న్యూఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గురువారం బహిరంగ చర్చకు ఆధికారికంగా ఆహ్వానించారు. తాను అరవింద్ కేజ్రీవాల్తో బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాని సీఎం షీలా దీక్షిత్ ఇటీవల ఓ టీవీ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు.
అలాగే రాజకీయ చర్చలో పాల్గొనేందుకు తాను ఏ మాత్రం సిగ్గు పడనని పేర్కొన్నారు. గతంలో న్యూఢిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల సందర్బరంగా బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్తో బహిరంగ చర్చలో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్బంగా షీలా గుర్తు చేశారు. అంతేకాకుండా బహిరంగ చర్చ అనేది ప్రజాస్వామ్యానికి అత్యంత ఆరోగ్యకరమైన అంశంమని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న మహిళల రక్షణ, నీటి, విద్యుత్ ఛార్జీల పెంపు తదితర అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సీఎం షీలా దీక్షిత్ను అరవింద్ కేజ్రీవాల్ గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ చేసిన డిమాండ్పై న్యూస్ టీవీ ఛానల్ అడిగిన ప్రశ్న షీలాపై విధంగా స్పందించారు. దాంతో షీలా దీక్షిత్కు గురువారం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక ఆహ్వానం పంపారు.
న్యూఢిల్లీ శాసనసభకు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభలోని మొత్తం 70 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుంది. నిజాయితినే ప్రాతిపదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నిక రంగంలోకి దిగింది. అయితే మళ్లీ న్యూఢిల్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే న్యూఢిల్లీలో కొల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించాలని బీజేపీ భావిస్తుంది.