Mobile Apps
-
థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా పీపీఐ లావాదేవీలకు అనుమతి
ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (గిఫ్ట్ కార్డ్‌లు, డిజిటల్ వాలెట్లు) ఉపయోగించే యూజర్లు ఇకపై గూగుల్‌పే (Google Pay), ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ (Mobile Apps) ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసేందుకు, నగదు స్వీకరించేందుకు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ప్రీపెయిడ్ పేమెంట్ సాధనం (PPI) పూర్తి స్థాయిలో ‘నో యువర్ కస్టమర్’ (KYC) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి యూపీఐ చెల్లింపులను సదరు బ్యాంకు లేదా థర్డ్ పార్టీ యాప్ నుంచి చేయడానికి వీలుంటోంది. కానీ పీపీఐల నుంచి చెల్లించాలన్నా, స్వీకరించాలన్నా ఆయా పీపీఐ సంస్థ యాప్ ద్వారానే చేయాల్సి ఉంటోంది. -
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ 14 యాప్స్ బ్లాక్
ఢిల్లీ: అనుమానిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్, క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో ఈ యాప్‌ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం 14 మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్Wickrme, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నంద్‌బాక్స్, కోనియన్, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్ మేరకు.. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్ ప్రతినిధులెవరూ భారత్‌లో లేరని నిర్ధారించుకుంది. మెసేజింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఓ ప్రకటనలో కేంద్రం కోరింది. ఇదీ చదవండి: మన్‌కీ బాత్ టైంలో పురిటి నొప్పులు, ఆపై.. -
క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!
ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో యుపిఐ చెల్లింపులతో పాటు క్రెడిట్ కార్డు వినియోగం కూడా ఎక్కువవుతోంది. అయితే చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు కార్డ్ ద్వారా బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ చేయవచ్చనే విషయం తెలిసుండకపోవచ్చు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం.. డైరెక్ట్ ట్రాన్స్ఫర్: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు పంపించుకోవడానికి స్మార్ట్‌ఫోన్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక్కో బ్యాంకు రోజువారీ లిమిట్ కలిగి ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సక్షన్ కొంత ఆలస్యం అవ్వొచ్చు, కొన్ని సార్లు వెంటనే కూడా పూర్తయిపోవచ్చు. ఇవన్నీ దేశం, కరెన్సీ, బ్యాంక్ రూల్స్ మొదలైన వాటిపైన ఆధారపడి ఉంటాయి. నెట్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి నగదు జమచేసుకోవచ్చు. దీని కోసం ఈ కింది రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదట మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి వెబ్సైట్ క్రెడిట్ కార్డ్ ఏరియా సెలక్ట్ చేసుకుని, ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఎంత మొత్తానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకునేది ఎంటర్ చేయండి. అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి, మొత్తం ట్రాంసెక్షన్ పూర్తయ్యే వరకు అవసరమైన సమాచారం అందించి పూర్తి చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మరో సులభమైన మార్గం ఫోన్ కాల్స్. మొదట మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి కాల్ చేసి వారు అడిగే వివరాలు తెలియజేయండి. డబ్బు పంపాలన్న విషయం కూడా వారికి తెలపాలి. మీరు ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న విషయం ద్రువీకరించి పూర్తి చేసుకోవచ్చు. చెక్కును అందించడం ద్వారా: చెక్ ఇస్యూ చేయడం ద్వారా కూడా డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొదటి తీసుకునే లేదా గ్రహీత పేరు దగ్గర 'సెల్ఫ్' అని వ్రాయండి చెక్కుపై రాయాల్సిన మిగిలిన వివరాలను కూడా పూర్తి చేయండి. దగ్గరగా ఉన్న బ్యాంక్ లొకేషన్లో చెక్కును డిపాజిట్ చేయాలి. ఏటీఎమ్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడానికి మీరు ఏటీఎమ్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఏటీఎమ్ క్యాష్ విత్‌డ్రా చేయడానికి క్యాష్ అడ్వాన్స్ ఫీచర్ ఎంచుకోవాలి. తరువాత పంపాలనుకున్న మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి. ఈ విధంగా డబ్బు జమచేయడానికి బ్యాంకులు కొంత చార్జెస్ నిర్ణయిస్థాయి. ఇది కూడా ఒక్కో బ్యాంకుకి ఒక్కోలాగా ఉంటుంది. మొబైల్ యాప్‌లు ఉపయోగించి: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎక్కువవ్వడం వల్ల ఏదైనా దాదాపు ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకుంటున్నారు. కావున స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి బ్యాలెన్స్‌లను బదిలీ చేయవచ్చు. -
మనోళ్లు ‘స్మార్ట్’గా అడిక్ట్!.. ఫోన్, యాప్స్‌కు బానిసలుగా..
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ యాప్స్ (అప్లికేషన్స్) వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఫోన్ వినియోగం అడిక్షన్ స్థాయికి చేరుతోంది. 2022 ఏడాదిలో భారత యూజర్లు రోజుకు సగటున ఐదు గంటల పాటు మొబైల్స్‌తోనే కాలక్షేపం చేశారు. ఆ ఏడాదికాలంలో ఏకంగా 28.8 బిలియన్ల యాప్ డౌన్లోడ్లు చేసి.. ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచారు. 111 బిలియన్ల డౌన్లోడ్లతో చైనా టాప్ ప్లేస్‌లో నిలిచింది. వివిధ మొబైల్ యాప్స్‌లో సమయం గడుపుతున్న విషయంలోనూ భారత్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా అందరూ కలిపి గతేడాది మొత్తం 0.74 ట్రిలియన్ గంటలు (74 వేల కోట్ల గంటలు) మొబైల్స్‌లోనే కాలం గడిపారు. ‘యాప్ ఆనీ (ఇటీవలే డేటా.ఏఐగా పేరు మారింది)’ ఇటీవల విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ద మొబైల్ రిపోర్ట్–2023’ నివేదికలో ఈ ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ కొనుగోళ్లలోనూ బిజీగా.. షాపింగ్‌కు సంబంధించి ఆన్లైన్ కొనుగోళ్లలోనూ భారతీయులు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు మొత్తంగా 110 బిలియన్ల గంటలు ఆన్లైన్ కొనుగోళ్లలో గడపగా.. అందులో భారతీయులు గడిపిన సమయం 8.7 బిలియన్లు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్లోడ్ చేసిన పది ఫైనాన్స్ యాప్‌లలో ఐదు (పేటీఎమ్, గూగుల్‌పే, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ యోనో యాప్) మన దేశంలోనే ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. 2022లో ఇండియన్ల ఫ్రెండ్షిప్, డేటింగ్ యాప్‌ల వినియోగం రెండింతలు పెరిగిందని నివేదిక పేర్కొంది. గతేడాది ఈ యాప్స్‌పై 9.9 మిలియన్ డాలర్ల (2021లో 4.5 మిలియన్ డాలర్లు) మేర ఖర్చు చేసినట్టు అంచనా. కల్పిత రిలేషన్‌షిప్‌లు.. మోసాలు.. మొబైల్స్, యాప్స్ వినియోగానికి అలవాటుపడ్డవారు తమకు అంతగా పరిచయం లేనివారి నుంచి కూడా పరోక్ష సాంత్వన కోరుకుంటున్నారు. యాప్స్‌తో పరిచయమయ్యేవారు నిజ స్వరూపాన్ని దాచి, కల్పిత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ. అమాయకత్వం నుంచి క్రిమినల్ బిహేవియర్ ఉన్న వారిదాకా తమ పద్ధతుల్లో ఈ యాప్స్‌ను ఉపయోగించడమో, దుర్వినియోగం చేయడమో జరుగుతోంది. ఈ దుష్ప్రభావాలను గుర్తెరిగి ప్రవర్తించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ నిశాంత్ వేమన, సైకియాట్రిస్ట్, సన్‌షైన్, చేతన హాస్పిటల్స్ జనంలో బద్ధకం పెరిగిపోతోంది విపరీతంగా మొబైల్, యాప్స్ వినియోగంతో జనంలో బద్ధకం పెరిగిపోతోంది. బంధువులు, స్నే హితులు, సన్నిహితులను కలుసుకునేందుకు కూడా ఉత్సాహం చూ పడం లేదు. ఊబకాయులు, మధుమేహ పీడితులు, ఇతర అనారోగ్యాల బాధితుల సంఖ్య కూడా ఎగబాకుతోంది. ఇది రాబోయే రోజుల్లో భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. వివిధ యాప్‌ల వినియోగం విషయంలో ప్రభుత్వపరంగా రెగ్యులేటరీ విధానం ఉండాలి. స్కూళ్లలో ఐదో తరగతి నుంచే ఈ యాప్‌లపై అవగాహన కల్పించాలి. –సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
రెడీ...సెట్...ప్లే; వికాసం నుంచి విజ్ఞానం వరకు
జ్ఞాపక శక్తికి పదునుపెట్టుకోవడానికి, పదసంపదను పెంచుకోవడానికి, సమస్యల పరిష్కారం విషయంలో బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకోవడానికి రకరకాల డిజిటల్ బ్రెయిన్ గేమ్స్‌పై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తుంది... బెంగళూరుకు చెందిన సహజకు చిన్న చిన్న రచనలు చేయడం అంటే ఇష్టం. భవిష్యత్‌లో రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనేది తన కోరిక. ఒక పుస్తకం ఆదరణ పొందాలంటే కాన్సెప్ట్‌తో పాటు భాష కూడా బాగుండాలి అనేది పద్దెనిమిది సంవత్సరాల సహజకు తెలియని విషయమేమీ కాదు. అందుకే తన పదసంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీని కోసం ‘వొకాబులరీ బిల్డర్’ అనే గేమ్ యాప్‌ను సాధనంగా ఎంచుకుంది. కాల్పనిక రచనల కోసం మాత్రమే కాదు, ఆకట్టుకునే భాషలో ఇ–మెయిల్స్ రాయడానికి, రకరకాల విషయాలపై వ్యాసాలు రాయడానికి యువతరం ‘వొకాబులరీ బిల్డర్’ను ఉపయోగిస్తోంది. ‘సూపర్‌బెటర్’ అనేది రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చి, నైపుణ్యాలు పెంపొందించే ఆట. ‘ఎవ్రీవన్ హ్యాజ్ హీరోయిక్ పొటెన్షియల్’ అనేది ఈ ఆట నినాదం. ‘నువ్వు నీ గురించి అనుకున్నదానికంటే బలవంతుడివి...అండగా నిలిచే ఆత్మీయులు నీకు బలమైన సైన్యమై ఉన్నారు...ఎందరికో నువ్వు రోలోమోడల్వి...ఇలాంటి సానుకూల ఆలోచనల్లో నుంచి సమస్యలను జయించే శక్తి పుడుతుంది’ అంటోంది ‘సూపర్‌బెటర్’ను రూపొందించిన జేన్మెక్ గోనిగల్. జేమ్మెక్ ఒకప్పుడు డిప్రెషన్ బారిన పడి అందులోంచి బయటపడింది. తాను కుంగుబాటు చీకటి నుంచి బయటపడిన విధానాన్ని ఒక ఆటగా మలిచి దీని గురించి తన బ్లాగ్‌లో రాసుకుంది. కొద్దికాలంలోనే బ్లాగ్‌లో నుంచి ‘సూపర్‌బెటర్’ రూపంలో డిజిటల్ ఆటగా మారింది. న్యూరోసైంటిస్ట్ల సలహాల ఆధారంగా రూపొందించిన గేమ్... లుమినోసిటీ. ఈ గేమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ‘మీరు ఎలాంటి స్కిల్స్ కోరుకుంటున్నారు?’ అని అడుగుతుంది. కోరుకునే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ఆలోచించడానికి, ఒక సమస్యకు భిన్నమైన పరిష్కారాలు ఆలోచించడానికి ఉపకరించే ఇండి పజిల్ గేమ్ మాన్యుమెంట్ వ్యాలీ. ఈ గేమ్ యాప్ యాపిల్ డిజైన్, పాకెట్ గేమర్ ‘గోల్డ్’ అవార్డ్‌లను గెలుచుకుంది. ‘మాన్యుమెంట్ వ్యాలీ’ ప్రత్యేకత రిలాక్సింగ్ సౌండ్ ట్రాకింగ్, ఆకర్షణీయమైన డిజైన్. సుడోకు ప్రేమికులను ‘గుడ్ సుడోకు’ ఆకట్టుకుంటోంది. ‘పజిల్ ప్రేమికులకు ఇదొక ప్రేమలేఖ’ అంటోంది కంపెనీ. ఇక ఫన్మెథడ్ వీడియో గేమ్ ‘బ్లాక్‌బాక్స్’లో డజన్ల కొద్దీ మినీ గేమ్స్ ఉంటాయి. ‘ఎలివేట్’లో ప్రత్యేకమైన వర్కవుట్ క్యాలెండర్ ఉంటుంది. ‘ఫన్ అండ్ క్లిక్’ పద్ధతిలో దీన్ని రూపొందించారు... ఇలా చెప్పుకుంటూ పోతే యువతరాన్ని ఆకట్టుకుంటున్న బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ‘బస్సు కోసం ఎదురుచూసే క్రమంలో టైమ్ వృథా అయ్యేది. ఇప్పుడు మాత్రం రకరకాల బ్రెయిన్ జిమ్ గేమ్స్ ఆడుతున్నాను. కొత్త ఉత్సాహం వస్తోంది’ అంటున్నాడు ముంబైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాకేత్. ‘మా తాతయ్యకు సుడోకులాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడం అంటే ఇష్టం. ఆయన కాలక్షేపం కోసం పజిల్స్‌ను సాల్వ్ చేస్తున్నారనుకునేదాన్ని. పజిల్స్ సాల్వ్ చేసే ప్రక్రియ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాక వినోదంతో కూడిన బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్స్‌పై ఆసక్తి పెరిగింది’ అంటోంది చెన్నైకి చెందిన భార్గవి. ‘మన జీవితమే పెద్ద పజిల్. చావు నుంచి పుట్టుక వరకు రకరకాల పజిల్స్‌ను పరిష్కరిస్తూనే ఉండాలి’ అనేది తాత్వికత ధ్వనించే మాట అయితే కావచ్చుగానీ రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి. వ్యక్తిత్వ వికాసానికి డిజిటల్ బ్రెయిన్ గేమ్స్‌ను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది యువతరం. -
గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!
మీ రైల్వే స్టేషన్లో గమనిస్తే ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం పొడవైన క్యూలలో నిల్చుని ఉండడం చూసే ఉంటారు. కొన్నిసార్లు, టికెట్ కౌంటర్ వద్ద ఆలస్యం అయ్యి మీ ప్రయాణం రద్దు కావడమో లేదా టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసి టికెట్ కలెక్టర్‌కు జరిమానా కట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ తాజాగా సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవ.. కేవలం సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది భారతీయ రైల్వే. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చింది. యూటీఎస్ యాప్ ఇన్స్టలేషన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్‌స్టల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. సబర్బన్ ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు తమ పరిధిలోని రైల్వే స్టేషన్‌కు ప్రయాణించేందుకు దీని ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు దీని పరిధి రెండు కి.మీ. దూరంలో ఉంటే.. ఆ దూరాన్ని పెంచనుంది రైల్వేశాఖ. యూటీఎస్ మొబైల్ యాప్‌లను ఉపయోగించే వారు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ►మీరు ప్రయాణ తేదీకి టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ►టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి. ►స్టేషన్ ఆవరణకు 5 కి.మీ నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ATVMలో ప్రయాణికులు పేపర్‌లెస్ టిక్కెట్లను ప్రింట్ చేయలేరు. వారికి పేపర్ టిక్కెట్ కావాలంటే, టిక్కెట్ బుకింగ్ సమయంలో వారు ఈ ఎంపికను ఎంచుకోవాలి. ►అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ యాప్‌తో, బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. ►ప్లాట్ఫారం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి. ►ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ►ఒక ప్రయాణీకుడు బుక్ & ప్రింట్ ఎంచుకుంటే. ఆ వ్యక్తికి పేపర్ లెస్ టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు. ►మీరు స్టేషన్ ఆవరణలో లేదా రైలులో యూటీఎస్ టిక్కెట్‌ను బుక్ చేయలేరు. ►ఎక్స్‌ప్రెస్/మెయిల్/ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టిక్కెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: ఫోన్‌పే,గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్! -
పాకిస్థాన్ ఓటీటీపై నిషేధం.. ఎందుకంటే?
పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌కు చెందిన 'విడ్లీ టీవీ' అనే ఓటీటీ ఫ్లామ్ఫామ్ను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మరో రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు, స్మార్ట్ టీవీ యాప్‌లపై కూడా నిషేధం విధించింది. ఇటీవల విడ్లీ టీవీ ఓటీటీలో విడుదలైన 'సేవక్: ది కన్ఫెషన్స్' అనే వెబ్ సిరీస్‌లో భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు తెచ్చేలా కంటెంట్ ఉందని కేంద్రం వెల్లడించింది. ఓటీటీలో విడుదలైన మూడు ఎపిసోడ్లు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. వెబ్ సిరీస్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ భారత చారిత్రక ఘటనలపై వ్యతిరేకతను పెంచేలా ఉందని.. పూర్తి అవాస్తవాలతో ప్రసారం చేస్తున్నారని భారత సీనియర్ అధికారి కంచన్ గుప్తా తన ట్విటర్లో వెల్లడించారు. IMPORTANT Ministry of Information & Broadcasting, using emergency powers under IT Rules 2021, has issued directions on 12 December 2022 for immediate blocking of the website, 2 mobile apps, 4 social media accounts, and one smart TV app of #Pakistan-based OTT Platform Vidly TV. n1 — Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) December 12, 2022 -
దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్ఐవీ
కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఓ విద్యార్థి కర్నూలు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గతేడాది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఎలా జరిగిందని ఆరా తీయగా.. మొబైల్‌యాప్‌లో ఓ మహిళ ఫోన్ నంబర్ సేకరించి ఆ విద్యార్థిని పిలిపించుకుని శారీరకంగా కలిసిన విషయం వెలుగు చూసింది. తనకు పాజిటివ్ అని తేలగానే బెంగ పెట్టుకుని చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యాడు. రాయదుర్గానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఇటీవల జ్వరం, కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లినపుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి హెచ్ఐవీ ఉన్నట్లు బయటపడింది. తండ్రి తప్పిదాల కారణంగా తల్లికి.. ఆ తర్వాత విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. రాయదుర్గం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆటోను వదిలి జీపు డ్రైవర్‌గా చేరాడు. బయటి ప్రాంతాలకు వెళ్లినపుడు మద్యం మత్తులో పెడదారి పట్టాడు. చివరకు హెచ్ఐవీ బారినపడి కుంగిపోతున్నాడు. డీ హీరేహాళ్ మండలానికి చెందిన 22 ఏళ్ల హిజ్రాకు హెచ్ఐవీ సోకింది. హిజ్రాతో లైంగిక సంపర్కం కలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలా వీరే కాదు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేకం వెలుగు చూస్తుండటం కలవరం రేపుతోంది. రాయదుర్గం (అనంతపురం జిల్లా): అరక్షిత శృంగారం ప్రాణాంతక హెచ్ఐవీ/ ఎయిడ్స్‌కు దారితీస్తోంది. భాగస్వామితో కాకుండా ఇతరులతో శారీరకంగా కలవడం, సురక్షిత పద్ధతులు పాటించకపోవడంతో చాలామంది దీనిబారిన పడుతున్నారు. వ్యాధి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా కొందరి నిర్లక్ష్యం వల్ల వారితో పాటు కుటుంబ సభ్యుల జీవితాలను కబళిస్తోంది. 20 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఎక్కువగా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. డిన్నర్ల పేరుతో రాత్రిళ్లు రోడ్ల మీద తీరగడం, మొబైల్ యాప్‌ల ద్వారా ఆకర్షణతో పెడదారిన పట్టడం వెరసి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ప్రతి నెలా 90 పాజిటివ్ కేసులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఏఆర్టీ, మొబైల్ నెట్వర్క్, నర్సింగ్ హోమ్ తదితర కేంద్రాల్లో నిర్వíహిస్తున్న హెచ్ఐవీ పరీక్షల్లో ప్రతి నెలా 80 నుంచి 90 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన డీ హీరేహాళ్, రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండతో పాటు అనంతపురం తదితర ప్రాంతాల్లో 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన ట్రాన్స్జెండర్స్లోనూ హెచ్ఐవీ కేసులు బయటపడుతున్నాయి. జిల్లాలో 14,718 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరందరికీ క్రమం తప్పకుండా చికిత్సలందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. హెచ్ఐవీ నిర్ధారణ జరిగినా కొందరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం, చికిత్సకు వెళ్లకుండా బయట మందులు వాడడం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఉన్నత చదువుల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు కొందరు ఈ మహమ్మారి వలలో చిక్కుకోవడం దురదృష్టకరం. కండోమ్ వినియోగిస్తే హెచ్ఐవీ వైరస్ బారినపడరని తెలిసినా మత్తు, వ్యామోహంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. యువత ఇకనైనా మేల్కొని వివాహేతర సంబంధాలు, అరక్షిత లైంగిక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితం నాశనం చేసుకోవద్దు యువత అనాలోచిత నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇటీవల కొంతమంది యువకుల్లో హెచ్ఐవీ లక్షణాలు కనిపించడం కాస్త ఆందోళనకర విషయమే. అయినా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా అరికట్టాల్సిన అవసరం అందరిపైనా ఉంది. పాజిటివ్ ఉన్నవారు దాచిపెట్టడం మాని చికిత్స తీసుకుంటే మంచిది. – కె.సత్యనారాయణ, ఏఆర్టీ వైద్యులు, అనంతపురం వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి అని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నిరక్షరాస్యులు ఒకరో ఇద్దరు ఈ వ్యాధి బారిన పడితే ఏమో అనుకోవచ్చు.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఈ వ్యాధి బారినపడటం విచారకరం. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, బయట తిరుగుళ్లు తిరిగే యువతపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తుండాలి. హెచ్ఐవీ వైరస్ ఒకసారి ప్రవేశించాక జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప ఇంకెక్కడా మందులు లభించవు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స పొందుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. లైంగిక చర్యలకు దూరంగా ఉంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టాలి. – డాక్టర్ అనుపమ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, అనంతపురం -
‘పొట్లం’ యువకుడి కథ.. ఏటా రూ.6 కోట్ల టర్నోవర్.. 200 మందికి ఉపాధి
ఆ యువకుడిది.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక సామాన్య రైతు కూలీ కుటుంబం. చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయినా, తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ అతడిని పెంచి పెద్ద చేసింది. పేదరికంతో విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే సాగింది. బీఏ మాత్రమే చదివినా పట్టుదలతో ఐటీ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. యాక్సెంచర్, విప్రో వంటి ప్రతిష్టాత్మక కంపెనీల్లో పనిచేశాడు. అంతటితో ఆగని ఆ యువకుడు ‘పొట్లం’ పేరుతో ఆహారం, సరుకులను డోర్ డెలివరీ చేసే యాప్‌కు శ్రీకారం చుట్టాడు. చదువుకునేటప్పుడే ఖర్చుల కోసం కిరాణా కొట్టులో పనిచేస్తూ ‘పొట్లం’ కట్టిన ఆ యువకుడు ఇప్పుడు తన సొంత ఊరు జంగారెడ్డిగూడెం కేంద్రంగా 200 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. పొట్లం యాప్ ద్వారా ఐదు పట్టణాల్లో ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలను డోర్ డెలివరీ చేస్తున్నాడు. తన వ్యాపారం ద్వారా ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం... అనే మాటను రుజువు చేస్తున్న ఆ యువకుడే.. శ్రీనివాస్ అలమండ. అతడి స్ఫూర్తిదాయక విజయగాథ ఇది.. సాక్షి, అమరావతి: పేదరికం కారణంగా అలమండ శ్రీనివాస్ ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే సమయంలో ఖర్చుల కోసం అనేక పనులు చేశాడు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ నెలకు రూ.1,500 జీతంతో ఉద్యోగం చేశాడు. ఇంగ్లిష్, అమీర్‌పేటలో ఐటీ కోర్సులు నేర్చుకుని యాక్సెంచర్, విప్రో కంపెనీల్లో 17ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, కెనడాల్లోనూ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అయితే, సొంత ఊరు జంగారెడ్డిగూడెంపై మమకారంతో తిరిగి వచ్చేశాడు. ఏదైనా మొబైల్ యాప్ తయారు చేయాలనే లక్ష్యంతో తన స్నేహితులు హరికృష్ణ, రఘు, సోదరుడు పవన్‌లతో కలిసి జంగారెడ్డిగూడెం కేంద్రంగా 2020లో పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ‘పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్’కు శ్రీకారం చుట్టాడు. లక్ష మందికిపైగా వినియోగదారులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్‌కు ప్రస్తుతం లక్ష మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. పొట్లం యాప్ ద్వారా జంగారెడ్డిగూడెం, ఏలూరు, తణుకు, నర్సీపట్నం, సత్తుపల్లి పట్టణాల్లో వినియోగదారులకు నిత్యం ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు, మాంసాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. పొట్లం యాప్ ద్వారా శ్రీనివాస్ ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. పొట్లంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2020లోనే పొట్లం మొదటి డార్క్ స్టోర్ పొట్లం యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా సరుకులు అందించేలా 2020 ఆగస్టులో జంగారెడ్డిగూడెంలో మొదటి డార్క్స్టోర్ను శ్రీనివాస్ ఏర్పాటు చేశాడు. వినియోగదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా పొట్లం ఆన్లైన్ యాప్, ఆఫ్‌లైన్ (ఫోన్ ద్వారా)లో ఆర్డర్ ఇస్తే సరుకులు డార్క్‌స్టోర్ నుంచి సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారు. రైతుకి వెన్నుదన్ను.. వ్యవసాయ కూలీ కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీనివాస్ పొట్లం యాప్ ద్వారా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా అక్కడికక్కడే మంచి ధర దక్కేలా చేస్తున్నాడు. దీనిద్వారా ఓవైపు రైతులకు దళారీల బాధ లేకుండా మంచి ధర దక్కుతుంటే.. వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు తక్కువ ధరకే అందుతున్నాయి. మార్కెట్ ధరల కంటే కనీసం 20 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేస్తున్నాడు. బయట మార్కెట్లో దాదాపు రూ.400 విలువ చేసే 17 రకాల కూరగాయలను కేవలం రూ.199కే డోర్ డెలివరీ ఇస్తున్నాడు. నిరక్షరాసులు సైతం.. ఆన్లైన్ కొనుగోళ్లు చేయాలంటే స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, చదువు తప్పనిసరి. ప్రస్తుతం బహుళజాతి సంస్థల యాప్‌లన్నీ ఈ కోణంలోనే ఉన్నాయి. కానీ పొట్లం యాప్ మాత్రం వీటికి భిన్నంగా ఆఫ్‌లైన్ విధానంలోనూ సేవలు అందిస్తోంది. పొట్లం వినియోగదారుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ లేనివారే అంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే నేరుగా ఇంటికి సరుకులు పంపే ఏర్పాటు ‘పొట్లం’ ప్రత్యేకత. కరోనా సమయంలోనూ ఉపాధి 2020లో కరోనా సమయంలో పొట్లం యాప్‌ను ప్రారంభించా. ఆ సమయంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల టీచర్లు చాలామంది ఉపాధి కోల్పోయి పొట్లం యాప్‌లో డెలివరీ బాయ్స్‌గా చేరారు. కరోనా కష్టకాలంలో ఏ ఉద్యోగం లేక రోజు గడవడం కష్టమైన చాలామందికి ఉపాధి కల్పించా. ఔత్సాహిక యువతకు మొదటి పది బ్రాంచ్‌లకు పొట్లం ఫ్రాంచైజీ ఉచితంగా ఇస్తా. ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ద్వారా మొత్తం 14 యాప్‌ల అనుసంధానంతో పొట్లం యాప్ పనిచేస్తోంది. పొట్లం ఫ్రాంచైజీని ఉచితంగా ఎవరైనా తమ ప్రాంతంలో తీసుకోవడానికి యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 నాటికి రాష్ట్రంలో ఐదు వేల కేంద్రాలకు పొట్లం యాప్‌ను విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నా. అధునాతన మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లను జోడించి వినియోగదారులకు సేవలందిస్తున్నా. – శ్రీనివాస్ అలమండ, ఎండీ, పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. -
ప్చ్..అధ్వాన్నంగా భారతీయ బ్యాంకుల్లో మొబైల్ యాప్స్ సేవలు!
భారత్‌కు చెందిన బ్యాంకులు కస్టమర్లకు మొబైల్ సర్వీసుల్ని అందించడంలో విఫలమవుతున్నాయి. కస్టమర్ల ఖర్చుల్ని, అప్పుల్ని అర్థం చేసుకోవడం, ఉపయోగకరమైన బడ్జెట్లను రూపొందించడం, ఆర్ధిక వృద్ధి సాధించేలా సలహాలు ఇవ్వడం, వారి ఆర్థిక స్థితుల్ని ట్రాక్ చేయడంలో బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఫర్ రెస్టర్..మనీ మేనేజ్మెంట్ సామర్థ్యాలలో దేశీయ బ్యాంకులకు అత్యల్ప స్కోర్‌ను ఇచ్చింది. తాజా క్యూ3లో మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు అందించే ఏ బ్యాంక్‌కు కూడా 60శాతం మించి స్కోర్ ఇవ్వలేదు. అందుకు కారణం బ్యాంకులు కస్టమర్లకు అందించే సర్వీసులపై అసంతృప్తి వ్యక్తం చేయడమేనని తెలుస్తోంది. బ్యాంకుల్లో నావిగేషన్ బాగున్నప్పటికీ యాప్స్‌లో సెర్చ్ బార్లో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ముఖ్యంగా వినియోగదారులు చేసిన ట్రాన్సాక్షన్లను గుర్తించేలా యాప్‌లో సులభమైన పద్దతులు లేవని ఫర్ రెస్టర్ తెలిపింది. దీంతో పాటు బ్యాంకులు గోప్యతా విధానాన్ని ప్రదర్శిస్తున్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం బ్యాంకులు పబ్లిష్ చేసే ఆర్టికల్స్ సామాన్యులకు అర్ధం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. "చాలా బ్యాంకులు యాప్స్‌ను బిల్డ్ చేయడంలో రాజీ పడడం లేదు. మంచి విషయమే. మొబైల్ బ్యాకింగ్ వ్యవస్థతో యూజర్లకు ఉపయోగం, సులభంగా ఉంటుంది. తద్వారా బ్యాంకుల్ని వినియోగించేందుకు మక్కువ చూపుతారని పేర్కొంది. -
ఫోన్ యాప్ ద్వారానే టీచర్ల హాజరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ సెప్టెంబర్ 1 నుంచి ఇంటిగ్రేటెడ్ అటెండెన్స్ మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఫోన్ యాప్ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని తెలిపింది. వీరితోపాటు పాఠశాల విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్ హాజరును నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం.. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వివరించింది. వారు ప్రత్యేకంగా మాన్యువల్ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. కాగా, ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని నెల రోజుల్లో అన్ని విభాగాల్లో అమలు చేయనున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే.. ఆండ్రాయిడ్ ఫోన్‌లేని టీచర్లు, ఉద్యోగులు తమ హాజరును హెడ్మాస్టర్ లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్స్ ద్వారా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్లను బుధవారంలోపు పూర్తి చేయాలని తెలిపింది. యాప్ ద్వారా హాజరు నమోదు.. విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, జోన్, జిల్లా కార్యాలయాలు, డైట్స్, ఎంఈవో తదితర కార్యాలయాలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశించింది. హాజరును క్రమం తప్పకుండా యాప్ ద్వారా నమోదు చేసేలా చూడాలని పేర్కొంది. -
కాలక్షేపం కోసం ఆడిన ఆన్లైన్ గేమ్‌లు...సైబర్ జూదం ఊబిల్లో ..
బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాతో మరో నష్టం మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులతో అతిగా మొబైల్స్‌ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది. పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ తెలుసుకుని గేమ్స్‌కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు. డబ్బు తగలేసిన టెక్కీ ఒక టెక్కీ పోకర్ అనే ఆన్లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది. వీధిన పడ్డ క్యాషియర్ బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు) -
అల్లరిపిల్ల: ఫేస్బుక్ ఐడీతో పురుషులకు వల.. నగ్నంగా కాల్స్
చిత్తూరు అర్బన్: పురుషుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ యువతి ‘అల్లరిపిల్ల’ అవతారం ఎత్తింది. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు కొల్లగొట్టింది. ఈ బాగోతంలో కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్న ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫేస్బుక్లో అల్లరిపిల్ల అనే ఐడీ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేవి. వీటిని అంగీకరించిన కొద్దిరోజుల్లోనే ఓ అజ్ఞాత యువతి మెసెంజర్ ద్వారా వాయిస్‌కాల్స్ చేసి, మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడం, నేరుగా కలవడానికి నమ్మకం వచ్చాక ప్రమాదకరమైన స్పై (నిఘా) యాప్స్ లింకులను పురుషుల మొబైళ్లకు పంపేది. ఆ లింకులను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్లో ఏం చేసినా అల్లరిపిల్ల తన సెల్‌ఫోన్ నుంచే చూసేది. వివరాలను వెల్లడిస్తున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, వెనుక అరెస్టయిన నిందితులు మరికొందరికి క్రెడిట్‌కార్డులు ఇప్పిస్తామంటూ నిఘా యాప్స్ పంపేది. ఆపై ఫోన్‌పే, గూగుల్‌పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి మళ్లించేది. ఇలా ఓ పది బ్యాంకు ఖాతాల నుంచి అల్లరిపిల్ల ఖాతాలోకి నగదు వెళ్తుంది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్ అనే వ్యక్తి సైతం అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే.. రూ.3.64 లక్షలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి. ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకుని విశాఖ జిల్లాకు చెందిన ఎ. సాంబశివరావు (32), బి.ఆనంద్మెహతా (35), జి. శ్రీను (21), సి. కుమార్రాజు (21), ఎల్.రెడ్డి మహేష్ (24), జి. శివకుమార్ (21), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్‌కుమార్ అలియాస్ సుకు (30), వరంగల్‌కు చెందిన టి.శ్రావణ్‌కుమార్ (31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్‌లను డీఎస్పీ అభినందించారు. ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు. వీరందరితో నెట్‌కాల్స్ ద్వారా మాట్లాడి కమీషన్ ఇచ్చి నగదు లావాదేవీలు జరపడానికి ఏజెంట్లుగా నియమించుకుంది. బాధితుడి ఫిర్యాదు, అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అల్లరిపిల్లను ఓ యువతిగా గుర్తించిన పోలీసులు ఆమెను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
అమ్మో.. చైనా యాప్‌లు.. పేర్లు మార్చుకుని ఏకంగా 57 శాతం!
సాక్షి, అమరావతి: ‘చైనా దుకాణంలో దూరిన ఎద్దు..’ అనేది ఓ సామెత. అంటే పింగాణి సామగ్రి దుకాణంలో ఎద్దు దూరితే అది లోపలున్నా.. బయటకొచ్చినా.. దుకాణానికి నష్టమే. ఇక తాజాగా మన మొబైల్ ఫోన్లో చైనా యాప్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే కొన్ని చైనా యాప్‌లు చాపకింద నీరులా మన వ్యక్తిగత సమాచారాన్ని దేశ సరిహద్దులు దాటిస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం అటువంటి చైనా యాప్‌లను నిషేధిస్తున్నప్పటికీ పేర్లు మార్చుకుని మరీ చలామణిలోకి వచ్చేస్తున్నాయి. చైనా యాప్‌లు 57 శాతానికిపైగా అదనపు సమాచారాన్ని సేకరించి ఇతరులకు చేరవేస్తున్నాయని పుణెకు చెందిన ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఆర్కా కన్సల్టెన్సీ జనవరిలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. సరిహద్దులు దాటుతున్న సమాచారం మొబైల్ యాప్ సంస్థలు అవసరానికి మించి వినియోగదారుల సమాచారాన్ని కోరుతున్నాయి. వినియోగదారులకు తగిన అవగాహన లేకపోవడంతో యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే తొందర్లో ఆ సమాచారాన్ని ఫీడ్ చేస్తున్నారు. ప్రధానంగా కాంటాక్ట్ నంబర్లు, కెమెరా, మైక్రోఫోన్, సెన్సార్లు, లొకేషన్, టెక్టŠస్ మెస్సేజ్‌లు మొదలైన అంశాలతో అనుసంధానించమని అడుగుతున్నాయి. ఆ విధంగా యాప్ కంపెనీలు 57 శాతానికిపైగా అవసరం లేని సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాయి. 90 శాతానికిపైగా యాప్‌లు అవసరం లేనప్పటికీ కెమెరా యాక్సెస్ కోరుతున్నాయి. వాటిలో వినోద, విద్య, ఇ–కామర్స్, న్యూస్, గేమింగ్ తదితర యాప్‌లున్నాయి. ఆ సమాచారాన్ని యాప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, సింగపూర్‌లతోపాటు గుర్తుతెలియని దేశాల్లోని సంస్థలకు విక్రయిస్తున్నాయి. ఆయా దేశాల్లోని సంస్థలు ఆ సమాచారాన్ని ఎందుకోసం కొనుగోలు చేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మార్కెట్ రీసెర్చ్ కోసం అంటూ ఈ సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెబుతున్నాయి. ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తున్నారా అన్నదానిపై సందేహాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలీబాబా వంటి ప్రముఖ సంస్థ యాప్‌లను భారత్‌లో ఏకంగా 43 కోట్లమంది వరకు డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. అంటే ఏ స్థాయిలో భారతీయుల సమాచారాన్ని ఆ సంస్థ సేకరించిందో తెలుస్తోంది. వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లోకి వెళుతుండటం సైబర్ నేరాలకు కూడా కారణమవుతోందని ఆర్కా కన్సల్టెన్సీ గుర్తించింది. డిజిటల్ పేమెంట్ల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడేందుకు అవకాశం ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్లు పెరగడం దీనికి తార్కాణమని కూడా గుర్తుచేస్తున్నారు. పేరు మార్పుతో మళ్లీ.. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా చైనా యాప్‌లను నిషేధిస్తోంది. 2020 నుంచి 278 చైనా యాప్‌లను నిషేధించింది. వాటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, వుయ్‌చాట్, లైకీ, బిగ్ లివ్, అలీ ఎక్స్‌ప్రెస్, అలీపే క్యాషియర్ మొదలైనవి ఉన్నాయి. భారత్‌లో ఆ యాప్‌లను బ్యాన్ చేయాలని గూగుల్ ప్లే స్టోర్‌ను కేంద్రం ఆదేశించింది కూడా. కానీ ఆ యాప్‌లు పేర్లు మార్చుకుని మళ్లీ దేశంలో అందుబాటులోకి రావడం విస్మయం కలిగిస్తోంది. వాటిలో ప్రముఖ కంపెనీలు అలీబాబా, టెన్సెంట్, నెట్ఈజ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందినవి కూడా ఉండటం గమనార్హం. దీనిపై వివరాల కోసం ఈ–మెయిల్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ సంస్థలు స్పందించలేదని ఆర్కా కన్సల్టెన్సీ పేర్కొంది. అప్రమత్తతే పరిష్కారం యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. మనకు అవసరమైనమేరకే యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకు ముందు ఆ కంపెనీలు అడిగే సమాచారాన్ని పూర్తిగా చదవాలి. సమాచారం పెద్దగా ఉంది కదా అని చదవకుండా యాక్సెస్ ఇవ్వొద్దు. అవసరమైనంత వరకే సమాచారం ఇవ్వండి. యాప్‌లు ప్రతి వారం, పదిరోజులకు ఒకసారి అప్డేట్ అడుగుతుంటాయి. అప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఓకే చేయండి. ఇక బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్ధిక వ్యవహారాల అంశాలపై మరింత జాగ్రత్తగా ఉండాలి. తమ వ్యక్తిగత సమాచారం లీకైందని భావించినా, తాము సైబర్ నేరాల బారిన పడ్డామని తెలిసినా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – రాధిక, ఎస్పీ, సైబర్ క్రైం -
చైనాకు భారత్ మరో షాక్.. 54 చైనా యాప్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్ యాప్‌లను సోమవారం కేంద్రం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ యాప్స్ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి. దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని వివరించాయి. గెరెనా ఫ్రీ ఫైర్–ఇల్యుమినేట్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, నైస్‌వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్డీ, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్‌లాక్, మూన్‌చాట్, బార్కోడ్ స్కానర్–క్యూఆర్ కోడ్‌స్కాన్ వంటివి ఈ జాబితాలో ఉన్నట్టు వివరించాయి. -
మరో 54 చైనీస్ యాప్‌లపై నిషేధం!
India plans to ban 54 Chinese apps: దేశ భద్రతకు ముప్పు తెచ్చే 54 చైనీస్ యాప్‌లను నిషేధించాలని భారత్ యోచిస్తోందని అధికారులు తెలిపారు. అంతేకాదు నిషేధించిన యాప్‌లలో స్వీట్ సెల్ఫీ హెచ్డీ, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఆన్‌మోజీఎరినా, యాప్‌లాక్, డ్యూయల్ స్పేస్ లైట్లు వంటివి ఉన్నాయి. గతేడాది జూన్‌లో దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ విస్తృతంగా ఉపయోగించే టిక్‌టాక్, వీచాట్, హెలో వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. పైగా మే 2020లో చైనా సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యలంఓ భారత్ దాదాపు 300 యాప్‌లను బ్లాక్ చేసింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన నేపథ్యంలో జూన్ 2020లో తొలిసారిగా భారత్ ఈ నిషేధాన్ని ప్రకటించింది. (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
ఫోన్లు చేయరు.. చాటింగ్ ద్వారా సంప్రదించి..
సాక్షి, హైదరాబాద్: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. అంటే ఇదేనేమో! అరాచకాలకు పాల్పడి అడ్డంగా బుక్కైన చైనా లోన్, ఫోంజి యాప్ నిర్వాహకులు ఇప్పుడు సరికొత్త రూపంలో దందాలకు తెరలేపారు. కొంతకాలంగా ఈ లోన్ యాప్‌ల కారణంగా దేశంలో అలజడి రేగడంతో అప్పటి నుంచి అకస్మాత్తుగా వీటి కార్యకలాపాలు నిలిచిపోయాయి. తాజాగా పేరు మార్చుకుని వస్తున్న ఈ ఫోంజి యాప్ (సులువుగా డబ్బు సంపాదించే)లకు ప్రచారం కల్పించేందుకు మనదేశంలోని యూట్యూబర్లకు యాడ్స్ పేరిట ఎరవేస్తున్నారు. బయటివారు ఇచ్చే దానికి పదింతలు అధికంగా చెల్లిస్తామని ఆశ చూపడంతో తమకు తెలియకుండానే అనేకమంది యూట్యూబర్లు చైనా యాజమాన్యాలకు సహకరిస్తున్నారు. వచ్చీ రాని ఇంగ్లిష్‌లో.. యూట్యూబర్లను సంప్రదించేవారిలో అధికంగా చైనీయులే. యూట్యూబర్లను నేరుగా ఫోన్లో సంప్రదించకుండా ఎక్కువగా వాట్సాప్ ద్వారా చాటింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం తొలుత లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లను ఎంచుకుంటున్నారు. చైనా భాషను గూగుల్ ట్రాన్స్లేటర్లో వేసి, అలా వచ్చిన ఇంగ్లిష్ కాపీని తిరిగి ఇక్కడివారికి పంపిస్తున్నారు. ఒక్కోసారి పొరబాటున చైనా భాషనే పంపించి వెంటనే డిలిట్ చేస్తున్నారు. దీనిపై బెంగళూరుకు చెందిన ఓ యూట్యూబర్ తనతో సంప్రదించేది చైనీయులు అని అనుమానించాడు. అదే సమయంలో తనకు రూ.500 ఇవ్వాల్సిన చోట రూ.5,000 ఇస్తామని, ఇంకా కావాలంటే రూ.50,000 కూడా ఇస్తామని ఆఫర్ చేయడంతో అతడు అప్రమత్తమయ్యాడు. వారి కుట్రలను అర్థం చేసుకోలేని చాలామంది డబ్బు కోసం వారికి వీడియోలు చేసి పెడుతూ చైనా యాప్ యాజమాన్యాలకు సహకరిస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచే యాప్‌లు.. బుర్స్, క్యాష్‌బ్యాక్, వాల్మార్ తదితర పేర్లతోటి మొన్నటిదాకా ప్లేస్టోర్‌లో ఈ యాప్‌లు అందుబాటులో ఉండేవి. ఆన్లైన్లో తమ ఉత్పత్తులకు లైక్ కొట్టే పార్ట్ టైం జాబులో చేరితే రోజూ కొంత డబ్బు చెల్లిస్తామని ఎరవేస్తారు. ఇందులో రూ.5,000 నుంచి రూ.1,50,000 వరకు ప్లాన్లు ఉంటాయి. ఈ చెల్లింపులన్నీ ఫోన్‌పే, గూగుల్ పే ద్వారానే. ఉదాహరణకు రూ.5,000 కట్టి బేసిక్ స్కీంలో చేరినవారు ఆయా ఉత్పత్తులకు లైక్ కొడితే వారి ఖాతాలో రోజుకు రూ.400 వేస్తారు. ఇందులో ట్యాక్సులు పోను రూ.328 జమా అవుతాయి. రూ.లక్షకుపైగా కట్టి స్కీంలో చేరితే రోజుకు రూ.9,000 పడతాయి. రెండువారాలు కొనసాగితే తమ డబ్బు తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడే యాప్ నిర్వాహకులు తమ తెలివితేటలు ప్రదర్శిస్తారు. సెల్ లోకేషన్ ఆధారంగా తమ వినియోగదారుల్లో ఎక్కువమందిని పల్లెటూరు, బస్తీలను ఎంచుకుంటారు. వీరిలో కొందరికి రోజూ డబ్బులు ఠంఛన్‌గా ఇస్తారు. ఉదాహరణకు మీరు రిఫర్ చేసిన వ్యక్తి రూ.30,000 స్కీములో చేరితే మీకు రోజూ అదనంగా రూ.300 వస్తాయి. అదే అతడు రూ.లక్ష స్కీములో చేరితే రోజూ రూ.600 వరకు చెల్లిస్తారు. ఓ శుభముహూర్తాన యాప్ పనిచేయదు. అంతా పేదలు, గ్రామీణులు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయరన్నది వీరి ధీమా. లాక్డౌన్ కాలాన్ని ఈ యాప్ నిర్వాహకులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ముఖ్యంగా ఉపాధి కోల్పోయినవారు, విద్యార్థులు వీరి ఎత్తుగడలకు జేబులు ఖాళీ చేసుకున్నారు. -
ఉగ్రమూకల కొత్త యాప్ బాట
శ్రీనగర్: ఉగ్రమూకలు సరికొత్త పన్నాగాలకు తెరలేపుతున్నాయి. ఎన్క్రిప్షన్ సదుపాయం ఉన్నప్పటికీ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి యాప్‌లను వాడకుండా మరింత ఎన్క్రిప్షన్ ఉంటూనే తక్కువ నెట్‌వర్క్‌లోనూ సమర్ధవంతంగా పని చేయగల యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి 3 యాప్‌లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మూడే ఎందుకు ? భద్రతా కారణాల రీత్యా ఆయా యాప్‌ల పేర్లను అధికారులు బయటపెట్టలేదు. అయితే ఆ మూడు యాప్‌లలో ఒకటి అమెరికా, రెండోది యూరోప్, మూడోది టర్కీకి చెందిన నిపుణులు తయారు చేసినవని వెల్లడించారు. ఈ యాప్‌లో ఎండ్ టు ఎండ్ డివైజ్ ఎన్క్రిప్షన్ ఉంటోంది. ప్రత్యేకించి ఇటీవల భారత్‌లో జరిగిన ఉగ్ర ఎన్కౌంటర్లలో మరణించిన వారి మొబైల్ ఫోన్లను పరిశీలించిన అధికారులకు టర్కీ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. 2జీ నెట్వర్క్ కోసం... కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా కాలం పాటు ఆ ప్రదేశాల్లో ఇంటర్నెట్ సౌకర్యం నిలిపేశారు. అనంతరం కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. 2జీ వేగంలో ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగల టర్కీ యాప్ వైపు ఉగ్రవాదులు మొగ్గు చూపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ యాప్‌లు కూడా ఫ్రీ సర్వీసులను అందించడం గమనార్హం. ఫోన్ నంబర్ అక్కర్లేదు ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న ఈ మూడు యాప్‌లలో ఒకదానికి అసలు మొబైల్ నంబర్ కూడా అవసరం లేకుండానే రిజిస్టర్ చేసుకొని సమాచారం పంచుకోవచ్చు. ఒకరకంగా ఇది వర్చువల్ సిమ్‌లాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. పుల్వామా–2019 ఘటనలోనూ ఇలాంటి వర్చువల్‌సిమ్ కార్డులను దాదాపు 40 వరకూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
మరో 8 చైనా యాప్‌లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి వీడే ముందు మరొక నిర్ణయం తీసుకున్నారు. అలీ పే, వీచాట్ సహా చైనాకు చెందిన ఎనిమిది యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రత పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం 45 రోజులు కొనసాగుతుంది. అలీ పే, కామ్‌స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్ ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమ్యాట్, విచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్లపై నిషేధం విధించారు. అమెరికాలో ఈ యా‹ప్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారని, చైనా నుంచి ఆ అప్లికేషన్లని నియంత్రిస్తూ ఉండడంతో దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. -
ఇక రైల్వే టికెట్ బుకింగ్ మరింత ఈజీ
న్యూఢిల్లీ, సాక్షి: ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీకానుంది. ఇందుకు వీలుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. యాప్‌ను సైతం అప్‌గ్రేడ్ చేసింది. ఈ మార్పులన్నీ 2021 జనవరి 1 నుంచీ అమల్లోకిరానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గురువారం అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లకు పచ్చజెండా ఊపారు. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను 6 కోట్లమందికిపైగా వినియోగిస్తున్నారు. రోజుకి సగటున 8 లక్షలకుపైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. రిజర్వ్డ్ టికెట్లలో 83 శాతం ఆన్లైన్ ద్వారానే బుక్ కావడం విశేషం! ఐఆర్సీటీసీ అందించిన వివరాల ప్రకారం.. చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్) - యూజర్లు లాగిన్ అయ్యాక టికెట్లతోపాటే భోజనం, వసతి గదుల(రిటైరింగ్ రూమ్స్) వంటివి బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. టికెట్ కోసం నింపిన యూజర్ల వివరాలతో ఒకే దఫాలో(వన్‌స్టాప్ సొల్యూషన్) వీటన్నిటినీ బుక్ చేసుకోవచ్చు. - బుకింగ్ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూజర్ వెదుకుతున్న స్టేషన్లు లేదా ప్రయాణికుల వివరాలను వేగంగా అందిస్తుంది. - యూజర్ అకౌంట్స్ పేజీలో రిఫండ్ స్టేటస్‌ను అత్యంత సులభంగా పరిశీలించవచ్చు. గతంలో ఈ వివరాలను తెలుసుకోవడం కష్టమయ్యేది. - రెగ్యులర్ లేదా ఫేవరెట్ ప్రయాణాలను ఎంపిక చేసుకోవడం ద్వారా వివరాలను ఆటోమాటిక్‌గా ఎంటర్ చేసుకోవచ్చు. - ట్రయిన్ సెర్చ్, సెలక్షన్‌కు సంబంధించి అన్ని వివరాలూ ఇకపై ఒకే పేజీలో కనిపించనున్నాయి. - వెదుకుతున్న రైళ్ల వివరాలు, అన్ని తరగతుల సీట్ల లభ్యత, ధరలు వంటివి ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. పేజీని స్ర్కోల్ చేయడం ద్వారా బుక్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. గతంలో ఒక్కో క్లిక్‌తో ఒక్కో ట్రయిన్ వివరాలను మాత్రమే తెలుసుకునేందుకు వీలుండేది. - బ్యాకెండ్‌లో క్యాచ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడంతో సీట్ల అందుబాటు సమాచారంలో మరింత వేగంగా లోడింగ్‌కు అవకాశముంటుంది. - వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు సంబంధించి సీటు ఖరారయ్యే(కన్ఫర్మేషన్) అవకాశాలను సైతం సూచిస్తుంది. గతంలో ఈ ఆప్షన్‌ను ప్రత్యేకంగా వెదకవలసి వచ్చేది. - ఇతర తేదీలలో సీట్ల లభ్యత వివరాలు సైతం పేజీలో ప్రత్యక్షం కానున్నాయి. - టికెట్ బుకింగ్ సమయంలో చెల్లింపుల పేజీలో ప్రయాణ వివరాలు డిస్ప్లే కానున్నాయి. టైపింగ్ తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవచ్చు. క్యాప్చాల వినియోగంతో సైబర్ సెక్యూరిటీకి వీలుంది. -
ఈ యాప్‌లను వెంటనే తొలగించండి!
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. ప్రతి చిన్న అవసరానికి మనం ఎక్కువ శాతం మొబైల్ మీద ఆధారపడుతున్నాం. ఏ చిన్న సమస్యకైనా మనకు ఏదో ఒక యాప్ రూపంలో పరిష్కారం లభిస్తుంది. ఈ యాప్స్ ద్వారా మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలూ కూడా ఉన్నాయి. ప్లే స్టోర్ లో ఉండే ఈ యాప్స్ వల్ల మన ఫోన్ హ్యాకర్ల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ గుర్తిస్తూ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సంస్థలు వాటి పేర్లను బహిర్గతం చేస్తున్నాయి. తాజాగా, డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న యాప్స్‌ని గుర్తించి లిస్ట్ బయటపెట్టింది. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి. ప్రతి నెల ఇలా వినియోగదారుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా తమ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించింది అవాస్ట్. అందుకే వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒక వేల డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే వీటిని మొబైల్ నుండి తొలగించాలని పేర్కొంది. (చదవండి: పీవీసీ ఆధార్: రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్‌తో పనిలేదు) వినియోగదారుల నుంచి డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్ జాబితా ఇదే... Skins, Mods, Maps for Minecraft PE Skins for Roblox Live Wallpapers HD & 3D Background MasterCraft for Minecraft Master for Minecraft Boys and Girls Skins Maps Skins and Mods for Minecraft -
‘యాప్’సోపాలు.. యువతకు తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఫ్రెండ్ రాజేందర్‌కు యాక్సిడెంటైంది. అర్జంటుగా డబ్బులు పంపండి’ అంటూ సందేశాలు రావడంతో అవాక్కయిన మిత్రులు వెంటనే రాజేందర్‌కు ఫోన్ చేశారు. బాగానే ఉన్నాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు కానీ, ఆ మెసేజ్‌లు ఎవరు పంపారో మొదట అర్థం కాలేదు. ఆరాతీస్తే రాజేందర్ ఓ యాప్ ద్వారా తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని దాని తాలూకు మనుషులు ఇలా బద్నాం చేశారని తేలింది. ‘మీ కొడుకు తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంట్లో ఏదుంటే అది ఎత్తుకు పోతాం..’ అంటూ ఫోన్లో వచ్చిన బెదిరింపుతో ఓ తండ్రి హతాశుడు అయ్యాడు. ఇంజనీరింగ్ చదివే తన కొడుకు రూ. లక్షలు అప్పు చేసిన ఫలితమని తెలిసి ఆయన తలపట్టుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కాల్ చేసింది కలెక్షన్ ఏజెంట్లు. వీరంతా వివిధ మనీలెండింగ్ యాప్స్ (అప్పులు ఇచ్చే యాప్స్) కోసం పని చేస్తుంటారు. ఏం చేసైనా ఇచ్చిన అప్పును వడ్డీతో సహా రాబట్టుకునేందుకు ఇటీవల హద్దుమీరుతున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేస్తూ, ఆ నంబర్లకు ఫోన్లుచేసి, తప్పుడు సందేశాలు పంపి సమాజంలో చులకన చేస్తున్నారు. వారిపై మానసిక ఒత్తిడి పెంచేందుకు దూకుడుగా వ్యవహరిస్తూ బ్లాక్మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా అప్పిచ్చి.. అలా వేధిస్తూ.. మనీ లెండింగ్ యాప్స్‌కు మొబైల్ ప్లేస్టోర్స్‌లో కొదవేం లేదు. ఇవి రూ.1,000–రూ.15 లక్షల దాకా అప్పులిస్తూ, రూ.1 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకునే క్రమంలో కంపెనీ షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. చిరునామా, వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ నంబర్ అందించాలి. విద్యార్థులకైతే ఆధార్, కాలేజీ ఐడీ కార్డు సరిపోతుంది. అలాగే, ఫోన్ కాంటాక్ట్స్‌ను యాక్సెస్ చేయమంటారా? అని అడుగు తుంది. దీన్ని వినియోగదారులు పట్టించుకోక ‘ఓకే’ కొడుతున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్ నంబర్లన్నీ యాప్ యాజమాన్యానికి యాక్సెస్ అవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కలెక్షన్ ఏజెంట్లు.. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్‌లోని ఆత్మీయులు, కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఇబ్బందుల పాల్జేస్తున్నారు. అప్పు మీద అప్పు.. పెరుగుతున్న ముప్పు లాక్‌డౌన్‌తో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. టీచర్లు, సినిమా టాకీస్ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ కార్మికులు ఇతర రంగాలకు చెందినవారు ఏడు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి వారు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఇంతకాలం నెట్టుకొచ్చారు. వాటిని తిరిగి తీర్చలేక, ఇంటి అవసరాల కోసమని మరోసారి అప్పులు చేసేందుకు అప్పుల యాప్‌లపై ఆధారపడుతున్నారు. చిన్నమొత్తంలో అప్పు చేసేవారికి ఫర్వాలేదు గానీ, భారీ మొత్తాల్లో అప్పుచేస్తే ఆ అప్పుల వసూళ్లకు కలెక్షన్ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ యాప్‌ల ద్వారా అప్పుచేసే యువకులు పెరిగారు. వీరు ఆన్లైన్ గేమ్స్ కోసం కూడా భారీగా అప్పులు చేస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేటలో ఓ యువకుడు రూ.15 లక్షలు ఇదే తరహాలో అప్పుచేసి.. తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం అప్పు వసూలుకు వేధించడం, ఫోన్ కాంటాక్టులను యాక్సెస్చేసి బ్లాక్మెయిల్ చేయడం ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. రూ.20 వేలలోపు ఉండే చిన్న రుణాల వసూలులోనూ కలెక్షన్ ఏజెంట్లు ఇష్టానుసారం వ్యవహరించడంపై బాధితులు వాపోతున్నారు. దీనిపై యాప్‌ల యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే, ‘మా దృష్టికి రాలేదంటూ’ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. వాస్తవానికి కంపెనీ సహకారం లేకుండా.. కాంటాక్ట్స్ కలెక్షన్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం అసాధ్యమని పలువురు అంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తే సంప్రదించండి అప్పు తీసుకున్న వారి కాంటాక్టులు యాక్సెస్ చేసి బ్లాక్మెయిల్ చేయడం చట్టవిరుద్ధం, నేరం. ఇలాంటి వేధింపులకు పాల్పడితే మౌనంగా భరించవద్దు. వెంటనే సైబర్ సెల్‌ను సంప్రదించాలి. బాధితులు విద్యార్థినులు, మహిళలైతే విమెన్ సేఫ్టీవింగ్‌ను ఆశ్రయించాలి. – స్వాతి లక్రా, ఏడీజీ ఆ ఉచ్చులో పడనీయొద్దు నేటి విద్యార్థులు ప్రమాదకర టెక్నాలజీ మధ్య ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను కాపీ కొట్టేందుకు బెట్టింగ్, మనీలెండింగ్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుం టున్నారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ తరహాలోనే ప్రతీ కాలేజీలో ప్రత్యేక సెల్స్ ఏర్పాటుచేసి విద్యార్థులు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలి. –డాక్టర్ శారద, ప్రొఫెసర్, ఓయూ -
యాప్స్ వార్
-
ఐపీఎల్ రేటింగ్.. చీటింగ్!
సాక్షి, హైదరాబాద్: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడుతున్న జట్ల బలాబలాలను ఆధారంగా చేసుకొని ఆన్లైన్ ద్వారానే బెట్టింగ్ కాస్తూ అందినకాడికి దండుకుంటున్న ఓ బుకీని, ఏడుగురు పంటర్లను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.22,89,400ల నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ.13 లక్షల నగదు ఉన్న బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్‌లతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. జట్ల బలబలాను బట్టి రేటింగ్స్... కొంపల్లి ఓక్ ట్రీ ఎంక్లేవ్‌కు చెందిన చందూర్ శశాంక్ సుచిత్రా ఎక్స్‌రోడ్డు సమీపంలో ఓంకార్ అప్టికల్స్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆ షాప్‌నే క్రికెట్ బెట్టింగ్‌కి అడ్డాగా మార్చేశాడు. గోవాకు చెందిన ప్రధాన బుకీలు బర్కత్, సాహిల్‌తో సంబంధాలు ఏర్పరుచుకొని హైదరాబాద్‌లో తనకున్న పరిచయాలు ఉపయోగించుకొని శశాంక్ క్రికెట్ బుకింగ్‌వైపు మళ్లించాడు. వాట్సాప్ కాల్ చేసి పంటర్లను డబ్బులను గూగుల్ పే, ఫోన్‌పేలకు పంపమనేవాడు. అయితే ఒక్కొక్కరు అంటే బెట్టింగ్ కాసేవాళ్లు రూ.50 వేలు డిపాజిట్ చేయమని సూచించేవాడు. ఆ తర్వాత క్రికెట్‌లైన్, క్రికెట్ ఎక్స్ఛేంజ్ మొబైల్ యాప్‌లను ఆధారంగా చేసుకొని బుకీ సొహైల్ రేటింగ్ ఇచ్చేవాడు. బలమైన టీమ్‌లకు రూ.పది వేలకు ఏడు వేలు, బలహీన జట్లు రూ.పది వేలకు రూ.తొమ్మిది వేలు అంటూ బెట్టింగ్ వేసేవారు. అయితే చాలా మంది పంటర్లు ఎక్కువ డబ్బులు రావాలనే ఆశతో రూ.పది వేలకు రూ.తొమ్మిది వేల రేటింగ్ ఇచ్చినవాటికే మొగ్గుచూపారు. అలాగే ప్రతి బంతికి కూడా ఆయా బ్యాట్స్‌మెన్ చేసే పరుగులకు కూడా రేటింగ్ ఇస్తూ పంటర్ల నుంచి బెట్టింగ్ ఉండేలా చూసుకునేవారు. ఇందులో వచ్చిన డబ్బులను గోవాలో ఉండే ప్రధాన బుకీ బర్కత్‌కు శశాంక్ పంపేవాడు. నిఘాతో దొరికిపోయాడు.. అయితే ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కావడంతో సైబరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రధానంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే బాలానగర్ స్పెషల్ అపరేషన్ టీమ్ (ఎస్వోటీ) ఇన్స్పెక్టర్ పి.రమణారెడ్డి నేతృత్వంలోని బృందం పేట్‌బషీరాబాద్ పోలీసుల సహకారంతో సుచిత్రా ఎక్స్‌రోడ్డులోని అప్టికల్స్‌లో శశాంక్, ఏడుగురు పంటర్లను పట్టుకున్నారు. రూ.22,89,000ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు బర్కత్, సాహిల్‌తో పాటు మరో ఏడుగురు పంటర్ల కోసం గాలిస్తున్నారు. విద్యార్థులూ పారాహుషార్ ‘బుకీలు చూపే అధిక ఆశతో చాలా మంది విద్యార్థులు ఈ క్రికెట్ బెట్టింగ్‌వైపు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం ఉంది. వివిధ ఫీజులు కావాలంటూ ఇంట్లో డబ్బులు అడిగే పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల కుటుంబంలో మనస్పర్ధలు, స్నేహితుల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. బెట్టింగ్‌కు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం అందించాలి’అని సీపీ సజ్జనార్ తెలిపారు. అనంతరం బెట్టింగ్ ముఠాను పట్టుకున్న బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డితో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. ఆ డీఎస్పీ ప్రొఫైల్ కేత్వాడ గ్యాంగ్ సృష్టే సాక్షి,హైదరాబాద్: ఏకంగా పోలీసు అధికారుల్నే టార్గెట్ చేసి, వారి వివరాలతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన రాజస్థాన్ గ్యాంగ్‌ను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో సిటీకి సంబంధించిన లింకు దొరికింది. అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) డీఎస్పీగా పని చేస్తున్న వి.రవికుమార్ పేరుతోనూ తామే నకిలీ ప్రొఫైల్ సృష్టించామని నల్లగొండ అధికారుల విచారణలో ఆ ముఠా అంగీకరించింది. దీనిపై సమాచారం అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వి.రవికుమార్ ఏసీబీలో మెదక్ రేంజ్‌కి నేతృత్వం వహిస్తున్నారు. ఈయనకు ఫేస్బుక్లో ప్రొఫైల్ ఉంది. దీనికి సెక్యూరిటీ లాక్ లేకపోవడంతో ఇందులోని వివరాలు కాపీ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన పేరు, ఫొటోతో నకిలీ ప్రొఫైల్ సృష్టించారు. దీని ఆధారంగా ఆయన స్నేహితులతో చాటింగ్ చేసి, అత్యవసరం అంటూ నగదు డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని గూగుల్ పే ద్వారా 77356 73646కు పంపాలంటూ కోరారు. తన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న రవికుమార్ గత నెల 20న ఈ– మెయిల్ ద్వారా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెలలోనే నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ పేరుతోనూ ఓ నకిలీ ప్రొఫైల్ ఏర్పడింది. దీంతో ఈ విషయాన్ని సవాల్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేసి రాజస్థాన్‌కు చెందిన ముఠా పనిగా గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం భరత్‌పురా జిల్లాలోని కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తభీమ్ ఖాన్, ననీష్, షాహిద్, సద్దాం ఖాన్‌లను పట్టుకుని తీసుకువచ్చారు. వీరిలో ప్రధాన నిందితుడైన ముస్తభీమ్ ఖాన్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 350 మంది పోలీసుల పేర్లతో వీళ్లు నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారని, వారిలో తెలంగాణకు చెందిన వారు 81 మంది ఉన్నట్లు బయటపడింది. ఈ వివరాలను ఆరా తీయగా.. రవి కుమార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదై ఉన్నట్లు తేలింది. కేత్వాడ ముఠా అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని నల్లగొండ పోలీసులు సైబర్ క్రైమ్ అధికారులకు అందించారు. దీని ఆధారంగా న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేయడానికి సైబర్ కాప్స్ సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు దీన్ని జారీ చేసిన తర్వాత ఆ నలుగురు నిందితుల్నీ సిటీకి తీసుకురానున్నారు. ఫేస్బుక్లో ఈ తరహా నకిలీ ప్రొఫైల్స్ సృష్టికి సంబంధించి ఇటీవల కాలంలో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి మాత్రమే నల్లగొండ పోలీసులకు చిక్కిన కేత్వాడ ముఠా పనిగా తేలింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇలాంటి ముఠాలు మరికొన్ని ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో ఆరా తీస్తూ ఆ కేసుల్ని సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ చందానగర్: గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను కట్ చేసి..అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం... చందానగర్ బస్టాప్దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్‌ను వెంట తెచ్చుకొని ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న రూ.12,86,000 నగదును ఎత్తుకెళ్లారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాకు చెక్ నాగోలు: అంతరాష్ట్ర గంజాయి సరఫరా ముఠాకు ఎల్బీనగర్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌లు చెక్ పెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా కంటైనర్‌లో తరలిస్తున్న 1010 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం...హర్యానాలోని నుహు జిల్లాకు చెందిన మహ్మద్ రంజాన్ అలియాస్ కల్లూ వృత్తి రీత్యా డ్రైవర్. ఉత్తరప్రదేశ్‌లోని కోరాపుట్ జిల్లాకు చెందిన శశికాంత్ గౌతమ్‌రావు హోటల్లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. ఇతను ఒడిశాకు గంజాయి సరాఫరా చేస్తూ ఉంటాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వివేక్ సింగ్ అలియాస్ అలోక్ వివిధ ప్రాంతాల నుండి వచ్చే గంజాయి కొనుగోలు చేస్తుంటాడు. హర్యానాకు చెందిన ఇమ్రాన్ కంటైనర్ ఓనర్. వీరందరూ అందరూ కలసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా బార్డర్ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కంటైనర్ లారీల ద్యారా అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నారు. కంటైనర్‌లో రహస్య క్యాబిన్ ఏర్పాటు చేసి ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి రవాణా చేస్తున్నారు. ఒడిశాలో స్థానికంగా పండించే వారి దగ్గర గంజాయి కొనుగోలు చేసి 5.5 కేజీల ప్యాకెట్లుగా ప్యాక్ చేసి కంటైనర్‌లో లోడ్ చేశారు. ఈ క్రమంలో ఇమ్రాన్ తన కంటైనర్‌ను విజయవాడ మీదుగా వారణాసికి తీసుకెళ్లేందుకు బయలుదేరాడు. దీనిపై పక్కా సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీస్‌లు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల సహకారంతో సోమవారం తెల్లవారు జామున కంటైనర్‌ను పట్టుకున్నారు. డ్రైవర్ మహ్మద్ రంజాన్, శశికాంత్ గౌతమ్రావులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారికోసం పోలీస్‌లు గాలిస్తున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, వి.స్వామి, టి.రవికుమార్, అవినాష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ యాప్ పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్‌కి భారీ ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. యాప్స్ ద్వారా మొబైల్‌లోకి ఎంటరయ్యే కొన్ని రకాల వైరస్, మాల్వేర్లు ఇట్టే విడిచిపెట్టవని, 'జోకర్' మాల్వేర్ కూడా ఇలాంటిదేనని చెబుతున్నారు. ఒక్కసారి మొబైల్‌లోకి ఎంటరైతే.. 'జోకర్' మాల్వేర్ అత్యంత ప్రమాదకరమైనదని టెక్ నిపుణలు చెబుతున్నారు. 2017 నుంచి ఇది అనేక మొబైళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక్కసారి ఈ 'జోకర్' బారిన పడితే మీ మొబైల్ ఇక మీ మాట వినదు. మొబైల్లోని కాంటాక్ట్స్‌ను, మెసేజులను చదవడంతోపాటు ఓటీపీలను కూడా ఈ మాల్వేర్ యాక్సెస్ చేయగలదు. తద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. (చదవండి: సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్) ఇప్పటికే లక్షా 20 వేల డౌన్లోడ్స్ ఈ సెప్టెంబర్‌లో ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌ను గూగుల్ పరీక్షించింది. 17 యాప్స్ భారీగా ఇన్ఫెక్ట్ అయినట్టు గుర్తించి.. వెనువెంటనే వాటిని తొలగించింది. ఐతే.. అప్పటికే ఆ 17 యాప్స్‌ను దాదాపు లక్షా 20 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు గుర్తించిన గూగుల్.. తక్షణమే మొబైళ్ల నుంచి వాటిని అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఇటీవల గూగుల్ గుర్తించిన 17 ఇన్ఫెక్టెడ్ యాప్స్ ఇవే.. One Sentence Translator - Multifunctional Translator Style Photo Collage Meticulous Scanner Desire Translate Talent Photo Editor - Blur focus Care Message Part Message Paper Doc Scanner Blue Scanner Hummingbird PDF Converter - Photo to PDF All Good PDF Scanner Mint Leaf Message-Your Private Message Unique Keyboard - Fancy Fonts & Free Emoticons Tangram App Lock Direct Messenger Private SMS