో పాల వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తమ ఆందోళనను గుర్తించాలని కోరారు. చాలా డైరీలు ఆవుపాలకు రూ.17 మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది లీటర్ నీళ్ల బాటిల్ కంటే తక్కువేనని మండిపడ్డారు. పాడి రైతులకు లీటర్ పాలకు రూ.35 అందేలా ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఎస్ఎస్ఎస్ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు పాడి అభివృద్ధి శాఖ మంత్రి మహాదేవ్ జంకర్ పేర్కొన్నారు. ముంబైకి కావాల్సిన పాలను ముందే తరలించామని, ఆందోళన జరిగే రెండు రోజుల పాటు ప్రభావం ఉండదని చెప్పారు. శెట్టి ఈ ఆందోళనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎస్ఎస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని సూచించారు. కాగా, ఎస్ఎస్ఎస్ ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ప్రతిపక్ష నేత రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఈ అంశంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎన్పీపీ కూడా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపింది. -
పాల ప్యాకెట్లో ధరల పోరు!
రూ. 36కే లీటరంటూ హైదరాబాద్‌లోకి ‘నందిని’ ⇒ ఇది... కర్ణాటక పాల రైతుల సమాఖ్య సొంత బ్రాండ్ ⇒ రెండేళ్లలో రూ.2,000 కోట్లతో విస్తరించడానికి సన్నాహాలు ⇒ ఇటీవలే అమూల్ దెబ్బకు ధరలు తగ్గించిన ప్రైవేటు డెయిరీలు ⇒ తాజా పరిణామంతో మరింత తగ్గడానికీ చాన్స్! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో పాల ధరల యుద్ధం పదునెక్కుతోంది. గుజరాత్ సహకార దిగ్గజం అమూల్ ప్రవేశంతో ప్రైవేటు డెయిరీలు ధరలు తగ్గించి రెండుమూడు నెలలు కూడా గడవకముందే కర్ణాటక సహకార దిగ్గజం ‘నందిని’ హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. లీటరు పాలు రూ.36కే విక్రయిస్తున్నట్లు ప్రకటించి... ధరల యుద్ధాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. హైదరాబాద్ తమకు ఆరంభమేనని, తెలుగు రాష్ట్రాలు రెండింటా పూర్తి స్థాయిలో విస్తరిస్తామని చెప్పిన కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (కేఎంఎఫ్) ఎండీ ఎస్.ఎన్.జయరామన్... గురువారమిక్కడ కంపెనీ ఉత్పత్తుల్ని ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఎంఎఫ్ చైర్మన్ పి.నాగరాజుతో కలసి మీడియాతో మాట్లాడారు. లక్ష లీటర్లు లక్ష్యంగా...: ప్రస్తుతం తాము హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లో రోజుకు 35 వేల లీటర్ల తాజా పాలు సరఫరా చేయగలుగుతామని జయరామ్ చెప్పారు. ‘కొద్ది రోజుల్లో దీన్ని లక్ష లీటర్లకు పెంచుతాం. కర్నాటకలోని బెల్గాం, బీజాపూర్ నుంచి పాలు సేకరించి హైదరాబాద్ సమీపంలోని థర్డ్ పార్టీకి చెందిన ప్రాసెసింగ్ కేంద్రానికి తరలిస్తున్నాం. డిమాండ్ పెరిగితే స్థానికంగా పాల సేకరణ చేపట్టడంతో పాటు సొంత ప్రాసెసింగ్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలకు విస్తరిస్తాం’ అని తెలిపారు. సేకరణ వ్యవస్థ వైఫల్యంతోనే...: వ్యవస్థీకృత విధానంలో పాల సేకరణ జరుగుతున్నది కేవలం గుజరాత్, కర్ణాటకలోనేనని కేఎంఎఫ్ ఎండీ చెప్పారు. పాడి రైతుకు దేశంలో ఎక్కడా లేనంతగా తమ సంస్థ లీటరుకు రూ.27 చెల్లిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లీటరుకు రూ.19 చెల్లిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయన్నారు. దళారీ వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోతున్నారని, కస్టమర్లు అధిక ధర చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. వ్యవస్థీకృత సేకరణ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని వివరించారు. క్లిక్ చేస్తే ఇంటికే పాలు.. ఈ-కామర్స్ కంపెనీ బిగ్ బాస్కెట్ ఇప్పటికే నందిని ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. ‘‘మేం ఈ వారంలో మొబైల్ యాప్‌ను తెస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ నుంచి కస్టమర్లు తాజా పాలను కూడా ఆర్డరు చేయొచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు వాసులకు మాత్రమే ఈ సౌకర్యం. కొద్ది రోజుల్లో హైదరాబాద్‌కూ విస్తరిస్తాం. కేఎంఎఫ్ 20% వృద్ధితో 2015-16లో రూ.12,720 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తోంది. పాల సేకరణ సామర్థ్యం జూన్ నాటికి రోజుకు 64 లక్షల నుంచి 70 లక్షల లీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నాం’’ అని జయరామ్ తెలియజేశారు. మౌలిక వసతుల కోసం వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్లు వ్యయం చేస్తున్నట్టు వెల్లడించారు. అమూల్ రాకతో... రెండుమూడు నెలల కిందట అమూల్ ప్రవేశించేంత వరకూ రాష్ట్రంలో ఒక్క ‘విజయ’ బ్రాండ్ తప్ప మిగిలిన పాల ధరలు ఎక్కువగానే ఉండేవి. విజయ కూడా సహకార సమాఖ్యే కనక దాన్ని ఇబ్బంది పెట్టడం తమ లక్ష్యం కాదని, అందుకే తాము కూడా విజయ మాదిరే రూ.38 ధరనే నిర్ణయించామని అప్పట్లో అమూల్ ఎండీ ఆర్.ఎస్.సోధి చెప్పారు కూడా. అయితే అమూల్ రాకతో హెరిటేజ్ వంటి ప్రయివేటు డెయిరీ పాలను అధిక ధర పెట్టి కొంటున్న వారు అటువైపు మళ్లారు. ఇంతలో నల్గొండ జిల్లా సహకార సమాఖ్య నార్ముక్ కూడా నార్ముక్ బ్రాండ్‌తో లీటరు రూ.38కే ఇస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. చివరికి విధి లేక హెరిటేజ్ కూడా తన పాల ధరను రూ.40కి తగ్గించింది. తాజాగా ‘నందిని’ రాకతో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారిం ది. నందిని ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు రూ.50, డబుల్ టోన్డ్ పాలు 300 మిల్లీలీటర్లు రూ.10, పెరుగు 200 గ్రాముల ప్యాక్ రూ.10 చొప్పున విక్రయిస్తోంది.