Parishad election results
-
‘పరిషత్’ ఫలితాల్లో ప్రతిబింబించిన ప్రభుత్వ పనితీరు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరు పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వివిధ పథకాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు.. ఇలా అందరి పని తీరు కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. నాడు– నేడు నుంచి మహిళా సాధికారత, రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలన్నీ చక్కటి ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. అన్ని పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్నారని, తద్వారా ఏపీ చరిత్రలోనే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఇలాంటి ఫలితాలను చూసి ఉండరని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆది నుంచి ఇవే ఫలితాలు ► మొదటి నుంచీ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం సీట్లు, పార్లమెంటు స్థానాల్లో 88 శాతం సీట్లు సాధించాం. ఇదే ట్రెండ్ సర్పంచి ఎన్నికల్లోనూ కొనసాగింది. మా పార్టీ మద్దతుదారులు 81 శాతం చోట్ల గెలుపొందారు. ► తర్వాత మునిసిపల్ ఎన్నికల్లోనూ ఇదే కొనసాగింది. 75 మునిసిపాల్టీల్లో 74 చోట్ల అంటే 98 శాతం గెలుపొందాం. కార్పొరేషన్లలో 12కు 12 చోట్ల అంటే 100 శాతం గెలిచాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. 100 శాతం జెడ్పీలు గెలిచాం. ► దేవుడి దయ వల్ల మంచి పనితీరు చూపుతున్నాం. ప్రతి పథకాన్ని ప్రజల ముంగిటకు చేరుస్తున్నాం. వివక్ష, అవినీతి లేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో వారికి ప్రయోజనాలు అందిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగేలా చూడాలి. ► ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్న మీకందరికీ అభినందనలు. మీ పనితీరు ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీరు అక్కడ మంచిగా పని చేస్తే, అది ప్రజల గుండెల్లో ప్రభుత్వ పనితీరు కింద ప్రతిబింబిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ► ఇతరత్రా ఎక్కడైనా అవినీతి ఉంటే ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అక్కడా మంచి వ్యవస్థను, సుపరిపాలనను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతిమంగా దేవుడి దయవల్ల 2024లో కూడా ఇవే ఫలితాలు కొనసాగడమే కాదు.. భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. -
Local Body Election Results: ఓట్ల తేడా 45 శాతం
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజాదరణ పెద్ద ఎత్తున పెరిగిందని పరిషత్ ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే 17.66 శాతం అధికంగా ప్రజాదరణ ముఖ్యమంత్రి జగన్ పట్ల వ్యక్తం కావడం గమనార్హం. సీఎం జగన్ రెండేళ్ల పాలన తర్వాత రాష్ట్రంలో 67.61 శాతం మంది ప్రజల ఆదరణను చూరగొన్నట్లు స్పష్టమైంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 16.38 శాతం మేర ప్రజాదరణను కోల్పోవడం విశేషం. రికార్డు స్థాయి ఓట్లతో ప్రారంభం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో దాదాపు 50 శాతం ఓట్లను దక్కించుకుని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లతో కలిపి గ్రామీణ ప్రాంతానికి చెందిన 1,30,53,282 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 67.61 శాతం ఓట్లను అధికార వైఎస్సార్సీపీ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్ధులు దక్కించుకున్నారు. టీడీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 22.79 శాతం ఓట్లు దక్కాయి. మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్న 1.30 కోట్ల మందికిపైగా ఓటర్లలో వైఎస్సార్సీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 88,25,343 మంది ఓట్లు వేశారు. టీడీపీ అభ్యర్ధులకు 29,75,238 మంది ఓటు వేశారు. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు మిగిలిన ఓట్లు దక్కాయి. ఇంత వ్యత్యాసం అత్యంత అరుదు.. రెండేళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తేడా 45 శాతం ఉండటం రాజకీయాల్లో అత్యంత అరుదైన అంశంగా పలువురు సీనియర్ రాజకీయవేత్తలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో దాదాపు సగం మంది ప్రజలు జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసినట్లుగా భావించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. -
ప్రజాభిమానానికి అధికార ముద్ర
పని చేస్తే ఫలితం దక్కుతుంది; ప్రజలు మెచ్చితే అన్ని కుట్రలూ వీగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వెల్లడైన సరళమైన సత్యం ఇది. స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు జనం బ్రహ్మరథం పట్టడం దాన్నే తెలియజేస్తోంది. ఈ ఎన్నికలు చాలా కారణాల వల్ల చరిత్ర. జరగాల్సినవి జరగక పోవడం, జరగాల్సిన సమయంలో జరగకపోవడం, జరిగినట్టే జరిగి ఆగిపోవడం, జరిగినా వెంటే ఫలితాలు తెలియకపోవడం... ఎన్నికల చరిత్రలో ఇవి చెరిగిపోవాల్సిన పేజీలు. ఇన్ని జరిగినా నాలుగు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనీవినీ ఎరుగని రీతిలో అధికార పార్టీ గెలవడం సువర్ణాక్షరాలతో రాయాల్సిన పుట. ఇది ప్రజాభిమానం వల్లే సాధ్యమైంది. చేస్తున్న పాలనకు వారి అధికార ముద్ర పడ్డందువల్లే సంభవమైంది. ఉమ్మడి ఏపీ చరిత్రలో గానీ, విభజిత ఏపీలో గానీ ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల అన్నిటిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది అధికార దుర్వినియోగంతోనో, మరో అక్రమంతోనో సాధ్యమయ్యేది కాదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో నలభై శాతం ఓట్లు వచ్చాయి. దానర్థం ఏమిటి? ఆయా చోట్ల అధికార పార్టీ ఏమైనా గొడవలు చేస్తే ఎదుర్కొనేవారు గణనీయంగానే ఉన్నా రన్నమాట. దానికి తోడు ఆయా వ్యవస్థల అండ ఎటూ ఉంది. అలాంటిది స్థానిక ఎన్నికలలో నిజంగా తెలుగుదేశంకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే ఉంటే ఆ పార్టీ ఊరుకుంటుందా? టీడీపీ ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేసింది. ఒక పక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్క రించామని చెబుతూనే, వివిధ నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్య ర్థులకు బీఫారాలు ఇచ్చారు. 8 వేలకు పైగా ఎంపీటీసీలు వైసీపీ గెలిస్తే, 9 వందలకు పైగా టీడీపీ గెలిచింది. మరి పోటీలో ఉన్నట్లా, లేనట్లా? నామినేషన్లు వేసిన తర్వాత చాలాకాలం ఎన్నికలు జరగకుండా చేయడంలో టీడీపీ సఫలమైంది. ఏడాదిన్నరపాటు ఎన్నికల ప్రక్రియ నడిచిన సందర్భం దేశంలో ఇదొక్కటే కావచ్చు. కరోనా కేసులు లేన ప్పుడు ఎన్నికలను వాయిదా వేయించింది. ఆ తర్వాత కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో జడ్పీ, మండల ఎన్నికలను పక్కనబెట్టి గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా పథకం అమలు చేయిం చింది. ఈ ఎన్నికలలో పూర్తిగా పరాజయం చెందడంతో కొత్త వ్యూహంలోకి వెళ్లారు. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపకుండా ఆపు చేయించారు. చాలా చిత్రంగా నామినేషన్లు పూర్తయిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించకపోవడం కూడా ఒక చరిత్రే. స్థానిక ఎన్నికలపై ఎవరైనా పరిశోధన చేయదలిస్తే, ఇవన్నీ ఆసక్తికర అధ్య యన అంశాలు అవుతాయి. మధ్యలో ఏపీ ప్రభుత్వంపై ఎన్నికల కమిషనర్ చాలా దారుణ మైన లేఖను కేంద్రానికి రాయడం జరిగింది. నిజానికి ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని ఎక్కువ మంది నమ్మకం. మొదట ఆ లేఖతో తనకు సంబంధం లేదని చెప్పిన నిమ్మగడ్డ, ఆ తర్వాత కేసును సీఐడీ టేకప్ చేయడంతో టీడీపీని రక్షించడం కోసం తానే రాశానని చెప్పు కోవలసి వచ్చింది. అలాగే ఈ ఎన్నికలపై కోర్టులలో పడినన్ని వ్యాజ్యాలు బహుశా మరే ఎన్నికలపై పడి ఉండకపోవచ్చు. సింగిల్ బెంచ్ జడ్జీ ఎన్నికలు నిర్వహించవద్దని అనడం, డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అయినా మళ్లీ సింగిల్ జడ్జీ ఈసారి ఎన్నికలనే రద్దు చేయడం, తిరిగి అప్పీల్లో డివిజన్ బెంచ్ నాలుగు న్నర నెలల సమయం తీసుకుని ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే స్థానిక ఎన్నికలు జాప్యం అయితే న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలిస్తుంటాయి. ఈసారి మాత్రం న్యాయ వ్యవస్థ వల్ల కూడా ఎన్నికలు జాప్యం అవడం మరో చిత్రం అని చెప్పాలి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కోడ్ అమలు చేసి, జడ్పీ, మండల ఎన్నికలకు అది వర్తింపచేయకుండా కోడ్ ఎత్తివేసి నిమ్మగడ్డ ఈ ఎన్నికలను వాయిదా వేయడమే కుట్రగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల కమిషనర్ నీలం సహానీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే దానిని లిటిగేషన్‌గా మార్చాయి టీడీపీ, జనసేన. ఒక పక్క తాము ఎన్నికలను బహిష్కరించామని చెబుతూనే మరో పక్క ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఆశ్చర్యమే. నలభై శాతం ఓట్లు కలిగిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాడి వదలివేయడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్య మంత్రి జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బలహీనవర్గాలకు చేరాయి. కులం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు దక్కాయి. దాంతో టీడీపీకి చెందినవారు కూడా వైసీపీ వైపు మొగ్గుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ లేకుంటే చంద్రబాబుకు కంచుకోట వంటి కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలు, తొంభై శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి ఎలా వస్తాయి? ఇది కచ్చితంగా చంద్రబాబుకు అప్రతిష్టే. ఈ 32 ఏళ్లలో కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీ గెలవ లేదు. గత ఎన్నికలలో 30 వేల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. పంచాయతీ ఎన్నికలలోనే వైసీపీ గెలుపుతో బిత్తరపోయిన చంద్ర బాబు, తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వచ్చారు. అయినా జడ్పీ, మండల ఎన్నికలలో ఫలితం దక్కకపోవడం విశేషం. పంచాయతీ ఎన్నికలలో చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో టీడీపీ గెలిస్తే మీడియాలో అది పెద్ద వార్తగా ప్రచారం అయింది. కానీ ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలలో ఆ స్థానం వైసీపీకి దక్కింది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు స్వగ్రామం నిమ్మకూరును టీడీపీకి బలమైన గ్రామంగా భావి స్తారు. అక్కడ కూడా ఈసారి వైసీపీ గెలిచింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇలాకాతో సహా అనేక చోట్ల టీడీపీకి ఒకటి, అరా తప్ప సీట్లు రాలేదు. గత నాలుగు దశాబ్దాలలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి విజయం నమోదు కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జడ్పీ ఎన్నికలలో అధికార టీడీపీ పది జడ్పీలను మాత్రమే గెలుచుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ పదింటిని, టీఆర్ఎస్ రెండింటిని కైవసం చేసుకుంది. మండలాల ఎన్నికలలో టీడీపీకి 482 దక్కితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 430, టీఆర్ఎస్కు 83 వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు 19 జడ్పీలు, టీడీపీకి రెండు, టీఆర్ఎస్కు ఒకటి వచ్చాయి. మండల ఎన్నికలలో కాంగ్రెస్‌కు 620, టీడీపీకి 355, ఇతర పార్టీలు 45 గెలుచుకున్నాయి. అంటే వైఎస్ ఉన్నప్పుడు కూడా టీడీపీ తన ఉనికిని నిలబెట్టుకోగలిగింది. 2014లో టీడీపీ ఆధిక్యత ప్రదర్శించగలిగినా, వైసీపీ తన పట్టును గట్టిగానే ఉంచుకోగలిగింది. టీడీపీకి 372 జడ్పీటీసీలలో తొమ్మిది జడ్పీలు, వైసీపీ 271 జడ్పీటీసీ లతో మూడు జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకున్నాయి. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. మండల పరిషత్‌లలో టీడీపీకి 386 వస్తే, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 205 వచ్చాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అన్నింటిలోనూ వైసీపీనే విజయం సాధించింది. 83 శాతం డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంటే, 11 శాతం డివిజన్లే టీడీపీకి వచ్చాయి.75 మున్సిపాలిటీలకు గానూ 74 వైసీపీ ఖాతాలో జమ య్యాయి. తాజాగా వెల్లడైన జడ్పీ, మండల ఎన్నికల ఫలితాలలో తొంభై శాతంపైగా వైసీపీకి రావడం టీడీపీకి జీర్ణం కాని విషయమే. ఇవన్నీ రికార్డులే. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పార్టీకి కొంత మొగ్గుంటుంది. ఒక్క 2014లో కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వల్ల పూర్తిగా నష్టపోయింది. అది వేరే విషయం. కానీ ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే– ఎనభై, తొంభై శాతం ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా రావడం; ప్రతిపక్ష టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం. ఇదే సమయంలో ఒక విషయం కూడా హెచ్చరించాలి. స్థానిక ఎన్నికలలో ఇంత పెద్ద ఎత్తున గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్‌పై మరింత బాధ్యత పెరిగింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ముందంజలోనే ఉన్నా, వచ్చే రెండున్నరేళ్లు పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజలలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకోవలసి ఉంటుంది. ఏ చిన్న ఘటన జరిగినా చిలవలు పలవలు చేయగల సత్తా టీడీపీకి, ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియాకు ఉంది. తిమ్మిని బమ్మిగా చేయగల నేర్పరులు వారు. తస్మాత్ జాగ్రత్త! కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
CM YS Jagan: బాధ్యత పెంచిన గెలుపు
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో ప్రజలు చేకూర్చిన అఖండ విజయం రాష్ట్ర ప్రభుత్వంపైన, తనపైనా బాధ్యత మరింత పెంచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్సీపీకి ఎంపీటీసీల్లో 86 శాతం, జెడ్పీటీసీల్లో 98 శాతం స్థానాల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలనుద్దేశించి సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడారు. కొన్ని అన్యాయమైన మీడియా సంస్థలు టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ విజయానికి వక్రభాష్యం చెబుతూ తప్పుడు రాతలు రాస్తున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల పరంగా, పార్టీల గుర్తుపై జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీటీపీ పోటీ చేసినప్పటికీ బహిష్కరించినట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్సార్సీపీ సునాయాస విజయంగా ఈనాడు పత్రిక వక్రభాష్యం రాసిందని, ఇలాంటి అన్యాయమైన ఈనాడు లాంటి పత్రిక ప్రపంచంలో ఎక్కడా ఉండదని వ్యాఖ్యానించారు. పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతీ అక్కచెల్లెమ్మ, సోదరుడికి ముఖ్యమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇంత ఘన విజయం అందించిన ప్రతీ తాత, అవ్వ, అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలియచేశారు. గతంలో ఎన్నడూ లేని అపూర్వ విజయం అదించిన ప్రజలకు సదా రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీ చల్లని దీవెనలతో మొదలైంది.. ఈరోజు మీరు చేకూర్చిన అఖండ విజయం ప్రభుత్వంపైనా, నాపైనా బాధ్యతను మరింత పెంచింది. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 151 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకుగానూ 22 చోట్ల గెలిపించారు. 50 శాతం పైచిలుకు ఓట్లతో, 86 «శాతం అసెంబ్లీ సీట్లతో, 87 శాతం పార్లమెంట్ సీట్లతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రయాణం మొదలైంది. పంచాయతీల్లోనూ అదే ఆదరణ.. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 13,081 పంచాయతీలకుగానూ 10,536 చోట్ల అంటే అక్షరాలా 81 శాతం పంచాయతీలలో అధికార పార్టీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రభంజనం.. దాని తర్వాత మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. 75 నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏకంగా 74 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆదరించారు. 99 శాతం స్థానాల్లో విజయం చేకూర్చారు. ఇక 12 చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 12కి 12 చోట్ల వంద శాతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు తాజాగా వచ్చాయి. దాదాపుగా 9,583 ఎంపీటీసీలకుగానూ 8,249 ఎంపీటీసీలు.. అంటే 86 శాతం ఎంపీటీసీల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులనే ప్రజలు గెలిపించారు. 638 జడ్పీటీసీలకుగానూ 628 జడ్పీటీసీలు (సీఎం సమీక్ష జరుగుతున్న సమయానికి ఉన్న సమాచారం ప్రకారం. ఆ తరువాత ఇవి 630కి పెరిగాయి) అంటే 98 శాతం జడ్పీటీసీలను దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో సాధించాం. 95 శాతానిపైగా హామీలు అమలు.. ప్రతి ఎన్నికలోనూ ఎక్కడా కూడా సడలని ఆప్యాయత, ప్రేమానురాగాలతో ప్రజలంతా ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారు. దేవుడి దయ వల్ల ఈ రెండున్నరేళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతానికి పైగా అమలు చేయగలిగాం. అందరి మన్ననలు పొందగలిగాం. ఇందుకు ప్రజలందరికీ సదా రుణపడి ఉంటాం. అవరోధాలు, ఇబ్బందులు.. కానీ ఇక్కడ కొన్ని విషయాలను ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నా. ప్రభుత్వానికి అవరోధాలు, ఇబ్బందులు కల్పించాలని కొన్ని శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు కోవిడ్‌తో డీల్ చేస్తున్నాం. మరోవైపు దుష్ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షంతోపాటు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, టీవీ– 5 లాంటి అన్యాయమైన మీడియా సంస్థలున్నాయి. అబద్ధాలను నిజం చేయాలని ప్రయత్నిస్తూ రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్నాయి. కేవలం వాళ్లకు సంబంధించిన మనిషి అధికార పీఠంపై కూర్చోలేదు కాబట్టి, ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా ముఖ్యమంత్రిని దించేసి వాళ్ల మనిషిని కూర్చోబెట్టాలనే దుర్మార్గపు బుద్ధితో చంద్రబాబును భుజాన వేసుకుని నడుస్తున్నాయి. ప్రజా దీవెనను జీర్ణించుకోలేకే ఇలాంటి రాతలు ఈ ఎన్నికల్లోనే కాదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా 2019 ఎన్నికల్లో 86 శాతం అసెంబ్లీ సీట్లు, 88 శాతం ఎంపీ సీట్లతో ప్రయాణాన్ని ప్రారంభించి సర్పంచ్ ఎన్నికల్లో 81 శాతం పార్టీ మద్దతుదారులే విజయం సాధించడం, మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం, వంద «శాతం కార్పొరేషన్లను గెలుచుకోవడం, ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 86 శాతం, 98 శాతంతో ప్రజలు వైఎస్సార్ సీపీకి ఘన విజయాన్ని చేకూర్చడాన్ని జీర్ణించుకోలేకే ఇలాంటి రాతలు రాస్తున్నారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలకు వక్రభాష్యాలా? ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే పార్టీల గుర్తులతో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఇంత బాగా ఆశీర్వదించి ప్రభుత్వాన్ని దీవిస్తే అది మింగుడు పడక విపక్షం, దానికి కొమ్ము కాసే మీడియా వక్రభాష్యాలు చెబుతున్నాయి. ఇవి సాక్షాత్తూ పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు. పార్టీ రహిత ఎన్నికలు కావు. పార్టీల గుర్తుతో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతి పార్టీ వారి అభ్యర్థులకు ఏ ఫామ్స్, బీ ఫామ్స్ కూడా ఇచ్చాయి. వాటి ఆధారంగా అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించారు. ఏ స్థాయిలో అడ్డుకుంటున్నారో మీరే చూస్తున్నారు.. ఓటమిని అంగీకరించలేరు. వాస్తవాలను ఒప్పుకోరు. ఇటువంటి అన్యాయమైన మీడియా సామ్రాజ్యం, ప్రతిపక్షం నడుమ ప్రజలకు మేలు చేయడానికి అడుగులు వేస్తుంటే మంచి జరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూస్తున్నారు. ప్రజలకు ఏ కాస్త మంచి జరుగుతున్నా వెంటనే తప్పుడు వార్తలు, కోర్టులో కేసులు వేయడం ద్వారా అడ్డుకుంటున్న పరిస్థితులను అంతా చూస్తున్నాం. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రభుత్వం చల్లగా నడుస్తోందని సవినయంగా తెలియచేస్తున్నా. ఏడాదిన్నర క్రితమే పూర్తై ఉంటే.. ఈ ఎన్నికల ప్రక్రియ నిజానికి ఒకటిన్నర సంవత్సరం క్రితం మొదలైంది. రకరకాల పద్ధతుల్లో ఎన్నికలు జరగకుండా చూడాలని ప్రయత్నం చేశారు. వాయిదా వేయించారు. కోర్టులకు వెళ్లి స్టేలు కూడా తెచ్చారు. చివరకు ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్ కూడా ఆర్నెళ్ల పాటు వాయిదా వేయించారు. ఇవే ఎన్నికలు ఏడాదిన్నర క్రితమే పూర్తై ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగం జరిగేదన్న ఇంగితజ్ఞానం కూడా ప్రతిపక్షానికి లేకుండా పోయిన పరిస్థితులను చూశాం. మరింత కష్టపడి మంచి చేస్తాం.. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇంత మంచి ఫలితాలు వచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఇవాళ కష్టపడుతున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ శ్రమించి ప్రజలకు మరింత మేలు చేస్తామని హామీ ఇస్తున్నా. ఇదెక్కడి పీడ..? ఈరోజు ఆశ్చర్యకరమైన ఓ వార్త చూశా. విపక్షం ఓడిపోయిన తర్వాత కనీసం ఓటమిని కూడా హుందాగా అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు పేపర్ ఉంది. ‘పరిషత్ ఏకపక్షమే.. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయాస గెలుపు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం...’ అని రాశారు. నిజంగా ఇది పేపరా? ఇదేమన్నా పేపర్‌కు పట్టిన పీడా? ఇంత అన్యాయమైన పేపర్లు బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో...! – సీఎం జగన్ -
Botsa Satyanarayana: ‘టీడీపీకి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదు’
-
సంక్షేమ పథకాల వల్లే పరిషత్ ఎన్నికల్లో విజయం
-
నిమ్మకూరులో వైఎస్సార్సీపీ విజయం
నిమ్మకూరు (పామర్రు): టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దాసరి అశోక్‌కుమార్ జయకేతనం ఎగురవేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు ఆకర్షితులై వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అశోక్‌కుమార్ తన ప్రత్యర్థి వీరాంజనేయులుపై తొలుత రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీనికి ప్రత్యర్థి రీ కౌటింగ్ జరపాలని డిమాండ్ చేయగా రీ కౌంటింగ్‌లో అశోక్‌కుమార్‌కు మరో 6 ఓట్లు ఆధిక్యం రాగా మొత్తం 8 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. చదవండి: ప్రజాప్రయోజనాలకే పెద్దపీట -
కెఎస్ఆర్ లైవ్ షో 20th September 2021
-
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడుకు భారీ షాక్
-
స్థానిక ఫలితాల్లో బీజేపీ జనసేన కూటమికి షాక్
-
మాజీ మంత్రి దేవినేని ఉమకు ఘోర పరాభవం
-
కుప్పంలో దిమ్మతిరిగిపోయే ఫలితాలు
-
శ్రీకాకుళంలో పత్తా లేకుండాపోయిన సైకిల్
-
నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: లెక్కించాల్సిన బ్యాలెట్ పేపర్లు తడవడంతో నాలుగు ఎంపీటీసీ స్థానాలో రీ పోలింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుంగం ఎంపీటీసీ స్థానంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో, విశాఖపట్నం జిల్లా గొలిగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ పరిధిలో రెండు బూత్‌ల్లోనూ రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తెలిపినట్టు తెలిసింది. కాగా, ఇలాగే బ్యాలెట్ బాక్సులు తడిచిపోవడంతో వైఎస్సార్ జిల్లాలో కొర్రపాడు, గొరిగెనూరు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించే అంశంపై ఆ జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను సంప్రదించారు. అయితే, రాత్రి 12 గంటల సమయానికి ఆ రెండు ఎంపీటీసీలకు సంబంధించి అధికారులకు ఎలాంటి లిఖితపూర్వక నివేదికలు అందని కారణంగా అక్కడ ఎలాంటి అ«ధికార నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను ఒక బాక్సులో నీళ్లు చేరడంతో లెక్కింపునకు అంతరాయం కలిగింది. అప్పటికి లెక్కించిన రెండు బ్యాలెట్ బాక్సుల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి పుష్పలతకు 355 ఓట్ల మెజారిటీ లభించింది. కాగా, మిగిలిన బాక్సులో 600 ఓట్లున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. మొత్తం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇదే కారణంతో ముద్దనూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఉమాదేవికి 6,409 ఓట్ల మెజారిటీ ఉన్నప్పటికీ ఆమె గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించలేదు. ఇక, జమ్మలమడుగు మండలం గొరిగెనూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను రెండింటిలో నీళ్లు చేరడంతో కౌంటింగ్ ఆపేశారు. ఇదే కారణంతో జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం కూడా ఆగిపోయింది. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ పై విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరికొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిచినా.. పోలింగ్ జరిగిన ఐదున్నర నెలల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం కారణంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్లోకి కొన్నిచోట్ల వర్షపు చెమ్మ చేరి కొన్ని పత్రాలు దెబ్బతినడం, చెదలు పట్టడం చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ఐదారు చోట్ల ఈ పరిస్థితిని అధికారులు గుర్తించారు. బ్యాలెట్ బాక్సుల్లో మొత్తం ఓట్లు దెబ్బతినకుండా కొన్ని మాత్రమే పాడయ్యాయి. దెబ్బతిన్న ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. -
దివాలా తీసి ఐపీ పెట్టిన దశలో టీడీపీ
సాక్షి, అమరావతి: ‘పరిషత్’ ఎన్నికల ఫలితాలతో మూడోసారి కూడా ప్రజలు వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందించారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు వైఎస్సార్సీపీని డిస్టింక్షన్ మార్కులతో పాస్ చేసి తమ బాధ్యతను మరింత పెంచారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలకు పార్టీ, సీఎం వైఎస్ జగన్ తరఫున కృతజ్ఞతలు చెప్పారు. మాజీ ఎన్నికల కమిషనర్, టీడీపీ ఏజెంట్ నిమ్మగడ్డ రమేష్‌కు, ఎన్నికలు ఆపడానికి కుట్రలు పన్నిన చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లకు వచ్చిన ఈ ఎన్నికల్లో జగన్ పాలన శభాష్ అనే తీర్పును ప్రజలు ఇచ్చారని చెప్పారు. పాలకుడి విశ్వసనీయత నచ్చితే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారన్న దానికి ప్రస్తుత ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కోవిడ్‌తో ప్రపంచమే కుదేలైనా.. సంక్షేమ పథకాలతో కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారని కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల అప్పు మిగిల్చిపోయినా.. నిబ్బరంగా ముందుకు సాగుతున్నారన్నారు. 2019లో 50 శాతం ఓట్లతో ప్రజలు ఆదరిస్తే.. ఇప్పుడు దాదాపు 90 శాతం ప్రజలు ఆదరించారని తెలిపారు. నాయకుడంటే ఎలా ఉండాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు తన చిన్నాన్న గతంలో సలహా ఇచ్చారన్నారు. ఇదే తరహాలో నాయకుడంటే ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు చెప్పాలని సూచించారు. టీడీపీ భవిష్యత్‌కు కుప్పం ఫలితమే నిదర్శనం టీడీపీ భవిష్యత్ ఏంటో చెప్పడానికి కుప్పం ఫలితం ఒక్కటి చాలని సజ్జల అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలోనూ వైఎస్సార్సీపీ సత్తా చాటుతోందని గుర్తు చేశారు. 2014లో 50 వేలు ఉన్న చంద్రబాబు మెజారిటీని 2019లో 27 వేలకు తగ్గించామన్నారు. ప్రస్తుతం కుప్పంలోని నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందామని చెప్పారు. అక్కడ తమకు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 43 వేల ఓట్లు రాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 62,957 ఓట్లు వచ్చాయన్నారు. కుప్పం మునిసిపాలిటీని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మెజారిటీ 70 వేలు దాటుతుందని తెలిపారు. దివాలా తీసి, ఐపీ పెట్టిన దశలో టీడీపీ ఉందన్నారు. ఆ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలకు రెట్టింపు ప్రతిపక్షంలో ఉంటూ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎన్నికల బహిష్కరణ ఒక డ్రామా పరిషత్ ఎన్నికల్లో ఓటమిని ముందే గుర్తించిన టీడీపీ నామినేషన్లు వేసి, ఉపసంహరణలు కూడా పూర్తయ్యాక ఎన్నికలను బహిష్కరిస్తున్నామని డ్రామాకు తెరలేపిందని దుయ్యబట్టారు. ఓవైపు ఎన్నికలను బహిష్కరించామంటూనే జనసేనతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని మండిపడ్డారు. స్థానిక పరిస్థితులను బట్టి జనసేన, టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ నేతలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇందుకు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజా తీర్పును స్వాగతించకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వితండ వాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2020 మార్చిలోనే జరగాల్సిన పరిషత్ ఎన్నికలను టీడీపీ కుట్రలు పన్ని నిమ్మగడ్డ రమేష్ సహకారంతో అడ్డుకుందన్నారు. టీడీపీ అంటేనే తాలిబన్ దేశం పార్టీ అని విమర్శించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండడం చేతకాక అసభ్య దూషణలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు.. మేరుగ నాగార్జున, మొండితోక జగన్మోహన్రావు, ముస్తఫా పాల్గొన్నారు. -
‘పరిషత్’లో పరాభవం
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్ష టీడీపీ పాతాళానికి కుంగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల కంటే దారుణమైన పరాజయాన్ని ఈసారి చంద్రబాబు మూటగట్టుకున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలకు మించి అవమానకర ఓటమి టీడీపీ శ్రేణులకు ఎదురైంది. 13 జిల్లా పరిషత్‌ల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. కనీసం పోటీ ఇవ్వలేక టీడీపీ అభ్యర్థులు చతికిలపడ్డారు. 6,659 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసి అర్థరాత్రి ఫలితాలు వెలువడుతున్న సమయానికి 803 స్థానాలకు పరిమితమైంది. 482 జెడ్పీటీసీలకు పోటీ చేసి కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది. 7 జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల్లో టీడీపీకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. శ్రీకాకుళం, విజయనగరం,, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ ఒక్క జెడ్పీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. మిగిలిన ఆరు జిల్లాలకు గాను ఐదు జిల్లాల్లో ఒక్కో స్థానాన్ని, కృష్ణా జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలను అతికష్టం మీద సాధించింది. కుప్పంలో కకావికలం తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మరోసారి కుదేలయ్యారు. అక్కడ వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేయడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీడీపీకి మిగిలిన 19 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది (అర్బన్ నియోజకవర్గాలు మినహా) ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను కూడా దక్కించుకోలేకపోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ దరిదాపుల్లోకి రాలేక చేతులెత్తేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తు లేకపోవడంతో ప్రజలను గందరగోళ పరిచేందుకు తాము సగం స్థానాల్లో గెలిచినట్లు హడావుడి చేసిన చంద్రబాబు మునిసిపల్ ఎన్నికల్లో చేతులెత్తేశారు. 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా ఒకే ఒక్క మునిసిపాల్టీకి టీడీపీ పరిమితమైంది. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో అంతకు మించిన పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ చరిత్రలో ఇది అతి పెద్ద ఓటమిగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నిమ్మకూరు వైఎస్సార్సీపీకే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఈ గ్రామాన్ని చంద్రబాబు తనయుడు లోకేష్ దత్తత తీసుకున్నా అక్కడి ప్రజలు ఆయన్ను పట్టించుకోలేదు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేసినా ప్రజల ఆశీర్వాదం ప్రతిపక్షానికి దక్కలేదు. ఎన్టీఆర్ సొంత మండలమైన పామర్రులో మండల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత తొలిసారి టీడీపీ ఓడిపోయింది. పామర్రు మండల పరిషత్‌ను తొలిసారి వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఇన్నేళ్ల తర్వాత అక్కడ వైఎస్సార్సీపీ పాగా వేయడం విశేషం. ఎన్టీఆర్ అత్త ఊరు కొమరోలులోనూ టీడీపీకి పరాజయం తప్పలేదు. కొమరోలును చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న విషయం విదితమే. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా సొంత నియోజకవర్గంలో బోల్తా పడ్డారు. ఒక్క జెడ్పీటీసీ, ఎంపీపీని కూడా గెలుచుకోలేకపోయారు. అతిథిపై విజయ బావుటా.. విజయనగరం జిల్లాలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి పోటీ చేసిన జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. పార్టీ విజయనగరం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఇన్చార్జిగా ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ కైవశం చేసుకుంది. అడ్రస్ లేని అచ్చెన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు సొంత నియోజకవర్గం టెక్కలిలో కోలుకోలేని దెబ్బ తగిలింది. టెక్కలిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. టెక్కలి జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ వాణి అత్యధికంగా 22,732 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అచ్చెన్న సొంత మండలం కోటబొమ్మాళిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దుబ్బ వెంకట రమణరావు 11,894 ఓట్ల ఆధిక్యతతో విజయబావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో 78 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వగ్రామం రామయ్యపుట్టుక (కవిటి–2) ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. అక్కడ నాలుగు జెడ్పీటీసీలు, ఎంపీపీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ప్రకాశం తీర్పు ఫ్యాన్‌కే ప్రకాశం జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు (పర్చూరు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), డోలా బాలవీరాంజనేయస్వామి (కొండెపి) తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒక్క జెడ్పీటీసీగానీ, మండల పరిషత్‌గానీ గెలిపించుకోలేకపోయారు. వారి సొంత గ్రామాల్లో సైతం ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందడం గమనార్హం. విపక్షానికి గుంటూరు గుణపాఠం గుంటూరు జిల్లాలో టీడీపీకి ప్రస్తుతం మిగిలిన ఏకైక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయారు. 65 ఎంపీటీసీలకు కేవలం నాలుగు చోట్లే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అక్కడ 42 ఎంపీటీసీలకు కేవలం 5 మాత్రమే టీడీపీ గెలిచింది. యనమలకు స్వగ్రామంలో పరాభవం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత గ్రామం అగర్తపాలెంలో వైఎస్సార్సీపీ గెలుపొందింది. ఉండి ఎమ్మెల్యే రామరాజు సొంత గ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ గెలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ, మండల పరిషత్‌ల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలవలేకపోయింది. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సొంత గ్రామం తొండంగి మండలం ఏవీ నగరంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. హిందూపురం ‘ఫ్యాన్’ పరం అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఒక్క జెడ్పీటీసీ, మండల పరిషత్‌ను కూడా టీడీపీ సాధించలేకపోయింది. టీడీపీకి పట్టున్న పలు గ్రామాల్లో సైతం వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఒక్క జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, జేసీ దివాకర్‌రెడ్డి వారి సొంత నియోజకవర్గాలైన రాప్తాడు, తాడిపత్రిలో కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. -
ఊరూ వాడా 'ఫ్యాన్' సునామీ..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఊరూ వాడా ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ.. ఆ తర్వాత గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అప్రతిహతంగా జైత్ర యాత్ర కొనసాగించింది. పట్నం అయినా.. పల్లె అయినా.. ఎన్నికలు ఎప్పుడైనా.. ఓటింగ్ ఈవీఎంలతోనైనా.. బ్యాలట్ పత్రాలతోనైనా.. అడ్డంకులు ఎన్ని ఎదురైనా.. విజయభేరి మోగించేది వైఎస్సార్సీపీయేనని ప్రజలు మరోసారి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే ప్రజా దీవెన అని పునరుద్ఘాటించారు. సంక్షేమ, అభివృద్ధి పాలనకే తమ ఓటని కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్ష టీడీపీ కుట్రలు, వ్యవస్థలను అడ్డంపెట్టుకుని చంద్రబాబు చేసే కుతంత్రాలను ఓటర్లు తిరస్కరించారు. ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మార్చిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో పట్నం ఓటరు ఫ్యాన్‌కు పట్టం కట్టగా, తాజాగా పరిషత్ ఎన్నికల్లో పల్లె ఓటర్లు కూడా ఫ్యాన్‌ను విజయపల్లకి ఎక్కించారు. రాష్ట్ర చరిత్రలోనే వైఎస్సార్సీపీకి రికార్డు స్థాయిలో ఘన విజయాన్ని అందించారు. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 86 శాతం ఎమ్మెల్యే సీట్లు, 88 శాతం ఎంపీ సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించిన వైఎస్సార్సీపీ పట్ల ఈ రెండున్నరేళ్లలో ప్రజాదరణ మరింతగా పెరిగిందని మునిసిపల్, పరిషత్ ఎన్నికలు విస్పష్టంగా నిరూపించాయి. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల్లో ఏకంగా 100 శాతం కార్పొరేషన్లు, 98.66 శాతం మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఇక ఆదివారం ప్రకటించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే రీతిలో విజయఢంకా మోగించింది. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్తులపై కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేసింది. 100 శాతం కార్పొరేషన్లు.. 84 శాతం డివిజన్లు ఇటీవల ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ 12 కార్పొరేషన్లలో మొత్తం 670 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలతో సహా 562 డివిజన్లలో ఘన విజయం సాధించింది. టీడీపీ కేవలం 81 డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు 27 చోట్ల గెలిచారు. మొత్తం మీద 84 శాతం డివిజన్లలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. దాంతో తిరుగులేని రీతిలో మెజార్టీ డివిజన్లు గెలుచుకోవడంతో ఆ 12 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 98.66 % విజయాలతో 74 మునిసిపాలిటీల్లో గెలుపు ఎన్నికలు నిర్వహించిన 75 మునిసిపాలిటీలలో 74 మునిసిపాలిటీలను గెలుచుకుంది. మొత్తం 2,124 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలతోసహా 1,754 వార్డుల్లో ఘన విజయం సాధించింది. అంటే 82.50 శాతం వార్డుల్లో వైఎస్సార్సీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 270 వార్డులతోనే సరిపెట్టుకుంది. ఇతరులకు 100 వార్డులు దక్కాయి. వైఎస్సార్సీపీ గెలుచుకున్న 74 మునిసిపాలిటీలలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్లలో అన్ని వార్డులు ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాయచోటి, ఎర్రగుంట్ల, కనిగిరి, ధర్మవరం, వెంకటగిరి, తుని మునిసిపాలిటీలకు నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని వార్డుల్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. నిడదవోలు, ఆదోని, డోన్, సూళ్లూరుపేట, గుత్తి, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు మినహా మిగిలిన అన్ని వార్డుల్లోనూ విజయం సాధించింది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో 98.66 శాతం విజయాలతో 74 మునిసిపాలిటీలపై విజయకేతనం ఎగురవేసింది. టీడీపీకి కేవలం ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీయే దక్కింది. -
అచ్చెన్న వ్యాఖ్యలు అక్షర సత్యం
సాక్షి, అమరావతి: పార్టీ లేదు.. బొక్కా లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ ముహూర్తాన అన్నారో గానీ ఆ వ్యాఖ్యలు అక్షర సత్యమవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలతో సీఎం వైఎస్ జగన్ విజయాల పరంపర కొనసాగుతోందన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు చూసినా, ఇప్పటి ఫలితాలు చూసినా అదే ట్రెండ్ కొనసాగుతోందని తెలిపారు. గతంలో 80 శాతం వస్తే ఇప్పుడు అంతకు మించి రానున్నాయన్నారు. ఒక నాయకుడి నిబద్ధతకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు సీఎం వైఎస్ జగన్ నాయకత్వానికి ప్రజామోదం లభించిందని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలతో టీడీపీ ఇక కనుమరుగు అవుతుందన్నారు. తాము ఎన్నికలు బహిష్కరించడం వల్లే వైఎస్సార్సీపీ గెలిచిందని టీడీపీ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. మరి ఎన్నికల్లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టారని.. ఎందుకు డబ్బులు పంచారని నిలదీశారు. ఇది బహిష్కరణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్నికలు బహిష్కరిస్తే టీడీపీ అభ్యర్థులు ఎలా గెలిచారని నిలదీశారు. ఏనాడూ టీడీపీకి ప్రజామోదం దక్కలేదు.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ 19 జిల్లా పరిషత్‌లు, టీడీపీ 2, టీఆర్ఎస్ ఒకటి గెలుచుకున్నాయన్నారు. కాంగ్రెస్ 620 మండలాల్లో, టీడీపీ 355, టీఆర్ఎస్ 22, సీపీఐ 23, సీపీఎం 6 చోట్ల విజయం సాధించాయని చెప్పారు. అంటే.. ఏనాడూ టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజామోదం దక్కలేదన్నారు. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 12 కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ గెలుచుకుందన్నారు. 671 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 563 చోట్ల (83.09 %) విజయం సాధించిందని తెలిపారు. టీడీపీకి 78 డివిజన్లే్ల (11.62%) దక్కాయన్నారు. ఇతరులు 28 చోట్ల గెలిచారన్నారు. మునిసిపాలిటీల్లో 75కు 74 చోట్ల (98.96%) వైఎస్సార్సీపీ గెలుపొందగా టీడీపీకి ఒకటి మాత్రమే వచ్చిందన్నారు. 2,123 వార్డుల్లో 1,754 ( 82.65%) చోట్ల వైఎస్సార్సీపీ, 17 చోట్ల వైఎస్సార్సీపీ రెబల్ అభ్యర్థులు గెలిచారన్నారు. టీడీపీ 270 వార్డుల్లో మాత్రమే విజయం సాధించిందన్నారు. -
సందడే సందడి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం పెద్దఎత్తున విజయోత్సవాలు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కన్పించింది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పార్టీ విజయదుందుభి మోగించటంతో కార్యకర్తలు, నేతల్లో అభిమానం ఉప్పొంగింది. ఏకపక్ష ఫలితాలు వెలువడతాయనే నమ్మకంతో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఆదివారం ఉదయం నుంచే నింగినంటేలా సంబరాలకు తెరతీశారు. కౌంటింగ్ ఆరంభం నుంచే తమకు అనుకూలంగా వస్తున్న ఫలితాలతో పార్టీ అభిమానులు సందడి చేశారు. మండల కేంద్రాలు, పంచాయతీ కేంద్రాల్లోనే కాకుండా చిన్నచిన్న పల్లెల్లోనూ పెద్దఎత్తున విజయోత్సవాలు జరిగాయి. డప్పు నృత్యాల మధ్య పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. పార్టీ శ్రేణులు వాడవాడలా మిఠాయిలు పంచుకున్నారు. అతితక్కువ కాలంలోనే పెద్దఎత్తున అమలైన సంక్షేమ ఫలాల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. అన్ని జిల్లాల్లోని వైఎస్సార్సీపీ శిబిరాలు ఇలా ఆనందోత్సాహాలతో కళకళలాడితే అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయాలు మాత్రం వెలవెలబోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఆ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు కరువయ్యారు. అన్నిచోట్లా నిశ్శబ్ద వాతావరణం తాండవించింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రోజంతా సందడే కన్పించింది. ఉ.11 గంటలకల్లా అనేక ప్రాంతాల నుంచి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సీఎం జగన్ అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పెద్దఎత్తున్న బాణసంచా కాల్చారు. డప్పుల మోత.. అభిమానుల డ్యాన్సులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. మంత్రులు, సీనియర్ నేతలు ధన్యవాదాలు చెప్పారు. పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట బాణసంచా కాలుస్తున్న పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ప్రజా విజయమని కొనియాడారు. సీఎం జగన్ స్వచ్ఛమైన పాలనను కాంక్షిస్తూ ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఇదని చెప్పారు. అనంతరం ఆయన మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గడువు ముగిసినా.. గెలవలేమని భావించే చంద్రబాబు ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఎన్నికలు పెట్టాలని కృషిచేసినా.. చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు చేశాయని ఆరోపించారు. బాబు, లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా.. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను తాము బహిష్కరించాం అని మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలకు సిగ్గులేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితాల్లో మార్పేమీ లేదని గుర్తుచేశారు. ఇప్పటికిప్పుడు టీడీపీ మొత్తం రాజీనామా చేసినా.. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసి వైఎస్సార్సీపీ గెలవడం తథ్యమని తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సీఎం జగన్ జనరంజక పాలనకు ఈ ఫలితాలు చక్కని నిదర్శనమన్నారు. ఇక రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని మరో ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా ధీమా వ్యక్తంచేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, వైఎస్సార్సీపీ నేతలు బల్లి శ్వేత, చల్లా మధు, ఎన్ఆర్ఐ రత్నాకర్, జూపూడి ప్రభాకర్‌రావు, ఎ. నారాయణమూర్తి, ఈద రాజశేఖర్‌రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. -
‘మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం’
సాక్షి, అమరావతి: ‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలవల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచింది’.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఆదివారం సీఎం ట్వీట్ చేశారు. ‘సోమవారం ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. అప్పుడు మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను’.. అని సీఎం అందులో పేర్కొన్నారు. దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది! మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2021 -
ప్రజలు టీడీపీ జెండాను పీకిపడేశారు
-
పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్న కలెక్టర్
-
ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్
-
పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం: మంత్రి కురసాల
-
కౌంటింగ్ తర్వాత 3 రోజుల్లోనే..
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీల ఎంపిక అంశంపై అఖిలపక్షం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. ఈ నెల 27న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మూడు రోజుల్లోనే జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి అఖిలపక్ష బృందం విజ్ఞప్తి చేసింది. జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకున్నాక జూలై మొదటివారంలో వారు పదవి స్వీకరించేలా చూడాలని, లేనిపక్షంలో కౌంటింగ్‌ను వాయిదా వేయాలని సూచించింది. కౌంటింగ్ పూర్తయ్యాక 40 రోజుల తర్వాత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తే కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేసే అవకాశముందని పేర్కొన్నాయి. ఈ మేరకు శుక్రవారం నాగిరెడ్డికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మర్రి శశిధర్‌రెడ్డి, ఎం.కోదండరెడ్డి, జి.నిరంజన్ (కాంగ్రెస్), ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ), పల్లా వెంకటరెడ్డి (సీపీఐ), డాక్టర్ చెరుకు సుధాకర్(తెలంగాణ ఇంటి పార్టీ), ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు(టీజేఎస్), కె.గోవర్థన్ (న్యూడెమోక్రసీ) వినతిపత్రం సమర్పించారు. విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారు... రైతుల పొలం పనులు, వర్షాకాలం వచ్చేలోగా ఎన్నికలు పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఎస్ఈసీ పరిషత్ షెడ్యూల్ విడుదల చేసినట్టు నాగిరెడ్డి చెప్పారని అఖిలపక్షనేతలు మీడియాకు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలనే విషయంపై అఖిలపక్ష బృందం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారని వారు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఫలితాలు ప్రకటించాక 40 రోజుల తర్వాత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక చేపడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అధికారపార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశముంటుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. పరిషత్ ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో చైర్పర్సన్ల ఎన్నిక జరిగేలా చూడాలని కోరినట్లు చెప్పారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నల్లధనం, పోలీసులను ప్రయోగించి అధికారపార్టీ అప్రజాస్వామిక పద్ధతుల్లో ఇతర పార్టీ ల నాయకులను చేర్చుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి, 3 రోజుల్లో జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకుని జూలై 5 తర్వాత బాధ్యతలు చేపట్టేలా చూడొచ్చని సూచించామన్నారు. గత 11 నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వమనేదే లేదని, జూలైలో మున్సిపల్ ఎన్నికలు పెడతామని ఎన్నికల కమిషన్ చెబుతోందని షబ్బీర్ అలీ అన్నా రు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యా యని ఆరోపించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, జెడ్పీలు, ఎంపీపీల ఎన్నిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కమిషనర్‌ను కోరినట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చట్టా లంటే ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు.