nuziveedu
-
కొత్త గ్రూపులకు ‘సారథి’!
నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దరబోయిన ఫొటోల తొలగింపు నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం. ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్‌గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
మీరిచ్చిందే.. మీ బిడ్డ ధైర్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీ బిడ్డ ఎవరికీ భయపడడు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోడు. మీ బిడ్డ పొత్తు ప్రజలతోనే. ఎన్నికలు సమీపిస్తుండటంతో గజదొంగల ముఠా, దత్తపుత్రుడు అంతా ఏకమై ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ సీఎం చంద్రబాబు ఏనాడూ ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రాలేదని, వంచనతోనే పదవి దక్కించుకున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఆ అన్యాయాలను గుర్తు తెచ్చుకోండి.. గత ముఖ్యమంత్రి (చంద్రబాబు నాయుడు) మాదిరిగా తన వర్గం, తన వాళ్లు, గజదొంగల ముఠా, దత్తపుత్రుడి కోసం ప్రజలందరి ప్రయోజనాలను తాకట్టు పెడితే సామాజిక అన్యాయం జరుగుతుంది. గజదొంగల ముఠా, జన్మభూమి కమిటీల కోసం దోచుకోవాలని భావించే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చుంటే ఏం న్యాయం చేస్తాడో మనమంతా చూశాం. రైతులు, అక్క చెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఎంత అన్యాయం చేశాడో చూశాం. 2014 నుంచి 2019 వరకు ఆ ఐదేళ్లలో ప్రత్యక్ష సాక్షులుగా అవన్నీ గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. ప్రాంతాలకు, సమాజంలో మనుషులకు అన్యాయం చేసిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు గురించి మరో రెండు మాటలు కూడా చెబుతా. చంద్రబాబు ఎన్నడూ ప్రజలకు మంచి చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదు. ఆయన తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో లేక చేసిన మంచి పనుల వల్లనో ఏనాడూ సీఎం కాలేదు. ఆ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కూతుర్ని ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి మొట్టమొదటిసారి సీఎం అయ్యాడు. రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యమా అని సీఎం అయ్యాడు. రైతన్నలకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని, జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 2014లో మూడోసారి సీఎం అయ్యాడు. ఆ తర్వాత రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలను కూడా వదలకుండా ఎంత మోసం చేశాడో చూసిన ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు గూబ గుయ్‌మనిపించేలా 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు. అలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్మగలరా? మిగతా సామాజిక వర్గాలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఆయన పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నా. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..? అని ఆయన అన్న మాటలను గుర్తు తెచ్చుకోండి. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అంటూ బెదిరించిన వైనాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇదే పెద్దమనిషికి అక్క చెల్లెమ్మల మీద ఉన్న చులకన భావనను కూడా గుర్తు తెచ్చుకోండి. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా..? అంటూ చులకనగా వ్యాఖ్యానించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అసలు సమాజం మీద ప్రేమ గానీ రైతుల పట్ల గౌరవం గానీ అక్కచెల్లెమ్మల సాధికారత, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కమిట్మెంట్ గానీ లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు? ఎప్పుడైనా మేలు చేశాడా? ఇలాంటి వారిని అసలు నమ్మగలరా? విజ్ఞతతో ఆలోచించండి.. రాబోయే రోజుల్లో ఆయన అబద్ధాలు, మోసాలు ఎక్కువ అవుతాయి. ఆయనకు తోడు గజదొంగల ముఠా! ఆ ముఠాకు తోడు దత్త పుత్రుడు ఏకమవుతారు. వీరందరూ కలసి ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తారు. ప్రతి ఇంటికీ బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తామంటారు. వాటిని విని మోసపోకండి. ఆ అబద్ధాలను నమ్మకండి. గతంలో ఇదే పెద్ద మనుషులిద్దరూ కలిసి వచ్చి 2014లో ఏం చెప్పారు? వాటిని అమలు చేశారా లేదా? అని ఆలోచించి విజ్ఞతతో అడుగులు ముందుకు వేయాలి. తోడేళ్లంతా ఏకమైనా.. ఒంటరిగానే సింహం వీళ్ల మాదిరిగా నాకు అబద్ధాలు చెప్పడం చేతకాదు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు కుట్రలు, కుతంత్రాలు చేయడం తెలియదు. మీ బిడ్డ మోసం చేయడు, అబద్ధాలు ఆడడు. ఇది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. మీ బిడ్డకు వారి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి సపోర్టు లేదు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అని మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు.. మీ బిడ్డ పొత్తు కేవలం మీతోనే ఉంటుంది. తోడేళ్లు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒంటరిగానే నడుచుకుంటూ వస్తుంది. మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ ధైర్యం మీ దగ్గర నుంచే వచ్చింది. నేను దేవుడిని నమ్ముతా. మీ ఆశీస్సుల మీద ఆధారపడతా. ఇవే మీ బిడ్డకు ధైర్యాన్ని ఇస్తాయి. సీఎం సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు మిథున్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్, కృష్ణా, ఏలూరు జిల్లాల ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, సామినేని ఉదయభాను, జెడ్పీ చైర్పర్సన్లు ఘంటా పద్మశ్రీ, ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. నూజివీడులో పల్ప్ యూనిట్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు కోరినట్లుగా 16 వార్డు సచివాలయాల పరిధిలో పనులకు ఒక్కో సచివాలయానికి రూ.కోటి చొప్పున రూ.16 కోట్లు కేటాయిస్తున్నాం. రూ.275 కోట్లతో మ్యాంగో పల్ప్ యూనిట్, ప్రాసెసింగ్ ప్లాంట్‌కు త్వరలో పునాది రాయి వేయబోతున్నాం. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. -
నూజివీడులో మామిడి పౌడర్ యూనిట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్‌పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. మార్కెట్ యార్డ్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్‌లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్‌ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిటŒæ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు -
ప్రచార పిచ్చితో ప్రాణాలు తీస్తున్నారు
-
చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశృతి
-
శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి..
సాక్షి, నూజివీడు (పశ్చిమగోదావరి): శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపంతో ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని స్టేషన్‌తోటకు చెందిన రాణిమేకల రాణి(20) ఇంటర్ వరకు చదివింది. అదే ఏరియాకు చెందిన డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కొండా ప్రదీప్‌కుమార్, రాణి ఆరునెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రెండు నెలల క్రితం వారి ఇళ్లల్లో తెలిసి వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరు సైతం మాట్లాడుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఆగస్టు మొదటి వారంలో ప్రదీప్ మళ్లీ రాణితో మాటలు కలిపి ఇద్దరం శారీరకంగా ఒక్కటైతే పెద్దలు కచ్ఛితంగా పెళ్లికి అంగీకరిస్తారని చెప్పి నమ్మించాడు. 10వ తేదీన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా ఒక్కటయ్యారు. మరుసటి రోజు నుంచి ప్రదీప్ యువతితో మాట్లాడటం మానేశాడు. మహిళ భయంతో 27న తన తల్లి మంజులకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె పెద్దలతో చెప్పగా, వారు ప్రదీప్, అతని తల్లిని వివాహం చేసుకోవాలని అడగగా నిరాకరించారు. దీంతో 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాణి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని తల్లికి చెప్పగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష) -
వారం రోజుల పాటు ‘అమృత భూమి’ చిత్రం ఉచిత ప్రదర్శన
ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘అమృత భూమి’. కె.బి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీ.శే. వంగపండు ప్రసాదరావు కథ, పాటలు అందించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కీలక పాత్రలో నటించారు. రసాయన వ్యవసాయం వల్ల భూములు నిస్సరమ అయిపోవటమే కాకుండా.. ప్రకృతి వనరులు, మనం తినే ఆహారం కూడా రసాయనాలు మయం అవుతోంది. అందుకే మనందరం - రైతులైనా, వినియోగదారులు అయినా - ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఆరోగ్యంగా జీవించాలంటే అమృతాహారం ఆవశ్యకతను గుర్తెరగాలి.. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని తెలిసేలా ప్రచారం చేయాలి. ఈ ఉదాత్తమైన అద్భుత సందేశాన్ని అత్యంత సృజనాత్మకంగా వెండి తెర పైకి ఎక్కించిన ఘనత ప్రముఖ స్వచ్ఛంద సేవకులు, ‘అమృతభూమి’ చిత్ర నిర్మాత పారినాయుడుకే దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ శాఖకు అనుబంధ సంస్థ రైతు సాధికార సంస్థ తోడ్పాటుతో ఈ చలన చిత్రాన్ని హృద్యంగా నిర్మించారు. పిల్లలు, పెద్దలు, రైతులు.. అందరూ చూడదగిన ఈ చిత్రాన్ని నూజివీడుకు చెందిన వ్యాపారవేత్త, మూల్పూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు లక్ష్మణ స్వామి నూజివీడు(కృష్ణా జిల్లా) ప్రాంత ప్రజలకు వారం రోజుల పాటు ఉచితంగా చూపించాలని సంకల్పించారు. ఇప్పుడు 7 రోజులూ .. రోజూ 4షోలకు మార్చారు. ఆగష్టు 5 నుంచి 11తేదీ వరకు రోజూ 4 ఆటలు.. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు, మాట్నీ 2 గంటలకు, ఫస్ట్ షో సాయంత్రం 6 గంటలకు, సెకండ్ షో రాత్రి 9 గంటలకు ఉచితంగా సత్యనారాయణ మినీ థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఈ ఖర్చంతా లక్ష్మణ స్వామి భరిస్తున్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ప్రకృతి సేద్యం, ప్రకృతి ఆహారం తక్షణ ఆవశ్యకతను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రాణం తీసిన వెయ్యి రూపాయల వివాదం
నూజివీడు: తనకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలను ఇవ్వమన్నందుకు వ్యక్తిని హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాద్రిపురానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు (45) మండలంలోని రావిచర్లలో ఉన్న సిమెంట్ ఇటుక రాళ్ల కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద అవసరమై 200 సిమెంట్ రాళ్లను గతంలో తెచ్చుకొని ఉంచాడు. వాటిలో 50 రాళ్లను అదే గ్రామానికి చెందిన కూచిపూడి రంగా (30) అనే వ్యక్తి రెండు నెలల క్రితం తీసుకెళ్లాడు. వాటికి సంబంధించి వెయ్యి రూపాయలు ఇవ్వాలని, లేదంటే సిమెంట్ రాళ్లనైనా తిరిగి ఇచ్చేయమని శ్రీనివాసరావు అతనిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం సాయంత్రం కూడా ఇదే విషయమై వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రంగా సమీపంలో ఉన్న కర్రతో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును స్థానికులు హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఊహించని ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం కలిగించింది. రూరల్ ఎస్ఐ ఎం.లక్ష్మణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ భవితకు దివిటీ
ప్రతిభ గల పేద విద్యార్థులకు ఇంటర్మీడియెట్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఉచిత విద్యనందించే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కళాశాలలను ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో చదువు పూర్తిచేసుకుని బయటికి వచ్చిన విద్యార్థులు మెరుగైన ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు అందుకుంటున్నారు. పలువురు విదేశాల్లో చదువులు, కొలువులకు సైతం వెళ్తుండగా, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టి స్థిరపడినవారూ ఉన్నారు. – నూజివీడు ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఉన్నత సాంకేతిక విద్యను అందిస్తూ నూజివీడు ట్రిపుల్ఐటీ పేద విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది. ఆరేళ్లపాటు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా చదువుకుంటున్న విద్యార్థులు క్యాంపస్ సెలెక్షన్స్‌లో సత్తాచాతున్నారు. ఏటా 350 నుంచి 500 మందికి పైగా వి ద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏడాదికి రూ.7.60 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ప్యాకేజీలకు ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ కొలువులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు, విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇస్రోలో సైంటిస్టులుగా, రైల్వేలో ఉన్నతోద్యోగులుగా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శా ఖల్లో ఇంజినీర్లుగా, బ్యాంకు, సచివాలయ ఉద్యోగులుగా ట్రిపుల్ఐటీ విద్యార్థులు పనిచేస్తున్నారు. సీడీపీసీ ప్రముఖ పాత్ర : విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంలో కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ (సీడీపీసీ) ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం నుంచే విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం, కంపెనీల అవ సరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను అన్నిరకాలు గా తీర్చిదిద్దేలా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. కంపెనీల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతూ వారిని ప్లేస్మెంట్లకు వచ్చేలా చేస్తున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, టెక్‌మహీంద్ర, క్యాప్‌జెమినీ, ఎఫ్ట్రానిక్స్, ఫ్రెష్‌డెస్క్, థాట్‌వర్క్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, ఐబీఎం, సినోప్సిస్, ఇంటెల్ తదితర 80 కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయి. 3,856 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు ట్రిపుల్‌ఐటీలో ఇప్పటివరకూ 8 బ్యాచ్‌లు కోర్సును పూర్తిచేసుకుని వెళ్లగా వీరిలో 3,856 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చాయి. మరికొందరు గేట్లో ర్యాంకులు సాధించి ఎంటెక్ చదువుతున్నారు. ఈ ఏ డాదిలో ఇప్పటివరకూ 768 మందికి ఉద్యోగాలు రాగా అన్‌లాగ్ డివైస్ కంపెనీ ఏడాదికి రూ.20 లక్షల జీతంతో నలుగురిని, గప్‌చుప్ టెక్నాలజీస్ రూ.15 లక్షల వేతనంతో ఇద్దరిని, జస్పే సంస్థ రూ.27 లక్ష ల వేతనంతో ఒక విద్యార్థిని ఎంపిక చేసుకున్నాయి. వైఎస్సార్ వెలుగులు నింపారు ట్రిపుల్ఐటీ స్థాపించి దివంగత వైఎస్సార్ నా జీవితంలో వెలుగులు నింపారు. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ బ్రాంచితో ఇంజినీరింగ్ పూర్తిచేశా. తర్వాత మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదివా. ఏడాదిన్నర పాటు దక్షిణ మధ్య రైల్వేలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశా. ప్రస్తుతం ఇస్రో ప్రధాన కార్యాలయం (బెంగళూరు)లో సైంటిస్టు–సీగా పనిచేస్తున్నా. –గుత్తా వెంకట శేషారావు, ఇస్రో సైంటిస్ట్ -
ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు..
సాక్షి, గొల్లపల్లి(నూజివీడు) కృష్ణా: పెళ్లిచేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు తనను గర్భవతిని చేసి, ఆ తర్వాత మోసం చేశాడని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి తన ఏడునెలల కుమారుడితో మండలంలోని గొల్లపల్లి సచివాలయం వద్ద సోమవారం బైఠాయించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా.. తనకేమీ న్యాయం చేయట్లేదని వాపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తూర్పు దిగవల్లికి చెందిన మిసమెట్ల వెంకటేశ్వరమ్మ(19)కు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో గ్రామంలోని ఆమె బంధువుల వద్ద ఉండి మూడేళ్ల క్రితం గొల్లపల్లిలోని ఆమె పెద్దమ్మ సాయల రాములమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. కూలిపనులకు వెళ్తున్న సమయంలో గొల్లపల్లికి చెందిన తటకలూరి విష్ణుబాబు(20) అనే యువకుడు ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడేవాడు. రోజూ వెంట పడటంతో వెంకటేశ్వరమ్మ సైతం అతనితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ ఒక్కటయ్యారు. దీంతో వెంకటేశ్వరమ్మ గర్భవతి అయ్యింది. ఈ నేపథ్యంలో గతేడాది సర్పంచి ఎన్నికలకు ముందు స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు సైతం చేసింది. చదవండి: (ఒకరు బీటెక్.. మరొకరు బీఎస్సీ.. ఏ కష్టమొచ్చిందో.!) అయితే ఈ పంచాయతీ గ్రామంలోని పెద్దల వద్దకు వెళ్లగా, వారి ముందు పెళ్లి చేసుకుంటామని ఒప్పుకొని ఆ తరువాత యువకుడితో పాటు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేశారు. ఆ తర్వాత యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగినా గ్రామంలో పెద్దలు గాని, పోలీసులు గాని పట్టించుకోకపోవడంతో చివరకు ఏమి చేయాలో తెలియక సచివాలయం వద్ద బైఠాయించింది. ఆమెకు మద్దతుగా సోషల్ వర్కర్ పంతం మార్తమ్మ, బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు రంగు ధనలక్ష్మిలు, గ్రామంలోని పలువురు మహిళలు నిలిచారు. చదవండి: (తల్లి మందలించిందని పారిపోయిన యువతి.. చివరికి ఏమైందంటే..) -
కనురెప్పకు ఏ కష్టమొచ్చిందో..!?
సాక్షి, విజయవాడ: కట్టుకున్నవాడు లేడు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరు.. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... ఇద్దరు ఆడపిల్లలు మరోవైపు.. ఎలా పెంచాలో తెలియదు.. ఏమి చేయాలో అర్థం కాదు.. దీనికి చావు ఒక్కటే పరిష్కారం అనుకుని.. కన్న తల్లే కర్కశంగా తన ఇరువురు ఆడపిల్లలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ఏడేళ్ల చిన్నకుమార్తె మృతిచెందగా, పెద్దకుమార్తె, తల్లి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తిరువూరుకు చెందిన దైద నాగలక్ష్మి(35)కు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్లకు చెందిన తుంగా సురేష్‌తో 10ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కర్ణిక(9), కావ్య(7) కుమార్తెలు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సురేష్ చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో నాగలక్ష్మి నూజివీడు మున్సిపాలిటీలోని గొడుగువారిగూడెంలో అద్దెకుంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏమైందో ఏమో గాని, శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో టిఫిన్ చేసిన తర్వాత ఇరువురు పిల్లలతో గుళికలు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి చుట్టుపక్కల వారు గమనించి ముగ్గురిని 108 లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్న కుమార్తె కావ్య మృతిచెందింది. తల్లి నాగలక్ష్మి, పెద్దకుమార్తె కర్ణికలకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ ఎం. వెంకటనారాయణ ఏరియా ఆస్పత్రికి వచ్చి సంఘటనపై విచారించారు. ఎస్ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నూజివీడు వండర్ కిడ్ తోషిత్‌రామ్
నూజివీడు: రెండున్నరేళ్ల వయస్సులో తన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన కలపాల తోషిత్‌రామ్. రెండున్నరేళ్లు అంటే మాటలుకూడా రాని వయస్సు. కానీ తోషిత్‌రామ్ మాత్రం తన ఐక్యూతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన పోటీల్లో తోషిత్ ఇంగ్లిష్ అక్షరాలను ఏ నుంచి జెడ్ వరకు, తిరిగి రివర్స్ ఆర్డర్లో జెడ్ నుంచి ఏ వరకు కేవలం 22 సెకన్లలోనే టకటకా చెప్పేశాడు. దీంతో యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కిడ్‌గా తోషిత్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. గతంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఈ బాలుడి తండ్రి కలపాల శ్రీరామ్‌ప్రసాద్ టీటీడీలో ఉద్యోగి, తల్లి భవ్యశ్రీ స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి: పది కోళ్లను తిన్న కొండచిలువ ) -
AP: ‘విద్యావిధానంలో చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికం’
సాక్షి, నూజివీడు: మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాలయాల్లో ఉన్న కోర్సులను మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన బుధవారం నూజివీడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులతో ‘ఇంటర్న్ షిప్’ని చేయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. గడిచిన రెండేళ్లలో విద్యావిధానంలో చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ వ్యవస్థను కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేశాయని పేర్కొన్నారు. నూజివీడులో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయెట్ సెంటర్‌ను అటామనస్ ఇనిస్టిట్యూట్‌గా గుర్తించి యూనివర్సిటీతో సంబంధం లేకుండా స్వయం ప్రతిపత్తి హోదాతో అభివృద్ధి చేయాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. -
కృష్ణాజిల్లా: పబ్జీ ఆటలో చెలరేగిన వివాదం
-
పబ్జీ ఆట: రెండు గ్రామాల మధ్య చిచ్చు
సాక్షి, కృష్ణాజిల్లా: పబ్జీ ఆటలో చెలరేగిన వివాదం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పర దాడులకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వివరాలు.. నూజివీడులో కళాశాల నుంచి బస్సులో వెళుతూ కొత్తూరు తండా, సిద్దార్ధనగర్ విద్యార్థులు పబ్జీ ఆడారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి బాహాబాహాకి దిగారు. ఈ గొడవ కాస్తా ముదిరి రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. ఇందులో పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో గ్రామస్తులు కర్రలు ,రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా చైనీస్ పబ్జీ గేమ్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. చదవండి: ‘డబ్బు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతాం’ -
కూతుర్ని అమ్మేసి, తల్లిపై హత్యాయత్నం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకొంది. భార్య కళ్లుగప్పి ఓ భర్త కన్న కూతురిని అమ్మేశాడు. వివరాలు.. నవీన్‌బాబు అనే వ్యక్తి ఆడపిల్లలు పుడుతున్నారని తన తల్లిదండ్రులతో కలిసి భార్య రజనీని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈక్రమంలోనే మరోసారి తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన నవీన్‌బాబు నాలుగో కూతురిని లక్షా 50 వేల రూపాయలకు అమ్మేశాడు. అయితే, డబ్బుల పంపిణీలో నవీన్‌బాబుకు అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరగటంతో విషయం బయటపడింది. గాయాల నుంచి కోలుకున్న రజనీ తన బిడ్డ ఎక్కడనీ భర్త, అత్తమామలను నిలదీసింది. దీంతో వారంతా కలిసి మరోసారి రజనీపై దాడి చేసి హత్యాయత్నం చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న రజనీ తన తల్లి దండ్రులతో కలిసి బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, న్యాయం చేస్తాడనుకున్న ముసునూరు ఎస్ఐ మరోలా చేశాడు. బిడ్డను కొన్న దంపతులను స్టేషన్‌కి పిలిపించి తల్లి రజనీతో ఫొటోలు తీయించి తిరిగి వారికే అప్పగించాడు. ఎస్ఐ తీరుపై రజనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన బిడ్డను ఇప్పించాలని బాధితురాలు నూజివీడు ఎమ్మెల్యేని ఆశ్రయించింది. (చదవండి: నకిలీ పోలీసుల గుట్టురట్టు) -
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
-
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
సాక్షి, కృష్ణా: నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో బుధవారం ఘరానా మోసం బట్టబయలైంది. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ కోట్ల రూపాయలను ఖాచేసి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. రూ. 1,56,56,897 కోట్ల ఖాతాదారుల నగదును బ్యాంక్ నుంచి కాచేసి చేతి వాటం చూపించాడు. దీనిపై బ్యాంక్ చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ.. రవీతేజ 2017లో నుంచి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడని చెప్పాడు. కాగా ఖాతాదారుల నగదును, ఫిక్సిడ్ డిపాజిట్లను తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నట్లు క్యాష్ తనిఖీలో వెల్లడైందని ఆయన తెలిపారు. వెంటనే నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా రవీతేజకు ఆన్లైన్లో రమ్మీ, కాసినో ఆటలకు అలవాడు పడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణతో తెలింది. బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రవీతేజపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నూజివీడు టు లండన్
సాక్షి, అమరావతి బ్యూరో: నూజివీడు మామిడి తొలిసారిగా లండన్ పయనమైంది. 16 టన్నుల నాణ్యమైన బంగినపల్లి మామిడి పండ్లను శనివారం వేకువజామున నూజివీడు నుంచి కంటైనర్‌లో విశాఖ పోర్టుకు చేర్చారు. అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా నౌకలో లండన్ చేరుకుంటాయి. కృష్ణా జిల్లా నూజివీడుతో పాటు ప్రకాశం జిల్లా ఉలవపాడు ఏరియాలో పండిన బంగినపల్లి మామిడిని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎపెడా) ద్వారా విజయనగరానికి చెందిన ఓ ఎగుమతి దారు కొనుగోలు చేశారు. ఈ మామిడిని నూజివీడు లోని ఇంటిగ్రెటెడ్ ప్యాక్ హౌస్‌లో గ్రేడింగ్ చేశారు. నాణ్యతకు అవసరమైన ప్రక్రియను అక్కడ ఉన్న వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో పూర్తయ్యాక 5 కిలోల చొప్పున అట్టపెట్టెల్లో వీటిని ప్యాక్ చేసి కంటైనర్‌లో పేర్చారు. ఏసీ కంటైనర్ ద్వారా.. మామిడి పండ్లను రైతులు, ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో శనివారం వేకువజామున కంటైనర్‌లో విశాఖపట్నం పోర్టుకు పంపారు. అక్కడ నుంచి నౌకలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ కంటైనర్‌లో లండన్‌కు పంపుతారు. విశాఖపట్నం నుంచి లండన్‌కు నౌక చేరుకోవడానికి 28 రోజుల సమయం పడుతుంది. 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచడడం వల్ల మామిడి పాడవదు. ఇన్ని రోజులు సరకు పాడవకుండా ఉండేందుకు ప్యాక్ హౌస్‌లో ముందుగానే పెస్టిసైడ్ ట్రీట్మెంట్ కూడా చేశారు. 16 టన్నుల మామిడిని విశాఖ నుంచి లండన్ చేరవేసేందుకు నౌక యాజమాన్యం 2,500 డాలర్లు వసూలు చేస్తోంది. -
బాలికలతో బాడీ మాసాజ్.. టీవీ యాంకర్‌పై కేసు
సాక్షి, కృష్ణా : ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్‌పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు. శిశు సంక్షేమ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. దీనిలో భాగంగానే నగరంలోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికల్ని పనికి కుదిర్చింది. అయితే సెలవులు ముగిసినప్పటికీ.. బాలికలు చైల్డ్ కేర్‌కి తిరిగిరాకపోవడంతో సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. అనంతరం బాలికల మిస్సింగ్‌పై దర్యాప్తు చేయగా.. హైదరాబాద్‌లో టీవీ యాంకర్ ఇంట్లో వెట్టిచాకరి చేస్తున్నట్టు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల్ని కమిటీ సభ్యులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఇంటి పనితో పాటు బాడీ మసాజ్ లాంటి పనులను సైతం వారితో చేయించుకుంటున్నట్లు బాలికలు తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేశారు. మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరంమని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లల్ని తన ఇంట్లో పనికి పెట్టుకుని.. వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సీడబ్ల్యూసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మైనర్ బాలికపై లైంగికదాడి; 24 గంటల్లో నిందితుడు అరెస్టు
సాక్షి, కృష్ణా : నూజివీడు పట్టణంలో బుధవారం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రవీంద్రబాబు నిందితుడిని పట్టుకునేందుకు ఓ ఐపీఎస్ అధికారితోపాటు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం నిందితుడు వెంకటేశ్వర రావును అతని ఇంటి వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని గాంధీనగర్ నివాసి అని, హోటల్లో సప్లైయర్‌గా పనిచేస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును చేధించిన రూరల్ ఎస్ఐ రంజిత్, ఇద్దరు కానిస్టేబుళ్లకు డీఎస్పీ శ్రీనివాసులు అవార్డులు అందజేశారు. (అర్థరాత్రి బాలికపై అత్యాచారం) మరోవైపు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దిశ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం నూజివీడులో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను పరామర్శించారు. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడికట్టిన వ్యక్తిని దిశ చట్టం కింద శిక్షిస్తామన్నారు. ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నేర నియంత్రణను ప్రతి ఒక్కరు తమ వంతు సామాజిక బాధ్యతగా తీసుకొని పోలీసులకు సహకరించాలని సూచించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. -
ఆమె పేరు చెబితే కార్యదర్శులకు హడల్
సాక్షి, నూజివీడు : అధికారులు అవినీతికి దూరంగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం పదేపదే చెప్తున్నా, అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. నూజివీడు నియోజకవర్గంలోని ఓ మండలంలో అధికారి పేరు చెబితే పంచాయతీ కార్యదర్శులు హడలెత్తుతున్నారు. ప్రతి విషయంలోనూ డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తుండడంతో వారంతా సెలవుపై వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తన ఇంట్లో పూజలు నుంచి మనవరాలి పుట్టినరోజు వరకు, వినాయక చవితి నుంచి దీపావళి వరకు ఏ పండుగ వచ్చినా ఒత్తిడి చేసీ మరీ సెక్రటరీల నుంచి వేలకువేలు గుంజుతున్నట్లు తెలిసింది. దసరా పర్వదినానికి చీర కొనిపెట్టమని కార్యదర్శులను ఒత్తిడి చేయడంతో రూ.5వేలు సమరి్పంచుకున్నట్లు సమాచారం. వినాయకచవితికి పూజా కార్యక్రమాలకు, దీపావళికి బాణసంచా కూడా కార్యదర్శులే కొని ఇచ్చినట్లు సమాచారం. ఆమె తనకు కావాల్సిన గృహోపకరణాలను సైతం కార్యదర్శులను పీడించి మరీ వారితో కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం. రూ.30వేలతో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. అందులో రూ.20వేలు ఆమె చెల్లించగా, మిగిలిన రూ.10వేలు ఓ కార్యదర్శి పేరుతో షోరూమ్‌లో అప్పురాయించారు. చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో ఆ కార్యదర్శి రూ.10వేలు షోరూమ్‌లో చెల్లించినట్లు సమాచారం. ఆ అధికారి మనమరాలి జన్మదిన వేడుకలకు కార్యదర్శుల జేబులు ఖాళీ అయ్యాయి. పంచాయతీలలో సొంత డబ్బులు పెట్టి పనులు చేయించి బిల్లులు పెడితే వాటిపై సంతకాలు చేయడానికి చేయి తడపాల్సిందే. వాళ్లూ, వీళ్లు అనే తేడా లేకుండా నిత్యం డబ్బులు గుంచే ఆలోచనలో ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే మండలంలోని మరో అధికారి కూడా పంచాయతీ కార్యదర్శుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోని టేబుల్‌పైన ఒక పంచాయతీ కార్యదర్శి తన బ్యాగ్‌ను ఉంచి పక్కకు వెళ్తే ఆ బ్యాగులోని రూ.2వేలను ఆ అధికారి తీసుకోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి తీరుపై ప్రజాప్రతినిధులలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
నకిలీ పోలీసులు అరెస్టు
సాక్షి, విజయవాడ(నూజివీడు) : పోలీసులమని చెప్పి డబ్బు వసూలు చేసిన నకిలీ పోలీసులను అరెస్టు చేసినట్లు హనుమాన్‌జంక్షన్ సీఐ డి.వి.రమణ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జి.కొండూరు మండలం కందులపాడుకు చెందిన నాగారపు సురేష్‌బాబు, గణేష్ కలసి బత్తులవారిగూడెం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సీతారామపురం గ్రామం చివర పోలీస్ స్టిక్కర్లతో ద్విచక్ర వాహనంపై ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు వెనుకగా వచ్చి ఆపారు. ‘మేము పోలీసులం బైక్ ఆపమంటే ఆపకుండా వస్తున్నావు అని బెదిరించి రూ.5,900 లాక్కోని నూజివీడు వైపు వెళ్లారు. దీనిపై నాగారపు సురేష్‌బాబు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలిపి శనివారం ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్ఐ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శోభనాపురం సమీపంలోని గణపవరం అడ్డరోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా నంబర్ లేని వాహనాన్ని నడుపుతూ అనుమానాస్పదంగా ఉన్న మైలవరం మండలం గణపవరానికి చెందిన బెల్లంకొండ నాగరాజు(33), బెల్లంకొండ వంశీ(19)లను అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు వసూలు చేసినట్లు నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్.ఐ పి.కిషోర్, ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
భరతమాతకు ట్రిపుల్ సెల్యూట్
ఈ ముగ్గురి నేపథ్యం.. అతి సాధారణం. కష్టాలకు ఎదురొడ్డుతూనే ‘పది’లో సత్తా చాటారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించి తమ కలల సాకారం వైపు కదిలారు. ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యం చూపి కొలువులను తమ వద్దకు రప్పించారు. అయితే దేశ రక్షణ కంటే తమ కుటుంబం, ఉద్యోగం ఏవీ ఎక్కువ కాదని భావించి, నెలకు లక్షలు తెచ్చిపెట్టే కొలువులను తృణపాయంగా త్యజించి, భరతమాత సేవలో పునీతులవుతున్నారు.. సాక్షి, నూజివీడు : ముగ్గురూ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే. చదువులో ప్రతిభ చాటి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. భారీ వేతనాలతో కూడిన ఉన్నత ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చినా కాదనుకున్నారు. దేశ రక్షణలో తాము భాగస్వాములు కావాలనే లక్ష్యంతో సైన్యంలో చేరి కెప్టెన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ముగ్గురు వీరులు.. మహాధీరులై భరత మాత సేవలో పునీతులవుతున్నారు. ఆర్మీలో కెప్టెన్లుగా సేవలందిస్తున్న వారి నేపథ్యాన్ని ఓసారి పరికిస్తే.. కూలీ కొడుకు.. ఆర్మీ కెప్టెన్ బర్నాన యాదగిరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని శేఖరపురం. తండ్రి గురవయ్య హైదరాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీ కాగా, తల్లి తులసమ్మ పోలియో వల్ల ఇంటివద్దే ఉంటోంది. యాదగిరి పదో తరగతిలో 94.5 శాతం మార్కులతో ఉత్తీర్ణుడై, 2008 ఫస్ట్బ్యాచ్లో ట్రిపుల్ ఐటీలో చేరాడు. 83.4 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం టెక్ మహేంద్ర సంస్థలో ఉద్యోగంలో చేరినా.. సంతృప్తి చెందక మాతృభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో 2015లో యూపీఎస్సీ నిర్వహించిన సీడీఎస్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ లను పూర్తిచేశాడు. మరోవైపు క్యాట్ పరీక్షలో 93.4 శాతంతో ప్రతిభను చాటి ఐఐఎం ఇండోర్‌లో ప్రవేశం పొంది, దేశ భద్రతా రంగం వైపు అడుగు వేశాడు. 2016 జూలై 8న ఇండియన్ మిలటరీ అకాడమీ శిక్షణలో రాణించి ‘టెక్నికల్ గ్రాడ్యుయేషన్’ కోర్సులో టాపర్‌గా నిలిచి కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు. శివారు ప్రాంతం నుంచి కెప్టెన్‌గా.. చిరుమామిళ్ల సీతారామకృష్ణతేజ స్వగ్రామం విజయనగరం జిల్లా శృంగవరపుకోట. తండ్రి వైన్‌షాపులో గుమస్తా కాగా.. తల్లి నాగమణి మృతి చెందారు. 2008 తొలి బ్యాచ్‌లో ట్రిపుల్ ఐటీలో చేరిన సీతారామకృష్ణతేజ మెకానికల్ ఇంజినీరింగ్‌లో 8.4 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. 17వ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్హత సాధించి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో 2015 జూన్ 23 నాటికి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కమిషన్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని మోడిఫైడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ ర్యాంక్‌లో పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేద కుటుంబాల్లో నుంచి వచ్చి ట్రిపుల్ ఐటీలో ఉత్తమ ప్రతిభతో ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసి.. సైన్యంలో కెప్టెన్లుగా పనిచేస్తున్న యాదగిరి, సురేంద్రనాథ్, కృష్ణతేజలు నేటి విద్యార్థులకు స్ఫూర్తిప్రదాతలు.. ఉన్నతోద్యోగం వదిలి..దేశసేవకు నడుం బిగించి.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నాదెళ్ల సురేంద్రనాథ్ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సురేంద్రనాథ్ తండ్రి వెంకట్రావు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి సాధారణ గృహిణి. 2009–15బ్యాచ్‌కు చెందిన సురేంద్రనాథ్ టీసీఎస్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ కన్సల్టెంట్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో ఉద్యోగాలను వదిలేసి ఆర్మీవైపే అడుగులు వేశాడు. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ పూర్తిచేసి శిక్షణ పొంది భారత సైన్యంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం అసోంలో కౌంటర్ (తిరుగుబాటు) ఆపరేషన్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యాయామ అధ్యాపకుడు నవీన్ అందించిన ప్రోత్సాహంతోనే తాను ఆర్మీలోకి అడుగుపెట్టానని పేర్కొంటున్నాడు. -
నూజివీడులో ఘోరం
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో ఘోరం చోటుచేసుకుంది. జీవితాంతం తోడుండాల్సిన భర్తే, భార్య పాలిట యముడయ్యాడు. స్థానికంగా నివాసం ఉంటున్న వీరయ్య, తన భార్య సత్యవాణీని హత్య చేశాడు. చున్నీతో ఊపిరాడకుండా చేసి చంపాడు. అనంతరం ఆ చున్నీని అత్తమామల ముఖం మీద కొట్టి మీ కూతురిని చంపేశానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లుగా తెలిసింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన వీరయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.