Nara Bhuvaneshwari
-
సీఎం గారి భార్య కదా..
-
గెస్ట్‌గా నారా భువనేశ్వరి.. రూ.7కోట్లు ఖర్చు పెట్టిన ఏపీ ప్రభుత్వం
సాక్షి,అమరావతి : సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి హాజరైన ఈవెంట్‌కి కూటమి ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు పెట్టింది. మహిళ సాధికారత పేరుతో పర్యాటక శాఖ భవాని ద్వీపంలో నిర్వహించిన శక్తి విజయోత్సవ్కి నారా భువనేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు .అయితే ఈ ఈవెంట్‌కు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.మొదట రూ.2 కోట్లకి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తర్వాత మరో రూ.5 కోట్లుకి అనుమతి తెలిపింది ప్రభుత్వం. చంద్రబాబు భార్య కావడంతో ప్రభుత్వం అడిగినంత మంజూరు చేసింది. భువనేశ్వరి వచ్చిన ఈవెంట్‌కు రూ.7కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
CBN: టెన్షన్‌తో బాబుకి ముచ్చెమటలు!
ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీల విజయావకాశాలపై ఎంత చర్చ జరుగుతున్నదో, అంతకన్నా ఎక్కువ చర్చ కొందరు ప్రధాన నేతల నియోజకవర్గాలపై కూడా జరుగుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరోసారి ఆయన గెలుస్తారా?లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలు ఈసారి తాము హిట్ కొడతామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాకపోతే ఆయన ఎన్నడూ అంత మెజార్టీతో గెలవలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన గెలుస్తారా?ఓడతారా అన్నది పక్కన పెడితే, ఈ ఎన్నికలలో ఆయనకు ముచ్చెమటలు పట్టాయన్నది మాత్రం వాస్తవం. అందుకే ఆయన పలు రకాల వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. అందులో ధనబలం కూడా ప్రముఖంగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఓటుకు పదివేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడలేదని కొందరు చెబుతున్నారు. వివిద నియోజకవర్గాలలో అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేసినా, కుప్పంలో చంద్రబాబు తరపున ఓట్ల కొనుగోలుకు వెచ్చించిన వ్యయం ఒక రికార్డుగా కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబునాయుడు కుప్పంలో వరసగా ఏడుసార్లు గెలిచి ఎనిమిదో సారి పోటీచేస్తున్నారు. అంతకుముందు చంద్రగిరిలో ఆయన ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉండే, వెనుకబడిన ప్రాంతం అయిన కుప్పంను ఎంపిక చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఆ విషయంలో సఫలం అవుతున్నారు. అత్యధికంగా బీసీ వర్గాలు ఉండే కుప్పంను ఆయన తన కోటగా మార్చుకున్నారు. అభివృద్ది విషయంలో మాత్రం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా చంద్రబాబు డబ్బు, దొంగ ఓట్లు ఇతర వ్యూహాల ద్వారా గెలుస్తూ వస్తున్నారు.సరిహద్దులోని తమిళనాడు, కర్నాటక గ్రామాలకు చెందినవారిని కూడా కుప్పం ఓటర్లుగా నమోదు చేయించి రాజకీయంగా లబ్ది పొందేవారని చెబుతారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా కలిసి వచ్చింది. గతంలో వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో వీక్ అభ్యర్ధిని కాంగ్రెస్ కుప్పంలో పెట్టేలా చేసుకునేవారని అంటారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి కొంత మారింది. క్రమేపి ఆయన మెజార్టీని తగ్గించే పనిలో వైఎస్సార్సీపీ పడింది. రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కుప్పంలో ఈయనను ఢీకొట్టడానికి సిద్ధం అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో కీలకమైన దొంగ ఓట్లను తొలగించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. సుమారు 17 వేల దొంగ ఓట్లను ఆయన తొలగించగలిగానని చెప్పేవారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించారు.తదుపరి ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ అభ్యర్ధి భరత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా, కుప్పం అభివృద్దిపై దృష్టి పెట్టారు. కుప్పంను మున్సిపాలిటీ చేయడం, రెవెన్యూ డివిజన్ చేయడం, స్కూళ్లు బాగు చేయడం, హంద్రీ-నీవా నీటిని విడుదల చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కొంత ఆకట్టుకున్నారు. వైఎస్సార్సీపీ గట్టి కృషి ఫలితంగా స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అది షాక్ అయింది. దాంతో ఆయన అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం ఏడాదికి ఒకటి, రెండుసార్లు కుప్పం వచ్చినా సరిపోయే పరిస్థితి పోయిందని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. నెల, నెల రావడం ఆరంభించారు. అది సరిపోదని భావించి అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నట్లు కథ నడిపారు.అదే టైమ్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంలో పట్టు బిగించడం ఆరంభించారు. దాంతో చంద్రబాబుకు రాజకీయంగా ఊపిరి ఆడని పరిస్థితి కల్పించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కొద్ది రోజులు అక్కడే ఉండి గడప, గడపకు వెళ్లడం చేశారు. కుప్పంలో రాజకీయం చేయడం ఆరంభించిన తర్వాత ఇలా ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, ఆయా వర్గాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం వంటివి ఈసారే చేశారు. గతంలో ఆయన తన ప్రతినిధులతో పనులు చేయించేవారు. అలాగే కుప్పం నుంచే కొంతమందిని పిలిపించుకుని హైదరాబాద్‌లోనో, ఉండవల్లిలోనో మాట్లాడి పంపించేవారు. ఆ పరిస్థితి మారి, ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలోనే ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించవలసి వచ్చింది.తనకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని అప్పుడప్పుడు డైలాగులు చెప్పినా, ఆయనకు ఎప్పుడూ అంత ఆధిక్యత రాలేదు సరికదా! క్రమేపి తగ్గుతూ వచ్చింది. 2014లో నలభై ఎనిమిదివేల మెజార్టీ వస్తే 2019లో అది 30 వేలకు తగ్గింది. ఇప్పుడు దొంగ ఓట్లను మరింత తగ్గించగలగడంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. స్థానిక ఎన్నికలలో టీడీపీ కన్నా వైఎస్సార్సీపీకి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే ట్రెండ్ కొనసాగినా, ఆ ఓట్లను ప్రామాణికంగా తీసుకున్నా చంద్రబాబు ఓటమికి గురికాక తప్పదు. స్థానిక ఎన్నికలకు, శాసనసభ ఎన్నికల సరళికి కొంత తేడా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పుడు తిరిగి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆయన శ్రమపడ్డారు. అయినా గెలుస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది.ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ నిత్యం కుప్పంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అండతో అక్కడ నిరంతరం జనంలో తిరుగుతున్నారు. దాంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరిగిందన్నది ఆ పార్టీ వాదన. అయితే చంద్రబాబుకు అక్కడ ఉన్న పట్టు అంత తేలికగా పోదని, ఆయా వర్గాలవారిని తనవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు పదివేల రూపాయల వరకు పంచవలసిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటింగ్ పూర్తి అయ్యాక కొన్ని సర్వేలలో చంద్రబాబు ఓడిపోయే అవకాశం కూడా ఉందని వార్తలు రావడం ఆయనకు, టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే.స్థానిక ఎన్నికల తర్వాత ఒక దశలో కుప్పంతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే పార్టీకి నష్టం వస్తుందని భయపడ్డారు. రిస్కు ఉందని తెలిసినా అక్కడే పోటీ చేయక తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను అక్కడే ఉంచి రాజకీయం నడిపారు. గతంలో చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందన్న చర్చ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారా? లేదా? అనే చర్చ జరగడం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం కానీ, వైఎస్సార్సీపీ కార్యక్రమాలు కానీ సఫలం అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే పెద్ద విజయంగా భావిస్తున్నారు.జగన్ అమలు చేసిన వివిద సంక్షేమ స్కీములు కుప్పంలో కూడా అమలు అయ్యాయి. దానివల్ల సుమారు రెండువేల కోట్ల మేర అక్కడి ప్రజలు లబ్దిపొందారు. కొన్ని వందల మందికి స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కూడా నిర్మించారు. ఆ రకంగా బలహీనవర్గాలను వైఎస్సార్సీపీ బాగానే ఆకట్టుకుంది. దానికితోడు బీసీలలో రెండు బలమైన వర్గాలను వైఎస్సార్సీపీ తనవైపు తిప్పుకోగలిగింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తన హయాంలో జరగని పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతుండడం ఆయనకు ఇబ్బందిగా ఉంది. స్థానిక ఎన్నికలలో ఓటమితో నైతికంగా దెబ్బతిన్న చంద్రబాబుకు దొంగ ఓట్లు కూడా చాలావరకు వైదొలగడం గడ్డుగా మారింది. అయినప్పటికీ ఆయనకు ఉండే క్లౌట్ ఆయనకు ఉండవచ్చు. అందువల్లే చంద్రబాబు ఓడిపోతారని పలువురు చెబుతున్నా, ఒకవేళ చంద్రబాబు ఓడిపోకపోయినా, మెజార్టీ బాగా తగ్గిపోతుందని అంచనాలు ఉన్నాయి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
భువనేశ్వరి తిట్ల దండకం.. ఇదే అసలు నిజం
-
నారా భువనేశ్వరి ఆడియోపై కొమ్మినేని షాకింగ్ కామెంట్స్
-
చెత్త నా కొడుకులు.. చెత్త బుట్టలో పుట్టారు..
సాక్షి, అమరావతి పోరా.. పో ఇక్కడ నుంచి లం..కొడకా.. నేను నీకంటే పెద్ద ఇంటిలో పుట్టిన దాన్ని. చెత్త నా కొడుకులు. చెత్త బుట్టలో పుట్టి కూడా వేషాలు వేస్తారు. దేనికీ పనికిరారు.. అడుక్కు తింటానికి కూడా.. బాస్టర్డ్. మీ అందరినీ మానిటర్ చేయలేక (పర్యవేక్షించలేక) నేను చస్తున్నా..తప్పుడు నా కొడకా, ఊడిగం చేసే కుక్క.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తిట్ల దండకంతో కూడిన ఆడియో ఒకటి గురువారం రాత్రి నుంచి వివిధ సోషల్ మీడియా వేదికల్లో హల్చల్ చేస్తోంది. కేవలం ఒక్క భువనేశ్వరి మాటలు మాత్రమే ఆ ఆడియో టేపుల్లో వినిపిస్తోంది. అందులో కొన్ని పదాలు పత్రికలో రాయడానికి వీలు లేనంత అసభ్యంగా ఉన్నాయి. ఆమె ఎప్పుడు, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న దానిపై అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు, ఇటు రాష్ట్రంలోని రాజకీయ వర్గాలందరిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో భర్త నామినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఆమె ఈ నెల 18, 19, 20 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలో.. కొందరు స్థానిక టీడీపీ నాయకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన మాటలుగా టీడీపీలో చర్చ సాగుతోంది. ‘కుప్పంలో లోకేశ్ తన సొంత మనుషులతో ఓ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ సభ్యులు కొందరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదని చెప్పారు. ఆ పరిస్థితిని మార్చడంలో భాగంగా ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా అయిన ఖర్చుకు సంబంధించి బిల్లులు పెట్టిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు’ అని కుప్పం టీడీపీ నాయకులు చెబుతున్నారు. కాగా, మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తూ.. చంద్రబాబు కుటుంబ సభ్యులందరితో పరిచయం ఉన్న ఓ దళిత నాయకుడు ప్రస్తుత ఎన్నికల్లో తన టికెట్ కోసం భువనేశ్వరిని కలిసి సిఫార్సు కోసం ప్రయతి్నంచినప్పుడు ఆమె ఈ రకంగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారన్న చర్చ కూడా సాగుతోంది. అయితే భువనేశ్వరి మాటలతో కూడిన ఆ ఆడియో టేపుల్లోని మాటలు సమాజంలో కొన్ని వర్గాల వారిని బాగా కించ పరిచేలా ఉండడంతో వివిధ కుల సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. -
నారా భువనేశ్వరి సంచలన ఆడియో
-
నారా భువనేశ్వరి సంచలన ఆడియో
-
నారా భువనేశ్వరిపై..జనసేన కార్యకర్తల ఆగ్రహం
-
AP: నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు
సాక్షి, గుంటూరు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యవహరించడంపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును భువనేశ్వరి పంపిణీ చేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 20న నారా భువనేశ్వరీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని.. ఇది ఎన్నికల రూల్స్ ప్రకారం ప్రలోభాల కిందకే వస్తుందని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 21న ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
ఆరని మంటలు.. బాబుకు చెమట్లు!
సాక్షి, అనకాపల్లి/సాక్షి, అమలాపురం/ అయినవిల్లి/మడకశిర/పెనుకొండ/ఉదయగిరి: రాష్ట్రంలో టికెట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అభ్యర్థుల ఖరారు విషయంలో అధినేత అనుసరిస్తున్న వైఖరిపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా జెండా మోసినవారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చినవారికి అందలం ఎక్కించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అనకాపల్లిలో పెల్లుబికిన నిరసనలు అనకాపల్లి స్థానాన్ని టీడీపీ–జనసేన కూటమి తరఫున కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లుగా తాను పార్టీకోసం కష్టపడితే తనను పార్టీ అధిష్టానం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అక్కడి అభ్యర్థి కొణతాల తనను పట్టించుకోకుండా తన వ్యతిరేక వర్గమైన బుద్ధా నాగ జగదీశ్‌ను కలవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని పీలాపై ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. బాబు సతీమణి భువనేశ్వరి అడ్డగింత ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని యలమంచిలి వెళ్లే దారిలో కూండ్రం వద్ద పీలా గోవింద వర్గీయులు అడ్డుకున్నారు. అనకాపల్లి రూరల్ మండల అధ్యక్షుడు పచ్చికూర రాము ఆధ్వర్యంలో నాయకులు సుమారు 10 నిమిషాలపాటు రోడ్డుకు అడ్డంగా నిలబడి పీలా గోవిందకే అనకాపల్లి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే భువనేశ్వరి కారు దిగి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో వారంతా తప్పుకున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు ‘బొల్లినేని’ నిర్ణయం నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా తనను నియమించనందుకు ఇక తాడోపేడో తేల్చుకోవాలని అక్కడి టీడీపీ ఇన్చార్జి బొల్లినేని వెంకట రామారావు నిర్ణయించుకున్నారు. పన్నెండేళ్లుగా పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కు టికెట్ కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆత్మీయుల వద్ద వెలిబుచ్చి కన్నీటిపర్యంతం కావడంతో కేడర్ ఉద్రేకానికి లోనైంది. ఒక్క మాట చెబితే కాకర్లను ఉదయగిరిలో నామినేషన్ కూడా వేయనివ్వమని తేల్చిచెప్పింది. గురువారం కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయులతో మాట్లాడుతూ తనకు టికెట్ విషయంలో న్యాయం జరగకపోతే కార్యకర్తల అభీష్టం మేరకు మార్చి రెండో తేదీన అధినేతను కలసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. పెనుకొండలో కొనసాగుతున్ననిరసనలు అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కాదని అన్నా క్యాంటీన్ అంటూ హడావుడి చేసిన సవితకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు రోజూ బీకే ఇంటి వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. పార్థసారథికి టికెట్ ఇవ్వకుంటే టీడీపీని ఓడిస్తామని నేతలు చెబుతున్నారు. సునీల్‌ను మార్చకుంటేరాజీనామా శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గురువారం మరోసారి తిప్పేస్వామి వర్గీయులు నిరసనకు దిగారు. సునీల్‌ను మార్చకుంటే తామంతా రాజీనామా చేయడానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. -
కుప్పంలో చంద్రబాబు కుర్చీని మడతపెట్టేసిన భువనేశ్వరి
-
భువనేశ్వరి చాలా లేట్ చేసింది.. భార్య కంటే చంద్రబాబు గురించి ఎవరికి తెలుస్తుంది
-
ఎన్నికల నుండి తప్పుకోవడమే బెటర్
-
లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి మాస్టర్ ప్లాన్...?
-
కుప్పంలో బాబు హ్యాండ్సప్
-
చంద్రబాబుపై నారా భువనేశ్వరి వ్యాఖ్యలు..రోజా రియాక్షన్
-
కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామన్న భువనేశ్వరి
-
చంద్రబాబు ఓటమి భువనేశ్వరికి ముందే తెలుసు: వైఎస్సార్సీపీ నేతలు
-
చంద్రబాబు కుర్చీని భువనేశ్వరి మడత పెట్టేసింది: మంత్రి అంబటి
-
భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదు
సత్తెనపల్లి: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్లు ఇస్తోందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. -
బాబుకు రెస్ట్! నేనే పోటీ చేద్దామని అనుకుంటున్నా: నారా భువనేశ్వరి
(సాక్షి, అమరావతి–తిరుపతి–శాంతిపురం) :‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలంతే!’ అంటారు పెద్దలు. బహుశా! కుప్పం ప్రజలకు కూడా 35 ఏళ్ల తరవాత ఆ రోజు వచ్చినట్లుంది. దశాబ్దాలుగా తాము గెలిపిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. రెండేళ్ల కిందటిదాకా కనీసం సొంతిల్లు కూడా కట్టు కోలేదని వాళ్లకి అర్థమయింది. బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు తెస్తానని ఇన్నాళ్లూ మోసపు మాటలు చెప్పారే తప్ప.. ఆ పనిని చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డేనని వాళ్లకు అనుభవంలోకి వచ్చింది. అందుకే రాబోయే ఎన్నికల్లో బాబుకు బైబై చెప్పేందుకు వాళ్లంతా సిద్ధమవటంతో.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నక్కజిత్తుల నారా వారు తనను ఓడించక ముందే ఆ నియోజకవర్గానికి ‘బై’ చెప్పటానికి సిద్ధమయ్యారు. ‘‘35 ఏళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు. ఇక ఆయనకు రెస్ట్ ఇవ్వాలనిపిస్తోంది. అందుకే ఈ సారి ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను’’ అంటూ చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి బుధవారం కుప్పంలో ఓ బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు. స్కిల్ కుంభకోణంలో వేల కోట్లు నేరుగా విత్‌డ్రా చేసుకుని మింగేసిన కేసులో ఈ మధ్య చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేయటంతో ఆయన జైలుకు వెళ్లటం తెలిసిందే. అది జరిగిన 10–15 రోజుల తరవాత కూడా ఆయన జైలు జీవితాన్ని చూసి తట్టుకోలేక కొందరు మరణించారన్నది టీడీపీ–ఎల్లో మీడియా వ్యాఖ్యానం. వారందరికీ సాయం చెయ్యడానికి నేరుగా నారా భువనేశ్వరి ఓ యాత్ర చేస్తున్నారు. ఆమేమీ రాజకీయ నాయకురాలు కాదు. దీంతో యాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్లాలి? ఎవరెవరిని కలవాలి? ఎవరికి చెక్కులివ్వాలి? ఏమేం మాట్లాడాలి? అనేది మొత్తం స్క్రిప్టు ప్రకారమే చేస్తున్నారు. బుధవారం మాట్లాడిన మాటలు కూడా ఆ స్క్రిప్టులో భాగమే. కళ్లెదుట ఓటమి స్పష్టంగా కనిపిస్తుండడంతో ఏదో ఒక వంకతో అక్కడి నుంచి పోటీ చేయకుండా జారుకోవాలనేది బాబు పన్నాగమని, అందుకే భార్య చేత ఆ మాటలు మాట్లాడించారు తప్ప అవేమీ చమత్కారమో, యథాలాపమో కావని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. కుప్పంలో పడిపోయిన బాబు గ్రాఫ్... కుప్పం బరి నుంచి పక్కకు తప్పుకొని వేరే నియోజకవర్గం చూసుకోవాలని, లేకపోతే ఈ సారి ఎన్నికల్లో పోటీయే చేయకుండా నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌గా వ్యవహరించాలని బాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పంలో బాబు గ్రాఫ్ అంతకంతకూ దారుణంగా పడిపోవటం దీనికి మొదటి కారణం. నిజానికి 2019 ఎన్నికల్లోనే ఆయన మెజారిటీ బాగా తగ్గిపోవటం నుంచి ఈ గ్రాఫ్ పతనం మొదలయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేతి నుంచి కుప్పం జారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. 25 వార్డుల్లో టీడీపీ కేవలం 7 వార్డుల్లో గెలవగా మిగిలిన 18 వార్డుల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గాను 70 పంచాయతీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. నాలుగు జెడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఈ ఫలితాలన్నీ కుప్పంలో చంద్రబాబు పని అయిపోయినట్లేనని స్పష్టంగా చెప్పాయి. వాస్తవానికి తనను ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆ ప్రాంతానికి మేలు చేయలేదు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా హంద్రీనీవా నీళ్లు తెస్తానని మోసం చేశారే తప్ప పని చేయలేదు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు వచ్చినా, దాన్ని మున్సిపాలిటీగా మార్చినా, రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేసినా.. అవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నపుడే జరిగాయి. ఇక్కడ 20వేల మందికి ఇళ్ల పట్టాలివ్వటంతో పాటు వాటిలో 10వేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. దాదాపు 90 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా బాబు ఈ స్థానాన్ని పట్టించుకోలేదు సరికదా... కనీసం సొంతిల్లు కూడా కట్టుకోలేదు. వరస పరిణామాలతో కుప్పం తనకు గుడ్‌బై చెప్పబోతోందోని అర్థమై రెండేళ్ల కిందట సొంతిల్లు కట్టారు. అయినా పరిస్థితి మారకపోవటంతో ఓటమిని తప్పించుకోవటానికి కుప్పం నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ‘సిద్ధం’ సభలతో ఉక్కిరి బిక్కిరి చంద్రబాబు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ‘రా... కదలిరా’ పేరిట సభలు నిర్వహించారు. మరోవైపు లోకేశ్ ‘శంఖారావం’ పేరుతో సభలు పెట్టారు. ఇక నారా భువనేవ్వరి ‘నిజం గెలవాలి’ అంటూ సమావేశాలు పెడుతున్నారు. వైఎస్పార్ సీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే... ‘సిద్ధం’ అంటూ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. బాబు...లోకేశ్... భువనేశ్వరి సభలన్నిట్లోనూ కలిపినా... రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు వచ్చిన జనాల్లో సగం కూడా రాలేదు. ‘సిద్ధం’ సభలు మూడూ ఒకదాన్ని మించి మరొకటి జనసంద్రాలయ్యాయి. జనం నాడి అర్థమైన చంద్రబాబుకు వణుకు మొదలైంది. అందుకే పొత్తులతోనైనా ఎలాగోలా పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో కూడా తాను ఓడిపోతే పరిస్థితి దయనీయంగా మారుతుందని, పార్టీ చేజారిపోతుందని అర్థమై.. ఈ సారికి వేరే చోట నుంచి పోటీ చెయ్యడమో... లేకపోతే ఎక్కడా పోటీ చేయకుండా నాన్ ప్లేయింగ్ కెపె్టన్లా వ్యవహరించి పరువు నిలుపుకోవటమో చేయాలని చూస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట. – చంద్రబాబుకి రెస్ట్ ఇచ్చి.. తానే పోటీ చేయాలనుందన్న భువనేశ్వరి! – కుప్పంలో పర్యటనలో బాబు సతీమణి వ్యాఖ్యలతో టీడీపీలో ఆందోళన – ఓటమి భయంతోనే.. బాబు అలా పలికించారనే ప్రచారం సాక్షి, తిరుపతి/శాంతిపురం: ‘‘కుప్పానికి వచ్చాను. ఇక్కడ నాకొక కోరిక ఉంది. నా మనస్సులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, నేనేమీ మిమ్మల్ని కొట్టను.. తిట్టను.. 35 ఏళ్లుగా చంద్రబాబు గారు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు నాకొక కోరిక ఉంది. ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నా. నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా’’ (కుప్పం నియోజక వర్గం శాంతిపురం బహిరంగ సభలో నారా భువనేశ్వరి) నారా భువనేశ్వరి చేసిన కీలకమైన వ్యాఖ్యలు టీడీపీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలే అనుకుంటే పొరబడ్డట్టేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆమె ఎప్పుడూ బహిరంగ సభలో ప్రసంగించలేదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత జనంలోకి వచ్చిన నారా భువనేశ్వరి ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసిస్తారు. ఆ స్క్రిప్‌్టని ఆమె బట్టీ పట్టి సభలో మాట్లాడుతారని టీడీపీలోని ఓ ముఖ్య నేత స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులుగా పర్యటిస్తున్న నారా భువనేశ్వరి బుధవారం శాంతిపురంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక.. 35 ఏళ్ల కాలంలో చంద్రబాబు కుప్పానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించడంతో పాటు.. కుప్పం వాసుల కలగా మిగిలిన హంద్రీ–నీవాకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ కేవలం ఐదేళ్ల కాలంలో కాలువ పనులు పరుగెత్తించి నీరు తీసుకురావడంతో కుప్పం వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీతో పాటు రెవెన్యూ డివిజన్‌గా చేశారు. చంద్రబాబు చేయలేని ఎన్నో కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ వల్లే కావడంతో కుప్పం వాసుల్లో మార్పు కనిపించింది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. కుప్పంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీలు, మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. పంచాయతీల్లోనూ అత్యధికంగా వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్థులే విజయం సాధించారు. కుప్పంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలో స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభించడం వంటి పరిణామాలు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించాయి. అప్పటి నుంచి చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావించారు. అందులో భాగంగా స్థానిక, జిల్లా, రాష్ట్ర నాయకులతో పలుమార్లు ఈ విషయం గురించి చర్చించారు. సతీమణి చేత చెప్పిండం వెనుక మర్మమం అదే ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు కూడా లేని సమయంలో నిజం గెలవాలి అనే కార్యక్రమం పేరుతో తన సతీమణి భువనేశ్వరిని కుప్పానికి పంపించారు. కుప్పంలో ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసి పంపారని, అందులో భాగంగా భార్యతో స్పష్టంగా చెప్పించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదికలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అనారోగ్యం, ఆపై వయస్సు మీద పడడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తప్పుకోవడమే మేలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోటీచేసి ఓడిపోతే మొదటికే మోసం వస్తుందనే భయంతో భార్యతో చెప్పించారని, ఆ తరువాత పారీ్టతో ప్రకటన చేయించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. నారా భువనేశ్వరి చేసిన ప్రకటనతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేస్తారని సొంత జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. -
బాబు రాజకీయాలకు పనికిరాడని ఇప్పుడు తెలిసిందా.. భువనేశ్వరీ?
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే మూడు ‘సిద్ధం’ సభలు జరిపామని, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలను.. నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని ప్రజలకు వివరించామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (మహిళాశిశు సంక్షేమం) నారమల్లి పద్మజ అన్నారు. ‘2019 మ్యానిఫెస్టోలో మేము చెప్పిన ప్రతీ వాగ్దానాన్నీ.. చేసి చూపించాం. మా పాలనే సాక్ష్యంగా 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్ళి.. కాలర్ ఎగరేసి మరీ ఓట్లు అడుగుతామని ఆరోజు చెప్పాం.. ఈరోజూ అదే చెబుతున్నాం’ అని అన్నారు. మూటాముల్లె సర్దేసిన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం.. మా పాలనే దానికి సాక్ష్యం.. మమ్మల్ని మరోమారు ఆశీర్వదించడానికి సిద్ధమా..? అని మా నాయకుడు జగన్ గారు ప్రజలను కోరినప్పుడు వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ను చూసి తెలుగుదేశం పార్టీకి వెన్నులో చలి పుట్టిందేమో.. ఇప్పటికే మూటాముల్లె సర్దేసింది. దాని పరిణామాలు కూడా ఒక్కొక్కటిగా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు రెస్టు తీసుకోవాలని భువనమ్మే చెబుతోంది ఈరోజు నారా భువనేశ్వరి కూడా ఇదే విషయాన్ని మరోమారు ధృవీకరించింది. మా ఆయన చంద్రబాబు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తన భర్త రాజకీయాలకు ఇక పనికిరాడని.. అలసిపోయాడని.. మీడియా ముందుకొచ్చి ఆమె మాట్లాడిన సందర్భాన్ని చూశాం. ఇది నిజమే.. హైదరాబాద్‌లోని ఏఏజీ ఆస్పత్రి కూడా చంద్రబాబు గురించి అదే చెప్పింది. ‘నీకు సకల రోగాలు ఉన్నాయి. నువ్వు గానీ నడవాలంటే.. వెనుక ఒక అంబులెన్స్ ఉండాలి. ఇక, బిజీ రాజకీయాలకు నువ్వు పనికిరావు.. రెస్టు తీసుకోవాలి..’ అని ఆస్పత్రి రిపోర్టు ద్వారానే చెప్పారు. అయినా.. ఆయన విన్లేదు. అందుకే.. చంద్రబాబు బైబై.. అని ఓపెన్‌గా చెప్పింది తన భార్యను ఎవరూ ఏమీ అనకుండానే వెక్కి వెక్కి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు. మా నాన్నను ముసలోడంటున్నారని లోకేశ్ కూడా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. తండ్రీ కొడుకులు ఎంతగా ఏడ్చినా.. మొత్తుకున్నా.. ప్రజల నుంచి వారు ఆశించినంత స్పందన రాకపోవడంతో ఇక, చివరికి కుర్చీలు మడత పెట్టుకునే పనిలో పడ్డారు. పాపం, తన భర్త, కొడుకు పడుతున్న పాట్లు గమనించిన భువనేశ్వరి ఈరోజు ఓపెన్‌గానే చంద్రబాబు బైబై.. అని చెప్పారు. ఆయన కూడా రాజకీయాలకు బైబై చెప్పాల్సిన అవసరముందని.. రెస్టు తీసుకోవాల్సిన వయసొచ్చిందని.. నీకు ప్రజల నుంచి ఆదరణ కరువైందని తన భర్తకూ ఆమె గుర్తుచేశారు. వెన్నుపోటుకు బదులు చెప్పిందా..? లోకేశ్ మాట్లాడించాడా..? సుదీర్ఘకాలం కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఇక పనికిరాడని స్వయంగా ఆయన భార్యే చెబుతున్న క్రమంలో.. అందరిలోనూ ఓ ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఆయన ఎమ్మెల్యేగానే పనికిరాడా..? లేదంటే, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడా..? అని భువనేశ్వరి మాటల అంతరార్థాన్ని విశ్లేషిస్తున్నారు. ఆమె ఇవన్నీ నిజంగానే చెబుతుందా..? లేదంటే, తండ్రి ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటుకు బదులుగా చెబుతుందా..? ఒకవేళ.. లోకేశ్బాబే తన తల్లి చేత ఇలా మాట్లాడిస్తున్నాడా..? మా నాన్న పని అయిపోయింది. నేటి రాజకీయాలకు ఆయనెటూ పనికిరాడని.. ఎలాగైనా మూలన కూర్చోబెట్టాలని తల్లికి చెప్పాడా..? అనేది తేలాల్సిన సందర్భమిది. అబద్ధాలాడటంలో తండ్రీకొడుకుల్ని మించిపోయింది భువనేశ్వరి అక్క పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంది. అలాగే, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా భువనేశ్వరి చేపడితే బాగుంటుందేమో.. ఎందుకంటే, ఆమె మాటల్లోని అబద్ధాల్ని చూస్తుంటే.. ఖచ్చితంగా రాజకీయాల్లోకి పనికొస్తుందని చెప్పొచ్చు. కన్నార్పకుండా అబద్ధాలు అల్లి ప్రచారం చేయడంలో తన భర్త, తన కొడుకును మించిపోయింది. మహిళల పక్షాన అప్పుడెందుకు నోరుమెదపలేదు..? ఆడపిల్ల ఆర్థరాత్రి నడవాలంటే మంచి ప్రభుత్వం రావాలంటున్న నువ్వు.. నీ బుద్ధి, నీ విచక్షణను నీ భర్త పాలనలో ఎక్కడ పెట్టుకున్నావని మేం ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు పాలన లేకుంటే మహిళలు వీధుల్లో నడవలేని పరిస్థితుల్లేవని మాట్లాడుతున్న నీకు మేము కొన్ని ప్రశ్నలడుగుతున్నాం. జవాబివ్వగలవా..? నీ భర్త చంద్రబాబు హయాంలో మహిళలపై అనేక దురాగతాలు జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు..? కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లో నీ తెలుగుదేశం పార్టీ నాయకులే దాదాపు 200 మంది మహిళల్ని లైంగికంగా హింసించి.. బెదిరించి బ్లూ ఫిల్మ్‌లు తీసినప్పుడు నువ్వెందుకు స్పందించలేకపోయావు..? తహశీల్దార్ వనజాక్షిని నీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏవిధంగా దాడిచేసి అవమానించాడో మీడియా సాక్షిగా నువ్వు చూసినా.. బయటకొచ్చి ఇది తప్పు అని మహిళల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోయావు..? రిషితేశ్వరి అనే విద్యార్థినిని అత్యంత పాశవికంగా హింసిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుని మరణిస్తే చదువుకునే బాలికల తరఫున నువ్వెందుకు నీ భర్తను నిలదీయలేదు..? వీటన్నింటికీ.. నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. బీసీ, దళిత మహిళల్ని అవమానిస్తే.. నువ్వు స్పందించలేదేం..? కుప్పంలో ఓ బీసీ మహిళ వైఎస్ఆర్సీపీ మీటింగ్‌కు హాజరైందని .. ఆమెను వివస్త్రను చేసి వీడియోలు చిత్రించి హింసించిన వైనం నీకు తెలియదా ..? ఆ ఘటనను కుప్పం ప్రజలు మరిచిపోగలరా..? అదేవిధంగా పెందుర్తిలో ఓ దళిత మహిళ.. తన అసైన్డ్ స్థలాన్ని లాక్కోవద్దని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడితే నీ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎలా కిరాతకంగా ప్రవర్తించాడో నీకు మీడియాలో నువ్వు చూడలేదా.? నీ సొంత తమ్ముడు మహిళల గురించి ఏం మాట్లాడాడో.. వినలేదా..? వాటిని చూసి ఒక మహిళగా స్పందించలేదెందుకు..? మీ హయాంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పు సభా వేదికపైనే ఒక మహిళను చూస్తే ముద్దెట్టుకోవాలి.. కడుపైనా చేయాలని నీ సోదరుడు మాట్లాడిన సంగతి నీకు తెలిసీ ఎందుకు మౌనంగా ఉన్నావు..? సాటి మహిళగా స్పందించి.. నీ తమ్ముడుకి గడ్డిపెట్టాలని అనిపించలేదా..? నీ తమ్ముడు బాలకృష్ణలాంటి అచ్చోసిన ఆంబోతుల్ని ఏం చేయాలి..? నిలువునా కాల్చేయాల్నా..? వీటన్నింటికీ నువ్వు స్పందించి.. నీ పార్టీ హయాంలో జరిగిన తప్పులను ఒప్పుకుని.. మీ తెలుగుదేశం పార్టీ తరఫున.. నీ తమ్ముడి తరఫున బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భువనేశ్వరిని మేము డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో జరిగిన నేరాలనూ ఆంధ్రకు అంటగడతారా..? చంద్రబాబుకు మూటలు మోసే నాయకుడున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కిందటేడాది ఆగస్టు 22న జరిగిన అత్యాచారం గురించి ఈరోజు ఇక్కడ భువనేశ్వరి మాట్లాడింది. అక్కడ ఓ బాలికపై గంజాయి తాగిన ఉన్మాదులు అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ నేరాన్ని తెచ్చి ఇప్పుడు ఆంధ్రలో ఉన్న ప్రభుత్వంపై అంటకట్టడానికి ప్రయత్నించడం నీకు సిగ్గనిపించడం లేదా..? అని భువనేశ్వరిని అడుగుతున్నాను. అబద్ధాల్లో నీ భర్త, నీ కొడుకును మించి పోయావు గనుక.. ఇప్పుడు నిలువునా మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీకి నువ్వు అధ్యక్షరాలివయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక పగ్గాలు చేపట్టమని చెప్తున్నాం. -
బాబు గారి బండారాన్ని బయటపెట్టిన భువనేశ్వరి
-
మంగళగిరిలో ఓటమి భయంతో రెండుచోట్ల పోటీపై లోకేష్ స్కెచ్?