parthasarathi
-
బీజేపీ Vs టీడీపీ.. ఆదోనిలో రచ్చ రచ్చ
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒకలా బీజెపి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని పార్థసారధి అన్నారు. -
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. జీవో 140 నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: హెటిరో అధినేత పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానమేట్‌లో సాయిసింధూ ఫౌండేషన్‌కు 15 ఎకరాలు కేటాయింపు చేస్తూ విడుదల చేసిన జీవో 140ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. సాయి సింధు ఫౌండేషన్, క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణం, లాభాపేక్ష లేకుండా 30 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన భూమి కేటాయించింది. సర్వే నంబర్ 41/14/2లోని భూమికి ఏడాదికి రూ. 1,47,743 లీజు మొత్తాన్ని సాయిసింధూ ఫౌండేషన్ చెల్లించేలా నిర్ణయించింది. -
సత్తుపల్లి జిల్లా అయ్యేలా కృషి చేస్తాం - బీఆర్ ఎస్ ఎంపీ బండి పార్థసారథి
-
బాలు శిష్యుడుకు కిన్నెర బాలు అవార్డు..
-
కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మదుపరుల అనుమతి లేకుండా వారి షేర్లను బదలాయించడంతోపాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న బ్యాంకు రుణాలను వ్యక్తిగత, షెల్ కంపెనీలకు మళ్లించిన నేరంలో ఆయనను సోమవారం ఉదయం బెంగళూర్‌లో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే తరహా కేసులో బెంగళూర్ పోలీసులు కూడా పార్థసారథిని పీటీ వారెంట్‌పై తీసుకెళ్లి విచారించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది. ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంకుల ద్వారా పొందిన రూ.1,100 కోట్ల రుణంను తన ఖాతాలతోపాటు షెల్ కంపెనీలైనా కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మరో 7 కంపెనీలోకి మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. డీమ్యాట్ అకౌంట్లు బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా పార్థసారథి సెబీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా తనఖా పెట్టి షేర్ల ద్వారా రుణాలను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్ గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ.700 కోట్ల విలువైన కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లను ఫ్రీజ్ చేసింది. కస్టమర్లకు తెలియకుండా బదలాయించుకున్న షేర్లకు సంబంధించిన రూ.1,906 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి బదలాయించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మిగిలిన రూ.1,800 కోట్ల లావాదేవీలపై విచారణను ముమ్మరం చేసింది. డబ్బును ఎక్కడికి మళ్లించారు, దేనికి వాడారో తేల్చేందుకు పార్థసారథిని మరింత లోతుగా విచారించనుంది. ఇందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను షెల్ కంపెనీకు మళ్లించిన ఆధారాలను ఆటోమేటెడ్ డిలీట్ సాఫ్ట్‌వేర్‌తో పార్థసారథి ధ్వంసం చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీటిని వెలుగులోకి తేవాల్సి ఉందని ఈడీ భావిస్తోంది. -
అఫ్ఘాన్ మాటున పాక్ ద్వంద్వ నీతి
అఫ్ఘానిస్తాన్ పరిణామాలను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ ఆర్థిక ప్రయోజనాలు పొందటానికి పావులు కదుపుతోంది. కానీ దాని వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. పాక్ నిర్వహించిన... మధ్య ఆసియాలోని అఫ్ఘానిస్తాన్ పొరుగున ఉన్న కజకస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం నుంచి ఆయా దేశాల మంత్రులు అర్ధంతరంగా వైదొలగి... తాలిబన్ పాలన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించడానికి ఢిల్లీలో తలపెట్టిన విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవ్వడం చూస్తే... పాక్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న గౌరవం తెలిసిపోతోంది. ఒక పక్క అమెరికా తలపెట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో పాల్గొంటున్నట్లు నటిస్తూనే, మరోవైపు తాలిబన్లకు సాయం చేసి అఫ్ఘాన్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాక్ ద్వంద్వ నీతిని అమెరికాతో సహా దాని మిత్రదేశాలు గుర్తించాయి. అందుకే అవి అఫ్ఘాన్ సమస్యపై పాక్ చూపిస్తున్న చొరవను నమ్మే పరిస్థితిలో లేవు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా, ఆయన తర్వాత 2022 నవంబర్ 1న సైన్యాధ్యక్ష పదవిని అధిష్ఠిస్తాడని అనుకుంటున్న ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్‌ల మధ్య విభేదాలు సృష్టించడంలో విజయం సాధించిన మొదటి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. కాబూల్ నుండి కాందహార్‌కు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌ను తరిమేసిన హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదులకు అన్ని విధాలా తన ఐఎస్ఐ ద్వారా సహాయ సహకారాలు అందించిన వాడిగా హమీద్ ప్రపంచవ్యాప్తంగా బోలెడంత అపఖ్యాతిని మూట గట్టుకున్నాడు. హమీద్ సమక్షంలోనే కొత్త అఫ్ఘానిస్తాన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయింది. ఇమ్రాన్ ఖాన్ ఇందుకు మద్దతు ఇచ్చినప్పటికీ, ఈ చర్య ఆయనకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలే ఎక్కువ. హమీద్ వారసుడు లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్... ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు వినే పరిస్థితి కనిపిం చడం లేదు. పాకిస్తాన్ ఆక్రమణ నుండి విముక్తి పొంది బంగ్లాదేశ్ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సమయంలో ఈ పరిణా మాలు చోటుచేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్‌కు సంబంధించిన అనేక ఆర్థిక సూచీలను గమనించినప్పుడు... పాకిస్తాన్ కంటే బంగ్లా దేశ్ చాలా మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతోంది. కాగా పాకిస్తాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పాకిస్తాన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త పర్వేజ్ హుడ్భోయ్ ‘‘ఇవ్వాళ కొంతమంది ఆర్థికవేత్తలు బంగ్లాదేశ్ తదుపరి ‘ఆసియా పులి’ అవుతుందని అంటున్నారు. గత ఏడాది భారత్ (8 శాతం)తో సమానంగా వృద్ధి రేటు (7.8 శాతం)సాధించింది. అదే సమయంలో పాకిస్తాన్ (5.8 శాతం) కంటే బాగా ముందుంది. బంగ్లాదేశ్ తలసరి రుణం 434 డాలర్లు. ఇది పాకిస్తాన్ తలసరి రుణం (974 డాలర్లు)లో సగం కన్నా తక్కువే. బంగ్లాదేశ్ విదేశీ మారక నిల్వలు 32 బిలియన్ డాలర్లు కాగా పాకిస్తాన్ నిల్వలు 8 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే పాకిస్తాన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువన్నమాట. ఆర్థిక పరంగా భారత్‌తో సమాన స్థాయిని తానూ కలిగి ఉన్నానని పాకిస్తాన్ పేర్కొన్నప్పటికీ, భారతదేశ విదేశీ మారక నిల్వల్లో కేవలం 1.25 శాతం మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి...’’ అని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ నిర్వహించిన... మ«ధ్య ఆసియాలోని అఫ్ఘానిస్తాన్ పొరుగున ఉన్న ఇస్లామిక్ కజకస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం నుండి ఆయా దేశాల మంత్రులు అర్ధంతరంగా వైదొలగి... తాలిబన్ పాలన నుండి ఉత్పన్నమయ్యే సమస్యలపైన, ప్రాంతీయ సహకారంపైనా చర్చించడానికి ఢిల్లీలో జరుగుతున్న విదేశాంగ మంత్రుల సమావేశా నికి హాజరయ్యారు. ఈ పరిణామం ఏమంత ఆశ్చర్యపడవలసిందేమీ కాదు. ఇస్లామాబాద్ సదస్సును పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారం భించారు. అయితే, ఈ సమావేశానికి హాజరైనవారిలో చాలా మంది నుంచి సహాయం అందే అవకాశం లేదు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో–ఆపరేషన్ (ఓఐసి) వ్యవస్థాపక దేశంగా సౌదీ అరేబియా మాత్రం ప్రాథమికంగా కొంత సహాయం చేసింది. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన వల్ల ప్రçపంచంలో తలెత్తిన ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకొని ఆర్థిక లబ్ధి పొందడానికే పాకిస్తాన్ తనను తాను అఫ్ఘాన్ పరిణామాలపై చర్చా వేదికగా ప్రకటించుకుంది. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ తన సొంత దేశంలో అనేక అంతర్గత సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితిలో ఉన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలను నిరాకరించిన తాలిబన్ల విధానానికి ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపడం వల్ల... అమెరికా, ఐరోపా లేదా ఇతర ఇస్లామిక్ మిత్రదేశాల నుంచి అతడికి మద్దతు దొరికే అవకాశం లేదు. అఫ్ఘానిస్తాన్‌కు అంతర్జాతీయ సహాయం అందించేందుకు సంప్రదింపులు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో భారత్, ఇరాన్... వాటి ఇతర మధ్య ఆసియా భాగస్వామ్య దేశాలు ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవును రవాణా కారిడార్‌గా చేసుకొని అఫ్ఘానిస్తాన్‌కు మరింత అంతర్జాతీయ సహాయం అందించడానికి చర్యలు చేపట్టాలి. 2023లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... రానున్న రెండు సంవత్సరాలు ఇమ్రాన్ ఖాన్‌కు కీలకం కాబోతు న్నాయి. ఈ ఎన్నికలకు ముందే పాకిస్తాన్ తదుపరి సైన్యాధిపతి ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఇమ్రాన్ ఖాన్‌కు, సైన్యాధి పతి జనరల్ బజ్వాకు మధ్య సత్సంబంధాలు లేవనేది రహస్యమేమీ కాదు. ఆర్మీ చీఫ్ నామినీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్‌ను కొత్త ఐఎస్ఐ చీఫ్‌గా నియమించాలని, ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్‌ను సైనిక దళాల అధిపతిగా బదిలీ చేయాలని ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బజ్వా నిర్ణయించ డంతో... ఆ నిర్ణయాన్ని అమలుచేసే విషయంలో ప్రధాని ఇమ్రాన్, జనరల్ బజ్వా మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. అమెరికా తల పెట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో తాను కూడా పాల్గొన్నానని పాకి స్తాన్ చెప్పుకుంటున్నప్పటికీ... అది తాలిబన్లకు సహాయం చేసి నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో పాకిస్తాన్ చేరినందుకు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ఈ చర్యను పాకిస్తాన్ ‘తనకు తాను చేసుకున్న గాయం’గా ఆయన అభివర్ణించారు. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా, సైనికంగా అమెరికా నుంచి సహాయం పొందిన పాకిస్తాన్ ఇప్పుడు వాషింగ్టన్ పట్ల నిరాశాజనకంగా మాట్లాడటం ఆసక్తిదాయకం. ఎన్నికైన అఫ్ఘాన్ ప్రభుత్వాలకు రక్షణ, ఆర్థికపరమైన సహాయాలను అందించినప్పటికీ, అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా చేపట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో సైని కంగా పాల్గొనకుండా భారతదేశం తగిన విధంగా వ్యవహరించింది. అయితే, పాకిస్తాన్ ఆలోచనా ధోరణిలో కొంత మార్పు కనిపిస్తు న్నప్పటికీ... ఆ దేశానికి తానిస్తున్న స్థానమేంటో... అమెరికా అధ్య క్షుడు బైడెన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వెల్లడించారు. పాకిస్తాన్ పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా... పాలనలో సైన్యం ప్రధాన పాత్ర వహిస్తుందనే వాస్తవాన్ని విస్మరించి, తాను ఎంతో ప్రచారార్భాటాలతో నిర్వహించిన ‘ప్రజాస్వామ్య దేశాల శిఖరాగ్ర సమావేశం’ (సమ్మిట్ ఆఫ్ డెమోక్రసీస్)కు పాకిస్తాన్‌ను ఆహ్వానించి పాక్ పట్ల తమకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాసియాలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకొనిపోయిన బంగ్లాదేశ్, శ్రీలంకలను ఆహ్వానించకపోవడం గమనించదగిన విషయం. అయితే అమెరికా పాకిస్తాన్‌కు ఇంత ప్రాధాన్యం ఇచ్చినా స్పష్టంగా చైనా ఒత్తిడితో ఇమ్రాన్ ఖాన్ అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ పరిణామాలన్నింటినీ భారతదేశం గమనిస్తూనే ఉంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన... భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని అనుకుంటున్నట్లు ప్రపంచానికి స్పష్టం చేసింది. తాను ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో వ్యూహా త్మక భాగస్వామ్యం కలిగి ఉండాలనే విషయంలో బైడెన్ న్యూఢిల్లీని బలవంతం చేయలేడని పుతిన్ పర్యటన స్పష్టం చేసింది. ఇటీవల అఫ్ఘానిస్తాన్–పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాస్పద డ్యూరాండ్ రేఖ సరిహద్దులో కంచె వేయడానికి పాకిస్తాన్ సైనికులు చేసిన ప్రయత్నాన్ని తాలిబన్లు భగ్నం చేయడం విశేషం. బ్రిటిష్ వాళ్లు అఫ్ఘానిస్తాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య నిర్ణయించిన సరిహద్దురేఖ డ్యూరాండ్. పాక్ తలపెట్టిన ఈ సరిహద్దు కంచెను ‘చట్టవిరుద్ధం’ అని అఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనయతుల్లా ఖ్వారిజ్మీ అభివర్ణించారు. ఈ మొత్తం సంఘటనను అఫ్ఘాన్లు వీడియో తీశారు. వివాదాస్పదమైన 2,600 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి ఇటువంటి సంఘటనలకు పాకిస్తాన్, అఫ్ఘాన్‌లో అధికారం పొందటంలో దాని నుంచి సహాయం పొందిన తాలిబన్ సిరాజుద్దీన్ హక్కానీలు భవి ష్యత్తులో పరస్పరం ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి. – జి. పార్థసారథి వ్యాసకర్త పాకిస్తాన్లో భారత మాజీ హైకమిషనర్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ -
Karvy Case: ‘కార్వీ ’ నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ.. ఇప్పటికే కార్వీ చైర్మన్ సి.పార్థసారథిని జైల్లో విచారించింది. తాజాగా బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఉన్న కార్వీ, అనుబంధ సంస్థల కార్యాలయాలతోపాటు ఇప్పటికే అరెస్టు అయిన ఐదుగురు నిందితుల ఇళ్లల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ తదితర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కార్వీ 9 షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంపై కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. అటు బెంగళూరు పోలీసులు సైతం తమ వద్ద నమోదైన కేసు విచారణ వేగవంతం చేశారు. ఆ కేసులో పార్థసారథిని మూడు రోజులు విచారించనున్నారు. రూ.3 వేల కోట్ల స్కాం కార్వీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణ హరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజ, రిస్క్ హెడ్‌గా ఉన్న వైస్ ప్రెసిడెంట్ గురజాడ శ్రీకృష్ణలను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. వీరంతా ప్రస్తుతం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ల్లోని 3 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,100 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మోసానికి సంబంధించి సికింద్రాబాద్‌కు చెందిన వారి నుంచి అందిన ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచిన మదుపరులు ఇచి్చన పవర్ ఆఫ్ అటారీ్నని తనకు అనువుగా మార్చుకున్న పార్థసారథి తదితరులు భారీ స్కామ్‌కు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ మొత్తం రూ.3 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలిక జప్తుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: పంజాబ్‌కు ‘కార్వీ’ పార్థసారథి -
బెంగళూరు పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి
-
‘కార్వీ’ చుట్టూ ఈడీ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఆ సంస్థ చైర్మన్ సి.పార్థసారథితోపాటు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్‌సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణహరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజలను ప్రశ్నించింది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోని మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ రెండు కమిషనరేట్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మేర మోసం చేశారంటూ సికింద్రాబాద్‌కు చెందిన మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకుని పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటంతో చంచల్‌గూడ జైల్లోనే విచారిస్తున్నారు. వారంపాటు పార్థసారథిని ప్రశ్నించడానికి అనుమతి కోరగా మూడు రోజులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆది, సోమవారాల్లో ఆయనను ప్రశ్నించిన అధికారులు మంగళవారం కూడా విచారించనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారుల నుంచి సేకరించిన ఎఫ్ఐఆర్లను బట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పవర్ ఆఫ్ అటార్నీని అనువుగా మార్చుకొని... కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు మదుపరులు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని పార్థసారథి తనకు అనువుగా మార్చుకుని భారీ స్కామ్‌కు తెగబడ్డారు. మదుపరుల అను మతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. అవన్నీ తమవే అంటూ చూపించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి కొలట్రల్ సెక్యూరిటీ(తనఖా)గా పెట్టి దాదాపు రూ.వెయ్యి కోట్లు అప్పు గా తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి, వాటి అభివృద్ధి–విస్తరణలకు వినియోగించాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ సంస్థల్లోకి మళ్లించి భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. దానికి సంబంధించిన వివరాల కోసమే పార్థసారథిని ప్రశ్నించి సమగ్ర వాంగ్మూలం నమోదు చేస్తోంది. కోర్టు అనుమతితో మిగిలిన నిందితుల విచారణ పూర్తయిన తర్వాత కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలికంగా జప్తు చేయనుంది. -
కార్వీ కేసు: రంగంలోకి దిగిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కార్వీపై అధికారులు కేసు నమోదు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని 7 రోజుల కస్టడీని ఈడీ కోరింది. జ్యుడిషియల్ కస్టడీలో మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్‌పై కార్వీ ఛైర్మన్‌ను ఈడీ విచారించనుంది. కస్టమర్స్ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే అంశంపై ఈడీ విచారణ చేపట్టనుంది. బ్యాంకు రుణాల నగదు విదేశాలకు తరలించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవీ చదవండి: Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే.. -
కార్వీ ఎండీ కేసు: మరో నిందితురాలు అరెస్టు
హైదరాబాద్: కార్వీ షేర్స్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా, ఈ కేసులో శుక్రవారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు కార్వీ సంస్థ సెక్రెటరీ శైలజను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కృష్ణహరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు -
కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్: కార్వీఎండీ పార్థసారథి రుణాల ఎగవేత కేసులో మరో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితులిద్దరిని రాజీవ్, హరికృష్ణలుగా గుర్తించారు. వీరిద్దరు కూడా నకిలీ షెల్ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్ కంపెనీలను నడుపుతున్నట్లు సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. డీమాట్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు -
కార్వీ ఎండీ పార్థసారథి కేసులో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి కేసులో సీసీఎస్ పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. కార్వీ అక్రమాలను సీసీఎస్ పోలీసులు నిగ్గు తేల్చారు. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపి పెట్టినట్లు తేలింది. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు సమాచారం. అలా పార్థసారథి దాదాపు రూ. 1200 కోట్లు బ్యాంకులకు రుణం ఎగవేశారు. దీంతో పాటు కార్వీ తెలంగాణ లోని బ్యాంక్‌ల వద్దనే రూ. 3000 కోట్ల స్కాం చేసినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులు కలిపితే మరో నీరవ్, మాల్యాలా కార్వి ఫ్రాడ్ కూడా పెద్ద స్కాంగా పరిగణించవచ్చు. కాగా కార్వీ ఆస్తుల మొత్తాన్ని పార్థసారధి బ్యాంకుల్లో కుదువ పెట్టారు. దీనికి సంబంధించి బ్యాంక్ లాకర్లను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కార్వి సంస్థ రుణం పొందిన 6 అకౌంట్లు ను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన అధికారులు.. అందులో దాదాపు రూ. 13 కోట్ల లిక్విడ్ క్యాష్‌ను గుర్తించారు. కాగా రెండు రోజుల క్రితం పార్థసారథి కస్టడీ ముగియగా.. విచారణ కోసం సీసీఎస్ పోలీసులు ఆయనను మరో రెండ్రోజలు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. -
‘ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరు’
-
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
-
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
సాక్షి,హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథిని పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని విచారించనున్నారు. ప్రస్తుతం పార్థసారథి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో వున్నారు. కాగా రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసులు ఆగస్టు 19న అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. చదవండి:Telangana Schools Reopen: ఆన్లైన్ కాదు.. అందరూ రావాల్సిందే -
కార్వీ సీఎండీ పార్థసారథి కేసు: సీసీఎస్‌కు పెరుగుతున్న బాధితుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: కార్వీ సీఎండీ పార్థసారథి కేసులో(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పార్థసారథిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో (సీసీఎస్) పోలీసులు ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో మదుపరుల పెట్టుబడితో కలిపి రూ. 2 వేల కోట్లకు స్కాం పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకర్ల ఫిర్యాదు మేరకు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. చదవండి: కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్ -
కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయని, ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్‌బీఎల్ సంస్థ.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. ఆయా ఖాతాల్లో క్లయింట్ల షేర్లతో పాటు నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టి వాటి విలువలో 80 శాతం వరకు రుణం పొందొచ్చు. దీన్ని అనువుగా మార్చుకుని మదుపరుల అనుమతి లేకుండా డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి పార్థసారథి మార్చుకున్నారు. ఆ షేర్లను కొలేటరల్ సెక్యూరిటీగా పెట్టి దాదాపు రూ.680 కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తాలను తమ సొంత కంపెనీల్లోకి మళ్లించడం, రుణాలు చెల్లించి షేర్లను తిరిగి మదుపరుల ఖాతాల్లోకి పంపడం ఏళ్లుగా సాగింది. షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ.. అలాగే వారి డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.720 కోట్లనూ ఇదే పంథాలో మళ్లించడం, తిరిగి జమ చేయడం చోటు చేసుకున్నాయి. ఇలా తమ ఖాతాల్లోని షేర్లు, నగదు దారి మళ్లినట్లు మదుపరులకు తెలియకుండా కార్వీ సంస్థ జాగ్రత్త పడింది. వారి అనుమతి లేకుండా ఈ వ్యవహారాలు నెరపినా వర్చువల్ ఖాతాలో మాత్రం ఆ షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ మోసం చేసింది. ఇదే పంథాలో షేర్లను తనఖా పెట్టిన కేఎస్‌బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు.. 2019– 20ల్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, హెచ్డీఎఫ్సీ నుంచి రెండు విడతల్లో రూ.347 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి వాటి అభివృద్ధికి వినియోగించాలి. దీనికి భిన్నంగా వ్యవహరించిన పార్థసార«థి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లోకి మళ్లించారు. తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను, నగదును కార్వీ సంస్థ మళ్లిస్తున్న విషయం గుర్తించిన కొందరు మదుపరులు సెబీకి ఫిర్యాదు చేశారు. దీంతో 2019లో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన సెబీ అవకతవకలు జరిగినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలోనే 2020లో కేఎస్‌బీఎల్ ఎక్కడా స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాలు చేయకుండా నిషేధం విధించింది. అప్పటికే ఈ సంస్థ అధీనంలో ఉన్న డీమ్యాట్ ఖాతాలను వేర్వేరు సంస్థలకు బదిలీ చేయించింది. ఆ సందర్భంలో కార్వీ సంస్థలు ఆయా బ్యాంకులకు తాకట్టు పెట్టిన షేర్లను వాటి అనుమతి లేకుండానే మదుపరుల ఖాతాలకు బదిలీ చేసేశారు. దీంతో బ్యాంకు రుణాలపై ష్యూరిటీ లేకుండాపోవడంతో పాటు చెల్లింపులు ఆగిపోయాయి. పార్థసారథికి కోర్టు రిమాండ్... సెబీ నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన నేపథ్యం లో కుంభకోణానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని నివా సంలో పార్థసారథిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం పార్థసారథిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో మరికొందరూ నిందితులుగా ఉన్నారని చెబుతున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై 2019లో స్టాక్ మార్కెట్ కుంభ కోణం బయటపడింది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.2 వేల కోట్లపైగా ఉంటుందని అంచనా. ఈ కుంభకోణం బయటపడే దాకా ఈ సంస్థ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలు అందించింది. వ్యవస్థలోని లోపాలను అనుకూలంగా మార్చుకుని, క్లయింట్ల నిధులు, షేర్లను అక్రమంగా తన ఖాతాలోకి బదలాయించుకోవడం ద్వారా ప్రయోజనాలు పొందిందని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా తీసుకున్న వాటిలో సుమారు రూ.1,096 కోట్ల మొత్తాన్ని కార్వీ రియల్టీ సంస్థకు మళ్లించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది. -
రుణాల ఎగవేత: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగవేశారనే ఆరోపణల నేపథ్యంలో కార్వీ ఎండీ పార్థసారధి అరెస్టయ్యారు. రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసుల గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. కార్విపై గతంలో సెబీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ గేషన్ దర్యాప్తు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు లక్షలాది మంది వినియోగదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల పెట్టుబడులు వినియోగదారులు పెట్టారు. కస్టమర్ల షేర్లను ఎండీ పార్థసారథిరెడ్డి బ్యాంకులకు తనఖా పెట్టడంతో బ్యాంకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు -
ఫలితాలు: ఆర్వోలదే తుది నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే (ఆర్వోలు) తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని, బాధ్యతాయుతంగా ఈ పని పూర్తి చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి అధికారం రిటర్నింగ్ అధికారులదేనని పేర్కొన్నారు. కోవిడ్–19 నిబంధనలు తప్పక పాటించాలని, కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పకుండా ధరించాలని ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి/ కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలను పరిశీలకుల ఆమోదం తర్వాతే రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి, పారదర్శకంగా నిర్వహిం చాలని, స్ట్రాంగ్ రూంను అభ్యర్థి లేదా వారి ఏజెంట్ సమక్షంలో ఉదయం 7.45 గంటలకు తెరవాలని చెప్పారు. సందేహాత్మక బ్యాలెట్ పేపర్లపై రిట ర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహించాలని, ప్రతి రౌండు తర్వాత ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు తీసుకోవాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు కౌంటింగ్ సెంటర్‌లోనికి అనుమతించరాదని పేర్కొన్నారు. హాల్ చిన్నగా ఉన్న 16 వార్డులలో 7 టేబుళ్ల చొప్పున రెండు కౌంటింగ్ హాల్స్‌కు అనుమతిస్తూ ఆర్వోలు, అదనపు ఆర్వోలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8,152, ఒక్కో రౌండ్‌కు 14,000 ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. 74,67,256 మంది ఓటర్లకుగాను 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 1,926 పోస్టల్ బ్యాలెట్స్ జారీ చేశారన్నారు. -
ఓటుందో.. లేదో.. చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి వెల్లడించారు. మున్సిపల్ డివిజన్ల డీ లిమిటేషన్, రిజర్వేషన్లు, ఎన్నికలు పాత జీహెచ్ఎంసీ చట్టం ప్రకారమా.. కాదా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ స్పందన మేరకు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారై తమకు అందాక నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డివిజన్ల డీ లిమిటే షన్‌కు సంబంధించి వైఖరిని వెల్లడించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయని, సంబంధించిన జీవోలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించే వరకు ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరుందో.. లేదో.. చెక్ చేసుకుని, లేకపోతే పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల కోసం ఎస్ఈసీ మొబైల్యాప్ కూడా అందుబాటులో ఉంచిందని, ఎస్ఈసీ వెబ్సైట్లోనూ తమ ఓటు ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలు చూసుకోవచ్చన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో పార్ధసార«థి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఓటరే కీలకం... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో ఓటర్‌దే కీలకపాత్ర. ఓటు హక్కున్న ప్రతీ పౌరుడు ఓటు వేయ డాన్ని బాధ్యతగా తీసుకో వాలి. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేం దుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు పోస్టర్లు, ప్రకటనలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం, సెలబ్రిటీల సందేశాలు వంటివి చేపడుతున్నాం. సవాళ్లతో కూడుకున్నదే... కరోనా భయం నేపథ్యంలో ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రజలను మోటివేట్ చేసే చర్యలు తీసుకుంటున్నాం. ఓటేసేందుకు అవసరమైన సురక్షిత చర్యలను చేపడుతున్నాం. బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. వాటిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టాం. అన్ని పరిశీలించాకే ఈ–ఓటింగ్.. కరోనా నేపథ్యంలో ఓటింగ్ పెంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటేసేందుకు పరిస్థితులు అనుకూలించని వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది కోసం ఈ–ఓటింగ్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాలని భావిస్తున్నాం. అయితే ఐటీశాఖ నుంచి సాఫ్ట్వేర్ అందాక, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నాకే పైలట్ బేసిస్‌తో చేపట్టడంపై నిర్ణయం తీసుకుంటాం. ఏర్పాట్లు పూర్తికావొస్తున్నాయి... ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) నుంచి అసెంబ్లీ ఓటర్ల జాబితా డేటా త్వరలోనే రానుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ ఏరియా వరకు 26 శాసనసభ నియోజకవర్గాల వారీగా 30 మంది జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కార్పొరేషన్ డివిజన్ల వారీగా అసెంబ్లీ జాబితాలతో ఓటర్ల జాబితాలను మ్యాపింగ్ చేసి ఎస్ఈసీకి ఇవ్వగానే పోలింగ్ స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రక్రియకు ముందు పోలింగ్‌బూత్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భవనాల ఎంపికను అధికారులు పూర్తిచేస్తారు. బూత్‌కు వెయ్యిమంది ఓటర్లు... ఒక్కో పోలింగ్ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లుండేలా చూడాలని ఈసీ ఇదివరకే సూచించింది. దీనికనుగుణంగా ఏర్పాట్లుచేస్తాం. వెయ్యికంటే తక్కువ మందికి ఒక బూత్ చేయాలనే ఆలోచన ఉన్నా బిల్డింగ్లు, సిబ్బంది ఏ మేరకు అందుబాటులో ఉంటాయనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఫేస్ రికగ్నిషన్ పద్ధతి... 150 పోలింగ్ బూత్‌లలో ఫేస్ రికగ్నిషన్ అమలుకు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించాం. వీటి కోసం ఎంపిక చేసే భవనాల్లో సరైన వెలుతురు, ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించాం. ఐటీ శాఖ, టెక్నాలజీ సర్వీసెస్ విభాగం సహకారంతో ఈ ప్రక్రియను చేపడుతున్నాం. ఈవీఎంలా, బ్యాలెటా.. త్వరలోనే నిర్ణయం జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ బ్యాలెట్ పేపర్లతోనా.. ఈవీఎంలతోనా.. అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు అందాయి. ఏ విధానంతో ఎలాంటి సమస్యలు అన్న దానిని పరిశీలించి, నిపుణుల సలహాలు తీసుకున్నాక దీనిని ప్రకటిస్తాం. (చదవండి: బ్యాలెట్‌తోనే జీహెచ్ఎంసీ పోరు!) -
‘పిల్లల కోసం కూడా అంబులెన్స్’
సాక్షి, తాడేపల్లి: 108,104 అంటే గుర్తుకు వచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ, ‘ ప్రతి మండలానికి 108, 104 ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు. పట్టణాల్లో 15, గ్రామాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 చేరుకుంటుంది. పేదల ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఉక్రోషంతో 104, 108లో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.108,104 లకు 203 కోట్లు ఖర్చు చేస్తే 307 కోట్లు అవినీతి జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘పెద్దలకే కాదు చిన్న పిల్లలు కోసం నియో నానిటల్ అంబులెన్స్ ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. 1800 వాహనాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 1800ల 108, 104 వాహనాలు ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలని సవాల్ చేస్తున్నా. దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో 104, 108 వ్యవస్థ ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో 108, 104 షెడ్లకు పరిమితమయ్యాయి. డీజల్ లేక మధ్యలోనే పేషంట్లతో 108 వాహనాలు ఆగిపోయేవి. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్యను 2000లకు సీఎం జగన్ పెంచారు. ఐదు లక్షల ఆదాయం ఉన్నా సరే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం 28 వేల కోట్లు ఖర్చు చేసింది. పార్టీ సైనికులుగా విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పని చేశారు. వారిపైన కూడా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. వారి భుజాలు పైన మరింత బాధ్యతను సీఎం జగన్ పెట్టారు. ఇప్పుడు వారికి కొత్తగా పదవులు కట్టబెట్టలేదు. గతంలో కూడా వారు జిల్లాల బాధ్యతలు చూశారు. లోకేష్‌కు ఏమి అర్హత ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టావు. లోకేష్ ఏమి సాధించాడని దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి పదవి కట్టబెట్టావు. దాదాపు వందకు పైగా దేశాల్లో అరబిందో విస్తరించి ఉంది. లాభాపేక్ష కోసం అరబిందో కు 104, 108 ఇచ్చారని మాట్లాడడం కరెక్ట్ కాదు’ అని పార్థసారధి అన్నారు. (ఏపీలో అన్‌లాక్ 2.0 అమలు ఉత్తర్వులు జారీ) -
‘బీసీల అభ్యున్నతికి బాబు మోకాలు అడ్డుపెట్టారు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుకు స్వలాభం తప్ప మరో ఆలోచన లేదని, బీసీల రిజర్వేషన్లను బాబు అడ్డుకున్నారని, ప్రతాప్‌రెడ్డితో చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేయించారని తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, మహిళలను అడ్డం పెట్టుకుని రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూముల కోసం అమాయకులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, బాబుకు రాజకీయ విలువలు లేవని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. (స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం) స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ప్రతాప్‌రెడ్డి బాబు అనుచరుడు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలతో ప్రతాప్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, బీసీల అభ్యున్నతికి చంద్రబాబు మోకాలు అడ్డుపెట్టారని విమర్శించారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు కల్పించామని, బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని ఆయన తెలిపారు. -
ఇసుకపై చంద్రబాబు దగుల్బాజీ రాజకీయాలు