అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం | To prepare for the development of the public debate | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

Published Sun, Jan 1 2017 10:53 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం - Sakshi

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

కాంగ్రెస్‌ గ్రేటర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీహరి

వరంగల్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, డేట్‌..ప్లేస్‌ చెప్పాలని గ్రేటర్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి అన్నారు. అభివృద్ధిపై కాంగ్రెస్‌ నేతలు చర్చకు సిద్ధమా అని టీఆర్‌ఎస్‌ నేత గుడిమళ్ల రవికుమార్‌ విసిన సవాల్‌కు శ్రీహరి స్పందించారు. వరంగల్‌లోని ఎల్‌బీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నగరంలో 1380 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎస్‌ఆర్‌నగర్‌లో 692ఇళ్లకు 80, హన్మకొండలోని అంబేద్కర్‌నగర్‌లో 572 ఇళ్లకు 692ఇళ్ల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయన్నారు.  ఈ విషయంపై సీఎంను అడిగే ధైర్యం టీఆర్‌ఎస్‌ నేతల్లో లేదని ఎద్దేవా చేశారు. కాకతీయ ఉత్సవాలకు నిధులు తక్కువ కేటాయించారని ఆరోపణలు చేసిన నేతలు ఇప్పుడు వాటి ఊసేత్తడానికే భయ పడుతున్నారన్నారు.  సమావేశంలో నగర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అయూబ్, నాయకులు మంద వినోద్‌కుమార్, కొత్తపెల్లి శ్రీనివాస్, చిప్ప వెంకటేశ్వర్లు, పొలుమారి విజయ్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement