Prodduturu
-
CM Jagan: ఆరంభం అదరహో! విపక్షాలు బెదరహో!!
బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర చూసిన తర్వాత వైఎస్సార్సీపీ విజయావకాశాలపై ఇంకెవరికైనా సందేహం ఉంటే పూర్తిగా నివృత్తి అయి ఉంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి గుండెలు జారిపోయి ఉంటాయి. యాత్ర ఆరంభం అదిరిన తీరు అదరహో అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్ విన్న తర్వాత విపక్షాలు బెదరహో అయి ఉండాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్పీచ్ ఎంతో సమగ్రంగా, అన్ని అంశాలను తడుముతూ వచ్చింది. చాలామందికి కొన్ని విషయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరి ఏమిటి అని ఎదురు చూసేవారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు. తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ డ్రగ్ కేసులను ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. తన చెల్లెళ్లకు కూడా గట్టిగానే సమాదానం ఇచ్చారని చెప్పాలి. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాన్ని ఆయన బహిర్గతం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్‌లో ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా, సంస్కారవంతమైన విమర్శలు, అర్దవంతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. చంద్రబాబు నాయుడు ఈ మద్య కాలంలో ఎక్కడ మాట్లాడినా అసభ్య పదాలను వాడుతూ తన పెద్ద వయసుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ద్వేషంతో ఏదేదో మాట్లాడుతూ తన పరువు పోగొట్టుకుంటున్నారు. వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటున్నా, ఆయన తన వైఖరి మార్చుకోవడం లేదు. తాము గతంలో ఏమి చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆయనకు దత్తపుత్రుడుగా పేరొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే ధోరణి అవలంభిస్తున్నారు. చంద్రబాబు అసలు పుత్రుడు సంగతి సరేసరి. ఆయన ఎప్పుడూ స్పీచ్‌లో ఉండాల్సిన డీసెన్సీని మెయింటెన్ చేయడం లేదు. వీరికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తాను చెప్పదలచుకున్న విషయాలను సవ్యమైన బాషలో వివరించారు. తొలిరోజు ఆయన తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలో నివాళి అర్పించి ప్రారంభించారు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తల్లికి ఏదో అన్యాయం చేశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసే దిక్కుమాలిన ప్రచారానికి చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ స్వయంగా అక్కడకు వచ్చి కుమారుడిని ఆశీర్వదించారు'. ఎప్పటిమాదిరి నుదుట ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఆ సన్నివేశం వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి. అక్కడ నుంచి బయల్దేరి వేంపల్లి, వీరపనాయుని పల్లి, ఎర్రగుంట్ల తదితర గ్రామాల గుండా ప్రొద్దుటూరు చేరుకునే మార్గమధ్యంలో వేలాది మంది జనం తరలివచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు స్వాగతం చెప్పారు. "కొందరైతే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న బస్తో పాటు పరుగులు తీస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను అభినందించడానికి పోటీ పడ్డారు. మామూలుగా అయితే ఈ దూరం గంటన్నర నుంచి రెండు గంటలలోపు చేరవచ్చు. అలాంటిది సుమారు ఐదారు గంటలు పట్టింది". కడప లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి వివేకా హత్య కేసు గురించి ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించి, చిన్నాన్నను ఎవరో చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, కడప జిల్లా ప్రజలందరికి తెలుసునని అన్నారు. 'వివేకాను చంపి, తానే చంపానని చెప్పుకుంటున్న హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు'. ఇద్దరు చెల్లెమ్మలు అంటూ షర్మిల, సునీతలను పేర్లు చెప్పకుండానే వారి గురించి మాట్లాడుతూ, 'రాజకీయ స్వార్దంతో తపిస్తున్న నా చెల్లెళ్లు" అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, చెల్లెళ్లు హంతకులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా ఆయన చెల్లెళ్లను తప్పు పట్టారు. ఇదంతా నన్ను దెబ్బతీసే రాజకీయం అని కూడా అంటున్నారంటే.. ఇది కలియుగం అని అనుకోవాల్సి వస్తుందని తాత్వికంగా వ్యాఖ్యానించారు. దీంతో.. "వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి షర్మిల, సునీత మద్దతు ఇస్తున్నారన్న అంశాన్ని ఆయన ప్రజల దృష్టికి తెచ్చారు. అలాగే వారిద్దరు తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అవడం, చంద్రబాబు చెప్పినట్లు చేయడం వంటి విషయాలను ఆయన వివరించారు. 'తమ కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ద్వజమెత్తారు. అలాగే విశాఖ డ్రగ్ కేసులో చంద్రబాబు తనకు సంబందించినవారు ఉన్నారని గుర్తించి, దానని కప్పిపుచ్చేందుకు వెంటనే వైఎస్సార్సీపీపై నెట్టివేస్తూ ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు'. ఈ కేసులో ఉన్నది చంద్రబాబు, ఆయన వదినకు చెందిన బంధువులేనని ఆయన అన్నారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముతున్నానని వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు." చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ నలభై ఐదేళ్లుగా కుట్రలు చేస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని, వివేకా బతికి ఉంటే శత్రువుగా చూస్తారని, ఆయన చనిపోగానే కొత్త రాగం అందుకుంటారని, ఎన్.టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనవారు, చనిపోయిన తర్వాత ఎన్.టీ రామారావు శవాన్ని లాగేసుకున్నారని, దండలు వేసి, విగ్రహాలు పెట్టారని.. సీఎం ఎద్దేవ చేశారు. చంద్రబాబు గుణగణాలను ఆయా సందర్భాలలో వివరిస్తూ.. చంద్రబాబు నిత్యం అబద్ధాలు, మోసాలపై ఆధారపడి రాజకీయాలను చేస్తారని అని ఆయన ద్వజమెత్తారు. 2014 తెలుగుదేశం మానిఫెస్టోలో చెప్పిన అంశాలను ప్రస్తావించి వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ రుణమాఫి తదితర వాగ్దానాలను ఉటంకించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. టీడీపీ మానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి కూడా గుర్తు చేశారు. 2014లో ఏ మూడు పార్టీల కూటమి అయితే పోటీచేసి ప్రజలను మోసం చేసిందో, ఇప్పుడు కూడా అదే కూటమి పోటీలో ఉందని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లపడి పొత్తు పెట్టుకున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవ చేశారు. 2014లోచంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్‌ల ఫోటోలతో కూడిన కరపత్రాలను ప్రజలకు చూపిస్తూ, అందులో ఉన్న రుణమాఫీ, నిరుద్యోగ బృతి తదితర హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. వీరు ముగ్గురు మళ్లీ మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవైపు చంద్రబాబు హామీలలోని డొల్లతనాన్ని వివరిస్తూ.., తాను ఏభైఎనిమిది నెలల్లో అమలు చేసిన వాగ్దానాల గురించి వివరించారు. ప్రత్యేకించి ఇళ్లవద్దకే ప్రజలకు అవసరమైన సేవలు అందించడం, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, వృద్దాప్య పెన్షన్, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర స్కీములను తాను అమలు చేశానని ప్రజలకు తెలియచేశారు. దిశ యాప్‌తో సహా పాలనతో తీసుకు వచ్చిన సంస్కరణలను, పేదలకు ఇళ్ల స్థలాలు మొదలైనవాటితో పాటు తన హయాంలో జరిగిన అభివృద్ది పనులను కూడా తెలియచేశారు.17 మెడికల్ కాలేజీలు, కొత్తగా పోర్టుల నిర్మాణం, కడప తదితర జిల్లాలలో వస్తున్న పరిశ్రమలు మొదలైనవాటి గురించ కూడా వివరించారు. "దుష్టచతుష్టయంలో బాగంగా ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 ల పాత్రను విమర్శిస్తూ, ఈనాడు రాస్తున్న రోత రాతలు చూశాక 'ఛీ' అని పారేస్తానని" ఆయన చెప్పారు. పొత్తు ద్వారా ప్రత్యేక హోదాకానీ, ఇతరత్రా కొత్త హామీ ఏదైనా సాధించారా అని మూడు పార్టీలను ప్రశ్నించారు. స్థూలంగా చెప్పాలంటే ఈ మూడు పార్టీల కూటమిని అభివృద్ది నిరోధక, పేదల వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. 'ఎప్పటి మాదిరి మళ్లీ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని వీరు ప్రజల వద్దకు వస్తారని, వారిని నమ్మవద్దని' వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. చంద్రబాబును పొరపాటున నమ్మితే తమ కంటిని తమ వేలుతోనే పొడుచుకున్నట్లేనని, ఇప్పుడు అమలు అవుతున్న స్కీములు రద్దు అవుతాయని కూడా ఆయన హెచ్చరించారు. పేదల భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు. 'ఒక మాటలోచెప్పాలంటే ఈ ప్రసంగం అంతా ఒక సమగ్రమైన స్పీచ్' అనిపిస్తుంది. అన్ని కోణాలను గంట సమయంలో సృజించారు. "ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో స్పందన పెద్ద ఎత్తున కనిపించింది. సభ గంటల తరబడి ఆలస్యం అయినా పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అంతా అక్కడే ఉండి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను 'సీఎం.., సీఎం..' అంటూ శుభాకాంక్షలు చెప్పిన తీరు కచ్చితంగా ఆయనకు పెద్ద బూస్ట్‌గానే ఉంది. ఇది వైఎస్సార్సీపీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటే, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి మరింత కంగారు పుట్టిస్తుంది". ఇదే రోజు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పెట్టిన సభలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభతో పోల్చితే చాలా తక్కువ వచ్చినట్లు చెప్పక తప్పదు. చంద్రబాబు స్పీచ్‌లో కొత్త విషయం ఏమీ ఉండడం లేదు. ఒక అపనమ్మకం కనిపిస్తుంది. అందుకే భయపడి మొదటిసారి కుప్పంలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అర్ధించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీముల గురించి ప్రస్తావించడానికి ఆయన వెనుకాడుతున్నారు. చంద్రబాబుకు క్రెడిబిలిటి లేని అంశాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదాహరణంగా వివరిస్తూ ఉంటే, చంద్రబాబు మాత్రం కేవలం దూషణలకే పరిమితం అవుతున్నారు. "ఒక పరిశీలకుడు అన్నట్లు చంద్రబాబు ఇస్తున్న సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు". క్రెడిబిలిటి ఆయనకు లేకపోవడమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఆ ఇబ్బంది లేదు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా పేదల బవిష్యత్తు కోసం అంతా అండగా నిలబడాలని పిలుపు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు సభలను చూస్తే ఏపీలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, చంద్రబాబు సభలలో ఆ స్పూర్తి కొరవడినట్లు అనిపిస్తుంది'. చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ వల్లో, ఏమో తెలియదు కానీ, 2019లో మాదిరి తొలి దశలో కాకుండా, ఈసారి నాలుగో దశకు ఎన్నికల తేదీలు వచ్చాయి. అంటే సుమారు నెల రోజులు ఆలస్యంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 'చంద్రబాబు తాను, కూటమి పక్షాలు సర్దుకోవడానికి ఈ టైమ్ అవసరం అని భావిస్తుంటే, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఈ టైమ్‌ను తనకు అనుకూలంగా మలచుకుని బస్ యాత్రను పెట్టుకుని జనంలోకి మరింత చొచ్చుకువెళ్లగలిగారు. తద్వారా జనంలో తనకు ఉన్న పట్టు ఏమిటో చూపించగలుగుతున్నారు'. దీని ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభంజనం మరోసారి రావచ్చన్న అబిప్రాయం కలుగుతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అడుగడుగునా అపూర్వ ఆదరణ...జనసంద్రమైన ప్రొద్దుటూరు
-
నేరం వాళ్లది..నింద మనమీద..ప్రొద్దుటూరు గడ్డపై సీఎం జగన్ సింహ గర్జన
-
ప్రొద్దుటూరులో సీఎం జగన్ భారీ బహిరంగ సభ
-
ప్రొద్దుటూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్
-
తనువు లేకున్నా.. తనుంది!
ప్రొద్దుటూరు క్రైం: తాను చనిపోయినా.. తన శరీరంలోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలనే ఆమె గొప్ప ఆలోచన పలువురికి ప్రాణం పోసింది. అవయవ దానంతో యువతి ఆదర్శంగా నిలవడమే కాకుండా మరికొందరికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దేవరశెట్టి సుచిత్ర (25) అనే యువతి బ్రెయిన్ డెడ్‌తో సోమవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌కు చెందిన దేవరశెట్టి నరసింహులు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తె రూపశరణ్య, చిన్న కుమార్తె సుచిత్ర. సుచిత్ర స్థానికంగా బీ ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని నెలల క్రితం నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, రూపశరణ్య బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. నరసింహులు విద్యుత్‌శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. సుచిత్రకు డిసెంబర్ 31న తీవ్ర తలనొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు, తోటి ఉద్యోగులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి వైద్యుల సూచన మేరకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించారు. బ్రైయిన్లో రక్తం గడ్డకట్టిందని స్కానింగ్‌లో నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు సుచిత్రను వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగినా కోలుకోలేక సుచిత్ర సోమవారం మృతి చెందింది. కాగా తమ కుమార్తె మరణానంతరం అవయవ దానం కోసం రిజిస్టర్ చేయించిందనే విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులకు తెలిపారు. దీంతో కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి యువతి శరీరంలోని నేత్రాలు, గుండె, మూత్రపిండాలు, వెన్నెముకను సేకరించి భద్రపరిచారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూర్చులో అంత్యక్రియలు నిర్వహించారు. -
బంగారం.. ప్రొద్దుటూరు
వింటే భారతమే వినాలి.. కొంటే ప్రొద్దుటూరు బంగారన్నే కొనాలంటారు ఈ ప్రాంత వాసులు. ఇక్కడ కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. నాణ్యత, తూకంలో తేడా కనిపించదు. కచ్చితమైన ధర.. మగువలు మెచ్చేలా కోరిన డిజైన్‌లో నగలు తయారు చేసే స్వర్ణకారులు ఇక్కడ కోకొల్లలు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రముఖ స్థానం పొందింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే మాత్రం పొద్దుటూరుకు వెళ్లాల్సిందే.. ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి వందేళ్ల చరిత్ర ఉంది. చిన్న గ్రామంగా ఉన్న ఈ ఊరు అప్పట్లో నీలి మందు వ్యాపారానికి ప్రసిద్ధి. స్థానిక అమ్మవారిశాల వీధిలోని పలువురు వర్తకులు నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేణా నీలిమందుకు ఆదరణ తగ్గింది. దీంతో వీరంతా ఏం చేస్తే బాగుంటుందని కొన్ని రోజుల పాటు సమాలోచనలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే బంగారం వ్యాపారం వైపు వారి దృష్టి మళ్లింది. 100 ఏళ్ల కిందట కేవలం 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత వ్యాపారులతో పాటు స్వర్ణకారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు మంచి నైపుణ్యం సంపాదించుకున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణా, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి బంగారు కొనుగోళ్ల నిమిత్తం ఇక్కడికి వస్తారు. రెండో ముంబైగా ప్రసిద్ధి 1960లో అప్పటి జనతా ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్సు లేకుండా ఏ ఒక్కరూ బంగారు దుకాణాలు నిర్వహించరాదు. రాయలసీమలోని కడపతో పాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా బంగారు దుకాణాలు నిర్వహించుకునేవారు. వీరంతా లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేసేవారు. ప్రొద్దుటూరులో మాత్రం అప్పట్లోనే లైసెన్సు కలిగిన దుకాణాలు ఉండేవి. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు. టెండర్ల అనంతరం ప్రొద్దుటూరులో సీబీఐ దాడులు ఎక్కువగా జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముంబై, బెంగళూరులకు దీటుగా విక్రయాలు ఇక్కడి బంగారు వ్యాపారం రాష్ట్రంలోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్‌బజార్ (అమ్మవారిశాలవీధి)లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్ షాపులు విస్తరించాయి. సుమారు 400కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్ షాపులు ఉన్నాయి. 12 వేల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు దీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి. వివాహ ముహుర్తాలు, పండుగలు, అక్షయ తృతీయ రోజున ప్రొద్దుటూరు గోల్డ్ మార్కె ట్ నూతన శోభను సంతరించుకుంటుంది. అక్షయ తృతీయ రోజున బంగారు కొనడాన్ని మహిళలు సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని బంగారు వ్యాపారులు మంచి డిజైన్లను తయారు చేయిస్తారు. ఆన్లైన్ధరల ప్రకారం బంగారు విక్రయాలు నిర్వహిస్తారు. దీంతో ఏ షాపునకు వెళ్లినా ఒకటే ధర ఉంటుంది. అందువల్ల ప్రొద్దుటూరు బంగారాన్ని అందరూ ఇష్టపడతారు. వ్యాపారులు, స్వర్ణకారులు బ్యాంక్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి నగలను తయారు చేస్తారు. నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు ప్రొద్దుటూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన స్వర్ణకారులు ఇక్కడ పని చేస్తున్నారు. మిషనరీ అందుబాటులో లేని రోజుల్లో ఇక్కడి స్వర్ణకారులు చేసిన ఆభరణాలకు మంచి గుర్తింపు ఉండేది. బెంగాల్ రాష్ట్రానికి చెందిన స్వర్ణకారులు అత్యధికంగా ప్రొద్దుటూరులో పని చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణా, కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాల నుంచి రోజు కొనుగోళ్ల నిమిత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. కోరిన డిజైన్లలో నగలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు సిద్ధహస్తులు. ముక్కు పుడక.. పెద్ద ఆభరణాలను స్థానికంగా తయారు చేస్తారు. దేవతా మూర్తులకు అలంకరించే కిరీటాలు, ఇతర కంఠాభరణాలను తయారు చేసే స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు. బంగారు కరిగించేవారు, నగను తయారు చేసేవారు. తయారైన నగకు రాళ్లను పొదిగేవారు, మెరుగులు దిద్దేవారు.. ఇలా పలువురు కష్టపడితేనే అందమైన నగలు తయారు అవుతాయి. స్వచ్ఛమైన బంగారంతో నగలు స్వచ్ఛమైన బంగారంతో నగలను తయారు చేయడం ప్రొద్దుటూరు వ్యాపారుల ప్రత్యేకత. వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నాం. ప్రొద్దుటూరుకు పసిడిపురిగా పేరు రావడం వెనుక ఎందరో స్వర్ణకారులు, వ్యాపారుల శ్రమ ఉంది. స్వర్ణకారుల ప్రతిభ వల్లనే ఇంతటి పేరు వచ్చింది. – ఉప్పర మురళీ, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు, ప్రొద్దుటూరు. రెడీమేడ్ ఆభరణాలతో పని తగ్గింది కొన్ని రోజుల క్రితం వరకు పని బాగా ఉండేది. ఇటీవల రెడీమేడ్ ఆభరణాల దిగుమతి ఎక్కువైంది. ఇతర రాష్ట్రాల నుంచి వీటిని ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు పనులు లేకుండా పోయాయి. పెళ్లి ముహుర్తాల్లోనే కొంత పని ఉంటుంది. మిగతా సమయాల్లో బాడుగలు కూడా రావడం కష్టమే. –షామీర్, స్వర్ణకారుడు, ప్రొద్దుటూరు కటింగ్ వర్క్ షాపు నిర్వహిస్తున్నా ఏడేళ్ల నుంచి గోల్డ్ కటింగ్ వర్క్‌షాపు నిర్వహిస్తున్నా. ఈ పని చాలా సంతృప్తి కరంగా ఉంది. దీపావళి, దసరా పండుగలు, గ్రామాల్లో పంటలు చేతికి వచ్చినప్పుడు మార్కెట్ కళ కళ లాడుతుంటుంది. ఆ సమయంలో మాకు చేతినిండా పని ఉంటుంది. స్వర్ణకారులకు ప్రభుత్వం రాయితీలతో రుణాలు ఇప్పిస్తే బాగుంటుంది. – అబ్దుల్ రెహమాన్, ఫ్యాన్సీ వర్క్ షాపు, ప్రొద్దుటూరు. -
అందరికీ ఆదర్శం.. చెన్నమరాజుపల్లె గ్రామం
ప్రొద్దుటూరు క్రైం : కొన్నేళ్ల క్రితం వరకు ఆ గ్రామం నిత్యం ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడుకుపోయేది. ఆ ఊరు పేరెత్తితేనే చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్లు హడలెత్తిపోయే పరిస్థితి. ఒకానొక సమయంలో వేరే ఊరి అమ్మాయిని ఆ గ్రామానికి ఇవ్వాలన్నా భయపడిపోయేవాళ్లు. ఫ్యాక్షన్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాక గ్రామస్తులు బిక్కు బిక్కు మంటూ జీవనం సాగించేవారు. ఆ గ్రామం ఎక్కడో మారు మూల ప్రాంతంలో లేదు. వైఎస్సార్ జిల్లాకు వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుందూ నది ఒడ్డున..పచ్చని పొలాల మధ్యన ఉన్న ఆ ఊరే చెన్నమరాజుపల్లె. ఫ్యాక్షన్ ఘర్షణలు గ్రామాభివృద్ధిని పడేలా చేశాయి. పగలు, ప్రతీకారేచ్ఛల మధ్య పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఊ ఊళ్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామం ఉపాధిబాటలో పయనిస్తోంది. మంచాల అల్లిక గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. ఫ్యాక్షన్ వద్దు ప్యాషన్ ముద్దు అనే నినాదంతో గ్రామస్తులు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. 1970 నుంచి 12 ఫ్యాక్షన్ హత్యలు ప్రొద్దుటూరు మండలంలోని చెన్నమరాజుపల్లెలో 1970లో ఫ్యాక్షన్ మొదలైంది. గ్రామాధిపత్యం కోసం మొదలైన ఫ్యాక్షన్ గొడవల్లో ఇప్పటి వరకు 12 మంది హత్యకు గురయ్యారు. ఇవి గ్రామంలో జరిగిన హత్యలే. గ్రామ ఫ్యాక్షన్ గొడవలకు అనుబంధంగా ఇతర ప్రాంతాల్లోనూ చాలా మంది హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు కుటుంబాల మధ్య మొదలైన గ్రామాధిపత్య పోరుతో ఈ హత్యల పరంపర కొనసాగింది. ఈ క్రమంలోనే ఆలయ భూముల కోసం కొన్నేళ్ల పాటు హత్యలు, ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. 1970లో ఇద్దరు, 71లో ఇద్దరు, 72లో ఒకరు, 79లో ముగ్గురు, 99లో ఒకరు, 2011 ముగ్గురు హత్యకు గురయ్యారు. 1970 నుంచి 79 వరకు 8 మంది ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయారు. తర్వాత 20 ఏళ్ల పాటు చెన్నమరాజుపల్లెలో ఎలాంటి గొడవలు లేవు. అంతా సద్దుమణిగి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్న సమయంలో పాతకక్షలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమన్నాయి. 1999–2011 మధ్య నలుగురు హత్యకు గురయ్యారు. 1999 నుంచి గ్రామంలో పోలీస్ పికెట్ నడుస్తోంది. గ్రామ స్వరూపాన్నే మార్చేసిన అల్లికలు మంచాల అల్లికలు చెన్నమరాజుపల్లె గ్రామ స్వరూపాన్నే మార్చేశాయని చెప్పవచ్చు. 450 కుటుంబాలున్న ఈ గ్రామంలో వ్యవసాయం, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. భూస్వాములైతే గ్రామంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే ఉన్నారు. రాందాసు అనే వ్యక్తి మొదట్లో ఇనుప పైపుల మంచాల అల్లికలు చేసేవాడు. రామలక్షుమ్మ అతని వద్ద అల్లిక పని నేర్చుకుంది. సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ఐదారుగురు ఈ పని చేసేవారు. మంచాలను అల్లడానికి సమీపంలోని ప్రొద్దుటూరుకు వెళ్లేవారు. రాను రానూ అల్లిక పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతి రోజు ప్రొద్దుటూరుకు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని వారు భావించారు. దీంతో మంచాల ఫ్రేంలు, వైరు పంపిస్తే ఇంటి వద్దనే అల్లి పంపిస్తామని కొందరు గ్రామస్తులు దుకాణ యజమానులకు తెలిపారు. ఇందుకు వారు అంగీకరించి ఇనుప ఫ్రేంలు, వైర్‌ను చెన్నమరాజుపల్లెకు పంపించసాగారు. 4–5 ఏళ్ల వరకు 20 కుటుంబాలు మాత్రమే అల్లిక పని చేసేవారు. ఇంట్లోనే ఉంటూ ఈ పని చేయడం మిగతా వారిని ఆకర్షించింది. దీంతో గ్రామంలోని ఇతర మహిళలు, పురుషులు అల్లిక పని నేర్చుకునేందుకు మక్కువ చూపసాగారు. కొందరు గ్రామంలోనే తెలిసిన వారి వద్ద పని నేర్చుకోగా, ఇంకొందరు ప్రొద్దుటూరుకు వెళ్లి నేర్చుకున్నారు. ప్రస్తుతం 75 శాతం కుటుంబాలు అల్లిక పనిని వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. చాలా మంది మహిళలు ఈ వృత్తిలో చక్కటి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. నెమలి, చిలుక, పుష్పాలు, హంస, చిలక ఇలా అనేక రకాల డిజైన్లతో అల్లికలు చేస్తున్నారు. ఆర్థికంగా పరిపుష్టి చెన్నమరాజుపల్లె గ్రామంలోని అనేక కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ప్రొద్దుటూరులో ఫర్నీచర్ దుకాణాలు, మంచాల ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఇక్కడ తయారైన మంచాలు రాయలసీమ వ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. ఇనుప ఫ్రేంలు మాత్రమే తీసుకొని వెళ్లే వారు కొందరుంటే, అల్లిన మంచాలను తీసుకెళ్లేవారు ఎక్కువ శాతం ఉన్నారు. చెన్నమరాజుపల్లె గ్రామం అల్లికలకు ప్రసిద్ధిగాంచడంతో ప్రొద్దుటూరులోని ఫ్యాక్టరీ, దుకాణ యజమానులు ఈ పనిని వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజు 1500 నుంచి 2000 మంచాలు తయారుఅవుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. మూడు రకాల వైర్లతో మంచాలను అల్లుతారు. లావుగా ఉన్న వైర్‌తో మంచం అల్లినందుకు రూ. 120 నుంచి 150, సన్నటి వైర్‌తో అల్లితో రూ. 280– 300, మహారాష్ట్ర వైర్‌తో మంచం అల్లితే రూ. 1000–1200 కూలిగా ఇస్తారు. లావు వైర్‌తో ఒక్కో వ్యక్తి రోజుకు 5 మంచాల వరకు అల్లుతారని చెబుతున్నారు. సన్నటి వైర్‌తో అయితే 2 లేదా మూడు మంచాలు అల్లుతామన్నారు. నలుగురు, ఐదుగురు ఉన్న కుటుంబాల్లో అయితే ఎక్కువ సంఖ్యలో మంచాలను అల్లుతున్నారు. కొన్నేళ్ల నుంచి పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరులలోని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు యువకులు ఆర్మీ, పోలీసు, బ్యాంకు, ట్రాన్స్‌కో. సచివాలయ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. గ్రామస్తుల్లో మార్పు రావడం సంతోషాన్ని ఇస్తుంది ఫ్యాక్షన్ గొడవలతో అభివృద్ధికి దూరంగా ఉన్న చెన్నమరాజుపల్లె గ్రామస్తుల్లో మార్పు రావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. అల్లిక పనులతో వారి కుటుంబాలతో పాటు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ తరపున వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. – సంజీవరెడ్డి, రూరల్ ఎస్ఐ, ప్రొద్దుటూరు పిల్లలను బాగా చదివించుకుంటున్నాం కొన్నేళ్ల క్రితం వరకు గ్రామంలో అభివృద్ధి ఊసే లేదు. ఫ్యాక్షన్ గొడవల్లో అనేకమందిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మా గ్రామంలో గతంలో నాటి పరిస్థితులు లేవు. మంచాల అల్లిక పనులతో గ్రామం ఉపాధి బాట పట్టింది. పిల్లలను బాగా చదివించుకుంటున్నాం. – ఎన్ వెంకటసుబ్బయ్య, చెన్నమరాజుపల్లె ఆరేళ్ల నుంచి అల్లిక పని చేస్తున్నా ఆరేళ్ల నుంచి అల్లిక పని చేస్తున్నా. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి పని చేసుకోవడం బాగుంది. మా గ్రామంలో ఎక్కువ మందికి ఉపాధి దొరకడం సంతోషంగా ఉంది. – దేవి, చెన్నమరాజుపల్లె ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాం మాకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందరం అల్లిక పని చేసేవాళ్లం. అల్లిక పని ద్వారా వచ్చిన డబ్బుతో కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాం. ఇద్దరు కుమారుల్లో వెంకటగ్రేస్ ఆర్మీలో సైనికుడిగా, చైతన్యకుమార్ లైన్మెన్గా పని చేస్తున్నారు. – గుర్రమ్మ, చెన్నమరాజుపల్లె -
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్ జిల్లా) : డ్వాక్రా మహిళలపై దాడి చేసిన కేసులో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షురాలు బోగాల లక్ష్మీనారాయణమ్మతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పొదుపు ఖాతాల్లో అవినీతి జరగలేదని, ఆడిట్ జరిగి ఒకవేళ అవినీతి జరిగిందని నిర్ధారణ అయితే ఆ డబ్బు తాను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు తమ డబ్బు ఇవ్వాలని ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం వేకువజామున ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిపై 147, 148, 323, 324, 307, 386, 509 రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. గురువారం జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఘర్షణ : ఏఎస్పీ ప్రేర్ణాకుమార్ టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్లే గొడవ జరిగిందని ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణాకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 12న లక్ష్మీనారాయణమ్మ అనే మహిళ రూ.40 లక్షల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ డ్వాక్రా మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణమ్మ గురువారం ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్లి మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఏదైనా ఉంటే తన ఇంటి వద్దకు రమ్మని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడారన్నారు. దీంతో డ్వాక్రా మహిళలు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని తెలిపారు. ‘ధైర్యం ఉంటే లోపలికి రండి..’ అంటూ ప్రవీణ్ మరోమారు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిందన్నారు. -
ప్రొద్దుటూరులోని నడింపల్లెలో గడపగడపకు మన ప్రభుత్వం
-
కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంది
-
వైఎస్సార్ జిల్లా: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు!
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 8 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు మండలం, రాజుపాలెం మండలంలో పలువురి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలా ఉండగా... టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు భారీ షాక్ తగిలింది. స్వగ్రాంలోనే ఆయన పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో బి.మఠం మండలంలో పలుగురాళ్లపల్లెలో వైఎస్సార్ సీపీ మద్దతుతో ఎస్సీ మహిళ మార్తమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు మండలం: సోములవారిపల్లి- మోపురి ప్రశాంతి దొరసానిపల్లి- ఆరవ ఈశ్వరమ్మ చౌటపల్లి- మార్తల లక్ష్మీ సునీత తాళ్లమాపురం- మాదిరెడ్డి కొండారెడ్డి చౌడూరు- నేతిపల్లి చండ్రాయుడు రాజుపాలెం మండలం ఏక గ్రీవమైన పంచాయతీలు వెంగలాయపల్లి- దనిరెడ్డి రేణుకమ్మ కొర్రపాడు- పిల్లి ఓబులమ్మ కుమ్మరపల్లి- బీరం నారాయణమ్మ గాదే గూడూరు- పొలా వరలక్ష్మీ మైదుకూరు నియోజకవర్గం: దువ్వూరు మండలం, సంజీవరెడ్డిపల్లెలో ఇరగంరెడ్డి వీరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జొన్నవరం- మరియమ్మ ఎర్రబెల్లి పంచాయతీ- మదార్ బీ టి. చల్లబసయ్య పల్లి- చంద్రకళ పోరుమామిళ్ళ మండలం పుల్లివీడు- తిమ్మారెడ్డి రఘునాథరెడ్డి తిమ్మారెడ్డి పల్లి- బీరం ఉమ కలసపాడు మండలం పెండ్లిమర్రి.. కొండా రమణమ్మ మహనందిపల్లి... దేవసాని సుగుణ చెన్నుపల్లి: ముద్దేటి నవీన్ కుమార్ కాశినాయన మండలం బాలాయపల్లి: పాలగుల్ల తిరుమలరెడ్డి కోడిగుడ్లపాడు: సోమేసుల బాలగురయ్య కొండ్రాజుపల్లి: కోనేటి శారద దేవి ఏకగ్రీవం అట్లూరు మండలంలో మొత్తం 12 పంచాయతీలకుగాను 4 పంచాయతీలు (వైఎస్సార్ సీపీ మద్దతుదారులు)ఏకగ్రీవం కామ సముద్రం- రాజవోలి లక్ష్మీదేవి మన్నెంవారిపల్లె- చాట్ల వెంకటమ్మ వేములూరు- గోవర్ధన్ రెడ్డి అట్లూరు- చెంచు సుబ్బరాయుడు చాపాడు మండలంలో ఏకగ్రీవమైన పంచాయతీలు ఎన్ ఓబయ్య పల్లె- అంజనమ్మ కుచ్చు పాప చింతకుంట సుబ్బారెడ్డి ఎదురూరు- బాల ఓబులమ్మ చిన్న గొడవ లూరు - పాలగిరి సుజాత పెద్ద గొడవ లూరు- పాలగిరి రాజేశ్వర్ రెడ్డి విశ్వనాథపురం- భూమి రెడ్డి నారాయణ రెడ్డి లక్ష్మీ పేట- కర్నాటి శ్రీవిద్య సీతారామపురం- వర స్వాతి ఖాజీపేట మండలంలో ఏకగ్రీవం పంచాయితీ గ్రామాలు చెన్నముక్కపల్లె- గోట్టి గంటి చంద్రశేఖర్ సన్న పల్లె- తుమ్మలూరు సుబ్బమ్మ త్రిపురవరం- మీగడ సుస్మిత కొమ్ములూరు- పోతులూరు రుక్మిని -
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదనే కారణంతో యువతిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. వివరాలు.. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ , లావణ్య అనే యువతిని మూడు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎవరూ లేని సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన సునీల్ తనను ప్రేమించాల్సిందిగా బెదిరించాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో లావణ్యపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లావణ్యను ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ప్రేమోన్మాది ఆత్మహత్య)\ -
నాగలి పట్టిన కుర్రాడు.. నేడు డీఎస్పీ
సాక్షి, ప్రొద్దుటూరు: ఆ యువకుడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.. వారికున్న కొద్దిపాటి పొలంలో వ్యవసా యం చేసి కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివించారు.. తన అభ్యున్నతి కోసం తండ్రి పడిన కష్టాలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూశాడు ఆ యువకుడు. కుటుంబ పరిస్థితులు అతడిలో కసిని పెంచాయి. బాగా చదివి పది మందికి సాయం చేసే ఉద్యోగం పొందాలి... తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఎంతో క్రమశిక్షణ.. అంతకు మంచి నిబద్ధతతో చదివాడు. నాడు నాగలి పట్టిన విజయనగరం కుర్రాడు నేడు లాఠీ పట్టాడు. ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏగిరెడ్డి ప్రసాదరావు గురించి ఆయన మాటల్లోనే.. రైతు కుటుంబం నుంచి... విజయనగరం జిల్లాలోని పార్వతీపురం సమీపంలో ఉన్న గుణానుపురం మా స్వగ్రామం. తల్లిదండ్రులు మహాలక్ష్మి, సత్యంనాయుడు. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న శంకర్రావు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే మాకు జీవనాధారం. కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి మా తల్లిదండ్రులు మా ఇద్దరినీ చదివించారు. మేము నాన్నతో పాటు పొలం పనులు చేసేవాళ్లం. మా ఊళ్లోని ప్రభుత్వ హైస్కూళ్లో 10వ తరగతి వరకు చదివాను. విజయవాడలోని గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశా ను. గౌహతిలోని ఐఐటీలో డిగ్రీ చదివాను. తర్వాత హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. కుటుంబ పరిస్థితుల ప్రభావంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను, గ్రూప్స్‌లో మంచి ర్యాంక్ రావడంతో ఇష్టమైన పోలీసు శాఖలో చేరాను. 2018 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికై అనంతపురంలోని పీటీసీలో శిక్షణ పొందాను. డి్రస్టిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిగా వైఎస్సార్ జిల్లాలోనే చేశాను. రాయచోటి, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందులలో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వర్తించా ను. అందువల్ల జిల్లాపై మంచి అవగాహన ఉంది. చట్టపరిధికి లోబడి పని చేస్తా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారనే భావన చాలా మందిలో ఉంది. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెప్పుకోవచ్చు. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ మా విధానం. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారు. సబ్‌డివిజన్‌లోని అన్ని గ్రామాలు తిరిగి స్వయంగా సమస్యలు తెలుసుకుంటాను అని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. -
మధ్యాహ్నం నిశ్చితార్థం.. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం!!
పెద్దల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆ శుభ క్షణాలను తలచుకుంటూ ఆమె ఎన్నో కలలు కనింది. పెళ్లి..ఆ తర్వాత గడిపే నూరేళ్ల జీవితం ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించింది. అలా కలగంటూనే నిద్రలోకి జారుకుంది. అదే శాశ్వత నిద్ర అవుతుందని కలలోనూ ఊహించలేదు. ఓర్వకల్లు రాక్‌గార్డెన్ ఎదుట శుక్రవారం అర్ధరాత్రి ఆగివున్న ట్రాక్టర్‌ను టవేరా వాహనం ఢీకొనడంతో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోథ్నవి (22) దుర్మరణం పాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. సాక్షి, ఓర్వకల్లు/ప్రొద్దుటూరు క్రైం : పెళ్లి మంత్రాలకు బదులు ఆ ఇంటిలో మృత్యు ఘంటికలు మోగాయి. నిశ్చితార్థం చేసుకుని వస్తున్న వారిని మార్గమధ్యంలోనే మృత్యువు కాటేసింది. అర్ధరాత్రి కాస్త వారి పాలిట కాళరాత్రిగా మారింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ద్వారకానగర్‌కు చెందిన ఈదుల మల్లికార్జునరెడ్డి తిరుపతిలో వాచ్‌మన్‌గా పని చేస్తుండేవారు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయన కుమార్తె గోథ్నవి ప్రొద్దుటూరు ఆచార్ల కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడితో గోథ్నవికి పెళ్లి నిశ్చయమైంది. ఇందులో భాగంగా రెండు కుటుంబాలు నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో గోథ్నవితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు టవేరా (ఏపీ 07 ఏఎం 5999) వాహనంలో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిశ్చితార్థమయ్యింది. తిరిగి ప్రొద్దుటూరుకు బయలుదేరారు. కాగా.. నందికొట్కూరు మండలంలోని వడ్డెమాను గ్రామానికి చెందిన ఎల్లప్ప.. మద్దిలేటయ్య స్వామి దర్శనం కోసం 20 మంది బంధువులతో ట్రాక్టర్ (ఏపీ 22ఏసీ 7033)లో శుక్రవారం రాత్రి బయలు దేరారు. ట్రాక్టర్ ముందు భాగం లైట్లు సరిగా పనిచేయడం లేదని ఓర్వకల్లు రాక్‌గార్డెన్ వద్ద రోడ్డు పక్కన నిలిపారు. టవేరా వాహనం ఢీకొట్టింది ఈ ట్రాక్టర్‌నే.. అదే సమయంలో వేగంగా వచ్చిన టవేరా వాహనం ట్రాక్టర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టవేరా వాహనంలో డ్రైవర్ పక్కన కూర్చున్న మార్తల కొండారెడ్డి (65) అనే వ్యక్తి, బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి (60) వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న గోథ్నవి తీవ్రగాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ఇందిర, పెద్దమ్మ సక్కుబాయి, సన్నిహితురాలు లత తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇందిర, లత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తండ్రి మల్లికార్జునరెడ్డి, డ్రైవర్ మహబూబ్బాషాలకు రక్తగాయాలయ్యాయి. చిన్నాన్న శివనాగిరెడ్డి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ట్రాక్టర్లో ఉన్న బోయ శ్రీనివాసులు(నాగటూరు), బోయ నరసింహులు(కల్లూరు), డ్రైవర్ పరశురాముడు(వడ్డెమాను), తెలుగు సుబ్బన్న(వడ్డెమాను), బోయ సవారి(మల్యాల), బోయ పవన్‌కుమార్(నాగటూరు) కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిశ్చితార్థానికి పెద్ద మనిషి వెళ్లి.. ప్రొద్దుటూరు పట్టణంలోని మిట్టమడి వీధికి చెందిన మార్తల కొండారెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతను కొన్ని రోజుల క్రితం నుంచి ద్వారకానగర్‌లో ఇంటిని బాడుగకు తీసుకుని ఉంటున్నాడు. కుమార్తె నీరజకు వివాహం కాగా.. అమెరికాలోని టీసీఎల్ కంపెనీలో పని చేస్తోంది. మల్లికార్జునరెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నందున నిశ్చితార్థంలో పెద్ద మనిషిగా మాట్లాడేందుకు రావాలని గోథ్నవి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ప్రమాదంలో కొండారెడ్డి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకువచ్చారు. భార్య లక్ష్మీదేవి, కుమారులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా నుంచి కుమార్తె వచ్చిన తర్వాత సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్న గోథ్నవి గోథ్నవి బీటెక్ చదివింది. ప్రొద్దుటూరులోని సరస్వతీ విద్యామందిరంలో 1, 4,5 తరగతులకు బోధించేది. గత నెల 22న పుట్టిన రోజు వేడుకలను స్కూల్లో ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా జరుపుకుంది. గురువారం పాఠశాలకు వచ్చిన ఆమె శుక్రవారం ఒక్క రోజు సెలవు పెట్టింది. శనివారం స్కూల్‌కు తిరిగి వస్తానని వెళ్లిందని ఉపాధ్యాయులు తెలిపారు. మూడేళ్ల క్రితం కుమారుడు మృతి మల్లికార్జునరెడ్డి, ఇందిర దంపతులకు శివ, గోథ్నవి సంతానం. మూడేళ్ల క్రితం శివ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరువక ముందే కుమార్తె కూడా అకాల మరణం చెందింది. ఇద్దరు పిల్లలను కోల్పోయి..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ దంపతులను చూసి స్థానికులు చలించిపోయారు. -
రాయలసీమ వేదికగా మరో రాజకీయ పార్టీ!
సాక్షి, కడప: రాయలసీమ వేదికగా మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఇంజా సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ సమతా పార్టీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా పార్టీ జెండా, లోగోను వ్యవస్థాపక అధ్యక్షుడైన ఇంజా సోమశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. విద్య, వైద్యం, సంక్షేమం ప్రధాన ఎజెండాగా పార్టీని స్థాపిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధి కోసం ప్రత్యక్ష రాజకీయాల ద్వారా కృషి చేస్తామని చెప్పారు. -
షాహిదా బేగం ఇక నా దత్త పుత్రిక : ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు : ఓ పేద విద్యార్థినిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అక్కున చేర్చుకున్నారు. ఆమెను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రొద్దుటూరులో టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ సన్మాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు 6 తరగతి విద్యార్థిని షాహిదా బేగం జానపద గేయం పాడి అందరినీ అలరించింది. ఎమ్మెల్యే స్పందించి విద్యార్థినిని వేదికపైకి పిలిచారు. రూ.5వేలు నగదు బహుమతి అందించారు. మండలంలోని మీనాపురం గ్రామానికి చెందిన షాహిదాబేగంకు తండ్రి లేడని ఆయన తెలుసుకున్నారు. పేదరికంలో పుట్టిన ఆమె చదువుకు తాను పూర్తిగా సహకరిస్తానని వెంటనే ప్రకటించారు. ఎంత వరకు చదివినా ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. పెళ్లి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పడంతో హర్షధ్వానాలు మారుమోగాయి. ఎమ్మెల్యే నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. -
రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు
సాక్షి, కడప : రూ.10 కోట్ల 24 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు ఎగ్గొట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు.. కడప నగరం హబీబుల్లా వీధిలో నివాసముంటున్న జేకే రాజేష్‌సింగ్, అతని అన్న రమేష్‌సింగ్‌లకు కడప సమీపంలోని విశ్వనాథపురంలో 3 ఎకరాల 30 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని వారు ప్రొద్దుటూరులోని బి.కొత్తపల్లె, వీఆర్ కాలనీకి చెందిన మణిప్రసాద్‌రెడ్డి భార్య కవితకు అమ్మాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ఏడాది అక్టోబర్ 24న రూ.2కోట్ల 50 లక్షలు అడ్వాన్సుగా తీసుకుని అగ్రిమెంట్ రాయించారు. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 28న భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు కడప బాలాజీనగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వారిని పిలిపించారు. అయితే వారు పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకురాకపోవడంతో ఈనెల 3వ తేదీకి రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాజేష్ సింగ్, రమేష్ సింగ్‌లు 3వ తేదీ మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ప్రొద్దుటూరుకు చెందిన కవిత, మణిప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, మురళి ఉన్నారు. వారంతా కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు తక్కువ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత డబ్బులు తక్కువ ఇస్తే ఎలా అని బాధితులు ప్రశ్నించగా ‘ మీకు డబ్బులు ఇచ్చేది లేదు.. మా జోలికి వస్తే చంపుతాం’ అంటూ బెదిరించి దాడికి పాల్పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించి రిజిస్ట్రేషన్ చేయించుకుని, తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కడప తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. -
ఆ బాబు బాధ్యత నాది: ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు : ‘తండ్రి లేని పిల్లాడని దిగులు చెందవద్దమ్మా.. ఈ బాబు బాధ్యత నేను తీసుకుంటా’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్ గత నెల 7న తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో ఇరువురు మృత్యువాత పడ్డారు. రాజేష్ చనిపోయే నాటికి అతని భార్య షబానా గర్భిణి. సోమవారం ఆమె జిల్లా ఆస్పత్రిలో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వార్డుకు వెళ్లి షబానా, పసికందు ఆరోగ్య స్థితిగతులపై వైద్యులతో మాట్లాడారు. ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకొని రాజేష్ రూపంలో దేవుడు పంపించాడని అన్నారు. ‘దిగులు పడ వద్దమ్మా.. ఈ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటా ’ అని అన్నారు. బాబుకు 19 ఏళ్లు వచ్చే నాటికి రూ. 10 లక్షలు చేతికి వచ్చేలా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తానని చెప్పారు. ఆ డబ్బు అతని జీవనోపాధి కోసం ఉపయోగపడుతుందన్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ పని చేస్తానన్నారు. ముగ్గురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొని వెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేవలం రెండు రోజుల్లోనే రూ. 5 లక్షలు చొప్పున ముగ్గురి కుటుంబాలకు అంద చేశారన్నారు. -
మళ్లీ చిన్నశెట్టిపల్లె వివాదం
సాక్షి, ప్రొద్దుటూరు: చిన్నశెట్టిపల్లె గ్రామానికి సంబంధించి రెండు వర్గాల మధ్య మళ్లీ వివాదం రాజుకుంటోంది. సమస్యను పరిష్కరించకపోతే గత పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. టీడీపీలోని మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి పొట్టిపాడు గ్రామం వద్ద మైలవరం ఉత్తర కాలువ వెంబడి రోడ్డు పనులు చేపడుతున్నారు. గత ఏడాది మార్చి నెలలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు ప్రారంభించారు. పనుల అంచనా వ్యయం రూ.1,33,421 మాత్రమే. ఈ పనుల్లో భాగంగా ప్రభాకర్‌రెడ్డి ప్రత్యర్థి వర్గానికి చెందిన బయపురెడ్డి సూర్యనరసింహారెడ్డి పొలంలో కాలువ నీరు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ప్రభాకర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పొలంలో పైపులు వేస్తున్నాడని సూర్యనరసింహారెడ్డి భావించారు. ముందుగా ఈ విషయంపై చెప్పినా పనులు ఆపకపోవడంతో ఇరువర్గాల మధ్య పొలంలోనే ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద ఇరు వర్గాలు రాళ్లు కూడా విసురుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన జిల్లాలో చర్చాంశనీయంగా మారింది. అప్పటి హోం మంత్రి చినరాజప్ప వరకు వెళ్లిందంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. పనుల నాణ్యతపై ఇటీవల ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రెండు వారాల క్రితం స్వయంగా పనులను పరిశీలించి వెళ్లారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ మరోమారు రోడ్డుపై గ్రావెల్ పరిచారు. అలాగే వివాదానికి సంబంధించిన స్థలంలో మాత్రం పనులను పూర్తి చేయకుండా పైపులను అలానే వదిలేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇరువర్గాల మధ్య మళ్లీ ఈ పనులకు సంబంధించిన వివాదం ఏర్పడింది. ఏడాదిన్నర కాలంగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రభాకర్‌రెడ్డి ప్రత్యర్థి వర్గీయులు చెబుతున్నారు. పనులు పూర్తి చేయకుండా ఎందుకు అసంపూర్తిగా వదిలేశారని ప్రశ్ని స్తున్నారు. ఈ విషయంపై పీఆర్ ఏఈ మల్లారెడ్డిని వివరణ కోరగా తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, తనకు వివరాలు తెలియదని చెప్పారు. సూర్యనరసింహారెడ్డి పొలం వద్ద అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు -
పదోన్నతి కల్పించాల్సి ఉన్నా..
సాక్షి, ప్రొద్దుటూరు (కడప) : ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు ప్రకటించిన జేఏఓల పదోన్నతుల్లో తనకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న దివ్యాంగుడు బి. సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం సాక్షి తో మాట్లాడారు. 2006లో రిక్రూట్మెంట్ ద్వారా 88 మార్కులతో తాను విద్యుత్ సంస్థలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందానని పేర్కొన్నారు. ఈ నెల 21 తేదీన ఎస్పీడీసీఎల్ అధికారులు సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న 12 మంది జేఏఓలకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లుగా (ఏఏఓ) పదోన్నతులు కల్పించారని తెలిపారు. జీఓఎంఎస్ నంబర్42, 2011 అక్టోబర్ 19 తో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సివిల్ అప్పీల్ నంబర్.9096 ఆఫ్ 2013 ప్రకారం దివ్యాంగుల కోటాలో తనకు పదోన్నతి కల్పించాల్సి ఉందన్నారు. అయితే అధికారులు ఇందుకు భిన్నంగా తనకంటే తక్కువ మార్కులు పొందిన మరో అధికారికి పదోన్నతి కల్పించారన్నారు. రిక్రూట్ మెంట్లో 75 మార్కులు పొందిన అతనికి ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం అదే రోస్టరు ద్వారా పదోన్నతి కల్పించకుండా దివ్యాంగుల కోటాలో ఎలా పదోన్నతి కల్పిస్తారని ప్రశ్నించారు. పదోన్నతి గురించి దాదాపు రెండేళ్లుగా సీఎండీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. -
చంద్రబాబు వస్తే కరువే
సాక్షి, ప్రొద్దుటూరు : చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువే. టీడీపీ ప్రభుత్వ హయాంలో పదును వర్షం కూడా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువుకు రోల్ మోడల్‌గా చంద్రబాబు నిలిచారని వైఎస్సార్సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. వర్షాలు లేక బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి, సక్రమంగా పంటలు పండక, పండిన వాటికి గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె గ్రామంలో సోమవారం ఉదయం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డితోపాటు రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలోని మూడు గ్రామ పంచాయతీలను దత్తత తీసుకోగా ఇందులో దొరసానిపల్లె ఒకటి అన్నారు. దత్తత గ్రామాలను ఎంపిక చేశాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం నిధులు విడుదల చేయలేదన్నారు. దీంతో ఎంపీ కోటా కింద నిధులు విడుదల చేసి ఈ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో పోస్టుడేటెడ్ చెక్కులు ఇచ్చి మభ్యపెట్టారన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో నివసిస్తున్న తాను నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నానన్నారు. ఎవరు తనను ఆశ్రయించినా తన వంతు సహాయం చేస్తున్నాని తెలిపారు. వందకు ఒక్క ఓటు ఇతర పార్టీలకు పడినా తనకు బాధగా ఉంటుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశానని అన్నారు. శ్మశానవాటికకు కాంపౌండ్ నిర్మించడం, రూ.40లక్షలతో రైల్వేస్టేషన్‌కు సిమెంటు రోడ్డు, రూ.50లక్షలతో జమ్మలమడుగు మెయిన్ రోడ్డుకు సిమెంటు రోడ్డు నిర్మించామని, అధికారులపై ఒత్తిడి తెచ్చి కమ్యూనిటీ హాల్‌తోపాటు అంగన్వాడీ భవనాలను మంజూరు చేయించామన్నారు. తన గ్రామ మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలనే లక్ష్యంతో రూ.20లక్షలు సొంత నిధులు వెచ్చించి స్థలాన్ని కొని బోరు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించానన్నారు. సొంత డబ్బుతో దొరసానిపల్లె హైస్కూల్ విద్యార్థులకు సైకిళ్లు కొనుగోలు చేయించానని పేర్కొన్నారు. చెత్త సేకరణ కోసం రూ.7లక్షలు వెచ్చించి ట్రాక్టర్లను కొనుగోలు చేయించానని చెప్పారు. సుమారు రూ.2కోట్లు వెచ్చించి గ్రామ పంచాయతీలో సిమెంటు రోడ్లు నిర్మింపజేశానన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తే దొరసానిపల్లెను బృందావనంలా తయారు చేస్తానని తెలిపారు. ఏ పథకమైనా తన గ్రామ పంచాయతీ నుంచే ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో దొరసానిపల్లె గ్రామ పంచాయతీ నాయకులు పాతకోట రామ్మోహన్‌రెడ్డి, గోపిరెడ్డి చిన్నరెడ్డి, ప్రాప్తం యాకోబ్, అనిల్, మార్తల నారాయణరెడ్డి, పాతకోట పునరుద్రారెడ్డి, నందం వెంకటసుబ్బయ్య, వంకం సుబ్బరాయుడు, శ్రీనుతోపాటు దనియాల గంగిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామిరెడ్డి, తులసిరెడ్డి, కరాటె జయరామిరెడ్డి, మార్తల కృష్ణారెడ్డి, బుజ్జిబాబు, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, గంగిరెడ్డి మాధవరెడ్డి పాల్గొన్నారు. -
నాడు అరణ్యం.. నేడు సుందరవనం
సాక్షి, ప్రొద్దుటూరు : సెలవు రోజుల్లో.. వారాంతంలో పట్టణ ప్రజలు సరదాగా బయటికి వెళ్లి కాసేపు గడపడానికి పరిసర ప్రాంతాల్లో ఒక్క ప్రదేశం కూడా లేదు. పిల్లలతో కలిసి సరదాగా బయటికి వెళ్దామనుకున్న వారికి నిరాశే మిగిలేది. పట్టణంలో మున్సిపల్ పార్కు ఉన్నా అక్కడ సరైన వసతులు లేకపోవడంతో వెళ్లడానికి ప్రజలు పెద్దగా ఇష్టపడరు. ఇవి 2004 ముందు నాటి పరిస్థితులు. ఆ సమయంలో ఎర్రగుంట్ల రోడ్డులోని అటవీ శాఖ స్థలంలో పార్కును ఏర్పాటు చేయాలని కొందరు స్థానికులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నాయకులు అడిగిన మరుక్షణమే ప్రతిపాదనలు పంపాలని అటవీ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సాక్షాత్తు సీఎం చెప్పడంతో ఆ ఫైలు వేగంగా కదిలింది. కేవలం రెండు నెలల్లోనే పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 2005 ఆగస్టు 3న వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెంటనే రూ.6 కోట్ల నిధులు కేటాయించడంతో పనులు చకచకా ప్రారంభమయ్యాయి. కేవలం ఏడాది తిరక్కుండానే రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కు సుందరంగా రూపుదిద్దుకుంది. 238 హెక్టార్లలో పార్కు ఏర్పాటు ఎర్రగుంట్ల రోడ్డులోని అటవీ శాఖ కార్యాలయం పక్కన ఉన్న దట్టమైన అరణ్యం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో సుందరవనంగా మారింది. పార్కు కోసం సుమారు 238.52 హెక్టార్ల స్థలాన్ని కేటాయించారు. పార్కు చుట్టూ ప్రహరీకి శ్రీకారం చుట్టారు. పరిధి ఎక్కువగా ఉండటంతో పనులు చివరి దశకు చేరుకున్నాయి. అందులో 23.5 హెక్టార్ల స్థలంలో సందర్శకుల కోసం అభివృద్ధి చేశారు. కిడ్స్‌జోన్, వాకర్ ట్రాక్, అక్కడక్కడా కూర్చోడానికి అందమైన షెడ్లు, అరుగులు, పూల మొక్కలు, చెట్లను ఏర్పాటు చేశారు. పార్కులోని జింకలు, కుందేళ్లు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. పండుగలు, ఆదివారం, ఇతర సెలవు దినాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా గడుపుతారు. ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల, రాజుపాళెం, దువ్వూరు మండలాల నుంచి ప్రజలు వస్తుంటారు. విశాలమైన వాకింగ్ ట్రాక్ ఉండటంతో రోజు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తుంటారు. నంగనూరుపల్లె వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో పార్కు నిర్వహణ పనులు జరుగుతున్నాయి. నిరంతరం 8 మంది పార్కులో పని చేస్తుంటారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే పార్కు ఏర్పాటు సాధ్యమైందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. పార్కులో మరికొంత అభివృద్ధి పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దట్టమైన చెట్లు ఉండేవి 2005కు ముందు ఈ ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉండేది. అయితే వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎం అయ్యాక ఈ ప్రాంతంలో నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో చెట్లు, పూల మొక్కలు, గ్రీనరీ, కిడ్స్ జోన్ ఉన్నాయి. ఆదివారం, పండుగ రోజుల్లో ఎక్కువ మంది వస్తుంటారు. – మనోహర్, వీఎస్ఎస్ సభ్యుడు, నంగనూరుపల్లి మొదటి నుంచి ఇక్కడే పని చేస్తున్నాను పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇందులోనే పని చేస్తున్నాను. చెట్లకు నీరు పోయడం, పెరిగిన మొక్కలను కత్తిరించడం, గ్రీనరీని శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తుంటాను. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పార్కుకు భూమి పూజచేయడం నేను చూశాను. – మరియమ్మ, వీఎస్ఎస్ సభ్యురాలు వైఎస్ చలువతో పార్కు ఏర్పాటైంది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకోవడంతోనే ప్రొద్దుటూరులో నేషనల్ పార్కు ఏర్పాటైంది. పట్టణ శివారులో పార్కు ఉండటంతో సెలవు రోజుల్లో పిల్లలతో కలిసి చాలా మంది సరదాగా గడిపేందుకు వెళ్తున్నారు. వాకింగ్ ట్రాక్ కూడా బాగుంది. పార్కును ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. – వెంకటసుబ్బయ్య, ప్రొద్దుటూరు -
ప్రోద్దుటూరు టీడీపీలో కొనసాగుతున్న రచ్చ
-
టీడీపీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి.. నిరసన!
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను లింగారెడ్డికి ఇవ్వడంతో.. వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను తొలగించారు. పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి తమ నిరసన తెలిపారు. ఐదేళ్లుగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జిగా వరదరాజులరెడ్డి ఉండగా.. టికెట్‌ను లింగారెడ్డికి కేటాయించడంతో వరద వర్గీయులు అధిష్టానంపై మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో వరదరాజులరెడ్డి ఆయన అనుచరులతో సమావేశమై చర్చలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని వరదరాజులరెడ్డి తెలిపారు.