Public debate
-
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
కాంగ్రెస్ గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి వరంగల్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, డేట్..ప్లేస్ చెప్పాలని గ్రేటర్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి అన్నారు. అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా అని టీఆర్ఎస్ నేత గుడిమళ్ల రవికుమార్ విసిన సవాల్‌కు శ్రీహరి స్పందించారు. వరంగల్‌లోని ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో 1380 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎస్ఆర్నగర్లో 692ఇళ్లకు 80, హన్మకొండలోని అంబేద్కర్‌నగర్‌లో 572 ఇళ్లకు 692ఇళ్ల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై సీఎంను అడిగే ధైర్యం టీఆర్ఎస్ నేతల్లో లేదని ఎద్దేవా చేశారు. కాకతీయ ఉత్సవాలకు నిధులు తక్కువ కేటాయించారని ఆరోపణలు చేసిన నేతలు ఇప్పుడు వాటి ఊసేత్తడానికే భయ పడుతున్నారన్నారు. సమావేశంలో నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, నాయకులు మంద వినోద్‌కుమార్, కొత్తపెల్లి శ్రీనివాస్, చిప్ప వెంకటేశ్వర్లు, పొలుమారి విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
చర్చకు మంత్రి మహేందర్‌రెడ్డి సిద్ధమా..?
- మాజీ హోంమత్రిపై విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదు - బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుల సవాల్ చేవెళ్ల: ఏ పార్టీ హయాంలో, ఎవరి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందిందో చర్చించడానికి బహిరంగ చర్చకు మంత్రి మహేందర్‌రెడ్డి సిద్ధమేనా..? అని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిపై రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. దివంగత మాజీ హోంమంత్రి పి.ఇంద్రారెడ్డి, మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డిల పేర్లు చెప్పుకొని పైకి వచ్చిన మహేందర్‌రెడ్డి వారిని విమర్శించే నైతిక హక్కు లేదని తెలిపారు. గతంలో మహేందర్‌రెడ్డి చేసిన భూదందాలు, ఇతర అక్రమాలు జిల్లా ప్రజలకు తెలుసు అని మండిపడ్డారు. ఆయన హీన చరిత్ర అందరికి తెలుసన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు నీతి, నిజాయతీతో పనిచేసిన సబితారెడ్డి గురించి వ్యక్తిగతంగా విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. హోంమంత్రిగా ఉన్న సమయంలో సబితారెడ్డి తన కుమారుడి చేత దందాలు చేయించారని మహేందర్‌రెడ్డి ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించిన మాదిరిగా ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన ఉండి ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ను మార్చవద్దంటూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంటే మంత్రి తన ఉనికిని కాపాడుకునేందుకు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సబితారెడ్డిని విమర్శించే స్థాయి మహేందర్‌రెడ్డికి లేదని తెలిపారు. జిల్లాకు సాగునీరు, తాగునీరు విషయంలో న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి వద్ద మాట్లాడే చేతగాని మంత్రి.. నీతిమాటలు చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. జిల్లాకు ఎవరి హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని నాయకులు మంత్రికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో నాయకులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ.అలీ, వనం మహేందర్‌రెడ్డి, ఎన్.మాధవరెడ్డి, పి.నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
బహిరంగ చర్చపై షీలాకు ఆహ్వానం పంపిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గురువారం బహిరంగ చర్చకు ఆధికారికంగా ఆహ్వానించారు. తాను అరవింద్ కేజ్రీవాల్‌తో బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాని సీఎం షీలా దీక్షిత్ ఇటీవల ఓ టీవీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. అలాగే రాజకీయ చర్చలో పాల్గొనేందుకు తాను ఏ మాత్రం సిగ్గు పడనని పేర్కొన్నారు. గతంలో న్యూఢిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల సందర్బరంగా బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్‌తో బహిరంగ చర్చలో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్బంగా షీలా గుర్తు చేశారు. అంతేకాకుండా బహిరంగ చర్చ అనేది ప్రజాస్వామ్యానికి అత్యంత ఆరోగ్యకరమైన అంశంమని పేర్కొన్నారు. న్యూఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న మహిళల రక్షణ, నీటి, విద్యుత్ ఛార్జీల పెంపు తదితర అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సీఎం షీలా దీక్షిత్‌ను అరవింద్ కేజ్రీవాల్ గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ చేసిన డిమాండ్‌పై న్యూస్ టీవీ ఛానల్ అడిగిన ప్రశ్న షీలాపై విధంగా స్పందించారు. దాంతో షీలా దీక్షిత్‌కు గురువారం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక ఆహ్వానం పంపారు. న్యూఢిల్లీ శాసనసభకు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభలోని మొత్తం 70 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుంది. నిజాయితినే ప్రాతిపదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నిక రంగంలోకి దిగింది. అయితే మళ్లీ న్యూఢిల్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే న్యూఢిల్లీలో కొల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించాలని బీజేపీ భావిస్తుంది. -
జగన్ బెయిల్‌పై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్సీ ఆమోస్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్‌కు, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ స్పష్టం చేశారు. జగన్ బెయిల్ పొందడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న టిడిపి నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ విషయమై ఉద్దేశపూర్వకంగానే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ అంశంపై టీడీపీ నేతలతో బహిరంగ చర్చలకు సిద్ధం అని ఆయన తెలిపారు. జగన్ బెయిల్‌తో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి శంకర్రావు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పై అనవసరమైన ఆరోపణలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.