Presidential Election 2022
-
నేనేం సోనియా రిమోట్‌ను కాను
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత పార్టీకి డమ్మీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ఉండబోతారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఆయన దీటైన సమాధానమిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం అహ్మదాబాద్‌లో ఖర్గే మాట్లాడారు.‘ నేనేం సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్‌ను కాదు. బీజేపీలోనే అలాంటి వ్యవస్థ ఉంది. కాంగ్రెస్‌లో సర్వామోదంతోనే అన్నీ జరుగుతాయి. ఒకవేళ నేను పార్టీ పగ్గాలు చేపడితే నా రిమోట్ కంట్రోల్ నా వద్దే ఉంటుంది. కాంగ్రెస్‌లో పార్టీ కమిటీ, ఎన్నికైన సభ్యులు, వర్కింగ్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు ఉమ్మడి, సమష్టి నిర్ణయాలే అమలవుతాయి. రిమోట్ కంట్రోల్ భావన బీజేపీదే. మీలోని వాళ్లే ఇలాంటివి సృష్టిస్తారు’ అని బీజేపీ నేతలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బీజేపీ అధ్యక్ష ఎన్నికలను ప్రధాని ఎన్నిసార్లు నిర్వహించారు? బీజేపీలో రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో అందరికీ తెలుసు. మీరా మాకు హితబోధ చేసేది?’ అని ఎదురుదాడికి దిగారు. ‘చీఫ్‌గా ఎన్నికైతే పార్టీలో సగం సంస్థాగతమైన పదవులు 50 ఏళ్లలోపు వారికి దక్కేలా కృషిచేస్తా. మహిళలు, యువత, దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తా. గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలను పరిరక్షిస్తూ, పటేల్ ఐక్యతా పిలుపును బలపరుస్తా’ అని అన్నారు. -
Droupadi Murmu: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక
న్యూఢిల్లీ: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక కొలువుదీరడానికి సమయం ఆసన్నమయ్యింది. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయిస్తారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రమాణ స్వీకారం అనంతరం ముర్ముకు సైనిక సిబ్బంది 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారని తెలిపింది. తర్వాత ఆమె ప్రసంగం ఉంటుందని పేర్కొంది. అంతకంటే ముందు రామ్‌నాథ్ కోవింద్, ముర్ము కలిసి పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌కు చేరుకుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రి మంత్రులు, దౌత్యవేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనికాధిరులు పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించనున్నారు. -
ద్రౌపది ముర్ము: విపక్షాలే దగ్గరుండి గెలిపించాయ్!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీలకంగా మారడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు. అంటే.. క్రాస్ ఓటింగ్‌కు లైన్ క్లియర్ అన్నమాట. అయితే ఆత్మప్రభోధానుసారం ఓటేయాలన్న పిలుపును సీరియస్‌గా తీసుకున్న చాలామంది ప్రజాప్రతినిధులు.. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము(64)ను గెలిపించుకోవడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు గట్టి దెబ్బే తగిలింది. యశ్వంత్ సిన్హాకే ఓటేయాలన్న ఆయా పార్టీల అధిష్టానాల పిలుపును లైట్ తీసుకుని.. ద్రౌపది ముర్ముకే ఓటేశారు చాలా మంది. మొత్తం ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది మాత్రమే ఓటేశారు. అలాగే అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల నుంచి భారీగా క్రాస్ ఓట్లు ముర్ముకు పోలయ్యాయి. ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు. సుమారు 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 104 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తెలుస్తోంది. బీజేపీ ఏమో ఆ సంఖ్యను 18 రాష్ట్రాల నుంచి 126 ఎమ్మెల్యేలుగా చెబుతోంది. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ముర్ముకు మద్దతుగా 64 శాతం ఓట్లు పోలయ్యాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతు లభించడం గమనార్హం. While President-elect #DroupadiMurmu got a vote in all states, Opposition's Presidential candidate Yashwant Sinha drew a blank in Andhra Pradesh, Nagaland, & Sikkim. pic.twitter.com/QTVtiRqBYS — ANI (@ANI) July 21, 2022 అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. మరోవైపు యూపీ, మహారాష్ట్ర అసెంబ్లీల నుంచి ద్రౌపది ముర్ముకు గరిష్ఠంగా ఓట్లు వచ్చాయి. అలాగే యశ్వంత్ సిన్హాకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచి భారీ మద్దతు లభించింది. राष्ट्रपति पद के लिए मध्यप्रदेश से श्रीमती द्रौपदी मुर्मू जी को भारतीय जनता पार्टी के अतिरिक्त भी वोट मिले हैं। मैं अन्य दलों के उन विधायक साथियों को, जिन्होंने अंतरात्मा की आवाज पर श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाने के लिए वोट किया है, उनको हृदय से धन्यवाद देता हूं। pic.twitter.com/pEWiY4O50Y — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 21, 2022 మధ్యప్రదేశ్ సీఎం కృతజ్ఞతలు గిరిజన వర్గానికి చెందిన సోదరి విజయంలో భాగస్వామ్యులైనందుకు కృతజ్ఞతలంటూ విపక్షాల ప్రజాప్రతినిధులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేయడం గమనార్హం. స్వతంత్రం అనంతరం పుట్టి.. రాష్ట్రపతి హోదాకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలిగా ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. జులై 25వ తేదీన ఆమె రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాలకు షాక్ -
Draupadi Murmu: నిరాడంబరతే ఆభరణం
పుట్టింది వెనకబడ్డ ఒడిశా రాష్ట్రంలో. అందులోనూ, దేశంలోకెల్లా అత్యంత వెనకబడ్డ జిల్లాలో. ఎలాంటి సౌకర్యాలకూ నోచని అత్యంత కుగ్రామంలో. అది కూడా అత్యంత వెనకబడిన సంతాల్ గిరిజన కుటుంబంలో. అలా అత్యంత అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ద్రౌపదీ ముర్ము జీవన ప్రస్థానం అత్యున్నతమైన రాష్ట్రపతి పీఠం దాకా సాగిన తీరు ఆద్యంతం ఆసక్తికరం. సౌకర్యాల లేమిని అధిగమించడంలో ఎంతటి అసమాన పట్టుదల కనబరిచారో వ్యక్తిగత జీవితంలో ఎదురైన పెను విషాదాలను తట్టుకోవడంలోనూ అంతకు మించిన మనో నిబ్బరం చూపారామె. అన్నింటికీ మించి ఎదిగిన కొద్దీ అంతకంతా ఒదిగుతూ వచ్చారు. వినమ్రతకు పర్యాయ పదంలా నిలిచారు. నెలకు కేవలం 10 రూపాయలతో కాలేజీ జీవితం గడుపుకున్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, 2021లో జార్ఖండ్ గవర్నర్‌గా పదవీ విరమణ చేశాక కూడా అంతే నిరాడంబరత ప్రదర్శించారు. స్వస్థలానికి తిరిగొచ్చి భర్త కట్టించిన సాదాసీదా ఇంట్లోనే మామూలు జీవితం గడిపారు. అంతటి నిగర్వి ముర్ము. జార్ఖండ్ గవర్నర్‌గా కూడా వివాదరహితంగా బాధ్యతలను నిర్వర్తించిన సౌమ్యురాలు. అధికార కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెకు విపక్షాల ఓట్లు కూడా గణనీయంగా పడేందుకు గిరిజన నేపథ్యంతో పాటు ఈ ప్రవర్తన కూడా కారణమైంది. ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామంలో 1958 జూన్ 20వ తేదీన జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. పట్టుదలతో స్కూలు చదువు, తర్వాత భువనేశ్వర్‌లో కాలేజీ చదువు పూర్తి చేశారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్‌గా జీవితం మొదలు పెట్టారు. స్కూల్ టీచర్‌గా, రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1997లో బీజేపీలో చేరారు. రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000లో చైర్పర్సన్ అయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తర్వాత బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2015లో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయ్యారు. పేరు: ద్రౌపది ముర్ము పుట్టిన తేదీ: జూన్ 20, 1958 పుట్టిన ఊరు: ఉపర్బేడ, మయూర్భంజ్, ఒడిశా వయస్సు: 64 ఏళ్లు తండ్రి: బిరంచి నారాయణ్ తుడు రాజకీయ పార్టీ: బీజేపీ చదువు: రమాదేవి విమెన్స్ యూనివర్సిటీ నుంచి బీఏ చేపట్టిన పదవులు: జార్ఖండ్ గవర్నర్, ఒడిశా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, వాణిజ్యం, రవాణా శాఖలు సంతానం: ఇతిశ్రీ ముర్ము (బ్యాంకు ఉద్యోగి) భర్త: శ్యాం చరణ్ ముర్ము (2014లో మృతి) తీరని విషాదాలు... ముర్ము వ్యక్తిగత జీవితంలో తీరని విషాదాలున్నాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన శ్యామ్ చరణ్ ముర్మును ఆమె పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2009–15 మధ్య కేవలం ఆరేళ్ల వ్యవధిలో భర్తతో పాటు ఇద్దరు కొడుకులను, తల్లిని, సోదరుడినీ కోల్పోయారు. ఈ విషాదం తనను ఆధ్యాత్మిక బాట పట్టించిందని 2016లో దూరదర్శన్ ఇంటర్వ్యూలో గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘అప్పట్లో పూర్తిగా కుంగిపోయి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అప్పుడే బ్రహ్మకుమారీల ఆశ్రమాన్ని సందర్శించాను. నా కుమార్తె కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు. ముర్ము చరిత్ర సృష్టించారు అత్యున్నత పదవికి ఎన్నికైన గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె గొప్ప రాష్ట్రపతిగా పేరు సంపాదిస్తారు. ఆమె పేదలు, అణగారిన వర్గాల ఆశారేఖగా ఉద్భవించారు. 130 కోట్ల మంది దేశ ప్రజలు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’జరుపుకుంటున్న వేళ గిరిజన బిడ్డ రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం గొప్ప విషయం. మారుమూల కుగ్రామంలో జన్మించిన ముర్ము సాధించిన విజయాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం. ముర్ముకు మద్దతుగా నిలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు మోదీ కృతజ్ఞతలు. – ప్రధాని నరేంద్ర మోదీ నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు నా అభినందనలు, శుభాకాంక్షలు. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజా జీవితంలో ద్రౌపది ముర్ము సంపాదించిన అనుభవం, అందించిన నిస్వార్థ సేవలు, ప్రజా సమస్యలకు ఆమెకున్న అవగాహన దేశానికి ఉపయోగడపతాయి. ద్రౌపది ముర్ముకు మనస్ఫూర్తి అభినందనలు. – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదుపరి రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక దేశానికి గర్వకారణం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ముర్ముకు అభినందనలు. –హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ద్రౌపది ముర్ముకు అభినందనలు. దేశాధినేతగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను ఆమె కాపాడుతారన్న నమ్మకం ఉంది. – బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నా తండ్రి పీఏ సంగ్మా ఇప్పుడు జీవించి ఉంటే ద్రౌపది ముర్ము విజయాన్ని చూసి ఎంతగానో సంతోషించేవారు. ముర్ముకు నా అభినందనలు. –మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గిన ముర్ముకు నా అభినందలు. భయం, పక్షపాతానికి తావులేకుండా రాజ్యాంగ పరిరక్షణకు ఆమె కృషి చేస్తారని ఆశిస్తున్నా. – యశ్వంత్ సిన్హా 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. –రాహుల్ గాంధీ -
Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి
న్యూఢిల్లీ: గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపదీ ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలను రెట్టింపు చేశారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు. అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము. దేశవ్యాప్తంగానే గాక ప్రపంచం నలుమూలల నుంచీ ముర్ముకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారని, దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలుపుతారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వెలిబుచ్చారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ముర్ము నివాసానికి వెళ్లి ఆమెను అభినందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ప్రత్యర్థి సిన్హా ప్రకటించారు. ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిగా తనదైన ముద్ర వేస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రతి రౌండూ ముర్ముదే రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌తో పాటు దేశవ్యాప్తంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలుత పార్లమెంటు సభ్యుల ఓట్లు లెక్కించారు. అనంతరం అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. అంతా ఊహించినట్టుగానే కౌంటింగ్ ప్రారంభం నుంచే సిన్హాపై ముర్ము నిర్ణాయక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రతి రౌండ్లోనూ దాదాపు మూడింట రెండొతుల ఓట్లతో దూసుకెళ్లారు. మూడో రౌండ్లోనే 50 శాతం ఓట్లు దాటేసి విజయానికి అవసరమైన మెజారిటీ మార్కు సాధించారు. అప్పటికి మరో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు మిగిలే ఉంది. చివరిదైన నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిశాక ముర్ము విజయాన్ని చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సర్టిఫికెట్ అందజేయనుంది. ► మొత్తం 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి ఎలక్టోరల్ కాలేజీలో 4,809 మంది సభ్యులున్నారు. వీరిలో4,754 మంది ఓటేశారు. వారి మొత్తం ఓట్ల విలువ 10,72,377. ► వాటిలో ముర్ము 64.03 శాతం ఓట్లు సాధించగా సిన్హా 36 శాతంతో సరిపెట్టుకున్నారు. ముర్ముకు 6,76,803 పోలవగా సిన్హాకు 3,80,177 పడ్డాయి. ► 2,824 మంది ప్రజాప్రతినిధులు ముర్ముకు, 1,877 మంది సిన్హాకు ఓటేశారు. ► 15 మంది ఎంపీలతో పాటు మొత్తం 53 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. ► ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది ఓటేశారు. ► గిరిజన బిడ్డ అయిన ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు. ► 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 125 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తేలింది. ► అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. ► ముర్ముకు యూపీ, మహారాష్ట్ర, ఏపీల నుంచి ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చాయి. సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి. ► ఆంధ్రప్రదేశ్, సిక్కింలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా, నాగాలాండ్‌లో మొత్తం ఎమ్మెల్యేలూ ముర్ముకే ఓటేయడం విశేషం! ► కేరళ నుంచి దాదాపుగా అన్ని ఓట్లూ సిన్హాకే పడ్డాయి. -
సాక్షి కార్టూన్ 22-07-2022
-
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్‌దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
ద్రౌపది ముర్మును గుర్తు పట్టారా.. ఫొటోలో ఎక్కడున్నారో చెప్పండి చూద్దాం!
Draupadi Murmu.. కొద్ది గంటల్లో కాబోయే రాష్ట్రపతి ఎవరు అనేది తేలిపోనుంది. 15వ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్డీయే అనూహ్యంగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము(64)ను అభ్యర్థిగా నిలిపిన విషయం తెలిసిందే. దీంతో, ఆమె ఫ్యామిలీ వివరాలు, జీవన విధానంపై భారతీయలు ఆరా తీశారు. అయితే, తాజాగా ఆమె కాలేజ్ డేస్‌లో దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ద్రౌపది ముర్ము స్వగ్రామం.. ఒరిస్సా మయూర్భంజ్లోని రాయంగ్పూర్లో ఉన్న తన ఇంట్లో ఆమె తన ఫ్యామిలీతో దిగిన ఫొటో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ద్రౌపది ముర్ము.. ఫొటోలో వెనుక వరుసలో కుడి నుండి మొదటిగా నిలబడి ఉన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయావకాశాలు ముర్ముకే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. ముర్ము స్వగ్రామంలో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. ద్రౌపది ముర్ము విజయం ఖాయమని భావిస్తున్న రాయ్‌రంగ్‌పూర్ గ్రామ పెద్దలు 20వేలకు పైగా స్పెషల్ లడ్డూలు తయారు చేయించారు. అంతేకాదు.. కోయ డ్యాన్సులతో బాణాసంచాలతో సంబురాలకు సర్వం సిద్ధం చేశారు. -
రూం నెం.63లో మిస్టర్ బాలెట్ బాక్స్
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశమంతా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలలో ఎవరు నెగ్గుతారనేదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. పార్లమెంట్ రూం నెంబర్ 63 వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ► పార్లమెంట్ హౌజ్‌తో సహా దేశంలోని మొత్తం 31 ఓటింగ్ కేంద్రాల నుంచి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు మంగళవారం సాయంత్రం కల్లా పార్లమెంట్‌కు చేరుకున్నాయి. ► ఈ బ్యాలెట్ బాక్సులను ‘మిస్టర్ బాలెట్ బాక్స్’గా పిలుస్తుంటారు. ► రూమ్ నెంబర్ 63 పార్లమెంట్ స్ట్రాంగ్ రూమ్. అందుకే ఈ గదిలోనే మిస్టర్ బాలెట్ బాక్స్‌ను ఉంచారు. ఇక్కడే ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి, ఆ రూమ్‌ను, చుట్టుపక్కల ప్రాంతాన్ని సైలెంట్ జోన్‌గా ప్రకటించారు. ► రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ.. రాష్ట్రపతి ఎన్నికలకు చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. కాబట్టి, ఆయన ఆధ్వర్యంలోనే కౌంటింగ్ మొదలవుతుంది. ► ముందుగా ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆపై రాజ్యసభ సెక్రెటరీ దగ్గరుండి ట్రెండ్‌ను ప్రకటిస్తారు. ఆ తర్వాతే ఆల్ఫాబెట్ క్రమంలో రాష్ట్రాల ఓట్లను లెక్కిస్తారు. మళ్లీ ఒకసారి ట్రెండ్ మధ్యలో చెప్తారు. చివరాఖరికి రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను.. విజేతను ప్రకటిస్తారు. ► ప్రతీ బ్యాలెట్ బాక్స్‌కు ‘మిస్టర్ బాలెట్ బాక్స్’ కింద ఈ-టికెట్ జారీ చేస్తుంది ఎన్నికల సంఘం. ► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేది ఎంపీలు, ఎమ్మెల్యేలు. కానీ, వాళ్లంతా ప్రజాప్రతినిధులై ఉండాలి. అంటే.. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదన్నమాట. ► ఈసారి ఎన్నికల్లో దాదాపు 99 శాతం మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ వెల్లడించింది. ► మొత్తం 4,809 ఎలక్టోర్స్.. 778 ఎంపీలు, ,4,033 ఎమ్మెల్యేలు ఓటేశారు. అనారోగ్యంతో కొందరు ఓటేయలేదు. ► గత రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10,69,358 ఓట్లకుగానూ రామ్‌నాథ్ కోవింద్‌కు 7,02,044 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి మీరా కుమార్‌కు 3,67,314 ఓట్లు వచ్చాయి. -
Droupadi Murmu: ముర్ము కోసం ఆ ఊరిలో పండుగ
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. భారత దేశానికి పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అవుతారనే సస్పెన్స్ మరికొన్ని గంట్లలో వీడిపోతుంది. బరిలో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ఉండగా.. విజయావకాశాలు ముర్ముకే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. దేశవ్యాప్తంగా సంబురాలకు ఎన్డీయే కూటమి సిద్ధమవుతోంది. పలు రాష్ట్రాల్లో విజయోత్సవాలకు బీజేపీ అంతా సిద్ధం చేసింది. తీపి వంటకాలు, ప్రత్యేక నృత్యాల కార్యక్రమాలకు ఏర్పాటు చేసింది కూడా. అయితే ద్రౌపది ముర్ము స్వగ్రామం ఒడిశా రాయ్రంగ్పూర్లో మాత్రం పండుగ వాతావరణం కాస్తంత ఎక్కువే నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం ఖాయమని భావిస్తోంది రాయ్‌రంగ్‌పూర్ గ్రామం. అందుకే 20వేలకు పైగా స్పెషల్ లడ్డూలు తయారు చేయించారు ఆ ఊరి పెద్దలు. అంతేకాదు.. కోయ డ్యాన్సులతో బాణాసంచాలతో సంబురాలకు సర్వం సిద్ధం చేశారు. ఇక ఆమె చదివిన పాఠశాలలో కోలాహలం మామూలుగా లేదు. ఆమె దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని ఆ స్కూల్ మాజీ హెడ్ మాస్టర్, ముర్ముకు పాఠాలు నేర్పిన బిశ్వేశ్వర్ మోహంతి తెలిపారు. తమ స్కూల్లో చదివి రాష్ట్రపతి కాబోతున్నందుకు విద్యార్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చదువుతామంటూ చెప్తున్నారు వాళ్లలో కొందరు. ద్రౌపది ముర్ము గనుక విజయం సాధిస్తే.. దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా నిలుస్తారు. Odisha | Locals in Rairangpur prepare laddu ahead of the counting of votes for the Presidential election tomorrow. NDA's Presidential candidate Droupadi Murmu resides in Rairangpur. pic.twitter.com/vMhLQwfuGe — ANI (@ANI) July 20, 2022 ఇదిలా ఉంటే.. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగ్గా.. ఇవాళ(గురువారం) పార్లమెంట్ హౌజ్‌లోని రూం నెంబర్ 63లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఇక్కడికి చేరుకున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో రూమ్ నెంబర్ 63ని సైలెంట్ జోన్‌గా ప్రకటించారు కూడా. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి -
Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఘన విజయం
Presidential Election 2022 Result Live: అప్డేట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 07:50 మూడో రౌండ్లోనూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో కలిపి ఆమె సగానికి పైగా ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్ల విలువ యశ్వంత్ సిన్హాకు 2,61, 062 ఓట్ల విలువ పోలైంది. 05:30 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఓట్లు చూస్తుంటే అంచనాలకు మించి మెజార్జీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది.. 75 శాతానికిపైగా ఓట్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది 03: 00PM రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓట్ల లెక్కింపు ముగిసింది. కాసేపట్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ద్రౌపది ముర్ముకు 62 శాతానికి పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 02: 50PM రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా.. సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. ఓటు విలువ ముర్ముకు 3,78,00 ఉండగా , యశ్వంత్ సిన్హాకు 1,45,600 గా ఉంది. చెల్లని ఎంపీ ఓట్లు 15గా తేలాయి. మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. కాగా ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1:50PM కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు 11:00AM రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పార్లమెంట్ భవనంలో మొదలైన కౌంటింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ హౌస్‌లో లెక్కిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. -
సజావుగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సజావుగా ముగిసింది. 175 ఎమ్మెల్యేలకు గాను 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 172 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కందుకూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న ప్రత్యేక అనుమతితో హైదరాబాద్‌లో ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ విదేశాల్లో ఉండటంతో ఓటు వేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి ఓటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఆర్కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనిత, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్సీపీ బాటలో టీడీపీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. భారత రాష్ట్రపతిగా తొలిసారి పోటీ చేస్తున్న ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అధికారపార్టీ బాటలో నడిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకే 172 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడం పూర్తయినప్పటికీ సాంకేతికంగా ఇద్దరు సభ్యులు ఓటింగ్‌కు రాకపోవడంతో 5 గంటల వరకు సిబ్బంది ఎదురు చూశారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసి అసెంబ్లీలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య విమానంలో బ్యాలెట్ బాక్స్‌ను మంగళవారం ఢిల్లీకి తరలించనున్నారు. గురువారం ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికైన అభ్యర్థి ఈనెల 25న నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కున్న ఎమ్మెల్యేలు, పాస్‌లున్న వ్యక్తులను తప్ప ఎవరినీ లోపలకి అనుమతించలేదు. మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియో తీశారు. ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, ఎన్నికల ప్రత్యేక అధికారి సంతోష్ అజ్మీరా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె.రాజ్ కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారి వనితారాణి నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (ఫొటోలు)
-
రాష్ట్రపతి ఎన్నికలు.. ఢిల్లీలో ఓటేసిన కేంద్ర మంత్రులు, ఎంపీలు
-
అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎం వాడరు!
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎన్నో సంస్కరణలు, మార్పులు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. ఇందులో ఈవీఎంల వాడకం అనేది టెక్నాలజీతో ముడిపడిన అంశం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి చర్చనీయాంశంగా(రాజకీయ విమర్శలకు సైతం వేదిక) మారుతుంటుంది కూడా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ఈవీఎంలనే ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడటం లేదు?. బ్యాలెట్ పేపర్ విధానంతోనే రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు జరుగుతుందసలు?.. ముందుగా ఈవీఎం టెక్నాలజీ సంగతి చూద్దాం. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు.. దాని పక్కనే సంబంధిత బటన్ ఉంటుంది. ఓటర్లు నచ్చిన అభ్యర్థి బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని కౌంటింగ్ రోజున క్షణాల్లో చూపించేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానం అలగ్ ఉంటుంది. ఈవీఎంలు ఎంత మాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ వర్తించదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటర్లు ఓటేయొచ్చు. చివరికి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడ్డాయనే ఆధారంగా విజేతను ప్రకటిస్తారు!. బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో ఓటర్ ఇష్టాన్ని బట్టి ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. మరి ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. -
సిన్హాకు బదులు ద్రౌపది ముర్ముకు ఓటేసిన సీతక్క..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్‌లో భాగంగా తప్పిదం చేశారు. ప్రతిపక్షాల బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కాకుండా ఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకు ఆమె ఓటేశారు. కాగా, తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారులకు సీతక్క తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరింది. కాగా, నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు సీతక్కకు చెప్పారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతక్క తెలిపారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ ఇంక్ బ్యాలెట్ పేపర్ మీద పడింది. బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్‌నే బాక్స్‌లో వేశాను. నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశాను. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఓటు చెల్లుతుందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి’’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ఓటు హక్కు వినియోగించుకోనున్న కేసీఆర్ -
ఓటుహక్కు వినియోగించుకున్న ప్రధానమంత్రి మోదీ
-
ఓటు వేసిన సీఎం వైఎస్ జగన్
-
రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు పంచారు: యశ్వంత్ సిన్హా
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తన పోటీని.. ఒక పోరాటంగా అభివర్ణించుకున్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే చేయడం లేదు.. ప్రభుత్వ సంస్థలపై కూడా చేస్తున్నాను. వాళ్లు(అవతలి పక్షాలను ఉద్దేశించి..) చాలా శక్తివంతంగా మారారు. తమకే ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తూ పార్టీలను చీల్చారు. ఒకానొక దశలో డబ్బుతో ప్రలోభ పెట్టారు కూడా. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. దేశ ప్రజాస్వామ్యానికి మార్గాన్ని నిర్దేశిస్తాయి, అది నిలుస్తుందా లేదంటే ముగుస్తుందా అనేది చూడాలి. ఓటర్లందరూ తమ ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రహస్య బ్యాలెట్ ఓటింగ్. వారు తమ విచక్షణను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నన్ను ఎన్నుకుంటారని ఆశిస్తున్నా అని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. I am not just fighting a political fight but a fight against govt agencies too. They have become too powerful. They are breaking up parties, forcing people to vote for them. There is also a game of money involved: Opposition Presidential candidate Yashwant Sinha pic.twitter.com/l5BydMLWAD — ANI (@ANI) July 18, 2022 -
Presidential Elections 2022 In TS: ఓటేయని మంత్రి గంగుల
► తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 119 ఎమ్మెల్యేలలో 117 మంది ఓటేశారు. మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. . ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ► రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్లు సైతం ఓటు వేశారు. ► రాష్టప్రతి ఎన్నికల్లో ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీలో 116 మంది ఎమ్మెల్యే లు తమ ఓటు వినియోగించుకున్నారు. ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్‌లు ఓటు వేయలేదు. కోవిడ్ కారణంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఓటు వేయనున్నారు గంగుల కమలాకర్. ► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకు మొత్తం 111 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► రాష్టప్రతి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటి వరకు 120 ఓట్లకు గాను 85 ఓట్లు పోలింగ్ పూర్తయింది. ► వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఏరియల్ సర్వేకు వెళ్లకుండానే హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ► ఏపీకి చెందిన కందుకూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేశారు. ► తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి , మల్లారెడ్డి సహా పలువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తెలంగాణలో మొదటగా ఓటేసిన మంత్రి కేటీఆర్ ► రాష్ట్రపతి ఎన్నికలు 2022 పోలింగ్ కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ భవన్లో టీఆరెస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ ద్వారా అవగాహన కల్పించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఒకేసారి ఎమ్మెల్యేలను తరలించేందుకు మూడు బస్సులను ఏర్పాటు చేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా టీఆరెస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పింక్ బ్యాలెట్ ఉండటంతో కన్ఫ్యూజ్ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ► గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్ కావడంతో.. అందరి ఓటింగ్ అయ్యాక ఆఖరిలో ఆయన ఓటేస్తారు. ► రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ కు సంబంధించిన ఎంపీలంతా పార్లమెంట్ లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పొలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► తెలంగాణ కు సంబంధించిన 119 ఎమ్మెల్యే లతో పాటు ఏపీకి చెందిన కందుకూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి కూడా తెలంగాణ అసెంబ్లీ లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భారత ప్రభుత్వం గుర్తించిన 22 అధికార భాషలలో ఏదైనా ఓక దానితో తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎంపీ లకు గ్రీన్ ,ఎమ్మెల్యే లకు పింక్ బ్యాలెట్ పత్రాలు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ లో జరిగే రాష్టప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే లు ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి , హన్మంతు షిండే, కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్‌గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ తరపున ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు. -
ఏపీ: ఓటు హక్కు వినియోగించుకున్న 173 మంది ఎమ్మెల్యేలు
►రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ►రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎన్.వెంకట్ గౌడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 169 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ఎం.శంకర్ నారాయణ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం 167 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో 161 మంది శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 14 మంది శాసన సభ్యులు ఓటు వేయాల్సి ఉంది. ► ఓటు వేసిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ► ఓటు వేసిన పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, హోం శాఖ మంత్రి తానేటి వనిత ► ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటు వేశారు. ► ఏపీ అసెంబ్లీలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు. ► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. ► ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. ► టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు తెలిపింది. 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ బ్యాక్సులను ఇప్పటికే రాష్ట్రాలకు తరలించింది. ఈ ఎన్నికల్లో 4,809 మంది ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. -
ఈనెల 21 రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అప్డేట్స్.. ► రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటేయగా.. రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు 21న విడుదల కానున్నాయి. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ► పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. West Bengal CM Mamata Banerjee arrives at the State Assembly in Kolkata to cast her vote for the #PresidentialElections pic.twitter.com/iEo8uweSLy — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్లో ఓటేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ Delhi | Union Minister & BJP MP Dharmendra Pradhan casts his vote in the Parliament for the Presidential polls pic.twitter.com/kZ3fW7Bl7M — ANI (@ANI) July 18, 2022 ►రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ Delhi | Congress MP Rahul Gandhi casts his vote for the Presidential elections pic.twitter.com/J9LE2hKmiQ — ANI (@ANI) July 18, 2022 ► ఢిల్లీ ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | AAP MP Harbhajan Singh & BJP MP Gautam Gambhir cast their votes for the Presidential polls pic.twitter.com/BBicynFPZl — ANI (@ANI) July 18, 2022 ►రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలో పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ శశి థరూర్, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Congress MPs Sonia Gandhi, Shashi Tharoor, and Mallikarjun Kharge cast their votes for the Presidential polls pic.twitter.com/7KoiIkOMGE — ANI (@ANI) July 18, 2022 ►ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ధన్కర్ అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతాడని తనకు ఖచ్చితంగా తెలుసన్నారు. "I am certain that he will be an excellent and inspiring Vice President," PM Modi after accompanying NDA's VP candidate Jagdeep Dhankhar for nomination filing pic.twitter.com/HgODAiADxe — ANI (@ANI) July 18, 2022 ► ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే. గుజరాత్‌కు చెందిన ఏకైక ఎన్సీపీ ఎమ్మెల్యే కంధాల్ ఎస్ జడేజా ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. Gujarat | NCP MLA Kandhal S Jadeja says he has voted for NDA's presidential candidate Droupadi Murmu pic.twitter.com/dorgGuOQqT — ANI (@ANI) July 18, 2022 ► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్. Defence Minister Rajnath Singh, Union Law Minister Kiren Rijiju, Congress MP Randeep Singh Surjewala and Samajwadi Party MP Jaya Bachchan cast their votes for the Presidential polls in Delhi pic.twitter.com/ReE4IkCwRt — ANI (@ANI) July 18, 2022 ► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ I've voted for the #PresidentialElections. We hope that NDA's candidate Droupadi Murmu will get maximum votes from our state: Assam CM Himanta Biswa Sarma pic.twitter.com/6R0M7VWAgu — ANI (@ANI) July 18, 2022 ►రాష్టపతి ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పూరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితోపాటు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీలో ఓటేశారు. Union Ministers Mansukh Mandaviya, Hardeep Singh Puri, Samajwadi Party's Mulayam Singh Yadav and NCP chief Sharad Pawar cast their votes for the #PresidentialPolls in Delhi pic.twitter.com/awpERyDYvZ — ANI (@ANI) July 18, 2022 ►హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Chandigarh | Haryana CM Manohar Lal Khattar casts his vote for Presidential elections pic.twitter.com/fKlRUxbwC9 — ANI (@ANI) July 18, 2022 ► కేరళ అసెంబ్లీలో ఓటు వేసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ Kerala Chief Minister Pinarayi Vijayan casts his vote for the Presidential election, at the State Assembly in Thiruvananthapuram. pic.twitter.com/7NxGRMIn81 — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్లో ఓటు వేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా Delhi | Union Home Minister Amit Shah cast his vote for the Presidential election, at Parliament. pic.twitter.com/BKINSA0WZy — ANI (@ANI) July 18, 2022 ► ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ #WATCH | Delhi: NDA's Vice Presidential candidate Jagdeep Dhankhar arrives at the Parliament Library Building. He will file his nomination today. pic.twitter.com/DC3wkaNURp — ANI (@ANI) July 18, 2022 ► ఓటు వేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ Delhi CM Arvind Kejriwal casts his vote for the Presidential election, at Delhi Assembly. pic.twitter.com/rikMFXanJ5 — ANI (@ANI) July 18, 2022 ► భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీల్ చేర్ వచ్చిన మన్మోహన్ పార్లమెంట్లో తన ఓటు వేశారు. Former Prime Minister of India and Congress MP Manmohan Singh, after casting his vote in the election being held for the post of President of India in Parliament pic.twitter.com/pm4Bihza1Z — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్లో ఓటు వేసిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ Delhi | Union Minister and BJP MP Anurag Thakur casts his vote in the election being held for the post of President of India, in Parliament pic.twitter.com/EGPLZBOGdZ — ANI (@ANI) July 18, 2022 ► ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రులు.. Odisha CM Naveen Patnaik votes in the 16th Presidential election, at the State Assembly in Bhubaneswar. pic.twitter.com/lvGxtuct9i — ANI (@ANI) July 18, 2022 Rajasthan CM Ashok Gehlot casts his vote for the Presidential election, at the State Assembly in Jaipur. pic.twitter.com/jqNsu5suYu — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022 Madhya Pradesh CM Shivraj Singh Chouhan casts his vote for the Presidential election, at the State Assembly in Bhopal. pic.twitter.com/ssobmZ1ocm — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022 Dehradun | Uttarakhand CM Pushkar Singh Dhami votes in the 16th Presidential election pic.twitter.com/B5yWLVjnjJ — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2022 ► ఓటు వేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ► యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అసెంబ్లీలో ఓటు వేశారు. #WATCH Uttar Pradesh CM Yogi Adityanath casts vote to elect new President, in Lucknow#PresidentialElection pic.twitter.com/VDJ4WZIPp7 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 18, 2022 ► భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T — ANI (@ANI) July 18, 2022 ► కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు సీఎం స్టాలిన్. ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH Tamil Nadu CM MK Stalin casts vote in 16th Presidential election, in Chennai pic.twitter.com/fmFb9sdw49 — ANI (@ANI) July 18, 2022 ► రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయంత్రం 5 గం. వరకు ఓటింగ్ జరగనుంది. ► సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్ ఓటింగ్‌కు అవకాశముంటుంది. ► జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది. ► 1971 జనాభా లెక్కల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువను నిర్ధారించారు. జనాభా, శాసనసభ స్థానాల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంది. ► గ్రీన్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎంపీలు, పింక్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో ఓటు వేయనున్నారు. ► దేశ ప్రథమ పౌరుడు, 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ బ్యాక్సులను ఇప్పటికే రాష్ట్రాలకు తరలించింది. ఈ ఎన్నికల్లో 4,809 మంది ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. -
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక నేడే
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి దాకా పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర్రాలకు తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లూ చేసింది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్డీఏ తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ము మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పై చిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి. దాంతో సునాయాసంగా విజయం సాధించి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక ప్రతిభా పాటిల్ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టనున్న రెండో మహిళ అవుతారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కుండదు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్ ఓటింగ్‌కు అవకాశముంటుంది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది. -
Presidential election 2022: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్, జాట్ నాయకుడు జగదీప్ ధన్‌ఖడ్(71)ను బరిలోకి దించనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. ధన్‌ఖడ్ అచ్ఛమైన రైతు బిడ్డ అని ప్రశంసించారు. ప్రజల గవర్నర్‌గా పేరు సంపాదించారని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో విస్తృత సంప్రదింపుల అనంతరం ధన్‌ఖడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రధాని మోదీ అభినందనలు భారత రాజ్యాంగంపై జగదీప్ ధన్‌ఖడ్‌కు అపార పరిజ్ఞానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చట్టసభల వ్యవహారాలపై మంచి పట్టు ఉందన్నారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా చైర్మన్ హోదాలో రాజ్యసభను చక్కగా ముందుకు నడిపిస్తారంటూ అభినందనలు తెలియజేశారు. ఉప రాష్ట్రపతిగా తన పేరును ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ధన్‌ఖడ్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇలా.. కొత్త ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయానికొస్తే నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులంతా కలిసి ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒకటి. అందరి ఓటు విలువ సమానమే. ప్రస్తుతం పార్లమెంట్లో మొత్తం ఎంపీల సంఖ్య 780. బీజేపీకి సొంతంగానే 394 మంది ఎంపీలున్నారు. మెజారిటీ (390) కంటే అధికంగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారు. అంచలంచెలుగా ఎదుగుతూ... జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాలో మారుమూల కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చీత్తోర్‌గఢ్ సైనిక్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ రాజస్తాన్ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్తాన్‌లో ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందారు. రాజస్తాన్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝున్‌ఝున్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో రాజస్తాన్‌లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జూలైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనేక విషయాల్లో ధన్‌ఖఢ్ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు భార్య సుదేశ్ ధన్‌ఖడ్, ఓ కుమార్తె ఉన్నారు.