జగన్ బెయిల్పై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్సీ ఆమోస్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్కు, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ స్పష్టం చేశారు. జగన్ బెయిల్ పొందడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న టిడిపి నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఈ విషయమై ఉద్దేశపూర్వకంగానే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ అంశంపై టీడీపీ నేతలతో బహిరంగ చర్చలకు సిద్ధం అని ఆయన తెలిపారు.
జగన్ బెయిల్తో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి శంకర్రావు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్పై అనవసరమైన ఆరోపణలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.