NGK Movie
-
‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’
చెన్నై : ఈ కాలంలో మాటకు విలువేలేదని చెప్పవచ్చు. అంతా కృత్రిమం, అవకాశవాదమే. ఈ రోజు సరే అన్న వారు రేపు సారీ అంటున్నారు. సినిమా వాళ్లు ఇందుకు అతీతం కాదు. నటి సాయిపల్లవి ఈ కోవకు చెందినదేనా అనే అనుమానాన్ని ఒక యువ దర్శకుడు వ్యక్తం చేస్తున్నాడు. సాయిపల్లవిని కోలీవుడ్‌కు తీసుకురావడానికి ముందు చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కూడా సాయిపల్లవిని తన చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారనే టాక్ అప్పట్లో ప్రచారం అయ్యింది. కాగా ఎట్టకేలకు దర్శకుడు విజయ్ ఆమెను దయా చిత్రంతో కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశ పరచింది. అంతే కాదు ఆ తరువాత ధనుష్‌తో రొమాన్స్ చేసిన మారి–2, సూర్య సరసన నటించిన ఎన్జీకే చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి, దీంతో అక్కడ సాయిపల్లవి దుకాణం బంద్ అన్నంతగా మారింది. దీంతో తెలుగు, మాతృభాష మలయాళంలోనే దృష్టి పెట్టింది. అలాంటి ఈ అమ్మడు రామకృష్ణన్ అనే యువ దర్శకుడి చిత్రంలో నటించడానికి సాయిపల్లవి మాట ఇచ్చిందట. దర్శకుడు చేరన్ శిష్యుడైన రామకృష్ణన్ సహాయ దర్శకుడిగా ఉన్న సమయంలోనే హీరోగా అవకాశం రావడంతో కుంకుమపూవే కొంజుం పురావే చిత్రంలో నటించాడు. అలా కొన్నిచిత్రాల్లో నటించిన ఇతను ఇటీవల అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు. అయితే తాజాగా దర్శకుడిగా చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అందులో నటి సాయిపల్లవి నటించడానికి అంగీకరించినట్లు చెప్పుచొచ్చాడు. దీని గురించి రామకృష్ణన్ తెలుపుతూ.. సాయిపల్లవిని కలిసి కథ వినిపించినట్లూ, కథ విన్న ఆమె ఎన్నాళ్ల నుంచి ఈ కథను తయారు చేస్తున్నారు అని ఆశ్చర్యపోయిందని చెప్పారు. కథ నచ్చిందని, తాను ఈ చిత్రంలో కచ్చితంగా నటిస్తానని చెప్పిందని అన్నారు. ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థనే తనును నటి సాయిపల్లవికి కథ చెప్పమని పంపించిందని దర్శకుడు తెలిపాడు. అయితే కథ బాగుంది, నటిస్తానని చెప్పిన సాయిపల్లవి ఆ తరువాత బిజీ కారణంగా తమ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేదని చెప్పారు. కాగా ఒకవేళ తన కథ సాయిపల్లవికి నచ్చలేదా నిజంగానే బిజీ కారణంగా కాల్షీట్స్ ఇవ్వలేకపోతోందా అన్న సందేహం తనకు కలుగుతోందని దర్శకుడు రామకృష్ణన్ అంటున్నాడు. దీనికి సాయిపల్లవే బదులు చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మడికి కోలీవుడ్ అచ్చిరాలేదు. పైగా ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ దర్శకుడిని నమ్మి మరోసారి కోలీవుడ్‌కు వచ్చే సాహసం చేస్తుందా తన మాట నిలబెట్టుకుంటుందా? అన్నది వేచి చూడాలి. -
రీల్ ఎన్జీకే రియల్ అవుతాడా?
తమిళనాడు, పెరంబూరు: రీల్ ఎన్జీకే రియల్ ఎన్జీకే అవుతాడా? పుట్టుకతోనే ఎవరూ వృత్తితో రారు. పరిస్థితులు, ఆలోచనలు, అవకాశాలు, అభిరుచులు ,అన్నింటికీ మించి అదృష్టం ఒక్కో మనిషిని ఒక్కో మార్గంలో నడిపిస్తాయి. ఇదంతా నటుడు సూర్య ప్రస్తుత పరిస్థితి గురించే. సీనియర్ నటుడు శివకుమార్ పెద్ద కొడుకు సూర్య, రెండవ కొడుకు కార్తీ. ఇద్దరూ తండ్రి అడుగు జాడల్లోనే నటులుగా రాణిస్తున్నారు. నటుడు శివకుమార్ గత 40 ఏళ్లుగా తన పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు చేయూత నిచ్చే విధంగా వారి చదువుకు ఆర్ధిక సాయం అందిస్తూ వస్తున్నారు. కాగా సమీపకాలంలో ఆయన బాధ్యతలను కొడుకు సూర్య తీసుకుని అగరం పౌండేషన్ ద్వారా విద్యాదానంతో పాటు వ్యవసాయ రైతులను ఆదుకునే విధంగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు తమ్ముడు కార్తీ అండదండలు ఉంటుంన్నాయి. ఎలాంటి స్వలాపేక్షా లేకుండా శివకుమార్ కుటుంబం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మంచి ప్రశంసలు లబిస్తున్నాయి. ఇంత వరకరూ బాగానే ఉంది. నటన, చిత్ర నిర్మాణం, విద్య, వ్యవసాయదారులకు సేయూత వంటి కార్యక్రమాలతో తన పని తాను చేసుకుపోతున్న నటుడు సూర్య ఇటీవల తన పౌండేషన్ ద్వారా నిర్వహించిన విద్యార్ధులకు ఆర్థిక సాయం కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలు పరుస్తున్న నూతన విద్యా విధానం విద్యార్దులకు మేలు చేసే విధంగా లేదనీ, ఐదవ తరగతి నుంచే ఎంట్రెన్స్ పరిక్షలు విధానంతో విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందనీ,ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూత పడే పరిస్థితి నెలకొంటుందనీ కాస్త ఆవేశంగానే మాట్లాడారు. రాజకీయ నాయకులు విమర్శనల దాడి కొందరు రాజకీయ నాయకులు సూర్య వ్యాఖ్యలపై విమర్శల దాడికి దిగారు. ముఖ్యంగా బీజేపీ, రాష్ట్ర అధికార పార్టీ నాయకులు సూర్యకు విద్య గురించి ఏం తెలుసని విమర్శిస్తున్నాడు? అంటూ ద్వజమెత్తారు. అయితే కాంగ్రేస్, మక్కళ్ నీది మయ్యం పార్టీ,నామ్ తమిళర్ వంటి రాజకీయ పార్టీలు సూర్యకు అండగా నిలిచారు. దీంతో సూర్యకు రాజకీయ రంగు పులిమేస్తున్నారా? అన్నంతగా పిరిస్థితులు కనిపిస్తున్నారు. కారణం కొందరు సినీ ప్రముఖులతో పాటు అనేక మంది అభిమానులు సూర్యకు మద్దతుగా నిలిచారు. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సూర్య వ్యాఖ్యలను స్వాగతించడంతో పాటు ఆయన్ని విమర్శిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులే కాకుండా, ఎప్పుడూ వాదులాడుకునే విజయ్,అజిత్ అభిమానులు ఒకటై సూర్యకు పూర్తిగా సపోర్టు చేస్తుండటం విశేషం. నటుడు సూర్య విద్యారంగంలో నిపుణులతో అగరం పౌండేషన్‌ను నడుపుతున్నారనీ, విద్యార్దులకు చేయూత నిస్తున్న ఆయనకు విద్యా గురించి తెలియదనడం సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యావిధానం గురించి ఎవరైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే వాటిని పరిగణలోకి తీసుకుని చర్చించాలి గానీ, ఎదురు దాడి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా అనవసరంగా రాదాంతం చేస్తూ కొందరు రాజకీయ నాయకులు ఎలాంటి ఆలోచనా లేని నటుడు సూర్యను రాజకీయాల్లోకి బలవంతంగా వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారా? అనే మాటా వినిపిస్తోంది. విశ్వరూపం చిత్రం విషయంతో ఆ చిత్ర దర్శక,నిర్మాత, నటుడు కమలహసన్ను వేదింపులకు గురి చేయడం కారణంగానే ఆయన్ని రాజకీయ పార్టీను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారనే భావన వ్యక్తం అవుతోంది. కాగా నటుడు సూర్య ఇటీవల నటించిన ఎన్జీకే చిత్రంలో నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ సామాజిక సేవలు చేసుకునే సూర్యను కొందరు రాజకీయ నాయకుల చర్యలు రాజకీయాల్లోకి వచ్చేలా చేయడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రినే అయ్యి పోతాడు. అది రీల్ జీవితం అయితే ప్రస్తుతం సూర్య రియల్ జీవితంలోనూ రాజకీయనాయకులు బలవంతంగా రాజకీయాల్లోకి నెట్టే చర్యలకు పాల్పడుతున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఇంతటితో ఆగిపోతుందా?లేక చిలువలు పలువలతో జటిలంగా మారుతుందా? చూద్దాం. ఎందుకంటే ఏ అర్హత అవసరం లేనిది రాజకీయరంగం. ఎవరైనా తమ అదృష్టాన్ని పరిక్షించుకోవచ్చు. కాగా ప్రస్తుతానికి మాత్రం నటుడు సూర్యకు రాజకీయ రంగప్రవేశ ఆలోచన లేదన్నది ఆయన అనుచరుల మాట. -
అందుకే.. జీవితంలో అసలు పెళ్లే చేసుకోను!
తమిళసినిమా: విజయాలను అందుకోవడం అంత ఈజీ కాదు. కొందరికి నేమ్,ఫేమ్ ఉన్నా విజయాలు దగ్గరికి రావడానికి దోబూచులాడుతుంటాయి. అందుకే పెద్దలు అంటుంటారు ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలని. ఇదుగో నటి సాయిపల్లవిది కోలీవుడ్‌లో ఇందే పరిస్థితి. మాలీవుడ్‌లో మలర్ చిత్రంతో వికసించిన కథానాయకి ఈ అమ్మడు. ఆ చిత్రంలో టీచర్‌గా అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడికి మాతృభాషతో పాటు దక్షిణాదిలోనే క్రేజ్ వచ్చేసింది. అంతేకాదు టాలీవుడ్లో అవకాశాలు తలుపు తట్టేశాయి. అలా అక్కడ సాయిపల్లవి నటించిన ఫిదా చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది. అదే విధంగా ఎంసీఏ చిత్రం హిట్ అయ్యింది. దీంతో అక్కడ సాయిపల్లవి పేరు మారు మోగింది. అంతే అ తరువాత సాయిపల్లవికి సక్సెస్ ముఖం చాటేసింది. ఇక కోలీవుడ్‌లో నటించిన మూడు చిత్రాలు ఈ అమ్మడి కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దయ, మారి–2, ఎన్జీకే ఈ మూడు చిత్రాల్లో ధనుష్‌తో జత కట్టిన మారి–2 చిత్రం కాస్త మెరుగు. అందులో రౌడీ బేబీ పాట సాయిపల్లవిని చాలా పాపులర్ చేసిందనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీకి ఏ భాషలోనూ కొత్త అవకాశాలు కనుచూపు దూరంలో కనిపించడం లేదు. ఇంతకు ముందు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా అవకాశాలు లేకుంటే వైద్యం వృత్తి చేసుకుంటానని చెప్పిన సాయిపల్లవి తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. హీరోయిన్ అన్న వారెవరికైనా ఎదురైయ్యే ప్రశ్న ఎవరినైనా ప్రేమించారా?పెళ్లి ఎప్పుడు? అన్నవే. అయితే నటి సాయిపల్లవికి మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నే ఎదురవుతోందట. అందుకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పేర్కొంటూ తాను అసలు పెళ్లే చేసుకోను అని చెప్పింది. కారణం ఏమిటంటే తాను పెళ్లి చేసుకుంటే తన తల్లిదండ్రులను చూసుకోవడం కుదరదని పేర్కొంది. అందుకే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చింది. సాయిపల్లవి చెప్పిన కారణం నమ్మశక్యంగా ఉందా? ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా నటిగా మాలీవుడ్, టాలీవుడ్‌లలో సక్సెస్‌లు చూసిన ఈ అమ్మడికి కోలీవుడ్‌లో మాత్రం అది ఇంకా అందని ద్రాక్ష లాగానే ఉండిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఒక్క అవకాశం కూడా చేతిలో లేదాయే. ఎన్జీకే చిత్రంలో ఈమెతో పాటు నటించిన నటి రకుల్‌ప్రీత్‌సింగ్ మాత్రం విజయ్‌తో రొమాన్స్ చేసే క్రేజీ ఆఫర్‌ను దక్కించుకుందనే ప్రచారం హోరెత్తుతోంది.ఇందుకు కారణం రకుల్‌ప్రీత్‌సింగ్ గ్లామర్‌ను నమ్ముకుంది. సాయిపల్లవి నటనను నమ్ముకోవడమేననుకోవాలి. -
రకుల్‌కు లక్కీచాన్స్?
నటి రకుల్ ప్రీత్ సింగ్ కోసం లక్కీచాన్స్ ఎదురుచూస్తోందా? ఇందుకు అవుననే టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. నిజానికి ఈ బ్యూటీ మార్కెట్ చాలా డౌన్లో ఉందన్నది వాస్తవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్తీతో రొమాన్స్ చేసిన దేవ్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత ఇంకా ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సూర్య సరసన నటించిన ఎన్జీకే చిత్రం ఆశించిన విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న చిత్రం ఒక్కటే సెట్స్ మీద ఉంది. అయినా రకుల్ ప్రీత్ సింగ్‌ను అదృష్టం విడనాడలేదనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఈ అమ్మడికి ఇళయదళపతి విజయ్‌తో జతకట్టే అవకాశం ఎదురు చూస్తుందన్నదే. సర్కార్ వంటి సంచలన చిత్రం తరువాత విజయ్ తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటిస్తోంది. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విజయ్ మహిళా ఫుట్‌బాల్ క్రీడా శిక్షకుడిగా నటిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. కాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇది వరకే వెల్లడించారు. కాగా విజయ్ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించేదెవరన్న విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. శంకర్, ఏఆర్.మురుగదాస్, వినోద్, పేరరసు, మోహన్‌రాజా ఇలా చాలా మంది దర్శకులు విజయ్ కోసం కథలను తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ పేరు తెరపైకి వచ్చింది. ఈయన ఇంతకు ముందు మానగరం వంటి సక్సెస్ఫుల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కార్తీ హీరోగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విజయ్ హీరోగా చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని విజయ్ కుటుంబ బంధువైన బ్రిట్టో నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ నిర్మాత ఇంతకు ముందు విజయ్‌కాంత్, విజయ్ కలిసి నటించిన సెంథూరపాండి, విజయ్ హీరోగా రసిగన్ వంటి చిత్రాలను నిర్మించారు. తాజాగా విజయ్‌తో నిర్మించనున్న ఈ చిత్రంలో కన్నడ నటి, తెలుగులో క్రేజీ నాయకిగా వెలిగిపోతున్న రష్మిక నటించనున్నట్లు ప్రచారం హోరెత్తింది. కానీ ఇప్పుడురకుల్ప్రీత్సింగ్ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అవకాశం కనుక రకుల్‌ను వరిస్తే తను నిజంగా లక్కీనే. చూద్దాం మరి కొద్ది రోజుల్లో విజయ్ 64వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. -
‘ఎన్జీకే’ రిజల్ట్‌పై సూర్య స్పందన
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ ఎన్జీకే. పొలిటికల్ సెటైర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్సాన్స్ రాలేదు. కథా కథనాలు ఆకట్టుకునేలా లేకపోవటంతో.. ఎన్జీకే, సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫలితంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సూర్య, తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఎన్జీకే విషయంలో ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నా. మా ప్రయత్నాన్ని, నటీనటుల కష్టాన్ని విశ్లేషించి, ప్రశంసించిన అందరికీ కృతజ్ఞతలు. ఎన్జీకే తెరకెక్కించేందకు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు సూర్య. I humbly accept all the love,views and opinions about NGK with utmost humility and thank the masterminds ;) who decoded and appreciated the different attempt, and the actors performances!! Thanks to the entire cast & crew for making this happen #NGK @selvaraghavan @prabhu_sr — Suriya Sivakumar (@Suriya_offl) 7 June 2019 -
‘పాకెట్ మనీ కోసమే సినిమాలు చేశా’
తాను నటినెందుకయ్యానో తెలుసా? అని అంటున్నారు నటి రకుల్‌ప్రీత్‌సింగ్. కథానాయకిగా రాణిస్తున్న ప్రతి నటి తానెందుకు నటినయ్యాను? ఎలా అయ్యాను? వంటి విషయాల గురించి ఏదో కారణం ఉందని చెబుతుంటారు. మనం వింటుంటాం. మరి రకుల్‌ప్రీత్‌సింగ్ ఏం చెబుతున్నారో చూసేస్తే పోలా. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం అనే ఒక్క విజయం మినహా సరైన మరో సక్సెస్ లేదన్నది నిజం. అయితే టాలీవుడ్లో రెండు మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రమే రకుల్‌ప్రీత్‌సింగ్ చేతిలో ఉన్నాయి. ఇకపోతే కోలీవుడ్‌లో సూర్యతో నటించిన ఎన్జీకే చిత్రంపై ఈ భామ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. దీని గురించి రకుల్‌ప్రీత్‌సింగ్ తాను ఎన్జీకే చిత్రంలో నటించడానికి ప్రధాన కారణాలు రెండు అని చెప్పుకొచ్చారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తే నటనను మరింత మెరుగుపరుచుకోవచ్చునని, ఇక రెండో విషయం హీరో సూర్య కావడం అన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ ఇంతకు ముందు తెరకెక్కించిన 7జీ.రెయిన్బో కాలనీ, కార్తీ హీరోగా నటించిన ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రాలు తనను బాగా ఆకట్టుకున్నాయన్నారు. నిజంగానే సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం వినూత్న అనుభంగా పేర్కొన్నారు. తాను కార్తీ, సూర్య ఇద్దరితోనూ నటించానని, ఇద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులని తెలిపారు. సూర్య, కార్తీ ఇద్దరూ కఠిన శ్రమజీవులు అన్నారు. ఎలాంటి గర్వం లేకుండా చేసేపనిని ఇష్టపడి చేస్తారని అంది. తనకు తమిళం కంటే తెలుగు భాష బాగా తెలుసని, తెలుగులో సరళంగా మాట్లాడగలనన్నారు. తమిళ చిత్రాలకు అయితే సంభాషణలను హిందీలో రాసుకుని చెబుతానని, అది కాస్త కష్టతరం అయినా సవాల్‌గా తీసుకుని నటిస్తానని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే తాను మొదట పాకెట్ మనీ కోసమే సినిమాల్లో నటించానని తెలిపారు. ఆ తరువాత కెమెరా ముందు నిలబడి నటించడం చాలా నచ్చడంతో పూర్తిగా నటిగా మారిపోయానని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పుకొచ్చారు. కోలీవుడ్‌లో ఈ అమ్మడికి రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఒక్కటే ఉంది. అదేవిధంగా తెలుగులో నాగార్జునతో మన్మథుడు 2, హిందీలో మర్జావాన్ అనే ఒక చిత్రంలో నటిస్తున్నారు. -
థ్రిల్ అయ్యారు
సూర్య హీరోగా, సాయిపల్లవి, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్లుగా శ్రీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్జీకే’(నంద గోపాల కృష్ణ). డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ తెలుగులో మే 31న విడుదలచేశారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా శ్రీ రాఘవ మాట్లాడుతూ– ‘‘వినూత్న పంథాలో తెరకెక్కిన ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో ఫస్ట్ హాఫ్‌లో హీరో, సెకండ్ హాఫ్‌లో విలన్‌గా సూర్య పాత్రని వైవిధ్యంగా చూపించాం. అదే ‘ఎన్జీకే’ చూసిన ఆడియన్స్‌ని థ్రిల్ అయ్యేలా చేసింది. సూర్యతో డిఫరెంట్ క్యారక్టర్ చేయించారని అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఎన్జీకే’ సాధించిన విజయం అటు సూర్యకి, ఇటు దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. -
ఫస్టాఫ్‌లో హీరో.. సెకండాఫ్‌లో విలన్
'గజిని' 'సింగం' వంటి విలక్షణ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సూర్య హీరోగా '7G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరొందిన శ్రీ రాఘవ దర్శకత్వంలో వినూత్న పంథాలో తెరకెక్కిన ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ 'ఎన్ జీ కే'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ అందించారు. మే 31న విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సూర్య ఫస్టాఫ్‌లో హీరో, సెకండాఫ్‌లో విలన్‌గా క్యారెక్టరైజేషన్‌ను డిఫరెంట్‌గా చేశాము. అదే ‘ఎన్జీకే’ చూసిన ఆడియెన్స్‌ను థ్రిల్ అయ్యేలా చేసింది. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి, సూర్య పెర్ఫార్మెన్స్కు ట్రెమెండస్ అప్లాజ్ రావడానికి ఈ కారక్టరైజేషనే కారణం అయ్యింది. సూర్య తో డిఫరెంట్ క్యారక్టర్ చేయించారని అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 'ఎన్జీకే' సాధించిన విజయం అటు సూర్యకి దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కెరక్టర్లు డిఫరెంట్ గా ఉండడం వల్ల అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువన్ శంకర్ రాజా రి రికార్డింగ్ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు. -
తిరుత్తణిలో ఎన్జీకే సందడి
తిరుత్తణి: నటుడు సూర్య నటించిన ఎన్జీకే చిత్రం శుక్రవారం విడుదలైన సందర్భంగా తిరుత్తణిలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. దీంతో సినిమా థియేటర్ల ముందు కోలాహలం చోటుచేసుకుంది. ఉదయం ఏడు గంటలకే వందలాది మంది అభిమానులు సినిమా థియేటర్ వద్దకు చేరుకుని కటౌట్లు ఏర్పాటు చేసి పూజలు చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. ఉత్సాహంగా మొదటి షో చూసి సంబరాలు జరుపుకున్నారు. తిరువళ్లూరు జిల్లా సూర్య ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు ఎల్టీ.రాజ్‌కుమార్ అధ్యక్షతన రూ. ఏడు లక్షల వ్యయంతో 215 అడుగుల పొడవైన సూర్య కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల అనుమతి లేకపోవడంతో తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంతో తిరుత్తణిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
లీడర్
-
సారీ చెప్పిన సాయి పల్లవి
కోలీవుడ్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ఈ రోజు ఎన్జీకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సూర్యతో పాటు సాయి పల్లవి కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో మాట్లాడాలని భావించారు. కాసేపట్లో మీతో ఆస్క్ సాయి పల్లవి(#AskSaiPallavi) ట్యాగ్ అభిమానుల ప్రశ్నలను ట్వీట్ చేయాలంటూ కోరారు. చాలా కాలం తరువాత సాయి పల్లవి సోషల్ మీడియాలో చాట్ చేయటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తమ ప్రశ్నలను ట్వీట్ చేశారు. అయితే సాయి పల్లవి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. దీంతో చాలా సమయం వెయిట్ చేసిన కొందరు అభిమానులు నువ్వు చీట్ చేశావు. మా ప్రశ్నలకు రిప్లై ఇవ్వలేదు అంటూ కామెంట్ చేశారు. దీంతో సాయి పల్లవి అభిమానులకు సారీ చెప్పారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలపై ఆలస్యంగా స్పందించిన ఆమె ‘నేను సమధానం చెప్పాలనుకున్నా కానీ కుదరలేదు’ అంటూ క్షమాపణలు కోరారు. తరువాత కొన్ని ప్రశ్నలకు సమాధానలు ఇచ్చారు. Thank you all for the unconditional love ❤️ I’m sorry that I cudn reply to all the tweets( I really wish I could but I’m so bad at this 🙈)I hope u enjoy watching NGK at theatres Tomo ♥️ Until next time ,sending u lots n lots of love 😘 — Sai Pallavi (@Sai_Pallavi92) 30 May 2019 -
‘ఎన్జీకే’ రిలీజ్‌కు ముందు ఫ్యాన్స్‌కు షాక్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఎన్జీకే శుక్రవారం విడుదలైంది. కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న సూర్య ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అభిమానులు కూడా ఈ మూవీ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుత్తణిలో ఏర్పాటు చేసిన 215 అడుగుల భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం ఈ కటౌట్ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన సూర్య అభిమానులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రిలీజ్ సందర్భంగా అభిమానుల ఏర్పాట్లలో ఉండగా గురువారం కటౌట్ తొలగించటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్జీకే సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు. -
‘ఎన్జీకే’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
మా అందరికీ ఇది స్పెషల్ మూవీ
‘‘అందరికీ సూర్య గొప్ప నటుడు అని తెలుసు. అయితే ఆయన అంతకంటే గొప్ప మనసున్న మనిషి. సూర్య ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలుసు. ఆయనకు సెల్యూట్’’ అన్నారు శ్రీరాఘవ. సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్జీకే’ (నంద గోపాలకృష్ణ). తెలుగు, తమిళ భాషల్లో రేపు(శుక్రవారం) ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో కేకే రాధామోహన్ విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ– ‘‘ఒక వ్యక్తి సమాజానికి ఎంత ఉపయోగపడ్డాడు అన్నదే సినిమా కథ. మా అందరికీ స్పెషల్ మూవీ. నా గత చిత్రం (‘గ్యాంగ్’) విడుదలై ఏడాదిన్నర అయింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణతో తెలుగు ఇండస్ట్రీని నా సొంత ఇంటిలా భావిస్తాను. ‘ఎన్జీకే’ ప్రేక్షకులకు యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఇంతకుముందు హిట్ సాధించిన సూర్య సినిమాలకు ‘ఎన్జీకే’ చిత్రం దీటుగా ఉంటుందని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్.ఆర్. ప్రభుకి థ్యాంక్స్’’ అన్నారు రాధామోహన్. ‘‘సూర్య అద్భుతంగా నటించారు. సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ మంచి నటీమణులు. యువన్‌తో సహా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు శ్రీరాఘవ. ‘‘సూర్య తమిళ హీరో అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఈ సినిమా మంచి హిట్ కావాలి. రాధామోహన్‌గారికి పెద్ద సెక్సెస్‌గా నిలవాలి’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘యూనిట్‌కి ఆల్ ది బెస్ట్. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత భోగవల్లి బాపినీడు. ‘‘తెలుగులో పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎలా వెయిట్ చేస్తున్నారో.. సూర్యగారి సినిమా అంటే అంతే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా సూపర్‌హిట్ అవుతుంది’’ అన్నారు నిర్మాత రామ్ తాళ్లూరి. ‘‘హైదరాబాద్‌కు వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. సూర్యగారు, రాఘవగారు.. ఇలా టీమ్ అందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు సాయిపల్లవి. ‘‘సూర్యగారు అమేజింగ్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. కెమెరామేన్ శివకుమార్ విజయన్ మాట్లాడారు. -
రికార్డ్ బ్రేక్: 215 అడుగుల సూర్య కటౌట్
అభిమానానికి హద్దు ఉండదేమో. తమ ఆరాధ్య నటుడు సినిమా రిలీజ్ అంటే ఇక ఫ్యాన్స్‌కు పండుగే. పూల దండలు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ప్రముఖ తమిళ హీరో సూర్య అభిమానుల కూడా తమ అభిమానంతో ఏకంగా రికార్డునే బ్రేక్ చేశారు.. సూర్య నటించిన ‘ఎన్జీకే’ చిత్రం శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో తమిళనాడు తిరువళ్లూరు జిల్లా సూర్య ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 215 అడుగుల ఎత్తైన కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ను తిరుత్తణిలో బుధవారం ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్‌ను చూసేందుకు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా కటౌట్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కాగా ఇప్పటివరకూ హీరో అజిత్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన 180 అడుగుల కటౌట్ దేశంలోనే అతిపెద్దదిగా రికార్డు నమోదు అయింది. అయితే తాజాగా సూర్య అభిమానులు ఆ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా 215 అడుగుల పొడవైన కటౌట్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టారు. సుమారు 40మంది కార్మికులు ఈ కటౌట్ నిర్మాణంలో పాల్గొన్నారు. 35 రోజుల పాటు శ్రమించి తిరుత్తణి- చెన్నై బైపాస్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు. -
‘అవును.. 2 కోట్ల యాడ్‌కు నో చెప్పా’
‘ప్రేమమ్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సాయి పల్లవి తరువాత సౌత్‌లో బిజీ హీరోయిన్గా మారిపోయారు. మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినా తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సూర్య సరసన హీరోయిన్గా నటించిన ‘ఎన్జీకే’ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో సాయి పల్లవి ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో నటించేందుకు నో చెప్పినట్టుగా వార్తలు వినిపించాయి. 2 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా.. ఈ బ్యూటీ నో చెప్పారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఆ వార్తలపై సాయి పల్లవి స్పందించారు. పింక్విల్లా కథనం మేరకు ‘ఇది భారతీయుల రంగు. మనం విదేశీయుల దగ్గరికి వెళ్లి మీరెందుకు తెల్లగా ఉన్నారని అడగం. అది వారి రంగు.. ఇది మన రంగు. ఆఫ్రికన్స్‌కు కూడా వారి రంగు వారికుంది. వారంతా అందంగానే ఉన్నారు. ఆ యాడ్ చేయటం ద్వారా వచ్చే డబ్బు నేనేం చేసుకుంటాను. ఇంటికెళ్లి మూడు చపాతిలు తిని, కారులో షికారు చేస్తాను. అంతకంటే నాకు పెద్దగా అవసరాలు లేవు. నేను నా చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచగలిగితే చాలు’ అని సాయి పల్లవి వెల్లడించినట్టుగా పింక్విల్లా పేర్కోంది. -
నేను యాక్టర్‌ని.. క్రియేటర్‌ని కాదు
‘‘నేను శ్రీ రాఘవ అభిమానిని. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలన్నది నా కల. ఆ అవకాశం కోసం 19ఏళ్లుగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ‘ఎన్.జీ.కే’ రూపంలో ఆ అవకాశం దొరికింది. ఆయన అద్భుతమైన నటుడు. ఆయన చేసి, చూపించిన దాంట్లో మనం ఒక్క శాతం చేసినా చాలు’’ అన్నారు హీరో సూర్య. ‘గజిని, యముడు, సింగం’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘ఎన్.జీ.కే’ (నంద గోపాల కృష్ణ). ‘7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల ఫేమ్ శ్రీరాఘవ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్‌సింగ్, సాయి పల్లవి కథానాయికలు. ఎస్.ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడదల కానుంది. తెలుగులో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సూర్య పంచుకున్న విశేషాలు... ►శ్రీ రాఘవ వినిపించిన నాలుగు కథల్లో ‘ఎన్.జీ.కే’ బాగా నచ్చింది. అందుకే ఈ కథతో ముందుకెళ్లాం. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఏ ఒక్క రాష్ట్రానికీ సంబంధించినది కాదు. ఏ రాష్ట్రంలోని రాజకీయాలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. కానీ, మా సినిమాలో యూనివర్శల్ కాన్సెప్ట్ ఉంటుంది. మంచి డైలాగులు, ఎమోషన్స్, స్క్రీన్‌ప్లే ఉంటుంది. ముఖ్యంగా క్లయిమాక్స్ చాలా బాగుంటుంది. మా కథకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ►వ్యవస్థలో ఎన్నో లోపాలున్నాయి. ప్రతి ఒక్కరూ ఓట్లు వేయడానికి మాత్రం ముందుంటారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రశ్నించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. మనకెందుకులే అనుకుంటున్నారు. చదువుకున్నవారు, మేథావులే ఇలా ఆలోచిస్తే ఎలా? వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఒక సామాన్య యువకుడు రాజకీయ వ్యవస్థపై ఎలాంటి పోరాటం చేశాడు? లోపాల్ని ఎలా సరిదిద్దాడు? అన్నదే ‘ఎన్.జీ.కే’ కథ. రియాలిటీకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం. ►రాఘవ ఓ కథని రెడీ చేయటానికి ఏడాది నుంచి ఏడాదిన్నర తీసుకుంటాడు. తనకెవరూ సపోర్టర్స్ లేరు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు... ఇలా అన్నీ ఒక్కడే రాసుకుంటాడు. అందుకే అంత టైమ్ తీసుకుంటాడు. ‘ఎన్.జీ.కే’ కేవలం శ్రీరాఘవ ఫిల్మ్. తన సినిమాల్లో పాటలు కూడా రెగ్యులర్‌గా ఉండవు. తనతో పని చేయడం ప్రతిరోజూ ఓ కొత్త అనుభూతి. దర్శకుడు బాలాసార్ స్కూల్ నుంచి నేను వచ్చాను. దర్శకత్వంలో బాలా, శ్రీరాఘవ ఎవరి శైలి వారిదే. శ్రీరాఘవతో పనిచేస్తున్నప్పుడు బాలా సార్‌తో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ బాగా నటించారు. ►శ్రీరాఘవ ఒక్కోసారి ఏడెనిమిది టేక్‌లు తీస్తారు. ఆ రోజు సన్నివేశం సరిగ్గా రాలేదంటే మరుసటి రోజు కూడా అదే సీన్ చేయిస్తారు. అందుకే ఆయన టేక్ ఓకే అంటే అదే పెద్ద రిలీఫ్‌గా భావించేవాణ్ణి. ప్రతి రోజూ కొత్త డైరెక్టర్లా చేస్తారు. ఈ సినిమా కోసం ఆయన ఎటువంటి రాజకీయ రిఫరెన్సులు తీసుకోలేదు. చాలా పరిశోధించారు. కెమెరాముందు నేను మిమిక్రీ చేయడం లేదు. అందుకే శ్రీరాఘవ చేసి చూపించే ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుని నటించేవాణ్ణి. మా ‘ఎన్.జీ.కే’ సినిమాని చూడకుండా నమ్మకంతో తెలుగులో విడుదల చేస్తున్న రాధామోహన్ సార్‌కి థ్యాంక్స్. ►ఒక్కసారి కథ విన్నాక డైరెక్టర్ చెప్పినట్టు చేస్తా. ఎందుకంటే నేను యాక్టర్‌ని.. క్రియేటర్‌ని కాదు. నాకు నచ్చినట్టు కథ, డైలాగులు రాసుకోలేను. అమితాబ్ సార్ సినిమాల్లో కామెడీ ఉంటుంది. నటనకూ ప్రాధాన్యత ఉంటుంది. నా సినిమాల్లో ఈ రెంటికీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటా. ►తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని నాకూ ఉంది. కానీ, కుదరడం లేదు. త్రివిక్రమ్‌గారితో సినిమా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు దర్శకురాలు సుద కొంగరతో (‘గురు’ ఫేమ్) సినిమా చేయడం మంచి అనుభూతి. ‘‘మా బ్యానర్లో ఇంతవరకు డబ్బింగ్ మూవీ రిలీజ్ చేయలేదు. కానీ, ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని ‘ఎన్.జీ.కే’ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సూర్య, సాయిపల్లవి, రకుల్ జగపతిబాబుతో పాటు శ్రీ రాఘవ డైరెక్షన్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్.. ఇలా బెస్ట్ ఆర్టిస్ట్‌లు, బెస్ట్ టెక్నీషియన్స్‌తో రూపొందిన సినిమా ఇది. రాజకీయ నేపథ్యంలో మా బ్యానర్లో ‘అధినేత’ సినిమా వచ్చింది. అలాగే వేరే బేనర్లలో ‘లీడర్, భరత్ అనే నేను’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. పొలిటికల్ సబ్జెక్ట్ అనేది యూనివర్శల్ కాబట్టి తప్పకుండా ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంటుంది. సూర్య ‘గజిని, యముడు, సింగం’ సినిమాల్లా ‘ఎన్.జీ.కే’ కూడా పెద్ద హిట్ అవుతుంది. – నిర్మాత రాధామోహన్ ప్రజల నమ్మకాన్ని జగనన్న నిలబెట్టుకుంటారు జగనన్నతో (వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి) నాకు చాలా సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. వైఎస్ కుటుంబంలోని అనిల్ రెడ్డి నా క్లాస్మేట్. సునీల్ రెడ్డి కూడా తెలుసు. అనిల్‌తో ఉన్న స్నేహం కారణంగా రాజకీయాలకు అతీతంగా వైఎస్ కుటుంబంతో నాకు మంచి సంబంధాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్‌గారు సాధించిన విజయం ఎంతో అద్భుతమైంది. వైఎస్సార్ (వైఎస్ రాజశేఖర రెడ్డి)గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు ఏపీ పాలిటిక్స్ గురించి తెలుసు. ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించాక ఆయన తనయుడు జగనన్న చేస్తున్న రాజకీయ పోరాటం గురించి అవగాహన ఉంది. పది సంవత్సరాల నుంచి ప్రజల మధ్యే ఉంటూ ఎంతో కష్టపడ్డారాయన. అన్ని రోజులు పాదయాత్ర చేయడం గ్రేట్. పైగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం అంటే ఇంకా గ్రేట్. అందుకే ప్రజలు కూడా భారీ విజయాన్ని అందించి, హిమాలయ పర్వతాలంత బాధ్యతను పెట్టారు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ, వాటిని నెరవేర్చుతారు. తక్కువ వయస్సు ఉండి ముఖ్యమంత్రి అయిన వారిలో జగన్ అన్న రెండో వార వడం నిజంగా గ్రేట్. కచ్చితంగా ఆయన సీఎంగా సక్సెస్ అవుతారు. ఈ ఒక్కసారి మాత్రమే కాదు.. మళ్లీ మళ్లీ ఎన్నో సంవత్సరాలు జగన్ అన్న సక్సెస్ అవుతారు’’ అన్నారు. ‘‘ఇక ‘యాత్ర 2’ సినిమాలో జగనన్న పాత్ర నేను చేయనున్నాననే వార్తలను నేను కూడా విన్నాను. ‘యాత్ర’కి మంచి టీమ్ కుదిరింది. ‘యాత్ర 2’ సినిమా గురించి ఇంతవరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. కథ ఆకట్టుకునే విధంగా ఉంటే కచ్చితంగా చేస్తాను.. అందులో డౌట్ లేదు’’ అని స్పష్టం చేశారు సూర్య. -
జగన్ అన్నకు కంగ్రాట్స్ : సూర్య
ఎలాంటి పాత్రలోనైనా తనదైన శైలిలో నటిస్తూ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న సూర్య నటించిన తాజా చిత్రం ఎన్జీకే(నందగోపాల కృష్ణ). నేటి సాయంత్రం(మే 28) హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతోన్న వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్‌ను తాను జగనన్న అని పిలుస్తానంటూ, రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో అభివృద్ది సాధిస్తాయని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావడం మనం చూస్తున్నామని, ఇది చాలా మంచి పరిణామని.. వైఎస్ జగన్, కేటీఆర్, బెంగళూరులో పోటీ చేసిన తేజస్వినీ సూర్యలను ప్రస్తావించారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రాబోతోన్న ఎన్జీకే చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అది నిజం కావాలి
‘‘నేను షూటింగ్ లొకేషన్‌కి వెళ్లే రోజు ఓ కొత్త ఎగై్జట్‌మెంట్ ఉండాలి. రెగ్యులర్‌గా కాకుండా నేనేదో కొత్తగా చేస్తున్నాను అనే ఫీల్ కలగాలి. అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను’’ అని రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన తమిళ చిత్రం ‘ఎన్జీకే’ (నందగోపాలకృష్ణ). ఎస్ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కేకే రాధామోహన్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్ సింగ్ చెప్పిన విశేషాలు. ► పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఇది. వానతి అనే ఇండిపెండెంట్, పవర్ ఉమెన్ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంతవరకు చేయలేదు. సూర్య మంచి కో–స్టార్. మంచి ప్రతిభాశాలి. సాయిపల్లవి టాలెంటెడ్ యాక్టర్. హీరో క్యారెక్టర్ పాలిటిక్స్‌లోకి వస్తున్నప్పుడు హీరోయిన్లుగా నేను, పల్లవి ఏం చేశామన్నది కథలో కీలకం. ► చాలా సినిమాలు చేసిన తర్వాత సెట్లో ఓ ధోరణికి అలవాటు పడిపోతాం. కానీ సెల్వసార్ సెట్లో అలా ఉండదు. ఒకవేళ మనం ఏదైనా హోమ్‌వర్క్ చేసి ఓ మైండ్ సెట్‌తో సెట్లోకి వెళితే అంతా క్యాన్సిల్. అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే హోమ్‌వర్క్ అంతా సెల్వసార్ చేసేస్తారు. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ పట్ల ఆయన ఫుల్ క్లారిటీగా ఉంటారు. మల్టీఫుల్ థింగ్స్‌ని బ్రెయిన్లో పెట్టుకుని యాక్ట్ చేయాలి. సెల్వసార్‌తో వర్క్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్. యాక్ట ర్గా మరింత ఇంప్రూవ్ కావొచ్చు. ► ప్రస్తుతం ఇండియాలో అందరూ పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా మనం దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్బీఏ, ఇంజినీరింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు మనకు. పాలిటిక్స్‌లో జాయిన్ అవ్వడానికి ఒక ప్రత్యేకమైన విధానం అంటూ ఏం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుంది? అనే విష యాలను నేటి యువత ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు. కామన్‌పీపుల్, చదువుకున్నవారు రాజకీయాలను ఎంచుకోవడం మంచిదే. చదువుకున్నవారి సంఖ్య పెరిగితే దేశంలోని సగం సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నది ► ఈ ఏడాదిలో నావి దాదాపు అరడజను సినిమాలు రీలీజ్ అవుతాయి. వీటి షూటింగ్‌కి ఎక్కువ టైమ్ పట్టింది. ‘దే దే ప్యార్ దే’ సినిమాకు దాదాపు ఏడు నెలల సమయం పట్టింది. అంత టైమ్ తీసుకున్నాం కాబట్టే ఆ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. బాలీవుడ్లో రకుల్‌కు మంచి భవిష్యత్ ఉందని అజయ్ దేవగణ్ అన్నారంటే చాలా సంతోషంగా ఉంది. అది నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తమిళంలో 3 సినిమాలు చేశాను. ► సినిమా అంతా ఒక హీరోయిన్ ఉంటేనే ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కాదు. ‘రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, దే దే ప్యార్ దే’ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ► బయోపిక్ చాన్స్ వస్తే నేను తప్పకుండా చేస్తాను. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించాలనుకున్నాను. కాస్టింగ్ అయిపోయింది. కొత్త కాన్సెప్ట్ ఉన్న వెబ్ సీరిస్‌లో నటించడానికి రెడీ. ► ప్రస్తుతం నాగార్జునగారి ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్నాను. హిందీలో చేసిన ‘మర్జవాన్’ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది. -
రైనా ప్రశ్నకు సూర్య రిప్లై
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఎన్జీకే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ట్వీటర్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు సూర్య. అయితే అనూహ్యం భారత క్రికెటర్ సురేష్ రైనా, సూర్యని ట్విటర్ ద్వారా ఓ ప్రశ్నించాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీంలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు అంటూ ప్రశ్నించాడు రైనా. అయితే ఈ ట్వీట్ స్పందించిన సూర్య ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘మీరు, ధోని అంటే ఇష్టం. మంచి గాయకుడు సురేష్ రైనా.. గొప్ప చిత్రకారుడిగా ధోని అంటే ఇష్టం.ఎప్పటికీ సీఎస్కే ఫ్యాన్’ అంటూ రిప్లై ఇచ్చాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్జీకే మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య సరసన సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Obviously it’s you and @msdhoni @ImRaina for the singing skills and @msdhoni for his drawing skill 😜 #CSK fan forever!! https://t.co/jnMv5KwjUR — Suriya Sivakumar (@Suriya_offl) 20 May 2019 -
గోపాలకృష్ణ రైట్స్ రాధాకి
నంద గోపాలకృష్ణ 31న రాబోతున్నాడు. తీసుకొస్తున్నది ఎవరో తెలుసా? కేకే రాధామోహన్. నంద గోపాలకృష్ణ అంటే హీరో సూర్య పేరు. ‘7/జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఎన్.జి.కె’. అంటే నంద గోపాలకృష్ణ అని అర్థం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ సొంతం చేసుకున్నారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాతలు:ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు. -
చిన్నోడైనా వాడినే పెళ్లి చేసుకుంటా!
చెన్నై : సెలబ్రిటీలు ఏం మాట్లాడినా వార్తే అవుతుంది. ఈ ఉత్తరాది భామ రకుల్‌ప్రీత్‌సింగ్ అందుకు అతీతం కాదు. కోలీవుడ్‌కు కోటి ఆశలతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి మొదట్లో ఇక్కడ చుక్కెదురైంది. అయితే అనుకోకుండా టాలీవుడ్ రకుల్‌ను ఆదుకుంది. అక్కడ వరుసగా అవకాశాలు రావడం, అందులో కొన్ని చిత్రాలు సక్సెస్ అవుడంతో రకుల్ మంచి మార్కెట్‌నే అందుకుంది. అయితే ఈమె జోరు అక్కడా ఎక్కువ కాలం సాగలేదు. ఇటీవల కొన్ని బిగ్ ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ఇక కోలీవుడ్‌లో ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం ఈ అమ్మడికి సక్సెస్ రుచి చూపించినా, ఆ తరువాత ఆ చిత్ర కథానాయకుడు కార్తీతోనే నటించిన దేవ్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ప్రస్తుతం నటుడు సూర్యతో రొమాన్స్ చేసిన ఎన్జీకే చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం 31న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది కాకుండా శివకార్తికేయన్‌తో ఒక చిత్రంలో రకుల్ రొమాన్స్ చేస్తోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ తాను మొదట్లో చాలా తప్పులు చేశానని చెప్పింది. అయితే అందుకు తానేమీ బాధ పడడంలేదని అంది. కారణం చేసిన తప్పులను పాఠంగా తీసుకుంటే జీవితంలో ఎదగగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విజయాల విలువ తెలియాలంటే అపజయాలను ఎదుర్కోవాలని అంది. నటి కావాలని ఎంతో మంది ఆశ పడుతుంటారని, అలాంటి అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని అంది. ఇకపోతే పెళ్లి గురించి అడుగుతున్నారని, ప్రేమలో పడడానికి తానూ ఎదురు చూస్తున్నానని చెప్పింది. నచ్చిన వాడు తారసపడితే వెంటనే ప్రేమించి పెళ్లాడేస్తానని తెలి పింది. కాబోయే జీవిత భాగస్వామి ఎలాంటి వాడై ఉండాలన్న ప్రశ్నకు, ప్రేమకు వయసుతో పని లేదని అతగాడు వయసులో చిన్నవాడా, పెద్దవాడా అన్నది చూడనని, నచ్చితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా ఇదే రకుల్‌ప్రీత్‌సింగ్ ఇంతకు ముందు తనను పెళ్లాడే వాడు ఆరడుగుల అందగాడై ఉండాలని పేర్కొందన్నది గమనార్హం. ఇకపోతే ఈ జాణ ఆరడుగుల పొడుగైన ఒక టాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయన్నది గమనార్హం. -
సాయి పల్లవిని ఓదార్చిన సూర్య
ప్రేమం చిత్రంతో ప్రారంభమై మారి– 2లో రౌడీ బేబి పాట వరకు అదరగొట్టే డ్యాన్స్‌తో చురుకైన నటన ప్రదర్శించారు నటి సాయి పల్లవి. ప్రస్తుతం ఎన్జీకే చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్నారు. చిత్రం ట్రైలర్ రిలీజ్‌కు వచ్చిన సాయిపల్లవి మాట్లాడుతూ తాను సూర్య అభిమానినన్నారు. చిత్రం షూటింగ్లో ఆయన కఠిన శ్రమను నేరుగా చూశానన్నారు. తాను చిత్రాల్లో నటించే సమయంలో ఇంట్లోనే హోం వర్కు చేసి సిద్ధంగా వెళతానన్నారు. ఎన్జీకే చిత్రానికి హోంవర్కు చేయకుండా రమ్మన్నారని, దీంతో చిత్రం షూటింగ్లో పది టేకులు, ఇరవై టేకులు, అంతకు పైగా టేకులు తీసుకున్నట్లు తెలిపారు. ఒక దశలో తాను నటించగలనా? అనే అనుమానం రావడంతో తన వల్ల చిత్రం షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు భావించానన్నారు. నటుడు సూర్య మాట్లాడుతూ సాయి పల్లవి చక్కని నటి అనడంలో సందేహం లేదని ప్రశంసించారు. కొన్నిసార్లు సీన్ ముగించుకుని వెళ్లే సాయి పల్లవి కన్నీరు పెట్టున్నారు. తన వల్లే ఇంతగా టేకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసి బాధపడ్డారని, దీంతో ఆమెను సముదాయించాల్సి వచ్చిందన్నారు. సీన్లో చక్కగా నటించిన తర్వాత డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత కూడా అంతటితో తృప్తి చెందని సాయి పల్లవి బాధగా ఉండడం నటనపై ఆమెకున్న అంకితభావాన్ని తెలియజేస్తుందన్నారు. -
‘ఎన్.జి.కె’ ఆడియో రిలీజ్
-
విద్యార్థినిగా ఫీలయ్యా!
సినిమా: దర్శకుడు సెల్వరాఘవన్‌కు నటుడు సూర్య ఒక విజ్ఞప్తి చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం ఎన్జీకే. నటి సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్ ఫిలింస్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్ నిర్మించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ ఎన్జీకే చిత్రం మే 31న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్ధినిలా.. ఇందులో పాల్గొన్న నటి సాయిపల్లవి మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే ఒక పాఠశాల విద్యార్థినిలా ఫీలయ్యానని అన్నారు. తాను ఎప్పుడూ షూటింగ్‌కు వెళ్లే ముందు తనను తాను తయారు చేసుకుంటానన్నారు. అయితే ఈ చిత్రానికి అలాంటి అవసరం లేదని భావించానన్నారు. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనే ముందు పెద్దగా తెలుసుకునేదేముంటుందిలే అని అనుకున్నానని అయితే దర్శకుడు సెల్వరాఘవన్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఒక్కో నటి, నటుడులోని ప్రతిభను వెలికి తీయడంలో సెల్వరాఘవన్ దిట్ట అని అన్నారు. సూర్యతో నటించి ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని సాయిపల్లవి పేర్కొన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వం అంటే ఇష్టం కాగా చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ రాజకీయం రక్తం చిందని యుద్ధం, యుద్ధం రక్తం చిందే రాజకీయం అని పేర్కొన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం ప్రతిరోజూ కొత్త చిత్రంలో నటించడానికి వెళుతున్నట్లు అనిపించిందన్నారు. నిన్న జరిగిన షూటింగ్‌కు ఇవాళ కొనసాగింపు ఉండదన్నారు. సమయం ముగిసినా ఆయన పని చేస్తూనే ఉంటానని అన్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వం, ఆయన రచన అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. ఆయన దర్శకత్వంలో మనస్ఫూర్తిగా నటించానని సూర్య అన్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం అంటేనే తనకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆయన సంగీతం కాలాన్ని జయిస్తుందని అన్నారు. నటి సాయిపల్లవి ప్రతి సన్నివేశం పూర్తి అయిన తరువాత బాగా నటించానా అని అడుగుతూ చాలా అంకితభావంతో నటించారని చెప్పారు. ఇందులో నటించిన అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారని తెలిపారు. షూటింగ్లో జాప్యం జరిగినా చిత్ర నిర్మాత ఎస్ఆర్.ప్రభు చిత్రానికి ఏమేం కావాలో అన్నీ సరైన సమయానికి సమకూర్చారని సూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సెల్వరాఘవన్, సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా నటుడు శివకుమార్ పాల్గొన్నారు.